సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ సంచలన లేఖ | Former MLA Vallabhaneni Vamsi Writes A Letter To CM Chandrababu | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ సంచలన లేఖ

Jul 14 2026 4:50 PM | Updated on Jul 14 2026 5:24 PM

Former MLA Vallabhaneni Vamsi Writes A Letter To CM Chandrababu

విజయవాడ:  సీఎం చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన లేఖ రాశారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ కాంట్రాక్టు కేటాయింపులు, అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలంటూ లేఖ రాశారు. 

గన్నవరం ఎయిర్ పోర్టు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కాంట్రాక్టు పనులను కేఎంవీ సంస్థకు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఇవ్వడంపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్‌ తీవ్ర విమర్శలు చేశారు. కేఎంవీ సంస్థ వల్లభనేని వంశీకి సన్నిహితుడిదని యార్లగడ్డ వెంకట్రావ్ ప్రచారం చేయడాన్ని వల్లభనేని వంశీ సవాల్‌ చేశారు. యార్లగడ్డ వెంకట్రావ్ ఆరోపణల నేపధ్యంలో సిబిఐతో సమగ్ర విచారణ చేయించాలని వల్లభనేని వంశీ డిమాండ్ చేశారు. 

కేఎంవీ సంస్థలకు పనుల కేటాయింపులో అవినీతి ఆరోపణల పై దర్యాప్తు చేయించాలన్నారు. ఈ వ్యవహారంలో తన పాత్ర ఉందంటూ చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. సిబిఐతో విచారణ చేయించి నిజానిజాలు నిగ్గు తేల్చాలన్నారు. విచారణలో అవినీతి జరిగినట్లు తేలితే బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందులో తన ప్రమేయం ఉందని నిర్ధారణ జరిగితే తనపై ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని చాలెంజ్‌ చేశారు వల్లభనేని వంశీ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement