అధికార మదమా?.. పవన్‌ తీరుపై వైరల్‌ వీడియో | Deputy CM Pawan Kalyan Sudden Inspection In Jindal Plant | Sakshi
Sakshi News home page

అధికార మదమా?.. పవన్‌ తీరుపై వైరల్‌ వీడియో

Jun 1 2026 1:45 PM | Updated on Jun 1 2026 2:07 PM

Deputy CM Pawan Kalyan Sudden Inspection In Jindal Plant

జిందాల్‌ ఫ్యాక్టరీ పరిశీలనలో పవన్‌ కల్యాణ్‌ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు 

కాలు మీద కాలు వేసుకుని ఊగుతూ నిర్లక్ష్యంగా సమీక్ష 

చేతులు కట్టుకుని నిలబడిన ఐఏఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు 

 ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య పరస్పర గౌరవంపై చర్చ 

సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌ అవుతున్న వీడియో, మీమ్స్‌ 

పవన్‌ అధికార మదానికి నిదర్శనమంటూ నెటిజన్ల మండిపాటు  

సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని జిందాల్‌ ఫ్యాక్టరీ పరిశీలన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులతో శనివారం వ్యవహరించిన తీరు సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది.  ఫ్యాక్టరీ పనితీరుపై వాకబు చేస్తున్న సమయంలో పవన్‌కళ్యాణ్‌ కాలు మీద కాలు పెట్టుకుని ఊగుతూ అహంకార ధోరణిలో సమీక్ష నిర్వహిస్తున్న వీడియో, మీమ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

ఆ వీడియోలో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ, పల్నాడు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సంజనా సింహ, జిందాల్‌ ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు చేతులు కట్టుకుని నిలుచున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సినిమాటిక్‌ హీరోయిజం పండించేందుకు ఇలా చేశారా... లేదా పవన్‌ ఆసలు స్వభావం అధికారం వచ్చిన తరువాత ఇలా బయటపడిందా అనే చర్చ మొదలైంది. ఏదైతేనేం ఉన్నతవిద్యావంతులైన ఐఏఎస్‌లు, ఇంజినీర్లు, ఇతర ఉన్నతా«ధికారులు నిలబడి పరిశ్రమ పనితీరు, పర్యావరణానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తుంటే కాలు మీద కాలు వేసుకుని నిర్లక్ష్యంగా, అధికారులను అవమానించే విధంగా ప్రవర్తించిన వ్యవహార శైలిని నెటిజన్లు తప్పుపడుతున్నారు. 

అధికారులు ప్రభుత్వ పాలకులకు జవాబుదారీగా మాత్రమే ఉంటారని.. బానిసలు కాదని, వారి చదువుకైనా గౌరవం ఇవ్వాలని సోషల్‌ మీడియాలో హెచ్చరిస్తున్నారు. పదవీ వచ్చాక అహంకారంతో సభ్యసమాజంలో ఇలాంటి పోకడలు సరికాదని మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర గౌరవంతో వ్యవహరించాల్సి ఉండగా.. తాజా దృశ్యాలు అందుకు భిన్నంగా ఉన్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement