భర్త.. రెండో భర్త.. ఇద్దరు ప్రియులు!
వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఏదో ఒక మూల రోజుకో దారుణం జరుగుతోంది. ప్రేమ, మోసం, హత్య, మృతదేహాన్ని దాచిపెట్టడం.. ఇలా ఒక్కో తీరు నేరాలు బయటపడుతున్నాయి. తాజాగా గుజరాత్లో బయటపడ్డ ‘శాంతిగిరి కేసు’ ట్విస్టుల మీద ట్విస్టులను ఇచ్చింది. ఈ తరహా కేసుల్లోనే ఓ కొత్తదనం చూపించింది. సురేంద్రనగర్ జిల్లాలో శాంతిగిరి గోస్వామి అనే వ్యక్తి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. భార్య, ఆమె ప్రియుడి చేతిలోనే అతను దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 10 నెలల తర్వాత ఈ కేసును చేధించిన పోలీసులు.. నిందితుల నుంచి విస్తుపోయే వివరాలను సేకరించారు. అసలేం జరిగిందంటే.. జాగృతి గోస్వామి అనే మహిళ సుఖ్దేవ్గిరి గోస్వామిని వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కొంతకాలానికి ఆమె తన భర్త పెద్ద అన్న శాంతిగిరి గోస్వామితో ప్రేమలో పడింది. భర్తను, పిల్లలను వదిలి.. అతనితో పారిపోయి మరో గ్రామంలో కొత్త జీవితం మొదలుపెట్టింది. అయితే అక్కడా ఆమె బుద్ధి వక్రదారి పట్టింది. శాంతిగిరి ట్రక్ డ్రైవర్ పని కోసం తరచూ బయట ఉండేవాడు. ఈ సమయంలో కాంతిలాల్ అలియాస్ భారత్ సబారియా అనే వ్యక్తితో జాగృతి సంబంధం పెట్టుకుంది. కాంతిలాల్ ఏకంగా జాగృతి ఇంటి పక్కనే ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. శాంతిగిరి లేని సమయంలో ఇద్దరూ కలుసుకునేవారు. అయితే ఏదో ఒకరోజు తమ విషయం తెలుస్తుందని.. శాంతిగిరిని అడ్డు తొలగించుకోవాలని ఆ ప్రేమికులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో యూనిస్ అనే వ్యక్తికి 25,000 సుపారీ ఇచ్చారు. అయితే యూనిస్ ‘భలే’ మోసం చేశాడు. నిద్రపోతున్న శాంతిగిరిని ఫోటో తీసి హత్య చేశానంటూ జాగృతికి పంపాడు. అయితే మరుసటి రోజు ఉదయం భర్త బతికే ఉండడంతో జాగృతి షాక్‌కు గురైంది. తీరా చూస్తే యూనిస్ ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో జాగృతి, కాంతిలాల్ స్వయంగా హత్యకు ప్లాన్ చేశారు. నిద్రిస్తున్న శాంతిగిరి గొంతును కాంతిలాల్ నులిమి చంపగా.. జాగృతి దుప్పటి తోసి శబ్దం రాకుండా చేసింది. ఆపై శవాన్ని గదిలో దాచారు. ఆ తర్వాత దీపక్ అలియాస్ మున్నా అనే వ్యక్తి సహాయంతో కారులో తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రమాదవశాత్తూ చనిపోయినట్లు కథ అల్లే ప్రయత్నం చేశారు. శాంతిగిరి కొత్త ఉద్యోగం కోసం బయటి ఊరికి వెళ్లాడని.. ఫోన్ నెంబర్ మార్చాడని అందరినీ నమ్మించారు. అలా ఎనిమిది నెలలు గడిచాయి. ఈ గ్యాప్‌లో కాంతిలాల్‌కు తెలియకుండా దీపక్‌తో ఆమె వ్యవహారం నడిపించింది. అయితే.. శాంతిగిరి బంధవుల ఎంట్రీతో సీన్ మారింది. జాగృతి ప్రవర్తనపై అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు వాళ్లు. అలా ఈ మిస్సింగ్ మిస్టరీ కేసు.. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌కు చేరింది. రెండు నెలల దర్యాప్తులో పక్కా ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందం.. జాగృతి, కాంతిలాల్‌ను అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న దీపక్ కోసం గాలింపు చేపట్టింది.
మేయర్ పీఠంపై ఇండియన్ ఎవరీ తుషార్ కుమార్?
లండన్: తూర్పు ఇంగ్లాండ్‌లో 23 ఏళ్ల తుషార్ కుమార్ మేయర్ ఎన్నికల్లో గెలిచి యునైటెడ్ కింగ్డమ్ (UK) చరిత్రలోనే మేయర్ పీఠాన్ని అధిరోహించిన అత్యంత పిన్నవయస్కుడైన భారతీయునిగా చరిత్ర సృష్టించారు. గతంలో లండన్‌లోని కింగ్స్ కాలేజీలో తూర్పు ఇంగ్లండ్‌లోని ఒక స్థానిక కౌన్సిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ రాజకీయ నాయకుడు, తుషార్ భారత్‌లో పుట్టారు. పదేళ్ల వయసులో ఇతని కుటుంబం బ్రిటన్‌కు వచ్చి స్థిరపడింది. కింగ్స్ కాలేజ్ లండన్ నుండి పొలిటికల్ సైన్స్ పూర్తి చేసిన మాజీ విద్యార్థి తుషార్ కుమార్, గత వారం జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో 'ఎల్ స్ట్రీ అండ్ బోర్హామ్వుడ్' (Elstree and Borehamwood) టౌన్ కౌన్సిల్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు.రాజకీయ ప్రస్థానంలేబర్ పార్టీకి చెందిన ఈ కౌన్సిలర్ 2023లో 'ఎల్ స్ట్రీ అండ్ బోర్హామ్వుడ్' టౌన్ కౌన్సిల్లో చేరారు. మేయర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన డిప్యూటీ మేయర్‌గా సేవలందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తుషార్ కుమార్ మాట్లాడుతూ.. "23 ఏళ్ల వయసులో, యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ సంతతి మేయర్‌గా అధికారికంగా బాధ్యతలు చేపట్టడం నాకొక అద్భుతమైన గౌరవం" అని ఆనందం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచిన స్థానిక ప్రజలకు, కౌన్సిలర్లకు, కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.మాజీ మేయర్ డాన్ ఓజారోవ్ అందించిన మార్గదర్శకత్వానికి ధన్యవాదాలు తెలిపిన తుషార్, కొత్త డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన కౌన్సిలర్ లిండా స్మిత్‌ను స్వాగతించారు.లక్ష్యాలు లండన్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడే కౌన్సిలర్‌గా ఎన్నికైన తుషార్, నిజమైన మార్పు అనేది స్థానిక సంఘాల స్థాయి నుంచే మొదలవుతుందని నమ్ముతారు. యువతను ప్రజా సేవ వైపు, సామాజిక జీవితం వైపు ప్రేరేపించడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తన మేయర్ పదవీ కాలంలో స్థానికంగా ఉన్న పేద ప్రజలకు సహాయం చేసే 'WD6 ఫుడ్ సపోర్ట్' (WD6 Food Support) అనే స్వచ్ఛంద సంస్థకు ప్రధాన చారిటీగా మద్దతు ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. తుషార్ కుమార్ తనలో ఆత్మవిశ్వాసాన్ని, పబ్లిక్ స్పీకింగ్ (నలుగురిలో మాట్లాడే) నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కింగ్స్ కాలేజ్ లండన్‌లోని 'సివిక్ లీడర్షిప్ అకాడమీ' ఎంతగానో సహాయపడిందని చెప్పారు. అలాగే విద్యార్థిగా ఉన్నప్పుడు 'యూనివర్శిటీ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్' లో కూడా ఆయన అనుభవాన్ని గడించారు.గతంలో ఆయన బ్రిటన్ ప్రభుత్వ 'డిపార్ట్మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్స్' (DWP) లో పాలసీ అడ్వైజర్‌గా, అలాగే ఒక జాతీయ LGBTQ చారిటీ సంస్థలో రీసెర్చ్ అనలిస్ట్‌గా పనిచేశారు. 'బుక్‌మార్క్ రీడింగ్ చారిటీ' ద్వారా అక్షరాస్యత కార్యక్రమాలకు కూడా ఆయన మద్దతు అందించారు.
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: వాహనదారులకు మళ్లీ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఆయిల్ కంపెనీలు 90 పైసల చొప్పున పెంచేశాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు మళ్లీ పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచే అమలుకానున్నాయి. ఇటీవలె రెండింటిపైనా రూ.3 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ లెక్కన నాలుగు రోజుల వ్యవధిలో రెండుసార్లు పెరిగాయన్నమాట. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌తో.. భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు రూ.1,600 కోట్ల నష్టాన్ని భరించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది. కానీ..దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయింది. అయితే మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనడం.. హర్ముజ్ ఉద్రిక్తతలు చల్లారకపోవడంతో ఈ పెంపు ఇక్కడితో ఆగకపోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ✔️ తాజా పెంపు తర్వాత ప్రధాన నగరాల్లో కొత్త ధరలు ఇలా ఉన్నాయి:ఢిల్లీ: పెట్రోల్ ₹98.63, డీజిల్ ₹91.50ముంబై: పెట్రోల్ ₹107.40, డీజిల్ ₹93.86హైదరాబాద్: పెట్రోల్ ₹111.36, డీజిల్ ₹99.53కోల్‌కతా: పెట్రోల్ ₹109.31, డీజిల్ ₹95.85చెన్నై: పెట్రోల్ ₹104.66, డీజిల్ ₹96.22బెంగళూరు: పెట్రోల్ ₹106.82, డీజిల్ ₹94.82పాట్నా: పెట్రోల్ ₹109.40, డీజిల్ ₹95.61జైపూర్: పెట్రోల్ ₹108.89, డీజిల్ ₹94.32తిరువనంతపురం: పెట్రోల్ ₹111.24, డీజిల్ ₹100.09చండీగఢ్: పెట్రోల్ ₹98.16, డీజిల్ ₹86.28
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీలను తుంగలో తొక్కడంలో చంద్రబాబు మరోసారి తన మార్కు చూపిస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఉద్దేశించిన స్త్రీ శక్తి పథకాన్ని దొంగ దెబ్బ తీస్తున్నారు. ఈ–బస్సుల ముసుగులో ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తేసేందుకు ఎత్తుగడ వేశారు. ఓ వైపు ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తూ విలువైన ఆస్తులను తమ అస్మదీయులకు కట్టబెడుతున్న బాబు మరోవైపు స్త్రీశక్తి పథకాన్ని నిర్వీర్యం చేసి రాష్ట్ర మహిళలను మోసం చేసేందుకు పావులు చకచకా కదుపుతున్నారు. ఈ–బస్సులకు వర్తించని ఉచిత బస్సు చంద్రబాబు ఎన్నికల హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. ఆయన 2024 జూన్ 12న అధికారంలోకి వచ్చినా 15 నెలల వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయనే లేదు. తద్వారా రాష్ట్ర మహిళలు నెలకు రూ.250 కోట్ల చొప్పున 15 నెలల్లో ఏకంగా రూ.3,750 కోట్ల మేర ప్రయోజనాన్ని కోల్పోయారు. 2025 ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని తూతూమంత్రంగా ప్రారంభించారు. అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించలేదు.ఆర్టీసీలో 16 కేటగిరీల బస్ సర్వీసులు ఉండగా... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ వంటి ఐదు రకాల సర్వీసుల్లోనే అమలు చేస్తున్నారు. ఈ–బస్సులతోపాటు వెన్నెల, డాల్పిన్ క్రూయిజర్, అమరావతి, నైట్ రైడర్, ఇంద్ర, మెట్రోలగ్జరీ, స్టార్ లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, నాన్‌స్టాప్, ఎస్ఏపీ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో వర్తింపజేయడం లేదు. ప్రస్తుతం ఆర్టీసీ నిర్వహిస్తున్న 100 ఈ–బస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు కాకపోవడం గమనార్హం. వందశాతం ఈ–బస్సులతో ఉచితం హుళక్కే ఈ నేపథ్యంలోనే ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. వందశాతం ఈ–బస్సులను ప్రవేశపెట్టే విధానానికి ఆమోదం తెలిపింది. అది కూడా పూర్తిగా ప్రైవేటు కార్పొరేట్ సంస్థల ద్వారానే ప్రవేశపెడతామని తేల్చి చెప్పింది. ప్రైవేటుపరం చేసేందుకు పక్కా కుతంత్రంతో ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తోంది. ‘ప్రధానమంత్రి ఈ–బస్ సేవా’ పథకం ద్వారా ప్రవేశపెట్టే ఈ–బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను చంద్రబాబు ప్రభుత్వం తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కొత్త డీజిల్ బస్సులను కొనడం లేదు.ఇటీవల ఆరు నెలల్లోనే 264 డీజిల్ బస్సులను సర్వీసుల నుంచి పూర్తిగా తొలగించారు. వాటి స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టనే లేదు. సగటున రోజుకు ఒక బస్సును సర్వీసు నుంచి తొలగిస్తోంది. తద్వారా ఆర్టీసీలో డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించి, ప్రైవేటు సంస్థల ద్వారా ఈ–బస్సులను ప్రవేశపెట్టాలన్నదే తమ ఉద్దేశమని సర్కారు స్పష్టం చేస్తోంది. మొదటగా ఆర్టీసీలో 50శాతం ఈ–బస్సులు ఉండేట్టు చూడటం ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించింది. అనంతరం 2029 నాటికి 100శాతం ఈ–బస్సులు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ–బస్సుల్లో ఇప్పటికే ఉచిత ప్రయాణం అమలు కావడం లేదు కాబట్టి.. కొత్తగా ప్రవేశపెట్టబోయే బస్సుల్లోనూ అదే నిబంధన వర్తించనుందనేది సుస్పష్టం. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులూ ధ్రువీకరిస్తున్నారు.
అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా!
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ధోని అభిమానుల హృదయం ముక్కలు చేసిన రైనా!
మేయర్ పీఠంపై ఇండియన్ ఎవరీ తుషార్ కుమార్?
‘దీదీ’ ఆనవాళ్లపై సువేందు ఉక్కుపాదం.. ముందుగా..
కన్నీళ్లు తెప్పించే క్షణం..! ఎట్టకేలకు 130 ఏళ్ల ..
విజయ్ సర్కార్ ఏ క్షణమైనా కూలిపోవచ్చు
నా పోస్ట్‌ని బ్రేకింగ్ న్యూస్ చేశారు.. అమ్మ కంగారుపడుతోంది : సల్మాన్ ఖాన్
ఆరోగ్యశ్రీ ఉన్నా డబ్బులు డిమాండ్.. వైద్యం అందక మహిళ మృతి
టీవీకే విజయం : డిజిటల్ సునామీపై స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్..!
మాను సంపంగి... మా అబ్బాయి
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఇంత కాలానికి ఓ శుభవార్త విన్నాం.. యుద్ధం చేయలేమని..!
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ముంచుకొస్తున్న మహా ఎల్ నినో!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా!
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ధోని అభిమానుల హృదయం ముక్కలు చేసిన రైనా!
మేయర్ పీఠంపై ఇండియన్ ఎవరీ తుషార్ కుమార్?
‘దీదీ’ ఆనవాళ్లపై సువేందు ఉక్కుపాదం.. ముందుగా..
కన్నీళ్లు తెప్పించే క్షణం..! ఎట్టకేలకు 130 ఏళ్ల ..
విజయ్ సర్కార్ ఏ క్షణమైనా కూలిపోవచ్చు
నా పోస్ట్‌ని బ్రేకింగ్ న్యూస్ చేశారు.. అమ్మ కంగారుపడుతోంది : సల్మాన్ ఖాన్
ఆరోగ్యశ్రీ ఉన్నా డబ్బులు డిమాండ్.. వైద్యం అందక మహిళ మృతి
టీవీకే విజయం : డిజిటల్ సునామీపై స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్..!
మాను సంపంగి... మా అబ్బాయి
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఇంత కాలానికి ఓ శుభవార్త విన్నాం.. యుద్ధం చేయలేమని..!
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ముంచుకొస్తున్న మహా ఎల్ నినో!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
ఫొటోలు
'పురుష:' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
మంచు మనోజ్ కొత్త ట్రస్ట్ ప్రారంభం (ఫొటోలు)
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
పెట్రో బాదుడు: వైఎస్సార్సీపీ పోరుబాటకు విశేష స్పందన
‘కాక్టెయిల్ 2’ మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్న,కృతి సనన్ (ఫొటోలు)
ఫ్యామిలీ ట్రిప్‌లో హీరోయిన్ శ్రీదేవి విజయ్‌కుమార్.. (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరో ఆది పినిశెట్టి దంపతులు.. (ఫొటోలు)
అనంతపురం : భారమైన వేళ.. బాధతో విక్రయం! (ఫొటోలు)
హైదరాబాద్ : మురిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
నాలుగు పదుల వయసులో మరింత బొద్దుగా ఛార్మి.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
సినిమా
సెయాన్ ఆరంభం
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న రూరల్–కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా ‘సెయాన్’. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా పతాకాలపై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శివ కార్తికేయన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఎమోషన్స్, మాస్ అప్పీల్, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఎంటర్టైనర్గా ‘సెయాన్’ చిత్రం రూపొందుతోంది.’’ అని యూనిట్ పేర్కొంది.వివేక్ విజయకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సహ–నిర్మాత: ఎస్. డిస్నీ. ఎకానమీ క్లాస్‌లో కమల్ హాసన్ ప్రయాణం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కల్కి 2’. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు కమల్æహాసన్.ఈ మూవీ షూటింగ్లో పాల్గొనేందుకు చెన్నై నుంచి హైదరాబాద్‌కి ఫ్లైట్‌లో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించారాయన. ‘‘సినిమా పరిశ్రమ క్లిష్ట పరిస్థితులకు ఎదుర్కొంటున్న తరుణం ఇది. ప్రైవేటు చార్టెడ్ ఫ్లైట్స్, విలాసవంతమైన ప్రయాణాలను కాదని, ఫ్లైట్‌లో సాధారణ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించి షూటింగ్‌కు వెళ్లాలని కమల్‌హాసన్‌గారు నిర్ణయించుకోవడం ఆయన గొప్పదనానికి నిదర్శనం. సినిమా రంగంలో జరగబోయే మార్పులకు ఇది తొలి అడుగు’’ అంటూ వైజయంతీ మూవీస్ సంస్థ ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది. ‘కల్కి 2’ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుందని తెలిసింది. మరోవైపు సినిమా నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఇటీవల కమల్‌హాసన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
'పెద్ది' స్టోరీ ఏంటి? ఊహించని ట్విస్ట్ గురించి అప్పుడే
'పెద్ది' ట్రైలర్ వచ్చేసింది. కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అసంతృప్తి ఎక్కువగా వినిపిస్తోంది. అదే టైంలో కంటెంట్ పరంగా మాత్రం స్టోరీపై రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంతకీ 'పెద్ది' స్టోరీ ఏమై ఉండొచ్చు? ఊహించని ట్విస్ట్ ఏంటి?(ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్)ఇప్పటివరకు వచ్చిన 'పెద్ది' ప్రమోషనల్ కంటెంట్‌లో హీరో పాత్ర క్రికెట్, కుస్తీ ఆడతాడు అన్నట్లు మాత్రమే చూపించారు. కానీ ట్రైలర్లో రన్నర్ అని కూడా రివీల్ చేశారు. అయితే క్రికెట్, రెజ్లింగ్‌కి సంబంధించిన సీన్స్ చూపించారు గానీ రన్నింగ్‌కి సంబంధించిన ఒక్క షాట్ కూడా పెట్టలేదు. చివరలో రన్నింగ్ ట్రాక్‌పైకి పెద్ది వెళ్తున్న సీన్ చూపించారు. 'పెద్ది బ్యాక్ ఆన్ హిజ్ ఫీట్' అనే డైలాగ్ వినిపించారు. దీంతోనే డిస్కషన్స్ మొదలయ్యాయి.బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది.. క్రికెట్, కుస్తీ, రన్నింగ్‌లో ఎక్స్పర్ట్. కానీ అనుకోని సంఘటనల వల్ల 'పెద్ది'.. ఒంటి కాలి వ్యక్తి అవుతాడు. అయినా సరే తనకున్న ప్రతిభతో పారా ఒలింపిక్స్ వరకు వెళ్తాడు. ఇదే ట్విస్ట్ అనిపిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి ఇందులో రామ్ చరణ్ పాత్రకు కాలు ఉండదనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే దర్శకుడు బుచ్చిబాబు కూడా మూవీ చివరి 50 నిమిషాల ఎమోషనల్‌గా ఉంటుందని, చూస్తున్న ప్రతి ఒక్కరూ డిస్ట్రబ్ అవుతారని ఇంటర్వ్యూలో చెప్పాడు.డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన మాటలు.. ట్రైలర్ చివరలో పెద్ది పాత్ర కుంటుతూ నడుస్తున్నట్లు అనిపించడం లాంటివి చూస్తుంటే.. ఈ దర్శకుడి గత చిత్రం 'ఉప్పెన'లానే ఇందులో 'కటింగ్' గ్యారంటీనా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజానిజాలేంటి? అనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: ఆటకూలీ పోరాటం.. 'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!)
చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్
రామ్ చరణ్ 'పెద్ది' విడుదలకు సిద్ధమైంది. వచ్చే నెల 4న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. సోమవారం మధ్యాహ్నం ముంబైలో ట్రైలర్ లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలోనే తన చేతికైనా గాయం గురించి రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)'చెయ్యి బాగానే ఉంది. బుచ్చిబాబు(దర్శకుడు) ఇచ్చిన బహుమతి ఇది. గత 25-30 రోజుల నుంచి కుస్తీ సన్నివేశాల షూటింగ్ చేశాం. ట్రైన్డ్ ఆర్టిస్టులని తీసుకురమ్మంటే నిజమైన పహిల్వాన్లని తీసుకొచ్చాడు. యాక్షన్ చెప్పగానే వాళ్లు బలంగా పట్టేసుకున్నారు. అందుకే చేతికి గాయమైంది. మణికట్టు దగ్గర ఎముక విరిగింది. 'పెద్ది'కి సంబంధించి ఇదో అందమైన జ్ఞాపకం' అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.'పెద్ది' షూటింగ్ టైంలో మూడుసార్లు చరణ్ గాయపడ్డారు. కుస్తీ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఓసారి గాయపడగా.. రీసెంట్గా చేసిన చిత్రీకరణలో కంటికి, మణికట్టుకి గాయాలయ్యాయి. రెండు మూడు రోజుల్లో వాటికి సంబంధించి సర్జరీలు జరగనున్నాయని నిర్మాత చెప్పారు. అయితే మణికట్టుకి ఎలా గాయమైందని ఇప్పుడు చరణ్ స్వయంగా చెప్పాడు.స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా కనిపించబోతున్నాడు. పల్లెటూరిలో ఉండే ఇతడు ఢిల్లీకి వెళ్లి కూలీపని ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ ప్రయాణంలో పెద్ది ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్లో మూవీ ఎలా ఉండబోతుందో చూపించారు గానీ స్టోరీపై పెద్దగా హింట్ ఇవ్వలేదు. బుచ్చిబాబు దర్శకుడు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఆటకూలీ పోరాటం.. 'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!)
'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మరికొన్నిరోజుల్లో థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. రెగ్యులర్ కమర్షియల్ అంశాలతో పాటే సమ్‌థింగ్ డిఫరెంట్‌గానూ అనిపించింది. 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ దెబ్బకు డీలా పడిపోయిన మెగా ఫ్యాన్స్.. ఇది ఎలాగైనా సరే హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. వీళ్లే కాదు టాలీవుడ్ కూడా అదే అనుకుంటోంది. మొత్తం భారమంతా ఈ మూవీపైనే ఉంది. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)ఈ ఏడాది సంక్రాంతిని టాలీవుడ్ గ్రాండ్‌గా మొదలుపెట్టింది. చిరంజీవి సినిమాకు రూ.300 కోట్లు వచ్చాయని అందరూ సంబరపడ్డారు. కానీ ఈ ఆనందం ఎన్నిరోజులు నిలబడలేదు. తర్వాత నుంచి ఇప్పటివరకు నాలుగు నెలలు గడిచాయి. ఒక్కటంటే ఒక్క మూవీ కూడా సరైన స్థాయిలో ఆడలేదు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో వచ్చిన చిత్రాలు భారీగా నిరాశపరిచాయి. దీంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడులన్నీ నష్టపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఏడాది వేసవి సీజన్.. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత దారుణమైనదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.సరిగ్గా ఇలాంటి టైంలో అంటే జూన్ 4న 'పెద్ది' థియేటర్లలోకి వస్తోంది. దీంతో టాలీవుడ్ ఆశలన్నీ దీనిపైనే పెట్టుకుంది. ఇది హిట్ అవ్వడం చిత్రబృందానికే కాదు తెలుగు సినీ పరిశ్రమకు కూడా చాలా కీలకం. ఎందుకంటే థియేటర్లు గతకొన్నాళ్లుగా బోసిపోయాయి. ప్రేక్షకులు కూడా సరైన మూవీ ఎప్పుడొస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే ఈ మూవీ..బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశమైతే కనిపిస్తోంది. మరి 'పెద్ది' ఏం చేస్తాడనేది చూడాలి?ట్రైలర్ బట్టి చూస్తే బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే ఓ పల్లెటూరి కుర్రాడు.. క్రికెట్, కుస్తీ, రన్నింగ్‌లో ఆటకూలీగా ఎలాంటి ప్రతిభ చూపించాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేదే కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. మూవీ ఎలా ఉండబోతుందో చూపించారు గానీ స్టోరీ గురించి మాత్రం పెద్దగా హింట్ ఇవ్వలేదు. 'పెద్ది గాడు గుడిలో దేవుడు కాదు గ్రౌండ్లో దేవుడు సారు' లాంటి డైలాగ్స్ బాగానే అనిపించాయి. స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక
క్రీడలు
చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్
నేపాల్ బౌలర్ సందీప్ లామిచ్చేన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 150 వికెట్లు (73 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉండేది. స్టార్క్ 77 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా.. సందీప్ నాలుగు మ్యాచ్‌లు ముందుగానే ఈ మైలురాయిని తాకాడు.ఐసీసీ వరల్డ్ కప్ లీగ్-2లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో సందీప్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతడు 10 ఓవర్లలో 47 పరుగులిచ్చి 3 వికెట్లు (జార్జ్ మున్సే, బ్రెండన్ మెక్‌ముల్లెన్, మాథ్యూ క్రాస్) తీశాడు. సందీప్‌తో పాటు లలిత్ రాజ్‌వంశీ (8-0-32-4) కూడా రాణించడంతో తొలుత బౌలింగ్ చేసిన నేపాల్ స్కాట్లాండ్ను 194 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం రోహిత్ పౌడెల్ (74 నాటౌట్), ఇషాన్ పాండే (55) రాణించడంతో 38.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కూడా సందీప్‌దే..!అంతర్జాతీయ వన్డేల్లో ఫాస్టెస్ట్ 100 వికెట్స్ రికార్డు కూడా సందీప్ ఖాతాలోనే ఉంది. ఈ ఘనతను అతడు కేవలం 42 మ్యాచ్‌ల్లోనే సాధించాడు. తాజాగా 150 వికెట్ల మార్క్‌ను కూడా అత్యంత వేగంగా చేరుకొని వన్డే క్రికెట్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాడు.
ఒక్క బెర్త్.. ఐదు జట్లు
ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. నిన్న (మే 18) సీఎస్కేను ఓడించడంతో ఎస్ఆర్హెచ్ ఓ బెర్త్ ఖరారు చేసుకుంది. వెళ్తూ వెళ్తూ ఆ జట్టు గుజరాత్‌ను కూడా ఫైనల్-4లోకి తీసుకెళ్లింది. అంతకుముందే ఆర్సీబీ ఓ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ప్రస్తుతానికి మూడు జట్లు బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. మిగిలిన ఏకైక బెర్త్ కోసం ఏకంగా ఐదు జట్లు పోటీపడుతున్నాయి.ఆ జట్లు ఏవి.. ఏ జట్టుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఏ జట్టుకు స్వల్పంగా ఉన్నాయి.. ఈ అంశాలపై ఓ లుక్కేద్దాం. మిగిలిన ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సీఎస్కే, ఢిల్లీ, కేకేఆర్ జట్లు పోటీపడుతున్నాయి. వీటిలో రాజస్థాన్‌కు అవకాశాలు ఎక్కువగా ఉండగా.. ఢిల్లీ తక్కువగా ఉన్నాయి. మిగతా మూడు జట్లలో చూసుకుంటే పంజాబ్, కేకేఆర్‌కు సమాన అవకశాలు ఉండగా.. సీఎస్కేకు కాస్త తక్కువ అవకాశాలు ఉన్నాయి.ముందుగా రాజస్థాన్‌ను తీసుకుంటే.. ఈ జట్టు లీగ్ దశలో ఇంకా 2 మ్యాచ్‌లు (లక్నో, ముంబై) ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. మిగతా రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఈ జట్టు మిగతా జట్ల జయాపజయాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. మిగతా జట్లు వారు ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లు గెలిచినా రాయల్స్ (16) ఉండే పాయింట్లు ఉండవు. కాబట్టి పోటీలో ఉన్న ఐదు జట్లలో రాయల్స్‌కే అవకాశాలు ఎక్కువ.రేసులో రెండో అతి పెద్ద అవకాశాలు ఉన్న జట్లు పంజాబ్, కేకేఆర్. ఈ రెండు జట్లు సమాన అవకాశాలు కలిగి ఉన్నాయి. పంజాబ్ వారు ఆడాల్సిన ఏకైక మ్యాచ్‌లో (లక్నో) గెలిస్తే 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది (రాజస్థాన్ ఏదైనా మ్యాచ్ ఓడిన పక్షంలో, మిగతా జట్లతో పనిలేదు). ఈ జట్టుకు మంచి రన్‌రేట్ ఉండటం అదనపు బెనిఫిట్ (కేకేఆర్‌తో పోలిస్తే) అవుతుంది.ఇక కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టు ఆడాల్సిన 2 మ్యాచ్‌ల్లో (ముంబై, ఢిల్లీ) భారీ తేడాతో గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది (రాజస్థాన్ కనీసం ఒక మ్యాచ్ అయినా ఓడి, పంజాబ్ ఆడాల్సిన ఏకైక మ్యాచ్‌లో ఓడితే). ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది.సీఎస్కే విషయానికొస్తే.. ఈ జట్టు ఆడాల్సిన ఏకైక మ్యాచ్‌లో (గుజరాత్) భారీ తేడాతో గెలిస్తే బెర్త్ దక్కే అవకాశం ఉంది (రాజస్థాన్ రెండు మ్యాచ్‌ల్లో ఓడాలి, పంజాబ్ ఓడాలి, కేకేఆర్ కనీసం ఒక మ్యాచ్ అయినా ఓడాలి, డీసీ ఓడాలి).చివరిగా ఢిల్లీ విషయానికొస్తే.. ఈ జట్టు ఆడాల్సిన ఏకైక మ్యాచ్‌లో (కేకేఆర్) భారీ తేడాతో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కే అవకాశం ఉంది (కేకేఆర్ కనీసం ఒక మ్యాచ్ అయినా ఓడాలి, రాజస్థాన్ రెండు మ్యాచ్‌ల్లో ఓడాలి, పంజాబ్ ఓడాలి, సీఎస్కే ఓడాలి).
ఐదో ప్రపంచకప్ ఆడనున్న మోడ్రిచ్
జాగ్రెబ్: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే క్రొయేషియా జట్టును ప్రకటించారు. 40 ఏళ్ల లుకా మోడ్రిచ్ ఐదోసారి ప్రపంచకప్‌లో ఆడనున్నాడు. 2006లో అరంగేట్రం చేసిన మోడ్రిచ్ ఆ తర్వాత 2014, 2018, 2022 ప్రపంచకప్ టోర్నిల్లో క్రొయేషియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలను వెనక్కి నెట్టి ప్రతిష్టాత్మక ‘బాలన్ డోర్’ అవార్డు అందుకున్న మోడ్రిచ్ 196 మ్యాచ్‌ల్లో క్రొయేషియా తరఫున ఆడాడు. వచ్చే నెలలో అమెరికా, మెక్సికో, కెనడా ఆతిథ్యమివ్వనున్న ప్రపంచకప్‌లో మిడ్‌ఫీల్డర్ మోడ్రిచ్ 200 మైలురాయిని దాటే అవకాశముంది. అంటోనియో కర్బాజాల్ (మెక్సికో), ఆండ్రెస్ గార్డాడో (మెక్సికో), లోథర్ మథియాస్ (జర్మనీ), రాఫెల్ మార్కెజ్ (మెక్సికో), గియాన్లుగి బఫన్ (ఇటలీ), యుటో నాగటోమో (జపాన్), గిలెర్మో ఒచావా (మెక్సికో), మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) ఇప్పటికే ఐదు ప్రపంచకప్ టోర్నీలు ఆడారు. మెస్సీ, రొనాల్డో తాజాగా ఆరోసారి ప్రపంచకప్‌లో పోటీపడనున్నారు. 2018 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా, 2022 ప్రపంచకప్‌లో మూడో స్థానాన్ని సంపాదించింది. క్రొయేషియా ఫుట్‌బాల్ జట్టు: లివాకోవిచ్, కొటార్స్కీ, ఇవోర్ పాండుర్ (గోల్‌కీపర్లు), గ్వార్డియోల్, కాలెటకార్, సుటాలో, స్టానిసిక్, పొన్గ్రాసిక్, ఎర్లిక్, వుస్కోవిచ్ (డిఫెండర్లు), లుకా మోడ్రిచ్, కొవాసిచ్, పాసాలిచ్, వ్లాసిక్, లుకా సుసిక్, బటురినా, జాకిక్, పీటర్ సుసిక్, నికోలా మోరో, టోనీ ఫ్రుక్ (మిడ్‌ఫీల్డర్లు), పెరిసిచ్, క్రామారిచ్, బుడిమిర్, పాసాలిచ్, పీటర్ మూసా, మటానోవిచ్ (ఫార్వర్డ్స్).
ఆసియా క్రీడలకు సురేఖ, చికిత, ధీరజ్, గణేశ్
సోనీపత్ (హరియాణా): ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ఆర్చరీ జట్లను ప్రకటించారు. మహిళల కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ స్టార్ వెన్నం జ్యోతి సురేఖ... తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత.. పురుషుల రికర్వ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్... పురుషుల కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన తిరుమూరు గణేశ్ మణిరత్నం భారత జట్టులోకి ఎంపికయ్యారు. మూడు రోజులపాటు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్ అనంతరం భారత జట్లను ఎంపిక చేశారు. వరుసగా నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న ప్రపంచ మాజీ నంబర్‌వన్ దీపిక కుమారి... దీపిక భర్త, భారత మాజీ నంబర్‌వన్ అతాను దాస్... వరుసగా మూడు ఆసియా క్రీడల్లో పాల్గొనడంతోపాటు రెండు స్వర్ణాలు, మూడు రజత పతకాలు నెగ్గిన అభిషేక్ వర్మ ట్రయల్స్‌లో విఫలమై ఆసియా క్రీడలకు ఎంపిక కాలేకపోయారు. ట్రయల్స్‌లో జ్యోతి సురేఖ 15.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా వరుసగా నాలుగో ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంది. ట్రయల్స్‌లో రెండో స్థానంలో నిలిచిన ప్రపంచ యూత్ చాంపియన్ చికిత, మూడో స్థానంలో నిలిచిన ప్రీతిక కూడా ఆసియా క్రీడలకు ఎంపికయ్యారు. పురుషుల కాంపౌండ్ విభాగంలో గణేశ్ 10.75 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం పొందాడు. గణేశ్‌తోపాటు సాహిల్ జాధవ్, కుశాల్ దలాల్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. సర్వీసెస్ తరఫున పోటీపడ్డ ధీరజ్ రికర్వ్ విభాగంలో 15.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు.
న్యూస్ పాడ్‌కాస్ట్
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
నేడు తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణం... మెజార్టీ దక్కడంతో ఎట్టకేలకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్
బిజినెస్
జారిపోతున్న రూపాయి..
ముంబై: అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాల ప్రభావాలతో రూపాయి మారకం విలువ గణనీయంగా పతనమవుతోంది. డాలరుతో పోలిస్తే మరో 39 పైసలు క్షీణించి 96.20కి పడిపోయింది. సోమవారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 95.81తో పోలిస్తే మరింత తక్కువగా 96.19 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 96.39కి కూడా క్షీణించి చివరికి 96.20 వద్ద క్లోజయ్యింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో క్రూడాయిల్ రేట్లు పెరుగుతుండటం, డాలరు బలోపేతం కావడం తదితర అంశాలతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతోందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. రాబోయే రోజుల్లోను ఇదే పరిస్థితి కొనసాగవచ్చని, అయితే, బంగారం, వెండి దిగుమతులపై ఆంక్షలతో పాటు ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ గానీ జోక్యం చేసుకోవడంలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే కనిష్ట స్థాయిల్లో రూపాయికి మద్దతుగా నిలవొచ్చని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు. స్పాట్ మార్కెట్లో రూపాయి 96–96.60 శ్రేణిలో తిరుగాడవచ్చని వివరించారు.
భారత్‌లో చాట్‌జీపీటీ ఇమేజ్‌ల సునామీ
న్యూఢిల్లీ: భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రముఖ ఏఐ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ ప్రవేశపెట్టిన ‘చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0’ భారత్‌లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. విడుదలైన నెల రోజుల్లోనే భారతీయులు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఏకంగా 100 కోట్లకు (1 బిలియన్) పైగా చిత్రాలను సృష్టించి సరికొత్త రికార్డు సృష్టించారు. ‘‘చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 భారత్‌లో ఇప్పటికే 100 కోట్ల మార్కును దాటేసింది. ఇది నిజంగా అద్భుతం’’ అంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ సోమవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 21న భారత్‌లో విడుదలైన ఈ వెర్షన్, మే 18 నాటికే ఈ ఘనతను సాధించింది. ఓపెన్ఏఐ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘సినిమాటిక్ పోర్ర్‌టెట్ కొలాజ్’, ‘మినీ మీ వరల్డ్’, ‘అండర్‌వాటర్ పోర్ర్‌టెట్’, ‘అనిమే’, ‘చిబి స్టికర్ ప్యాక్’, ‘మంగా కామిక్ స్ట్రిప్’, ‘ఫ్యాషన్ స్టూడియో పోర్ర్‌టెట్’ వంటి ప్రాంప్ట్ లతో భారతీయులు భారీగా చిత్రాలను రూపొందిస్తున్నారు. భారత్‌లో ఏఐ ఇమేజ్ జనరేషన్ కేవలం ఉత్పాదకతకే పరిమితం కాకుండా.. క్రియేటర్ కల్చర్, ఫ్యాషన్, ఫ్యాన్‌డమ్స్, డిజిటల్ ఐడెంటిటీతో మమేకమవుతోందని ఓపెన్ఏఐ పేర్కొంది.
కఠిన పొదుపు దిశగా కదలండి
న్యూఢిల్లీ: కఠిన పొదుపు దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీలు) మళ్లాలని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, బీమా సంస్థలను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ప్రజలు పెట్రోల్/డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణించాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా ఆర్థిక శాఖ ఈ సూచన చేసింది. బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని, విదేశీ పర్యటనలు మానుకోవాలని, ఇంటి నుంచే పనిచేయాలని, కార్లలో ఒంటరిగా వెళ్లకుండా ఇతరులతో కలసి ప్రయాణించాలంటూ ప్రధాని దేశ ప్రజలను కోరడం తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధంతో క్రూడ్, బంగారం ధరలు భారీగా ఎగబాకి.. దిగుమతి బిల్లు భారమవుతోంది. ఫలితంగా రూపాయి నేలచూపులు చూస్తోంది. దీంతో ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, బీమా, ఆర్థిక సంస్థల అధికారులు, సిబ్బందిని ఈవీల్లో ప్రయాణించాలని కోరింది. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఈవీలను అద్దెకు తీసుకోవాలని సూచించింది. తప్పనిసరి అయితే తప్పించి అన్ని సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ రూపంలో నిర్వహించుకోవాలని కూడా ఆర్థిక శాఖ కోరింది.
బులియన్ బ్యాంక్ కావాలి
న్యూఢిల్లీ: పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు, అదే సమయంలో ఆభరణాల తయారీకి అవసరమైన పసిడిని దేశీయంగానే సమకూర్చుకునేందుకు జ్యుయలరీ పరిశ్రమ ఓ ఆసక్తికరమైన ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టింది. బులియన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని కోరింది. తద్వారా దేశంలోపలే నిరుపయోగంగా ఉన్న పసిడిని వినియోగంలోని తీసుకురావచ్చని సూచించింది. ఆల్ ఇండియా జ్యుయలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ (ఏఐజేజీఎఫ్) ప్రతినిధులతో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిర్వహించిన సమావేశంలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ఇళ్లు, సంస్థలు, పెట్టుబడి వాహకాలు కలిగి ఉన్న బంగారాన్ని సమీకరించి జ్యుయలరీ రంగానికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తగిన కార్యాచరణను రూపొందించాలని ఆభరణాల పరిశ్రమ మంత్రిని కోరింది. బులియన్ బ్యాంక్ ప్రతిపాదనపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటును పరిశీలిస్తామని ఈ సందర్భంగా మంత్రి నుంచి హామీ లభించింది. ఈ కమిటీని కనుక ఏర్పాటు చేస్తే అందులో ప్రభుత్వం, ఆభరణాల రంగం, బులియన్ మార్కెట్, ఆర్థిక సంస్థలు, నియంత్రణ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని ఆ వర్గాలు తెలిపాయి.బ్యాంక్ మాదిరే.. ప్రతిపాదిత బులియన్ బ్యాంక్ అన్నది కేంద్రీకృత సంస్థగా పనిచేయనుంది. ఈ బ్యాంక్ దేశీయంగా ఉన్న పసిడిని సమీకరించి, అరువు కింద పరిశ్రమకు ఇస్తుంది. ఇళ్లలోని, సంస్థల నిర్వహణలోని (గోల్డ్ ఈటీఎఫ్‌లు) బంగారాన్ని సమీకరించి.. ఆభరణాల సంస్థలు, ఎగుమతిదారులు, రిఫైనరీలు, తయారీదారులకు సరఫరా చేయనుంది. ఇళ్లు, సంస్థల వద్ద 25,000–35,000 టన్నుల పసిడి ఉంటుందని అంచనా. గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) సైతం పెద్ద మొత్తంలో భౌతిక బంగారాన్ని (పెట్టుబడులకు బ్యాకెండ్‌గా) ఖజానాల్లో కలిగి ఉన్నాయని ఏఐజేజీఎఫ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈటీఎఫ్‌ల్లోకి వచ్చే ప్రతి రూపాయి తాజా పెట్టుబడికి అనుగుణంగా పసిడి దిగుమతులకు అదనపు డిమాండ్ ఏర్పడుతుందని పేర్కొంది. కనుక బులియన్ బ్యాంక్ ద్వారా ఈటీఎఫ్‌లు తమ నిర్వహణలోని భౌతిక బంగారంలో 20–30 శాతాన్ని బాడుగ కింద ఇచ్చేందుకు అనుమతించాలని సూచించింది. దీనివల్ల ఆభరణాల వినియోగానికి సంబంధించి పసిడి దిగుమతుల డిమాండ్‌ను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నది పరిశ్రమ సూచన. రూపాయి విలువను, ఫారెక్స్‌నిల్వలను కాపాడుకునేందుకు పసిడి, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం ఇటీవలే 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం తెలిసిందే. అలాగే, ఆభరణాల ఎగుమతిదారులకు అడ్వాన్స్డ్ అథరైజేషన్ స్కీమ్ కింద పసిడి దిగుమతులను కఠినతరం చేయడంతో పరిశ్రమ ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఎన్ఎస్ఈలో ఈజీఆర్‌ల ట్రేడింగ్ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్‌లు)లో లైవ్ ట్రేడింగ్ ప్రారంభించినట్టు ఎన్ఎస్ఈ ప్రకటించింది. నియంత్రిత స్పాట్ గోల్డ్ మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు ఇది సాయపడుతుందని పేర్కొంది. అహ్మదాబాద్, ముంబైలో సేకరణ, ఖజానా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు.. ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరులోనూ కొత్త కేంద్రాలను సోమవారం నుంచి యాక్టివేట్ చేసినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 120 కేంద్రాలకు నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్టు తెలిపింది. సెబీ నమోదిత ఖజానాల్లో భౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి, ఆ రిసీట్స్‌పై స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో ట్రేడింగ్‌కు వీలుగా అందుబాటులోకి వచ్చిందే ఈజీఆర్.
ఫ్యామిలీ
ఏకలవ్య శిష్యరికం
ఆధునిక భారతదేశంలో ఏకలవ్యుడు దళిత, గిరిజన హక్కులకు ఆదర్శంగా ప్రత్యేకంగా నిలిచాడు. ఏకలవ్యుని గౌరవార్ధం, కేంద్ర ప్రభుత్వం భారతీయ గిరిజనుల కోసం ‘ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను‘ నిర్వహిస్తోంది. అలాగే కర్ణాటక, హర్యానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు క్రీడలలో అసాధారణ విజయాలు సాధించిన 19 ఏళ్లలోపు ఉన్న విద్యార్థులకు, వ్యక్తులకు ఏకలవ్య పురస్కారాలను ప్రదానం చేస్తోంది. ఇది ఇలా ఉండగా హర్యానాలోని గురగ్రామ్ లో ఏకలవ్యునికి అంకితం చేయబడిన ఆలయం ఒకటి ఉంది. ఆ గ్రామంలోని కాండ్సప్రాంతంలో ఆలయాన్ని అక్కడి గ్రామస్తులు అప్పట్లో నిర్మించారు. ఈ ఆలయం వద్దనే ఏకలవ్యుడు తన బొటనవేలు కోసి గురువైన ద్రోణాచార్యుడికి సమర్పించినట్లు చారిత్రాత్మక ఆధారం. ఏకలవ్యుడంటే తెలియని వాళ్లు...గురు దక్షిణగా తన కుడిచేతి బొటన వేలునే తెగ్గోసి ఇచ్చిన విషయం గురించి వినని వారు బహుశా ఉండరేమో.... దీక్ష... పట్టుదల...అంకిత భావం... ఎనలేని గురుభక్తితో కాదు పొమ్మన్నా సరే... ఆ గురువునే మట్టిబొమ్మగా మలుచుకొని ఒక గొప్ప విలువిద్య కారుడుగా మహాభారతంలో పేరుగాంచిన మేటి విలుకాడే ఏకలవ్యుడు....నిషాదుల రాజు హిరణ్యధన్వుని కుమారుడే ఏకలవ్యుడు. కౌరవ పాండవులకు ఆస్థాన గురువైన ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్చుకోవాలన్నది ఏకలవ్యుని ఆకాంక్ష. అయితే ఏకలవ్యుని సామర్థ్యాన్ని గమనించిన ద్రోణాచార్యుడు అతనికి తగిన శిక్షణ ఇస్తే అతడు విలువిద్యలో కౌరవ, పాండవ రాకుమారులను మించిపోతాడని, దాంతో తాను భీష్మునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనేమోననే ఉద్దేశ్యంతో ఏకలవ్యుని తన శిష్యునిగా స్వీకరించేందుకు అంగీకరించలేదు ద్రోణాచార్యుడు. ఏకలవ్యుడు అందుకు ఏమాత్రం నిరాశపడక గురువుపై ఉన్న అపారమైన భక్తి, అచంచలమైన విశ్వాసంతో ద్రోణాచార్యుని మట్టిబొమ్మను తయారు చేసుకొని స్వీయ శిక్షణతో గొప్ప విలుకాడుగా పేరుగాంచాడు.ఒకసారి ఒక వేట కుక్క ఏకలవ్యుడిని చూసి మొరగడంతో ఏకలవ్యుడు ఆ కుక్క నోరు తెరిచి ఉండగానే దానికి ఏమాత్రం హాని కలగకుండా ఏడు బాణాలు వేశాడు. ఎంతో నైపుణ్యంతో వేసిన బాణాలను చూసిన అర్జునుడు నిరాశకు లోనై ద్రోణాచార్యునికి విషయాన్ని తెలిపాడు. అనంతరం ఏకలవ్యుని కలిసిన ద్రోణాచార్యుడు, ఏకలవ్యుని ఏకాగ్రతను గుర్తించి అభినందిస్తాడు. అయితే తన ప్రియ శిష్యుడైన అర్జునుని మేటి విలుకానిగా తీర్చిదిద్దుతానని తాను అర్జునునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనేమో అనే ఉద్దేశ్యంతోనూ, అతను తనను గురువుగా భావించి నేర్చుకున్న విలువిద్యకు తగిన గురుదక్షిణగా ఏకలవ్యుని కుడిచేతి బొటన వేలు కోరతాడు, ఏమాత్రం సంకోచించకుండా తన కుడిచేతి బొటన వేలునే తెగ్గోసి గురువైన ద్రోణాచార్యునికి సమర్పిస్తాడు ఏకలవ్యుడు. గురువుతో ప్రత్యక్ష సంబంధం లేకుండానే ఆ గురువును ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు జాడలలో నడుస్తూ స్వయంగా విద్యను నేర్చుకునే వారిని ఏకలవ్య శిష్యులు అనే నానుడి అలా వచ్చింది. అమృత బిందువులు – ఆలోచన లేని స్పందన అవగాహన లేని విమర్శ సంపాదన లేని ఖర్చు ప్రయత్నం లేని ఓటమి వీటివల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది.– ‘మన సంబంధం ఆస్తులతో ముడిపడిన వారంతా బంధువులవుతారు. మన విలువలు సుఖ దుఃఖాలతో ముడిపడిన వారంతా ఆత్మ బంధువులవుతారు.– సన్మార్గంలో సాగడం వల్లే మనిషి ఈ సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందుతాడు. మానవత్వం వల్లే అందరికీ ఆదర్శ్రపాయుడవుతాడు. అందుకే భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మ ద్వారా అందరికీ సాయం చేసే స్థాయికి మనం ఎదగాలి.– మనం గెలిస్తే మనవాళ్ళకి మనమేంటో తెలుస్తుంది. మనం ఓడిపోతే మనవాళ్ళు ఎవరో మనకు తెలుస్తుంది.– చిన్నప్పుడు దేన్నయినా పట్టుకుని నిలబడాలి. పెద్దయ్యాక దేన్నయినా తట్టుకుని నిలబడాలి.→ ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే. – సి. ఎన్. మూర్తి సీనియర్ పాత్రికేయులు
నిస్వార్థ సేవే నిజమైన ధర్మం
రాగి పాత్రని ప్రతి రోజూ శుభ్రం చేయకపోతే, చిలుం పట్టినట్లుగా, ప్రతి రోజూ విహిత కర్మాచరణ, సత్కర్మలు చేయకపోతే, మనసు కూడా మలినమై పాపగ్రస్థమవుతుంది. సత్కర్మ అంటే కేవలం పూజలు, పునస్కారాలు చేయడం మాత్రమే కాదు. సమాజానికి, తోటి ప్రాణులకు మేలు చేసే ప్రతి పని సత్కర్మే అవుతుంది. కీడు తలపెట్టకపోవడం, అందరూ బాగుండాలని కోరుకోవడం (మానసిక సత్కర్మ). మృదువుగా మాట్లాడటం, సత్యాన్ని పలకడం, ఎవరినీ మాటలతో గాయపరచకపోవడం(వాచిక సత్కర్మ). శ్రమించి పని చేయడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, సమాజసేవ చేయడం(శారీరక సత్కర్మ). భారతీయ సంస్కృతిలో ‘యద్భావం తద్భవతి‘ అని అంటారు. అంటే మన ఆలోచనలు ఎలా ఉంటే మన పనులు అలానే ఉంటాయి. భారతీయ జీవన విధానంలో, ధర్మశాస్త్రాలలో సత్కర్మాచరణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మనం చేసే పనులే మన వ్యక్తిత్వాన్ని, మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మనిషి పుట్టుకతో గొప్పవాడు కాడు, తను చేసే కర్మల (పనుల) ద్వారానే గొప్పవాడవుతాడు. మనం చేసే ప్రతి చిన్న మంచి పని సమాజంలో ఒక సానుకూల మార్పుకు నాంది పలుకుతుంది. కాబట్టి, ప్రతిరోజూ కనీసం ఒక మంచి పని చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలి.రోజుకు కొంత సమయం సత్సాంగత్యంలో గడపడం వల్ల పోనుపోను మనసు ప్రక్షాళితమవుతుంది. ఒకరి అనుభవం, జిజ్ఞాస ఇతరులకు చేరతాయి. దీనివల్ల వేరే ఆలోచనలు దూరంగా ఉంటాయి. నిజజీవితంలో ఏదైనా కర్మ నిర్వర్తించేటప్పుడు, అది నాకు, ఇతరులకు మంచి చేస్తుందా అనే ప్రశ్న వేసుకోవడం, ఆ కర్మను ఫలాపేక్ష లేకుండా భగవదర్పితం చేయడం వల్ల మోక్షమార్గం సులువవుతుంది. మనసు పూర్తిగా ఆ పరమాత్మపై లగ్నమైనప్పుడు, లౌకికమైన భయాలు మనిషిని ఏమీ చేయలేవు. మనసుని దైవపరం చేయడం వల్ల మనం చేసే ప్రతి పనీ నిష్కామ కర్మ అవుతుంది. సంసారమనే సాగరంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, భగవంతుడనే నావ మనల్ని మునిగిపోనివ్వదు. క్రోధం, ఈర‡్ష్య, ద్వేషం వంటి అంతర్గత శత్రువులనే మంటలు మనల్ని దహించలేవు. మనసు ప్రశాంతమైన మలయమారుతంలా మారుతుంది. లోకంలో మన చుట్టూ ఉండే ప్రతికూలతలనే విషం వ్యక్తిత్వాన్ని లేదా మనశ్శాంతిని హరించలేదు.‘నేను చేస్తున్నాను’ అనే అహంకారం లేకుండా, ‘అంతా దైవ నిర్ణయం, నేను కేవలం నిమిత్తమాత్రుడిని’ అనే భావంతో కర్మలు చేయడం వల్ల విజయం వచ్చినా పొంగిపోము, అపజయం ఎదురైనా కుంగిపోము.ఒక వ్యక్తి చేసే ’మంచి పని’ అనేది కేవలం ఎదుటివారికి సహాయం చేయడం మాత్రమే కాదు, అది సమాజంలో ఒక సానుకూల మార్పుకు పునాది వేస్తుంది. మంచి పనిని ఆచరించడానికి పెద్ద పెద్ద పనులు చేయనక్కర్లేదు, మన దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనులే గొప్ప మార్పును తెస్తాయి. మంచి పని చేసేటప్పుడు ఏ గుర్తింపునూ లేదా ప్రతిఫలాన్ని ఆశించకుండా చేస్తే, అది పైన మనం చెప్పుకున్న ’నిష్కామ కర్మ’ అవుతుంది. ఫలితం ఆశించకుండా చేసే సాయం ఎప్పుడూ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.మానవ జీవితం కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ‘కర్మ’ అంటే పని. మనం చేసే పనులే మన భవిష్యత్తును, మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. ‘సత్’ అంటే మంచి, ‘ఆచరణ’ అంటే అనుసరించడం. అంటే, శాస్త్ర సమ్మతంగా, ధర్మబద్ధంగా, పరోపకార భావంతో చేసే పనులనే సత్కర్మాచరణ అంటారు. ఒక వ్యక్తి చేసే మంచి పని సమాజంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి చెట్టు నాటితే, అది వందల మందికి నీడనిస్తుంది. డబ్బు, పదవులు శాశ్వతం కావు. మనిషి మరణించిన తర్వాత కూడా అతను చేసిన మంచి పనులు మాత్రమే జీవించి ఉంటాయి. ప్రతి ఒక్కరూ రోజూ కనీసం ఒక చిన్న మంచి పనినైనా చేస్తూ సత్కర్మ మార్గంలో పయనించాలి.– ఆనంద ‘మైత్రేయ’మ్
ఆ కేఫ్ మొత్తం ఆడవాళ్లే..!
పర్యాటకం కమ్ ఉపాధిని కల్పించేలా అద్బుతమైన కేఫ్ ఇది. అయితే ఇక్కడ మొత్తం ఆడవాళ్లే ఉంటారు. నిర్వహించేది..వంట చేయడం నుంచి క్లీనింగ్ వరకు మొత్తం ఆడవాళ్ల సామ్రాజ్యమే దర్శనమిస్తుంది. అలాంటి విచిత్రమైన కేఫ్ తూర్పు సిక్కింలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాబా హర్భజన్ సింగ్ పుణ్యక్షేత్రానికి సమీపంలో, 13,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది పూర్తిగా స్థానిక మహిళలతో కూడిన బృందంతో నడిచే కేఫ్. మారుమూల ఎత్తైన ప్రాంతంలో ఉండే ఈ కేఫ్ స్థితిస్థాపకత, వ్యవస్థాపకత, స్వావలంబనను ప్రతిబింబిస్తుంది. అంతేగాదు సందర్శకులకు ఓ గొప్ప అనుభవాన్ని అందిస్తోంది. ఈ కేఫ్ భారత ఆర్మీ చొరవతో ఏర్పాటైంది. స్థానికి భాగస్వాముల సమన్వయంతో త్రిశక్తి కార్ప్స్ ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించి, సులభతరం చేసింది. యుద్ధ భూమిని వీక్షించే కార్యక్రమంలో భాగంగా, ఈ ప్రాంత వారసత్వాన్ని, వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రదర్శిస్తూ సరిహద్దు ప్రాంతాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కేఫ్ రూపుదిద్దుకుంది. ఇది ఒకరకరంగా స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ..మారుమూల ప్రాంతా ఆర్థిక సాధికారతనకు దోహదపడుతోంది. అంతేగాదు జీవనోపాధిని ఇలా పర్యాటకంతో అనుసంధానించటంతో ఈ కార్యక్రమం సుస్థిర అభివృద్ధికి, పుణ్యక్షేత్రానికి పర్యాటకుల రాక పెరగడానికి తోడ్పడుతుందని పలువురు భావిస్తున్నారు. ఈ ప్రయత్నం నిజంగా సమర్థవంతమైన సైనిక-పౌర సహకారానికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతేగాదు ఇది సరిహద్దు ప్రాంతాలలో సమ్మిళిత వృద్ధి, అభివృద్ధి పట్ల భారత సైన్యం నిబద్ధతను బలోపేతం చేయడంతో పాటు, భారత పౌరులతో బలమైన సంబంధాలను పెంపొందిస్తుంది.(చదవండి: సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..)
సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..
అందరు చేసే వంటకమే కానీ దాన్ని సర్వ్ చేసే విధానం లేదా వండే విధానంలో ప్రత్యేకత ఉంటేనే కథ ఏ ఫుడ్ స్టాల్ అయినా క్లిక్ అయ్యేది. ప్రజాదరణ పెరిగేది. బహుశా దాన్నే క్యాచ్ చేశాడు ఈ టీనేజ్ యువకుడు. అలా ఇలా ఆలోచించలేదు ఈ యువకుడు. వంట చేసే విధానంలో సరికొత్తగా ఫ్యాషన్ జోడించడంతో అతడ ఫుడ్ స్టాల్ మూడు పువ్వులు ఆరు కాయల్లా దినదినాభివృద్ధితో దూసుకుపోతోంది. ఇంతకీ స్టైలిష్‌గా వంట చేయడం ఎలాగంటే..చైనాకు చెందిన ఒక యువకుడు ఒక సాధారణ ఫ్రైడ్ రైస్ దుకాణాన్ని తన క్రియేటివిటీతో కొత్త లుక్‌ని అందించడమే కాదు లాభాల బాట పట్టేలా చేశాడు. అందరిలా వండటం కంటే.. ప్రత్యేకంగా విభిన్నంగా వంట చేసి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా అతడి వద్దకు వచ్చేవాళ్లు తినడాని కంటే..అతడు చేసే విధానం అతడి ఆహార్యం చూసి నివ్వెరపోతూ ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తిగా వస్తూ..ఇక అక్కడే తింటుండటం విశేషం. 19 ఏళ్ల లూ షాన్డాంగ్ ఈనే యువకుడు కుటుంబ దుకాణాన్ని చాలా విభన్నంగా నడిపిస్తున్నాడు. ఎవరైన వంట చేయాడానికి వచ్చే వాళ్లు కుక్ డ్రెస్ లాంటది వేసుకుంటారు. కానీ ఇక్కడ లూ ఫ్యాషన్‌గా ఉంటాడు. ఆయన ఆఫీస్‌కి వెళ్లే వ్యక్తిలా సూటు బూటు వేసుకుని కనిపించడం విశేషం. చైనాలోని ఓ సాదారణ ఫ్రైడ్ రైస్ స్టాల్ రెస్టారెంట్‌కు మించి క్రేజ్ సంపాదించుకుంది. అందుకు ప్రధాన కారణం అతడు వండే విధానమే. లీ చాలా స్టైలిష్‌గా వండుతున్న విధానం అందర్నీ ఆకర్షించి ఆ స్టాల్‌కి జనాలు క్యూకట్టేలా ప్రజాదరణ పొందింది. అంతేకాదండోయ్ ఎంతో రుచిగా క్షణాల్లో వేడివేడిగా వడ్డిస్తాడు. అతడు ఎంత బిజీలో అయినా ఫ్రైడ్ రైస్‌ని జస్ట్ మూడు నిమిషాల్లో తయారు చేస్తాడు. ఇక ఫైడ్‌రైస్ ఒక ప్లేటు రూ. 1401లు అట. అతడి ఖర్చులు పోగా నెలకు సుమారుగా రూ. 7లక్షలుపైనే ఆర్జిస్తున్నట్లు తెలిపాడు. క్రియేటివిటీకి నైపుణ్యం తోడైతే అద్భుతాలు జరగుతాయి అంటే ఇదేగదా..!. లూ నవ్వు మామలు గ్రేట్ కాదు..సూపరో సూపర్..!. కాగా, ఈ స్టాల్ ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈమేరకు లూ మాట్లాడుతూ..ఏదో సరదాగా కస్టమర్ల ముఖంలో నువ్వులు విరబూయించేందుకు ఇలా సూటు వేసుకుని వంట చేశాను. కానీ వాళ్ల నుంచి ఈ స్ధాయిలో స్పందన వస్తుందని అస్సలు ఊహించలేదని సంతోషంగా చెబుతున్నాడు లూ. View this post on Instagram A post shared by Mothership (@mothershipsg) (చదవండి: కోడిగుడ్డంత పుచ్చకాయలు)
అంతర్జాతీయం
పాకిస్థాన్ భయంకర వ్యూహం.. చైనాతో ‘అణు’ డీల్‌కు రహస్యంగా..
పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ ఏం చేసినా భారత్‌ను దృష్టిలో పెట్టుకునే చేస్తుంది. భారత్ త్రివిధ దళాల వద్ద ఉన్న విధ్వంసకర ఆయుధాలను చూసి పాక్ భయపడుతుంది. భారత్‌లో ఎటువంటి ఆయుధాలు ఉన్నాయో, ఎలాంటి అణ్వాయుధ వ్యవస్థలు ఉన్నాయో అటువంటివి అభివృద్ధి చేసుకోవాలని భావిస్తుంది. కానీ, అగ్ర దేశాల వద్ద అప్పులు అడుక్కునే పాక్ ఎన్నో రకాల ఆయుధాలను తన అమ్ములపొదిలో చేర్చుకోలేకపోయింది. ప్రపంచంలో 6 దేశాలకు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ఆధారిత సముద్ర అణు నిరోధక వ్యవస్థ ఉంది. అవే.. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే, భారత్. ఇక ఇజ్రాయెల్ వద్ద క్రూయిజ్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద అణు బాలిస్టిక్ క్షిపణిని మోసే ఒక సంప్రదాయ జలాంతర్గామి ఉంది. భారత్‌కు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ఆధారిత సముద్ర అణు నిరోధక వ్యవస్థ ఉండడంతో తమకూ కావాలని పాక్ ప్రయత్నాలు జరిపింది.చైనా నౌకాదళం తమ గ్వాదర్ పోర్ట్‌ను శాశ్వతంగా వినియోగించుకునే అవకాశం ఇస్తామని పాకిస్థాన్ చెప్పినట్లు తెలుస్తోంది. దానికి ప్రతిఫలంగా అణుదాడి చేయగల సామర్థ్యం ఉన్న జలాంతర్గాములు లేదా అణు ఆయుధ వ్యవస్థను ఇవ్వాలని చైనాను పాక్ కోరిందని అమెరికాకు చెందిన ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ పేర్కొంది. శత్రుదేశం ముందుగా అణుదాడి చేసినా.. జలాంతర్గాముల నుంచి తిరిగి అణుదాడి చేసే శక్తిని పొందాలని పాక్ భావిస్తోంది. దీన్ని అణు నిరోధక వ్యవస్థలో అత్యంత కీలక భాగంగా భావిస్తారు.పాక్ సైన్య రహస్య పత్రాలను పరిశీలించి.. పాకిస్థాన్ సైన్య రహస్య పత్రాలను పరిశీలించామని, దాని ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నామని ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ తెలిపింది. 2024లో పాకిస్థాన్ సైన్యం-చైనా ద్వైపాక్షిక చర్చల్లో ఈ డిమాండ్ వచ్చిందని పేర్కొంది. ఆ సమయంలో పాకిస్థాన్ సైన్యానికి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ నాయకత్వం వహించాడు. 2024 ఆరంభంలో గ్వాదర్‌ను చైనా సైన్యానికి శాశ్వత స్థావరంగా మార్చేందుకు అనుమతి ఇస్తామని చైనాకు పాకిస్థాన్ రహస్యంగా హామీ ఇచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది అణ్వాయుధాలు మోసే జలాంతర్గాములు ఇవ్వాలని చైనాను కోరింది. దీంతో ఇప్పటికే పాక్ వద్ద ఉన్న గగనతల, భూతల అణ్వాయుధాల ద్వంద్వ వ్యవస్థను సముద్ర వ్యూహాత్మక ఆయుధాలతో కూడిన త్రివిధ వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డిమాండ్ అసంబద్ధమని చైనా భావించడంతో చర్చలు నిలిచిపోయాయి.ఇమ్రాన్ ఖాన్‌ను అధికారంలో నుంచి తొలగించాలని ఒత్తిడి తెచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేటివ్‌లోని కీలక అధికారి రహస్య కేబుల్ వివరాలు కూడా ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ వెల్లడించింది. దీంతో, అణ్వాయుధాలు కలిగిన పాకిస్థాన్.. అటు చైనా, ఇటు అమెరికాతో చర్చోపచర్చలు జరిపినట్టు స్పష్టమైంది. గత ఐదేళ్లలో అమెరికా-పాకిస్థాన్ సంబంధాలను మలిచిన పరిణామాలను ఈ కథనం వివరించింది. అమెరికాతో సన్నిహితంగా ఉంటూనే.. వ్యూహాత్మక ఆయుధాలు ఇవ్వాలని చైనాతోనూ పాకిస్థాన్ బేరసారాలు జరిపింది.అణ్వాయుధాలు మోసే జలాంతర్గాములు 3 రకాలుగా ఉంటాయి.. అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు, క్రూయిజ్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు, బాలిస్టిక్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు.ఈ మూడింట్లో పాకిస్థాన్ దేన్ని కోరిందో పాకిస్థాన్ కథనంలో స్పష్టత లేదు. 1970 చివర, 1980 ఆరంభంలో చైనా సహకారంతో పాకిస్థాన్ అణుబాంబు తయారుచేసింది. రహస్య అణు సాంకేతిక బదిలీల్లో ఇదే తొలి ఉదాహరణగా భావిస్తున్నారు. అధిక సాంద్రత యురేనియం సరఫరాతో పాటు, 1960లలో పరీక్షించిన 12 కిలోటన్నుల సామర్థ్యమున్న సీహెచ్ఐసీ-4 అణు విస్ఫోటక రూపకల్పనను కూడా పాకిస్థాన్‌కు చైనా ఇచ్చింది. 1990లలో అణ్వాయుధాలను ప్రయోగించే ఎం-11 మధ్యదూర బాలిస్టిక్ క్షిపణులను కూడా పాకిస్థాన్‌కు చైనా విక్రయించింది.ఈ ఆయుధాలతో గగనతలం, భూమి నుంచి ప్రయోగించే ద్వంద్వ అణు వ్యవస్థను పాకిస్థాన్ తయారుచేసుకుంది. కానీ త్రివిధ వ్యవస్థలో మూడో భాగమైన సముద్ర ఆధారిత అణ్వాయుధ సామర్థ్యం మాత్రం సాంకేతిక, ఆర్థిక పరిమితుల వల్ల సాధ్యం కాలేదు.సముద్రం అడుగునుంచి ప్రయోగించే అణ్వాయుధాను అత్యంత శక్తివంతమైన ఆయుధాలుగా భావిస్తారు. శత్రువు తొలి అణుదాడి చేసినా, తీవ్ర నష్టం జరిగిన తర్వాత కూడా ప్రతిదాడి చేయొచ్చు. 2017లో 450 కిలోమీటర్ల పరిధితో జలాంతర్గామి నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించి త్రివిధ అణు వ్యవస్థ పూర్తి చేశామని పాకిస్థాన్ ప్రకటించింది. కానీ పాకిస్థాన్ వద్ద కేవలం 5 క్రియాశీల సంప్రదాయ జలాంతర్గాములు మాత్రమే ఉండటం, క్షిపణి పరిధి తక్కువగా ఉండటం వల్ల ఇది ప్రాథమిక స్థాయి సముద్ర అణు నిరోధక వ్యవస్థగానే మిగిలింది.
ఇజ్రాయెల్‌కు పదులకొద్దీ విమానాల్లో మందుగుండు సామగ్రి
టెల్ అవీవ్: జర్మనీలోని స్థావరాల నుంచి అమెరికాకు చెందిన పదుల కొద్దీ కార్గో విమానాలు మందుగుండు సామగ్రితో సోమవారం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో దిగినట్లు అల్ జజీరా వార్తా సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఛానల్ 13 సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది.ఇరాన్‌పై మరోసారి దాడులు ప్రారంభించే ఉద్దేశంతోనే వాషింగ్టన్ చర్యలు కొనసాగుతున్నాయన్న అనుమానాలు పెరిగాయి. దీంతో పశ్చిమాసియా ఘర్షణ మరింత ఉద్ధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా చర్యలు ఇరాన్‌పై యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే సన్నాహాల్లో భాగమని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది.యురేనియం నిల్వలు, ఆంక్షల సడలింపు, యుద్ధ నష్టపరిహారం అంశాలపై చర్చలు నిలిచిపోయిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి హెచ్చరిక జారీ చేశారు. “ఇరాన్ ముందున్న సమయం వేగంగా ముగుస్తోంది. వారు వెంటనే కదలాలి. లేకపోతే వారి దగ్గర ఏమీ మిగలదు. సమయం అత్యంత కీలకం” అని ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు.చర్చలు పునఃప్రారంభించేందుకు అమెరికా విధించిన ప్రధాన షరతులను ఇరాన్ మీడియా బయటపెట్టిన కొన్ని గంటలకే ట్రంప్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. 400 కిలోల శుద్ధి చేసిన యురేనియాన్ని అప్పగించాలని, ఒక అణు కేంద్రాన్ని మాత్రమే కొనసాగించాలని, యుద్ధ నష్టపరిహారం డిమాండ్‌ను వదులుకోవాలని అమెరికా కోరింది.దీనికి ప్రతిగా టెహ్రాన్ కూడా చర్చలపై 5 షరతులు పెట్టింది. పశ్చిమాసియాలో, ముఖ్యంగా లెబనాన్‌లో సైనిక చర్యలు ముగియాలని, ఇరాన్‌పై ఆంక్షలు తొలగించాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా తెలిపింది.అదనంగా యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వాలని, హార్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఈ వ్యూహాత్మక మార్గంలో నౌకల రాకపోకలపై ఇరాన్ నియంత్రణ కఠినతరం చేసింది. మరోవైపు ఇరాన్ పోర్టులు, సముద్ర వాణిజ్యంపై అమెరికా విస్తృత నౌకాదళ దిగ్బంధంతో ఒత్తిడి పెంచింది.
చైనాలో భారీ భూకంపం: కుప్పకూలిన భవనాలు
గ్వాంగ్సీ : చైనాలోని గ్వాంగ్సీ ప్రాంతాన్ని భయంకరమైన ప్రకృతి విపత్తు వణికించింది. సోమవారం తెల్లవారుజామున సంభవించిన 5.2 తీవ్రత గల భారీ భూకంపం విధ్వంసాన్ని సృష్టించింది. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ప్రాణభయంతో ఒక్కసారిగా ఇళ్లలోంచి వీధుల్లోకి పరుగులు తీశారు. కళ్ల ముందే క్షణాల వ్యవధిలోనే పలు బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఇద్దరు మృత్యువాత గ్వాంగ్సీ పరిధిలోని లియోజౌ నగరం, అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతాలను ఈ భూకంపం అత్యంత తీవ్రంగా కుదిపేసింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరొకరు గల్లంతైనట్లు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా, సీసీటీవీ తమ కథనాల్లో వెల్లడించాయి. ఈ విపత్తులో గాయపడిన మరో నలుగురు బాధితులను హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని ఉన్నతాధికారులు తెలిపారు.నేలమట్టమైన 13 భవనాలుభారీ ప్రకంపనల ధాటికి ఆ ప్రాంతంలో ఏకంగా 13 భవనాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయని అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తగా ప్రాణనష్టాన్ని నివారించే ఉద్దేశ్యంతో ప్రభావిత ప్రాంతాల నుంచి ఏకంగా 7,000 మందికి పైగా నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్యవసర ప్రతిస్పందన బృందాలు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన సహాయక, పునరావాస కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. రైల్వే వ్యవస్థపై ప్రభావంభూకంపం దెబ్బకు రైల్వే వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడింది. రైల్వే మౌలిక సదుపాయాలకు వాటిల్లిన నష్టాన్ని, భద్రతా పరిస్థితులను అంచనా వేసేందుకు నిపుణుల బృందాలు విస్తృత తనిఖీలు ప్రారంభించాయి. ఈ క్రమంలో రైళ్ల రాకపోకలకు, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ఆఫ్టర్ షాక్స్ (మరిన్ని ప్రకంపనలు) వచ్చే ప్రమాదం పొంచి ఉందన్న తీవ్ర ఆందోళనల నేపథ్యంలో, అదనపు నష్టం జరగకుండా నివారించేందుకు అత్యవసర సహాయక సిబ్బందిని భారీ సంఖ్యలో మోహరించారు.
క్రూజ్ షిప్లో ప్రాణాంతక వైరస్.. కెనడాలో తొలి కేసు!
ఒట్టావా: అట్లాంటిక్ మహాసముద్రంలో ‘ఎంవీ హోండియస్’ క్రూజ్ షిప్లో ప్రయాణించిన వారిలో ప్రాణాంతక ‘ఆండీస్ హంటా వైరస్’ వెలుగుచూడటం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా ఈ నౌకలో ప్రయాణించిన ఓ కెనడా దేశస్థునికి ఈ వైరస్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారికంగా నిర్ధారించడంతో విమానయాన, పర్యాటక వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.కెనడాలో తొలి కేసు నమోదుఏప్రిల్ 1న అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఎంవీ హోండియస్ క్రూజ్ షిప్లో మొత్తం నలుగురు కెనడా పౌరులు ప్రయాణించారు. వీరిలో ఒకరి నమూనాలను పరీక్షించగా, మే 16న హంటా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆఫ్ కెనడా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. విన్నిపెగ్‌లోని నేషనల్ మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో చేసిన పరీక్షల్లో, అతడితో పాటు ప్రయాణించిన మరో కెనడియన్‌కు మాత్రం నెగెటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.మనిషి నుంచి మనిషికి వ్యాప్తిసాధారణంగా ఎలుకలు, వాటి వ్యర్థాల ద్వారా మాత్రమే ఈ హంటా వైరస్ వ్యాపిస్తుంది. కానీ, ప్రస్తుతం ఈ క్రూజ్ షిప్లో వెలుగుచూసిన ‘ఆండీస్’ రకం మాత్రం మనిషి నుంచి మనిషికి నేరుగా సోకే అత్యంత ప్రమాదకరమైన వైరస్ కావడం ఆందోళన కలిగిస్తోంది. నౌకలో ప్రయాణికుల మధ్య వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించిన ఆరోగ్య సంస్థలు తక్షణమే అప్రమత్తమై, ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ చేపట్టాయి.కోవిడ్‌లా కాదు.. ప్రజలకు ముప్పు లేదుక్రూజ్ షిప్లో కేసులు నమోదైనప్పటికీ, కెనడాలోని సామాన్య ప్రజలకు ఈ వైరస్ వల్ల ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని అధికారులు భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని, కాంటాక్ట్ ట్రేసింగ్, పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని కోవిడ్-19 మహమ్మారితో పోల్చవద్దని, ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావొద్దని వైద్యాధికారులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: నాడు మన సొంతం.. నేడు పరాయి ముచ్చట!
జాతీయం
ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం
ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం జరిగింది. రుషికేష్ సమీపంలో ఉజ్జయిని ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో రైలు ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే దేశవ్యాప్తంగా గత మూడు రోజుల్లో వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకోవడం రైల్వే భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రుషికేశ్ సమీపంలో ఖాంద్ గ్రామం వద్ద యోగనగరి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంజిన్‌తో పాటు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. అధికారులు వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టారు. రాత్రంతా రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ బృందాలు సంఘటనా స్థలంలో పనిచేశాయి. బోగీలను తొలగించడానికి భారీ యంత్రాలను మంగళవారం ఉదయం పంపించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. బ్రేక్‌లో సాంకేతిక లోపం లేదంటే లోకో పైలట్ నిర్లక్ష్యం కారణమని అనుమానం వ్యక్తమవుతోంది.#WATCH | Rishikesh, Uttarakhand | Morning visuals from the spot where three coaches of the Ujjaini Express derailed in the Khand village area near the Yog Nagari Rishikesh Railway Station yesterday night. No passengers were on board the train at the time of the accident. pic.twitter.com/TRjraIEi1G— ANI (@ANI) May 19, 2026ఈ ప్రమాదంతో రుషికేశ్ ప్రాంతంలో రైలు రాకపోకలు తాత్కాలికంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. రక్షణ పనులు పూర్తయిన తర్వాతే సాధారణ సేవలు పునరుద్ధరించబడతాయని అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడం ఒక పెద్ద ఉపశమనం. అయితే, వరుసగా ప్రమాదాలు జరగడం రైల్వే భద్రతా వ్యవస్థలో లోపాలను స్పష్టంగా చూపిస్తోంది. మే 17న తిరువనంతపురం–హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం, మే 18న బీహార్‌లో ససారం–పాట్నా ప్యాసింజర్ రైలులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగాయి. అదృష్టవశాత్తూ, ఈ రెండు ఘటనల్లోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: వాహనదారులకు మళ్లీ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఆయిల్ కంపెనీలు 90 పైసల చొప్పున పెంచేశాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు మళ్లీ పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచే అమలుకానున్నాయి. ఇటీవలె రెండింటిపైనా రూ.3 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ లెక్కన నాలుగు రోజుల వ్యవధిలో రెండుసార్లు పెరిగాయన్నమాట. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌తో.. భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు రూ.1,600 కోట్ల నష్టాన్ని భరించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది. కానీ..దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయింది. అయితే మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనడం.. హర్ముజ్ ఉద్రిక్తతలు చల్లారకపోవడంతో ఈ పెంపు ఇక్కడితో ఆగకపోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ✔️ తాజా పెంపు తర్వాత ప్రధాన నగరాల్లో కొత్త ధరలు ఇలా ఉన్నాయి:ఢిల్లీ: పెట్రోల్ ₹98.63, డీజిల్ ₹91.50ముంబై: పెట్రోల్ ₹107.40, డీజిల్ ₹93.86హైదరాబాద్: పెట్రోల్ ₹111.36, డీజిల్ ₹99.53కోల్‌కతా: పెట్రోల్ ₹109.31, డీజిల్ ₹95.85చెన్నై: పెట్రోల్ ₹104.66, డీజిల్ ₹96.22బెంగళూరు: పెట్రోల్ ₹106.82, డీజిల్ ₹94.82పాట్నా: పెట్రోల్ ₹109.40, డీజిల్ ₹95.61జైపూర్: పెట్రోల్ ₹108.89, డీజిల్ ₹94.32తిరువనంతపురం: పెట్రోల్ ₹111.24, డీజిల్ ₹100.09చండీగఢ్: పెట్రోల్ ₹98.16, డీజిల్ ₹86.28
నీట్ పేపర్ లీకేజీ కేసు.. లాతూర్‌లో కోచింగ్ సెంటర్ యజమాని అరెస్ట్
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ అధికారులు మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన కోచింగ్ సెంటర్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. రేణుకాయీ కెమిస్ట్రీ క్లాసెస్(ఆర్సీసీ) పేరుతో కోచింగ్ సెంటర్ నెలకొల్పిన శివరాజ్ రఘునాథ్ మోటెగావొంకర్ ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇతడి ఫోన్లో ఈ నెల 3వ తేదీన లీకైన నీట్ ప్రశ్నపత్రం లభించింది. అంతకుముందు లాతూర్‌లోని శివనగర్‌లో ఉన్న కోచింగ్ సెంటర్‌తోపాటు అతడి నివాసంలోనూ సోదాలు జరిపారు. శివరాజ్‌ను అతడి నివాసంలోనే దాదాపు 8 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. పేపర్ లీకేజీ ముఠాలో శివరాజ్ కీలకంగా ఉన్నాడని, ఇతడి కోచింగ్ సెంటర్‌కు 9 బ్రాంచీలుండగా, లాతూర్‌లోనిది ప్రధాన కేంద్రమని అధికారులు వెల్లడించారు. లీకేజీ కుట్రలో భాగంగా పరీక్షకు దాదాపు 10 రోజులు ముందుగానే, ఏప్రిల్ 23వ తేదీనే ప్రశ్నపత్రం, జవాబులు ఇతడికి అందాయన్నారు. వీటిని ఇతడు చేత్తో రాసిన నోట్స్ రూపంలో ఇతరులకు అందజేశాడని, పరీక్ష అనంతరం వీటిని తగులబెట్టారన్నారు. నీట్ నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)తో సంబంధాలున్న కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకరి్ణకి శివరాజ్ సన్నిహితుడని వివరించారు. ఇతడి ఇల్లు, కోచింగ్ సెంటర్లలో జరిపిన సోదాల్లో 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షలోని ప్రశ్నలున్న కెమిస్ట్రీ క్వశ్చన్ బ్యాంక్ లభించిందని చెప్పారు. ‘గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లోని ఐదు చోట్ల సోదాలు చేపట్టి, కీలక పత్రాలతోపాటు ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నాం. వీటిని విశ్లేషించే పని చురుగ్గా సాగుతోంది’అని సీబీఐ ప్రతినిధి తెలిపారు. ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, పుణే, లాతూర్, అహల్యానగర్‌లలో 10 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఇలా ఉండగా, సోమవారం శివరాజ్ రఘునాథ్ మొటెగావొంకర్ను సీబీఐ అధికారులు ఢిల్లీలోని కోర్టులో హాజరుపర్చారు. ఇతర ఆధారాలతోపాటు నీట్ పేపర్లోని ప్రశ్నలను తన కోచింగ్ సెంటర్లో విద్యార్థులకు వెల్లడిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను కూడా చూపారు. దీంతో, ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి అజయ్ గుప్తా అతడిని 9 రోజుల సీబీఐ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.
వారికి బెయిల్ నిరాకరణ సరికాదు
న్యూఢిల్లీ: 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసు నిందితులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరిస్తూ జనవరిలో తానిచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తానే అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘బెయిల్ నియమం, జైలు మినహాయింపు’నియమం కేవలం వట్టి నినాదం కాదని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం పేర్కొంది. నార్కో–టెర్రర్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జమ్మూకశ్మీర్‌లోని హంద్వారాకు చెందిన సయ్యద్ ఇఫ్తికార్ అంద్రాబీకి బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం పైవిధంగా వ్యాఖ్యానించింది. 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసు నిందితులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు జనవరి 5వ తేదీన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియాల సుప్రీం ధర్మాసనం బెయిల్ నిరాకరించింది. సాక్షుల విచారణ జరుగుతున్నందున ఏడాది తర్వాత మరోసారి బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవాలని వారికి స్పష్టం చేసింది. అయితే, ఈ ఆదేశాలు 2021 నాటి కేఏ నజీబ్ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా లేవని సోమవారం జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. అప్పటి తీర్పులో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)కింద నమోదైన కేసుల్లో విచారణలో జాప్యాన్ని బెయిలివ్వడానికి ఒక ప్రాతిపదికగా పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ తీర్పునకు దేశంలోని అన్ని న్యాయస్థానాలు తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. జాతీయ భద్రత, ఉగ్రవాద నేరాలకు సంబంధించిన, ఉపా చట్టాన్ని ఉద్దేశించిన కేసుల్లో ‘బెయిల్ నియమం..జైలు మినహాయింపు’అనే సూత్రాన్ని వర్తింపజేయాలని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు.
ఎన్ఆర్ఐ
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)
ఈ అనుభవంతో భారత్‌ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్‌లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్‌లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్‌లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్‌నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్‌లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_)
అమెరికాలో ఇద్దరు తెలుగు వాళ్లకు ఐదేళ్ల జైలు శిక్ష!
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీసాల జారీ విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అయినప్పటికీ హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతుండడం కలకలం రేపుతోంది.తాజాగా హెచ్-1బీ వీసాల పేరిట జరిగిన ఫ్రాడ్ కేసులో అమెరికాలోని ఇద్దరు తెలుగు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగరానికి చెందిన సంపత్ రాజీదీ, శ్రీధర్ మాడ ఈ ఫ్రాడ్ కేసులో భాగం అయినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు తేలడంతో అమెరికా చట్టం ప్రకారం.. వీరికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు దాదాపు 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్లు) భారీ జరిమానా విధించే అవకాశముందని తెలుస్తోంది. సంపత్ రాజీదీ అమెరికాలో రెండు వీసా ప్రాసెసింగ్ కంపెనీలను నడుపుతున్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి విదేశీయులకు హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేశారు. అలాగే శ్రీధర్ మాడ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ విభాగంలో చీఫ్ ఇన్ఫర్మేషనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అభ్యర్థులు యూనివర్సిటీ ప్రాజెక్టుల్లో పని చేస్తారని ఫేక్ పత్రాలు అందించారు. సాధారణంగా హెచ్-1బీ వీసా పొందాలంటే అమెరికాలోని ఏదైనా ఒక సంస్థలో సదరు నిపుణుడికి ఉద్యోగం కచ్చితంగా ఉండాలి. దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీధర్ మాడ.. తనకున్న అధికారంతో యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించారు. ఈ విషయాలు విచారణలో తేలినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఇక జూన్ 2020 నుంచి జనవరి 2023 మధ్య ఈ ఫేక్ దందాను కొనసాగించినట్లు విచారణలో తేలింది.చదవండి: మలి విడత చర్చలు.. పాక్‌కు వెళ్లని జేడీ వాన్స్!
అరవింద కృష్ణ స్వామికి అట్లాంటా శంకర నేత్రాలయ సత్కారం
అట్లాంటా: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం Crowne Plaza Atlanta NE నార్క్రాస్లో అత్యంత ఉత్సాహభరితమైన, భారీ సంఖ్యలో ప్రజలు హాజరైన ఒక "Meet ’n Greet" (పరిచయ సమావేశం) కార్యక్రమాన్ని నిర్వహించింది. జార్జియా, పొరుగు రాష్ట్రాల నుండి 250 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం, ఆ సంస్థ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా, Medlytix LLC CEO అయిన అరవింద్ కృష్ణ స్వామిని తమ సలహా మండలి (Board of Advisors)లో సరికొత్త సభ్యుడిగా సంస్థ అధికారికంగా ఆహ్వానించింది.అట్లాంటాలోని ప్రముఖ సంగీత, నృత్య అకాడమీల సాంస్కృతిక ప్రదర్శనలు పురోహిత నరసింహాచార్యులు దివ్య సన్నిధిలో, ఈ సమావేశం అర్థవంతంగా, విజయవంతంగా జరగాలని ఆశీస్సులు కోరుతూ, అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి గారితో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా. జగదీష్ శెత్, మెగా దాతలు మరియు బ్రాండ్ అంబాసిడర్లు శ్రీ శంకర్ సుబ్రమణియన్, శ్రీ అరవింద్ కృష్ణస్వామి, శ్రీమతి జయ కృష్ణస్వామి, మరియు డా. కిషోర్ చివుకుల, సలహాదారుల మండలి సభ్యులు, కోశాధికారి మూర్తి రేకపల్లి; జె.సి. శేఖర్ రెడ్డి; పాలక మండలి సభ్యులు డా. రెడ్డి ఊరిమిండి మరియు మెహర్ లంక; సాంస్కృతిక సమన్వయకర్త నీలిమ గడ్డమనుగు; చాప్టర్ ఉపాధ్యక్షుడు వెంకీ నీలం; మరియు అట్లాంటా ఎస్ఎన్ బృందంలోని ఇతర అంకితభావం గల సభ్యులు పాల్గొన్న సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలన, అనగా లాంఛనప్రాయంగా జ్యోతి ప్రజ్వలనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.అట్లాంటాలోని నాలుగు ప్రముఖ శాస్త్రీయ నృత్య, సంగీత అకాడమీలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమంతో ఈవెంట్ ప్రారంభమైంది. సుస్వర సంగీత విద్యాలయంకు చెందిన శాంతి మెడిచెర్ల, భరత దర్శన్ స్కూల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్కు చెందిన సౌజన్య మధుసూదన్, కళాక్ష్య అకాడమీకి చెందిన మిటల్ పటేల్, మరియు నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీకి చెందిన నీలిమ గడ్డమనుగు దీనికి నాయకత్వం వహించారు. ఈ సాంస్కృతిక విభాగంలో భారత్‌కు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు రాము (చెన్నై) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ప్రతిభావంతులైన స్థానిక గాయకులు శిల్పా ఉప్పులూరి (ఈమె కార్యక్రమ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు), ఫణి డొక్కా, రామ్ దుర్వాసుల, ఉషా మోచర్ల, శాంతి మెడిచర్ల, మరియు అట్లాంటాకు చెందిన రాగ వాహినిలతో కలిసి, ఎంతో ఇష్టపడే క్లాసిక్ చిత్రాల నుండి హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో బహుభాషా మేళవింపును ప్రదర్శించి రాము ఆ సాయంత్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. బహుభాషా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ప్రదర్శనకు, అధ్యక్షులు బాల ఇందుర్తి ఆయనను ఆప్యాయంగా “ఎస్పీబీ మానసపుత్ర” అని సంబోధించారు.మొబైల్ కంటి శస్త్రచికిత్స విభాగానికి భారీ విరాళంఅరవింద్ కృష్ణస్వామికి సంబంధించిన ఆడియో-విజువల్ (AV) ప్రజెంటేషన్ ప్రదర్శించినప్పుడు, ఆయన చేసిన అద్భుతమైన $555,000 విరాళాన్ని గుర్తించి, ప్రేక్షకులు కరతాళధ్వనులతో హోరెత్తిస్తూ, లేచి నిలబడి ఘన సన్మానం (standing ovation) చేశారు. 12 MESU (Mobile Eye Surgical Unit) 'Adopt-A-Village' కంటి వైద్య శిబిరాలకు మద్దతుగా అరవింద్ $155,000 విరాళం అందించారని అధ్యక్షుడు బాల ఇందుర్తి తెలియజేశారు. అంతేకాకుండా, భారతదేశంలో వైద్య సేవలు సరిగా అందని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకచోట కొత్త MESU కేంద్రాన్ని స్థాపించడానికి అరవింద్ ఉదారంగా ప్రకటించిన $400,000 విరాళం వినియోగించబడుతుంది.మహారాష్ట్ర మరియు గుజరాత్‌లలో అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు అధ్యక్షుడు బాల, ప్రస్తుతం 'శంకర నేత్రాలయ ఇండియా' అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావుతో కలిసి సన్నిహితంగా పనిచేస్తున్నారు. డల్లాస్‌కు చెందిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు మరియు SMUలో అరవింద్ కృష్ణస్వామికి పూర్వ సహవిద్యార్థి అయిన డాక్టర్ రెడ్డి ఊరిమిండి, అరవింద్‌ను 'శంకర నేత్రాలయ USA'కు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పరోపకార నాయకత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ, ప్రసాద్ రెడ్డి కాటమ్రెడ్డితో పాటు అరవింద్ కూడా అర్ధ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించడం చూడటం గర్వకారణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర నేత్రాలయ అట్లాంటా బృంద సభ్యులలో డా. కిషోర్ రెడ్డి రాసమల్లు; రమేష్ చాపరాల, గిరి కోటగిరి; ప్యాడీ రావు, సుబ్బారావు; శ్రీనివాస్ దుర్గం; చరిత్ర జూలపల్లి; మరియు చాప్టర్ లీడ్లు కార్తికేయన్ వినాయగం మరియు లోగియ అవిలినేలి ఉన్నారు. శంకర నేత్రాలయతో తన ప్రయాణం 2016లో అప్పటి ఉపాధ్యక్షుడు డాక్టర్ శేషు శర్మ చొరవతో ప్రారంభమైందని అధ్యక్షుడు బాల తెలిపారు. ఆ సమయంలో, సంస్థకు కేవలం ఏడు శాఖలు మాత్రమే ఉండేవి; నేడు, ఇది దేశవ్యాప్తంగా ముప్పై శాఖలకు విస్తరించింది. ఈ అద్భుతమైన విస్తరణకు అంకితభావం గల బలమైన వాలంటీర్ల బృందం, వ్యవస్థాపకులు, పద్మభూషణ్ దివంగత డాక్టర్ ఎస్. ఎస్. బద్రీనాథ్ మరియు SNUSA వ్యవస్థాపకులు శ్రీ ఎస్. వి. ఆచార్యల ఆశీస్సులే కారణమని ఆయన పేర్కొన్నారు.
క్రైమ్
మాజీ మిస్ పూణే అనుమానాస్పద మృతి : దిగ్భ్రాంతి పర్చే లాస్ట్ మెసేజెస్
భోపాల్‌లో గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ మిస్ పూణే , కంటెంట్ క్రియేటర్ 33 ఏళ్ల ట్విషా శర్మ మరణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు నెలల గర్భిణి అయిన ట్విషా (31) భోపాల్‌లోని అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోవడానికి ముందు తన స్నేహితులకు పంపిన చివరి సందేశాలు వాట్సాప్ చాట్ కలకలం రేపుతోంది. తొందరపడి పెళ్లి చేసుకోవద్దు అంటూ ఆమె తన స్నేహితులకు పంపిన సందేశాలు ఆమె తీవ్రమైన మానసిక ఆందోళన, ఒంటరితనం, పెళ్లి తర్వాత వేదనలో ఉన్నట్లు ఆ మెసేజ్‌ల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఆమె ఉరి వేసుకోవడానికి ఉపయోగించినట్టు చెబుతున్న బెల్టును పోస్ట్‌మార్టంకు ఎయిమ్స్ భోపాల్‌కు పంపకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ కేసును పక్క దారి పట్టిస్తున్నారంటూ భోపాల్ పోలీసులపై ఆరోపణలు కుదిపేస్తున్నాయి. దర్యాప్తు సమగ్రతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అసలు ఏం జరిగింది?నోయిడాకు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన ట్విషా శర్మ, ఢిల్లీలో ఉద్యోగం చేసేది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన లాయర్ సమర్థ్ సింగ్‌ను డిసెంబర్ 2025లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన అయిదు నెలలకే, మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన భర్త ఇంట్లో ట్విషా శవం వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఆమె మరణం ఉరి వేసుకోవడం వల్లే జరిగిందని తేలినప్పటికీ, ఆమె శరీరంపై పలు చోట్ల గాయాల గుర్తులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్‌మీడియా చాట్స్ కీలకంగా మారాయి.మే 7న ఒక స్నేహితురాలితో వాట్సాప్ చాట్‌లో.. "నేను ఇంట్లోనే ఖాళీగా కూర్చోవడం వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నాను. నా జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నాను. పెళ్లి కుటుంబాన్ని ఇస్తుంది, కానీ ఎక్కడున్నా మన కోసం మనం పని చేయడం ఆపకూడదు" అని పేర్కొంది. పెళ్లి చేసుకోవాలనే తొందరలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. బాగా ఆలోచించి ముందడుగు వేయండి" అని స్నేహితురాలిని హెచ్చరించింది. అలాగే తనకు ఇల్లు, స్నేహితులు బాగా గుర్తొస్తున్నారని వాపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మరో స్నేహితుడితో మాట్లాడుతూ.. "నేను చిక్కుకుపోయాను బ్రో (I am trapped bro). నువ్వు మాత్రం ఇలాంటి వాటిలో ఇరుక్కోవద్దు. నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను, సమయం వచ్చినప్పుడు కాల్ చేస్తాను" అని తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది.న్యాయం కోసం రోడ్డెక్కిన కుటుంబంట్విషా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్ (రిటైర్డ్ జడ్జి)లపై కుటుంబ సభ్యులు హత్య, కట్నం వేధింపుల ఆరోపణలు చేశారు. భర్త, అత్తమామలు ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించారని ఆరోపించారు. నిందితులు ప్రభావవంతమైన వ్యక్తులు కావడం వల్ల వారికి ముందస్తు బెయిల్ లభించిందని, దీనివల్ల స్థానిక పోలీసుల దర్యాప్తు సక్రమంగా జరగకపోవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమార్తె మరణంపై న్యాయం చేయాలని, ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS Delhi)లో మళ్లీ పోస్ట్‌మార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ట్విషా కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నివాసం వెలుపల నిరసన చేపట్టారు. భోపాల్ వచ్చినప్పటి నుండి తాము ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడం కోసం మహిళా కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, పోలీస్ కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ట్విషా తండ్రి నవనిధి శర్మ, సోదరుడు ఆశిష్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు .స్థానిక పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరుతున్నారు.నిందితుల కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉండటంతో పాటు, వారికి సమీప బంధువైన వ్యక్తి లోకాయుక్తగా ఉండటంతో కేసును ప్రభావితం చేస్తున్నారని తండ్రి నవనిధి శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కుటుంబ సభ్యుల ప్రకారం పెళ్లయిన దగ్గర్నుంచీ ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. దీంతో తిరిగి వచ్చేయాలని ఆమె భావించింది. ఇంతలోనే ఆమె అనుమానాస్పద స్థితిలో కన్నుమూయడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త సమర్థ్ సింగ్ పరారీలో ఉన్నాడని, అతని తల్లి, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్‌కు ముందస్తు బెయిల్ లభించిందని చెప్పారు. బెయిల్‌ను సవాలు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: విజయ్ సర్కార్ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్ నేత జోస్యం
ప్రేమోన్మాది మణితేజ మృతి
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన వైష్ణవిని కత్తితో అతి కిరాతకంగా హత్య చేసిన ప్రేమోన్మాది మణితేజ (29) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శనివారం వైష్ణవి తాను పనిచేస్తున్న పాఠశాలలో విధులు ముగించుకుని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా నిందితుడు కత్తితో దారుణంగా మెడ, గొంతుపై విచక్షణా రహితంగా పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. రక్తం మరకలతో పారిపోతున్న మణితేజను స్థానికులు పట్టుకుని కాళ్లు చేతులు కట్టి వేసి దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో అతని తలపై రాళ్లు ఎత్తివేయడంతో తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన మణితేజను మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. హైదరాబాద్‌లో పరిచయం.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన మణితేజ ల్యాండ్రీ షాప్ నిర్వహించేవాడు. గతంలో వైష్ణవి ఓ హాస్టల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో విద్యార్థుల దుస్తులు ఉతికి, ఇస్త్రీచేసి అప్పగించే సందర్భంగా ఆమెతో పరిచయం ఏర్పడింది. తర్వాత వైష్ణవి అక్కడ ఉద్యోగం మానేసినా ఫోన్లో ఇద్దరూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే తాను ప్రేమిస్తున్నట్లు వైష్ణవిని వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. అయితే ఇటీవల వైష్ణవికి వెళ్లి కుదిరిందన్న సమాచారం తెలియడంతో మణితేజ తన ప్రేమను కాదన్న వైష్ణవిని హతమార్చాలని నిర్ణయించుకుని.. జడ్చర్లకు వచ్చి ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.కాగా, మణితేజ తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి, తమ్ముడు ఉన్నారు. హత్య అనంతరం వైష్ణవి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు యువకుడి ఆచూకీని గుర్తించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మణితేజ మృతి చెందాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ నుంచి జడ్చర్లకు వచ్చారు. ఈ క్రమంలో వైష్ణవి కుటుంబ సభ్యులు, బంధువులు వారిపై దాడిచేస్తారన్న అనుమానంతో పోలీసులు వారిని జడ్చర్ల సమీపంలోని డీటీసీలో ఉంచి రక్షణ కల్పించారు. అప్పటి దాకా మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. జడ్చర్లలో వైష్ణవి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత జనరల్ ఆస్పత్రిలో మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.
ఆస్తి కోసం తల్లీకూతుళ్ల దారుణ హత్య
హాలియా: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సాయిలు, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు యాదయ్యకు సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామానికి చెందిన సుమలతతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. యాదయ్య, సుమలత (40) దంపతులకు కుమార్తె రుద్రాక్షి లావణ్య (19) సంతానం. కుమార్తె పుట్టిన ఆరు నెలలకే తండ్రి యాదయ్య మృతి చెందాడు.దీంతో సుమలత తన కుమార్తె లావణ్యతో కలిసి వేరుగా నివాసం ఉంటోంది. కాగా, రుద్రాక్షి సాయిలు, యాదయ్యకి వారసత్వంగా వచ్చిన 6 ఎకరాల వ్యవసాయ భూమిని అతని కుమార్తె లావణ్య పేరుమీద రిజిస్టర్ చేసి గార్డియన్‌గా నానమ్మ వెంకటమ్మను పె ట్టారు. కొంతకా లం తరువాత వెంకటమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. కోడలు సుమలత అత్త గురించి పట్టించుకోకపోవడంతో వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు ఆమెను ఆస్పత్రిలో చూపించగా వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలిసింది.ఈ క్రమంలో వెంకటమ్మను ఆమె కోడలు సుమలత, మనుమరాలు లావణ్య పట్టించుకోవడం లేదని వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు కోర్టులో పిటిషన్ వేశారు. గత ఏడాది లావణ్య మేజర్ అయినందున తాత సాయిలు లావణ్యకు చేసిన భూమి పట్టా విషయంలో తీర్పు అనుకూలంగా రావడంతో తమ తల్లి వెంకటమ్మకు ఆస్పత్రిలో వైద్యం కోసం ఖర్చు చేసిన రూ.30 లక్షలు ఇవ్వాలని ఆడబిడ్డలు వేసిన కేసుకు సంబంధించి రూ.5 లక్షలు ఇవ్వాలని కోర్టు రుద్రాక్షి సుమలతకు సూచించింది. సాయిలు, వెంకటమ్మ బాగోగుల విషయంలో పలుమార్లు ఆడబిడ్డలకు, సుమలతకు మధ్య తగాదాలు జరిగాయి.ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆస్తి విషయంలో ఆడపడుచులు.. సుమలత మరోమారు ఘర్షణ పడ్డారు. అనంతరం ఉదయం 9 గంటల సమయంలో సుమలత, ఆమె కూతురు లావణ్య గ్రామ శివారులోని ఆయిల్‌పామ్ తోట వద్దకు పని చేయడానికి వెళ్లారు. అక్కడే గుర్తు తెలియని వ్యక్తులు తల్లీకూతుళ్లపై విరుచుకుపడి కంట్లో కారం చల్లారు. లావణ్య మెడకు చున్నీ, సుమలత మెడకు పైటకొంగు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ తల్లీకూతుళ్ల హత్య విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా జరుగుతున్న ఆస్తి తగాదాలే తల్లీకూతుళ్ల హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి తల్లి శాంతమ్మ తన కుమార్తె, తన మనుమరాలు హత్యకు ఆమె ఆడపడుచులు, వారి భర్తలే కారణమని ఆరోపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు.
భర్త వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య
కిర్లంపూడి: నవ వధువు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ జి.సతీష్ తెలిపిన వివరాల మేరకు..కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన సత్యంశెట్టి వెంకటేశులు దంపతుల మూడవ కుమార్తె వెంకటలక్ష్మి (25)కి ఏప్రిల్ 25న పిఠాపురం మండలం మర్లావకు చెందిన గాది దుర్గాకోటేశ్వరరావుతో వివాహమైంది. దుర్గాకోటేశ్వరరావు పెళ్లి జరిగిన మూడో రోజే తనకు వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ వీడియోలు, ఫొటోలు ఆమెకు చూపించాడు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి అప్పటినుంచి అన్యమనస్కంగా ఉంటోంది. ఆచారాల్లో భాగంగా మూడు సార్లు అత్తారింటికి వెళ్లి వచ్చిన ఆమె గోనేడలోని తన తల్లిదండ్రుల ఇంటివద్దే ఉంటోంది. తన భర్తకు ఉన్న అక్రమ సంబంధాల విషయాన్ని తట్టుకోలేక శనివారం రాత్రి తన గదిలోని ఫ్యానుకు చీరకట్టి ఉరి వేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు.కాగా, వెంకటలక్ష్మి తల్లిదండ్రులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఇద్దరు పిల్లలకు వివాహాలు కాగా, చిన్న కుమార్తె వెంకటలక్ష్మిని డిగ్రీ వరకు చదివించి గత నెలలోనే పెళ్లి చేశాడు. తమ బాధ్యతలు తీరాయని సంతోషపడేలోపే ఈ దారుణం జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తల్లి సత్యంశెట్టి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త దుర్గాకోటేశ్వరరావు, అత్త నూకామణిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వీడియోలు
నాపై దాడి వెనుక ఉన్నది.. ప్రవీణ్ పగడాలలా నన్ను కూడా చంపాలని...
పెద్దితో జాన్వీ శ్రీదేవి గారి రేంజికి వెళ్ళిపోతారు
లోకేష్ ఆశలపై నీళ్లు.. మోదీ నిర్ణయంతో నిరాశ
నిమ్మల రామానాయుడి సైకిల్ పై వెళ్తే కెమెరామెన్ మాత్రం కార్ లో
బాలయ్య ఇలాకాలో టీడీపీ ఫేక్ కరెన్సీ.. లక్షకు 10 లక్షల ఫేక్ కరెన్సీ
గీ తల్లి ప్రేమ చూస్తే..దుఃఖం ఆగదు
జలమండలి జనరల్ మేనేజర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
గురువుకు తగ్గ శిష్యుడు... సంజు కళ్ళు చెదిరే స్టంపింగ్
ఐదేళ్లలో లక్షకు 5లక్షల లాభం.. బంపరాఫర్ ప్రకటించిన స్టాక్!
అప్పట్లో చిరు & రవితేజ.. ఇప్పుడు నాని & విజయ్


