Pawan Kalyan
-
వేసవొచ్చింది... సెలవులు తెచ్చింది
వేసవి వచ్చిందంటే చాలు... స్కూల్స్, కాలేజీలు క్లోజ్ అవుతాయి. స్టూడెంట్స్‌కు సెలవులొచ్చేస్తాయి. అలాగే ప్రతి ఏడాది సినిమా స్కూల్స్‌కు కూడా వేసవి సెలవులు వస్తుంటాయి. ఈ సెలవుల్లో మెజారిటీ స్టార్ హీరోలు షూటింగ్ నుంచి బ్రేక్స్ తీసుకుంటుంటారు. అలా ఈ ఏడాది షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చిన కొందరు తెలుగు హీరోలపై ఓ లుక్ వేయండి.లండన్‌లో ల్యాండ్ నిన్న మొన్నటివరకు ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి ఇటీవలే లండన్‌లో ల్యాండ్ అయ్యారు. ఆయన తనయుడు, హీరో– నిర్మాత రామ్‌చరణ్ మైనపు విగ్రహం లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం కోసం చిరంజీవి ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాను హీరోగా నటించనున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు చిరంజీవి. ఈ నెల మూడో వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిసింది.ఈ మూవీలో నయనతార, కేథరీన్ హీరోయిన్లుగా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. సాహు గార పాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘విశ్వంభర’ సినిమాకు చిన్న పాటి ΄్యాచ్ వర్క్, ఓ స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్ ఉన్నాయట. వీలు చూసుకుని, ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టే ఆలోచనలో ఉన్నారు చిరంజీవి. ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తుండగా, యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, విక్రమ్, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషా, ఆషికా రంగనాథన్ హీరోయిన్లుగా నటిస్తారు. ఇక ‘విశ్వంభర’ సినిమా కొత్త విడుదల తేదీపై అతి త్వరలోనే ఓ స్పష్టత రానుంది.ఓవర్ టు ఓజీ కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉంటూ, సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉంటున్న పవన్ కల్యాణ్ ఇటీవలే ‘హరిహర వీరమల్లు’ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఇది. దీంతో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో పవన్ కల్యాణ్ వంతు షూటింగ్ పూర్తయింది. జాగర్లమూడి రాధాకృష్ణ, జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఏయం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ నిర్మించారు. అయితే ఈ సినిమాను తొలుత మే 30న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ...పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాని నేపథ్యంలో రిలీజ్‌ను వాయిదా వేశారని, అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుందని తెలిసింది. రెండు భాగాలుగా ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల కానుంది.తొలి భాగంగా ‘హరిహర వీరమల్లు: స్పిరిట్ వర్సెస్ స్వార్డ్’ విడుదలవుతుంది. ఇలా ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణ పూర్తి కావడంతో, ఇక పవన్ ఫోకస్ అంతా ‘ఓజీ’ సినిమాపైనే. అయితే ‘హరిహర వీరమల్లు’ సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన పవన్ కల్యాణ్ షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చారు. అతి త్వరలోనే ఆయన ‘ఓజీ’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, బాబీ డియోల్, నాజర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తారు.ఫారిన్ వెకేషన్ ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్తుంటారు హీరో మహేశ్‌బాబు. అయితే ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు సినిమాప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబుకు ఈ ఏడాది ఫారిన్ హాలిడే బ్రేక్ దొరక్కపోవచ్చని కొందరు అనుకున్నారు. కానీ మహేశ్‌బాబుకు ఆ అవకాశం లభించింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా లాంగ్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత ఫారిన్ ఫ్లైట్ ఎక్కారు మహేశ్‌బాబు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో కలిసి యూఎస్‌లో ఉన్నారని సమాచారం.ఇంకా రెండు వారాలు మహేశ్‌బాబు అక్కడే ఉంటారట. వచ్చిన తర్వాత రాజమౌళి సినిమా షూటింగ్‌ను మళ్లీ షురూ చేస్తారు. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2027 వేసవిలో ఈ చిత్రం విడుదలవుతుందనే ప్రచారం సాగుతోంది.ఇటలీలో... ‘ది రాజా సాబ్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలతో కొన్ని రోజులు క్రితం బిజీ బిజీగా గడి పారు ప్రభాస్. దాంతో ఈ సినిమా చిత్రీకరణలకు బ్రేక్ ఇచ్చి, ఇటీవల ఫారిన్ వెళ్లారు ప్రభాస్. దాదాపు ఇరవై రోజుల నుంచి ప్రభాస్ ఇటలీలోనే ఉంటున్నారని తెలిసింది. అతి త్వరలోనే ప్రభాస్ ఇండియాకు తిరిగి రానున్నారు. వచ్చిన తర్వాత ‘ది రాజా సాబ్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలనుప్రారంభిస్తారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.మరో నటి రిద్దీ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘ఫౌజి’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్లు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026లో ‘ఫౌజి’ సినిమా విడుదల కానుంది.లండన్‌లో... లండన్ వెళ్లారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే హై ఓల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ చిత్రకరణ కర్ణాటకలో జరిగింది. ఎన్టీఆర్ పాల్గొనగా, యాక్షన్ సీక్వెన్స్‌లు, కొంత టాకీ పార్టును చిత్రీకరించారు ప్రశాంత్ నీల్. కాగా ఈ కర్ణాటక షూటింగ్ షెడ్యూల్ తర్వాత ఎన్టీఆర్ లండన్ వెళ్లారని తెలిసింది. లండన్‌లోని ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా స్క్రీనింగ్ జరగనుందని తెలిసింది. అలాగే ఈ చిత్రం సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి లైవ్ కాన్సెర్ట్ కూడా ఉంది.ఈ కార్యక్రమం కోసం ఎన్టీఆర్ లండన్ వెళ్తున్నారని తెలిసింది. ఈ వేడుకలో ‘ఆర్ఆర్ఆర్’లో హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఈ చిత్రదర్శకుడు రాజమౌళిలతో పాటు ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్‌లోని మరికొందరు పాల్గొంటారట. తిరిగొచ్చిన తర్వాత మళ్లీ ‘డ్రాగన్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు ఎన్టీఆర్. కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘డ్రాగన్’ సినిమాను 2026 జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.విదేశాల్లో వెరీ బిజీ ‘పెద్ది’ సినిమా చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చి, లండన్ వెళ్లారు రామ్‌చరణ్. లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ, ‘ఆర్ఆర్ఆర్’ వేడుకల్లో పాల్గొనేందుకు రామ్‌చరణ్ ఆల్రెడీ లండన్‌లోనే ఉన్నారు. ఈ రెండు కార్యక్రమాలతో ప్రస్తుతం రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత ‘పెద్ది’ సినిమా చిత్రీకరణలో ఆరంభిస్తారు రామ్‌చరణ్. బుచ్చిబాబు దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ‘పెద్ది’ చిత్రం వచ్చే ఏడాది రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామా మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, దివ్యేందు, శివ రాజ్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు హీరోలు ఈ వేసవికి షూటింగ్ బ్రేక్స్ ఇచ్చారు.– ముసిమి శివాంజనేయులువేసవి తర్వాతే... ఈ వేసవికి కొందరు హీరోలు షూటింగ్స్‌కు బ్రేక్ ఇవ్వగా, ఈ వేసవి తర్వాతనే కొత్త సినిమా షూటింగ్లనుప్రారంభించాలని మరి కొందరు హీరోలు ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ నెక్ట్స్ సినిమాపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. వెంకటేశ్ కూడా చాలా కథలు వింటున్నారు. కాగా వెంకటేశ్ నెక్ట్స్ మూవీ దర్శకుడు త్రివిక్రమ్‌తో ఉంటుందని, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారని, వేసవి తర్వాత అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట. ఇక మరో సీనియర్ హీరో నాగార్జున సోలో హీరోగా కొత్త సినిమాపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. అయితే తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ చెప్పిన ఓ కథ నాగార్జునకు నచ్చిందని, త్వరలోనే ఈ మూవీ గురించిన అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. వేసవి తర్వాతనే ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించాలని నాగార్జున భావిస్తున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. మరోవైపు అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి తర్వాతే ఈ సినిమా చిత్రీకరణనుప్రారంభించాలని అట్లీ అండ్ టీమ్ ప్లాన్ చేసిందట. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇలా మరికొంతమంది తెలుగు హీరోలు ఈ వేసవి సెలవుల తర్వాత తమ కొత్త సినిమాల సెట్స్‌లోకి అడుగుపెట్ట నున్నారని తెలిసింది. -
నేను పీకే తాలుకా.. తలచుకుంటే లేపేస్తా...!
డాబాగార్డెన్స్(విశాఖపట్నం): నేను పవన్ కల్యాణ్ తాలూకా? నీవెవ్వడివిరా? నేను తలచుకుంటే లేపేస్తా.’ అంటూ ఓ వైద్యుడిపై పీకే అభిమాని విరుచుకుపడ్డాడు. ఆ వైద్యుడు కన్నీటితో తన ఆవేదనను సాక్షి వద్ద వెలిబుచ్చాడు. ఏం జరిగిందో ఆయన మాటల్లోనే..పాతనగరం ఫిషింగ్ హార్బర్ వద్ద హోమియో క్లినిక్ నడుపుతున్నా. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో క్లినిక్ మూసి, ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ అభాగ్యురాలు తన చంటి పిల్లలతో మండుటెండలో ఆకలితో అలమటిస్తుంటే.. బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ ఇచ్చాను. ఆనందంగా స్వీకరించిన పిల్లలు సమీపంలోని మరిడిమాంబ ఆలయం షెల్టర్ వద్దకు తినుకుంటూ వెళ్లడంతో ఓ ద్విచక్రవాహనదారుడు స్పీడ్‌గా వచ్చి సడన్ బ్రేక్ వేశాడు. ‘ఎందుకు అంత స్పీడ్? ఇది వీధి కదా.. కొంచెం నెమ్మదిగా వెళ్లొచ్చు కదా.. అని ప్రశ్నించా..అంతే ఆ యువకుడు రెచ్చిపోయి.. ‘నేను పవన్ కల్యాణ్ తాలూకా.. నీవెవ్వడివిరా నన్ను ప్రశ్నస్తున్నావ్? నేను తలచుకుంటే లేపేస్తా’ అంటూ దౌర్జన్యం చేశాడని డాక్టర్ రియాజ్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశాడు. స్పీడ్ బ్రేకర్లు వేసుంటే సమస్యే ఉండేది కాదు.. ఈ ప్రాంతంలో ఓ వైపు మరిడిమాంబ ఆలయం.. కొంత దూరంలో యాసీన్ బాబా దర్గా ఉన్నాయి. ఇటు మరిడిమాంబ ఆలయానికి వెళ్లే భక్తులు, యాసీన్ బాబా దర్గాకు వచ్చే ముస్లింలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఇటు గుండానే వెళ్తుంటారు. ద్విచక్ర వాహన చోదకులు స్పీడ్‌గా వెళ్తున్న నేపథ్యంలో స్పీడ్ బ్రేకర్లు వేయాలని జీవీఎంసీ జోనల్ కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని డాక్టర్ రియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. -
నీ నటన సూపర్ బాబు,పవన్ ను ఏకిపారేసిన కేఏ పాల్
-
నీ నటన సూపర్.. బాబు,పవన్ ను ఏకిపారేసిన కేఏ పాల్
-
గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
పవన్ కల్యాణ్‌పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
సంగారెడ్డి జిల్లా: ముస్లింలు ఉగ్రవాదులు అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసు స్టేషన్లో ముస్లిం యువకులు ఫిర్యాదు చేశా రు. మంగళవారం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఖాజా ఆధ్వర్యంలో ఎస్.ఐ కాశీనాథ్‌కు వారు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వందశాతం ముస్లింలు ఉగ్రవాదులే అని పవన్ కల్యాణ్ ద్వేషపూరిత ప్రకటన చేశారని ఇస్లాంకు ఉగ్రవాదంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇస్లాం శాంతి, ప్రేమకు సంబంధించిన మతమన్నారు. ముస్లింల గుర్తింపు అయిన టోపీలు, గడ్డాలు, కుర్తాలు, స్కార్ప్‌లను పవన్ కల్యాణ్ ఉగ్రవాదానికి చిహ్నాలుగా ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆయనపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. -
పవన్, విజయ్ ఇద్దరూ ఒక్కటే.. అవగాహన శూన్యం: ప్రకాష్‌రాజ్
తమిళగ వెట్రి కళగం నేత విజయ్, జనసేన నేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌లను ఉద్దేశించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు. ఓ తమిళ పత్రికలో ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముందుగా చైన్నెలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను ప్రకాష్ రాజ్ కలవడం గమనార్హం. పవన్ కల్యాణ్, విజయ్‌లకు ఇద్దరికీ ప్రజా సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు.టాలీవుడ్ స్టార్ హీరో అయిన చిరంజీవి కుటుంబం నుంచి పవన్ రాజకీయాల్లోకి వచ్చారని, ఆ అభిమానులు మాత్రమే పార్టీ కార్యకర్తలుగా మారారని గుర్తుచేశారు. విజయ్ కూడా తమిళ్లో అగ్రహీరో ఆపై ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కుమారుడు కావడం కలిసొచ్చిందన్నారు. విజయ్‌కు ఎలాంటి గుర్తింపు లేనప్పుడే ఆయన ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. అయితే, పవన్ కొన్నేళ్ల క్రితమే రాజకీయాల్లోకి వస్తే.. విజయ్ మాత్రం ఇప్పుడే సినిమాల నుంచి రాజకీయ ప్రవేశం చేశారన్నారు.విజయ్, పవన్‌లతో తాను చాలా సినిమాల్లో నటించానని ఆ సమయంలో వారిద్దరిలో ఎవరూ కూడా రాజకీయాల గురించి అస్సలు మాట్లాడింది లేదన్నారు. పవన్ వచ్చి పది సంవత్సరాలు అయిందని ఆయనకు దీర్ఘదృష్టి కానీ, ప్రజా సమస్యలపై అవగాహన కానీ ఉన్నట్లు తాను ఎప్పుడూ గమనించలేదన్నారు. ఆయనలో ఆవేశం తప్పా ఎలాంటి విజన్ లేదు. కాబట్టే రోజుకొక పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేశారన్నారు. మార్పు కోసం అంటూ రాజకీయాలలోకి వస్తున్న వారు తమ ఇమేజ్ను పక్కనబెట్టి ప్రజల్లోకి వచ్చి గెలుపును సొంతంగా అందుకోవాలన్నారు. విజయ్‌కు ఉన్న ఇమేజ్ కారణంగా తమిళనాట కొన్ని స్థానాలు దక్కవచ్చన్నారు. గెలుపు వచ్చిన తర్వాత ప్రజల్లో తమ సత్తా ఏంటో వారిద్దరూ నిరూపించుకోవాలని ఆయన సూచించారు. అయితే, వచ్చే ఎన్నికల్లో విజయ్‌కు ఉన్న ఇమేజ్ వల్ల ఆయన పార్టీకి కొన్ని సీట్లు దక్కే అవకాశం ఉందన్నారు. -
పవన్ 'హరిహర వీరమల్లు'.. అంతా ఓటీటీ దయ!
పవన్ కల్యాణ్.. 'హరిహర వీరమల్లు' షూటింగ్ ఎట్టకేలకు ముగించారు. అప్పుడెప్పుడో 2020 జనవరిలో మొదలైతే.. దాదాపు ఐదేళ్ల తర్వాత తాజాగా మంగళవారంతో తొలి భాగం చిత్రీకరణ పూర్తయింది. దీంతో ఇప్పుడు రిలీజ్ డేట్ పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ విడుదల ఎప్పుడు ఉండొచ్చు?(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!)క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' షూటింగ్ 2020 జనవరిలో మొదలైంది. తర్వాత కొన్నిరోజులకే లాక్ డౌన్ రావడం, తర్వాత ఎన్నికలు, పవన్ ఎమ్మెల్యేగా గెలవడం.. ఇలా పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ అలా అలా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు మమా అనిపించారు.లెక్క ప్రకారం ఈ మే 9న థియేటర్లలోకి సినిమా వస్తుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు రావట్లేదని క్లారిటీ వచ్చేసింది. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దగ్గర మే 30 తేదీ వినిపించింది. కానీ ఈ తేదీకి కూడా రావడం కష్టమేనేమో అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ఓటీటీ హక్కుల్ని దక్కించుకున్న అమెజాన్ సంస్థ.. మే 30 తేదీపై పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. జూన్ రెండో వారం అని అంటోంది.(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)ప్రస్తుతానికైతే విడుదల తేదీపై చర్చలు జరుగుతున్నాయి. ఏదనేది ఓటీటీ సంస్థ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం చాలా తెలుగు సినిమాలు.. ఇలా ఓటీటీ సంస్థ చెప్పినదానిబట్టి రిలీజ్ చేస్తుండటమే దీనికి కారణం అని చెప్పొచ్చు.మరోవైపు పవన్ సినిమా వచ్చే దానిబట్టి విజయ్ 'కింగ్డమ్' రిలీజ్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేయాలని ఫిక్సయ్యారు. కానీ పవన్ వస్తే మాత్రం తప్పుకోవడం గ్యారంటీ. మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: మంచం పట్టిన 'బలగం' నటుడు.. ప్రస్తుతం దీనస్థితిలో) -
పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన వంగా గీతా
-
జనసేన కార్యకర్త కుటుంబాన్ని పట్టించుకోని పవన్
-
Garam Garam Varthalu: గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్..
-
కార్యకర్త చనిపోతే పట్టించుకోని పవన్.. దళితులంటే చిన్నచూపా
-
పవన్ మర్చిపోవచ్చు.. మోదీ కూడా యూటర్న్!
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత దేశ ప్రధానిగా ఎన్నికైన తొలి నాళ్లలో అందరికీ నరేంద్ర మోదీ అంటే బాగా గౌరవం ఉండేది. కానీ, కాలం గడిచే కొద్ది ఆయనలో రాజనీతిజ్ఞుడు బదులు ఫక్తు రాజకీయవేత్త కనిపిస్తున్నారు. సొంత అవసరాలకోసం అవకాశవాద రాజకీయాలు చేసే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ప్రధాని మోదీకి పెద్ద తేడా లేదేమో అన్న అభిప్రాయం కలిగేలా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది.అమరావతి పనుల పునః ప్రారంభానికి మోదీ ఏపీకి వచ్చిన సందర్భంలో జరిగిన సభ, ఆయనతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల స్పీచ్ గమనిస్తే, ప్రజలను మభ్య పెట్టడానికి ఒకరికొకరు పోటీ పడినట్లు కనిపిస్తుంది. దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఒక విధంగా తండ్రి పాత్రలో ఉన్నట్లు లెక్క. కుటుంబంలోని పిల్లలు ఎవరైనా తప్పుడు మార్గంలో ఉంటే తండ్రి ఏ రకంగా మందలిస్తారో, అదే రీతిలో మోదీ కూడా రాష్ట్రాలలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపి అలా చేయవద్దని చెప్పాలి. కానీ, దురదృష్టవశాత్తు, అందుకు విరుద్దంగా ఆయన కూడా అల్లరిచేసే పిల్లాడిని గారాబం చేసినట్లు వ్యవహరిస్తున్నారన్న సందేహం వస్తుంది.ఏపీలో ఇప్పటికే పలుమార్లు శంకుస్థాపనలు జరిగిన అమరావతిలో.. అందులోనూ తానే గతంలో ఒకసారి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి మళ్లీ వచ్చి అదేమీ తప్పు కాదన్నట్లు ఉపన్యసించి వెళ్లారు. దేశంలో కొత్తగా వచ్చిన రాష్ట్రాలలో ఏర్పడిన రాజధానులలో అవసరమైన భవనాల నిర్మాణాలకు ఎంత ఖర్చు అయింది మోదీకి తెలిసే ఉండాలి. ఎన్ని వేల ఎకరాల భూమి ఆ రాష్ట్రాలు సేకరించాయన్న సమాచారం ఆయన వద్ద ఉండి ఉండాలి. ఏపీ తప్ప మిగిలిన కొత్త రాష్ట్రాలలో లక్ష ఎకరాల భూమి సమీకరించలేదు. ఆ రాష్ట్రాలలో నేతలు తామే నగరాలు నిర్మిస్తామని చెప్పి, రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చలేదు. కానీ ఏపీలో మాత్రం తొలుత ఏభైమూడువేల ఎకరాలు సిద్దం చేసుకుని, తిరిగి ఇంకో 44వేల ఎకరాలు తీసుకుంటామని చెబుతుంటే మోదీ వారించనవసరం లేదా?.అసలు ఇంత భూమి తీసుకుని ఏమి చేస్తారు?. మూడు పంటలు పండే పచ్చటి పొలాలను ఎందుకు ఈ స్థాయిలో తీసుకుంటున్నారు? అని అడగాలా?లేదా?. తెలంగాణలో 400 ఎకరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో అభివృద్ది పనులు చేపట్టాలని తలపెడితే, పర్యావరణం దెబ్బతినిపోయిందని గగ్గోలు పెట్టిన ఆయన లక్ష ఎకరాలలో పర్యావరణ విధ్వంసానికి ఎందుకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా?. అలా చేయకపోగా తగుదునమ్మా అంటూ ఆ పర్యావరణ విధ్వంసంలో తాను కూడా భాగస్వామి అవడం మోదీ ప్రత్యేకత అనుకోవాలి. ఇదే అమరావతికి సంబంధించి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును ఏ స్థాయిలో మోదీ విమర్శించారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవినీతి కోసమే పధకాలను తయారు చేస్తున్నారని, రాజధాని నుంచి అన్నిటా అవినీతి రాజ్యమేలుతోందని చంద్రబాబుపై ధ్వజమెత్తిన మోదీ, ఇప్పుడు చంద్రబాబు గొప్ప పని చేస్తున్నారని మెచ్చుకోవడం అవకాశవాదం అవ్వదా?.అమరావతి ఏపీకి ఒక శక్తి అవుతుందని అన్నారు. నిజంగా అలా జరిగితే ఎవరూ కాదనరు. కానీ, అదెలా సాధ్యం?. అందుకోసం అయ్యే లక్షల కోట్ల వ్యయం ఎక్కడ నుంచి వస్తుందో మోదీ చెప్పాలి కదా!. ఏపీ ప్రభుత్వం సుమారు లక్ష కోట్ల పనులు చేపడుతోందని మంత్రి నారాయణ ప్రకటించారు. గతంలో 33వేల ఎకరాల భూమిలో మౌలిక సదుపాయాల కల్పనకు లక్షాతొమ్మిదివేల కోట్ల రూపాయలు అవసరం అని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. ఆ లేఖను మోదీ సర్కార్ చెత్తబుట్టలో పడేసినట్లుగా పక్కనబెట్టేసి కేవలం 2500 కోట్ల రూపాయలు మాత్రం మంజూరు చేసింది. తాజాగా 2024 ఎన్నికలలో మళ్లీ స్నేహం కుదిరింది కనుక మోదీ, చంద్రబాబు ఒకరినొకరు పొగుడుకుంటూ జనాన్ని పిచ్చోళ్లను చేస్తున్నారు. చంద్రబాబును యూటర్న్ బాబు అని, పోలవరం, అమరావతిలను ఏటీఎంల మాదిరి వాడుకుంటున్నారని గతంలో ధ్వజమెత్తిన మోదీ.. ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయడంలో చంద్రబాబుకు అనుభవం ఉందని అంటున్నారు. మోడీ కూడా యూటర్న్ తీసుకున్నట్లే కదా!.ప్రస్తుతం లక్ష కోట్లు వ్యయం చేస్తామని చెబుతున్న ఏపీ ప్రభుత్వానికి ఆ మొత్తం కేంద్రం నుంచి వచ్చే అవకాశమే లేదు. అదంతా రుణమే. అంటే అమరావతిని అప్పుల చిప్పగా మార్చుతున్నారన్నమాట. అమరావతి సభలో ఒక్క నయాపైసా కూడా కొత్తగా ఇస్తున్నట్లు మోదీ చెప్పలేదు. ఇదంతా అయ్యే పని కాదని, లక్షల కోట్ల అప్పు భారం ఏపీ ప్రజలపై పడుతుందని తెలిసి కూడా మోదీ మాట మాత్రం కూడా హెచ్చరించకపోవడం దారుణంగా ఉంటుంది. ఇప్పటికే ఒక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు ఉన్నాయి కదా!. మళ్లీ ఆ స్థాయిలో నిర్మాణాలు చేపట్టవలసిన అవసరం ఏమిటి అని ప్రధాని హోదాలో ప్రశ్నించలేదు.అంతేకాదు.. కేవలం రెండువేల మంది పనిచేసే సచివాలయానికి ఏభై, నలభై అంతస్తుల టవర్లు దేనికి అని అడగలేదు. ఏపీలో కూటమి నేతలు కోరగానే వాటికి మరోసారి శంకుస్థాపన చేసేశారు. దీనిపై సోషల్ మీడియాలో చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ జరగాలన్న పిచ్చి కవిత్వాన్ని ప్రస్తావిస్తూ ఎద్దేవ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున కూడా చిన్న, చిన్న రోడ్ల విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేసి అవేదో చాలా పెద్ద పనులు అన్నట్లుగా పిక్చర్ ఇచ్చే ప్రయత్నం జరిగినట్లు అనిపిస్తుంది. మండుటెండలో లక్షల సంఖ్యలో జనాన్ని బలవంతంగా అధికార యంత్రాంగం ద్వారా తరలించి వందల కోట్లు ఖర్చు చేయడం మినహా ఏమీ ప్రయోజనం జరిగిందన్నది ప్రశ్నగా ఉంది.సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రజలను మోసం చేస్తున్న నేపధ్యంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలలో పెరుగుతున్న నిరసనను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు అనిపిస్తుంది. బీజేపీ కూడా కూటమిలో భాగస్వామి కనుక ప్రధాని కూడా ఒక పాత్ర పోషించారనుకోవాలి. చంద్రబాబు తన ప్రసంగంలో మోదీని ఆకాశానికి ఎత్తివేశారు. ఒకప్పుడు మోదీ అంత అవినీతిపరుడు లేడన్న నోటితోనే, మోదీ ప్రపంచంలోనే పవర్ పుల్ నేత అని, 2047 నాటికి వికసిత్ భారత్ ఆయన వల్లే సాధ్యమని చెబుతున్నారు. 2047 నాడికి మోదీకి 96 ఏళ్లు వస్తాయి. అప్పటి వరకు ఆయనే దేశానికి సారధ్యం వహించడం సాధ్యమేనా అని ఎవరు అడుగుతారు!. మరో పదిహేనేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పొగిడినట్లే ఇది కూడా ఉంది. మోడీ ఒకటి, రెండు అంశాలలో చంద్రబాబును పొగిడినా, మరీ అతి చేయలేదు.కానీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు మాత్రం హద్దులు లేకుండా పొగిడారు. ఒకరకంగా నమో సంకీర్తన చేశారనిపిస్తుంది. పోనీ ఇంతగా పొగిడితే పొగిడారులే.. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, ఇతర హామీల విషయంలో మోదీకి ఏమైనా విజ్ఞప్తి చేస్తారేమోలే అని ఆశించినవారికి మాత్రం ఆశాభంగమే ఎదురైంది. అమరావతికి లక్ష కోట్ల అప్పు చేస్తున్నాం.. ఇందులో మీరు ఇంత శాతం భరించండి .. అని అడగలేదు. ప్రత్యేక హోదా ఊసే లేదు. అసలు ఈ నేతలెవ్వరూ లక్ష కోట్ల అప్పు చేస్తున్న విషయాన్నే ప్రజలకు చెప్పకుండా దాటవేయడంలోనే కుట్ర ఉందనిపిస్తుంది. ఒకపక్క భారీ ఎత్తున పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ, లక్షల కోట్లను కేవలం 30 గ్రామాలలో వ్యయం చేస్తూ ఆర్ధిక విధ్వంసానికి పాల్పడుతున్న చంద్రబాబు.. గత జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందని విమర్శించారు.చంద్రబాబు ప్రభుత్వం 2014 టర్మ్‌లో నిర్మించిన అసెంబ్లీ, సచివాలయం తదితర నీరు కారే భవనాలను ఏమైనా జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందా?. ఉన్నవాటిని వాడుకుందాం.. విశాఖ కార్యనిర్వాహణ రాజధాని అయితే పదివేల కోట్లతో గ్రోత్ ఇంజన్ అవుతుంది అని జగన్ చెబితే విధ్వంసం అని తప్పుడు ప్రచారం చేశారు. అప్పట్లో అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరం అని ప్రచారం చేసిన చంద్రబాబు ఈ సభలో ఆ మాట ఎందుకు అనలేకపోయారు. ఖర్చుకు అవసరమైన నిధులు ఎలా సేకరిస్తున్నది, దాని భారం ప్రజలపై ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలను వివరించలేకపోయారు. పైగా మూడేళ్లలో లక్ష కోట్ల పనులు పూర్తి చేస్తామని అనడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. దానికి ఎంతో యంత్రాంగం అవసరం అవుతుంది. ఏ ప్రభుత్వం అయినా ఏడాదికి ఒక ప్రాజెక్టుకు ఐదువేల నుంచి పదివేల కోట్లు వ్యయం చేయగలిగితే గొప్ప. కానీ, ఏడాదికి 33 వేల కోట్ల చొప్పున ఖర్చు చేయడం అంటే అందులో మతలబు ఉన్నట్లే అవుతుంది. ఆయా పనుల రేట్లు డబుల్ చేసి కాంట్రాక్టర్లకు మేలు చేస్తారేమో తెలియదు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో రాజధానిపై ఏ విమర్శలు చేసింది మర్చిపోయి మాట్లాడారు. పనిలో పని చంద్రబాబును గొప్పగా పొగిడి మార్కులు తెచ్చుకున్నారు. లోకేష్ అయితే విభజన తర్వాత హైదరాబాద్ నుంచి తరిమేశారని చెప్పి నవ్వులపాలయ్యారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడి రాత్రికి రాత్రి చంద్రబాబు విజయవాడ వెళ్లిపోయిన సంగతిని అంతా గుర్తు చేసుకుంటున్నారు. విశేషం ఏమిటంటే బాబు, లోకేష్, పవన్‌లు పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించి తన నాయకత్వం గురించి విశేషంగా పొగిడినా, మోదీ మాత్రం ఆ ప్రస్తావనే తేలేదు.అలాగే జగన్ ప్రభుత్వాన్ని వారు విమర్శించినా, మోదీ మాత్రం అందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏతావాతా చెప్పవచ్చేదేమిటంటే, అమరావతి పనుల పునఃప్రారంభ సభ నిర్వహణకు, పబ్లిసిటీకి వందల కోట్లు ఖర్చు అయినా, ఆ మందం అయినా ఏపీ ప్రజలకు మేలు జరగలేదన్న భావనే కలుగుతుంది. కాకపోతే, పవన్‌కు మోదీ నుంచి ఒక చాక్లెట్ లభించింది. ఆయనకు అదే మంచి లడ్డూ అనుకోవాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సింహాచలం బాధితుల్ని పరామర్శించకుండా మొహం చాటేసిన చంద్రబాబు, పవన్
-
పిఠాపురంలో పవన్ ఇల్లు క్లోజ్!
-
పవన్ భూతులకు భయపడి చాక్లెట్ ఇచ్చారు
-
Big Question: మన రాజధానికి అడ్డెవరు? ప్రధాని ముందే పచ్చి అబద్దాలు
-
పొగడ్తలేనా.. ప్రయోజనాలు పట్టవా..!
-
దేశాభివృద్ధికి ఏపీని ఇంజన్‌గా చేస్తాం
సాక్షి, అమరావతి : ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీ భుజంతో పాటు నా భుజం కలిపి పనిచేస్తా. రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ యువకుల కలలను నిజం చేసేందుకు అంకిత భావంతో పనిచేస్తామని హామీ ఇస్తున్నా’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమరావతి పునఃప్రారంభంలో భాగంగా రూ.58 వేల కోట్ల విలువైన పనులకు ప్రధాని శుక్రవారం శంకుస్థాపన చేశారు. వెలగపూడిలోని సచివాలయం వెనుక భాగంలో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడుతూ తల్లి దుర్గాభవాని కొలువైన పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం ఆనందంగా ఉందన్నారు. ‘దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కాదు. ఏపీ ఆశలకు, వికసిత్ భారత్ ఆశయాలకు బలమైన పునాది. ఈ సందర్భంగా వీరభద్రస్వామికి, అమరలింగేశ్వరస్వామికి, తిరుపతి వెంకన్న పాదాలకు నమస్కరిస్తూ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. ప్రసంగాన్ని తెలుగులోనే ప్రారంభించిన ప్రధాని మోదీ మధ్యలో కొన్ని తెలుగు వాక్యాలు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. పదేళ్లుగా చేయూతనిచ్చాం... ఇంద్రుడి రాజధాని అమరావతి.. ఏపీ రాజధాని అమరావతి. ప్రతి యువకుడి కలలు నిజమయ్యే నగరంగా అమరావతి తయారవుతోంది. ఐటీ, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీస్, విద్య, ఆరోగ్య రంగాల్లో రానున్న రోజుల్లో అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా నిలవబోతోంది. 2015లో అమరావతికి శంకుస్థాపన చేశా. ఈ పదేళ్లలో అమరావతికి అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతు ఇచ్చాం. వికసిత్ ఏపీ కోసం నాడు ఎన్టీఆర్ కలగన్నారు. మనందరం కలసి అమరావతి, ఏపీని వికసిత్ భారత్ దేశానికి గ్రోత్ ఇంజన్‌గా తయారు చేయాలి. రైలు, రోడ్డు ప్రాజెక్టులకు రూ.వేల కోట్లు.. రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం రూ.వేల కోట్లు అందిస్తోంది. దీనివల్ల ఏపీలో జిల్లాల మధ్య అనుసంధానం, పక్క రాష్ట్రాలతో కనెక్టివిటీ మెరుగుపడుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు, పర్యాటకం పెరిగేందుకు దోహదం చేస్తుంది. రేణిగుంట నుంచి నాయుడుపేట మధ్య నిర్మిస్తున్న కొత్త హైవే వల్ల తిరుపతి వెంకన్నను తక్కువ సమయంలో దర్శించుకోవచ్చు. రైల్వే బడ్జెట్లో ఉమ్మడి రాష్ట్రానికి రూ.900 కోట్లకు మించి కేటాయింపులుండేవి కావు. ఇప్పుడు విభజిత ఏపీకి రూ.9 వేల కోట్లకు పైగా అందిస్తున్నాం. ఏపీలో వంద శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసుకున్నాం. 8 సరికొత్త వందేభారత్ రైళ్లు ప్రారంభించాం. 750కిపైగా రైల్వే ఫ్లైఓవర్లు, అండర్ పాసేజ్‌లు నిర్మించాం. 70కిపైగా రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ కింద అభివృద్ధి చేశాం. నాలుగు స్తంభాలు కేంద్ర బిందువుగా పేదలు, రైతులు, యువత, మహిళాశక్తి.. ఈ నాలుగు స్తంభాలపై వికసిత్ భారత్ నిర్మాణం ఆధారపడి ఉంటుంది. రైతులపై భారం పడకుండా పదేళ్లలో ఎరువుల సబ్సిడీ కోసం రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) ద్వారా ఒక్క ఏపీలోనే సుమారు రూ.5,500 కోట్ల బీమా పరిహారం అందించాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం (పీఎం కిసాన్) ద్వారా రాష్ట్రంలో రైతులకు రూ.17,500 కోట్ల మేర పెట్టుబడి సాయం అందించాం. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహాయ సహకారాలు అందిస్తాం. నవదుర్గా మిస్సైల్ లాంచ్ కేంద్రం.. అంతరిక్ష శక్తిగా దేశం అవతరించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. శ్రీహరికోట నుంచి లాంచ్ అయ్యే ప్రతీ రాకెట్ కోట్లాది మంది భారతీయులు గర్వించేలా చేస్తుంది. కోట్లాది మంది దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో డీఆర్డీవో నవదుర్గా మిస్సైల్ లాంచింగ్ రేంజ్‌కు శంకుస్థాపన చేశాం. నాగాయలంకలో నిర్మించబోయే ఈ కేంద్రం కనక దుర్గమ్మలా దేశ రక్షణకు నిరంతరం శక్తిని ఇస్తుంది. దేశవ్యాప్తంగా ఏక్తా మాల్స్ నిర్మించబోతున్నాం. ఇందులో ఒకటి విశాఖపట్నంలో నిర్మించేందుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా హస్తకళాకారుల ఉత్పత్తులు ఒకే చోటకు తెచ్చేందుకు వీలుంటుంది.21న విశాఖలో యోగా దినోత్సవం.. జూన్ 21న విశాఖలో నిర్వహించే యోగా దినోత్సవానికి నన్ను ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఆరోజు ప్రపంచ ప్రజలంతా ఏపీ వైపు చూసేలా చేయాలి. అందుకోసం ఈ 50 రోజుల్లో ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి ఇంట్లో యోగాకు ప్రాముఖ్యత కల్పించేలా, వరల్డ్ రికార్డు సాధించేలా కృషి చేయాలి. ఏపీలో కలలు గనే వారి సంఖ్య తక్కువేమీ కాదు. వాటిని నిజం చేసే వారూ తక్కువేమీ లేరు. మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తామంటున్నారు. అమరావతి పనులు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జీడీపీ ఏ స్థాయిలోకి దూసుకెళ్తుందో ఊహించగలను.ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలబెడతాం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్అమరావతి ఆర్కిటెక్చరల్ జోన్‌గా, కాంక్రీట్ జంగిల్‌గా మిగిలిపోకుండా జవాబుదారీతనంతో ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పాలనలో అమరావతి వరల్డ్ క్లాస్ రాజధానిగా ఎదుగుతుందన్నారు. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును, ప్రజల ఆకాంక్షలను దివిసీమ ఉప్పెన మాదిరి తుడిచి పెట్టాలని చూసిందని విమర్శించారు. అమరావతితో పాటు రాష్ట్రాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో అమరావతిని నిలబెట్టాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్టు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు.కక్షతో నిలిపేశారు: మంత్రి లోకేశ్ సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే అమరావతి నిర్మాణాన్ని నిలిపివేశారని మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ విమర్శించారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు కాలం గడిపేసిందన్నారు. మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని అపే దమ్ము ఎవరికీ లేదన్నారు. నరేంద్ర మోదీ అనే మిస్సైల్ ఉండగా వందల పాకిస్తాన్‌లు వచ్చినా భారత్‌ను ఏమీ చేయలేరన్నారు.మూడేళ్లలో నిర్మిస్తాంమోదీ ఆశీస్సులతోనే అమరావతి పనులు పట్టాలెక్కించాం: సీఎం చంద్రబాబు ప్రపంచంలోనే శక్తిమంతమైన నాయకుడు మోదీ 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం సాక్షి, అమరావతి: అమరావతి పనులను మూడేళ్లలో పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా కొత్త రాజధానిని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా అమరావతిని నిర్మించి ప్రపంచ పటంలో నిలబెడతామన్నారు. శుక్రవారం ‘అమరావతి పునః ప్రారంభ’ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 2015లో ప్రధాని మోదీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం విధ్వంసం చేసిందని విమర్శించారుగత పది నెలల్లో కేంద్ర సహకారం, మోదీ ఆశీస్సులతో అమరావతి పనులను పట్టాలెక్కించామన్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని క్వాంటం వ్యాలీ సిటీగా మారుస్తామన్నారు. కేంద్రం సహకారంతో 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో ఐదు కోట్ల ఆంధ్రులు ప్రధాని మోదీకి మద్దతుగా ఉంటారన్నారు. మోదీ నాయకత్వంలో మనదేశం ప్రపంచంలో గొప్ప శక్తిగా ఆవిర్భవిస్తోందన్నారు. -
పవన్ కల్యాణ్ హీరోగా కొత్త చిత్రం.. సాంగ్ రిలీజ్ చేసిన తండేల్ డైరెక్టర్
పవన్ కల్యాణ్ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త సినిమా 'ఏ స్టార్ ఈజ్ బార్న్'. ఈ సినిమా ద్వారా ప్రియా పాల్, నేహా శర్మ, ఊహ రెడ్డి హీరోయిన్లుగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఈ సినిమాకు వీజే సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. సీఆర్ ప్రొడక్షన్స్, వీజే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రవి సాగర్, వీజే సాగర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని "నా గతమే' అనే పాటను తండేల్ మూవీ డైరెక్టర్ చందు మొండేటి విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ... "నా గతమే సాంగ్ బాగుంది. పోస్టర్స్, ప్రోమోస్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ కావడంతో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. కాగా.. ఈ సినిమాను తెలంగాణలోని వనపర్తి, కొల్లాపూర్, సోమశిల, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో దాదాపు 93 మంది కొత్త నటీనటులు ఉండడం విశేషం. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర టీజర్, ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. -
ప్రధాని సభలో ఏపీ హక్కులపై బాబు, పవన్‌లు మౌనం
అమరావతి: అమరావతి పునః ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఏపీకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట.. రాష్ట్ర హక్కులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు మౌనం పాటించారు. రాష్ట్ర విభజన నాటి ఏపీ హక్కుల గురించి ప్రధాని మోదీ వద్ద.. వీరు కనీసం ప్రస్తావించలేదు. కేవలం ప్రధాని మోదీపై పొగడ్తల వర్షం కురిపించిన బాబు.. విభజన సమస్యల పరిష్కారం అంశానికి సంబంధించి మోదీ నుంచి ఎటువంటి ప్రకటన చేయించలేకపోయారు.విభజన హామీలు పెండింగ్ లో ఉన్నందను చంద్రబాబు, పవన్‌లు కనీసం మోదీ వద్ద ఆ ప్రస్తావన తెచ్చి ఉంటే బాగుండేది. కానీ వారు ఆ పని చేయలేదు. అమరావతిని రీలాంచ్ చేసే కార్యక్రమం వరకే పెట్టుకున్నట్లే చంద్రబాబు, పవన్‌ల ధోరణి కనబడింది. ప్రధాని బ్లెస్సింగ్స్ కావాలన్నారే కానీ ఏపీ హక్కుల కోసం మాత్రం అడగలేదు చంద్రబాబు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ, పోలవరం ఎత్తు తగ్గింపుపై స్పష్టత తదితర అంశాలు మోదీ వద్ద చంద్రబాబు, వవన్‌లు ప్రస్తావించలేదు.అమరావతి రీలాంచ్ కార్యక్రమంలో భాగంగా కొత్తగా మరో శిలాఫలకాన్ని ఆవిష్కరించారే కానీ, విభజన నాటి ఏపీ హక్కుల గురించి మాత్రం మోదీ ప్రసంగంలో కానీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ప్రసంగంలో కానీ కనీసం మచ్చుకైనా కనిపించకపోవడం గమనార్హం.పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు -
KSR: చంద్రబాబు సర్కార్ భూదాహానికి వంత పాడుతున్న ఎల్లో మీడియా
-
పవన్ గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బొత్స దిమ్మతిరిగే సమాధానం
-
అక్షయపాత్ర అమరావతి ఎవరి కోసం ? పవన్ తో పాటు లోకేష్ ఫోటో కారణం ఇదేనా!
-
పరామర్శకూ తీరికలేదా బాబూ!
సింహాచలం అప్పన్న ఆలయంలో హాహాకారాలు.. మృత్యు ఘోష.. ఎవరికైనా బాధనిపిస్తుంది. కాని ఆంధ్రప్రదేశ్ సర్కారుకు మాత్రం అవేమీ పట్టినట్లు లేదు. కూటమి నేతలందరూ అమరావతి సంబరంలో మునిగి తేలుతున్నారు. పలుమార్లు శంకుస్థాపనలు జరిగిన అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇంకోసారి శంకుస్థాపన చేయిస్తున్నారు.సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలి అయింది సామాన్యులే.. అమరావతి హంగామాతో తీవ్రంగా నష్టపోతున్నదీ పేదలే. హిందూ మతంలో ఒక నమ్మకం ఉంటుంది. ఏదైనా ఒక కుటుంబంలో అశుభం జరిగితే నిర్దిష్టంగా కొన్నాళ్లపాటు ఎలాంటి శుభ కార్యక్రమాలు జరపరు. హిందూ మతోద్దారకులమని ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సనాతన హిందూ అని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. శంకుస్థాపన కార్యక్రమాలను వాయిదా వేసుకోలేదు. పాలకులు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కుటుంబంలా పరిగణిస్తారు. ఆ ప్రకారం చూస్తే ఒక ప్రముఖ ఆలయంలో జరిగిన ఈ దుర్ఘటనలో కొత్తగా కట్టిన గోడ కూలి ఏడుగురు మరణించినా తమ ప్రోగ్రాం ఆపుకోవడానికి ఇష్టపడలేదు. సింహాచలం మృతుల కుటుంబాలను పరామర్శించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు వెళ్లలేదు.అంటే వారికి ఏదో అనుమానం ఉండబట్టే అటువైపు వెళ్లకుండా ఉన్నట్లు అనిపిస్తుంది.మామూలుగా అయితే ఒక ప్రసిద్ద పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు సంభవిస్తే వెంటనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు అంతా వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించి బాధితులకు స్వాంతన చేకూర్చడానికి యత్నిస్తారు. కాని వీరిద్దరూ ఆ పని చేయలేదు. కొద్ది నెలల క్రితం వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల కోసం తిరుపతి వెళ్లిన వేలాది భక్తులు తొక్కిసలాటకు గురయ్యారు. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఆ తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆ సమాచారం వచ్చిన వెంటనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పోటీ పడి తిరుపతి వెళ్లారు.ఏదో చేస్తున్నట్లు హడావుడి చేశారు. అలాంటి వారు సింహాచలం ఎందుకు వెళ్లలేదు? ప్రధాని మోడీ అమరావతి వస్తున్నందున వెళ్లలేక పోయారని చెప్పవచ్చు కానీ మూడు గంటల ఖాళీ కూడా లేదనడం అతిశయోక్తి అవుతుంది. పైగా ఇప్పుడు వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ నుంచైనా పర్యవేక్షణ చేయవచ్చు. పవన్ కళ్యాణ్ కు ఆ ఇబ్బంది లేదు కదా?మరి ఆయన ఎందుకు సింహాచలం వెళ్లలేదు? దీనికి రెండు,మూడు కారణాలు చెబుతున్నారు. అక్కడకు వెళ్లితే భక్తులలో ఉన్న కోపం అంతా తమపై చూపే అవకాశం ఉందని, వారు ప్రభుత్వ నిర్వాకంపై నిలదీస్తే ఇబ్బంది అవుతుందని అనుకుని ఉండవచ్చ అంటున్నారు. అమరావతి పునః శంకుస్థాపన పనుల పేరుతో తప్పించుకునే అవకాశం ఉండడం. మరొకటి చావుల వద్దకు వెళ్లి రావడం అశుభం అని ఎవరైనా సలహా ఇచ్చారేమో తెలియదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు నిజంగానే హిందూ మతాచారాలపై అంత శ్రద్దగా ఉంటారా అంటే అదీ గ్యారంటీ లేదు. ఏ మతం వారివద్దకు వెళ్లితే ఆ మతమే గొప్పదని చెప్పి వస్తుంటారు. రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటారు.గత గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు కుటుంబం స్నానమాచరించే ఘట్టాన్ని సినిమా తీయడం కోసం సామాన్య భక్తులను నిలిపి వేయడం, ఒక్కసారిగా గేటు తెరవడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించడం జరిగింది. అప్పుడు చంద్రబాబు తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో యత్నాలు చేశారు. చివరికి రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలో చనిపోలేదా? అంటూ వితండ వాదం చేశారు. అంతే తప్ప అంత పెద్ద ఘటన జరిగితే మామూలుగా అయితే పదవి నుంచి తప్పుకుంటారు. ప్రాంతీయ పార్టీ కనుక ఆయనను పార్టీలో ఎవరూ ప్రశ్నించరు కనుక ఆ ప్రస్తావనే ఉండదు. పోనీ కనీసం ఒక కానిస్టేబుల్ పై కూడా చర్య తీసుకోకపోవడం విశేషం. తిరుపతి తొక్కిసలాట ఘటన జరిన తర్వాత పవన్ కళ్యాణ్ క్షమాపణల డ్రామా తెలిసిన సంగతే.చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు ఏమి మాట్లాడింది అందరికి తెలుసు. అక్కడ చైర్మన్ లేదా, అధికారులపై చర్య తీసుకోలేదు. వారిని పదవుల నుంచి తప్పించలేదు. నిజంగా హిందూ మత విశ్వాసాలు నమ్మేవారైతే అలా చేస్తారా? అన్న విమర్శలను పలువురు చేశారు. చివరికి ఒక రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. గోదావరి పుష్కరాల మరణాలపై వేసిన కమిషన్ ఏ తరహా రిపోర్టు ఇచ్చిందో, తిరుపతి ఘటనపై కూడా రిపోర్టు అందుకు భిన్నంగా వస్తుందా అన్నది కొందరి సందేహం. పుష్కరాల తొక్కిసలాటలో తప్పు భక్తులదే అని ఆ కమిషన్ తేల్చింది. ఇప్పుడు సింహాచలం ఘటనపై కూడా విచారణ కమిటీని నియమించినా, ఎంతవరకు ప్రయోజనం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. గోడ కూలడానికి నాణ్యత లోపమని కాకుండా, భక్తుల రద్దీ, తోపులాట అని నివేదికలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఆలయాలలో ఏ చిన్న ఘటన జరిగినా, దాని వెనుక టీడీపీ, జనసేన రాజకీయ శక్తుల ప్రమేయం ఉన్నా, దానినంతటిని జగన్ కు ఆపాదించి ఎంత రచ్చ చేసేవారో గుర్తు చేసుకుంటేనే కంపరం కలుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం అదే ధోరణి ప్రదర్శించారు. తిరుమల లడ్డూ లో జంతు కొవ్వు కలిసిదంటూ దారుణమైన అసత్యాన్ని చంద్రబాబు, పవన్ లు ప్రజలకు చెప్పారు. దీనివల్ల కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, దైవానికి అపచారం చేసినట్లు అవుతుందని వారు ఫీల్ కాలేదు. తమ రాజకీయ ప్రయోజనం కోసం ఎంతకైనా దిగజారతామన్నట్లుగా వారు వ్యవహరించారు. ఈ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి తాను అన్ అప్పాలజిటిక్ సనాతన హిందూ అని ప్రకటించుకుని కొత్త వేషం కట్టారు.అసలు సనాతన హిందూయిజం ఏమి చెబుతుందో తెలియకుండానే, తానేదో వేద శాస్త్రాలు అన్నిటిని పుక్కిట పట్టినట్లుగా మాట్లాడారు. విశేషం ఏమిటంటే ఆయన భార్య విదేశీయురాలు. క్రైస్తవ మతానికి చెందిన వారు.అలాగే పవన్ కు పుట్టిన వారు సైతం క్రైస్తవమే తీసుకున్నారు. మరి అక్కడ ఈయన సనాతనమేమైందో తెలియదు. అనవసరంగా సినిమా డైలాగులు చదివితే ఇలాంటి అప్రతిష్టే వస్తుంది. చంద్రబాబు తన రాజకీయం కోసం ఏ మతాన్ని అయినా వాడుకోగలరు.ఆయన తెలివితేటలు వేరు.ఆయనను మించి ఏదో చేసి బీజేపీ వారి మెప్పు పొందాలని పవన్ చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల ఆయన పరువు పోగొట్టుకుంటున్నారు. పోనీ నిజంగానే అంత సనాతన హిందూ అయితే సింహాచలం ఎందుకు వెళ్లలేదు.ఒక సంతాప సందేశం ఇచ్చి వదలివేశారే.అమరావతి కార్యక్రమ ఆహ్వానంలో తన పేరు వేయలేదని మొదట అలిగారని, దాంతో ప్రభుత్వం మరో కార్డు వేసిందని చెబుతున్నారు. తన డిమాండ్ నెరవేరకపోతే ఏమైనా సింహాచలం వెళ్లేవారేమో. తిరుమల గోవుల మరణాలు, కాశీనాయన క్షేత్రంలో భవనాల కూల్చివేత, తిరుమల, బ్రహ్మం గారి మఠం తదితర ఆధ్యాత్మిక కేంద్రాలలో మత్తు పదార్ధాల వాడకం వంటి ఆరోపణలు వస్తున్నా ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టలేక పోతోందన్న విమర్శలు వస్తున్నాయి. సింహాచలంలో చందనోత్సవానికి ఐదుగురు మంత్రుల కమిటీ కూడా ఉందట. వారంతా ఏమి చేశారో తెలియదు. కాని గోడ కూలి ఏడుగురు మరణించారు. చిన్న ఆలయ గోడ నిర్మాణమే చేయలేని వారు రాజధాని నిర్మాణం చేస్తారట అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి.అదే టైమ్ లో జగన్ విజయవాడ వద్ద కృష్ణానదికి కట్టిన రిటైనింగ్ వాల్ ఏ రకంగా స్ట్రాంగ్ గా ఉందీ వివరిస్తూ కూడా వీడియోలు వచ్చాయి. సింహాచలం ఘటన తర్వాత జగన్ వెంటనే అక్కడకు వెళ్లి మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చివచ్చారు. చంద్రబాబు, పవన్ లు మాత్రం సాకులు వెతుక్కుంటూ కూర్చున్నారు. ఎల్లో మీడియా మాత్రం సింహాచలం ప్రమాదాన్ని తగ్గించి చూపడానికి నానా పాట్లు పడింది. ఏది ఏమైనా మత సెంటిమెంటును రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదు.అది ఎప్పటికైనా వారికే తగులుతుంది.ఈ నేపథ్యంలో పాలకులు చేసే పాపాలు తమకు శాపాలుగా మారుతున్నాయని ప్రజలు సెంటిమెంట్ గా భావించే పరిస్థితి ఏర్పడింది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్ రూల్స్ పెడతాడు.. పాటించడూ!
-
ఎవరు పోతే మాకేంటి? బాధ్యత ఉండక్కర్లే
-
సింహాచలం ఘటన.. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం
విశాఖపట్నం, సాక్షి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సింహాచలం ప్రమాద ఘటన జరిగిందని.. అలాంటిది ప్రభుత్వ అధికారులతోనే విచారణ జరిపిస్తే ఫలితం ఏముంటుందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గురువారం సింహాచలంలో ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు ఎప్పుడూ అధికారంలో ఉన్న ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. సింహాచలంపై జరిగిన బాధాకరం. జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం నిర్లక్ష్యం. ప్రచార పిచ్చి ప్రమాదానికి కారణం అయింది. వీఐపీలకు దర్శనం కల్పించడం మీద ఉన్న శ్రద్ధ భక్తులకు సౌకర్యం కల్పించడంపై లేదు. ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడం చాలా బాధాకరం.మంత్రులు చందనోత్సవాన్ని చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా జరుపుతామన్నారు. సింహాచలంపై ఏడుగురు గురు భక్తులు చనిపోయిన సంఘటన ఎన్నడు జరగలేదు. మరణాలపై చంద్రబాబు చాలా తేలికగా మాట్లాడుతున్నారు. మరణాలపై ఆయనకు చీమ కుట్టినట్లు కూడా లేదు. మరణాలపై ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. సింహాచలం ప్రమాద ఘటనపై ప్రభుత్వ అధికారులతో విచారణ జరిపితే ఏమి లాభం?. ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణ ఎందుకు వేయలేదు. జ్యుడీషియల్ కమిటీతో విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి. అందుకే వైఎస్సార్సీపీ తరఫున మేం డిమాండ్ చేస్తున్నాం. కమిటీ ముందు కాంట్రాక్టర్ నిజాలు చెప్పాడు. నాలుగు రోజుల్లో గోడ కట్టామని చెప్పారాయన. ఆ గోడకు డిజైన్, టెండర్ లేవు. కాంట్రాక్టర్ పై ఒత్తిడి చేసిన వాళ్ళు ఎవరో తెలియాలి. దేవాలయాలు భక్తులు అంటే చాలా నిర్లక్ష్యం కనిపిస్తుంది. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలో ఉన్న ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. కొండపై 7 మంది చనిపోతే కనీసం శుద్ధి చేయాలనే ఆలోచన ఉండాలి కదా. మరణాలు తరువాత సంప్రోక్షణ చేయడం మన సంప్రదాయం. ప్రమాద ఘటనపై పరామర్శకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు రాలేదు?. జనసేన కార్యకర్త అయితేనే పవన్ పరామర్శ చేస్తారా?. మిగతా వారిని పరామర్శించరా?.ప్రభుత్వంలో ఉండి మీరు చేయాల్సిన పనిని వైఎస్ జగన్ చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. చనిపోయిన వారి కుటుంబాలకు పార్టీ తరుపున 2 లక్షల రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తున్నాం అని బొత్స అన్నారు. -
డిప్యూటీ సీఎంకు పంగ‘నామం’
సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న అమరావతి రాజధాని పునహ్వార్మాణ కార్యక్రమం ఆహ్వానపత్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ముద్రించకపోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో విరుచుకుపడడంతో మళ్లీ ఆయన పేరును చేర్చి ఆహ్వాన పత్రాలు ముద్రించారు. అయితే ఇప్పటికే 90శాతం ఆహ్వాన పత్రాల పంపిణీ జరిగిపోయింది. మోదీ, బాబు పేర్లు మాత్రమే..! ఈ నెల 2న వెలగపూడిలో అమరావతి పునర్నిర్మాణం పేరుతో భారీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించి సీఆర్డీఏ నాలుగు పేజీల ఆహ్వానపత్రాన్ని ముద్రించి అందరికీ పంపిణీ చేసింది. మొదటి పేజీ, చివరి పేజీలో అమరావతి డిజైన్లు, ప్రభుత్వ రాజముద్ర, 2వ పేజీలో ఇంగష్, 3వ పేజీలో తెలుగులో ఆహ్వాన పత్రాన్ని ముద్రించారు. అందులో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు పేర్లు మాత్రమే ముద్రించారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పేరు లేదు. ఈ ఆహ్వానపత్రికలను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీఐపీలు, వీవీఐపీలు, ముఖ్యులకు పంపించారు. ఆహ్వానపత్రికలో పవన్ పేరు లేదని ఆలస్యంగా గుర్తించిన జనసేనపార్టీ మిన్నకుండిపోయింది. పవన్ కళ్యాణ్ కూడా సర్దుకుపోయారు. అయితే జనసేన శ్రేణులు మాత్రం తీవ్రంగా స్పందించారు. సోషల్‌మీడియాలో ప్రభుత్వ తీరుపై నిప్పులుచెరిగారు. తమ నేతను కరివేపాకులా తీసి పారేశారంటూ ఆవేదన వెళ్లగక్కారు. తమ పార్టీ లేకపోతే చంద్రబాబు సీఎం అయ్యేవారు కాదని, తమ నేతకే పంగనామాలు పెడతారా? అంటూ పోస్టులు పెట్టారు. దీనికి టీడీపీ శ్రేణులూ కౌంటర్ ఇచ్చాయి. రెండుపార్టీల మధ్య సోషల్‌మీడియా వార్ జరుగుతోంది.మరిచిపోయినట్టు నటించి దిద్దుబాటు చర్యలు ఇది చిలికిచిలికి గాలివానలా మారుతోందని గుర్తించిన టీడీపీ పెద్దలు పేరు మరిచిపోయినట్టు నటించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీంతో సీఆర్డీఏ అధికారులు ఆహ్వానపత్రంలో మొక్కుబడిగా పవన్ పేరు చేర్చి మళ్లీ ముద్రించి విడుదల చేశారు. అయితే ఇప్పటికే 90శాతం పత్రికల పంపిణీ పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనతో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యంపై సర్వత్రా చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకు తలొగ్గి అన్ని విషయాల్లో బేషరతుగా మద్దతు ఇస్తున్నా ప్రభుత్వంలో ఆయనకు ఏమాత్రం విలువ లేదని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
KSR LIVE: పవన్ వ్యాఖ్యలకు శంకర్ రెడ్డి కౌంటర్
-
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్
-
పవన్ కొడుక్కి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్!
పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్.. కొన్నిరోజుల క్రితం సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్కూల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగేసరికి మార్క్ కి గాయాలు కాగా కొన్నాళ్ల పాటు అక్కడే చికిత్స అందించి హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆరోగ్యం కుదట పడిందనే అందరూ అనుకున్నారు. కానీ మరో ట్రీట్ మెంట్ కూడా జరుగుతోందని పవన్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్) పహల్గామ్ మృతులకు నివాళి ఆర్పించడంలో భాగంగా తాజాగా మంగళగిరిలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో మాట్లాడిన పవన్ కల్యాణ్.. తన కొడుకు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి కూడా బయటపెట్టారు.అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో బ్రాంకోస్కోపీ చేయించారు. తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చేశారు. అయితే తన కుమారుడు సురక్షితంగా ఇంటికి చేరుకున్నప్పటికీ.. ఇప్పటికీ ఆ ఘటన నుంచి తేరుకోలేకపోతున్నాడని, రాత్రుళ్ల నిద్రలో నుంచి భయపడి లేస్తున్నాడని చెప్పారు.(ఇదీ చదవండి: నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో) బిల్డింగ్ పై నుంచి కింద పడిపోయినట్లు తన కొడుకు మార్క్ శంకర్ కి కలలు వస్తున్నాయని పవన్ అన్నారు. ఈ ట్రామా, భయాన్ని తగ్గించేందుకు సైకియాట్రిస్ట్ ట్రీట్ మెంట్ ప్రస్తుతం చేయిస్తున్నామని చెప్పుకొచ్చారు.పవన్ కల్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతానికి రెండింటికి పనిచేస్తున్నారు. అవే హరిహర వీరమల్లు, ఓజీ. వీటిలో పవన్ కి సంబంధించిన షూటింగ్ పెండింగ్ లో ఉంది. మరి వీటిని ఎప్పుడు పూర్తి చేస్తారో దానిబట్టి రిలీజ్ చేస్తామని నిర్మాతలు అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..) -
జనసేన కార్యాలయం వద్ద పీఈటీ అభ్యర్థుల నిరసన
మంగళగిరి టౌన్: మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) అభ్యర్థులు మంగళవారం నిరసన చేపట్టారు. డీఎస్సీలో పీఈటీ పోస్టుల భర్తీ లేకపోవడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ హామీ ఇచ్చి మోసం చేశారని, మీరైనా న్యాయం చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. డీఎస్సీలో ఖాళీ పీఈటీ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. కాన్వాయ్‌లో పవన్ కళ్యాణ్ వస్తున్న సమయంలో పెద్దగా నినాదాలు చేసినా పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
వాటర్‌లో వార్
వెండితెర నీటిమయం కానుంది. ఎందుకంటే నీటిలో వీరోచిత యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నారు కొందరు తెలుగు హీరోలు. కొందరు నీటి పై... మరి కొందరు నీటి లోపల వాటర్ సీక్వెన్స్ చేస్తున్నారు. ఇలా ప్రత్యర్థులతో ‘వాటర్‌లో వార్’ చేస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.బురదలో ఫైట్ వాటర్‌లో ఫైట్ సీక్వెన్స్‌లను చాలా సినిమాల్లో చేశారు చిరంజీవి. కానీ... తొలిసారిగా కాస్త బురద ఉండే వాటర్ ఫైట్ సీక్వెన్స్‌ను ‘విశ్వంభర’ సినిమా కోసం చేశారాయన. ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఓ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఉందని, ఈ ఫైట్‌ను ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా డిజైన్ చేశారని సమాచారం. ఈ చిత్రంలో ఆంజనేయ స్వామి భక్తుడు భీమవరం దొరబాబు పాత్రను చిరంజీవి పోషిస్తున్నారని తెలిసింది.త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక పాట మినహా పూర్తయిందట. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్, వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్ లేదా ఆగస్టులో ‘విశ్వంభర’ విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. పడవలో ఫైట్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకులు. మొఘల్ సామ్రాజ్యం కాలం నాటి 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేస్తుండగా, హీరోయిన్గా పంచమి అనే పాత్రలో నిధీ అగర్వాల్ నటిస్తున్నారు.ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కనిపిస్తారు. ఈ సినిమాలో ఓ అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఉందని తెలిసింది. ఈ సీన్ సినిమా ఆరంభంలోనే వస్తుందట. ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ‘హరిహర వీరమల్లు’ రెండు భాగాలుగా రూపొందుతోంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. పడవల్లో గొడవ పడవ ప్రయాణంలో ప్రత్యర్థులతో గొడవ పడుతున్నారట మహేశ్‌బాబు. ఇది ఏ రేంజ్ గొడవ అనేది థియేటర్స్‌లో చూడాలి. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఇటీవల హైదరాబాద్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారట రాజమౌళి. ఈ చిత్రంలో ప్రధాన తారాగణమైన మహేశ్‌బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొనగా, వీరితో పాటు దాదాపు మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారని సమాచారం. ఈ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ను ఓ భారీ సెట్లో చిత్రీకరించారట. ఈ బోట్ యాక్షన్ సీక్వెన్స్‌ని హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ డిజైన్ చేశారని భోగట్టా. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుందని సమాచారం.సముద్రంలో దేవర తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘దేవర’. ఈ చిత్రంలో తండ్రి దేవరగా, కొడుకు వరగా ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను మెప్పించింది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘దేవర’ తొలి భాగంలో సముద్రంలో జరిగే యాక్షన్ సీక్వెన్స్‌లను చూశాం. అలాగే ‘దేవర 2’లోనూ ఆ తరహా వాటర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలిసింది. తొలి భాగంలో సముద్రం అడుగు భాగాన కొన్ని అస్థిపంజరాలు ఉన్నట్లుగా చూపించారు.వీటి వెనక దాగి ఉన్న యాక్షన్ ఎపిసోడ్ ‘దేవర 2’లో ఉంటుందని తెలుస్తోంది. ఇంకా రెండో భాగం షూటింగ్ ఆరంభం కాలేదు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. కల్యాణ్‌రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ ‘దేవర’ చిత్రాన్ని నిర్మించారు. ఈ నిర్మాతలే ‘దేవర 2’ని కూడా నిర్మిస్తారని ఊహించవచ్చు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చాక ‘దేవర 2’ షూట్లో పాల్గొంటారని తెలుస్తోంది. సాహసాల సూపర్ యోధ సూపర్ యోధగా సాహసాలు చేస్తున్నారు తేజ సజ్జా. ఈ సాహసాల విజువల్స్ ఆగస్టులో థియేటర్స్‌లో చూడొచ్చు. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘మిరాయ్’ అనే ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ రూపొందుతోంది. ఈ సినిమాలో ఓ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఉందని భోగట్టా. యాక్షన్‌తో పాటు ఆధ్యాత్మిక అంశాలు కూడా మిళితమై ఉన్న ఈ సినిమాకు చెందిన ఓ లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణ శ్రీలంకలో జరిగింది.ఆ షెడ్యూల్లో ఓ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఓ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ కూడా తీశారని సమాచారం. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 1న విడుదల కానుంది. ఇలా వాటర్‌లో జరిగే యాక్షన్ ఎపిసోడ్స్‌తో మరికొన్ని చిత్రాలు రానున్నాయి. -
‘లోకేష్ అన్యాయం చేశారు మీరైనా..’ పట్టించుకోని పవన్!
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ తగిలింది. మంగళగిరి జనసేన కార్యాలయంలో ఇవాళ ఆ పార్టీ ఆధ్వర్యంలో పహల్గాం సంతాప సభ జరిగింది. అయితే ఆ సమయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(PET) అభ్యర్థులు ఆయన కోసం నిరసన చేపట్టారుడీఎస్సీ నుంచి పీఈటీని ఎత్తేయడంపై ఆయన్ని ప్రశ్నించారు. పాదయాత్రలో నారా లోకేష్ తమకు హామీ ఇచ్చి మోసం చేశారని.. కనీసం మీరైనా న్యాయం చేయాలని పవన్‌ను ఉద్దేశిస్తూ ఫ్లెక్సీ, ఫ్లకార్డులు పట్టుకున్నారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, దాని ద్వారానే పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.పవన్ కాన్వాయ్ వస్తున్న సమయంలో వాళ్లు తమ నినాదాలను పెంచారు. అయితే పవన్ వాళ్లను కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో వాళ్లు నిరాశ చెందారు. -
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కూటమిలో ఫ్లెక్సీ వార్
-
Garam Garam Varthalu: గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
ఎన్నికలముందు కారు టాప్‌పై ఇప్పుడు హెలికాప్టర్లో పవన్ పై పేర్ని నాని సెటైర్లు
-
పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సిన రచ్చబండ కార్యక్రమం అర్ధాంతరంగా రద్దు
-
పవన్ కళ్యాణ్ పిచ్చి మాటలు కాశ్మీర్లో అసలేం జరిగిందో చెప్పిన చిన్నారిపవన్ కళ్యాణ్ పిచ్చి మాటలు కాశ్మీర్లో అసలేం జరిగిందో చెప్పిన చిన్నారి
-
Garam Garam Varthalu: గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
పవన్ సినిమా వాయిదా.. ఎందుకంటే ఈ రెండు మూవీస్
పవన్ కల్యాణ్ ఏళ్లకేళ్లుగా చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. నాలుగైదేళ్లుగా సెట్స్ మీదే ఉంది. మే 9న పక్కా థియేటర్లలోకి వస్తామని పోస్టర్స్ మీద పోస్టర్లు వదిలారు. తీరా చూస్తే ఇప్పుడు సౌండ్ లేదు. దీంతో వాయిదా లాంఛనమే. మరోవైపు ఈ తేదీని ఇప్పుడు మరికొన్ని తెలుగు మూవీస్ పట్టేస్తున్నాయి. (ఇదీ చదవండి: రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్) మే 9 టాలీవుడ్ కి చాలా అచ్చొచ్చిన తేదీ. గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి.. ఇలా చెప్పుకొంటూపోతే ఆ రోజున థియేటర్లలో రిలీజై హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. 'హరిహర..' కూడా అదే తేదీ అనేసరికి ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ ఇప్పుడు మే 23న లేదంటే జూన్ 4న రావొచ్చని టాక్ వినిపిస్తుంది.పవన్ సినిమా వాయిదా లాంఛనమే అని తెలియడానికి మరోలా కూడా క్లారిటీ వచ్చింది. కొన్నిరోజుల క్రితం సమంత నిర్మించిన 'శుభం' మూవీ ఇదే తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు శ్రీ విష్ణు '#సింగిల్' కూడా మే 9న థియేటర్లలోకి వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇలా వరస చిత్రాలు ఆ తేదీన రాబోతున్నాయంటే పవన్ మూవీ మరోసారి వాయిదా పడ్డట్లేగా.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
‘పవన్.. మీరు సామాన్యులను, దళితులను పట్టించుకోరా?’
తాడేపల్లి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితులను వెలివేస్తే ఆయన అస్సలు పట్టించుకోలేదని, ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. వీరయ్య చౌదరిని మద్యం గొడవల్లో చంపేస్తే హెంమంత్రి అక్కడకు పరిగెత్తారని, మీకు డబ్బున్న వారే కనిపిస్తారా? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. మీకు డబ్బున్నవారినే తప్పితే పేదలు, సామాన్యులు, దళితులను పట్టించుకోరా? అని నిలదీశారు. ఇంతకంటే దిగజారిన, దిక్కుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందా? అని పేర్ని నాని మండిపడ్డారు. ఈరోజు’(శుక్రవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడారు పేర్ని నాని. కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువఏపీలో కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని, గతంలో తమ ప్రభుత్వ హయాంలో అప్పులపై విషం ప్రచారం చేశారని, ఎల్లో మీడియా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి నానాయాగి చేశారన్నారు. పెద్దపెద్ద మేధావులకే చంద్రబాబు ఆర్థిక పాఠాలు నేర్పురారన్నట్లుగా జాకీలతో లేపారని, ఇప్పుడు చంద్రబాబు రూ. లక్షా 3 వేల కోట్లు అప్పు నేరుగా తెచ్చారన్నారు.‘రూ.44 వేల కోట్లను కార్పొరేషన్ ల ద్వారా తెచ్చారు. ఒక లక్షా 47 వేల కోట్లకు పైనే అప్పు చేశారు. జగన్ చేసిన అప్పులతో పోర్టులు, సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్ల అభివృద్ధి ఇలా అనేక రూపాల్లో కనిపిస్తున్నాయి. జగన్ ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉంది. కానీ చంద్రబాబు చేస్తున్న అప్పులు ఏం చేస్తున్నారో చెప్పటం లేదు. ఎన్నికలకు ముందు ఉత్తరకుమారుడిలా చంద్రబాబు మాటలు చెప్పారు. ఇప్పుడేమో సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలో అర్థం కావటం లేదంటున్నారు. చంద్రబాబు మాటలకు పవన్ కళ్యాణ్ చిడతలు కొడుతున్నారు. తాజాగా లక్షా 91 వేల కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టేశారు.రూ.9 వేల కోట్ల అప్పుల కోసం తాకట్టు పెట్టారు. దీనిమీద ఎల్లోమీడియా ఎందుకు మాట్లాడటం లేదు?, ఆరు మాసాలకు చెందిన కిస్తీలను ముందుగానే బ్యాంకులో వేయాలనే నిబంధన పెట్టటం దుర్మార్గం.అప్పు ఇచ్చిన వారు రిజర్వ్ బ్యాంకులో ఉండే ప్రభుత్వ నిధులను నేరుగా తీసుకోవచ్చని కూడా నిబంధన పెట్టారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? , ఇలాంటి వ్యవహారాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అసలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలా నిధులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తారు? , ఇంతకంటే బరితెగింపు ఉంటుందా?, జగన్ కంటే ఎక్కువగా సంక్షేమం అందిస్తామనీ, అప్పు చేయకుండా సంపద సృష్టిస్తామని అప్పట్లో తెగ బిల్డప్పులు ఇచ్చారు.ఇప్పుడు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. రాష్ట్రం అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అమరావతి ఒక్కటేనా?, ఎన్నికలకు ముందు అద్దె ఆఫీసుల్లో ఉన్నవారు ఇప్పుడు ప్యాలెస్‌లు కడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు కారుపైకి ఎక్కి ప్రయాణించారు. ఇప్పుడు జనానికి కనపడకుండా ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో తిరుగుతున్నారు. సొంత కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లాలన్నా ప్రత్యేక విమానాలే. రాష్ట్ర ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తారా? , ఈ విమానాలు, హెలికాఫ్టర్లకు ఎవరి డబ్బు ఖర్చు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రత్యేక విమానాలకు ఖర్చు పెడతారా?’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు. -
పిఠాపురంలో పవన్ ‘రచ్చ’బండ రద్దు
కాకినాడ, సాక్షి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సొంత నియోజకవర్గంలోనే వరుస షాకులు తగిలాయి. రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించకుండానే.. రద్దు చేసుకుని తిరుగుపయనం అయ్యారాయన. అదే సమయంలో ఈ పర్యటనలోనే కూటమిలో విబేధాలు కూడా మరోసారి బయటపడ్డాయి.పవన్ కల్యాణ్ శుక్రవారం పిఠాపురం రచ్చబండలో పాల్గొనాల్సి ఉంది. అయితే.. రైతులు, ఇతర వర్గాల ప్రజలు తమ సమస్యలపై నిరసన తెలిపే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో.. కార్యక్రమాన్ని నిర్వహించకుండానే అర్ధాంతరంగా వెళ్లిపోయారు. మరోవైపు, ఈ పర్యటనలో కూటమిలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. డిప్యూటీ సీఎం, పలు శాఖల మంత్రి హాజరయ్యే కార్యక్రమానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇంచార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ గైర్హాజరయ్యారు. ఇక.. ఉప్పాడలో పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసిన టీటీడీ కళ్యాణ మండపం, సీతారాముల దేవాలయం శంకుస్థాపన శిలాఫలకాల్లో సీఎం చంద్రబాబు పేరు కనిపించలేదు. దీంతో టీడీపీ నేతలు బహిరంగంగానే అక్కడ అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. -
Garam Garam Varthalu: గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ట్రోల్స్ పై రోజా క్లారిటీ
-
విజన్ కాదు, విస్తరాకుల కట్ట.. బాబుపై నిప్పులు చెరిగిన రోజా
-
‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’లో ఇదేం ఘోరం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో పెరుగుతున్న పెత్తందార్ల ఆగడాలను ఆపాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలోనే దళితులను పెత్తందార్లు సామాజిక బహిష్కరణ చేసిన ఘటన ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇటువంటివి చోటుచేసుకుంటున్నాయని, ఇవి పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యకు మూలమైన.. విద్యుద్ఘాతం వల్ల చనిపోయిన దళిత యువకుని కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల ఆరి్థక సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి ఆవేదన వారి మాటల్లోనే...రాష్ట్ర హోంమంత్రి మల్లాం గ్రామానికి వెళ్లాలి పిఠాపురం నియోజకవర్గంలోని మల్లాం గ్రామంలో దళితులను సాంఘిక బహిష్కరణకు పాల్పడిన పెత్తందార్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినప్పటికీ ‘శాంతి భద్రతల పేరుతో’ చర్చలు జరిపి రాజీలు చెయ్యడం దుర్మార్గం. పెత్తందార్లపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర హోంమంత్రి అనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయులు ఆ గ్రామాన్ని సందర్శించాలి. బాధ్యులపై కేసులు నమోదు చేయించి దళితులకు మనోధైర్యం కల్పించాలి. – అండ్ర మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాటసంఘం (కేవీపీఎస్) రాష్ట్ర కార్యదర్శి పవన్ పర్యటించాలి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మల్లాం గ్రామంలో పర్యటించి దళితులకు మనోధైర్యం కల్పించాలి. సామాజిక బహిష్కరణ అమలు జరిగిన కాలానికి బాధితులందిరికీ పరిహారం చెల్లించాలి. –వి.శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పవన్ స్పందించాలి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి పెత్తందార్లపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి. గ్రామంలో దళితులకు రక్షణ కల్పించాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం. – కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అప్పుడు గరగపర్రు.. ఇప్పుడు మల్లాం గత టీడీపీ పాలనలో గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహం విషయంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేయడంతో రాష్ట్రవ్యాప్త ఉద్యమం జరిగింది. అదే తరహాలో ఇప్పుడు టీడీపీ కూటమి పాలనలో మల్లాంలో దారుణం జరిగింది. రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి దారితీయకముందే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – నల్లి రాజేష్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు -
డిప్యూటీ సీఎం ఇలాకాలో దళితుల సాంఘిక బహిష్కరణ
పిఠాపురం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని మల్లాం గ్రామంలో ఓ చిన్న కారణానికి దళితులు సాంఘిక బహిష్కరణకు గురైన సంఘటన ఆదివారం వెలుగులోకి వచి్చంది. స్థానికులు, అధికారుల కథనం ప్రకారం.. మల్లాంలో వెలిశెట్టి జల్లిబాబు ఇంట్లో అదే గ్రామానికి చెందిన దళితుడు పల్లపు సురేష్ (37) ఈ నెల 16న కరెంటు పని చేస్తూ, విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈ నెల 17న దళితులు ధర్నా చేశారు. ఇరు వర్గాల సమక్షంలో పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం కృషి చేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన కొందరు సమావేశమై, దళితులపై సాంఘిక బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు.కొందరు పెద్దల నిర్ణయం మేరకు తమను పనిలోకి పిలవడం లేదని, ఎవరూ పాలు పోయడం లేదని, హోటళ్లలో కూడా పాలు, టిఫిన్, టీ, కాఫీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తమను సాంఘిక బహిష్కరణ చేశారని పలువురు దళితులు పిఠాపురం రూరల్ పోలీసు స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. మాకు ఇబ్బంది రాకూడదనే అలా..‘మా పొలాలు, వ్యాపారాల్లో దళితులు పని చేస్తున్నారు. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మాపై తప్పుడు కేసులు పెట్టి, డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. దీంతో వాళ్లకు ఏ పనీ చెప్పకపోతే ఇబ్బంది ఉండదు కదా అని ఒక నిర్ణయం తీసుకున్నాం’ అంటూ రెండో వర్గం వారు అధికారుల వద్ద స్పష్టం చేశారు. దళితుల సాంఘిక బహిష్కరణ విషయంపై కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్, ఎస్సై జాన్‌బాషా దళిత కాలనీలోని బాధితులను విచారించారు. ఈ సందర్భంగా కాల్దరి భాస్కరరావు మాట్లాడుతూ.. ఆదివారం గ్రామంలో యథావిధిగా చేపలు అమ్మేందుకు ప్రయతి్నంచగా బుర్రా రాంబాబు, మేడిది రాజారావులు తన వద్ద ఎవరూ చేపలు కొనొద్దని చెప్పారన్నారు. కలగపూడి ఆమోష్ మాట్లాడుతూ.. బుర్రా నాని, బుర్రా మణికి చెందిన రెండు హోటళ్లలో టిఫిన్ కోసం వెళ్లగా తమకు విక్రయించబోమని చెప్పారన్నారు. ఆలపాటి చంద్రరావు మాట్లాడుతూ.. మలిరెడ్డి రాంబాబు దుకాణంలో టీ ఇవ్వలేదని, తమకు టీ అమ్మవద్దని వారి పెద్దలు చెప్పారని తెలిపారన్నారు. కాల్దారి శ్రీను మాట్లాడుతూ.. చల్లా వెంకట రమణ పాల కేంద్రం వద్ద పాలు పోయలేదని చెప్పారు. అనంతరం ఆర్డీవో ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
పవన్ సవాల్.. టీడీపీకి దిమ్మతిరిగింది!
-
ఉద్దేశపూర్వకంగానే చిరుతకు ఉచ్చు
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నూటిపాళ్యంలో చిరుతపులి మరణించిన ఘటనలో...వేటగాళ్లు ఉద్దేశపూర్వకంగానే ఉచ్చు వేసినట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) చలపతిరావు తెలిపారు. వేటగాళ్ల ఉచ్చులో ఆడ చిరుత కడుపులో రెండు కూనలతో మృతి చెందిన ఘటనపై అటవీ, పర్యావరణశాఖమంత్రి పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. దీంతో శుక్రవారం పీసీసీఎఫ్ చలపతిరావు, అన్నమయ్య జిల్లా డీఎఫ్‌వో జగన్నాథ్‌సింగ్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ తిరుపతి సర్కిల్ ఎస్.సెల్వం పొన్నూటిపాళ్యం అటవీప్రాంతంలో పర్యటించారు. అక్కడ పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఘటనా స్థలిని పరిశీలిస్తే... రెగ్యులర్‌గా కణుతులు, దుప్పిలు వచ్చే ప్రాంతంలో కాకుండా వేరేచోట ఉచ్చు బిగించినట్లు తెలుస్తోందన్నారు. మిగిలిన విషయాలు దర్యాప్తులో తేలనున్నట్టు పేర్కొన్నారు. మదనపల్లె ఫారెస్ట్ కార్యాలయ పరిధిలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా రెస్క్యూ ఆపరేషన్‌కు అవసరమైన ట్రాంక్విలైజర్స్, డార్ట్గన్, నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు. కాగా, పొన్నూటిపాళ్యం అడవిలోకి వెళ్లి వస్తున్న అధికారులకు గ్రామస్తుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఘటనతో ఏమాత్రం సంబంధం లేని అమాయక రైతులను అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారంటూ అధికారుల వాహనాలను అడ్డుకున్నారు. దీనికి స్పందించిన పీసీసీఎఫ్... చెప్పదలచుకున్న విషయాలను రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు. దీంతో వారు నిరసన విరమించారు. -
పవన్.. ‘సనాతన ధర్మం అంటే కాషాయ దుస్తులు ధరించడం కాదు’
పల్నాడు జిల్లా,సాక్షి: తిరుమల లడ్డు వ్యవహారంలో కట్టుకథ అల్లి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నెట్టే ప్రయత్నించారు. ఇదే అంశంలో సాక్షాత్తూ సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన కూటమి ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారుతిరుమల గోశాలలో కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయంపై కాసు మహేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘తిరుపతిలో గోవులు చనిపోవడం బాధాకరం. గోవులు చల్లగా ఉంటేనే ఈ విశ్వం చల్లగా ఉంటుంది. గోవులు చనిపోతున్నాయని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పేంతవరకు విషయం బయటికి రాలేదు.టీటీడీ ఈవో,ఛైర్మన్ గోవులు చనిపోతున్నాయని చెప్తుంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ మాత్రం గోవులు చనిపోవటం లేదని చెబుతున్నారు. తొమ్మిది పది నెలల నుంచి నెలకు 10 నుంచి 15 గోవులు చనిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? గోవుల మరణాలపై చర్చకి సిద్ధమని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.భూమన కరుణాకర్‌రెడ్డి చర్చకు వెళ్తుంటే పోలీసులతో అడ్డుకున్నారు. చర్చ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయం కోసం వాడుకుంటుంది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని హడావిడి చేశాడు. సనాతన ధర్మం అంటే కాషాయం బట్టలు వేసుకొని తిరగటం కాదు. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.గతంలో లడ్డు వ్యవహారంలో కట్టు కధ అల్లి రాజకీయం చేసి వైఎస్ జగన్ మీద వేసే ప్రయత్నించారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదు. ప్రభుత్వం రాజకీయాలు పక్కనపెట్టి గోవులు ఎందుకు చనిపోతున్నాయో కారణాలు కనుక్కోండిగిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి రైతుకు 20 వేలుఇస్తానని ప్రకటించారు. ఇప్పటికి 40 వేలు రైతులకి బకాయి ఉన్నారు. చంద్రబాబు రైతులకు ఇస్తానన్న డబ్బులు చెల్లిస్తే వారికి ఎంతో కొంత ఉపయోగపడతాయి’అని సూచించారు. -
చంద్రబాబు, పవన్ లు నాకు శత్రువులు కాదు
-
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికలోని అంశాలతో తనకు సంబంధం లేనట్లు, అదేదో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌ల బాధ్యత అన్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రశ్నించడానికే పార్టీని పెట్టానని గొప్పగా చెప్పుకున్న పవన్.. ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లను రాజకీయంగా మోయడానికి, తన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేయడానికే అన్నట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శ. దీంతో ఆయనకు ఇప్పుడిప్పుడే నిరసన సెగ తగులుతోంది. కొద్ది రోజుల క్రితం విశాఖ, గిరిజన ప్రాంతాలకు వెళ్లినప్పుడు వలంటీర్లు పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను నిలదీసే యత్నం చేశారు. ఇప్పటికే ఆయా చోట్ల వలంటీర్లు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. అయినా కూటమి ప్రభుత్వంలో కనీస స్పందన లేదు. కూటమి పెద్దలకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. దాంతో వలంటీర్లు నేతలను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి వీరే కాదు. సూపర్ సిక్స్ తదితర హామీలు ఏమయ్యాయంటూ మహిళలు, నిరుద్యోగులు తదితర వర్గాలు నిరసన ర్యాలీలు చేయడం ఆరంభమైంది.వలంటీర్లకు సంబంధించి పవన్ చేసిన ప్రకటనను గమనిస్తే ఆయన ఎలా మాట మార్చుతున్నది ఇట్టే తెలిసిపోతుంది. గత ప్రభుత్వం వలంటీర్లను అధికారికంగా నియమించలేదని చంద్రబాబు, లోకేశ్‌లు క్యాబినెట్ సమావేశంలో చెప్పారని, వారికి ఇచ్చేది జీతం కాదు.. గౌరవ వేతనం మాత్రమేనని, అందుకే ఏమీ చేయలేదని తెలియ చేశారని పవన్ అన్నట్లుగా మీడియాలో కథనం వచ్చింది. లక్షన్నర మంది జీవితాలను నట్టేట ముంచేసి, అదేదో స్వల్ప విషయమన్నట్లుగా పవన్ వ్యవహరించడం శోచనీయం. 👉ఎన్నికల ప్రణాళికలో వలంటీర్లకు పదివేల జీతం ఇస్తామని, వారి సేవలను కొనసాగిస్తామని ప్రకటించింది వాస్తవం కాదా? పలు ఎన్నికల ప్రచార సభలలో పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వలంటీర్ల అంశం ప్రస్తావించారో గుర్తు లేదా? వలంటీర్ల కడుపు కొట్టబోమని, అందులోను లక్షమంది యువతులకు అన్యాయం చేస్తానా? అని ప్రసంగించారు. వాస్తవానికి రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉండే వారు. కాని ఎన్నికల సమయంలో సుమారు ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు రాజీనామాలు సమర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉంటే వారిని కూడా బాధ్యతలలోకి తీసుకునే వారు. కాని కూటమి ప్రభుత్వం రావడంతో తమకు గౌరవ వేతనం పెరుగుతుందని రాజీనామా చేయని వలంటీర్లు ఆశపడ్డారు. తీరా చూస్తే కూటమి ప్రభుత్వం అసలుకే మోసం తెచ్చింది. 👉వలంటీర్లు(Volunteers) అంటే స్వచ్ఛందంగా సేవలందించే వారని, వారికి గత జగన్ ప్రభుత్వం గౌరవ వేతనం ఇచ్చిందన్న సంగతి పవన్ కళ్యాణ్ కు తెలియదా? ఆ విషయం తెలియకుండానే, గుడ్డిగా చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రణాళికపై సంతకం చేశారని నమ్మాలా? అదే వాస్తవం అయితే పవన్ కళ్యాణ్ ఈ పదవిలో ఉండడానికి అర్హుడవుతారా? పైగా క్యాబినెట్లో చంద్రబాబు, లోకేశ్‌లు ఏదో చెప్పారని వారిపై నెట్టేసి తప్పించుకునే యత్నం చేస్తారా? ప్రభుత్వంలో వారు ఏమి చేసినా సమర్థిస్తున్న పవన్ కళ్యాణ్ వలంటీర్ల విషయం తనకు ఏమీ తెలియదన్నట్లుగా నటించడం ధర్మమేనా?. వలంటీర్లకు ఇచ్చేది గౌరవ వేతనం కనుక ,వారికి ఆ బాధ్యతలు అప్పగించడం కుదరదని చంద్రబాబు, లోకేశ్ లు చెబితే పవన్ కళ్యాణ్ చెవిలో పువ్వు పెట్టుకుని విన్నారా?మనం హామీ ఇచ్చాం కదా! ఎందుకు చేయలేం. ప్రభుత్వం అనుకుంటే ఇది ఒక పెద్ద సమస్యా?అ ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించి ఉండాలి కదా? ఉగాది పర్వదినానా పవిత్రమైన పూజలు నిర్వహించి మరీ వలంటీర్లకు హామీ ఇచ్చారు కదా? ఇప్పుడు కాదంటే పాపం కదా అని చంద్రబాబును అడగాలి కదా? అలా అడగలేదంటే ఏమిటి దాని అర్థం? వలంటీర్లు సామాన్యులు కనుక, వారిని ఏమి చేసినా ఏమీ కాదన్న భావనే కదా?. 👉జగన్ ప్రభుత్వం(Jagan Govt) విజయవంతంగా నిర్వహించిన వలంటీర్లు అంటే చంద్రబాబు, లేదా పవన్ కళ్యాణ్‌లకు ఎప్పుడూ గౌరవం లేదు. వారిని అసలు సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులుగా చూడడానికి కూడా ఇష్టపడలేదు. చంద్రబాబు నాయుడు వీరిని మూటలు మోసే వారని, ఆడవాళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడు వెళ్లి వేధించేవారని ఒకసారి నీచమైన రీతిలో వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అయితే మరీ దారుణంగా వలంటీర్లను కిడ్పాపర్లతో పోల్చారు. ఏపీలో 30 వేల మంది అమ్మాయిలు తప్పిపోయారని అంటూ వలంటీర్లపై ఆరోపణలు చేశారు. కాని ప్రజలలో వలంటీర్ల పట్ల ఉన్న సానుకూలత వల్ల అది వైఎస్సార్సీపీకి ఎక్కడ అడ్వాంటేజ్ అవుతుందోనన్న భయంతో, మాట మార్చి తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడమే కాకుండా, గౌరవ వేతనం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలు చేస్తామని ప్రకటించారు. అప్పటికి వారికి అధికారం వస్తుందన్న నమ్మం లేదు. కాని అనూహ్యంగా గెలిచేసరికి, ఇప్పుడు సూపర్ సిక్స్‌తో సహా అనేక అంశాలపై స్వరం మార్చుతున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు సినీ నటుడు. ఆ తర్వాతే రాజకీయ నేత. సినిమాలలో వకీల్ సాబ్‌గా ఆయన నటన అభిమానులను మెప్పించింది. కానీ రాజకీయ జీవితంలో మాత్రం ఆయన వ్యవహారశైలి వకీల్‌సాబ్ పాత్రకు భిన్నంగా ఉంది. ఈ సంగతిని ప్రజలూ గుర్తిస్తున్నారు. కరడుకట్టిన, గుడ్డి అభిమానులు మినహా మిగిలిన వారిలో పవన్ కళ్యాణ్ మాట మార్చేస్తున్నారన్న భావన క్రమేపీ బలపడిపోతోంది. 👉అబద్దాలు బాగా ఆడతారన్న పేరు ఉన్న చంద్రబాబుకు తానా అంటే తందానా అని తబలా వాయిస్తున్న చందంగా పవన్ వ్యవహరిస్తున్నారు. ఆయనతో పోటీ పడి అసత్యాలు చెబుతున్నారు. తాము మాట మార్చుతున్నామని ధైర్యంగా పవన్ కళ్యాణ్ చెప్పి ఉంటే కొంతైనా బెటర్‌గా ఉండేది. అలా కాకుండా చంద్రబాబు, లోకేశ్‌లదే తప్పు అన్నట్లు, తనకేమీ సంబంధం లేదన్నట్లు పవన్ కళ్యాణ్ డ్రామా ఆడినట్లు డైలాగులు చెబితే ప్రజలను పిచ్చివాళ్లను చేసినట్లు కాదా? వలంటీర్లను మోసం చేయడం కాదా? 30 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ గురించి ఏపీ అంతటా తిరిగి చేసిన ప్రచారం అంతా అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దం అని తేలింది కదా! కేవలం 47 మంది మాత్రమే మిస్ అయ్యారని, వారిలో ఎక్కువ మంది తిరిగి వచ్చారని అసెంబ్లీలో సమాధానం చెప్పింది కూటమి ప్రభుత్వమే కదా? పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దం ప్రచారం చేసి ఆంధ్ర సమాజాన్ని చీట్ చేసినట్లు అవుతుందా? అవ్వదా?.చంద్రబాబు, లోకేశ్‌ల పట్ల పవన్ కళ్యాణ్ ఎంత విధేయుడిగా ఉన్నా ప్రజలకు అభ్యంతరం లేదు. కాని ఎన్నికల ప్రణాళికను చంద్రబాబుతో కలిసి ఆయన కూడా విడుదల చేశారన్న సంగతి మర్చిపోకూడదు కదా! వకీల్ సాబ్ పాత్రను సినిమాలలో పోషించడం కాదు.. ప్రజా జీవితంలో ఆ మాదిరి నిలబడితేనే మంచి పేరు వస్తుంది. పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్లినప్పుడు ఆయన కాన్వాయ్ కోసం పోలీసులు ఆంక్షలు విధించడం, తత్పలితంగా సుమారు 30 మంది జెఈఈ పరీక్షలు రాయలేకపోయిన ఘటన కూడా కూటమి ప్రభుత్వ తీరుకు అద్దం పడుతుంది. పవన్ కళ్యాణ్ పదవిని ఎంజాయ్ చేసే మోజులో విద్యార్ధుల భవిష్యత్తును కూడా దెబ్బతీశారన్న విమర్శకు ఆస్కారం ఇచ్చారు. ఏది ఏమైనా వలంటీర్లను చంద్రబాబు, లోకేశ్‌లే కాదు.. పవన్ కళ్యాణ్ కూడా మోసం చేసినట్లే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పిఠాపురంలో రైతుల వినూత్న నిరసన..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురంలో రైతులు వినూత్న నిరసన చేపట్టారు. కల్లాల్లో ధాన్యం రాశుల వద్ద ధర్నా నిర్వహించారు. రబీ పచ్చి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా అకాల వర్షాలతో ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. మిల్లర్లు సిండికేట్‌గా మారి 76 కేజీల బస్తాను రూ.1200లకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బస్తా మీద రూ.200-300ల వరకు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది పచ్చి ధాన్యం బస్తా రూ.1,400-1,500ల వరకు అమ్ముకున్నామని అన్నదాతలు గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేత్రస్థాయిలోకి వచ్చి రైతులతో సమీక్ష చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
మహిళలపై చేయి వేస్తే తోలు తీస్తామన్న పవన్ ఏం చేస్తున్నారు: బ్రహ్మనాయుడు
-
ట్వీట్ పెట్టి పారిపోవడం కాదు.. రోజా వార్నింగ్
-
RK Roja: పవన్ కళ్యాణ్... దమ్ముంటే రండి
-
భక్తి లేదు.. భయం కూడా లేదా? దేవుడిపైనే పచ్చ కుట్రలు!
-
Perni Nani: వక్ఫ్ సవరణ బిల్లు సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా జరుగుతోంది
-
టీడీపీ కార్యకర్తలు నా భార్యని కాలితో తన్నారు: మాజీ ఎంపీ నందిగం సురేష్
తాడేపల్లి,సాక్షి: సీఎం చంద్రబాబు పర్యటనలు సినిమా షూటింగులను తలపిస్తున్నాయని మాజీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు జనాల్లో తిరిగే పరిస్థితి లేదు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దళితుల మేలు కోరి అనేక పథకాలను అమలు చేశారు. కానీ చంద్రబాబు రౌడీరాజ్యం కొనసాగిస్తున్నారు. పథకాలు అడిగితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాజధానిలో వరద వస్తే మునిగే ఐనవోలు ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని చంద్రబాబు చూశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాజధాని వరద ప్రాంతం నుండి విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.దళితులు,అంబేద్కర్ మీద వైఎస్ జగన్‌కు ఉన్న ప్రేమ అది. చంద్రబాబుకు అధికారం రాగానే మా కుటుంబంపై దాడి చేశారు. టీడీపి కార్యకర్తలు నా భార్యని కాలితో తన్నారు. త్వరలోనే ఆ వీడియోలు బయటపెడతా. ఇదేనా చంద్రబాబూ దళితుల మీద మీకు ఉన్న ప్రేమ? దళితుల మీద కక్షసాధిస్తూ పైకి కపట ప్రేమను చూపించొద్దు. చంద్రబాబు పర్యటనలు సినిమా షూటింగులను తలపిస్తున్నాయి. దళితుల గురించి చంద్రబాబు, పవన్, లోకేష్ బహిరంగంగా విమర్శలు చేశారు. ఇలాంటి వారికి దళితులే సరైన గుణపాఠం చెప్తారు’అని స్పష్టం చేశారు. -
చంద్రబాబు పీ4 విధానం ఓ బోగస్: సీపీఐ రామకృష్ణ
సాక్షి, అనంతపురం: వక్ఫ్ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వడం దుర్మార్గమంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. వక్ఫ్ బిల్లులో సవరణలు చేయకుండానే ఎందుకు మద్దతు ఇచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. వక్ఫ్ బిల్లు దేశంలో లౌకిక వాదాన్ని దెబ్బతీసేలా ఉంది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ఏం పని?’’ అంటూ రామకృష్ణ ప్రశ్నించారు.‘‘హిందూ ధార్మిక సంస్థల్లో ముస్లింలకు చోటిస్తారా?. ముస్లిం, క్రైస్తవ ఆస్తులపై బీజేపీ ప్రభుత్వం కన్నేసింది. చంద్రబాబు పీ4 విధానం ఓ బోగస్. తిరుపతిలో గోవుల మరణాలపై సమగ్ర విచారణ చేయాలి’’ అని రామకృష్ణ డిమాండ్ చేశారు.‘‘భూమన కరుణాకరరెడ్డి ఆరోపణలపై పాజిటివ్‌గా స్పందించాలి. సీఎం చంద్రబాబు, ఈవో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ప్రతి విషయం వైఎస్ జగన్‌కు ఆపాదించడం మంచి పద్ధతి కాదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ వైఖరి మార్చుకోవాలి’’ అని రామకృష్ణ హితవు పలికారు. -
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను స్టార్ హీరో అల్లు అర్జున్ కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని పవన్ ఇంటికి వెళ్లిన బన్ని మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిరోజుల క్రితం సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులతో దాదాపు 30 నిమిషాల పాటు అల్లు అర్జున్ దంపతులు మాట్లాడినట్లు తెలుస్తోంది. కానీ, అందుకు సంబంధించిన ఫోటోలు వంటివి అధికారికంగా వెలువడలేదు. -
తిరుమల శ్రీవారి దర్శించుకున్న పవన్ సతీమణి అన్నా లెజినోవా
సాక్షి, తిరుమల: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల పర్యటనలో ఉన్నారు. తిరుమల పర్యటనలో భాగంగా అన్నా లెజినోవా సోమవారం వేకువ జామున శ్రీవారిని దర్శించుకుని సుప్రభాత సేవలో పాల్గొన్నారు.వివరాల ప్రకారం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద తితిదే అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.అయితే, తమ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడటంతో అన్నా లెజినోవా శ్రీవారి దర్శనానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. స్థానిక గాయత్రీ నిలయంలో ఆమె బస చేశారు. VIDEO | Andhra Pradesh Deputy CM Pawan Kalyan’s wife Anna Lezhneva offered prayers at Tirumala Temple in Tirupati district.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/QQ41ZI1Jjy— Press Trust of India (@PTI_News) April 14, 2025 -
కుమారుడితో హైదరాబాద్ చేరుకున్న పవన్.. ఇక్కడికే షిఫ్ట్ కానున్నారా..?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కుటుంబసభ్యులతో పాటు సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. రెండురోజుల క్రితం సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన చిన్నకుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) గాయపడిన విషయం తెలిసిందే. అయితే, ఆ చిన్నారి ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నాడు. కొద్దిసేపటి క్రితం పవన్ తన సతీమణి అన్నాలెజినోవా, మార్క్శంకర్తో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. పవన్ తన కుమారుడిని ఎత్తుకుని వస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సింగపూర్‌లోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో పవన్ సతీమణి అన్నా లెజినోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. గతేడాదిలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకల్లో ఆమె పట్టా అందుకున్నారు. ఆ కార్యక్రమంలో పవన్ కూడా పాల్గొన్నారు. ఆమె అక్కడ చదువుకుంటున్నందున తన కుమారుడు మార్క్ శంకర్ కూడా సింగపూర్‌లోనే స్కూల్లో చేరిపించారు. అగ్ని ప్రమాదం నుంచి ఇప్పుడిప్పుడే మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. దీంతో కొన్ని నెలల పాటు పవన్ ఫ్యామిలీ హైదరాబాద్‌లోనే వుంటుందని తెలుస్తోంది. ఆ తరువాత కూడా వారు సింగపూర్‌కు వెళ్తారా..? లేదా ఇక్కడే ఏదైనా మంచి స్కూల్లో బాబుని జాయిన్ చేస్తారో తెలియాల్సి వుంది. హైదరాబాద్‌లో కూడా చాలావరకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖల పిల్లలు వాటిలో చదువుతున్నారు. సింగపూర్‌లో అన్నా లెజినోవా చదవు కూడా పూర్తి అయింది కాబట్టి వారు హైదరాబాద్‌లోనే ఉండే ఛాన్స్ ఎక్కువని అంటున్నారు. -
సింగపూర్ నుంచి ఇండియాకు చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఫ్యామిలీ
-
‘కూటమి’ డైవర్ట్ పాలిటిక్స్.. వైఎస్ జగన్‌పై పెద్ద కుట్రే జరుగుతుందా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా ఏదైనా పెద్ద కుట్ర జరుగుతోందా? లేక ఏపీ ప్రజల అసంతృప్తిని కప్పిపుచ్చి డైవర్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం చూస్తోందా? వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనను తెలుగుదేశం మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతులు కవర్ చేసిన తీరు చూస్తే ఎవరికైనా ఈ అనుమానాలు రాకమానవు. హోంశాఖ మంత్రి అనిత, టీడీపీ లోక్‌సభ సభ్యుడు లావు కృష్ణదేవరాయళ్ల వ్యాఖ్యలు అనుమానాలను మరింత బలపరిచేవిగా ఉంటున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ నేత కురుబ లింగమయ్య బీసీ వర్గపు నేత. ఆ ప్రాంతంలో ఈ వర్గానికి మంచి పట్టే ఉంది. హత్య వెనుక రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గానికి చెందిన కొందరు ఉన్నారన్నది అభియోగం. మొత్తం ఇరవై మందిపై ఫిర్యాదు చేస్తే ఇద్దరిపైనే కేసు పెట్టారట. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్లడానికి సిద్దమైన రోజు నుంచి పరిటాల సునీత ఆయనపై పలు విమర్శలు చేశారు. కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేశారు.దానికి అక్కడి వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇది ఒక నియోజకవర్గానికి పరిమితం అనుకుంటే, దానిని హోం మంత్రి రాష్ట్రస్థాయి వివాదంగా మార్చితే, టీడీపీ ఎంపీ జాతీయ స్థాయికి తీసుకువెళ్లే యత్నం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఆయన లేఖ రాసిన తీరు, అందులో ప్రస్తావించిన అంశాలు అన్ని కూడా జగన్ కు వ్యతిరేకంగా పెద్ద కుట్రకు ఏమైనా ప్లాన్ చేశారా అన్న సందేహం వస్తుంది. విశేషం ఏమిటంటే గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి వారు పల్నాడు ప్రాంతంలో కక్షల రాజకీయాలను ఎగదోసేలా వ్యాఖ్యలు చేసినప్పుడు , ఆయా చోట్ల పోలీసులపై దూషణలకు దిగినప్పుడు ఇదే లావు శ్రీకృష్ణదేవ రాయలు వైసీపీ ఎంపి. టీడీపీ నేతలపై ఆయన కూడా విమర్శలు చేసే ఉంటారు కదా! అదే రాయలును ప్రయోగించి టీడీపీ నాయకత్వం కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయించింది. నిజానికి జగన్ టూర్ సందర్భంగా జరిగిన ఘటనలపై కేంద్రానికి ఫిర్యాదు చేయవలసినంత పరిస్థితి ఏమిటో అర్థం కాదు. పైగా అందులో కేవలం రాప్తాడు అంశంతో ఆపకుండా, గత ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీ చేసే పిచ్చి ఆరోపణలన్నిటిని కలగలిపి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. అవసరం రీత్యా టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ అధిష్టానం పొత్తుకు సిద్దమైంది తప్ప, ఆయనపై నమ్మకం, విశ్వాసంతో కాదన్న సంగతి అందరికి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీని, అమిత్ షా ను చంద్రబాబు ఎంతగా దూషించింది వారికి తెలియదా? జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయినా, ఎన్నడూ అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. బీజేపీ పెద్దలు కూడా జగన్ పై ఆ గౌరవం చూపుతూ వచ్చారు.ఇప్పుడు తెలుగుదేశం వ్యూహాత్మకంగా జగన్ పై వారికి ఉన్న సదభిప్రాయాన్ని చెడగొట్టి, ఏదో రకంగా కేసులు పెట్టించి రాజకీయంగా దెబ్బ కొట్టాలన్న దురుద్దేశంతో ఇలా లేఖలు రాయిస్తున్నట్లు కనబడుతుంది. జగన్ ప్రజలలో తిరుగుతుంటే వస్తున్న ఆదరణ చూసి కూటమి నేతలు ఖంగు తింటున్నారు. జగన్‌ది నిజంగానే కుట్ర స్వభావమై ఉంటే, అసలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు బీజేపీ పంచన చేరే అవకాశం ఎందుకు రానిస్తారు? ఆయనే ఎన్డీయే కూటమిలో చేరి ఉండేవారు కదా! కాని ఒక సిద్దాంతానికి కట్టుబడి ఆయన అందులో చేరలేదు. అంశాల వారిగా మద్దతు ఇవ్వడం లేదా, వ్యతిరేకించడం చేస్తూ వచ్చారు. ఉదాహరణకు వక్ఫ్ బిల్లుపై వైసీపీ స్పష్టంగా వ్యతిరేకిస్తే, దానిని కూడా వక్రీకరించడానికి టీడీపీ మీడియా ఎన్ని పాట్లు పడింది చూశాం. అదే చంద్రబాబు గతంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక ట్రిపుల్ తలాఖ్, ముస్లింలకు సంబంధించిన ఇతర అంశాల్లోనూ బీజేపీని, మోడీని ఎంతో ఘాటుగా విమర్శించారు. కాని ఇప్పుడు ఎన్డీయేతో కలిసి, కిక్కురుమనకుండా కేంద్రానికి మద్దతు ఇచ్చారు. దీనిపై రాష్ట్రంలో ముస్లిం వర్గాలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.జగన్ పై 11 సీబీఐ కేసులు, 9 ఈడి కేసులు ఉన్నాయని రాయలు ఇప్పుడు ఆ లేఖలో పేర్కొనడమే కుట్ర. అన్ని కేసులు ఉన్నప్పుడే వైసీపీలో చేరి ఈయన ఎంపీ అయ్యారు కదా! అసలు ఆ కేసులన్నీ కక్ష పూరితమని బీజేపీ నేత, దివంగత సుష్మా స్వరాజ్ పార్లమెంటులోనే చెప్పిన విషయం ఈయనకు తెలియదా? జగన్‌ను ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ అంటూ రాసిన లేఖపై కృష్ణదేవరాయలు సంతకం చేశారంటే ఆయనకు ఆత్మ అనేది ఉందా అన్న సందేహం వస్తుంది. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్ని కుట్రలు చేసిందీ... ఎన్ని అక్రమాలకు పాల్పడిందీ ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకంలోనే ఉన్నాయి కదా? సొంత మామను పదవి నుంచి తోసేసి ఎలాంటి కుట్రలేదని తన తండ్రి రత్తయ్యతో చెప్పించి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన 1996లో లక్ష్మీపార్వతి ఆధ్వర్వంలోని ఎన్టీఆర్ టీడీపీ తరపున పోటీ చేశారు. లావుకు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇస్తూ చంద్రబాబుపై పలు కేసులు ఉన్నాయని, ఆయన కూడా బెయిల్ పై ఉన్నారని, కనుక ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ అని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. జగన్ ప్రజలలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారట. ఎంత దుర్మార్గపు ఆరోపణ. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మతం పేరుతో, కులం పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంత దారుణమైన రాజకీయం చేసింది లావుకు తెలియదా? వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబందించి కూడా జగన్‌పై నీచంగా లేఖలో ప్రస్తావించడం ద్వారా టీడీపీ ఏదో కుట్ర చేస్తోందన్న అనుమానం కలగదా? విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లు ఏ మాదిరిగా పోలీసులను తిట్టింది ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయే. పోలీసులను జగన్ కక్ష సాధింపులకు వాడుకున్నారట. ఆ పని నిజంగా చేసిఉంటే చంద్రబాబు, లోకేశ్ పవన్ కళ్యాణ్‌లపై అప్పట్లో ఎన్ని కేసులు వచ్చి ఉండాలి? ఇప్పుడు రెడ్ బుక్ పేరుతో జరుగుతున్న అరాచకాలను గమనిస్తే జగన్ టైమ్‌లో ఎక్కడైనా ఒకటి, అరా జరిగాయేమో తప్ప, రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. అయినా కార్యకర్తలను రెచ్చగొట్టి కేసులు పెట్టించుకోవాలని సూచించింది చంద్రబాబు, లోకేశ్‌లు కాదా? ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి ఇస్తానని ఆఫర్ చేసింది వారు కాదా? ఐదేళ్ల క్రితం ఏదో అన్నారనో, లేక ఏదో జరిగిందని, ఇప్పుడు తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ కేసులు పెట్టడాన్ని కక్ష రాజకీయాలు అంటారా? లేక అలాంటి కేసులే పెట్టని జగన్ పాలనను కక్ష పూరిత పాలన అంటారా? జగన్ భద్రతకు సంబంధించి లావుతో పాటు మంత్రి అనిత కూడా ఏదో వాదన చేశారు. ఈ ఒక్కదానికి సమాధానం చెప్పగలరా? 250 మంది పోలీసులు జగన్ హెలికాఫ్టర్ వద్ద నిజంగా ఉండి ఉంటే, అక్కడ చేరిన వంద మంది,లేదా రెండు వందల మందిని వెనక్కి పంపించలేకపోయారా? వారిని అక్కడకు రాకుండా ఆపలేకపోయారా? ఏపీ పోలీసులు అంత అసమర్థులని వీరు చెబుతున్నారా? హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడంతో వీఐపీలను తీసుకువెళ్లడం రిస్కు అని పైలట్ అన్నారే తప్ప, తాము వెళ్లలేమని ఎక్కడైనా చెప్పారా? ఇంతకు ముందు కూడా జగన్ ఆయా చోట్లకు హెలికాఫ్టర్ లో వెళ్లి వచ్చారు కదా? అక్కడ కూడా ఇలాగే జరిగిందా? లేదే! జగన్ పోలీసులందరిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏదో భూకంపం వచ్చేసినట్లుగా దీనికి కవరేజీ ఇస్తోంది. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పోలీసులను ఉద్దేశించి జగన్ అన్నారు. మరి చంద్రబాబు, లోకేశ్‌లు పోలీసు అధికారులను అంతకన్నా దారుణంగా దూషించిన వీడియోలు కనబడుతున్నాయి కదా?పోలీసు అధికారుల సంఘం కూడా వాటిని ఎందుకు ప్రస్తావించడం లేదు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా జగన్ నే విమర్శించారు తప్ప, అంతకు ముందు చంద్రబాబు దూషణల గురించి మాట్లాడడం లేదే! హోం మంత్రి అనిత అయితే ఏకంగా టీడీపీని భుజాన వేసుకుని మోస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్న ఎస్.ఐ.ని దమ్మున్నోడు అని ప్రశంసించారంటే ఇంతకన్నా సిగ్గు చేటైన విషయం ఏమి ఉంటుంది? అసలు హోం శాఖలో ఏమి జరుగుతోందో అమెకు తెలుసా అన్నది ఒక సందేహం. ఎందుకంటే రెడ్ బుక్ పేరుతో మొత్తం హోం శాఖను నడుపుతున్నది లోకేశే అని అంతా చెబుతున్నారు. మీడియాతో మాట్లాడేటప్పుడు వ్యవస్థను పాడుచేసేలా ఒక మంత్రే మాట్లాడిన తీరు చూస్తే తెలుగు దేశం ఆధ్వర్యంలో వ్యవస్థలు ఎంతగా దిగజారాయో అవగతం అవుతుంది. పనిలో పని లావు కృష్ణదేవ రాయలు, కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో సరికొత్త రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని అమిత్ షా కు తెలియచేసి ఆయన మెప్పు పొందగలిగితే బాగుండేది కదా? ఒక వైపు చంద్రబాబు ఆయా స్కామ్ లలో నిందితుడుగా ఉన్నారు. ఆయన కూడా బెయిల్ పైనే ఉన్న విషయం జనం మర్చిపోయారన్నది వారి ఉద్దేశం కావచ్చు. ఆయా స్కాములను నీరుకార్చే పనిలో ఉండి ఉండవచ్చు. వాటన్నిని కప్పిపుచ్చి జగన్ పై తట్టెడు బురద వేయడం ద్వారా వైసీపీని దెబ్బ తీయాలని అనుకుంటే అది అంత తేలిక కాదు. సూపర్ సిక్స్ గురించి కాని, కక్ష రాజకీయాల గురించి కాని ప్రజలలో ఈ ప్రభుత్వం పట్ల ఏహ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి కొత్త కుట్రలకు ఎల్లో మీడియాతో కలిసి కూటమి ప్రభుత్వం తెరదీసింది. ఈ తరహా వ్యూహాలలో చంద్రబాబును మించిన నేత దేశంలోనే మరెవ్వరైనా ఉన్నారా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చెప్పుతీసి కొడతా అన్న పిఠాపురం పీఠాధిపతి పవన్ పై ఎన్ని కేసులు పెట్టారు?
-
Big Question: కూటమి పాపమే తిరుమల కొండకు శాపమా?
-
నా రెండో పెళ్లిపై అంత ఆసక్తి ఎందుకు?.. రేణు దేశాయ్ ఆగ్రహం
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. తనపై వస్తున్న వార్తలపై స్పందించారు. తన రెండో పెళ్లిపై మీకు ఎంత ఆసక్తి అని ప్రశ్నించారు. ఇలాంటి వార్తలతో సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? అని రేణు దేశాయ్ నిలదీశారు. సోషల్ మీడియాలో తన రెండో పెళ్లిపై వస్తున్న వార్తలపై ఆమె మండిపడ్డారు.కాగా.. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి రేణు దేశాయ్ మాట్లాడారు. దీంతో పాటు పలు అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రాజకీయాల్లోకి రావడంపై కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగే సమాజంలో జరుగుతున్న పలు విషయాలపై కూజా మాట్లాడారు. ఇవన్నీ వదిలేసి కేవలం తన రెండో పెళ్లినే ఎందుకు హైలెట్ చేస్తున్నారంటూ రేణు దేశాయ్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశారు.రేణు దేశాయ్ సోషల్ మీడియాలో రాస్తూ..' మీడియా వాళ్లు నా రెండో పెళ్లి గురించి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నారని నాకు అర్థమైంది. నేను గంటకు పైగా మాట్లాడిన పాడ్‌కాస్ట్‌లో మన సమాజానికి ఉపయోగమైన చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడా. కానీ వాటిని గురించి చర్చ చేయరు. సమస్యల కంటే నా రెండో పెళ్లికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. నేను మీ అందరినీ కోరుకునేది ఒక్కటే.. దయ చేసి ఈ 44 ఏళ్ల మహిళ వివాహం గురించి మీ దృష్టిని మరల్చండి'అని పోస్ట్ చేశారు. -
టీడీపీ, జనసేన మధ్య ఏం నడుస్తోంది?
ఆంధ్రప్రదేశ్ కూటమి భాగస్వాములు టీడీపీ, జనసేనల మధ్య అంతా బాగానే ఉందా? లేక ఎవరికి వారు తమదైన రాజకీయ క్రీడలు ఆడేస్తున్నారా? ఈ అనుమానం ఎందుకొస్తోందంటే.. ఒకపక్క సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేశ్.. పవన్ కళ్యాణ్‌ను అతిగా పొగిడేస్తూంటే.. ఇంకోపక్క పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూండటం!. ఇదే సమయంలో చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడంటూ పలు కార్యక్రమాల్లో ప్రశంసిస్తూండటం.. ఏదో తేడా కొడుతున్నట్టుగానే ఉంది రాజకీయ విశ్లేషకులకు! ఇప్పటికిప్పుడు ఇరు పార్టీల్లో పెద్ద విభేదాలేవీ స్పష్టం కాకపోయినప్పటికీ పిఠాపురం వ్యవహారం మాత్రం వివాదాల్లోనే ఉంటోంది.జనసేన గెలిచిన ఇతర నియోజకవర్గాల్లోనూ టీడీపీ స్థానిక నేతలు తాము చెప్పిన వారికే పనులు చేయాలని ఏకంగా లేఖలు రాస్తుండటం కూడా ఇరు పార్టీల మధ్య సయోధ్యపై ప్రశ్నలు విసురుతోంది!. అక్కడ వర్మకు ఎమ్మెల్సీ పదవి రాకుండా పవన్ టీడీపీపై ఒత్తిడి చేయగలిగారని అంటారు. అంతేకాక తన బదులు నాగబాబును నియోజకవర్గంలో తిప్పుతూ ప్రభుత్వ కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఈ సందర్భంగా వర్మకు అసలు విలువ ఇవ్వడం లేదు. దాంతో రెండు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటున్నారు. నాగబాబుకు అసాధారణ స్థాయిలో పోలీసులు భద్రత కల్పించడం కూడా ఆసక్తికరమైన విషయమే. రెండు వర్గాల మధ్య ఏదైనా గొడవ చెలరేగితే వచ్చే ఇబ్బందుల రీత్యా ఇలా చేసి ఉండవచ్చు.నెల్లిమర్ల నియోజకవర్గంలో స్థానిక టీడీపీ నేత తాము చెప్పినవారికే పనులు చేయాలని అధికారులకు ఉత్తరం రాయడం విశేషం. ఇక్కడే కాదు. ఆయా చోట్ల జనసేన ఎమ్మెల్యేలు ఉన్నా, పెత్తనం టీడీపీ వారే చేస్తున్నారన్నది జనసేన కేడర్‌లో బాధగా ఉంది. తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే, సమస్య ఏమిటో తెలుసుకోకుండా జనసేన అధిష్టానం తన పార్టీ నేతనే మందలించిందన్న వార్తలు వచ్చాయి. రాజకీయాలలో ఇవన్ని సాధారణంగా జరిగేవే. అయినా ఒక్కొక్కటిగా గొడవలు పెరుగుతూ, ఆ తర్వాత రోజులలో అవే పెద్దవిగా మారుతుంటాయి. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయిన తర్వాత పవన్ కళ్యాణ్, లోకేశ్‌ల మధ్య స్నేహం పెరిగిన మాట నిజమైనా.. ఎన్నికల తరువాత మాత్రం వీరిద్దరూ అంటీ అంటనట్టుగానే ఉన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తరువాత లోకేశ్ ఒకరకంగా పవన్ కళ్యాణ్‌ను అవమానించేలా వ్యాఖ్యానించారు కూడా. టీటీడీ అధికారులు, ఛైర్మన్ క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తే, అది ఆయన పార్టీ అభిప్రాయం అని లోకేశ్ తీసిపారేశారు. చైర్మన్‌తో తూతూ మంత్రంగా క్షమాపణ చెప్పించారు తప్పితే పవన్ కోరినట్లు అధికారులపై ముఖ్యమంత్రి చర్య తీసుకోలేదు. క్షమాపణలు కూడా చెప్పించ లేదు. పవన్ కళ్యాణ్ వద్ద పనిచేసే అధికారుల నియామకం విషయంలో కూడా లోకేశ్ జోక్యం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. దానిపై పవన్ ఢిల్లీలో కూడా నిరసన చెప్పారని కథనాలు వ్యాపించాయి.అటవీ శాఖకు చెందిన భూమిలో ఉందన్న సాకుతో కాశీనాయన ఆశ్రమంలో భవనాలు కూల్చిన ఘటనపై పవన్ మాట్లాడ లేదు కానీ, లోకేశ్ క్షమాపణ చెప్పడం విశేషం. నిజానికి లోకేశ్‌కు జనసేనతో పొత్తు అంత ఇష్టం లేదని ఎన్నికల ముందు ప్రచారం జరిగింది. దానికి తగినట్లే పవన్‌కు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఉండదని, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం పాలిట్‌బ్యూరో నిర్ణయమని లోకేశ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయినా పవన్ సర్దుకుపోయారు. బీజేపీ వారు ఏభై సీట్లు డిమాండ్ చేయమని సూచించినా, పవన్ పట్టుబట్టలేదు. పైగా టీడీపీకి చెందిన వారికే కొందరికి తన పార్టీ టిక్కెట్లు ఇచ్చి చంద్రబాబు ఏం చెబితే అది చేశారని అంటారు.2017 ప్రాంతంలో లోకేశ్‌పై పవన్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలే చేసినా 2020 నాటికి రాజీపడిపోయి చంద్రబాబుతో చేతులు కలిపారు. 2024లో అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్‌ల కన్నా లోకేశ్ పవర్ఫుల్ అయ్యారన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. తాను కూడా అలాగే ఇతర శాఖలలో జోక్యం చేసుకోవాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ, పౌర సరఫరాల శాఖలో వేలు పెట్టి ‘సీజ్ ద షిప్’ అని అధికారులను ఆదేశించి పవన్ నవ్వులపాలయ్యారు. చంద్రబాబు, పవన్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు ఇంతవరకు కనిపించలేదు కానీ.. లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అంశంలో పవన్ అభ్యంతరం చెప్పారని రెండు పార్టీలలో గుసగుసలు వినిపించాయి. అందువల్లే లోకేశ్ కోరిక తీరలేదని అంటారు. ఇప్పటికే లోకేశ్‌ను సీఎంను చేయాలని చంద్రబాబుపై కుటుంబపరంగా ఒత్తిడి ఉందని చెబుతారు. అయినా పవన్ కళ్యాణ్ నుంచి సమస్య వస్తుందని చంద్రబాబు సర్ది చెబుతుండవచ్చన్నది ఎక్కువ మంది అభిప్రాయం.ఇక, ఇది నిజమా? కాదా? అన్నది చెప్పలేం కానీ.. పవన్ కళ్యాణ్ ఆయా సభలలో చంద్రబాబు పదిహేనేళ్లు సీఎంగా ఉండాలని, ఆయన సమర్థుడని, అనుభవజ్ఞుడని పనికట్టుకుని పొగుడుతున్న తీరు లోకేశ్ అనుచరులకు మింగుడుపడటం లేదనిపిస్తుంది. కేవలం లోకేశ్‌ను సీఎం కానివ్వకుండా, లేదా డిప్యూటీ సీఎం ప్రమోషన్ రానివ్వకుండా చూడడానికి పవన్ ప్రకటనలు ఉపయోగపడుతున్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలోనే లోకేశ్ వ్యూహం మార్చి తన ప్రమోషన్‌కు పవన్ కళ్యాణ్ నుంచి ఆటంకం లేకుండా ఉండడానికి ప్రయత్నాలు ఆరంభించారా అన్న సందేహం కలుగుతుంది. కొన్నాళ్లుగా లోకేశ్ తనకు సంబంధం లేని శాఖలలో కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు హాజరవుతున్నారు. ఆ సభలలో ఒకటికి రెండుసార్లు 'పవనన్న, పవనన్న’ అని ప్రస్తావిస్తూండటం.. ‘పవనన్న పట్టుబడితే సాధించి తీరుతారని, కేంద్రం నుంచి కూడా నిధులు తెస్తున్నారని’ పొగడ్తలు కురిపిస్తున్నారు.గతంలో ఇలాంటి ప్రోగ్రాంలను చంద్రబాబు వదలి పెట్టేవారు కారు. ఇప్పుడు తన కుమారుడి ఆధిపత్యానికి ఆయన అడ్డు చెప్పడం లేదు. దాంతో టీడీపీ మంత్రులు లోకేశ్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రకాశం, అనకాపల్లి జిల్లాలలో లోకేశ్ పర్యటనలే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు తర్వాత పెత్తనం ఎటూ లోకేశ్‌దే కనుక ఇందులో పెద్దగా ఆక్షేపించవలసింది ఉండకపోవచ్చు. పార్టీ పరంగా అయితే ఏమైనా చేసుకోవచ్చు కాని, ప్రభుత్వ పరంగా లోకేశ్ ఇలా పెత్తనం చెలాయించడం కరెక్టేనా అన్న చర్చ వస్తుంది.మరోవైపు, పవన్ కళ్యాణ్ మాత్రం సభలలో చంద్రబాబునే పొగుడుతూ, లోకేశ్‌ను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అయినప్పటికీ లోకేశ్ బుజ్జగించి పవన్‌ను తన దారిలోకి తెచ్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చన్నది పలువురి భావన. పదిహేనేళ్లు కలిసి ఉండాలని అనుకుంటున్నప్పుడు మరీ తేడా ఏదైనా వస్తే తప్ప భవిష్యత్తులో లోకేశ్‌కు కూడా విధేయత ప్రదర్శించక తప్పని స్థితి పవన్‌కు వస్తుందని అంటున్నారు. చంద్రబాబుకు ఇప్పటికే 74 ఏళ్లు వచ్చినందున భవిష్యత్తులో ఆ పరిణామం జరగవచ్చు. లోకేశ్ మరో మాట కూడా చెబుతున్నారు.టీడీపీ, జనసేనల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా కూర్చుని పరిష్కరించుకుంటాము తప్ప వేరు పడబోమని అన్నారు. ఇది కూడా గమనించవలసిన అంశమే. రాజకీయాలలో పైకి ఒకటి చెబుతారు. లోపల జరిగేవి వేరుగా ఉంటుంటాయి. అలాగే పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ఎవరి వ్యూహాలతో వారు ముందుకు వెళుతూ, కలిసి ఉన్నట్లు కనిపిస్తూనే ఎవరికి వారు పైచేయి తెచ్చుకునేందుకు యత్నించినా ఆశ్చర్యం ఉండదు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
'ఆ దేవుడే రక్షించాడు'.. మార్క్ శంకర్ ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడని ఆయన తెలిపారు. అయితే బాబు ఇంకా కోలుకోవాలని.. మా కుల దైవం ఆంజనేయ స్వామి దయతో మళ్లీ మామూలుగా వస్తాడని ట్వీట్ చేశారు. ఓ పెద్ద ప్రమాదం నుంచి పసిబిడ్డని హనుమాన్ రక్షించాడని పోస్ట్ చేశారు. మార్క్ శంకర్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ నా తరపున, తమ్ముడు పవన్ కల్యాణ్ తరఫున ధన్యవాదాలు తెలియచేస్తున్నా అని రాసుకొచ్చారు.మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు. అయితే బాబు ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు. రేపు హనుమత్ జయంతి.. ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊర్లలో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కల్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం' అని పోస్ట్ చేశారు.ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభరం మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విశ్వంభరకు సంబంధించిన మెగా అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు.రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా… pic.twitter.com/nEcWQEj92v— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2025 -
జనసేన జోగినేని మణి అరాచకం.. మహిళతో అనుచిత ప్రవర్తన
సాక్షి, వైఎస్సార్: ఏపీలో జనసేన నాయకుడు జోగినేని మణి అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీరామనవమి రోజున ఓ మహిళను కాళ్లతో తన్ని.. తనకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు గురిచేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, సదరు బాధితురాలు.. మణి వల్ల తమకు ప్రాణహని ఉందని పోలీసులను ఆశ్రయించారు.వివరాల ప్రకారం.. పోసాని కృష్ణమురళిపై ఓబులవారిపల్లి పీఎస్‌లో కేసు పెట్టిన జనసేన నాయకుడు జోగినేని మణి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. శ్రీరామనవమి రోజున మణి.. అదే మండలం చెన్నరాజుపోడు గ్రామానికి చెందిన మహిళ రాజేశ్వరిని కాళ్లతో తన్ని దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు గురిచేశాడు. అనంతరం, పత్తి రాజేశ్వరిపై దాడి చేశాడు. ఈ సందర్భంగా మణి.. తనకు పవన్ కల్యాణ్, హోం మంత్రి అందరూ తెలుసు. నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ చులకన చేసి మాట్లాడాడు. దీంతో, మణి వల్ల తనకు ప్రాణహాని ఉంది బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఇక, జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్‌గా జోగినేని మణి కొనసాగుతున్నాడు. అంతకుముందు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విమర్శించాడంటూ పోసాని కృష్ణమురళిపై మణి కేసు పెట్టిన విషయం తెలిసిందే. అతని ఫిర్యాదు మేరకు అప్పట్లో ఆఘమేఘాలపై పోసానిని అరెస్టు చేశారు పోలీసులు. తాజగా మణి అరాచకాలను బాధితురాలు.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే?.. రేణు దేశాయ్ సమాధానం ఇదే!
పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్.. రెండేళ్ల క్రితమే టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో కీలక పాత్రలో మెప్పించింది. అయితే ప్రస్తుతం సినిమాలేమీ చేయకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటోంది. సమాజంలో జరుగుతున్న విషయాలపై కూడా రియాక్ట్ అవుతూ ఉంటోంది. ఇటీవల హెచ్‌సీయూ భూముల వివాదంపై రేణు దేశాయ్ స్పందించారు. వన్య ప్రాణులను ఇబ్బంది పెట్టొద్దని సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న విషయంపై మాట్లాడారు. రెండో పెళ్లిపై చేసుకోవాలని చాలా సార్లు అనిపించింది.. కానీ నాపై ఇద్దరు పిల్లల బాధ్యత ఉందని గుర్తు చేసుకున్నారు. నాకు, పిల్లలకు మధ్య మరో వ్యక్తి వస్తే ఎలా ఉంటుందనేది చాలా సెన్సిటివ్ విషయమని రేణు దేశాయ్ తెలిపింది.రేణు దేశాయ్ మాట్లాడుతూ.. "నాకు కూడా భాగస్వామి కావాలని అనిపిస్తుంది. కానీ నా పిల్లల పట్ల నాకున్న బాధ్యత వల్లే సింగిల్‌గా ఉంటున్నా. వ్యక్తిగతంగా చూస్తే నాకు బాయ్‌ఫ్రెండ్ ఉండాలి.. నాకు పెళ్లి కావాలి.. నాకంటూ ప్రత్యేకమైన జీవితం ఉండాలని ఉంటుంది. కానీ నేను పిల్లల కోణం నుంచి ఆలోచిస్తే ఇది సాధ్యం కాదు. నా పిల్లలకు నేను సింగిల్ పేరేంట్. ఆద్యకు ఇప్పుడు 15 ఏళ్లు. మరో మూడేళ్ల తర్వాత తాను కాలేజీకి వెళ్తుంది. ఆద్య తన జీవితంలో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నా' అని చెప్పుకొచ్చింది.కాగా.. రేణు దేశాయ్, పవన్ కల్యాణ్ బద్రి, జానీ చిత్రాల్లో జంటగా నటించారు. 2009లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఇద్దరి మధ్య రిలేషన్లో మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. -
అసలు నువ్వు నిజంగా చదువుకున్నావా..? పవన్ పై నిప్పులు చెరిగిన వలంటీర్
-
పవన్ కుమారుడి ఆరోగ్య పరిస్థితి ఇది
-
చంద్రబాబు తప్పుకుంటేనే మంచిదా వర్మ?
కాకినాడ, సాక్షి: అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచిపోయాయి. చేసిన త్యాగానికి ఒక పదవీ దక్కలేదు. రాజకీయంగా తన నియోజకవర్గంలోనే ప్రాధాన్యం దక్కడం లేదు. పైగా మిత్రపక్ష పార్టీ.. ఆ పార్టీ తరఫున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ ఆధిపత్యాన్ని తట్టుకోలేకపోతున్నారాయన. ఈ వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్‌ను ప్రమోట్ చేసే బాధ్యతలను ఎత్తుకున్నారు. టీడీపీ అధినాయకత్వ మార్పుపై వర్మ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. ‘‘నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వల్లే టీడీపీ అధికారంలోకి రాగలిగింది. కాబట్టి టీడీపీకి లోకేష్ నాయకత్వం అవసరం. పార్టీ సారధిగా లోకేష్‌ను నియమించేలా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలి. పార్టీకి 2047 ప్రణాళిక కావాలి’’ అని అన్నారాయన. అయితే వర్మ వ్యాఖ్యలు పరోక్షంగా చంద్రబాబును తప్పుకోమని చెప్పడమేనన్న విశ్లేషణ నడుస్తోంది. కూటమి పార్టీలో టీడీపీ జనసేన అధినేతల మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ, లోకేష్‌తోనే పవన్‌కు గ్యాప్ ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కిందటి ఏడాది ఎన్నికల సమయంలో పొత్తు కుదరడం దగ్గరి నుంచి.. లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చేయాలనే ప్రచారం దాకా నడిచిన పరిణామాలు ఎంత హాట్ హాట్‌గా సాగాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు వల్ల కాకపోవడంతో పవన్ పార్టీ డామినేషన్‌కు చెక్ పెట్టేందుకే వర్మ లోకేష్ జపం మొదలుపెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్..: జూనియర్ ఎన్టీఆర్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిన్నకుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ (Mark Shankar Pawanovich) అగ్నిప్రమాదంలో గాయపడ్డ ఘటనపై హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్పందించాడు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడని తెలిసి ఎంతో బాధపడ్డాను. అతడు త్వరగా కోలుకోవాలి. లిటిల్ వారియర్.. ధైర్యంగా ఉండు. పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులకు బలం చేకూరాలంటూ ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్ చేశాడు.ఏం జరిగిందంటే? పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ వేసవి శిక్షణ తరగతులకు సింగపూర్‌లోని రివర్ వ్యాలీ రోడ్ ఎడ్యుకేషన్ సెంటర్‌కు వెళ్లాడు. ఏప్రిల్ 8న ఈ ఎడ్యుకేషన్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మార్క్ శంకర్ చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. దీంతో వెంటనే స్కూల్ యాజమాన్యం అతడిని ఆస్పత్రిలో చేర్పించింది. ప్రస్తుతం శంకర్‌కు బ్రాంకోస్కోపీ చేస్తున్నట్లు పవన్ వెల్లడించారు. తన పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజే చిన్న కుమారుడికి ఇలా జరగడం బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు.Saddened to hear about Mark Shankar being caught in a fire mishap in Singapore. Wishing him a speedy recovery. Stay strong ,little warrior ! Strength and prayers to Shri @PawanKalyan garu and family.— Jr NTR (@tarak9999) April 9, 2025 చదవండి: Saptagiri: విషాదం.. బాధలో కమెడియన్ సప్తగిరి -
జగన్ కు థాంక్స్ చెప్పిన పవన్
-
మా అబ్బాయి గాయపడ్డాడు.. వారికి నా కృతజ్ఞతలు: పవన్
సాక్షి, అమరావతి: సింగపూర్‌లో వేసవి శిక్షణ తరగతులకు వెళ్లిన తన రెండవ కుమారుడు మార్క్ శంకర్.. అక్కడ తరగతి గదిలో మంగళవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడని, ప్రాణాపాయమైతే లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ క్రమంలో తాను అరకు పర్యటనలో భాగంగా గిరిజన గ్రామాల సందర్శనలో ఉండగా ప్రమాదం గురించి తన భార్య అన్నా నుంచి ఫోన్ కాల్ వచ్చిందన్నారు. ఆ తర్వాత ఇక్కడ (హైదరాబాద్)కు వచ్చానన్నారు. ప్రమాదం చిన్నదే అని తొలుత భావించానని, అయితే ఒక చిన్నారి మృతి చెందడంతో పాటు 30 మంది గాయాల పాలవ్వడం తీవ్రంగా కలచి వేసిందన్నారు. ప్రమాదంలో చిన్నారి మార్క్ శంకర్ చేతులు, కాళ్లపై గాయాలయ్యాయని, ఆ సమయంలో దట్టమైన పొగ పీల్చడంతో అది ఊపిరితిత్తుల్లోకి చేరినట్టు వైద్యులు తెలిపారన్నారు. దాని నుంచి ఉపశమనం కలిగించేందుకు బ్రాంకోస్కోపీ జరుగుతోందని, ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు స్పష్టం చేశారని చెప్పారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తొలుత గుర్తించి, పిల్లలను కాపాడిన భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారు వెంటనే స్పందించడం వల్ల చాలా మంది పిల్లల ప్రాణాలను కాపాడగలిగారన్నారు.‘పిల్లలు తరగతి గదులకు వెళ్లి సురక్షితంగా తిరిగి వస్తారని తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటాం. ఇలాంటి వార్తలు వినాల్సి వచ్చినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఏడేళ్ల మార్క్ శంకర్‌కు ప్రమాదంలో చిన్న గాయాలు అయినప్పటికీ, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో అది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఈ ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ రోజు నా పెద్ద కుమారుడు అకీరానందన్ పుట్టిన రోజు. దురదృష్టవశాత్తు ఈ రోజు నా చిన్న కుమారుడికి గాయాలు అవడం బాధాకరం. విషయం తెలిసిన వెంటనే ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది.ప్రధాని నరేంద్ర మోదీ.. మార్క్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. వెంటనే సింగపూర్‌లో తగు వైద్య ఏర్పాట్లు చేయాలని భారత హై కమిషనర్‌కు ఆదేశాలిచ్చారు. అరకులో ఉండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానికి, సీఎంకు ధన్యవాదాలు. ఆపద సమయంలో వెంటనే స్పందించి నిండు మనసుతో మార్క్ శంకర్ బాగుండాలని అభిలాషించిన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సహచర సినీ ప్రముఖులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జనసేన శ్రేణులు, ఇతరులందరికీ కృతజ్ఞతలు. ఈ రాత్రి (మంగళవారం)కి కుమారుడి వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాను’ అని చెప్పారు. కాగా, ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతికి గురయ్యామని బీజేపీ రాష్ట్ర «అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. -
అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడిన ఘటనపై YS జగన్ దిగ్భ్రాంతి
-
అకీరా పుట్టినరోజే ఇలా జరగడం బాధాకరం: పవన్ కల్యాణ్
హైదరాబాద్, సాక్షి: సింగపూర్‌లో తన చిన్నకొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్(Mark Shankar Pawanovich) ప్రమాదానికి గురి కావడంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan) స్పందించారు. ప్రమాద తీవ్రత ఇంతలా ఉంటుందని ఊహించలేదని.. తన కొడుకుకు గాయాలైన మాట వాస్తవమేనని ధృవీకరించారాయన. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు.ఉదయం అరకు పర్యటనలో ఉండగా నాకు ఫోన్ వచ్చింది. సింగపూర్ హైకమిషనర్ సమాచారం అందించారు. నా కొడుకు మార్క్ శంకర్ స్కూల్లో ప్రమాదం జరిగింది. మొదట చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నా. కానీ, ప్రమాద తీవ్రత ఇంత ఉంటుందని ఊహించలేదు. 30 మంది పిల్లలు సమ్మర్ క్యాంప్‌లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ పసిబిడ్డ చనిపోయింది. నా కుమారుడు మార్క్ శంకర్‌కు చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తులోకి పొగ వెళ్లినట్లు తెలిసింది. ప్రధాని మోదీ ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. నా పెద్దకొడుకు అకీరా పుట్టినరోజే చిన్నకొడుక్కి ఇలా జరగడం బాధాకరం’’ అని పవన్ అన్నారు. సింగపూర్‌లో నా కుమారుడి అగ్నిప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీ(PM Modi)కి ధన్యవాదాలు. అలాగే సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ సహా అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు అని పవన్ అన్నారు.ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 9,45గం. ప్రాంతంలో సింగపూర్(Singapore) రివర్ వ్యాలీ రోడ్ ఎడ్యుకేషన్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బడిలో 80 మంది పిల్లలు ఉన్నారు. అరగంటపాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించగా.. 15 మంది పిల్లలు, నలుగురు స్టాఫ్ గాయపడ్డారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. పవన్-అన్నాలెజినోవాలకు కూతురు పోలేనా అంజనా పవనోవా, కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సంతానం. -
గెట్ వెల్ సూన్ చిన్నబాబు.. పవన్ తనయుడికి ప్రమాదంపై రోజా స్పందన
తిరుపతి, సాక్షి: పవన్ కల్యాణ్ తనయుడు సింగపూర్‌లో ప్రమాదానికి గురికావడంపై అటు సినీ, ఇటు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో.. ఆ చిన్నారి ప్రమాదానికి గురికావడం తనను కలిచివేసిందని మాజీ మంత్రి ఆర్కే రోజా అంటున్నారు.ఈరోజు పవన్‌కల్యాణ్‌గారి చిన్నబాబు మార్క్ శంకర్(Mark Shankar) ప్రమాద వార్త నా మనసుని ఎంతో కలచివేసింది.ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్ ఆరోగ్యంతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని రోజా ట్వీట్ చేశారు. ఈరోజు @PawanKalyan గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్ మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.#Getwellsoon— Roja Selvamani (@RojaSelvamaniRK) April 8, 2025ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 9,45గం. ప్రాంతంలో రివర్ వ్యాలీ రోడ్ ఎడ్యుకేషన్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బడిలో 80 మంది పిల్లలు ఉన్నారు. అరగంటపాటు శ్రమించి ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించగా.. 15 మంది పిల్లలు, నలుగురు స్టాఫ్ గాయపడ్డారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనయుడు మార్క్ శంకర్ కూడా ఉన్నాడు. దీంతో ఈ ఘటన అంతలా హైలైట్ అయ్యింది. పవన్-అన్నాలెజినోవాల చిన్న కొడుకే మార్క్ శంకర్ పవనోవిచ్(mark shankar pawanovich). ఈ ప్రమాదంలో ఆ చిన్నారి చేతికి, కాళ్లకు గాయాలయ్యాయని.. పొగ కారణంగా శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడ్డాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్యకరంగానే ఉన్నట్లు సమాచారం. -
మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని YS జగన్ ట్వీట్
-
అవును పవన్ సర్.. మీ కాన్వాయ్ కారణంగానే పరీక్షకు వెళ్లలేకపోయారు
విశాఖపట్నం, సాక్షి: తన కాన్వాయ్ కారణంగానే విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు నగర పోలీసులు సైతం విద్యార్థులదే తప్పిదమన్నట్లు ప్రకటన ఇచ్చేశారు. అయితే పవన్ కాన్వాయ్ కారణంగానే విద్యార్థులకు ఆలస్యమైందని.. ఇందుకు ఆధారాలతో సహా పక్కగా జనసేన ఎమ్మెల్యే దొరికిపోయారు.జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అత్యుత్సాహం వల్లే 30 మంది ఎమ్మెల్యేలు పరీక్ష రాయలేకపోయారు. పవన్‌కు గజమాల స్వాగతం ఏర్పాటు చేసిన ఆయన.. సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్‌ను నిలిపివేయించారు. దీంతో సకాలంలో విద్యార్థులు చేరుకోలేకపోయారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సీసీ టీవీ ఫుటేజీల ద్వారా బయటపడింది. -
మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ( Mark Shankar) సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jaganmohan Reddy ) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘సింగపూర్ స్కూల్ ప్రమాదంలో పవన్ కల్యాణ్‌గారి తనయుడు మార్క్ శంకర్ గాయపడ్డాడని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. ఈ క్లిష్ట పరిస్థితులలో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. సింగపూర్‌లో ఓ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంతో పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్‌కు చేతులు, కాళ్లకు గాయాలు అయినట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడే ఓ ప్రముఖ ఆసుపత్రిలో శంకర్ కు చికిత్స అందుతోందని, అతని ఆరోగ్యంపై ఆందోళన అక్కర్లేదని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. I am shocked to know about the fire accident at a school in Singapore in which @PawanKalyan garu's son, Mark Shankar got injured. My thoughts are with the family in this difficult time. Wishing him a swift and complete recovery.— YS Jagan Mohan Reddy (@ysjagan) April 8, 2025 -
Majji Srinivasa Rao: విద్యార్థుల భవిష్యత్తును రోడ్డున పడేసిన పవన్..
-
పవన్ బసచేసిన రైల్వే గెస్ట్ హౌస్ ముందు వాలంటీర్లు నిరసనలు
-
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు ప్రమాదం
-
సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సింగపూర్ వెళ్లనున్నారు. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ (Mark Shankar Pawanovich) చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్‌ను వెంటనే స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, బాబు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది.ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్ ఉన్నారు. ఫోన్ కాల్ ద్వారా ఆయన సమాచారం తెలుసుకున్నారు. కానీ, ఇప్పటికే అక్కడ ఆయన పర్యటన షెడ్యూల్‌కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో అక్కడి పర్యటన ముగించుకుని ఆయన సింగపూర్ వెళ్లనున్నారు. -
కెమెరామెన్ జీబ్రాతో ఆస్ట్రిచ్
చూడప్పా సిద్దప్పా ‘నేను సింహం లాంటోడిని...అది గడ్డం గీసుకోదు...నేను గడ్డం గీసుకుంటాను...మిగతాదంతా సేమ్ టు సేమ్’ అన్న మీ డైలాగ్ విని ఎంతో మురిసిపోయాం. మాపై మీకున్న ప్రేమకు ఫిదా అయ్యాం. మీ పంజా సినిమా టైటిల్ చూసి పులులంతా సంబరాలు చేసుకున్నాయి. సింహం పడుకుంది కదా అని చెప్పి జూలుతో జడ వేయకూడదురోయ్... అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫొటో తీయించకూడదు రోయ్. అంటూ అత్తారింటికి దారేది చిత్రంలో చెప్పిన డైలాగ్‌కు జూలో చప్పట్ల మోత మోగించాం. మా గురించి మీ సినిమాల్లో వాడుకుని రికార్డులు సృష్టించిన మీరు డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి హోదాలో తొలిసారి జూకి వస్తున్నారు. చాలా సంతోషం..అయితే మీరొస్తున్నారని తెలిసి గుండెనిండా ఆవేదనతో సమస్యలు నివేదించడానికి సిద్ధంగా ఉన్నాం. జూలో ఉంటున్నాం కానీ తీరని ఆవేదన అనుభవిస్తున్నాం. మా వేదన తీరుస్తారని, మా కన్నీళ్లు తుడుస్తారని ఆశగా ఎదురుచూస్తున్నాం. మాట నిలుపుకుంటారా? సినిమా డైలాగ్స్‌తో సరిపెడతారో మీ చేతుల్లోనే ఉంది... సపర్యలు చేసేవారు లేక మానవ తప్పిదాల వల్ల మేము ఇక్కడ బందీలుగా బతుకుతున్నాం. కనీసం మాకు సరైన సపర్యలు చేసేవారు కూడా లేకపోతే ఎలా? కొందరు యానిమల్ కీపర్లు ఉన్నా, వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో మాకు సరైన సమయంలో ఆహారం పెట్టేవారు లేరు. మా ఆవాసాలను శుభ్రం చేసేవారు కరువయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. తోడు లేక ఒంటరిగా జీవిస్తున్నాం. మా భవిష్యత్తు ఏంటి నాయకా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ జూ పార్కులో మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే మేము అంతరించిపోవడం ఖాయం. మా జాతులను కాపాడాల్సిన బాధ్యత మీపై లేదా? మమ్మల్ని ఈ దుర్భరమైన పరిస్థితుల నుంచి విముక్తి కలిగించే మార్గం లేదా? మృత్యువాత పడుతున్నా.. ఒక్కరే డాక్టర్ మాకు వైద్యం చేస్తున్నారు. ఆయన తరుచూ విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇప్పుడు కూడా ఐదేళ్లు సెలవు పెట్టి అమెరికా పోయారు. ఇప్పుడు మమ్మల్ని ఇద్దరు అనుభవంలేని అవుట్సోర్సింగ్ వెటర్నరీ వైద్యుల చేతిలో పెట్టేశారు. రెండేళ్లుగా విదేశాల నుంచి తీసుకువచ్చిన అరుదైన మా సంతతి కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. మలేసియా, సింగపూర్ తదితర దేశాల నుంచి తీసుకువచ్చిన ఒక జత జిరాఫీలు, ఒక జీబ్రా మృతి చెందాయి. రెండు జిరాఫీ పిల్లలు మృత్యువాత పడ్డాయి. నెల క్రితం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ జూలో పుట్టిన రెండు సింహం పిల్లల్ని ఇక్కడ అనుభవం లేని యానిమల్ కీపర్లు, వెటర్నరీ వైద్యులు కలసికట్టుగా పొట్టన పెట్టుకొన్నారు. ఆవాసాలు నరకంగా ... ఒకప్పుడు విశాలమైన మా ఆవాసాలు నేడు సంకుచితంగా మారాయి. సరైన నిర్వహణ లేక అవి అపరిశుభ్రంగా తయారయ్యాయి. తాగడానికి స్వచ్ఛమైన నీరు లేదు. ఉండటానికి నీడ లేదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నరకయాతన అనుభవిస్తున్నాం. తోడు లేక దిగాలు ప్రస్తుతం ఇక్కడ మాకున్న సంఖ్య(850), మా ఎన్క్లోజర్లు సంఖ్య(80)ను బట్టి కనీసం 100కు పైగా పరి్మనెంట్ యానిమల్ కీపర్లు, ఆరుగురు పరి్మనెంట్ వెటర్నరీ వైద్యులు ఉంటే మేమంతా ఆరోగ్యంగా ఉండి జూకి వచ్చే సందర్శకులన హుషారుగా పలకరించగలం. మమ్మల్ని కాపాడడానికి జూలో పరి్మనెంట్ యానిమల్ కీపర్లు, పరి్మనెంట్ వెటర్నరీ వైద్యులను నియమిస్తే సంరక్షణ కలుగుతుందని మా నమ్మకం. 2011 నుంచి తోడుకోసం ఎదురు చూస్తున్న ఖడ్గ మృగం, రెండేళ్ల క్రితం జతగాడిని కోల్పోయిన చింపాంజీ, జీబ్రా, ఏడాదిన్నరగా ఒంటరిగా మిగిలిన ఆ్రస్టిచ్ తదితర మా జాతి జీవాలు తోడు కోసం ఎదురు చూస్తున్నాయి. -
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ
సాక్షి, అల్లూరి జిల్లా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు నిరసన సెగ తగిలింది. పవన్ బస చేసిన రైల్వే గెస్ట్ హౌస్ ముందు వాలంటీర్లు నిరసనకు దిగారు. డిప్యూటీ సీఎంకు వినతిపత్రం సమర్పించేందుకు వాలంటీర్లు ప్రయత్నించగా, ఆయనను కలిసేందుకు పోలీసులు అనుమతినివ్వలేదు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం తమను వీధిలోకి తీసుకోవాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు.‘‘ఏజెన్సీ ప్రాంతంలో 6,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పదివేల జీతం ఇవ్వాలి. రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు న్యాయం చేయాలి. వాలంటీర్లు హామీ ఇచ్చి ఏడాది దాటినా పట్టించుకోలేదు’’ అని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఈ పాపం.. ఎవరిది పవన్?
పెందుర్తి: వారంతా తన కలను సాకారం చేసుకునేందుకు నిద్రాహారాలు మాని తపించారు. జీవిత లక్ష్యం నెరవేరే రోజు వచ్చింది.. కానీ ఎన్నో ఆశలతో పరీక్షకు సిద్ధమైన ఆ విద్యార్థులకు సోమవారం విశాఖలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పర్యటన శాపంగా మారింది. ఉదయం నుంచే కూటమి నేతల కోలాహలం.. కఠినమైన ఆంక్షల కారణంగా ట్రాఫిక్‌లో చిక్కుకుని 23 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షకు దూరమయ్యారు.పవన్‌కళ్యాణ్ కాన్వాయ్ కోసం ఎన్ఏడీ నుంచి పెందుర్తి వరకు వాహనాలను నిలిపివేయడంతో జేఈఈ మెయిన్ పరీక్ష రాసేందుకు వెళుతున్న విద్యార్థులంతా చిక్కుకుపోయారు. రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో నిర్వాహకులు వారిని పరీక్షకు అనుమతించలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే పవన్‌కళ్యాణ్ రాక సందర్భంగా ట్రాఫిక్‌ను ఆపలేదని.. బీఆర్టీఎస్ మధ్య రోడ్డులో ఆయన వెళ్లారని.. మిగిలిన సర్విస్ రోడ్లపై ఇతర వాహనాలు యథావిధిగా ముందుకు సాగాయని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అసలేం జరిగింది..! అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఎన్ఏడీ కొత్త రోడ్డు నుంచి పెందుర్తి వరకు ఉదయం నుంచి పోలీసులు ట్రాఫిక్‌ను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. పవన్ ప్రత్యేక విమానంలో ఉదయం 8.15 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకోగా 6.30 నుంచే ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ వచ్చారు. పవన్ కాన్వాయ్‌కు కేటాయించిన బీఆర్టీఎస్ మధ్య రోడ్డులో ఇతర వాహనాలను పూర్తిగా నిలిపివేయగా.. ఎడమ, కుడి మార్గాల్లోనూ ఆంక్షలు విధించడంతో ట్రాఫిక్ మందకొడిగా సాగింది. ఈ రోడ్డులో 7.30 నుంచి ట్రాఫిక్‌ను పూర్తిగా నియంత్రించారు.దీంతో పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్‌ను కఠినంగా నియంత్రించడం.. జనసేన కార్యకర్తలు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేయడంతో బీఆర్టీఎస్ సర్విస్ రోడ్డుపై రద్దీ పెరిగిపోయి విద్యార్థులు జేఈఈ పరీక్షకు ఆలస్యమైనట్లు స్పష్టమవుతోంది. మరోపక్క పవన్ ఎయిర్‌పోర్టులో ఉదయం 8.21 గంటలకు బయల్దేరగా వేపగుంట నుంచి పెందుర్తి మార్గంలో అన్ని వైపులా ఉదయం 8.10 గంటలకే ట్రాఫిక్‌ను నిలిపివేసేలా జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.దీనివల్ల పవన్‌వెళ్లే వరకు ఆ మార్గంలో వాహనాలు కదల్లేదు. దీంతో వేపగుంట నుంచి చినముషిడివాడ కేంద్రానికి కేవలం 10 నిమిషాల లోపు చేరుకోవాల్సిన విద్యార్థులు ఆలస్యమయ్యారు. మరోవైపు జనసేన పార్టీ నిబంధనల ప్రకారం గజమాలతో అధినేతను గానీ ఇతర నాయకులను గానీ సత్కరించడం నిషిధ్ధం. కానీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గజమాలతో పవన్‌ను (షెడ్యూల్ ప్రకారం పవన్‌కళ్యాణ్ ఎక్కడా ఆగే వీలు లేదు) సత్కరించేందుకే ఇంత హడావిడి చేసి విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయేలా చేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.పవన్ వెళుతున్న రోడ్డులోనే ఉన్న చినముషిడివాడలోని అయాన్ డిజిటల్ కేంద్రంలో 1,350 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షకు హజరవుతున్నారని తెలిసి కూడా అధికారులు దానిపై ప్రత్యేక దృష్టి సారించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్‌కళ్యాణ్ పర్యటన కారణంగా ట్రాఫిక్ నిలిపివేయడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. చినముషిడివాడ కేంద్రంలో జేఈఈ పరీక్షకు సగటున 50 నుంచి 70 మంది గైర్హాజరు అవుతున్నట్లు సీపీతో పాటు వెస్ట్ జోన్ ఏసీపీ పృధ్వితేజ పేర్కొన్నారు.అలా ఎలా సార్!!సాధారణంగా ఎన్ఏడీ కొత్త రోడ్డు నుంచి బీఆర్టీఎస్ మీదుగా చినముషిడివాడ చేరుకోవడానికి వాహనం / ట్రాఫిక్ పరిస్థితిని బట్టి 10 నుంచి 20 నిమిషాలు పడుతుంది. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కాన్వాయ్ చినముషిడివాడ అయాన్ డిజిటల్ కేంద్రాన్ని ఉదయం 8.41 గంటలకు (ఎయిర్‌పోర్టులో బయలుదేరిన సమయం ఉదయం 8.21 గంటలు అని చెబుతున్నారు) దాటిందని చెబుతున్నారు. ఒక వీవీఐపీ వస్తున్నారంటే కనీసం గంట ముందు నుంచే ఇటు పోలీసులు అటు పార్టీ అభిమానులు, నాయకుల హడావుడి ఉంటుంది. అంటే ఉదయం 7 నుంచే రోడ్లపై వారి హంగామా మొదలైంది.బీఆర్టీఎస్ మధ్య మార్గంలో ఇతర వాహనాలపై నిషేధం విధించడం.. వాటిని సర్విసు రోడ్డులోకి మళ్లించడం.. జనసేనతో పాటు ఇతర కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల ఓవరాక్షన్ కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని జేఈఈ పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే పోలీసులు తప్పుడు వివరణలు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. ఎయిర్‌పోర్టు నుంచి చినముషిడివాడకు డిప్యూటీ సీఎం కాన్వాయ్ రావడానికి 20 నిమిషాల సుదీర్ఘ సమయం (వీవీఐపీల ప్రయాణ సమయం సుమారుగా 10 నిమిషాలు) పట్టడం మరో ఆశ్చర్యకరమైన విషయం.నా కల చెదిరింది..జేఈఈ రాసి ఉన్నతస్థాయిలో నిలవాలన్నది నా కల. దీని కోసం చాలా కష్టపడ్డా. మా ఇంటి (కంచరపాలెం) నుంచి చినముషిడివాడకు ఎంత ట్రాఫిక్ ఉన్నా 30–40 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. ఎన్ఏడీ కొత్త రోడ్డుకు వచ్చేసరికి చాలా ట్రాఫిక్ ఉంది. అక్కడి నుంచి చినముషిడివాడ చేరుకోవడానికి 45–50 నిమిషాలు పట్టింది. 2 నిమిషాల ఆలస్యంతో పరీక్ష రాసే అవకాశం కోల్పోయా. నా కల చెదిరిపోయింది. – బొడ్డు జశ్వంత్, జేఈఈ అభ్యర్థి, కంచరపాలెంవిచారణ చేపట్టండి: పవన్కళ్యాణ్సాక్షి, అమరావతి: పెందుర్తి ప్రాంతంలో జేఈఈకి కొందరు విద్యార్థులు హాజరుకాలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకుని వాస్తవాలపై విచారణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఆదేశించారు. తన కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్ని ఆపేశారు, పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ట్రాఫిక్ పరిస్థితి, సర్వీసు రోడ్లలో ట్రాఫిక్‌ను నియంత్రించారా? వంటి అంశాలపై విచారించాలని సూచించారు. రేయింబవళ్లు కష్టపడి.. జేఈఈ పరీక్ష కోసం మా అబ్బాయి రేయింబవళ్లు కష్టపడి చదివాడు. చినముషిడివాడ కేంద్రం వద్దకు వెళ్లేందుకు ఉదయం 6.30కే ఇంటి నుంచి బయలుదేరాం. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపేయడంతో చిక్కుకుపోయాం. రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో లోపలికి అనుమతించలేదు. మా అబ్బాయి మళ్లీ పరీక్ష రాసేలా పవన్‌కళ్యాణ్, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సత్యవతి, కంచరపాలెం, విద్యార్థి తల్లిఏం చేయాలో.. మాది సాధారణ కుటుంబం. జేఈఈపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. తుని నుంచి వేకువజామున బయలుదేరి వచ్చా. ఎన్ఏడీ వచ్చేసరికి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పరీక్షా కేంద్రానికి మరో 10 నిమిషాల్లో చేరుకుంటాననగా ట్రాఫిక్‌ను ఆపేశారు. రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో అనుమతించలేదు. ఇప్పుడు నా భవిష్యత్ ఏమిటో.. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – ఆళ్ల హేమంత్, తునిమరో అవకాశం ఇవ్వాలి.. బాబు, పవన్ స్పందించాలి ముమ్మాటికి పవన్‌కళ్యాణ్ పర్యటన కారణంగా ట్రాఫిక్ జామ్ వల్లే మా పిల్లలు పరీక్షకు ఆలస్యం అయ్యారు. లేదంటే నిర్దేశిత సమయానికి చాలా ముందే కేంద్రానికి చేరుకునేవాళ్లు. పరీక్షకు అనుమతించకపోవడంతో పిల్లల భవిష్యత్ పాడవుతుంది. మంగళవారం వరకు పరీక్షలు ఉంటాయి కాబట్టి పిల్లలందరికీ మరో అవకాశం ఇవ్వాలి. దీనిపై పవన్, చంద్రబాబు ఉన్నత స్థాయిలో మాట్లాడాలి. – అనిల్, విద్యార్థి తండ్రిట్రాఫిక్ వల్లే.. ఎన్ఏడీ నుంచి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయా. చాలా దూరం ట్రాఫిక్ నిలిచిపోయింది. అయినా ఏదోలా కేంద్రానికి చేరుకున్నా రెండు నిమిషాలు ఆలస్యం అయ్యానని పరీక్షకు అనుమతించలేదు. కేవలం ట్రాఫిక్ వల్లే పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయా. – ఆర్యన్‌రాజ్ -
‘తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు.. ఊళ్లో మాత్రం ఉండడు’
తాడేపల్లి: ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు మంచి నీళ్లకు అల్లాడిపోతుంటే మరొకవైపు మద్యం మాత్రం ఏరులై పారుతోందని మాజీ మంత్రి , వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని విమర్శించారు. 10 నెలల కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నా, మద్యం మాత్రం విచ్చలవిడిగా సరఫరా అవుతుందని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి పేర్ని నాని మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్ సీపీ దిగిపోయే నాటికి గోదాంల్లో ఉన్న మద్యాన్ని టీడీపీ ప్రభుత్వం అమ్మింది. గోదాంల్లో ఉన్న మద్యాన్ని ఎందుకు టెస్టులు చేయించలేదు. వైఎస్సార్ సీపీ హయాంలో మద్యంపై ఆరోపణలు చేసిన మీరు ఆ డిస్టరీలను ఎందుకు రద్దు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటైనా డిస్టలరీను రద్దు చేసిందా?’ అని ప్రశ్నించారు పేర్ని నాని. ఇంకా ఆయన ఏమన్నారంటే..వేలం పాట పట్టుకో.. ఎమ్మెల్యేకి డబ్బు కొట్టుకో.. ‘లెల్ట్’ పెట్టుకో..‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే వైఎస్సార్ సీపీకి చెందిన ఆస్తులను ధ్వంసం చేశారు. కేరళ, బెంగళూరు మద్యం ఏపీలో ఎందుకు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. కూటమి ప్రభుత్వం మద్యం పాలసీ రెడ్ బుక్ రూల్ ప్రకారమే నడుస్తోందా?. వేలం పాట పట్టుకో.. ఎమ్మెల్యే డబ్బు కొట్టుకో.. బెల్ట్ పెట్టుకో అన్నట్లే ఉంది ఏపీలో పాలన. సూపర్ సిక్స్ హామీల అమలు లేదు కానీ.. మద్యం మాత్రం యధేచ్ఛగా సరఫరా అవుతుంది. బెల్ట్ షాపులుంటే తోలుతీస్తానన్న సీఎం.. మద్యం ఆఖరికి బడ్డీ కొట్టుల్లో దొరుకుతున్నా మాట్లాడటం లేదు ఎందుకు?. శుక్రవారం మధ్యాహ్నం డిఫ్యాక్ట్ సీఎం(లోకేష్ ఉద్దేశిస్తూ) ఏపీలో ఉండడు’ అని విమర్శించారు. కొన్నిసార్లు అపరిచితుడు.. మరొకసారి దశావాతారాలుపవన్ కళ్యాణ్ ని చూస్తే అపరిచితుడిలా కనిపిస్తాడు.. కొన్నిసార్లు దశావతారాల్లో కనిపిస్తాడు.తోలు తీస్తా.. తాట తీస్తా అంటాడు. ఊళ్లో మాత్రం ఉండడు.. సమీక్షలు రాడు.. క్యాబినెట్ మీటింగ్ లకు రాడు. కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఈ మూడు నియోజవర్గాల్లో మద్యం విచ్చలవిడిగా దొరకుతోంది. బడ్డీ కొట్టులోని ఫ్రిజ్ లో మద్యం ఉంటుందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చురాష్ట్రాన్ని పొడిచేస్తామంటారు.. ఈ ముగ్గురు.. కానీ వీళ్ల నియోజకవర్గాల్లోని మద్యం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. ఇది రాష్ట్రంలో పరిస్థితి’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.ఆ ఐదేళ్లు చంద్రబాబు, పవన్‌లు విషం వైఎస్సార్సీపీ హయాంలో వరుసగా ఐదేళ్లు మదం పాలసీపై చంద్రబాబు, పవన్ విషంకక్కారు. చంద్రబాబు,పవన్,లోకేష్ బూటకపు ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేశారు. గడచిన 10 నెలలుగా అదే మద్యాన్ని గ్రామాల్లో ఏరులైపారిస్తున్నారు, గ్రామాల్లో పచ్చచొక్కాలు మద్యాన్ని పాడికుండలా మార్చుకున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్తీమద్యాన్ని అమ్ముతోందని విషపు ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం నిల్వలను ఈ ప్రభుత్వం రాగానే అమ్ముకుంది. కల్తీమద్యం అయినప్పుడు మీరెందుకు అమ్ముకున్నారు’ అని నిలదీశారు.ఇది కూడా తిరుపతి లడ్డూ కల్తీ మాదిరి తప్పుడు ప్రచారమేనాలడ్డూలో పంది కొవ్వు కలిపారని చేసిన తప్పుడు ప్రచారం లాంటిదేనా?, అధికారంలోకి రాగానే ఆస్తులు ధ్వంసం చేశారు... తగలబెట్టారు...దాడులు చేశారుమద్యం కల్తీదోకాదో ఎందుకు టెస్ట్ లు చేయించలేదని ప్రశ్నిస్తున్నా. ఒక్క డిస్టిలరీ మీదైనా చర్య తీసుకున్నారా ?, రాష్ట్రంలోని 20 డిస్టిలరీలు గతంలో చంద్రబాబు తెచ్చినవే. జగన్ హయాంలో ఒక్క డిస్టిలరీ కూడా తీసుకురాలేదు. కూటమి ప్రభుత్వం రాగానే డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు మారారుకేరళ ,బెంగుళూరు మద్యమే అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు 1500 ఇస్తామన్నారు. చంద్రబాబు మొదటి సంతకానికే దిక్కులేదు. చెప్పిన మాట అమలుకాకపోతే చొక్కాపట్టుకోమన్నాడు డిఫ్యాక్టర్ సీఎం. చొక్కాపట్టుకుందామంటే శుక్రవారం మధ్యాహ్నం నుంచే కనిపించడుఇంకో ఆయన కాలర్ లేని చొక్కాలేసుకుని కనిపించకుండా పోతాడు. సీఎం ,సీఎం కొడుకు..డిఫ్యాక్టర్ సీఎం కనిపించకపోతే వార్తలు రాయడానికి ఈనాడు,జ్యోతికి చేతులు రావా.. ఈ రాష్ట్రానికి లోకేష్ నాయుడు అనధికార ముఖ్యమంత్రి కుప్పం,పిఠాపురం,మంగళగిరిలో మద్యం ఏరులై పారుతోందిప్రతీ బడ్డీ కొట్టులో మద్యం దొరుకుతోంది. ఏపీలో టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్ముతున్నారు. ప్రభుత్వం నిర్ధేశించినదానికంటే 30% శాతం అధికంగా అమ్మాలనేదే ఏపీలో మద్యం పాలసీ’ అని మండిపడ్డారు. -
పవన్ కళ్యాణ్ వల్ల అన్యాయమైపోయిన కుటుంబం
-
ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానన్న పవన్ ఎక్కడ?
విశాఖ,సాక్షి: మధురవాడ ప్రేమోన్మాది కేసులో బాధితులను చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అన్న అనుమానం కలుగుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణీ అన్నారు. విశాఖ మధురవాడ స్వయంకృషినగర్‌లో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలి వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు.అనంతరం,ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడారు. మధురవాడ ప్రేమోన్మాది కేసులో బాధితులనీ చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నిందితుడుకి ఉరి శిక్ష వేయాలని ఒక మహిళ గా డిమాండ్ చేస్తున్నా.కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. మహిళల్ని రక్షించడంలో ప్రభుత్వం కూడా విఫలమైంది. అఘాయిత్యాలు జరిగితే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి నెలకొంది. హోంమంత్రి అనిత ఎక్కడున్నారు. రుషికొండ కోసం గంటలు క్యాబినెట్లో సమీక్షలు చేస్తారు. ఆడపిల్లల మాన, ప్రాణాల రక్షణ కోసం చర్చించే సమయం లేదా. ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తాం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక్కడే పర్యటిస్తున్న ఇటువైపు ఎందుకు చూడలేదు.100రోజుల్లో గంజాయి నిర్మూలన అన్నారు. గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. బాధితురాలికి వైఎస్సార్సీపీ ఆర్థిక సహాయం అందిస్తుంది. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అని అన్నారు. -
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
విశాఖ జిల్లా,సాక్షి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలను విద్యార్థులు రాయలేకపోయారు. పెందుర్తి అయాన్ డిజిటల్ జేఈ విద్యార్థులకు పవన్ కాన్వాయ్ అడ్డుగా వచ్చింది. దీంతో పరీక్షా కేంద్రానికి విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్లారు. పరీక్ష రాయకుండానే ముప్పై మంది విద్యార్థులు వెనుదిరిగారు. పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.పెందుర్తిలో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉదయం 8.30 జరగనుండగా.. పవన్ కాన్వాయ్ కారణంగా పరీక్షా కేంద్రానికి 8.32కి వచ్చారు. ఆ రెండు నిమిషాలు కూడా పవన్ వస్తున్నారని పోలీస్ అధికారులు ట్రాఫిక్ నిలిపివేశారని, లేదంటే పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకునే వారమని విద్యార్థులు మీడియాకు తెలిపారు.పవన్ కళ్యాణ్ వస్తున్న మార్గంలోనే ఎగ్జామ్ సెంటర్ ఉంది. పవన్ వస్తున్నారనే కారణంతో ప్రొటోకాల్ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. కాబట్టే రెండు నిమిషాల ఆలస్యంతో పరీక్షా కేంద్రానికి వచ్చామని, ఆలస్యమైందని అధికారులు తమని పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేదని విలపిస్తున్నారు. ఈ విషయంలో పవన్ జోక్యం చేసుకుని ఆ 30 మంది విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. -
జనసేన నేతల మధ్య రగడ.. అర్ధరాత్రి ఉమ ఇంటిపై దాడి
సాక్షి, కోనసీమ జిల్లా: ఏపీలో జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీలో రెండు వర్గాల నేతల మధ్య దాడి ఘటన చోటుచేసుకుంది. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన నాయకుడిపై దాడి చేసిన ఘటనలో పార్టీ మండల అధ్యక్షుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన నాయకుడు తొలేటి ఉమకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లిలో జనసేన పార్టీ నేతల మధ్య విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. పార్టీ నాయకుడు తోలేటి ఉమపై జనసన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్, ఆయన అనుచరులు దాడి చేశారు. ఆదివారం అర్ధరాత్రి రాజేష్, అనుచరులు.. ఉమ ఇంట్లోకి చొరబడి కర్రలతో దాడి చేశారు. ఈ దాడి సందర్భంగా ఉమను తప్పించే ప్రయత్నం చేసిన ఆయన భార్యపై కూడా వారు దాడి చేయడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.రాజేష్ వర్గం.. ఉమపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, అర్ధరాత్రి హుటాహుటిన ఉమను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. ఉమపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న అతడి అనుచరులు.. రాజేష్ కారును ధ్వంసం చేశారు. దాడి ఘటన కారణంగా ఉద్రిక్తత నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్, సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆదివారం మధ్యాహ్నం పి.గన్నవరం పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కారణంగానే దాడి జరిగినట్టు పలువురు చెబుతున్నారు. -
‘పవన్ కల్యాణ్‌కు ఆ స్క్రిప్ట్ రాసిచ్చినోడు ఎవడో కానీ..’
సాక్షి, విజయవాడ: పిల్లి కళ్లుమూసుకుని పాలుతాగుతూ ఎవరూ చూడటం లేదనుకునే రకం చంద్రబాబు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఏపీని శ్రీలంక చేసేశాడని చంద్రబాబు ప్రచారం చేశారు.. అధికారంలోకి వచ్చి 10 నెలల కాలంలో మీ ప్రభుత్వ ట్రాక్ రికార్డ్ ఏంటో చెప్పాలి’’ అంటూ చంద్రబాబును నిలదీశారు.‘‘గతేడాది 90 వేల కోట్లు అప్పులు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదలు కాగానే 5750 కోట్లు అప్పుతెచ్చారు. అన్ని కార్పొరేషన్ల పేరుమీద అప్పులు తెచ్చి ఏపీని అప్పులు పాలు చేస్తున్నావ్. అమరావతి రాజధాని పేరుతో 31 వేల కోట్లు అప్పు తెచ్చావ్. ఒక్క అమరావతి రాజధాని కోసమే 62 వేల కోట్లు అప్పు తేవాలని చూస్తున్నారు. అమరావతికి కేంద్రం గ్రాంట్ ఇస్తుందని జబ్బలు చరిచారు. గ్రాంట్ ఎక్కడిచ్చారో సమాధానం చెప్పాలి’’ అంటూ రామకృష్ణ దుయ్యబట్టారు.అప్పులపై సీఎం చంద్రబాబు తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలి. బీజేపీ అధికారంలోకి వచ్చి పదకొండేళ్లయ్యింది. ఈ పాలనలో ఒక్క సమస్యనైనా పరిష్కరించారా?. హిందువుల గురించి మాట్లాడే మీరు వారికి ఏం మేలు చేశారో సమాధానం చెప్పాలి. 2014 ఎన్నికల్లో ప్రస్తావించిన అంశాల్లో ఒక్కటైనా చేశారా?. ఈ దేశంలో రైతులకు ఏమైనా మేలు చేశారా?. 2014 నుంచి 2022 వరకూ మోదీ పాలనలో లక్షా 474 మంది రైతులు, కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు, కూలీలు ఆత్మహత్యలపై మీ దగ్గర సమాధానం లేదు’’ అని రామకృష్ణ ధ్వజమెత్తారు.‘‘పేదరికం తగ్గించలేక పోయారు. ధరలు తగ్గించలేకపోయారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఇవ్వలేకపోయారు. విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ తెప్పిస్తామని వారితో లాలూచీ పడ్డారు. ముస్లింలకు వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టడమే అజెండాగా పెట్టుకున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు ఓటేసి ముస్లింలకు టీడీపీ ద్రోహం చేసింది. పేద ముస్లింల అభివృద్ధి కోసం వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చారని పవన్ మాట్లాడుతున్నాడు. ఆయనకు స్క్రిప్ట్ రాసిచ్చినోడు ఎవడో తెలియడం లేదు?. పవన్‌ను ఢిల్లీ తీసుకెళ్లి వక్ఫ్ సవరణ బిల్లుపై స్పీచ్ ఇప్పించాలి’’ అంటూ రామకృష్ణ ఎద్దేవా చేశారు.‘‘ఇప్పుడు ముస్లింలపై దాడి చేశారు. తర్వాత క్రిస్టియన్లు, దేవాలయాల స్థలాలపై పెత్తనం చేస్తారు. భారతదేశంలోని అన్ని మత సంస్థలపై పెత్తనం కోసమే ఈ వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సీపీఐ పెద్ద ఎత్తున పోరాటం చేపడుతోంది. ఈనెల 13వ తేదీన విజయవాడలో భారీ సదస్సు నిర్వహిస్తున్నాం’ అని రామకృష్ణ వెల్లడించారు. -
పవన్, నాగబాబుపై పిఠాపురం ప్రజలు ఫైర్..
-
నాగాంజలి వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?
-
‘మిస్టర్ పవన్.. దీపక్ తాట ఎందుకు తీయలేదు?’
సాక్షి, తాడేపల్లి: రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి చాలా బాధాకరమని వైఎస్సార్సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మసీ విద్యార్ధి విషయంలో ఆమెకు అన్యాయం జరిగింది.. చంద్రబాబు ఏం చేశారు?. రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాటతీస్తామన్నారు.. ఇప్పుడు ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు.విద్యార్థిని నాగాంజలి మృతిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి స్పందిస్తూ..‘నాగాంజలి మృతి చాలా బాధాకరం. నరరూప రాక్షసుడి వేధింపులు భరించలేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. 12 రోజులు మృత్యువుతో పోరాడినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. నాగాంజలి ఆత్మహత్య చేసుకోవడానికి ఏజీఎం దీపక్ కారణమని సూసైడ్ నోట్లో రాసింది. దీపక్ పనిచేసే కిమ్స్‌లోనే 12 రోజులుగా ఉంచితే సరైన వైద్యం ఎక్కడ దొరుకుతుంది. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి నుంచి కనీస స్పందించలేదు. వైద్యం అందుతుందో కూడా ఆరా తీయలేదు.పవన్.. కేవలం మాటలేనా?ఆడపిల్లలకు అన్యాయం చేస్తే అదే ఆఖరి రోజు అని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. పోలవరం సందర్శనకు వెళ్లిన చంద్రబాబు.. నాగాంజలి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు?. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాటతీస్తామన్నారు. నాగాంజలికి అంత అన్యాయం జరిగితే దీపక్ తాట ఎందుకు తీయలేదు పవన్?. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా పవన్. మీ మాటలు చేతలకు పనిచేయవా?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోవచ్చని మంత్రి స్టేట్ మెంట్ ఇచ్చారు. నాగాంజలి 12 రోజులుగా ఆసుపత్రిలో వైద్యం పొందుతుంటే.. వారిని కనీసం పరామర్శించారా?. మెరుగైన వైద్యం అందించమని ఆదేశాలైనా ఇచ్చారా?.ఆడబిడ్డలకు రక్షణ కరువు..ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారా?. సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు కామెడీ స్కిట్స్ చూసి ఎంజాయ్ చేసే శ్రద్ధ ఆడపిల్లల మీద లేదా?. కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు వాడుకుంటున్నారు. ఆడ పిల్లలు, ప్రజల రక్షణపై పోలీసులు దృష్టిపెట్టడం లేదు. ఆడపిల్లలపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా శిక్షలు పడవనే ధైర్యంతో బరితెగించి రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేదు. ఏపీలో ఇలాంటి దారుణమైన పరిస్థితి నెలకొనడం చాలా దురదృష్టకరందిశ యాప్ కాపీనే శక్తి..గతంలో వైఎస్ జగన్ దిశా యాప్ తెచ్చారు. దిశా చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. కేంద్రంతో పొత్తులో ఉన్న మీరు దిశా చట్టాన్ని ఎందుకు ఆమోదించుకోలేక పోతున్నారు?. దిశ యాప్‌పై ఇప్పటి హోం మంత్రి గతంలో చాలా వెటకారంగా మాట్లాడారు. దిశ యాప్ ను కాపీ కొట్టి శక్తిగా పేరు మార్చారు. మీ శక్తి యాప్ ఏమైపోయిందో హోమ్ మంత్రి సమాధానం చెప్పాలి. శక్తి టీమ్‌లు ఎక్కడికి పోయాయి?. శక్తి యాప్ సరిగా పనిచేసుంటే ఆడపిల్లలకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?. అనిత మాటలు చేతల్లో కనిపించవా?. నిందితులు తెలుగుదేశం వారైతే వారికి రక్షణ కల్పిస్తున్నారు. కేసుల నుంచి బయటపడేలా ప్రభుత్వం చూస్తోంది. ఎందుకు ఈ ప్రభుత్వానికి ఓటు వేశామా అనే పరిస్థితిని తీసుకువచ్చారు. ఇప్పటికైనా మంత్రి మేల్కోవాలి. ఇలాంటి ఘటనలు మరలా పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మహిళల రక్షణకు, భద్రతకు పెద్దపీట వేయాలని డిమాండ్ చేస్తున్నాం.బాధితురాలికి న్యాయం జరగాలి..నాగాంజలి మృతిపై మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ స్పందిస్తూ..‘నాగాంజలి మరణం బాధాకరం. బాధితురాలు సూసైడ్ నోట్లో ఏం కోరుకుందో దానిపై తల్లిదండ్రులతో కలిసి పోరాటం చేస్తాం. నాగాంజలి కుటుంబాన్ని ప్రభుత్వం, కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం తమ బాధ్యతగా ఆదుకోవాలి. నిందితుడు నుంచి ఆర్థిక సహాయం బాధితురాలికి అందకుంటే అంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదు. ఈ ఘటనపై హోం మంత్రి, డిప్యూటీ సీఎం స్పందించక పోవడం బాధాకరం. -
అభిమానుల గుండెల్లో పవన్ గునపాలు!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అభిమానులతోపాటు కాపు సామాజిక వర్గం వారందరి గుండెల్లోనూ గునపాలు దించేలా మాట్లాడారు. తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా వాడుకుని వదిలేస్తానని, వారి ఆకాంక్షలకు తగినట్లు పనిచేయడం తన పని కాదన్నట్టుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో డ్రామా ‘పీ-4’ ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ తనకు సత్తా లేకపోవడం వల్లనే సమర్థుడు, అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబుకు 2014 నుంచి మద్దతిస్తున్నాని చెప్పడం విని అభిమానులు హతశులయ్యే ఉంటారు.చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లకు మాత్రం ఈ మాటలు చెవికి ఇంపుగా అనిపించి ఉండవచ్చు. పవన్ మన చెప్పుచేతల్లోనే ఉంటాడులే అని మనసులో ఉప్పొంగిపోయి ఉండవచ్చు కూడా. కానీ.. పదేళ్లుగా పవన్ ఎక్కడకు వెళ్లినా సీఎం, సీఎం అంటూ నినాదాలు చేసే అభిమానుల మాటేమిటి? వాస్తవానికి ఇలాంటి అభిమానులు పవన్ లాంటి నేతను నమ్ముకోవడం వారి దురదృష్టం. ఒక్కటైతే వాస్తవం.. పవన్ ఏనాడూ నిజాయితీగా, నిబద్ధతతో వ్యవహరించలేదు. అభిమానులకు కష్టంగా ఉండవచ్చు కానీ.. ఆయన కేవలం సినిమా గ్లామర్ మాత్రమే ఆయన్ను ఈ స్థాయికైనా చేర్చింది. కాపు సామాజికవర్గం నేతలు చాలా మంది ఈయన కన్నా బాగా వారికి అండగా నిలబడ్డారు. అయినా ఎందుకో వారికి ఈయనపైన అభిమానం పెరిగింది. బహుశా మెగాస్టార్ చిరంజీవి సోదరుడు కావడం, ప్రజారాజ్యం పార్టీని పెట్టినా నిలదొక్కుకోలేకపోయారన్న సానుభూతి కావచ్చు. పవన్ కళ్యాణ్ ఆ లోటును తీర్చి తాము కోరుకున్న విధంగా ముఖ్యమంత్రి అవుతారన్న ఫీలింగ్ కావచ్చు.. వీటన్నిటి రీత్యా వీరంతా మద్దతు ఇచ్చారు.గతంలో కాపు సామాజికవర్గం వైఎస్సార్సీపీకి కూడా బలంగా మద్దతు ఇచ్చినా, 2024లో మాత్రం అత్యధికులు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపే మొగ్గారన్నది ఎక్కువ మంది విశ్లేషణ. అందులో వాస్తవం కూడా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఈయనకు గాలం వేసి తనవైపు లాగడంలో సఫలమయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా 2019లో ఘోర పరాజయం రీత్యా భయపడి, చంద్రబాబు ఏం చెబితే అది చేశారని అంటారు. జాక్ పాట్ తగిలినట్లుగా కూటమి అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ మంత్రి అయ్యారు. చంద్రబాబు, పవన్లకంటే లోకేశే ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, రెడ్ బుక్ పేరుతో అరాచకాలను ప్రోత్సహిస్తున్నా వీరు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని చాలామంది చెబుతున్నారు.పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో అప్పడప్పుడూ తన శాఖను పర్యవేక్షిస్తూ, మిగిలిన టైమ్ లో సనాతని వేషం కట్టడం, ఇతర రాష్ట్రాలలో పర్యటించడం, ఎప్పుడైనా చంద్రబాబుకు అవసరమైతే ఆ పాత్రను పోషించడం, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ను నిందించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పవన్ మొదటి నుంచి గందరగోళంగానే మాట్లాడుతూ వచ్చారు. ఆయన కావాలని అలా మాట్లాడుతున్నారా? లేక అవగాహన లేక వ్యవహరిస్తున్నారో తెలియదు. గత పదేళ్లలో ఆయన ఎన్ని రకాలుగా మాటలు మార్చారో చెప్పతరం కాదు. తన వ్యక్తిగత జీవితం మొదలు, తన పుట్టిన ప్రదేశం, చదువుకున్న ఊరు, ఇతరత్రా పలు అంశాలపై భిన్నమైన ప్రకటనలు చేసినా ఆయన అభిమానులు, కాపు సామాజికవర్గం వారు ఆదరించారనే చెప్పాలి.పిఠాపురంలో ఎన్నికలకు ముందు టీడీపీ నేత వర్మ చేతులు పట్టుకుని మీరే గెలిపించాలని అన్నారు. గెలిచిన తర్వాత ఆయన దేముందని తన సోదరుడు నాగబాబు అంటే కనీసం ఖండించలేదు. పిఠాపురం సభలో నలభై ఏళ్ల టీడీపీని తానే నిలబెట్టానని చెప్పారు. కాని ఇప్పుడేమో తనకు సత్తా లేదని అంటారు. తన తండ్రి గురించి సైతం రెండు రకాలుగా మాట్లాడటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆయన కమ్యూనిస్టు, దీపారాధన దీపం వద్ద సిగరెట్ ముట్టించుకున్నారని ఒకసారి, ఎప్పుడూ రామజపం చేస్తారని మరోసారి చెప్పి విస్మయ పరిచారు. 2017 తర్వాత తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు, లోకేశ్‌లను ఎంత తీవ్రంగా విమర్శించారో, వారిద్దరిని ఎంత అవినీతిపరులుగా చూపారో, ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా పొగుడుతున్నారు. వారిలో ఇప్పుడు అవినీతి కనిపించడం లేదు. సమర్దత మాత్రమే కనిపిస్తోంది. చంద్రబాబు పదిహేనేళ్లు సీఎంగా ఉండాలని అంటున్నా, భవిష్యత్తులో లోకేశ్ సీఎం అయినా కాదనకుండా పవన్ కళ్యాణ్ విధేయుడుగానే ఉంటారన్నది పలువురి నమ్మకంగా ఉంది.చంద్రబాబు, లోకేశ్‌లు కూడా ఆ రోజుల్లో పవన్‌ను బాగానే విమర్శించేవారు. అయినా ఇప్పుడు వారు పొగుడుతున్నట్లు నటిస్తున్నారు. రెండు పార్టీలు కలిసి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు గురించి పవన్ కళ్యాణ్ నోరు విప్పడం లేదు కనుక వారికి ఆనందంగానే ఉంటుంది. అలా ఉన్నంతకాలం ఆయన మంచి మిత్రుడుగానే కనిపిస్తారు. ప్రశ్నించడానికి పార్టీని పెట్టానని చెప్పిన పవన్ అసలు ప్రశ్న అంటే ఏమిటో మర్చిపోయారు. గతంలో తన తల్లిని, తనను దూషించారని చెప్పిన టీడీపీని భుజాన ఎత్తుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏకంగా తనకు సత్తా లేదని చెప్పడం చూస్తే, ఒకరకంగా నిజం చెప్పారని కొందరు, తమ పరువు తీశారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ ఇంతగా దిగజారిపోతారని తాము ఊహించలేకపోయామని ఆయనకు మద్దతు ఇచ్చినవారు వాపోతున్నారు.కాపు సామాజికవర్గ నేతలు పలువురు ముఖ్యమంత్రి చంద్రబాబుపై హోరాహోరీ పోరాడారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం పెద్ద ఎత్తునసాగింది. అలాంటి వారందరిని కాదని, కాపుల రిజర్వేషన్ గురించి, కాపుల కులభావన గురించి పలుమార్లు మాట మార్చిన పవన్నే ఈసారి కాపు వర్గం వారు ఎంపిక చేసుకున్నారు. సీఎం అని అభిమానులు నినాదాలు ఇస్తుంటే గతంలో ఓటు వేయండి. సీఎం అవుతానని అనేవారు. ఆ తర్వాత టీడీపీతో పొత్తు అనంతరం తమకు సీఎం అయ్యేంత బలం లేదని, ఎమ్మెల్యేగా గెలవడం ముఖ్యం అన్నట్లు మాట్లాడేవారు. అదే పవన్ కళ్యాణ్ టీడీపీని తానే గెలిపించానని చెబితే టీడీపీ సోషల్ మీడియా ఆయనపై విరుచుకుపడింది. జనసేన మద్దతుదారులను ఒక ఆట ఆడుకుంది. అయినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యే తీరుతెన్నులపై అక్కడి జనసేన స్థానిక నేత ఆరోపణలు చేస్తే వాటి గురించి వాకబు చేయకుండా, ఆయనకే నోటీసు ఇవ్వడం విశేషం. దీన్ని బట్టి పవన్ పార్టీని బలోపేతం చేసుకోవడం కన్నా, పదవిని ఎంజాయ్ చేయడం, టీడీపీకి సేవ చేయడం ద్వారా తాను కూడా లబ్ది పొందడానికే పరిమితం అయ్యారని అర్థం అవుతోందని అంటున్నారు. చిత్రం ఏమిటంటే ఏపీలో సత్తా లేదని చెబుతున్న పవన్ కళ్యాణ్ కొద్ది కాలం క్రితం తమిళనాడు వెళ్లి అక్కడ జనసేనను విస్తరిస్తానని చెప్పి వచ్చారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లుగా ఉందీ వైఖరి. వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని, ఆయన నుంచి వచ్చే ప్రయోజనాల కోసమని ఎద్దేవా చేశారు. బీజేపీ ఆడినట్లు పవన్ ఆడతారని కొంతమంది అనుకుంటున్నా, ప్రస్తుతానికి చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి సిద్దంగా ఉన్నారని అంటున్నారు. ప్రభుత్వపరంగా చూస్తే ఆయన శాఖలలో వేలాది ఫైళ్లు పెండింగులో ఉన్నట్లు చంద్రబాబు సర్కారే ప్రకటించింది. ఇందులో మొదటి ర్యాంకు ఇచ్చింది. అయినా పవన్ దానిపై పెద్దగా ఫీల్ అయినట్లు లేరు. నిజానికి పవన్ కళ్యాణ్ పెద్దగా చదువుకోలేదు. కానీ, వేల పుస్తకాలు చదువుకున్నట్లు కనిపించాలన్నది ఆయన తాపత్రయంగా కొందరు అభివర్ణిస్తుంటారు. అసలు ఏ మనిషి అయినా ఎనభై వేల పుస్తకాలు చదవడం సాధ్యమేనా అని ఒకరు ప్రశ్నించారు. అదేమిటంటే ఒక మనిషి వందేళ్లు జీవిస్తాడనుకుంటే, అందులో మొదటి పదిహేనేళ్ల నుంచి ఇరవై ఏళ్ల వరకు విద్యకు కేటాయించవలసి ఉంటుంది. అలాగే చివర ఇరవై ఏళ్లు కూడా పెద్దగా చదవలేని పరిస్థితి రావచ్చు. మనిషి వందేళ్లు జీవించడం అంటే 36500 రోజులు బతకడం అన్నమాట. రోజూ ఒక పుస్తకం చదవడం ఎక్కువ సందర్భాలలో అసాధ్యం. అందువల్ల ఎవరైనా ఏభై వేల పుస్తకాలనో, ఎనభై వేల పుస్తకాలనో, రెండు లక్షల పుస్తకాలనో చదివేశానని చెబితే అదంతా గ్యాస్ అని ఆయన వివరించారు.అంటే ఇదంతా రాజకీయ నేతల హిపోక్రసీ అన్నమాట. ప్రభుత్వపరంగా పెద్దగా పని చేయలేక, ఇటు పార్టీ పరంగా నిర్మాణం చేయలేక, ఏదో పదవిని ఎంజాయ్ చేస్తూ ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీని నడపడం కన్నా వేరే పార్టీలో విలీనం చేయడం బెటర్ కదా అని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సత్తా ఉపన్యాసాలలో అబద్దాలు చెప్పడంలో మాత్రం బాగానే ఉంది. కానీ, ప్రజలకు ఉపయోగపడటంలో మాత్రం విషయం కొరవడింది. అందుకే ఆయన తనకు సత్తా లేదని అంగీకరించారని అనుకోవచ్చా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Prakash Raj: పవన్ సనాతన వేషం వెనుక రహస్యం
-
రిపోర్టర్ ప్రశ్నకు కేఏ పాల్ సమాధానం దెబ్బకు అందరూ సైలెంట్
-
సనాతన ధర్మాన్ని కాపాడడానికి నువ్వు ఎవరు పవన్ కళ్యాణ్..?: ప్రకాశ్ రాజ్
సౌత్ ఇండియా పాపులర్ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మరోసారి ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆయన పలుమార్లు పవన్ రాజకీయ తీరుపై విమర్శలు చేసిని విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట మరింతగా వైరల్ అవుతున్నాయి.పవన్ కల్యాణ్ కొద్దిరోజుల క్రితం సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తానన్నారు కదా దానిపై మీ అభిప్రాయం చెప్పండి అంటూ ప్రకాశ్‌రాజ్‌ను కోరారు. అందుకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. ' సనాతన ధర్మాన్ని కాపాడడానికి పవన్ ఎవరు..? అతనికి ఎలాంటి అర్హతలు ఉన్నాయో చెప్పాలి. అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యల గురించి పవన్ మట్లాడారు. కానీ, ఎప్పుడైతే ఎన్నికల్లో గెలుపొందారో వాటిని పక్కన పెట్టేశారు. రాష్ట్రంలో నిరుద్యోగత ఉంది. విపరీతమైన అవినీతితో నిండిపోయింది. ఎక్కడ చూసిన కూడా లంచాలే కనిపిస్తున్నాయి. ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. చాలాచోట్ల రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకుండా సెడెన్‌గా తను కాస్ట్యూమ్స్ మార్చేసి ఇలా సమయం ఎందుకు వృథా చేస్తున్నారు..? ఇలా రకరకాలుగా దుస్తులు మార్చేసి మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు. అసలు అతను ఏపీ డిప్యూటీ సీఎం అని చెప్పడానికి నేను చాలా అన్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాను. డెమోక్రసీలో అపోజిషన్ అనేది లేకుంటే ఎలా..? ప్రజల పక్షాన నిలబడి వారిని ఎవరు ప్రశ్నించాలి..?' అని ప్రకాశ్‌రాజ్ అన్నారు.తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాశ్ రాజ్అదే ఇంటర్వ్యూలో ఆయన తిరుమల లడ్డూ వివాదం గురించి కూడా ఇలా మాట్లాడారు. 'సనాతన ధర్మానికి నేను వ్యతిరేకం కాదు. చాలా సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. కోట్లమంది భక్తుల మనోభావాలకు సంబంధించించిన తిరుమల లడ్డూపై ఎవరైనా మాట్లాడే సమయంలో సరైన ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంతమాత్రం కరెక్ట్ కాదు. లడ్డూ తయారీలో కల్తీ జరిగింటే అందుకు కారణమైన వారిని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మీరు కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోండి.' అంటూ ఆయన సూచించారు. He has no vision. I'm feeling very uncomfortable with him being the Deputy Chief Minister. - @prakashraaj about @PawanKalyan #PawanKalyan #SanatanaDharmaRakshanaBoard pic.twitter.com/AjZJWO77Ec— Telugu Chitraalu (@TeluguChitraalu) April 2, 2025 -
కొత్త నాటకానికి తెరతీసిన బాబు అండ్ కో!
వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు ఏమైనా చెబుతాడంటారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇది మరింత బాగా వర్తిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఖాయం చేసిన డైలాగు ‘2029 నాటికి జీరో పావర్టీ’ అంటే మరో నాలుగేళ్లలో ఏపీలో పేదరికం ఉండదన్న మాట. ఇందుకోసం ఆయన పీ-4 అనే విధానాన్ని తెస్తారట. దీని ప్రకారం రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది ధనికులు పేదలను దత్తత తీసుకుని పైకి తీసుకురావాలట. అది సాధ్యమా? కాదా? ఇందుకు ఎన్ని వేల కోట్లు లేదా లక్షల కోట్లు వ్యయం చేయాలి? అన్నది పక్కనబెడితే, ఇదేదో కొత్త ఆలోచన అనుకున్న వారికి దీంతో బుర్ర తిరిగి పోవాల్సిందే.ఇలాంటి దత్తత కార్యక్రమాలు దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు తమ ఆర్థిక స్థోమతకు తగ్గట్టు దానధర్మాలు చేస్తుంటారు. మరి కొందరు తమకు తెలిసిన పేదల కుటుంబాలలోని పిల్లల చదువులకు ఆర్థిక సాయం చేస్తుంటారు. మరికొందరు అనాథ శరణాలయాలకు విరాళాలు ఇస్తుంటారు. దీనికి పీ-4 అని పేరు తగిలించి, వీటన్నింటినీ తన ఖాతాలోకి వేసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకోసం రాత్రిళ్లు నిద్ర కూడా పోకుండా ఆలోచించానని చంద్రబాబు చెబితే ఎవరైనా విశ్వసిస్తారా? ఆయనకు నిద్రలేమి సమస్య ఉందేమో అనుకునే అవకాశం ఉంటుంది.పీ-4 కార్యక్రమం కింద పెద్ద పారిశ్రామికవేత్తలు, ధనికులు, వ్యాపారవేత్తలు, అంతా ముందుకు వచ్చి తమ ఆస్తిలో పేదలకు వాటా ఇస్తారు. పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా చేసి మార్గదర్శులు అవుతారు అనుకున్న వారూ లేకపోలేదు. అంతెందుకు చంద్రబాబు నాయుడు ఆస్తి సుమారు రూ.900 కోట్లు అని ఏడీఆర్ ప్రకటించింది. దాంట్లో కొంత ఉంచుకుని మిగిలింది పేద కుటుంబాలకు ఇచ్చి వారిని కోటీశ్వరులను చేస్తారని అనుకుంటే ఆ ఊసే ఎత్తలేదని వైఎస్సార్సీపీ నేతలు ఎత్తి పొడుస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కొంతకాలం క్రితం బహిరంగ సమావేశాలలో మాట్లాడుతూ తమ హెరిటేజ్ సంస్థ వాటాల్లో రెండు శాతం అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని చెప్పారు. అందులో ఏమైనా పేదలకు వాటాలిచ్చి స్థితిమంతులుగా చేస్తారేమో అని కొందరు విశ్లేషకులు ఊహించారు. అవేమీ జరగలేదు.టీడీపీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి సరిపెట్టారు. అది కూడా టీడీపీ పార్టీ కార్యకర్తలకే కదా!. ఎంతమంది పేదలను ఆ ట్రస్టు ద్వారా కోటీశ్వరులను చేశామని చెప్పగలిగి ఉంటే దానికి ఒక అర్థం ఉండేది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఈ పీ-4 కార్యక్రమం చంద్రబాబు చేస్తున్న మరో మోసం అని వ్యాఖ్యానించారు. ఏపీలో ఆదాయ పన్ను కట్టేవారి సంఖ్య ఎనిమిది లక్షలుగా ఉందని, 90 శాతం మంది వైట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారని, ఇవేవి తెలియకుండా చంద్రబాబు ప్రజలను తన సూపర్ సిక్స్ నుంచి డైవర్ట్ చేయడానికి ఇలాంటివి చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకున్న మెఘా సంస్థ అధినేత పీవీ.కృష్ణారెడ్డి పీ-4 సభా వేదికపై ఉన్నారు. ఆయన తన సంపదలో కొంత భాగాన్ని పేదలకు పంచుతారేమోనని మరికొందరు అనుకున్నారు. కానీ, ఆయన ఒక విద్యార్ధికి వైద్య విద్య అభ్యసించడానికి సాయం చేస్తారట. ఆయన సొంత మండలం గుడ్లవల్లేరును దత్తత తీసుకుంటారట. అక్కడ ఏ కార్యక్రమాలు చేపడతారో తెలియదు.వైఎస్ జగన్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తల నుంచి వాటాలను లాక్కున్నారని ఒక అబద్దం చెబుతూ, తమ ప్రభుత్వంలో ప్రజలకు వాటాలు ఇస్తున్నామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నిజంగా స్వచ్చందంగా వేదిక మీద ఉన్న చంద్రబాబు, పవన్‌లతో సహా ప్రముఖ పారిశ్రామిక వేత్తలంతా తమ ఆస్తులలో పేదలకు వాటాలు కల్పిస్తామని ప్రకటించి ఉంటే ఈ కార్యక్రమానికి మంచి గుర్తింపు వచ్చేదేమో!. కానీ, వారెవరూ ఆ పని చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ పేదలకు వాటాలు ఇస్తున్నామని సినిమా డైలాగులు చెప్పారు. బిల్ గేట్స్, వారెన్ బఫెట్ వంటి అమెరికా ప్రముఖులు తమ ఆదాయంలో కొంత వాటాను విరాళాలుగా ఇచ్చేస్తుంటారు. మరో ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రీన్ కో కంపెనీ డైరెక్టర్ అయిన చలమలశెట్టి సునీల్ కూడా ఇలాగే మరో విద్యార్ధిని దత్తత తీసుకుంటామని తెలిపారు. గత ఎన్నికలలో ఈయన వైఎస్సార్సీపీ పక్షాన పోటీచేసి ఓటమి చెందారు.వైఎస్ జగన్ పాలన సమయంలో గ్రీన్ కో కంపెనీకి భూమి కేటాయించి, విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తే, తెలుగుదేశంతోపాటు, ఎల్లో మీడియా ప్రత్యేకించి ఈనాడు ఎన్ని వ్యతిరేక వార్తలు రాసిందో తెలిసిందే. వైఎస్సార్సీపీ వారికి ఏమీ చేయవద్దని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సునీల్ సేవలను తీసుకోవడం విశేషం. ఒక విద్యార్ధిని మెడికల్ సీట్ ను ఆశిస్తోంది. ఆమెకు ప్రభుత్వ కాలేజీలో సీటు వస్తే దాతతో పెద్దగా పని ఉండదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరైన 750 సీట్లను వదలుకుందన్న విమర్శలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వ రంగంలో వైద్య కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే, కూటమి సర్కార్ వాటన్నింటినీ ప్రైవేటు పరం చేస్తోంది. ఇది కూడా పీ-4లో భాగమేమో తెలియదు. ఒకవేళ ప్రైవేటు కాలేజీలో చదివించాల్సి వస్తే ఆ విద్యార్ధినికి దాత రెండో, మూడో కోట్ల రూపాయల డొనేషన్ కట్టడానికి సిద్దపడతారా? అన్నది ఒక డౌటు. చంద్రబాబు నాయుడు ఏ రోజుకారోజు ఏదో ఒక కొత్త డైలాగు తెరపైకి తెస్తుంటారు. తద్వారా అంతకుముందు తాను చెప్పిన డైలాగుల్ని జనం మర్చిపోయేలా చేయాలన్నది ఆయన లక్ష్యం. ఎటూ ఆయన భాజ భజంత్రీలు వాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఉండనే ఉంది. కొన్నాళ్లపాటు ఈ పీ-4ను వీరంతా కలిసి ఊదరగొడతారు. ఆ తర్వాత సడెన్‌గా ఏపీలో పేదలు ఎవరూ లేరని ప్రకటించేసినా ఆశ్చర్యం లేదు. లేకుంటే 2029 నాటికి జీరో పావర్టీగా ఉండాలని చంద్రబాబు చెబితే అది అయ్యే పనో, కాదో అందరికీ తెలుసు.నిజానికి చంద్రబాబు ఎప్పుడూ పేదల పక్షపాతి కాదు. ఆయన 1995-2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం, వేలాది మంది ఉద్యోగులను ఊడపీకడం చేశారు. రైతులు విద్యుత్ భారంతో అల్లాడుతుంటే విద్యుత్ ఛార్జీలు పెంచారు. దానిపై పెద్ద ఉద్యమమే నడిచింది. ఆ టైమ్ లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. దానిని చంద్రబాబు హేళన చేసి మాట్లాడే వారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని అనేవారు. అప్పుడు కూడా విద్యుత్ సంస్కరణల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేదలకు ఇస్తానని కబుర్లు చెప్పేవారు. కానీ, ఆ సంస్కరణల వల్ల పేద, మద్య తరగతి వారికి ఒరిగిందీ లేదు. చంద్రబాబు వారికి సాయం చేసింది లేదు.2004లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ఉచితంగా విద్యుత్తు అందించి చూపించారు. ఎన్టీ రామారావు పేదలకు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తే, చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటన్నిటిని మార్చేశారు. అధికారం లేనప్పుడు, ఎన్నికల ప్రచారాలలో మాత్రం పేదలకు అవి చేస్తా, ఇవి చేస్తానని చెబుతూంటారు ఈయన. వీటిని నమ్మి ఓట్లు వేసి మోసపోయిన ఘట్టాలు ఎక్కువే. 2014లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీతో సహా వందల హామీలు ఇచ్చిన బాబు పవర్ లోకి వచ్చాక అరకొరగా అమలు చేసి రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాలైతే రద్దే చేయలేదు.తాజాగా 2024 ఎన్నికలలో సూపర్ సిక్స్ అంటూ ప్రచారం హోరెత్తించారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500, ప్రతి విద్యార్ధికి ఏడాదికి రూ.15 వేలు, రైతులకు రూ.20 వేలు ఇలా పలు హామీలు ఇచ్చారు. పదవిలోకి వచ్చిన తరువాత మాత్రం బడ్జెట్ చూస్తుంటే భయమేస్తోందని హామీలకు మంగళం పాడేశారు. అప్పులు చేసి సంక్షేమం చేయలేమని ఒకసారి, తాను ఎన్నికలకు ముందు ఒకరకంగా అనుకున్నానని, ఇప్పుడు పరిస్థితి అలా లేదని ఇంకోసారి చెప్పడం ఆరంభించారు. అంటే చిత్తశుద్ది లేకుండా కేవలం అధికారమే ఏకైక లక్ష్యంగా ఏ అబద్దాన్ని అయినా ఆడవచ్చన్నది ఆయన నమ్ముతున్నారన్నమాట.ఇప్పుడు ఎవరైనా సూపర్ సిక్స్ అని అడిగితే దానికి ప్రతిగా పీ-4 అమలు చేస్తున్నాం కదా! అని దబాయిస్తారు. ఎవరినైనా ధనికుడిని మీరే వెతుక్కోండి అని పేదలకు చెప్పినా చెప్పవచ్చేమో. పేదల పిల్లలు వెళ్లే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య తగ్గుతోందని ఎవరైనా అన్నారనుకోండి. పీ-4 తెచ్చాం కదా! ప్రైవేటు స్కూళ్లలో చదువుకోండి అని చెబుతారేమో!. గతంలో విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదు అని చంద్రబాబు అన్నారు. వలంటీర్లు ఎంత పేదలో అందరికీ తెలుసు. వారి సేవలను కంటిన్యూ చేస్తామని, వేతనం రూ.10వేలు చేస్తామని ఉగాది పర్వదినం రోజున ఊరించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇప్పుడు ఆ వ్యవస్థనే తీసి వేశారు. ఈసారి ఉగాది నాడు కొత్తగా పీ-4 అన్న నాటకంలో మొదటి అంకం ప్రారంభించారు. ఇందులో ఎన్ని ప్రహసనాలు ఉంటాయో చెప్పజాలం.ఉగాది కల్లా మహిళలకు ప్రీ బస్ స్కీమ్ అమలు చేస్తామని రవాణా మంత్రి రామ్ ప్రసాదరెడ్డి గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఉగాది వెళ్లిపోయింది. ప్రస్తుతం బస్‌లలో ప్రయాణించే వారిలో అత్యధిక శాతం పేద, మధ్య తరగతి వారేనన్న సంగతి తెలిసిందే. నిజంగానే వీరికి చెప్పిన హామీలు అమలు చేయాలన్న నిజాయితీ ఉంటే, పేదలకు ఉపకరించే ఈ స్కీములను ఈ ఏడాదంతా ఎగవేసి, అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రూ.31 వేల కోట్ల అప్పు తీసుకు వస్తారా?.మరో సంగతి చెప్పాలి.. చంద్రబాబు 2014 టర్మ్‌లో ఐదేళ్ల పాలన తర్వాత ఏపీలో నిరుపేదల శాతం 11 శాతం నుంచి 12 శాతానికి పెరిగిందని, అదే జగన్ టైమ్‌లో రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్నా నిరుపేదల శాతం 12 శాతం నుంచి ఆరు శాతానికి తగ్గిందని నీతి అయోగ్ నివేదికలు చెబుతున్నాయి. ఇలా ఉంటుంది చంద్రబాబు పాలన తీరు. వైఎస్ జగన్ తన పాలనలో పేదలకు, ప్రత్యేకించి మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చితే చంద్రబాబు కూటమి మాత్రం పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం మినహా మిగిలిన దాదాపు అన్నిటికి తిలోదకాలు ఇచ్చేసింది. అమరావతిలో వ్యాపారుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు సర్కార్ యాభై వేల మంది పేదల ఇళ్ల స్థలాలు వెనక్కి లాగేసుకుంటోంది. దీనిని బట్టే పేదలపై ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఏమిటో అర్థమవుతుంది.చంద్రబాబు అమరావతికి కూడా ఇలాగే విరాళాలు ఇవ్వండి. ఇటుకలు ఇవ్వండి అంటూ కొంతకాలం తిరిగారు. ఇప్పుడేమో అప్పులు ఇవ్వండని ఆర్థిక సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. ఏతావాతా పీ-4 కార్యక్రమాన్ని చూస్తే పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు, చంద్రబాబును పవన్ కళ్యాణ్, సభలో పాల్గొన్న ధనికులను చంద్రబాబు, తిరిగి ఆ బడాబాబులు చంద్రబాబును పొగుడుకోవడానికి మాత్రం బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. ఉపన్యాసాల సోది భరించలేక జనం మధ్యలోనే తిరుగు ముఖం పట్టారు. దీన్ని అర్థం చేసుకోలేని సీఎం యథా ప్రకారం ఆ పేద, బడుగు వర్గాలను అవమానిస్తూ వారిని తప్పుపట్టారు. దీన్ని బట్టే ఈ పీ-4 ఎంత విజయవంతం అయ్యేది అర్థం చేసుకోవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీలో మహిళలకు రక్షణ లేదు: వరుదు కల్యాణి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని.. రాష్ట్రంలో గంటకు మూడు, నాలుగు సంఘటనలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. ఇవి ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. ప్రభుత్వ ఉదాసీనత కారణంగానే ఈ దారుణాలు జరుగుతున్నాయన్నారు. విశాఖ ఉన్మాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.హోంమంత్రి నివాసం ఉంటున్న విశాఖలోనే ఈ దారుణాలు జరుగుతున్నాయి. ఆమె సొంత నియోజకవర్గంలో 25 పోక్సో కేసులు నమోదయ్యాయి. రాజమండ్రి ఘటన జరిగి పది రోజులు అవుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎందుకు నోరెత్తి మాట్లాడలేదు?. వరుసగా ఇన్ని దారుణాలు జరుగుతుంటే చంద్రబాబు, పవన్ ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు?. నిందితులకు రక్షణ కల్పిస్తూ, బాధితులపై కేసులు పెట్టడం దుర్మార్గం’’ అంటూ వరుదు కల్యాణి దుయ్యబట్టారు.‘‘పోలీసులు మహిళల రక్షణను వదిలేసి రెడ్‌బుక్ రాజ్యాంగం కోసం పని చేస్తున్నారు. ఏపీలో మహిళలు ఇంట్లో ఉన్నా రక్షణ ఉండటం లేదు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఒక్క సమీక్ష కూడా చేయలేదు. హోంమంత్రి, సీఎంల కనీసం సమీక్షలు కూడా ఎందుకు చేయటం లేదు? -
వర్మ రివెంజ్ స్టార్ట్.. ఇక పవన్ కు చుక్కలే
-
KSR Comment: తమిళనాడులో జనసేన.. ఊసరవెల్లి సిగ్గుపడేలా పవన్ తీరు
-
Big Question: సత్తా లేనప్పుడు పార్టీ పెట్టడం ఎందుకు పవన్
-
Big Question: పార్టీ పెట్టలేదు.. పవన్ తో పార్టీ పెట్టించారు
-
Big Question :సత్తా లేనోడి తాలూకా
-
రాజమండ్రి ఘటనపై సిట్‌తో దర్యాప్తు చేయించాలి : వరుదు కళ్యాణి
తూర్పుగోదావరి జిల్లా,సాక్షి: మహిళలకు అన్యాయం జరిగితే ఒప్పుకోనన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా? అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ప్రశ్నించారు. రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడిన బాధితురాలి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, అధికార ప్రతినిధి శ్యామల, మాజీ ఎంపీ భరత్ రామ్‌లు పరామర్శించారు. బొల్లినేని ఆసుపత్రి ఘటనపై సిట్ వేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. వరుదు కళ్యాణి: మాట్లాడుతూ.. ఘటన జరిగి పది రోజులైనా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ఘటనను పట్టించుకోరా. యువతిని దారుణంగా హింసించి ఆత్మహత్యకు పురిగొలిపేలా చేసిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు. ఏ హాస్పిటల్లో అయితే బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందో అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం దారుణం. జిల్లా యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదు. సీసీటీవీ ఫుటేజ్‌ను ఇప్పటిదాకా ఎందుకు తల్లిదండ్రులకు చూపించలేదు. ఈ ఘటనపై సిట్ వేసి దర్యాప్తు జరపాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం’ అని హెచ్చరించారు.ఆరే శ్యామల అధికార ప్రతినిధి:బాధిత కుటుంబ తల్లడిల్లిపోతుంది. సహాయంగా ఉండాల్సిన ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది. మహిళలకు అన్యాయం జరిగితే ఒప్పుకోమన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ. బాధిత తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. అంజలికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాటు చేయాలి. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలి.మాజీ ఎంపీ మార్గాని భరత్: బాధితురాల్ని దారుణంగా హింసించిన దీపక్‌ను శిక్షించాలి. నిందితుడు అధికార తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడు కావడంతోనే ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఘట్టంపై సమగ్ర విచారణ జరగాలి. బాధిత యువతి తనకు తానుగా ఇంజక్షన్ చేసుకోలేదు.. ఎవరు చేశారన్న విషయాన్ని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేయాలి. ప్రభుత్వాధికారులు ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదు. గతంలో దీపక్ ఎవరెవరిని హింసించాడన్న అంశాన్ని కూడా పోలీసులు పరిశీలించాలి. ఈ ఘటనలో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి బాధితురాలి తల్లిదండ్రులు :మా బిడ్డను ఆరోగ్యంగా మాతో పంపాలి. లేదంటే అదే ఇంజక్షన్ మాకు ఇవ్వండి. మాకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం’అని హెచ్చరించారు. -
పవన్‌ను వాడుకోవడం.. ఇప్పుడు బీజేపీ వంతు!
అవసరమైతే తమిళనాడుకు కూడా పార్టీని విస్తరిస్తానంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్! వినడానికి బాగానే అనిపించినా ఆయన చెప్పిందైతే వాస్తవం! ఎలాగంటారా? ఏపీలోనే సొంతబలం లేదు కదా? ఇతర రాష్ట్రాలలో ఏం చేయగలుగుతారని మీకు అనిపించవచ్చు. అదే తమాషా రాజకీయం! ఇదంతా భారతీయ జనతా పార్టీ ఆడుతున్న గేమ్ అని అందులో ఈయన ఒక పావుగా మారుతున్నారని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. వామపక్షాల వారైతే బహిరంగంగానే ఈ విమర్శలకు దిగుతున్నారు.రాజకీయాలలోకి వచ్చిన తర్వాత అనేక రూపాలు మార్చుకున్న పవన్ కళ్యాణ్ కొద్ది నెలల క్రితం దక్షిణాది రాష్ట్రాలలో దేవాలయాలను సందర్శించారు. అది కూడా బీజేపీ మాట మేరకే అని ఒక విశ్లేషణ. ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ యోచిస్తోంది. ఇందుకోసం మళ్లీ అన్నా డీఎంకేతో జత కట్టడానికి పావులు కదుపుతోంది. అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ఇందుకు దాదాపు సిద్దమవుతున్నట్లుగానే వార్తలు వస్తున్నాయి. డీఎంకే చేపట్టిన హిందీ వ్యతిరేక ఆందోళన, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి నష్టం కలుగుతున్న అంశాలపై ఆయన వ్యూహాత్మకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వినతిపత్రాలు సమర్పించడానికి ఢిల్లీ వళ్లారు. గతంలో బీజేపీతో పొత్తు ఉన్నా, లోక్‌సభ ఎన్నికల సమయంలో వేర్వేరుగా పోటీ చేశారు. కానీ డీఎంకే మొత్తం స్వీప్ చేసింది. ఆ పార్టీ తమిళనాడులో బలంగా వేళ్లూనుకుంది. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే బలహీనపడింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే బెటర్ అన్న భావన అన్నాడీఎంకేలో ఏర్పడిందని చెబుతున్నారు.ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఈ కూటమిలో చేరతారా? లేదా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. తమ కూటమికి సినీ రంగు అద్దడానికి, తమిళనాడులోని తెలుగు వారిని కొంతమేర ఆకర్షించడానికి పవన్ కళ్యాణ్‌ను ప్రయోగించాలని బీజేపీ తలపెట్టిందని అంటున్నారు. ఒకప్పుడు కులం ఏమిటి? మతం ఏమిటి అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఏకంగా సనాతని వేషం కట్టి దక్షిణాది రాష్ట్రాలు తిరిగి వచ్చారు. ఒక ప్లాన్ ప్రకారం కొద్ది రోజుల క్రితం తమిళ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఏపీలో కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చినా, టీడీపీ పొత్తు కారణంగా జనసేనకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కాపు సామాజిక వర్గం వారు తమ నుంచి ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలని ఎప్పటినుంచో అభిలషిస్తున్నారు.పవన్ కళ్యాణ్ వారి ఆశలపై నీళ్లు జల్లుతూ చంద్రబాబుకు పూర్తిగా వత్తాసు పలుకుతున్నారు. పదిహేనేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని అంటున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ సీఎం కాకుండా అడ్డుపడడానికే ఈ వాదన చేస్తున్నారన్న అభిప్రాయం ఉన్నా, అవసరమైతే తన పదవి కోసం లోకేశ్‌కు కూడా విధేయత ప్రదర్శించే అవకాశం ఉంటుందని కొందరి భావన.చంద్రబాబు ఎప్పుడైనా మళ్లీ బీజేపీని వ్యతిరేకించినా, లేక ఏదో ఒక అంశంపై విడిపోవాలని బీజేపీ అనుకున్నా, పవన్ కళ్యాణ్‌ను ప్రొజెక్టు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్‌కు ఏపీలో పెద్దగా ఓట్లు రాకపోయినా లేకపోయినా, ఆయన సినిమా ఇమేజీని వాడుకుని ఇతర రాష్ట్రాలలో ప్రొజెక్టు చేస్తే దాని ప్రభావం ఏపీపై కూడా ఉండవచ్చన్నది ఒక అంచనా అట.తెలంగాణలో గతంలో బీజేపీ జనసేనతో కలిసి పోటీచేసినా ఫలితం పెద్దగా లేకుండా పోయింది. జనసేన ఒక్క చోట తప్ప పోటీ చేసిన అన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కాని సనాతని వేషం కట్టి ఇతర రాష్ట్రాలలో పర్యటించడం, ఇప్పుడు తమిళనాడుపై దృష్టి కేంద్రీకరించడం వంటి చర్యల ద్వారా చంద్రబాబుకు ఒక చెక్ గా పవన్ ఉండే అవకాశం ఉంటుంది. బీజేపీ వారు చెప్పినట్లు ప్రచారం చేసి వారితో ఆయన మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోగలిగితే సమీప భవిష్యత్తులో లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయడం, లేదా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం చంద్రబాబు కుటుంబానికి కుదరకపోవచ్చు. అన్నాడీఎంకే, బీజేపీ కూటమిలో చేరినా తమిళనాడులో జనసేన ఎంతవరకు సఫలం అవుతుందన్నది సందేహమే. సినీ నటుడు కూడా కనుక ప్రచారానికి ఈయనను వాడుకోవచ్చు. అందుకే యథా ప్రకారం పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలాంటి అబద్దాలు ఆడారో, అదే తరహాలో తమిళనాడులో కూడా ట్రయల్ ప్రారంభించినట్లు అనిపిస్తుంది.ఉదాహరణకు ఆయనకు తమిళ కవి భారతీయార్ పై అభిమానం ఉందని చెప్పడం, శివాజీ గణేశన్‌కు అభిమానినని, 1982 నుంచి 1995 వరకు చెన్నైలో ఉన్నానని చెప్పడం, మైలాపూర్ పాఠశాలలో చదువుకున్నానని అనడం, కూరగాయల మార్కెట్ కు వెళ్లి తమిళం నేర్చుకున్నానని వెల్లడించడం చూస్తే వీటిలో ఎన్ని నిజాలు ఉన్నాయో, ఎన్ని అబద్దాలు ఉన్నాయో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే పవన్ తన పుట్టిన స్థలం, చదువు గురించి మాత్రమే కాదు..అనేక అంశాలలో ఎన్ని రకాలుగా మాటలు మార్చింది ఏపీ ప్రజలకు తెలుసు. అన్నాడీఎంకే, బీజేపీ కలిస్తే తప్పులేదని, అన్నా డీఎంకేతో జనసేన పొత్తు పెట్టుకోవచ్చని ఆయన అన్నారు. ఇక పిఠాపురంలో హిందీకి అనుకూలంగా మాట్లాడి, తమిళ నేతలను పరోక్షంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడ మాత్రం మాట మార్చారు. భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తానని చెప్పారు. తద్వారా తమిళ సెంటిమెంట్‌కు అనుకూలంగా మాట్లాడినట్లు కనిపించే యత్నం చేశారన్న మాట.పిఠాపురంలో తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నప్పుడు హిందీని వ్యతిరేకించడం ఏమిటని అన్నారు. హిందీని రుద్దవద్దన్నది మాత్రమే తమిళ పార్టీల డిమాండ్. ఇదే అంశంపై అన్నాడీఎంకే కూడా అమిత్‌షా కు విన్నవించింది. పవన్ కళ్యాణ్ మరో ఆశ్చర్యకరమైన అంశం చెప్పారు. 2014లో పార్టీని ప్రారంభించినప్పుడు కనుచూపు మేర చీకటి కనిపించిందని, ఎలా ముందుకు వెళ్లాలో తెలియలేదని, మనసులో ధైర్యం తప్ప మరేమీ లేవని ఆయన అన్నారు. ఇది సత్య దూరమైందో, కాదో ఆయనే ఆలోచించుకోవాలి. జనసేన పార్టీని స్థాపించడం, ఆ వెంటనే చంద్రబాబు కోరిక మేరకు మద్దతు ఇవ్వడం, కనీసం పోటీ కూడా చేయక పోవడం, తదుపరి టీడీసీ కూటమి ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకుని ఎంజాయ్ చేయడం జరిగాయి. చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా స్పెషల్ విమానాలు ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నుంచి తరలి వెళ్లేవారు. మరి ఇందులో ఆయనకు చీకటి కనిపించడం ఏమిటో తెలియదు. కాకపోతే 2019లో బీఎస్పీ, వామపక్షాలతో పోటీచేసి ఓటమి చెందినప్పుడు చీకటి కనిపించి ఉండవచ్చు. తన పార్టీ ఒకే సీటు గెలవడం, తనే రెండు చోట్ల ఓడిపోయారప్పుడు. 2019లో కూడా చంద్రబాబుతో పరోక్ష పొత్తు ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై మొదట పార్లమెంటులో మాట్లాడాలని, అలా కాకుండా ఒకేసారి రోడ్లపైకి వస్తే ఎలా అని ప్రశ్నించారు. అంతే తప్ప దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తాను కూడా పోరాడతానని చెప్పలేక పోయారు. అదే టైమ్‌లో దక్షిణాదిలో లోక్ సభ సీట్లు తగ్గవని నమ్ముతున్నట్లు ఆయన చెబుతున్నారు.ఏపీలో పార్టీ విస్తరణకు ప్రత్యేకంగా ఎలాంటి అడుగులు వేయకపోయినా, జనసేన నేతలు, కార్యకర్తలు ఆయా నియోజకవర్గాలలో టీడీపీ వారి పెత్తనం కింద నలిగిపోతున్నా, పట్టించుకోని పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని చెబుతున్నారు. చంద్రబాబుతో కలిసి చేసిన సూపర్ సిక్స్ అనే అబద్దాల వాగ్దానాలను తమిళనాడులో కూడా చెబుతారేమో తెలియదు. ఈ ఇంటర్వ్యూలలో ఆ జర్నలిస్టులు ఏపిలో ఎన్డీయే కూటమి హామీల అమలు తీరుతెన్నుల గురించి ఒక్క ప్రశ్న కూడా వేసినట్లు కనిపించదు. ముందస్తుగా మాట్లాడుకుని ఉంటే ఇబ్బంది లేని ప్రశ్నలే వేసే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ విప్లవవీరుడు చెగువెరా మొదలు టిడిపి అధినేత చంద్రబాబు వరకు, ప్రధాని మోడీ వరకు ఎన్ని రంగులు మార్చారో ,ఇప్పుడు తమిళనాడులో కూడా ఎన్ని రకాల విన్యాసాలు చేస్తారో, ఆయనను తమిళ ప్రజలు ఎంతవరకు నమ్ముతారో వేచి చూడాల్సిందే. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పరువు తీసిన పవన్
-
Pawan Kalyan: నాకు సత్తా లేదు..
-
కూటమి హయాంలో దేవదేవుడికే నిద్ర లేకుండా పోతుంది: రోజా
-
బాబూ.. శ్రీవారికి నిద్ర లేకుండా చేస్తున్నావ్: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి ఆ దేవదేవుడికి కూడా నిద్ర లేకుండా పోతుంది! అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. తిరుమలలో స్వామి వారి దర్శనానికి సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి, డబ్బు ఉన్నవారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. భగవంతుడికి విశ్రాంతి సమయం కూడా లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి ఆ దేవదేవుడికి కూడా నిద్ర లేకుండా పోతుంది!. సంప్రదాయం ప్రకారం, భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. అది భగవంతుడి కోసమే కాకుండా, మన కోసమూ. సాంప్రదాయాలను పాటిస్తే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు.వైఎస్ జగన్ పాలనలో రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు దర్శన భాగ్యం ఉండేవి. కానీ, ఇప్పుడు స్వామికి నిద్ర లేకుండా చేస్తూ, భక్తుల సంఖ్యను తగ్గిస్తున్నారు. దర్శనాల సంఖ్య 60వేల చుట్టూ పరిమితం చేస్తూ, రోజుకు 7 నుంచి 10 వేల బ్రేక్ దర్శనాలకు టీటీడీ ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో సామాన్య భక్తులకు స్వామి దర్శనం మరింత దూరమవుతోంది. సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి, డబ్బు ఉన్నవారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారు. ఇదేనా కూటమి సనాతన ధర్మం? పవన్, బీజేపీ. ఇది చంద్రబాబు నమూనా ప్రక్షాళన?. భగవంతుడు అన్నీ గమనిస్తున్నాడు!! అంటూ కామెంట్స్ చేశారు. -
పవన్, లోకేష్ పై అంబటి రాంబాబు అదిరిపోయే కవిత్వం
-
మీ అన్నగా చెప్తున్నా అన్న.. నీ మాటలు ఏమయ్యాయి పవన్ ?
-
‘మీ అన్నగా చెప్తున్నా’ అన్న పవన్ మాటలు ఏమయ్యాయి?
తాడేపల్లి : గత ఏడాది ఉగాది పండుగనాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు ఎన్నో మాయమాటలు చెప్పి వాలంటీర్లను ముంచేశారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ విమర్శించారు. ఈరోజు(ఆదివారం) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధానకార్యాలయం నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన పుత్తా శివశంకర్.. గత ఉగాది నాడు చంద్రబాబు, పవన్‌లు ప్రజల్ని ఎలా నమ్మించి మోసం చేశారనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. ఇద్దరూ కలిసి వాలంటీర్లను నిలువునా గొంతుకోసేశారు. గత ఉగాది పండుగ నాడు వాలంటీర్లకు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుది. ‘‘ మీ అన్నగా చెప్తున్నా’ ’నంటూ పవన్ సైతం వాలంటీర్లకు పదివేల జీతం హామీ ఇచ్చారు. వారికి లక్ష రూపాయల వరకూ సంపాదించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. మరి ఇప్పుడు ఆ హామీ సంగతిని పక్కన పెడితే.. ఇప్పుడేమో అసలు వాలంటీర్ల వ్యవస్థే లేదంటున్నారు. వాలంటీర్లను విజయవాడ వరదలప్పుడు వాడుకున్నది ఎవరు?, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలన రెండున్నర లక్షల వాలంటీర్ల కుటుంబాలు రోడ్డును పడ్డాయి. రోడ్డున పడిన వాలంటీర్ల కుటుంబాలను ఆదుకోవాలి’ అని పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు. -
కష్టాలు పవన్ ఖాతాలో.. సుఖాలు లోకేష్‌కు
అమరావతిలో ఎప్పట్లానే ఉగాది ఆస్థానం ఏర్పాటు చేసారు... గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే చంద్రబాబు.. లోకేష్.. మంత్రులు మాత్రమే ఉండేవాళ్ళు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం ఆస్థానంలో పాల్గొన్నారు. పంచాంగకర్త మాడుగుల నాగఫణి శర్మ.. గతంలో మాంచి ఫామ్‌లో ఉంటూ.. కొన్ని అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుని ఫేడ్ అవుట్ అయిన మాడుగుల నాగఫణి శర్మ పంచాంగం చదూతున్నారు. లోలోన పవన్ లోకేష్ ఇద్దరూ టెన్షన్ టెన్షన్ అవుతున్నారు.. మాకు ఎలా ఉంటుంది.. ఏమై ఉంటుంది.. భవిష్యత్ బంగారమే కదా అంటూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. నాగబాబు కూడా కొత్త కండువా మాటికీ సర్దుకుంటూ మేధావి నవ్వు నవ్వుతూ అటూ ఇటూ చూస్తున్నాడు. అసలు ఉగాది పండగను కనిపెట్టి.. తెలుగుప్రజలు కొత్త సంవత్సరాన్ని పరిచయం చేసిన చంద్రబాబు కూడా చిద్విలాసంతో కూర్చున్నారు..చెప్పండి శర్మగారూ అని చంద్రబాబు ఆదేశించగా... ముందుగా ఆదాయ వ్యయాలు అని మొదలెట్టారు.. ఆ.. గమ్మున చెప్పండి అన్నారు అందరూ కోరస్ గా.. మీ అందరికీ ఆదాయం వెయ్యి.. ఖర్చు పావలా అన్నారు శర్మగారు.. దీంతో వారంతా లోలోన మురిసిపోయారు.. అవును .. అమరావతి కాంట్రాక్టులతో బాగానే వస్తోంది.. ఎక్కడా పైసా ఖర్చు చేయక్కర్లేదు.. శర్మగారు బాగానే చెప్పారు అనుకున్నారు.. లోకేష్ కూడా.. అవును పోస్టింగులు.. బదిలీలు అన్నీ నావే కాబట్టి నా ఆదాయం బాగానే ఉంటుంది.. పైగా జిల్లాలకు వెళ్ళినపుడు ఏమైనా ఖర్చు ఉన్నా అదంతా ప్రభుత్వ ఖాతాలోకి పోతుంది.. కాబట్టి నాకు అంతా ఆదాయమే అనుకున్నారు. పవన్ కూడా నేను నియోజ కవర్గానికి వెళ్లడమే తక్కువ.. క్యాడర్ గురించి బాధ లేదు.. అటు సినిమాలు చేస్తూ ఆదాయం బాగానే వస్తోంది.. అంటే పంచాంగం కరెక్ట్ గానే ఉన్నట్లుంది అనుకున్నారు. ఇక రాష్ట్ర ఆదాయం గురించి శర్మ గారు చెబుతూ రాష్ట్రానికి ఆదాయం తగ్గుతుంది.. అప్పులు పెరుగుతాయి అన్నారు.. ఇది విన్నాక బాబుగారు లోలోన రాష్ట్రం ఏమైపోతే నాకేంటి..స్టేట్ మొత్తం అప్పులైతే నాకేంది అనుకున్నారు. ఇహ లోకేష్ గారి సంగతి చూస్తే అంటూ కండువా సవరించుకున్న శర్మగారు.. ఆయనకు సీఎం పదవికి ప్రస్తుతం పవనాలు అనుకూలంగా లేవు.. కొన్నాళ్ళు మంత్రిగిరిలోనే ఉంటారు అన్నారు.. దీంతో లోకేష్ పవన్ వైపు గుర్రుగా చూడగా.. నిన్ను సీఎం ను ఎలా చేస్తాను అనుకున్నావు అంటూ పవన్ బదులిచ్చారు. ఇప్పుడు పవన్ గారి రాశి ప్రకారం చూస్తే ప్రస్తుతానికి ఫర్లేకున్నా మున్ముందు భవిష్యత్ కష్టమే అన్నారు.. దీంతో లోకేష్ చంద్రబాబులు పవన్‌ను కుమ్మేద్దాం కళ్ళతో అని సిగ్నల్స్ ఇచ్చుకున్నారు. మరి నా సంగతి ఏమిటి అన్నాడు నాగబాబు.. నీకూ పదవీ యోగం ఉంది అన్నాడు శర్మ.. హమ్మయ్య అనుకుంటూ అందరూ వెళ్లిపోయారు..:::సిమ్మాదిరప్పన్న... -
ఎర్రపుస్తకం తెల్లమొహం వేసింది..!
-
వలంటీర్లు ‘పచ్చడి’
ఇదిగో బాబు.. ‘ఈనాడు’లో నీ ఉగాది హామీసరిగ్గా ఏడాది కిందట టీడీపీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘వలంటీర్లను తొలగించం. గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతాం’ అని ప్రకటించారు. కానీ గద్దెనెక్కిన తర్వాత వలంటీర్లను నిండా ముంచేశారు. సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ప్రజలకు సూపర్ సిక్స్ సహా ఎన్నో హామీలిచ్చి.. ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన చంద్రబాబు, కూటమి పార్టీల నేతలు ఆపై మాట మార్చేశారు. ‘సూపర్ సిక్స్’ అమలు చేస్తానని మోసపూరిత హామీలతో అధికారం చేపట్టాక ప్రతి వర్గాన్ని మోసం చేసిన చంద్రబాబు.. వలంటీర్లను సైతం మోసం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు, పైరవీలు, పక్షపాతం లేకుండా క్షేత్ర స్థాయిలో సేవలు అందించిన వలంటీర్ల వ్యవస్థనూ ఒక్కసారిగా కుప్పకూల్చారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయం.. చివరకు తనకు ఓటు వేయని వారికైనా సరే అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలన్న నాటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వలంటీర్లు విధులు నిర్వర్తించారు. వారికి కేటాయించిన ఇళ్లకు స్వయంగా వెళ్లి.. వారికి ఏయే పథకాలకు అర్హత ఉందో గుర్తించి.. వారితో దరఖాస్తు చేయించి.. ఆయా పథకాలు వర్తింప చేసి.. ప్రభుత్వం ద్వారా లబ్ధి కలిగేలా కృషి చేశారు. ఇంతగా సేవలు అందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థను ప్రస్తుత టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నుంచి వలంటీర్లకు చిక్కులు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వలంటీర్లకు విధులు అప్పజెప్పడం మానేసింది.ఇప్పుడు మళ్లీ ఉగాదొచ్చింది..ఇప్పుడు మళ్లీ ఉగాది వచ్చింది. గత ఏడాది జూన్‌లో రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబే కొనసాగుతున్నారు. ఈ ఏడాది కాలంలోనే రాష్ట్రంలో వలంటీర్లందరి ఉద్యోగాలు పోయాయి. 2024 జూన్ ఒకటో తేదీన సైతం వలంటీర్లు గౌరవ వేతనాలు పొందారు. అయితే 2023 ఆగస్టు నుంచే రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదంటూ చంద్రబాబు ప్రభుత్వమే వలంటీర్లందరినీ ఉద్యోగాల నుంచి తొలగించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు గత ఏడాది ఉగాది పండుగ రోజున చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు వారి వేతనాలు పెరగకపోగా, ఏకంగా వారి ఉద్యోగాలే లేకుండా పోయాయి. పది నెలలుగా వారి వేతన చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. అసలు రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థే ప్రస్తుతం ఉనికిలో లేదని సాక్షాత్తు ఆ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి నిస్సిగ్గుగా ప్రకటించారు. ‘ఆ వ్యవస్థే లేనప్పుడు వారిని ఎలా కొనసాగిస్తాం? వలంటీర్ల వ్యవస్థే లేనప్పుడు జీతాల పెంపు అంశం ఎక్కడ ఉంటుంది?’ అంటూ ఎదురు ప్రశ్నించడంతో వలంటీర్ల దిమ్మ తిరిగిపోయింది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని వల్లె వేశారు. ‘అసలు వలంటీర్లు అఫీషియల్‌గా లేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు జీతాలు పెంచడానికి చూస్తున్నా, జీవోలో ఎక్కడా వాళ్లు లేరు. ఏదన్నా చేద్దాం.. ముందుకెళదామంటే వాళ్లు ఉద్యోగంలో ఉంటే చేయవచ్చు’ అంటూ వ్యాఖ్యానించడంతో అందరూ విస్తుపోయారు. దీంతో తామంతా దారుణంగా మోసపోయామని వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. గత ఉగాది పండుగ పూట మీకు తీపి కబురు చెబుతున్నామన్న చంద్రబాబు ఇంత దుర్మార్గంగా తమను మోసం చేస్తారని అనుకోలేదని నిప్పులు చెరిగారు. తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పది నెలలుగా ఎక్కడికక్కడ ధర్నాలకు దిగారు. 2.66 లక్షల మంది వలంటీర్లు వివిధ రూపాల్లో ఆందోళనలు చేయడంతో పాటు వినతులు ఇస్తున్నా, చంద్రబాబు ప్రభుత్వం వారి గురించి కనీస ఆలోచన చేయడం లేదు. కరోనా సమయంలో కీలక సేవలువైఎస్ జగన్ హయాంలో ఎలాంటి అవినీతి, వివక్ష, పైరవీలకు తావులేకుండా ఆయా పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దనే అందించారు. ప్రజలకు ప్రభుత్వ ఆఫీసుల్లో ఏ పని ఉన్నా వలంటీర్లే గ్రామ సచివాలయాల ద్వారా చేయించారు. కరోనా వంటి అత్యంత విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రతి నెలా రెండు విడతల చొప్పున కేవలం మూడు రోజుల సమయంలో అన్ని కుటుంబాల్లో ఫీవర్ సర్వే పూర్తి చేశారు. తద్వారా ఎప్పటికప్పుడు రోగుల గుర్తింపులో కీలక పాత్ర పోషించారు. వరదల సమయంలో బాధిత ప్రజలకు గతంలో ఎప్పుడూ లేనంత వేగంగా సహాయక చర్యలు అందించడంలో ముందు వరుసలో నిలిచారు. గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఎన్నికల వరకు చంద్రబాబు సహా కూటమి నేతలంతా తీవ్ర విమర్శలు చేశారు. తీరా పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 2.66 లక్షల కుటుంబాలను నిట్ట నిలువునా ముంచేశారని వలంటీర్లు వాపోతున్నారు. ఇప్పుడు ఊడగొట్టిన ఉద్యోగాలే ఎక్కువ కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారని చూస్తే ఆ ఊసే లేదు. ఊడకొట్టిన ఉద్యోగాలే ఎక్కువ. 2.66 లక్షల మంది వలంటీర్ల ఉద్యోగాలు పోయాయి. బేవరేజ్ కార్పొరేషన్లో 18 వేల మందిని తొలగించారు. ఫైబర్ నెట్, ఏపీఎండీసీ, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, వైద్య ఆరోగ్య శాఖ.. ఇలా ఆయా ప్రభుత్వ విభాగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు తీసేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్లో సర్దుబాటు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. ఆ విధంగా ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీలను పూర్తిగా కుదించేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు..తెలుగుదేశం.. ఎన్డీయే మూడు పార్టీల కూటమి తరఫున మీకు హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం. వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఉగాది పండుగ రోజున తీపి కబురు చెబుతున్నాం. రూ.5 వేలు కాదు, మీకు రూ.10 వేలు పారితోషకం ఇచ్చే బాధ్యత మాది.-అసెంబ్లీ ఎన్నికల ముందు 2024 ఏప్రిల్ 9న ఉగాది పండుగ సందర్భంగా చంద్రబాబువలంటీర్లకు నేను ఒకటే చెబుతున్నా.. వలంటీర్లలో లక్ష మంది మహిళలున్నారని వైఎస్సార్సీపీ మంత్రులు మాట్లాడుతున్నారు. అమ్మా, నేను ఓ అన్నగా చెబుతున్నా. మీకు ఐదు వేలు వస్తుంటే, ఇంకో ఐదు వేలు పెంచి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. నేను ఎప్పుడూ మీ పొట్ట కొట్టను. -ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్కళ్యాణ్అధికారంలోకి వచ్చాక..వలంటీర్లు అసలు అఫీషియల్‌గా లేరు ఇప్పుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు జీతాలు పెంచడానికి చూస్తున్నా, ఎక్కడా.. జీవోలో వాళ్లు అసలు లేరు. ఏదన్నా చేద్దాం.. ముందుకెళదామంటే వాళ్లు ఉద్యోగంలో ఉంటే చేయవచ్చు. అంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయింది. -నాలుగు నెలల క్రితం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో సర్పంచుల సంఘ ప్రతినిధుల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్రూ.4.57 లక్షల కోట్ల పంపిణీలో కీలక పాత్ర2019 ఆగస్టు 15న అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మక వలంటీర్ల వ్యవస్థకు నాంది పలికింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల మందిని నియమించింది. 2024లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే వరకు ఎలాంటి వివక్ష, రాజకీయ పక్షపాతం, పైరవీలు, అవినీతికి తావులేకుండా ప్రభుత్వం ద్వారా లబ్ధిని ప్రజల గడప వద్దకే అందజేయడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు. ఆ ఐదేళ్లలో రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ రూపంలో, మరో రూ.1.84 లక్షల కోట్లు నాన్ డీబీటీ రూపంలో మొత్తంగా రూ.4.57 లక్షల కోట్ల మేర లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో క్షేత్ర స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించారు. అరచేతిలో వైకుంఠం చూపారుచంద్రబాబు వలంటీర్లకు అరచేతిలో వైకుంఠం చూపారు. అది నిజమనుకుని, ఆ హామీలు నమ్మాం. తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. గతేడాది ఉగాది నాడు నూతన పట్టు వస్త్రాలు ధరించి, నుదుట బొట్టుతో చంద్రబాబు మా భవిష్యత్ గురించి ఎంతగానో తపన పడుతున్నట్లు మాట్లాడారు. మమ్మల్ని ఊరిస్తూ బూటకపు హామీలు ఇచ్చారు. ఆ హామీని నమ్మి దగా పడ్డ వలంటీర్లంతా ఈ ఉగాదిని కూటమి దగా–దినంగా పాటించాలని నిర్ణయించుకున్నాం. పండుగ పూట పస్తుండి నిరసనలు తెలుపుతాం. – హుమాయూన్ బాషా, ఏపీ గ్రామ వార్డు వలంటీర్ల సంఘం అధ్యక్షుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలిసీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉండగా మాకు (వలంటీర్లకు) ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి రాగానే రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామన్నారు. చంద్రబాబు గత ఉగాది నాడు పచ్చడి తింటూ ఈ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల వ్యవస్థ లేదని చెబుతున్నారు. మంత్రులు ‘పుట్టని బిడ్డ’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్‌లో విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో మా సేవలు వినియోగించుకున్నారు. పుట్టని బిడ్డతో సేవలు ఎలా చేయించుకున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఉగాది పర్వదినాన చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి. –గాలి షైనీ, వలంటీర్, విజయవాడమా ఉసురుతో ఈ ప్రభుత్వం పతనం ఉగాది పండుగ రోజున వలంటీర్ వ్యవస్థకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును మరిచిపోలేం. గతేడాది ఉగాది రోజున వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పని చేసిన మమ్మల్ని సీఎం చంద్రబాబు మోసం చేశారు. వలంటీర్లంతా పేద కుటుంబాలకు చెందిన వారే. అలాంటి కుటుంబాల్లో వలంటీర్ ఉద్యోగం కల్పించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేలు చేసింది. కానీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇద్దరూ చేసిన మోసాన్ని మేము మరిచిపోలేం.. మా ఉసురు ఈ ప్రభుత్వ పతనానికి దారి తీయడం ఖాయం. – చేపల రాజు, వలంటీర్, రేవుపోలవరం, అనకాపల్లి జిల్లాదుర్మార్గంగా పక్కన పెట్టేశారువలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలు సైతం రెట్టింపు చేస్తామని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని విస్మరించి సీఎం చంద్రబాబు మమ్మల్ని మోసం చేశారు. అధికారంలోకి వచ్చి పది నెలలైనా మా గురించి పట్టించుకోవడం లేదు. జీతాలు పెంచే విషయం అటుంచి.. ఏకంగా వలంటీర్ల వ్యవస్థనే రద్దు చేశారు. గత ఐదేళ్లలో వలంటీర్లు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందించాము. కరోనా సమయంలో మేము చేసిన సేవలు, త్యాగాలు వెలకట్టలేనివి. చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మి జీతాలు పెరుగుతాయని అనుకున్నాం. తీరా అధికారంలోకి వచ్చాక దుర్మార్గంగా పూర్తిగా పక్కన పెట్టేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలి. – అన్నపూర్ణ, వలంటీర్, రాములవీడు గ్రామం, పొదిలి మండలం, ప్రకాశం జిల్లానమ్మించి నట్టేట ముంచేశారుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలంటీర్లను నమ్మించి నట్టేట ముంచేశారు. రూ.5 వేలు కాదు.. రూ.10 వేలు ఇస్తామని చెప్పి వలంటీర్లను మోసం చేశారు. ఎన్నికల్లో నెగ్గాక ఈ వ్యవస్థే లేదంటూ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో, ఇతరత్రా మా సేవలు చూసి యావత్ దేశ ప్రజలంతా ప్రశంసించడం నిజం కాదా? మీకు చిత్తశుద్ధి ఉంటే వలంటీర్లకు చేసిన వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చాలి. లేదంటే తగిన బుద్ధి చెబుతాం.– పెదపూడి చినబాబు, వలంటీర్, ఎన్ఆర్పీ అగ్రహారం, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లాదగ్గరలోనే బుద్ధిచెప్పే రోజులు వలంటీర్లను కొనసాగించడానికి పరిపాలన అనుమతులు లేవని సాకులు చెప్పి నిలిపివేశారు. అయితే విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో వలంటీర్ల సేవలను ఏ అధికారంతో వినియోగించుకున్నారో చెప్పాలి. గత ప్రభుత్వానికి సాధ్యమైంది.. ఈ ప్రభుత్వానికి ఎందుకు కావడం లేదు? వలంటీర్లను తప్పించాలనే దురుద్దేశంతో ప్రభుత్వం సాకులు చెబుతోంది. చాలా మంది డిగ్రీ వరకు చదువుకొని ఉన్న ఊరిలో ఇంటి పనులు, ప్రజా సేవ చేస్తూ జీవనం సాగించే వారు. కూటమి ప్రభుత్వం కుట్రతోనే వలంటీర్లను పక్కనపెట్టింది. ఇది నిజం. వారికి తగినబుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. – రామ్‌గోపాల్, చిన్నటేకూరు, కల్లూరు మండలం, కర్నూలు జిల్లాఉగాది చేదు జ్ఞాపకంఉగాది పండుగ మా వలంటీర్లందరికీ చేదు జ్ఞాపకం. ఎన్నికలకు ముందు గత ఉగాది పండుగను పురస్కరించుకుని విజయవాడలో చంద్రబాబునాయుడు ఒక ప్రకటన చేశారు. ఉగాది రోజు వలంటీర్లందరికీ తీపి కబురు చెబుతున్నామన్నారు. రూ.10 వేలు జీతం ఇచ్చే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సైతం అదే మాట చెప్పారు. ఇప్పుడేమో వలంటీర్లకు జీతాలు పెంచాలని చూస్తున్నాం కానీ వారందరూ ఎక్కడా జీవోలో లేనే లేరు అని తప్పించుకోవడం బాధాకరం. చిరు జీతానికి పని చేసుకుంటున్న మమ్మల్ని మోసం చేయడం సబబు కాదు. – చలపతి, పాదిరికుప్పం, కార్వేటినగరం మండలం, చిత్తూరు జిల్లా -
‘వాటిని అపవిత్రం చేస్తుంటే పవన్ ఏం చేస్తున్నాడు?
తిరుపతి: తిరుమలలో అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. పాప ప్రదాయినిగా బావించే పాపవినాశనంలో ప్రవిత్ర జలాలను అపవిత్రం చేశారని ధ్వజమెత్తారు భూమన. ఈరోజు తిరుపతి నుంచి ప్రెస్ మీట్ లో భూమన మాట్లాడుతూ.. ‘తిరుమల పాపవినాశనంలో బోటు షికారు ట్రయిల్ రన్ చేశారు. కూబింగ్ కోసమని బోట్లు తిప్పామని అన్నారు. అటవీశాఖ ట్రయల్ రన్ నిరతవహిస్తున్నామను అని అన్నారు. అనితర మేము వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గోరంతను కొండంత చేసిన కూటమి ప్రభ/త్వం.. నేడు పాప ప్రదాయినిగా భావించే పాప వినాశనంలో పవిత్ర జలాలను అపవిత్రం చేసింది. చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని, అందుకే బోట్లు సర్వే చేశామని అన్నారు. ఇప్పటికి ఐదు రోజులైంది. కానీ టీటీడీ అధికారులు ఎవ్వరూ ఇంతవరకూ వివరణ ఇవ్వలేదు.పవన్ ఏం చేస్తున్నాడు..?నడుం బిగించానని చెప్పిన పవన్ కు నడుం నొప్పి ప్రారంభమైంది. అటవీశాఖ పవన్ పరిధిలో ఉంటుంది, అలాంటిది పవిత్ర జలాలకు అపవిత్రం చేస్తుంటే పవన్ ఏం చేస్తున్నాడు?, ఎందుకు స్పందించలేదు?, నిన్న బాలాజీ నగర్ లో పోలీసులు మద్యం పట్టుకొన్నారు. కొండపై మధ్యం విచ్చలవిడిగా దొరుకుతుంది. తిరుమల కొండపై మద్యం నిషేధించి దశాబ్దాలు అయినా అక్కడ మద్యం ఏరులై పారుతోంది. తిరుమల కొండపై ఎక్సైజ్ శాఖ ఉంది. పది రోజులకు ముందు గంజాయి, మద్యం మత్తులో భక్తులపై దాడి చేశారు. వీరిని పట్టుకోవడానికి భద్రత సిబ్బంది కష్టపడాల్సివచ్చింద15 రోజులకు ముందు ఆలయం సమీపంలో మద్యం మత్తలో ఓ యువకుడు హాల్ చల్ చేశాడు. ఆలయ సమీపంలో ఇలా జరుగుతుంటే ఏం చేస్తున్నారు?, . ఆలయం సమీపంలో ఇలా జరుగుతుంటే ఏం చేస్తున్నారుతిరుమలను బోట్లు ద్వారా పర్యాటక కేంద్రంగా మార్చాలని చూడలేదా?, .సీఎం చంద్రబాబు అన్నిదేవాలయాలను కలుపుతూ టూరిజం ఏర్పాటు చేస్తామని అన్నారు. టీటీడీ ప్రక్షాళన చెయ్యడానికే ఈఓ శ్యామలా రావు నియమించానన్నారు సీఎం చంద్రబాబు. ఇదేనా ప్రక్షాళన అంటే చంద్రబాబుకూటమి ప్రభుత్వంలో రోజుకో అరాచకంవైఎస్సార్‌సీపీ పాలనలో అన్నీ అరాచకలే అన్న మీరు.. ఒక్కటి కూడా నిరూపించలేదు. కానీ నేడు కూటమి ప్రభ/త్వంలో రోజుకో అరాచకం జరుగుతుంది. ముంతాజ్ హోటల్ అనుమతి ఇచ్చిందే చంద్రబాబు, అలాంటి ముంతాజ్ హోటల్ పై పెద్దఎత్తున స్వామీజీలు నిరసనలు చేశారు. అనంతరం వెనక్కి తగ్గారు. కూటమి ప్రభుత్వం చేసే మోసాలు, అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు. తిరుమలలో వరుస ఘటనలు ఎవరు జవాబు చెప్తారు’ అని ప్రశ్నించారు భూమన -
అయినను రాజకీయ భక్తులు నోరు విప్పరేం?
మనం ఎవరైనా.. ఏదో సందర్భవశాత్తు.. తప్పనిసరైతేనే అబద్దాలు చెబితే చెప్పవచ్చు. కానీ దైవసన్నిధికి వెళ్లినప్పుడు మాత్రం అలా అసత్యాలు చెప్పడానికి వెనుకాడతాం. రాజకీయ నేతలకు ఈ విషయంలో కూడా మినహాయింపే ఉన్నట్లు ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు.. అంతా పవిత్రంగా భావించే తిరుమలను సైతం తమ రాజకీయ అవసరాలకు వాడుకోవడంలో విపక్షంలో ఉన్నప్పుడు కాని, అధికారంలోకి వచ్చిన తర్వాత కాని ఆరితేరినట్లు కనబడుతోంది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తన మనుమడు దేవాన్ష్ పుట్టిన రోజు పురస్కరించుకుని తిరుమలకు వెళ్లినప్పుడు ఆయన చెప్పిన విషయాలలో అబద్దాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు, ఆ తర్వాత భూమన వాదన విన్న తర్వాత తిరుమల యాత్ర సందర్భంగా కూడా అబద్దాలు చెబుతున్నారన్న విమర్శలకు సీఎం ఎందుకు ఆస్కారం ఇస్తున్నారనే భావన కలుగుతోంది. చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని, దేవుళ్లను రాజకీయాలకు వాడుకునే నీచత్వం చంద్రబాబు, పవన్లదని భూమన అన్నప్పుడు దానిని ఖండించవలసిన టీడీపీకాని, ప్రభుత్వంలోని వారు కాని అసలు పట్టించుకోలేదంటే దానిపై వివరణ ఇచ్చే పరిస్థితి లేదనే అర్ధం అవుతుంది కదా!. 👉వైఎస్ జగన్(YS Jagan) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి చిన్న అంశాన్ని.. అందులో వాస్తవం ఉన్నా లేకపోయినా గోరంతలు కొండంతలు చేసి తిరుమల అపవిత్రం అయిపోతోందంటూ చంద్రబాబు, పవన్, లోకేష్ ఆరోపణలు గుప్పించేవారు. వాటిలో అత్యధికం అసత్యాలే అనే సంగతి అప్పట్లోనే రుజువు అయ్యింది కూడా. కానీ జగన్ ప్రభుత్వానికి జరగవలసిన డామేజీ అప్పటికే జరిగిపోయింది. ఉదాహరణకు తిరుమలకు వెళ్లే బస్‌ల టిక్కెట్లపై అన్యమత ప్రచారం ఉందని, కొండపై శిలువ రూపంలో లైట్లు ఉన్నాయని.. ఇలా ఒకటేమిటి దారుణమైన అబద్దాలు ప్రచారం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా పోటీపడి ఈ అసత్యాలను జనంలోకి తీసుకువెళ్లే యత్నం చేసేవి. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయిన ఈ పద్దతి మానుకున్నారా? అంటే లేదు. అదే ధోరణి అనుసరిస్తున్నారు. 👉చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు అత్యంత ఘోరమైన అపచారం.. తిరుమల లడ్డూ విషయంలో చేశారు. కోట్లాది మంది పవిత్రంగా భావించే ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ బాధ్యతారాహిత్యంగా చంద్రబాబు ఆరోపణ చేశారు. దానికి అదనంగా అయోధ్యకు పంపిన లడ్డూలలో కల్తీలడ్డూలు వెళ్లాయని దారుణమైన అబద్దాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు. తీరా చూస్తే ఇవేవి నిజం కాదని వెల్లడైంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యి సరఫరా అయితే దానిని టీటీడీ అధికారులు వెనక్కి పంపినట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాంటప్పుడు జంతు కొవ్వు కలిసిన నెయ్యి లడ్డూలో ఎలా వాడతారన్నదానికి ఇంతవరకు సమాధానం లేదు. అలాగే అయోధ్యకు లడ్డూలను తయారు చేయించి పంపించింది ప్రస్తుతం టిటిడి సభ్యుడిగా ఉన్న సౌరబ్ బోరా అని తేలింది. ఆయన స్వచ్చమైన ఆవు నేయితో తయారు చేసిన లడ్డూలను పంపితే.. పవన్ కళ్యాణ్ మాత్రం తప్పుడు ఆరోపణ చేశారు. పోనీ ఆయన తన అభిప్రాయానికి కట్టుబడి బోరా పై ఏమైనా చర్య తీసుకోవాలని కోరారా? అంటే అదీ లేదు. ఇవన్నీ తిరుమలేషుని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేయడం కాదా? అన్న ప్రశ్న వస్తే సమాధానం ఉండదు. చంద్రబాబు తాజా తిరుమల టూర్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చూద్దాం. ఏడుకొండలను ఆనుకుని ఉన్న ప్రాంతం స్వామివారి సొంతం అని, అక్కడ ఓబెరాయ్ హోటల్‌కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి అభివృద్ది సంస్థ ఆ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన విషయాన్ని మాత్రం కప్పిపెట్టారు. పైగా ఆ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వగానే ఎల్లో మీడియా రాయలసీమలోనే మొదటి సెవెన్ స్టార్ హోటల్ అంటూ ఊదరగొట్టింది. మొత్తానికి.. సాధువుల నిరసనలతో ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దేవలోక్ ప్రాజెక్టు కు కేటాంచిన భూ అనుమతిని కూడారద్దు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తీరా చూస్తే ఆ ప్రాజెక్టుకు 2016లో అప్పటి టిడిపి ప్రభుత్వమే విల్లాలు,గదుల నిర్మాణం నిమిత్తం అనుమతి ఇచ్చింది. గతంలో అసెంబ్లీలో.. ఏడు కొండలు లేవు.. రెండు కొండలే ఉన్నాయని కొందరన్నారని మరో అసత్య వచనం చెప్పారు. దానిపై అప్పట్లో పోరాడనని చంద్రబాబు అంటున్నారు. అప్పుడు కూడా చంద్రబాబు అబద్దమాడినట్ట్లు ఒకటికి పదిసార్లు రుజువు అయినా అదే అసత్యం చెబుతూ ఉంటారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడు కొండలను దివ్యక్షేత్రంగా ప్రకటిస్తూ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2007లో జి,ఓ.746 ఇచ్చారని ప్రస్తుత ఈఓ శ్యామలరావు హైకోర్టులో వేసిన ఒక అఫిడవిట్లో తెలిపారు. 👉ఒక వదంతిని సృష్టించడం, దానిని నిజమని ప్రచారం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన గురించి తెలిసినవారు వ్యాఖ్యానిస్తుంటారు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తామని ఒకసారి , దానిని కొనసాగిస్తామని మరోసారి చెబుతున్నారు. ఇది కాకుండా కొత్తగా ఆలయాల నిర్మాణం కోసం ఇంకో ట్రస్టు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. నిజానికి శ్రీవాణి ట్రస్టు ను ఏర్పాటు చేసింది టీడీపీ హయాంలోనే అట. దానిని వైఎస్సార్సీపీ హయాంలో సమర్ధంగా నిర్వహించి విదేశాలలో, దేశ వ్యాప్తంగా 3600 దేవాలయాలను నిర్మించిందని భూమన చెప్పారు. అనేక చోట్ల కళ్యాణోత్సవాలను కూడా జరిపించారు. ఇది వాస్తవమా?కాదా?.. ఇప్పుడేదో కొత్తగా దేశంలో టీటీడీ(TTD) తరపున ఆలయాలు నిర్మించబోతున్నట్లు బిల్డప్ ఇవ్వడం అవసరమా?. నిజంగానే శ్రీవాణి ట్రస్టు ను రద్దు చేసి ఆ నిధులను టీటీడీ సాధారణ నిధులలోకి తీసుకువస్తే రూ. 600 కోట్ల జీఎస్టీని చెల్లించవలసి వస్తుందని భూమన చెప్పారు. ఏ ఉద్దేశంతో చంద్రబాబు ఈ ట్రస్టును రద్దు చేసి మరో కొత్త ట్రస్టు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారో తెలియదు. గతంలో శ్రీవాణి ట్రస్టు నిధులు దుర్వినియోగం అయ్యాయని చంద్రబాబు ఆరోపించేవారు. అది నిజం కాదని పరోక్షంగా ఆయన అంగీకరిస్తున్నారనుకోవాలి. ఇక.. తిరుమలకు నీటి కొరత రాబోతోందని, ఆలయం మూసివేయాలని ఒక అధికారి తనతో చెప్పారంటూ చంద్రబాబు పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ అధికారి పేరు ఎందుకు చెప్పలేదు. నిజంగానే నీటి సమస్య వస్తే భక్తులను కొండపైకి రాకుండా ఆపుతారేమో కాని, స్వామివారి నిత్య కైంకర్యాలను ఆపి ,ఆలయాన్ని మూసివేయడం ఎక్కడైనా జరుగుతుందా? అనేదానికి జవాబు దొరకదు. ఆఖరికి సెంటిమెంట్ విషయాలలో కూడా చంద్రబాబు ఇలా మాట్లాడడమేమిటో అర్ధం కాదు. గతంలో అప్పటి ఈఓ ధర్మారెడ్డి తనయుడు ఆకస్మికంగా చనిపోతే.. కర్మకాండ ముగిసిన తర్వాత ఆయన ఆలయానికి వస్తే దానిని తప్పుపడుతూ ఆలయాన్ని అపవిత్రం చేస్తారా? అని చంద్రబాబు, పవన్‌లు అన్నారన్న సంగతిని భూమన ప్రస్తావించారు. మరి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణించి నెలలు తిరగకముందే.. చంద్రబాబు కుటుంబం తిరుమలకు ఎలా వస్తారని, ఇది అపవిత్రం కాదా? అని భూమన ప్రశ్నించారు.దీనికి చంద్రబాబు లేదంటే ఆయన తరపున టీటీడీ వాళ్లైనా జవాబు ఇవ్వాలి కదా!. కిక్కురుమన్నట్లు లేదు. అంతేకాదు.సోషల్ మీడియాలో ఒక ఫొటోతో కూడా వ్యాఖ్య ఒకటి కనిపించింది. జగన్ ముఖ్యమంత్రి హోదాలో తిరుమల వెళ్లినప్పుడు స్పూన్ తో ప్రసాదం స్వీకరించడాన్ని కూడా ఆక్షేపించి తమ రాజకీయ అవసరాలకోసం చంద్రబాబు వాడుకున్నారట. మరి అదే చంద్రబాబు తన మనుమడితో పాటు స్పూన్ తోనే ప్రసాదం తీసుకుంటున్న ఫోటో కనిపించింది. నిజానికి ఇది పెద్ద అంశం కాదు. కాని చంద్రబాబు దేనినైనా రాజకీయం చేయగలరని.. తనవరకు వస్తే మాత్రం ఏమి జరగనట్లే ఉంటారని చెప్పడానికే ఇలాంటి నిదర్శనాలు అవుతాయి. పాపనాశనం రిజర్వాయిర్‌లో బోటింగ్ పెట్టారట. అదే జగన్ టైంలో పెట్టి ఉంటే టీడీపీ, బీజేపీ, జనసేనలు ఎంత గగ్గోలు పెట్టేవో?. ఇప్పుడేమో వివాదం అయ్యేసరికి అధికారులు ఏవో సాకులు చెబుతున్నారు. తిరుమల అదనపు ఈవో అచ్చంగా రాజకీయవేత్త మాదిరి.. స్థానికంగా వైఎస్సార్సీపీ అభిమానులన్న అనుమానంతో చిరువ్యాపారులను బెదిరిస్తున్నారట. సామాన్యులకే స్వామివారి దర్శనంలో ప్రాధాన్యత అని చంద్రబాబు,పవన్ కళ్యాణ్, బీఆర్ నాయుడు ఊదరగొడుతుంటారు. కాని ఆచరణలో మాత్రంఅందుకు భిన్నంగా ప్రస్తుతం రోజుకు ఎనిమిదివేల మందికి వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నారట. వీటిలో అత్యధికం ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుందట. దాంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండవలసి వస్తోందని సామాన్యులు వాపోతున్నారు. ఇక ఆలయాల కూల్చివేతలు, మఠాల భవనాల ధ్వంసం చేయడం వంటివి జరుగుతున్నా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు నోరు విప్పి మాట్లాడం లేదు. హిందూ మత ఉద్దారకులమని ప్రచారం చేసుకునే బీజేపీ సైతం వీటిని చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. మతాన్ని,దైవక్షేత్రాలను రాజకీయాలకు వాడుకుంటున్న వీరికి నిజంగా భక్తి ఉందా? అనే సందేహం ఎవరికైనా రావచ్చు. వీరు అపర భక్తులా? లేక రాజకీయ భక్తులా అంటే ఏమి చెబుతాం?.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే నోరు మెదపరా?'
తూర్పుగోదావరి, సాక్షి: ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే సహించబోనని.. చెయ్యి వేసిన వాడి తాట తీస్తానని గతంలో పవన్ కల్యాణ్ ఎన్నో ప్రకటనలు ఇచ్చారు. మరి ఇప్పుడు ఆయనెక్కడ ఉన్నారు? అంటూ రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులు, ఆమె స్నేహితులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం దాకా వచ్చిన చంద్రబాబుకి.. ఇక్కడిదాకా వచ్చే టైం లేదా? అని అడుగుతున్నారు. మహిళా హోం మంత్రి అనితకు పరామర్శించే సమయమే లేదా? అని నిలదీస్తున్నారు. లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన డీ ఫార్మ్ ఫైనలియర్ విద్యార్థిని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె చికిత్స పొందుతున్న రాజమండ్రి బొల్లినేని కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యమే వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నమూ చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని సమాచారం అందుతోంది. ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి కమిటీ వేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి వెంకటేశ్వరరావు సారథ్యంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం శుక్రవారం ఆసుపత్రికి వచ్చి విద్యార్థినికి అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యంపై ఇవాళ(శనివారం) హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు.బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్‌తో ఆత్మహత్యా యత్నం బహిర్గతమైంది. నిందితుడు దీపక్ ఓ టీడీపీ ఎమ్మెల్యేకి బంధువు కావడంతో కేసును నీరు కారుస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగిన మూడు రోజుల దాకా అంతా గోప్యంగా ఉంచారని అంటున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆందోళన బాట పట్టారు. సీసీ ఫుటేజీ ఎక్కడ? బాధితురాలు వేకురోనీమ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుందని.. దీనివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు పేర్కొంటుండగా.. ఇంకా బ్రెయిన్ డెడ్ కాలేదని ఆస్పత్రి యాజమాన్యం అంటోంది. మరి అంత ప్రమాదకరమైన ఇంజక్షన్ ఆమె చేతికి ఎలా వచ్చిoది? ఆమే చేసుకుందా..? ఎవరైనా ఇచ్చారా? సీసీ ఫుటేజీలో ఏం ఉంది? అనే దిశగా పోలీసు దర్యాప్తు చేయకపోవడం సందేహాలకు తావిస్తోంది. వాడిని చంపేయండి..! చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన చెల్లికి ఈ పరిస్థితి కల్పించిన దీపక్‌ను చంపేయాలని బాధితురాలి సోదరి, మేనత్త ఆగ్రహంతో మండిపడ్డారు. తన చెల్లెలు బాగా చదువుకునేదని, మంచి మార్కులతో ఫార్మసీ పూర్తి చేసే లోపు ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి లోపల ఏం జరుగుతోందో తెలియడం లేదని, ఎలాంటి వైద్యం అందిస్తున్నారో చెప్పడం లేదని బాధితురాలి అక్క విలపించింది. దీపక్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని మేనత్త డిమాండ్ చేసింది. సూసైడ్ లేఖ దొరక్కపోయి ఉంటే ఈ కేసును వేరే విధంగా మార్చేసేవారన్నారు. -
కేంద్రం నుండి ఎంత ముడుపు వచ్చింది పవన్,బాబుపై స్టీల్ ప్లాంట్ వర్కర్లు ఫైర్
-
Big Question: హైందవ ధర్మానికి అడ్డంకులు.. వేసేది సనాతని వేషం.. చేసేది చిల్లర రాజకీయం
-
చంద్రబాబు, పవన్ ఆదేశాలతో ఏపీలో దెబ్బతింటున్న ఆధ్యాత్మిక శోభ
-
హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?: వైఎస్ జగన్
ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే.. అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లే. ఒకరు ఆదేశిస్తారు.. మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశినాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూలి్చవేతలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపై, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు ఉందా? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ వైపు యథేచ్ఛగా జరుగుతున్న ఆలయాల కూల్చివేతలు.. మరో వైపు హిందూ ధర్మంపై కొనసాగుతున్న దాడులపై వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా స్పందించారు. ‘ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే.. అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే.. మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లే.. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు’ అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్ జిల్లా కాశినాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన అటవీ శాఖను చూస్తున్న, సనాతన వాదినని చెప్పుకుంటున్న డిప్యూటీ సీఎం.. తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని దెప్పి పొడిచారు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అని నిలదీçస్తూ గురువారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. కాశినాయన క్షేత్రం పరిరక్షణకు ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో చేసిన కృషికి సంబంధించిన ఆధారాలు, అప్పట్లో అధ్యాత్మిక శోభతో విలసిల్లిన ఆ క్షేత్రం ఫొటోలు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ క్షేత్రం కూల్చివేతకు జారీ చేసిన ఉత్తర్వులు, కూల్చివేత ఫొటోలను ట్యాగ్ చేస్తూ ‘ఇవిగో ఆధారాలు.. ఏమిటి మీ సమా«దానం’ అని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను సూటిగా ప్రశ్నించారు. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు కావా? నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే... దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు.. రాష్ట్రంలో ఆలయాలపై, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?మా ఐదేళ్ల పాలనలో ఈ క్షేత్రాన్ని పరిరక్షించాం అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై 2023 ఆగస్టు 7న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుం బిగించిన మాట వాస్తవం కాదా? అదే ఏడాది.. అదే నెల 18న అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖ రాశాను. కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రాన్ని రిజర్వ్ చేయాలని, దీని కోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని ఆ లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఆలయాల పట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ పట్ల మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఇవిగో ఆధారాలు07–08–2023:కాశినాయన క్షేత్రంలో నిర్మాణాలు నిలిపివేయాలని, ఉన్నవాటిని తొలగించాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చిన కాపీ 18–08–2023: కాశినాయన క్షేత్రం ఉన్న భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని, 12.98 హెక్టార్ల భూమిని కాశినాయన క్షేత్రానికి రిజర్వు చేయాలని కోరుతూ అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు నాటి సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖ అధికార అహంకారానికి ఇవిగో ఆధారాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో నిర్మాణాలను కూల్చివేస్తూ వచ్చారు. చంద్రబాబు ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడి చేశారు. ఇందుకు ఇవిగో ఆధారాలు (కాశినాయన క్షేత్రం కూల్చివేతకు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులు ట్యాగ్ చేస్తూ), ఏమిటి మీ సమాధానం?1–1–2025: ఏపీ అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదేశాల మేరకు కాశినాయన క్షేత్రంలోని నిర్మాణాలను తొలగించాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సంబంధిత అధికారులకు జారీ చేసిన ఆదేశాల కాపీ వీళ్ల తీరే అంత.. వారే ఉత్తర్వులిచ్చి, వారి చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్న పూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెబుతున్నారు. వీళ్ల తీరే అంత. ఈ ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతే. -
డింగ్ డాంగ్ 2.0: పొలిటికల్ తిట్ల పురాణం
-
YS Jagan: ఆలయాలు కూల్చే నువ్వు హిందూ ధర్మం గురించి మాట్లాడతావా
-
మోదీ అంటే భయమా.. దక్షిణాదిపై స్పందనేది బాబు?
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం దక్షిణాది రాష్ట్రాలలో కాక పుట్టిస్తోంది. చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 14 రాజకీయ పార్టీల నేతల సమావేశం ప్రస్తుత జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గట్టిగానే చెప్పగలిగింది. ఈ సమావేశానికి హాజరు కాకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ కూడా తన అభిప్రాయాలను విస్పష్టంగా తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ కాపీని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు పంపించారు.తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ అంశం వల్ల ఏ రాష్ట్రానికి నష్టం జరగదని, ఇంకా చర్చ జరగలేదని చెబుతుంటే మరో కేంద్రమంత్రి బండి సంజయ్ మాత్రం చెన్నై సమావేశాన్ని దొంగల భేటీగా పోల్చి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సంజయ్ ఇప్పటికీ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ అంశంపై మాట్లాడడానికి నోరు పెగులుతున్నట్లు లేదు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పునర్విభజన వల్ల నష్టం జరుగుతుందని అనుకోవడం లేదని చెబుతున్నారు. వీరిద్దరు బీజేపీతో కూటమి కట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.గతంలో చంద్రబాబు నాయుడు తను కూటమిలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఊరుకోబోనని కనీసం కబుర్లయినా చెప్పేవారు. ఇప్పుడు ఆ ధైర్యం కూడా చేయలేకపోవడం గమనార్హం. పాతికేళ్లపాటు పునర్విభజన వద్దని చెన్నై భేటీలో పాల్గొన్న నేతలు కోరారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో వచ్చే సమస్యకు జగన్ తన లేఖ ద్వారా పరిష్కార మార్గాలు వివరించారు. పాతికేళ్ల నిషేధమన్న డిమాండ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదన్న సంగతి గుర్తుంచుకోవాలి. పాతికేళ్లలో ఉత్తరాది జనాభా మరింత పెరగదని ఈ నేతలు గ్యారంటీ ఇవ్వగలరా అన్న ప్రశ్న వస్తుంది. అందువల్ల ఇప్పుడే పునర్విభజన వ్యవహారానికి ఒక పద్దతైన పరిష్కార మార్గం ఆలోచించాలని చెప్పక తప్పదు.వైఎస్ జగన్ తన లేఖలో పేర్కొన్నట్లు ఆయా రాష్ట్రాలకు ప్రస్తుతం పార్లమెంటులో ఉన్న వాటాను యథాతథంగా కొనసాగించడానికి ప్రయత్నాలు జరిగితే బాగుంటుంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణలు అవసరం అవుతాయి. ఇదే ఉద్దేశం చెన్నై భేటీలో పాల్గొన్న నేతలందరికీ ఉన్నప్పటికీ, వారి తక్షణ డిమాండ్ మాత్రం పునర్విభజన వద్దన్నది కావడం గమనార్హం. అయితే, పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా నియోజకవర్గాలు పెరగకపోతే ఎన్నికైన ఎంపీలకు అవి అలవికానివిగా మారతాయి. ఉదాహరణకు ఇప్పుడు 17 లక్షల నుంచి 19 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉంటే, అది పాతిక లక్షలకు ఒక నియోజకవర్గంగా మారవచ్చు. అదే సమయంలో ఏ రాష్ట్రానికి దీనివల్ల నష్టం జరగకూడదన్నది అంతా ఒప్పుకోవాలి.ఈ సమస్యకు ప్రధాన కారణం ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా నియంత్రణ సరిగా లేకపోవడం, దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా జనాభా పెరుగుదలను నియంత్రించడం. దీనివల్ల జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను నిర్ణయిస్తే ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మొదలైన రాష్ట్రాలలో కొత్త నియోజకవర్గాలు భారీ ఎత్తున వస్తాయి. దక్షిణాదిలో మాత్రం ఆ స్థాయిలో పెరగవు సరికదా కేరళ వంటి చోట్ల నియోజకవర్గాలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 48 సీట్లు పెరిగితే ఆ రాష్ట్రం ఎంపీలు చెప్పినట్టుగా వినాల్సిన పరిస్థితి కేంద్రానికి వస్తుంది. యూపీతోపాటు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి కొద్ది రాష్ట్రాలే దేశాన్ని శాసించే పరిస్థితి రావచ్చు. ఈ పరిణామం ఒకరకంగా నియంతృత్వ ధోరణికి దారి తీయవచ్చన్నది దక్షిణాది రాష్ట్రాల నేతల భయం.జనాభా ప్రాతిపదికన పునర్విభజన రాజకీయ నేతలకే కాదు.. దక్షిణాది ప్రజలకు కూడా నష్టం కలిగించే అంశమే. నిధుల పంపిణీ వంటి వాటిలో ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ వాటా వస్తుంటే, ఉత్తరాదికి అధిక వాటా వెళ్తోంది. ఈ అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ, యూపీ నుంచి కేంద్రానికి అందే రూపాయి పన్ను అందితే, తిరిగి ఆ రాష్ట్రానికి 2.73 రూపాయలు వెళుతున్నాయని తెలిపారు. బీహార్‌కు రూపాయికి ఆరు రూపాయలకు పైగా నిధులు వెళుతుంటే తమిళనాడుకు 29పైసలు, కర్ణాటకకు 14 పైసలు, తెలంగాణకు 41 పైసలు, కేరళకు 66 పైసల వాటా మాత్రమే నిధులు వస్తున్నాయని వివరించారు. ఈ వివక్షతో పాటు ఇప్పుడు లోక్‌సభ నియోజకవర్గాలు కూడా తగ్గితే ఉత్తరాది, దక్షిణాది అంతరం బాగా పెరిగే ప్రమాదం ఉంటుంది. దేశ సమగ్రత భావానికి ఇది విఘాతం కలిగిస్తుంది. అనవసరమైన అపోహలకు దారి తీస్తుంది.కేరళ ముఖ్యమంత్రి విజయన్ కూడా ఉత్తరాదిన నియోజకవర్గాలు పెరిగితే బీజేపీ లబ్ది పొందుతుందని, దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా చెన్నై సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ది పథంలో వెళుతున్న దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధంగా కేంద్ర నిర్ణయాలు ఉండరాదని అన్నారు. బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులను ఉత్తరాదికే పరిమితం చేశారని ఆయన వ్యాఖ్యానించారు.వైఎస్ అధినేత జగన్ మాత్రం కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా చెప్పిన విధంగా దామాషా పద్దతిలో లోక్‌సభ సీట్ల సంఖ్యను నిర్ణయించాలని, తదానుగుణంగా రాజ్యాంగ సవరణలు చేయాలని ప్రతిపాదించారు. చెన్నై భేటీలో తమిళనాడు, కేరళ, పంజాబ్, తెలంగాణ ముఖ్యమంత్రులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ కూడా హాజరు కావడం విశేషం. పంజాబ్‌లోని పరిస్థితులు, ఐఎన్డీఏతో ఉన్న సంబంధాల రీత్యా హాజరై ఉండవచ్చు. నవీన్ పట్నాయక్ వర్చువల్‌గా పాల్గొని తన అభిప్రాయాలు తెలియచేశారు. తదుపరి భేటీ హైదరాబాద్‌లో జరుగుతుందని ప్రకటించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే భేటీకి ప్రధాన ప్రత్యర్ధి అయిన బీఆర్ఎస్ ఎంతవరకు హాజరు అవుతుందన్నది సందేహమే. ఇప్పటికే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి పక్షాలు పాల్గొన్న సమావేశానికి బీఆర్ఎస్ వెళ్లడంపై బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని విమర్శలు చేస్తుంది. ఒడిషా నుంచి బీజేడీ నేతలు హైదరాబాద్ వస్తారా? రారా? అన్నది చెప్పలేం. ఎటుతిరిగి డీఎంకే, వామపక్షాలు కాంగ్రెస్‌తో కలిసే ఉంటున్నాయి కనుక వారికి ఇబ్బంది ఉండదు. ఇక వైఎస్సార్సీపీ అధినేత వ్యూహాత్మకంగా వ్యవహరించి భేటీకి వెళ్లకుండా, అలాగని తన అభిప్రాయాలు దాచుకోకుండా ప్రధానమంత్రికే ఏకంగా లెటర్ రాశారు. దానివల్ల దక్షిణాదికి అన్యాయం జరగరాదని ఆయన డిమాండ్ చేసినట్లయింది. అదే సమయంలో కాంగ్రెస్ కూటమి పక్షాలు అధికంగా ఉన్న భేటీకి ఆయన హాజరు కాకుండా జాగ్రత్తపడ్డారు. ఇంతవరకు వైఎస్సార్సీపీ అటు ఎన్డీయే వైపుకానీ, ఇటు ఇండియాకూటమివైపు కానీ ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తోంది.ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేనలు మాత్రం దీనిపై మాట్లాడలేకపోతున్నాయి. సాధారణంగా అయితే గతంలో తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందని భావిస్తే పొత్తుల గురించి పట్టించుకోకుండా మాట్లాడతానని చంద్రబాబు అనేవారు. గుజరాత్ మత కలహాల అంశంలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంటులో దీనిపై చర్చ జరిగి ఓటింగ్ సమయానికి జారి పోయినప్పటికీ, కొన్నిసార్లు అయినా మాట్లాడేవారు. అలాగే ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ యూపీ, బీహార్ రాష్ట్రాలకు అధిక వాటాలో కేంద్రం నుంచి నిధుల వెళ్లే తీరుతెన్నులపై గతంలో ధ్వజమెత్తేవారు. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ మైనార్టీలకు అన్యాయం జరిగితే ఊరుకోబోనని మాట వరుసకైనా అనేవారు. కానీ, ఇప్పుడు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు అంటే ఏం భయమో తెలియదు కానీ.. ఏపీతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉన్న నియోజకవర్గాల పునర్విభజనపై మాత్రం స్పందించడం లేదు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడినా, మాట్లాడకపోయినా పెద్దగా పట్టించుకోరు. ఆయనకు దీనిపై పెద్దగా అవగాహన కూడా ఉండకపోవచ్చు. కానీ, తానే మోదీని ఎదిరించగలనని గతంలో చెప్పుకున్న చంద్రబాబు వంటి సీనియర్ నేత, ఇప్పుడు ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో ఇంత నష్టం జరుగుతుంటే కేంద్రాన్ని గట్టిగా నిలదీయ లేకపోవడం ఆయన ఎంతగా బలహీనపడ్డారో తెలియ చేస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి పాలనలో ఒకవైపు యధేచ్చగా జరుగుతున్న ఆలయాల కూల్చివేతలు, మరోవైపు హిందూ ధర్మంపై కొనసాగుతున్న దాడులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్సీపీ హయాంలోనే ఆలయాల పరిరక్షణ కొనసాగిందన్న ఆయన.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతోనే ఇప్పుడు ఏపీలో ఆధ్యాత్మిక శోభ దెబ్బ తింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్(YS Jagan) ట్వీట్లో ఏమన్నారంటే.. నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి?. ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రం(Kasinayana Kshetram)లో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మం(Hindu Dharmam)పై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?.. .. అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట వాస్తవం కాదా? అదే నెల ఆగస్టు 18, 2023న అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌గారికి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖరాసి కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్యకూడా తీసుకోలేదు. ఆలయాలపట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణపట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇది. .. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో కూల్చివేస్తూ వచ్చారు. చంద్రబాబు(Chandrababu)గారి ఆదేశాలమేరకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడిచేశారు. ఇవిగో ఆధారాలు, ఏమిటీ మీ సమాధానం? తామే ఉత్తర్వులిచ్చి, తమ చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్నపూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెప్తున్నారు. వీళ్ల తీరే అంత? .. ఈ ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతే. ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమనుతాము చిత్రీకరించుకునేది వీళ్లే. .. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీశాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటివరకూ ఒక్క మాటకూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అని వైఎస్ జగన్ నిలదీశారు.నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో… pic.twitter.com/gTRsvBfnia— YS Jagan Mohan Reddy (@ysjagan) March 27, 2025 -
మరో అపచారం.. పవనానంద స్వామి ఎక్కడ?
తిరుపతి, సాక్షి: తిరుమల క్షేత్రంలో మరో ఘోర అపచారం జరిగిందని.. సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పవనానంద స్వామి(డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్) ఎక్కడ? అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి నిలదీశారు. పాప వినాశనం డ్యామ్‌లో బోటింగ్ వ్యవహారంపై బుధవారం భూమన మీడియాతో మాట్లాడారు. నిన్న పాప వినాశనం డ్యామ్‌లో బోటింగ్ చేశారు. ఆ నీటిని భక్తులు పవిత్రంగా చూస్తారు.అలాంటి డ్యామ్‌లో టూరిజం పేరుతో బోటింగ్ చేయడం ఏంటి?. టూరిజం వేరు.. అధ్యాత్మికం వేరు. టీటీడీ పరిధిలోనే పాప వినాశనం డ్యామ్ ఉంది. బోటింగ్‌పై ఈవో, అడిషనల్ ఈవో సమాధానం చెప్పాలి అని భూమన డిమాండ్ చేశారు.అటవీ శాఖ పవన్ కల్యాణ్ దగ్గరే ఉన్న సంగతి తెలిసిందే. ఆ శాఖ ఆధ్వర్యంలో తిరుమలలోని పాపవినాశనంలో మంగళవారం బోటింగ్ ట్రయల్ రన్ చేపట్టారు. కుమారధార, పసుపుధార నీరు మొత్తం పాపవినాశనంలో చేరుతుండగా.. ఈ ప్రాంతంలోనే పాపవినాశనం తీర్థం, గంగాదేవి ఆలయం ఉన్నాయి. ఈ క్రమంలో బోటింగ్ వ్యవహారంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఇలా పర్యాటక కేంద్రంగా మార్చే యత్నాలు మానుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. -
పవన్‌కు విజయ కుమార్ ఛాలెంజ్
-
ఆదాయం పెంచాలి: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు పెంచడం ద్వారా ఆదాయం పెంచాలని, అప్పుడే తాను చెప్పిన విధంగా సంక్షేమ పథకాలను సజావుగా అమలు చేయగలనని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లను కోరారు. ఆదాయం పెంచకుండా సంక్షేమం, అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఒక శాతం వృద్ధి రేటు పెంచితే అదనంగా రూ.15 వేల కోట్లు, 3 శాతమైతే రూ.45 వేల కోట్ల ఆదాయం వస్తుందని.. అప్పుడైతేనే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయగలనని పునరుద్ఘాటించారు. వచ్చే ఆర్ధిక ఏడాది 15 శాతం పైగా వృద్ధి రేటు సాధించేందుకు అనుగుణంగా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సదస్సును ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలలి, పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. మే నెలలో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ద్వారా రూ.15 వేలు చొప్పున ఇస్తామని, స్కూల్స్ తెరిచేలోగా ఈ మొత్తాన్ని పంపిణీ చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద మూడు వాయిదాల్లో ఇస్తున్న మొత్తంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు, 5 వేలు, 4 వేలు చొప్పున మూడు వాయిదాల్లో రైతులకు ఇస్తామని తెలిపారు. (హామీ మేరకు రూ.6 వేలు+రూ.20 వేలు = రూ.26 వేలు ఇవ్వాలి. కానీ కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలు మాత్రమే ఇస్తామని చెబుతున్నారు). మెగా డీఎస్సీ కింద 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎస్సీ వర్గీకరణతో సహా ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. స్కూల్స్ తెరిచే నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలని చెప్పారు. ఏప్రిల్‌లో మత్స్యకారుల జీవనోపాధికి రూ.20 వేలు ఇస్తామని, 2027లో పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు. కలెక్టర్లు సీఈవోలా పని చేయాలని, ఎప్పటికప్పుడు పనితీరుపై సమీక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏం చెప్పారంటే.. రెవిన్యూ సమస్యలపై దృష్టి పెట్టడం లేదు – రెవెన్యూ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కలెక్టర్లు వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కేవలం భూ సంబంధిత సమస్యలే 60–70 శాతం ఉన్నాయి. దీనిపై వర్క్‌షాప్ నిర్వహించాలి. క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలిసిన కలెక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, మంత్రులు, నిపుణులు నెల రోజుల్లో నివేదికతో రావాలి. “వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్’ అనే నినాదంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. – ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగులకు రూ.1,030 కోట్లు విడుదల చేశాం. ఇప్పుడు మరో రూ.6,200 కోట్లు విడుదల చేస్తాం. రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరముంది. అన్ని వర్క్ ప్లేసుల్లో చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. అంతర పంటలతో అరకు కాఫీని ప్రోత్సహించాలి. – బీసీల్లో వడ్డెర కులస్తులకు క్వారీలు ఇచ్చేలా, మత్స్యకార సొసైటీలకు చెరువులు అప్పగించి చేపలు పెంచుకునేలా తోడ్పాటు ఇవ్వాలి. కల్లు గీత కార్మీకులకు కేటాయించిన వైన్ షాపులు దుర్వినియోగం కాకూడదు. – రైతులు ఇచి్చన భూములను తాకట్టు పెట్టడం, విక్రయించడం ద్వారా వచ్చే నిధులతోనే అమరావతి నిర్మాణం చేపడుతున్నాం. అనకాపల్లి వద్ద స్టీల్ ప్లాంట్, రామాయపట్నం కోసం భూములతో పాటు మిగతా ప్రాజెక్టులకు ఇదే నమూనాను అమలు చేయాలి. అనకాపల్లిలో టౌన్íÙప్, రామాయపట్నంలో మరో టౌన్ షిప్ వస్తాయి. – కలెక్టర్లు.. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన అన్ని అనుమతులను వచ్చేలా చూడాలి. సోలార్ రూఫ్ టాప్, సహజ సేద్యంను ముందుకు తీసుకెళ్లాలి. గ్రీన్ ఎనర్జీ, పర్యాటకం, వాట్సాప్ గవర్నెన్స్, పీ4 గేమ్ చేంజర్ కానున్నాయి. – వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి. పశువులకు మేతపై దృష్టి పెట్టాలి. వడగాడ్పుల వల్ల ఒక్క వ్యక్తి కూడా మృతి చెందకూడదు. కాల్ సెంటర్ నిర్వహించాలి. స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా పచ్చి మేత పెంపకానికి చర్యలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వలసలకు తావివ్వొద్దు. – మంత్రులు, శాఖాధిపతులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా, నియోజకవర్గ, మండల, సచివాలయాల స్ధాయిలో విజన్ ప్రణాళికలతో ముందుకు సాగాలి. శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీలతో కలిసి పని చేయాలి. సాంకేతికతను ఉపయోగించుకోవాలి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ప్రారంభంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో సీఎం పక్కనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కుర్చీ వేశారు. అయితే ఆయన రాకపోయినప్పటికీ ఆ చైర్‌ను అలాగే ఖాళీగా ఉంచి సదస్సు నిర్వహించారు. కాగా, 2025–26 ఆర్థిక ఏడాదిలో స్థూల ఉత్పత్తి లక్ష్యాలలో భాగంగా వృద్ధి శాతం 16, 17, 18 చొప్పున జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్దేశించారు. -
సినిమాల్లో నటించడంపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినీరంగంలో కొనసాగుతారా..? మళ్లీ కొత్త సినిమాలు చేస్తారా..? అని అభిమానుల్లో చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ విషయంపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. అయితే, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం రావడం కష్టమేనని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ, ఈ మూడు సినిమాల కోసం పవన్ ఇప్పటికే చాలా సమయం తీసుకున్నారు. దీంతో నిర్మాతలకు బడ్జెట్ పెరిగి తలనొప్పిగా మారిందని కూడా చెబుతున్నారు.తమిళ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి పవన్ కల్యాణ్ మాట్లాడారు. తనకు డబ్బు అవసరం ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంటానని చెప్పారు. అయితే, తాను సినిమా నిర్మాణరంగంలో మాత్రం భాగం కానన్నారు. 'నాకు ఉన్న ఏకైకా ఆదాయమార్గం నటన మాత్రమే.. నాకు డబ్బు అవసరం ఉన్నంతవరకూ నటిస్తూనే ఉంటాను.' అని పవన్ అన్నారు. 2020 ముందు వరకు పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ కేవలం రూ. 15 కోట్ల లోపు మాత్రమే అని ఇండస్ట్రీలో చెబుతున్న మాట.. అయితే, వకీల్‌సాబ్ సినిమా నుంచి ఆయన రూ. 50 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు కన్నుమూత
తమిళనాడుకు చెందిన కోలీవుడ్ నటుడు, కరాటే మాస్టర్ షిహాన్ హుస్సేని (60) అనారోగ్యంతో కన్నుమూశారు. కోలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన ఆయనకు మంచి గుర్తింపే ఉంది. మార్షల్ ఆర్ట్స్‌లో చాలామందికి శిక్షణ ఇచ్చిన షిహాన్ హుస్సేనికి ఫ్యాన్స్ కూడా భారీగానే ఉన్నారు. పవన్ కల్యాణ్, దళపతి విజయ్ ఇద్దరూ కూడా ఆయన వద్దే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ముఖ్యంగా పవన్ ఆయన వద్దే మార్షల్ ఆర్ట్స్‌తో పాటు కరాటే, కిక్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు.కొన్ని నెలలుగా షిహాన్ హుస్సేని బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. అయితే, తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని అందుకోసం తను నిర్మించుకున్న మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రాన్ని అమ్మేస్తున్నట్లు ఆయన చెప్పాడు. దానిని తన శిష్యుడు పవన్ కల్యాణ్ కొనుగోలు చేస్తే సంతోషిస్తానని ఆయన చివరగా కోరాడు. తన వేదన పవన్ వరకు వెళ్తే తప్పకుండా సాయం చేస్తాడని కూడా షిహాన్ హుస్సేని ఆశించాడు. ఆయన అభ్యర్తన పవన్ కల్యాణ్ వరకు చేరిందో లేదో తెలియదు. ఇప్పుడు షిహాన్ హుస్సేని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. దీంతో ఆయన వద్ద శిక్షణ పొందిన కొందరు శిష్యులు మాట్లాడుతూ.. మాస్టర్ చివరి కోరిక తీరకుండా వెళ్లిపోయారని వాపోతున్నారు.పదిరోజుల క్రితం పవన్‌ను అభ్యర్థించిన షిహాన్ హుస్సేనికొద్దిరోజుల క్రితం షిహాన్ హుస్సేన్ తన శిష్యుడు పవన్ కల్యాణ్ తన శిక్షణా కేంద్రాన్ని కొనమని కోరారు. ఈ క్రమంలో పవన్‌తో కొన్ని విషయాలను పంచుకున్నారు ' నా వద్ద శిక్షణ తీసుకుంటున్న సమయంలో అతనికి పవన్ అని పేరు పెట్టాను. ఈ మాటలు అతని చెవులకు చేరితే అతను తప్పకుండా స్పందిస్తాడని తెలుసు. అతను ఈ మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రాన్ని కొనుగోలు చేసి భవిష్యత్ తరాల కోసం నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. అతను ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి అని నాకు తెలుసు. కానీ, అతను నా దగ్గర శిక్షణ పొందిన రోజులు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. శిక్షణా కేంద్రాన్ని శుభ్రం చేయడమే కాదు.. ప్రతిరోజు నాకు టీ అందించే వాడు కూడా.. మార్షల్ ఆర్ట్స్ ను దేశవ్యాప్తంగా విస్తరింపచేయాలని ఇద్దరమూ మాట్లాడుకునే వాళ్లం. ఇప్పుడు దానిని పవన్ పూర్తి చేస్తాడని ఆశిస్తున్నాను.' అని హుస్సేని అన్నారు. ఈ శిక్షణ కేంద్రాన్ని వాణిజ్య సముదాయంగా లేదా నివాస అపార్ట్‌మెంట్‌గా మార్చే వ్యక్తికి అమ్మే బదులు, ఇది తన వారసత్వాన్ని సజీవంగా ఉంచడంలో సహాయపడుతుందని ఆయన నమ్మారు. ఆర్చరీలోనూ షిహాన్ హుస్సేని శిక్షణ ఇచ్చాడు. మార్షల్ ఆర్ట్స్ సుమారు 10 వేల మందికి పైగా ఆయన వద్ద ట్రైన్ అయ్యారు.. ఆర్చరీలో 1000 మందికి పైగా విద్యార్థులను ఆయన తయారు చేశారు.పవన్ కల్యాణ్ స్పందనమార్షల్ ఆర్ట్స్‌లో తనకు శిక్షణ ఇచ్చిన షిహాన్ హుస్సేని మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి సమయంలో హుస్సేని కుటుంబ సభ్యులకు మరింత బలాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వద్ద కరాటేలో శిక్షణ పొందానని పవన్ చెప్పుకొచ్చారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారనే వార్త తనకు తెలిసిందని, ఈనెల 29న ఆయన్ని పరామర్శించడానికి చెన్నై వెళ్లాలనుకున్నానని ఆయన అన్నారు. ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వస్తుందనుకోలేదన్నారు. -
పవన్ కొత్త సినిమాలు క్యాన్సిల్?
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలుగులో స్టార్ హీరో. కానీ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో చేతిలో ఉన్న సినిమాలే పూర్తి చేయలని పరిస్థితి. అలాంటి కొత్త చిత్రాలంటే అస్సలు అయ్యే పనికాదు. ఈ క్రమంలోనే కొత్త సినిమాలు రెండు క్యాన్సిల్ అయ్యాయనే మాట వినిపిస్తోంది.పవన్ చేతిలో ప్రస్తుతం 'హరిహర వీరమల్లు', 'ఓజీ' (OG Movie) సినిమాలున్నాయి. వీటిలో 'హరిహర..' లెక్క ప్రకారం ఈ మార్చి 27న రిలీజ్ కావాలి. కానీ మే 9కి వాయిదా వేశారు. పవన్ కి సంబంధించిన కొన్ని సీన్స్ పెండింగ్ ఉన్నాయని అంటున్నారు. మరి మేలో అయినా సరే సినిమా రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.(ఇదీ చదవండి: వెంటిలేటర్ పై అల్లు అర్జున్ నానమ్మ.. ఇప్పుడు ఎలా ఉందంటే?)పవన్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్న 'ఓజీ'కి దాదాపు 20 రోజుల డేట్స్ పవన్ ఇవ్వాల్సి ఉందట. అది ఎప్పుడు జరిగితే దానిబట్టి రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ టీమ్ ఉంది. ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లి చాలా ఏళ్లు అయిపోయాయి. ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఎప్పుడొస్తాయో చెప్పలేని పరిస్థితి.ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaab Bhagath Singh) షూటింగ్ కొన్నిరోజులు చేశారు. గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ మూవీని హోల్డ్ లో పెట్టేశారనే టాక్ ఉంది. అలానే సురేందర్ రెడ్డితో కమిట్ అయిన ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ చేసేశారని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల బట్టి చూస్తే పవన్ చివరి చిత్రం 'ఓజీ'నే!(ఇదీ చదవండి: రామ్ చరణ్- అల్లు అర్జున్.. ఈ సారికి లేనట్టే!) -
జాగ్రత్త చంద్రబాబు.. పాములాంటి దత్త పుత్రుడిని పెంచుతున్నావ్
-
ఒకటికి రెండు
తెలుగు సినిమాల గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, సలార్, కల్కి 2898 ఏడీ, దేవర, పుష్ప’ వంటి చిత్రాల విజయాలు అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలన్నింటిలోని కామన్ పాయింట్ ఏంటంటే... ఈ సినిమా కథలన్నీ భారీ స్థాయిలో ఉన్నాయి.అందుకే ఒకటి కాదు... రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ సినిమాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఒకటికి రెండు ట్రెండ్ టాలీవుడ్లో ఊపందుకుంది. భారీ కథలు ఎంపిక చేసుకుని, ఆ కథను పలు భాగాలుగా ఆడియన్స్‌కు చూపిస్తున్నారు మేకర్స్. ఈ కోవలో పెద్ద కథలతో రానున్న కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం.ఉగాదికి రిలీజ్ హీరో మహేశ్‌బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ చిత్రీకరణ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను ఇటీవలే ఒడిశాలోని కోరాపుట్‌లో పూర్తి చేశారు. నెక్ట్స్ షెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్ చేశారు.కాగా దక్షిణాఫ్రికా, కెన్యా దేశాల్లో ఈ మూవీ చిత్రీకరణ జరగనుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని, తొలి భాగం 2026 చివర్లో లేదా 2027 ఉగాది సమయంలో ప్రేక్షకుల ముందుకు రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన ‘బాహుబలి’ సినిమా ‘బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్’ అంటూ రెండు భాగాలుగా వచ్చి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు కెరీర్‌లోని ఈ 29వ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైతే, మహేశ్‌బాబు కెరీర్లో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి చిత్రం ఇదే అవుతుంది.ఈ ఏడాదిలోనే రాజా సాబ్ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ హీరోగా చేసే సినిమాలు భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. రెండు భాగాలుగా వచ్చిన ‘బాహుబలి’ సినిమా బ్లాక్‌బస్టర్ సాధించడంతో ప్రభాస్ నెక్ట్స్ సినిమాలు కూడా భారీ స్థాయిలో రూపొందుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘కల్కి 2898 ఏడీ, సలార్’ చిత్రాలు ఫ్రాంచైజీలుగా రానున్నాయి. ఈ రెండు సినిమాల తొలి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చి, సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.మలి భాగాల చిత్రీకరణకు ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ప్రభాస్ హీరోగా చేస్తున్న మరో సినిమా ‘రాజా సాబ్’ కథ కూడా పెద్దదే. ఈ హారర్ కామెడీ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మూడేళ్లుగా కొనసాగుతోంది. మూడు తరాలు, ఆ తరాలకు చెందిన ఆత్మలు, హారర్ ఎలిమెంట్స్ వంటి అంశాలతో ‘రాజా సాబ్’ మూవీ రెండు భాగాలుగా రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు.ఇప్పటికే ‘రాజా సాబ్’ సినిమా నుంచి ప్రభాస్‌కు చెందిన రెండు డిఫరెంట్ లుక్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సింది. కానీ కొంత టాకీ పార్టు, సాంగ్స్ షూట్, వీఎఫ్ఎక్స్... వంటివి పెండింగ్ ఉండటంతో ‘రాజా సాబ్’ సినిమా రిలీజ్ వాయిదా పడనుంది. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్ కానుందని సమాచారం. వీరమల్లు పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హిస్టారికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగంగా ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ మే 9న విడుదల కానుంది. 17వ శతాబ్దంలో జరిగే ఈ కథలో పవన్ కల్యాణ్ కథ రీత్యా ఓ దొంగ తరహా పాత్రలో కనిపిస్తారని తెలిసింది. ఈ మూవీలో నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, సత్యరాజ్, బాబీ డియోల్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. డబ్బింగ్ పనులూ మొదలయ్యాయి. ఏఎమ్ రత్నం, అద్దంకి దయాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి స్వరకర్త.కింగ్డమ్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారట విజయ్ దేవరకొండ. ఈ చిత్రంలో విజయ్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నామని ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తొలి భాగం మే 30న రిలీజ్ కానుంది. ఈ పీరియాడికల్ ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్‌లో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని సమాచారం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరకర్త.కోహినూర్ వజ్రం కోసం...‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందనున్న హిస్టారికల్ ఫిల్మ్ ‘కోహినూర్’. ‘ది కింగ్ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్’ అనేది క్యాప్షన్. గత ఏడాది దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. ఈ సినిమాకు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించనున్నారని, 2026 జనవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నామని కూడా అప్పట్లో మేకర్స్ వెల్లడించారు. కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం అనే అంశం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుంది.‘భద్రకాళి దేవత మహిమగల వజ్రం సామ్రాజ్యవాదుల చేతుల్లోకి వెళ్లింది. కోహినూర్ వజ్రాన్ని తిరిగి మూలాలకు తీసుకు రావడానికి ఓ యువకుడు సాగించే, చారిత్రాత్మక ప్రయాణం నేపథ్యంలో ఈ మూవీ కథ ఉంటుంది’’ అని ఈ మూవీ గురించి మేకర్స్ పేర్కొన్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక హీరో సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్ కాంబినేషన్లో ‘క్షణం, కృష్ణ అండ్ హీజ్ లీల’ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో మూడో చిత్రంగా ‘కోహినూర్’ తెరకెక్కనుంది.ఏటిగట్టు కథలు హీరో సాయిదుర్గా తేజ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న పీరియాడికల్ మాస్ ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కేపీని దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను దాదాపు రూ. 125 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ యాక్షన్ ఫిల్మ్ కోసం విదేశాల్లో ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్నారు సాయిదుర్గా తేజ్.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ మూవీలో సంజయ్ దత్ మరో లీడ్ రోల్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. కాగా ఈ మూవీ కూడా రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.స్వయంభూ నిఖిల్ నటిస్తున్న హిస్టారికల్ అండ్ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త, నభా నటేష్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, భారీ స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సునీల్ ఓ సర్ప్రైజింగ్ క్యారెక్టర్లో కనిపించనున్నారని తెలిసింది. కాగా ఈ మూవీ చిత్రీకరణ 95 శాతం పూర్తయినట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు నిఖిల్.‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది. తొలి భాగాన్ని ఈ ఏడాదిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఇక ఈ చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ వంటి విద్యల్లో నిఖిల్ ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. మిరాయ్ సాహసాలు ‘హను–మాన్’తో భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించారు హీరో తేజ సజ్జా. ఆ మూవీ తర్వాత తేజ సజ్జా చేస్తున్న మరో మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మంచు మనోజ్ విలన్ రోల్ చేస్తున్నారు.ఈ సినిమాలో తేజ సజ్జా సాహసాలు, యాక్షన్ సీక్వెన్స్ సూపర్‌గా ఉంటాయట. కాగా ‘మిరాయ్’ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతున్నట్లుగా తెలిసింది. ఈ సినిమాను ఈ ఆగస్టు 1న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. సో... ఆ రోజున ‘మిరాయ్’ సినిమా తొలి భాగం విడుదల కావొచ్చని ఊహించవచ్చు. ఇలా రెండు భాగాలుగా విడుదల కానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
‘జబర్దస్త్ స్కిట్లు.. బాబు, పవన్ వెకిలి నవ్వులు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వెటకారంగా నిర్వహించారని.. కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా, వెటకారంగా నిర్వహించారు అనేది ప్రజలందరూ చూశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన కడప వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జబర్దస్త్ కార్యక్రమంలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారంటూ దుయ్యబట్టారు.‘‘జీవితంలో ఎప్పుడు నవ్వని చంద్రబాబు వెకిలి నవ్వులు నవ్వారు. కనీస సంస్కారం లేకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వెకిలి నవ్వులు ఎందుకు?. కేవలం జగన్‌ను హేళన చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారా?. ఇవన్నీ మానుకుంటే చంద్రబాబుకు బాగుంటుంది. సిగ్గు లేకుండా, హుందాతనం లేకుండా ప్రవర్తించిన గ్రీష్మ అనే మహిళకు ఏ విధంగా ఎమ్మెల్సీ ఇచ్చావో స్పష్టం చేయాలి. టీడీపీలో ఎంతో మంది సీనియర్లు, నాయకులను కాదని రౌడీలకు పదవులా?’’ అంటూ సతీష్‌రెడ్డి నిలదీశారు.‘‘పులివెందుల నియోజకవర్గం నుంచి పవన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హత్య సినిమాపై ట్రోల్ చేశారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలోని సన్నివేశాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అదుపులోకి తీసుకుంటారా?. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు చేస్తే పోలిసులు స్పందించడం దారుణం. టీడీపీ, జనసేన నాయకులకు సిగ్గు లేదు. వైఎస్సార్సీపీ నాయకులు హుందాతనంతో ప్రవర్తిస్తారు. సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్ మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అపహస్యం చేశారు’’అని సతీష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చంద్రబాబుకి అలా చెప్పిన అధికారి ఎవరు?: భూమన
తిరుపతి, సాక్షి: తమ రాజకీయ అవసరాల కోసం దేవుళ్లను, సనాతన ధర్మాన్ని వాడుకోవడం మాత్రమే చంద్రబాబు, పవన కల్యాణ్‌లకు మాత్రమే తెలుసని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakara Reddy) అంటున్నారు. తాజాగా తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలకు, విమర్శలకు భూమన ఘాటుగా బదులిచ్చారు. గతంలో మేము చేసిన తీర్మానం చంద్రబాబు ఓసారి చూడాలి. హిందువులను తప్ప ఇతరులకు ప్రవేశం లేదన్నది వైఎస్ఆర్ పాలనలో తీసుకున్నదే. కానీ ప్రచారం మాత్రం మీరు చేసుకుంటున్నారు. అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ, తుడా అనుమతులు ఇచ్చింది ఆయన పాలనలోనే అనే విషయం గుర్తించాలి... తిరుమలలో ఆధ్యాత్మికానికి.. పర్యాటకానికి ఎక్కడా పొంతన ఉండదు. 2014-19 టీడీపీ పాలనలో దేవలోక్(Devlok)కు చంద్రబాబు అనుమతులు ఇచ్చారు. అదీ మా పాలనపై రుద్దుతున్నారు. హిందూ ధర్మంకు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసానికి స్వామీజీలు, సన్యాసులు అంతా కదన రంగానికి కదలి వచ్చారు. ఆ కారణంగా భయపడే విరమించుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ టీడీపీ హయాంలోనే ఏర్పాటు చేశారు. కానీ, వైఎస్సార్సీపీ(YSRCP) పాలనలో అత్యద్భుతంగా నిర్వహించాం. వేల కోట్ల రూపాయలు ఈ ట్రస్ట్ ద్వారానే జమ అయ్యాయి. టీటీడీ తరఫున దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాం. జగన్ పాలనలో 3,600 దేవాలయాలు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మాణం చేయించారు. ఇది చూసి ఓర్వలేక.. ట్రస్ట్ నిధులు దుర్వియోగం అయ్యాయని అసత్యప్రచారాలకు దిగారు. విజిలెన్స్ విచారణ జరిపించారు. టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టగానే బీఆర్ నాయుడు ఆ ట్రస్ట్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ, విజిలెన్స్ రిపోర్ట్ సమర్థవంతంగా నిర్వహించిన్నట్లు వచ్చింది. దీంతో.. శ్రీవాణి ట్రస్ట్ గురించి మాట్లాడటం మానేశారు. తిరుమలలో తాగునీటి కొరత రాబోతోంది.. ఆలయం మూసేయాలని ఓ అధికారి తనతో చెప్పారని చంద్రబాబు అనడంపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీతో ఆలయం మూసి వేస్తామని చెప్పిన అధికారి ఎవరు?. అధికారులు మూసేయాలి అనుకున్నారు.. అని ఎలా చెప్తారు?. 90 రోజుల్లో చర్యలు తీసుకోకుంటే .. వారిని అరెస్టు చేయిస్తామని హెచ్చరించడం ఏంటి?. ఏ చట్టంతో మీరు అధికారులు ను అరెస్టు చేస్తారు? భయపెడుతున్నారు?. తప్పు చేసే అధికారులు అధికారులు తప్పు చేస్తే, వారినీ సస్పెండ్ చేయాలి లేదంటే బదిలీ చేయాలి. కేవలం వేంకటేశ్వరస్వామిని వాడుకోవడానికి అధికారులను తెరపైకి తెస్తున్నారు. 👉తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు చనిపోయి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. అయినా కూడా చంద్రబాబు తిరుమలకు ఎలా వస్తారు?. అదేమైనా చిత్తూరు జిల్లా సాంప్రదాయం?.. సద్దులు చెప్పడానికేనా? మీరు పాటించరా చంద్రబాబు?. పైగా తిరుమల వేంకటేశ్వర స్వామిని అరకు కాఫీతో పోలుస్తారా?(అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన)👉తిరుమలలో సీఎంవో కార్యాలయం నుంచే వీఐపీల దర్శన దందా నడుస్తోంది. ఈ కారణంగానే సామాన్యులకు మధ్యాహ్నం దాటితే కానీ దర్శనం కావడం లేదు. 👉సనాతన ధర్మం కాపాడతాం అని చెప్పిన పవన్ కల్యాణ్.. విజయవాడలో గణపతి ఆలయం కూల్చివేస్తే ఎక్కడ ఉన్నారు?. మౌనంగానే ఉండి కాపాడుతున్నారా? ఇప్పటికైనా పవన్ సమాధానం చెప్పాలి. అధికారంలోకి రాగానే.. తిరుమలలో ప్రక్షాళన శ్యామలరావుతో మొదలు పెట్టాం అని చెప్పారు. శ్యామల రావు నెయ్యిలో ఎలాంటి జంతు పదార్థాలు కలవలేదు అని చెప్పారు. గతంలో అడిషనల్ ఈవో గా పనిచేసిన ధర్మా రెడ్డిపై చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఇప్పుడున్న అడిషనల్ ఈవో.. తిరుమలలో ఉన్న నిర్వాసితులను వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ బెదిరిస్తున్నారు అంటూ భూమన మండిపడ్డారు. -
పవన్ కల్యాణ్ సినీ కెరీర్ పై నిర్మాత నాగవంశీ కామెంట్స్ వైరల్
-
చీరుకు యూకే పార్లమెంట్ అవార్డ్ ఇచ్చిందా ?
-
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమం.. అంబటి రాంబాబు సెటైర్లే సెటైర్లు
-
జగన్ పై జోకులు వేసి నవ్వుతారా? ఇదేనా మీ రాజకీయం.. అన్ని రోజులు ఒకేలా ఉండవ్