హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ అంశానికి సంబంధించి ఎమ్మెల్యే అనిరుధ్.. ‘సాక్షి’తో మాట్లాడారు. ‘పవన్ కళ్యాణ్ సభ విషయం లొ మాకు అభ్యంతరం లేదు. సభ ఎవరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కోనసీమ కొబ్బరిచెట్లకు తెలంగాణ నరదృష్టి తగిలిందని గతంలో పవన్ మాట్లాడారు.
తెలంగాణ ప్రజలపై పవన్ నీచంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణను అవమానించిన విషయంలో కచ్చితంగా క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాకే సభ పెట్టాలి. పవన్ సభ పై బీజేపీ, బిఆర్ఎస్ మౌనం వెనక రాజకీయ కారణం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, బిఆర్ఎస్ కలసి పోటీ చేసే అవకాశాలున్నాయి’ అని తెలిపారు.
పవన్.. కొండగట్టు అంజన్నపై ఒట్టేసి చెప్పు!


