బులియన్ బ్యాంక్ కావాలి
న్యూఢిల్లీ: పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు, అదే సమయంలో ఆభరణాల తయారీకి అవసరమైన పసిడిని దేశీయంగానే సమకూర్చుకునేందుకు జ్యుయలరీ పరిశ్రమ ఓ ఆసక్తికరమైన ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టింది. బులియన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని కోరింది. తద్వారా దేశంలోపలే నిరుపయోగంగా ఉన్న పసిడిని వినియోగంలోని తీసుకురావచ్చని సూచించింది. ఆల్ ఇండియా జ్యుయలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ (ఏఐజేజీఎఫ్) ప్రతినిధులతో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిర్వహించిన సమావేశంలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ఇళ్లు, సంస్థలు, పెట్టుబడి వాహకాలు కలిగి ఉన్న బంగారాన్ని సమీకరించి జ్యుయలరీ రంగానికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తగిన కార్యాచరణను రూపొందించాలని ఆభరణాల పరిశ్రమ మంత్రిని కోరింది. బులియన్ బ్యాంక్ ప్రతిపాదనపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటును పరిశీలిస్తామని ఈ సందర్భంగా మంత్రి నుంచి హామీ లభించింది. ఈ కమిటీని కనుక ఏర్పాటు చేస్తే అందులో ప్రభుత్వం, ఆభరణాల రంగం, బులియన్ మార్కెట్, ఆర్థిక సంస్థలు, నియంత్రణ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని ఆ వర్గాలు తెలిపాయి.బ్యాంక్ మాదిరే.. ప్రతిపాదిత బులియన్ బ్యాంక్ అన్నది కేంద్రీకృత సంస్థగా పనిచేయనుంది. ఈ బ్యాంక్ దేశీయంగా ఉన్న పసిడిని సమీకరించి, అరువు కింద పరిశ్రమకు ఇస్తుంది. ఇళ్లలోని, సంస్థల నిర్వహణలోని (గోల్డ్ ఈటీఎఫ్‌లు) బంగారాన్ని సమీకరించి.. ఆభరణాల సంస్థలు, ఎగుమతిదారులు, రిఫైనరీలు, తయారీదారులకు సరఫరా చేయనుంది. ఇళ్లు, సంస్థల వద్ద 25,000–35,000 టన్నుల పసిడి ఉంటుందని అంచనా. గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) సైతం పెద్ద మొత్తంలో భౌతిక బంగారాన్ని (పెట్టుబడులకు బ్యాకెండ్‌గా) ఖజానాల్లో కలిగి ఉన్నాయని ఏఐజేజీఎఫ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈటీఎఫ్‌ల్లోకి వచ్చే ప్రతి రూపాయి తాజా పెట్టుబడికి అనుగుణంగా పసిడి దిగుమతులకు అదనపు డిమాండ్ ఏర్పడుతుందని పేర్కొంది. కనుక బులియన్ బ్యాంక్ ద్వారా ఈటీఎఫ్‌లు తమ నిర్వహణలోని భౌతిక బంగారంలో 20–30 శాతాన్ని బాడుగ కింద ఇచ్చేందుకు అనుమతించాలని సూచించింది. దీనివల్ల ఆభరణాల వినియోగానికి సంబంధించి పసిడి దిగుమతుల డిమాండ్‌ను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నది పరిశ్రమ సూచన. రూపాయి విలువను, ఫారెక్స్‌నిల్వలను కాపాడుకునేందుకు పసిడి, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం ఇటీవలే 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం తెలిసిందే. అలాగే, ఆభరణాల ఎగుమతిదారులకు అడ్వాన్స్డ్ అథరైజేషన్ స్కీమ్ కింద పసిడి దిగుమతులను కఠినతరం చేయడంతో పరిశ్రమ ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఎన్ఎస్ఈలో ఈజీఆర్‌ల ట్రేడింగ్ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్‌లు)లో లైవ్ ట్రేడింగ్ ప్రారంభించినట్టు ఎన్ఎస్ఈ ప్రకటించింది. నియంత్రిత స్పాట్ గోల్డ్ మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు ఇది సాయపడుతుందని పేర్కొంది. అహ్మదాబాద్, ముంబైలో సేకరణ, ఖజానా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు.. ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరులోనూ కొత్త కేంద్రాలను సోమవారం నుంచి యాక్టివేట్ చేసినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 120 కేంద్రాలకు నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్టు తెలిపింది. సెబీ నమోదిత ఖజానాల్లో భౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి, ఆ రిసీట్స్‌పై స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో ట్రేడింగ్‌కు వీలుగా అందుబాటులోకి వచ్చిందే ఈజీఆర్.
మనసేం చెబితే అదే 'మీ నిచ్చెన'
స్నాతకోపన్యాసం ఇవ్వాలని కొన్నేళ్లుగా, చాలాసార్లు అడుగుతూ వస్తున్నా నేనెప్పుడూ మృదువుగా తిరస్కరిస్తూనే వచ్చాను. అందుకు కారణం, ప్రసంగించేందుకు నేను సిద్ధంగా లేనని నాకు అనిపించటం. జీవిత పరమార్థాన్ని కుదించి చెప్పడం అంత తేలిక కాదు. జీవితాన్ని పూర్తిగా ఎలా ఆనందించాలో తెలియజేయటం చాలా కష్టం. అదీ కాక, ఏం చెప్పాలా అని ఒత్తిడికి లోనవుతాం. మిగిలిన వాళ్ల స్నాతకోపన్యాసాలు వినడం నాకెంతో ఇష్టం. కానీ వారి అడుగు జాడల్లో నడవడం చాలా కష్టం. ఇంకెందుకు వాటిని వినడం లేదా చదవడం అంటారేమో. ఎందుకంటే, నేనెప్పుడూ మార్గదర్శనం కోరుకునే వ్యక్తిని. నా చిన్నతనం చర్చిలో గడిచింది. ‘‘దేవుడే దారి చూపుతాడు. దారి చూపాల్సిందిగా మనం ఆయన్ని కోరాలంతే. భగవంతుడు చెప్పినట్లుగా నడుచుకునే సాహసాన్ని కూడా మనం ప్రదర్శించగలగాలి’’ అని నాకు చెబుతూ వచ్చారు. నేనెప్పటికీ ఆ మాటల్ని విశ్వసిస్తాను.ఒక ప్రణాళికగా జీవితం నడవదుఇన్నాళ్లూ ఉపన్యసించేందుకు ససేమిరా అన్నవాడిని, ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నానో కూడా నాకు తెలియదు. నిజానికి, నా ప్రసంగ పాఠానికి ఏదైనా శీర్షిక పెట్టాలంటే, ‘‘నాకు తెలియదు’’ అనే పెట్టాలి. నాకు అన్నీ తెలుసు అనే స్థితికి ఎన్నడూ చేరుకోలేనని నాకు 57 ఏళ్లు వచ్చాక గ్రహించాను. జీవితం మనం ప్రణాళిక వేసుకున్నట్లుగా సాగదని చెప్పడానికే నేను ఇక్కడకు వచ్చాను. కనీసం, నా జీవితం అలా సాగలేదని చెప్పగలను. జీవితంలో చాలా భాగం నాకు ఏమీ తెలియకుండానే గడిచిపోయింది. ఈ తెలియకపోవడం అన్నది 22 లేదా 27 ఏళ్ల వయసప్పుడే కాదు. ఆరు నెలల క్రితం కూడా ఏమీ తెలియదు. ఆ మాటకొస్తే నిన్న కూడా ఏమీ తెలియదు. ఆరేళ్ల వయసప్పుడే ఒక పాత్రలో నటించాను. ఆ తర్వాత నాటకాలు వేశాను. పాడాను. కచ్చేరీలు చేశాను. కానీ, అవే నా వృత్తిగా పరిణమిస్తాయని నేను ఎన్నడూ అనుకోలేదు. సహచరుడు ఒకరు మోడలింగ్ చేస్తూ, బాగా డబ్బు గడించడం చూసి 19 ఏళ్ల వయసులో నేను మోడలింగ్‌కి ప్రయత్నం చేశాను. కానీ, నాది ఫొటోజెనిక్ ఫేస్ కాదని, కెమెరా నాకు అచ్చిరాదని, వేరే వ్యాపకం ఏదైనా చూసుకోవడం మంచిదని, ఆ ఏజన్సీ అధిపతి నాకు నిష్కర్షగా చెప్పేశాడు. ఆ మాటలు నాలో పాతుకుపోయి, నేను సినీ జీవితంలోప్రవేశించిన తర్వాత కూడా, చాలా రోజులు నా చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. కనుక, చెవికెక్కించుకునే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి.కోరుకున్న చోటుకే చేరుకుంటాంజర్నలిజం ప్రధానాంశంగా నేను కమ్యూనికేషన్స్‌లో లిబరల్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేసే దశలో ఉన్నప్పుడు మనం ఒక నాటకం వేయా లని టీచరు చెప్పారు. చిట్టీలలో పేర్లు రాసి, డ్రా తీశారు. నా పేరు రావడంతో, నన్నో పాత్రకు ఎంపిక చేశారు. ఇష్టం లేకపోయినా, డిగ్రీ చివరి ఏడాదిలో 90 శాతం సమయాన్ని నాటకానికే వెచ్చించాల్సి వచ్చింది. నాటకం వేసేందుకు స్థానికంగా ఉన్న మరో యూనివర్సిటీకి మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ యాక్టింగ్ స్టూడెంట్లు కొంతమంది ఉన్నారు. వారికి, మాకూ ఒకేచోట బస. ఎందుకో తెలియదుకానీ, ‘‘నేను ఎవరి సాహచర్యాన్ని కోరుకుంటున్నానో వారి వద్దకే చేరాను’’ అనే భావన నాలో కలిగింది! సిడ్నీలోని యాక్టర్స్ సెంటర్లో ఒక ఏడాది కోర్సులో చేరాలనుకున్నా. 20 సీట్లు ఉన్నాయి. మొదటిసారి నాకు రాలేదు. సీటు వచ్చిన ఒకతను చేరకపోవడంతో, నాకు మళ్లీ పిలుపు వచ్చింది. దానికీ, సుమారు ఎనిమిదిమంది పోటీ పడితే, నాకు దక్కింది. కోర్సులో చేరాలని వచ్చిన జాబు చూసి సంతోషపడ్డాను కానీ, చివరలో 3,500 డాలర్ల ఫీజు చెల్లించాలనే నిబంధన చూసి హతాశుడినయ్యాను. ఇది 1984 నాటి మాట. ఆ ఫీజు నాకు అప్పట్లో, పది లక్షల డాలర్లతో సమానం. నాన్న ఇచ్చిన పైకంతో అప్పుడే డిగ్రీ పూర్తి చేశాను. మరో కోర్సు చేయడా నికి డబ్బులు ఇవ్వాలని నాన్నని అడిగే సాహసం చేయలేక పోయాను. ఆఫరు లెటర్‌ను చెత్త బుట్టలో పడేశాను. నటన నా నుదుటిన రాసిపెట్టిలేదేమో అనుకున్నా. మరుసటి రోజు, మా నాయనమ్మ వీలునామా చలువ వల్ల, నాకు 3,500 డాలర్లు వచ్చి పడ్డాయి. చెత్త బుట్టలో పడేసిన లెటర్ని జాగ్రత్తగా బయటకు తీసి, కోర్సులో చేరాను. అలా, నాలుగేళ్ల పాటు నటన నేర్చుకున్నాను.కొందరికి అది పూర్తి కాకతాళీయంగా జరిగినదిగా తోచవచ్చు. నాకు మాత్రం, అది ఒక సంకేతం, ఒక ప్రార్థనకు లభించిన జవాబు అనిపి స్తుంది. అలాగే, నాకు ‘ద బాయ్ ఫ్రమ్ ఔన్స్’ అనే సంగీత నాటకంలో నటించే అవకాశం లభించింది. అప్పటికే రెండు పెద్ద మ్యూజి కల్స్ చేసే పనిలో ఉన్నాను. నాటకాలు, సినిమాలు, టెలివిజన్ కార్య క్రమాల్లో అవకాశాల కోసం నేను ముమ్మరంగా ప్రయత్నిస్తున్న రోజులవి. వచ్చింది గొప్ప అవకాశం అని నాకు లోపలి నుంచి తోస్తున్నా, అప్పటికప్పుడే మరో మ్యూజికల్ చేయడం సరికాక పోవచ్చు అనుకుని ఆ అవకాశాన్ని వద్దను కున్నాను. తీరా, దాన్ని చూస్తున్నప్పుడు, అంతకు రెండేళ్ల క్రితం లభించిన ఆ అవకాశాన్ని చేజిక్కించు కోనందుకు ఎంతో బాధపడ్డాను. అంతఃకరణ చెప్పినట్లు నడచుకోక పోవడం తప్పు అనిపించింది. ఆ క్షణమే, లోపల ఏది మంచిదని తోస్తుందో దాన్నే చేయాలని నిర్ణయించుకున్నాను. భయం కలగటం మంచి సంకేతం!మన మెదడు ఎప్పుడూ ఒక ప్రణాళికతో నడచుకోవాలని చెబుతుంది. కానీ, మనం మన హృదయ కవాటాలను తెరచి, లోపలి నుంచి మన మది చెప్పింది వింటే, అది నిగూఢమైన ఒక మార్మిక సంకేతంగా తోచవచ్చు. కానీ, కొన్నిసార్లు ఆ సంకేతాలు నిశ్శబ్దంతో నిండి ఉంటాయి. అప్పుడు అంతరాత్మ ఏం చెబుతోందో ఎలా తెలుస్తుంది అనిపించవచ్చు. దేన్నైనా పరిపూర్ణమైనదిగా చేయాలనే ఆలోచనను మొదట పక్కన పెట్టండి. లోపల నుంచి వచ్చిన ఆలోచన భయపెడితే బహుశా అది మంచి సంకేతమే కావచ్చు. అది ఉత్తేజపరిస్తే చాలా మంచి సంకేతం కింద లెక్క. అది చెప్పిన పని చేయడం వల్ల నామమాత్రపు లాభమైనా లభిస్తుందనే భరోసా లేదని తెలిసినా, ప్రయత్నించి చూడాలనే తలంపు కలిగితే, అది అద్భుతమైన సంకేతం కింద లెక్క. నాకు జీవితంలో జరిగిన గొప్ప మేలు ఏదైనా ఉందీ అంటే, అది నేను చేసిన తప్పిదాలే లేదా నా వైఫల్యాలే, అనుకోకుండా సత్ఫలితాలను ఇచ్చిన చివరి నిమిషపు ప్రయత్నాలే. మనసు నాకు ఎప్పుడూ మంచి చెబుతూనే ఉంటుంది. ఇప్పటికీ దారి చూపుతూనే ఉంది. అది చెప్పినట్లు చేస్తేనే, నాకు నేను సరైన బాటలో ఉన్నాననిపిస్తుంది. ఈ ప్రసంగం కూడా దాని ప్రబోధం మేరకే చేస్తున్నాను. మీకు ఏది సంతోషం కలిగిస్తుందో వెదకండి. భయం, సందేహాలు, ఒంటరితనం, వైఫల్యాలు ఎదురైనపుడు మీలో వెలుగును నింపేది ఏదో తెలుసుకోండి. లోపల రగులుతున్న దానిని కనుగొనండి. ‘‘నిచ్చెన చివరి మెట్లు దాకా ఎక్కిన తర్వాత, ఎక్కాల్సిన గోడ ఇది కాదు అని తెలుసుకోవడం కన్నా అధ్వానమైన విషయం బహుశా మరొకటి ఉండదు’’ అని జోసెఫ్ క్యాంప్‌బెల్ (అమెరికన్ రచయిత) అంటాడు. మీరు ఎక్కాల్సిన గోడ ఏదో, దానికి ఎంచు కోవాల్సిన నిచ్చెన ఏదో మీ మనసే మీకు చెబుతుంది. మీరందరూ సాహసం, ఆశ్చర్యం, సంతోషం, తెగువ, గొప్పగా చెప్పుకోతగిన వైఫల్యాలు, విజయాలు, గొప్ప స్నేహ బంధాలు, ప్రేమతో నిండిన జీవితం గడపాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. మీరు కోరుకుంటు న్నట్లుగా మీరు జీవిస్తున్నారనే భావన మీలో కలగాలి. ఎందుకంటే, దాన్ని మీ దగ్గర నుంచి ఎవరూ లాక్కోలేరు.
కాపులపై దాడికి తెగబడిన టీడీపీ గూండాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు కాపు సామాజిక వర్గీయలపై బరితెగించారు. దారికాసి మరీ కాపు యువకులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఊరి శివారు నుంచి గ్రామ నడిరోడ్డు వరకూ కాపులను కొట్టుకుంటూ తీసుకొచ్చారు. బల ప్రదర్శనతో తమ బరితెగింపును, గూండాయిజాన్నీ చాటారు. దాడి వ్యవహారం కాపు సంఘ నేతల వద్దకు చేరడం, చివరకు వారంతా కేంద్ర మంత్రి వద్ద పంచాయితీ చేయడంతో ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు.అసలేం జరిగిందంటే.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో ఈ నెల 11వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో ఓ టీడీపీ కార్యకర్త బుడంపాడు అడ్డరోడ్డు నుంచి ముట్లూరులోని తన ఇంటికి బైక్‌పై వెళుతున్నాడు. అదే మార్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఒకే బైక్‌పై ఎదురుగా వస్తుండగా.. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. దీంతో వారిమధ్య ఘర్షణ జరిగింది.గొడవ పెద్దది కావడంతో టీడీపీ కార్యకర్త గ్రామంలోని టీడీపీ ఎంపీటీసీకి ఫోన్ చేయగా.. ఆయనతో పాటు మరో పది మందికిపైగా టీడీపీ గూండాలు ముట్లూరు–కోవెలమూడి మధ్య నల్లకుంట ప్రాంతానికి చేరుకుని ముగ్గురిపైనా విచక్షణా రహితంగా దాడికి దిగారు. వారిలో ఇద్దరు భయభ్రాంతులకు గురై దాడినుంచి తప్పించుకుని గ్రామంలోకి పరుగులు పెట్టారు. మరో వ్యక్తి కాపుల్లో పలుకుబడి ఉన్నవారు కావడంతో అతడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అక్కడితో ఆగకుండా నల్లకుంట నుంచి సుమారు ఐదు వందల మీటర్ల మేర అతడిని రోడ్డుపైనే కొట్టుకుంటూ గ్రామంలోకి తీసుకెళ్లారు. అంతా మా ఇష్టం కాగా.. గ్రామంలోకి వెళ్లిన ఇద్దరూ ఈ విషయాన్ని గ్రామ పెద్దలు, కాపు నేతలు, జనసేన నాయకులకు వివరించడంతో బాధిత కుటుంబ సభ్యులు, కాపు నేతలు కలిసి టీడీపీకి చెందిన నాయకులను ఇదేం దారుణమని ప్రశ్నించారు. ఇలా కొట్టుకుంటూ గ్రామంలోకి తీసుకురావడం ఏమిటని నిలదీయగా.. ‘అధికారం మాది.. పార్టీ మాది.. మా ఇష్టం.. మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం’ అంటూ టీడీపీ ఎంపీటీసీ, ఆయన వెంట ఉన్న టీడీపీ నాయకులు బదులిచ్చారు. ఈ విషయమై ఆ రోజు రాత్రి ఒంటిగంట వరకు గ్రామంలో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. బాధితులంతా జనసేన పార్టీకి మద్దతుదారులు కావడంతో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు.కేసులు నమోదు చేయకుండా..దాడుల అనంతరం కాపు వర్గానికి చెందిన వారు టీడీపీకి చెందిన వారు ఒకరిపై ఒకరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, దాడుల్లో గాయపడిన కాపు వర్గీయులపై రెండు కేసులు నమోదు చేయగా.. టీడీపీకి చెందిన వారిపై ఒక్క కేసు మాత్రమే నమోదు చేశారు. అందులోనూ కీలకమైన, దాడికి పాల్పడిన స్థానిక ప్రజాప్రతినిధిపై కేసు పెట్టలేదు. బాధిత కాపు సామాజిక వర్గీయులు ఈ విషయాన్ని కాపు సంఘ నేతల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి వద్ద పంచాయితీ పెట్టడంతో ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆదివారం రాత్రి ఆ స్థానిక ప్రజాప్రతినిధిపై కేసు నమోదు చేశారు. జనసేన పార్టీకి మద్దతుగా నిలవడం వల్లే దాడిజనసేన పార్టీకి మద్దతుగా నిలిచామన్న అక్కసుతోనే టీడీపీకి చెందిన నాయకులు తమపై దాడికి తెగబడ్డారని బాధిత కుటుంబాల వారు చెబుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నప్పటికీ.. జనసేనకు మద్దతుగా నిలిచిన కాపులపై టీడీపీ నేతలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోయారు. కాపులను చిన్నచూపు చూస్తూ.. అవకాశం దొరికినప్పుడల్లా కాపులపై దాడులకు తెగబడుతున్నారని బాధిత వర్గం ఆరోపిస్తోంది. దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు కాపు నేతలు సిద్ధమవుతున్నారు.
బాలికపై జనసేన నేత లైంగిక దాడికి యత్నం
భీమవరం(ప్రకాశం చౌక్): జనసేన పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ ఓ బాలిక (17)పై లైంగిక దాడికి ప్రయత్నించాడు. అతని ఆగడాలను భరించలేని బాలిక సోమవారం భీమవరం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఇన్చార్జ్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఇన్చార్జి కలెక్టర్ ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత బాలిక తెలిపిన వివరాల మేరకు... ‘పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలోని ఓ గ్రామ మాజీ సర్పంచ్, జనసేన నాయకుడు అయిన తిరుమాని వెంకటరాజు కొంతకాలం కిందట నా తల్లికి దగ్గరయ్యాడు. దీనిపై తరచూ మా ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. నా తండ్రిని చంపి అడ్డు తొలగించుకోవాలని చూశారు.నా తండ్రిపై దాడి చేసి ఇంటి నుంచి వెళ్లగొట్టారు. అప్పటి నుంచి వెంకటరాజు మా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో వెంకటరాజు కన్ను నాపై పడింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కోరిక తీర్చాలని అసభ్యంగా ప్రవర్తించేవాడు. ప్రతిఘటిస్తే నేను జనసేన నేతనని ఎవరూ ఏమీ చేయలేరని భయపెట్టేవాడు. ఈ నెల 7న ఇంట్లో నన్ను బంధించి వెంకటరాజు లైంగిక దాడికి ప్రయత్నించగా కేకలు వేశాను. నా తల్లి వచ్చి అతనికి సహకరించాలని చెప్పింది. వారి నుంచి తప్పించుకుని రాజులలంక వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించాను.స్నేహితులు నన్ను రక్షించి ఇంటికి తీసుకువెళ్లారు. ఇంటి తలుపులు తీయకపోవడంతో 12వ తేదీ వరకు స్నేహితుల ఇంటి వద్ద ఉన్నాను. ఆ తర్వాత మా మావయ్యకు ఈ విషయం తెలిసి వచ్చి మళ్లీ ఇంటికి తీసుకువెళ్లినా తలుపు తీయలేదు. నరసాపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. దీంతో కలెక్టరేట్‌కు వచ్చి వెంకటరాజుతోపాటు నా తల్లిపై కూడా ఫిర్యాదు చేశాను.’ అని బాధిత బాలిక విలపించింది.
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
ఇకపై ఒకటో తేదీనే జీతం.. లేదంటే కంపెనీ క్లోజ్!
కఠిన పొదుపు దిశగా కదలండి
అడిగింది 11.50 ఎల్ఎంటీ.. ఆమోదం 10 ఎల్ఎంటీ..
బులియన్ బ్యాంక్ కావాలి
ఐదేళ్లలో అభివృద్ధి చేస్తాం
పవర్ఫుల్ సావిత్రి
సెయాన్ ఆరంభం
రెస్టారెంట్లో బుల్లెట్ల వర్షం.. నలుగురిని బలితీసుకున్న 17 ఏళ్ల కుర్రాడు!
సీఎస్కేపై గెలుపు.. ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్
ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్..!
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
మాను సంపంగి... మా అబ్బాయి
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఇంత కాలానికి ఓ శుభవార్త విన్నాం.. యుద్ధం చేయలేమని..!
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ముంచుకొస్తున్న మహా ఎల్ నినో!
మాట మార్చిన ట్రంప్
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
‘సెలక్టర్లు చెప్పినా వినలేదు.. లేదంటే నాడే ద్రవిడ్ కెరీర్ ఖతం’
తొలిసారి ‘జిహాదీ డ్రగ్’ పట్టివేత
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
ఇకపై ఒకటో తేదీనే జీతం.. లేదంటే కంపెనీ క్లోజ్!
కఠిన పొదుపు దిశగా కదలండి
అడిగింది 11.50 ఎల్ఎంటీ.. ఆమోదం 10 ఎల్ఎంటీ..
బులియన్ బ్యాంక్ కావాలి
ఐదేళ్లలో అభివృద్ధి చేస్తాం
పవర్ఫుల్ సావిత్రి
సెయాన్ ఆరంభం
రెస్టారెంట్లో బుల్లెట్ల వర్షం.. నలుగురిని బలితీసుకున్న 17 ఏళ్ల కుర్రాడు!
సీఎస్కేపై గెలుపు.. ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్
ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్..!
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
మాను సంపంగి... మా అబ్బాయి
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఇంత కాలానికి ఓ శుభవార్త విన్నాం.. యుద్ధం చేయలేమని..!
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ముంచుకొస్తున్న మహా ఎల్ నినో!
మాట మార్చిన ట్రంప్
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
‘సెలక్టర్లు చెప్పినా వినలేదు.. లేదంటే నాడే ద్రవిడ్ కెరీర్ ఖతం’
తొలిసారి ‘జిహాదీ డ్రగ్’ పట్టివేత
ఫొటోలు
‘కాక్టెయిల్ 2’ మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్న,కృతి సనన్ (ఫొటోలు)
ఫ్యామిలీ ట్రిప్‌లో హీరోయిన్ శ్రీదేవి విజయ్‌కుమార్.. (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరో ఆది పినిశెట్టి దంపతులు.. (ఫొటోలు)
అనంతపురం : భారమైన వేళ.. బాధతో విక్రయం! (ఫొటోలు)
హైదరాబాద్ : మురిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
నాలుగు పదుల వయసులో మరింత బొద్దుగా ఛార్మి.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
హల్దీ పిక్స్ షేర్ చేసిన హీరోయిన్ (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 17-24)
ఫ్లవర్ గర్ల్‌లా నయనతార (ఫొటోలు)
వయసు పెరిగినా వన్నె తగ్గని మాధురి అందం (ఫొటోలు)
సినిమా
భరణం? విడాకుల్లో మూడో వ్యక్తి ప్రమేయం? నటి భర్త క్లారిటీ
బాలీవుడ్ నటి మౌనీరాయ్ కొన్నిరోజుల క్రితమే విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె తన భర్త సూరజ్ నంబియార్‌తో కలిసి అధికారికంగానే వెల్లడించింది. అయితే వీళ్లిద్దరూ విడిపోవడానికి బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీనే కారణమని తెగ రూమర్స్ వస్తున్నాయి. అలానే భరణం గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వీటన్నింటికి చెక్ పెట్టిన సూరజ్.. ఇన్‌స్టా స్టోరీలో మొత్తం క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)'మా విడాకుల విషయంలో వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నా. ఎలాంటి భరణం లేదు. మా మధ్య వివాదాలు ఏం లేవు. మూడ వ్యక్తి ప్రమేయం అసలు లేదు. మేం చర్చించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం. ఇది మాత్రమే నిజం. మిగతావన్నీ అవాస్తవాలు. రూమర్స్ గురించి స్పందించకపోవడం తప్పే అవుతుంది. అందుకే క్లారిటీ ఇస్తున్నా' అని సూరజ్ చెప్పుకొచ్చాడు.ప్రేమించుకుని 2022లో సూరజ్-మౌనీ రాయ్ పెళ్లి చేసుకున్నారు. సూరజ్ దుబాయికి చెందిన బిజినెస్‌మ్యాన్. మలయాళీ, బెంగాలీ సంప్రదాయల్లో వీళ్ల వివాహం జరిగింది. కానీ నాలుగేళ్లకే విడిపోయారు.(ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్)
స్టైల్ మార్చిన శోభిత.. చీరలో మానస
కొత్త హెయిర్ స్టైల్‌తో అక్కినేని కోడలు శోభితచీరలో కనువిందు చేస్తున్న మానస వారణాసిఒంపు సొంపులతో దివ్యభారతి అందాల విందుఫన్నీ మూమెంట్స్ షేర్ చేసిన శ్రీనిధిశెట్టిపాత హీరోయిన్ లుక్‌లో దుషారా విజయన్ View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi)
రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ రిలీజ్
మెగా హీరో రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'పెద్ది'. లెక్క ప్రకారం మార్చిలోనే రావాలి కానీ రెండుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వచ్చే నెల 4న థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంటూ మూవీపై అంచనాలని పెంచేస్తోంది.(ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక)బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే పనోడు.. క్రికెట్, కుస్తీలో ఎలాంటి ప్రతిభ చూపించాడు. జీవితంలో ఇతడికి ఎదురైన సవాళ్లు ఏంటనేది కాన్సెప్ట్. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బుచ్చిబాబు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు హిట్ అయ్యాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా ఆ జోష్ని కొనసాగించేలానే ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
మరోవారం వచ్చేసింది. ఈసారి సతీ లీలావతి, సిస్టమ్, మధువిధు, మేం కాప్‌లం లాంటి తెలుగు మూవీస్, సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరోవైపు థియేటర్లలో 'దృశ్యం 3' రిలీజ్ కానుంది. ఈ వీకెండ్‌కి అయితే ఇదే ఎంటర్టైన్మెంట్. అయితే సడన్ గా ఓ రెండు తెలుగు చిత్రాలు ఒకే ఓటీటీలోకి స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. రిలీజైన 12 రోజులకే)గతేడాది జనవరిలో థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'డ్రీమ్ క్యాచర్'. ప్రశాంత్ కృష్ణ, అనీషా దామా, ఐశ్వర్య హోళక్కల్ ప్రధాన పాత్రలు చేశారు. కలలో వచ్చిన సంఘటనలు నిజజీవితంలో ఒకవేళ జరిగితే హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఈ కలలు రావడం అనేది ప్లస్ అయిందా మైనస్ అయిందా అనేది కాన్సెప్ట్. ఇప్పుడీ చిత్రం ఏడాదిన్నర తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.ఇకపోతే సుమన్, మహేశ్ పెగ్గర్ల, సిరి తదితరులు నటించిన 'భీంసేరి' అనే తెలుగు సినిమా కూడా నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఇది కూడా రెంట్ విధానంలోనే అందుబాటులోకి వచ్చింది. ఓ క్రూరమైన లేడీ పోలీసాఫీసర్.. ఓ నిరుపేద కుటుంబాన్ని అన్యాయంగా నాశనం చేస్తుంది. కానీ ఆ కుటుంబంలో ఓ మహిళ ప్రాణాలతో బయటపడుతుంది. ఈమె సదరు లేడీ పోలీసాఫీసర్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక)
క్రీడలు
ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కన్నుమూత!
ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్, మాజీ టెస్టు కెప్టెన్ మైక్ స్మిత్ (92) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మైక్ స్మిత్ (ఎంజేకే స్మిత్) ఇంట్లోనే తుదిశ్వాస విడిచినట్లు వార్విక్షైర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్ మేటి బ్యాటర్‌గా గుర్తింపు పొందిన మైక్‌స్మిత్ 50 టెస్టులు ఆడాడు. ఇందులో 25 టెస్టులకు ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 1958లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మైక్ స్మిత్ 1972లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. 50 మ్యాచ్‌ల్లో 2,278 పరుగులు చేసిన మైక్ స్మిత్ మూడు సెంచరీలు సాధించాడు. ఇక ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 637 మ్యాచ్‌లాడి 40వేలకు పైగా పరుగులు సాధించిన మైక్ స్మిత్ 72 సెంచరీలు బాదాడు. అంతేకాదు 1991 నుంచి 2003 మధ్య వార్విక్షైర్ కౌంటీ బోర్డు చైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన పదవిలో ఉన్న సమయంలోనే వార్విక్షైర్ కౌంటీల్లో చాలా టైటిల్స్ సాధించింది. మైక్ స్మిత్ కుమారుడు నీల్ స్మిత్ అప్పటి జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. క్రికెటర్‌గానే గాక రగ్బీ ప్లేయర్‌గానూ మైక్ స్మిత్ గుర్తింపు పొందాడు. 1956లో వేల్స్‌తో జరిగిన రగ్బీ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున క్యాప్ అందుకున్నాడు. ఇక మైక్ స్మిత్ మరణంపై వార్విక్షైర్ నివాళి అర్పించింది. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా గ్లామోర్గాన్‌తో మ్యాచ్‌కు ముందు వార్విక్షైర్ మైక్ స్మిత్ మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించింది.చదవండి: బంగ్లా బ్యాటర్ చరిత్ర.. పాక్‌కు క్లీన్‌స్వీప్ గండం!
IPL 2026: సీఎస్కేపై సన్‌రైజర్స్ ఘన విజయం
ఐపీఎల్-2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఎస్ఆర్హెచ్ అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. సీఎస్కే విధించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ 19 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్(47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్ క్లాసెన్(26 బంతుల్లో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ డౌన్ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు నితీశ్ కుమార్ రెడ్డి.. ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో ఔటయ్యాడు. సన్‌రైజర్స్ విజయానికి 17 బంతుల్లో 27 పరుగులు కావాలి.ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్క్లాసెన్ రూపంలో సన్‌రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. 47 పరుగులు చేసిన క్లాసెన్.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.దూకుడుగా ఆడుతున్న కిషన్, క్లాసెన్హెన్రిచ్ క్లాసెన్(43), ఇషాన్ కిషన్(48) దూకుడుగా ఆడుతున్నారు. 14 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్: 126/2అభిషేక్ శర్మ (26) ఔట్.. రెండో వికెట్ డౌన్సీఎస్కేతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 56 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన అభిషేక్ శర్మ అకిల్ హొసెన్ బౌలింగ్‌లో స్పెన్సర్ జాన్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.7 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 53/1ఏడు ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. అబిషేక్ శర్మ (25), ఇషాన్ కిషన్ (22) పరుగులతో ఆడుతున్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ ట్రావిస్ హెడ్ (6) రూపంలో 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ముకేశ్ చౌదరీ బౌలింగ్‌లో హెడ్ కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు.ఎస్ఆర్హెచ్ టార్గెట్ 181 పరుగులుసొంతగడ్డపై జరుగుతున్న ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (44), కార్తిక్ శర్మ (32), శివమ్ దూబే (26) తలా కొన్ని పరుగులు చేయడంతో సీఎస్కే గౌరవప్రదమైన స్కోరును అందుకుంది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్ 3 వికెట్లు తీయగా, సాకిబ్ హుసేన్ 2, ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగ చెరొక వికెట్ తీశారు. టాపార్డర్ విఫలం కావడం సీఎస్కే కొంపముంచింది.16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (35), శివమ్ దూబే (16) పరుగులతో ఆడుతున్నారు.4 వికెట్లు డౌన్చెన్నై సూపర్ కింగ్స్ మరో రెండు వికెట్లు కోల్పోయింది. కార్తీక్ శర్మ 32, రుతురాజ్ గైక్వాడ్ 15 పరుగులు తీసి ఔటయ్యారు. క్రీజులో బ్రెవిస్ 11, శివం దూబె 7 పరుగులతో ఉన్నారు. స్కోరు 13 ఓవర్లకు 105-4గా ఉంది. 9 ఓవర్లలో సీఎస్కే 89/29 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే 2 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. కార్తిక్ శర్మ (32), రుతురాజ్ గైక్వాడ్ (14) క్రీజులో ఉన్నారు.ఉర్విల్ క్లీన్‌బౌల్డ్.. రెండో వికెట్ డౌన్ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో సీఎస్కే 48 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన ఉర్విల్ పటేల్‌ను సాకిబ్ హుస్సేన్ క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్ చేర్చాడు.తొలి వికెట్ కోల్పోయిన చెన్నైసంజూ శాంసన్ (27) రూపంలో చెన్నై సూపర్‌కింగ్స్ 31 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టాస్ గెలిచిన సీఎస్కే బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌లో సీఎస్కే ఒక మార్పుతో బరిలోకి దిగింది. గుర్జన్‌పీత్ సింగ్ స్థానంలో అకిల్ హొసేన్ తుది జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ ధోనీ పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో మ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ తెలిపాడు. మరోవైపు ఎస్ఆర్హెచ్ మాత్రం ఎలాంటి మార్పు లేకుండానే బరిలోకి దిగుతోంది.తుది జట్లు:సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగేచెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, స్పెన్సర్ జాన్సన్
ధోని రిటైర్మెంట్.. ఐదేళ్ల క్రితం ప్రకటన వైరల్!
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే)కు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. పంజాబ్‌తో పోటీ పడుతున్న సీఎస్కే తన చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టే అవకాశముంది. మరోవైపు సీఎస్కేకు ఐదు టైటిల్స్ అందించిన ఎంఎస్ ధోని మాత్రం ఈ సీజన్లో పిక్క కండరాల గాయంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ నేపథ్యంలో సోమవారం సీఎస్కే తమ సొంత హోంగ్రౌండ్లో ఎస్ఆర్హెచ్తో సీజన్లో చివరి మ్యాచ్ ఆడనుంది. ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలు వస్తున్న వేళ సీఎస్కే అభిమానులు అతడిని చివరిసారిగా మైదానంలో చూడాలని ఆశపడుతున్నారు. అయితే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? లేదా అన్నది పక్కనబెడితే ఐదేళ్ల క్రితం ధోని తన రిటైర్మెంట్పై చేసిన ప్రకటన తాజాగా వైరల్‌గా మారింది. 2021లో చాంపియన్‌గా నిలిచిన సీఎస్కే టైటిల్ వేడుక సందర్భంగా అప్పటి కెప్టెన్ హోదాలో ధోనీ మాట్లాడాడు. తన చివరి టీ20 మ్యాచ్‌ను చెన్నైలో ఆడాలని ఆశిస్తున్నట్లు ధోనీ తెలిపాడు. 'నేను నా క్రికెట్‌ను ఎప్పుడూ ప్రణాళికబద్దంగానే ఆడాను. నా కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను సొంతఊరు రాంచీలో ఆడడం ఎన్నటికీ మరిచిపోను. ఇక నాకు రెండో హోంగ్రౌండ్ అయిన చెన్నై స్టేడియంలో సీఎస్కే తరఫున చివరి టీ20 మ్యాచ్ ఆడుతానని ఆశిస్తున్నా. అది వచ్చే ఏడాదో లేక ఐదేళ్లలోనా అనేది కచ్చితంగా తెలియదు' అని ధోనీ ఐదేళ్ల క్రితం తన రిటైర్మెంట్ గురించి ముందే సూచించాడు. చెన్నై వేదికగా తలపడనున్న సీఎస్కే, ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో ధోని ఆడితే గనుక అతని ఐదేళ్ల ప్రకటన ఇవాళ నిజమయ్యే అవకాశముంది. సీఎస్కేతో తన సుదీర్ఘ ప్రయాణం కూడా ముగియనుంది. మరి ధోనీ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ఆడుతాడా లేదా అన్నది మరో రెండు గంటల్లో తేలిపోనుంది.ఇదే మంచి తరుణం: అశ్విన్ధోనీకి అనుచర గణంలో ఒకడిగా గుర్తింపు పొందిన భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పిక్క కండరాల గాయం నుంచి కోలుకున్న ధోనీ సీఎస్కే తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిపాడు. 'సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ధోనీ ఆడేందుకు ఇదే మంచి అవకాశమని నాకు అనిపిస్తోంది. అది ఎలా జరుగుతుందో వేచి చూడాలి. నేను విన్నంత వరకు, అతను గత రెండు మూడు మ్యాచ్‌లుగా మైదానంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. 44 ఏళ్ల ధోని సీఎస్కే జట్టుకు దూరంగా ఉండడం వెనుక ఒక ప్రణాళిక దాగుంది. ఈ సీజన్లో ధోనీ లేకుండానే సీఎస్కే తమ ప్రయాణాన్ని కొనసాగించింది. ఇప్పటికీ ప్లేఆఫ్స్ రేసులో స్థిరంగా కొనసాగుతున్న సీఎస్కే తుది జట్టులో మార్పులు చేయడం కష్టతరమే. అయితే ధోనికి ఇది చివరి మ్యాచ్ అని ప్రచారం జరుగుతుండడంతో ఎస్ఆర్హెచ్తో పోరులో ధోనీ ఫ్యాన్స్ అతడిని చివరిసారి చూసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.చదవండి: బంగ్లా బ్యాటర్ చరిత్ర.. పాక్‌కు క్లీన్‌స్వీప్ గండం!
బంగ్లా బ్యాటర్ చరిత్ర.. పాక్‌కు క్లీన్‌స్వీప్ గండం!
బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ ఆ జట్టు తరఫున టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ మార్క్ అందుకోవడం ద్వారా బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితా లో ముష్ఫికర్ రహీమ్ చోటు సంపాదించాడు. 39 ఏళ్ల ముష్ఫికర్ రహీమ్‌కు టెస్టుల్లో ఇది 14వ సెంచరీ.తద్వారా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన బంగ్లా క్రికెటర్‌గా ముష్ఫికర్ రహీమ్ నిలిచాడు. 2005లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ముష్ఫికర్ రహీమ్ బంగ్లాదేశ్ తరపు 100కు పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడి 6వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు, 14 సెంచరీలు, 29 అర్థసెంచరీలు ఉండడం విశేషం. జింబాబ్వేతో టెస్టులో 219 పరుగులు కెరీర్ బెస్ట్ స్కోరు సాధించిన ముష్ఫికర్ రహీమ్ బంగ్లాదేశ్ తరఫున డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా, అలాగే బంగ్లా తరఫున మూడు ద్విశతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలో ముష్ఫికర్ రహీమ్ తర్వాత మోమినుల్ హక్ (13 సెంచరీలు), ప్రస్తుత బీసీబీ తాత్కాలిక అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ (10 సెంచరీలు), నజ్ముల్ హొసేన్ షాంటో (9 సెంచరీలు), లిటన్ దాస్ (6 సెంచరీలు) ఉన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. పాకిస్తాన్ ముందు బంగ్లాదేశ్ 437 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. అంతకముందు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్ రహీమ్ (137) సెంచరీ చేయగా.. ఓపెనర్ మహ్మదుల్ హసన్ జాయ్ (52), లిటన్ దాస్ (69) అర్థసెంచరీలు సాధించారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ 4 వికెట్లు తీయగా, సాజిద్ ఖాన్ 3, హసన్ అలీ 2 వికెట్లు తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 278 పరుగులకు ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 232 పరుగులకే కుప్పకూలింది. తద్వారా 56 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ కలుపుకొని ప్రత్యర్థి ముంగిట భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజుల ఆట ముగిసేసరికి పాకిస్తాన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లలో పరుగులేమి చేయలేదు. చేతిలో పది వికెట్లు ఉన్నప్పటికీ రెండు రోజులు ఆట మిగిలి ఉండడంతో అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తొలి టెస్టును కోల్పో యిన పాక్ ఇప్పుడు రెండో టెస్టులోనూ ఓడిపోతే క్లీన్‌స్వీప్ అయినట్లే. Built on class and consistency 💪Mushfiqur Rahim among the finest in Tests. Celebrates in style pic.twitter.com/DN6067jYjc— Bangladesh Cricket (@BCBtigers) May 18, 2026చదవండి: IPL: లిటన్ దాస్ సంచలన ఆరోపణలు
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
నేడు తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణం... మెజార్టీ దక్కడంతో ఎట్టకేలకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్
తమిళనాట ప్రతిష్టంభనలో విజయ్ ప్రమాణ స్వీకారం... మద్దతు ప్రకటించినా అధికారికంగా లేఖ ఇవ్వని వీసీకే
బిజినెస్
వర్క్ ఫ్రమ్ హోమ్ విస్తరణపై జోహో కామెంట్స్
భారతీయ ఐటీ దిగ్గజం జోహో తమ సంస్థలో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని విస్తరించబోమని నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్వేర్ రంగంలో పరిశోధన, అభివృద్ధి బృందాల మధ్య ముఖాముఖి చర్చలు, ప్రత్యక్ష సహకారం ఉన్నప్పుడే ఆశించిన ఉత్పాదకత, వేగవంతమైన పరిష్కారాలు లభిస్తాయని అంతర్గత సమీక్షలో తేలడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ విషయాన్ని జోహో వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ వెంబు సోమవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అధికారికంగా వెల్లడించారు.ప్రత్యక్ష సహకారంతోనే మెరుగైన పరిష్కారాలుకంపెనీ అంతర్గత చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా సొంత డెవలప్మెంట్ టీమ్‌లో నేనే స్వయంగా ఈ వ్యత్యాసాన్ని గమనించాను. సమస్య పరిష్కారంలో భాగస్వాములైన వ్యక్తులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకోనప్పుడు వాటి పరిష్కారానికి చాలా ఎక్కువ సమయం పడుతోంది. అదే ముఖాముఖిగా కూర్చున్నప్పుడు ఆలోచనల మార్పిడి మరింత సులువుగా సాగుతుంది. దీనివల్ల అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన సాఫ్ట్వేర్ పరిష్కారాలు లభిస్తున్నాయి. అందుకే ఆర్ అండ్ డీ విభాగంలో ఉత్పాదకతను దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రం హోమ్‌ను విస్తరించకూడదని నిర్ణయించాం’ అని చెప్పారు.జోహో పునసమీక్షపశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు, ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో.. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని, అనవసర ప్రయాణాలను తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ సమయంలో అలవాటైన వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి పద్ధతులను మళ్లీ ప్రోత్సహించాలని ప్రధాని కోరారు.ప్రధాని పిలుపునకు స్పందించిన శ్రీధర్ వెంబు.. మే 11న ఒక పోస్ట్‌లో ‘గత కొన్ని నెలలుగా మా సంస్థలో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని పూర్తిగా అమలు చేస్తున్నప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని పిలుపును గౌరవిస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ పునసమీక్షిస్తాం’ అని పేర్కొన్నారు. అయితే, సంస్థ ప్రయోజనాలు, సాంకేతిక ఉత్పాదకతను బేరీజు వేసుకున్న తర్వాత ఈ విస్తరణ సాధ్యం కాదని జోహో తేల్చిచెప్పింది.ఇంధన పొదుపునకు ప్రత్యామ్నాయ వ్యూహాలువర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వనంత మాత్రాన పర్యావరణ స్పృహను విస్మరించబోమని వెంబు స్పష్టం చేశారు. ఇంధన వినియోగాన్ని, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి జోహో ఇతర మార్గాలను అన్వేషిస్తోందని ఆయన తెలిపారు. అందులో భాగంగా ఉద్యోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచడం, కంపెనీ క్యాంటీన్లలో డీజిల్, గ్యాస్ వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వంట సామగ్రిని ప్రవేశపెట్టడం వంటివి అమలు చేయబోతున్నట్లు చెప్పింది. ఇప్పటికే జోహో సంస్థ సోలార్ (సౌరశక్తి) రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది. క్యాంపస్‌ల్లో ఇప్పటికే ప్రాకృతిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నారు.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!
శ్రమకే అగ్రతాంబూలం!
నేటి ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో లక్షల రూపాయల ప్యాకేజీలు తీసుకునే సాఫ్ట్వేర్ ఇంజినీర్ల జీతాలే అందరికీ హాట్ టాపిక్. కానీ, రోజువారీ శ్రమను నమ్ముకున్న ఒక సాధారణ ఇంటి పనిమనిషి నెలవారీ సంపాదన వివరాలు ఇప్పుడు సాఫ్ట్వేర్ నిపుణులను, విద్యావంతులను ఆలోచనలో పడేసాయి. ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన ఇంటి పనిమనిషితో జరిపిన చిన్న సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది.బెంగళూరుకు చెందిన ఆదిత్య అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇటీవల తన ఇంటి పనిమనిషి పదేపదే ఆలస్యంగా రావడంపై ఆమెను ప్రశ్నించాడు. సాధారణంగా మొదలైన ఈ ప్రశ్న ఆమె ఇచ్చిన సమాధానంతో ఆదిత్య అవాకయ్యేలా చేసింది. ఆమె కేవలం ఒకరి ఇంట్లోనే కాకుండా ఒక పక్కా ప్రణాళికతో బహుళ ఆదాయ వనరులను సృష్టించుకుందని తెలిసి అతను షాక్‌కు గురయ్యాడు. ఆదిత్య తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న వివరాల ప్రకారం.. ఆమె తన దినచర్యలో భాగంగా..వేర్వేరు అపార్ట్మెంట్ల్లో నివసించే నలుగురు బ్యాచిలర్స్‌కు రోజువారీ భోజనం వండి పెడుతోంది. ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.6,000 చొప్పున తీసుకుంటోంది. దాంతో ఆమెకు రూ.24,000 లభిస్తోంది. దీనికి అదనంగా, మరో రెండు కుటుంబాలకు పూర్తిస్థాయి ఇంటి పనిమనిషిగా ఉంటూ నెలకు రూ.20,000 సంపాదిస్తోంది. మొత్తంగా ఆమె నెలవారీ ఆదాయం అక్షరాలా రూ.44,000. అంటే సంవత్సరానికి ఆమె సంపాదన రూ.5.28 లక్షలు. దేశంలో సగటు కార్పొరేట్ ఎంట్రీ-లెవల్ ఉద్యోగి జీతం కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం.ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఆదిత్య ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. ‘ఇక్కడ వేలాది మంది చదువుకున్న యువత ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. కానీ సరైన నైపుణ్యం ఉంటే ఆదాయానికి కొరత లేదు’ అని పేర్కొన్నాడు. ఈ వ్యవహారం ద్వారా తాను ఒక గొప్ప విషయాన్ని గ్రహించానని ఆదిత్య రాసుకొచ్చాడు. ‘ఈ రోజు ఒక విషయం స్పష్టమైంది. ఏ పనీ చిన్నది కాదు. నైపుణ్యం, స్థిరత్వం, కష్టపడే తత్వం ఎప్పుడూ సరైన ఫలితాన్ని ఇస్తాయి’ అని అతను స్పష్టం చేశాడు.కెరీర్ వృద్ధి వర్సెస్ శారీరక శ్రమఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దీనిపై నెటిజన్లు భిన్నమైన విశ్లేషణలు చేస్తున్నారు. ‘డిగ్రీలు లేకపోయినా ప్రాక్టికల్ నైపుణ్యాలతో స్థిరమైన, గౌరవప్రదమైన ఆదాయాన్ని ఆర్జించవచ్చని నిరూపితమైంది’ అని కొందరంటున్నారు. ‘దేశంలో పట్టభద్రులైన యువత ఉద్యోగాల కోసం అల్లాడుతున్న వేళ ఇదొక ప్రత్యామ్నాయం’ అని కొందరు చెబుతున్నారు. డిగ్రీలు పూర్తి చేసినా అర్థవంతమైన ఉపాధి దొరకని దేశీయ ఉద్యోగ సంక్షోభాన్ని ఈ ఉదంతం ప్రతిబింబిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.విజయానికి కొలమానం ఏది?ఈ వైరల్ కథనం మారుతున్న భారతదేశ శ్రామిక శక్తి వాస్తవ రూపానికి అద్దం పడుతోంది. విజయాన్ని కేవలం నెలవారీ జీతం అంకెలతోనే కొలవాలా? లేక భవిష్యత్తు వృద్ధి, ఉద్యోగ భద్రత, జీవన నాణ్యత ఆధారంగా అంచనా వేయాలా? అనే పెద్ద ప్రశ్నను ఇది సమాజం ముందుంచింది. ఏదేమైనా, విద్యావంతుల్లో పెరుగుతున్న నిరుద్యోగానికి, నైపుణ్య ఆధారిత పనులకు ఉన్న డిమాండ్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!
వైట్-కాలర్ ఉద్యోగాలకు ఏఐ ఎసరు
సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు కేవలం శారీరక శ్రమతో కూడిన పనులకే పరిమితమవుతుందని భావించిన ఆటోమేషన్ ఇప్పుడు ఏకంగా మేధోసంపత్తితో కూడిన వైట్-కాలర్ ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. రాబోయే 12 నుంచి 18 నెలల్లోనే కార్పొరేట్ ప్రపంచంలో అకౌంటెంట్లు, న్యాయవాదులు, మార్కెటింగ్ నిపుణుల ఉద్యోగాలు కనుమరుగయ్యే లేదా పూర్తిగా ఆటోమేట్ అయ్యే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ ఏఐ డివిజన్ హెడ్ ముస్తఫా సులేమాన్ హెచ్చరిక చేశారు.మానవ మేధస్సుకు సవాల్గతంలో ఆంత్రోపిక్ అధినేత డారియో అమోడీ వంటి టెక్ దిగ్గజాలు ఊహించిన పరిణామాలనే సులేమాన్ తాజా వ్యాఖ్యలు బలపరుస్తున్నాయి. ప్రస్తుతం మానవులు మాత్రమే చేయగలరని భావిస్తున్న అత్యంత సంక్లిష్టమైన వైట్-కాలర్ విధులను 2027 సంవత్సరానికి ముందే ఏఐ చేజిక్కించుకోనుందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల ప్రభావితమయ్యే రంగాలు..అకౌంటింగ్, ఫైనాన్స్ విభాగంలో లెక్కల విశ్లేషణ, ఆడిటింగ్ ప్రక్రియలు పూర్తిగా ఆటోమేట్ అవుతాయి.లీగల్ వర్క్ (న్యాయ విభాగం)లో కేసుల డాక్యుమెంటేషన్, లీగల్ రీసెర్చ్‌లను ఏఐ నిమిషాల్లో పూర్తి చేస్తుంది.మార్కెటింగ్, కంటెంట్‌పరంగా వినియోగదారుల ట్రెండ్స్ గుర్తించడం ఏఐ చేతుల్లోకి వెళ్తుంది.ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో వర్క్‌ఫ్లోల సమన్వయం, ప్రణాళికల అమలు మానవ ప్రమేయం లేకుండానే సాగుతుంది.ఇప్పటికే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు తమ రోజువారీ కోడింగ్ ఉత్పాదకతను పెంచుకోవడానికి ఏఐ అసిస్టెంట్లను విస్తృతంగా వాడుతున్నారని, త్వరలోనే కంప్యూటింగ్ సామర్థ్యం పెరిగి మెజారిటీ మానవ ప్రోగ్రామర్ల కంటే ఏఐ మోడల్స్ అత్యుత్తమ కోడింగ్ చేయగలవని ఆయన విశ్లేషించారు.సహాయకారి నుంచి ప్రత్యామ్నాయంగా!ప్రస్తుత తరుణంలో ఏఐ కేవలం మనుషుల పనిభారాన్ని తగ్గించే ఒక ఉత్పాదకత సాధనంలాగా మాత్రమే కనిపిస్తోంది. కానీ, ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. కేవలం సహాయం చేసే స్థాయి నుంచి మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేసే దిశగా సాంకేతికత పరిణామం చెందుతోందని సులేమాన్ ఆందోళన వ్యక్తం చేశారు.పరిష్కారం ఏంటి?మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ఇచ్చిన ఈ హెచ్చరిక కేవలం ఊహాజనితం కాదు, ఇది పరిశ్రమ వర్గాలకు ఒక మేల్కొలుపు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మన నైపుణ్యాలను నిరంతరం అప్‌గ్రేడ్ చేసుకోకపోతే వైట్-కాలర్ ఉద్యోగులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!
ఆరంభంలో నష్టాలు.. ముగింపులో లాభాలు!
భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు (మే 18) ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొని చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో కుప్పకూలిన సూచీలు ద్వితీయార్థంలో దేశీయ కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్నాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,043 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా పతనమైనప్పటికీ ముగింపు సమయానికి నష్టాలన్నింటినీ పూడ్చుకుని స్వల్ప లాభాల్లోకి చేరుకున్నాయి. చివరకు నిఫ్టీ 50 సూచీ 6 పాయింట్లు పుంజుకొని 23,649 వద్ద, సెన్సెక్స్ 77 పాయింట్లు పెరిగి 75,315 వద్ద స్థిరపడ్డాయి.ఆరంభ పతనానికి కారణాలుఅమెరికా-ఇరాన్ మధ్య సరికొత్తగా రేగిన ఉద్రిక్తతలు, గల్ఫ్ రీజియన్‌లో డ్రోన్ దాడుల వార్తలు అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించాయి. ఇది గ్లోబల్ మార్కెట్లలో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏకంగా బ్యారెల్‌కు 111 డాలర్ల మార్కును దాటింది. భారతదేశం తన చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతున్నందున క్రూడాయిల్ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ భయాలను, కరెంట్ అకౌంట్ లోటు ఆందోళనలను పెంచింది.అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలోపేతం కావడం, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ 4.60% దాటడంతో భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 96.2 మార్కుకు బలహీనపడింది. ఇది విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.గత శుక్రవారం అమెరికా మార్కెట్లు 1 శాతానికి పైగా నష్టపోగా నేడు ఆసియా మార్కెట్లయిన జపాన్ నిక్కీ, హ్యాంగ్ సెంగ్ సైతం నష్టాల్లో ట్రేడ్ అవ్వడం దేశీయ మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.ముగింపులో రికవరీకి కారణాలురూపాయి బలహీనపడటం ఐటీ, ఎగుమతి ఆధారిత రంగానికి లాభసాటిగా మారడంతో ఇన్వెస్టర్లు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి ఐటీ షేర్ల వైపు మొగ్గు చూపారు.టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ షేరు నేడు సరికొత్త రికార్డు సృష్టించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ను దాటేసి రూ.11.80 లక్షల కోట్లతో దేశంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ క్యాప్ గల కంపెనీగా నిలిచింది. ఈ స్టాక్ ర్యాలీలో కీలక పాత్ర పోషించింది.దేశీయంగా మార్చి త్రైమాసికం (2026 క్యూ4) ఆర్థిక ఫలితాల సీజన్ నడుస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాల్లో 10% వృద్ధి నమోదు చేయడం, టాటా స్టీల్ నికర లాభం రెండింతలు పెరగడం వంటి అంశాలు మార్కెట్‌కు స్థిరత్వాన్ని ఇచ్చాయి.నిఫ్టీ 23,300 స్థాయికి పడిపోయిన తరుణంలో విలువ ఆధారిత కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దిగువ స్థాయిల వద్ద దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేయడంతోపాటు ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్లో షార్ట్ కవరింగ్ జరగడం వల్ల సూచీలు రికవరీ అయ్యాయి.ప్రస్తుతానికి దేశీయ ఆర్థిక మూలాధారాలు బలంగా ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల గమనం రాబోయే రోజుల్లో మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయి. ఇన్వెస్టర్లు గ్లోబల్ పరిణామాలను గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరించడం శ్రేయస్కరం.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!
ఫ్యామిలీ
పుదీనాతో చెమటకు చెక్!
పుదీనాలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని డ్యామేజ్ కాకుండా రక్షించడమే కాకుండా, హైడ్రేట్ చేసి తాజాగా ఉండేలా చేస్తాయి. పుదీనాలోని విటమిన్ ‘ఏ’ చర్మంలోని జిడ్డును తగ్గించి, చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. పుదీనా ఆకుల పేస్ట్, గుడ్డు తెల్లసొన మిశ్రమంతో మాస్క్ వేసుకుంటే చర్మం నిగారిస్తుంది. పుదీనాలోని శాలిసిలిక్ యాసిడ్ మొటిమలను తగ్గిస్తుంది. పుదీనా రసం, పచ్చి బొప్పాయి రసాన్ని కలిపి మచ్చలు, కీటకాలు కుట్టిన చోట లేదా చర్మ ఇన్ఫెక్షన్లపై రాస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. వేసవిలో చన్నీటిలో పుదీనా ఆకులను వేసి ముఖం కడుక్కోవడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో పుదీనా ఆకులు లేదా పుదీనా నూనె వేసుకుంటే అలసట తగ్గి, అధిక చెమట సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖంపై మొటిమల వల్ల ఏర్పడే మచ్చల నివారణకు కూడా పుదీనా తోడ్పడుతుంది. సమాన పరిమాణంలో ఎండిన తులసి, వేప, పుదీనా ఆకులను పొడి చేసి పెట్టుకోవాలి. ఒక చెంచా ఈ పొడికి కొంచెం పసుపు, రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసి మచ్చలపై రాస్తే అవి క్రమంగా తగ్గుతాయి. చర్మ సంరక్షణ కోసం కానోపిఎంత ఖరీదైన ఫేస్ వాష్‌లు వాడినా, ముఖం కడుక్కోవడానికి ఉపయోగించే నీరు బాగుండకపోతే ఆ ప్రయత్నాలన్నీ వృథానే. కొళాయి నీటిలో ఉండే క్లోరిన్, ఇతర మలినాలు, హార్డ్ వాటర్ చర్మాన్ని పొడిగా మార్చడమే కాకుండా, మొటిమలు, అలర్జీలకు దారితీస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ వెల్నెస్ బ్రాండ్ కానోపీ తన సరికొత్త ఫాసెట్ ఫిల్టర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫిల్టర్ సాధారణ వాటర్ ఫిల్టర్ల లాగా కాకుండా, ప్రత్యేకంగా చర్మ సంరక్షణ కోసం రూపొందించినది. ఇది నీటిలోని క్లోరిన్, ఇతర మలినాలను తొలగించి, నీటిని సున్నితంగా మారుస్తుంది. దీనివల్ల చర్మంపై కలిగే మంట, అలర్జీలు తగ్గుతాయి. మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది. చర్మం సహజసిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది.ఈ ఫిల్టర్ కేవలం పనితీరులోనే కాకుండా, చూడటానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బాత్రూమ్ ఇంటీరియర్‌కు తగినట్లుగా ఇది లావెండర్, ఇత్తడి, మ్యాట్ బ్లాక్, బ్రష్డ్ నికెల్ వంటి అద్భుతమైన రంగులలో లభిస్తుంది. కానోపీ సంస్థ కేవలం ఫిల్టర్లకే పరిమితం కాకుండా, షవర్ హెడ్లు హ్యూమిడిఫైయర్లను కూడా సరికొత్త రీతిలో డిజైన్ చేస్తోంది. గృహోపకరణాలను బ్యూటీ టూల్స్‌గా మార్చడం ద్వారా మన ఇంట్లోనే చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.(చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?)
గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?
నేను ఐదు నెలల గర్భవతిని. డాక్టర్ చెప్పడంతో ఓజీటీటీ పరీక్ష చేయించుకున్నాను. దాంతో రక్తంలో షుగర్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇది నాకు, నా బిడ్డకు ప్రమాదకరమా? నేను ఇకపై డయాబెటిక్‌గా ఉండాల్సి వస్తుందా?– శైలజ, గుంటూరు.గర్భధారణ సమయంలో కొంతమంది మహిళల్లో రక్తంలో షుగర్ స్థాయి పెరగవచ్చు. దీనిని ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. ఇది గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల ప్రభావం వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం కారణంగా వస్తుంది. ఇది సాధారణంగా 24 నుంచి 28 వారాల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ప్రతి గర్భిణీకి ఓజీటీటీ అనే పరీక్ష చేయించుకోవాలని సూచిస్తారు. కొంతమంది మహిళల్లో ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గత గర్భధారణలో జెస్టేషనల్ డయాబెటిస్ ఉండటం, కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉండటం, 35 ఏళ్లకు పైబడిన వయస్సు, అధిక బరువు వంటి కారణాలు ఉంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నప్పుడు తల్లి, బిడ్డకు కొన్ని సమస్యలు రావచ్చు. బిడ్డ బరువు ఎక్కువగా పెరగడం, ఉమ్మనీరు ఎక్కువ కావడం, డెలివరీ సమయంలో ఇబ్బందులు, డెలివరీ తర్వాత ఎక్కువ బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టిన తర్వాత బిడ్డకు శ్వాస సమస్యలు లేదా తక్కువ షుగర్ లెవల్స్ రావచ్చు, కానీ ఇవి సాధారణంగా చికిత్సతో నియంత్రించవచ్చు. ఇది నిర్ధారణ అయిన తర్వాత మీరు డైట్ పై ఎక్కువగా దృష్టి పెట్టాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వులు, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాగే రక్తంలో షుగర్ స్థాయిలను తరచూ చెక్ చేసుకోవాలి. డైట్‌తో నియంత్రణలో లేకపోతే సురక్షితమైన మందులు లేదా ఇన్సులిన్ ఇవ్వవచ్చు. ఇవి తల్లికి, బిడ్డకు సేఫ్‌గా ఉంటాయి. చాలా సందర్భాల్లో డెలివరీ అయిన తర్వాత ఈ జెస్టేషనల్ డయాబెటిస్ తగ్గిపోతుంది. అయితే భవిష్యత్తులో టైప్–2 డయాబెటిస్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. నేను ఇప్పుడు ఎనిమిది వారాల గర్భవతిని. గతంలో ఏడు వారాలలో మిస్క్యారేజ్ అయింది. ఈ గర్భధారణలో ఇప్పటివరకు నాకు రెండుసార్లు బ్లీడింగ్ వచ్చింది. డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలని, కొన్ని మందులు వాడాలని చెప్పారు. ఈ బిడ్డను కూడా కోల్పోతానేమో అన్న భయం నన్ను చాలా బాధిస్తోంది. – రూప, కర్నూలు.గర్భధారణలో తొలి పన్నెండు వారాలను ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు. ఈ దశ చాలా కీలకం, ఎందుకంటే ఈ సమయంలో శిశువు ముఖ్యమైన అవయవ వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి. అయితే ఇదే సమయంలో మిస్క్యారేజ్ ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో ప్రతి గర్భిణీ గమనించాల్సిన రెండు ముఖ్యమైన లక్షణాలు బ్లీడింగ్, కడుపు నొప్పి. ఫస్ట్ ట్రైమెస్టర్‌లో బ్లీడింగ్‌కు అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో చాలా సందర్భాల్లో ఇది తల్లి లేదా శిశువుకు హానికరం కాకపోవచ్చు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, ఇన్ఫెక్షన్లు, సెక్స్ తర్వాత రక్తస్రావం, హార్మోన్ల మార్పులు వంటి కారణాలు ఉండవచ్చు. అయితే ముందుగా తప్పకుండా రూల్ అవుట్ చేయాల్సిన రెండు ముఖ్యమైన పరిస్థితులు మిస్క్యారేజ్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. మీరు డాక్టర్‌ను కలిసినప్పుడు పూర్తి వైద్య చరిత్ర తీసుకుంటారు, శరీర పరీక్ష చేస్తారు, అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా శిశువు పరిస్థితిని చెక్ చేస్తారు. ఈ పరీక్షలతో బ్లీడింగ్‌కు గల అసలు కారణం ఏమిటో తెలుసుకోవచ్చు. మీ ఆరోగ్యం స్థిరంగా ఉండి, స్కాన్‌లో బిడ్డ బాగానే కనిపిస్తే, బ్లీడింగ్ పరిమాణం, కారణాన్ని బట్టి చికిత్స ఇస్తారు. ఇందులో ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, మనశ్శాంతిగా ఉండడం చాలా ముఖ్యం. అవసరమైతే ప్రొజెస్టెరాన్ మందులు కూడా ఇస్తారు, ఇవి గర్భధారణకు మద్దతు ఇస్తాయి. గతంలో మిస్క్యారేజ్ జరిగినందుకు ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి గర్భధారణ వేరు. చాలాసార్లు సరైన పర్యవేక్షణతో ఆరోగ్యంగా గర్భధారణ కొనసాగుతుంది. బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు ఆసుపత్రిలో అబ్జర్వేషన్ కోసం ఉంచవచ్చు. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండటం, డాక్టర్ సూచనలు పాటించడం చాలా ముఖ్యం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే చాలా మంది మహిళలు ఆరోగ్యంగా బిడ్డలను ప్రసవిస్తున్నారు.డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: బీపీని నియంత్రణలో ఉంచే ‘3-3-3’ రూల్ అంటే..? వైద్యులు ఏమంటున్నారంటే..)
కృత్రిమ గర్భధారణకు కృత్రిమ మేధోసాయం!
కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఒకటైన ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియను మరింత సమర్థంగా జరిగేలా ఇప్పుడు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తోడ్పడుతోంది. మునుపు దాదాపు పరిశోధనల్లో లేదా మరికొన్ని అంశాల్లో సహాయకారిగా ఉండే ఏఐ ఇప్పుడు వైద్యరంగంలోని చాలా విషయాల్లో తన సహాయం అందించడం పరిపాటి అయ్యింది. ఐవీఎఫ్ ప్రక్రియకు మరింత చేయూత ఇచ్చేందుకు అవసరమైన పరిజ్ఞానం సమకూర్చుకుంటోంది. ఆ వివరాలేమిటో చూద్దాం...పిల్లలు లేనివారు ఓ బిడ్డకోసం తాపత్రయపడటం మన సమాజంలో ఉన్నదే. ఇందుకు సహాయపడే కృత్రిమ గర్భధారణ ప్రక్రియల్లో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ఒకటి.ఐవీఎఫ్ అంటే... ఐవీఎఫ్ ప్రక్రియలో మొదట మహిళ అండాశయాల నుంచి అండాలను సేకరించి వీర్యకణంతో కృత్రిమంగా ఫలదీకరణం జరిగేలా చూస్తారు. దంపతులు కలిసినప్పుడు ఏదైనా కారణాలతో మహిళలో నేచురల్‌గా ఫలదీకరణం జరగనప్పుడు డాక్టర్లు ఇలా బయటే ఫలదీకరణ జరిగేందుకు సహాయపడుతుండటంతో దీన్ని ‘అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ’ (ఏఆర్టీ) అంటారు. ఫలదీకరణ లోపలే జరగకపోవడానికి కారణాలంటే... మహిళల్లో ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకు΄ోవడం, ఎండోమెట్రియాసిస్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) లేదా ఓవరీ తాలూకు సమస్యలుండటం, నిర్దిష్టంగా ఇదీ సమస్య అని తెలియని కారణాలు ఉండటం. అదే పురుషుల విషయంలో వీర్యకణాల సంఖ్య (స్పెర్మ్ కౌంట్) తక్కువగా ఉండటం. ఈ సమస్యలున్నప్పుడు ఫలదీకరణ జరిగేందుకు బయటే ఐవీఎఫ్ జరిగేలా చూస్తారు.ఎలా చేస్తారంటే... సంక్లిష్టమైన ప్రక్రియ అయి ఐవీఎఫ్‌ను అనేక అంచెల్లో చేయాల్సి ఉంటుంది. మొదట హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి మహిళలో అండాలు పెరిగేలా చూస్తారు. మామూలుగానైతే మహిళలో నెలకు ఒక అండమే పెరుగుతుంది. ఇలా అనేక అండాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వడాన్ని ‘కంటెయిల్డ్ ఒవేరియన్ స్టిమ్యులేషన్’ అంటారు. ఇలా అండాలు పెరిగాక ఒక సూదిలాంటి పరికరంతో ‘ఫాలికిల్’ నుంచి వాటిని బయటకు తెస్తారు. అటు తర్వాత ఆ అండాలను ఓ ఇంక్యుబేటర్లోకి ప్రవేశపెడతారు. ఆపైన ఆ అండాల్లోకి శుక్రకణాలను ఇంజెక్ట్ చేస్తారు. ఇలా ఇంజెక్ట్ చేయడాన్ని ‘ఇంట్రా సైటో΄్లాసమిక్ స్పెర్మ్ ఇంజెక్షన్’ (ఐసీఎస్ఐ) అంటారు. ఫలదీకరణం అయిన అండం ఇక ‘పిండం’ (ఎంబ్రియో)గా మారుతుంది. బయట కృత్రిమంగా ఫెర్టిలైజ్ చేశాక... ఇక ఆ పిండాన్ని (ఎంబ్రియోను) గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) ద్వారా గర్భసంచిలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియను ‘ఎంబ్రియో ట్రాన్స్ఫర్’ అంటారు. తాజా పిండాన్ని మహిళ గర్భసంచిలోకి ప్రవేశపెట్టడాన్ని ‘ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంబ్రియో’ అంటారు. కొన్ని సందర్భాల్లో నిల్వ చేసిన ఎంబ్రియోలను మహిళ గర్భసంచిలోకి ప్రవేశపెడితే దాన్ని ‘ఫ్రోజెన్ ట్రాన్స్ఫర్’ అని అంటారు. ఇలా మహిళలోకి ప్రవేశపెట్టిన పిండాన్ని గర్భసంచి ఆమోదించి, తనలో నేచురల్‌గా పెరిగేందుకు అనుమతిస్తే ఇక ఆ ప్రెగ్నెన్సీ మామూలు గర్భవతిలోలాగే పెరుగుతుంది. ఐవీఎఫ్‌లో జరిగేది ఇదే.ఏఐ సహాయం ఎక్కడెక్కడ...ఇప్పుడు ఐవీఎఫ్లోని అనేక దశల్లో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) సహాయం చేస్తోంది. అదెలాగంటే... ∙హార్మోన్ ఇంజెక్షన్స్ ఏవేవి ఎంత మోతాదులో ఇవ్వాలో నిర్ణయించడం కృత్రిమంగా పెరిగిన అనేక అండాలలో నాణ్యమైన వాటి ఎంపిక పార్టనర్ వీర్యకణాల్లోనూ నాణ్యమైన వాటి ఎంపిక టైమ్–లాప్స్ ఎంబ్రియో ఇమేజింగ్ సిస్టమ్స్... అంటే ఇందులో పిండం (ఎంబ్రియో) డిస్టర్బ్ కాకుండా ఉండేలా చూస్తూ... కొన్ని అడ్వాన్స్డ్ కెమెరాల సహాయంతో... ఆ ప్రక్రియ ఎలాంటి అంతరాయాలూ లేకుండా జరుగుతోందా లేదా అనే అంశాన్ని పరిశీలించడం. ఈ డేటా సహాయంతో నాణ్యమైన ఎంబ్రియోను సూచించడం.భవిష్యత్తులో మరింత పురోగతి... ఏఐ పరిజ్ఞానాన్ని మరిన్ని అంశాల్లో మరింత లోతుగా ఉపయోగించుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యనిపుణులు భావిస్తున్నారు. వాటిలో కొన్ని... ∙గర్భధారణ ఏ మేరకు విజయవంతం కాగలదనే అంశాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం ∙ల్యాబ్‌లలో జరిగే ప్రక్రియలు మరింత తేలిగ్గా / సులువుగా జరిగేందుకు తగిన సాంకేతికతను అభివృధ్ధి చేసుకోవడం (ఎంబ్రియాలజీ ల్యాబ్ ఆటోమేషన్) మహిళ దేహంలో జరుగుతున్న హార్మోనల్ మార్పులను పరిశీలించడం (డిజిటల్ పేషెంట్ మానిటరింగ్) ∙రోబోటిక్స్ సహాయంతో ప్రక్రియలు మరింత సునిశితంగా / ఖచ్చితత్వంతో జరిగేలా చూడటం ∙తనకు డాక్టర్ ఇచ్చిన సూచనలను మహిళ ఖచ్చితంగా పాటిస్తోందా లేదా అన్నది పరిశీలించడం (రియల్ టైమ్ అప్డేట్) ∙అండాలు/పిండాల నిల్వలో (క్రయోప్రిజర్వేషన్)లో గణనీయమైన మెరుగుదల.ఏఐ సహాయంతో ఇవీ ప్రయోజనాలు...మెరుగైన గర్భధారణ ఫలితాలు: నాణ్యమైన ఎంబ్రియో ఎంపికతో గర్భధారణకు మెరుగైన అవకాశాలు ప్రమాదాలు / ముప్పులు తగ్గడం : దేహానికి కోత / గాటు పెద్దగా లేకపోవడంతో (అతి తక్కువ ఇన్వేసివ్ పద్ధతుల వల్ల) తక్కువ నొప్పి, తక్కువ ముప్పు (రిస్క్) సునిశితత్వం / ఖచ్చితత్వం: ల్యాబ్ ప్రక్రియలన్నీ సమర్థంగా జరిగేలా చూడటం ద్వారా మానవ తప్పిదాలను తగ్గించడం. చివరగా... ఐవీఎఫ్ అన్నది ఇప్పటికీ కొంత ఖరీదైన ప్రక్రియే. ఈ ప్రక్రియలో వేగాన్నీ, సునిశితత్వాన్ని, ఖచ్చితత్త్వాన్ని పెంచడం ద్వారా ఫలదీకరణ అవకాశాలు మరింత మెరుగుపరచడం, తద్వారా ఖర్చులు తగ్గించడం సాధ్యమవుతుంది. ఇలా ఏఐ సహాయంతో భవిష్యత్తులో ఐవీఎఫ్ మరింత ఫలవంతంగా రూపొందే అవకాశముంది.నిర్వహణ : యాసీన్ (చదవండి: ప్రతీక్ యాదవ్ మరణానికి కారణమైన ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అంటే?)
పేరెంట్ మార్క్ స్కాలర్షిప్స్
సంస్థలు ఇచ్చేది మార్కులకు స్కాలర్షిప్. కాని తల్లిదండ్రులు ఇవ్వాల్సింది బతుకుకు స్కాలర్షిప్. ఈ సెలవుల్లో పిల్లలకు నేర్పాల్సిన ఆరు లక్షణాలు: 1. కుతూహలం 2. ఓర్పు 3. సహానుభూతి 4. శ్రమ 5. ఓటమి ఒప్పుకోలు 6. కృతజ్ఞత... రోజుకో గంట. సెలవులు మరో 30 రోజులు. ఎలా నేర్పాలో చదవండి. చివరి రోజు ‘స్కాలర్షిప్ సర్టిఫికెట్’ ఇచ్చి వాళ్లు కోరిన సబబైన కానుక ఇవ్వండి. అదే అసలైన వేసవి ఫలితం. వేసవి సెలవులు ఇంకో 30 రోజులున్నాయి. ఆటలూ పాటలూ సరే. వాటితోపాటు కొన్ని వ్యకిత్వ గుణాల్లో కూడా తర్ఫీదు ఇవ్వాలి. మార్కుల కోసం హితవు చెప్పినట్టే ఈ లక్షణాల పెంపు కోసం కూడా హితవు చెప్పాలి. అందుకు స్కాలర్షిప్లు ప్రకటించండి. పిల్లల్లో ఆరు ఉత్తమ లక్షణాలను నాటి, పెంచి, సెలవులు అయిపోయే రోజు ‘స్కాలర్షిప్’ పేరుతో వాళ్లు అడిగిన సబబైన కానుక ఇవ్వండి. ఆ కానుక అందుకునే సమయానికి పిల్లలు ‘మనిషి’గా తయారై ఉంటారు. అదీ సంతోషం. ఇంతకీ ఆ ఆరు లక్షణాలు ఏంటి? 1. కుతూహలం: ప్రశ్నించే గుణం లేకపోతే నేర్చుకునేది ఏదీ ఉండదు. ‘ఎందుకు? ఏమిటి? ఎలా? అని అడిగే ధైర్యం నీలో ఉండాలి’ అని చెప్పాలి. ఇలా నేర్పాలి: రోజూ ‘ఈ రోజు నువ్వు అడిగే మూడు ప్రశ్నలు’ అని ఒక పేపర్ ఇవ్వండి. అందులో ప్రశ్నలు మీరే రాయండి. సూర్యుడు ఎందుకు ఎర్రగా ఉంటాడు? ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఇలా. జవాబు తెలుసుకోమనండి. ‘జవాబు నాక్కూడా తెలీదు, కలిసి వెతుకుదాం పద’ అనండి. నెట్లో కాదు. లైబ్రరీకి తీసుకెళ్లండి. ప్రశ్న లేకపోతే జీవితమే ప్రశ్నార్థకవుతుందని తెలియచేయండి.2. ఓర్పు: రీల్స్, షార్ట్స్ యుగంలో పిల్లలకు పది సెకన్ల కన్నా ఎక్కువ వేచి చూసే ఓపిక ఉండటం లేదు. ఓర్పు లేని వాడు చదువులో, ఉద్యోగంలో, జీవితంలో సమస్యలు ఎదుర్కొంటాడు. అన్నీ క్షణాల్లో జరిగిపోవాలి అనే భావన సరికాదని తెలియచేయండి.ఇలా నేర్పాలి: ఒక మొక్క నాటించండి. రోజూ నీళ్లు పోయమనండి. ‘రేపటికి రేపు పండ్లు రావు. దానికి కొంత సమయం పడుతుంది’ అని చెప్పండి. ఓపిగ్గా చేయాల్సిన పజిల్స్, చెస్‌లో ఉంచండి. వంట చేయడం నేర్పండి. ‘సేమ్యా పాయసం ఉడకడానికి 20 నిమిషాలు ఆగాలి’ అని రుచి చూపించండి. ఈలోపు అతడు ఏడ్చినా, గొడవ చేసినా వెంటనే ఫోన్ ఇవ్వకండి. ‘ఐదు నిమిషాలు ఆగితే ఇస్తా’ అనండి. ఓర్పుకు రివార్డ్ ఇవ్వండి. 3. సహానుభూతి: ‘సాటివాడికి నొప్పి అయితే నాకూ నొప్పే’ అనే భావన కలిగించాలి. క్లాస్‌లో 95 శాతం మార్కులు తెచ్చుకుని అన్ని మార్కులు రాని వారితో కలవకపోతే, వారిని సహానుభూతితో చూడకపోతే ఒంటరిగా మిగలక తప్పదని చెప్పండి. రేపు ఉద్యోగమైనా అంతే అని చెప్పండి. ప్రపంచాన్ని నడిపేది ఐక్యూ కాదని; ఈ.క్యూ (ఎమోషనల్ కోషియెంట్) అని చెప్పండి.ఇలా నేర్పాలి: పనిమనిషి, పాలవాడు, చెత్త ఎత్తే అన్నతో మాట్లాడించండి. ‘వాళ్ల పిల్లలు ఏం చదువుతున్నారు?’ అని అడగమనండి. వీధికుక్కకు, పక్షులకు నీళ్లు పెట్టమనండి. ‘దానికి దాహం అవుతుంది’ అని చెప్పండి. టీవీలో యుద్ధం వార్త వస్తే ‘అక్కడ పిల్లలు స్కూల్‌కి వెళ్లలేరు కదా’ అని చర్చ పెట్టండి.4. శ్రమ: ‘నా పని నేను చేసుకుంటా’ అనే దర్జా కలిగి ఉండటమే జీవితం అని నేర్పండి. ఫోన్లో మీటలు నొక్కుతూ ఏ.సి. రూమ్‌లో కూర్చుని ఆర్డర్ వేస్తే అన్నీ ముంగిటకొస్తాయనుకునే తరం తయారవుతోంది. ఇలాంటి వారు డేటా అయిపోయినా, కరెంట్ లేకపోయినా, స్విగ్గీబాయ్ రాకపోయినా మిడిగుడ్లేస్తారు. ఇలా నేర్పాలి: వాళ్ల పక్క వాళ్లతోనే సర్దించండి. ప్లేట్ కడిగించండి. వారానికి ఒకరోజు ‘నో స్విగ్గీ డే’. కలిసి అన్నం వండండి, చపాతీలు చేయించండి. తల్లి, తండ్రి ఎంత శ్రమ చేస్తారో ఆఫీస్, షాప్, పొలం చూపించండి. ‘ఇంట్లో ఫ్యాన్ తిరగడానికి బయట నాన్న ఎంత చెమటోడుస్తున్నాడో’ చూపించండి.5. ఒప్పుకునే గుణం ‘ఓడిపోయా. తప్పు నాదే. నెక్ట్స్ ట్రై చేస్తా’ అనిపించే తత్త్వం పిల్లల్లో ముఖ్యం. 99 మార్కులు వచ్చి ఒక మార్కుతో ఫస్ట్ ర్యాంక్ పోతే కుంగిపోయే పిల్లలున్నారు. ఆటల్లో ఓడిపోతే బ్యాట్ విరగ్గొడుతున్నారు. జీవితం ర్యాంకుల గేమ్ కాదు పడి లేచే గేమ్ అని వారికి తర్ఫీదు ఇవ్వండి.ఇలా నేర్పాలి: వాళ్లతో కలిసి క్యారమ్స్, చెస్ ఆడండి. కావాలని ఓడించండి. ‘ఓటమి కొత్త గేమ్‌కి టికెట్’ అని చెప్పండి. మీరు కూడా చేసిన తప్పులు, పొరపాట్ల వల్ల ఓడిపోయిన ఉదంతాలు చెప్పండి. ‘నాన్న కూడా ఒకసారి ఫెయిల్ అయ్యాడు’ అనండి. ‘ట్రై’ అనే మాటకు చాలా బలం ఉందని చెప్పండి. ఓడినా గెలిచినవారి కథలు వినిపించండి.6. కృతజ్ఞత: ‘ఇది నాకు ఊరికే రాలేదు’ అని గుర్తించే పిల్లలూ, గుర్తుంచుకునే పిల్లలే ముందుకు వెళతారు. అన్నీ ఉన్నా ‘ఇంకా ఏం లేదు’ అని ఏడ్చే పిల్లలు ఉంటున్నారు. ఉన్నదానితో సంతృప్తి పడటం లేదు. కృతజ్ఞత లేని వాడు ఎప్పటికీ సంతోషంగా ఉండడని చెప్పాలి.ఇలా నేర్పాలి: రాత్రి పడుకునే ముందు ‘ఈ రోజు నీకు నచ్చిన మూడు మంచి విషయాలు’ చెప్పమనండి. అన్నం తిన్నాను, సినిమాకు వెళ్లాను, ఫ్రెండ్ బ్యాట్‌తో ఆడుకున్నాను – ఇలా ఏదైనా. అన్నం వండిన అమ్మకు, సినిమా కు డబ్బు ఇచ్చిన నాన్నకు, బ్యాట్ ఇచ్చిన ఫ్రెండ్‌కు మనసులో థ్యాంక్స్ చెప్పుకోమనండి. ‘థ్యాంక్యూ కార్డ్’ చేయించండి. ‘గ్లాస్ నీళ్లు ఇచ్చినందుకు థ్యాంక్స్‌రా’ అనండి. పిల్లలూ నేర్చుకుంటారు. ముగింపు – స్కాలర్షిప్ డేసెలవులు అయిపోయే రోజు ఇంట్లో చిన్న ఫంక్షన్. ‘నెల రోజుల స్కాలర్షిప్ ప్రోగ్రాం కంప్లీటెడ్’ అని సర్టిఫికెట్ మీ చేత్తో రాసి ఇవ్వండి. ‘నువ్వు స్కాలర్షిప్ గెలిచావ్. నీకు ఈ టెలిస్కోప్’ అని ఇవ్వండి. ఆ కానుక విలువ 500 కావచ్చు, 5000 కావచ్చు. ఎన్ని లక్షణాల్లో బాగా తర్ఫీదు అయ్యారో ఆ ప్రతి లక్షణానికి ఒక సర్టిఫికెట్, బహుమతి ఇవ్వండి. ఇవి జీవితాంతం గుర్తుంటాయి. ఆ లక్షణాలను కాపాడుకునేలా చేసి జీవితాంతం నడిపిస్తాయి.
అంతర్జాతీయం
ఎనిమిదేళ్ల తర్వాత ఎయిర్‌షో.. ఢీ కొట్టి ముక్కలైన విమానాలు
అమెరికాలో ఘోరం సంభవించింది. ఎయిర్‌షోలో రెండు యుద్ధ విమానాలు ఒకదాన్నొకటి ఢీ కొట్టి పేలిపోయాయి. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం ఐడాహో స్టేట్ మౌంటెన్ హోమ్ ఎయిర్‌ఫోర్స్ వద్ద ఈ ఘటన జరింది. అయితే అదృష్టవశాత్తూ పైలట్లు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. గన్‌ఫైటర్ స్కైస్ ఎయిర్ షోలో రెండు అమెరికా EA-18G గ్రౌలర్ యుద్ధ విమానాలు మధ్య ఆకాశంలో ఢీకొన్నాయి. ఈ ఘటన మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఢీకొన్న వెంటనే విమానాలు పేలిపోయి ముక్కలైపోయాయి. ప్రమాద స్థలంలో దట్టమైన నల్ల పొగలు ఎగసిపడగా, అత్యవసర సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. బేస్‌ను తక్షణమే లాక్డౌన్ చేశారు. ఆదివారం మిగిలిన అన్ని కార్యక్రమాలను రద్దు చేశారు.విమానాల్లో ఉన్న నాలుగు మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఢీకొన్న క్షణాల్లోనే వారు పారా షూట్ల సహాయంతో కిందికి దిగారు. ఈ విషయాన్ని షో నిర్వాహకులు, అమెరికా నేవీ ధృవీకరించారు.Footage of the mid air collision between a pair of Navy Super Hornets/Growlers during the Gunfighter Skies Air Show at Mountain Home Air Force Base moments ago. pic.twitter.com/yQqPavmSWk— OSINTtechnical (@Osinttechnical) May 17, 2026మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ ప్రతినిధి ప్రకారం, ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. "అత్యవసర సిబ్బంది అక్కడే ఉన్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభమైన ఈ ఎయిర్ షోకు వేలాది మంది హాజరయ్యారు. అయితే ఈ ప్రమాదం గత ఘటనలను గుర్తు చేసింది. 2018లో ఒక హ్యాంగ్ గ్లైడర్ పైలట్ రన్‌వేపై కూలి మరణించాడు. 2003లో థండర్బర్డ్స్ జెట్ కూలిపోయింది. కానీ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. తాజా ప్రమాదం మళ్లీ ఎయిర్ షో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది.
అమ్మను దూరం చేసి.. పసివాడిని బలి తీసుకున్న ట్రంప్ యంత్రాంగం
ఫ్లోరిడా: అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కఠినమైన వలసవిధానాలు పరోక్షంగా ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకున్నాయి. అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు హోండురాస్ మూలాలున్న ఓ తల్లి, ఆమె రెండేళ్ల కుమారుడిని వేరు చేశారు. గతిలేక ఆ తల్లి తన కుమారుడిని బంధువుల ఇంట్లో వదిలేసి వెళ్లగా ఇప్పుడా అబ్బాయి విగతజీవిగా కన్పించాడు. ఈ ఉదంతంలో తల్లిదే తప్పు అంటూ అధికారుల వింతవాదనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోండురాస్ దేశానికి చెందిన వెండీ హెర్నాండెజ్ రెయెస్ తన రెండేళ్ల కుమారుడు ఆర్లిన్ జోసీతో కలిసి ఫ్లోరిడాలోని ఎస్కాంబియా కౌంటీలో నివసిస్తోంది. జనవరిలో లూసియానాలో ఓ రోజు నిర్మాణ పనులకు వెళ్లగా అక్కడి సిబ్బంది ఆమెను, మరికొందరిని అక్రమ వలసదారులంటూ ఇమిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. అధికారులు వెండీని నిర్బంధ కేంద్రంలో బంధించారు. రెండేళ్ల ఆర్లిన్ నిర్బంధ కేంద్రంలో ఉండటం కుదరదని అధికారులు తెగేసి చెప్పారు. దీంతో చేసేదిలేక ఆమె తన కుమారుడిని ఫ్లోరిడాలోని ఎస్కాంబియా కౌంటీలో ఉండే బంధువుæ మల్డోనాడోకి అప్పగించింది. అధికారులు నెల రోజుల్లోనే ఆమెను హొండురస్కు బలవంతంగా పంపేశారు. బంధువుల ఇంట్లో ఉన్న తన కుమారుడు తీసుకురావాలని అధికారులను ఎంతగా వేడుకున్నా వాళ్లు కనికరం చూపలేదు. ఆర్లిన్ సంరక్షణా బాధ్యతలు తీసుకున్న మల్డోనాడో సైతం అక్రమ వలసదారుడే. గతంలో నేరాలకు పాల్పడ్డాడు. అతడి చిత్రహింసల తాళలేక ఆర్లిన్ మార్చి నెలలో ప్రాణాలు కోల్పోయాడు. శరీరమంతటా గాయాలతో నిండిపోయింది. పిల్లాడి మృతి వార్త తెలిసి స్థానిక పోలీసుఅధికారులు మల్డోనాడోను అరెస్ట్ చేశారు. అయితే చిన్నారి మరణానికి ఆమె తల్లే పరోక్షంగా కారణమని, తాము చెప్పినా వినకుండా ఆర్లిన్ను వదిలేసి వెళ్లిందని ఇమిగ్రేషన్ అధికారులు వాదిస్తున్నారు. ఈ వాదనలను తల్లి తీవ్రంగా ఖండించారు. తన వెంట కుమారుడిని తీసుకెళ్తానని ఎంత మొత్తుకున్నా అధికారులు వినిపించుకోలేదని, ఇప్పుడు తిరిగి నింద తనపై మోపుతున్నారని ఆమె ఏడుస్తూ చెప్పారు. ప్రాణంగా చూసుకుంటున్న కన్న కొడుకును రాక్షసుడి చేతుల్లో పెట్టి వదిలేసి వెళ్లిపోయేంతటి కర్కశురాలిని కాదంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
తుపానుకు ముందు ప్రశాంతత
వాషింగ్టన్: ఇరాన్‌ను ఎలాగైనా తమ దారికి తెచ్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై కొన్ని రోజులుగా సైనిక చర్యలు చేపట్టకపోవడాన్ని ‘తుపానుకు ముందు ప్రశాంతత’గా ట్రంప్ అభివరి్ణంచారు. ఇరాన్‌కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. వైమానిక దాడులను పునఃప్రారంభించేందుకు ఉన్నతాధికారులతో ట్రంప్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలొచ్చాయి. కృత్రిమ మేధతో సృష్టించిన ఒక ఫొటోను ట్రంప్ తాజాగా సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఈ ఫొటోలో అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దడం(మాగా) అని రాసి ఉన్న టోపీని ట్రంప్ ధరించారు. నావికాదళ అడ్మిరల్ ట్రంప్‌కు వెనకాల నిలబడి ఉన్నారు. వెనక ఆకాశం ఉరుములు మెరుపులతో భీకరంగా ఉంది. ఈ ఫొటోను పోస్ట్‌చేసి ట్రంప్ పరోక్షంగా ఇరాన్‌కు ఒక స్పష్టమైన హెచ్చరిక చేశారని యుద్ధరంగ నిపుణులు వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో శాంతికి షరతులే అడ్డంకిపశ్చిమాసియాలో శాంతి సాధనకు ఓ వైపు కృషి జరుగుతుంటే మరోవైపు అవరోధాలు ఎదురవుతున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన పర్వం కొనసాగుతోంది. తమ షరతులకు అంగీకరిస్తే శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరిస్తామంటూ అమెరికా కొత్తగా ఐదు షరతులను తెరమీదకు తెచ్చింది. వాటికి ఇరాన్ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. ఇరాన్ అణ్వాయుధాలు సొంతం చేసుకునేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని అమెరికా పలుమార్లు తేల్చిచెప్పింది. ఇరాన్ వద్దనున్న 400 కిలోల శుద్ధిచేసిన యురేనియంను తమకు అప్పగించాలని చర్చల సందర్భంగా ట్రంప్ సర్కార్ షరతు విధించింది. మరో షరతు ఏమిటంటే.. ఇరాన్ అణు కర్మాగారాల్లో కేవలం ఒక సముదాయం మాత్రమే పనిచేస్తూ ఉండాలి. మిగిలినవి మూసివేయాలి. క్షిపణి నిల్వలను గణనీయంగా తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తోంది. అలాగే ఇన్నాళ్లూ అమెరికా ఆంక్షలు, విధానపరమైన నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోయామని, అందుకు తమకు పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. కానీ, అమెరికా ఒప్పుకోవడం లేదు. యుద్ధాన్ని ముగించడానికి అంకితభావంతో చర్చలు జరపాలన్న ప్రతిపాదనకు అమెరికా నిర్దిష్ట హామీని ఇవ్వడంలో విఫలమైందని ఇరాన్ మీడియా ఆదివారం వెల్లడించింది.
సహకారమే మన బలం
గోథెన్బర్గ్: సహకారమే మన బలమని భారత ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ ఆదివారం స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్స్సన్తో సమావేశమ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని ఈ సందర్భంగా ఇరుదేశాలు అంగీకరించాయి. భారత్–ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ ప్రజల ప్రయోజనం కోసం కొత్త అవకాశాలను అన్వేషించాలని నిర్ణయించారు. వ్యాపారం, వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణ సహా కీలక రంగాల్లో పరస్పర సహకారంపై సంప్రదింపులు జరిపారు. సహకారమే మన బలమని ఉద్ఘాటించారు. రెండో రోజుల పర్యటన నిమిత్తం నెదర్లాండ్స్ నుంచి ఆదివారం ఉదయం స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌కు చేరుకున్న మోదీకి ఘనస్వాగతం లభించింది. మోదీ గౌరవార్థం ఆయన ప్రయాణించిన విమానానికి స్వీడన్ ఎయిర్‌పోర్స్ విమానాలు ఎస్కార్ట్‌గా వచ్చాయి. గోథెన్బర్గ్ ఎయిర్‌పోర్టులో మోదీకి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్స్‌సన్ సాదర స్వాగతం పలికారు. మోదీకి స్వాగతం పలకడానికి స్వీడన్‌లోని ప్రవాస భారతీయులు తరలివచ్చారు. మోదీ రాకను పురస్కరించుకొని నిర్వహించిన సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం మోదీ, క్రిస్టర్స్‌సన్ మధ్య ప్రతినిధుల స్థాయి భేటీ జరిగింది. ఇరు పక్షాలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి అందుబాటులో ఉన్న నూతన మార్గాలపై చర్చించారు. హరిత పరివర్తన, కృత్రిమ మేధ(ఏఐ), వర్ధమాన సాంకేతికతలు, స్టార్టప్‌లు, సప్లై చైన్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ చర్యలు సహా ప్రజల మధ్య సంబంధాల విషయంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై భారత్, నెదర్లాండ్స్ ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ప్రధాని మోదీకి ‘పోలార్ స్టార్’ గౌరవం ప్రధాని మోదీ స్వీడన్ అత్యున్నత పురస్కారం ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్’అందుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చేసిన కృషి, దూరదృష్టి కలిగిన నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారం అందజేసినట్లు స్వీడన్ యువరాణి విక్టోరియా ప్రకటించారని విదేశాంగ శాఖ తెలిపింది. భారత్, నెదర్లాండ్స్ మధ్య ఇక వ్యూహాత్మక భాగస్వామ్యం ద హేగ్: అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో భారత్, నెదర్లాండ్స్ దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాయి. ఇకపై ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నెదర్లాండ్స్‌లో పర్యటించారు. ఆ దేశ ప్రధానమంత్రి రోబ్ జెటెన్తో సమావేశమయ్యారు. ఇరుదేశాలు మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రక్షణ, అరుదైన ఖనిజాలు సహా కీలక రంగాల్లో పరస్పర సహకారం కోసం 17 ఒప్పందాలపై భారత్, నెదర్లాండ్స్ సంతకాలు చేశాయి. పశ్చిమాసియా పరిణామాలపై ఇద్దరు ప్రధానమంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన సరఫరాలో అంతరాయాల వల్ల ప్రపంచదేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. భేటీ తర్వాత వారిద్దరూ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.మోదీకి రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ పురస్కారాన్ని అందజేస్తున్న స్వీడన్ యువరాణి విక్టోరియా
జాతీయం
ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ లిఖింపూర్‌లో ఈ రోజు( సోమవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిసైయా-లఖింపూర్ జాతీయ రహదారిపై వ్యాన్, లారీ పరస్పరం ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.లిఖింపూర్ నుండి వ్యాన్ సిసైయా వైపు వ్యాన్ వెళ్తుండగా ఉంచ్‌గావ్, భరేహతా గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. దీంతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు మరో తొమ్మిదిమంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు పేర్కొన్నారు. కాగా మరణించిన వారిలో ఏడుగురిని ఇదివరకే గుర్తించామని మరో ముగ్గురిని గుర్తించే అవకాశం ఉందని తెలిపారు.కాగా ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "లఖింపూర్ ఖేరి జిల్లాలో జరిగిన దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం తీవ్ర విచారకరం, గుండెల్ని పిండేసే ఘటన. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మరణించిన వారి ఆత్మలకు ఆ శ్రీరాముడు తన దివ్య చరణాల చెంత స్థానం కల్పించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను." అని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. అదేవిధంగా ఈ ప్రమాదంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు సైతం ప్రగాఢ సానూభూతి తెలియజేశారు.
‘బెయిల్ మీ ఇష్టమా?’.. కింది బెంచ్‌లపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థలో సంచలనం రేకెత్తించేలా భారత అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఒక కీలక తీర్పును వెలువరించింది. ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) అంటే ‘ఉపా’ (UAPA) చట్టం కింద నమోదైన కేసుల్లోనూ ‘బెయిల్ పొందడం ఒక నియమం’ అని, విచారణ లేకుండా సుదీర్ఘకాలం జైలులో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. ముఖ్యంగా ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్ కు బెయిల్ నిరాకరించిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీంతో ఉమర్ ఖాలిద్‌కు బెయిల్ దక్కే అవకాశాలు మెరుగుపడ్డాయి. గతంలో ‘కేఏ నజీబ్’ కేసులో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును కింది బెంచ్‌లు పట్టించుకోకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పులను న్యాయవ్యవస్థలో కీలక మార్గదర్శకాలుగా భావిస్తారు. అలాంటి తీర్పులు చట్టపరమైన స్పష్టతను తీసుకురావడమే కాదు, దిగువ బెంచ్‌లకు దిశానిర్దేశం చేస్తాయి. ఇద్దరు జడ్జిల బెంచ్ ఏదైనా అంశాన్ని విచారించే సమయంలో పెద్ద బెంచ్ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోవడం న్యాయసూత్రాల్లో భాగం. పెద్ద ధర్మాసనం అభిప్రాయాన్ని పక్కన పెట్టి భిన్నంగా వ్యవహరించొద్దు. చిన్న బెంచ్‌లు పెద్ద ధర్మాసనం నిర్దేశించిన సూత్రాలను అనుసరించడం న్యాయపరమైన బాధ్యతగా భావిస్తారు. ఈ విషయాన్నే సుప్రీంకోర్టు కాస్త ఘాటుగా చెప్పింది.విస్తృత ధర్మాసనం తీర్పులను ధిక్కరిస్తారా?జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. 2024లో వెలువడిన ‘గుర్విందర్ సింగ్’, ఉమర్ ఖాలిద్ కు సంబంధించిన ‘గుల్ఫిషా ఫాతిమా’ కేసుల్లో ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన తీర్పులపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. 2021లో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ‘కేఏ నజీబ్’ కేసులో ఇచ్చిన తీర్పుకు ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు. విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పులకు కట్టుబడి ఉండాల్సిందేనని, చిన్న బెంచ్‌లు వాటిని తక్కువ చేయడం న్యాయ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు ఘాటుగా మందలించింది.‘ఉపా’ కేసుల్లోనూ బెయిల్ ప్రాథమిక హక్కేఉపా చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ, ‘బెయిల్ ఇవ్వడమే నియమం.. జైలులో ఉంచడం మినహాయింపు’ అనే సూత్రం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 21 కల్పించే వ్యక్తిగత స్వేచ్ఛా హక్కును ఉపా చట్టంలోని కఠినమైన సెక్షన్ 43D(5) కూడా అడ్డుకోలేదని పేర్కొంది. కేవలం ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే సాకుతో, నిందితులను ఏళ్ల తరబడి విచారణ లేకుండా జైలులో ఉంచడం అనేది వారికి శిక్ష విధించినట్లే అవుతుందని కోర్టు హెచ్చరించింది. ఆరోపణలు ఎంత తీవ్రమైనవో, విచారణ కూడా అంతే వేగంగా జరగాలని సూచించింది.ఆరేళ్ల జైలు జీవితం: సయ్యద్ ఇఫ్తిఖర్ కు విముక్తిమాదకద్రవ్యాల సరఫరా ద్వారా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చారనే ఆరోపణలపై ఉపా చట్టం కింద అరెస్టై, ఆరేళ్లుగా జైలులో ఉన్న జమ్ముకశ్మీర్‌కు చెందిన సయ్యద్ ఇఫ్తిఖర్ అంద్రాబీ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. కింది కోర్టులు, హైకోర్టు ఇతనికి బెయిల్ నిరాకరించగా, సుప్రీంకోర్టు మాత్రం అతని సుదీర్ఘ జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. ఉపా కేసుల్లో నేరం రుజువయ్యే శాతం చాలా తక్కువగా ఉందని కూడా న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తుచేయడం గమనార్హం.ఇది కూడా చదవండి: మణిపూర్‌లో టెన్షన్.. బందీల కోసం బలగాలు
శబరిమల: ప్రైవేట్ హోటల్స్‌కు శాశ్వతంగా చెక్!
శబరిమల: కేరళలోని శబరిమల సన్నిధానంలో ఇకపై కలుషిత ఆహారానికి, ఇష్టారాజ్యంగా వ్యవహరించే ప్రైవేట్ హోటల్స్‌కు శాశ్వతంగా చెక్ పడనుంది. పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చే అయ్యప్ప స్వామి భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన ప్రైవేట్ కాంట్రాక్టర్ల సిండికేట్‌ను బద్దలు కొడుతూ, ఫుడ్ క్వాలిటీ కోసం ప్రముఖ విశ్వసనీయ సంస్థలను రంగంలోకి దించుతోంది.రంగంలోకి 'కుటుంబశ్రీ'.. హెల్త్ కార్డ్ తప్పనిసరిటెండర్ నిబంధనలను సమూలంగా ప్రక్షాళన చేస్తూ, పంపా, సన్నిధానం వద్ద ఉన్న ఫుడ్ సెక్టార్‌లోకి కుటుంబశ్రీ, ఇండియన్ కాఫీ హౌస్, కేటీడీసీ లాంటి సంస్థలను దేవస్వం బోర్డు ఆహ్వానిస్తోంది. ఇకపై ప్రతి హోటల్ కార్మికుడికి ‘హెల్త్ కార్డ్’ ఉండటం తప్పనిసరి. ఈ కొత్త మార్గదర్శకాలను ఏమాత్రం ఉల్లంఘించినా ఫుడ్ అవుట్లెట్లను తక్షణమే మూసివేస్తారు. ఇప్పటివరకు కేవలం తనిఖీలు, జరిమానాలతో సరిపెట్టుకున్న అధికారులు ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.కాంట్రాక్టర్ల లాబీయింగ్‌కు చెక్‘విజన్ శబరిమల’ చొరవలో భాగంగా ఈ భారీ ప్రక్షాళన జరుగుతోంది. ఇటీవల ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ స్వయంగా జరిపిన తనిఖీల్లో పారిశుద్ధ్య లోపం, కేటాయించిన దానికంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించడం లాంటి పలు ఉల్లంఘనలు వెలుగుచూశాయి. కాంట్రాక్టర్లు లాబీయింగ్ చేస్తూ, రేట్లు తగ్గించే వరకు టెండర్లు వేయకుండా ఆపే పాత పద్ధతికి బోర్డు ముగింపు పలుకుతోంది. అవకతవకలను నివారించేందుకు టెండర్ ప్రక్రియ మొత్తాన్ని ‘ఈ-టెండరింగ్’ విధానంలోకి మార్చాలని యోచిస్తోంది. వ్యర్థాల నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది.భక్తుల సౌకర్యానికే తొలి ప్రాధాన్యతమండల-మకరవిళక్కు సీజన్లో దేవస్వం బోర్డు ఉచిత అన్నదానం చేస్తున్నప్పటికీ, వేలాది మంది భక్తులు హోటళ్లపైనే ఆధారపడుతున్నారు. అయితే ఇరుకైన దారుల్లో కొట్లు ఏర్పాటు చేయడంతో భక్తుల కదలికలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని, ఇకపై భక్తుల సౌకర్యానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని జయకుమార్ తెలిపారు. ఇక మహిళల సామూహిక సంఘమైన ‘కుటుంబశ్రీ’ విషయంలో వయసు నిబంధనలను పాటిస్తారు.ఇది కూడా చదవండి: గంగాతీరంలో హై అలర్ట్.. అసలేం జరిగింది?
మాజీ మిస్ పూణే అనుమానాస్పద మృతి : దిగ్భ్రాంతి పర్చే లాస్ట్ మెసేజెస్
భోపాల్‌లో గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ మిస్ పూణే , కంటెంట్ క్రియేటర్ 33 ఏళ్ల ట్విషా శర్మ మరణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు నెలల గర్భిణి అయిన ట్విషా (31) భోపాల్‌లోని అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోవడానికి ముందు తన స్నేహితులకు పంపిన చివరి సందేశాలు వాట్సాప్ చాట్ కలకలం రేపుతోంది. తొందరపడి పెళ్లి చేసుకోవద్దు అంటూ ఆమె తన స్నేహితులకు పంపిన సందేశాలు ఆమె తీవ్రమైన మానసిక ఆందోళన, ఒంటరితనం, పెళ్లి తర్వాత వేదనలో ఉన్నట్లు ఆ మెసేజ్‌ల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఆమె ఉరి వేసుకోవడానికి ఉపయోగించినట్టు చెబుతున్న బెల్టును పోస్ట్‌మార్టంకు ఎయిమ్స్ భోపాల్‌కు పంపకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ కేసును పక్క దారి పట్టిస్తున్నారంటూ భోపాల్ పోలీసులపై ఆరోపణలు కుదిపేస్తున్నాయి. దర్యాప్తు సమగ్రతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అసలు ఏం జరిగింది?నోయిడాకు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన ట్విషా శర్మ, ఢిల్లీలో ఉద్యోగం చేసేది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన లాయర్ సమర్థ్ సింగ్‌ను డిసెంబర్ 2025లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన అయిదు నెలలకే, మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన భర్త ఇంట్లో ట్విషా శవం వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఆమె మరణం ఉరి వేసుకోవడం వల్లే జరిగిందని తేలినప్పటికీ, ఆమె శరీరంపై పలు చోట్ల గాయాల గుర్తులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్‌మీడియా చాట్స్ కీలకంగా మారాయి.మే 7న ఒక స్నేహితురాలితో వాట్సాప్ చాట్‌లో.. "నేను ఇంట్లోనే ఖాళీగా కూర్చోవడం వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నాను. నా జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నాను. పెళ్లి కుటుంబాన్ని ఇస్తుంది, కానీ ఎక్కడున్నా మన కోసం మనం పని చేయడం ఆపకూడదు" అని పేర్కొంది. పెళ్లి చేసుకోవాలనే తొందరలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. బాగా ఆలోచించి ముందడుగు వేయండి" అని స్నేహితురాలిని హెచ్చరించింది. అలాగే తనకు ఇల్లు, స్నేహితులు బాగా గుర్తొస్తున్నారని వాపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మరో స్నేహితుడితో మాట్లాడుతూ.. "నేను చిక్కుకుపోయాను బ్రో (I am trapped bro). నువ్వు మాత్రం ఇలాంటి వాటిలో ఇరుక్కోవద్దు. నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను, సమయం వచ్చినప్పుడు కాల్ చేస్తాను" అని తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది.న్యాయం కోసం రోడ్డెక్కిన కుటుంబంట్విషా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్ (రిటైర్డ్ జడ్జి)లపై కుటుంబ సభ్యులు హత్య, కట్నం వేధింపుల ఆరోపణలు చేశారు. భర్త, అత్తమామలు ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించారని ఆరోపించారు. నిందితులు ప్రభావవంతమైన వ్యక్తులు కావడం వల్ల వారికి ముందస్తు బెయిల్ లభించిందని, దీనివల్ల స్థానిక పోలీసుల దర్యాప్తు సక్రమంగా జరగకపోవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమార్తె మరణంపై న్యాయం చేయాలని, ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS Delhi)లో మళ్లీ పోస్ట్‌మార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ట్విషా కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నివాసం వెలుపల నిరసన చేపట్టారు. భోపాల్ వచ్చినప్పటి నుండి తాము ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడం కోసం మహిళా కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, పోలీస్ కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ట్విషా తండ్రి నవనిధి శర్మ, సోదరుడు ఆశిష్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు .స్థానిక పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరుతున్నారు.నిందితుల కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉండటంతో పాటు, వారికి సమీప బంధువైన వ్యక్తి లోకాయుక్తగా ఉండటంతో కేసును ప్రభావితం చేస్తున్నారని తండ్రి నవనిధి శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కుటుంబ సభ్యుల ప్రకారం పెళ్లయిన దగ్గర్నుంచీ ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. దీంతో తిరిగి వచ్చేయాలని ఆమె భావించింది. ఇంతలోనే ఆమె అనుమానాస్పద స్థితిలో కన్నుమూయడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త సమర్థ్ సింగ్ పరారీలో ఉన్నాడని, అతని తల్లి, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్‌కు ముందస్తు బెయిల్ లభించిందని చెప్పారు. బెయిల్‌ను సవాలు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: విజయ్ సర్కార్ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్ నేత జోస్యం
ఎన్ఆర్ఐ
ఈ అనుభవంతో భారత్‌ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్‌లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్‌లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్‌లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్‌నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్‌లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_)
అమెరికాలో ఇద్దరు తెలుగు వాళ్లకు ఐదేళ్ల జైలు శిక్ష!
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీసాల జారీ విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అయినప్పటికీ హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతుండడం కలకలం రేపుతోంది.తాజాగా హెచ్-1బీ వీసాల పేరిట జరిగిన ఫ్రాడ్ కేసులో అమెరికాలోని ఇద్దరు తెలుగు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగరానికి చెందిన సంపత్ రాజీదీ, శ్రీధర్ మాడ ఈ ఫ్రాడ్ కేసులో భాగం అయినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు తేలడంతో అమెరికా చట్టం ప్రకారం.. వీరికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు దాదాపు 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్లు) భారీ జరిమానా విధించే అవకాశముందని తెలుస్తోంది. సంపత్ రాజీదీ అమెరికాలో రెండు వీసా ప్రాసెసింగ్ కంపెనీలను నడుపుతున్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి విదేశీయులకు హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేశారు. అలాగే శ్రీధర్ మాడ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ విభాగంలో చీఫ్ ఇన్ఫర్మేషనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అభ్యర్థులు యూనివర్సిటీ ప్రాజెక్టుల్లో పని చేస్తారని ఫేక్ పత్రాలు అందించారు. సాధారణంగా హెచ్-1బీ వీసా పొందాలంటే అమెరికాలోని ఏదైనా ఒక సంస్థలో సదరు నిపుణుడికి ఉద్యోగం కచ్చితంగా ఉండాలి. దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీధర్ మాడ.. తనకున్న అధికారంతో యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించారు. ఈ విషయాలు విచారణలో తేలినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఇక జూన్ 2020 నుంచి జనవరి 2023 మధ్య ఈ ఫేక్ దందాను కొనసాగించినట్లు విచారణలో తేలింది.చదవండి: మలి విడత చర్చలు.. పాక్‌కు వెళ్లని జేడీ వాన్స్!
అరవింద కృష్ణ స్వామికి అట్లాంటా శంకర నేత్రాలయ సత్కారం
అట్లాంటా: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం Crowne Plaza Atlanta NE నార్క్రాస్లో అత్యంత ఉత్సాహభరితమైన, భారీ సంఖ్యలో ప్రజలు హాజరైన ఒక "Meet ’n Greet" (పరిచయ సమావేశం) కార్యక్రమాన్ని నిర్వహించింది. జార్జియా, పొరుగు రాష్ట్రాల నుండి 250 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం, ఆ సంస్థ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా, Medlytix LLC CEO అయిన అరవింద్ కృష్ణ స్వామిని తమ సలహా మండలి (Board of Advisors)లో సరికొత్త సభ్యుడిగా సంస్థ అధికారికంగా ఆహ్వానించింది.అట్లాంటాలోని ప్రముఖ సంగీత, నృత్య అకాడమీల సాంస్కృతిక ప్రదర్శనలు పురోహిత నరసింహాచార్యులు దివ్య సన్నిధిలో, ఈ సమావేశం అర్థవంతంగా, విజయవంతంగా జరగాలని ఆశీస్సులు కోరుతూ, అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి గారితో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా. జగదీష్ శెత్, మెగా దాతలు మరియు బ్రాండ్ అంబాసిడర్లు శ్రీ శంకర్ సుబ్రమణియన్, శ్రీ అరవింద్ కృష్ణస్వామి, శ్రీమతి జయ కృష్ణస్వామి, మరియు డా. కిషోర్ చివుకుల, సలహాదారుల మండలి సభ్యులు, కోశాధికారి మూర్తి రేకపల్లి; జె.సి. శేఖర్ రెడ్డి; పాలక మండలి సభ్యులు డా. రెడ్డి ఊరిమిండి మరియు మెహర్ లంక; సాంస్కృతిక సమన్వయకర్త నీలిమ గడ్డమనుగు; చాప్టర్ ఉపాధ్యక్షుడు వెంకీ నీలం; మరియు అట్లాంటా ఎస్ఎన్ బృందంలోని ఇతర అంకితభావం గల సభ్యులు పాల్గొన్న సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలన, అనగా లాంఛనప్రాయంగా జ్యోతి ప్రజ్వలనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.అట్లాంటాలోని నాలుగు ప్రముఖ శాస్త్రీయ నృత్య, సంగీత అకాడమీలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమంతో ఈవెంట్ ప్రారంభమైంది. సుస్వర సంగీత విద్యాలయంకు చెందిన శాంతి మెడిచెర్ల, భరత దర్శన్ స్కూల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్కు చెందిన సౌజన్య మధుసూదన్, కళాక్ష్య అకాడమీకి చెందిన మిటల్ పటేల్, మరియు నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీకి చెందిన నీలిమ గడ్డమనుగు దీనికి నాయకత్వం వహించారు. ఈ సాంస్కృతిక విభాగంలో భారత్‌కు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు రాము (చెన్నై) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ప్రతిభావంతులైన స్థానిక గాయకులు శిల్పా ఉప్పులూరి (ఈమె కార్యక్రమ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు), ఫణి డొక్కా, రామ్ దుర్వాసుల, ఉషా మోచర్ల, శాంతి మెడిచర్ల, మరియు అట్లాంటాకు చెందిన రాగ వాహినిలతో కలిసి, ఎంతో ఇష్టపడే క్లాసిక్ చిత్రాల నుండి హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో బహుభాషా మేళవింపును ప్రదర్శించి రాము ఆ సాయంత్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. బహుభాషా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ప్రదర్శనకు, అధ్యక్షులు బాల ఇందుర్తి ఆయనను ఆప్యాయంగా “ఎస్పీబీ మానసపుత్ర” అని సంబోధించారు.మొబైల్ కంటి శస్త్రచికిత్స విభాగానికి భారీ విరాళంఅరవింద్ కృష్ణస్వామికి సంబంధించిన ఆడియో-విజువల్ (AV) ప్రజెంటేషన్ ప్రదర్శించినప్పుడు, ఆయన చేసిన అద్భుతమైన $555,000 విరాళాన్ని గుర్తించి, ప్రేక్షకులు కరతాళధ్వనులతో హోరెత్తిస్తూ, లేచి నిలబడి ఘన సన్మానం (standing ovation) చేశారు. 12 MESU (Mobile Eye Surgical Unit) 'Adopt-A-Village' కంటి వైద్య శిబిరాలకు మద్దతుగా అరవింద్ $155,000 విరాళం అందించారని అధ్యక్షుడు బాల ఇందుర్తి తెలియజేశారు. అంతేకాకుండా, భారతదేశంలో వైద్య సేవలు సరిగా అందని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకచోట కొత్త MESU కేంద్రాన్ని స్థాపించడానికి అరవింద్ ఉదారంగా ప్రకటించిన $400,000 విరాళం వినియోగించబడుతుంది.మహారాష్ట్ర మరియు గుజరాత్‌లలో అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు అధ్యక్షుడు బాల, ప్రస్తుతం 'శంకర నేత్రాలయ ఇండియా' అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావుతో కలిసి సన్నిహితంగా పనిచేస్తున్నారు. డల్లాస్‌కు చెందిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు మరియు SMUలో అరవింద్ కృష్ణస్వామికి పూర్వ సహవిద్యార్థి అయిన డాక్టర్ రెడ్డి ఊరిమిండి, అరవింద్‌ను 'శంకర నేత్రాలయ USA'కు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పరోపకార నాయకత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ, ప్రసాద్ రెడ్డి కాటమ్రెడ్డితో పాటు అరవింద్ కూడా అర్ధ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించడం చూడటం గర్వకారణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర నేత్రాలయ అట్లాంటా బృంద సభ్యులలో డా. కిషోర్ రెడ్డి రాసమల్లు; రమేష్ చాపరాల, గిరి కోటగిరి; ప్యాడీ రావు, సుబ్బారావు; శ్రీనివాస్ దుర్గం; చరిత్ర జూలపల్లి; మరియు చాప్టర్ లీడ్లు కార్తికేయన్ వినాయగం మరియు లోగియ అవిలినేలి ఉన్నారు. శంకర నేత్రాలయతో తన ప్రయాణం 2016లో అప్పటి ఉపాధ్యక్షుడు డాక్టర్ శేషు శర్మ చొరవతో ప్రారంభమైందని అధ్యక్షుడు బాల తెలిపారు. ఆ సమయంలో, సంస్థకు కేవలం ఏడు శాఖలు మాత్రమే ఉండేవి; నేడు, ఇది దేశవ్యాప్తంగా ముప్పై శాఖలకు విస్తరించింది. ఈ అద్భుతమైన విస్తరణకు అంకితభావం గల బలమైన వాలంటీర్ల బృందం, వ్యవస్థాపకులు, పద్మభూషణ్ దివంగత డాక్టర్ ఎస్. ఎస్. బద్రీనాథ్ మరియు SNUSA వ్యవస్థాపకులు శ్రీ ఎస్. వి. ఆచార్యల ఆశీస్సులే కారణమని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు
న్యూయార్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న 2026న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో స్మారక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ నైతికతపై దార్శనికత మరియు బహుపాక్షికవాదానికి దాని ప్రాసంగికత’ అనే థీమ్‌తో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి,అంబాసిడర్ హరీష్ పార్వతనేని స్వాగతోపన్యాసం చేశారు. భారత పౌరులలో రాజ్యాంగ నైతికత స్ఫూర్తిని నింపడంలో డాక్టర్ అంబేద్కర్ కృషి చాలా ముఖ్యమైందన్నారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగానికి మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు మధ్య ఉన్న ఉమ్మడి అంశాలను వివరించారు. రాజకీయ విభజన, నిరంతర సంఘర్షణలతో కూడిన ఈ క్లిష్ట సమయాల్లో రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాలన్న డాక్టర్ అంబేద్కర్ పిలుపు ఎంతో సందర్భోచితమైనదని, ఇది బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడానికి, ఐక్యరాజ్యసమితిలో సమర్థవంతమైన సంస్కరణలు తీసుకురావడానికి, దాని ప్రధాన విభాగాలకు పునరుజ్జీవం పోయడానికి, ఐక్యరాజ్యసమితిని దాని ఉద్దేశ్యానికి అనుగుణంగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుందని రాయబారి హరీష్ చెప్పారు.ప్రముఖ సివిల్ సర్వెంట్, ప్రముఖ అంబేద్కర్ పండితుడు అయిన డాక్టర్ రాజా శేఖర్ వుండ్రు కీలకోపన్యాసం చేశారు. రెండు ప్రపంచ యుద్ధాలను, ఐక్యరాజ్యసమితి ఏర్పాటును ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా, డాక్టర్ అంబేద్కర్ బహుపాక్షికవాదం ప్రాముఖ్యతను గుర్తించారని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం యొక్క కేంద్ర సూత్రాలను రూపొందించడంలో డాక్టర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి చార్టర్లో పొందుపరిచిన అంతర్జాతీయ శాంతి పరిరక్షణ అనే ప్రాథమిక స్ఫూర్తి భారత రాజ్యాంగంలో కూడా ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్ అంబేద్కర్ నొక్కిచెప్పారని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో, బహుపాక్షికవాదం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా అంతర్జాతీయ రాజ్యాంగ నైతికతను పెంపొందించాల్సిన అవసరం ఉందని రాజా శేఖర్ వుండ్రు అన్నారు.డాక్టర్ అంబేద్కర్ జీవితం ఒక నైతిక నిదర్శనమని, అందులో ఆయన కేవలం బాధ నుండి తప్పించుకోవడమే కాకుండా, దానిని రూపాంతరం చెందించి, ఆ గాయాన్ని జ్ఞానంగా మార్చారని హార్వర్డ్ డివినిటీ స్కూల్ విజిటింగ్ ప్రొఫెసర్, అతిథి వక్త డాక్టర్ సంతోష్ రౌత్, అభిప్రాయపడ్డారు. నేటి ప్రపంచంలో, ముఖ్యంగా బహుపాక్షికత (multilateralism) విషయంలో, డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషి మరియు ఆదర్శాల గాఢమైన ఔచిత్యాన్ని డాక్టర్ రౌత్ విశదీకరించారు. ఐక్యరాజ్యసమితి ఛార్టర్ వంటి లిఖితపూర్వక గ్రంథాల స్ఫూర్తిని ఆచరణలో పెట్టడానికి దోహదపడే శక్తిగా ఆయన నైతికతను అభివర్ణించారు.వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా హాజరయ్యారు.
క్రైమ్
ప్రేమోన్మాది మణితేజ మృతి
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన వైష్ణవిని కత్తితో అతి కిరాతకంగా హత్య చేసిన ప్రేమోన్మాది మణితేజ (29) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శనివారం వైష్ణవి తాను పనిచేస్తున్న పాఠశాలలో విధులు ముగించుకుని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా నిందితుడు కత్తితో దారుణంగా మెడ, గొంతుపై విచక్షణా రహితంగా పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. రక్తం మరకలతో పారిపోతున్న మణితేజను స్థానికులు పట్టుకుని కాళ్లు చేతులు కట్టి వేసి దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో అతని తలపై రాళ్లు ఎత్తివేయడంతో తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన మణితేజను మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. హైదరాబాద్‌లో పరిచయం.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన మణితేజ ల్యాండ్రీ షాప్ నిర్వహించేవాడు. గతంలో వైష్ణవి ఓ హాస్టల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో విద్యార్థుల దుస్తులు ఉతికి, ఇస్త్రీచేసి అప్పగించే సందర్భంగా ఆమెతో పరిచయం ఏర్పడింది. తర్వాత వైష్ణవి అక్కడ ఉద్యోగం మానేసినా ఫోన్లో ఇద్దరూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే తాను ప్రేమిస్తున్నట్లు వైష్ణవిని వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. అయితే ఇటీవల వైష్ణవికి వెళ్లి కుదిరిందన్న సమాచారం తెలియడంతో మణితేజ తన ప్రేమను కాదన్న వైష్ణవిని హతమార్చాలని నిర్ణయించుకుని.. జడ్చర్లకు వచ్చి ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.కాగా, మణితేజ తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి, తమ్ముడు ఉన్నారు. హత్య అనంతరం వైష్ణవి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు యువకుడి ఆచూకీని గుర్తించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మణితేజ మృతి చెందాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ నుంచి జడ్చర్లకు వచ్చారు. ఈ క్రమంలో వైష్ణవి కుటుంబ సభ్యులు, బంధువులు వారిపై దాడిచేస్తారన్న అనుమానంతో పోలీసులు వారిని జడ్చర్ల సమీపంలోని డీటీసీలో ఉంచి రక్షణ కల్పించారు. అప్పటి దాకా మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. జడ్చర్లలో వైష్ణవి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత జనరల్ ఆస్పత్రిలో మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.
ఆస్తి కోసం తల్లీకూతుళ్ల దారుణ హత్య
హాలియా: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సాయిలు, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు యాదయ్యకు సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామానికి చెందిన సుమలతతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. యాదయ్య, సుమలత (40) దంపతులకు కుమార్తె రుద్రాక్షి లావణ్య (19) సంతానం. కుమార్తె పుట్టిన ఆరు నెలలకే తండ్రి యాదయ్య మృతి చెందాడు.దీంతో సుమలత తన కుమార్తె లావణ్యతో కలిసి వేరుగా నివాసం ఉంటోంది. కాగా, రుద్రాక్షి సాయిలు, యాదయ్యకి వారసత్వంగా వచ్చిన 6 ఎకరాల వ్యవసాయ భూమిని అతని కుమార్తె లావణ్య పేరుమీద రిజిస్టర్ చేసి గార్డియన్‌గా నానమ్మ వెంకటమ్మను పె ట్టారు. కొంతకా లం తరువాత వెంకటమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. కోడలు సుమలత అత్త గురించి పట్టించుకోకపోవడంతో వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు ఆమెను ఆస్పత్రిలో చూపించగా వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలిసింది.ఈ క్రమంలో వెంకటమ్మను ఆమె కోడలు సుమలత, మనుమరాలు లావణ్య పట్టించుకోవడం లేదని వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు కోర్టులో పిటిషన్ వేశారు. గత ఏడాది లావణ్య మేజర్ అయినందున తాత సాయిలు లావణ్యకు చేసిన భూమి పట్టా విషయంలో తీర్పు అనుకూలంగా రావడంతో తమ తల్లి వెంకటమ్మకు ఆస్పత్రిలో వైద్యం కోసం ఖర్చు చేసిన రూ.30 లక్షలు ఇవ్వాలని ఆడబిడ్డలు వేసిన కేసుకు సంబంధించి రూ.5 లక్షలు ఇవ్వాలని కోర్టు రుద్రాక్షి సుమలతకు సూచించింది. సాయిలు, వెంకటమ్మ బాగోగుల విషయంలో పలుమార్లు ఆడబిడ్డలకు, సుమలతకు మధ్య తగాదాలు జరిగాయి.ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆస్తి విషయంలో ఆడపడుచులు.. సుమలత మరోమారు ఘర్షణ పడ్డారు. అనంతరం ఉదయం 9 గంటల సమయంలో సుమలత, ఆమె కూతురు లావణ్య గ్రామ శివారులోని ఆయిల్‌పామ్ తోట వద్దకు పని చేయడానికి వెళ్లారు. అక్కడే గుర్తు తెలియని వ్యక్తులు తల్లీకూతుళ్లపై విరుచుకుపడి కంట్లో కారం చల్లారు. లావణ్య మెడకు చున్నీ, సుమలత మెడకు పైటకొంగు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ తల్లీకూతుళ్ల హత్య విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా జరుగుతున్న ఆస్తి తగాదాలే తల్లీకూతుళ్ల హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి తల్లి శాంతమ్మ తన కుమార్తె, తన మనుమరాలు హత్యకు ఆమె ఆడపడుచులు, వారి భర్తలే కారణమని ఆరోపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు.
భర్త వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య
కిర్లంపూడి: నవ వధువు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ జి.సతీష్ తెలిపిన వివరాల మేరకు..కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన సత్యంశెట్టి వెంకటేశులు దంపతుల మూడవ కుమార్తె వెంకటలక్ష్మి (25)కి ఏప్రిల్ 25న పిఠాపురం మండలం మర్లావకు చెందిన గాది దుర్గాకోటేశ్వరరావుతో వివాహమైంది. దుర్గాకోటేశ్వరరావు పెళ్లి జరిగిన మూడో రోజే తనకు వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ వీడియోలు, ఫొటోలు ఆమెకు చూపించాడు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి అప్పటినుంచి అన్యమనస్కంగా ఉంటోంది. ఆచారాల్లో భాగంగా మూడు సార్లు అత్తారింటికి వెళ్లి వచ్చిన ఆమె గోనేడలోని తన తల్లిదండ్రుల ఇంటివద్దే ఉంటోంది. తన భర్తకు ఉన్న అక్రమ సంబంధాల విషయాన్ని తట్టుకోలేక శనివారం రాత్రి తన గదిలోని ఫ్యానుకు చీరకట్టి ఉరి వేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు.కాగా, వెంకటలక్ష్మి తల్లిదండ్రులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఇద్దరు పిల్లలకు వివాహాలు కాగా, చిన్న కుమార్తె వెంకటలక్ష్మిని డిగ్రీ వరకు చదివించి గత నెలలోనే పెళ్లి చేశాడు. తమ బాధ్యతలు తీరాయని సంతోషపడేలోపే ఈ దారుణం జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తల్లి సత్యంశెట్టి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త దుర్గాకోటేశ్వరరావు, అత్త నూకామణిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రేమించకుంటే చంపేస్తారా?
సాక్షి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్లో తనను ప్రేమించడం లేదని ప్రేమోన్మాది తేజ.. చేతితో గాయపడి వైష్ణవి (23) మృతి చెందింది. ఈ ఘటనలో స్థానికులు చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన తేజను ఆసుపత్రికి తరలించారు. ఆ యవకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో వైష్ణవి మృతిపై తన సోదరి అక్షయ కీలక వ్యాఖ్యలు చేసింది. తన అక్క(వైష్ణవి) గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డింది.వైష్ణవి మృతిపై తన సోదరి అక్షయ స్పందించింది. ఈ సందర్బంగా అక్షయ..‘మా సోదరి మృతిపై రకరకాల కథనాలు రావడం బాధాకరం. ఏ అమ్మాయి అయినా డబ్బులు తీసుకొని మోసం చేస్తారా?. చనిపోయే సందర్భంలో నిందితుడు చేసిన ఆరోపణను ఎలా నిర్ధారిస్తారు?. అమ్మాయిలను సమాజంలో పురుగుల్లా చూస్తున్నారు. మా అక్క గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆమె గురించి మీకేం తెలుసు?. మాకు న్యాయం చేయకపోయినా సరే కానీ ఇలాంటి ఆరోపణలు మానుకోవాలి. న్యాయం కోసం ముఖ్యమంత్రి వద్దకైనా వెళ్తాం.మా అక్కపై దాడి జరిగే సమయంలో అందరూ చూస్తూనే ఉన్నారు తప్ప ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్‌ను అలవరచుకోవాలి. ఎవరో చనిపోయారని తెలిస్తే అక్కడికి వెళ్ళాక మా అక్క అని గుర్తించాం. సామాజిక బాధ్యతగా వివరించాల్సిన అవసరం ప్రజలపై ఉంది. ప్రేమించకుంటే చంపేస్తారా?’ అని ప్రశ్నించింది.ఇదిలా ఉండగా.. బాదేపల్లి పట్టణంలోని ఎర్రసత్యం కాలనీకి చెందిన వైష్ణవి పోలేపల్లి సెజ్‌లోని ఎస్వీకేఎం స్కూల్లో రిసెప్షనిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. శనివారం విధులు ముగించుకొని సాయంత్రం 5.30 గంటల సమయంలో కాలనీలో నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న సమయంలో యువకుడు తేజ.. యువతిని వెంటాడి తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు. దీంతో, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ యువకుడు పారిపోతున్న సమయంలో స్థానికులు గమనించి వెంటాడి పట్టుకుని కాళ్లు చేతులు తాళ్లతో కట్టి వేసి చితకబాదారు. రాళ్లతో తలపై దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడకు వచ్చిన 108 అంబులెన్స్‌లో యువతిని వైద్య చికిత్స కోసం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
వీడియోలు
పెద్ది సినిమా ట్రైలర్ వచ్చేసింది..
బుర్ర ఉండి మాట్లాడుతున్నావా..!
పెట్రో బాదుడుపై పోరుబాట
RCBతో ఓటమి కన్నీళ్లు పెట్టుకున్న పాంటింగ్
పెద్ది ట్రైలర్ ఈవెంట్ లో రామ్ చరణ్ అనుభవం
ఈ తల్లి ధైర్యానికి చేతులెత్తి మొక్కాల్సిందే
అప్పుడు మా అమ్మ, చిరు సార్.. ఇప్పుడు నేను & చరణ్
అమరావతిలో తేడా జరుగుతుంది అని పవన్ కి తెలుసు
లోకేష్ ని రఫ్ఫాడించిన పేర్ని కిట్టు
బయటపడ్డ బుద్ధా వెంకన్న.. అల్లుడి అరాచకాలు కన్నీళ్లు పెట్టుకున్న బాధితుడు


