మిస్టర్‌ పవన్‌.. తెలంగాణ మా అయ్య జాగీరే : పొన్నం | Congress Leaders Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

మిస్టర్‌ పవన్‌.. తెలంగాణ మా అయ్య జాగీరే : పొన్నం

Jun 2 2026 6:31 PM | Updated on Jun 2 2026 7:39 PM

Congress Leaders Comments On Pawan Kalyan

సాక్షి,హైదరాబాద్‌: ‘తెలంగాణ మీ అయ్య జాగీరా?’ అంటూ పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు.  మిస్టర్‌ పవన్‌ కళ్యాణ్‌.. ‘తెలంగాణ మా అయ్య జాగీరే’ అంటూ పొన్నం ప్రభాకర్‌ తీవ్రంగా స్పందించారు. ‘తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల జాగీరే. ఆయన మాటల్లో అహంకారం కనిపించింది. పవన్‌ పెయిడ్‌ ఆర్టిస్ట్‌’ అంటూ ధ్వజమెత్తారు. 

‘‘ఆంధ్రాలోనే గెలవలేదు. తెలంగాణకు వచ్చి చేసేదేముంది’’ అని ఆయనే వ్యాఖ్యానించారు. ఏపీలో తన పరిస్థితి ఏంటో తానే చెప్పుకున్నాడు. ఆంధ్రాలోనే తనకు దిక్కులేదు.. తెలంగాణ లో ఏముంటుంది అన్నారు. ఏపీ ప్రజలు ఇక్కడ ఉండొద్దని, ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దని మేము అనట్లేదు. అమెరికా వాల్లే పెట్టుబడి పెట్టగా.. ఏపీ వాళ్లు పెడతామంటే మేము ఎందుకు వద్దంటాం. పవన్ తెలంగాణ నీ అయ్య జాగిరి కాదు పవన్. ఇక్కడకొచ్చి ఏం మాట్లాడుతున్నావ్‌’ అని హెచ్చరించారు.

‘గద్దర్‌కు కార్  కొనిచ్చా అని బహిరంగంగా ప్రకటించి పవన్ తప్పు  చేశాడు. పవన్ గద్దర్‌కు క్షమాపణ చెప్పాలి ...లేదంటే దలిత సంఘాలు ప్రశ్నించాలి. తెలంగాణను పదేపదే పాకిస్థాన్‌తో పోల్చి అవమానిస్తున్నారు. తెలంగాణ అమరవీరుల కు ఎప్పుడైనా పవన్ మద్దతు ఇచ్చారా?, 

తెలంగాణ ఏర్పాటు తో 11 రోజులు అన్నం తినలేదు అన్నది పవన్ కాదు. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్డిస్ట్. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. కొండగట్టుకు పవన్ వస్తే...తెలంగాణ ఛీఫ్ గెస్ట్ గా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 

కొండగట్టుకు పైసలు ఇచ్చామంటుంన్నారు.. మీ అయ్య జాగిరా ఆ పైసలు. బీజేపీ పార్టీ పవన్‌కు సరైన స్కిప్ట్ ఇవ్వలేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే సభ పెట్టి పవన్ గెలికాడు. తెలంగాణ లొ పవన్ తిరుగుతా అంటే మాకు అభ్యంతరం లేదు’ అని ‍స్సష్టం చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement