ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖ: రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులు రెచ్చిపోతున్నాయి. తాజాగా విశాఖలోని ఓమ్ని ఆసుపత్రిలో వైద్యం వికటించి ఓ మహిళ మృతిచెందింది. దీంతో వైద్యుల నిర్లక్షం కారణంగానే మహిళ చనిపోయిందని ఆమె తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ అదనంగా డబ్బు తేవాలని డిమాండ్ చేశారని డబ్బు తేవడం ఆలస్యమవడంతో ఆపరేషన్‌కు ఆలస్యం చేశారని తెలిపారు.
దీంతో మహిళకు సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు వదిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ అదనంగా రూ. 60 వేలు ఆసుపత్రి వర్గాలు వసూలు చేశారని పేర్కొన్నారు. ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు.


