సాక్షి, తాడేపల్లి: నేటి నుండి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టనుంది. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసనలు కొనసాగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటంపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే హామీల అమలుకు నిరసనలు చేపట్టనుంది.
నేడు మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ఇచ్చిన బాండ్లు దగ్ధం చేయనున్నారు. అలాగే, ఈనెల 8 లేదా 9 తేదీల్లో టౌన్ హాల్ సదస్సులు జరగనున్నాయి. ఈనెల 12న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు కొనసాగుతాయి.


