సాక్షి,అమరావతి: రాయలసీమ లిఫ్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. నేడు(గురువారం, జనవరి 8వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
‘చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్ని తాకట్టు పెట్టారు. ఇలాంటి చరిత్ర హీనులు దేశంలో ఎవరూ ఉండరు. చంద్రబాబు చరిత్ర హీనుగా మిగిలిపోతారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా తాకట్టు పెట్టారో సీఎం రేవంత్ చెప్పారు. రాయలసీమ లిప్ట్ ఆపించామని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారు. రాయలసీమ లిఫ్ట్‌పై వాస్తవాలు అందరికి తెలియాలి. రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదని మాట్లాడుతున్నారు.
అంటే.. వీళ్లకి రేవంత్‌కు మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. రాయలసీమ లిఫ్ట్ సీమ, నెల్లూరుకు సంజీవిని. వీళ్ల మాటలు చూస్తుంటే మనుషేలా అనిపిస్తుంది. చంద్రబాబు క్లోజ్‌డోర్ మీటింగ్‌లో అడిగినట్లు.. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రే చెప్పారు. చంద్రబాబది ఒక విలన్ క్యారెక్టర్.
చంద్రబాబు అండ్ కో బరితెగించి మాట్లాడటం చూస్తుంటే.. రేవంత్‌తో చీకటి ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్లుంది. తన స్వార్థం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచారు. తన స్వార్థం కోసం జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచారు’ అని ధ్వజమెత్తారు.
పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావాలంటే.. శ్రీశైలంలో 881 అడుగుల నీటిమట్టం ఉండాలి. పోతిరెడ్డిపాడుకు 7వేల క్యూసెక్కులు రావాలంటే.. 854 అడుగుల ఎత్తులో నీళ్లు తోడుకోవాలి. పోతిరెడ్డిపాడు నుంచి 101 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి.
పోతిరెడ్డిపాడు నుంచి 2,3సార్లే నీటిని తీసుకున్నాం. కల్వకుర్తిని 25 నుంచి 50 టీఎంసీఎలకు పెంచారు.పాలమూరు-రంగారెడ్డి,డిండిని డిజైన్ చేశారు.ఎస్‌ఎల్‌బీసీ నుంచి మరో 40 టీఎంసీలు తోడుకోవడానికి నిర్మాణాలు, అదనంగా మరో టీఎంసీ తరలింపునకు కూడా తెలంగాణ ప్రణాళికలు. 770 అడుగల నుంచే ఎడమవైపు పవర్ హౌస్ ద్వారా.. మరో 4 టీఎంసీలు ఎడాపెడా తోడేసుకుంటున్నారు. రోజుకు మొత్తం 8 టీఎంసీలు తెలంగాణ తోడుకుంటుంది’ అని స్పష్టం చేశారు.
ఓటుకు కోట్లు కేసులో ఆడియో,వీడియోలతో చంద్రబాబు దొరికిపోయారు. చంద్రబాబు నోరు మెదపలేక రాషష్టట్రాన్ని తాకట్టు పెట్టారు. కల్వకుర్తి,ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు-రంగారెడ్డి,డిండి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవు. ఈ పనులు ఆపాలని 2021 అక్టోబర్‌లో ఎన్‌జీటీ ఆదేశాలిచ్చింది. ఎన్‌జీటీ ఆదేశాలను తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు. ఆ తర్వాత తెలంగాణకు ఎన్‌జీటీ రూ.920 కోట్ల పెనాల్టీ వేసింది. శ్రీశైలంలో 777 అడుగుల దగ్గరే తెలంగాణ నీళ్లు తోడుకుంటుంటే.. ఏపీ మాత్రం 834 అడుగుల దగ్గర నీళ్లు తోడుకునే పరిస్థితి.
మా ప్రభుత్వం రాకపోవడం రాయలసీమ ప్రజల దురదృష్టం
శ్రీశైలానికి ఎప్పుడు 881 అడుగులకు నీరు చేరుకుంటుంది?.సీమ సస్యశ్యామలం కోసమే రాయలసీమ లిఫ్ట్ చేపట్టాం. 800 అడుగుల్లో రోజుకు 3 టీఎంసీలు తోడుకునేలా డిజైన్ చేశాం. రూ. వెయ్యి కోట్లు ఖర్చుచేసి పనులను పరుగులు పెట్టించాం. రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్‌ను అడ్గుకోవడానికి చంద్రబాబే స్వయంగా కేసులు వేయించారు. మా ప్రభుత్వం రాకపోవడం రాయలసీమ ప్రజల దురదృష్టం. రాయలసీమకు చంద్రగ్రహణం పట్టింది. చంద్రబాబే దగ్గరుండి రాయాలసీమ లిఫ్ట్‌ను ఖూనీ చేశారు. 22 టీఎంసీలకు లిఫ్ట్ ఎందుకని చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబుకు బుద్ధి,జ్ఞానం ఉందా?’
శ్రీశైలం నీళ్లను 500 కిలోమీటర్లు తీసుకెళ్లి కుప్పంకు ఇచ్చాం. రాయలసీమకు నీళ్ల కేటాయింపుల మేరకు లిఫ్ట్ ప్రాజెక్ట్.ఆంధ్రా, తెలంగాణ ప్రజలు అన్న దమ్ములం. ఏపీ ప్రజలకు నష్టం జరగకుండా చూడాల్సి ధర్మం ఉంది. తప్పును సరిదిద్దుకోకపోతే చరిత్రహీనులవుతాం. పాలకులు భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరైందేనా?.సీమ ప్రాజెక్టులకు ఫుల్‌గా నీళ్లు నింపుకోలేని పరిస్థితి. చంద్రబాబు తప్పును మేం సరిదిద్దుతూ వచ్చాం.
సీమ ప్రాజెక్టులకు ఫుల్‌గా నీళ్లు నింపుకోలేని పరిస్థితి. మేం వచ్చాక కెనాల్‌ల సామర్ధ్యాన్ని కూడా పెంచాం. మేం వచ్చాక పూర్తిస్థాయిలో గండికోటలో నీళ్లు నిల్వ చేశాం. బ్రహ్మంసాగర్‌లో మేం వచ్చాకే 17 టీఎంసీలు నిల్వ చేశాం.బాబు హయాంలో ఏనాడూ నీళ్లు నిల్వ చేయలేదు. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనత మాదే. సోమశిలలో 78,కండలేరులో 68 టీఎంసీలు నిల్వ చేశాం. పులిచింతలలో కూడా మేం వచ్చాకే 45టీఎంసీలు నిల్వచేశాం. అలాంటి ప్రాజెక్టు పూర్తయితే నాకు పేరొస్తుందని ఆపేశారని’ అన్నారు.



