తాడేపల్లి: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి క్రెడిట్ చోరీకి చంద్రబాబు పడరాని పాట్లు పడతున్నారని వైఎస్సారసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు తొలుత 15 వేల ఎకరాలు.. ఆ తర్వాత 5 వేల ఎకరాలు బాబు కావాలన్నారని, ఆ ఎయిర్‌పోర్ట్‌కు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు కూడా ఉంటే వాటి అన్నింటినీ అధిగమించి దానికి తాను శంకుస్థాపన చేశానన్నారు వైఎస్ జగన్
ఈ రోజు(గురువారం, జనవరి 8వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాకే భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులను వేగవంతం చేశామన్నారు.
‘భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూసేకరణకు రూ. 960 కోట్లు ఖర్చు చేశాం. మేం వచ్చాక భోగాపురం కోర్టు కేసులు పరిష్కరించాం. మా హయాంలోనే నిర్వాసితులకు భూములు కేటాయించాం. భోగాపురం నిర్వాసితులకు కాలనీలు కట్టాం. అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా అనుమతులు తెచ్చకోలేకపోయారు. మేం అధికారంలోకి వచ్చాక అన్ని అనుమతులు తెచ్చాం. కోవిడ్ కష్టాలలో కూడా ఎయిర్‌పోర్ట్ పనులు ఆగలేదు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు నేనే శంకుస్థాపన చేశారు. 2026లో మొదటి విమానం ల్యాండింగ్ అవుతుందని ఆనాడే చెప్పా’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.



