ప్రాణాపాయ స్థితిలో బాధితుడు.. చోద్యం చూస్తున్న పోలీసులు | Police Negligence Spark Outrage in Nellore | Sakshi
Sakshi News home page

ప్రాణాపాయ స్థితిలో బాధితుడు.. చోద్యం చూస్తున్న పోలీసులు

Jul 14 2026 6:32 PM | Updated on Jul 14 2026 6:39 PM

Police Negligence Spark Outrage in Nellore

సాక్షి,నెల్లూరు: జిల్లా పోలీస్ శాఖలో బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్య ధోరణి మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కావలి మండలంలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఒక ఘోర దాడి ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై స్థానికులు, బాధితుడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వివరాల్లోకి వెళ్తే.. కావలి మండలానికి చెందిన వాసు అనే యువకుడిపై నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వాసు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో నెల్లూరు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు.

తమ కుమారుడిపై అన్యాయంగా దాడి జరిగిందని, నిందితులను శిక్షించాలని కోరుతూ బాధితుడి తల్లి, బంధువులు కావలి రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. అయితే, బాధితుల పట్ల బాధ్యతగా నడుచుకోవాల్సిన పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించడం గమనార్హం. గత నాలుగు రోజులుగా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఒక ప్రత్యక్ష సాక్షి  స్వయంగా పోలీసుల ముందుకు వచ్చి స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధపడినా, కావలి రూరల్ పోలీసులు ఆ సాక్ష్యాన్ని సైతం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కావాలనే నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే అనుమానాలు బాధితుడి కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement