breaking news
krantikumar
-
క్రాంతికుమార్ కేసులో కీలక పరిణామం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతికుమార్ కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించడంతో పోలీసుల్లో కదలిక వచ్చింది. శనివారం క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావును నార్త్ ఏసీపీ సత్యానందం తన కార్యాలయానికి పిలిపించి కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు ఇంటికి వచ్చి క్రాంతి కుమార్‌ను తీసుకెళ్లడం మొదలు.. సీఐ నాగరాజు వేధించడం వరకు అన్ని అంశాలను వెంకటేశ్వరరావు వివరించారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించి వెంకటేశ్వరరావు నుంచి ఏసీపీ రాత పూర్వక ఫిర్యాదు తీసుకున్నారు. క్రాంతికుమార్ ఆత్మహత్యకు పాల్పడే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోకు సంబంధించిన ఫోన్‌ను సైతం స్వా«దీనం చేసుకున్నారు. దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే అనుమానాస్పద మృతిగా నమోదైన కేసును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలంటూ వెంకటేశ్వరరావు పోలీసులను కోరారు. బాధ్యులందరిపై కేసు నమోదు చేయాలి తమ కుమారుడిని కావాలని వేధించి, మృతి చెందేలా సీఐ నాగరాజు వ్యవహరించారని క్రాంతికుమార్ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, జాతీయ ఎస్సీ కమీషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. సీఐ నాగరాజుతో పాటు బాధ్యులందరిపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఐ నాగరాజు తీవ్రంగా వేధించడం వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. తమకు ఎవరిపైనా ఎలాంటి కక్షలు లేవన్నారు. ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని, తమకు న్యాయం జరగకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కాగా, క్రాంతికుమార్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించిన తర్వాతే పోలీసుల్లో కదలిక వచ్చిందని మాదిగ ఎడ్యుకేషనల్ ట్రస్టు బాధ్యుడు ఎ.వి.పటేల్ అన్నారు. ఎన్నికల్లో తాము జగన్ కోసం పని చేయకపోయినా, క్రాంతికుమార్ కుటుంబానికి అండగా నిలిచారని కొనియాడారు. చంద్రబాబు సర్కారుకు మాలలు, మాదిగలు అంటే లెక్కలేదని మండిపడ్డారు. క్రాంతికుమార్ కుటుంబానికి దళిత సంఘాలు, న్యాయవాదులమంతా అండగా ఉంటామని న్యాయవాది గవాస్కర్ తెలిపారు. -
క్రాంతికుమార్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: క్రాంతికుమార్ సూసైడ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రాంతికుమార్ ఆత్మహత్యపై పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. క్రాంతికుమార్ ఫోన్‌ను స్వాధీనం చేసుకోనున్న పోలీసులు.. ఫోన్ ఇవ్వాలంటూ క్రాంతికుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నార్త్ ఏసీపీ సత్యానందరావును కలిసి క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావు ఫోన్ అందజేయనున్నారు. కాగా, దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో చంద్రబాబు ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. పోలీసులు మూడు నెలలపాటు తనను భౌతికంగా హింసిస్తున్నారని... ఆ చిత్రహింసలు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. సెల్ఫీ వీడియో తీస్తూనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియో వెలుగులోకి రావడంతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణం బహిర్గతమైంది.లాకప్‌లోనే సాయికృష్ణ అదృశ్యం.. పోలీసుల వేధింపులతో క్రాంతి కుమార్ ఆత్మహత్య.. ఇవి రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ కర్కశ కూటమి ప్రభుత్వం ఇటువంటివి ఇంకెన్ని దారుణాలు పాల్పడిందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. -
క్రాంతికుమార్ మృతిపై సీబీఐ విచారణ జరపాలి
లబ్బీపేట/కృష్ణలంక (విజయవాడ తూర్పు): దళిత యువకుడు పేరుపోగు క్రాంతికుమార్ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించడంతోపాటు, అతని కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. క్రాంతికుమార్ మృతితో దిక్కులేకుండా పోయిన ఆయన బిడ్డలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం వల్లే రాష్ట్రంలో పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని రెచ్చి పోతున్నారని, బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, హోంమంత్రి అనిత క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే రెచ్చిపోయి హింసిస్తుంటే, సామాన్యులు తమ కష్టాలను ఎవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు. విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులకు తాళలేకపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబాన్ని శనివారం వైఎస్సార్సీపీ నాయకుల బృందం పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. రాష్ట్రంలో కృష్ణలంక లాంటి పోలీస్ స్టేషన్లు ఎన్నో ఉన్నాయని, ఇప్పటికైనా వేధింపులు, దాడులకు ఫుల్స్టాప్ పెట్టాలని నాయకులు డిమాండ్ చేశారు.ఒక దళిత మహిళ అయ్యుండి బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి హోంమంత్రి అనితకి తీరికలేదా అని నాయకులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలకు క్రాంతికుమార్ తండ్రి, ఏపీ ఎమ్మార్ఫీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు ఘటన పూర్వాపరాలను వివరించారు. పోలీసుల వేధింపుల వల్ల తన కొడుకు ప్రాణాలొదిలాడని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ కులంలో పుట్టడమే తప్పయిపోయిందని తన కొడుకు చాలా ఆవేదన చెందాడని కంటతడిపెట్టారు. ప్రజాఉద్యమాల్లో క్రియాశీలకంగా ఉన్న తన కొడుక్కే ఇలా జరిగిందంటే ఇక నోరులేని సామాన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ నాగరాజు వంటివారు పోలీసు వ్యవస్థకే మాయని మచ్చని విమర్శించారు. ఘటనపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలివైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించామని చెప్పారు. దళిత యువకులపై పోలీసులు దాడులు చేస్తున్నారని, వారిపై అక్రమంగా గంజాయి కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరిచి వేధిస్తున్నారని విమర్శించారు. బూట్ పాలిష్ చేయాలంటూ క్రాంతిని వేధించిన సీఐ నాగరాజు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చర్మం వలచడం కూడా దళితుల వృత్తే అనే విషయం గుర్తుంచుకోవాలి’’ అని పోలీసులను హెచ్చరించారు. చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు, దాష్టీకాలు పెరిగిపోయాయని, వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, దళితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు సాగిస్తున్న మారణకాండకు కృష్ణలంక పరిధిలో జరిగిన సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలే సాక్ష్యమని స్పష్టం చేశారు. హోం మంత్రి అనిత తక్షణమే స్పందించి క్రాంతి కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇది మంచి ప్రభుత్వం కాదని, మేకప్, లాకప్ ప్రభుత్వమని విమర్శించారు. -
గగుర్పొడిచే సాహసాలకు గిన్నిస్ గుర్తింపు
సూర్యాపేట: ఒళ్లు గగుర్పొడిచే సాహసాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పనికెర క్రాంతికుమార్ మరో రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ వేదికపై అరుదైన సాహసాలు ప్రదర్శించి ఒకేసారి 4 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లు అందుకొన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన క్రాంతికుమార్ 2024 ఫిబ్రవరిలో ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగిన కార్యక్రమంలో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు.ఆయన చేసిన సాహసాలు ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ చేయకపోవడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ ఆయనకు తన బుక్‌లో చోటిచ్చింది. ఇటీవల ఆ సంస్థ నిర్వాహకులు క్రాంతికుమార్‌కు అవార్డులు ప్రదానం చేశారు. ఈ విషయాన్ని క్రాంతికుమార్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. రికార్డులు సాధించింది ఈ విభాగాల్లోనే.. » 60 సెకన్లలో 72 టేబుల్ ఫ్యాన్లను నాలుకతో ఆపగా, అందులో 57 ఫ్యాన్లు ఆగినట్లు రికార్డు నమోదైంది. » గొంతులో రెండు అడుగుల పొడవైన 37 కత్తులు దింపుకుని 16 సెకన్లలో 1,944 కిలోల బరువు (కారు, దానిపై ఎనిమిది మంది)ని లాగాడు. » 60 సెకన్లలో నాలుగు ఇంచుల పొడవైన 22 మేకులను ముక్కులో దించుకుని రక్తపు చుక్క రాకుండా కొత్త రికార్డు నమోదు చేశాడు. » 60 సెకన్లలో మరుగుతున్న నూనె నుంచి 17 చికెన్ ముక్కలను బయటకు తీశాడు. -
రిమ్స్ వైద్య విద్యార్థులపై దాడి
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థులపై బుధవారం అర్ధరాత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతికుమార్ బయటి వ్యక్తులతో కలిసి దాడికి పాల్పడిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనలో ఇద్దరు వైద్య విద్యార్థులు గాయాలపాలయ్యారు. డైరెక్టర్ చాంబర్ ముందు నుంచి బుధవారం సాయంత్రం కవిరాజ్, మరో ముగ్గురు విద్యార్థులు అతి వేగంగా కారులో వెళ్లారు. దీంతో డైరెక్టర్ జైసింగ్ వారిని మందలించగా, విద్యార్థులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. అనంతరం జైసింగ్ అభిమానులమంటూ కొందరు సదరు విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. దీంతో దాడికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ గురువారం మెడికోలు తరగతులకు వెళ్లకుండా, ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. దీంతో కలెక్టర్ రాహుల్‌రాజ్ ఘటనపై విచారణకు ఆదేశించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఘటనకు బాధ్యుడైన రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతికుమార్‌ను టర్మినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మెడికోలకు మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న మద్దతు తెలిపారు. వైద్య విద్యార్థులపై దాడికి దిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతికుమార్‌తోపాటు బయట వ్యక్తులైన వసీమ్, శివ, వెంకటేశ్, శ్రీకాంత్‌పై కేసు నమోదుచేసి, రిమాండ్‌కు తరలించనున్నట్లు ఆదిలాబాద్ టూటౌన్ సీఐ అశోక్ తెలిపారు. విద్యార్థుల ఫిర్యాదుతో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌పై కూడా కేసు నమోదైంది. -
ఓ యువతి పోరాటం
సమాజంలో జరుగుతున్న అఘాయిత్యా లపై ఓ సామాన్య యువతి ఎలాంటి పోరు చేసిందనే కథాంశంతో రూపొం దిన చిత్రం ‘అనగ నగా ఒక దుర్గ’. ప్రకాశ్ పురిజాల దర్శకత్వంలో రాంబాబు నాయక్, అంజి యాదవ్ నిర్మించిన ఈ చిత్రంలో క్రాంతికుమార్, ప్రియాంకా నాయుడు నటిం చారు. సమకాలీన అంశానికి వాణిజ్యపంథా జోడించి చిత్రం తీసినట్లు దర్శకుడు చెప్పారు.


