జిమ్‌ ట్రైనర్‌ సతీష్‌రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్‌ | New Twist In Gym Trainer Satish Reddy Case Kakinada | Sakshi
Sakshi News home page

జిమ్‌ ట్రైనర్‌ సతీష్‌రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్‌

Aug 28 2026 1:34 PM | Updated on Aug 28 2026 3:51 PM

New Twist In Gym Trainer Satish Reddy Case Kakinada

సాక్షి, కాకినాడ జిల్లా: జిమ్‌ ట్రైనర్‌ సతీష్‌రెడ్డి హత్యలో ఎమ్మెల్యే అనుచరుడి హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. హత్యలో ఎమ్మెల్యే అనుచరుడు కటౌట్‌ శ్రీను హస్తం ఉందని సతీష్‌రెడ్డి భార్య  జయశ్రీ ఆరోపించారు. కటౌట్‌ శ్రీను టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడు. కేసు నుంచి శ్రీనును తప్పించాలని చూస్తున్నారని.. కటౌట్‌ శ్రీను నుంచి నాకు ప్రాణహాని ఉందని సతీష్‌రెడ్డి భార్య జయశ్రీ అన్నారు. ఏడాది క్రిందట జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి తో జయశ్రీకి ప్రేమ వివాహం జరిగింది. ప్రస్తుతం జయశ్రీ ఐదు నెలల గర్భవతి.

జయశ్రీ మాట్లాడుతూ.. ’’కొద్ది నెలల క్రితం కటౌట్‌ శ్రీను నుంచి అతని భార్య విడాకులు తీసుకుంది. అయితే భార్య విడాకులు ఇవ్వడానికి సతీష్ రెడ్డే కారణమని  కటౌట్ శ్రీను భావించాడు. నేను నా పుట్టింట్లో ఉండగా సాయికిరణ్‌ను వెంట బెట్టుకుని కటౌట్‌ శ్రీను వచ్చి సతీష్‌ను చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం తెలుసుకుని సాయికిరణ్‌ను సతీష్ రెడ్డి కొట్టాడు. దీంతో ఎప్పటి నుంచో స్నేహితులుగా ఉన్న సాయికిరణ్, సతీష్‌రెడ్డి కి మధ్య వివాదం నడుస్తుంది.

..మా ఇంట్లో అన్నం తిన్న సాయి కిరణే తన అనుచరులతో నా భర్తను కిరాతకంగా చంపాడు. అయితే ఈ హత్య చేయించింది మాత్రం కటౌట్‌ శ్రీనే. ఇదే విషయాన్ని పోలీసులకు చెబితే.. శ్రీను పేరు బయటకు చెప్పవద్దంటూ అతనిని తప్పిస్తున్నారు’’ అని సతీష్ రెడ్డి భార్య జయశ్రీ ఆరోపించారు.

ఇదీ చదవండి: సాధిక్‌, సౌజన్య ఆన్‌లైన్‌లో ఏం ఆర్డర్‌ పెట్టారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement