రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నేతలు
సాక్షి, నంద్యాల జిల్లా: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు సందర్శించారు. మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, కల్పలతరెడ్డి, శివరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, సమన్వయ కర్త దారా సుధీర్ పరిశీలించారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు.

నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలను సస్యశ్యామలం చేయాలనేది వైఎస్ జగన్ కల.. 2020లో రాయలసీమ ఎత్తిపోతలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారన్నారు. రూ.3,207 కోట్ల వ్యయంతో వైఎస్ జగన్ రాయలసీమ ప్రాజెక్టును చేపట్టారు. చీకటి ఒప్పందం చేసుకునే చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టును వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.




