ఉర్విల్ క్లీన్‌బౌల్డ్.. రెండో వికెట్ డౌన్
ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే 48 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన ఉర్విల్ పటేల్‌ను సాకిబ్ హుస్సేన్ క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్ చేర్చాడు.
తొలి వికెట్ కోల్పోయిన చెన్నై
సంజూ శాంసన్ (27) రూపంలో చెన్నై సూపర్‌కింగ్స్ 31 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సోమవారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా 63వ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సీఎస్‌కే బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌లో సీఎస్‌కే ఒక మార్పుతో బరిలోకి దిగింది. గుర్జన్‌పీత్ సింగ్ స్థానంలో అకిల్ హొసేన్ తుది జట్టులోకి వచ్చాడు.
గాయం నుంచి కోలుకున్నప్పటికీ ధోనీ పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో మ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ తెలిపాడు. మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్ మాత్రం ఎలాంటి మార్పు లేకుండానే బరిలోకి దిగుతోంది.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే
చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, స్పెన్సర్ జాన్సన్


