breaking news
Chandrababu Naidu
-
‘రాయలసీమ ద్రోహి చంద్రబాబు’
ప్రొద్దుటూరు(వైఎస్సార్ కడప జిల్లా): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమకు చేసిందేమీ లేదని, ఒకవేళ చేసిందేమైనా ఉంటే బహిరంగంగా చెప్పాలని వైఎస్సార్సీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. 40 ఏళ్లుగా చూస్తే రాయలసీమ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని రాచమల్ల విమర్శించారు. రాయలసీమకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలన్నారు. రాయలసీమ ప్రజలు అంటే చంద్రబాబుకు కోపం అని,. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ అభివర్ణించారు.రాయలసీమ ప్రజలకు చంద్రబాబు హరికథలు మాత్రమే చెబుతారంటూ ఎద్దేవా చేశారు. ‘వ్యవసాయం దండగ అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. రాయలసీమకు చంద్రబాబు చేసేందేమీ లేదు. 40 ఏళ్లుగా ఇదే జరుగుతూ వస్తుంది. ఏవో హరికథలు మాత్రమే రాయలసీమ ప్రజలకు చెబుతారు చంద్రబాబు. వైఎస్సార్సీపీ హయాంలోనే రాయలసీమ అభివృద్ధి చెందింది. రాయలసీమకు మంచి చేసింది వైఎస్సార్, వైఎస్ జగన్‌లు మాత్రమే. వైఎస్సార్సీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 38 లక్షల 74 వేల కుళాయి కనెక్షన్లు ఇచ్చాం. వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన జల్ జీవన్ కార్యక్రమాన్ని కేంద్రం ప్రశంసించింది.రూ. 700 కోట్లతో ఉద్దానానికి వైఎస్ జగన్ సురక్షిత మంచి నీరు ఇచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో తాళ్లరామాపురంలో అనేక అభివృద్ధి పనులు చేశాం’ అని స్పష్టం చేశారు. చంద్రబాబు జీవితం మొత్తం కుట్రలేచంద్రబాబు జీవితం మొత్తం కుట్రలేనని రాచమల్లు మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాయలసీమలో 125 నుంచి 150 మందిని హత్యలు జరిగాయి. కూటమి అధికారంలోకి వచ్చాక కర్నూలు జిల్లా 29 హత్యలు చేశారు. అనంతపురంలో 42 మందిని వెన్నుపోటు పార్టీ నేతలు హత్య చేశారు.శ్రీసత్యసాయి జిల్లాలో 54 మందిని హత్య చేశారు’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకావిష్కరణ -
బాబు ప్రొద్దుటూరు సభకు వెళ్తున్న బస్సులో మద్యం సరఫరా
-
పవన్ కళ్యాణ్ వస్తే న్యాయం జరుగుతుంది అనుకున్నాం కానీ రోడ్డున పడేసారు
-
కూటమిలో చైతన్య చిచ్చు!
సాక్షి, చిత్తూరు: చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిథి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టీటీడీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు మనవరాలైన చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. దీంతో ఇప్పటి వరకు జెండాలు మోసి పలువురి విజయానికి కృషి చేసిన తమ పరిస్థితి ఏమిటని చిత్తూరులోని రెండు సామాజిక వర్గాలు అంతర్మథనంలో పడ్డాయి. చైతన్య స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చిత్తూరు నగర మేయర్ పదవి ఆశిస్తుండడం కూటమి పార్టీ లో చిచ్చు రేపుతోంది. ఎవరికేమి చేశారని? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 28 నెలల కాలంలో జిల్లాలో ఎన్నో నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. ఇందులో కాణిపాకం వినాయక స్వామి ఆల య బోర్డు చైర్మన్, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (చుడా), ఏపీ వన్నెకుల క్షత్రియ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్, ఆర్టీసీ చైర్మన్, కుప్పం రెస్కో, కుప్పం గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్, చిత్తూ రు ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ, పెనుమూరు, కుప్పం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తదితర నామినేటెడ్ పదవులన్నీ టీడీపీ నేతలకే దక్కింది.పేరుకు కూటమి ప్రభుత్వమని చెప్పుకుంటున్నా, పదవుల భర్తీలో తమను ఏ మాత్రం గుర్తించడం లేదని కూటమి లోని బీజేపీ, జనసేన నేతలు పలు సందర్భాల్లో సామాజిక మాధ్యమాల వేదికగా బహిరంగంగా పోస్టులు పెట్టారు. ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో చిత్తూరు మేయర్ స్థానంపై కూటమిలోని మిగిలిన రెండు పార్టీలు పట్టుగా ఉన్నాయి. మేయర్ కుర్చీ జనసేనదే! 2024 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన గురరజాల జగన్మోహన్ నాయుడు అందర నీ ఆశ్చర్యపరిచారు. అసలు గెలుపు వరిస్తుందనే విష యం ఆయన కూడా ఉహించి ఉండరు. అప్పటి వరకు ఎమ్మెల్యే సీటు కోసం చిత్తూరు టీడీపీలోని బలిజ (కాపు) సామాజికవర్గ నేతలు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పటికే జనసేన పార్టీలో చేరిన ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక కూడా జనసేన పార్టీ తరపున చిత్తూరు ఎమ్మెల్యే టికెట్టు ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో చిత్తూరు మేయర్ సీటుపై ఆమె ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల చిత్తూ రు నగరంలో కాజూరు చెరువు అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్తో కలిసి పర్యటించి మేయర్ పోటీలో తాను కూడా ఉన్నట్లు సంకేతాలిచ్చారు. రెండు రోజుల క్రితం పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ను కలిసిన ఈమె.. మేయర్ సీటు కోసం మురళీమోహన్ మద్దతు కోరినట్లు ప్రచారం సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చిత్తూరు సీటు జనసేన పారీ్టకే దక్కాలని ఇప్పటికే స్థానిక జనసేన సైనికులు పట్టుబడుతున్నారు. తమ నాయకుడి మాట కోసం సర్వం ఒడ్డి, టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన తమకు చిత్తూరు మేయర్ కుర్చీ ఇవ్వాల్సిందేనని కోరుతున్నారు. ఆశా..? నిరాశ..? ఆదికేశవులు కుటుంబం నుంచి చిత్తూరు మేయర్ కోసం తన తాత పేరుతో పాటు, జనసేన కార్డు వా డుతుండడం చైతన్య రాజకీయ భవిష్యత్తుకు చావో, రేవో తేల్చనుంది. ఇదే సమయంలో చైతన్య రాకతో చిత్తూరులో ఇప్పటికే మేయర్ కుర్చీ ఆశిస్తు న్న రెండు సామాజిక వర్గాల్లోని ప్రధాన నాయకులు కారాలు– మిరియాలు నూరుతున్నారు. ఆదికేశవులు నాయు డు, ఆయన సతీమణి సత్యప్రభతోనే చిత్తూరులో ఆ కుటుంబం రాజకీయ పయణం ముగిసిందని చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్న వాళ్లంతా కాలక్షేప రాజకీయాలు, ఆర్థిక హోదాకు ఓ పదవి కావాలని చూస్తున్నారని, సేవ చేయడానికి కాదని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అది ముమ్మాటికీ చైతన్యకు అడ్డు కట్ట వేయడానికేనని స్పష్టమవుతోంది. కూటమి కుంపటిలో చైతన్య రాక చిచ్చురేపుతున్నా, ఇన్నాళ్లు పలు నామినేటెడ్ పదవులను వదులుకున్నట్లు చిత్తూరు మేయర్ కుర్చీని సైతం టీడీపీ నేతలకు జనసేన–బీజేపీ నేతలు త్యాగం చేస్తారో..? పోటీలో తమ తరువాతేనని కాలుదువ్వుతారో వేచి చూడాల్సి ఉంది. ఇదీ చదవండి: మంత్రి నాదెండ్లకు ఘోర అవమానం! -
మంత్రి నాదెండ్లకు ఘోర అవమానం!
గుంటూరు: రూరల్ మండలం బుర్రిపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన చంద్రబాబు బహిరంగ సభ ప్రాంగణంలో అనేక అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సభా వేదికపై స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఫొటోను ప్రొటోకాల్ అధికారులు ఏర్పాటు చేయడం మరిచారు. విషయాన్ని తెలుసుకున్న జనసేన నేతలు అధికారుల దష్టికి తీసుకువెళ్లడంతో ఆగమేఘాలపై అరగంట తరువాత మంత్రి మనోహర్‌తో కూడిన ఫొటోను వేదికపై ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై పొందుపరిచారు.హెలీప్యాడ్ ప్రాంగణానికి వెళ్లేందుకు ఆ గ్రామ రైతులు, టీడీపీ ముఖ్య నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. గంటల తరబడి వేచి ఉండి, చివరకు చేసేది లేక అక్కడి నుంచి నిష్క్రమించారు. ఒకానొక దశలో టీడీపీ మహిళా నాయకురాలు ఎన్నిసార్లు హెలీప్యాడ్ ప్రాంగణానికి వెళ్లాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కష్టపడి పనిచేసే వారికి ఇటువంటి అవమానాలు తప్పవని సీనియర్ నాయకుల ఎదుట ఒకింత అసహనం వ్యక్తం చేసింది. హెలీప్యాడ్ ప్రాంగణానికి 30 మందికి మాత్రమే అనుమతి ఉంటే, దాదాపు 80 మంది వివిధ మార్గాల గుండా రావడంతో ఎన్ఎస్జీ కమెండోలు పలువురిని పక్కకు తోశారు. వీరిలో జనసేన నాయకులు ఉన్నారు. ఆలస్యంగా సీఎం ప్రసంగం మధ్యాహ్నం 12.15 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఇళ్ల నిర్మాణానికి బుర్రిపాలెంలో శంకుస్థాపన చేసి సభా ప్రాంగణానికి వెనుదిరిగి వచ్చారు. ఒంటి గంట దాటినా ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభం కాకపోవడంతో కొంతమంది బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. గ్యాలరీల దగ్గర ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనేక అపశ్రుతుల మధ్య చంద్రబాబు బహిరంగ సభ కొనసాగింది. సభ ముగియడంతో ప్రజలు ‘బతికిపోయాంరా బాబు’ అంటూ బయటకు వచ్చారు. తీవ్ర ఉక్కపోత, ఎండ తట్టుకోలేక సభకు వచ్చిన ప్రజలు ఇబ్బందిపడ్డారు. రైతులను అడ్డుకుంటున్న పోలీసులు ఇదీ చదవండి: నాటి చంద్రబాబు పాత్రలో నేడు లోకేష్.. పీఆర్ పీక్స్! -
నాటి చంద్రబాబు పాత్రలో నేడు లోకేష్.. పీఆర్ పీక్స్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు తన ప్రాధాన్యం కాదని ఆయన చెప్పారు. ప్రజల హృదయాలను గెలుచుకోవాలనే పని చేస్తున్నానని ఆయన అన్నారని ఎల్లో మీడియా అత్యంత ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. ఇండియా టుడే మీడియా కేరళంలో నిర్వహించిన ఒక సదస్సులో సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు.నిజంగా ఆయన అదే ప్రకారం పనిచేస్తే మంచిదే. కాని ప్రస్తుతం షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న భావన రాజకీయ వర్గాలలోనే కాకుండా సాధారణ ప్రజలలో కూడా ఏర్పడింది. ముఖ్యమంత్రి పదవిలో లేరన్న మాట మినహాయించి, ప్రభుత్వంలో లోకేష్‌కు తెలియకుండా ఏమి జరగవన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఇది ఏమైనా మంచి పనుల కోసం అయితే ఫర్వాలేదు. పెద్దగా ఎవరూ అభ్యంతరం చెప్పరు. కాని రెడ్‌బుక్ పేరుతో ఏపీలో సాగుతున్న అరాచకాలన్నిటికి ఆయనే బాధ్యుడున్న విమర్శ వైఎస్సార్సీపీతో సహా వివిధ సంఘాలు చేస్తుంటాయి. ఇందులో చాలావరకు నిజం ఉందనిపించేలా ఆయన పార్టీ సమావేశాలలో వైఎస్సార్సీపీ వారిపై తప్పుడు కేసులు పెట్టించడం గురించి రెడ్‌బుక్ పేజీలు అంటూ ప్రసంగిస్తుంటారు.గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అని రెచ్చగొట్టేవారు. అధికారంలోకి వచ్చాక టీడీపీవారిపై ఉన్న కేసులన్నీ ఎత్తివేయించే పనిలో ఉన్నారు. ఎక్కడైనా అలా ఎత్తివేయకపోతే డీజీపీని పంపిస్తానని ముఖ్యమంత్రి మాదిరే ప్రకటనలు చేశారు. నిజానికి ఇదంతా సీఎం లేదా, హోం మంత్రి పరిధిలో ఉండే విషయం. అయినా పెత్తనం అంతా లోకేష్‌దే అన్నమాట.ఇక పరిశ్రమల మంత్రి టీజీ భరత్ ఎక్కడ ఉంటారో తెలియదు. కాని మొత్తం ఆ పరిశ్రమకు సంబంధించిన అంశాలన్నిటిపైన నిర్ణయాలు ఈయనే ప్రకటిస్తుంటారు. విదేశాలకు టూర్లు వెళుతుంటారు. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లినా పారిశ్రామికవేత్తలతో తాను చర్చలు జరుపుతానని ఆయనే ఈ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. 99 పైసలకే పరిశ్రమలకు భూములు ఇస్తా.. తన ఇష్టం అన్నట్లుగా కొంతకాలం క్రితం ఆయన మాట్లాడారు. ఆర్థిక శాఖకు సంబంధించి కూడా అదే పరిస్థితి. లోకేష్ పేషీకి తెలియకుండా బిల్లులు పాస్ అవడం అరుదని చెబుతున్నారు.గత టరమ్‌లో టీడీపీ ప్రభుత్వంలో చెట్టు-నీరు స్కీమ్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ఆనాటి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వేల కోట్ల అవినీతి టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పేవారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేసింది. దాని ప్రకారం కొందరి బిల్లులు నిలిచిపోయాయి. ఈసారి టీడీపీ ప్రభుత్వం రావడంతో ఆ బిల్లులన్నీ క్లియర్ చేసుకుంటున్నారట. లోకేష్ ఏ బిల్లుల గురించి చెప్పారో కాని, ఒక పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. తాము ఇప్పటికే చాలావరకు బిల్లులు క్లియర్ చేశామని, మరో 200 కోట్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ సందర్భంలో ఆర్దిక మంత్రి ప్రస్తావనను తెచ్చినప్పటికి అది నామమాత్రమే అన్నది తెలుస్తూనే ఉంది.ప్రభుత్వ విషయాలలోనే కాదు.. పార్టీ వర్కింగ్ అధ్యక్షుడి హోదాలో కూడా ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేనకు 15 శాతం సీట్లే ఇస్తామని స్పష్టం చేసింది కూడా ఆయనే. ఒకవైపు పార్టీపరంగా సమావేశాలు నిర్వహిస్తూ, మరో వైపు ప్రభుత్వంలో చక్రం తిప్పుతూ, ఇంకో వైపు తన ఇమేజీని పెంచుకోవడం కోసం ఎల్లో మీడియాను, ఐటీడీపీ తదితర సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నారు.సాధారణంగా దేశస్థాయిలో జరిగే సదస్సులకు చంద్రబాబే వెళుతుండేవారు. కాని ఈ మధ్యకాలంలో ఢిల్లీ, లేదా ముంబై తదితర నగరాలలో జాతీయ మీడియా సంస్థలు నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలకు లోకేషే హాజరవుతున్నారు. ఆయా సభలలో లోకేష్, చంద్రబాబులు పరస్పరం పొగుడుకోవడం, తండ్రికి బహిరంగ కార్యక్రమాలలో పాదాభివందనం చేస్తున్న ఘట్టాలు అందరు గమనిస్తున్నవే. ఇదంతా పీఆర్లో భాగమేనని వేరే చెప్పనవసరం లేదు.ఇదీ చదవండి: యూసీసీపై అమిత్ షా ప్రకటన.. టీడీపీకి సంకటమేనా?కాగా, డీఎస్సీకి సంబంధించి అడిగిన ప్రశ్నలకు యధా ప్రకారం తండ్రి మాదిరి అసత్యాలు చెప్పడానికి ఆయన పెద్దగా ఫీల్ అవలేదు. ఎన్నికల కమిషన్‌పై వచ్చిన విమర్శలకు కూడా ఆయన ఇచ్చిన జవాబు తన తండ్రికే వర్తిస్తుందన్న సంగతి ఆయన గమనించనట్లే వ్యవహరించారు. గతంలో ఓటమి ఎదురైనప్పుడు ఈసీపై చంద్రబాబు ఎన్ని విమర్శలు చేసింది తెలిసిందే. ఈ సంగతి పక్కన పెడితే తనకు సీఎం పదవి ఇప్పుడు ప్రాధాన్యం కాదని ఆయన చెప్పడాన్ని ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే సీఎం పదవిలో లేరన్నమాటే కాని, మొత్తం అధికారం అంతా ఆయన చేతిలోనే ఉందని చాలామంది నమ్ముతున్నారు. అందుకే ఆయన ఆఫీస్ వద్దే జనం ఎక్కువగా కనిపిస్తారట.2014 టరమ్‌లో లోకేష్ ఎన్నికలలో పోటీచేయలేదు. కాని పార్టీ అధికారంలోకి రావడంతో కొంతకాలానికి చంద్రబాబుపై కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చి లోకేష్‌ను ఎమ్మెల్సీ చేసి, ఆ తర్వాత మంత్రిగా చేయించారని అంటారు. అప్పట్లో షాడో ముఖ్యమంత్రి అన్న విమర్శ రాలేదు. ఆ తర్వాత విపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టి జనంలో తిరగడానికి కృషి చేశారు. వాటిలో యువగళం ఒకటి.2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం చంద్రబాబు ప్రధానంగా పర్యటనలు, ఉపన్యాసాలకే పరిమితం అవుతుంటే, లోకేష్ కథ నడుపుతున్నారని టీడీపీ వర్గాలు చెప్పుకుంటాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా చంద్రబాబుతో దాదాపు సమానంగా సానుకూల కథనాలు అనండి.. భజన స్టోరీలు అనండి.. నిత్యం ఇస్తుంటాయి. లోకేష్‌ను సీఎం చేయాలన్న వాదన కుటుంబంలోను, ఆయన మద్దతుదారులలో బలంగా ఉన్నప్పటికి, వివిధ కారణాల రీత్యా అది జరగడం లేదన్న అభిప్రాయం ఉంది.ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు కూడా పూర్తి స్థాయిలో ఇందుకు సానుకూలత వ్యక్తం చేయవలసి ఉందని అంటారు. అందుకే పవన్ కళ్యాణ్‌ను అన్న అని లోకేష్ సంభోధించడమే కాక, సభలలో వారిద్దరి మధ్య ఎంతో సన్నిహిత సంబంధం ఉందన్న పిక్చర్ ఇవ్వడానికి యత్నిస్తున్నారు. పవన్ ఈయనను ఓరే అన్నంత చనువు ఉన్నంతగా ఆ మధ్య చెప్పారు. కాని పవన్ అసలు ఎవరిని ఓరేయ్, అరేయ్ అనరని ఆయన మద్దతుదారులు చెబుతూ లోకేష్ వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది వేరే కథ. బహుశా తను సీఎం పదవి తీసుకున్నా పవన్ సహకారం అవసరమన్న భావనతో ఆయనతో సలహా, సంప్రదింపులు జరుగుతున్నాయన్న అభిప్రాయం కల్పించడం లోకేష్ లక్ష్యం కావచ్చు. కాని, పవన్‌కు తెలియకుండానే ప్రభుత్వంలోని అనేక విషయాలు జరుగుతుంటాయి. డీఎస్సీకి అక్రమాల ఆరోపణలపై పవన్ ఇంతవరకు ప్రత్యక్షంగా లోకేష్‌కు మద్దతుగా ఖండన ఇవ్వకపోవడం కూడా గమనించదగిందే.ఇక్కడ మరో విషయం గుర్తు చేయాలి. 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పదవిని రెండేళ్లపాటు పవన్ కళ్యాణ్‌కు కూడా ఇవ్వాలని జనసేనలో కొందరు ప్రచారం చేశారు. కాని మొహమాటం లేకుండా అది కుదిరే పని కాదని లోకేష్ మీడియా ముందు ఆ రోజుల్లోనే కుండబద్దలు కొట్టారు. బహుశా ఆ అవకాశం పవన్‌కు వస్తే తన భవిష్యత్తుకు అడ్డంకి అవుతుందని అనుకొని ఉండవచ్చు. అంతేకాక పవన్‌కు డిప్యూటి సీఎం పదవిపై కూడా టీడీపీ పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుందని చెప్పి షాక్ ఇచ్చారు. అయినా పవన్ దానిపై పెద్దగా ఫీల్ కాకుండా సర్దుకుపోయారు. ఇప్పుడు పవన్ ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో బయటపడడం లేదు. లోకేష్ తనకు సీఎం పదవి ప్రాధాన్యం కాదని అన్నారే తప్ప, ఈ టరమ్ అంతా చంద్రబాబే సీఎంగా ఉంటారని, వచ్చే ఎన్నికలలో సీఎం అభ్యర్ధి కూడా ఆయనే అని లోకేష్ స్పష్టంగా చెప్పకపోవడం గమనించదగ్గ అంశమే.2029 ఎన్నికలలో లోకేష్‌నే సీఎం అభ్యర్ధిగా ఫోకస్ చేస్తారా? లేదా? అన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొంతకాలం క్రితం లోకేష్ సీఎం కాబోతున్నారంటూ టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. కాని అది జరగలేదు. ఉమ్మడి ఏపీ, విభజిత ఏపీలలో ఒక వైఎస్ జగన్ తప్ప మరే సీఎం కుమారుడు, లేదా కుమార్తె ముఖ్యమంత్రులు కాలేకపోయారు. ఇప్పుడు ఆ అవకాశం కోసం లోకేష్ ఎదురుచూస్తుండవచ్చు.1986 ప్రాంతంలో ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణను వారసుడుగా ప్రకటించారు. ఆ వెంటనే చంద్రబాబు జోక్యం చేసుకుని వారసత్వ, కుటుంబ రాజకీయాల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పి ఆ ప్రకటనను ఉపసంహరింప చేశారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. కాని ఆ తర్వాత అతనిలో ఉన్న పొటెన్షియాల్టిని గమనించి, లోకేష్ భవిష్యత్తుకు ఆటంకం అవుతాడని సందేహించి ఆయనను పక్కన పెట్టేశారని చెబుతారు. ఒకప్పుడు ఎన్టీఆర్ వద్ద కర్షక పరిషత్ చైర్మన్‌గా ఉంటూ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు చక్రం తిప్పారు. ఇప్పుడు లోకేష్ ఆ పాత్ర పోషిస్తున్నారు.లోకేష్ తన కుమారుడు కనుక వారసత్వ, కుటుంబ రాజకీయాల సమస్య, విమర్శలు రావని చంద్రబాబు భావిస్తుండవచ్చు. అందుకే పార్టీలోను, ప్రజలలోను లోకేష్ పట్ల సానుకూలత పెంచేందుకు వివిధ ప్లాన్లు అమలు చేసున్నారనుకోవచ్చు. కాలచక్రం అలా ఉంటుందన్నమాట. కాకపోతే లోకేష్ పాజిటివ్ కోణం కన్నా, నెగిటివ్ ధోరణిలోనే ఎక్కువగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. లోకేష్ కోరిక ఈ టరమ్‌లో తీరుతుందా? లేదా? అన్నది చూడాల్సిందే. మనసులో ఎంత బలమైన కోర్కె ఉన్నా కొంత కాలం అణచుకోక తప్పదు కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బొచ్చు కూడా పీకలేరు... బాబు, కొలికపూడిపై టీడీపీ నేత సంచలన కామెంట్స్
-
బ్రతికున్నపుడు మజ్జిగ పోయలేదు కానీ.. చనిపోయాక సమాధి దగ్గర మజ్జిగ ఇచ్చే గేదెను కట్టేస్తా అన్నట్లు..
-
ఫీల్డ్ అసిస్టెంట్ల ‘సామూహిక’ ధర్నాతో విజయవాడలో హైటెన్షన్
సాక్షి, విజయవాడ: సామూహిక రాయబారం పేరుతో విజయవాడ పంచాయతీ కమిషనర్ కార్యాలయం వద్ద ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నాకు దిగారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద సంఖ్యలో విజయవాడకు తరలివస్తున్నారు. దీంతో పంచాయతీ కమిషనర్ కార్యాలయం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సామూహికంగా తరలివచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లు కార్యాలయం వద్ద ధర్నా చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, తమ వేతనాలను పెంచాలని వారు కోరుతున్నారు. అలాగే ఉద్యోగ భద్రతకు సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ప్రాంతాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు విజయవాడకు చేరుకుంటుండటంతో కార్యాలయం పరిసరాల్లో సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు ఒకే చోటకు చేరడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పంచాయతీ కమిషనర్ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.ధర్నాకు అనుమతులు, ఆందోళనకారుల రాకపోకలు, కార్యాలయం వద్ద పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఫీల్డ్ అసిస్టెంట్లు చెబుతున్నారు.పెండింగ్ బకాయిల విడుదల, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత.. మూడు ప్రధాన డిమాండ్లతో ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకోవడంతో పంచాయతీ కమిషనర్ కార్యాలయం వద్ద పరిస్థితి ఉత్కంఠగా మారింది. పోలీసుల భారీ మోహరింపుతో అక్కడ హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.ఇదీ చదవండి: బుర్రిపాలెంలో అసత్య హరి‘చంద్రుడు’ -
'బుర్రిపాలెం'లో బాబు బుర్రకథలు!
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లె వేశారు. సూపర్ సిక్స్‌లు, ఇతర హామీలు అమలు చేయకుండా తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పచ్చి అబద్ధాలను నిత్యం ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా బుర్రిపాలెం వేదికగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణ పథకాన్ని భ్రషు్టపట్టించారంటూ విమర్శలు చేశారు. ఈ క్రమంలో వాస్తవాలను ఓసారి పరిశీలిస్తే చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అవాస్తవాలేనని స్పష్టం అవుతుంది. బాబు: వైఎస్సార్సీపీ హయాంలో 2019–24 మధ్య గృహ నిర్మాణ పథకాన్ని భ్రష్టుపట్టించారు. వాస్తవం: రాష్ట్రంలో నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడం కోసం వైఎస్సార్సీపీ హయాంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఏకంగా 31 లక్షల మందికిపైగా మహిళల పేరిట ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. నాడు ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాల మార్కెట్ విలువే రూ.76 వేల కోట్లకు పైగా ఉంటుంది. ఇలా రాష్ట్రంలోనే కాకుండా దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా గృహ నిర్మాణ పథకంలో నూతన శకాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించారు. బాబు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక 5.5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చాం. వాస్తవం: గత ప్రభుత్వంలో పేదలకు 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంతో పాటు 21 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేశారు. 2024 ఎన్నికల నాటికే 9 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చేశారు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. కాగా, ఆ ఇళ్లనే తాను నిర్మించి పేదలకు ఇచ్చినట్టుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. బాబు: 2029 నాటికి పేదలందరికీ ఇళ్లు సమకూరుస్తాం వాస్తవం: పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాలు ఇచ్చి, ఇళ్లు కూడా నిర్మిస్తామని చంద్రబాబు 2024 ఎన్నికల్లో మేనిఫెస్టో ద్వారా హామీ ఇచ్చారు. గద్దెనెక్కి రెండున్నరేళ్లు కావస్తున్నా నేటికీ పేదలకు గజం స్థలం కూడా మంజూరు చేయలేదు. గజం స్థలం సేకరించి పేదలకు పంపిణీ చేయకుండానే ఏకంగా రూ.52 వేల కోట్ల విలువైన స్థలాలను పేదలకు ఇచ్చేశామంటూ చంద్రబాబు నమ్మబలుకుతున్నారు. విశాఖ, విజయవాడ, మంగళగిరి మరికొన్ని ప్రాంతాలలో కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్న వారి స్థలాలను క్రమబద్ధీకరించి దాన్నే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. -
అందరికీ ఇళ్లు ఇస్తాం
తెనాలి/సాక్షి, అమరావతి: ప్రధాని మోదీ నాయకత్వంలో తాను, పవన్‌కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) గ్రామీణ్ 2.0 పథకం కింద రాష్ట్రంలో చేపట్టే ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో పైలట్ ప్రాజెక్టుగా సీఎం ప్రారంభించారు. 175 ఇళ్ల నిర్మాణానికి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో కలిసి చంద్రబాబు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పేదలకు పట్టాభిషేకం పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. 60–70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పేదల సమస్యలను పరిష్కరిస్తున్నామని విశాఖ, విజయవాడ, మంగళగిరిల్లో పైసా ఖర్చు లేకుండా 60 వేలమంది పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చామని చెప్పారు. వీటి విలువ రూ.52 వేల కోట్లుగా ఉంటుందని, ప్రతి పేదవాడికి రూ.కోటి విలువైన ఇంటి జాగా ఇచ్చి కోటీశ్వరులను చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదని చెప్పారు. నిబంధనల ప్రకారం రాష్ట్రానికి 75 వేల ఇళ్లు మంజూరైతే అడిగిన వెంటనే కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మూడు లక్షల ఇళ్లను ఇచ్చారన్నారు. రాబోయే ఆరు నెలల్లో మరో మూడు లక్షల ఇళ్లను, వచ్చే సంవత్సరం మరో మూడు లక్షల ఇళ్లను ఇస్తారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 2029 లోపు నూటికి నూరుశాతం అందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని చంద్రబాబు తెలిపారు. మార్చి నాటికి భూముల సర్వే పూర్తి 2019–24 మధ్య రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ విధ్వంసం జరిగిందని, పేదలకిచ్చిన ఆరు లక్షల ఇళ్లను రద్దు చేశారని చంద్రబాబు ఆరోపించారు. భూసేకరణలో పెద్దఎత్తున అవినీతి చేశారన్నారు. పేదలకిచి్చన ఇళ్లు నివాసయోగ్యం కాదన్నారు. 2014–19లో తాము 17 లక్షల ఇళ్లు శాంక్షన్ చేసి 8 లక్షలు పూర్తి చేశామన్నారు. భూముల రీ సర్వే మార్చి నాటికి పూర్తిచేసి భూ వివాదాలు లేని రాష్ట్రంగా చేస్తామని చంద్రబాబు చెప్పారు. సూపర్ సిక్స్ ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని చంద్రబాబు చెప్పారు. సమయం, వ్యయం తగ్గుతుంది: చౌహాన్ 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ఇళ్ల నిర్మాణాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణ సమయం, వ్యయం తగ్గుతుందని తక్కువ మానవ వనరులతో పూర్తి చేయవచ్చన్నారు. ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు కొలుసు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి సాగును మోదీ ప్రోత్సహిస్తున్నారు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నారని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధాని లక్ష్యాలకు అనుగుణంగా ఏపీలో ప్రకృతి సాగు జరుగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలో జానకిరామ్ అనే రైతుకు చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్రమంత్రి చౌహాన్ సందర్శించారు. ఎలాంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా పంటలు సాగు చేస్తున్న రైతును అభినందించారు. కాగా.. అంతకుముందు సీఎం చంద్రబాబును ఉండవలిల్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కేంద్రమంత్రి కలిశారు. ఈ సందర్భంగా రెండు వేర్వేరు లేఖలను చంద్రబాబు అందించారు. రైతులను ఆదుకునేందుకు, పేదల ఇళ్ల నిర్మాణానికి అదనపు నిధులు ఇవ్వాలని ఆ లేఖల్లో సీఎం కోరారు. ఖరీఫ్–2026కి సంబంధించి పీఎం ఆశా పథకం కింద 9 రకాల పంటలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడానికి ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. -
‘గూడు’ పుఠాణి!
సాక్షి, అమరావతి: ‘నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు.. లేదా ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 సాయం’ వంటి సూపర్ సిక్స్‌తోపాటు ఇతర హామీలకు దిక్కు మొక్కు లేకున్నా.. హామీలన్ని అమలు చేసేశామని సీఎం చంద్రబాబు ఊదరగొడుతున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలో నిరుపేదలకు పక్కా గూడు కల్పనలోనూ దొంగ లెక్కలతో వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం బురిడీ కొట్టించేస్తోంది. పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం మంజూరు, పక్కా ఇళ్ల నిర్మాణం అంటూ 2024 ఎన్నికల మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు హామీలు ఇచ్చారు. గద్దెనెక్కి రెండేళ్లయినా పేదలకు గజం స్థలం మంజూరు చేసిన పాపాన పోలేదు. పక్కా గృహాల మంజూరు తూతూ మంత్రంగా ఉంది. తానిచ్చిన హామీలను అమలు చేయకపోగా, గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం విషయంలోనూ పేదలను నిలువునా దగా చేసేస్తున్నారు. ఏకంగా 1.70 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండానే చేసేసినట్టు దొంగ లెక్కలు చూపిస్తూ ఏకంగా ప్రభుత్వమే 420 వేషాలు వేస్తోంది. ఈ అంశం గత కొద్ది నెలలుగా గృహ నిర్మాణ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాకి లెక్కలతో షో చంద్రబాబు ప్రభుత్వం గతేడాది నవంబర్, ఈ ఏడాది మార్చిలో రెండు పర్యాయాలు సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం పేరిట హడావుడి చేసింది. రెండు విడతల్లో 5.50 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందించినట్టు డబ్బా కొట్టుకుంది. ఈ క్రమంలో వాస్తవాలు పరిశీలిస్తే ఆ ఇళ్లన్నీ కూడా గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంజూరు చేసి, నిర్మించినవే. సీఎం చంద్రబాబు పేదలకు పంపిణీ చేసిన ఇంటి ధ్రువీకరణ పత్రాల్లోనూ 2019–24 మధ్య ఆ ఇళ్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో బాబు సర్కార్ నవ్వులపాలైంది. ఇదిలా ఉండగా, గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్లను తన ఖాతాలో వేసుకునే క్రమంలో వాస్తవ లెక్కలను సైతం చంద్రబాబు సర్కారు కప్పెట్టేసినట్టు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు రెండేళ్లలో నిరి్మంచినట్టు ప్రచారం చేసుకున్న 5.50 లక్షల ఇళ్లు గత ప్రభుత్వంలో వైఎస్సార్, జగనన్న కాలనీల్లో మంజూరు చేసినవే. వీటిలో 1.70 లక్షలకు పైగా ఇంకా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అరకొర నిర్మాణంలో ఉన్న ఇళ్లను సైతం పూర్తి చేసినట్టు కాకి లెక్కలు చూపి సామూహిక గృహ ప్రవేశాల పేరిట చంద్రబాబు రాష్ట్రంలో పెద్ద షో చేశారు. బాబు చేసింది శూన్యం రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్లు కల్పనే లక్ష్యంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను ఉచితంగా మహిళల పేరిట పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం ద్వారా ఏకంగా 17 వేలకుపైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జగనన్న కాలనీల్లో 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. వీటికి టిడ్కో ఇళ్లు 2.62 లక్షలు అదనం. కాగా, ఎన్నికలు ముగిసే నాటికి 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వం లబి్ధదారులకు అందజేసింది. ఇక సాధారణ ఇళ్లలో 8 లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఇళ్ల నిర్మాణాన్ని చంద్రబాబు గాలి కొదిలేశారు. కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం నిర్మాణం పూర్తవ్వని ఇళ్లను సైతం పూర్తి చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. -
తాగునీటిపై నీటి మూటలు
సాక్షి, అమరావతి: ఒకవైపు వ్యవసాయానికి సాగునీటిపై రైతులను మభ్యపుచ్చి నిండా ముంచేసిన చంద్రబాబు సర్కారు స్థానిక ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాలకు తాగునీటిపైనా మరో డ్రామాకు సిద్ధమైంది! రెండున్నరేళ్లుగా రక్షిత మంచినీటి సరఫరా పథకాల ఊసెత్తకుండా హడావుడిగా సోమవారం వైఎస్సార్ కడప జిల్లాలో ‘జేజేఎం–అమరజీవి జలధార’ పనుల శంకుస్థాపనకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2019–24 మధ్య మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో రాష్ట్రంలో 39,34,701 ఇళ్లకు కొత్తగా తాగునీటి కొళాయిలు ఏర్పాటుచేయగా చంద్రబాబు సర్కారు కేవలం 2,69,735 ఇళ్లకు మాత్రమే అందించింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్దానం లాంటి తీవ్ర సమస్యాత్మక ప్రాంతంలో రూ.700 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తిచేస్తే చంద్రబాబు సర్కారు అలాంటిది ఒక్కటంటే ఒక్క పథకాన్ని ఇప్పటివరకు పూర్తిచేయలేదు. పులివెందుల పరిధిలోని ఏడు మండలాల్లో గ్రామాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు రూ. 480 కోట్లతో సమగ్ర మంచినీటి పథకం నిర్మాణ పనులు వైఎస్సార్సీపీ హయాంలోనే 80 శాతానికి పైగా పూర్తవగా మిగిలిన పనులను రెండేళ్లుగా పూర్తి చేయకుండా చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ప్రొద్దుటూరు వేదికగా ‘జేజేఎం–అమరజీవి జలధార’ పనుల శంకుస్థాపన పేరుతో మరో నాటకానికి తెర తీసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన పనులను రద్దు చేసిన చంద్రబాబు సర్కారు వాటిలో కొన్నింటిని ఇప్పుడు తిరిగి తెరపైకి తేవడం మినహా కొత్తగా చేసిందేమీ లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక కేంద్రం జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని 2028 వరకు దేశమంతటా పొడిగించగా దానినీ సీఎం చంద్రబాబు తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు.గత ప్రభుత్వంలోనే దాదాపుగా పూర్తి.. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా జల జీవన్ మిషన్‌లో భాగంగా రూ. 26,823 కోట్లతో రక్షిత సమగ్ర తాగునీటి పథకాల నిర్మాణాలతో పాటు మరో 77,917 గ్రామ స్థాయి రక్షిత మంచినీటి పథకాలు, తాగునీటి కొళాయిల ఏర్పాటు పనులను మంజూరు చేసింది. ఉద్దానం లాంటి పథకాలు పూర్తికాగా పులివెందుల, డోన్ వంటి సమగ్ర రక్షిత పథక నిర్మాణ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మూడో వంతుకు పైగా ఇళ్లకు గత ప్రభుత్వంలోనే తాగునీటి కొళాయిల ఏర్పాటు పూర్తవగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. ‘ఇంటింటికీ రక్షిత తాగునీరు– ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్’ ఏర్పాటు చేస్తామంటూ సూపర్ సిక్స్ 2.0 హామీల్లో చంద్రబాబు పేర్కొన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక 25 శాతానికి లోపే పనులు జరిగాయనే సాకుతో రూ.10.680.50 కోట్లతో గత ప్రభుత్వం మంజూరు చేసిన 44,194 చిన్న పనులతో పాటు రూ. 750 కోట్ల సమగ్ర రక్షిత మంచినీటి పథకం పనులను సైతం రద్దు చేశారు. రెండేళ్లకుపైగా కాలయాపన చేసి గతంలో రద్దు చేసిన పనుల స్థానంలో జల జీవన్ మిషన్ కార్యక్రమాలను మంజూరు చేసింది. వీటిని ఇప్పడే కొత్తగా మంజూరు చేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నట్లు హడావుడి చేస్తోంది.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన తాగునీటి పథకాల పనులను రద్దు చేస్తూ చంద్రబాబు సర్కారు జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేసి.. కేంద్రం చుట్టూ ప్రదక్షిణ2024 డిసెంబరు 21న రద్దు చేసిన 44 వేల పనుల నిధులతో కేవలం బడా కాంట్రాక్టర్లు మాత్రమే చేపట్టే ఏడు సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్మాణ పనులకు చంద్రబాబు సర్కారు పచ్చ జెండా ఊపింది. మొత్తం రూ. 9,355 కోట్లతో ఏడు సమగ్ర రక్షిత మంచినీటి పథకాలకు ఈ ఏడాది మార్చి 26న ఆదేశాలిచ్చింది. తర్వాత వీటినే పది మంచి నీటి పథకాలుగా మార్పు చేస్తూ 2026 జులై 22న మరో జీవో జారీ చేసింది. వీటి టెండర్ల ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ఒకసారి రద్దు చేసి మళ్లీ మంజూరు చేసిన పనులకు 50 శాతం వాటా నిధులు పొందాలంటే వాటికి కేంద్రం ఆమోదం తీసుకోవాలి. ఈ అనుమతులు ఇప్పటికి కేంద్రం మంజూరు చేయలేదని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఫలితం రాలేదు. కేంద్రం నుంచి అనుమతి రాకుండానే శంకుస్థాపన కార్యక్రమాలకు ప్రభుత్వం సిద్ధమైందని అధికారులు పేర్కొంటున్నారు. కార్పొరేషన్ పేరుతో రుణాలు..జల్ జీవన్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ పేరుతో చంద్రబాబు సర్కారు రూ.13,650 కోట్ల రుణ సమీకరణకు అనుమతి ఇచ్చింది . ఇప్పటికి రూ. 1,600 కోట్లు అప్పులు చేసినా గ్రామాల్లో మంచినీటి నిర్మాణ పనుల పురోగతి లేదు. కోవిడ్‌లోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పథకాల కోసం రుణాలు తీసుకోకుండా దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుల బాధిత ప్రాంతం ఉద్దానంలో రూ. 700 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకం మొదలు పెట్టి పూర్తి చేయడం గమనార్హం. మరో రూ. 750 కోట్లతో పులివెందుల, డోన్ నియోజకవర్గాల్లో పనులను దాదాపు పూర్తి చేసింది. పైగా 2014–19 మధ్య టీడీపీ హయాంలో మంచినీటి పథకాల పేరిట తెచ్చిన అప్పుల్లో రూ. 300 కోట్ల మేర వైఎస్ జగన్ ప్రభుత్వం వడ్డీతో సహా తీర్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కారు మంచినీటి పథకాల పేరిట ఇటీవల తెచ్చిన అప్పులో దాదాపు రూ. 200 కోట్లు ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన కొందరు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల రూపంలో చెల్లించారనే విమర్శలున్నాయి. -
అమ్మకానికి ఆర్టీసీ!
సాక్షి, అమరావతి: దేన్నైనా ప్రైవేటుపరం చేయడమంటే ఆయనకు ఇష్టం. ప్రైవేటు కంపెనీలంటే మహా ఇష్టం. ఎందుకంటే అందులోనే అస్మదీయులుంటారు.. అడిగిందల్లా అప్పనంగా ఇచ్చేయవచ్చు. అడిగినంత దోచిపెట్టవచ్చు. ప్రభుత్వరంగంలో వ్యవస్థలను నడపాలన్నా, నియామకాలు జరపాలన్నా ఆయనకు మహా చెడ్డ చిరాకు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ‘మనసులో మాట’ పుస్తకంలో కూడా రాసుకున్నారు. ఆయనెవరో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా..ఆయనే సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలను, పోర్టులను ప్రైవేటీకరిస్తూ ప్రజాధనాన్ని దారుణంగా లూటీ చేస్తున్న చంద్రబాబు ఇపుడు ఆర్టీసీ ప్రైవేటీకరణకు నడుం బిగించారు. ఆ మధ్య విజయవాడలో ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని లూలు మాల్‌కు కేటాయించిన చంద్రబాబు కార్మికుల ఉద్యమంతో తోకముడిచిన సంగతి తెల్సిందే. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన తన ప్రయత్నాలను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. విద్యుత్ బస్సులను, పలు డిపోలను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతగా నాలుగు డిపోలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించేశారు. వాటిపై కార్మికులు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇపుడు డ్రైవర్, కండక్టర్ పోస్టులను సైతం ప్రైవేట్ ఏజెన్సీలకు కాంట్రాక్ట్ పద్ధతిలో అప్పగించడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. రెగ్యులర్ నియామకాలకు తిలోదకాలిచ్చేసి ఔట్సోర్సింగ్, ఆన్‌కాల్ విధానంలో సిబ్బందిని తీసుకుని ఆర్టీసీని నడిపించాలని చూస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంటే శాశ్వత ప్రాతిపదికన కండక్టర్, డ్రైవర్ వంటి పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.ఆన్‌కాల్ అంటే.. రోజు కూలీ... ఆర్టీసీలో సుమారు 4వేల డ్రైవర్ పోస్టులు, 2వేలకుపైగా కండక్టర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వాటిని రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయాలని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల జేఏసీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. కానీ చంద్రబాబు ససేమిరా అంటున్నారు. ఆన్‌కాల్ (ఏ రోజుకు ఆరోజు ఔట్సోర్సింగ్ విధులు) పద్ధతిలో పనిచేయించుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కొక్కరికి రోజుకు రూ.వెయ్యి వేతనం ఇస్తారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో 1,800మంది ఆన్‌కాల్ డ్రైవర్లు పనిచేస్తున్నారు. మరో 4వేల మందిని అదే పద్ధతిలో తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడం గమనార్హం. ప్రజా రవాణాను దారుణంగా దెబ్బతీసే కుట్ర ఎర్రబస్సు అంటే పేదవాడి బెంజ్ కారు. ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణానికి ప్రధాన సాధనం. అలాంటి ప్రజా రవాణా వ్యవస్థను ఒక పథకం ప్రకారం దారుణంగా దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి. ఆర్టీసీ డిపోలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం, ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటువారికి ధారాదత్తం చేయడం వంటివన్నీ ఈకోవలోనివే. ఇపుడు డ్రైవర్లను, కండక్టర్లను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించడం మరింత ప్రమాదకరమని ఉద్యోగసంఘాల జేఏసీ నాయకులు అంటున్నారు. ఆర్టీసీలో డ్రైవర్లను ‘‘ఆన్‌కాల్/రోజువారీ వేతనం’’పై తీసుకోవడం కేవలం ఉద్యోగుల సమస్యగా కాకుండా ప్రయాణికుల భద్రత, బాధ్యత, సిబ్బంది నిర్వహణ పరంగా కూడా సమస్యలు వస్తాయి. రెగ్యులర్ డ్రైవర్ నియామకంలో ఎంపిక, శిక్షణ, డ్రైవింగ్ పరీక్షలు, వైద్య పరీక్షలు, సేవా రికార్డు వంటి వ్యవస్థలు ఉంటాయి. రోజువారీ/ఆన్‌కాల్ విధానంలో అవి పట్టించుకోరు. ప్రయాణికులతో నిండిన ఆర్టీసీ బస్సును నడిపే వ్యక్తి ఎంపికలో ప్రమాణాలు సడలితే ప్రమాదమే. ఆన్ కాల్ విధానం నేరుగా ప్రయాణికుల భద్రతపై పడుతుంది. ఆన్‌కాల్ డ్రైవర్ ఎక్కువ రోజువారీ ఆదాయం కోసం ఇతర డ్రైవింగ్ పనులు కూడా చేస్తే, అతని మొత్తం పని గంటలను ఆర్టీసీ ఎలా పర్యవేక్షిస్తుంది? అన్నది ముఖ్యమైన భద్రతా ప్రశ్న. ఉద్యోగ భద్రత లేకపోవడంతో డ్యూటీ ఒత్తిడి రోజువారీ వేతనంపై ఆధారపడే డ్రైవర్‌కు ‘‘డ్యూటీ వద్దంటే తదుపరి రోజు పని ఉండకపోవచ్చు’’ అనే పరిస్థితి ఉంటే, టైమ్ టార్గెట్లు, ట్రిప్పులు, అదనపు డ్యూటీల విషయంలో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రజా రవాణాలో భద్రత కంటే ట్రిప్పుల సంఖ్య/సమయపాలనకు ప్రాధాన్యత పెరగకూడదనే అంశాన్ని ముందుకు తెస్తుంది. రూట్ పరిజ్ఞానం, డిపో విధానాలపై అవగాహన, బస్సు ప్రత్యేకతలపై పరిచయం, స్థానిక ట్రాఫిక్ పరిస్థితుల అవగాహన, అత్యవసర పరిస్థితుల నిర్వహణ వంటి అంశాల్లో రెగ్యులర్ డ్రైవర్లకు ఉన్న అవగాహన రోజువారీ వేతన డ్రైవర్ కి వుండవు.విద్యుత్ బస్సులది ‘ప్రైవేట్ దారి’.. కేంద్ర ప్రభుత్వ సాయంతో పీఎం ఈ బస్సు సేవా పథకంలో ఏపీఎస్ ఆర్టీసీలో తెస్తున్న విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించేలా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మొత్తం 1,450 విద్యుత్ బస్సుల ఆపరేషన్, నిర్వహణను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్దతిలో ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించాలని నిర్ణయించారు.వాటిలో తొలివిడతగా 750 విద్యుత్ బస్సులను పూనేకు చెందిన పినాకిల్ అనే కంపెనీకి అప్పగించి వాటి నిర్వహణకు అవసరమైన 12 డిపోలలో నాలుగింటిని (విద్యాధరపురం, గుంటూరు 2, మంగళం, నెల్లూరు 2) సైతం ఆ కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. ఈ నిర్ణయాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడంతోపాటు దశలవారీగా ఉద్యమాలు చేశాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ బస్సుల్లో ఒక్కటీ ఇంకా రోడ్డెక్కలేదు. ఆ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించకుండా ఆర్టీసీయే నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రయాణీకులు పెరిగారు.. బస్సులు తగ్గాయి.. రాష్ట్రంలో గతేడాదితో పోల్చితే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులు పెరిగారు. అందుకు అనుగుణంగా బస్సులు, సిబ్బంది సంఖ్య పెరగకపోగా మరింత తగ్గిపోయింది. » 2025 ఆగష్టు నాటికి రాష్ట్రంలో 10,700 బస్సులు తిరిగేవి. 44వేల సిబ్బంది ఉండేవారు. ప్రతిరోజూ 35 లక్షల మందికిపైగా ప్రయాణించేవారు. » 2026 ఆగష్టు నాటికి కాలం చెల్లిన 600 బస్సులు తగ్గిపోగా 10,100 బస్సులు మాత్రమే సర్వీస్ చేస్తున్నాయి. గోదావరి పుష్కరాలు(2027)నాటికి మరో 1500 బస్సులకు కాలం చెల్లిపోతుంది(్రస్కాప్ అవుతాయి). గడిచిన ఏడాదికాలంలో దాదాపు మూడు వేల మంది సిబ్బంది పదవీ విరమణ చేయడంతో 41వేల మంది సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణీకులు మాత్రం దాదాపు 15లక్షలు పెరిగి మొత్తం 50లక్షల మంది ప్రయాణిస్తున్నారు. » వాస్తవానికి 35 లక్షల మంది ప్రయాణీకులకు 44వేల సిబ్బంది, 10,700బస్సులు ఉంటే పెరిగిన మరో 15లక్షల మందికి అదనంగా కనీసం 20వేల సిబ్బంది, ఐదు వేల బస్సులు అవసరం. » వైఎస్ జగన్ ప్రభుత్వంలో తిరుమల కొండపై తెచ్చిన ఈ బస్సులు, ఏపీఎస్ ఆర్టీసీకి మంజూరు చేసిన డీజిల్ బస్సులు మినహా చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఒక్క బస్సు మంజూరు చేయలేదు. గత ప్రభుత్వం మంజూరు చేసిన బస్సులే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కొత్తగా వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల నాన్ ఏసీ సీఎన్జీ 500 బస్సులకు టెండర్ పిలిచారు. దాన్ని రద్దు చేసి వాటిని ఏసీ బస్సులుగా మళ్లీ టెండర్ పిలవాలని నిర్ణయించారు. ఆర్టీసీ విలీనం.. దశాబ్దాల కల నెరవేర్చిన జగన్ దశాబ్దాలుగా కలగా మిగిలిపోయిన ఆర్టీసీ విలీనాన్ని వైఎస్ జగన్ నెరవేర్చారు. తద్వారా 58 వేల మంది ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేశారు. అంటే ఆర్టీసీలోని ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులయ్యారన్నమాట. వారంతా కొత్తగా ఏర్పాటైన ప్రజా రవాణా శాఖ కిందకు వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలు, నియమనిబంధనలు ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచారు. ఈ విలీనం వల్ల ప్రభుత్వంపై రూ.3,300 కోట్ల ఆర్టీసీ ఆర్థిక భారం పడింది. అయినా వైఎస్ జగన్ వెనక్కి తగ్గలేదు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని విలీనం చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.4వేల బస్సులు.. 15వేల రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయాలి ఆర్టీసీ జేఏసీ నేతల డిమాండ్ ఏపీఎస్ ఆర్టీసీలో ప్రభుత్వమే సొంతంగా 4వేల బస్సులను కొనుగోలు చేసి 15వేల పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని ఏపిపిటిడి(ఆర్టీసి) ఉద్యోగ సంఘాల జేఏసి రాష్ట్ర కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు స్టేట్ కో కన్వీనర్లు పీవీ రమణారెడ్ఢి, జీవీ నరసయ్య, సీహెచ్ సుందరయ్య, కట్టా సుబ్రమణ్యం, ఎస్వీ శేషగిరిరావు, సూర్యప్రకాశరావు, జి.మాల్యాద్రి డిమాండ్ చేసారు. కండక్టర్ల కొరతను అధిగమించే పేరుతో రెగ్యులర్ నియామకాలకు బదులుగా కాంట్రాక్టర్ ద్వారా ఔట్సోర్సింగ్, ఆన్‌కాల్ పద్దతిలో నియమించడం సరికాదన్నారు. ఈ విధానం తాత్కాలికంగా సిబ్బంది కొరతను తీర్చినట్లు కనిపించినా, దీర్ఘకాలంలో ఆర్టీసీలో రెగ్యులర్ ఉద్యోగ వ్యవస్థను బలహీనపరిచి, ప్రైవేట్ పరం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ సిబ్బంది సహా వివిధ కేటగిరీల్లో సుమారు 15 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రెగ్యులర్ రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి తీవ్రంగా పెరిగిందన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే పునరాలోచించి రెగ్యులర్ నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలు విడనాడకపోతే సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల భద్రత కోసం అన్ని సంఘాలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. -
ప్రజల తీర్పును ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు ఉందా?..
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారిని వైఎస్సార్సీపీ పొన్నూరు ఇంచార్జ్ అంబటి మురళీకృష్ణ విమర్శించారు. ఈ రెండున్నరేళ్లలో పేదలకు ఒక్క ఇంటి స్థలం కూడా ఇవ్వకుండా, గత వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన వాటి ముందు నిలబడి చంద్రబాబు ఫోజులు ఇస్తూ క్రెడిట్ చోరీకి పాల్పడటం ఒక్కేటే చేస్తున్నారని మండిపడ్డారు. అసలు పేదలకు ఇళ్లు రాకుండా కేసులు వేయించింది చంద్రబాబేనని, ఇప్పుడు తానే చేసినట్లు క్రెడిట్ చోరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘ వైఎస్ జగన్ 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 22 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. 9 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. పేదల చేతిలో లక్ష కోట్ల ఆస్తి పెట్టారు. పేదలకు ఇళ్లు రాకుండా చంద్రబాబు కేసులు వేయించారు. వెయ్యికి పైగా కేసులతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అన్ని అడ్డంకులను అధిగమించి జగన్ పేదలకు ఆస్తి ఇచ్చారు. రెండున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క ఇంటి స్థలమైనా ఇచ్చారా?, వైఎస్ జగన్ ప్రారంభించిన మిగతా ఇళ్లనైనా పూర్తి చేశారా?, వైఎస్ జగన్ చేసిన ఇళ్ల ముందు నిలబడి చంద్రబాబు క్రెడిట్ కొట్టేస్తున్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బుర్రిపాలెం తీసుకొచ్చారు. వ్యవసాయ మంత్రిని తీసుకొచ్చి రైతుల సమస్యలపై ఎందుకు మాట్లాడనివ్వలేదు?, రాష్ట్రంలో 388 మండలాల్లో కరువు పరిస్థితులున్నాయి. రైతులకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నారు. ఇలాంటి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి ఎందుకు మాట్లాడలేదు?, చౌహాన్ పర్యటనను కూడా జగన్‌పై విమర్శలకే వాడుకుంటారా?, జగన్‌ను తిట్టడమే కూటమి ప్రభుత్వ అజెండానా?, నాదెండ్ల మనోహర్‌కు జగన్‌ను విమర్శించే అర్హత ఉందా?సీజ్ ద షిప్’ ఎపిసోడ్‌పై నాదెండ్ల మనోహర్ విచారణకు సిద్ధమా?, జగన్ తెచ్చిన నవరత్నాలు, సంక్షేమ పథకాలను అటకెక్కించారు. రైతు కన్నీళ్లు పెడుతుంటే.. చంద్రబాబు ప్రచారాలు చేసుకుంటున్నారు. అమరావతిలో జగన్ పేదలకు ఇచ్చిన ఇళ్లను అడ్డుకున్నది చంద్రబాబే. అమరావతి అందరిదంటారు.. పేదలకు పట్టాలిస్తే అడ్డుకుంటారు. స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలి. ఎన్నికలంటే వైఎస్సార్సీపీకి భయం లేదు. ప్రజల తీర్పును ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు ఉందా?, అచ్చెన్నాయుడు గ్రామాల్లోకి వస్తే రైతుల కష్టాలు తెలుస్తాయి’ అని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: బీసీలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది.. రమేష్ యాదవ్ -
పక్షపాతం చూపితే ప్రశ్నిస్తాం.. కాకాణి హెచ్చరిక
సాక్షి, నెల్లూరు జిల్లా: మనుబోలులో 19 గ్రామపంచాయతీల వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. కాకాణి పూజిత సమావేశానికి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కాకాణి దిశానిర్దేశం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారంపై నేతలు, కార్యకర్తల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని కాకాణి మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్సీపీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా అడ్డుకోవద్దని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు చేయొద్దని అధికారులను కాకాణి కోరారు.పోలీస్, రెవెన్యూ, ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని డిమాండ్ చేసిన కాకాణి.. అధికారులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తే చట్టపరంగా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీకి చట్టబద్ధంగా రావాల్సిన హక్కులు, పారదర్శక సేవలు అందించాల్సిందేనని కాకాణి స్పష్టం చేశారు.ఇదీ చదవండి: టీడీపీ నేతల నుంచి నాకు ప్రాణహాని ఉంది: కేతిరెడ్డి -
జనసేన ఎమ్మెల్యేలపై చంద్రబాబు అసంతృప్తి!
పశ్చిమ గోదావరి జిల్లా కూటమిలో రెండేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బాహాటంగానే రచ్చకెక్కుతున్నాయి. నియోజకవర్గాల్లో ఆధిపత్యం, ప్రోటోకాల్ వివాదాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు ఈ విభేదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.సాక్షి, భీమవరం: జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి ఒప్పందంలో భాగంగా టీడీపీ నాలుగు, జనసేన మూడు స్థానాల్లో గెలుపొందగా, నరసాపురం ఎంపీ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. అయితే జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతల హవానే నడుస్తోందని జనసేన శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యేలకు పోటీగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం, ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించడం ఘర్షణ వాతావరణానికి దారితీస్తోంది. మరోవైపు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు, ఆచంట, ఉండి, తణుకు నియోజకవర్గాల్లో తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని జనసేన, బీజేపీ కేడర్ నిరాశతో ఉంది. తాడేపల్లిగూడెంలో రాజీనామా సవాల్ తాడేపల్లిగూడెంలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి మధ్య విభేదాలు ఇప్పటికే భగ్గుమన్నాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో బాబ్జి మాట్లాడుతూ వార్డుల్లో ఎక్కడకు వెళ్లినా రోడ్లు లేవంటున్నారని, దోమల సమస్య చెబుతున్నారని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బొలిశెట్టి స్పందించారు. ఎమ్మెల్యే పనిచేయడం లేదని ఎవరితోనైనా అనిపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ చేశారు. తాను వచ్చాక ఎన్ని కోట్లు రూపాయల వర్కులు జరిగింది? ఎన్ని రోడ్లు వేసింది? ఎన్ని డ్రెయిన్లు, ఎన్ని ఫిల్టర్ బెడ్లు కట్టింది? చరిత్ర చెబుతుందన్నారు. పదేపదే ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఇష్టానుసారం చేస్తామంటే చూస్తు ఊరుకోన్నారు. లోకల్ ఎలక్షన్స్‌లో జనసేన గెలిచే స్థానాలను ఎవరి కోసం త్యాగం చేసేది లేదని ఎమ్మెల్యే బొలిశెట్టి స్పష్టం చేశారు. నరసాపురంలో బాహాటంగానే విమర్శలు‘ఎమ్మెల్యే గారు.. మీరు, మీ నియోజకవర్గం ఆఫీసర్లు సరిగా పనిచేయడం లేదు. అన్నిట్లో మైనస్ ఉన్నారు’ అంటూ ఇటీవల ప్రజావేదిక సభలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నరసాపురం కూటమిలో నిప్పు రాజేశాయి. చంద్రబాబు కావాలనే తమ పార్టీ ఎమ్మెల్యేను జనంలో చులకన చేశారని జనసేన కేడర్ మండిపడింది. టీడీపీ, తన సామాజికవర్గం ఎమ్మెల్యేలపై ఎక్కడైనా ఈవిధంగా బహిరంగ రివ్వూ ఇచ్చారా? కనీసం మీ మీద గానీ, ప్రభుత్వంపై గాని రివ్యూ చేసుకున్నారా? మహిళలకు నెలకు రూ. 1500 ఇచ్చారా? నిరుద్యోగభృతి ఇచ్చారా? రెండేళ్లయినా కొత్త పింఛన్లు, హౌసింగ్ లోన్లు లేవు. ప్రజల్లో తల ఎత్తుకోలేకున్నాం. పథకాలేవని అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నామంటూ విమర్శలు గుప్పించారు. నిధులివ్వకుండా నిందలేమిటి చంద్రబాబు? అంటూ ఎమ్మెల్యే నాయకర్ పేరిట ఒక కరపత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది’ -
ఈ రాష్ట్రం నీ జాగీరా.. చంద్రబాబుపై రెచ్చిపోయిన TDP సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు
-
నీ పిట్టలదొర మాటలు ఆపు.. చంద్రబాబు లక్ష కోట్ల ప్రకటనపై జగన్ ఫైర్
-
మీ చావు మీరే చావండి అనుకుంటే.. తాట తీసేస్తాం జాగ్రత్త..
-
బాబు గుప్పిట్లో వైఎస్ వివేకా మరణ రహస్యం
-
ఆలయాల్లో పండుగ వ్యాపారం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం పండుగల పేరుతో ఆలయాల్లో వ్యాపారం మొదలు పెట్టింది. పండుగ రోజుల్లో దైవ దర్శన టికెట్ల ధరలు పెంచేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాల వేళ అమ్మవారి అంతరాలయ దర్శనం టికెట్ ధరను రూ.500 నుంచి రూ.1,000కి పెంచాలని నిర్ణయించింది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా రెండేసి గంటలపాటు రూ.1,000 టికెట్లు ఉన్నవారికి అంతరాలయ దర్శనాలకు అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు దేవదాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు తాజాగా దుర్గగుడి పాలకమండలి అంతరాలయ దర్శన టికెట్ ధరను రూ.1,000లకు పెంచుతూ తీర్మానానికి ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. మధ్య తరగతి వర్గాలను అమ్మవారి అంతరాలయ దర్శనానికి దూరం చేసేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని భక్తులు మండిపడుతున్నారు. కలియుగదైవం తిరుమల శ్రీవారి భక్తుల విశ్వాసాలనే తమ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవడానికి పవిత్ర లడ్డూ ప్రసాదంపై జుగుప్సాకరమైన విమర్శలు చేసిన చంద్రబాబు, కూటమి పారీ్టల నేతలు ఇప్పుడు గుళ్లలోనూ పండుగ వ్యాపారం మొదలుపెట్టారంటూ భక్తులు మండిపడుతున్నారు. -
మభ్యపుచ్చేందుకే ' సుప్రీం'!
సాక్షి, అమరావతి : ముందుగా నిర్ణయించుకున్న స్క్రిప్టు ప్రకారం బీసీలను మభ్యపెట్టేందుకు రిజర్వేషన్లపై చంద్రబాబు సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిజంగా బీసీ రిజర్వేషన్లపై న్యాయపోరాటం చేస్తున్నారని అనుకోవడానికే ఇదంతా చేస్తున్నారు తప్ప చంద్రబాబుకు ఎలాంటి చిత్తశుద్ధీ లేదని బీసీ నాయకులంటున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు ఏం చెబుతుందో వినాలి కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు కోర్టులో పోరాడుతున్నట్టు నటిస్తూ ఇటు అధికారులను, అటు పార్టీ నాయకులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఎలాగూ కోర్టు కొట్టేస్తుంది కాబట్టి మీరంతా మీ పనులు వేగంగా పూర్తిచేయండి అంటూ అధికారులను అదిలిస్తున్నారు. అదే సమయంలో పార్టీ ముఖ్యనేతలతో ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. సుప్రీంకోర్టులో స్పష్టత రాకముందే చంద్రబాబు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఎన్నికల నిర్వహణకు చేస్తున్న హడావుడి మామూలుగా లేదు. మంత్రి అచ్చెన్నాయుడు స్థానిక ఎన్నికలకు సన్నద్దతపై శనివారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ప్రధాన నాయకులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. మరికొన్ని జిల్లాల్లోనూ కూటమి నేతల ఎన్నికల సమావేశాలు కొనసాగాయి. కలెక్టర్లు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల హడావుడి శనివారం కూడా జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారుల సమావేశాలు కొనసాగాయి. పోలింగ్ తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగిందని, స్ట్రాంగ్ రూమ్‌ల గుర్తింపు వంటి వాటికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిసింది. పాత రిజర్వేషన్లకు అనుగుణంగా ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవలసిందిగా పైనుంచి సూచనలందాయని అధికారుల స్థాయిలో చర్చ సాగుతోంది. ఒకపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రులు పార్టీ నాయకులను స్థానిక సంస్థలకు సన్నద్ధం చేస్తుండగా ఇంకోపక్క జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోనూ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సైతం ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిని పెంచింది. ఈ నెల 7 (బుధవారం) అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ నగర పోలీసు కమిషనర్లతో పాటు ఆయా జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, నగర, పట్టణ మున్సిపల్ కమిషనర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఆర్థిక, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశం కూడా పూర్తి చేసిందంటే ఆ తర్వాత ఎప్పడైనా ఎన్నికల నోటిఫికేషన్ జారీకి అవకాశం ఉంటుందని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. -
రైతులకు బాబు లక్ష మోసాలు
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి ప్రతి హామీ నెరవేరుస్తానని ఇంటింటికీ బాండ్లు పంచిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ పాలన మూడో ఏడాది నడుస్తోంది... ఇప్పుడు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే రాయలసీమలో హార్టికల్చర్‌కు రూ. లక్ష కోట్లు అంటూ పిట్టలదొర మాటలు చెబుతూ మరోవైపు రైతులను లక్ష మోసాలకు గురి చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. అందులో ఆయన ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు ఏరోజైనా పట్టించుకున్నారా?రూ. లక్ష కోట్లంటూ చంద్రబాబు పిట్టలదొర మాటలు చెబుతూ, మరోవైపు రైతులను లక్ష మోసాలకు గురి చేస్తున్నారు. రాయలసీమలో హార్టికల్చర్‌కు రూ. లక్ష కోట్లు అంటూ చంద్రబాబు చేస్తున్నవి డ్రామాలు, అంకెల గారడీలు కాక మరేమిటి? బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా, రైతుల్ని ఇంతలా మభ్యపెట్టడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం. రైతులమీద ప్రేమ మాటలకు, ప్రచారాలకు మాత్రమే పరిమితం అని రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనే పలుమార్లు రుజువు చేసింది. హార్టికల్చర్ సహా పంటలకు ధరల్లేక రైతులు రోడ్డున పడితే, రోజూ ధర్నాలు చేస్తే చంద్రబాబు ఏరోజైనా పట్టించుకున్నారా? మా ప్రభుత్వంలో పెట్టిన ధరల స్థిరీకరణ నిధిని నిర్వీర్యంచేసి, ఉచిత పంటల బీమాను తీసివేసి రైతుల వెన్నువిరిచిన మాట వాస్తవం కాదా?. సున్నా వడ్డీ పథకాన్ని రద్దుచేసి, సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని నిర్వీర్యం చేసి రైతుల నడ్డివిరిచారు. చంద్రబాబు పబ్లిసిటీ డ్రామాలు చేసి, వాటినే నిజాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు గానీ రైతుల కష్టసుఖాల గురించి ఏరోజూ పట్టించుకోరనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి?డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టి.. కరువు నివారణా చర్యలు మొదలు పెట్టాలితీవ్రమైన కరువు కారణంగా రాయలసీమలో ఇప్పుడు తీవ్ర దుర్భిక్షం నెలకొంటే, వేలాది ఎకరాల్లో హార్టికల్చర్ తోటలు ఎండిపోతుంటే... చంద్రబాబు వాటర్ మ్యాన్ అని బిల్డప్ ఇవ్వడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఓ పక్క రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు చంద్రబాబే అడ్డుతగులుతున్నారు. మరోపక్క ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే దాదాపుగా 78 లక్షల బోర్లు ఎండిపోయాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ట్యాంకర్ నీటికోసం రూ.1500 నుంచి రూ.2,000 ఖర్చుచేసి, ఆ చెట్లను బతికించేందుకు నానా అగచాట్లు పడుతున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఇక హార్టికల్చర్ హబ్ సంగతి పక్కనపెడితే, రైతుల ఆత్మహత్యలకు చిరునామాగా రాయలసీమ సహా రాష్ట్రం మొత్తం తయారయ్యింది. చంద్రబాబు ఇప్పటికైనా డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టి, రైతులకు ఊరటనిచ్చేలా తక్షణమే కరువు నివారణా చర్యలు మొదలుపెట్టాలి. -
రూ.9 లక్షల డొల్ల కంపెనీకి రూ.1400 కోట్ల ప్రాజెక్టా?: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో తమ అనుయాయులకు, బినామీ కంపెనీలకు అడ్డగోలుగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఇవ్వడమే కాకుండా, పలు రాయితీల రూపంలో వందల కోట్లు దోచిపెడుతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు.గతంలో విశాఖపట్నంలో ఉర్సా లాంటి డొల్ల కంపెనీకి రూపాయికే ఎకరం చొప్పున భూములు కట్టబెట్టిన తరహాలోనే, ఇప్పుడు రాయలసీమలోని చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో ‘రావోక్స్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట మరో భారీ దోపిడీకి తెర లేపారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆక్షేపించారు. ప్రెస్మీట్లో పుత్తా శివశంకర్ ఇంకా ఏం మాట్లాడారంటే..:బినామీ సంస్థలకు ప్రజా ఆస్తులు:ఏర్పాటై ఏడాది కూడా పూర్తి కాని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎలాంటి అనుభవం లేని, కేవలం రూ.9 లక్షల పెయిడ్ అప్ క్యాపిటల్‌తో రిజిస్టర్ అయిన సంస్థకు ఏకంగా రూ.1388.14 కోట్ల ప్రాజెక్టు ఆపాదించారు. ‘రావోక్స్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు ఏపీఐఐసీకి చెందిన విలువైన 40.50 ఎకరాల భూమితో పాటు, రూ.592.22 కోట్ల మేర టైలర్ మేడ్ ఇన్సెంటివ్‌లను జీవో ఎంఎస్ 259 ద్వారా ధారాదత్తం చేశారు. అలా తమ వారి లబ్ధి కోసం నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే బినామీ సంస్థలకు ప్రజల ఆస్తులను యథేచ్ఛగా దోచిపెడుతున్నారు.రూ.9 లక్షల కంపెనీకి రూ.1400 కోట్ల పెట్టుబడి సామర్థ్యం ఎక్కడిది?:గత ఏడాది నవంబరు 20న ప్రారంభమైన రావోక్స్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పెయిడ్ అప్ క్యాపిటల్ కేవలం రూ. 9 లక్షలు మాత్రమేనని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) రికార్డులే చెబుతున్నాయి. కనీసం రూ.2.5 లక్షల రుణం పొందే అర్హత కూడా లేని ఈ పసిగుడ్డు కంపెనీ ఏకంగా రూ.1388.14 కోట్ల పెట్టుబడి పెడుతుందంటే ఎవరైనా నమ్ముతారా? అసలు ఈ కంపెనీ వెనుక ఉండి నల్లధనాన్ని పెట్టుబడిగా పెడుతున్న బడా బాబులు ఎవరు? కేవలం పేపర్ మీద కంపెనీ పెట్టి, ప్రభుత్వ భూములు చేజిక్కించుకుని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పారిపోయే కుట్ర కాదా ఇది?సర్జికల్ గ్లౌజులు చేసే వారికి ఆ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది?:ఈ సంస్థ డైరెక్టర్లకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కనీస అనుభవం ఉందా? వీరికున్న మరో కంపెనీ ఈజిస్ గ్లోవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం ఏఎంటీజెడ్‌లో సర్జికల్ హ్యాండ్ గ్లౌజులు తయారు చేస్తుంది. గ్లౌజులు తయారు చేసే వారికి, టమోటా, మామిడి ప్రాసెసింగ్ చేసే అనుభవం ఎలా ఆపాదించారు? పైగా వీళ్ల అనుబంధ సంస్థ ’దిసూత్ర ల్యాబ్స్’ను, ఈ ఏడాది ఏప్రిల్‌లో కేవలం రూ.10 వేల పెట్టుబడితో ప్రారంభించారు.జీవోకు ముందే రూ.1090 కోట్ల మెషినరీ ఆర్డర్లు ఎలా ఇచ్చారు?:ఈ కంపెనీకి భూకేటాయింపునకు సంబంధించిన ఆదేశాలు గత నెల జారీ అయ్యాయి. ఆ మేరకు జీఓ ఎంఎస్ నెం:259ని సెప్టెంబరు 25న జారీ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదన తొలుత సెప్టెంబరు 7న జరిగిన ఎస్ఐపీసీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ) సమావేశంలోనూ, ఆ తర్వాత 11 రోజుల అనంతరం, సెప్టెంబరు 18న జరిగిన ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో వచ్చింది. కాగా, అప్పటికే దాదాపు రెండు నెలల ముందే జూలై 1 నాటికే ఆ సంస్థ రూ.1090 కోట్ల విలువైన ప్లాంట్ అండ్ మిషనరీ ఆర్డర్ ప్లేస్ చేసింది! నిజంగా ఆ కంపెనీకి అంత ఆర్థిక స్థోమత ఉందా? అదే నిజమైతే అంత తక్కువ మూలధన పెట్టుబడి మాత్రమే పెడతారా? లేక ఇదంతా ముందస్తు కుమ్మక్కు కాదా?రూ.592 కోట్ల ఇన్సెంటివ్ ఎవరి జేబుల్లోకి?:రూ.1388 కోట్ల ప్రాజెక్టు విలువలో ఏకంగా 46.61 శాతం, అంటే రూ.592.22 కోట్లను టైలర్ మేడ్ ఇన్సెంటివ్లుగా ప్రకటించడం విడ్డూరం కాదా? కేవలం రూ.9 లక్షల మూలధన పెట్టుబడి ఉన్న కంపెనీకి రూ.592 కోట్ల ఇన్సెంటివ్‌లు ఇవ్వడం దేశ చరిత్రలోనే ఎక్కడైనా ఉందా?. ఇలా 40.50 ఎకరాల భూమి ఉచితంగా ఇవ్వడమే కాకుండా, వివిధ రూపాల్లో మరో రూ.592 కోట్లు ప్రభుత్వం నుంచే దోచి పెడుతుంటే ఇది బినామీ దందా కాక మరేమిటని పుత్తా శివశంకర్ నిలదీశారు.ఇదీ చదవండి: చంద్రబాబూ.. మీ డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టండి: వైఎస్ జగన్ -
‘ఇప్పుడున్నది లోకేష్ కనుసన్నల్లో పనిచేసే చంద్రబాబు’
విజయవాడ : ఏపీలో ఇప్పడంతా క్యాష్, క్యాష్, క్యాష్.. ఇదే నడుస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా క్యాష్ కొడితేనే పని అవుతుందని విమర్శించారు. ప్రజలు భయంతో బ్రతికే రోజులు వచ్చేశాయని, టీవీ చానల్స్‌ను కూడా డబ్బు ఎరవేసి లోబరుచుకుంటున్నారని పేర్ని నాని స్పష్టం చేశారు. ఇప్పుడు కనిపిస్తున్న చంద్రబాబు పాత చంద్రబాబు కాదని, ఇప్పుడున్నది లోకేష్ కనుసన్నల్లో పని చేసే చంద్రబాబన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో ‘రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు. ప్రభుత్వ రంగ పరిరక్షణలో అనే అంశంపై రౌండ్ టేబుల్ మీటింగ్‌లో చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి, టిడిపి సీనియర్ నేత వడ్డే శోభనాధ్రీశ్వరరావు, మాజీమంత్రి పేర్ని నాని, ప్రొ. సి. రామచంద్రయ్య, సామాజిక కార్యకర్త డా. వసుంధర, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పేర్ని నాని మాట్లాడుతూ.. ‘పిపిపి ద్వారా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఓటేసి గెలిపించిన జనం ఎలా పోయినా పర్వాలేదు అనే ఆలోచనలో ఉన్నారు. ప్రజలు పన్నులు చెల్లించాలి. .చంద్రబాబు అండ్ కో హెలికాప్టర్లలో తిరుగుతారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు. ప్రైవేట్ నిర్వహణకు ఇచ్చి జీతభత్యాలు ప్రజల సొమ్ము ఇస్తామంటున్నారు. ఇంతకంటే బరితెగింపు ఏముంది?, రాజధాని మొత్తం కరెంట్ కోసం ప్రైవేట్‌కు కట్టబెట్టారు. ఏపీలో ఉన్న ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను ప్రైవేట్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఆర్టీసీకి చెందిన 12 డిపో లను ప్రైవేట్ కు కట్టబెట్టారు. ఫ్రీ బస్ స్కీమ్ పేరుతో ఆర్టీసీకి నెలకు రూ. 150 కోట్లు ప్రభుత్వం అప్పులు పెడుతుంది. రూ. 7 వేల కోట్ల అప్పుల్లో ఉన్న ఆర్టీసీని కాపాడేందుకు ప్రభుత్వంలో వైఎస్ జగన్ విలీనం చేశారు. జీతభత్యాల ఖర్చు ప్రభుత్వం భరించేలా జగన్ చర్యలు తీసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పీపీపీ మోడల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను పెడుతున్నారు. జీవో 74 ద్వారా రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన ప్రతీ సేవను పీపీపీకి అప్పగించేస్తున్నారు. జీతాలకేే డబ్బులన్నీ పోతున్నాయని చంద్రబాబు చెబుతున్నారు. ఇప్పటికే రూ. 3లక్షల 95 వేల కోట్లు అప్పులు తెచ్చారు. ప్రజల సొమ్మును వయోబులిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతో దోచిపెడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ముగ్గురం కలవడం వల్లే.. చంద్రబాబు సీఎం: అయ్యన్న -
గొంతెమ్మ కోరికలు కోరుతున్నామా..!? చేసిన పనికి డబ్బులు ఇవ్వడానికి మీకేంటి నొప్పి..
-
యూసీసీపై అమిత్ షా ప్రకటన.. టీడీపీకి సంకటమేనా?
దేశంలోని ఎన్డీఏ రాష్ట్రాలలో ఉమ్మడి పౌర స్మృతి(యూనిఫాం సివిల్ కోడ్)ని అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించడం కొత్త వివాదం అవుతుందా? అన్న చర్చ జరుగుతోంది. ఎన్డీఏలో భాగస్వామి అయిన జేడీ(యు) ఈ ప్రతిపాదనకు ఓకే చేస్తున్నా, బిహారులో మాత్రం అమలు చేయరాదని డిమాండ్ చేస్తోంది. అలాగే మరికొన్ని ఎన్డీఏ పక్షాలు కూడా ఈ ప్రతిపాదనపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అమిత్ షా ప్రకటనతో ఇబ్బందిలో పడిన తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ విషయంలో కూడా యూటర్న్ తీసుకోవడానికే సిద్దపడుతున్నట్లు కనబడుతోంది.ఒకప్పుడు తలాఖ్ చట్టాన్నే వ్యతిరేకించిన టీడీపీ, ఇప్పుడు యూసీసీకి మద్దతు ఇవ్వాలని అభిప్రాయపడుతోంది. ముఖ్యమంత్రి, టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు దీనిపై నేరుగా వ్యాఖ్య చేయనప్పటికీ , ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చాలా స్పష్టంగా అమిత్ షా ప్రకటన మేరకు నడుచుకుంటామని తెలిపారు. నిజానికి దేశం అంతటికి కలిపి పార్లమెంటులో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) బిల్లు పెట్టవలసి ఉంటుంది. కాని బీజేపీ అందుకు సిద్దపడడం లేదు. రాష్ట్రాలవారీగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఈ విధానం అమలు చేయాలని భావిస్తున్నట్లు ఉంది.ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడంలో తప్పేముంది? దేశంలో ఉన్న పౌరులందరికి సమానమైన నియమ, నిబంధనలు పెట్టడం మంచిదే కదా అన్న అభిప్రాయం కలగడం సహజమే. ప్రత్యేకించి వ్యక్తిగత విషయాలైన పెళ్లి, విడాకులు, ఆస్తుల వారసత్వం తదితర అంశాలలో యూసీసీ తీసుకువస్తామని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో చెబుతోంది. 2014 నుంచి బీజేపీ పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక కూడా వివిధ కారణాలతో ఈ ప్రతిపాదనను అమలు చేయలేకపోయింది. అయితే గత ఏడాది ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఈ యూసీసీని అమలు చేయడం ఆరంభించింది. ఇందులో ఉన్న అంశాలలో ప్రజలకు మేలు చేసేవి అయితే స్వాగతించవలసిందే. ఉదాహరణకు ఆయా విషయాలలో అన్ని మతాలలోని మహిళలకు సమానత్వం కల్పించడం మంచిదే. కాని ఇది అన్ని మతాలలో ఒకే విధంగా ఉండాలి. కేవలం ఒక మతాన్ని ఉద్దేశించి ఈ చట్టం తెస్తున్నారన్న భావన కలగనివ్వరాదు.బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం సీఎఎ, త్రిబుల్ తలాఖ్ తదితర చట్టాలను తెచ్చినప్పుడు పెద్దగా ఇబ్బంది రాలేదు. ప్రత్యేకించి త్రిబుల్ తలాఖ్ విధానాన్ని రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలకు మేలు జరుగుతుందని చాలామంది భావించారు. కాని ముస్లిం సమాజంలో కొంతమంది వ్యతిరేకించారు. బీజేపీ హిందూ మతాన్ని ఏకీకృతం చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నిస్తోందన్నది కాంగ్రెస్ తో సహా వివిధ పక్షాల విమర్శ. అయినప్పటికీ, బీజేపీ చిత్తశుద్దితో అందరిని సమానంగా చూసే చట్టాలు తెస్తే తప్పు లేదు. కాని అనేక మతపరమైన విషయాలలో బీజేపీ అనుసరిస్తున్న విధానం అంత సమర్ధనీయంగా లేదన్నది బుద్దిజీవుల భావన.గోవాలో అమలు చేస్తున్న యూసీసీపై పలువురు తమ అసమ్మతి తెలియచేస్తున్నారు. అందులో పురుషాధిక్యతను చాటే విధంగా నిబంధనలు రూపొందించారన్నది ఆరోపణ. అలాగే వివిధ మతాలలో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. వాటిని గౌరవించకపోతే సమాజంలో అశాంతి ప్రబలే ప్రమాదం ఉంటుంది. అన్ని మతాలవారిని ఒప్పించి ఇలాంటివాటిని తేగలిగితే బాగుంటుంది. కాని అది అంత తేలిక కాదు. ఉత్తరాఖండ్ తర్వాత గుజరాత్ చేసిన యూసీసీ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో ఈ యూసీసీని అమలు చేస్తారా? అన్నది చర్చనీయాంశం అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక దానిని అమలు చేయరు.పైగా మైనార్టీలు అధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో వారి మనోభావాలు దెబ్బతింటాయని కాంగ్రెస్ భావిస్తుంది. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా అదే పరిస్థితి కొనసాగవచ్చు. బీజేపీ కనుక పవర్లోకి వస్తే అప్పుడు యూసీసీ అమలు ప్రతిపాదన ముందుకు రావచ్చు. అయితే అంతకుముందు ఎన్నికల మానిఫెస్టోలో ఈ అంశం చేర్చుతారా? లేదా? అన్నది చెప్పలేం.ఇక ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వానికి ఈ అంశం ఇబ్బంది కలిగించేదే. బీజేపీతో స్నేహం తప్పనిసరి కనుక కేంద్రంలోని ఆ పార్టీ నాయకత్వం చెప్పినట్లు తెలుగుదేశం, జనసేన కూడా వినకతప్పదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఈ విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆయన గత ఐదేళ్లుగా బీజేపీ విధానాలకు వంతపాడుతున్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎటువచ్చి తెలుగుదేశం పార్టీకే కొంత సమస్య అవుతుంది. ఒకప్పుడు ఈ విషయంలో బీజేపీపై ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ తెచ్చిన త్రిబుల్ తలాఖ్ చట్టాన్నే ఈయన వ్యతిరేకించారు. 2019లో బీజేపీ మళ్లీ గెలిస్తే ముస్లింలకు రక్షణ ఉండదని విమర్శించేవారు. కాని ఆ తర్వాత పరిణామాలలో 2024లో అధికారంలోకి రావడానికి బిజెపి అవసరం తప్పనిసరి అని గుర్తించి మెల్లగా ప్లాన్ మార్చేసుకున్నారు. ఎలాగైతేనేం మళ్లీ అధికారంలోకి రాగలిగారు. తదుపరి ప్రధాని మోదీని విపరీతంగా పొగడడం ఆరంభించారు. బీజేపీకన్నా తాము మతవాదంలో తక్కువేం కాదన్న చందంగా వ్యవహరించడం ఆరంభించారు.ఇదీ చదవండి: బాబు ‘బీసీ’ బిల్డప్.. కోర్టు తీర్పుతో అట్టర్ ఫ్లాప్!గతంలో బీజేపీతో పొత్తు ఉన్నా, ముస్లింల హక్కులకు భంగం కలిగితే ఒప్పుకోబోమని అనేవారు. కాని ఇప్పుడు ఆ మాట కూడా అనలేని పరిస్థితి ఏర్పడినట్లు ఉంది. యూసీసీని అంగీకరించబోమని గతంలో చంద్రబాబు అన్నారు. కాని పల్లా శ్రీనివాసరావు ప్రస్తుతం అమిత్ షా ప్రకటనను సమర్ధించడంతో టీడీపీ యూటర్న్ తీసుకున్నట్లయింది. దేశ సమైక్యతకోసం యూసీసీని బలపరుస్తామని ఆయన అన్నారు. మరి గతంలో ఎందుకు వ్యతిరేకించారో చెప్పలేదు. దీనిని బట్టి తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాలలో ఎంత బలహీనంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. బిహార్ వంటి రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జేడీయు, లోక్ జనశక్తి పార్టీలోని రెండు వర్గాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. కాని టీడీపీ ఏపీ అధ్యక్షుడు మాత్రం పూర్తిగా సరెండర్ అయిపోయిన విధంగా మద్దతు ప్రకటించారు. టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రస్తుతానికి దీనిపై చర్చ జరగలేదని అన్నారు.వివిధ రాష్ట్రాలలో పలు రకాలు సంస్కృతులు ఉంటాయి. అలాగే ఆచారాలు ఉంటాయి. మతాలలోని అనాచారాలను సంస్కరించడం, మహిళలకు సమాన గౌరవం ఇవ్వడం వంటివి చేయడం స్వాగతించదగినవే. కాని బీజేపీ అధినేతలు ఆయా సందర్భాలలో మతాన్ని తమ రాజకీయం కోసం వాడుకుంటున్నారన్న విమర్శ ఎక్కువగా ఉంది. చివరికి ప్రధాని సైతం మత ఆధారిత ప్రసంగాలు చేస్తుంటారు. అందువల్లే వారి చిత్తశుద్దిపై సందేహాలు వస్తున్నాయి. కాకపోతే టీడీపీ వంటి పార్టీలు యూటర్న్ తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఏపీలో ఈ ప్రతిపాదన అమలు చేస్తారో చెప్పలేం కాని, అదే జరిగితే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటారు. ఏపీలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు జరిగి, తెలంగాణలో అమలు కాకపోతే ఒక విభిన్నమైన వాతావరణం ఏర్పడుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వచ్చాడు చెయ్యి ఊపాడు పోయాడు.. బాబు రేపల్లె పర్యటనపై పేర్ని నాని సెటైర్లు
-
నారా విధ్వంసం.. పిచ్చి పీక్స్.. పర్ఫామెన్స్ వీక్
-
ముగ్గురం కలవడం వల్లే.. చంద్రబాబు సీఎం: అయ్యన్న
విశాఖపట్నం జిల్లా: ‘గత సార్వత్రిక ఎన్నికల్లో ముగ్గురం కలవడం(టీడీపీ, బీజేపీ, జనసేన) వల్లే కదా ప్రభుత్వం వచ్చింది.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. మరి వచ్చే పంచాయతీ, మండల ఎలక్షన్స్‌లో కూడా వాళ్లకి టికెట్లు ఇవ్వాలి కదా.. అది ధర్మం కదా’ అని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో శుక్రవారం జరిగిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మండలంలో ఉన్న 31 పంచాయతీల్లో కొన్ని జనసేన, బీజేపీలకు ఇచ్చేస్తున్నానని చెప్పారు. మిగిలినవి తెలుగుదేశం పార్టీ వారికి ఇద్దామన్నారు. ఏ పార్టీకి ఎక్కడ ఇస్తానో ఏంటో తర్వాత తెలుస్తుందని పేర్కొన్నారు. దానికి అనుగుణంగా క్యాడర్ సిద్ధం కావాలని, ఎవరు ఉంటారో.. ఎవరు పోతారో తెలియదన్నారు. ఇదీ చదవండి: 10 నెలల కంపెనీకి.. ఫ్రీగా 40 ఎకరాల భూమి -
మరీ ఇంత బరితెగింపా?
సాక్షి, నంద్యాల: చంద్రబాబు బాబు పాలనలో కొందరు ప్రొఫెసర్లే వైద్య విద్యార్థులతో ‘కాసుల డీల్’ మాట్లాడుకొని కాపీ కొట్టించే స్థాయికి వ్యవస్థ పతనమైంది. నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రెఫరల్ (గతంలో ఫెయిల్ అయిన) విద్యార్థులతో ప్రిన్సిపాల్ సహకారంతో కొందరు ప్రొఫె సర్లు డీల్ మాట్లాడుకొని ‘కక్కుర్తి కాపీయింగ్’కు పాల్పడిన ఘటన కాలేజీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఏకంగా విద్యార్థులను పరీక్ష హాల్ నుంచి తీసుకెళ్లి మరోచోట కూర్చోబెట్టి, వారికి సెల్ఫోన్లు సమకూర్చి, ఏఐ యాప్‌లో సెర్చ్ చేయించి, జవాబులు రాయించేయడం కలకలం రేపింది. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినా చర్యలు తీసుకోకుండా హెల్త్ యూనివర్సిటీ అధికారులు వారికి అండగా నిలబడ్డారని కాలేజీ వర్గాలు మండిపడుతున్నాయి. సీసీ కెమెరాల కన్నుకప్పి ఆగస్టులో జరిగిన ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షల్లో రెగ్యులర్ విద్యార్థులతో పాటు రెఫరల్ విద్యార్థులూ పరీక్షలు రాశారు. కొందరు ప్రొఫెసర్లు.. పలుమార్లు పరీక్షల్లో తప్పిన రెఫెరల్ విద్యార్థులతో డీల్ మాట్లాడుకొన్నారు. వారికి ప్రిన్సిపాల్ కూడా సహకరించినట్లు సమాచారం. సీసీ కెమెరాల కంట పడకుండా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో రాయించారు. దీనిని ప్రత్యేక అబ్జర్వర్ ప్రొ.అనిల్ కుమార్ వ్యతిరేకించి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఆయన్ని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. సురేఖ, ప్రత్యేక అబ్జర్వర్లుగా ఉన్న ప్రొఫెసర్లు డా. రాజశేఖర్, డా. చంద్రశేఖర్ బెదిరించి నోరు మూయించినట్లు సమాచారం. కాపియింగ్ విషయం యూనివర్సిటీ అధికారుల దృష్టికి వెళ్లినా తొక్కి పెట్టారని ఆరోపణలొస్తున్నాయి. పైగా.. డీఎంఈకి సమాచారం ఇవ్వకుండా యూనివర్సిటీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక వర్సిటీలోని కొందరు అధికారుల ప్రమేయం ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. -
సిండికేట్‌కు మరో ‘ప్యాకేజీ’
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ ప్రధాన కాలువ లైనింగ్ పనులను అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని.. బోరు బావులు ఎండిపోతాయని.. తాము జీవనాధారం కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ.. రైతుల ఆందోళనను ఏమాత్రం ఖాతరు చేయకుండా హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ.. పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు ఇప్పటికే రూ.3,850 కోట్ల మేర టీడీపీ కూటమి సర్కార్ వ్యయం చేసింది. తాజాగా రూ.625.69 కోట్ల విలువైన పనులను సిండికేట్ అస్మదీయ కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. శ్రీసత్యసాయి జిల్లాలో ఎన్పీ కుంట, అన్నమయ్య జిల్లాలో గాలివీడు, పెదమండ్యం, చినమండ్యం, కేవీపల్లి మండలం అడవిపల్లి వరకూ హంద్రీ–నీవా రెండో దశ కాలువ 463 కి.మీ. నుంచి 554.175 కి.మీ. వరకూ మిగిలిపోయిన లైనింగ్, కాంక్రీట్ కట్టడాల నిర్మాణాల పనులకు జలవనరుల శాఖ శుక్రవారం టెండర్లు పిలిచింది. కాంట్రాక్టు విలువను రూ.511.66 కోట్లుగా నిర్ణయించింది. జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.113.63 కోట్ల రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. కాంట్రాక్టు విలువ రూ.625.29 కోట్లన్నమాట. పనుల పూర్తికి 18 నెలలు గడువు పెట్టింది. బిడ్ల దాఖలుకు ఈనెల 15 తుది గడువు. ఈనెల 19న ఆర్థిక బిడ్‌ను తెరిచి.. స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ ఆమోదంతో టెండర్ ఖరారు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ఐదు సంస్థలకే అర్హత...గతంలో హంద్రీ–నీవా లైనింగ్ పనులను ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్టŠట్స్, సీఎం చంద్రబాబుకు సన్నిహితులైన సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్, బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రా, కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన ఎస్సార్ కన్స్ట్రక్షన్స్, రంగరాజు ఎండీగా ఉన్న ఎన్సీసీ దక్కించుకున్నాయి. కాంట్రాక్టు ఒప్పందాన్ని తుంగలో తొక్కి.. రాతి పొర ఉన్న ప్రాంతాల్లో షార్ట్ క్రీటింగ్ (రాతి పొరకు ఇనుప జాలరీ అమర్చి సిమెంటు కాంక్రీట్ వేయడం) పద్ధతిలో కాకుండా, ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ (స్టీల్ ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ – ఇనుప మేకులతో కూడిన కాంక్రీట్ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో పిచికారి చేయడం) పద్ధతిలో మట్టి పొరకు చేశారు. అత్యంత నాసిరకంగా పనులు చేయడంతో 2025లో కాలువలో నీటి ప్రవాహానికే లైనింగ్ ఎక్కడికక్కడ దెబ్బతిని కొట్టుకుపోయింది. తాజాగా పిలిచిన టెండర్లలోనూ ఈ ఐదు సంస్థలే బిడ్లు దాఖలు చేసేలా నిబంధనలు రూపొందించారు. 2016–17 నుంచి 2025–26 వరకూ కాలువలో మట్టి తవ్వకం, గట్లు వేయడం, సిమెంటు కాంక్రీట్ లైనింగ్ చేయడం లాంటివి ఏదైనా ఒక ఏడాదిలో రూ.170.554 కోట్ల విలువైనవి పూర్తి చేసి ఉండాలని నిబంధన పెట్టారు. గత పదేళ్లలో ఏదైన ఒక ఏడాదిలో 14,84,552 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం, గట్లు వేసే పని.. 38,054 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్(పీసీసీ/వీఆర్‌సీసీ/ఆర్సీసీ), సిమెంట్ కాంక్రీట్ లైనింగ్/షార్ట్ క్రీటింగ్/ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ పద్ధతిలో 5,05,263 చదరపు మీటర్ల పని చేసి ఉండాలని నిబంధన పెట్టారు. వీటిని పరిశీలిస్తే.. ఆ ఐదు సంస్థల్లో ఒక సంస్థకు పనులు కట్టబెట్టడానికేనన్నది స్పష్టమవుతోందని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎస్ఎస్ఆర్ తుంగలోకి...బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజినీర్స్ (బీవోసీఈ) ఖరారు చేసి, ప్రభుత్వం ఆమోదించిన ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం మట్టి తవ్వకం పనులకు క్యూబిక్ మీటర్‌కు రూ.123.75.. కాలువ గట్లు (ఎంబాక్‌మెంట్) పనులకు క్యూబిక్ మీటర్‌కు 195.57 చెల్లించాలి. నిజానికి రెండో దశ ప్రధాన కాలువ 463 నుంచి 554.175 కిమీ వరకూ తవ్వకం పనులు 95 శాతం ఇప్పటికే పూర్తయ్యాయి. కానీ.. 44,53,657 క్యూబిక్ మీటర్ల మట్టి పని, కాలువ గట్ల పని మిగిలి ఉన్నట్లు చూపారు. సగటున క్యూబిక్ మీటర్‌కు రూ.195.57లు చొప్పున వేసుకున్నా ఈ పనులకు రూ.87.10 కోట్లు వ్యయం అవుతుంది. కానీ.. ఆ పనులకు సగటున క్యూబిక్ మీటర్‌కు రూ.396.60 చొప్పున లెక్కగట్టి ఏకంగా రూ.176.62 కోట్లుగా టెండర్లో పేర్కొనడం గమనార్హం. అంటే.. మట్టి పనికి క్యూబిక్ మీటర్‌కు సగటున రూ.201.03 పెంచేసినట్లు స్పష్టమవుతోంది. తద్వారా మట్టి పనుల రూపంలోనే రూ.89.52 కోట్ల మేర అంచనా వ్యయాన్ని పెంచేశారని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఇక కాంక్రీట్ కట్టడాలు, సిమెంటు కాంక్రీట్ లైనింగ్, షార్ట్ క్రీటింగ్, ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ పనుల అంచనా వ్యయాన్ని కూడా ఇదే రీతిలో పెంచేశారు. గతంలోలానే సిండికేటు కాంట్రాక్టు సంస్థల్లో ఒక సంస్థకు అధిక ధరలకు పనులు కట్టబెట్టి.. అత్యంత నాసిరకంగా చేపట్టి నీకింత నాకింత అంటూ ప్రజాధనాన్ని దోచుకుతినేందుకు ముఖ్యనేత సిద్ధమయ్యారని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. -
10 నెలల కంపెనీకి.. ఫ్రీగా 40 ఎకరాల భూమి
సాక్షి, అమరావతి: ఆ కంపెనీ పుట్టి పట్టుమని పది నెలలే అయింది. దాని ప్రమోటర్లకు ఫుడ్ ప్రాసెసింగ్లోగానీ ఫుడ్ పార్కుల నిర్మాణంలోగానీ ఎలాంటి అనుభవంలేదు. రూ.9 లక్షలతో కంపెనీ పెట్టి రూ.1,388.14 కోట్లతో ఫుడ్ పార్కును ఏర్పాటుచేస్తున్నామంటూ దరఖాస్తు చేసుకున్నారో లేదో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద 40 ఎకరాల భూమిని ఉచితంగా ధారాదత్తం చేసేసింది. అంతేకాదు.. పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద రూ.592.22 కోట్లు వెనక్కి ఇచ్చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉర్సా.. ఇండిచిప్.. అజాద్ మొబిలిటీ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రేవాక్స్ అగ్రిటెక్ ఇండియాకి భారీ ప్రయోజనాలను చేకూరుస్తూ ఉత్తర్వులు జారీచేసింది.ఎలాంటి అనుభవం లేకపోయినా..విశాఖ కేంద్రంగా 2025 నవంబర్ 20న రూ.9 లక్షల మూలధనంతో రేవాక్స్ అగ్రిటెక్ ఇండియా పేరిట దేవిప్రసాద్ ముల్లూరు, కీర్తి వినాయక్ కంభంలు కలిసి కంపెనీని ఏర్పాటుచేశారు. వీరిద్దరికీ అప్పటివరకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోగానీ, ఫుడ్ పార్కులు, ఇతర నిర్మాణ రంగ కార్యకలాపాల్లోగానీ ఎలాంటి అనుభవంలేదు. విశాఖలో ఉన్న వీరు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కైగల్ గ్రామంలో ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ)కి చెందిన 40.50 ఎకరాల్లో రూ.1,388.14 కోట్లతో ఫుడ్‌పార్క్ ఏర్పాటుచేస్తామంటూ ప్రతిపాదన పంపగానే 99 పైసలు కూడా తీసుకోకుండానే ఉచితంగా భూమి కేటాయించడమే కాక భారీ రాయితీలు ఇవ్వడంపై అధికారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. 2025 నవంబర్ 20న రేవాక్స్ అగ్రిటెక్ ఇండియా కంపెనీ రిజిస్టర్ అయినట్లు స్పష్టం చేస్తున్న కాపీ ఈ ఇద్దరు డైరెక్టర్లలో దేవిప్రసాద్ అనే వ్యక్తికి ఇంతవరకు వ్యాపార రంగంలో ఎలాంటి అనుభవంలేదు. మరో డైరెక్టర్ కీర్తి వినాయక్‌కు మాత్రం గ్లౌజులు వంటి వైద్య సంబంధిత వస్తువులను ఈజీఐఎస్ గ్లోవ్స్ పేరిట ఉత్పత్తి చేసిన అనుభవం ఉంది. అలాగే, పెటోరస్ కెమికల్స్‌తో పాటు ఈ ఏడాది ఏప్రిల్‌లో సత్రా లాబ్స్ ఇండియా పేరిట మరో కంపెనీని స్థాపించారు. ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అనుభవంలేని వారికి పాలసీకి విరుద్ధంగా> ఉచితంగా భూమిని ఇవ్వడం వెనుక ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న వారు చక్రం తిప్పారంటూ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.రేవాక్స్ అగ్రిటెక్ ఇండియా కంపెనీకి చిత్తూరు జిల్లాలో ఉచితంగా 40.5 ఎకరాలు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 259 ప్రోత్సాహకాల రూపంలో భారీ మొత్తం వెనక్కి..పండ్ల రసాలు, కెచప్‌లు, జ్యూస్, జామ్‌లు, ఇతర స్పైసెస్ పదార్థాలు తయారుచేసే విధంగా రూ.1,388.14 కోట్ల పెట్టుబడితో ఫుడ్ పార్కును ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వానికి రేవాక్స్ ప్రతిపాదనలను పంపింది. వీటిని పరిశీలించిన తర్వాత వాస్తవ పెట్టుబడి విలువలో రూ.592.22 కోట్ల ప్రోత్సాహకాల రూపంలో తిరిగి వెనక్కి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో క్యాపిటల్ సబ్సిడీ రూపంలో రూ.272.64 కోట్లు, విద్యుత్ సబ్సిడీల రూపంలో రూ.37.20 కోట్లు, జీఎస్టీ మినహాయింపుల కింద రూ.280.83 కోట్లు ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసి ఏప్రిల్, 2028 నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా అన్ని విభాగాల అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. -
రైతులకు కేంద్రం చేయూత
సాక్షి, మదనపల్లె: రైతాంగానికి కేంద్రప్రభుత్వం వివిధ పథకాల ద్వారా చేయూత ఇస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. స్వదేశీ–స్వరాజ్యం అన్న గాందీజీ, జై జవాన్– జైకిసాన్ అని పిలుపునిచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె బీకేపల్లి గ్రామంలో నిర్వహించిన సభలో రాయలసీమ హార్టికల్చర్ హబ్, రిలయన్స్ సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శిలా ఫలకాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ బటన్ నొక్కి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌ను ఏర్పాటు చేస్తున్న రిలయన్స్ సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మాదిరిగా దేశానికి ఉపయోగపడేలా రైతులకు సహకారం అందిస్తోందని తెలిపారు. ప్రధాని మోదీ రైతాంగానికి ఎరువుల కొరత లేకుండా చూస్తున్నారని తెలిపారు. యూరియా బస్తా ధర అంతర్జాతీయంగా రూ.3వేలు ఉంటే రైతులపై భారం పడకుండా రూ.300కే అందిస్తున్నామని, బస్తాకు కేంద్రం రూ.2,700 సబ్సిడీని భరిస్తోందన్నారు. వాతావరణాన్ని తట్టుకునేలా కొత్త వంగడాలు తెచ్చామన్నారు. మదనపల్లె పర్యటనలో మొక్కలు నాటి నీరుపోస్తున్న నిర్మలా సీతారామన్, చంద్రబాబు, అనంత్ అంబానీ, పవన్ కళ్యాణ్ గోబర్ధన్ విధానం ద్వారా బయోగ్యాస్, పీఎం కుసుమ్ యోజన ద్వారా సోలార్ పంపుసెట్లు ఇస్తున్నామన్నారు. రైతులకు పంట నష్టం రాకుండా కిసాన్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఆక్వా రైతులకు, పశువుల పెంపకానికి సంయుక్తంగా పథకాలు అందిస్తున్న ట్టు తెలిపారు. కాగా నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తుండగా టీడీపీ కూటమి శ్రేణులు తీవ్ర గందరగోళం సృష్టించారు. ‘ఒక్క నిమిషం నా మాట వినండి’ అంటూ ఆమె పదే పదే వేడుకొన్నా కూటమి శ్రేణులు అల్లరి మానకపోవడంతో ఆమె తీవ్ర అసహనానికి గురై రెండు చేతులూ జోడించారు. వాటర్‌మేన్ అంటుంటే ఆనందంగా ఉంది: సీఎం రాష్ట్రంలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను రానున్న మూడేళ్లలో పూర్తి చేయడంతోపాటు పోలవరం పూర్తి చేసి ప్రధాని ద్వారా జాతికి అంకితమిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. మదనపల్లెలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ) ఉద్యాన రంగానికి కీలకం అవుతుందన్నారు. గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌తో మరో రూ.లక్ష కోట్ల జీడీపీ పెరిగే అవకాశం ఉందన్నారు. వాటర్ మాన్ అంటుంటే తన మనసుకు ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రాయలసీమలో గత రెండేళ్లలో రూ.8 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టినట్టు ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అన్నారు. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రులు నారా లోకేశ్, కింజరాపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో నూతన మార్పులకు వేదిక...అనంత్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నదాతల ఆదాయాన్ని పెంచుతూ, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో మదనపల్లెలో ఏర్పాటు కానున్న ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ (ఐఎస్ఏ) భారత వ్యవసాయ రంగంలో కీలక మైలురాయిగా నిలవనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ పేర్కొన్నారు. మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (రిలయన్స్ భాగస్వామ్యంతో) శంకుస్థాపన కార్యక్రమం అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల సంప్రదాయ అనుభవంతో అనుసంధానించి, వ్యవసాయ రంగంలో నూతన మార్పులకు ఈ విద్యాసంస్థ వేదిక కానుందని తెలిపారు. మదనపల్లెలో అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఈ విద్యాసంస్థను ఏర్పాటు చేయడం చారిత్రాత్మక పరిణామమని అభివర్ణించారు. సుమారు పాతికేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ఏర్పాటును ప్రస్తావిస్తూ ఇప్పుడు భారతీయ రైతులకు కూడా అదే తరహాలో ప్రత్యేక విద్యాసంస్థ అందుబాటులోకి రావడం విశేషమన్నారు. ప్రపంచానికి భారత్ అనేకమంది ప్రతిభావంతులైన సీఈఓలను అందించిందని, అదే స్ఫూర్తితో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ రైతులను తమ సొంత పొలాలకు సీఈఓలుగా తీర్చిదిద్దే దిశగా పనిచేస్తుందని అన్నారు. వ్యవసాయాన్ని కేవలం సంప్రదాయ వృత్తిగా కాకుండా, ఆధునిక సాంకేతికత, సమర్థవంతమైన నిర్వహణ, మార్కెట్ అవగాహనతో కూడిన లాభదాయక రంగంగా అభివృద్ధి చేయడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశమని వివరించారు.జై జవాన్.. జై కిసాన్.. జై విజ్ఞాన్.. జై అనుసంధాన్లాల్ బహదూర్ శాస్త్రి పిలుపు ఇచ్చిన జై జవాన్.. జై కిసాన్ నినాదానికి, అటల్ బిహారీ వాజ్‌పేయి జై విజ్ఞాన్‌ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై అనుసంధాన్‌ను జోడించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ నాలుగు నినాదాల స్ఫూర్తిని ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ పనిచేయనుందని పేర్కొన్నారు.వ్యవసాయాన్ని గర్వంగా ఎంచుకునే వృత్తిగా మారుద్దాం.. తాను ఒక పశు సేవకుడిని అనంత్ అంబానీ తెలిపారు. మన రైతులు పశుసంపద విలువను అర్థం చేసుకుంటారన్నారు. జామ్‌నగర్‌లోని తమ ’వంతార’ కేంద్రం హై–టెక్ పశుసంవర్ధక, వన్యప్రాణి సంరక్షణ సాంకేతికతను ఇక్కడ కూడా అమలు చేస్తామని చెప్పారు. వ్యవసాయాన్ని యువత గర్వంగా ఎంచుకునే వృత్తిగా మారుద్దాం.. వారికి నైపుణ్యాలు, సాంకేతికత కల్పిస్తే, వారు తమ గ్రామాల్లోనే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకుంటారని అన్నారు.వ్యవసాయంలో ఏఐ,డ్రోన్లు, రోబోటిక్స్ ఈ విద్యాసంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డ్రోన్లు, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అనంత్ అంబానీ వెల్లడించారు. పంటలకు చీడపీడలు సోకే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి రైతులను అప్రమత్తం చేసే పరికరాలు, పంట ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ నీరు, పోషకాలను సమర్థంగా వినియోగించుకునేలా సూచించే డ్రోన్లు అభివృద్ధి చేసే దిశగా యువ ప్రతిభావంతులు పనిచేయనున్నారని తెలిపారు. కష్టతరమైన వ్యవసాయ పనులను సులభతరం చేసి, పంట నష్టాలను తగ్గించేందుకు రోబోటిక్స్ సాంకేతికత ఉపయోగపడుతుందన్నారు. ఈ పాఠశాల శిక్షణ మాడ్యూళ్లను గ్రామీణ ప్రాంతాల్లోని లక్షల మంది రైతులకు వర్చువల్ క్లాస్‌రూమ్‌ల ద్వారా, వారి స్వంత భాషల్లో అందిస్తామన్నారు. జియో అభివృద్ధి చేసిన జియో కృషి ప్లాట్‌ఫారమ్ ద్వారా రైతులకు ప్రయోజనకరమైన ఉత్పత్తులను, జామ్‌నగర్‌లోని ఆధునిక బయో–ఎనర్జీ ఆర్అండ్డీ కేంద్రం జ్ఞానాన్ని పంచుకుంటామన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారి, ప్రతి రైతుకు సమాజంలో గౌరవం, ఆర్థిక ప్రయోజనం లభించినప్పుడే మహాత్మా గాంధీ ఆశయాలైన సర్వోదయ, అంత్యోదయలకు నిజమైన సార్థకత చేకూరుతుందన్నారు. భారతదేశం గ్రామాల్లోనే జీవిస్తుందన్న గాంధీజీ సందేశాన్ని గుర్తుచేస్తూ.. గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం దేశ ప్రగతికి పునాదులని స్పష్టం చేశారు. -
సీమను ఆయనే ఉద్ధరించారంట.. బాబు కాకమ్మ కథలు!
సాక్షి, అమరావతి : బడ్జెట్లో రూపాయి కేటాయించకుండానే.. రూ.లక్ష కోట్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతానంటూ చంద్రబాబు మాటల విన్యాసాలు చూసి రాయలసీమ వాసులు నివ్వెరపోతున్నారు. అబ్రకదబ్ర.. చూమంత్రకాళీ అంటూ ఇంద్రజాలికుల మాదిరిగా పైసాలేకుండానే మదనపల్లిలో శంకుస్థాపన హంగామా చేసిన చంద్రబాబు కళ్లార్పకుండా నిస్సిగ్గుగా మాట్లాడిన తీరుచూసి రాష్ట్ర ప్రజలు నోరెళ్లబెడుతున్నారు.ఈ రూ.లక్ష కోట్ల ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెడుతుందో చెప్పని చంద్రబాబు.. కేంద్రం రూ.40 వేల కోట్లు పెడుతుందని, ప్రైవేటు రంగం నుంచి రూ.60 వేల కోట్లు పెట్టుబడులొస్తున్నాయని గొప్పలు చెప్పారు. కానీ, ఇదే సభలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తన ప్రసంగంలో ఎక్కడా ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.40 వేల కోట్లు ఇస్తున్నట్లుగా చెప్పకపోవడం కొసమెరుపు. దీంతో.. చంద్రబాబు ఏ స్థాయిలో ప్రజలను మభ్యపెడుతున్నారో ఇట్టే అర్ధమవుతుంది. ఈ అసత్య హరిశ్చంద్రుడు ఇంకా ఏఏ అబద్ధాలు చెప్పారంటే.. రాయలసీమను ఉద్యాన సీమగా తీర్చిదిద్దింది ఆయనేనట!.. రాయలసీమను ఉద్యాన సీమగా మార్చేందుకు ఆద్యుడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్. ఈ విషయం సీమలోని ప్రతీ ఒక్కరికీ తెలుసు. ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్తే ఈరోజు రాయలసీమలో ఉద్యాన పంటల సాగుకు ఊతమిచ్చింది. రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ బోర్లలో మూడొంతులు రాయలసీమలోనే ఉన్నాయి. 90 శాతం సబ్సిడీపై బిందు, తుంపర పరికరాల ద్వారా చిన్న, సన్నకారు రైతులకు సూక్ష్మ, సాగునీటి వ్యవస్థతో ఉద్యాన పంటలకు ఊతమిచ్చిందీ వైఎస్సారే. ఈ వాస్తవాలను కప్పిపుచ్చుతూ ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్‌తో కరువు సీమ రూపురేఖలు మార్చేశానంటూ చంద్రబాబు తెగ డబ్బా కొట్టుకున్నారు. పైగా.. మైక్రో ఇరిగేషన్ పాలసీని తీసుకొచ్చానంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లెవేశారు. ‘సీమ’లో సాగునీటి ప్రాజెక్టులన్నీ ఆయన గొప్పతనమేనట.. ‘ఎన్టీఆర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాం. రూ.3,500 కోట్లతో అతిపెద్ద లిఫ్ట్ హంద్రీ–నీవా ద్వారా కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లాం. వెలిగొండ ఫేజ్–1 ప్రారంభించాం. హంద్రీ–నీవా నుంచి నీళ్లులేకపోతే మదనపల్లి పూర్తిగా ఎప్పుడో వలస పోయేది’.. అంటూ చంద్రబాబు నోటికొచ్చినట్లు పచ్చి అబద్ధాలు చెప్పుకొచ్చారు. వాస్తవానికి.. జలయజ్ఞం కింద పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు తీసుకెళ్లడమే కాదు.. గాలేరు–నగరిలో అంతర్భాగమైన గోరుకల్లు, అవుకు, గండికోట, మైలవరం, సర్వారాయ సాగర్, వామికొండ రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు, హంద్రీ–నీవాలో జీడిపల్లితో పాటు మరో ఆరు రిజర్వాయర్లు నిర్మించి సీమను సస్యశ్యామలం చేసేందుకు బాటలు వేసిన ఘనత డాక్టర్ వైఎస్సార్‌దే. అయినాసరే చంద్రబాబు ఎలాంటి సిగ్గులేకుండా సీమలో ప్రాజెక్టులన్నీ తమ హయాంలోనే చేపట్టి పూర్తిచేసినట్లు చెప్పుకొచ్చారు. సీమ రూపురేఖలు మార్చేశారంట.. ఇక తలసరి ఆదాయంలో రాయలసీమ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని చంద్రబాబు మరో ఘోరమైన అబద్ధం చెప్పారు. పైగా.. ఒకప్పుడు సీమలో ఎడారి ఛాయలుండేవని, కరువుతో పెద్ద సంఖ్యలో వలస పోతుండేవారని, పంటలకు నీళ్లుండేవి కావని, పశువులకు మేత ఉండేది కాదని.. కూలీలకు ఉపాధి దొరికేది కాదని చెబుతూ.. ఇప్పుడు తన కృషివల్లే రాయలసీమ రూపురేఖలు మారిపోయాయంటూ నోటికొచ్చినట్లు డబ్బాకొట్టుకున్నారు. నిజంగా.. తలసరి ఆదాయంలో నెం.1గా ఉంటే, కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమను వదిలి ఈ ఏడాది లక్షలాది కుటుంబాలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు ఎందుకు వలస పోతున్నారంటూ సీమ వాసులు ప్రశ్నిస్తున్నారు. -
సర్కారుపై ఉద్యోగుల సత్యాగ్రహం
చంద్రబాబు సర్కారుపై ఉద్యోగులు నిరసన గళమెత్తారు. గాంధీ జయంతి రోజున రోడ్డెక్కి శాంతియుతంగా సత్యాగ్రహం చేశారు. గాంధేయమే గాండీవమని నినదించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని గర్జించారు. ఐఆర్, పీఆర్సీ, ఐదు డీఏలు, 40వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు మాటేమిటని నిలదీశారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, జీవో నంబర్ 11 రద్దు తదితర అంశాలపై ధ్వజమెత్తారు. సమస్యలపై జాతిపిత విగ్రహాలకు విన్నపాలు నివేదించారు. సర్కారుకు సద్బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు. – సాక్షి, అమరావతిమహాత్మా.. మా మొర వినుమా.. ఓ మహాత్మ మా మొర వినుమా అంటూ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు శుక్రవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా గ్రామ, వార్డు ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా గాంధీ విగ్రహాల ఎదుట గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసనలు తెలిపారు. ‘ప్రజలకు సేవ చేయాల్సిన మేమే మా హక్కుల కోసం రోడ్డెక్కాల్సి వచ్చింది. మా సమస్యలు వినాలని కోరుతున్నాం’ అంటూ గాంధీ విగ్రహాల ఎదుట వినతిపత్రాలు ఉంచారు. ఈ పాలకుల మనసులు మార్చి మా కష్టాలు కడతేర్చు జాతిపితా అంటూ వేడుకున్నారు. గాం«దీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల గుమ్మం వద్దకు సేవలందిస్తున్న తమపట్ల వివక్ష చూపడం సరికాదన్నారు. ఒకవైపు ప్రజలకు ప్రభుత్వ సేవలు అందిస్తూ.. మరోవైపు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. తమపట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తే కేసులా? తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ నిర్వహించిన ‘చలో విజయవాడ’లో పాల్గొన్న ఉద్యోగులను సస్పెండ్ చేయడం, 46 మందిపై కేసులు నమోదు చేయడం ప్రభుత్వ వేధింపులకు పరాకాష్ట అని ఐక్యవేదిక నేతలు దుర్గం మధులత, కేవీ రాజేష్‌బాబు మండిపడ్డారు. స్వాతంత్య్ర సాధన కోసం గాం«దీజీ ఎంచుకున్న శాంతియుత మార్గంలోనే నిరసనలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వంలో కదలిక రావాలని, తమ డిమాండ్ల పరిష్కారం విషయంలో చిత్తశుద్ధితో ముందుకు రావాలన్నారు. గతంలో ఉపాధ్యాయులకు ఇచ్చినట్లుగానే సచివాలయ ఉద్యోగులకు కూడా రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరుచేయాలని, ప్రొబేషన్ ఆలస్యమైన తొమ్మిది నెలల కాలానికి చెందిన బకాయిలు చెల్లించడంతో పాటు అదనంగా వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు కనీస వేతన పరిరక్షణ కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు తాము ఇదే రీతిలో శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఆందోళనల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో పాటు ఏపీ మహిళా పోలీసు ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, వ్యవసాయ, ఉద్యాన, పశు సవంర్థక, మత్స్య సహాయకుల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ నిరసనలకు నాయకత్వం వహించారు. డీఏ బకాయిల కోసం డిమాండ్ డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీస్ఈఏ)పోరాటానికి దిగింది. గాంధీ జయంతి రోజైన శుక్రవారం విజయవాడ ధర్నా చౌక్‌లో సీపీఎస్ ఉద్యోగులు నిరాహార దీక్ష చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు బాజీ పఠాన్, ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, ఇతర నాయకులు దీక్షలో కూర్చున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినదించారు. 48 గంటల నిరశన దీక్షకు సిద్ధపడిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం భారీ వర్షం కురిసి టెంట్లు చెల్లాచెదురు కావడంతో దీక్షాపరులతో బలవంతంగా దీక్ష విరమింపజేశారు. సీపీఎస్ ఉద్యోగుల ఉద్యమానికి పలు సంఘాలు మద్దతు తెలిపాయి. జాతిపితా.. సర్కారుకు సద్బుద్ధి ప్రసాదించు ఇచి్చన హామీలు అమలు చేయని చంద్రబాబు సర్కారుపై అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. గాంధీజీ విగ్రహాల వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హామీలు అమలుచేసేలా బాబు ప్రభుత్వానికి సద్బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు. అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న తమకు కనీస వేతనాలు పెంచకపోవడం ఎంతవరకు సమంజసమని నిరసించారు. తమకు ప్రభుత్వం సామాజిక పెన్షన్లు, సంక్షేమ పథకాలు కూడా అందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సామాజిక పింఛన్లు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, కనీస వేతనాలు అందించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సర్కారు స్పందించకుంటే గాంధేయమార్గంలో మహోద్యమం చేపడతామని హెచ్చరించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ మూడు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఐదో రోజుకు చేరిన ‘పార్ట్‌టైమ్ ఉద్యోగుల’ మహా ధర్నాపెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ వర్షంలోనూ కొనసాగిన నిరసన మధురానగర్(విజయవాడసెంట్రల్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థలో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ టీచర్లు, లెక్చరర్లు, సిబ్బంది విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహిస్తున్న మహాధర్నా శుక్రవారం ఐదో రోజుకు చేరింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉద్యోగులు మహా ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్ట్‌టైమ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారుస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి మాట తప్పడంతోనే ఈ మహా ధర్నా చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఐదు రోజులుగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం దారుణమన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన ధర్నాకు న్యాయవాది, జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రామకృష్ణ, విశ్వ కళా మండలి రాష్ట్ర అధ్యక్షుడు కుటుంబరావు, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఉమామహేశ్వరరావు తదితరులు మద్దతు తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి విశాఖలో సత్యాగ్రహ దీక్ష బీచ్‌రోడ్డు: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వందలాది మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు ఏపీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ రాష్ట్ర గౌరవ చైర్మన్ ఏవీ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడంపై చంద్రబాబు ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే రాష్ట్రంలోని మూడు లక్షల మంది ఉద్యోగులు అసెంబ్లీకి తరలివస్తారని హెచ్చరించారు.ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఉద్యోగులకు కనీసం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జేఏసీ రాష్ట్ర చైర్మన్ కాంతారావు (నాని) మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో ఉద్యోగులతో సదస్సులు నిర్వహిస్తామని, అక్టోబర్ 4న రాజమహేంద్రవరంలో ‘గోదావరి జిల్లాల గర్జన’ నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీకాస్ ఉద్యోగుల జేఏసీ ప్రధాన కార్యదర్శి పి.వెంకటసుబ్బయ్య, సమగ్ర శిక్ష కేజీబీవీ రాష్ట్ర నాయకులు కె. విజయగౌరి, ఎన్హెచ్ఎం రాష్ట్ర జేఏసీ చైర్మన్ డి.దయాని, మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ నాయకుడు రాజు, అనకాపల్లి జిల్లా జేఏసీ నాయకుడు వీవీ శ్రీనివాసరావు, విశాఖ జిల్లా జేఏసీ నాయకుడు పి.మణి, సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
డ్యూయల్ డ్రామా!
సాక్షి, అమరావతి: అపరిచితుడు సినిమాలో హీరో కాసేపు రెమోలా.. కాసేపు రామాచారిలా.. వ్యవహరిస్తూ పోలీసు అధికారులను ముప్పుతిప్పలు పెట్టడం చూశాం. అచ్చు అలానే బీసీ రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అపరిచితుడి అవతారం చూసి అధికారులు విస్తుపోతున్నారు. చెల్లవని తెలిసీ బీసీలను బుట్టలో వేయడానికి రిజర్వేషన్ల కోసం జీవోలిస్తారు.. దానిపై కోర్టు విచారణ జరుపుతుండగానే అధికారులను ఎన్నికలకు సన్నాహాలు చేయమంటారు.. కలెక్టర్ల మీటింగులు పెట్టి ఎన్నికల ఏర్పాట్లపై గంటల తరబడి చర్చిస్తారు. కోర్టు కొట్టేయగానే మొసలి కన్నీరు కారుస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు చేద్దామని బీసీలకు గంభీరంగా చెబుతారు.ఓహో నిజంగానే సీఎంగారు సుప్రీంకోర్టుతో కొట్లాడతారు కాబోలనుకుని అధికారులు అనుకుంటే.. కోర్టులెలాగూ కొట్టేస్తాయి.. పాత రిజర్వేషన్ ప్రకారమే సీట్లు ఖరారు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని అధికారులకు హకుం జారీ చేస్తారు.. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ ముఖ్యనేతలకూ సంకేతాలిస్తారు.. బీసీలతో అలా.. అధికారులతో ఇలా.. చంద్రబాబు డ్యూయల్ డ్రామా నడిపిస్తున్నారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో మాట్లాడి పార్లమెంటులో చట్టసవరణ కోసం పట్టుబట్టేవారు. టీడీపీ బలంపై కేంద్రం ఆధారపడి నడుస్తున్నందున ఇపుడు చంద్రబాబు తలుచుకుంటే అది చాలా సులువు. కానీ బీసీలకు న్యాయం చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదనేది సుస్పష్టం.ఇంకా ఆగని బాబు నాటకాలు..బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు మొదలెట్టిన డ్రామా రక్తికట్టకపోవడంతో తన నట కౌశలాన్ని మరింత పెంచి ప్రదర్శిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది కోసం జీఓలు ఇచ్చి భంగపడ్డారు. ఒకవైపు హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తామని చెబుతూనే.. మరోవైపు శనివారంలోపు స్థానిక సంస్థలకు 34శాతం రిజర్వేషన్లు ఖరారు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఆయన డ్రామాలకు పరాకాష్ట. ఇప్పటికే రిజర్వేషన్ల హామీ.. కమిషన్ ఏర్పాటు.. జీఓలు వంటి విషయాల్లో బీసీను నమ్మించి వెన్నుపోటు పొడిచారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేవనే కారణంతో చంద్రబాబు ఇచ్చిన రెండు జీఓలను హైకోర్టు కొటేసిన విషయం విదితమే. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తామంటూ చంద్రబాబు చెప్పడంతోపాటు మంత్రులతోను చెప్పిస్తున్నారు. వాస్తవానికి రిజర్వేషన్లు 50శాతం మించకూడదనే సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని తెలిసినా చంద్రబాబు డ్రామా ఆడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మొత్తం రిజర్వేషన్లు 61శాతం అవుతాయని, సుప్రీం కోర్టుకు వెళ్లినా చెల్లదని సామాన్యులకు సైతం అర్థమవుతోంది. అయినప్పటికీ తానేదో బీసీల కోసం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ.. డ్రామాను రక్తికట్టించేందుకు బాబు తెగ తాపత్రయ పడుతున్నారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి రిజర్వేషన్ పరిమితి పెంచుకునేలా చట్ట సవరణ చేయాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.బీసీ రిజర్వేషన్లపై మొదటి నుంచి నాటకాలే..ఎన్నికల ముందు హామీల్వివ్వడం.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోవడం చంద్రబాబు నైజం. హామీలను అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు డ్రామాలు ఆడటంలో ఆయనకు ఎవరూ సాటిరారు. బీసీ రిజర్వేషన్ల అమలులోను చంద్రబాబు అనేక డ్రామాలాడుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలుకు చర్యలు తీసుకున్నట్టుగా కనిపించడానికి రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కానీ హైకోర్టుకు సమర్పించిన వాదనలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా రాష్ట్రంలో బీసీల జనాభా 50.42 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. 34 శాతం రిజర్వేషన్ నిర్ణయానికి ఈ సమకాలీన గణాంకాలతోపాటు మిశ్రా కమిషన్ అధ్యయనం కూడా ఆధారమని తెలిపింది. ఇదే సమయంలో మిశ్రా కమిషన్ నివేదికను ప్రభుత్వం ఇంకా పరిశీలిస్తోందని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలపడం గమనార్హం. అలాంటప్పుడు ఆ నివేదికలోని గణాంకాలను ఆధారంగా చేసుకుని 34 శాతం బీసీ రిజర్వేషన్ ఎలా నిర్ణయించారనే ప్రశ్న ఉత్పన్నమైంది. నివేదిక ఇంకా తుది ఆమోదం పొందకపోతే దాని ఆధారంగా ప్రభుత్వం జీవోలు ఎలా జారీ చేసిందని ధర్మాసనం ప్రశ్నించింది. నివేదికను బహిరంగపరచకపోవడానికి కారణమేంటని కూడా కోర్టు ప్రశ్నించడం గమనార్హం.నాడు టీడీపీ నేతతో కేసు వేయించిన చంద్రబాబు..నిజానికి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు టీడీపీ నేతతోనే చంద్రబాబు హైకోర్టులో కేసు వేయించారు. బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్ జగన్ జీఓ ఇవ్వడంతో టీడీపీకి చెందిన బిర్రు ప్రతాపరెడ్డితో చంద్రబాబు హైకోర్టులో కేసు వేయించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యహరించిన ప్రతాపరెడ్డి 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఓ నామినేటెడ్ పోస్టు కూడా అనుభవించారు. బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఓసీలకు అవకాశాలు తగ్గిపోతాయని, ఇది సుప్రీం కోర్టు విధించిన 50శాతం కోటాకు విరుద్ధమని ప్రతాపరెడ్డి చేత చంద్రబాబు హైకోర్టులో కేసు వేయించారు. దీన్ని విచారించిన హైకోర్టు వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీఓను రద్దు చేస్తూ 2020 మార్చి 2న తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే 2021లో నిర్వహించిన గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లోను బీసీ అభ్యర్థులను నిలబెట్టి 34శాతం రిజర్వేషన్లకు మించి పదవులు కట్టబెట్టిన వైఎస్ జగన్.. అలా బీసీల పట్ల తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.బీసీలను మోసం చేయడానికే.. బాబు డ్రామాలు..!సుప్రీం కోర్టు మార్గదర్శకాలు.. 2020లో హైకోర్టు తీర్పు అన్నీ తెలిసిన చంద్రబాబు మళ్లీ బీసీ రిజర్వేషన్ల పేరుతో హంగామా చేయడం మోసం చేయడానికేనని బీసీ నేతలు మండిపడుతున్నారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో మూడు కీలక దశలు(ట్రిపుల్ టెస్ట్)ను నిర్ధేశించింది. బీసీల స్థానిక వెనుకబాటుతనంపై సమకాలీన, కఠినమైన అనుభావిక అధ్యయనం చేసే ప్రత్యేక కమిషన్ ఉండాలి. కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఏ స్థానిక సంస్థలో ఎంత రిజర్వేషన్ అవసరమో నిర్ణయించాలి. ఒకే శాతం మొత్తంగా వర్తింపజేయడం కాకుండా స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలన్నదే సుప్రీంకోర్టు నిర్దేశించిన విధానం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. ఈ మూడు దశలను పూర్తి చేసిన తర్వాతే బీసీ రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇవన్నీ తెల్సినా.. తెలియనట్టు నటిస్తూ.. కమిషన్ వేసిన చంద్రబాబు దాన్ని గడువును సుదీర్ఘంగా పొడిగించి చివరకు పూర్తిస్థాయి నివేదిక ఆమోదించకుండానే జీఓలు ఇచ్చి న్యాయపరంగా నిలబడకుండా చేసి బీసీలకు వెన్నుపోటు పొడిచారు. ఈ ప్రశ్నలకు బదులేది బాబూ..» 34 శాతం బీసీ రిజర్వేషన్‌కు ఖచ్చితమైన గణాంక ప్రాతిపదికపై స్పష్టత ఏది?» రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ పూర్తి నివేదికను ప్రభుత్వం ఎందుకు బహిరంగపరచలేదు?» నివేదిక ఇంకా ప్రభుత్వ పరిశీలనలో ఉంటే దాని ఆధారంగా 34 శాతం నిర్ణయం ఎలా తీసుకున్నారు?» యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలోని బీసీ గణాంకాలను పూర్తిగా ఎందుకు ప్రజల్లోకి తీసుకురాలేదు?» మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటితే దానికి ప్రభుత్వం చూపుతున్న రాజ్యాంగ, న్యాయపరమైన ఆధారం ఏమిటి?» 2020లో 34 శాతం బీసీ రిజర్వేషన్‌పై వచ్చిన కోర్టు తీర్పుల నేపథ్యంలో ప్రస్తుత విధానంలో కొత్తగా వచ్చిన చట్టపరమైన రక్షణ ఏమిటి?కాపులను ఇలానే దగా చేసిన చంద్రబాబు..రిజర్వేషన్ల పేరుతో ఇప్పుడు బీసీలను మోసం చేసిన చంద్రబాబు 2014 ఎన్నికల్లో కాపు రిజర్వేషన్ల అమలుకు హామీ ఇచ్చి దగా చేసిన విషయాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. 2014లో కాపులకు రిజర్వేషన్ అమలు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. హామీ అమలు కోసం కాపు సామాజికవర్గం వత్తిడి పెంచడంతో 2016లో మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేశారు. మంజునాథ్ కమిషన్ పూర్తి రిపోర్టు బహిర్గతం చేయకుండానే హడావుడిగా అసెంబ్లీలో పెట్టి 2017లో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్టు బిల్లు తెచ్చారు. దీంతో మళ్లీ 50శాతం పరిమితికి మించిన కోటాపై న్యాయపరమైన అడ్డంకులు తప్పలేదు. 2019 ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు ఇస్తున్నట్టు ప్రకటించిన చంద్రబాబు వాటిని కూడా సక్రమంగా అమలు చేయలేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం 2014లో కాపులకు, దశాబ్ధం తర్వాత 2024లో బీసీలకు రిజర్వేషన్ హామీలతో మోసం చేసిన ఘనత చంద్రబాబుది. -
చంద్రబాబుకు పబ్లిసిటీ ఎక్కువ.. పని తక్కువ..
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు పబ్లిసిటీ ఎక్కువ.. పని తక్కువ అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత శైలజానాథ్. హార్టికల్చర్ హబ్‌పేరుతో చంద్రబాబు దగా చేస్తున్నారని మండిపడ్డారు. సీమలో నీటి సంక్షోభం ఉన్న సంగతి బాబుకు తెలియదా?, చంద్రబాబు చెప్పేవన్నీ పచ్ఛి అబద్ధాలేనని, రాయలసీమ నీటి సంక్షోభం ఉన్న సంగతి ఆయనకు తెలియదా? అని నిలదీశారు. చంద్రబాబుది నరం లేని నాలుక అని, నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. సీమలో పంటలు ఎండిపోతే.. చంద్రబాబు సంబరాలు ఏంటి? అని ప్రశ్నించారు. రాయలసీమ అంటే చంద్రబాబుకు అంత అపహాస్యమా?, చిత్తూరు జిల్లాలో నీరు లేక 10 వేల ఎకరాల్లో మామిడి చెట్లు ఎండిపోయిన విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఇదీ చదవండి: కరువు వేళ ఈవెంట్లు కాదు.. రైతులను ఆదుకోండి.. -
ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్
-
కరువు వేళ ఈవెంట్లు కాదు.. రైతులను ఆదుకోండి..
సాక్షి, తాడేపల్లి: రాయలసీమ తీవ్ర కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు ఈవెంట్లతో కాలం గడుపుతున్నారని.. ‘రైజింగ్ రాయలసీమ’ ఈవెంట్లు ఎవరి కోసం? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుకు కావాల్సింది ఈవెంట్లు, పబ్లిసిటీ కాదు.. కష్టకాలంలో ప్రభుత్వ భరోసా. రైతులకు తక్షణమే రుణాల రీ షెడ్యూల్, ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం అందించాలి’’ అని డిమాండ్ చేశారు.‘‘కేవలం 388 మండలాలకే కరువు పరిమితం చేయడం అన్యాయం. వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హమైన అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి. జూన్ నుంచే వర్షాభావ పరిస్థితులు ఉన్నా సెప్టెంబరు చివరి వరకు కరువు ప్రణాళిక ఎందుకు సిద్ధం చేయలేదు?. వేల ఎకరాల్లో చీనీ సహా పండ్ల తోటలు ఎండిపోతున్నాయి. రైతులు లక్షలు ఖర్చుపెట్టి కొత్త బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టమోటా, అరటి, బత్తాయి, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. ఈ రెండేళ్లలో ఉద్యాన రంగానికి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి’’ అంటూ కన్నబాబు నిలదీశారు.‘‘వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంటే ఇప్పుడు ‘హబ్‌లు ఏర్పాటు చేస్తాం’ అంటూ కొత్త ప్రకటనలు చేయడం వల్ల రైతుకు తక్షణ ప్రయోజనం ఏమిటి?. గతంలో అనేక ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయని ప్రచారం చేశారు. ప్రకటించిన వాటిలో ఎన్ని ప్రాజెక్టులు వాస్తవంగా గ్రౌండ్ అయ్యాయో ప్రభుత్వం చెప్పాలి. చంద్రబాబును ‘వాటర్ మ్యాన్’ అని పొగిడే వారు ఒక్కసారి రాయలసీమలో ఎండిపోయిన పొలాలు, రైతుల కష్టాలను చూడాలి. విశాఖకు తన ప్రార్థనల వల్లే వర్షం వచ్చిందని చంద్రబాబు చెప్పుకున్నారు. అదే నిజమైతే నాలుగు నెలల ముందే ప్రార్థించి కరువును ఎందుకు నివారించలేకపోయారు?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.‘‘ఇప్పుడు ‘రోడ్డు డాక్టర్లు’ అంటున్నారు.. ముందు ‘కరువు డాక్టర్లను’ తీసుకొచ్చి రైతులను దుర్భిక్షం నుంచి బయటపడేయండి. ఈవెంట్లతో కరువు పోదు.. పబ్లిసిటీతో రైతు కష్టాలు తీరవు. ‘రైజింగ్ రాయలసీమ’ అని పేరు పెట్టడం కాదు.. కరువుతో కుంగిపోతున్న రాయలసీమ రైతును కాపాడండి’’ అని కన్నబాబు హితవు పలికారు.‘‘మదనపల్లెలో సీఎం చంద్రబాబు మొదలుకాని సినిమాకే విజయోత్సవ సభ నిర్వహించారు. ప్రచారం తప్ప పని చేయకుండా తనకు తానే డబ్బా కొట్టుకోవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం. మదనపల్లెలో ప్రకటించింది లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్ కాదు... లక్ష అబద్ధాల ప్రభుత్వం. పంటలు, తోటలు ఎండిపోయి రైతులు అల్లాడుతుంటే హార్టికల్చర్ హబ్ పేరిట సంబరాలు జరుపుతారా?. వ్యవసాయాన్ని గబ్బు పట్టించి, ఇప్పుడు హబ్లంటూ సరికొత్త విన్యాసాలు చేస్తున్నారు...గతంలో అమరావతికి హైపర్‌లూప్, బుల్లెట్ ట్రైన్, మెట్రో, సీ-ప్లేన్ అన్నట్లే ఇదీ ఒక పిట్టల దొర కథ. లాక్‌హీడ్ ప్లాంట్, సౌదీ అరాంకో, ఎయిర్‌బస్, అలీబాబా డేటా సెంటర్ తరహాలోనే ఈ హబ్ ప్రచారం కూడా గాల్లో కలిసిపోతుంది. రోజూ మాటలు, ఈవెంట్లతో ప్రజలను మభ్యపెట్టడమే కూటమి ప్రభుత్వ నైజం. 2026-27 బడ్జెట్లో హార్టికల్చర్ శాఖకు కేటాయించింది కేవలం రూ. 1,123 కోట్లే. లక్ష కోట్ల ప్రాజెక్టు అని ప్రచారం చేసుకుంటున్న హబ్‌కు బడ్జెట్లో పెట్టింది కేవలం రూ. 200 కోట్లా?. హబ్‌లో రూ. 60 వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు ఎవరు పెడుతున్నారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి’’ కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: బాబు కుట్రలను దీటుగా ఎదుర్కొందాం -
బీసీ రిజర్వేషన్ల విషయంలో జగన్ ను ప్రశ్నిస్తే బాబుకే నష్టం..
-
నువ్వు ఎవడివయ్య రద్దు చేయడానికి.. BC రిజర్వేషన్ జీవోపై చంద్రబాబుపై ధ్వజమెత్తిన పేర్ని నాని
-
మరోసారి వెన్నుపోటు.. నాడు ఎన్టీఆర్ కు నేడు బిసీలకు..
-
బాబు ‘బీసీ’ బిల్డప్.. కోర్టు తీర్పుతో అట్టర్ ఫ్లాప్!
అది మోసమని తెలుసు.. ప్రజలను మభ్య పెట్టడమని తెలుసు.. అయినా ఎందుకు కావాలని ప్రభుత్వంలోని వారు ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తుంటారు? అదే రాజకీయం అన్నమాట. ఇలాంటి విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం డాక్టరేట్ సాధించిందని ఒప్పుకోవచ్చు.దేశంలో రిజర్వేషన్లకు సంబంధించి సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు అందరికి తెలుసు. దాని ప్రకారం ఏభై శాతం మించితే అవి చెల్లవు. అయినా ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం స్థానిక ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ చెల్లని జీఓ ఒకటి ఇచ్చేసింది. ఆ తర్వాత టీడీపీ క్యాడర్ చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం వంటివి చేసేశారు. ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినట్లు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని గొప్పలు పోయారు. జయహో బీసీ అంటూ ఊదరగొట్టారు. కాస్త బుద్ది జీవులు కాని, బీసీ సంఘాలవారు కాని ఇదేమి మోసం అని విస్తుపోయారు.ఏభై ఏళ్ల రాజకీయ సీనియర్ని అని చెప్పుకునే చంద్రబాబు మరీ ఇంత ఓపెన్‌గా ప్రజలను తప్పుదారి పట్టించవచ్చా అని వారు బాధపడ్డారు. కాని చంద్రబాబు స్టైలే అది కదా అని అనుకున్నారు. ఈ జీఓలపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. ఈ రిజర్వేషన్ల జీఓలు చెల్లవని హైకోర్టు కొట్టివేసింది. ఏభై శాతం మించిన రిజర్వేషన్లను ఎలా సమర్ధించుకుంటారని హైకోర్టు ప్రశ్నిస్తే సరైన సమాధానం ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. రాజివ్ రంజన్ కమిషన్ నివేదిక పరిశీలనలో ఉందని చెబుతున్నారని, అలాంటప్పుడు ఆ నివేదిక ఆధారంగా బీసీలకు 34 శాతం రిజర్వేష్లు ఎలా ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించడంతో ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. పంచాయతీరాజ్ చట్టంలోనే వెసులుబాటు ఉందంటూ కొత్త వాదన తెచ్చి బీసీ వర్గాలను మాయచేయాలని కూడా అనుకున్నారు. ఎల్లో మీడియాలో బీసీలకు రిజర్వేషన్లు పెంచేసినట్లుగా హోరెత్తించారు. ఇవన్ని ఉట్టిదేనని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో స్పష్టమైంది. దాంతో చంద్రబాబు ప్రభుత్వం బీసీలను మాయ చేయడానికి డ్రామా ఆడిందన్న విషయం బట్టబయలైంది.నిజానికి చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే బీసీలకు కచ్చితంగా 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న నిజాయితీ ఉంటే, పార్లమెంటులో సంబంధిత చట్టం తీసుకురావడానికి కృషి చేసి ఉండాల్సింది. కేంద్రంలో టీడీపీ ఎంపీల బలంతోనే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నం ఎందుకు చేయలేదన్న ప్రశ్న వస్తుంది. ఇది బీసీలను వంచించడం కాదా అని ఆయా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. నిజానికి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి గత జగన్ ప్రభుత్వం కూడా జీఓ ద్వారా యత్నించింది. దానిపై బిర్రు ప్రతాపరెడ్డి అనే టీడీపీ నాయకుడు హైకోర్టుకు వెళ్లారు. దాంతో జీఓలను అప్పట్లో న్యాయ స్థానం కొట్టేసింది. ఆ మీదట ఏభై శాతం మించకుండా చట్టప్రకారం సుమారు 24 శాతం రిజర్వేషన్లు ఇస్తూ, పార్టీ పరంగా సుమారు ఏభై శాతం వరకు బీసీలకు టిక్కెట్లు ఇచ్చి జగన్ న్యాయం చేశారు.ఉదాహరణకు 69 శాతం మేయర్ పదవులను బీసీలకు ఇచ్చారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఆ రకంగా కొన్ని జనరల్ స్థానాలలో కూడా బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. 13 జిల్లా పరిషత్‌లకు గాను ఆరింటిని బీసీలకు వచ్చేలా చేశారు. 46 శాతం పదవులను బీసీవర్గాలకు కట్టబెట్టారన్నమాట. మండల పరిషత్, మున్సిపల్ చైర్ పర్సన్ల పదవులకు కూడా ఇలాగే ఏభై శాతం పైగా జగన్ బీసీలకు ఇచ్చారు. చంద్రబాబు ఆ ప్రకారం ఇస్తామని చెప్పలేకపోతున్నారు.ఇదీ చదవండి: రేవంత్ మాటలు.. బీజేపీకి వరంగా మారుతున్నాయా?గత కొన్ని నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి గెలుపుకోసం ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రచారం ఆరంభించారు. మున్సిపాల్టీలలో 11 వేల కోట్ల రూపాయల పనులు, పల్లెలలో 11 వేల కోట్ల రూపాయల పనులు చేపడుతున్నట్లు హంగామా చేసి సభలు పెట్టారు. పల్లెకు పట్టాభషేకం, పేదలకు పట్టాభిషేకం అంటూ డైలాగులు చెబుతూ హోరెత్తించారు. స్థానిక ఎన్నికలలో కూటమికి తిరుగులేదని చంద్రబాబు ప్రసంగాలు చేస్తున్నారు. బీసీలకు తాము న్యాయం చేయబోయామని కాని వైఎస్సార్సీపీ అడ్డుకుందని కూడా టీడీపీ ప్రచార వ్యూహం అమలు చేయవచ్చు. ఎందుకంటే అలవోకగా అబద్దాలు ఆడడంలో ఈ పార్టీ మంచి నైపుణ్యం సాధించిందన్న సంగతి తెలిసిందే.ఇప్పుడు అసలు సమస్య కూటమికి ఎదురు అవుతుంది. ఆరు వారాలలో ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశించింది. అది సాధ్యం కాదని చెప్పి వాయిదా కోరితే తప్ప ఎన్నికలు ఆగకపోవచ్చు. అయితే టీడీపీ, జనసేనల మధ్య పోటీచేసే స్థానాలపై పంచాయతీ నడుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని నాదెండ్ల మనోహర్ కాని ఒకసారి ఆత్మాభిమానం అంటూ, మరోసారి గెలుపు ప్రాతిపదిక అంటూ టీడీపీ లైన్లో మాట్లాడారు. తద్వారా కార్యకర్తలలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. కనీసం 30 శాతం సీట్లు అయినా జనసేనకు ఆయా పదవులకు పోటీచేసే అవకాశం కల్పించాలన్నది క్యాడర్ డిమాండ్. కాని పవన్ కళ్యాణ్ ఎంతవరకు న్యాయం చేస్తారో అన్న సంశయం వారికి లేకపోలేదు. అయినా ఏదో ఆశ వారిలో ఉంది.టీడీపీ వర్కింగ్ అధ్యక్షుడు నారా లోకేష్ ఇప్పటికే 15 శాతం సీట్లు జనసేనకు ఇస్తామని ప్రకటించారు. దానిని నేరుగా ఖండించే ధైర్యం జనసేనకు లేకపోయింది. కాకపోతే కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియాలో వారి ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసి సరిపెట్టుకున్నారు. 30 శాతం సీట్లు సాధించగలిగితే పవన్ కళ్యాణ్‌పై పార్టీలో నమ్మకం పెరుగుతుంది. లేదంటే పార్టీలో నిరాశ అలముకుంటుంది. అది వేరే సంగతి. ఒకవేళ 30 శాతం సీట్లు జనసేనకు, మరో ఐదు శాతం సీట్లు బీజేపీకి ఇవ్వాల్సి వస్తే టీడీపీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. బలం లేని జనసేన, బీజేపీలకు అన్ని సీట్లు ఇవ్వడం ఏమిటని టీడీపీ స్థానిక నేతలు తిరుగబడే అవకాశం ఉంటుంది. 30 శాతం కాకపోయినా, 15 శాతంతోనే జనసేనకు సరిపెట్టినా, సీట్ల కేటాయింపులో గడబిడలు కొంతమేర జరగవచ్చు.ఉదాహరణకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల మేయర్ పదవులను జనసేన కోరుతోందట. కాని వాటిని టీడీపీ తమకు ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఈ పరిస్థితిలో సామాజికవర్గాల సమస్య కూడా టీడీపీ ఎదుర్కోవలసి ఉంటుంది. జగన్ మాదిరి బీసీ వర్గాలకు పార్టీపరంగా ఏభై శాతం సీట్లు ధైర్యంగా ఇవ్వడం కూడా అంత తేలికకాకపోవచ్చు. ఈ సమస్యతో పాటు బీసీలకు, బలహీనవర్గాలకు ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల మానిఫెస్టోలో చేసిన వాగ్దానం కూడా కూటమికి తలనొప్పిగా మారుతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే.. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపైన, యాక్టివ్‌గా ఉండే కార్యకర్తలు, సోషల్ మీడియాపై అక్రమ కేసులు పెడుతూ భయపెట్టాలని చూస్తోంది. వైఎస్సార్సీపీ వారిని భయపెట్టి పోటీలో లేకుండా చేయడానికి కూడా యత్నించవచ్చు.అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ క్యాడర్‌కు, నేతలకు ధైర్యాన్ని ఇస్తూ అన్ని చోట్ల పోటీచేయాల్సిందేనని చెబుతున్నారు. మరో వైపు ప్రభుత్వపరంగా జనాన్ని పోగుచేస్తే తప్ప చంద్రబాబు మీటింగ్‌లు జరగడం కష్టంగా ఉంటే, జగన్ ఎక్కడకు వెళ్లినా వస్తున్న జన తరంగాలు కూటమిని కలవరపెడుతున్నాయి. వీటన్నిటిని గమనంలోకి తీసుకుంటే శాసనసభ ఎన్నికలలో మాదిరి ఏదైనా మాయ జరిగితే తప్ప స్థానిక ఎన్నికలు కూటమికి ఒక అగ్ని పరీక్షవంటివే అని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఉద్యోగులకు బాబు మరో బిగ్ షాక్..!
-
బాబు కుట్రలను దీటుగా ఎదుర్కొందాం
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను దీటుగా ఎదుర్కొందామని వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. అన్నివర్గాల ప్రజలు చంద్రబాబు పాలనపై ఆగ్రహంతో ఉండటంతో స్థానిక ఎన్నికలను సజావుగా జరిపించే ఉద్దేశం ఆయనకు లేదని చెప్పారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీ నేతలు, శ్రేణులు ధైర్యంగా నిలబడాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసే దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి విస్తృత కసరత్తు చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం దౌర్జన్యాలను ఎదుర్కోవడంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలతో ఆయన ముఖాముఖి సమావేశమయ్యారు. జిల్లాలవారీగా క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సుదీర్ఘంగా, సమగ్రంగా సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలం, ఎన్నికల సన్నాహాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై నేతలతో విస్తృతంగా చర్చించారు. ఉత్సాహంగా వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు జిల్లాల అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ జిల్లాల వారీగా సమీక్షించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తగిన అభ్యర్థుల ఎంపికలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని, స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ అన్నివిధాలుగా సన్నద్ధంగా ఉందని పార్టీ నేతలు వైఎస్ జగన్‌కు వివరించారు. వెన్నుపోటు పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, పాలన, స్థానిక సమస్యలు తదితర అంశాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పలువురు నేతలు వివరించారు. ప్రజల మద్దతు వైఎస్సార్సీపీకే ఉందని, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే పార్టీదే విజయమని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలకు బెదిరింపులు స్థానిక ఎన్నికల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు అధికార పార్టీ నుంచి బెదిరింపులు వస్తున్నాయని పలువురు నాయకులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. పోలీసు వ్యవస్థ దుర్వినియోగం కొనసాగుతోందని, ఎన్నికల్లో పోటీకి అవసరమైన సర్టిఫికెట్ల జారీలో కూడా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వంపై నానాటికీ పెరుగుతున్న అసంతృప్తిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక విపక్షంపై దౌర్జన్యాలకు దిగుతున్నారని వివరించారు.ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొందాంనేతల ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్న వైఎస్ జగన్ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలను సాఫీగా జరిపించే ఉద్దేశం చంద్రబాబుకు లేదని చెప్పారు. చంద్రబాబు మోసాలు, దౌర్జన్యాలు, స్కామ్‌లు, అరాచకాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ప్రతి వర్గం కూడా చంద్రబాబు పాలన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉందని, అందుకే స్థానిక ఎన్నికలను సజావుగా జరిపే ఆలోచన చంద్రబాబుకు లేదని తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీ శ్రేణులు ధైర్యంగా నిలబడాలని వైఎస్ జగన్ నేతలకు సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రతి స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకత్వం సమన్వయంతో పని చేయాలని, కార్యకర్తలకు అండగా నిలవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో స్థానిక పరిస్థితులు, ప్రజాదరణ, పార్టీ పట్ల నిబద్ధత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక జరగాలని నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
AP: 388 మండలాల్లో కరువు
సాక్షి, అమరావతి: కరువు మండలాలపై ఎట్టకేలకు చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచింది. వానల్లేక పొలాలు ఎండిపోతున్నా.. రైతులు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నా పట్టించుకోకుండా తీరిగ్గా స్పందించింది. రాష్ట్రంలో 21 జిల్లాల్లోని 388 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ గురువారం జీవో జారీ చేసింది. ఇందులో 283 మండలాల్లో తీవ్ర కరువు, 105 మండలాల్లో మధ్యస్థ కరువు ఉన్నట్టు పేర్కొంది. ప్రకటించిన మండలాల్లో దాదాపు మూడొంతులు తీవ్ర కరువులోనే ఉన్నాయి. లోటు ఆగస్టులోనే స్పష్టం.. ప్రకటన అక్టోబర్‌లో.. కరువు అంచనాకు తీసుకున్న వర్షపాతం లెక్కలు ఆగస్టు 31తోనే ముగిసినా.. కరువు మండలాలను ప్రకటించడానికి నెల రోజుల సమయం తీసుకోవడం గమనార్హం. వర్షాభావ తీవ్రత ఆగస్టు నెలాఖరుకే స్పష్టమైంది. అయినా సర్కారు వెంటనే కదల్లేదు. కరువు ప్రతిపాదనలు పంపాలంటూ జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం సెప్టెంబర్ 18న మెమో పంపింది. అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కరువు కమిటీ సెప్టెంబర్ 30న ఒక్క వర్చువల్ భేటీలో పరిశీలించి 21 జిల్లాల్లోని మండలాలను సిఫార్సు చేసింది. మర్నాడే జీవో ఇచ్చింది. నెలంతా నాన్చి, చివర్లో హడావుడిగా ప్రక్రియను ముగించారు. ఇదేనా ముందస్తు? మాన్యువల్ ప్రకారం ఖరీఫ్ కరువును అక్టోబర్ 31లోగా ప్రకటించాలని చెబుతున్న ప్రభుత్వం తాము ముందుగానే ప్రకటించామని చెప్పుకుంటోంది. దీనికి ముందస్తు కరువు ప్రకటన అని పేరు కూడా పెట్టింది. కానీ అక్టోబర్ 31 అనేది చివరి గడువు మాత్రమే. కరువు సూచికలు కనిపించిన వెంటనే ప్రకటించాల్సి ఉంటుంది. జూన్ నుంచి వానలు లేక మూడు నెలలుగా నష్టపోతున్న రైతులకు అక్టోబర్‌లో వచ్చిన ప్రకటన ముందస్తు ఎలా అవుతుందన్నది అసలు ప్రశ్న. ఆలస్యానికి మూల్యం రైతులదే కరువు ప్రకటన ఆలస్యమైతే దాని ఆధారంగా అందాల్సిన సాయం కూడా ఆలస్యమవుతుంది. రుణాల రీషెడ్యూల్, ఇన్పుట్ సబ్సిడీ, కేంద్రానికి నివేదిక, ఉపాధి హామీ అదనపు పనిదినాలు అన్నీ ఈ ప్రకటనతోనే ముడిపడి ఉన్నాయి. వర్షాభావం స్పష్టమైన వెంటనే ప్రకటించి ఉంటే ప్రత్యామ్నాయ పంటల విత్తనాల సరఫరా వంటి చర్యలకు అవకాశం ఉండేదని రైతు సంఘాలు అంటున్నాయి. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ చివరి దశకు చేరుకుంది. ప్రకటన వచ్చినా సాయం మాటే లేదు నెల ఆలస్యంగా వచ్చిన జీవోలోనూ రైతుకు ఊరటనిచ్చే మాట లేదు. మండలాల జాబితా, గెజిట్ ప్రచురణ ఆదేశాలు తప్ప ఇన్పుట్ సబ్సిడీ ఎంత, ఎప్పుడు, పంట నష్టం అంచనా ఎప్పటిలోగా, రుణాల రీషెడ్యూల్, వడ్డీ మాఫీ, కేంద్ర సాయం కోసం నివేదిక, పశుగ్రాసం, తాగునీటి ఏర్పాట్లు వంటి ఏ ఒక్కదానిపైనా స్పష్టత ఇవ్వలేదు. ప్రకటనకే నెల పడితే, సాయానికి ఇంకెన్ని నెలలు పడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాయలసీమ, ప్రకాశంలో మరీ దారుణం తీవ్ర కరువు మండలాలు అత్యధికంగా రాయలసీమ, ప్రకాశం ప్రాంతాల్లోనే ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో 28, అనంతపురంలో 27, నంద్యాలలో 26, అన్నమయ్యలో 25, చిత్తూరులో 24, మార్కాపురంలో 19, ప్రకాశంలో 18, కర్నూలులో 15, వైఎస్సార్ కడపలో 14 మండలాలను తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించారు. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి జిల్లాలో 22 మండలాలు తీవ్ర కరువులో ఉన్నాయి. కుప్పం.. అమరావతిలోనూ కరువే సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం తీవ్ర కరువు జాబితాలో ఉంది. చిత్తూరు జిల్లాలో ప్రకటించిన 24 మండలాలూ తీవ్ర కరువులో ఉన్నవే. రాజధాని అమరావతి ప్రాంతమైన తుళ్లూరు మండలం కూడా తీవ్ర కరువు జాబితాలో ఉంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం మధ్యస్థ కరువులో ఉంది. డెల్టా శివారు భూములకూ దెబ్బ సాగునీటికి కొదవలేదనుకునే కృష్ణా డెల్టా సైతం కరువు జాబితాలో చేరింది. కృష్ణా జిల్లాలో 8 మండలాలు తీవ్ర, 9 మండలాలు మధ్యస్థ కరువులో ఉన్నాయి. తీవ్ర కరువు జాబితాలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, నాగాయలంక, కోడూరు వంటి మండలాలు డెల్టా చివరి ప్రాంతాలే. బాపట్ల జిల్లాలో ప్రకటించిన 15 మండలాలూ తీవ్ర కరువు కిందే ఉన్నాయి. జాబితాలో లేని 300 మండలాలు రాష్ట్రంలో 688 మండలాలు ఉంటే కరువు జాబితాలో చోటు దక్కింది 388కే. కరువు ఛాయలు ఉన్నా మిగతా 300 మండలాల రైతులకు మొండిచేయి చూపారని రైతు సంఘాలు చెబుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు కరువు జాబితాలో చోటు ఇవ్వలేదు.సగం సీమలోనే.. 388 కరువు మండలాల్లో 186 రాయలసీమలోనే ఉన్నాయి. తీవ్ర కరువు మండలాలు 283 అయితే, వాటిలో 159 సీమలోనే ఉన్నాయి. అన్నీ తీవ్రమే అనకాపల్లి, బాపట్ల, మార్కాపురం, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ప్రకటించిన మండలాలన్నీ తీవ్ర కరువు కిందే ఉన్నాయి అగ్రస్థానం కడప అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 37 మండలాలు కరువు జాబితాలో ఉన్నాయి. -
ఐయ్యారే.. రూ.20,898 కోట్లు ఎగ్గొట్టారే!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చంద్రబాబు ప్రభుత్వం భారీ వెన్నుపోటు పొడిచింది. 2024 ఎన్నికల మేనిఫేస్టోలో ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ (మధ్యంతర భృతి) ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని గాలికొదిలేసిన చంద్రబాబు, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన వేతన సవరణ కమిషనర్ డాక్టర్ మన్మోహన్‌సింగ్‌తో ఆ పదవికి రాజీనామా చేయించారు. ఆ తరువాత వేతన సవరణ కోసం మరో కమిషనర్‌ను నియమించలేదు. తద్వారా 27 నెలలుగా ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వకుండా వారికి చెందాల్సిన ఆర్థిక ప్రయోజనాలకు చంద్రబాబు గండికొట్టారు. రెండేళ్లకు పైగా కాలయాపన చేసి తాజాగా వేతన సవరణ కమిషనర్‌గా దినేష్‌కుమార్‌ను నియమించారు. 27 నెలలుగా ఐఆర్ ప్రకటించకపోవడంతో ఉద్యోగులకు రూ.20,898 కోట్ల ఆర్థిక ప్రయోజనాలకు చంద్రబాబు ప్రభుత్వం గండికొట్టింది.నెలకు రూ.774 కోట్ల మేర గండి..వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల ఐఆర్ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2019 జూలై 1వ తేదీ నుంచి 27 శాతం ఐఆర్ అమలు చేస్తూ తొలి కేబినెట్ సమావేశంలోనే వైఎస్ జగన్ హయాంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2019 ఆగస్టు 1వ తేదీ వేతనంతో ఐఆర్ చెల్లించారు. అప్పట్లో నెలకు రూ.774 కోట్ల మేర ఐఆర్ ఇవ్వడం ద్వారా ఉద్యోగులకు ప్రయోజనం కల్పించారు. జగన్ మాటిచ్చి నెరవేర్చారు.. చంద్రబాబు మాట మార్చారు2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే ఆమోదించి అమలు చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇవ్వడమే తప్ప ఇప్పటికీ అమలు చేయలేదు. ఇదే వైఎస్ జగన్‌కు చంద్రబాబుకు విశ్వసనీయతలో ఉన్న వ్యత్యాసం. చంద్రబాబు అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం ఇచ్చినట్టు 27 శాతం ఐఆర్ ఇచ్చి ఉంటే ఉద్యోగులకు రూ.20,898 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరేది. 27 నెలల తరువాత వేతన సవరణ కమిషనర్‌ను నియమించారు.కమిషన్ నివేదిక ఇచ్చేందుకు మరో ఏడాది గడువు విధించారు. కమిషనర్ నివేదిక సమర్పించి.. అమలు చేయడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అంటే ప్రస్తుత వేతన సవరణ కమిషన్ నివేదిక సమర్పించేందుకు 2027 అక్టోబర్ వరకు గడువు ఉంది. 13వ వేతన సవరణ కమిషన్‌ను 2028లో నియమించాల్సి ఉంటుంది. ప్రస్తుత కమిషన్ నివేదిక వచ్చి.. అది అమలయ్యే వరకు ఐఆర్ ఇవ్వాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
అబద్ధాలతో చంద్రబాబు చెట్ట‘పట్టాలు’
సాక్షి, అమరావతి: కొండలు, కాలువ కట్టలపై కొద్దిపాటి స్థలంలో రేకుల షెడ్డు వేసుకుని బతుకీడుస్తున్న పేదవాడి స్థలం విలువ కోటి రూపాయలట. ఇది ఎవరో రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెప్పిన మాట కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సభా వేదిక నుంచి చెప్పిన లెక్క. విశాఖ, విజయవాడ, మంగళగిరిలో 60 వేల మందికి రూ.52 వేల కోట్ల విలువైన భూములు ఇచ్చామని అదేపనిగా ఊదరగొడుతూ ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో పట్టా విలువ ఏకంగా రూ.కోటిపైనే. నిజంగా ఆ భూమికి అంత విలువ ఉందా అంటే.. అంత ఉంటే వాళ్లు పేదలు ఎలా అవుతారని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అధికారుల లెక్క ఒకటి.. బాబు లెక్క మరొకటి విజయవాడలో నిర్వహించిన సభకు నాలుగు రోజుల ముందు అధికారులు విజయవాడ భూముల విలువ రూ.9,800 కోట్లు అని చెప్పారు. ఒక్కో కుటుంబానికి లబ్ధి రూ.40–45 లక్షలని ప్రకటించారు. అదే చాలా ఎక్కువ. ఆ భూమికి అంత విలువ ఎక్కడ ఉంటుందని స్థానికులు ఆశ్చర్యపోయారు. కాగా.. చంద్రబాబు దాన్ని ఇంకా పెంచేసి మైక్ చేతికి రాగానే విజయవాడలోని ఆ భూమి విలువ రూ.28,112 కోట్లని చెప్పారు. అధికారులది ఒక లెక్క.. చంద్రబాబుది ఒక లెక్క. కానీ వాస్తవానికి అక్కడున్న భూముల విలువ కంటే ఒకటి, రెండు రెట్లు ఎక్కువ చేసి అధికారులు చెబితే దానికి మూడు రెట్లు కలిపి చంద్రబాబు లెక్క చెప్పడం గమనార్హం. దీనినిబట్టి చంద్రబాబు దొంగ లెక్కలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గజం రూ.82 వేలు.. ఏ కొండ మీద? సీఎం లెక్క ప్రకారం విజయవాడలో కొండపై స్థలాల్లో గజం ధర రూ.82,700. ఇది నగరంలో ప్రధాన ప్రాంతాల్లో ఉండే రేటు. పట్టాలు ఇచ్చింది మాత్రం కొండ ప్రాంతాల్లో, రోడ్డు కూడా లేని గల్లీల్లో ఉన్నవారికి. ప్రభుత్వ విలువ ప్రకారం చూసినా అక్కడ గజం రూ.20 వేలు దాటదు. మరి ఆ రూ.82 వేలు ఏ లెక్క? కేవలం ప్రచార లెక్క. ఇచ్చింది కాగితం.. చెప్పింది రూ.కోట్లు ఈ పట్టాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది పైసా కూడా లేదు. సేకరించిన భూమి సెంటు కూడా లేదు. పేదలు దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లకే ఒక కాగితం ఇచ్చారు. విశాఖలో అయితే గతంలోనే ఇచ్చిన పట్టాలకు ఇప్పుడు డీడ్లు ఇచ్చి మళ్లీ పట్టాభిషేకం అన్నారు. ఆ కాగితానికే రూ.కోట్ల విలువ కట్టి తానేదో పేదలకు కోట్ల ఆస్తి పంచినట్టు డప్పు కొట్టుకుంటున్నారు.చెప్పేది కొండంత.. చేసేది గోరంత సభలో రూ.కోట్ల లెక్కలు, క్షేత్రస్థాయిలో కాగితాలు. మైక్ ముందు రూ.52 వేల కోట్లు. ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు సున్నా. చెప్పే మాటకు, చేసే పనికి, కనిపించే వాస్తవానికి ఎక్కడా పొంతన లేదు. అంకెల గారడీతో పేదలను మభ్యపెట్టడం చంద్రబాబుకు కొత్త కాదని, ఇది ప్రజలను నిలువునా మోసం చేయడమేనని పేదలు మండిపడుతున్నారు. -
ఈ ఏడాదీ తిరోగమనంలోనే జీఎస్టీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. యువతకు ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతీ లేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన పంటలకు బీమా రాక రైతులు కుదేలైపోయారు. కొత్తగా వచ్చిన వ్యాపార సంస్థలు, పరిశ్రమలు లేవు. ఏ రంగంలోనూ అభివృద్ధి లేదు. వ్యాపారాలు దిగజారిపోతున్నాయి. దీంతో ఏటేటా జీఎస్టీ వసూళ్లు పడిపోతున్నాయి. చంద్రబాబు అధికారం చేపట్టిన మూడో సంవత్సరం కూడా రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు తిరోగమన దిశలోనే నడుస్తున్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు 6.79 శాతం మేర క్షీణించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. గతేడాది ఏప్రిల్–సెప్టెంబర్ ఆరు నెలల కాలానికి రూ.23,570 కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాదికి వచ్చేసరికి 6.79 శాతం క్షీణించి 21,992 కోట్లకు పరిమితమైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం 12 నెలల్లో కూడా రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 5.41 శాతం క్షీణించి రూ.44,825 కోట్ల నుంచి రూ.42,397 కోట్లకు పడిపోయిన సంగతి తెలిసిందే.రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు, రాజధాని అమరావతిలో వేల కోట్ల పనులతో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతోందంటూ చంద్రబాబు సర్కారు ప్రకటనలతో ఊదరగొడుతుంటే జీఎస్టీ గణాంకాలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు, వేల కోట్ల నిర్మాణ పనులు జరుగుతుంటే ఆ మేరకు రాష్ట్ర జీఎస్టీ ఆదాయం ఎందుకు పెరగడం లేదని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే... జీఎస్టీతో పాటు పెట్రోలియం, లిక్కర్ వ్యాట్, వృత్తి పన్ను అన్నీ కలిపి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం మొదటి ఆరు నెలల కాలంలో 18 శాతం పెరిగి రూ.30,435.98 కోట్లకు చేరినట్లు రాష్ట్ర ప్రధాన పన్నుల అధికారి ఎ.బాబు ప్రకటన జారీ చేశారు. -
తెలిసే వంచన!
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు మరోమారు వెన్నుపోటు రుచి చూపించారు. 34 శాతం రిజర్వేషన్లు కోర్టుల ముందు నిలబడవని తెలిసీ దారుణంగా వంచించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు మొక్కు బడిగా కల్పించిన 34 శాతం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టేయడంతో బాబు బండారం బట్టబయలైంది. కేవలం జీవో ఇచ్చి ఊరుకుంటే కోర్టులు కొట్టేస్తాయని ఆయనకు తెలుసు. రిజర్వేషన్లు 50శాతం దాటరాదని ఇప్పటికే సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులు తీర్పులిచ్చిన సంగతీ చంద్రబాబుకు తెలుసు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే సాధ్యమనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. కేంద్రంలో టీడీపీ బలంపై ఆధారపడిన ప్రభుత్వం ఉన్నదన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ కేంద్రంపై వత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్ల కోసం చట్టం చేయించే పని చేయకుండా ఓ జీవో ఇచ్చి బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ కురిపించారు. ఇప్పుడు అనుకున్నట్టుగానే హైకోర్టు ఆ జీవోను కొట్టేసింది. అలా బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు డ్రామాలో మరో అంకం పూర్తయింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని ఆయన అంటున్నారు. డ్రామాలో ఇది ఇంకొక అంకం. సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఈ డ్రామాను మరికొన్ని రోజులు నడిపించవచ్చు. బీసీల కోసం చంద్రబాబు నిజంగా ప్రయత్నిస్తున్నాడని కొంతమందినైనా నమ్మించవచ్చు. కానీ చంద్రబాబు ఆడుతున్న నాటకం బీసీలకు అర్థమయ్యింది. తమకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబులో ఏ కోశానా కనిపించడంలేదని వారు మండిపడుతున్నారు. టీడీపీ బలంపై కేంద్రప్రభుత్వం ఆధారపడి ఉన్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేయడానికి ఇదో మంచి అవకాశమని అందరూ భావిస్తున్నారు. కానీ చంద్రబాబులో చిత్తశుద్ధి, నిజాయితీ లేదని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు సుప్రీంకోర్టుకు వెళ్తామంటూనే, మరోవైపు అన్ని మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులకు ఎన్నికల నిర్వహణకు సిద్ధంకావాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చేశారు. బీసీల కోసం కేంద్రంపై ఒత్తిడి చేసిందెక్కడ? వాస్తవానికి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చారు. చట్టం ఏం చెబుతోంది.. సుప్రీంకోర్టు తీర్పులు ఏమంటున్నాయి.. అన్న విషయాలు తెలుసుకోకుండానే ఆయన ఈ హామీని ఇచ్చారని అనుకోవడానికి వీలేలేదు. బీసీల పట్ల నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన వెంటనే కేంద్రంలో తనకున్న పలుకుబడిని, కేంద్రం తమపై ఆధారపడి ఉన్న పరిస్థితిని ఉపయోగించుకుని బీసీ రిజర్వేషన్ల కోసం చట్టం తెచ్చేందుకు ప్రయత్నించొచ్చు. నెలనెలా ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే చంద్రబాబు, ఏ రోజు కూడా బీసీ రిజర్వేషన్ల గురించి చర్చించిన దాఖలాల్లేవు. కేంద్రానికి ఓ వినతిపత్రం కూడా పంపలేదు. బీసీలకు 50 సంవత్సరాలకే రూ.4వేల పెన్షన్ అందిస్తామన్నారు. ధోకా ఇచ్చారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామన్నారు.. ధోకా.. బీసీలకు సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామన్నారు.. మూడు బడ్జెట్లలో బీసీ లకు సబ్‌ప్లాన్ ఉందా.. వీటిని బట్టి అర్థం కావడంలేదూ వెన్నుపోటులో చంద్రబాబు గోల్డ్‌మెడల్ హోల్డరని.మోసాన్ని దాచి ప్రతిపక్షంపై విమర్శలు బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు వైఎస్సార్సీపీ వాళ్లే హైకోర్టులో కేసులు వేసి రిజర్వేషన్లను అడ్డుకున్నారనే అబద్ధాలతో కొత్త డ్రామాలకు తెరతీశారు. వాస్తవానికి ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ(సర్) ప్రక్రియ ముగిసిన తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తరువాత స్థానిక సంస్థలను నిర్వహించాలని మాత్రమే వైఎస్సార్సీపీ హైకోర్టును కోరింది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరలేదు. అయితే చంద్రబాబు మాత్రం రిజర్వేషన్ల వైఫల్యాన్ని వైఎస్సార్సీపీకి ముడిపెట్టి ప్రతిపక్షాన్నే నిందిస్తున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను గతంలో అడ్డుకున్నది చంద్రబాబే.. 2020–21 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని నిర్ణయిస్తూ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019 డిసెంబరు 28నే జీవో నెంబరు 176 జారీ చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 58.95 శాతం రిజర్వేషన్ల అమలుకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటుతున్నాయంటూ చంద్రబాబు కోర్టులో కేసు వేయించారు. బిర్రు ప్రతాపరెడ్డి అనే టీడీపీ నాయకుడితో చంద్రబాబు ఈ నాటకం ఆడించారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ప్రతాపరెడ్డి ఓ నామినేటెడ్ పదవి కూడా అనుభవించారు. చంద్రబాబు వేయించిన కేసు నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50శాతం మించరాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పుడు కోర్టులో ఎందుకు అడ్డుకున్నారు చంద్రబాబూ..? బీసీలకు 34శాతం రిజర్వేషన్ వస్తుంటే మీకు కడుపు మంట ఎందుకు అని సొంత పారీ్టలోనే కొందరు నాయకులు విమర్శించడం నిజం కాదా..? చేతులు దులుపుకునేందుకే సుప్రీంకోర్టుకు అప్పీలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టేస్తూ తీర్పునివ్వడంతో దానిపై సుప్రీంకోర్టుకెళతామని చంద్రబాబు ప్రకటించేశారు. తద్వారా త్వరగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసి, అంతే త్వరగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సబబు కాదని చెప్పించాలన్నదే ఆయన వ్యూహం. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించిన ఏ కేసులో కూడా సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్లను సమర్థించిన దాఖలాలే లేవు. ఇదే పరిస్థితుల్లో పలు రాష్ట్రాలు చేసిన రిజర్వేషన్ల వల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటినప్పుడు అందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పింది. ఆ తీర్పుల ఆధారంగానే ఇపుడు ఏపీ హైకోర్టు కూడా బీసీలకిచ్చిన 34 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు మళ్లీ వెళ్లినా కూడా ఏం జరుగుతుంది? గతంలో ఇచ్చిన తీర్పునే ఇస్తుంది. ఈ విషయం తెలిసీ కాలయాపన కోసమే చంద్రబాబు డ్రామాలు... రిజర్వేషన్లను కోర్టులు కొట్టేశాయి కాబట్టే, తానేం చేయలేకపోతున్నానని బీసీలను వంచించేందుకు చంద్రబాబు నాటకాలు.. వాస్తవానికి హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. అయితే సుప్రీంకోర్టుకెళ్లడానికి ముందే నోటిఫికేషన్ ఇస్తే, వంచన బయటపడుతుందన్న భయంతో ఆ పని చేయకుండా ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు ఆపారని అధికారవర్గాల్లో వినిపిస్తోంది. బాబు సర్కార్ తీరును అనుమానించిన హైకోర్టు... అసలు రాజీవ్ రంజన్ మిశ్రా క్షేత్రస్థాయిలో బీసీల గురించి ఎలాంటి సర్వే చేయలేదు. బీసీ స్థితిగతుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కోర్టుకు మాత్రం కమిషన్ నివేదిక, సిఫారసుల మేరకే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన హైకోర్టు, రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కంగుతిన్న చంద్రబాబు ప్రభుత్వం విధి లేని పరిస్థితుల్లో కమిషన్ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన హైకోర్టుకు, ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని గ్రహించింది. దీంతో ఎలాంటి శాస్త్రీయ సర్వే లేకుండా, బీసీల స్థితిగతులను తెలుసుకోకుండా వారికి నామమాత్రంగా, మొక్కుబడిగా ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్లను కొట్టేసింది. అసలు కమిషన్ నివేదికను చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు బయటపెట్టలేదు. దాన్ని అత్యంత రహస్యంగా ఉంచింది. నివేదికను ఎందుకు బహిర్గతం చేయడంలేదని హైకోర్టు ప్రశ్నించినా పట్టించుకోలేదు. బీసీ రిజర్వేషన్లపై ఎప్పడు ఏం జరిగిందంటే.. ⇒ 2019 డిసెంబర్ 28: బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీఓ 176 ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకుడు బిర్రుప్రతాపరెడ్డి చేత చంద్రబాబు కేసువేయించారు. ⇒ 2020 మార్చి 2: బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌తో మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు అవుతాయని ఆ జీఓను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ⇒ 2021 మార్చి 4: వికాస్ కిషన్‌రావు గవాలి తీర్పులో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు మూడు అంశాలు(ట్రిపుల్ టెస్ట్)ను స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ⇒ 2026 ఆగస్టు 20: స్థానిక సంస్థలైన గ్రామాల్లో 34 శాతం(జీఓ105), పట్టణాల్లో 33.33 శాతం(జీఓ 1065) ద్వారా బీసీ రిజర్వేషన్లపై టీడీపీ ప్రభుత్వం జీఓలు ఇచ్చింది. ⇒ 2026 సెప్టెంబర్: 34 శాతం నిర్ణయానికి ఆధారమైన గణాంకాలు, కమిషన్ నివేదిక, చట్టపరమైన ప్రాతిపదికను ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ⇒ 2026 అక్టోబర్ 1: స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన జీఓలను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.ఆరు వారాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. బాబుకు గుణపాఠం చెప్పడం ఖాయం చట్టబద్ధత లేకుండా తెచ్చిన జీవోలు హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు కుటిల నైజం మరోసారి బట్టబయలైంది. యావత్ బీసీ సమాజానికి చంద్రబాబు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. స్థానిక ఎన్నికల్లో బాబుకు బీసీ సమాజం గుణపాఠం చెప్పడం ఖాయం. – చెల్లుబోయిన వేణు, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి బాబు కల్లిబొల్లి మాటలు బీసీలు నమ్మరు బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగనివ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. బీసీలను అణగదొక్కేందుకు రిజర్వేషన్ల పేరిట రాజకీయ కుట్రకు తెరతీశారు. బాబు చెప్పే కల్లిబొల్లి మాటలు, అబద్ధపు జీవోలతో బీసీలను మరోసారి మోసం చేయలేరు. – గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీ మోసకారితనం బట్టబయలైంది బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసి బాబు ప్రభుత్వ మోసకారితనాన్ని బట్టబయలు చేసింది. ఇదంతా బీసీలను దగా చేయడానికి చంద్రబాబు ఆడిన నాటకం. బాబు ప్రభుత్వ మోసకారి విధానాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. – వి.శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శిచిత్తశుద్ధి లేదని రుజువైంది బీసీలకు రిజర్వేషన్ల విషయంలో బాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రుజువైంది. ‘మేము ఇవ్వాలనుకున్నాం.. కానీ కోర్టు కొట్టేసింది’ అనే సాకుతో సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తోంది. ఇకనైనా బీసీలపై కపట ప్రేమ మానుకొని, చిత్తశుద్ధితో వ్యవహరించాలి. – కె.రామకృష్ణ, సీపీఐ జాతీయ కార్యదర్శి పార్లమెంటులో చట్టం చేయించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం కంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో చట్టం చేయించాలి. – కేశన శంకరరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు మోసానికి ఫుల్స్టాప్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం చేయాలనుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు తీర్పుతో ఫుల్స్టాప్ పడింది. రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు చేయడం, ఆ తర్వాత కోర్టుల్లో ఎదురుదెబ్బలు తినడం చంద్రబాబుకు అలవాటే. – ఉషశ్రీ చరణ్, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి 34 శాతం రిజర్వేషన్లపై బీసీలకు బాబు వెన్నుపోటు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటు పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి, చట్టపరమైన చర్యలు చేపట్టి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధించాలి. బీసీల రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని తెలిసి కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జీఓలు జారీ చేయడం సిగ్గుచేటు. – వరుదు కళ్యాణి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ -
నయవంచన రాజకీయాలు ఇంకెన్నాళ్లు ?
సాక్షి,అమరావతి: బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరిట సీఎం చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు, నయవంచనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. బీసీలపై నయవంచనతో కూడిన రాజకీయాలు ఇంకా ఎన్నాళ్లు చేస్తారు? ఇంకా ఎన్నాళ్లు వారిని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటున్నారని చంద్రబాబుని ప్రశ్నించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ డ్రామాఆడుతున్నారని మీకూ తెలుసు? సుప్రీంకోర్టు గత తీర్పుల వల్ల అది ఏ కోర్టులోనూ నిలబడదని కూడా మీకు తెలుసు? కోర్టులో నిలబడదని తెలిసీ, 44 రోజులుగా మీరు ఆడుతోంది కపట నాటకం కాదా? అంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబును వైఎస్ జగన్ కడిగిపారేశారు. ఇవాళ మీరిచ్చిన జీవోలను కొట్టేస్తూ, హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీసీలకు క్షమాపణలు చెప్పి, లెంపలు వేసుకోండని హితవు పలికారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే... కేంద్రాన్ని ఒప్పించండి.. చంద్రబాబు గారూ.. నిజంగా మీకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే.. మీరు చేయాల్సింది కేంద్రంలో ఉన్న మీ కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి ఆ మేరకు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఒక మార్గాన్ని తీసుకొస్తే గాని, ఈ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. మరి ఆ దిశగా మీరు ఏం చేశారు? కేంద్రంతో మాట్లాడారా? కనీసం మీ కేంద్ర మంత్రులతో అక్కడి కేబినెట్ సమావేశాల్లో ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారా? మీరు ఢిల్లీ వెళ్లినప్పుడు ఎన్నిసార్లు దీనిపై కేంద్రంతో చర్చించారు? ఇవి చేయకుండా, చెల్లని జీవోలు ఇచ్చి డ్రామాలు చేయడం వెనుక మీ ఉద్దేశం, బీసీలను మభ్య పెట్టి, మోసం చేయాలనే కదా? రాజకీయ స్వార్థం కోసం మీ డ్రామాలు ప్రదర్శించడానికి బీసీలే కావాల్సి వచ్చారా? బీసీలపై ప్రేమను చేతల్లో చూపండి బీసీలపై ప్రేమ మాటల్లో కాదు చంద్రబాబు గారూ చేతల్లో చూపించాలి. మా ప్రభుత్వ హయాంలో మనసా, వాచా, కర్మణా బీసీల సహా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయపరంగా పైకి తీసుకురావడానికి అన్ని రకాలుగా పనిచేశాం. చరిత్రలో తొలిసారి విప్లవాత్మకమైన చట్టాన్ని, 2019 ఆగస్టులో తీసుకువస్తూ, రాష్ట్రంలోని కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీలు, కమిటీలలోని నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాం. పదవులు పొందిన ఎంతోమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు రాజకీయంగా చైతన్యవంతులయ్యారు.ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక మెట్టు పైకి వచ్చి, ప్రజాసేవలో పాల్గొన్నారు. దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ వర్గాల్లో సరికొత్త నాయకత్వాన్ని తయారు చేసిన ఘనత ఒక్క వైఎస్సార్సీపీకే దక్కింది. అంతేకాదు 139 బీసీ కులాలను కవర్ చేస్తూ 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. మీ ప్రభుత్వం వద్దే మేం తెచ్చిన చట్టం ఉంది. రెండున్నరేళ్లుగా ఆ చట్టాన్ని ఎందుకు పట్టించుకోలేదు? మా మాదిరి మీరు ఎందుకు అమలు చేయలేదు? కళ్లముందే బీసీలకు మేలు కలిగే చట్టం ఉన్నా ఎందుకు పట్టించుకోలేదు? ఇదీ బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి. సంక్షేమ పథకాలతో బీసీలకు బాసట అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, చేదోడు, తోడు తదితర సంక్షేమ కార్యక్రమాల్లో బీసీ కుటుంబాలు పెద్ద సంఖ్యలో లబ్ధిపొందాయి. వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకు మొత్తం రూ.1.82 లక్షల కోట్ల ప్రయోజనం అందించాం. ఇప్పుడు వీటన్నింటినీ నాశనం చేసి బీసీల ఉసురు తీస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలను పైకి తీసుకురావడం కోసం మేం ఏర్పాటు చేసిన నిచ్చెనలను విరగ్గొట్టారు. పైగా మీరిచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు సహా అనేక హామీలను మోసాలుగా మార్చారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే, అది రాజ్యాంగబద్ధమైన చర్యల ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నమీరు, అక్కడ మీ పరపతిని వాడి, కేంద్రాన్ని ఒప్పించి, చట్ట సవరణ ద్వారా 34శాతం రిజర్వేషన్లు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. రాజకీయంగా బీసీలకు మంచి అవకాశాలు కల్పించాంఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మాకు మేముగా బీసీలకు రాజకీయంగా మంచి అవకాశాలను కల్పించాం. 11 రాజ్యసభ స్థానాల్లో నాలుగు బీసీలకు అవకాశం ఇచ్చాం. 58 ఎమ్మెల్సీ స్థానాల్లో 28 స్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాం. చివరకు స్థానిక సంస్థల్లో కూడా జనరల్ స్థానాల్లో బీసీలకే టిక్కెట్లు ఇచ్చాం. 13 జడ్పీ చైర్పర్సన్ పదవుల్లో ఆరు, 13 మేయర్ పదవుల్లో తొమ్మిది, 84 మున్సిపల్ చైర్పర్సన్ పదవుల్లో 44 బీసీలకు ఇచ్చాం. 636 మండలాధ్యక్ష పదవుల్లో 239, 639 జడ్పీటీసీల్లో 227 బీసీలకే ఇచ్చాం, చంద్రబాబు గారూ.. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా?వైఎస్ జగన్‌ను కలిసిన వేమూరు విద్యార్థులునేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌తో యూకేలో ఉన్నతవిద్యకు వెళుతున్నట్లు వెల్లడి ఉన్నత పౌరులుగా ఎదగాలని వైఎస్ జగన్ ఆకాంక్షసాక్షి, అమరావతి: బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన విద్యార్థులు వేమూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యంలో గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌తో యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌లో ఉన్నతవిద్య అభ్యసించేందుకు వెళుతున్నట్టు వైఎస్ జగన్‌కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువులో ప్రతిభ కనబరిచి, భవిష్యత్తులో సమాజానికి మేలుచేసే ఉన్నత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వారి ఉన్నత విద్యాభ్యాసం విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. ‘మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యావ్యవస్థలో చేపట్టిన కార్యక్రమాలు మాలాంటి అనేకమంది విద్యార్థులకు ఉన్నత అవకాశాలు కల్పించాయి. ఆ సమయంలో విద్యారంగంలో మీరు తీసుకున్న చర్యలు మా ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడ్డాయి’ అని విద్యార్థులు వైఎస్ జగన్‌తో పేర్కొన్నారు. వరికూటి అశోక్‌బాబు కుమారుడు గౌతమ్ గైడ్ చేయడంతో తాము ఈ సీట్లు సాధించామని చెప్పారు. పేద విద్యార్థులకు ఉన్నతవిద్య అందేలా సహాయం చేసిన గౌతమ్‌ను వైఎస్ జగన్ అభినందించారు. వైఎస్ జగన్‌ను కలిసిన విద్యార్థుల్లో నడకుర్తి అలెగ్జాండర్, వేణు వాసుమల్ల, మూల్పూరు ప్రసన్నకుమారి, నీరజా భూపతి, రోహిత్ వాసుమల్ల ఉన్నారు. -
ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబూ?: పేర్ని నాని
సాక్షి, మచిలీపట్నం: గ్రామంలో కష్టం వచ్చిన ప్రతీ ఇంటి దగ్గర వైఎస్సార్సీపీ కార్యకర్త ఉండాలని.. ప్రజల్లో మమేకమయ్యేవాడినే మీరు ఎన్నుకోండీ. డబ్బులతో మనుషులను కొనలేరు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు పేర్ని నాని పేర్కొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో రైతులకు సాగునీరివ్వాలనే ఆలోచన ఎమ్మెల్యేకు లేదు. నీళ్లు లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కాల్వల్లో సాగునీరు పారకపోయినా... సారా మాత్రం పారుతుంది’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘జనం గొంతు తడపడానికి తాగు నీరు లేదు కానీ బెల్ట్ షాపులకు మాత్రం కొదవ లేదు. నీరు లేదు వరి పండించడం మానేయండని చంద్రబాబు అంటున్నాడు. అక్టోబర్ 1 తేదీన కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. మీటింగ్ పెట్టి పాత వాళ్లకే పెన్షన్లు ఇచ్చి చంద్రబాబు జారుకున్నాడు. మూడు సెంట్ల స్థలం ఇస్తా.. సైట్ ఓపెన్ అయ్యిందని హడావుడి చేస్తున్నాడు. చంద్రబాబు జీవితంలో పేదవారికి ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.‘‘పేదలకు పట్టాలిచ్చిన ఘనత వైఎస్సార్, వైఎస్ జగన్‌లకే దక్కుతుంది. కమ్యూనిస్టులు ఉద్యమాలు చేస్తేనే గతంలో ఇళ్ల స్థలాలు వచ్చేవి. కానీ ఎలాంటి ఉద్యమాలు లేకుండా వైఎస్ జగన్ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. నిజాయితీగా బతికిన కమ్యూనిస్టు నాయకుడు పాటూరి రామయ్య వైఎస్ జగన్‌ను మెచ్చుకున్నారు. ఇంతకంటే ఏం కావాలి మనకు. రిజర్వేషన్లపై కోర్టు ఏం చెప్పిందో వైఎస్ జగన్ అదే చేశారు. కానీ చంద్రబాబు దుర్మార్గంగా జగన్‌పై నిందలు వేస్తున్నారు..ఇవాళ కోర్టులో అన్ని కేసులు కొట్టించుకున్నారు. మరి రిజర్వేషన్లపై కేసును ఎందుకు నీకు అనుకూలంగా తెచ్చుకోలేదు. డబ్బున్నోళ్లకు, పారిశ్రామిక వేత్తలకు లోకేష్ డోలో 650 అవుతా అంటున్నాడు. పేదలకు లోకేష్ పేరు గుర్తొస్తే పురుగుల మందు గుర్తుకొస్తుంది. హామీల గురించి విలేకరి అడిగితే మమ్మల్ని నమ్మడానికి జనానికి బుద్ధి లేదా అని లోకేష్ అంటున్నాడు’’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: డ్రామా చేస్తున్నారని మీకూ తెలుసు?: వైఎస్ జగన్ -
వెన్నుపోటు పార్టీ బీసీలకు మరోసారి ‘వెన్నుపోటు’: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు నిజంగా న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి వెన్నుపోటు పార్టీ సారథ్యంలోని ప్రభుత్వానికి ఉంటే.. వెంటనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి, అవసరమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి సవాల్ చేశారు. బీసీల రిజర్వేషన్ల సాధన కోసం కూటమి పార్టీల ఎంపీలు రాజీనామాలు చేస్తే, ఏకంగా కేంద్ర ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. తద్వారా కేంద్రం దిగివచ్చి బడుగులకు అవసరమైన 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే చర్యలు చేపడుతుందని సలహా ఇచ్చారు.కేంద్రంపై ఒత్తిడి తేకుండా బీసీలకు ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్ హామీని ఎలా అమలు చేస్తారో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బీసీల రిజర్వేషన్ల అంశాన్ని కేవలం రాజకీయ ప్రచారానికి ఉపయోగించకుండా, రాజ్యాంగబద్ధంగా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు.రిజర్వేషన్లకు సంబంధించిన న్యాయపరమైన పరిమితులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్న నేపథ్యంలో వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయని, వాటిని అనుసరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. రాజకీయ అవసరాలకు కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి సమాజంలో అట్టడుగున ఉన్న బడుగులకు ద్రోహం చేయడం తగదని వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.50 శాతం పరిమితిని అధిగమించాల్సి వస్తే అవసరమైన రాజ్యాంగపరమైన చర్యలు చేపట్టాలన్న జ్జానం చంద్రబాబుకు లేదా అని నిలదీశారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టపరమైన ప్రక్రియ అవసరం అనే సంగతి తెలియదా అని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదు అని తెలిసి కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జీఓలు జారీ చేయడం వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని ధ్వజమెత్తారు. ఈ ప్రెస్ మీట్ లో ఆమె ఇంకా ఏం మాట్లాడరంటే..ఆ కమిషన్ల నివేదికలపై చర్యలు ఏవీ..?గతంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిషన్ల నివేదికలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలి. మంజునాథ కమిషన్, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వంటి కమిషన్లను ఏర్పాటు చేసి నివేదికలు తీసుకున్న తర్వాత వాటిని బుట్టదాఖలు చేసింది. ఆ నివేదికల పరిస్థితి ఏమిటో ప్రజలకు వివరించాలి. కమిషన్ల నివేదికలను పక్కన పెట్టి కేవలం రాజకీయ ప్రకటనలతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం వెనుకబడిన వర్గాలకు వెన్నపోటు పోడవడమే. 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయడు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యంలో నష్టం జరిగింది.ఆ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఉంటే బీసీలకు లభించే రాజకీయ అవకాశాలు మరింతగా ఉండేవి. వేలాది స్థానిక సంస్థల పదవులను బీసీలు కోల్పోయారు. అంతేగాక భారీ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు కాకుండా నిలిచిపోయాయి. బీసీలకు రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో చంద్రబాబు బాధ్యతగా లేకుండా, రాజకీయ అవసరాలే పరమావధిగా వ్యవహరించారనడానికే ఇదే నిదర్శనం.గ్రామగ్రామానికి వెళ్లి బాబు ద్రోహాన్ని వివరిస్తాంకేంద్రంలో కూటమి ప్రభుత్వానికి భాగస్వామ్యంగా ఉన్న పార్టీలు తమ రాజకీయ బలాన్ని ఉపయోగించి బీసీల రిజర్వేషన్ల అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేయవద్దు. 34 శాతం రిజర్వేషన్ల అమలుపై కూటమి పార్టీలు వెనుకబడిన వర్గాలకు చేస్తున్న దగాను గ్రామగ్రామానకు వెళ్లి బీసీలకు వివరిస్తాం. కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు పరిస్థితిపై ద్రోహం చేస్తున్న తీరును ప్రజలకు వివరిస్తాం. వైఎస్సార్సీపీ బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుంది. గ్రామగ్రామాన పర్యటించి బీసీలకు వాస్తవ పరిస్థితులను వివరిస్తాం. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50 శాతం అవకాశాలు కల్పించాలి. బీసీలకు సంబంధించిన సంస్థలు, పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.వైఎస్ జగన్ హయాంలోనే బీసీలకు భరోసావైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారతకు అనేక చర్యలు చేపట్టింది.139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటికి చైర్మన్లు, డైరెక్టర్లుగా బీసీలకు అవకాశం కల్పించింది. బీసీలకు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా ప్రాధాన్యత కల్పించాం. బీసీల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించేందుకు వైఎస్సార్సీపీ ఎంపీల ద్వారా ప్రైవేట్ బిల్లులు కూడా ప్రవేశపెట్టించాం. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బీసీలకు భారీ స్థాయిలో ఆర్థిక సహాయం అందించాం. డీబీటీ ద్వారా రూ.1,22,451 కోట్లు, నాన్-డీబీటీ ద్వారా రూ.50,657 కోట్లు, మొత్తంగా రూ.1,73,109 కోట్లు బీసీలకు అందించాం. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారత కల్పించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది.పారదర్శక ఎన్నికలే మా లక్ష్యంఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తికాకముందే ఎన్నికలు నిర్వహించడంతో అనేక అవకతవకలు చోటుచేసుకునే అవకాశం ఉందని న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడాలని కోరాం. వలసలు, మరణాలు, ఇతర కారణాలతో తొలగించాల్సిన ఓట్లను సరిచేసిన తర్వాత తుది ఓటర్ల జాబితాను ప్రకటించాలి. తుది జాబితా వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్ల జాబితాపై మరింత స్పష్టత ఉంటుంది.సవరణ ప్రక్రియ పూర్తికాకముందు పాత జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తే తొలగించాల్సిన ఓట్లు కూడా అందులో ఉండే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా సవరణ పూర్తయి తుది జాబితా వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే అనవసరమైన వివాదాలకు అవకాశం ఉండదు. ప్రజాస్వామ్య ప్రక్రియ మరింత పారదర్శకంగా జరుగుతుంది. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు, ఓటర్ల జాబితా విషయంలో కూడా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కోరారు.ఇదీ చదవండి: ‘పాన్ ఇండియా జోకర్ నారా లోకేష్’ -
BC రిజర్వేషన్ అంటే ఏంటి.. చంద్రబాబు 34% వల్ల ఎంత నష్టం
-
అందుకే ప్రజలు చంద్రబాబును నమ్మరు: ఉషశ్రీ చరణ్
సాక్షి, తాడేపల్లి: 34 శాతం బీసీ రిజర్వేషన్ చెల్లదని తెలిసీ చంద్రబాబు డ్రామా చేశారని.. కేవలం బీసీలను మోసం చేయటానికే ఈ నాటకమంటూ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే చట్టమే తీసుకురావచ్చు.. కానీ అలా చేయకపోవటానికి కారణం బీసీలు ఎదగటం చంద్రబాబుకు ఇష్టం లేదు. వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు’’ అంటూ ఆమె దుయ్యబట్టారు.‘‘అందుకే ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు, జడ్పీలు, మేయర్లు, ఎంపీపీలు.. ఇలా అన్ని పదవుల్లోనూ వైఎస్ జగనే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. బీసీల బతుకుల్లో వెలుగు నింపినది వైఎస్ జగన్ మాత్రమే. బీసీల కోసం ప్రత్యేకంగా ఒక శాఖను పెట్టాలని కేంద్రానికి ప్రతిపాదన చేసిందీ వైఎస్ జగనే. బీసీల్లోని కులవృత్తుల వారి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలన్నదీ వైఎస్ జగనే.. ఇలా అనేక రకాలుగా ఆయన బీసీలకు మేలు చేశారు’’ అని ఉషశ్రీ చరణ్ వివరించారు.కానీ చంద్రబాబు పాలనలో బీసీలపై దాడులు జరుగుతున్నాయి. జోగి రమేష్, విడదల రజిని, కారుమూరి నాగేశ్వరరావు, సీదిరి అప్పలరాజు.. ఇలా అనేకమంది బీసీ నేతలపై దాడులు చేశారు. అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేశారు. బీసీలను మోసం చేసిన చంద్రబాబుకు తగిన బుద్ది చెప్పే రోజు త్వరలోనే వస్తుంది’’ అని ఉషశ్రీ చరణ్ తేల్చి చెప్పారు.ఇదీ చదవండి: రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. చంద్రబాబు వరుస డ్రామాలు! -
‘చంద్రబాబు..మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టండి’
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగానే బీసీలకు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. మోసం చేయడం, మాయ చేయడం చంద్రబాబుకు అలవాటేనని, ఇప్పుడు బీసీలకు కూడా వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు బీసీల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. . బీసీలకు రాజకీయంగా అండగా నిలిచింది వైఎస్సార్‌సీపీనేనని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం, అక్టోబర్ 1వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి బొత్స మాట్లాడుతూ.. ‘ సుప్రీంకోర్టుకు వెళ్తానని బాబు చెప్తున్నారు.. ఇది మోసం చేయడం కాదా?, బీసీల పట్ల చంద్రబాబుకు ప్రేమ ఉంటే రాజ్యాంగ సవరణ చేయండి వెన్నుపోటు పార్టీలో ఉన్న బీసీ నేతలు.. చంద్రబాబును ఎందుకు నిలదీయరు?, ఎన్నికల కోసం బాబు రాజకీయ డ్రామాలాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు చంద్రబాబు మోసాలను గమనించాలి’ అని సూచించారు.చట్టబద్ధమైన పరిష్కారం చూపండి‘కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే. మరి బీసీలకు న్యాయం చేయడానికి అడ్డంకి ఏమిటి?, 50 శాతం రిజర్వేషన్ పరిమితిపై న్యాయపరమైన పరిస్థితి తెలిసినా 34 శాతం పేరుతో బీసీలను ఎందుకు మభ్యపెడుతున్నారు?, మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామనడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు, చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్టబద్ధమైన పరిష్కారం చూపండి. బీసీల మనోభావాలతో రాజకీయాలు చేయడం చంద్రబాబు మానుకోవాలి. బీసీ రిజర్వేషన్లను వైఎస్సార్సీపీ అడ్డుకుందని చంద్రబాబు, టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎప్పుడు బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంది?.. ఆధారాలు చూపాలి. బీసీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదు?కోర్టుల తీర్పులకు వైఎస్సార్సీపీని బాధ్యులను చేయడం ఏంటి?, రాజ్యాంగపరమైన అంశాన్ని వైఎస్సార్సీపీపై నెట్టేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. బీసీలకు మేలు చేయాలన్న ఆలోచన ఉంటే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. టీడీపీ, కూటమిలోని బీసీ నేతలు తమ నాయకత్వాన్ని పార్లమెంట్లో పరిష్కారం కోసం ఎందుకు ప్రశ్నించడం లేదు?, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై కూటమిలోని బీసీ నేతలు కూడా గళమెత్తాలి. రిజర్వేషన్ల అంశాన్ని ఎన్నికల రాజకీయాలకు ఉపయోగించుకోవడం సమంజసం కాదు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సాకుగా మార్చొద్దు. 1994లోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. అంతా తానే చేశానని చంద్రబాబు చెప్పుకోవడం చరిత్రను వక్రీకరించడమేమా డిమాండ్ ఇదే..బీసీలకు 34 శాతం తానే ఇచ్చానంటూ చంద్రబాబు ప్రచారం చేసుకోవడం సరికాదు. ప్రతి సున్నితమైన అంశాన్నీ రాజకీయ కోణంలో చూడటమే చంద్రబాబు విధానం. బీసీ సోదరులు చంద్రబాబు ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాలను పరిశీలించాలి. బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించే మార్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీల ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధమైన, న్యాయపరంగా నిలబడగల పరిష్కారం తీసుకురావాలి’ అని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. చంద్రబాబు వరుస డ్రామాలు! -
బీసీ రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు డ్రామాలు: ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పేరుతో కూటమి ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ క్రీడలు, మోసపూరిత వైఖరిపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరును నిలదీశారు.సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులు స్పష్టంగా ఉన్నప్పటికీ, కేవలం రాజకీయ లబ్ధి కోసమే మళ్లీ జీవోల పేరుతో బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. న్యాయపరమైన అంశాలపై స్పష్టత లేకుండా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు మాయ మాటలతో మభ్యపెట్టి మోసం చేసే కుట్రకు తెరలేపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు నిజంగా 34 శాతం రాజకీయ ప్రాతినిథ్యం కల్పించాలనే చిత్తశుద్ధి ఉంటే, కేవలం జీవోలు, ప్రకటనలకే పరిమితం కాకుండా ఎన్నికల్లో పార్టీ తరఫున బీసీలకు అదే స్థాయిలో అవకాశాలు కల్పించాలని సవాల్ విసిరారు.స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను ప్రభుత్వం గౌరవించాల్సిందే అన్నారు. 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన న్యాయపరమైన ఆధారాలు, రిజర్వేషన్ పరిమితిని ఎలా సమర్థిస్తారన్న అంశాలపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని వివరాలు కోరిందని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు కల్పించిన రాజకీయ ప్రాతినిధ్యాన్ని ధర్మాన ప్రసాదరావు గణాంకాలతో సహా వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...కోర్టు తీర్పులు తెలిసే డ్రామాలు:సుప్రీంకోర్టులో ఉండే తొమ్మిది మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం.. వివిధ కేటగిరీల రిజర్వేషన్లు అన్నీ కలిపి 50 శాతం మించకూడదు అనేది అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన అత్యున్నత తీర్పు. ఇది దేశంలో అమల్లో ఉంది. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా బాగా తెలుసు. అయినప్పటికీ, ఏపీలో మళ్లీ 34శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ జీవో ఇచ్చి అమలు చేస్తామని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి?ఈ జీవో ఇచ్చిననాడే మేము స్పష్టంగా చెప్పాం.. ఇది రాజ్యాంగ ధర్మాసనం తీర్పునకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి కోర్టులో నిలబడదని, కొట్టేస్తారని ముందే చెప్పాం. ఇది తెలిసి కూడా ఇలాంటి అసాధ్యమైన జీవోలు ఇచ్చి హడావుడి చేయడం కేవలం ప్రజలను, ముఖ్యంగా బీసీలను మోసగించే చర్య కాక వేరే ఏమవుతుంది? రేపో మాపో సుప్రీంకోర్టు కూడా దీన్ని కొట్టేస్తుందని తెలిసినా కావాలనే ఈ నాటకాలు ఆడుతున్నారు. అమాయకులైన బీసీలను మోసం చేయడానికి ఇదొక ఆయుధంగా వాడుకుంటున్నారు.నిజమైన ప్రేమ ఉంటే ఇప్పుడు అమలు చేసి చూపించండి:మీకు నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే, 34శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఉంటే.. ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసి చూపించండి! మీకంటే ముందు ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వైఎస్ జగన్ గారు బీసీలకు ఏకంగా పదవుల్లో ఎలా పెద్దపీట వేసి చూపించారో చూడండి.వైఎస్సార్సీపీ హయాంలో బీసీలకు రాజ్యాధికారం:రాష్ట్రంలోని మొత్తం 13 మేయర్ స్థానాల్లో ఏకంగా 9 స్థానాలు (69%) బీసీలకే కేటాయించి వైఎస్సార్సీపీ చరిత్ర సృష్టించింది.13 జెడ్పీలలో 6 (46%) బీసీలకు ఇవ్వడం జరిగింది.14 రాజ్యసభ స్థానాల్లో 4 (36%), అలాగే లోక్‌సభ పోటీల్లో 25 స్థానాలకు గాను 11 (44%) బీసీలకే కేటాయించారు.ఎమ్మెల్సీలలో 48%, మున్సిపల్ చైర్పర్సన్లలో 53%, మండల పరిషత్తులలో 68% మేర బీసీలకు ప్రాతినిధ్యం కల్పించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే.చంద్రబాబువి కేవలం మాటలే.. చేతలు శూన్యం:మంత్రివర్గంలోనూ, ఉన్నత పదవుల్లోనూ బీసీలను ఎప్పుడైనా సమానంగా గౌరవించారా? కేవలం మాటలు చెప్పడం, జీవోల పేరుతో కాలయాపన చేయడం తప్ప బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు. నిజమైన సామాజిక న్యాయం కేవలం వైఎస్సార్సీపీ అధినాయకుడు వైఎస్ జగన్ గారి హయాంలోనే సాధ్యమైంది. మోసపూరిత మాటలతో మిమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నవారి పట్ల బీసీ సోదరులు ఐక్యంగా అప్రమత్తంగా ఉండాలి. మనల్ని వంచించే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. చంద్రబాబు వరుస డ్రామాలు! -
34% రిజర్వేషన్ల హామీ ఏమైంది? బీసీలకు బాబు క్షమాపణ చెప్పాలి..
-
వీడియో బయటపెట్టినందుకు అరెస్ట్ చేయిస్తావా! గుర్తుపెట్టుకో ఒకటికి రెండు తిరిగిస్తాం..!
-
సిగ్గుచేటు.. ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు?: చెల్లుబోయిన
సాక్షి, తాడేపల్లి: రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు బీసీలను మోసం చేశారని ఆరోపించారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. రిజర్వేషన్లు హైకోర్టు కొట్టేయటంతో చంద్రబాబు నైజం తెలిసింది. ఇంకెంత కాలం బీసీలను మోసం చేస్తారు చంద్రబాబూ అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పక్కన ఉంటే బీసీలు అవసరం లేదా అంటూ ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ జగన్ హయాంలో మాత్రమే బీసీలకు మేలు జరిగిందని అన్నారు.మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘రిజర్వేషన్లు హైకోర్టు కొట్టేయటంతో చంద్రబాబు నైజం తెలిసింది. 50% కంటే రిజర్వేషన్ పెంచటం కుదరదని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది. అయినప్పటికీ బీసీలను మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. చంద్రబాబు వెంటనే బీసీలకు క్షమాపణ చెప్పాలి. జీవోలు ఇచ్చి పాలాభిషేకం చేయించుకోవడం సిగ్గుచేటు. ఇప్పుడు ఆ బీసీలకు చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు?. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అధిక పదవులను కోల్పోయారు. తమిళనాడు తరహాలో చట్టం ఎందుకు తీసుకురాలేదు?. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్తామన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చెప్తారు?. చంద్రబాబు చేసిన మోసాలకు బీసీలు బలయ్యారు. ఆరు వారాల్లో ఎన్నికలు జరపాలని హైకోర్టు చెప్పింది. మరి ఈ ఆరు వారాల్లో బీసీలకు ఎలా న్యాయం చేస్తారు?. చంద్రబాబు బీసీలకు 34% సీట్లు ఇవ్వాల్సిందే. రాష్ట్రంలో 52% ఉన్న బీసీలను అన్యాయం చేస్తే సహించేది లేదు. పవన్ కళ్యాణ్ పక్కన ఉంటే బీసీలు అవసరం లేదా?. చంద్రబాబు ఎన్ని డ్రామాలు చేసినా బీసీలు ఇక నమ్మరు. వైఎస్ జగన్ హయాంలో మాత్రమే బీసీలకు మేలు జరిగింది. జడ్పీలు, మున్సిపాలిటీలు సహా రాజ్యసభ సీట్ల వరకు బీసీలకు జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రివర్గంలో కూడా అధిక పదవులు బీసీలకే ఇచ్చారు. నిజంగా చంద్రబాబుకు బీసీల మీద ప్రేమ ఉంటే చట్టం చేసే అవకాశం ఉన్నా అలా ఎందుకు చేయలేదు? కేవలం జీవోలు ఇచ్చి ఎందుకు సైలెంట్ అయ్యారు?’ అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: చంద్రబాబు డ్రామా పండింది.. హైకోర్టులో ఎదురుదెబ్బ -
రేవంత్ మాటలు.. బీజేపీకి వరంగా మారుతున్నాయా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనంతట తాను కొన్ని అనవసర అంశాలను ప్రస్తావిస్తున్నారా? లేక సలహాదారులు , పీఆర్ టీమ్ రాసి ఇస్తున్న వాటిని పాలో అవుతున్నారో తెలియదు. కాని ఆయన చేస్తున్న ప్రసంగాలు కొన్నిసార్లు వివాదాస్పదం అవుతున్నాయి. కొన్ని వ్యాఖ్యలు హేతుబద్దంగా కనిపించడం లేదు. ఇటీవల ఢిల్లీలో అస్సాం చెందిన ఒక మీడియా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఒటర్ల జాబితా ప్రత్యేక సవరణను బ్రిటిష్ హయాం నాటి సైమన్ కమిషన్‌తో పోల్చారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ శ్రీరాముడు ఉత్తరాది దేవుడు, ఉన్నవారి దేవుడు, శివుడు దక్షిణాది దేవుడు అంటూ చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇలాంటి విషయాలు మాట్లాడడానికి ముందు ఆయన పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తే బాగుంటుంది. అలాకాకపోతే ఆయన విమర్శలకు గురి అవుతారు. ఎన్నికల సంఘం దేశంలో ఎన్నికలను నిర్వహిస్తున్న తీరుపై , ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ అంశంలో అనుసరిస్తున్న విధానాలపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఈసీలో జరిగిన పరిణామాలపై ఇచ్చిన సంచలన కధనంతో ఆ సంస్థ ఆత్మరక్షణలో పడింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు ఆందోళనలు సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నిరసనలలో పాల్టొంటోంది. హైదరాబాద్ లో పీసీసీ అద్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితరులు నిరసనలు నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణపై గత కొన్ని నెలలుగా రేవంత్ కాని, కాంగ్రెస్ నేతలు కాని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా రాష్ట్రాలలో దీని పరిస్థితిపై లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈసీ పనితీరును ఉతికి ఆరేస్తున్నారు. దానికి ప్రతిగా బీజేపీ జవాబు ఇస్తోంది. ఇదంతా వేరే కధ. తాజాగా ఢిల్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు బహుశా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించడానికి చేశారా అన్న సందేహం కలుగుతుంది.ఆనాటి భారత ప్రభుత్వ చట్టాన్ని సమీక్షించడానికి, రాజ్యాంగ సంస్కరణలు చేపట్టడానికి సైమన్ కమిషన్ ఏర్పడింది. ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ పై ఆందోళనకు పిలుపు ఇచ్చింది. సైమన్ కమిషన్ లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించలేదన్నది ఈ నిరసనకు ప్రధాన కారణం. దీనిని ప్రస్తుత భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్కు పోలిక ఏమిటో తెలియదు. ఓటర్ల జాబితా సవరణ లో వివక్ష జరుగుతోందని, విపక్షం అదికారంలో ఉన్న రాష్ట్రాలలో లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతు అవుతున్న వైనంపై పలు అభియోగాలు వచ్చాయి.అసలు చట్టం లేకుండానే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టడం, ఓటర్ నమోదుకు అవసరమయ్యే ఫామ్ 6 లో పలు మార్పులు పార్లమెంటుతో సంబంధం లేకుండా చేయడం, ఓట్ల తొలగింపు ప్రక్రియను డిల్లీ లో కేంద్రీకృత విధానంలో చేయడం వంటివాటిపై అనుమానాలు వచ్చాయి. ఈ విషయాలను వివరించడం తప్పు కాదు.కాని తెలిసి,తెలియని రీతిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రసంగం చేస్తే అది ఆయనకు అంత ప్రతిష్టనివ్వదు. 13 కోట్ల ఓట్లను తొలగించిన వైనం, జనాభా పెరుగుతుంటే, ఓట్లు ఎలా తగ్గుతున్నాయని ప్రశ్నించడం వంటివి సమంజసమే. తమాషా అంశం ఏమిటంటే దేవుళ్లకు కూడా ఉత్తరాది, దక్షిణాది అని పేర్లు పెట్టడం. బహుశా దేశంలో ఏ రాజకీయ నేత ఇలాంటి విశ్లేషణ గతంలో చేసి ఉండరు.పైగా శివుడు పేదల దేవుడని, రాముడు సంపన్నుల దేవుడని ఆయన వర్గీకరించారు. దీనిపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్,బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు తదితరులు దేవుళ్లను కూడా చీల్చుతారా? అని విమర్శిస్తూ కాంగ్రెస్ ది ఎప్పుడూ విభజించే విధానమే అని ధ్వజమెత్తారు.ఆ రకంగా బీజేపీకి ఈయన అవకాశం ఇచ్చినట్లయింది కదా! రేవంత్ చేసిన ఈ వాదనలో హేతుబద్దత కూడా కనిపించదు. నిజానికి ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా లేకుండా భక్తులు శ్రీరాముడు, శివుడులను కొలుస్తారు. శ్రీరామ నవమి వస్తే శ్రీరాముడిని, శివరాత్రి వస్తే శివుడికి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ట్రాలలో రాముడి గుడి లేని గ్రామం ఉండదంటే ఆశ్యర్యం కాదు. అదే విధంగా శ్రీశైలంతో సహా పలు చోట్ల శివాలయాలు ఉంటాయి. భద్రాద్రిలో అదికారికంగా శ్రీరామనవమి చేస్తారు. ఎపీలో ఒంటిమింట, రామతీర్ధంలలో ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంది. ఉత్తరాదిలో శివాలయాలు పెద్ద ఎత్తునే కనిపిస్తాయి. ఉదాహరణకు వారణాసిలో ఉన్నది శివలింగమే కదా! కేదార్ నాద్, బదరీనాద్, అమరనాద్ వంటి ప్రముఖ క్షేత్రాలలో శివార్చనలు జరుగుతుంటాయి. అంతేకాదు.. లక్షల సంఖ్యలో ఉండే దేవుళ్లను ఆయా ప్రాంతాలలో ఆచారాలను బట్టి పూజిస్తారు. దీనికి ప్రాంతీయత ఆపాదించడం ఏమిటో! అయోధ్యలో రాముడికి బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో బ్రహ్మండమైన రీతిలో గుడి కట్టించిన నేపధ్యంలో ఆయన సంపన్నుల దేవుడని అన్నారో, లేక బీజేపీ సంపన్నుల పార్టీ అని చెప్పడానికి ఈ ఉపమానం వాడారో తెలియదు కాని అంత అర్దవంతంగా కనిపించదు.ఇదీ చదవండి: గతాన్ని మరిచిన బాబు.. ఈసీపై డబుల్ టాక్!?సాధారణంగా ఒక మాట చెబుతారు. విష్ణువు ధనికుడుగాను, శివుడు తిరిపమెత్తే దేవుడుగాను ప్రాచుర్యంలో ఉంటారు. బహుశా దానిని దృష్టిలో ఉంచుకుని రేవంత్ అన్నారేమో కాని, దానిని సరిగా చెప్పలేకపోయారనిపిస్తుంది. ధనిక, పేద తేడా లేకుండా హిందూ భక్తులు అంతా ఈ దేవుళ్లను పూజిస్తుంటారు. బీజేపీ వారు హరహర మహాదేవ అనరని రేవంత్ వ్యాఖ్యానించగానే, ప్రధాని మోడీ శివరాత్రినాడు అవే పదాలు వాడుతూ ప్రార్దనలుచేసిన వీడియోలు వచ్చేశాయి. అంటే సి.ఎమ్. స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియచేస్తుంది. తన గురువు చంద్రబాబు మాదిరే ఏది పడితే అది మాట్లాడితే రేవంత్ కే నష్టం అని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తుంటాయి. ప్రధాని మోడీ తెలంగాణతో పాటు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూడా అన్యాయం చేస్తున్నారని, అంతా గుజరాత్ కే చేసుకుంటున్నారని రేవంత్ ఆరోపించడం విచిత్రమే. బీజేపీ పాలిత రాష్ట్రాల తరపున ఈయన వకల్తా తీసుకోవడం ఏమిటో తెలియదు. అందుకు ఏమైనా ఉదహరణలు ఇచ్చారా అంటే అదీ కనబడదు. తాను కాంగ్రెస్ లోకి ఎందుకు రావల్సి వచ్చింది తదితర విశేషాలు చెప్పారు. వాటిలో అభ్యంతరాలు ఏమి లేవు. సహజంగానే బీఆర్ఎస్ పైన, కేసీఆర్‌పైన విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే ఆంధ్రవాళ్ల పెత్తనంపై పోరాడి తెలంగాణ సాధించుకున్నామని రేవంత్ చెబుతున్నారు. మరి ఇప్పటికీ ఆయన ఆంధ్రా నాయకుడైన చంద్రబాబు నాయుడుకే శిష్యుడుగా ఉంటున్నారన్న విమర్శ ఎందుకు వస్తోంది? టీడీపీ ఎంపీ ఒకరు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డా, అలాగే మరో ఎంపీ కుమారుడు చేసిన కారు ప్రమాదంలో ఒక మహిళ మరణించినా అరెస్టు చేయకపోవడం, ఏపీకి చెందిన కొందరు నేతలపై భూ కబ్జా ఆరోపణలు వచ్చినా చట్టాన్ని అమలు చేయకుండా, చూసిచూడనట్లు పోవడం వంటివాటిని గమనిస్తే ఇంకా వారి పెత్తనానికి రేవంత్ ప్రభుత్వం తలొగ్గి పనిచేస్తున్నదన్న భావన కలగదా! ఏది ఏమైనా రేవంత్ జాతీయ స్థాయిలో ప్రొజెక్టు కావాలన్న ఆలోచనలో తప్పు లేదు. కాని ఆ క్రమంలో చేసే ప్రసంగాలు, వ్యాఖ్యల పట్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది కదా!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. చంద్రబాబు వరుస డ్రామాలు!
సాక్షి, అమరావతి: బీసీల రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు వరుస డ్రామాలకు దిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవోలను ఏపీ హైకోర్టు గురువారం కొట్టేసింది. సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం తెచ్చిన ఆ జీవోలు చెల్లవంటూ హైకోర్టు తేల్చేసింది. తద్వారా ఊహించిన తీర్పే రావడంతో కూటమి సర్కార్‌పై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం కోటా కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2026 ఆగస్టులో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే.. ఈ రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించుతున్నాయంటూ జీవో 105, జీవో 1065 చట్టబద్ధతను సవాలు చేస్తూ న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు సందర్భంగా.. రిజర్వేషన్లు 59 శాతానికి మించి ఉండకూడదన్న ధర్మాసనం, రాజ్యాంగపరిధికి లోబడి రిజర్వేషన్లు కల్పించలేదని అభిప్రాయపడింది. మొత్తం రిజర్వేషన్లు పరిమితిని దాటకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని చెబుతూ పంచాయతీరాజ్, పురపాలక శాఖలు తెచ్చిన ఆ జీవోలను డిస్మిస్ చేసింది. సర్ ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికలను వాయిదా వేయాలని వైఎస్సార్సీపీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఉన్నత న్యాయస్థానం.. ఆ కారణంతో ఎన్నికలు వాయిదా వేయమని కోరడం సరికాదని వ్యాఖ్యానించింది. అలాగే వార్డుల పునర్విభజనపైనా జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. తుది ఓటర్ల జాబితా ప్రచురణలో చట్ట నిబంధనలు పాటించాలని.. ఆరు వారాల్లో స్థానిక సంస్థల ఎన్నిక ప్రక్రియ ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ తీర్పు వెల్లడించింది.డ్రామా నడిపిన చంద్రబాబుబీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా చట్టం మాత్రం చేయలేదు. బదులుగా కేవలం జీవోలతో ముందుకెళ్లడంపై మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లను చట్టబద్ధం చేయాల్సిన చంద్రబాబు.. డెడికేషన్ కమిషన్ ఏర్పాటు పేరిట మరో నాటకానికి తెర తీశారు. అయితే ఆ కమిటీ నివేదిక పూర్తిగా అందకముందే జీవోలు జారీ చేయడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటే అంశంపై ఇప్పటికే న్యాయపరమైన వివాదాలు, గతంలో కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ.. అదే అంశంపై మరోసారి జీవోలు ఇవ్వడం ద్వారా బీసీలను చంద్రబాబు గందరగోళానికి గురిచేశారు. ఇటు.. కేంద్రంలోనూ భాగస్వామ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధం చేసే దిశగా చర్యలు తీసుకోకపోవడాన్ని బీసీ సంఘాలు నిలదీస్తూ వస్తున్నాయి. ఈలోపు ఈ జీవోలను హైకోర్టు కొట్టివేయడంతో.. చంద్రబాబు డ్రామా పండిందంటూ బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. సుప్రీం పేరిట ఇంకోటి!హైకోర్టు తీర్పు.. తీవ్ర విమర్శల నేపథ్యంలో చంద్రబాబు మరో డ్రామాకు దిగినట్లు తెలుస్తోంది. తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని భావిస్తోందట. అయితే రిజర్వేషన్లు రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అలాంటిది ఈ జీవోల యవ్వారంలో బాబు సర్కార్ తీరును కోర్టు సమర్థిస్తుందా? అనేది అనుమానంగానే కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: అదెలా సమర్థించుకుంటారు?.. ఏపీ హైకోర్టు సూటి ప్రశ్న -
మీ చేతకాని ప్రభుత్వం వల్ల లక్ష 30 వేల ఉద్యోగులు రోడ్డున పడ్డారు
-
కొత్తవి లేవు.. ఉన్న వాటిలోనూ కోత!
ఎప్పుడో మంజూరై, ఏళ్ల తరబడి ప్రతీనెలా వృద్ధాప్య పింఛను డబ్బులు తీసుకుంటున్న గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండబాల వారి పాలెం గ్రామానికి చెందిన కుర్రా రుక్మిణమ్మ పింఛన్‌ను కూటమి ప్రభుత్వం 2025 జూన్‌లో అర్ధంతరంగా నిలిపివేసింది. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా పింఛన్లు రద్దు చేశారంటూ భర్త పద్మారావుతో కలిసి ఆమె ఏడాదిన్నరగా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ ఏడాది మే నెలలో గుంటూరు జిల్లా కలెక్టర్.. రుక్మిణమ్మ వృద్ధాప్య పింఛను పునరుద్ధరించాలంటూ సిఫార్సు చేయడంతో ఈమె గత 11 నెలల బకాయిలు పొందేందుకు అర్హురాలని పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇది జరిగి నాలుగు నెలలైనా వారు ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.సాక్షి, అమరావతి : చంద్రబాబు ప్రభుత్వం అక్టోబర్‌లో కూడా కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. పైగా పాత పింఛన్లకు గత నెలలో విడుదల చేసిన నిధుల కంటే తక్కువగా మంజూరు చేస్తూ.. అంటే కోత పెడుతూ అక్టోబర్ 1 (గురువారం)న పంపిణీ చేసేందుకు సచివాలయాల వారీగా నిధులు విడుదల చేసింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు కొత్తగా పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తులు స్వీకరించే ఆన్లైన్ పోర్టల్‌ను పూర్తిగా మూసేసిన విషయం తెలిసిందే. స్థానిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లో కేవలం తొమ్మిది రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణకు వీలు కల్పించింది. మళ్లీ అవకాశం వస్తుందో రాదో అన్నట్టు అర్హులు ఆపసోపాలు పడుతూ ఆఫీసులు చూట్టూ తిరిగి ఆ తక్కువ సమయంలోనే ఏకంగా 13.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో అక్టోబర్ 1వ తేదీ నాటికే కొత్త పింఛన్లు మంజూరు చేసి.. డబ్బులు కూడా పంపిణీ చేస్తారని టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం చేశారు. అయితే, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు పెట్టడానికే రెండేళ్ల నాలుగు (28) నెలలు గడువు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఆయా దరఖాస్తుల పరిశీలన అంటూ మరికొంత కాలం కాలయాపన చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. నెలనెలా పింఛన్ల నిధుల్లో కోతకొత్త పింఛన్ల సంగతి అలా ఉంచితే, పాత పింఛన్లకూ చంద్రబాబు ప్రభుత్వం ప్రతి నెలా కోతలు పెడుతూనే ఉంది. నెలనెలా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం మంజూరు చేసే నిధుల మొత్తం తగ్గిపోతూనే ఉంది. గత సెప్టెంబర్ 1న పంపిణీకి విడుదల చేసిన నిధుల కన్నా, ఈ అక్టోబర్ 1న పంపిణీ చేసే నిధులు తగ్గిపోయాయి. గత 28 నెలలుగా ప్రతి నెలా నాలుగైదు కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి విడుదల చేసిన మొత్తం తగ్గిపోతూనే ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏడాది క్రితం 2025 ఆగస్టులో పింఛన్ల పంపిణీకి విడుదల చేసిన నిధులు మొత్తం కన్నా, అక్టోబర్‌లో పంపిణీకి విడుదల చేసిన మొత్తం దాదాపు రూ.58 కోట్లు తక్కువగా ఉండడం గమనార్హం.పింఛన్ల సంఖ్యలో 6.42 లక్షలు తగ్గుదలగత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో దేశంలో మరే రాష్ట్రంలో (ఇప్పుడు మన రాష్ట్రంలో ఇస్తున్న సంఖ్య కంటే చాలా ఎక్కువ) లేనట్టుగా అత్యధికంగా 66,34,742 మంది లబ్ధిదారులు పింఛను పొందారు. తర్వాత కాలంలో పెన్షన్ల సంఖ్య సాధారణంగా పెరగాలి. కానీ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల రెండు నెలల తర్వాత కూడా ఈ సంఖ్య చాలా తక్కువగానే ఉంది. సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ మధ్య రాష్ట్రంలో జరిగిన పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కేవలం 59,91,857 మంది లబ్ధిదారులకు మాత్రమే డబ్బులు పంపిణీ చేసింది. అంటే దాదాపు గత ప్రభుత్వంలో గరిష్ట పింఛన్ల సంఖ్య కన్నా ప్రస్తుతం 6.42 లక్షల పింఛన్ల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. మరో వైపు 2019–24 మధ్య ఆ ఐదేళ్ల కాలంలో అప్పటి ప్రభుత్వం 29.51 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసినట్టు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అప్పట్లో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
అధికారులపై తారస్థాయికి చేరిన చంద్రబాబు కక్ష సాధింపు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు తారస్థాయికి చేరుతున్నాయి. హక్కుల కోసం శాంతియుతంగా నిరసనలు తెలిపిన ప్రభుత్వ ఉద్యోగులపై వేధింపులకు పాల్పడింది. సచివాలయ ఉద్యోగులపై పోలీస్ కేసులు, సస్పెన్షన్లతో వేధిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వ వైద్యుల పైనా ప్రతాపం చూపిస్తోంది. ప్రముఖ కార్డియో వాస్కులర్ సర్జన్ (సీటీవీఎస్) డాక్టర్ ప్రభాకర్‌రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఆయనకు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పోస్టింగ్ ఇచ్చినట్టే ఇచ్చి, కొన్ని గంటల్లోనే ఆ నియామకాన్ని నిలిపివేసింది. కర్నూలు జీజీహెచ్‌లో ప్రొఫెసర్ హోదాలో పనిచేస్తున్న ప్రభాకర్‌రెడ్డికి అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఏడీఎంఈ)గా ప్రమోషన్ లభించింది. పదోన్నతిపై ఆయన్ని నంద్యాల జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా నియమిస్తూ బుధవారం ఉదయం వైద్య శాఖ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయితే ఆయన నియామకాన్ని తప్పుబడుతూ ఎల్లో మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను టీడీపీ సోషిల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు, సీఎంవోకు ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. దీంతో ప్రభాకర్‌రెడ్డి నియామకాన్ని నిలిపివేయాలని సీఎంవో నుంచి వైద్య శాఖకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఈ ఆదేశాల ఆధారంగా బుధవారం సాయంత్రానికే వైద్య శాఖ ప్రభాకర్‌రెడ్డి నియామకాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ఇప్పుడీ అంశం వైద్య శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రమోషన్‌పై 9 మంది వైద్యులకు పోస్టింగ్‌లు ఇచ్చి, వారిలో కేవలం ప్రభాకర్‌రెడ్డి నియామకాన్ని మాత్రమే నిలిపివేయడం బాబు సర్కారు కక్ష సాధింపు చర్యలకు అద్దం పడుతోంది. ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లోని వైద్యులు చేతులెత్తేసిన క్లిష్టమైన గుండె ఆపరేషన్లను సైతం విజయవంతంగా నిర్వహించి ప్రభాకర్‌రెడ్డి వేల మంది ప్రాణాలను కాపాడారు. మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ సర్వీసులో హైదరాబాద్ గాంధీ, వైజాగ్ కేజీహెచ్, కర్నూలు జీజీహెచ్‌లలో 4 వేల గుండె ఆపరేషన్లు చేశారు. అంతటి సీనియర్ వైద్యుడిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడాన్ని వైద్య వర్గాలతో పాటు మేధావి వర్గాలు తప్పు పడుతున్నాయి. -
ఎండలో పాట్లు.. తిండికి ఫీట్లు..!
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య మున్సిపల్ స్టేడియంలో బుధవారం జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన పట్టాదారులు, జనం ఎండకు నిలబడలేక, ఆహారం అందక నరకయాతన అనుభవించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం 12 గంటలకే జరుగుతుందని.. అందరూ ఉ.10 గంటలకల్లా స్టేడియంలో ఉండాలని చెప్పడంతో పట్టాదారులు, వారి కుటుంబ సభ్యులంతా ఆ సమయానికి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే, మధ్యాహ్నం రెండు గంటలైనా కూడా సీఎం సభకు రాకపోవడంతో వచ్చిన వారు మండుటెండలో ఆకలి కేకలతో అలుమటిస్తూ కనిపించారు. పట్టాల పంపిణీ కౌంటర్ల వద్ద సిబ్బంది తక్కువుగా ఉండడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. గతంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పట్టాలు పనికిరావని చెప్పడంతోనే మళ్లీ వచ్చి ఈ పట్టాలను తీసుకోవాల్సి వస్తోందని లబ్థిదారులు వాపోయారు. ఉదయం రమ్మని చెప్పి తమకు తిండితిప్పలు లేక మండుటెండల్లో సాయంత్రం వరకూ పడిగాపులు కాసేలా చేశారంటూ మహిళలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఇక సభ ముగిసిన తర్వాత అధికారులు స్వీట్ బాక్సులు ఇచ్చేందుకు ప్రయత్నించడంతో అప్పటివరకూ ఆకలితో ఉన్న జనం ఒక్కసారిగా మీద పడడంతో మళ్లీ తోపులాట జరిగింది. పట్టాలతో పేద కుటుంబాలకు భరోసాఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలో బుధవారం నిర్వహించిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఆయన పేదలకు పట్టాలు పంపిణీ చేసి మాటాడారు. విశాఖలో 28 వేలమందికి, మంగళగిరిలో 5,800 కుటుంబాలకు భూములపై హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు విజయవాడలో 26,401 వేల కుటుంబాలకు పట్టాలు ఇస్తున్నట్లు తెలిపారు. మొత్తం కలిపి ఇప్పటివరకు 60 వేల మంది పేదలకు పట్టాలిచ్చినట్లు చెప్పారు. రూ.52 వేలకోట్ల విలువైన భూముల్ని పేదలకు ఇచ్చామన్నారు. విజయవాడలో ఇస్తున్న భూముల విలువ రూ.28,112 కోట్లని పేర్కొన్నారు. ఒక్కో స్థలం విలువ రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందించామని, వచ్చే ఏడాదిలోగా మరో 5.5 లక్షల ఇళ్లు ఇస్తామని చెప్పారు. 2019–24లో పాలకులు ప్రతి ఇంట్లోను ఆస్తుల వివాదాలు సృష్టించారని ఆరోపించారు. సంక్షేమం–అభివృద్ధి–సంపదసృష్టి నిరంతరం జరిగేలా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రూ.1.50 లక్షల కోట్లు అభివృద్దికి ఖర్చు చేశామన్నారు. 2028 కృష్ణా పుష్కరాల నాటికి కృష్ణా–గోదావరి నీళ్లు పుష్కలంగా మనకు వస్తాయని చెప్పారు. మహిళా వర్క్ ఫోర్సులో ఏపీ కీలకం కేంద్ర గణాంకశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం విమెన్ వర్క్ ఫోర్సులో విశాఖ, విజయవాడ ముందంజలో ఉన్నాయని చెప్పారు. విశాఖలో ప్రతి వందమందిలో 42 మంది మహిళలు, విజయవాడలో ప్రతి వందమందిలో 37 మంది మహిళలు పనిచేస్తున్నట్టు వెల్లడైందని తెలిపారు. పారిశ్రామికవేత్తలుగా ప్రతి వందమందిలో 30 శాతం మంది మహిళలే ఉన్నారని చెప్పారు. కాగా, తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని జలవనరుల శాఖ అధికారులను సమీక్ష సందర్భంగా సీఎం ఆదేశించారు. చంద్రబాబు సభ ఎదుట పేలిన గ్యాస్ సిలిండర్ విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య మున్సిపల్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన పేదలకు పట్టాభిషేకం సభ వద్ద పెను ప్రమాదం తప్పింది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో సభా ప్రాంగణానికి ఎదురు భాగంలో స్టేడియం బయట సోడా బండికి ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి విద్యుత్ తీగలను దాటి 200 మీటర్ల దూరంలో ఇళ్ల మీద నుంచి రోడ్డు మీద పడింది. దీంతో అక్కడ ఉన్న పోలీసులు, ప్రజలు పరుగులు తీశారు. అదే గ్యాస్ సిలిండర్ దిశ మారి స్టేడియం వైపు వచ్చి ఉంటే సభా ప్రాంగణంలో వేదికకు దగ్గర్లో పడి పెనుముప్పు వాటిల్లేది. సీఎం వచ్చిన కాసేపటికే ‘పవర్’ కట్.. పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటిగంటకు జరుగుతుందని చెప్పినా సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 2:30 గంటలు దాటిన తరువాత వచ్చారు. ఆయన సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వెంటనే అక్కడ పవర్ కట్ అయ్యింది. వేదిక పైకి చేరుకుని మాట్లాడుతుండగా కృష్ణాహోటల్ సెంటర్ వైపు ఉన్న సోడా బండికి అమర్చిన గ్యాస్ సిలిండర్ పేలింది. -
‘ఒప్పుకుంటే ప్రమోషన్లు.. ఒప్పుకోకపోతే థర్డ్ డిగ్రీనా?’
తాడేపల్లి :లిక్కర్ కేసు పేరుతో వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. ముందే టార్గెట్ పిక్స్ చేసుకుని సిట్ విచారణ సాగిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ వద్ద పని చేసిన అధికారులు, పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకూల వాంగ్మూలాల కోసం బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడుతున్నారన్నారు. ఒప్పుకుంటే ప్రమోషన్లు.. ఒప్పుకోకపోతే థర్డ్ డిగ్రీనా? అని నిలదీశారు టీజేఆర్. ‘చెవిరెడ్డి మాజీ గన్మెన్ల వ్యవహారమే సిట్ విచారణ తీరుకు నిదర్శనం. ఒక గన్‌మెన్‌కు జీతం పెంపు.. మరో గన్‌మెన్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వెంకటేష్ నాయుడు కోర్టులో చేసిన ప్రకటనలపై సిట్ సమాధానం చెప్పాలి. రూ.11 కోట్ల నగదు పట్టుకున్నామన్న వ్యవహారంలో నిజాలు బయటపెట్టాలి. ల్యాప్‌టాప్‌లు, మొబైళ్లలో డేటా ట్యాంపరింగ్ చేశారనే అంశాలపై సమాధానం చెప్పాలి. చంద్రబాబు జేబు సంస్థలా సిట్ వ్యవహరిస్తోంది. జరగని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి రాజకీయ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. డీఎస్సీ వివాదం నుంచి దృష్టి మళ్లించేందుకే లిక్కర్ కేసును మళ్ళీ తెరపైకి తెచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విక్రయాలు ప్రభుత్వ ఆధీనంలోనే జరిగాయి. ప్రభుత్వమే మద్యం అమ్మితే ప్రైవేటు వ్యక్తులకు లంచాలు ఎక్కడి నుంచి వస్తాయి?, వైఎస్సార్సీపీ హయాంలో మద్యం దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించాం. కూటమి పాలనలో మద్యం షాపులు భారీగా పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 60 వేలకుపైగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారు. ప్రస్తుత మద్యం విధానంలో టీడీపీ నేతల సిండికేట్లు నడుస్తున్నాయి. మద్యం దుకాణాల నిర్వహణలో మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యం ఉంది. ఎంఆర్పీపై ఒక్కో బాటిల్‌కు రూ.20–40 అదనంగా వసూలు చేస్తున్నారు. కొత్త టెండర్లు పిలవకుండా పాత లైసెన్సులనే ఎందుకు కొనసాగించారు?, టెండర్ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎందుకు వదులుకున్నారు?, మద్యం విక్రయ కేంద్రాలు పెరిగినా ప్రభుత్వ ఆదాయం అందుకు అనుగుణంగా ఎందుకు పెరగలేదు?, ఆ అదనపు ఆదాయం ఎక్కడికి వెళ్తోందో ప్రభుత్వం లెక్క చెప్పాలి. గత ప్రభుత్వంలో రూ.3 వేల కోట్ల స్కామ్ జరిగిందంటే ఆ మొత్తం ఇప్పుడు అదనపు ఆదాయంగా కనిపించాలి కదా?, రాష్ట్రంలో కల్తీ, నకిలీ మద్యం విక్రయాలపై సమగ్ర విచారణ జరపాలి. ‘అసలైన లిక్కర్ స్కామ్ ఇప్పుడే జరుగుతోంది. కూటమి ప్రభుత్వ మద్యం విధానంలోని ప్రతి అంశంపై చట్టపరంగా పోరాడతాం’ అని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: అప్పుడు అన్ని వేళ్లు బాబు వైపు చూపించలేదా?: రాచమల్లు -
ఇదంతా నువ్వే చేయిస్తున్నావ్ అని నాకు తెలుసు.. వివేకా అల్లుడా నీకే చెప్తున్నా
-
‘కోర్టు తీర్పు.. చంద్రబాబు సర్కార్‌కు చెంపపెట్టు’
సాక్షి, తాడేపల్లి: తెనాలిలో పోలీసుల చేతిలో దారుణంగా హింసకు గురైన నలుగురు దళిత యువకులకు జరిగిన అవమానం, మానసిక క్షోభకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, అందుకుగాను బాధిత కుటుంబాలకు వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. తెనాలిలో నలుగురు దళిత యువకులను రోడ్డుపై దారుణంగా కొట్టి హింసించిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన గుర్తు చేశారు.ఆ కుటుంబాల గౌరవం కాపాడాలి:ఈ కేసులో యువకులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించి క్లీన్ అక్విటల్ ఇవ్వడం ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని గోరంట్ల మాధవ్ అన్నారు. బాధిత యువకుల డిగ్నిటీ, డిసెన్సీ, వారికి జరిగిన అవమానానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఆ బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాతో పాటు, వారి గౌరవాన్ని కాపాడేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజల హక్కు కాలరాస్తున్నారు:పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్, బీఎస్ఏ వంటి చట్టాలను అమలు చేయాల్సిన పోలీసు వ్యవస్థ, లోకేష్ చేతిలో ఉన్న ఎర్రబుక్‌ను అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. పోలీసు వ్యవస్థకు డిసిప్లిన్, డిగ్నిటీ, ఇంటిగ్రిటీ ఉండాలని, అయితే కొందరు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రభుత్వం చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా అమలు చేస్తున్నారని ఆక్షేపించారు. దీని వల్ల పోలీసు వ్యవస్థ డిసెన్సీ, డిగ్నిటీ దిగజారిపోతోందని గోరంట్ల మాధవ్ అన్నారు.ఇదీ చదవండి: కన్నీటితో చంద్రబాబు సర్కార్‌కు హెచ్చరిక -
గతాన్ని మరిచిన బాబు.. ఈసీపై డబుల్ టాక్!?
రాజకీయ ప్రయోజనాలకోసం ఎన్నికల వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీయడం విచారకరం.. ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్య.2019లో చంద్రబాబే చేసిన ఇంకో వ్యాఖ్యను గమనించండి. మోదీ దేశంలోని ప్రతిష్టాత్మక వ్యవస్థలను ధ్వంసం చేశారు. బీజేపీ పాలనలో వ్యవస్థల స్వతంత్రత, ప్రజాస్వామ్యం దాడికి గురవుతున్నాయి. సీబీఐ మొదలు ఆర్బీఐ వరకు... ఎన్నికల కమిషన్ వంటి సంస్థలను కూడా వదలిపెట్టడం లేదు.ఈ రెండు వ్యాఖ్యలను చదివితే ఏమనిపిస్తుంది? చంద్రబాబు వంటి అవకాశవాద రాజకీయ నేతల వల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటోందా? లేక బలపడుతోందా? అన్న భావన కలగదా! తాను అధికారంలో ఉంటే అంతా సజావుగా ఉన్నట్లు, అధికారంలో లేకపోతే వ్యవస్థలన్నీ పాడైనట్లు జనం అనుకోవాలన్నమాట. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్‌కుమార్ నియమితులైనప్పటి నుంచి వివాదాలు మరీ తీవ్రమైనట్లు అనిపిస్తుంది. గతంలో కూడా కొందరు సీఈసీలపై విమర్శలు వచ్చాయి. కానీ ఈసారి వచ్చినవి తీవ్రమైన అభియోగాలు.గతంలో టీఎన్ శేషన్ సీఈసీగా ఉన్నప్పుడు దేశం మొత్తాన్ని గడగడలాడించారంటే అతిశయోక్తి కాదు. కాస్త దుందుడుకు అన్న విమర్శ ఉన్నప్పటికీ, రాజకీయ నేతలు ఎన్నికల అక్రమాలకు పాల్పడాలంటే, అదికారులు రాజకీయ నేతలకు సహకరించాలంటే భయపడే పరిస్థితిని తెచ్చారు. చివరికి గోడలపై ఎన్నికల ప్రచారం చేయడానికి కూడా ఒకటికి, రెండుసార్లు ఆలోచించుకునేవారు. అప్పట్లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో విబేధాలు రావడంతో, ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు ఎన్నికల కమిషన్‌ను త్రిసభ్య కమిషన్‌గా మార్చారు. ఆయన తనకు సన్నిహితుడైన జీవీజీ కృష్ణమూర్తిని నియమించారని అంటారు. శేషన్‌కు చెక్ పెట్టడానికి ఈ ఏర్పాటు జరిగిందన్న భావన అప్పట్లో ఉండేది. ఆనాటి నుంచి త్రిసభ్య కమిషనే కొనసాగుతోంది. కొన్నిసార్లు విమర్శలు వచ్చేవి.కేంద్రంలో శక్తిమంతమైన ప్రభుత్వం ఉన్నప్పుడు కొందరు ఎన్నికల కమిషనర్లు రాజీనామా చేసి వెళ్లిపోయిన ఘట్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధానిగా, బీజేపీ అదికారంలోకి వచ్చాక కొన్ని ఇలాంటివి జరిగాయి. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న ఒకరి కుటుంబ సభ్యులపై ఈడీని ప్రయోగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఎంపిక కమిటీలో సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ బదులుగా కేంద్ర మంత్రిని ఒకరిని నామినేట్ చేసే పద్దతిని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది. లోక్‌సభలో విపక్ష నేతకు ఇందులో స్థానం ఉన్నా ఆ పాత్రను నామమాత్రం చేశారన్నమాట.గత 2024 ఎన్నికలకు ముందు జ్ఞానేశ్‌కుమార్‌ను ఎంపిక చేసుకున్న వైనం, అంతకుముందు కేంద్రంలో ఈయన కీలక పాత్ర పోషించిన తీరు, గతంలో కేరళలో పనిచేసినప్పుడు వచ్చిన విమర్శలు, ప్రధాని, హోం మంత్రులకు ఈయన సన్నిహితుడన్న ప్రచార నేపథ్యం వంటివాటిని పరిగణనలోకి తీసుకుంటే సహజంగానే ఆయా వర్గాలకు అనుమానాలు కలుగుతాయి. దానికి తోడు పశ్చిమబెంగాల్, బిహార్, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలలో 2024 ఎన్నికలు జరిగిన తీరుతెన్నులపై ఎన్నో సంశయాలు వచ్చాయి. కొన్ని రాష్ట్రాలలో ఓటర్ల జాబితా సవరణ పేరుతో లక్షల ఓట్ల తొలగింపు, లేదా పెండింగులో పెట్టడం, పోలింగ్ జరిగేనాటికి కూడా ఓటర్ల నమోదు దరఖాస్తులను పరిష్కరించకపోవడం, ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరు, అర్ధరాత్రి దాటిన తర్వాత లక్షల ఓట్లు పోలైనట్లు చూపించడం, వీటిపై ఆధార సహితంగా ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం వంటివి ఎన్నికల సంఘంలో పారదర్శత లేదన్న అభిప్రాయం కలిగించింది.కొన్ని ఉదాహరణలు చూడండి.. పశ్చిమబెంగాల్లో 27 లక్షల ఓట్లను పెండింగ్‌లో ఉంచారట. వాటి సంగతి తేల్చకుండా ఎన్నికలు పూర్తి చేయడంలో ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు వాటిని పరిశీలిస్తుంటే 97 శాతం ఓట్లు నిజమైనవేనని తేలుతోందట. ఏపిలో సాయంత్రం ఆరు తర్వాత ఏభై లక్షల ఓట్లు ఎలా పోలయ్యాయి? అందులోను అర్దరాత్రి 12 గంటల నుంచి రెండుగంటల వరకు 17 లక్షల ఓట్లు ఎలా పోల్ అయ్యాయన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఎన్నికల సంఘం మౌనముద్ర దాల్చింది. వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు ఫిర్యాదు చేసినా కిమ్మనలేదు. పరకాల ప్రభాకర్ వంటి వారు పరిశోధన చేసి సదస్సులు పెట్టి విమర్శలు గుప్పిస్తున్నా, జవాబు ఇవ్వడం లేదు. ఎన్నికల వ్యవస్థపై అభాండాలు వేస్తారా అని కూడా అడగలేకపోయింది.ఇదీ చదవండి: బాబుకు సోషల్ మీడియా భయం.. కరపత్రాల ప్రచారం తగ్గిందా?విశేషం ఏమిటంటే 2009లో కాని, 2019లో కాని ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ పైన, ఈవీఎంల పైన తీవ్ర విమర్శలు చేసి, అవి మానిప్యులేషన్‌కు గురి అవుతున్నాయని ఆరోపించారు. నిజానికి అప్పట్లో ఈవీఎంలపై ఈ స్థాయిలో సందేహాలు రాలేదు. అయినా వాటి ద్వారా అక్రమాలు చేయవచ్చని ఆయన అనేవారు. అలాంటి వ్యక్తి.. ఇప్పుడేమో ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లేలా విమర్శలు చేయరాదని సుద్దులు చెబుతున్నారు. 2019లో ఆనాటి ప్రధాని మోదీపై ఎంత తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది ఆయన ట్వీట్లే తెలియచేస్తాయి. సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్ వంటి వ్యవస్థలను ధ్వంసం చేశారని కూడా ఆనాడు ఆరోపించారు. ఇప్పుడేమో ఇలా అమాయకంగా మాట్లాడుతున్నారు. అవే ఆయన తెలివితేటలు.చంద్రబాబు వ్యూహాత్మకంగా, ఎలాగొలా బతిమలాడి 2024 ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఏపీలో పరిస్థితులు మారిపోయాయి. ఎన్నికల కమిషన్ పూర్తిగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు వ్యవహరించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆనాటి బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తమకు ఏ ఏ అధికారి కావాలో చెబుతూ జాబితాను సమర్పిస్తే, చాలావరకు ఎన్నికల సంఘం అమలు చేసిందని చెబుతారు. సీసీ టీవీ ఫుటేజీ ఒకసారి లీక్ అయింది. దానిని టీడీపీ ప్రచారం చేసింది. అయినా అదెలా జరిగిందని ఈసీ అడగలేదు. ఎన్నికలయ్యాక కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్దిష్ట గడువుతో సంబందం లేకుండా వివిపాట్ స్లిప్‌లను దగ్దం చేసేయడం పలు సందేహాలకు అవకాశం ఇచ్చింది.కొందరు వైఎస్సార్సీపీ నేతలు కొన్ని బూత్‌లలో ఓట్లను తిరిగి లెక్క వేయాలని కోరుతూ దరఖాస్తు చేసినా అందుకు ఎన్నికల కమిషన్ అధికారులు సిద్దపడలేదు. దీనిపై న్యాయవ్యవస్థ వద్దకు వెళ్లినా ప్రయోజనం కలగకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిన వ్యవస్థలు ఇలా వ్యవహరిస్తున్నాయేమిటా అని చాలామంది బాధపడ్డారు. కాని జరగవలసిన డామేజీ జరిగిపోయింది.ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎన్నికల కమిషన్‌లో జరిగిన కొన్ని పరిణామాలు, ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం చెప్పిన విధానం.. అన్నిటిని జర్నలిస్టు రితిక చోప్రా వెలుగులోకి తీసుకువచ్చిన కథనం సంచలనం అయింది. ఇందుకు ఆమె చేసిన కృషిని అంతా అభినందించాలి. ఎన్నికల కమిషన్‌లోని డొల్లతనం అంతా వెలుగులోకి వచ్చింది. అసలు ఇలా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు చట్టంలో ఎక్కడా అవకాశం లేదని, మాజీ ఎన్నికల ముఖ్య కమిషన్ ఖురేషి వెల్లడించారు. అయినా జ్ఞానేశ్‌కుమార్ ఎలా చేశారంటే ఏమి చెబుతాం. కేవలం బీజేపీ, దానికి మద్దతు ఇచ్చే పార్టీల కోసమే పనిచేస్తున్నారని, విపక్ష పార్టీల వాదనలను పెడచెవిన పెడుతున్నారన్న భావన కలిగితే వ్యవస్థకు ఎంత నష్టం. ఎవరు ఫిర్యాదు చేసినా అందులోని వాస్తవాలను విచారించి న్యాయం ఏమిటో తేల్చవలసిన ఎన్నికల వ్యవస్థే ఏకపక్షంగా మారితే ఎన్నికలు జరిగి ఏమి ఉపయోగం? ఇదంతా నియంతృత్వానికి దారితీయదా? అందువల్లే ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలవరం సృష్టిస్తోంది.జ్ఞానేశ్ రాజీనామాకు విపక్షంలోని కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ, సమాజవాది, తదితర పార్టీలతో పాటు యువతకు ప్రాతినిథ్యం వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామక విధానంపై పునఃసమీక్ష జరగాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అభిప్రాయపడ్డారు. గతంలో తాము మద్దతు ఇచ్చినప్పటికీ, జరిగిన పరిణామాల రీత్యా దీనిలో మార్పు రావాలని ఆయన కోరారు. ఈ అంశంపై కొన్ని బీజేపీ మిత్రపక్షాలు కూడా జాగ్రత్తగా స్పందించాయి. వాటిలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈసీ వివరణ ఇవ్వాలని తొలుత సూచించారు. దానికి టీడీపీ అధినాయకత్వం కంగారుపడినట్లు ఉంది. తదుపరి ఈసి ఇచ్చిన వివరణ అంత సంతృప్లిగా లేనప్పటికీ, చంద్రబాబు నాయుడు బీజేపీకి కోపం రాకుండా వెంటనే స్పందించారు.ఇంతకాలం ఏపిలో జరిగిన ఎన్నికల ప్రహసనంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా మాట్లాడని చంద్రబాబు దీనిపై మాట్లాడుతూ వ్యవస్థల విశ్వసనీయత గురించి ధర్మోపదేశం చేశారు. ఏపిలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి అవకతవకలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పెద్దగా ప్రయోజనం జరగలేదని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు వంటివి లేకుండా ఓటర్ల జాబితాలను తయారు చేయాలన్న చిత్తశుద్ది ఉంటే, ఆధార్ కార్డుకు లింక్ పెట్టి ఓట్లను ఖరారు చేస్తే సరిపోతుందని ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. అది చేయకుండా ఎన్నో విన్యాసాలను ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ చేస్తుంటే ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఎలా కుదురుతుంది?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సీఎం కాదు 'ఛీ' ఎం.. ఉద్యోగులకు నారా వారి నరకం..
-
సాంకేతిక విద్యలో ‘సొంత’ రాజ్యం
సాక్షి, అమరావతి: సాంకేతిక విద్యాశాఖలో అధికారులు ఆడిందే ఆటగా సాగుతోంది. ఆ శాఖలో ఏం జరుగుతోంది, ఉద్యోగుల సమస్యలేమిటనే కనీస విషయాన్ని కూడా సంబంధిత మంత్రి, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండేళ్లుగా ప్రమోషన్లను అటకెక్కించడమే కాకుండా కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) అమలులో అడ్డగోలు నిబంధనల్ని చొప్పించి ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టడం, 20 ఏళ్లనాటి సర్వీస్ రూల్స్‌ను తమ స్వప్రయోజనాల కోసం చట్టవిరుద్ధంగా మార్చేందుకు యత్నించడం వంటి చర్యలతో సాంకేతిక విద్యాశాఖ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. జరుగుతున్న అక్రమాలను ఈ ఏడాది ప్రారంభంలో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా.. వెనక్కి తగ్గిన శాఖ అధికారులు మళ్లీ తమ విధానాలను బలవంతంగా ఉద్యోగులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో వెలుగులు.. నేడు చీకట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉండగా పాలిటెక్నిక్ విద్యా రంగానికి, అందులో పనిచేసే సిబ్బంది సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత లభించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పే–స్కేల్‌ను (2016 పే–స్కేల్) 2022లో ఉద్యోగులకు వర్తింపజేసి ఆర్థిక భరోసా కల్పించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేసి, పలు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు శాశ్వత పోస్టులను మంజూరు చేశారు. అర్హులైన అన్ని కేడర్ల బోధన, బోధనేతర సిబ్బందికి సకాలంలో పదోన్నతులు కల్పించారు. విద్యా సంస్థల్లో మౌలిక వసతులు, ల్యాబ్‌ల ఆధునికీకరణతో పాలిటెక్నిక్ విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందేలా చర్యలు తీసుకున్నారు. రికార్డు స్థాయిలో పాలిటెక్నిక్ కోర్సులకు ‘ఎన్బీఏ గుర్తింపు’ వచ్చేలా చేశారు. అయితే, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఈ శాఖను పూర్తిగా గాలికొదిలేసింది. 2024–25, 2025–26 ప్యానెల్ సంవత్సరాలకు సంబంధించి ఉద్యోగులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన పదోన్నతులు రాకుండా చేసి, తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. కేవలం డైరెక్టర్/కమిషనర్ స్థాయిలోనే నిర్ణయం తీసుకుని విడుదల చేసే వీలున్న ‘లెక్చరర్ నుంచి సీనియర్ లెక్చరర్’ ప్రమోషన్లను సైతం విడుదల చేయకుండా కొందరు అధికారులు మోకాలడ్డారు. దీంతో కొందరు ఉద్యోగులు తమ మొత్తం సర్వీసులో ఒక్క పదోన్నతైనా పొందుతారో లేదో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. సాంకేతిక విద్యను ఉన్నత విద్యలో విలీనం చేసిన తర్వాత మంత్రులుగానీ, ప్రభుత్వ పెద్దలుగానీ ఈ శాఖలో ఏం జరుగుతుందో కనీసం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టకపోవడంతో కొందరు అధికారులు పెట్టినవే నిబంధనలు అన్నచందంగా మారిపోయింది. సీఏఎస్ ప్రహసనం.. రూల్స్‌కు తిలోదకాలు పదోన్నతులు కల్పించని పక్షంలో లెక్చరర్ల సర్వీసును గుర్తించి ఆర్థిక ప్రయోజనం కల్పించేందుకు ఉద్దేశించిన ‘కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్’ (సీఏఎస్) అమలులో డైరెక్టరేట్ అధికారులు చేసిన తప్పులు ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి. జీవో–10 ప్రకారం పాలిటెక్నిక్ లెక్చరర్లు లెవెల్–9ఏతో సర్వీసులో చేరతారు. ఐదేళ్ల సర్వీసు, నిర్ణీత అర్హతలు పూర్తి చేసుకున్న వారికి లెవెల్–10 అమలు చేయాలి. తర్వాత స్థాయి లెవెల్–11 (లెక్చరర్ సీనియర్ స్కేల్) ఇవ్వాలంటే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అనుమతి, స్క్రీనింగ్ కమిటీ క్లియరెన్స్ జీవో–10 ప్రకారం తప్పనిసరి. కానీ, డైరెక్టరేట్‌లోని కొందరు అధికారులతో కూడిన అంతర్గత కమిటీ అత్యుత్సాహం ప్రదర్శించి, ఏపీపీఎస్సీ అనుమతి లేకుండానే సెపె్టంబర్ నెలలో ఏకంగా 244 మంది లెక్చరర్లకు లెవెల్–9ఏ నుంచి నేరుగా లెవెల్–11 ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2012–13లో చేరిన వారికి ఏఐసీటీఈ–2016 నిబంధనల ప్రకారం 2022లోనే లెవెల్–10 ఇవ్వాల్సి ఉండగా.. అది ఇవ్వకుండా నేరుగా లెవెల్–11 ఎలా ఇస్తారని, రేపు ఆడిట్ అభ్యంతరాలతో రికవరీలు విధిస్తే ఎవరిది బాధ్యతని లెక్చరర్లు నిలదీశారు. తప్పిదం బయటపడటంతో కొద్ది రోజులకే ఆ ఉత్తర్వులను అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వెబ్సైట్ నుంచి తొలగించారు. కానీ ఉత్తర్వుల రద్దు చేస్తూ ప్రొసీడింగ్ ఇవ్వకపోవడంతో కొన్ని కాలేజీల్లో లెవెల్–11 వేతనాలు డ్రా చేయడం, మరికొన్ని కాలేజీల్లో నిలిపివేయడం జరిగింది. దీంతో ఒకే నోటిఫికేషన్ ద్వారా సర్వీసులో చేరిన ఉద్యోగుల మధ్య నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతన వ్యత్యాసం ఏర్పడింది. అటు పదోన్నతులు, ఇటు కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అమలు కాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులోనూ తప్పులే.. పోస్టుల విభజన ప్రక్రియలో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడంలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఈ నిబంధనల ప్రకారం పేస్కేల్ ఆధారంగా పోస్టులను నిర్ణయించే విధానాలను పాటించలేదు. కేవలం కొందరు ఉద్యోగుల పదోన్నతుల ప్రయోజనం చేకూర్చే విధంగా తప్పులు చేశారు. అయితే, వీటికి కార్యదర్శి స్థాయిలో తీవ్రస్థాయి ఫిర్యాదులు అందడంతో అడ్డుకట్టపడింది. అసలు సర్వీస్ నిబంధనలు లేని శాఖగా సాంకేతిక విద్యాశాఖను మార్చి అభాసుపాలు చేశారని సిబ్బంది మండిపడుతున్నారు.సర్వీస్ రూల్స్‌పై నిండా నిర్లక్ష్యం 20 ఏళ్ల క్రితం నాటి సర్వీస్ రూల్స్ మార్పు ప్రక్రియ కోసం నిబంధనల ప్రకారం ఇతర శాఖల నిపుణులతో కాకుండా సొంత శాఖ అధికారులతోనే హైపర్ కమిటీ వేయించుకున్నారు. గతంలో తమ పదోన్నతుల కోసం సొంత శాఖపైనే హైకోర్టులో కేసులు వేసిన వ్యక్తులను ఈ కమిటీలో కీలక సభ్యులుగా నియమించడం గమనార్హం. అనుకూల నిబంధనలు రూపొందిస్తామని చెప్పి కొందరి నుంచి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడ్డారన్న విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తమ సమస్యలను కనీసం పట్టించుకోకపోవడం, కొందరు అధికారులు ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తుండటంతో లెక్చరర్లు, ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పదోన్నతులు, ఆగిపోవడానికి సర్వీస్ రూల్స్ లేకపోవడమేనని చెబుతున్నారు. సర్వీస్ రూల్స్‌కు సంబంధించి అంతర్గత కమిటీ నివేదికను అందరికీ అందుబాటులో ఉంచలేదని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అప్పటి డైరెక్టర్ ఆదేశాల మేరకు ఆన్లైన్లో ఉంచారు. దీనికి పర్యవసానంగా ఉద్యోగుల నుంచి 300 పైగా అభ్యంతరాలు డైరెక్టరేట్‌కు అందాయి. అనంతరం వీటి పరిశీలనకు జేఎన్టీయూ, ఉన్నత విద్యశాఖల ఉద్యోగులతో మరో కమిటీని నియమించారు. అయితే, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?, రెండో కమిటీ ఏ నివేదిక ఇచ్చింది? అనేది బహిర్గతం చేయలేదు. సర్వీస్ రూల్స్‌పై సాంకేతిక విద్య జాయింట్ డైరెక్టర్‌ను వివరణ కోరగా, ప్రభుత్వానికి పంపించామని ఒకసారి, త్వరలో పంపిస్తామని మరోసారి చెప్పడం గమనార్హం. -
స్తంభించిన మీ భూమి పోర్టల్
సాక్షి, అమరావతి: టెక్నాలజీకి తానే ఆద్యుడినని, భూముల రీ సర్వే తన ఘనతేనని లేని వాటి గురించి గొప్పలు చెప్పుకునే చంద్రబాబు పాలనలో కనీసం భూముల వివరాలు చూపించే వెబ్సైట్ కూడా సక్రమంగా పనిచేయడం లేదు. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు, భూ యజమానులు తమ భూ రికార్డుల కోసం ఆధారపడే ‘మీ భూమి’ (meebhoomi.ap.gov.in) పోర్టల్ మూగబోయింది. పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్ కోసం మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ రావాలి. కానీ ‘ప్లీజ్ వెయిట్’ అంటూ రింగులు తిరుగుతూనే ఉంటోంది తప్ప ఓటీపీ మాత్రం రావడం లేదు. ఎంతసేపు ఎదురుచూసినా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. పోర్టల్ తెరవగానే సీఎం చంద్రబాబు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫొటోలు దర్శనమిస్తున్నాయి.. కానీ వాటి కిందే ఉన్న లాగిన్ బాక్స్ మాత్రం పనిచేయట్లేదు. ఎస్ఎంఎస్ సేవలు అందిస్తున్న సీడాక్ సంస్థకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆ సంస్థ సేవలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పోర్టల్‌ను అంతరాయం లేకుండా నడపడానికి అవసరమైన చిన్న మొత్తాన్నీ చెల్లించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రారంభమై విజయవంతంగా సాగిన భూముల రీ సర్వేను తన ఘనతగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్న చంద్రబాబు.. తన పాలనలో ఉన్న పోర్టల్‌ను సవ్యంగా నడపలేకపోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. -
హంద్రీ–నీవా లైనింగ్ పనుల్లో మరో దోపిడీకి ఎత్తు
సాక్షి, అమరావతి : హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశ ప్రధాన కాలువ లైనింగ్ పేరుతో మరో విడత దోపిడీకి చంద్రబాబు సర్కార్ తెరతీసింది. శ్రీసత్య సాయి జిల్లా ముదిగుబ్బ, కదిరి, తలుపుల, ఎన్పీ కుంట మండలాల పరిధిలో హంద్రీ– నీవా రెండో దశ ప్రధాన కాలువ కాలువ 400.5 కి.మీ నుంచి 458.975/463 కి.మీ వరకు లైనింగ్ పనులు, మిగిలిపోయిన నిర్మాణ పనులకు రూ.487.48 కోట్ల అంచనాతో మంగళవారం టెండర్లు పిలిచింది. మరో రూ.109.21 కోట్లను జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది.అంటే.. కాంట్రాక్టు విలువ రూ.596.69 కోట్లు. ఈ పనులను లంప్సమ్ విధానంలో 18 నెలల్లోగా పూర్తి చేయాలని షరతు విధించింది. టెండర్లో బిడ్ల దాఖలుకు అక్టోబర్ 16 తుది గడువు. అక్టోబర్ 21న ఆర్థిక బిడ్‌ను తెరిచి టెండర్‌ను ఖరారు చేసి, పనులను కాంట్రాక్టు సంస్థకు అప్పగించనుంది. 2016–17 నుంచి 2025–26 వరకూ ఏదైనా ఒక ఏడాదిలో 13,19,026 క్యూబిక్ మీటర్ల మట్టి పని.. 25,705 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని, 3,97,015 చదరపు మీటర్ల సిమెంట్ కాంక్రీట్ లైనింగ్, షార్ట్ క్రీటింగ్, ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ (స్టీల్ ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్) పనులు పూర్తి చేసిన కాంట్రాక్టు సంస్థలకు టెండర్లో బిడ్ దాఖలుకు అర్హత ఉంటుందని పేర్కొంది. గత పదేళ్లలో ఏదైనా ఓ ఏడాది 2026–27 ధరల ప్రకారం రూ.162.50 కోట్ల విలువైన ఇదే రకం పనులు పూర్తి చేసి ఉండాలని మరో షరతు విధించింది. వీటిని బట్టి చూస్తే హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 216 కి.మీ నుంచి 400 కి.మీ వరకు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు చేసిన కాంట్రాక్టు సంస్థల్లో ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ (ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల రఘు), కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు (ఎస్సార్ కన్స్ట్రక్షన్స్), సీఎం చంద్రబాబు సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావు (బీఎస్సార్ ఇన్ఫ్రా), సీఎం చంద్రబాబు సన్నిహితుడు రంగరాజు ఎండీగా ఉన్న ఎన్సీసీ, సీఎం రమేష్ (రిత్విక్ ప్రాజెక్ట్స్)లలో.. ఒక సంస్థకు పనులు కట్టబెట్టేందుకే షార్ట్ క్రీటింగ్కు తోడుగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీని చేర్చారన్నది స్పష్టమవుతోంది. సన్నిహితులకు కట్టబెట్టేందుకే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ లింకు » రాతి పొర ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కాలువకు షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో లైనింగ్ (రాతి పొరకు ఇనుప జాలరీని అమర్చి.. దానిపై సిమెంటు కాంక్రీట్ వేయడం) చేయాలి. షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో లైనింగ్ చేయడానికి సాధ్యం కాని చోట్ల మాత్రమే.. రాతి పొరకు ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ (ఇనుప మేకులతో కూడిన సిమెంట్ కాంక్రీట్ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో స్ప్రే చేయడం) పద్ధతిలో లైనింగ్ చేయాలి. » కానీ.. హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 216 నుంచి 400 కి.మీ వరకు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు 2024–2025లో పిలిచిన టెండర్లలో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ నిబంధన లేదు. సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ లేదా షార్ట్ క్రీటింగ్ విధానంలో మాత్రమే లైనింగ్ చేయాలని స్పష్టంగా ఉంది. » టెండర్ నిబంధనలు ఉల్లంఘించి రాతి పొర లేకపోయినా కాలువ గట్లను సరి చేయకుండానే మట్టి పొరకే ఇష్టారాజ్యంగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో అత్యంత నాసిరకంగా లైనింగ్ చేసి బిల్లులు కాజేశారు. దాంతో 2025లో కాలువలో నీటి ప్రవాహ ఉద్ధృతికే లైనింగ్ ఎక్కడికక్కడ జారిపోయి కొట్టుకుపోయింది. రూ.3,850 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆ పనుల్లో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందని ఇంజినీరింగ్ నిపుణులు ఎత్తి చూపుతున్నారు. » తాజాగా టెండర్లు పిలిచిన పనులనూ అస్మదీయ సంస్థకు కట్టబెట్టి.. భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోచిపెట్టి.. నీకింత నాకింత అంటూ పంచుకుతినేందుకు ముఖ్య నేత సిద్ధమయ్యారని ఆరోపిస్తున్నారు. అందుకే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ పద్ధతిలో లైనింగ్ చేసినా టెండర్లో బిడ్ దాఖలు చేసేందుకు అర్హత ఉంటుందని నిబంధన పెట్టారని స్పష్టం చేస్తున్నారు. -
డప్పు సేవ.. తప్పుదోవ!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ పాలసీ వారికి డప్పు కొట్టించుకుంటూ ప్రజలను పక్కదోవ పట్టించడమేనని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా సమయంలో సొంత కుటుంబ సభ్యులే వైరస్ సోకిన వారి దగ్గరకు వెళ్లలేని సమయంలో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడంతోపాటు నిరంతరం పేద ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సేవలు అందించిన గ్రామ, వార్డు వలంటీర్ల సేవలు ఈ రాష్ట్రానికి అవసరమా.. లేక జరగని వాటిని జరిగినట్లు గొప్పలు చెబుతూ డప్పు కొట్టేందుకు ప్రభుత్వ పెద్దలకు మాత్రమే ఉపయోగపడే సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ సేవలు అవసరమా.. అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కాగానే వృధా ఖర్చు అంటూ తొలగించిన 2.66 లక్షల మంది వలంటీర్ల కుటుంబాలు ఇప్పుడు గొంతెత్తి ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం తీరు దోపిడీ కన్నా దారుణంగా ఉందని దుయ్యబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్న ‘సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాలసీ‘ ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన కొంత మంది అనుయాయులకు ఏటా కోట్ల రూపాయలు దోచి పెట్టడానికి తప్ప సామాన్య ప్రజలకు ఏ విధమైన ప్రయోజనం లేదని తూర్పారబడుతున్నాయి.2019–24 మధ్య ఎంతటి వరదలొచ్చినా, ఇక్కట్లు వచ్చినా స్వల్ప ప్రాణ నష్టానికి కూడా తావు లేకుండా తాము సేవలు అందించామని చెబుతున్నారు. విజయవాడ బుడమేరు వరదల సమయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం తమకు రెట్టింపు వేతనం (రూ.10 వేలు) ఇచ్చి మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ఆశ పెట్టి.. సేవలు వినియోగించుకుందని గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిలువెత్తు మోసానికి నిదర్శనమిది దేశంలోనే తొలిసారిగా పౌర సేవలను ఇంటింటికీ తీసుకెళ్తూ ప్రజాభిమానం పొందిన వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు అండ్ కో వెళ్లగక్కిన అక్కసు అంతా ఇంతా కాదని వలంటీర్ల కుటుంబాలు పేర్కొంటున్నాయి. ఈ వ్యవస్థ ఆవిర్భావం నుంచి వారు విషం చిమ్ముతూనే ఉన్నారని, మధ్యలో పవన్‌కళ్యాణ్.. మరింత దారుణంగా చేసిన వ్యాఖ్యలు తమ గుండెలను తొలచి వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లను సంఘ విద్రోహ శక్తులుగా, మహిళలను అక్రమ రవాణా చేసే కిరాతకులుగా చిత్రీకరించి.. ఆ వ్యవస్థను విచ్ఛినం చేసే కుట్రకు తెరదీశారని మండిపడుతున్నారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, నగరాల్లో మున్సిపల్ కమిషనర్లు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా ఎంపిక చేసిన వలంటీర్లను వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా ముద్రవేసి దుష్ప్రచారం చేస్తూ, పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ ధనాన్ని పప్పు బెల్లాలు మాదిరి దోచి పెడుతోందని ఆరోపణలు చేయడాన్ని వలంటీర్లు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పే సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్లకు ప్రభుత్వ పెద్దల, అధికార పార్టీ ఇమేజ్ను పెంచుకోవడానికి ప్రజల పన్నుల డబ్బును చెల్లించడం కాక మరేంటని ప్రశ్నిస్తున్నారు. 2019–24 మధ్య ఐదేళ్ల కాలంలో ప్రజలకు గడప వద్దనే సేవలు అందించడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి కొత్త సమాచారమైనా గంటల వ్యవధిలోనే ఆయా కుటుంబాలకు అందే పరిస్థితి ఉండగా.. వాస్తవాలతో పాటు అసత్యాలు కూడా ఎక్కువ ప్రచారంలో ఉండే సోషల్ మీడియా పోస్టులతో ప్రజలకు నిజమైన, కచ్చితమైన సమాచారం చేరే అవకాశం ఎంతవరకు ఉంటుందని నిలదీస్తున్నారు. ఎన్నికల ముందు వలంటీర్ల వేతనాలు రెట్టింపు చేస్తాం.. ఉన్నత చదువులు చదువుకున్న వలంటీర్లకు నైపుణ్య శిక్షణ ఇచ్చి నెలకు రూ.50 వేల ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేస్తాం.. అంటూ మాయ మాటలతో మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని గెలిచాక తమను నట్టేట ముంచారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది నిలువెత్తు మోసానికి నిదర్శనమని ఎత్తి చూపుతున్నారు. నాడు–నేడు బాబు, పవన్ మాటలు » జగన్మోహన్రెడ్డి ఎంత స్వార్థపరుడో వలంటీర్లు అర్థం చేసుకోవాలి. అందుకే తెలుగుదేశం, ఎన్డీయే.. మూడు పార్టీల కూటమి తరఫున మీకు హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం. వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఉగాది పండుగ రోజున తీపి కబురు చెబుతున్నాం. రూ. 5 వేలు కాదు.. రూ.10 వేలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. – 2024 ఏప్రిల్ 9న ఉగాది రోజున (అసెంబ్లీ ఎన్నికల ముందు) చంద్రబాబు వలంటీర్లకు ఇచ్చిన హామీ. » వలంటీర్లకు నేను ఒకటే చెబుతున్నా.. వలంటీర్లలో లక్ష మంది మహిళలున్నారని వైఎస్సార్సీపీ మంత్రులు మాట్లాడుతున్నారు. మీకు నేను ఓ అన్నగా చెబుతున్నా.. మీకు ఐదు వేలు వస్తుంటే, ఇంకో ఐదు వేలు పెంచి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. నేను ఎప్పుడూ మీ పొట్ట కొట్టను. – ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక.. » 2024 జూన్ 4న ఓట్ల లెక్కింపు జరిగింది. 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వలంటీర్లకు గౌరవ వేతనం ఆగిపోయింది. అనంతరం ఎలాంటి ప్రకటన లేకుండానే వారిని విధుల నుంచి తప్పించారు. నెలల తరబడి వలంటీర్లు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించినా.. కూటమి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన లేకుండా వలంటీరు వ్యవస్థకు మంగళం పాడేసింది. » ఇప్పుడు వలంటీర్లు అసలు అఫీషియల్‌గా లేరు. ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు జీతాలు పెంచడానికి చూస్తున్నా.. ఎక్కడా, జీవోలో వాళ్లు అసలు లేరు. ఏదన్నా చేద్దాం.. ముందుకెళదామంటే వాళ్లు ఉద్యోగంలో ఉంటే చేయొచ్చు. అంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయింది. » మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో సర్పంచుల సంఘం ప్రతినిధుల సమావేశంలో పవన్ కళ్యాణ్ -
ధర్నాలో పాల్గొన్న ఉద్యోగుల వివరాలు పంపండి
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం మరింతగా కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటికే విజయవాడలో జరిగిన ధర్నాలో పాల్గొన్న పలువురు ఉద్యోగులపై పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయించిన ప్రభుత్వం.. తాజాగా ఆ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయ ఉద్యోగులందరి వివరాలను రాష్ట్ర కార్యాలయానికి పంపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు 27వ తేదీ విజయవాడలో నిర్వహించిన ధర్నాకు అనుమతి లేకపోయినప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆ ధర్నాలో పాల్గొన్నారని ఎత్తి చూపుతూ ప్రభుత్వం ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ కార్యాలయం సోమవారం ఈ మేరకు జిల్లాలకు ఆదేశాలు జారీ చేయగా.. ఆయా జిల్లాల కలెక్టర్ల సూచనతో జిల్లా గ్రామ, వార్డు సచివాలయ అధికారులు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల నుంచి మండలాలు, పట్టణాల వారీగా మంగళవారం సాయంత్రానికే జాబితాలు సేకరించి పంపారు. తమ సమస్యల గురించి రెండేళ్లుగా పలుమార్లు విన్నవించినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఉద్యోగులు 27వ తేదీ ఆదివారం ‘ఛలో విజయవాడ’ చేపట్టారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో మరింతగా కక్ష గట్టింది. వాస్తవానికి 27వ తేదీ ఆదివారం ఉద్యోగులకు సెలవు. అయినప్పటికీ వారంతా ఆ రోజు ఎక్కడ ఉన్నారని ప్రభుత్వం ఆరా తీయడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సచివాలయ ఉద్యోగుల తీవ్ర స్థాయి ఆందోళనల నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీన పింఛన్ల పంపిణీకి ఏమైనా ఇబ్బందులెదురవుతాయా.. అని ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ మేరకు క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంది. పింఛన్ల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. మరో వైపు ప్రభుత్వం ఈ నెల 27న విజయవాడ ధర్నాలో పాల్గొన్న సచివాలయ ఉద్యోగులకు మెమోలు జారీ చేస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మేజర్ పంచాయతీ పరిధిలో పని చేస్తున్న 9 మంది సచివాలయ ఉద్యోగులకు మెమోలు ఇచ్చింది. మీకు జీతాలు ఎందుకు నిలిపివేయకూడదో వివరణ ఇవ్వాలని అడగడం కలకలం రేపుతోంది. -
‘బాబు చేతిలో పోలీస్ శాఖ కీలు బొమ్మగా మారిపోయింది’
సాక్షి, కాకినాడ జిల్లా: ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియంత సామ్రాజ్యంలా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.. ప్రశ్నించేవారిని అణిచివేసేలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. అధికారులను అడ్డదారుల్లో వాడుకుంటుందన్నారు. ఉద్యోగుల పట్ల చంద్రబాబుకు చాలా చులకన. అన్ని వర్గాలాన్నే ప్రభుత్వ ఉద్యోగులు కూడా మోసపోయారు. ఇప్పుడు సచివాలయం ఉద్యోగులు మోసపోయారు. పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంతో వైఎస్ జగన్ సచివాలయాలు ఏర్పాటు చేయాలని విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. 15,004 సచివాలయాలు నిర్మించి.. 1,34,000 ఉద్యోగులను నియమించారు. సచివాలయం వ్యవస్థే వృధా అన్నట్లు మంత్రులు మాట్లాడుతున్నారు’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.‘‘అక్రమ కేసులు పెట్టి సచివాలయం ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆంద్రజ్యోతిలో సచివాలయాల మీద పచ్చి అబద్దాలను వండి వర్చారు. గ్రామాల్లోకి వెళ్లి సచివాలయాల ఉద్యోగులు ఎలా పని చేస్తున్నారో అడగండి. వైఎస్ జగన్ మీద ద్వేషం తప్పా.. మీకు మరేమీ లేదు. ఉద్యోగులను గౌరవంగా చూసుకుంటానని చంద్రబాబు ఎన్నికల మానిఫెస్టోలో చెప్పారు. తమ హక్కుల కోసం అడిగితే ఉద్యోగులపై కేసులు పెడతారా?...చంద్రబాబు చేతిలో పోలీస్ శాఖ కీలు బొమ్మగా మారిపోయింది. సచివాలయం ఉద్యోగులకు ఎలాంటి జీవోలు గత పాలనలో ఇచ్చామో ఆఫీస్‌కి వెళ్లి వెతుక్కోండి. సచివాలయం వ్యవస్థను రద్దు చేస్తారా? అని సూటిగా చంద్రబాబును అడుగుతున్నా?. సచివాలయ వ్యవస్థను కుదించే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నారు. కోవిడ్‌లో సచివాలయం ఒక యూనిట్‌గా ప్రజలకు సేవలందాయి. సచివాలయం ఉద్యోగులను వైఎస్ జగన్ ప్రభుత్వం చాలా గౌరవంగా చూసింది. మీ చేతగానితనాన్ని సచివాలయం ఉద్యోగులపై ఎందుకు రుద్దుతారు చంద్రబాబు?..ఉద్యోగుల మీద ప్రజల్లో నెమ్మదిగా పాయిజన్ ఎక్కిస్తున్నారు. వచ్చిన ప్రభుత్వ ఆదాయం ఉద్యోగులకు సరిపోతుందని చెబుతున్నారు. పి-4 పథకంలో దాతలు దొరకకపోతే.. ఉద్యోగులే దాతలుగా మారాలని ఒత్తిడి తెచ్చారు. ఇప్పడు సచివాలయం ఉద్యోగులపై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిస్తున్నారు. మీ ఎల్లో మీడియా ఉందని పేట్రేగిపోతున్నారు. ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదూ?. పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకువచ్చారు. మీ తండ్రి కొడుకులను వాళ్లు తమ భుజాన ఎత్తుకుని మోయాలిఇన్ఫ్లుయెన్స్ కోల్పోయిన వాళ్లే ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టుకుంటారు. అసలు సమస్యలను వదిలేసి వైఎస్ జగన్‌పై దూషణలతో ఎంతకాలం నెట్టుకొస్తారు. ఉద్యోగులు ఏం పాపం చేశారని వారిపై మీ రెడ్‌బుక్ ప్రయోగిస్తున్నారు. ఉద్యోగులు వాళ్ల హక్కుల కోసం ప్రశ్నిస్తే తప్పా..? ఎకరం రూ.99 లకు కార్పోరేట్ సంస్థలకు కట్టబెడితే ఒప్పా? అని ఎల్లో మీడియాను అడుగుతున్నా....భీమడోలు షుగర్ ఫ్యాక్టరీని పప్పు బెల్లంలా గతంలో చంద్రబాబు అమ్మేశారు. ఇప్పుడు మరికొన్ని సహకార చక్కెర కర్మాగారాలను అమ్మేసే ప్రయత్నం జరుగుతుంది. రైతులు దీనికి ఒప్పుకోవడం లేదు. త్వరలో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంటే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. సచివాలయం ఉద్యోగులపై కేసులు పెట్టడం దుర్మార్గం.. అమానుషం’’ అంటూ కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: కొల్లు రవీంద్రకు ఇదే నా ఛాలెంజ్: పేర్ని కిట్టు -
జగన్ సెక్యూరిటీ..! చేతులెత్తేసిన రెడ్ బుక్ పోలీసులు
-
Bolisetty: మీరు ఇలా చేస్తే తిరుగుబాటు ఖాయం..
-
కూటమికి బిగ్ షాక్.. బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విశాఖ: సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు డబ్బులు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం చేసిన మంచిని మాత్రమే చెప్పి.. తప్పులను చెప్పకుండా ఉండేందుకు డబ్బులు ఇవ్వడం ఒక రకంగా లంచం ఇవ్వడమేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న తప్పొప్పులను రెండింటినీ చెప్పే వారికి మాత్రమే డబ్బులు ఇవ్వాలని సూచించారు. మంచిని మాత్రమే ప్రచారం చేసి.. చెడును ప్రజలకు చెప్పకపోతే చివరికి ప్రజల్లో తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంటుందని బొలిశెట్టి అన్నారు. ప్రభుత్వ పనితీరుపై సోషల్ మీడియా వేదికల్లో వాస్తవాలను చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.కొండల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు..విశాఖలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని కాపాడాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఉందని బొలిశెట్టి అన్నారు. కొండలను రక్షించేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇష్టానుసారంగా కొండలను తవ్వడం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ఇటీవల కూడా విశాఖలో పర్యావరణ అంశాలపై బొలిశెట్టి సత్యనారాయణ పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన గతంలో జనసేనలో పర్యావరణ విభాగం బాధ్యతల్లో ఉండగా.. 2026 మార్చిలో పార్టీ అధికారిక బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు జనసేన ప్రకటించింది.ఎమ్మెల్యే వంశీపై విమర్శలు..విశాఖకు చెందిన ఎమ్మెల్యే వంశీపై కూడా బొలిశెట్టి విమర్శలు చేశారు. ఎమ్మెల్యే వంశీకి జనసేన సిద్ధాంతాలు ఇంకా వంటపట్టలేదని ఘాటు విమర్శలు చేశారు. ఆయన ఇంకా వ్యాపారవేత్తగానే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పర్యావరణాన్ని కాపాడే వారికి ఓట్లు వేయాలని ప్రజలకు బొలిశెట్టి పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: కొత్త సెక్షన్లతో కేసులు.. సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన -
బాబుకు సోషల్ మీడియా భయం.. కరపత్రాల ప్రచారం తగ్గిందా?
ఏపీ ప్రభుత్వం ప్రచారం విషయంలో వెనుకడుగు వేయడం లేదు. కొత్తగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారికి ప్రభుత్వం పరోక్ష వేతనం చెల్లించడానికి రెడీ అయింది. ఇది ఒకరకంగా పరీక్ష లేకుండానే క్రీడా కోటాలో కొందరికి టీచర్ల ఉద్యోగాలు ఇచ్చిన చందంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్, ఇప్పటికే తనకు అనుకూలంగా పనిచేస్తున్న దాదాపు ఎనభై శాతం ప్రధాన మీడియాకాని, వందల సంఖ్యలో ఉన్న యూట్యూబ్ చానళ్లు తమ ప్రచారానికి సరిపోవడం లేదని అనుకుంటోందా? లేక వాటిని జనం నమ్మడం లేదన్న అభిప్రాయానికి వచ్చిందా అన్నది తెలియదు కాని, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల పేరుతో అంటే ప్రభావశీలురతో కంటెంటె పెట్టిస్తారట. దానికి భారీగా చెల్లింపులు చేస్తారట.కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారందరికి నాలుగువేల రూపాయల చొప్పున మంజూరు చేయడానికి డబ్బులు లేవని మంత్రి అచ్చెన్నాయుడు ఆ మధ్య ఉపన్యాసం ఇచ్చారు. ఉద్యోగుల జీతాలకే ప్రభుత్వ ఆదాయంలో 94-98 శాతం ఖర్చు అవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలిపారు. సంపద సృష్టించే మార్గాలు కనబడడం లేదని, ఐడియాలు ఉంటే ఇవ్వండని ప్రజలనే ఆయన సలహా కోరారు. అవన్ని వాస్తవమా? కాదా? అన్నది మనం చెప్పలేం.కాని, చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సోషల్ మీడియాలో కూటమి సర్కార్ పక్షాన, చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌ల పక్షాన ప్రచారం చేయడానికి ఒక్కొక్కరికి 15 వేల రూపాయల నుంచి లక్షన్నర వరకు ఇస్తారట. ప్రభుత్వం ఇచ్చే కంటెంట్ పోస్టు చేస్తే ఒక రేటు, స్వయంగా తయారు చేసే కంటెంట్‌కు మరో రేటు ఉంటుందట. ప్రభుత్వం ఇచ్చే గ్రాఫిక్స్ పోస్టింగ్‌లకు కేటగిరిని బట్టి 500 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఇస్తారట. ఆడియో, వీడియో పోస్టింగ్లకైతే 750 నుంచి రెండువేల రూపాయల వరకు ఇస్తారట. సొంతంగా తయారు చేసే వీడియోలకు గాను క్రియేటర్స్‌కు 2500 నుంచి ఇరవైవేల వరకు చెల్లిస్తారట. దీనికి ఏవో కండిషన్లు అని చెప్పినా, చివరికి ఏమి జరుగుతుందో ఊహించుకోవచ్చు.ఎన్నివేల మందిని ఇందుకోసం వినియోగించుకుంటారో, ఎంత బడ్జెట్ కేటాయిస్తారో వెల్లడించలేదు. హిమచల్ ప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్‌లలో వివిధ పద్దతులలో ఇలాంటి స్కీములను అమలు చేస్తున్నారట. యూపీలో ఆయా సోషల్ మీడియా ఫ్లాట్ పారంలకు నేరుగా డబ్బులు ఇస్తారట. వీటిని కాపీ చేసి ఏపీ ప్రభుత్వం వీటిని అమలు చేస్తోందన్నమాట. ఇప్పటికే డిజిటల్ కార్పొరేషన్‌తో ప్రభుత్వ ప్రచారం చేస్తుంటుంది. అందులో కూడా కంటెంట్ తయారు చేస్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, తదతర మీడియా సంస్థలకు ప్రచార ప్రకటన రూపంలో, ఇతరత్రా భారీగానే లబ్ది చేకూర్చుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. వారు మరీ ఏకపక్షంగా టీడీపీ కరపత్రాలుగా ప్రచారం చేస్తుండడంతో ప్రజలలో విశ్వసనీయత తగ్గిపోతోంది.ఈ నేపథ్యంలో ఈ కొత్త ఐడియాను తీసుకువచ్చి ప్రజాధనాన్ని వెచ్చించబోతున్నారన్నమాట. నిజంగానే ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవైనా పోస్టు చేస్తే ఫర్వాలేదు. ప్రభుత్వం ఇచ్చే గ్రాఫిక్స్, వీడియోలు అంటే కేవలం ప్రభుత్వ నేతల ప్రచారమే అత్యధికశాతం ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. దానికి తోడు ఇప్పుడు ఈ ఇన్‌ఫ్లూయేన్సర్లు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో వచ్చే విషయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలన్నమాట. అలాగే ఇండిపెండెంట్‌గా పనిచేసే యూట్యూబర్లు వెలికితీసే వాస్తవాలను ఖండించాలన్నమాట. వైఎస్సార్సీపీ నేతలపై బురద చల్లే పనిలో నేర్పరితనం ప్రదర్శించాలన్నమాట. డైవర్షన్ రాజకీయాలలో భాగస్వాములవ్వాలన్నమాట.ఇదీ చదవండి: దానం ఎపిసోడ్.. డిఫెన్స్‌లో కాంగ్రెస్, రేవంత్? ఉదాహరణకు డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ఆధారాలు చూపుతున్నప్పుడు అవేవి సరికావన్నట్లుగా ప్రచారం చేయాలి. ఇలాంటి డైవర్షన్ విషయాలలో చంద్రబాబును మించిన మొనగాడు మరొకరు ఉండకపోవచ్చు. డీఎస్సీ స్కామ్‌పై నిరసన చెప్పడానికి వెళ్లిన వైఎస్సార్సీపీవారిపై దాడి చేసింది టీడీపీవారు లేదా టీడీపీ యువగళం టీమ్ అన్నది బహిరంగ రహస్యమే. వారే ఈ విషయం చెప్పుకున్నారు. కాని వ్యూహాత్మకంగా గురువులపై వైఎస్సార్సీపీ దాడి అని చంద్రబాబే ప్రచారం ఆరంభించారు. అది నిజం కాదని ఆయనకు తెలుసు. పోలీసులకు తెలుసు. లేదా రెండు వైపులా ఏమైనా గొడవ జరిగితే ఇరుపక్షాలకు చెందినవారిమీద కేసులు పెట్టవచ్చు.అదేమి కాకుండా వైఎస్సార్సీపీపైన ఎంత వీలైతే అంత బురద చల్లడం, జగన్‌పై పిచ్చి, పిచ్చి ఆరోపణలు చేయడంతో అసలు స్కామ్‌ను దారి మళ్లించాలన్నది వారి వ్యూహమన్నమాట. దీనికోసం ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఎంత బాగా పనిచేసి అంతగా వ్యూస్ సంపాదిస్తే వారికి అంతగా డబ్బు వస్తుందన్నమాట. ఇదంతా టీడీపీ తరపున ఇప్పటికే పనిచేస్తున్నవారికి డబ్బులు ఇవ్వడానికే ఈ స్కీమ్ తెచ్చారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. డీఎస్సీలో పరీక్షలు లేకుండా టీచర్ ఉద్యోగాలు కొంతమందికి ఇచ్చి అప్రతిష్ట తెచ్చుకున్న నేపథ్యంలో ఈ స్కీమ్ ప్రకారం తమకు కావల్సిన వారికి ప్రభుత్వం డబ్బు ఇష్టారీతిన వెచ్చించే అవకాశం ఉండవచ్చన్నది కొందరి అనుమానం.ఒకవైపు ఇలా జనం డబ్బుతో వారినే మభ్య పెట్టడానికో, నమ్మించడానికో సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ, మరో వైపు పోలీసుల ద్వారా తమకు వ్యతిరేకంగా స్కామ్‌లను బయటపెడుతున్న సోషల్ మీడయాను అణచివేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆ క్రమంలో చివరికి అమెరికాకు చెందిన పోలీస్ వ్యవస్థ ఎఫ్‌బీఐ పేరుతో కూడా నకిలీ ఫిర్యాదులు చేయడానికి ఏపీ పోలీసు వ్యవస్థ సిగ్గుపడకపోవడం దారుణంగా ఉంటుంది.ఎవరైనా వేరే సంస్థ పేరుతో తప్పుడు ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టే పోలీసులే స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలకు నకిలీ ఫిర్యాదులు చేయడం ఏమిటి? తద్వారా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వాస్తవ పోస్టులను తొలగించేలా చూడడం ఏమిటి? ఏపీలో పోలీసు వ్యవస్థ ఎంతసేపు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాను అణచివేయడం, వారిపై తప్పుడు ఆరోపణలు చేయడం, వారి అక్కౌంట్లను మూసివేయించడం పనిలోనే బిజీగా ఉంటున్నట్లు కనిపిస్తుంది.ఎక్స్‌లో 150 ఖాతాలు తొలగింపచేశారట. సుమారు 800 పోస్టులు తొలగించారట. చివరికి జడ శ్రవణ్ వంటివారు మీడియా సమావేశాలలో చేసే విమర్శల వీడియోలు కొన్నిటిని సైతం ఇండియాలో కనబడకుండా చేస్తున్నారంటే ప్రభుత్వం సోషల్ మీడియాకు ఎంత భయపడుతోందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ కొత్త ఐడియాను ప్రవేశపెట్టి టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఉపాధి స్కీము కింద ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టబోతున్నారన్నమాట. అంత మాత్రాన ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత తగ్గుతుందా? అన్నది సందేహమే!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వింత సెక్షన్లతో కేసులు.. సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన
సాక్షి, విజయవాడ: ఏపీలో సచివాలయ ఉద్యోగుల ‘చలో విజయవాడ’ ఆందోళనపై పోలీసులు కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో 46 మంది, మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో 24 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ పరిణామంతో సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు సెప్టెంబర్ 27న ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చారు. నిరసనకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే ఉద్యోగులను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చిన ఉద్యోగులను పోలీసులు పలు ప్రాంతాల్లో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోనే సుమారు 600 మంది ఉద్యోగులను వివిధ పోలీస్స్టేషన్లకు తరలించినట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.కేసులు.. అరెస్టులు..సత్యనారాయణపురం, మాచవరం పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో BNSS సెక్షన్ 170 ప్రయోగించారు. ఈ సెక్షన్ ప్రకారం ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా, మేజిస్టేట్ అనుమతి లేకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులను అరెస్ట్ చేస్తారంటూ ప్రభుత్వం లీకులు ఇస్తోంది. పోలీసులు అరెస్టులకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ చర్యలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. కేసుల పేరుతో ఉద్యోగుల పట్ల కూటమి సర్కార్ కఠినంగా ప్రవర్తిస్తోంది. అంతేకాకుండా. నిరసనల్లో పాల్గొన్న 45మందిని సస్పెండ్ చేయాలని కూడా చూస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారంటూ చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.ఇదీ చదవండి: ‘డబ్బులిస్తాం.. డప్పుకొట్టండి’ -
పిచ్చికుక్క అని ముద్ర వేస్తావా.. మేమేంటో చూపిస్తాం
-
కోట్ల జయసూర్యప్రకాష్ పై బాబు సీరియస్..?
-
ఎలమంచలిలో కూటమి కొట్లాట వైరల్ అవుతున్న న్యూస్
-
టీడీపీలో పదవి చిచ్చు.. అర్ధరాత్రి ఇవేం దాడులు?
సాక్షి, కడప: కడప టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కడప మేయర్ పదవిని బలిజలకు కేటాయించాలని కోరుతూ కాపు జేఏసీ కన్వీనర్ విజయ్‌కుమార్ పార్టీ ఎన్నికల పరిశీలకుడు దీపక్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే మాధవి రెడ్డికి వ్యతిరేకంగా మేయర్ పదవి కోసం డిమాండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో.. అర్ధరాత్రి విజయ్‌కుమార్‌కు చెందిన కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు బలిజ నేతలు ఆరోపిస్తున్నారు.జిల్లాకు వచ్చిన టీడీపీ ఎన్నికల పరిశీలకుడు దీపక్‌రెడ్డిని కలిసిన విజయ్‌కుమార్.. కడప మేయర్ సీటును బలిజలకు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం స్థానిక టీడీపీలో వర్గ విభేదాలను మరింత తీవ్రతరం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీరును ప్రశ్నిస్తున్నందుకే తమ వర్గానికి చెందిన నేతలపై దాడులు జరుగుతున్నాయని కొందరు టీడీపీ బలిజ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే తీరును మరో బలిజ నేత చెన్నంశెట్టి మురళీ బహిరంగంగా ప్రశ్నించినట్లు వారు చెబుతున్నారు.మరోవైపు ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వ్యతిరేకంగా పార్టీ అధిష్ఠానం పంపిన నేతలను టీడీపీలోని కొందరు స్థానిక నాయకులు కలుస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కడప టీడీపీలో అంతర్గత రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. విజయ్‌కుమార్ కారును ధ్వంసం చేసిన ఘటనపై సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీలోని బలిజ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులెవరు, రాజకీయ విభేదాలే కారణమా అన్నది తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: ‘డబ్బులిస్తాం.. డప్పుకొట్టిండి’ -
బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోతుంది అందుకే చంద్రబాబు హడావిడి
-
టీడీపీ ప్రాభవం కోల్పోవడం వల్లే పార్టీ మారా. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్య
-
అక్రమ కేసులతో వేధించేకంటే ఎన్కౌంటర్ చేసేయండి బాబూ
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వ వేధింపులు పరాకాష్టకు చేరాయని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేని సర్కారు శాంతియుత పోరాటం చేపడితే అక్రమ కేసులతో వేధిస్తోందని విమర్శించారు. ఇలా వేధిస్తూ నిత్య నరకం చూపేకంటే ఒక్కసారే ఉద్యోగులను ఎన్కౌంటర్ చేయండంటూ చంద్రబాబు సర్కారుపై ధ్వజమెత్తారు.టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులపై పనిభారం తీవ్రంగా పెరిగిందని, వందలాది మంది ఉద్యోగులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధలు తాళలేకే సచివాలయ ఉద్యోగులు పోరుబాట పట్టారని వివరించారు. ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన సర్కారు అక్రమ కేసులతో కక్షసాధించడం తగదని పేర్కొన్నారు. సీఐ అలీ మరణానికి సచివాలయ ఉద్యోగులు కారణమంటూ అక్రమ కేసు నమోదు చేయడం దారుణమని, దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని కాకర్ల చూపించారు.సీఐ అలీ ఉద్యోగుల తోపులాటతో కింద పడ్డారని తప్పుడు ఫిర్యాదుచేశారని, సర్కారు వద్ద ఉన్న వీడియోల్లో అయినా అలీ కిందపడినట్టు ఉందా? అని ప్రశ్నించారు. సీఐ గుండెపోటుతో మరణించారని తొలుత ప్రకటించిన సర్కారు.. ఇప్పుడు ఆ నెపం సచివాలయ ఉద్యోగులపై నెట్టడం ఏమిటని నిలదీశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న ఉద్యోగులపై లాఠీచార్జి చేయడమే కాకుండా వారిపై అక్రమ కేసులు కట్టడం దారుణమని కాకర్ల విమర్శించారు. తోటి ఉద్యోగులపై కక్ష సాధిస్తుంటే ఏం చేస్తున్నారు? గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులపై జరిగిన లాఠీచార్జిపై ఎందుకు నోరు మెదపటం లేదని ఉద్యోగ సంఘాల నేతలను కాకర్ల ప్రశ్నించారు. తోటి ఉద్యోగులపై అక్రమ కేసులు పెడితే స్పందించని నాయకత్వం ఎందుకని నిలదీశారు. న్యాయమైన డిమాండ్లతో ఆందోళన చేస్తున్న ఉద్యోగులను బ్లేడ్, గంజాయి బ్యాచ్ అంటూ వ్యాఖ్యానించిన ఎల్లో మీడియా కరోనా వైరస్ కంటే నీచమైందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో టీచర్లు ధర్నా చేస్తూ అప్పటి సీఎం వైఎస్ జగన్‌ని బహిరంగంగా విమర్శించినా ఎలాంటి కేసులూ నమోదు చేయలేదని గుర్తుచేశారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులపై వేధింపులు తక్షణమే ఆపాలని, అక్రమ కేసులు, సస్పెన్షన్లను ఉపసంహరించుకోవాలని కాకర్ల వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. -
సీఎం రమేష్ సంస్థకు భారీ నజరానా
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ఇచ్చింది. కుప్పం బ్రాంచి కెనాల్లో రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ చేపట్టిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి, భారీ ప్రయోజనం చేకూర్చిందని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్లో 0 నుంచి 66.95 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులను ఆర్నెల్లలో పూర్తి చేయాలనే షరతుతో 2024 డిసెంబర్ 14న రూ.81.43 కోట్ల అంచనాతో జలవనరుల శాఖ టెండర్లు పిలిచింది.ఆ పనులను 85.46 కోట్ల (జీఎస్టీ, సీనరేజి వంటి పన్నులు కాకుండా)కు దక్కించుకున్న రిత్విక్ ప్రాజెక్ట్స్ సకాలంలో పూర్తి చేయలేకపోయింది. టెండర్ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ (స్టీల్ ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్) విధానంలో లైనింగ్ చేశారు. అత్యంత నాసిరకంగా చేసిన ఈ లైనింగ్ గతేడాది కాలువలో నీటి ప్రవాహానికి ఎక్కడికక్కడ దెబ్బతింది. సకాలంలో పనులు పూర్తి చేయని రిత్విక్ ప్రాజెక్ట్స్ నుంచి లిక్విడేటెడ్ డ్యామేజస్ వసూలు చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదు. పైగా, పనుల పూర్తికి గడువును పొడిగించింది. మరోపక్క చీఫ్ ఇంజినీర్స్ కమిటీతో నివేదిక పేరుతో అదనంగా పనులు చేశారని చూపుతూ అంచనా వ్యయాన్ని రూ.99.20 కోట్ల నుంచి రూ.126.25 కోట్లకు పెంచింది. ఈ మేరకు జలవనరుల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రి త్విక్ ప్రాజెక్ట్స్ సంస్థకు రూ.40.79 కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. నాసిరకం పనులు చేసిన ఈనాడు కిరణ్ వియ్యంకుడికీ బహుమానం హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ చేస్తే భూగర్బ జలాలు అడుగంటిపోతాయని, బోర్లు, బావులు ఎండిపోతాయంటూ రైతులందరూ ముక్తకంఠంతో తీవ్రంగా వ్యతిరేకించినా 216.3 కి.మీ. నుంచి 400 కి.మీ. వరకూ లైనింగ్ పనులకు రూ.936.70 కోట్లతో 2024 డిసెంబర్ 3న జలవనరుల శాఖ పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇందులో రెండో ప్యాకేజీ (ప్రధాన కాలువ) 260 కి.మీ. నుంచి 300 కి.మీ. లైనింగ్‌తోపాటు 285.1 కి.మీ. నుంచి 287.1 కి.మీ. వరకు టన్నెల్ నిర్మాణ పనులకు రూ.158.19 కోట్లు కేటాయించింది.గతేడాది ఈ పనులకు రూ.117.63 కోట్ల అంచనాతో పిలిచిన టెండర్లలో రూ.123.24 కోట్లకు కోట్ చేసిన ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థకు కట్టబెట్టింది. ఇక్కడ నాసి రకంగా పనులు చేయడం వల్ల ఒక సీజన్లో కాలువలో నీటి ప్రవాహానికే లైనింగ్ ఎక్కడికక్కడ దెబ్బతింది. కాంట్రాక్టు ఒప్పందం మేరకు ఆర్నెల్లలోగా పనులు పూర్తిచేయడంలో విఫలమైన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థపై చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు సర్కారు.. పనుల పూర్తికి గడువు పొడగించడమే కాకుండా, అంచనా వ్యయాన్ని రూ.158.19 కోట్ల నుంచి రూ.337.90 కోట్లకు పెంచేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా రాయల రఘు సంస్థకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చింది. చంద్రబాబు ప్రభుత్వ డీపీటీ (దోచుకో.. పంచుకో.. తినుకో)కి ఈ రెండు ప్రాజెక్టులు మరో నిదర్శనమంటూ ఇంజినీరింగ్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఫ్యామిలీ టూర్ పేరుతో నువ్వు నీ కొడుకు ఎక్కడి వెళ్తున్నారో చెప్పమంటావా
-
‘మరోసారి చంద్రబాబు రహస్య విదేశీ టూర్’
తాడేపల్లి: రాష్ట్రం ఓవైపు ఉద్యోగులు, నిరుద్యోగుల ఆందోళనలతో అట్టుడుకుతోందని, మరోవైపు కరువు, వరదలతో రైతులు కష్టాల్లో ఉన్నారని, అయినా ఇవేవీ పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు మూడు రోజులుగా రహస్య పర్యటనల్లో ఉన్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. రాష్ట్రంలో సమస్యల్ని వదిలేసి చంద్రబాబు దోచుకున్న డబ్బు దాచుకోవడానికి విదేశాలకు రహస్య టూర్లు చేస్తుంటే, కేంద్రం మొద్దునిద్రలో ఉందని లక్ష్మీపార్వతి ఆక్షేపించారు. గతంలో సీఎంగా ఉండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ కోర్టు అనుమతితో, వివరాలు ఇచ్చి విదేశాలకు వెళ్లినా కారుకూతలు కూసిన లోకేష్..ఇప్పుడు తన తండ్రి ఎక్కడికి వెళ్లాడో సమాధానం చెప్పాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్లో లక్ష్మీపార్వతి ఇంకేమన్నారంటే..సమస్యలు గాలికొదిలేసి చంద్రబాబు రహస్య టూర్లుమూడు రోజులైనా చంద్రబాబు అడ్రస్ లేడు, అయినా ఆయన ఇక్కడే ఉన్నట్లు పచ్చ మీడియా బిల్డప్ లు ఇస్తోంది. చంద్రబాబు ఈ రహస్య ప్రయాణాలు ఎందుకు పెట్టుకుంటున్నారు ?, రాష్ట్రవ్యాప్తంగా ఓవైపు ఆందోళనలు, మరోవైపు కరువు, ఇంకోవైపు అతివృష్టితో ఉత్తరాంధ్ర వరదలు వచ్చి మునిగిపోయింది. ఉత్తరాంధ్రలో వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అటు రాయలసీమలో చూస్తే కరవుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు డీఎస్సీ అభ్యర్ధులు న్యాయం కోసం రోడ్డెక్కుతున్నారు. ఇలా ఎటు చూసినా కల్లోలమే. ఇన్ని రకాల సమస్యలు రాష్ట్రాన్ని చుట్టుముడుతుంటే, జనం ఆందోళనలు చేస్తుంటే.. ముఖ్యమంత్రి ఎటుపోయాడు? ఏ ప్రభుత్వంలో అయినా ముఖ్యమంత్రి ఇలా చెప్పకుండా, తాను ఎక్కడికి పోతున్నాడో కూడా చెప్పలేని పరిస్ధితుల్లో ఉన్నాడా? గతంలోనూ చంద్రబాబు ఫ్యామిలీ టూర్ పేరుతో ఇలాంటి పర్యటనలే చేశాడు. కస్టమ్స్ తనిఖీ కూడా ఉండదు కాబట్టి సూట్ కేసులతో స్పెషల్ ఫ్లైట్లతో తిరుగుతుంటాడు. ఇలా ప్రతీసారీ తాను దోచుకున్న డబ్బు దాచుకోవడానికి వెళ్లి వస్తుంటాడు. మాల్దీవులు, ఇండోనేషియా, మారిషస్, సింగపూర్ వంటి దేశాలకు వెళ్లి డబ్బులు దాచుకుంటూ ఉంటాడు. సింగపూర్ లో అయితే ఓ పెద్ద హోటలే కట్టేశారు. అప్పట్లో దావూద్ ఇబ్రహీంతో చెప్పి తన సమస్య పరిష్కరించుకున్నాడు. ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా చేస్తాడా ? భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో అయినా ఇలా చేశాడా? కేంద్రం ఎందుకు ఆయనపై నిఘా పెట్టలేకపోతోందా ? ఓ ముఖ్యమంత్రి వ్యక్తిగత టూర్ పేరుతో ఇలా రహస్య పర్యటనలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ?జగన్ వివరాలు ఇచ్చి వెళ్లినా కారుకూతలు కూసేవారుజగన్ మోహన్ రెడ్డి గారు అయితే గతంలో ఏ దేశం వెళ్తున్నారో సీబీఐకి, కోర్టుకు వివరాలు ఇచ్చి మరీ వెళ్లారు. అవి వ్యక్తిగత పర్యటనలు అయినా సరే ఏ దేశం వెళ్తున్నారో వివరాలు మాత్రం ఇచ్చేవారు. కానీ ఇవాళ చంద్రబాబు మాత్రం ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు. దోపిడీ సొమ్ము దాచుకోవడానికే ఇలా చెప్పకుండా రహస్యంగా టూర్లకు వెళ్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. గతంలో జగన్ మోహన్ రెడ్డి గారు సీబీఐ అనుమతి తీసుకుని మరీ విదేశాలకు వెళ్తే.. బుర్రా బుద్దీ లేని సకల శాఖ మంత్రి లోకేష్ మాత్రం కారుకూతలు కూశారు. అలాంటి హీనసంస్కారంతో పెరిగిన వ్యక్తి .. స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ స్టూడెంట్ అంటే నమ్మలేం. ఎందుకంటే లోకేష్ ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్ వీధి రౌడీలా ఉంటుంది. చూసే వాళ్లకు అంత హీనంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా టూర్ వివరాలు ఇచ్చి వెళ్లినా కారుకూతలు కూసిన పచ్చ మీడియా ఇప్పుడు చంద్రబాబు ఎక్కడున్నాడో సమాధానం చెప్పాలి కదా. ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకపోయినా ఉన్నట్లు ప్రచారాలు చేస్తున్న ఎల్లో మీడియా .. రాష్ట్రాన్ని దిగజారుస్తోంది. మీరంతా ఆంధ్రప్రదేశ్ ను 50 ఏళ్లు వెనక్కి తీసుకుపోయారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పరిశ్రమలన్నీ ఎటుపోయాయి, పెట్టుబడిదారులంతా రాష్ట్రం వదిలి పారిపోతున్నారు. మీ రెడ్ బుక్ దోపిడీ వ్యవస్థ అందరినీ ఆ స్ధాయిలో భయపెడుతోంది. పార్టీలో కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఓ పరిశ్రమ వస్తే చాలు లంచాల కోసం వేధిస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? నదుల గర్భాన్ని తొలిచేసి మరీ ఇసుక అమ్ముకుంటున్నారు. వేల సంవత్సరాలుగా పూజలందుకుంటున్న కొండల్ని సైతం సీఎం రమేశ్ వంటి వారు తవ్వేస్తున్నారు. ఎంపీగా దొంగచాటుగా ఎన్నికైన ఇలాంటి వ్యక్తికి అక్కడి సంపద దోచుకునే హక్కు ఎక్కడిది ?చంద్రబాబు, లోకేష్‌కు ప్రజల ఉసురు తప్పదుజగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమలు చేసిన సంక్షేమం, విద్య, వైద్యంలో అభివృద్ది వల్ల ఏ రోజూ పేదవాడు రోడ్డుపైకి రాలేదు. అది నిజమైన విజన్. నాడు-నేడులో స్కూల్స్ అభివృద్ది చేసి పిల్లల డ్రాప్ అవుట్ లేకుండా చేశారు. కానీ ఇప్పుడు వేల మంది విద్యయార్దులు స్కూల్స్ మానేస్తున్నారు. 40 ఏళ్ల చంద్రబాబు అనుభవం అంతా ఏమైంది ? చంద్రబాబుకు పాలన చేతకాదని నేను ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాను. ఫ్యామిలీ టూర్ల పేరుతో దోపిడీ చేసిన డబ్బంతా చంద్రబాబు విదేశాలకు తరలిస్తుంటే కేంద్రం నిద్రపోతోందా ? కేంద్రానికి బాధ్యత లేదా ? నిఘా వర్గాలకు బాధ్యత లేదా ? డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి ఈ దోపిడీని కేంద్రం ప్రోత్సహిస్తూనే ఉంటుందా ? డీఎస్సీలో ఒక్కో ఉద్యోగం 15లక్షలకు అమ్ముకున్నారు కాబట్టి, ఆ డబ్బంతా తరలించేందుకు రహస్య టూర్లు వేస్తున్నారు. ఈ విషయం ప్రజలకూ అర్దమైంది. వీళ్లు రహస్య టూర్ అనేసరికి ఎంత సొమ్ము తీసుకుపోతున్నావంటూ సోషల్ మీడియాలో జనం ప్రశ్నిస్తున్నారు. మీరు విమర్శించేటప్పుడు కాస్తయినా బుర్ర ఉపయోగించండి. జగన్మోహన్ రెడ్డి గారిపై పిచ్చి ప్రేలాపనలు చేసే లోకేష్.. తన భాషలోనే తన తండ్రి ఎక్కడికి వెళ్లాడో అడుగు. మళ్లీ ఇలాంటి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే మర్యాద దక్కదని లోకేష్ ను హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో తాగడానికి నీళ్లు లేవు, వ్యవసాయానికి నీళ్లు లేవు. ఇవన్నీ వదిలేసి చంద్రబాబు రహస్య టూర్లు వేస్తారా? ఈ టూర్ నుంచి వచ్చాక అయినా చంద్రబాబు తన రహస్య టూర్ వివరాలు బయటపెట్టకపోతే బాధ్యతారాహిత్యంగానే ప్రజలు భావించాల్సి ఉంటుంది. అసలు ముఖ్యమంత్రిని సైతం పట్టించుకునే పరిస్ధితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జనం కడుపులో చల్ల కదలకుండా హాయిగా నిద్రపోయారు, పిల్లల్ని బాగా చదివించుకున్నారు, రైతులు కరువు లేకుండా నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహించాయి. రాయలసీమలో సైతం నదులు, కాలువలు నిండి పంట దిగుబడులు పెరిగాయి. చంద్రబాబు అడుగుపెట్టగానే అంతా నాశనమైంది. రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినట్లు కరువు, చంద్రబాబు కవల పిల్లలు. నీ కొడుకు లోకేష్ ఒక్కటే బాగుపడాలా? ఒక్కడిని కాపాడేందుకు డీఎస్సీ తప్పుల్ని కప్పిపుచ్చుతున్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టిస్తున్నారు. ఇదేం పాలన చంద్రబాబూ? ఒక్కసారైనా నీకు పశ్చాత్తాపం కలగదా ? కొన్ని లక్షల కోట్లు ఇప్పటికే సంపాదించుకున్నాం.. ఇప్పటికైనా పేద వర్గాలకు న్యాయం చేయాలని తండ్రీ కొడుకులు ఎందుకు అనుకోరు. అమరావతి పేరుతో చంద్రబాబు దోపిడీ చేస్తే, డీఎస్సీ స్కాం పేరుతో లోకేష్ దోపిడీ చేస్తున్నారు. వీరిద్దరికీ మానవత్వం లేదు, ఎప్పుడు కనువిప్పు అవుతుందో కూడా తెలియదు. కాలం విధించే శిక్షలకు మీరిద్దరూ సిద్దంగా ఉండండి. ఇంత మంది ప్రజల్ని బాధపెట్టిన ఉసురు మీకు కచ్చితంగా తగులుతుంది. దాన్ని అనుభవించడానికి చంద్రబాబు, లోకేష్ సిద్దపడాలని లక్ష్మీపార్వతి హెచ్చరించారు.ఇదీ చదవండి: చంద్రబాబు సర్కారుపై కాకర్ల ధ్వజం -
'పరిపాలన గాలికి వదిలేశారు' ప్రభుత్వంపై బొత్స సీరియస్
-
చంద్రబాబు మోహంలో ఆ రోజే మార్పు... ఆ కక్ష అంతా ఈ రోజు లాఠీ ఛార్జ్ తో తీర్చుకున్నాడు
-
సచివాలయ ఉద్యోగులపై దాడులా?.. పోలీసుల తీరు దుర్మార్గం: బొత్స
సాక్షి, విజయనగరం: ఏపీలో సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. మహిళలపై పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తాజాగా విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో వైఎస్సార్సీపీ తెచ్చిన సచివాలయ వ్యవస్థ విజయవంతంగా నడిచింది. దేశం మెచ్చే విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. ప్రజల వద్దకే పాలన తీసుకురావాలని వైఎస్ జగన్ ప్రయత్నం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పోలీసులతో ప్రభుత్వం దుర్మార్గ పాలన సాగిస్తోంది. మహిళలపై పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారు. పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇలా చేయడం తప్పు. ప్రజాస్వామ్యంలో తమ అభిప్రాయాలను చెప్పే హక్కు అందరికీ ఉంటుంది. వందలాది మంది సచివాలయ ఉద్యోగులను నిర్భంధించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు ఏపీ కోరలేదు. సచివాలయ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.మొన్నటి వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయి. పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వంలో చలనం లేదు. రైతులకు నష్టపరిహారం ఇస్తామని చెప్పడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పంట దెబ్బతిన్న రైతులను ఆదుకున్నాం. రైతులకు నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి అండగా నిలిచాం. ఏ ఒక్క రైతుకైనా కూటమి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది?. అరటి, బొప్పాయి, మొక్క జొన్న, వరి పంటలు నాశనం అయ్యాయి. ఇన్సూరెన్స్ లేదు. కొత్త విధానం తెచ్చాము అన్నారు. ఏదీ ఆ విధానం? అని ప్రశ్నించారు. ఈ రెండున్నర ఏళ్లలో రైతులకు జరిగిన నష్ట పరిహారం ఇవ్వాలి. మొక్కుబడిగా కాదు. సక్రమంగా ఇవ్వాలి. అరటి, బొప్పాయి పంటలకు ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది. మొక్క జొన్నకు 50 వేలు అవుతుంది. ప్రభుత్వం తక్షణమే నష్ట పరిహారం ప్రకటించాలి. పరిపాలన గాలికి వదిలేసారు. ఒక్క పోలీస్ స్టేషన్లో తప్ప ఎక్కడా ఆక్టివిటీ లేదు. పోలీస్ స్టేషన్లలో అన్నీ సెటిల్మెంట్స్ జరుగుతున్నాయి. పరిపాలన అంటే పోలీస్ వ్యవస్థ కాదు. పోలీస్ అధికారులు దిగువ స్థాయి వారికి సూచనలు ఇవ్వండి. మళ్ళీ బ్రిటిష్ పాలన తీరును తీసుకురండి. ఇది మంచి విధానం కాదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదీ చదవండి: రేపు ఒంగోలుకు వైఎస్ జగన్ -
డేటా ఎందుకు తొలగించారు? YSRCP అశోక్ కుమార్ సూటి ప్రశ్నలు
-
చంద్రబాబు సర్కార్ మరో దుర్మార్గం!
ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ప్రశ్నిస్తున్న వాళ్లపై ఉక్కుపాదం మోపుతోందన్న విమర్శలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం గళమెత్తిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తాజాగా కేసుల రూపంలో షాక్ తగిలింది. ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు విజయవాడకు తరలివచ్చిన ఉద్యోగులపై పోలీసు కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చారు. ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు విజయవాడకు చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉద్యోగులతో పోలీసుల దౌర్జన్యంగా వ్యవహరించడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లపైనే ఇప్పుడు కేసులు నమోదు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనుమతులు లేకుండా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారనే కారణంతో సత్యనారాయణపురం పోలీసులు 46 మంది ఉద్యోగులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా నిరసన తెలిపిన ఉద్యోగులపై కేసులు నమోదు చేయడంపై ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. న్యాయబద్ధమైన తమ డిమాండ్లు తెలియజేసేందుకు ప్రయత్నిస్తే కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కొంతకాలంగా తమ విధులు, పని భారం, సేవా సంబంధిత అంశాలపై పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ‘చలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహించారు. తాజాగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లపైనా కేసులు నమోదు కావడంతో ఉద్యోగుల్లో మరింత ఆందోళన నెలకొంది.చలో విజయవాడలో పాల్గొన్నందుకు కేసులు నమోదు చేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ సమస్యలపై నిరసన తెలిపిన ఉద్యోగులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: నాదీ హామీ.. న్యాయం చేసి తీరతాం: వైఎస్ జగన్ -
ఇది ప్రజాస్వామ్యమేనా ? బాబుకు జగన్ సీరియస్ వార్నింగ్
-
బాబు వెన్నులో వణుకు పుట్టేలా సచివాలయ ఉద్యోగుల మాస్ వార్నింగ్
-
34% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే సత్తా ఉందా?
సాక్షి, రాజమహేంద్రవరం: స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడం వల్లే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నాడని వైఎస్సార్సీపీ బీసీ నాయకులు ధ్వజమెత్తారు. సత్తా ఉంటే ఆ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నందున పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన వెన్నుపోటు పార్టీ వంచనపై ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని బీసీల గర్జన సదస్సు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాతేరులో ఆదివారం నిర్వహించారు. బీసీలకు ఏం చేశారో చెప్పాలి: బొత్స శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక రెండున్నరేళ్లలో బీసీలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. బ్యాక్ బోన్ అని గుర్తించిన మాజీ సీఎం వైఎస్ జగన్ వారిని ప్రోత్సహించి ప్రాధాన్యమిచ్చారని గుర్తుచేశారు. ముగ్గురు బీసీ ఎమ్మెల్యేలను డిప్యూటీ సీఎంలను చేశారని కొనియాడారు. చంద్రబాబు మాత్రం స్వలాభం కోసం అప్పులు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. 50 ఏళ్లు నిండిన బీసీలకు పింఛన్లు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. అందరం ఐక్యంగా పోరాడదామని బొత్స పిలుపునిచ్చారు. బీసీల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం: చెల్లుబోయిన బలహీన వర్గాలను చంద్రబాబు నిత్యం మోసం చేస్తున్నారని మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్య క్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల కోసమే 34 శాతం రిజర్వేషన్ డ్రామాలాడుతున్నాడని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రిని చేసేందుకు ఒక్క బీసీ ఎమ్మెల్యే దొరకలేదా అని ప్రశ్నించారు. పవన్‌కళ్యాణ్ పక్కన కూర్చునేందుకు బీసీలకు అర్హత లేదా అని నిలదీశారు. బీసీలను నేటికీ కులవృత్తిదారులుగానే బాబు చూస్తున్నారని, ఆదరణ పథకం కోసం రూ.3 వేల కోట్లు కేటాయించామని చెబుతున్నా నేటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదని చెప్పారు. చేయూత పేరిట మహిళలకు ప్రతినెలా రూ.1,500 ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని, రుణాల కోసం 3 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్కరికీ మంజూరు చేయలేదని మండిపడ్డారు. కుట్టుశిక్షణ తీసుకున్న మహిళలకు మెషిన్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదామన్నారు. క్రెడిట్ చోరీయే చంద్రబాబు పని: మాజీ మంత్రులుమాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. హాస్టళ్లలో సరైన వసతులులేక బీసీ విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో టార్చ్లైట్ల వెలుగుల్లో ఆపరేషన్లు చేసే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో బీసీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారన్నారు. ఇంకెంతకాలం ఇలాంటి పాలన భరిస్తామని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో గత సీఎం వైఎస్ జగన్ వసతులు కల్పించి అభివృద్ధి చేస్తే చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడని మండిపడ్డారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ బాబు ప్రైవేటుపరం చేసేవాడన్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యను దూరం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి బీసీల అభ్యున్నతికి పాటుపడిన బీసీల ఆత్మబంధువు జగన్ అని కొనియాడారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని గోదావరిలో కలిపేస్తాం మాజీ మంత్రులు జోగి రమేష్, విడదల రజని, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వాన్ని గోదావరిలో కలిపేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించే సత్తా చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికలొచ్చినప్పుడే ఆదరణ, ముందడుగు అంటూ డ్రామాలాడుతున్నాడని మండిపడ్డారు. బీసీల రక్షణకు చట్టం తీసుకొస్తామని మాయ చేశారన్నారు. మహాత్మా జ్యోతీరావు ఫూలే ఆశయాలను దివంగత మహానేత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆచరణలో చేసి చూపించారని కొనియాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు తండ్రీకొడుకులు బాటలు వేశారని గుర్తుచేశారు. బీసీలకు ఉప ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా అవకాశమిచ్చింది వైఎస్ జగనే అన్నారు. 2029లో జగన్‌ను సీఎంను చేసుకునేందుకు ఐక్యంగా కృషి చేద్దామన్నారు. బీసీలకు వైఎస్ జగన్ చేసిన మేలును అందరికీ వివరిద్దామన్నారు. వివిధ అంశాలపై సదస్సులో తీర్మానాలు చేశారు. బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ, మాజీ ఎంపీలు మార్గాని భరత్‌రామ్, బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ, కవురు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, రౌతు సూర్యప్రకాశరావు, కడుబండి శ్రీనివాసరావు, పార్లమెంటరీ కో–ఆర్డినేటర్లు గూడూరి శ్రీనివాస్, గూడూరి ఉమాబాల, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదా వరి జిల్లాల బీసీ సెల్ అధ్యక్షులు, ఏఎంసీ మాజీ చైర్మన్లు పాల్గొన్నారు. -
సర్కారుకు షాక్
సాక్షి, అమరావతి: హక్కుల కోసం.. ఆత్మగౌరవం కోసం శాంతియుతంగా జరగాల్సిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నిరసనపై చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా ఉక్కుపాదం మోపింది. ప్రొబేషన్ డిక్లరేషన్, ప్రమోషన్ ఛానల్, సీనియారిటీ తదితర సమస్యలను పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. రెండేళ్ల ఇంక్రిమెంట్, వేతన బకాయిలు, కనీస మూల వేతనం పెంపు, జీఓ నంబర్ 11 రద్దు వంటి డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఆదివారం, సెలవు రోజుల్లో బలవంతంగా తమ చేత పని చేయించవద్దని కోరుతున్నారు. వీటిని సాధించుకోవడం కోసం ఇన్నాళ్లూ ఎన్ని విజ్ఞప్తులు చేసినా, మంత్రి నుంచి అధికారుల వరకూ ఎంత మందికి ఎన్ని వినతులు ఇచ్చినా, చర్చలు జరిపినా ఎలాంటి ఫలితం లేదు. చివరికి విసిగిపోయి ఆందోళనకు సిద్ధమయ్యారు. కానీ అడ్డంకులను దాటుకుని వేలాదిగా తరలివచ్చిన సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు పోలీసులను ఉసిగొల్పారు. దాంతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆదివారం ఖాకీ దళాలు దౌర్జన్యకాండకు తెగబడ్డాయి. బీటెక్, ఎంటెక్, ఏంబీఏ, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత చదువులు చదివి, సమాజంలో గౌరవంగా బతుకుతున్న ఉద్యోగులను నేరస్థుల్లా, టెర్రరిస్టుల్లా చూశారు. శాంతియుతంగా నిరసన తెలపాలని వచ్చిన వారిని చితక్కొట్టారు. మహిళా ఉద్యోగుల పట్ల అమానుషంగా వ్యవహరించారు. మగ పోలీసులే మహిళల జుత్తు పట్టుకుని ఈడ్చి పడేశారు. దుస్తులు చించి అవమానించారు. అసలు తమను ఎందుకు కొడుతున్నారో తెలియక, కొడుతున్న వారు కూడా సాటి ప్రభుత్వ ఉద్యోగులే అయినా వారెందుకు తమపై విరుచుకు పడుతున్నారో అర్థం కాక సచివాలయ ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఒంటి మీద లాఠీ దెబ్బలు ఎక్కడబడితే అక్కడ తగులుతుంటే గావు గేకలు పెట్టారు. పోలీసు వ్యాన్లలో పశువుల్లా కుక్కి వారిని పోలీస్స్టేషన్లకు తరలించారు. అక్కడ గదుల్లో లోపలపెట్టి స్టేషన్‌కు తాళాలు వేసి, తినడానికి తిండి, తాగడానికి మంచి నీరు కూడా ఇవ్వకుండా నిర్బంధించారు. సమస్యలు విన్నవించుకోవడం కోసం ధర్నా చేపడితే, దానిని రణరంగంగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దమననీతిపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఎంతగా అణచి వేయాలని చూసినా, వెనక్కి తగ్గేది లేదంటూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు. ఒక వైపు ఉద్యోగులను పోలీసులు నిలువరిస్తే, మరోవైపు నుంచి భారీ సమూహంలా వచ్చి, అడ్డుగోడలు బద్దలు కొట్టారు. నిర్బంధాలను పటాపంచలు చేసి..ప్రభుత్వం విధించిన ఆంక్షలు, పోలీసుల హెచ్చరికలు, ముందస్తు నిర్బంధాల మధ్య కూడా సచివాలయ ఉద్యోగులు సోషల్ మీడియా ఆధారంగా పరస్పర సమాచారాన్ని పంచుకుంటూ అత్యధికంగా విజయవాడ చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసిన నేపథ్యంలో ‘ఛలో విజయవాడ’ ఊహించని రీతిలో విజయవంతం కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జిల్లాల్లోనూ ఉద్యోగులను అడ్డుకునే చర్యలు చేపట్టినప్పటికీ వేలాదిగా ఉద్యోగులు విజయవాడకు చేరుకున్నారు. దీని వెనుక జెన్‌జీ యువత మాస్టర్ ప్లాన్ ఉంది. ప్రణాళికలో భాగంగా.. విజయవాడకు కొందరు రెండు రోజుల ముందే వచ్చేశారు. ఎవరు వస్తున్నారనే దానిపై సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయ సేకరణ వంటివి చేపట్టారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఇతర ప్రాంతాల నుంచి ఎలా చేరుకోవాలన్న దానిపై గ్రూపుల్లో సమాచారం పంచుకున్నారు.. ఒక మార్గంలో అడ్డంకులు ఎదురైతే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకునేలా ముందుగానే ప్లాన్–బి (ప్రణాళిక) రూపొందించుకున్నారు.సోషల్ మీడియానే సమాచార వేదిక వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఎక్స్ వంటి వేదికలను సచివాలయ ఉద్యోగులు విస్తృతంగా ఉపయోగించారు. ఎక్కడ పోలీసులు అడ్డుకున్నారు? ఎవరిని అదుపులోకి తీసుకున్నారు? విజయవాడలో ఎక్కడికి చేరుకోవాలి? వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెనుక వస్తున్న వారికి చేరవేశారు. బస్సుల్లో, రైళ్లలో వస్తున్న వారు బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వరకు చేరుకోకుండానే ముందు స్టేజీల్లో ఎక్కడ దిగాలనేదానిపై సూచనలు చేశారు. పోలీసుల నిర్బంధానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకున్నారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలను ప్రస్తావిస్తూ భావోద్వేగపూరిత పోస్టులు కూడా విస్తృతంగా షేర్ చేశారు. అవి మరింతగా ఉద్యమ స్ఫూర్తిని రగిల్చాయి.ఎక్కడ అడ్డుకుంటే అక్కడే..ముందు రోజు రాత్రి రైళ్లు, బస్సుల్లో వస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాలు దించి, వారిని పోలీస్స్టేషన్లకు తరలించారు. వందలాదిగా వస్తున్న వారిని వెనక్కి వెళ్లిపొమ్మంటూ అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగులు ఎక్కడ అడ్డుకుంటే అక్కడే తమ గళాన్ని వినిపించారు. తమ హక్కుల కోసం నినదించారు. ఆ దృశ్యాలను వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.భయపెట్టలేని ముందస్తు అరెస్టులు.. సస్పెన్షన్లుఛలో విజయవాడకు ముందు నుంచే ఉద్యోగులపై నిఘా, ముందస్తు నిర్బంధాలు, అరెస్టులు చేపట్టారు. తెల్ల కాగితాలపై వారి చేత సంతకాలు చేయించుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాల ముఖ్య నేతలను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఛలో విజయవాడకు సంబంధించిన సోషల్ మీడియా కార్యకలాపాలను సైతం నియంత్రించారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టిం చారు. ఉద్యోగులను ఏమార్చే ప్రయత్నం చేశారు. ఉద్యమంలో పాల్గొంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ కలెక్టర్లు, కమిషనర్లు హెచ్చరించారు. అయినా అవేవీ ఉద్యోగులను భయపెట్టలేకపోయాయి. ఢిల్లీని వణికించిన ‘కాక్రోచ్’ తిరుగుబాటుకు కొనసాగింపుగా అన్నట్లు ఏపీలో కదంతొక్కిన జెన్ జీ యువతరం మరోసారి స్వాతంత్రోద్యమంలో ‘స్టూడెంట్ మూమెంట్’ను గుర్తుచేసింది. రాత్రయినా ఏమాత్రం ఉద్యమ స్ఫూర్తిని కోల్పోకుండా సెల్‌ఫోన్ వెలుగులోనే ఆందోళన కొనసాగించి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను చాటిచెప్పింది. -
ఉద్యోగుల పొట్ట కొడతారా!
సాక్షి, అమరావతి : పొట్టకూటి కోసం పోలీస్ ఉద్యోగం చేస్తున్న వారు చంద్రబాబు ఆదేశాలతో తోటి ప్రభుత్వోద్యోగుల పొట్టలు కొట్టేలా ఉక్కుపాదం మోపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అక్రమాలు.. వైఫల్యాలపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నుంచి ఉద్యోగుల వరకు చేస్తున్న వరుస ఉద్యమాలపై పోలీస్ బలాన్ని ప్రయోగిస్తున్న చంద్రబాబు తీరుపై ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. రెడ్‌బుక్ పాలనలో ప్రభుత్వం చెప్పిందే తరువాయి కొందరు పోలీసులు పేట్రేగిపోయి భయోత్పాతం సృష్టిస్తున్నారు. విజయవాడ ధర్నాచౌక్‌లో ఆదివారం భారీ నిరసన చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత అమానుషంగా ఉంది. సచివాలయ ఉద్యోగులపై విరుచుకుపడి తమ ప్రతాపం చూపించారు. మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులే జుట్టుపట్టి ఈడ్చేసి కర్కశంగా ప్రవర్తించారు. చివరికి.. వివిధ పోలీస్స్టేషన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు నిర్బంధానికి గురైన మహిళా ఉద్యోగులను టాయిలెట్స్‌కు కూడా అనుమతించలేదు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారిని మందులు తెచ్చుకుంటామని మొరపెట్టుకున్నా కనికరించకుండా రాక్షసంగా వ్యవహరించారు. భోజనం కూడా పెట్టని పోలీసులు విజయవాడ గాంధీనగర్ ధర్నాచౌక్‌కు చేరుకున్న ఉద్యోగులపట్ల పోలీసులు అమానవీయంగా ప్రవర్తించడంతో తోపులాటలు జరిగాయి. మహిళా ఉద్యోగులను మగ పోలీసులు ఈడ్చేసి మరీ పోలీసు వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించారు. మహిళా సిబ్బందిని నున్న, సింగ్‌నగర్, మాచవరం, కృష్ణలంక, ఉయ్యూరు తదితర పోలీస్స్టేషన్లకు తరలించారు. క్రిమినల్స్‌ను చూసినట్లు వారిపట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారు. వారికి భోజనం కూడా పెట్టకుండా ఆకలితో అలమటించేలా చేశారు. మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సచివాలయ ఉద్యోగులకు భోజనం తీసుకెళ్లిన ఉద్యోగుల సంఘ నేత కాకర్ల వెంకట్రామిరెడ్డిని పోలీసులు అనుమతించలేదు. దీంతో తాము తెచ్చిన భోజనమైనా ఉద్యోగులకు అందించండి? లేకుంటే మీరైనా భోజనం పెట్టండి అంటూ వెంకట్రామిరెడ్డి పోలీసులను కోరారు. అయినా పట్టించుకోని పోలీసులు భోజనాన్ని సచివాలయ ఉద్యోగులకు పెట్టకుండానే రాక్షసంగా వ్యవహరించారు. ఆ ఇద్దరి మరణాలు సర్కారు హత్యలే.. ఇక చంద్రబాబు ప్రభుత్వ తీవ్ర నిర్బంధం కారణంగానే వైఎస్సార్సీపీ నేత కాకుమాను రాజశేఖర్, తాజాగా ఆదివారం విజయవాడ నున్న సీఐ అహ్మద్ అలీ మృతిచెందారు. ఈ రెండు ఘటనలు సర్కారు హత్యలేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ చేయాలని, నైతిక బాధ్యత వహించి లోకేశ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న ఆ పార్టీ నేత, లిడ్ క్యాప్ మాజీ చైర్మన్ కానుమాను రాజశేఖర్‌పై పోలీసులు దాడిచేయడంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురై కిందపడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఆసుపత్రిలో చేర్చి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయనపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి మానసికంగా వేధించడంతో తీవ్ర ఒత్తిడికి గురై చివరికి గుండెపోటుతో మృతిచెందారు. ఇప్పుడు విజయవాడ ధర్నాచౌక్‌లో ఆదివారం సచివాలయ ఉద్యోగుల ఆందోళనను భగ్నం చేయడానికి విధులు నిర్వర్తిస్తున్న నున్న సీఐ అహ్మద్ అలీ గుండెపోటుకు గురయ్యారు. ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. చంద్రబాబు ప్రభుత్వ తీవ్ర ఒత్తిడివల్లే సీఐ గుండెపోటుకు గురయ్యారని సహచర పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇదే ధర్నాలో పోలీసుల దాడులు, దౌర్జన్యాలకు అనేక మంది సచివాలయ ఉద్యోగులు సొమ్మసిల్లి పడిపోవడం, గాయాలపాలయ్యారు. -
సీఎం రిలీఫ్ ఫండ్‌లో రూ.వందల కోట్ల దోపిడీ
సాక్షి, అమరావతి: పేద, మధ్యతరగతి ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వెన్నుపోటు పొడుస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) పేరుతో అంతులేని దోపిడీకి తెరలేపిందని ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అశోక్‌కుమార్ ఆరోపించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన ఈ 22 నెలల్లోనే ఏకంగా రూ.1,298 కోట్లను సీఎంఆర్ఎఫ్ కింద డ్రా చేసి.. ఇందులో రూ.వెయ్యి కోట్లు ఆరోగ్యశ్రీ పరిధిలోని వ్యాధులకే కేటాయించడం భారీ కుంభకోణానికి నిదర్శనమని చెప్పారు. ఒకవైపు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రీయింబర్స్మెంట్ కింద చెల్లించాల్సిన రూ.3,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టి ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని.. మరోవైపు, అధికార కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి అనుయాయులకు చెందిన ఆసుపత్రులకు సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ నిధులను అడ్డగోలుగా దోచిపెడుతున్నారని అశోక్‌కుమార్ తెలిపారు. పేషెంట్లు లేకపోయినా దొంగ ఎల్వోసీలు సృష్టించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం పట్టించుకోకపోవడం ఆయన అవినీతి పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎంఆర్ఎఫ్ ద్వారా విడుదల చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, స్వతంత్ర సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు కనీసం మందులు కూడా దొరకని దుస్థితి నెలకొందని.. అద్దంకి నియోజకవర్గంలోని ప్రభుత్వాస్పత్రిని చూస్తే 50 పడకలు కూడా సరిగ్గాలేవని, అది ఒక భూత్ బంగ్లాలా మారిందని అశోక్‌కుమార్ చెప్పారు. ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కల్పించడంలేదన్నారు. -
హామీలు అమలు చేయాలంటే కొడతారా?
సాక్షి, అమరావతి : ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగిన ఉద్యోగులపై చంద్రబాబు సర్కార్ పాశవికంగా దాడి చేయడం అమానుష చర్య అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘ఐఆర్ లేదు.. పీఆర్సీ లేదు. మేం పీఆర్సీ చైర్మన్‌ను నియమిస్తే మీరు వెళ్లగొట్టారు. ఉద్యోగులకు హక్కుగా ఇవ్వాల్సిన 5 డీఏలు పెండింగ్. ఉద్యోగులు రోడ్డెక్కితే.. అప్పుడు అందులో రెండు డీఏలు ఇస్తానని ప్రకటించి, అరియర్స్ చెల్లింపునకు కూడా వాయిదాలు పెట్టారు. సరెండర్ లీవ్స్ పెండింగ్. ఉద్యోగులకు పెట్టిన బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లు. ఇవి ఇవ్వాలని అడిగిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం అత్యంత తీవ్రమైన విషయం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపనప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతును వినిపించడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ‘ఆందోళన చేస్తే ఈ రకంగా లాఠీలతో కొడతారా? మహిళలని చూడకుండా గాయపరుస్తారా? ఈడ్చి పడేస్తారా? శాంతియుత ఆందోళనలపై దాడులు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? ధర్నా కోసం వస్తున్న వారిని అడ్డుకుని పోలీస్స్టేషన్లలో నిర్బంధించి నరకయాతన పెడతారా? ధర్నా జరగనీయకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను అడ్డగోలుగా సస్పెండ్ చేయడం దారుణం కాదా? చంద్రబాబూ.. ఇది ప్రజాస్వామ్యమేనా? రోజురోజుకూ మీ నిరంకుశత్వం పెరిగిపోతోంది? ఉద్యోగులకు వెన్నుపోటు పొడవడమే మీ లక్ష్యం. అధికారం చేతిలో ఉందికదా అని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటే ఎలా?’ అని నిలదీశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే కాదు.. ఇవాళ ఏ ఉద్యోగి అయినా రోడ్డెక్కుతున్నారంటే కారణం మేనిఫెస్టోలో మీరు హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగులందరికీ వెన్నుపోటు పొడవటమే అన్నారు. మీరు అధికారంలోకి వస్తానే ఐఆర్ అన్నారు. పీఆర్సీ అన్నారు. తీరా చూస్తే ఏవీ లేవని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సమయంలో మహిళా ఉద్యోగిని పోలీసులు ఈడ్చుకెళ్తున్న ఫొటోను ట్యాగ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సచివాలయ వ్యవస్థపై కక్ష మీరు సీఎం సీట్లోకి వచ్చిన తొలి రోజు నుంచే.. మేం దేశంలో ఎక్కడా లేని విధంగా, పరిపాలనలో విప్లవాత్మక చర్యగా తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలపై కక్షగట్టారు. గ్రామ స్థాయిలోనే 540కి పైగా సేవలందించిన, మా మానస పుత్రికలైన గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ నిర్వీర్యమే లక్ష్యంగా.. ఆ వ్యవస్థలపై నిరంతరం దాడి చేస్తూనే ఉన్నారు. గ్రామ స్వరాజ్యం కనబడకుండా చేసేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఒకే నోటిఫికేషన్‌తో దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను, వలంటీర్ల రూపంలో మరో 2.6 లక్షల ఉద్యోగాలను గ్రామ, వార్డు స్థాయిలో పారదర్శక పాలన కోసం మేం సృష్టించాం. హేతు బద్ధీకరణ పేరుతో మీరు శాశ్వతంగా 30 వేల ఉద్యోగాలకు ఎసరు పెట్టడమే కాకుండా, వలంటీర్లకు మేం ఇచ్చే రూ.5 వేల జీతాన్ని రూ.10 వేలు చేస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక వారికీ వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు వలంటీర్లు అందించే సేవలనూ సచివాలయాల ఉద్యోగుల నెత్తిమీద పెట్టి, మోయలేని పని భారాన్ని మోపారు. పారదర్శకతకూ, ఇంటి వద్దకే పాలనకూ తెరదించారు. మీరు పెడుతున్న కష్టాలు, వేధింపులు భరించలేక ఒత్తిడికి గురై కొందరు, బలవన్మరణానికి పాల్పడి మరికొందరు.. ఇలా ఈ రెండున్నరేళ్ల మీ దుర్మార్గ పరిపాలనలో ఏకంగా సుమారు 100 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు, వారి బాధలు వినాలనే ఉద్దేశం మీకు లేనప్పుడు, వారు శాంతియుత ఆందోళన ద్వారా తమ గొంతు వినిపించాలనుకోవడం తప్పు ఎలా అవుతుంది? ఈ లాఠీఛార్జి ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించడమే కాకుండా, ఉద్యోగులకు క్షమాపణ చెప్పండి. వారిపై విధించిన సస్పెన్షన్లను బేషరతుగా ఎత్తివేయండి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.గ్రామ–వార్డు సచివాలయాల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు వారి జగనన్నగా నేను హామీ ఇస్తున్నాను. దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే గ్రామ–వార్డు సచివాలయాల వ్యవస్థను మునుపటి కంటే మరింత బలోపేతం చేస్తాం. తద్వారా గ్రామ స్వరాజ్యం మూడు పువ్వులు – ఆరుకాయలుగా వర్దిల్లుతుంది, మాట ఇస్తే, మాటమీద నిలబడే విశ్వసనీయ పాలన మళ్లీ ఉజ్వలిస్తుంది. ఉద్యోగులు తమ బాధ్యతలను గొప్పగా నిర్వర్తించేలా, ప్రజలకు అద్భుతమైన సేవలు మళ్లీ అందేలా, దేశం అంతా మన వైపు చూసేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రెండున్నరేళ్లు అయిపోయింది. ఇక మిగిలింది రెండున్నరేళ్లు మాత్రమే. కళ్లు మూసుకుంటే ఆ కాలం కూడా ఇట్టే గడిచి పోతుంది. మన అందరి ప్రభుత్వం తప్పక వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. -
పదోన్నతుల పేరిట సర్కారు బురిడీ!
సాక్షి, అమరావతి: కడుపు మండి రోడ్డెక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను చంద్రబాబు సర్కారు బురిడీ కొట్టించేందుకు బరితెగించింది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని వారు కొన్నాళ్లుగా కోరుతున్నా, సర్కారు ఖాతరు చేయలేదు. దీంతో తాడోపేడో తేల్చుకోవడానికి ఆదివారం ‘చలో విజయవాడ’కు తరలివచ్చారు. పోలీసుల ఆంక్షలకు వెరవలేదు.. ధర్నాచౌక్‌లో లాఠీలు ఝళిపించినా భయపడలేదు. ధర్నా కొనసాగించారు. దీంతో ఉద్యమాన్ని పక్కదారి పట్టించేలా ప్రభుత్వం పట్టణ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు అంటూ సవాలక్ష లోపాలతో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలను చూసిన సచివాలయ ఉద్యోగులు సర్కారు మోసపూరిత విధానాలపై నిప్పులు చెరుగుతున్నారు. కీలక అంశాలపై స్పష్టత ఏది? ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రమోషన్లకు సంబంధించి స్పష్టత లేదు. 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 1,630 గ్రేడ్–1 పోస్టులు ఏర్పాటు చేసినా.. అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్లు ఎప్పటిలోగా ఇస్తారో ఉత్తర్వుల్లో చెప్పలేదు. పే ఫిక్సేషన్‌పై స్పష్టత లేదు. ఒక కేడర్ నుంచి మరో కేడర్‌కు ప్రమోషన్ వచ్చినప్పుడు జీతాన్ని ఏ విధంగా నిర్ణయిస్తారో పేర్కొనలేదు. జీతం పెరుగుదలపై క్లారిటీ ఎక్కడ? ప్రమోషన్ వచ్చిన ఉద్యోగికి జీతం ఎంత పెరుగుతుంది? అదనపు ఇంక్రిమెంట్ ఇస్తారా? గ్రేడ్–1కి వెళ్లినప్పుడు వేతన ప్రయోజనం ఉంటుందా? అన్న వివరాలు లేవు. అరియర్స్ ప్రస్తావన కూడా లేదు. 2019 నుంచి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు గత కాలానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు లేదా అరియర్స్ ఇస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. సీనియారిటీ నిర్ణయం ఎలా? ప్రమోషన్ల సమయంలో నియామక తేదీ, కేడర్‌లో సీనియారిటీ, రోస్టర్ తదితర అంశాల్లో దేనిని ప్రాతిపదికగా తీసుకుంటారో స్పష్టం చేయలేదు. అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత ఏర్పడే ఖాళీల ఆధారంగా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు అవకాశం కల్పించనున్నారు. దీంతో ఒక దశ పూర్తయిన తర్వాతే మరో దశ మొదలయ్యే పరిస్థితి ఉంటుంది. అది కూడా ఎంత కాలం పడుతుందో తెలియని పరిస్థితి.శానిటేషన్, ప్లానింగ్ కేడర్లలో 815 చొప్పున పోస్టులను గ్రేడ్–1కు అప్‌గ్రేడ్ చేశారు. అయితే వీటికి ప్రమోషన్లు ఎప్పుడు, ఏ విధంగా ఇస్తారన్నది స్పష్టంగా లేదు. ఉన్న ఖాళీల్లో మిగులు పోస్టులను సర్దుబాటు చేయడం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం ఉండదని చెబుతున్నారు. అయితే ప్రమోషన్ పొందిన ఉద్యోగులకు వేతనపరంగా ఎలాంటి ప్రయోజనం కల్పిస్తారన్నది ఉత్తర్వుల్లో వివరించలేదు. రెండు కేటగిరీల ఊసే లేదు వార్డు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్, వార్డు అమెనిటీస్ సెక్రటరీల ప్రమోషన్లపై సంబంధిత శాఖల సిఫార్సులు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఈ ఉద్యోగులకు ఇంకా స్పష్టమైన గడువు తెలుపలేదు. హడావుడిగా ఉద్యోగుల హోదాలు, బాధ్యతలను మార్చే అంశం ప్రస్తావించిన సర్కారు.. కొత్త జాబ్ చార్ట్, అధికారాలు, జవాబుదారీతనం, తదుపరి ప్రమోషన్‌కు అవసరమైన అర్హతలపై స్పష్టత ఇవ్వక పోవడంపై సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రమోషన్ల అమలు గడువు, సీనియారిటీ, పే ఫిక్సేషన్, జీతభత్యాలు, అరియర్స్పై స్పష్టమైన మార్గదర్శకాలు లేని ఈ ఉత్తర్వులు ఉత్తిత్తివేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘చంద్రబాబుది నియంతృత్వ పాలన.. ఎవరికీ రక్షణ లేదు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుది నియంతృత్వ పాలన.. ఈ నిరంకుశ పాలనలో ఎవరికీ రక్షణ లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సమస్యలపై నిరసనలు తెలిపితే అరెస్టులు చేయటం దుర్మార్గం అంటూ దుయ్యబట్టారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు గొంతు చించుకున్న చంద్రబాబు ఇప్పుడు ఉద్యమాలపై ఉక్కు పాదం మోపుతారా?’’ అంటూ నిలదీశారు.‘‘గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ధర్నా చేస్తే ప్రభుత్వం ఎందుకు సహించలేక పోతోంది?. ఉన్నతాధికారులతో గ్రామ సచివాలయ ఉద్యోగులను వేధించటం అన్యాయం. ఉద్యోగులపై వేధింపులను చూసి సభ్య సమాజం సిగ్గుతో తల దించుకుంటోంది. సమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబు విదేశాలలో రహస్య పర్యటనకు వెళ్లటం సిగ్గుచేటు. శాప్ ఆఫీసు ఎదుట నకిలీ టీచర్లతో నకిలీ ధర్నాలు చేయించిన ఘనత ఈ ప్రభుత్వానిది’’ అని లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘గ్రామ సచివాలయ ఉద్యోగులు ధర్నా చేయిద్దని పోలీసులతో నోటీసులు ఇప్పిస్తారా?. ఉద్యోగులకు సమస్యలు ఉండవా? పరిష్కారం కోరుకోకూడదా?. ఉద్యమిస్తే ఉక్కుపాదంతో అణచివేయడం దుర్మార్గపు చర్య. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చాలా చిన్నవారు. అలాంటి వారిపైకి పోలీసులను ఉసిగొల్పటం అన్యాయం. సాటి ఉద్యోగుల విషయంలో పోలీసులు కూడా సంయమనం పాటించాలి. తోటి ఉద్యోగులపై లాఠీలు ఝుళిపించటం సరికాదు’’ అంటూ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు.‘‘కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో కూడా పని చేసింది ఈ నిరుద్యోగులే. అలాంటి వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలి. సచివాలయ ఉద్యోగులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. కనీసం తాగడానికి మంచినీరు కూడా ఇవ్వటం లేదు. ఈ దుర్మార్గపు చర్యలను ఖండిస్తున్నాం. ప్రభుత్వం మొండి వైఖరి వీడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’’ అని లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ‘రక్షక భటులు.. రాక్షస భటులుగా మారిపోయారు’ -
సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?
-
‘రక్షక భటులు.. రాక్షస భటులుగా మారిపోయారు’
సాక్షి, తాడేపల్లి: గ్రామ సచివాలయ ఉద్యోగులపై ఉక్కు పాదం అన్యాయం.. వారు రాజ్యాంగబద్దంగా గళాన్ని విప్పితే అణచివేస్తారా? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే అరెస్టు చేసిన వందలాది మంది ఉద్యోగులను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.‘‘గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం వైఎస్ జగన్ సచివాలయ వ్యవస్థను తెస్తే చంద్రబాబు దాన్ని సర్వనాశనం చేశారు. ధర్నా చేస్తున్న ఉద్యోగులను లాఠీలతో కొట్టించటం అన్యాయం. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరితే కాల్పులు జరిపించిన వ్యక్తి చంద్రబాబు. డీఎస్సీ అక్రమాలపై ఉద్యమం చేసిన మా వాళ్లపై పోలీసులతో దాడులు చేయించారు. ఆ దాడుల్లో మా నేత కాకుమాను రాజశేఖర్ చనిపోయారు. రక్షక భటులు రాక్షస భటులుగా మారిపోయారు’’ అని టీజేఆర్ ధ్వజమెత్తారు.ఈ ఘటనకు బాధ్యడిని చేస్తూ డీజీపీపై సుమోటోగా కేసు నమోదు చేయాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు సహేతుకమైనవి. వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం వేధింపులకు దిగటం అన్యాయం. శాప్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తారా?. మా ఎమ్మెల్సీలు తలశిల, లేళ్ల అప్పిరెడ్డి రౌడీషీటర్లు అయితే చంద్రబాబు, లోకేష్ కూడా రౌడీషీటర్లే. కరోనా సమయంలో గ్రామ సచివాలయ ఉద్యోగులే ప్రజలను కాపాడారు. అలాంటి వారి సమస్యలు పరిష్కారం చేయకపోగా పోలీసులతో కొట్టిస్తారా?’’ అంటూ టీజేఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: సీఎం పర్యటనల ఈవెంట్స్ ఖర్చు రూ.44.62 కోట్లు -
సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?
-
FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు
-
తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు
-
విజయవాడ ధర్నాచౌక్ వద్ద రణరంగ వాతావరణం
సచివాలయ ఉద్యోగుల ధర్నా అప్డేట్స్.. కృష్ణాజిల్లా:ఆత్కూరు పోలీసుల నిర్బంధంలో 32 మంది మహిళా సచివాలయ సిబ్బందిఉదయం నుంచి స్టేషన్ లో నే ఉంచిన పోలీసులుఆధార్ కార్డులు ఇచ్చి... సంతకాలు పెడితేనే వదిలిపెడతామంటున్న పోలీసులువేర్వేరు జిల్లాలకు వెళ్లాల్సిన వారు కావడంతో ఆందోళనలో సచివాలయ మహిళా ఉద్యోగులురాత్రి 9 గంటల దాటినా ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో ఉంచడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సచివాలయ మహిళా ఉద్యోగులుకృష్ణా జిల్లాఉయ్యూరు రూరల్, టౌన్ పోలీస్ స్టేషన్లో 183 మంది సచివాలయం ఉద్యోగులు ఉదయం ధర్నా చౌక్ నుంచి సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చిన పోలీసులు రాత్రి 9 అవుతున్న ఇంకా స్టేషషన్లోనే సచివాలయ ఉద్యోగులు ఆధార్ కార్డులు ఇచ్చి సంతకాలు పెట్టాలంటూ పోలీసులు ఒత్తిడి ఆధార్ కార్డులతో మీకేం పని అంటూ ప్రశ్నిస్తున్న ఉద్యోగులు ఇంకా స్టేషన్ లోనే ఉండడంతో ఆగ్రహానికి వ్యక్తం చేస్తున్న మహిళ ఉద్యోగులువిజయవాడ: పటమట పోలీస్ స్టేషన్ లో సచివాలయ ఉద్యోగులు నిర్బంధంఉదయం 7 గంటలకు బస్టాండ్ ,రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులుపన్నెండు గంటలుగా పటమట పోలీస్ స్టేషన్లోనే ఉంచేసిన పోలీసులుఇంకా స్టేషన్లోనే ఉన్న మహిళా ఉద్యోగులు పైఅధికారులు చెబితేనే పంపిస్తామంటున్న పోలీసులునోటీసులపై సంతకాలు పెట్టాలి..ఆధార్ కార్డులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్న పోలీసులువిజయవాడ ధర్నాచౌక్ వద్ద రణరంగ వాతావరణం11 గంటలుగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నిరసనవారిపై పోలీసుల లాఠీ చార్జ్డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకూ వెనక్కి తగ్గేది లేదంటున్న ఉద్యోగులు టార్చ్లైట్ల వెలుగులోనే ఆందోళనసాయంత్రం అయినా కొనసాగుతున్న సచివాలయ ఉద్యోగుల ఆందోళన.సెల్‌ఫోన్ టార్చ్లైట్లు ఆన్ చేసి “We Want Justice” అంటూ నినాదాలుఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వద్ద సచివాలయ ఉద్యోగులకు మాజీ ఉద్యోగ సంఘ నాయకులు వెంకట్రామిరెడ్డి సంఘీభావంన్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సచివాలయ ఉద్యోగులను అరెస్టు చేయడం అన్యాయంకుటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తుంది.ప్రభుత్వానికి సమస్యలను చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదుకూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక కారణాలతో దాదాపు 100 మంది ఉద్యోగులు చనిపోయారుప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్లను తొలగించి సచివాలయం ఉద్యోగులపై పని భారాన్ని మోపారుసచివాలయ ఉద్యోగులను సాధారణ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలిసచివాలయ ఉద్యోగుల ఆందోళనకు తాను అండగా ఉంటానని, ప్రభుత్వం దిగి వచ్చి సమస్యలు పరిష్కారం చేయాల్సిందే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వానికి ఎందుకంత కక్ష?: కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీవైఎస్ జగన్ తెచ్చిన వ్యవస్థ అని కోపమా?మహిళా ఉద్యోగులను కూడా రోడ్డు మీద పడేసి లాగడం దుర్మార్గంతలలు పగిలే పోలీసులు కొట్టడం సిగ్గుచేటుఇదేనా మహిళా ఉద్యోగులకు ఇచ్చే గౌరవం?తిరుపతిలో కూడా ధర్నా చేస్తున్న నర్సింగ్ స్టూడెంట్స్‌ని జుట్టు పట్టుకుని లాగారుఉద్యోగులు న్యాయ బద్దమైన సమస్యల పరిష్కారానికి ధర్నా చేస్తే అరెస్టులు చేస్తారా?ధర్నాకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ముందే చెప్పారుఅయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదుపైగా యూనియన్ నేతలపై సస్పెన్షన్ వేటు వేశారువారి హక్కుల గురించి అడిగితే అరెస్టులు చేయటం దుర్మార్గంఅరెస్టు అయిన వారందరినీ బేషరతుగా రిలీజ్ చేయాలితిరుపతి: తిరుపతి ఓల్డ్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన సచివాలయ ఉద్యోగులున్యాయపరమైన సచివాలయం ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలికూటమి ప్రభుత్వం పాలనలో సచివాలయం ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలుకూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఖండిస్తున్నాంవిజయవాడలో సచివాలయం ఉద్యోగులపై లాఠీ చార్జీని ఖండిస్తూ నిరసన పోలీస్ స్టేషన్లలో భోజనాలు కూడా ఇవ్వని పోలీసులుమాచవరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డిఉద్యోగులకు భోజనాలు ఇవ్వడానికి వెళ్లిన వెంకట్రామిరెడ్డివెంకట్రామిరెడ్డిని భోజనాలు ఇవ్వకుండా అడ్డుకున్న పోలీసులునానా బాధలు ఎదుర్కొంటున్న అరెస్టైన సచివాలయ ఉద్యోగులు సచివాలయ వ్యవస్థను చంద్రబాబు సర్వ నాశనం చేశారు: సుధాకర్బాబురాజ్యింగ బద్ధంగా గళం విప్పితే అణిచివేస్తారా?ధర్నా చేస్తున్న వారిపి లాఠీచార్జ్ దుర్మార్గంసమస్యలు పరిష్కారం చేయకపోగా, పోలీసులతో కొట్టిస్తారా?రక్షకభటులు, రాక్షస భటులుగా మారిపోయారువిజయవాడ ధర్నా చౌక్‌లో తీవ్ర ఉద్రిక్తతసచివాలయ ఉద్యోగులను ఈడ్చిపడేస్తున్న పోలీసులుమహిళా ఉద్యోగులను సైతం ఈడ్చుకెళ్లిన పోలీసులుమహిళా ఉద్యోగిని జట్టుపట్టుకుని ఈడ్చేసిన పోలీసులుఉద్యోగులను బలవంతంగా లాక్కెళ్తున్న పోలీసులుఉద్యోగుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీసులుపోలీసులతో సచివాలయ ఉద్యోగలు వాగ్వాదం, తోపులాటతోపులాటలో పలువురు సచివాలయ ఉద్యోగులకు గాయాలువిజయవాడ: పోలీసులు దౌర్జన్యం వ్యవహరిస్తున్నారు: ఉద్యోగులుశాంతియుత ఆందోళనను అడ్డుకోవడం సరికాదుకూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది విజయవాడ: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో సచివాలయ ఉద్యోగులు71 మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలింపుభోజనం కూడా చేయలేదని, మమ్మల్ని విడిచిపెట్టాలని సచివాలయ ఉద్యోగుల ఆవేదనమమ్మల్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా ప్రభుత్వం చూస్తోందిమాకు కూడా అన్ని రకాల బెన్పిట్స్ ఇవ్వాలిఉద్యోగులు అరెస్టునెల్లూరు నుండి ప్రైవేటు బస్సులో విజయవాడ చేరుకున్న సచివాలయ ఉద్యోగులు అరెస్టుఅరెస్టు చేసిన ఉద్యోగులను మాచవరం పోలీస్ స్టేషన్ కు తరలింపుఉదయం నుండి తిండి తిప్పలు లేకుండా నిర్భందం.ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వమే ఉక్కుపాదం మోపడంపై ఉద్యోగుల ఆవేదన, ఆగ్రహంవిజయవాడలో మహిళా ఉద్యోగులను సైతం ఈడ్చుకెళ్లిన పోలీసులు.పోలీసులతో ఉద్యోగుల వాగ్వాదం, తోపులాట.శాంతియుత ఆందోళన వద్దని ఉద్యోగుల ఆవేదన విజయవాడ..కొనసాగుతున్న సచివాలయ ఉద్యోగుల ఆందోళనధర్నా చౌక్ వద్దకు చేరుకున్న పోలీస్ బలగాలులాఠీలతో రంగ ప్రవేశం చేసిన పోలీసులుఅరెస్టులకు సిద్దమైన పోలీసులునాలుగు గంటలుగా కొనసాగుతున్న నిరసనమంత్రి వచ్చే వరకు కదిలేది లేదని స్పష్టం చేసిన సచివాలయ ఉద్యోగులు..పోలీసులు, కూటమి సర్కార్ తీరుపై ఉద్యోగుల మండిపాటు. కృష్ణా జిల్లా..గన్నవరం వద్ద సచివాలయ మహిళా ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు.తణుకు నుండి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఛలో విజయవాడ కార్యక్రమానికి బయల్దేరిన 60 మంది ఉద్యోగులు.పోలీసుల తీరుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళా ఉద్యోగులు.శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళుతుంటే అడ్డుకోవడం దారుణమంటూ ఉద్యోగుల ఆగ్రహందద్దరిల్లిన విజయవాడ..సచివాలయ ఉద్యోగుల నిరసనతో దద్దరిల్లిన బెజవాడలెనిన్ సెంటర్ జంక్షన్‌కు పోటెత్తిన సచివాలయ ఉద్యోగులులెనిన్ సెంటర్‌కు వచ్చే అన్ని దారులను మూసేసిన పోలీసులుపోలీసులు ఎక్కడ అడ్డుకుంటే అక్కడే బైఠాయించి నిరసన చేస్తున్న సచివాలయ ఉద్యోగులుఆందోళన చేస్తున్న సచివాలయ ఉద్యోగులను అరెస్ట్ చేస్తున్న పోలీసులుపోలీసులు, ప్రభుత్వం తీరుపై సచివాలయ ఉద్యోగులు ఫైర్పోలీసుల ఓవరాక్షన్..ఉద్యోగుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు.సచివాలయ ఉద్యోగులను ఈడ్చిపడేసిన పోలీసులు.పోలీసుల తీరుపై సచివాలయ ఉద్యోగుల ఆగ్రహంపోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు.విజయవాడలో ఉద్రిక్తత..రోడ్డుపై బైఠాయించి గ్రామ సచివాలయ ఉద్యోగుల ఆందోళన. పోలీసుల దిగ్బంధంలో ధర్నా చౌక్రణరంగంగా మారిన విజయవాడధర్నా చౌక్ రాకుండా అన్ని వైపుల బారికేడ్లతో మూసేసిన పోలీసులుఎక్కడికి అక్కడ సచివాలయ ఉద్యోగులను అరెస్టు చేస్తున్న పోలీసులుపోలీసుల వలయాన్ని ఛేదించి లెనిన్ సెంటర్ వరకు చేరుకున్న సచివాలయ ఉద్యోగులులెనిన్ సెంటర్‌కు వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగులులెనిన్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి నిరసనలువిజయవాడలో సచివాలయ ఉద్యోగుల ఆందోళనరోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న సచివాలయ ఉద్యోగులుఉద్యోగులను ఈడ్చిపడేస్తున్న పోలీసులుపోలీసుల తీరుపై సచివాలయ ఉద్యోగులు ఫైర్విజయవాడలో ఉద్రిక్తత..విజయవాడ ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత.ఛలో విజయవాడకు రాకుండా ఎక్కడికక్కడ ఉద్యోగుల అరెస్ట్. వియ్ వాంట్ జస్టిస్ అంటూ సచివాలయ ఉద్యోగుల నినాదాలు. 👉చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అర్ధరాత్రి నుంచే బస్సులు, రైళ్ల నుంచి ఉద్యోగులను దించి.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్దే అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నాయి.👉విజయవాడలోనే దాదాపు 600 మంది సచివాలయ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అదుపులోకి తీసుకున్న వారిని నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విజయవాడకు బయలుదేరిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నట్లు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొందరిని బస్సుల నుంచి, మరికొందరిని రైళ్ల నుంచి దించి అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నాయి.👉చలో విజయవాడకు హాజరుకాకుండా ఉద్యోగులను అడ్డుకోవడం, అరెస్టులు చేయడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం నిర్బంధ చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. -
9 సహకార షుగర్ కర్మాగారాల ఆస్తులు తెగనమ్మేందుకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్
-
సీఎం పర్యటనల ఈవెంట్స్ ఖర్చు రూ.44.62 కోట్లు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ పనులకు భారీగా వ్యయం చేశారు. వివిధ జిల్లాల్లో సీఎం కార్యక్రమాలకు సంబంధించిన ఈవెంట్ మేనేజ్మెంట్ పనులను మాన్ డెకరేటర్స్ సంస్థ నిర్వహించింది. ఇందుకోసం రూ.44.62కోట్లు ఖర్చుచేసినట్టు మాన్ డెకరేటర్స్ సంస్థ పేర్కొంది. తమకు చెల్లించాల్సిన బకాయిల్లో కనీసం 50 శాతం మంజూరు చేయాలని మాన్ డెకరేటర్స్ సాధారణ పరిపాలన శాఖను కోరింది. అలాగే, వివిధ జిల్లాల్లో సీఎం జరిపిన పర్యటనలకు సంబంధించిన ఖర్చుల నిమిత్తం బడ్జెట్ విడుదల చేయాలని కోరుతూ చిత్తూరు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, పల్నాడు, అనంతపురం, అంబేడ్కర్ కోనసీమ, అన్నమయ్య, తూర్పు గోదావరి, శ్రీసత్యసాయి, విజయనగరం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, కాకినాడ, తిరుపతి కలెక్టర్ల నుంచి వివిధ తేదీల్లో ప్రతిపాదనలు సాధారణ పరిపాలన శాఖకు అందాయి. మాన్ డెకరేటర్స్‌కు సంబంధించి 50 శాతం నిధులను విడుదల చేయడానికి చేసిన అభ్యర్థన పరిశీలించిన తరువాత ఆర్థిక శాఖకు సాధారణ పరిపాలన శాఖ పంపింది. దీనిపై ఆర్థిక శాఖ బకాయి మొత్తంలో 50 శాతం మాన్ డెకరేటర్స్‌కు చెల్లించేలా రూ.22.31 కోట్ల అదనపు బడ్జెట్ నిధులు విడుదలకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ చెల్లింపులు షెడ్యూల్ ఆఫ్ రేట్స్ (ధరల పట్టిక) ఖరారు, చర్చలకు లోబడి, అలాగే 2026–27 ఆర్థిక సంవత్సరంలో తగిన సమయంలో అనుబంధ గ్రాంట్ల ద్వారా నిధులు సమకూరే వరకు ట్రెజరీ నియంత్రణ, త్రైమాసిక నియంత్రణ ఉత్తర్వుల నుంచి మినహాయింపుతో చెల్లింపులకు ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసింది. అయితే, మాన్ డెకరేటర్స్‌కు రూ.11.71 కోట్లు చెల్లించేందుకు పరిపాలన ఆమోదం తెలుపుతూ సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. -
రైతుల పట్ల చంద్రబాబు సర్కార్ కర్కశం: బొత్స
సాక్షి, విజయనగరం జిల్లా: చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతులకి నష్టాలేనని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చీపురుపల్లి మండలంలో ఈదురుగాలులకు నేలకు ఒరిగిన బొప్పాయి, అరటి పంటలను బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ పరిశీలించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. అరటి, బొప్పాయి రైతులకు లక్షల్లో పెట్టుబడి నష్టం కలిగిందన్నారు.‘‘ఈ సర్కార్‌కు దయ దాక్షిణ్యం లేదు. ఎంతసేపు దోచుకోవడమే. మీ ప్రభుత్వం తాలూకా రైతు విధానం ఏంటి? విపత్తుల్లో ప్రభుత్వం ఒక్క రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. చాలా కర్కశంగా ఉంది. బొప్పాయి, అరటికి పెట్టుబడి నష్టం ఇవ్వండి. అరటి, బొప్పాయికి ఎకరాకు లక్ష రూపాయలు ఇవ్వాలి. మొక్కజొన్నకి రూ.50 వేలు ఇవ్వాలి. గత తుపాను నష్టం కూడా ఇప్పుడు కలిపి ఇవ్వాలి’’ అని బొత్స డిమాండ్ చేశారు.‘‘మూడు రోజులుగా గ్రామాల్లో కరెంటు లేదు.. ఇప్పటికి పునరుద్ధరణ చేయలేదు. కరెంటు ఆగితే ప్రత్యామ్నాయం ఎందుకు చేయలేదు. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలు నష్టం జరిగింది క్రాప్ ఇన్సూరెన్స్ కాకి ఎత్తుకెళ్లిపోయింది. గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టేది. ఈ ప్రభుత్వం కట్టడం లేదు.. ఈ ప్రభుత్వంలో రైతులు ఎలా బతుకుతారు?. ఏమైనా అడిగితే, సమాధానం చెప్పకుండా రాజకీయం చేస్తున్నారు’’ అంటూ బొత్స దుయ్యబట్టారు.ఇదీ చదవండి: 8 చక్కెర కర్మాగారాల అమ్మకం -
మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం
-
చంద్రబాబు సర్కార్‌పై అమరావతి రైతుల ఆగ్రహం
సాక్షి, గుంటూరు: ‘‘అధికారులు వస్తారు.. పోతారు.. గ్రామ కంఠం విషయంలో తొలిరోజు నుంచి మాకు నష్టమే. బంగారం బిస్కెట్లు, డబ్బులు ఇచ్చినవారికి కిలో మీటర్ దూరం కూడా గ్రామకంఠం కిందే ఇచ్చారు. గతాన్ని తవ్వితే చాలా ఇబ్బందులు వస్తాయని పెమ్మసాని చెప్పారు. గతంలో జరిగింది అధికారుల పొరపాటు కాదు.. రాజకీయ ప్రేరేపితంతోనే ఇచ్చారు’’ అంటూ అమరావతి రైతులు మండిపడ్డారు.‘‘అసైన్డ్ భూములు, ఎండోమెంట్ భూములు, లంక భూములు , గ్రామకంఠం భూముల మీద సిట్ విచారణ జరిపించాలి. వీటన్నింటికీ మూల కారకుడు మంత్రి నారాయణ. నారాయణకు రైతు బాధలు తెలియవు. నారాయణ కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చాడు. రైతులను మభ్య పెట్టి లబ్ధి పొందడం తప్ప నారాయణ మరొకటి తెలియదు...మంత్రి నారాయణపై సిట్ విచారణ జరపాలి. సిట్ విచారణలో అధికారులను రెండో పార్ట్‌గా చేర్చాలి. సిట్ వేయడం వల్లే సాయికృష్ణ కేసులో నిజం బయటికివచ్చింది. గ్రామం కంఠాల విషయంలో చంద్రబాబు ఎందుకు జోక్యం చేసుకోడు. గ్రామ కంఠాల విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోవాలి’’ అని అమరావతి రైతులు డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: గణేష్ వేడుకల్లో కేసీఆర్ పాటలు.. కేటీఆర్ ఏమన్నారంటే? -
చేతకాని సన్నాసులు.. దద్దమ్మలు... మతం, కులం అంటూ కొట్టుకుంటున్నారు
-
‘చంద్రబాబు పబ్లిసిటీకి అడ్డూ అదుపు లేదు’
తాడేపల్లి : చంద్రబాబు పబ్లిసిటీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయలు ప్రచారానికే ఖర్చు చేస్తున్నారని, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లతో కూడా పబ్లిసిటీ చేసుకుంటారట అని శివశంకర్ పేర్కొన్నారు. వారితో అబద్దాలు ప్రచారం చేయిస్తారా? ప్రజలకు సమాచారాన్ని అందించడానికి ఐ ఆండ్ పిఆర్ వ్యవస్థ ఉంది. ఇప్పటికే రూ.330 కోట్లు ఆ వ్యవస్థ ద్వారా ఖర్చు చేశారు. ఇంకా కాంక్లైవ్ పేరుతో వందల కోట్లు నేషనల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేసుకున్నారు. ఆ డబ్బులు ప్రజల అవసరాలకు ఖర్చు చేయొచ్చుకదా? అని శివశంకర్ ప్రశ్నించారు.రైతులు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు కనపడటం లేదా? అంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ సీఎం చంద్రబాబును నిలదీశారు. వరదల వల్ల మునిగిపోయిన అమరావతిపై వారితో చెప్పించగలరా?, రాయలసీమ కరువు గురించి చెప్పించగలరా?, ఆ సమస్యలపై ఇన్ఫ్లుయన్సర్లతో మాట్లాడించండి. ఫాలోవర్స్‌ని బట్టి డబ్బులు ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఇన్‌స్టా, ఎక్స్, ఫేస్‌బుక్‌లలో డబ్బులు ఇస్తే ఫేక్ ఫాలోవర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాంటి ఫేక్ ఫాలోవర్స్‌కు డబ్బులు ఖర్చు చేస్తారా? అసలు చంద్రబాబు ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తోంది? ఉత్తరాంధ్ర వరదల్లో మునిగిపోతే చంద్రబాబు విదేశాలకు వెళ్లిపోతారా? రాష్ట్ర ప్రజల సమస్యలు చంద్రబాబుకు పట్టవా? అంత రహస్యంగా చంద్రబాబు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? అని నిలదీశారు. -
బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని పొగిడేది అందుకే..!
-
బాబూ.. అమరావతిలో అసలు లెక్కేంటి?
ఎవరైనా వెయ్యి రూపాయలతో అయ్యే పనికి ఐదువేలో, పది వేలో ఖర్చు చేస్తారా? అలా చేస్తామని అంటే జనం ఏమని అనుకుంటారు? అయితే చేతకాని తనమన్నా కావాలి. లేదా ఏదైనా స్వార్ధ ప్రయోజనం ఉండి ఉంటుందని అనుకోరా? సరిగ్గా ఇదే రీతిలో ఏపీ రాజధాని అమరావతి గ్రామాలలో జరుగుతోందనిపిస్తోంది.కొత్త ఎయిర్ పోర్టు కోసం ఇరవై వేల ఎకరాలు, రైల్వే లైన్, గ్రిడ్ రోడ్డు విస్తరణ వంటి కోసం 6212 ఎకరాలు తీసుకుంటారట. ఎయిర్ పోర్టుకు ఐదువేల ఎకరాలు సరిపోతుంది. కాని నాలుగురెట్లు ఎక్కువగాను, రైల్వేలైన్, తదితర అవసరాలకు 1581 ఎకరాలు చాలు. కాని నాలుగు రెట్లు అదనంగా పూలింగ్ చేస్తారట. ఇప్పటికే విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. గతంలో దాని విస్తరణకు రైతులనుంచి భూములు తీసుకున్నారు. ఆ రైతులందరికి పూర్తి స్థాయి న్యాయం జరగలేదని ఈ మధ్యనే ఎయిర్ పోర్టు వద్ద ధర్నా కూడా జరిగింది.అయితే కొంతమంది పలుకుబడి కలిగినవారు ఈ భూములకు బదులు అమరావతి ప్రాంతంలో విలువైన ప్లాట్లు పొందారని కూడా చెబుతారు. దీనిని పక్కనబెడితే కూటమి ప్రభుత్వానికి లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా, కొత్తగా మరో విమానాశ్రయం కట్టాలన్న ఆలోచన వచ్చింది. అది కూడా విజయవాడ, గుంటూరులకు సుదూరంగా ఉండే మారుమూల గ్రామాలలో కావడం విశేషం. ఇందుకోసం ఐదువేల ఎకరాలు అవసరమట. కాని 20వేల ఎకరాలు సేకరించవలసి ఉంటుందని పురపాలక శాఖ మంత్రి పీ.నారాయణ ప్రకటించారు. అదేమిటి? నాలుగు రెట్లు అధికంగా భూములు తీసుకోవడం ఏమిటన్న సందేహం ఎవరికైనా రావచ్చు. దానికి ఆయన ఇచ్చిన జవాబు ఏమిటంటే 20వేల ఎకరాలు తీసుకుంటే ప్రభుత్వానికి ఐదువేల ఎకరాలే మిగులుతుందట. మిగిలిన భూమిలో ప్లాట్లు అభివృద్ది చేసి రైతులకు ఇవ్వవలసి ఉంటుందట. అలాగే విద్యాసంస్థలు, ఆస్పత్రులు ఇతర అవసరాలకు కేటాయించాలట. ఇదే ప్రకారం రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గ్రిడ్ రోడ్లకు కూడా తీసుకుంటారట.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో కేంద్రానికి రాసిన ఒక లేఖ ప్రకారం ప్లాట్ల అభివృద్దికి ఎకరాకు రెండు కోట్లు వ్యయం అవుతుంది. అది ఇప్పుడు మరికొంత పెరిగిందేమో తెలియదు. ఈ రకంగా చూస్తే ఎయిర్ పోర్టు భూమి పోను మిగిలిన 15వేల ఎకరాలనే పరిగణనలోకి తీసుకుంటే ఎకరాకు మినిమమ్ రెండు కోట్ల చొప్పున ముప్పైవేల కోట్ల వ్యయం అవుతుందన్నమాట. ఇంత భారీ వ్యయం చేసే బదులు అవసరమైన ఐదువేల ఎకరాలకు రెండు కోట్ల చొప్పున లెక్కగట్టి ఇస్తే పదివేల కోట్లు సరిపోతుంది కదా!లేదా మూడు కోట్లు ఇచ్చినా 15వేల కోట్లు అవుతుంది.రైల్వే లైన్ తదితర అవసరాలకోసం ఈ ప్రకారం లెక్కవేస్తే ప్లాట్ల అభివృద్దికే 18వేల కోట్లు అవుతుంది. కాని కొనుగోలు చేస్తే పది, పన్నెండువేల కోట్లు మించి కాకపోవచ్చు. దీనిని వదలి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ మాదిరి ఎందుకు భూములు సేకరిస్తున్నట్లు? రైతులకు ప్లాట్ల అభివృద్ది జరిగే వరకు కౌలు రూపేణా, రుణాల మాఫి రూపేణా, ఇతరత్రా కోట్ల రూపాయల మెత్తాలను వెచ్చించవలసి ఉంటుంది. దీనిని బట్టి ఏం అర్దం అవుతుంది. వెయ్యి రూపాయల ఖర్చు అయ్యేదానిని మూడు, నాలుగు రెట్లకు పెంచుతున్నారనిపించదా? ప్రభుత్వం ఏదో రకంగా దీనిని సమర్ధించుకోవచ్చు. కానీ అందులో హేతుబద్దత ఎంత అన్నదే చర్చ.ఇదీ చదవండి: నాడు ప్రశంసలు.. నేడు విమర్శలు.. బాబుకు కొత్త ఆందోళన!హైదరాబాద్ శంషాబాద్ వద్ద రైతుల నుంచి భూములను ప్రభుత్వం తీసుకుని పరిహారం చెల్లించిన అనుభవం ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం పూలింగ్ వైపే వెళుతోంది. రైతుల నుంచి భూములు తీసుకోవడంతో పచ్చని పంట పొలాలను నాశనం చేయడం ఒక ఎత్తు అయితే, వారి వద్దే భూములు ఉంటే ఎప్పుడైనా తమకు నచ్చిన రేటుకు అమ్ముకునే అవకాశం ఉండడం మరో ఎత్తుగా ఉంటుంది. వీటన్నిటిని కాదని ప్రభుత్వం భూములు తీసుకోవడం, నిర్మాణాల పేరిట వేల కోట్ల రూపాయలను అప్పు తెచ్చి మరీ వ్యయం చేయడంపై విమర్శలు వస్తున్నాయి.మాజీ మంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఐఎఎస్, లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయకుమార్ తదితరులు ముందుగా ఇప్పటికే తీసుకున్న భూమిని అభివృద్ది చేయకుండా కొత్తగా భూములు తీసుకోవడం ఏమిటని, పలు అనుభవాల రీత్యా చంద్రబాబునునమ్మడం ఎలా అని ప్రశ్నించారు. రెండో దశ భూ సేకరణ అంటే అవినీతికోసమేనని మరో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కొంతకాలం క్రితం ఆరోపించారు. ఎవరు ఎన్ని హితోక్తులు చెప్పినా, విమర్శలు చేసినా.. ప్రభుత్వం మాత్రం తగ్గడం లేదు. ఆయా భవనాల నిర్మాణానికి పెడుతున్న వ్యయం చూస్తే ఎవరికైనా దిమ్మదిరగాల్సిందే.శాశ్వత సచివాలయ టవర్ల అద్దాలకు 2455 కోట్లు వ్యయం చేయబోతున్నారు. ఇందులో తొలుత ఉన్న అంచనా వ్యయం కన్నా 500 కోట్లు అధికంగా ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి. అమరావతిలో విద్యుత్ సరఫరాను ప్రైవేటుకు అప్పగించాలన్నది మరో ఆలోచనట. దీనిపై నివేదికలు తయారు చేయడానికి టెండర్లు పిలిచారు. ఇప్పటికే వేల కోట్ల వ్యయం చేసి అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను సీఆర్డిఏ తయారు చేస్తోంది. అంతా సిద్దం అయ్యాక ప్రైవేటువారికి దీనిని అప్పగిస్తారా? లేక ముందే ప్రైవేటుకు అప్పగిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఇదంతా వినియోగదారులపై భారం కాదా అన్నది కొందరి సందేహం.అమరావతి చుట్టూరా అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయాలన్నది మరో ప్రతిపాదన. కేంద్రం దీనిపై కొన్ని అభ్యంతరాలు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. సుమారు 30వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా అయితే ఇందులో రాష్ట్రం కూడా నాలుగువేల కోట్లకు పైగా భరించాల్సి ఉంటుందట. అసెంబ్లీ కొత్త భవనాన్ని నిర్మించడంలో భాగంగా కేవలం భవన శిఖరం(డూమ్) నిర్మాణానికి 660 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేశారట. పార్లమెంటు కొత్త భవనం, తెలంగాణ సచివాలయంలకు పెట్టిన ఖర్చుతో పోల్చితే ఏపీ ఖర్చు గుండె బేజారెత్తిస్తుందని చెప్పాలి.కొండవీటి వాగు వరదనుంచి రక్షణ పొందడానికి కొన్నివందల కోట్లు వ్యయం చేస్తున్నారు. కృష్ణానది కుడి కరకట్ట విస్తరణకు 443 కోట్లు వెచ్చించబోతున్నారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సెంట్రలైజ్డ్ కూలింగ్ వ్యవస్థ కోసం 415 కోట్లు పెట్టబోతున్నారు. గవర్నర్ నివాస భవన సముదాయానికే 200 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా అట. అమరావతిలో పెడుతున్న ఖర్చులో ఇవి కొన్నే. ఇందులో దుబారా, అవినీతిపై ఎవరైనా ప్రశ్నించినా పట్టించుకునే దశలో చంద్రబాబు సర్కార్ లేదు. మొత్తం రాష్ట్ర ప్రజలందరినుంచి వసూలు చేసే పన్నులలో నుంచే అమరావతి అప్పులను తీర్చవలసి ఉంటుంది. ఒకపక్క ఎల్ నినో కారణంగా కరువు తాండవిస్తుంటే, మరో పక్క అమరావతిలో వేల కోట్ల రూపాయలను విచ్చలవిడిగా వెచ్చించడం న్యాయమా అని సామాన్యుడు ప్రశ్నించినా వినే నాధుడు లేడు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హరికృష్ణను గిల్లీ.. ఆ రోజు లక్ష్మి పార్వతిపై ఉసిగొలిపాడు..
-
వెయ్యితో పోయేదానికి 10 వేల కోట్లు.. ఎయిర్ పోర్ట్ కోసం 20 వేల ఎకరాలు..
-
తెలంగాణలో కేసీఆర్.. ఏపీ లో జగన్.. అబ్బా కొడుకులను ఉతికారేసిన కొడాలి నాని
-
ఏపీ ఇన్ ఫ్లుయెన్సర్లకు జీతాలు.. పేర్ని నాని సెటైర్లే సెటైర్లు
-
ప్రజలు వరదల్లో.. సీఎం విదేశాల్లో..!
సాక్షి, అమరావతి: తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారన్న వార్తలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయన ఏ దేశానికి వెళ్లారు? ఎక్కడ బస చేస్తారు? అనే కనీస సమాచారాన్ని కూడా ప్రభుత్వం బయటపెట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు రోజులపాటు ఎక్కడ ఉంటారో ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తుపాన్, భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సహాయక చర్యలు, నష్టం అంచనా, బాధితులకు పరిహారం వంటి పనులు ఇంకా కొనసాగాల్సిన సమయంలో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని వీడి వెళ్లడమేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ రహస్యమే.. చంద్రబాబు విదేశీ పర్యటనలపై గోప్యత ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో నూతన సంవత్సర వేళ ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు కూడా పర్యటన వ్యక్తిగతమా? అధికారికమా? అన్నది ప్రభుత్వం స్పష్టం చేయలేదు. ఆయన పర్యటన లండన్, సింగపూర్, బాలి అంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. సాధారణ పరిపాలన శాఖకే సమాచారం లేదన్న విమర్శలు కూడా వచ్చాయి. తన జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పుకునే ముఖ్యమంత్రి తన పర్యటనల విషయంలో ఎందుకింత రహస్యం పాటిస్తున్నారన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. ఉద్యోగికి ఒక న్యాయం.. సీఎంకు మరో న్యాయం తుపాన్ అత్యవసర పరిస్థితుల్లో విధులకు ఆటంకం కలిగించారంటూ శ్రీకాకుళం జిల్లాలో గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ‘ఆదివారం సెలవు రోజున తలపెట్టిన శాంతియుత నిరసనకు పిలుపు ఇవ్వడమే తప్పుగా భావించి’ మధుబాబుపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడింది. ‘తుపాన్ ఎమర్జెన్సీ’ పేరుతో వేటువేసింది. ఇంతటి తుపాన్ తీవ్రత ఉన్నప్పుడు.. సీఎం కుటుంబంతో విదేశాలకు వెళ్లడం ఏమిటని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. నిబంధనలు ఉద్యోగులకేనా, పాలకులకు వర్తించవా అని నిలదీస్తున్నాయి. కుటుంబంతో విదేశాలకు సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంతోసహా విదేశాలకు వెళ్లినట్లు తెలిసింది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఈ పర్యటన ఉంటుందని, ఇది పూర్తిగా వ్యక్తిగతమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి ఏ దేశానికి వెళ్లారు? ఎక్కడ బస చేస్తారు? అనే అంశాలపై కనీస సమాచారం కూడా ప్రభుత్వం బయటపెట్టకపోవడం గమనార్హం. -
రాష్ట్రంలో వెన్నుపోటు ప్రభుత్వ దౌర్జన్యకాండ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం దౌర్జన్యకాండ సాగిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో హఠాన్మరణం చెందిన వైఎస్సార్సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ భౌతికకాయాన్ని ఆయన స్వస్థలమైన ఒంగోలులోని క్లౌపేటలో శుక్రవారం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు, పలువురు పార్టీ నేతలు, నాయకులు సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులర్పింంచారు. పార్టీకి రాజశేఖర్ చేసిన సేవలను కొనియాడారు. కాకుమాను కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీఎస్సీలో అక్రమాలపై విజయవాడలో నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమంలో పోలీసులు చేసిన లాఠీచార్జీతోపాటు, నెట్టివేయడంవల్లే తీవ్ర అస్వస్థతకు గురై మరణించారని కాకుమాను కుటుంబ సభ్యులు వివరించారు. కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకరబాబు, వైఎస్సార్సీపీ ఒంగోలు పార్టీ సమన్వయకర్త చుండూరు రవిబాబుతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఖాకీలు వేధింపులవల్లే కాకుమాను మరణం: వైవీ, సజ్జల అనంతరం వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన యోధుడు కాకుమాను రాజశేఖర్ అని పేర్కొన్నారు. కాకుమాను కుటుంబానికి వైఎస్సార్సీపీ పూర్తి అండగా ఉంటుందని చెప్పారు. కాకుమాను ఇటీవల వెన్నుపోటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారని, డీఎస్సీలో అక్రమాలపై ఈనెల 22న విజయవాడ, శాప్ ఆఫీస్ వద్ద జరిగిన శాంతియుత నిరసనలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఆ సమయంలో పోలీసులు లాఠీచార్జీకి దిగి నెట్టివేయడం వల్ల రెండుసార్లు కాకుమాను కిందపడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఆ తర్వాత అక్రమ కేసులు బనాయించి అర్ధరాత్రిళ్లు ఇంటిపై పడి టెర్రరిస్టుల మాదిరి వేధించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారని, మెరుగైన వైద్యం కోసం హైదరా బాద్ వెళ్లిన కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచారని ఆవేదన వ్యక్తంచేశారు. నిరసన గళాన్ని అణగదొక్కడానికి చంద్రబాబు సర్కారు నరమేధం సాగిస్తోందని విమర్శించారు. బాబు దుర్మార్గ పాలనను ప్రజలు గమనించాలని విన్నవించారు. అధికారం ఉందని పోలీసు వ్యవస్థను కిరాయి సైన్యంలా వాడుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దౌర్జన్యకాండను ప్రజా క్షేత్రంలో ఎండగడతామని స్పష్టంచేశారు. మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ, డీఎస్సీ నిరసనలో పోలీసుల లాఠీచార్జితో తీవ్ర అస్వస్థతకు గురైన కాకుమాను అదేరోజు సాయంత్రం ఆస్పత్రిలో చూపించుకున్నారని, శరీరం బాగా నొప్పులున్నాయని, బీపీ బాగా పెరిగిందని, జ్వరం కూడా వచ్చిందని తనకు మెసేజ్ పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. -
బాబు సర్కారు మరో రూ.2,500 కోట్లు అప్పు
సాక్షి, అమరావతి: వివిధ కార్పొరేషన్ల పేరుతో అప్పుల పరంపరను చంద్రబాబు సర్కారు యథేచ్ఛగా కొనసాగిస్తోంది. తాజాగా.. సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్ఎంఎఫ్సీఎల్) నుంచి ఆంధ్రప్రదేశ్ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఐఐసీ) రూ.2,500 కోట్లు టర్మ్ రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మొత్తం అప్పు, వడ్డీకి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. ఎస్ఎంఎఫ్సీఎల్కు ఆమోదయోగ్యమైన రీతిలో అసలు, వడ్డీ రెండింటినీ కవర్ చేస్తూ రుణ కాలపరిమితి అంతటా చెల్లుబాటయ్యేలా రూ.2,500 కోట్ల రుణానికి హామీ ఇచ్చింది. అలాగే, ఎస్క్రో ఖాతాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటి భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’ను కూడా జారీచేసింది. ఈ రుణం పూర్తిగా ఏపీఐఐసీ సొంత వనరులు లేదా భూముల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంతోనే తీర్చాలి. వీటిని తీర్చడంలో ఏపీఐఐసీ విఫలమైనప్పుడు ప్రభుత్వ హామీ అమలులోకి వస్తుంది. భూముల లీజు, అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని ఎస్క్రో ఖాతాకు మళ్లించాలి.ఎస్ఎంఎఫ్సీఎల్ విధించిన డాక్యుమెంటేషన్, రుణ పంపిణీకి ముందు, పంపిణీ తర్వాత పాటించాల్సిన అన్ని షరతులను పాటించడానికి ఏపీఐఐసీకి అధికారం ఇచ్చారు. అలాగే, ఈనెల 30లోగా తీసుకునే రుణానికి 8.40 శాతం వడ్డీగా నిర్ణయించారు. చంద్రబాబు సర్కారు వచ్చిన తరువాత ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో రూ.8,500 కోట్లు అప్పుచేసింది. ఇప్పుడు చేసే అప్పుతో కలిపి ఏపీఐఐసీ ద్వారా చేసిన అప్పు మొత్తం రూ.11,000 కోట్లకు చేరనుంది. -
ఉద్యోగుల గళంపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: సమస్యలపై గళమెత్తిన ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం మరోమారు కక్ష సాధింపునకు దిగింది. చలో విజయవాడకు పిలుపునిచ్చారన్న నెపంతో విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, రణస్థలం మండలం జె.ఆర్.పురం సచివాలయ సర్వేయర్ బూరాడ మధుబాబును సస్పెండ్ చేసింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియా గ్రూపుల ద్వారా సర్వేయర్లను రెచ్చగొట్టారని, తుపాను అత్యవసర సమయంలో విధులకు, రీసర్వేకు ఆటంకం కలిగించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని, అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆంక్షలు విధించారు. మధుబాబు సంఘాన్ని గుర్తింపు లేని సంఘంగా ఉత్తర్వుల్లోనే పేర్కొనడం గమనార్హం. సెలవు రోజు నిరసన.. విధులకు ఆటంకమెలా? తుపాను రాకముందే సెప్టెంబర్ 17న చలో విజయవాడపై ఎస్జీఎస్డబ్ల్యూ డైరెక్టర్‌కు ముందస్తు నోటీసు ఇచ్చామని, తుపాను దృష్ట్యా 25న తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా రద్దు చేసుకున్నామని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. తుపాను తగ్గడంతో 27న ఆదివారం సెలవు రోజున శాంతియుతంగా కార్యక్రమం చేపడుతున్నామని, అది విధులకు ఎలా ఆటంకమవుతుందని ప్రశ్నిస్తున్నాయి. సస్పెన్షన్ ఉపసంహరించాలి మధుబాబు సస్పెన్షన్ అసంబద్ధమని ఎస్జీఎస్డబ్ల్యూ ఐక్య వేదిక రాష్ట్ర ప్రతినిధి, సర్వేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్ నాయుడు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ఆవేదనలో ఉన్న 1.27 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబాల్లో ఈ చర్య మరింత ఆగ్రహం రగిలిస్తుందని, నాయకులపై వరుస చర్యలతో ఉద్యమాన్ని అణచాలనుకోవడం సమస్యను తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు. సస్పెన్షన్ తక్షణమే ఉపసంహరించకపోతే 27న చలో విజయవాడను మరింత పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు చలో శ్రీకాకుళం కార్యక్రమానికి తరలివస్తారని స్పష్టం చేశారు. -
చంద్రబాబు, లోకేశ్ ఫారిన్ టూర్లపై పేర్ని నాని హట్ కామెంట్స్
కృష్ణాజిల్లా: మాజీ మంత్రి కొడాలి నాని కనబడటం లేదని నాలుగు నెలల క్రితం టీడీపీ వాళ్లు ఆనందపడ్డారని, ఇప్పుడేమో గుడివాడలో ఉన్న సమస్యలు టీడీపీ నేతల వెంట పడుతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. చంద్రబాబు ఏ సమస్య గురించీ పట్టించుకోరని తెలిపారు.గుడివాడ నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్ ఫారిన్ టూర్లపై హట్ కామెంట్స్ చేశారు. ‘‘నిన్నటి నుంచి చంద్రబాబు కనపడటం లేదు. చంద్రబాబు ఫారిన్ వెళ్లారని ఎవరో చెబుతున్నారు. వెళ్లారని చెప్పరు.. ఏ ఊరో చెప్పరు... ఏ దేశంలో ఉన్నారో చెప్పరు. ఒకరు సీఎం.. మరొకరు మంత్రి ఏ దేశం వెళ్లారో కూడా చెప్పుకోలేకపోతున్నారు.ఫలానా దేశం వెళుతున్నాం...ఈ రాష్ట్రానికి ఇది సాధించడానికి వెళుతున్నామని దమ్ముగా చెప్పాలి కదా? చంద్రబాబు, లోకేశ్ దేశం దాటి వెళితే ఏ దేశం వెళ్లారో కూడా చెప్పరు. క్రమశిక్షణ లేని పెంపకం. నోటికి ఏది వస్తే అది వాగడం లోకేశ్‌కు అలవాటు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు లండన్‌కు మందులు వేసుకోవడానికి వెళుతున్నాడని లోకేశ్ మాట్లాడేవారు. మీ నాన్న ఎందుకు ఫారిన్ వెళుతున్నాడో చెప్పగలరా లోకేశ్? ఏ మందు వేసుకోవడానికి మీ నాన్నను విదేశాలకు పంపించారు?ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేశ్ ఏది పడితే అది మాట్లాడారు. రాష్ట్రంలో బాధ్యత లేని ప్రభుత్వం నడుస్తోంది. బాధ్యత లేని ముఖ్యమంత్రి, బాధ్యత లేని మంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇంకా రెండున్నరేళ్లున్నా వీళ్లెప్పుడు పోతారా? అని జనం ఎదురుచూస్తున్నారు. ప్రజలే కాదు టీడీపీ కార్యకర్తలు కూడా ఎదురుచూస్తున్నారు’’ అని చెప్పారు.‘‘చంద్రబాబు రైతులకు నీళ్లు లేవంటే పట్టించుకోరు. ఎల్ నినో ఉంది.. పంటలు సాగు చేయొద్దంటారు. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వరు. హాస్టల్ ఫీజులు వేయరు...మెస్ ఛార్జీలు ఇవ్వరు. రోడ్లు వేయరు. గ్రామాల్లో మంచినీళ్లు రావు. సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. పరిష్కారం దేవుడే చూస్తాడని మాట్లాడతారు. ఈ మాత్రం దానికి ఆయనెందుకు సీఎంగా?’’ అని పేర్ని నాని అన్నారు. -
ఎన్టీఆర్ లాంటి పెద్ద మనిషి పై అలాంటి నిందలు వేయడానికి సిగ్గుగా లేదా చంద్రబాబు
-
‘అక్రమాలపై ప్రశ్నిస్తే అర్ధరాత్రి ఇళ్లలో చొరబడతారా?
సాక్షి, తాడేపల్లి: తమపై అక్రమ కేసులకు నిరసనగా రేపు(శనివారం) సీపీని కలుస్తాం.. అక్రమ కేసులపై ప్రశ్నిస్తామని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే పోలీసులు అర్ధరాత్రి ఇళ్లలో చొరబడతారా? అంటూ దుయ్యబట్టారు. జైల్లో ఉంచటానికి అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. నారా లోకేష్ పెత్తనంలో పోలీసులు వైఖరి ఇలా ఉంది’’ అంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అసలు ఈ సెక్షన్లు ఎలా పెడతారని కోర్టు ప్రశ్నిస్తే ప్రభుత్వ లాయరు దగ్గర సమాధానం లేదు. వైఎస్సార్సీపీ నేతలందరిపై రౌడీముద్ర వేయాలని చూస్తున్నారు. కాదంబరి జత్వానీ కేసులో కూడా పోలీసులు దగ్గరుండి దుర్గగుడికి తీసుకెళ్లారు. ఇప్పుడు దొంగ టీచర్లను కూడా అలాగే దుర్గ గుడికి తీసుకెళ్లి దర్శనం చేయించారు. అప్పుడు జత్వానీనీ, ఇప్పుడు దొంగ టీచర్లను కాక పడుతున్నారు. కానీ ఈ కేసులు ఏవీ నిలబడవు’’ అని అంబటి వ్యాఖ్యానించారు.‘‘కాకుమాను రాజశేఖర్ మృతికి పోలీసుల వైఖరే కారణం. శాప్ ఎదుట ధర్నాలో పాల్గొన్న రాజశేఖర్‌పై పోలీసులు దాడి చేశారు. రౌడీషీట్లు ఇష్టానుసారం ఓపెన్ చేయటం సిగ్గుచేటు. ఈడీ కేసులకు భయపడను. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తాను. ఎల్లోమీడియాలో ఊహా కథనాలు రాస్తున్నారు’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: సాయం అంటే ఇది.. థాంక్యూ జగన్ మామయ్య -
స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలి... వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం
-
రెండు రోజులు అయింది దస్తగిరి మిమ్మల్ని కలిసి... ఎందుకో చెప్పమంటారా
-
రెడ్‌బుక్ పాలనలో మరో అంకం రాత్రిళ్లు పోలీస్ టెర్రర్
సాక్షి, అమరావతి : రెడ్‌బుక్ పాలనలో రాత్రివేళ కూడా పౌరుల ప్రశాంతతను దెబ్బతీసేలా చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని భయాందోళనలు సృష్టిస్తోంది. గురువారం రాత్రి విజయవాడ తదితర ప్రాంతాల్లో పోలీసులను పురిగొల్పి అక్రమ కేసులు, అరెస్టులు, నోటీసులతో రెడ్‌బుక్ పాలనకు నిదర్శనంగా నిలిచింది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని, నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు ఈ నెల 21న విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆప్ ఆంధ్రప్రదేశ్(శాప్) కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెల్సిందే.శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న వారిపై లోకేశ్ యువగళం రౌడీ దళం దాడికి దిగింది. పోలీసుల వద్ద నుంచి లాఠీలు లాక్కొని దాడులు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అదే రోజున ఆందోళలను భగ్నం చేయడానికి విఫలయత్నం చేసిన పోలీసులు అడుగడుగునా వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకున్నారు. హౌస్ అరెస్టులు చేయడంతో పాటు పలువురిని పోలీస్ స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు.అయినా చంద్రబాబు ఉక్రోశం చల్లారక.. ఐదేళ్ల క్రితం జరిగిన టీడీపీ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘటనను సాకుగా చూపి 51 మందిపై రౌడీషీట్లు తెరవాలని నిర్ణయించారు. ప్రజా వ్యతిరేకతకు భయపడి ఆ ప్రయత్నం నుంచి వెనక్కుతగ్గి.. మరో రీతిలో వేధించేందుకు కుతంత్రం రచించారు. ఈ క్రమంలో శాప్ కార్యాలయం వద్ద ఆందోళన జరిగిన నాలుగు రోజులకు వీడియో ఫుటేజి ద్వారా 260 మందిని గుర్తించినట్టు పోలీసులు తీరుబడిగా రెడ్‌బుక్ టెర్రర్లో మరో అంకానికి తెరలేపారు. వారందరిపైనా కేసులు నమోదు చేసే ప్రక్రియను చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి పలువురు ఇళ్లకు వెళ్లి పోలీసులు హల్చల్ చేశారు. చంద్రబాబు, లోకేశ్‌లను సంతృప్తి పరచడానికి పోలీసులు వేధింపు చర్యలకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఖాకీల అత్యుత్సాహం ⇒ డీఎస్సీ అక్రమాలపై నిరసన తెలిపిన వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. శాంతియుత నిరసన తెలపడం నేరమన్నట్లుగా వ్యవహరిస్తూ నాలుగు రోజుల తర్వాత అక్రమ కేసులు, అరెస్టులు అంటూ వేధింపులకు దిగడం దారుణమని ప్రజలు తప్పుబడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నట్టు ఉందని మండిపడుతున్నారు. ⇒ మహిళలు అని కూడా చూడకుండా గురువారం రాత్రి విజయవాడ నగర మాజీ మేయర్, వైఎస్సార్సీపీ మహిళా నేత రాయన భాగ్యలక్ష్మి ఇంటికి వెళ్లిన పోలీసులు.. అరెస్టు చేయడానికి వచ్చామని చెప్పారు. నగర మొదటి పౌరురాలిగా సేవలు అందించిన తన పట్ల పోలీసుల తీరు బాగోలేదని, మహిళ పట్ల పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా.. అని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. దీంతో పోలీసులు కేసుకు సంబంధించిన నోటీసును అందించి వెనుదిరిగారు. ⇒ మరో మహిళా నేత పసుపులేటి వెంకటేశ్వరమ్మ ఇంటికి వెళ్లిన పోలీసులు.. అరెస్టు చేసేందుకు వచ్చినట్టు చెప్పడంతో ఆమె సైతం తీవ్రంగా మండిపడ్డారు. దీంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసు ఇచ్చి వెళ్లారు. ⇒ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మైనారిటీ వర్గానికి చెందిన న్యాయవాది సుభానీని సింగ్‌నగర్ పోలీసులు తీసుకెళ్లారు. 64వ డివిజన్ మాజీ కార్పొరేటర్ యర్రగోళ్ల శ్రీరామయాదవ్ను కూడా తీసుకెళ్లారు. అమిత్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు, గెల్లిపోగు రాజును సూర్యారావుపేట పోలీసులు, వలీని సింగ్‌నగర్ పోలీసులు రాత్రివేళ తీసుకెళ్లడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క విజయవాడలోనే సుమారు 70 మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లిన పోలీసులు.. అరెస్టులు అంటూ భయాందోళనలు సృష్టించారు. ⇒ నందిగామ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను గురువారం రాత్రి విజయవాడ పోలీసులు తీసుకెళ్లారు. కంచికచర్ల వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వేమా సురే‹Ù, నందిగామకు చెందిన బెజవాడ రాజశేఖర్‌ను మాచవరం పోలీసులు తీసుకెళ్లడంతో వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పలువురు నేతలపై కేసులు ఉన్నాయని, అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించినట్లు చెబుతున్నారు. డీఎస్సీ స్కామ్‌పై శాంతియుత నిరసన తెలిపితే అక్రమ కేసులు, అరెస్టులతో పోలీసులు టెర్రర్ రేపడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. -
ఎంబీబీఎస్ ప్రవేశాల్లోనూ ప్రతిభావంతులకు అన్యాయం
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ పేరిట ప్రతిభావంతులను దగా చేసినట్టే డాక్టర్ కావాలన్న ప్రతిభావంతులైన విద్యార్థుల ఆశలను చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్‌కు ముందు కుట్రపూరిత జీవోలు తెచ్చి స్పోర్ట్స్ కోటా కింద టీచర్ పోస్టులను అడ్డదారుల్లో అమ్మేసుకున్నారు. అదే తరహాలో 2026–27 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ ప్రవేశాలకు ముందు జీవో–102 తీసుకొచ్చి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు చంద్రబాబు సర్కారు తీవ్ర అన్యాయం తలపెట్టింది. నీట్ యూజీ మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు దక్కాల్సిన ప్రభుత్వ సీట్లను వారికి దక్కకుండా ప్రభుత్వమే కుట్ర చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు విడతలుగా ప్రభుత్వ కోటా ఎంబీబీఎస్ సీట్లను ఆరోగ్య విశ్వవిద్యాలయం భర్తీ చేసింది. దీంతో మెరిట్ ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు దక్కాల్సిన 70కు పైగా సీట్లు గల్లంతయ్యాయి. వైఎస్ జగన్ హయాంలో విద్యార్థులకు మేలు జరిగేలా..రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో పారదర్శక విధానాలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా కార్యదర్శి స్థాయిలోని ఇద్దరు ఐఏఎస్‌లు, ఇద్దరు నిపుణులైన విద్యావేత్తలు, ఇద్దరు న్యాయవాదులతో కమిటీ వేసి అధ్యయనం చేయించింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు 2020 డిసెంబర్లో జీవో–151 తెచ్చింది. అప్పటి నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ సమయంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అన్ని వైద్య, దంత కాలేజీలకు ఒకేసారి ప్రా«ధాన్యత క్రమంలో విద్యార్థులు ఆప్షన్లుగా ఎంచుకునేవారు. ఈ క్రమంలో కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థుల నీట్ ర్యాంక్‌ల ఆధారంగా తొలుత ఓపెన్ కేటగిరీ సీట్లను కేటాయించే వారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అన్ని కాలేజీలను ఆప్షన్లులుగా ఎంచుకోవడంతో వారిచి్చన ప్రాధాన్యత ఆధారంగా తొలుత ఓపెన్ సీట్లన్నీ భర్తీ చేసేవారు. ఓపెన్‌లో సీట్లు దక్కించుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను మెరిటోరియస్ రిజర్వ్డ్ కేటగిరీ (ఎంఆర్సీ) కింద పరిగణించి, వారికి తదుపరి స్లైడింగ్ అవకాశం ఇచ్చేవారు. ఓపెన్‌లో సీటు దక్కించుకున్న కాలేజీ కంటే వారి రిజర్వేషన్ కేటగిరీలో ఇంకా మంచి కాలేజీలో సీట్ వస్తే ఇచ్చేవారు. మిగిలిన సీట్లను సైతం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రవేశాల్లో రిజర్వేషన్ల అమలు కోసం ప్రవేశపెట్టిన జీవో–550కు భంగం వాటిల్ల కుండా భర్తీ చేసేవారు. చంద్రబాబు సర్కారు రాగానే..ఇలా 2020 నుంచి 2025 వరకూ సాఫీగా సాగిన కౌన్సెలింగ్ ప్రక్రియకు చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన జీవో–102 గొడ్డలి పెట్టుగా మారింది. 2026–27 కౌన్సెలింగ్ ప్రారంభించడానికి ముందు ఈ ఏడాది జూలై 30న ప్రభుత్వం జీవో–102 జారీ చేసింది. అన్ని రౌండ్ల కౌన్సెలింగ్‌కు ఒకేసారి కాకుండా ప్రతి రౌండ్‌కు విద్యార్థులు ఆప్షన్లు నమోదుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా విద్యార్థులు అందుబాటులో ఉన్న కళాశాలలను తప్పనిసరిగా ఆప్షన్లుగా ఎంచుకోవాలన్న నిబంధనను పూర్తిగా ఎత్తేశారు. ప్రభుత్వమే అన్ని కాలేజీలను ఆప్షన్లుగా ఎంచుకునే అవసరం లేదని తేల్చేయడంతో విద్యార్థులు తమకు నచ్చిన కొన్ని కాలేజీలనే ఆప్షన్లుగా నమోదు చేసుకున్నారు. దీంతో అసాధారణ ప్రతిభ కనబరిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఓపెన్ కేటగిరీకి కాకుండా వారి రిజర్వేషన్లకు పరిమితం అయ్యే దుస్థితిని ప్రభుత్వమే సృష్టించినట్లయింది.మెరుగైన ర్యాంకర్‌కు రిజర్వేషన్.. తక్కువ ర్యాంకర్‌కు ఓపెన్చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన జీవో–102 ఫలితంగా నీట్ యూజీలో అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రిజర్వేషన్ కేటగిరీలకు, వారి కంటే తక్కువ ర్యాంక్ సాధించిన వారు ఓపెన్ కేటగిరీల్లో సీట్లు పొందాల్సి వచ్చింది. మొదటివిడత సీట్ల కేటాయింపుల్లో ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్‌లో ఓపెన్ కేటగిరీలో కటాఫ్ ర్యాంక్ 71,547, ఎస్వీయూ రీజియన్‌లో 94,966 నమోదైంది. అయితే, ఈ రెండు రీజియన్లలోనూ ఓపెన్ కటాఫ్ కంటే ఎంతో మెరుగైన ర్యాంక్ తెచ్చుకున్న విద్యార్థులకు హెల్త్ యూనివర్సిటీ రిజర్వేషన్ విభాగాల్లో సీట్లే కేటాయించింది. ఇలా రెండు రీజియన్లలో 70 మందికిపైగా విద్యార్థులను రిజర్వేషన్ కోటాలోకి తోసేశారు. గుంటూరు మెడికల్ కాలేజీలో 31,325 ర్యాంక్ సాధించిన విద్యార్థికి బీసీ–బీ కేటగిరి కింద సీటు ఇచ్చారు. ఇదే కాలేజీలో బీసీ–బీ కేటగిరీకి చెందిన 55,233 ర్యాంక్ సాధించిన విద్యార్థికి ఎంఆర్సీ కింద సీటు కేటాయించారు. ఇలా 31,325 ర్యాంక్ సాధించిన విద్యార్థి కంటే ఎక్కువ ర్యాంక్ సాధించిన 14 మంది బీసీ–బీ విద్యార్థులు ఎంఆర్సీలో గుంటూరు మెడికల్ కాలేజీలోనే సీట్లు దక్కించుకున్నారు. ఇక రెండు రీజియన్లలోనూ ఓపెన్ కటాఫ్ కంటే మెరుగ్గా 23,550, 30,307, 30,611, 31,325, 37,039 వంటి ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులను రిజర్వేషన్ విభాగాల్లో సర్దుబాటు చేశారు. సుప్రీంకోర్టు తీర్పులు, జీవో–550 ప్రకారం అసాధారణ ప్రతిభ కనబరిచిన 70 మంది విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో సీట్లు దక్కించుకుని ఉంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలకు చెందిన మరో 70 మందికి ఎంబీబీఎస్ సీట్లు దక్కేవి. అలా దక్కకుండా ప్రభుత్వమే వెనుకబడిన వర్గాల విద్యార్థులకు జీవో–102తో వెన్నుపోటు పొడిచింది.షరతు ఎత్తేసి.. అన్ని కాలేజీలు ఎంచుకోవాలని సూచనజీవో–151 ప్రకారం విద్యార్థులు అన్ని కాలేజీలను తప్పనిసరిగా ఆప్షన్లుగా ఎంచుకోవాలనే షరతు ఉండేది. ఈ షరతుతో విద్యార్థులకు అన్యాయం కలిగిన సందర్భాలు రాష్ట్రంలో ఇప్పటివరకూ చోటు చేసుకోలేదు. ఇదిలా ఉండగా అకారణంగా జీవో–151 రద్దు చేసి జీవో–102 తీసుకురావడం ద్వారా విద్యార్థులు అన్ని కాలేజీలను ఎంపిక చేసుకునే పద్ధతిని ఎత్తేసి మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయాక వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ విద్యార్థులకు ఉచిత సలహాలు ఇచ్చారు. అందుబాటులో ఉన్న కాలేజీలను విద్యార్థులు ఎంపిక చేసుకోవాలని సూచించారు. గుంటూరు కాలేజీలో బీసీ–బీ కోటాలో సీటు దక్కించుకున్న విద్యార్థి రెండో రౌండ్లో సీటు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా రెండు ఆప్షన్లు నమోదు చేసిన వెంటనే మిగిలిన కాలేజీలు ఎంపిక చేసుకోవడానికి వీల్లేకుండా పోయింది. దీంతో బాబు సర్కార్ చేసిన మార్పులపైనా విద్యార్థులు, తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
బాబు ఏడాది పాలన సంబరం ఖర్చు రూ.7,29,03,156
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ఏడాది పాలన సంబరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7,29,03,156లను ఖర్చు చేసింది. ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో గత ఏడాది జూన్ 23న ఏపీ సచివాలయం వెనుక ఉన్న ప్రాంగణంలో సభ నిర్వహించారు. ఈ సభ ఖర్చులకు సంబంధించి ప్రణాళికా శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై ఆర్థికశాఖ పలు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఆ సభ నిర్వహణకు సంబంధించిన ఖర్చులపై ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గురువారం సవివరమైన ఉత్తర్వులు జారీ చేశారు. మూడు జిల్లాల కలెక్టర్లతోపాటు ఏపీఎస్ఆర్టీసీ వీసీ అండ్ ఎండీకి ఈ మొత్తం నిధులను విడుదల చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌కు రూ.4,94,64,946, కృష్ణా జిల్లా కలెక్టర్‌కు రూ.2,17,76,139, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు రూ.1,15,748, ఏపీఎస్ఆర్టీసీ వీసీ అండ్ ఎండీకి రూ.15,46,323లు చొప్పున విడుదల చేయనున్నట్లు వివరించారు. -
బాబు మార్కు ‘పవర్’ గేమ్
సాక్షి, అమరావతి: చంద్రబాబు ద్వంద్వ విధానాలు, స్వార్థ ప్రయోజనాలకు ఇది మరో నిదర్శనం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందంపై నానా రగడ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అదే సెకీతో అప్పటికంటే ఎక్కువ ధరకు విద్యుత్ కొనడానికి సిద్ధమవుతున్నారు. పైగా సెకీతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్ రూ.2.49 చొప్పున 7వేల మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి సరఫరా అయ్యేందుకు సిద్ధంగా ఉంది.అయినప్పటికి ఆ విద్యుత్‌ను తీసుకోకుండా మరల అదే సెకీ నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోళుకు చేయాలనుకుంటున్నారు. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇది చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ విధానాలకు నిదర్శనమని, ఈ నిర్ణయం వల్ల ప్రజలపై అదనపు చార్జీల భారం పడుతుందని, డిస్కంలు ఆర్థికంగా దెబ్బతింటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.అప్పట్లో సెకీతో ఒప్పందం తప్పన్నారువ్యవసాయానికి పగటిపూట 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందించడం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం యూనిట్ రూ.2.49 చొప్పున అంతర్రాష్ట్ర ప్రసార సిస్టం (ఐఎస్టీఎస్) చార్జీలు మినహాయింపుతో పాతికేళ్ల పాటు 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సెకీతో ఒప్పందం చేసుకుంది. దీనిపై చంద్రబాబు అండ్‌కో పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసింది. ఇది ఖజానాపై ఆర్థిక భారమని తప్పుడు ప్రచారం చేశారు. అతి తక్కువ ధరతో సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, భారీ అవినీతి జరిగిందంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లుతూనే ఉన్నారు. ఇంత దుష్ప్రచారానికి పాల్పడుతున్న అదే చంద్రబాబు ప్రభుత్వం అదే సెకీతో ఇప్పుడు ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలుకు సిద్ధమైంది. నాటి ఒప్పందం కంటే 15 ఏళ్లు అదనపు దీర్ఘకాలానికి. దీని వెనుక చంద్రబాబు కూటమి ప్రభుత్వ పెద్దల స్వార్ధ ప్రయోజనాలున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.పీఎస్పీతో నష్టాలు ఎక్కువేపంప్డ్ స్టోరేజ్‌లో ముందుగా విద్యుత్‌తో నీటిని పైకి పంపి.. అవసరమైనప్పుడు తిరిగి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. నీటిని పైకి పంపడానికి ముందుగా విద్యుత్ కావాలి. కాబట్టి 1 యూనిట్‌ను తిరిగి పొందడానికి 1 యూనిట్ కంటే ఎక్కువ విద్యుత్ అవసరం. ఈ ప్రక్రియలో విద్యుత్ నష్టం తప్పదు. టాటా పవర్‌తో సెకీ కుదుర్చుకున్న ఒప్పందంలో కూడా 24.61 శాతం వార్షిక నష్టంగా పేర్కొన్నారు. అందువల్ల నిల్వ సామర్థ్యాన్ని మొత్తం విద్యుత్ ఉత్పత్తిగా పరిగణించలేమని, దీనివల్ల దీర్ఘకాలంలో స్థిర చార్జీల భారం అధికమవుతుందని నిపుణులు చెబుతున్నారు.40 ఏళ్లకు ఒప్పందం అవసరమా?డిస్కంల విద్యుత్ అవసరాలు – వనరుల ప్రణాళిక ప్రకారం.. రాష్ట్రానికి 2026–27లో 92,538 మిలియన్ యూనిట్లు అవసరం కాగా అది 2028–29 నాటికి 1,05,910 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అంచనా. అయితే పునరుత్పాదక విద్యుత్ కూడా భారీగా అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే పీఎం సూర్యఘర్ పథకంతో ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్, వ్యవసాయ పంపుసెట్ల సోలరైజేషన్ వంటి కార్యక్రమాల ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో 40 ఏళ్ల పాటు పీఎస్పీ విద్యుత్‌ను అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.రూ.58,300 కోట్ల భారండిస్కంల తరపున ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్)1,344 మెగావాట్లు/10,752 మెగావాట్ అవర్ పంప్డ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని సెకీ నుంచి 40 ఏళ్లకు సమకూర్చుకోవాలనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి తాజాగా ఆమోదం తెలిపింది. ఈ విద్యుత్‌కు ప్రస్తుతానికి తుది టారిఫ్ ప్రకటించలేదు. అయితే ఈ ఏడాది టాటా పవర్‌తో ఇదే తరహా పీఎస్పీ స్టోరేజ్ ఒప్పందాన్ని సెకీ కుదుర్చుకుంది.ఈ ఒప్పందంలో ఏడాదికి స్థిర ఛార్జీలు సుమారు రూ.1.084 కోట్లుగా నిర్ణయించారు. అదే రేటు ప్రాతిపదికగా తీసుకుని ఏపీ తీసుకునే 1,344 మొగావాట్లను లెక్కిస్తే.. ఏడాదికి సుమారు రూ.1,458 కోట్లు అవుతుంది. ఈ లెక్కన 40 ఏళ్లకు సుమారు రూ.58,300 కోట్లు. ఒక వేళ ఇంతకన్నా ఎక్కువకు తీసుకుంటే ఖర్చు మరింతగా పెరుగుతుంది. ఇదంతా డిస్కంలు చెల్లించాల్సిందే. అంటే మళ్లీ సర్దుబాటు చార్జీలు, ఇతర రూపాల్లో రాష్ట్ర ప్రజల నుంచే వసూలు చేస్తారు.ఒక్క యూనిట్‌కు రూ.3.7210,752 మెగావాట్ అవర్ అంటే 1,344 మెగావాట్ల సామర్థ్యంతో సుమారు 8 గంటల పాటు విద్యుత్ అందించే సామర్థ్యం. ఇలా రోజూ కచ్చితంగా జరిగితే ఏడాదికి సుమారు 392.4 కోట్ల యూనిట్లు అందించే సామర్థ్యం ఉంటుంది. ఏటా రూ.1,458 కోట్ల ఫిక్స్డ్ చార్జీలను ఈ గరిష్ట సామర్ధ్యంతో లెక్కిస్తే ఒక్క యూనిట్‌కు సుమారు రూ.3.72 పడుతుంది.అంటే గత ప్రభుత్వం సెకీకి చెల్లిస్తామన్న యూనిట్ ధర రూ.2.49 కంటే ఇప్పుడు రూ.1.23 అదనంగా చెల్లించేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైనట్టు. ఇందులో చార్జింగ్ విద్యుత్ ఖర్చు, పంపింగ్ నష్టాలు, ట్రాన్స్మిషన్, ఇతర ఛార్జీలు కలపలేదు. అవికూడా కలిస్తే వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. నిజానికి సెకీ విద్యుత్ ఇప్పటికిప్పుడు తీసుకుని రాష్ట్ర అవసరాలకు వాడుకోవడానికి 7వేల మెగావాట్లు సిద్ధంగా ఉంది. దానిని కాదని అదే సంస్థతో ఇంత ఎక్కువ ధర చెల్లించి విద్యుత్ కొనాల్సిన అవసరం ఏ మాత్రం లేదు.‘సెకీ’ సౌర విద్యుత్ ఒప్పందం.. ప్రయోజనాలు⇒ అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలు (ఐఎస్టీఎస్) మినహాయించి యూనిట్ రూ.2.49 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనకు తానుగా 2021 సెపె్టంబర్ 15 రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ ద్వారా ప్రతిపాదించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ ఇస్తామని చెప్పింది కేంద్రం. ఒప్పందం జరిగింది కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య. ⇒ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఇంత చవకైన సౌర విద్యుత్ కొనుగోలు, అత్యధికంగా 7 వేల మెగావాట్ల కోసం గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వంలోనూ ఒప్పందం జరగలేదు. డిస్కంలు కూడా ఎప్పుడూ ఇలాంటి చవకైన ధరతో, ఇంత ప్రజోపయోగకరమైన ఒప్పందం చేసుకోలేదు. ⇒ సెకీ విద్యుత్ తీసుకోవడం వల్ల ఏటా రూ.3,750 కోట్ల ఆరి్థక ప్రయోజనం చేకూరుతుంది. ⇒ రైతులకు 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చి మంచి చేయాలనే సత్సంకల్పంతో, దూరదృష్టితో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసుకున్న అద్భుత ఒప్పందమిది. ⇒ సెకీ విద్యుత్ తీసుకోకపోతే అప్పటికే పిలిచిన టెండర్ల కేసు కోర్టులో ఎప్పటికి తేలుతుందో తెలియదు. అది తేలే నాటికి పరికరాల రేట్లు, విద్యుత్ ధరలు ఎంతగానో పెరిగేవి. ⇒ కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ), రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) రెండూ సెకీ ఒప్పందానికి ఆమోదం తెలిపాయి. ⇒ సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుంది. ⇒ అదే రాష్ట్రంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే పాతికేళ్ళు సెంట్రల్ గ్రిడ్ ఛార్జీలు చెల్లించాలి. రాష్ట్రంలో అంతర్గతంగా సౌర ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే వాటికి కావాల్సిన విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థ బలోపేతం చేయటం తప్పనిసరి. ఈ ఖర్చును బేరీజు వేసుకుంటే బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే తక్కువవుతోంది.చంద్రబాబు కుట్రలు పటాపంచలుసెకీతో వైఎస్ జగన్ ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కుదుర్చుకున్న ఒప్పందంపై కూటమి ప్రభుత్వం దు్రష్పచారం చేసింది. సీఎం చంద్రబాబు విద్యుత్ రంగంపై విడుదల చేసిన శ్వేత పత్రంలోనూ సెకీ ఒప్పందాన్ని తప్పుబడుతూ పచ్చి అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేశారు. సెకీ నుంచి విద్యుత్ తీసుకుంటే జనరల్ నెట్వర్క్ యాక్సెస్ (జీఎన్ఏ) నిబంధనల ప్రకారం రూ.3 వేల కోట్ల నుంచి రూ.3500 కోట్ల వరకూ అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలు చెల్లించాల్సి వస్తుందని నమ్మించాలనుకున్నారు. ఎల్లో మీడియా అదే దు్రష్పచారం చేసింది. కానీ, కేంద్ర సంస్థల నిబంధనలు, ఏపీఈఆర్సీ ఆదేశాలతో చంద్రబాబు కుట్రలు పటాపంచలయ్యాయి. 2023 ఫిబ్రవరి 7న సీఈఆర్సీ జారీ చేసిన నోటిఫికేషన్లోనూ అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీల మినహాయింపు గురించి స్పష్టత వచి్చంది. సీఓడీ తేదీ నుంచి 25 సంవత్సరాల పాటు ఈ మినహాయింపు వర్తిస్తుందని సీఈఆర్సీ వెల్లడించింది. అయినా, చంద్రబాబు అసత్యాలతో రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించాలని ప్రయత్నించారు. ఏపీఈఆర్సీ ఈ ఏడాది ఆగస్టు 13న జారీ చేసిన ఆదేశాలతో కూడా చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రచారమంతా అబద్ధమని స్పష్టమైంది. పైగా గతంలో చంద్రబాబు ప్రభుత్వం రెండింతలకు పైగా ధరలకు ఒప్పందాలు చేసుకొని ప్రజలపై భారం వేయడం తెలిసిందే. చంద్రబాబు చేసిన పని వల్ల డిస్కంలు ఏటా రూ.3,500 కోట్లు చొప్పున దశాబ్దాల పాటు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయాన్ని దాచి అప్పట్లో విద్యుత్ ఉత్పత్తి లోటు ఉందని టీడీపీ పచ్చి అబద్ధాలు చెప్పింది. ఫలితంగా బాబు హయాంలో విద్యుత్ రంగం కుదేలైంది. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక విప్లవాత్మక నిర్ణయాలతో ఈ రంగాన్ని గాడిలో పెట్టారు. 2024లో మళ్లీ చంద్రబాబు రావడంతో గతం పునరావృతం అవుతోందని విద్యుత్ రంగం నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అదే కోవలో అత్యధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకునేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేయడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. -
పునరావాస కేంద్రానికి వచ్చేది లేదు.. మాకిచ్చిన హామీలు నెరవేర్చండి
సీలేరు: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా గాలికొండ పంచాయతీ చట్రాపల్లి గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. దీంతో గ్రామంలోని 37 గిరిజన కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. అయినా పునరావాస కేంద్రానికి రావాలన్న అధికారుల వినతిని గిరిజనులు తిరస్కరించారు. రెండేళ్ల క్రితం వర్షాలకు కొండల నుంచి వచ్చిన వరద గ్రామాన్ని ముంచెత్తినప్పుడు తమకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పట్టుబడుతున్నారు. 2024లో కురిసిన భారీ వర్షాలకు కొండల పైనుంచి వచ్చిన వరద నీరు చట్రాపల్లి గ్రామాన్ని ముంచెత్తింది. కొండచరియలు విరిగిపడి ఒక గిరిజనుడు మృతి చెందాడు. మరికొందరు గాయపడ్డారు. అప్పటివరకు స్పందించని ప్రభుత్వం.. కొండచరియలు విరిగిపడిన తర్వాత హడావుడి చేసింది. నష్టపరిహారం అందించి గ్రామస్తులను ఆదుకుంటామని, గ్రామంలో మోడల్ కాలనీ నిర్మించి ముంపు లేకుండా చూస్తామని, రోడ్డు, రూ.25 లక్షలతో వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీల్లో ఒక్కటి కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు.వర్షాలు వచ్చిన ప్రతిసారీ పునరావాస కేంద్రానికి తరలించడం, ఆ తర్వాత వదిలేయడం జరుగుతోందే తప్ప, తమ కష్టాలను తీర్చడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొండల నుంచి నీరంతా గ్రామంలోకి వచ్చేసింది. దీంతో ఇళ్లన్నీ నీట మునిగే పరిస్థితి తలెత్తింది. గురువారం మండల తహసీల్దార్ అన్నాజీరావు. ఎంపీడీవో రమణబాబు, పోలీసులు గ్రామానికి వచ్చి పునరావాస కేంద్రానికి రావాలని గిరిజనులను కోరారు. ఇందుకు గ్రామస్తులు ససేమిరా అనడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. సాయంత్రం 5 గంటలకు మరోసారి అధికారులు గ్రామస్తులతో మాట్లాడినా ససేమిరా అన్నారు. మోడల్ కాలనీ, రోడ్డు, వంతెన నిర్మించాలని, వర్షం నీరు గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. -
గవర్నర్ ఆశ్చర్యపోయారు: అంబటి
సాక్షి,గుంటూరు: ‘‘డీఎస్సీ స్కామ్‌లో తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇలా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ స్కాం రాష్ట్రంలో సంచలనంగా మారింది’’ అని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్.. డీఎస్సీలో జరిగిన స్కాం గురించి చెబుతుంటే గవర్నర్ ఆశ్చర్యపోయారన్నారు. చదువుకున్న వారికి ఉద్యోగాలు రావాలి.. వారి కోసం పోరాటం కొనసాగిస్తామని అంబటి అన్నారు.‘‘డీఎస్సీలో అన్యాయం జరిగిందని విజయవాడ శాప్ కార్యాలయం వద్ద నిరసన తెలిపాం. బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేసినట్లు మా నాయకులు, కార్యకర్తలపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తే చూస్తూ ఊరుకోం. 21వ తేదీన ఆందోళన చేస్తామని కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చాం. అక్కడకు వాళ్లు చెబుతున్న గురువులు ఎందుకు వచ్చారు?. లోకేష్ దళం మాపైన దాడి చేస్తే పోలీసులు మాపైన కేసులు పెట్టారు. కొంతమంది పోలీసులు లోకేష్ చెప్పినట్లు చేస్తున్నారు. వాళ్లు పోలీసులు రూపంలో ఉన్న రౌడీలు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.డీజీపీ, సీపీకి చెప్తున్నా.. మీకు ఎవరెవరు కావాలో పేర్ల లిస్టు ఇస్తే వాళ్లందరం ప్రత్యేక బస్సుల్లో విజయవాడ కమిషనర్ కార్యాలయానికి వస్తాం. మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయండి. రాత్రిపూట దొంగచాటుగా కోర్టులో హాజరు పరచడానికి సిగ్గుండాలి. ఎస్సీలుపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి పోలీసులకు సిగ్గుండాలి. నన్ను ఇవాళ విచారణకు రమ్మని ఈడీ చెప్పలేదు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆరోగ్యశ్రీలో వికసించిన 'అవినీతి' -
ఇవి ఏమైనా బ్యాంక్ అకౌంట్ లా.. అంబటి మాస్ ర్యాగింగ్...
-
బలమైన అభ్యర్థులను ఎంపిక చేయండి అని YS జగన్ చెప్పారు
-
అయ్యప్ప మాల సాక్షిగా చెబుతున్నా... వచ్చే ఎన్నికల్లో కూటమి కొట్టుకుపోవడం పక్కా
-
‘ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది బాబుకు తెలుసు’
తాడేపల్లి: వెన్నుపోటు పార్టీ నిజస్వరూపాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా కార్యకర్తలు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని వైఎస్ జగన్ సూచించినట్లు కురసాల పేర్కొన్నారు. దీనిలో భాగంగా బలమైన అభ్యర్థుల ఎంపికను ప్రారంభించాలని వైఎస్ జగన్ చెప్పారరన్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు, కార్యకర్తలకు 24 గంటుల అందుబాటులో ఉంటానని వైఎస్ జగన్ తమకు హామీ ఇచ్చారన్నారు.తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి మీడియాతో కురసాల మాట్లాడుతూ.. ‘చంద్రబాబు మాటలు నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయారు. వెన్నుపోటు పార్టీ వైఫల్యాలను గడపగడపకు తీసుకెళ్లాలని వైఎస్ జగన్ సూచించారు. స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు.. పోలీసులను, అధికారులను అస్త్రంగా వాడే అవకాశం ఉంది. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టేందుకు శ్రేణులు సన్నద్ధం కావాలని వైఎస్ జగన్ చెప్పారు. స్థానిక ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా జరిగేలా అధికారులు చూడాలి. వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఎంపిక చేసిన తర్వాత బాబు బెదిరించే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది బాబుకు తెలుసు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు తన టక్కుటమారా విద్యలు ప్రయోగిస్తారు. హోంమంత్రి హోంమంత్రిగా కంటే కూడా టీడీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. జగన్ నామస్మరణ చేయకుండా కూటమి నేతలకు పూట గడవడం లేదు. సాయికృష్ణ లాకప్డెత్మీద ఎంత మేకప్ వేద్దామనుకున్నా కూటమికి కుదరలేదు. బూడిదైనా ఇప్పించండని సాయికృష్ణ తల్లి వేడుకుంది. సాయికృష్ణ కేసులో సుప్రీంకోర్టు మాట్లాడితే హోంమంత్రి ఎందుకు మాట్లాడరు. హోంమంత్రి తీరు అబద్ధాలను ప్రచారం చేసేలా ఉంది. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో డీజీపీ నిద్ర పోతున్నారా అని కోర్టు అడిగిన విషయం గుర్తు లేదా? అని కురసాల ప్రశ్నించారు.ఇదీ చదవండి: వైఎస్ జగన్‌ను కలిసిన సీపీఐ నేతలు -
రౌడీ షీట్లకు బ్రేక్.. బాబు యూ టర్న్
-
సీట్లు ఎవరో వేసే బిచ్చం కాదు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
-
నాడు ప్రశంసలు.. నేడు విమర్శలు.. బాబుకు కొత్త ఆందోళన!
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. గతంలో వైఎస్సార్సీపీ పాలనను వ్యతిరేకించే విధంగా వ్యవహరించిన కొందరు మేధావులు, మాజీ అధికారులలో మార్పు కనిపిస్తోంది. రాజకీయాలకు దూరంగా ఉన్న మరికొంతమంది సైతం ప్రభుత్వంపై స్పందిస్తున్న తీరు ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.గతంలో న్యాయాధికారిగా పనిచేసి జడ శ్రవణ్‌కుమార్ ఇటీవలికాలంలో కూటమి ప్రభుత్వ వైఖరిని తూర్పారాపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన గత ప్రభుత్వ టైమ్‌లో అమరావతి తదితర అంశాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి పని చేశారు. వివిధ ఆందోళనలలో పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ఆయన విసిగిపోయారు. సొంత రాజకీయ పార్టీని స్థాపించుకుని పనిచేస్తున్న శ్రవణ్ ప్రజా సమస్యలపై గళం విప్పారు. ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను కూడా వెలుగులోకి తెస్తున్నారు.చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అరెస్టు అయినప్పుడు బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తికి, ఆయన రిటైర్ అయ్యాక లోకాయుక్త పదవిని ఇవ్వడాన్ని తీవ్రంగా ఆక్షేపించి శ్రవణ్ న్యాయపోరాటానికి సిద్దం అయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పని విధానంపై విరుచుకుపడుతున్నారు. మంత్రి నారా లోకేష్‌పై అవినీతి అభియోగాలు మోపుతూ మీడియా సమావేశాలు పెడుతున్నారు. డీఎస్సీ అక్రమాలు వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో శ్రవణ్ అంతగా స్పందించలేదు. అందులో అక్రమాలు ఉన్నాయా? లేదా? అన్న సందేహం ఆయనకు వచ్చినట్లు ఉంది.కాని గత కొద్ది రోజులుగా ఆయనకు వచ్చిన ఆధారాల మేరకు డీఎస్సీపై అవకతవకలపై విరుచుకుపడుతున్నారు. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొందినవారికి సంబంధించి అక్రమాలు జరిగాయని ఆయన చెబుతున్నారు. క్రీడా కోటాలో అనర్హులకు టీచర్ ఉద్యోగాలు వచ్చాయని వైఎస్సార్సీపీ గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. జై భీమ్ పార్టీని స్థాపించిన జడ శ్రవణ్ కూటమికి అధినేతలకు దూరం అవడమే కాకుండా, స్వతంత్రంగా ఆ ప్రభుత్వంపై విమర్శలు సందిస్తున్నారు.మరో రిటైర్డ్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వంపై ఈ స్థాయిలో విమర్శలు చేస్తారని రెండేళ్ల క్రితం ఎవరూ ఊహించి ఉండరు. కూటమి అధికారంలోకి రాగానే ఈయనకు కీలకమైన పదవి వస్తుందని చాలామంది అనుకున్నారు. కాని అనూహ్యంగా ప్రాధాన్యత లేని పోలీస్ హౌసింగ్ సంస్థ చైర్మన్ పదవిని చంద్రబాబు ఇచ్చారు. ఇది ఒక రకంగా అవమానించడమేనని ఆయన సన్నిహితులు చాలామంది బాధపడ్డారు. అయినా చంద్రబాబు కాని, షాడో ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రి లోకేష్ గాని పట్టించుకున్నట్లు లేదు. ఆ తర్వాత క్రమేపి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై ఏబీవి కూడా ధ్వజమెత్తడం ఆరంభించారు. ముఖ్యంగా 22-ఎ నిషేధిత భూముల జాబితా విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. సీతమ్మవారిని రావణాసురుడు అపహరించుకుపోయినట్లు భూములను ప్రభుత్వంలోని వారు ఎత్తుకపోయారని గళమెత్తారు. అమరావతి రెండో దశ భూ సమీకరణ అంతా అవినీతే అని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో చేసిన ఒక వ్యాఖ్య కూడా గమనించదగిందే. రాష్ట్రంలో సహకార డెయిరీ రంగం మూల పడుతోందని ఆయన అన్నారు. సహకార డెయిరీ రంగం 'మూడు " పువ్వులు, అనేకానేక కాయలు అంటూ వ్యంగ్యాస్త్రం విసిరారు.ఇదీ చదవండి: బాబూ.. ఏపీలో కొత్త సంస్కృతికి తెర లేపారా?అలాగే ఒక ప్రముఖ టీవీ యాజమాన్యంలో మార్పుల గురించి కూడా ఆయన కామెంట్ చేశారు. అది అసలు వార్తే కాదట.. కొనుక్కుని చదివే పాఠకులు వర్సెస్ ప్రకటనలు విసిరే పాలకులు.. ఎవరి ప్రయోజనాలు ముఖ్యం అని ఆయన ప్రశ్నించారు. ఏవి తల్లి నాడు విరిసిన విలువలు, అభ్యుదయాలు? అని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఈటీవిని టీడీపీకి చెందిన ముఖ్యనేతలలో ఒకరు తన అధీనంలోకి తీసుకున్నారని ప్రచారం అవుతున్న పరిస్థితిలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.మరో సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు కూడా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు కోడలు, లోకేష్ సతీమణి అయిన నారా బ్రాహ్మణి ఎక్స్‌లో చేసిన ఒక పోస్టుపై ఆయన ఘాటుగా స్పందించారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అయి 53 రోజులు జైలులో ఉండి విడుదలై మూడేళ్లు అవుతున్న సందర్భంగా నిజం గెలిచింది అంటూ, 53 కొవ్వొత్తులు వెలిగించిన వీడియోని ఆమె పోస్టు చేశారు.ఈ పోస్టుపై నాగేశ్వరరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రెండొ, ఇరవైరెండెకరాలతోనో 1970వ దశకంలో రాజకీయ జీవితం ఆరంభించి, ప్రస్తుతం దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా తెలుగుజాతికి అపఖ్యాతి తీసుకువచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును నిస్వార్థ అవినీతిపరుడు అని కూడా ఎద్దేవ చేశారు. ఆత్మగౌరవం కోసం పోరాడిన తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ.రామారావుకు వెన్నుపోటు పొడిచారని కూడా ఆయన విమర్శించారు. ఏపీ విభజనకు లేఖ ఇవ్వడంతో తెలుగుజాతికి తీరని ద్రోహం చేశారని చంద్రబాబుపై నాగేశ్వరరావు మండిపడ్డారు.మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విశాఖపట్నం ప్రాంతంలో ఇబ్బడి ముబ్బడిగా డేటా సెంటర్లు పెట్టడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికా వంటి దేశాలు డేటా సెంటర్లను వదలించుకుంటుంటే, ఇండియా వంటి దేశాలు ఎదురు రాయితీలు ఇచ్చి తెచ్చుకోవడం ఏమిటని అన్నారు. అందులో విశాఖలో వీటిని అధికంగా ఏర్పాటు చేయడం వల్ల వచ్చే నీరు, విద్యుత్ సమస్యలను ఆయన ప్రస్తావించారు.ఇంకో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఏపీ పోలీసులు ఎఫ్‌బీఐ పేరుతో మెటాకు ఫిర్యాదు చేసి సోషల్ మీడియా పోస్టులను తొలగించడంపై అసహనం వ్యక్తం చేశారు. దీనిని నేరపూరిత దుష్ప్రవర్తనగా ఆయన అభివర్ణించారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. వీరే కాదు. మరికొందరు మేధావులు కూడా ప్రభుత్వంలో జరుగుతున్న వివిధ అక్రమాలు, వివాదాస్పద అంశాలపై ప్రజలను చైతన్య పరుస్తున్న తీరు స్వాగతించదగిందే!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
51 మందిపై రౌడీషీట్లకు బ్రేక్!
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేతలపై ‘రౌడీ’ ముద్ర వేయాలన్న చంద్రబాబు సర్కారు దుందుడుకు చర్యలకు బ్రేక్ పడింది. ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు రౌడీ షీట్లు తెరిచే స్థాయికి దిగజారిపోయిన చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో 24 గంటలు తిరక్కముందే వెనుకడుగు వేయాల్సి వచ్చింది. ఐదేళ్ల క్రితం నాటి కేసులో ఉన్నారనే సాకు చూపి 51 మందిపై రౌడీషీట్లు తెరవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు మంగళవారం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయొద్దని బుధవారం రాత్రి పోలీస్ హౌస్ ఆఫీసర్లకు సెల్ మెసేజ్‌లు ఇవ్వడం పోలీస్ వర్గాల్లో చర్చకు దారితీసింది. డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ చేయాలని, విద్యా శాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ ఉవ్వెత్తున ఉద్యమం చేయడంతో ఉలిక్కిపడిన చంద్రబాబు సర్కారు కక్ష సాధింపునకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై 2021లో జరిగిన దాడి కేసులో ఉన్నారనే సాకు చూపి ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తోపాటు 51 మంది వైఎస్సార్సీపీ నేతలపై రౌడీషీట్లు తెరవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ మంగళవారం జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకత్వాన్ని మొత్తంగా రౌడీల జాబితాలోకి నెట్టే ఇలాంటి బరితెగింపు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ చూడలేదని రాష్ట్ర ప్రజలు విస్తుపోయారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ పోరు ఉవ్వెత్తున ఎగసి పడుతున్న వేళ, సమాధానం చెప్పలేక చేతులెత్తేసి.. ఐదేళ్ల నాటి కేసును తవి్వతీసి మరీ ఈ అ్రస్తాన్ని ప్రయోగించిన ప్రభుత్వం అభాసు పాలైంది. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇ చ్చిన వారిని, పోలీసులే అరెస్టు అవసరం లేదని నోటీసులతో వదిలేసిన వారిని సైతం ఇప్పుడు రౌడీలుగా చిత్రీకరించేందుకు సిద్ధం కావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ నేతలపై రౌడీషీట్లు తెరిచే చర్యలు ఆపాలంటూ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు కమిషనరేట్ పరిధిలోని తొమ్మిది పోలీస్ స్టేషన్లకు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు, నలుగురు ఏసీపీలకు సెల్ మెసేజ్‌లు ఇవ్వడం గమనార్హం. దీంతో భవానీపురం, అజిత్‌సింగ్‌నగర్, నున్న, కృష్ణలంక, మాచవరం, పటమట, గవర్నర్‌పేట, గుణదల, సత్యనారాయణపురం స్టేషన్ల ఎస్హెచ్ఓలు తమ పరిధిలోని వారిపై రౌడీషీట్లు తెరిచే చర్యలను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నిలుపుదల చేయాలని సీపీ సెల్ మెస్‌జ్ ద్వారా స్పష్టం చేశారు. జగన్ గవర్నర్‌ను కలిశాకే..మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ కీలక నేతలు బుధవారం రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన అనంతరం రౌడీ షీట్లు విషయంలో ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం గమనార్హం. ప్రధాన ప్రతిపక్ష నేతలపై రౌడీషీట్లు తెరిచేందుకు చంద్రబాబు పూనుకోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని నిఘా వర్గాల నివేదికలతో వెనుకడుగు వేశారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. న్యాయపరంగా నిలవదనే భయం రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక లోకేశ్ ఒత్తిడితో రెడ్‌బుక్ అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిందే తడవుగా 2024లోనే మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడితో సంబంధం లేని వారిపై పలు సెక్షన్లతో కేసులు పెట్టి అరెస్టులు చేసేలా లోకేశ్ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడు డీఎస్సీ స్కామ్‌పై వైఎస్సార్సీపీ ఉద్యమం ఉధృతం చేయడంతో ఉలికిపాటుకు గురైన చంద్రబాబు రౌడీషీట్ల తంతుకు తెరలేపారు. ఒకే కేసులో ఏకంగా 51 మంది వైఎస్సార్సీపీ నేతలపై రౌడీషీట్లు తెరిస్తే సమాజం హర్షించదని, న్యాయపరంగాను అవి నిలబడవనే భయంతో పునరాలోచనలో పడినట్టు తెలిసింది. ఇష్టానుసారం రౌడీషీట్ తెరవడం కుదరదు రౌడీషీట్ అనేది సాధారణ పోలీసు రికార్డు కాదు. రెండు కంటే అత్యధిక కేసులు ఉన్నవారిపైన, సమాజంలో ఇబ్బందికరంగా ఉన్న వారిపైన పోలీసుల నిఘా కోసం రౌడీషీట్ తెరుస్తారు. ఏపీ పోలీస్ మాన్యువల్ స్టాండింగ్ ఆర్డర్ 601 ప్రకారం తరచూ నేరాలకు పాల్పడే వారిపై, శాంతిభద్రతలకు ముప్పుగా వ్యవహరించే వారిపై రౌడీషీట్ తెరవడానికి నిబంధనలు వర్తిస్తాయి. ఒక్క కేసులో నిందితుడిగా ఉన్నంత మాత్రాన రౌడీషీట్ తెరవడం సరికాదని ఏపీ హైకోర్టు సైతం పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. రౌడీషీట్.. వ్యక్తి ప్రతిష్ట, హక్కులపై ప్రభావం చూపే చర్య కాబట్టి పోలీసు మాన్యువల్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని హైకోర్టు పేర్కొన్న సందర్భాలున్నాయి. రౌడీషీట్ అనేది గ్రామాల్లో అయితే డీఎస్పీ పర్యవేక్షణలో, పట్టణాల్లో ఏసీపీల పర్యవేక్షణలో చేయాల్సిన ప్రక్రియ. రౌడీషీట్ తెరవాలన్నా, తొలగించాలన్నా.. ఆయా వ్యక్తుల ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని డీఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులు నిర్ణయం తీసుకుంటారు. అటువంటిది రాజకీయ కక్షతో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఏకంగా 51 మందిపై ఒకేసారి రౌడీషీట్లు తెరవాలనే ప్రయత్నం తొందరపాటు చర్య అవుతుందని రిటైర్డ్ పోలీస్ అధికారులు సైతం తప్పుబడుతున్నారు.


