ఆ సినీనటుడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి: టీపీసీసీ చీఫ్‌ | Mahesh Kumar Goud Slams Pawan Kalyan | Sakshi
Sakshi News home page

ఆ సినీనటుడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి: టీపీసీసీ చీఫ్‌

Jun 15 2026 3:03 PM | Updated on Jun 15 2026 3:21 PM

 Mahesh Kumar Goud Slams Pawan Kalyan

హైదరాబాద్‌: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. రాష్ట్ర విభజన గురించి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్న తీరుపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ సినిమా డైలాగులు మాట్లాడితే నడవదని విమర్శించారు. తెలంగాణ ఎలా వచ్చిందో ఆ సినీనటుడు తెలుసుకోవాలంటూ మండిపడ్డారు.

‘‘ఎవరో ఉప్పందిస్తే పవన్‌ మాట్లాడడం మానుకోవాలి. ఇదేం సినిమా కాదని పవన్‌ కల్యాణ్‌ గుర్తు పెట్టుకోవాలి. విభజన గురించి మాట్లాడడమంటే వ్యతిరేకించినట్లే’’ అని చెప్పారు. కాగా, పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్న తీరుపై తెలంగాణ నేతల నుంచి కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement