విజయనగరం టౌన్: ఎనిమిది పదులు దాటిన వయసు.. చూపు అంతంతమాత్రమే.. చెవులు కూడా వినపడే స్ధా యి లేదు.. గట్టిగా అరిచే ఓపిక లేదు.. దీనస్ధితిలో కాలయాపన చేసే ఓ పండుటాకుపై కామాంధు డు పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. దిక్కుతోచని స్థితిలో ఆమె తన ఇంటికి వెళ్లి జరిగిందంతా కుటుంబ సభ్యులతో మొరపెట్టుకోవడం, వెంట నే ఆస్పత్రికి తరలించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.
ఘోషా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలిని గురువారం పరామర్శించారు. విషయాన్ని ఎస్పీ ఎఆర్.దామోదర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ నరసింహారావు, సీఐ నరసింహమూర్తి, ఎస్‌ఐలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధిచి సీఐ, కాలనీవాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
విజయనగరం పట్టణంలోని ఓ కాలనీలో నివసిస్తున్న 82 ఏళ్ల వృద్ధురాలు బుధవారం మధ్యాహ్నం కంటోన్మెంట్ ప్రాంతం నుంచి ఇంటికి అరుంధతీనగర్ కాలనీ మీదుగా గాజులరేగ నడక మార్గం నుంచి వెళ్తున్న సమయంలో కామాంధుడు ఆమెపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. కొంతసేపటికి తేరుకున్న ఆ వృద్ధురాలు ఇంటికి వెళ్లి జరిగిందంతా కుటుంబ సభ్యులకు తెలియజేసింది.
వెంటనే వారు స్పందించి పోలీసులకు సమాచారమిచ్చారు. వృద్ధురాలిని ఘోషా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రంగంలోకి దిగి తమదైనశైలిలో విచారణ ప్రారంభించారు. మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ స్వయంగా ఘోషా ఆస్పత్రికి సిబ్బందితో కలిసి వెళ్లి వృద్ధురాలు, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్కా్వడ్, క్లూస్‌టీమ్‌లను రంగంలోకి దించారు. నిందితునికోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు.
చదవండి: మూడేళ్ల కొడుకుని వంతెనపై వదిలి.. నదిలో దూకిన దంపతులు!


