క్రాంతికుమార్‌ కేసులో కీలక పరిణామం | Vijayawada: Key Development In Krantikumar Case | Sakshi
Sakshi News home page

క్రాంతికుమార్‌ కేసులో కీలక పరిణామం

Jul 4 2026 7:10 PM | Updated on Jul 4 2026 7:40 PM

Vijayawada: Key Development In Krantikumar Case

సాక్షి, విజయవాడ: క్రాంతికుమార్‌ సూసైడ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రాంతికుమార్‌ ఆత్మహత్యపై పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. క్రాంతికుమార్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకోనున్న పోలీసులు.. ఫోన్‌ ఇవ్వాలంటూ క్రాంతికుమార్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నార్త్‌ ఏసీపీ సత్యానందరావును కలిసి క్రాంతి కుమార్‌ తండ్రి వెంకటేశ్వరరావు ఫోన్‌ అందజేయనున్నారు. 

కాగా, దళిత యువకుడు క్రాంతి కుమార్‌ ఆత్మహత్య చేసు­కుంటూ తీసిన సెల్ఫీ వీడియో చంద్రబాబు ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. పోలీసులు మూడు నెలలపాటు తనను భౌతికంగా హింసిస్తున్నారని... ఆ చిత్రహింసలు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. సెల్ఫీ వీడియో తీస్తూనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియో వెలుగులోకి రావడంతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణం బహిర్గతమైంది.

లాకప్‌లోనే సాయికృష్ణ అదృశ్యం.. పోలీసుల వేధింపులతో  క్రాంతి కుమార్‌ ఆత్మహత్య.. ఇవి రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ కర్కశ కూటమి ప్రభుత్వం ఇటువంటివి ఇంకెన్ని దారుణాలు పాల్పడిందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement