స్వామివారి బంగారు కిరీటం తాకట్టు ఎపిసోడ్లో కొత్త డ్రామా
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ వెంకటేశ్వరస్వామి బంగారు కిరీటం మాయం వ్యవహారంలో కొత్త డ్రామాకు తెరలేపింది ఆలయ ట్రస్టు. తాకట్టు పెట్టిన బంగారు కిరీటాన్ని రాత్రికి రాత్రే రాజస్థాన్ నుంచి తెప్పించిన ట్రస్టు.. మీడియా ముందు ప్రదర్శించింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి కిరీటాన్ని తాకట్టు పెట్టలేదంటూ ట్రస్టు సభ్యులు కొత్త డ్రామాకు తెరలేపారు. కిరీటం గురించి ప్రశ్నించిన మీడియాపై ట్రస్టు సభ్యులు దౌర్జన్యం చేశారు. అయితే మీడియా ప్రతినిధులకు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సర్ధిచెప్పి పంపించారు. కాగా, కిరీటం తాకట్టు వ్యవహారంలోదాత మాటూరి సుబ్బారావు పోరాటం ఫలించింది. గుడివాడలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బంగారు కిరీటం మాయం కావడంపై దాత సుబ్బారావు ట్రస్టును ప్రశ్నించారు. చివరకు పోలీసుల జోక్యంతో ఆ కిరీటం తాకట్టు పెట్టినట్లు తేలింది. దీనిపై ఇప్పుడు బుకాయిస్తున్నారు ట్రస్టు సభ్యులు. తాము కిరీటం తాకట్టుపెట్టలేదంటూ.. హుటాహుటీనా రాజస్థాన్ నుంచి తెప్పించి మరీ కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారు. రూ. 75 లక్షలకు పైగా ఉండే ఆ బంగారు కిరీటాన్ని మాటూరి సుబ్బారావు దంపతులు గతేడాది స్వామి వారికి సమర్పించారు. అయితే స్వామి వారి దర్శనానికి వచ్చిన దాత సుబ్బారావు.. ఆ కిరీటం కనిపించకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. దాంతో ట్రస్టు సభ్యుల్ని సైతం నిలదీశారు. తమ పరిధిలో లేకపోయినా దేవాదాయశాఖ అధికారులు విచారణ చేపట్టారు. సుబ్బారావు దీనిలో భాగంగా ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ ,ఇతర సభ్యుల పై కేసు నమోదు చేశారు పోలీసులు. దాంతో ట్రస్టు సభ్యులు కంగారుపడ్డారు. తాకట్టు వ్యవహారం పై తీవ్ర దుమారం రేగడంతో టీడీపీ నేతలు సైతం రంగంలోకి దిగారు. తాకట్టు పెట్టుకున్న వ్యాపారి ఆ కిరీటంతో రాజస్థాన్‌కు వెళ్లిపోవడంతో ఆ బంగారు కిరీటాన్నిఅక్కడ నుంచి పరుగ పరుగు పరుగున తెప్పించి మీడియా ముందు ప్రదర్శించారు. ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలపై చిందులు వేశారు ట్రస్టు సభ్యులు.
పాక్‌లో ‘బొద్దింకల’ తుఫాన్
ఇస్లామాబాద్: భారత్‌లో వ్యంగ్యంగా ప్రారంభమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించింది. అక్కడి యువత కూడా కొత్త కొత్త పేర్లతో అకౌంట్లను క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.పాకిస్థాన్‌లో కాక్రోచ్ అవామీ పార్టీ, కాక్రోచ్ అవామీ లీగ్, ముత్తాహిదా కాక్రోచ్ మూవ్మెంట్ వంటి పేర్లతో కొత్త సోషల్ మీడియా అకౌంట్లు వెలుగులోకి వచ్చాయి. ‘సిస్టమ్ మనల్ని కాక్రోచ్లుగా భావించింది. మేమే ప్రజల స్వరం అని అకౌంట్ల బయోలో పేర్కొనడం గమనార్హం.లోగోలు,బ్రాండింగ్పాకిస్థాన్లోని ఈ అకౌంట్ లోగోలు భారతీయ వెర్షన్లను పోలి ఉన్నప్పటికీ అవి పచ్చ,తెలుపు రంగు ఉపయోగిస్తున్నాయి. ఇది స్థానిక రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమను చూపించడానికి ఒక వ్యూహాత్మక నిర్ణయం. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ పీటీఐ,పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వంటి ప్రధాన పార్టీలకు వ్యతిరేకంగా యువతను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.యువతలో ప్రభావంఈ ఉద్యమం ఒక వ్యంగ్య రాజకీయ వేదికగా మారింది. నిరుద్యోగం, రాజకీయ వ్యవస్థపై అసంతృప్తి, యువతలోని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఇది ఒక కొత్త మార్గంగా నిలుస్తోంది. భారత్‌లో ప్రారంభమైన ఈ వ్యంగ్య ఉద్యమం ఇప్పుడు పాకిస్థాన్ యువత కూడా ఆకర్షితులవుతున్నారు.
IPL 2026: ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ అప్డేట్స్
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా 67వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తలపడుతున్నాయి. ఆర్సీబీ మూడో వికెట్ డౌన్దేవ్దత్త్ పడిక్కల్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన పడిక్కల్.. మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 91/28 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో దేవ్‌దత్త్ పడిక్కల్(20), పాటిదార్(10) ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీఎస్ఆర్హెచ్ విధించిన 256 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ధాటిగా ఆరంభించింది. 4 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. అయితే మరుసటి ఓవర్లోనే వెంకటేశ్ అయ్యర్ (44) ఔట్ కావడంతో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ టార్గెట్ 256 పరుగులుహైదరాబాద్ వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్ భారీ స్కోరు చేసింది. అభిషేక్, ఇషాన్, క్లాసెన్ అర్థశతకాలతో విధ్వంసం సృష్టించడంతో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ (79), అభిషేక్ (56), క్లాసెన్ (51) ఫిఫ్టీలతో మెరిశారు. ఆఖర్లో నితీశ్‌కుమార్ (12 బంతుల్లో 29 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఎస్ఆర్హెచ్ 250 పరుగుల మార్క్‌ను దాటింది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ 2 వికెట్లు తీయగా, సుయాశ్, కృనాల్ చెరొక వికెట్ తీశారు.16 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. క్లాసెన్ 23 బంతుల్లో 50 పరుగుల మార్క్ సాధించాడు. కిషన్ 65 పరుగులతో ఆడుతున్నాడు.దంచుతున్న ఎస్ఆర్హెచ్.. 15 ఓవర్లలో 189-2ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ దంచికొడుతుంది. 15 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (50), క్లాసెన్ (47) క్రీజులో ఉన్నారు. అంతకముందు 56 పరుగులు చేసిన అభిషేక్ శర్మ సుయాశ్ శర్మ బౌలింగ్‌లో జోర్డాన్ కాక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.6 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 63-16 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (26), ఇషాన్ కిషన్ (8) పరుగులతో ఆడుతున్నారు.హెడ్ (26) ఔట్.. తొలి వికెట్ డౌన్ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ రసిక్సలామ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోయి 45 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (17) క్రీజులో ఉన్నాడు.టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీపై భారీ విజయాన్ని సాధించి టేబుల్లో రెండో స్థానంలో నిలవాలని ఎస్ఆర్హెచ్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఇప్పటికే టాప్‌లో ఉన్న ఆర్సీబీ విజయంతో లీగ్ దశను ముగించాలని భావిస్తోంది. మరి భారీ స్కోర్లకు పెట్టింది పేరైన ఉప్పల్ స్టేడియంలో ఎవరిది పైచేయి కానుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ తమ సొంత మైదానంలో ఎస్ఆర్హెచ్తో తలపడింది. ఆ మ్యాచ్‌లో విజయం సాధించిన ఆర్సీబీ.. యాదృశ్చికంగా లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌ను మళ్లీ ఎస్ఆర్హెచ్తోనే ఆడుతోంది. అయితే ఎస్ఆర్హెచ్ మాత్రం ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 26 సార్లు తలపడితే ఎస్ఆర్హెచ్ 14 సార్లు, ఆర్సీబీ 12 సార్లు విజయాలు సాధించాయి. ఇక సొంత మైదానంలో ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్దే పైచేయిగా ఉంది. ఇక్కడ ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్ ఆరింటిలో గెలవగా.. ఆర్సీబీ మూడింట నెగ్గింది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(వికెట్‌కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్.సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్. 🚨Toss update from Hyderabad 🚨@SunRisers won the toss and elected to bat first against @RCBTweets Rajat Patidar returns to lead #RCB Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB pic.twitter.com/izekAMXKnx— IndianPremierLeague (@IPL) May 22, 2026
కేంద్ర ప్రభుత్వానికి రూ.2.87 లక్షల కోట్లు..
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఈ చమురు వేడి తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఊరటనిచ్చే వార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.2.86,588.46 కోట్ల మిగులు నిధులను (డివిడెండ్) బదిలీ చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అందుకున్న రూ.2.7 లక్షల కోట్ల డివిడెండ్ కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన శుక్రవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఈ నిధుల బదిలీకి బోర్డు ఆమోదం తెలిపింది.అంచనాల కంటే స్వల్పంగా తక్కువ..బ్లూమ్‌బెర్గ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థలు ఈసారి ఆర్బీఐ దాదాపు రూ.3 లక్షల కోట్ల (31.2 బిలియన్ డాలర్లు) రికార్డు స్థాయి మిగులును ప్రభుత్వానికి బదిలీ చేయవచ్చని అంచనా వేశాయి. అయితే, ప్రస్తుత బదిలీ ఆ అంచనాల కంటే స్వల్పంగా తక్కువగా నమోదైంది.ఆదాయంలో భారీ వృద్ధిమే 22న ఆర్బీఐ విడుదల చేసిన అధికారిక మీడియా ప్రకటన ప్రకారం.. కేంద్ర బ్యాంక్ స్థూల ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 26.42% పెరిగింది. రిస్క్ నిబంధనలకు ముందు ఆర్బీఐ ఖర్చులు 27.60% పెరిగాయి. రిస్క్ ప్రొవిజన్, చట్టబద్ధమైన నిధులకు బదిలీ చేయకముందు ఆర్బీఐ నికర ఆదాయం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.3,13,455.77 కోట్లు ఉండగా.. 2026 ఆర్థిక సంవత్సరంలో అది రూ.3,95,972.10 కోట్లకు చేరింది. మార్చి 31, 2026 నాటికి రిజర్వ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ పరిమాణం 20.61% వృద్ధితో రూ.91,97,121.08 కోట్లకు చేరుకుంది.రిస్క్ బఫర్ పెంపుప్రభుత్వానికి బదిలీ చేసే డివిడెండ్‌ను పెంచినప్పటికీ, భవిష్యత్తు సవాళ్లను తట్టుకునేందుకు ఆర్బీఐ తన 'కంటింజెంట్ రిస్క్ బఫర్' (ఆకస్మిక ప్రమాదాల నిధి) పరిమాణాన్ని భారీగా పెంచింది. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యవసర నిధి కింద రూ.1,09,379.64 కోట్ల బదిలీకి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మునుపటి సంవత్సరంలో ఈ కేటాయింపు కేవలం రూ.44,861.70 కోట్లుగా మాత్రమే ఉండటం విశేషం.ప్రస్తుతం దేశంలో ఇంధన ధరల పెరుగుదల వల్ల దిగుమతి బిల్లులు భారంగా మారాయి. దీనికి తోడు కరెంట్ ఖాతా లోటు (CAD) పెరగడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) నిధులను ఉపసంహరించుకోవడం వంటి అంశాలు దేశ ఆర్థిక స్థితిపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆర్బీఐ నుంచి అందుతున్న ఈ భారీ డివిడెండ్.. కేంద్ర ప్రభుత్వానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక బలమైన రక్షణ కవచంలా (బఫర్‌గా) ఉపయోగపడనుంది.ఆర్బీఐకి ఈ ఆదాయం ఎలా వస్తుంది?సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం తన వివిధ రకాల పెట్టుబడులు, విదేశీ మారక నిల్వల (Forex Reserves) నిర్వహణ, కరెన్సీ నోట్ల ముద్రణ ద్వారా వచ్చే ఆదాయం నుండి తన ఖర్చులు, రిస్క్ నిధులను మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. ఈ నిధులు ప్రభుత్వ బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి, సంక్షేమ కార్యక్రమాలకు ఎంతో కీలకంగా ఉంటున్నాయి.
ఎస్ఆర్హెచ్ త్రిమూర్తుల అరుదైన ఫీట్!
పాక్‌లో ‘బొద్దింకల’ తుఫాన్
నందు-అవికా 'అగ్లీ స్టోరీ' సినిమా రివ్యూ
స్టార్ ప్లేయర్ దూరం.. కేకేఆర్‌కు ఎదురుదెబ్బ!
ఏఐ టూల్స్ తయారు చేసిన వారికే షాక్!
సీఎం ప్రజావాణిలో 396 దరఖాస్తులు
SBI అలర్ట్: వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్?
అనాధ గిరిజన చిన్నారులకు అండగా నిలిచిన సీఎం ప్రజావాణి
'విశ్వంభర' డైరెక్టర్ సోదరుడు దర్శకుడిగా ఎంట్రీ
ఒకే ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
‘సీఎం సీటొద్దులే.. మంత్రిగా సరిపెట్టుకుంటా’
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
స్టాలిన్ కక్ష కడితే.. విజయ్ విముక్తినిచ్చాడు
BCCI: రోహిత్ శర్మకు బై.. బై!.. వరల్డ్‌కప్ జట్టులోకి అతడు?
ధనుష్ కంటే అతడు 100 రెట్లు నయం: దర్శకుడు
అప్పుడెప్పుడో వ్యవసాయం దండగ అన్నట్లు ఇప్పుడు వంటావార్పు దండగ అని మరో స్టేట్మెంట్ ఇస్తే పోలా..!
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
అందుకే బ్రేక్ వచ్చింది : వడ్డే నవీన్
చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
తమిళనాడు.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కి అదృష్టం
ఇళ్లల్లో నివసించకున్నా.. తాళం వేసినా.. అద్దెకిచ్చిన చర్యలే
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
విజయ్ సర్కార్ దూకుడు.. వెలుగులోకి భారీ స్కాం
పాక్ మాజీ క్రికెటర్‌కు బంపరాఫర్.. ఐపీఎల్‌కు అర్హత!
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
ఎస్ఆర్హెచ్ త్రిమూర్తుల అరుదైన ఫీట్!
పాక్‌లో ‘బొద్దింకల’ తుఫాన్
నందు-అవికా 'అగ్లీ స్టోరీ' సినిమా రివ్యూ
స్టార్ ప్లేయర్ దూరం.. కేకేఆర్‌కు ఎదురుదెబ్బ!
ఏఐ టూల్స్ తయారు చేసిన వారికే షాక్!
సీఎం ప్రజావాణిలో 396 దరఖాస్తులు
SBI అలర్ట్: వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్?
అనాధ గిరిజన చిన్నారులకు అండగా నిలిచిన సీఎం ప్రజావాణి
'విశ్వంభర' డైరెక్టర్ సోదరుడు దర్శకుడిగా ఎంట్రీ
ఒకే ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
‘సీఎం సీటొద్దులే.. మంత్రిగా సరిపెట్టుకుంటా’
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
స్టాలిన్ కక్ష కడితే.. విజయ్ విముక్తినిచ్చాడు
BCCI: రోహిత్ శర్మకు బై.. బై!.. వరల్డ్‌కప్ జట్టులోకి అతడు?
ధనుష్ కంటే అతడు 100 రెట్లు నయం: దర్శకుడు
అప్పుడెప్పుడో వ్యవసాయం దండగ అన్నట్లు ఇప్పుడు వంటావార్పు దండగ అని మరో స్టేట్మెంట్ ఇస్తే పోలా..!
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
అందుకే బ్రేక్ వచ్చింది : వడ్డే నవీన్
చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
తమిళనాడు.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కి అదృష్టం
ఇళ్లల్లో నివసించకున్నా.. తాళం వేసినా.. అద్దెకిచ్చిన చర్యలే
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
విజయ్ సర్కార్ దూకుడు.. వెలుగులోకి భారీ స్కాం
పాక్ మాజీ క్రికెటర్‌కు బంపరాఫర్.. ఐపీఎల్‌కు అర్హత!
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
ఫొటోలు
ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ.. చిందేసిన ఉప్పల్ (ఫొటోలు)
కామాఖ్య దేవాలయ దర్శనంలో శ్రీముఖి (ఫొటోలు)
అక్కినేని కోడలు శోభిత కొత్త లుక్ (ఫొటోలు)
మృణాల్ ఠాకుర్ దేశీ గ్లామర్ (ఫొటోలు)
రమణి కళ్యాణం : చీరలో మెరిసిపోతున్న నటి దీప్షిక చంద్రన్ (ఫొటోలు)
ముంబై : 'రాజా శివాజీ' చిత్రం సక్సెస్ పార్టీ
తెలంగాణ : సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఆరంభం (ఫొటోలు)
ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ప్లేయర్ల ప్రాక్టీస్.. ఉప్పల్‌లో లాస్ట్ పంచ్ ఎవరిది (ఫొటోలు)
డేవిడ్ రెడ్డి టీమ్‌తో మంచు మనోజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. త్రిమూర్తులు టీజర్ లాంఛ్ (ఫోటోలు)
సినిమా
ఓటీటీలోకి వచ్చిన సినిమా.. సీఎం విజయ్‌ని టార్గెట్ చేసి
గత నెలలో తమిళనాడు ఎన్నికలు జరిగాయి. ఇందులో టీవీకే పార్టీ అధికారం దక్కించుకోగా.. హీరో విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఎన్నికలు జరుగుతున్న టైంలో ఈయన్ని టార్గెట్ చేస్తూ సెటైరికల్‌గా ఓ మూవీ రిలీజ్ చేశారు. ఇప్పుడిది ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా)'టీఎన్ 2026' పేరుతో తీసిన ఈ మూవీలో సినిమాటోగ్రాఫర్ కమ్ నటుడు నటరాజన్ ప్రధాన పాత్ర చేశాడు. కమెడియన్ తంబి రామయ్య.. స్టోరీ అందించడంతో పాటు కీలక పాత్ర చేశాడు. ఈయన కొడుకు ఉమాపతి రామయ్య ఈ చిత్రానికి దర్శకుడు. హీరో విజయ్‌ని టార్గెట్ చేసేలా ఉన్న ఈ మూవీ.. జనాల్ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. వ్యర్థ ప్రయత్నంగా మిగిలింది. గత నెల చివరి వారంలో ఐదు ఓటీటీల్లోకి తమిళంలో మాత్రమే అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు.'టీఎన్ 2026' విషయానికొస్తే.. ప్రముఖ సినిమా హీరో, రాజకీయాల్లోకి అడుగుపెడతాడు. కొత్తగా పార్టీ స్థాపిస్తాడు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే అంశంతో పొలిటికల్ సెటైరికల్‌గా ఈ సినిమా తీశారు. అయితే విజయ్‌ని టార్గెట్ చేస్తూ తీశారని అతడి అభిమానులు కామెంట్స్ చేయగా.. ఇది పూర్తిగా కల్పిత కథ అని తంబి రామయ్య చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'.. ఒక్క సినిమాలో ఎనిమిది మంది విలన్స్)
'రమణి కళ్యాణం' మూవీ రివ్యూ
టైటిల్: రమణి కళ్యాణం నటీనటులు: సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్, శ్రీనివాస రెడ్డి, యాంకర్ శ్యామల.. తదితరులునిర్మాణ సంస్థ: కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్నిర్మాతలు: విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి, శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాలరచన & దర్శకత్వం: విజయ్ ఆదిరెడ్డిడైలాగ్స్ : రామ్ జగదీశ్ సినిమాటోగ్రఫీ : అరవింద్ తిరుకోవెల సంగీతం : సూరజ్ S కురుప్ ఎడిటర్ : రవితేజ గిరజాల విడుదల తేది: మే 22, 2026ట్రైలర్, టీజర్స్ చూడగానే నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయి మధ్య ప్రేమకథ అని తెలిసి ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ఎలా ఉందొ రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. సంజన(దీప్షిక) చిన్నప్పుడే ఓ యాక్సిడెంట్ లో కళ్ళు పోగొట్టుకున్నా తన పనులు తాను చేసుకుంటూ అందరితో కలివిడిగా ఉంటూ ఓ పబ్ లో సింగర్ గా పనిచేస్తూ ఉంటుంది. నలుగురు పిల్లలు, ఓ బామ్మ.. వాళ్లే సంజన ప్రపంచం. సంజన పనిచేసే పబ్ ఓనర్ కిషోర్(శ్రీనివాసరెడ్డి) ఫ్రెండ్ రాజ్(సూర్య వసిష్ఠ) నడవలేడు. పక్షవాతం వల్ల వీల్ చైర్ కే అంకితం. అనుకోకుండా ఈ ఇద్దరూ ఓ గొడవతో పబ్ లో కలిసి స్నేహితులుగా మారి అనంతరం ప్రేమలో పడతారు. ఎప్పుడూ అతని గతం, గోల్ గుర్తుచేసుకుంటూ బాధపడే రాజ్ సంజన ప్రేమతో పూర్తిగా మారిపోయి సంతోషంగా ఉంటాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఆ సమయంలోనే కిషోర్ కి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి? మరి సంజన - రాజ్ ల పెళ్లి జరిగిందా? అసలు రాజ్ ఎందుకు వీల్ చైర్ కే పరిమితమయ్యాడు? రాజ్ గతమేంటి? సంజన గతం ఏంటి? సంజనతో ఉండే నలుగురు పిల్లలు ఎవరు? కిషోర్ కి రాజ్ గురించి ఏం తెలిసింది అన్నదే ఈ సినిమా కథ.ఎలా ఉందంటే.. ఎప్పుడో గతంలో ఇలా హీరో హీరోయిన్స్ కి ఆరోగ్య సమస్యలు ఉండటం, వాళ్ళ పేమకథలతో సినిమాలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మొదలైంది. మనలో ఏ లోపం ఉన్నా జీవితంలో ముందుకు వెళ్లడానికి అది అడ్డంకిగా మారకూడదు అనే పాయింట్ ని ఓ ప్రేమకథగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్స్ పాత్రల పరిచయం, వాళ్ళ స్నేహం, ప్రేమతో సాగుతుంది. ఇంటర్వెల్ కి ఓ ఎమోషనల్ సీన్ తో నెక్స్ట్ కిషోర్ ఏం చేస్తాడు అనే ఆసక్తి కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ కాస్త ఎమోషనల్ గా సాగుతుంది. ఈ సినిమాకి హీరోయిన్ పాత్రనే బాగా హైలెట్ చేసారు. తను అసలు బ్లైండ్ అనే విషయం మర్చిపోయి ధీమాగా బతుకుతుంది. తన యాక్సిడెంట్ వల్ల అసలు కారు ఎక్కదు. దాని గురించి గొడవే జరుగుతుంది. అలాంటిది ఆ భయం నుంచి ఎలా బయటపడింది తన ట్రామాకు సంబంధించిన సీన్స్ అన్ని బాగానే రాసుకున్నారు.మధ్యమధ్యలో కామెడీ ట్రై చేసారు కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇక హీరోయిన్ ఆర్జేగా మారడం ఓకే కానీ, ఆ ఆర్జే సీన్స్, ఆఫీసులో కిరాక్ సీతతో అక్కర్లేని సీన్స్ తో సాగదీశారు. అసలు కిరాక్ సీత పాత్ర ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. హీరో ఫ్లాష్ బ్యాక్ కూడా బాగానే ఉంది. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మనం ఊహించం. అయితే క్లైమాక్స్ మాత్రం రొటీన్ పాత సినిమాల్లో లాగా ఎమోషనల్ గా చూపించే ప్రయత్నం చేసారు. ఆ క్లైమాక్స్ ఇంటర్వెల్ సమయంలోనే ఊహించేయొచ్చు.ఇక హీరోయిన్ తో ఉండే ఆ నలుగురు పిల్లలు ఎవరు, ఆ బామ్మ ఎవరు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ ప్రేమకథలో ఎమోషన్ ఇంకాస్తా పండాల్సింది. నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయితో డ్రీమ్ సాంగ్స్ వేయడం ఇబ్బందిగా ఉండటమే కాక కథకు అడ్డంగా కూడా ఉంటుంది. ఇక ఈ సినిమా ఓ రెండు మూడేళ్ళ క్రితం షూటింగ్ జరుపుకున్న సినిమా అని అందులో ఉన్న కొంతమంది ఆర్టిస్టులను చూస్తే తెలిసిపోతుంది. హీరో హీరోయిన్స్ కి లోపాలు పెట్టి వల్ల మధ్య ప్రేమకథతో దర్శకుడు ఏదో మోటివేషనల్ మెసేజ్ ఇద్దామనుకున్నట్టు ఉంటుంది.ఎవరెలా చేశారంటే..దీప్షిక చంద్రన్ మాత్రం కళ్ళు లేని అమ్మాయి పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సూర్య వశిష్ట కూడా సినిమా అంతా వీల్ చైర్ లోనే ఉండి బాగానే నటించాడు. ఎప్పుడూ నవ్వించే శ్రీనివాస రెడ్డి ఈసారి ఎమోషనల్ పాత్రలో మెప్పించాడు. లోహిత్ కుమార్, ప్రభావతి, చైతన్య జొన్నలగడ్డ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు నటించారు.ఇక సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా పాటలు అంతగా మెప్పించవు. ఎడిటింగ్ లో అక్కర్లేని సాంగ్, కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బాగుండేది. దర్శకుడు ఓ మోటివేషనల్ రాసుకున్న ప్రేమకథని ఇంకాస్త ఎమోషనల్ గా తెరకెక్కించాల్సింది. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
‘పురుషః’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: పురుషఃనటీనటులు:బత్తుల పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, వెన్నెల కిషోర్, రాయంచ కొక్కురనిర్మాత: బత్తుల కోటేశ్వరదర్శకత్వం: వీరు వులవలసంగీతం: శ్రవణ్ భరద్వాజ్సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాలఎడిటింగ్: కోటివిడుదల తేది: మే 22,2026కథేంటంటే..గోవింద్ అలియాస్ బండ(పవన్ కల్యాణ్ బత్తుల),సత్తిబాబు అలియాస్ బొగ్గు(సప్తగిరి), శ్రీను అలియాస్ జంప్(కసిరెడ్డి రాజ్ కుమార్) ముగ్గురూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. పెళ్ళైన తర్వాత ఈ ముగ్గురికీ తమ తమ భార్యలతో రోజూ చిన్న చిన్న గొడవలు అతుతుంటాయి. భర్తలపై అనుమానం పెంచుకున్న ఈ ముగ్గురు భార్యలు..నిత్యం వారిని టార్చర్ చేస్తుంటారు. అదే సమయంలో చిన్నప్పటి స్నేహితుడు కిస్సు(వెన్నెల కిశోర్) పెళ్లి కుదురుతుంది. ఈ ముగ్గరు తమ భార్యలతో కలిసి ఆ పెళ్లికి వెళ్తారు. అక్కడ యవ్వనంలో గోవింద్, సత్తిబాబు, శ్రీనులు కలిసి చేసిన కొన్ని చిలిపి పనుల గురించి భార్యలకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? రోజీ ఎవరు? గోవింద్ జీవితంలోకి ఆమె ఎలా వచ్చింది? కిస్సు రాసిన బుక్ ఈ ముగ్గురి కాపురాల్లో ఎలాంటి చిచ్చు పెట్టింది? విడాకుల కేసు ఏమైంది? చివరకు ఈ మూడు జంటలు మళ్లీ కలిశాయా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. భార్య బాధితుల కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’, ‘ఎఫ్ 2’ లాంటి సినిమాలు చాలా మంచి విజయం సాధించాయి. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు రాలేదు. చాలా కాలం తర్వాత భార్య బాధితుల నేపథ్యంలో వచ్చిన చిత్రం పురుషః. ఓ రకంగా ఇది పెళ్లైన మగాడి బయోపిక్ అని చెప్పొచ్చు. భార్య భర్తల మధ్య గొడవలతో మొదలైన ఈ కథ చివరకు ‘భార్యల్ని యుద్దంతో కాదు.. ప్రేమతో గెలవాలి’ అనే సందేశంతో ముగుస్తుంది. సినిమా ప్రారంభంలోనే ముగ్గురు స్నేహితుల ఫ్యామిలో జరిగే గొడవలు.. కోర్టు కేసు సన్నివేశాలతో నవ్వులు పూయిస్తుంది. కోర్టులో విడాకుల కోసం వెళ్లిన ముగ్గురు స్నేహితలను అక్కడి న్యాయమూర్తి (వీటీవీ గణేష్) తన క్యాబిన్లోకి పిలుచుకొని వారి సమస్యలు ఏంటని అడగడంతో అసలు కథ మొదలవుతుంది. అయితే భర్తలు కష్టాలు.. భార్యలు చేసే టార్చర్ చూస్తున్నంతసేపు క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ఎఫ్ 2 లాంటి సినిమాలలోని కొన్ని సన్నివేశాలు మనకు గుర్తొస్తుంటాయి. ఫస్టాఫ్ అంతా భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ చేసే కామెడీతో సాగిపోతుంది.వెన్నెల కిషోర్ ఎంట్రీ తర్వాత కామెడీ మరింత పెరుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం ఎక్కువగా గోవింద్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. గోవింద్ ప్లాష్‌బ్యాక్, రోజీతో లవ్‌స్టోరీ కొంత సాగదీతగా అనిపిస్తుంది. ఇక గొడవ అయిన ప్రతిసారి భర్తలు సూపర్ హీరోలుగా మారి వారితో యుద్ధం చేస్తున్నట్లుగా వచ్చే కామెడీ సీన్స్ కూడా అంతగా నవ్వించవు. చివర్లో ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాని ప్రభావం కూడా అంతంత మాత్రమే.అయితే క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఊహించరు. కానీ, ఆ ట్వీస్ట్ రివీల్ అయిన తర్వాత గత సినిమాలు గుర్తుకు వస్తాయి. ముగింపు బాగుంటుంది. ఎవరెలా చేశారంటే..పవన్ కల్యాణ్ కి ఇదే తొలి సినిమా. అయినా కూడా చాలా బాగా నటించాడు. భార్య చేతిలో ఇబ్బంది పడే భర్తగా, ఫ్లాష్ బ్యాక్ లో నిజాయితీగా ప్రేమించే లవర్‌గా రెండు డిఫరెంట్ వేరియేషన్ చూపించి మెప్పించాడు. స ప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ ల కామెడీ సినిమాకు మరో ప్లస్ పాయింట్. వెన్నెల కిశోర్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో నవ్వించాడు. భార్యలుగా నటించిన రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. రాజీవ్ కనకాల, టీవీ గణేష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శ్రవణ్ భరద్వాజ్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. పాటలు జస్ట్ ఓకే. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్ లో కొన్ని సీన్స్ ను కట్ చేసి ఉంటే సినిమా మరింత వేగంగా ఉండేది. కళ్యాణ్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
పెద్ది ఐటమ్ సాంగ్.. 50 రోజులు కష్టపడ్డాం..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కనిపించనుంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంది. ఈ ప్రత్యేక పాటలో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్.. చెర్రీ సరసన కనిపించనుంది. తాజాగా ఈ పాట ప్రోమోను రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేశారు.తాజాగా ఈ పాటకు సంబంధించి గేయ రచయిత అనంత్ శ్రీరామ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ స్పెషల్ సాంగ్ కోసం 50 రోజులు కష్టపడ్డానని అన్నారు. ఈ పాటలోని ప్రతి పదం అర్థవంతంగా ఉంటుందని తెలిపారు. ఏఆర్ రెహమాన్ బాణీలు చాలా కొత్తగా ఉంటాయన్నారు. ఆయన బాణీలను అర్థం చేసుకోవడానికే కొన్ని రోజుల సమయం పడుతుందన్నారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ సమయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫుల్ సాంగ్ మే 23న విడుదల కానుంది.
క్రీడలు
ఉగ్రవాదితో షాహిద్ అఫ్రిది డిన్నర్!
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్తాన్లో ఉగ్రవాదిగా ముద్రపడిన ఉజైర్ బలోచ్‌తో కలిసి అఫ్రిది డిన్నర్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో క్రికెట్ అభిమానులు షాహిద్ అఫ్రిదిని ఏకిపారేస్తు న్నారు. జీషన్ అక్రమ్ మీర్జా అనే వ్యక్తి తన ‘ఎక్స్’ వేదికగా ఫొటోలను పంచుకున్నాడు.2013లో షాహిద్ అఫ్రిది ఒక ప్రైవేటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనట్లు తెలుస్తోంది. అదే కార్యక్రమానికి అప్పటి ల్యారీ గ్యాంగ్ నెట్‌వర్క్‌కు కీలక నాయకుడిగా ఉన్న ఉజైర్ బలోచ్ కూడా వచ్చాడని, ఈ సందర్భంగా ఉజైర్ బలోచ్ గ్యాంగ్‌తో కలిసి అఫ్రిది డిన్నర్లో పాల్గొన్నాడంటూ అభిమాని ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇక ల్యారీ గ్యాంగ్‌లో రెహమాన్ డెకాయిట్ తర్వాత రెండో అత్యున్నత పదవిలో కొనసాగిన ఉజైర్ బలోచ్ లక్షిత హత్యలు, దోపిడీలు, ముఠా హింస, మాదకద్రవ్యాల రవాణా, గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 2008 ముంబై ఉగ్రదాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరా చేయడంలో ఉజైర్ బలోచ్ కీలకపాత్ర పోషించాడని ఆరోపణలు ఉన్నాయి. 2016లో పాకిస్తాన్ ప్రభుత్వం ఉజైర్ బలోచ్‌ను అదుపులోకి తీసుకొని దేశంలో అత్యంత కరుడుగట్టిన నేరస్థులలో ఒకడిగా ముద్ర వేశారు. ఇటీవలే విడుదలైన బాలీవుడ్ చిత్రం ధురందర్లో ఉజైర్ బలోచ్ అనే పాత్రను భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదానికి సహకరించిన గ్యాంగ్‌స్టర్‌గా చూపించారు. అయితే తాజాగా షాహిద్ అఫ్రిది ఉగ్రవాదిగా ముద్రపడిన ఉజైర్ బలోచ్‌తో డిన్నర్లో పాల్గొన్న ఫొటోలు ప్రత్యక్షమవ్వడం వివాదానికి దారి తీసింది. పాక్ వ్యక్తులే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారనడానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.నిజానికి మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తన ప్రవర్తనతో ఎన్నోసార్లు అప్రతిష్ట పాలయ్యాడు. ఆటలో నైపుణ్యం సంగతి పక్కనబెడితే అతడు భారత్ వ్యతిరేకిగా ముద్రపడ్డాడు. ఈ పాక్ మాజీ కెప్టెన్ పదే పదే భారత్ సంస్కృతికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి ఉగ్రవాదాన్ని సమర్థించి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. బయట వివాదాలు ఎన్ని ఉన్నా ఆటలో మాత్రం షాహిద్ అఫ్రిది నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. పాక్ తరఫున అఫ్రిది 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా శతకం బాదిన తొలి బ్యాటర్‌గా (37 బంతుల్లో) అఫ్రిది ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2018లో అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు.Shahid Afridi and Uzair Baloch of PAC aka Lyari Gang pic.twitter.com/IxSg0rUPEM— Zeeshan Akram Mirza (@ZshanMirza) March 27, 2013చదవండి: గుజరాత్ ఓపెనర్‌కు అశ్విన్ చురకలు!
గుజరాత్ ఓపెనర్‌కు అశ్విన్ చురకలు!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ నిలకడ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లాడిన సాయి సుదర్శన్ 157 స్ట్రైక్‌రేట్‌తో 638 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో లీడింగ్‌లో కొనసాగుతున్నాడు. అయితే సాయి సుదర్శన్ ప్రదర్శన బాగానే ఉన్నప్పటికీ బ్యాటింగ్‌లో ఇంకా దూకుడు పెంచాల్సిన అవసరముందని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చురకలు అంటించాడు.ఐపీఎల్లో స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్నప్పటికీ ఆఖరి ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టడంలో సాయి సుదర్శన్ విఫలమవుతున్నాడని తెలిపాడు. అశ్విన్ మాట్లాడుతూ..'నేను శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్‌ను ప్రశంసించాలనుకుంటున్నా. గుజరాత్ టైటా న్స్ను అటు కెప్టెన్‌గా సమర్థంగా నడిపిస్తూనే బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో గిల్ పట్టుదలతో భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. కానీ సాయి సుదర్శన్ ప్రదర్శన మెచ్చుకునే రీతిలో ఉన్నప్పటికీ మోడ్రన్ టీ20 క్రికెట్‌కు సరిపోయేలా అతడు ఆడడం లేదు. సాయి సుదర్శన్ ఎక్కువగా సంప్రదాయబద్ధంగానే క్రికెట్ ఆడతాడు, కానీ ఇన్నింగ్స్ చివర్లో వేగంగా ఆడలేకపోతున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో బ్యాటింగ్‌లో వేగం పెంచితే మాత్రం సాయి సుదర్శన్‌కు తిరుగుండకపోవచ్చు. ఆరెంజ్ క్యాప్‌లో లీడింగ్‌లో ఉన్నప్పటికీ సాయి సుదర్శన్ తన ప్రదర్శనను చాలా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. అతడు దీనిని చేయగలడని ఆశిస్తున్నా. ఇక గిల్ బాగా ఆడుతున్నప్పటికీ తనలోని పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయలేదని నాకు అనిపిస్తోంది.' అంటూ చెప్పుకొచ్చాడు. గురువారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 89 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (84), కెప్టెన్ గిల్ (64) అర్థశతకాలతో రాణించారు. జాస్ బట్లర్ (57 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ 13.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. శివమ్ దూబే (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. మ్యాచ్‌లో ఓటమితో సీఎస్కే టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: ఆటగాళ్లకు అవమానం.. పాక్ జట్టులో సంక్షోభం!
ఆటగాళ్లకు అవమానం.. పాక్ జట్టులో సంక్షోభం!
పాకిస్తాన్ హాకీ జట్టు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ఎఫ్) నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు రాకపోగా తాజాగా మరో బాంబు పేల్చింది. రోజువారీ శిక్షణా శిబిర భత్యం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లకు శిక్షణా భత్యం కింద ఇస్తున్న 11 డాలర్లను(రూ. 3 వేలు) 3.5 డాలర్లకు (రూ. 335) తగ్గించడం గమనార్హం. దీంతో పాక్ ఆటగాళ్లు శిక్షణా శిబిరం భత్యం కింద ఇకపై కేవలం 335 రూపాయలు మాత్రమే అందుకోనున్నారు. ఇదే విషయమై పాక్ ఆటగాళ్లు తమకు న్యాయం చేయాలంటూ పీహెచ్ఎఫ్కు ఫిర్యాదు చేశారు. ‘ఈజిప్టులో మేము ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఆడుతున్న సమయంలోనే విదేశీ పర్యటనలకు మాకు రోజువారీ భత్యం 110 డాలర్లు ఇస్తామని వారు ప్రకటించారు. కానీ ఆ మొత్తం ఇప్పటివరకు మాకు అందలేదు. ఇప్పుడు శిక్షణా శిబిరం భత్యానికి సంబంధించి ఇచ్చే మొత్తాన్ని రూ.335కు కుదించడం దారుణం. దీనివల్ల మాకు ఒరిగేదేమిలేదు. ఆర్థిక నష్టాల పేరుతో మాకు వచ్చే అరకొర డబ్బులను కూడా ఇలా కుదింపు పేరుతో లాగేసుకోవడం దుశ్చర్య కిందకు వస్తుంది. తక్షణమే మాకు న్యాయం చేయాలి’ అని ఆటగాళ్లు పాకిస్తాన్ హాకీ సమాఖ్యకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్, బెల్జియం వేదికగా హాకీ ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 20 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించినప్పటికీ, కెప్టెన్ ఎవరన్న దానిపై మాత్రం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. గతేడాది నుంచి పాకిస్తాన్ హాకీ జట్టును షకీల్ అమ్మాద్ బట్ నడిపిస్తున్నాడు. ఎఫ్ఐహెచ్ ప్రొ మూడో దశ జూన్ 13 నుంచి 27 వరకు జరగనుంది. ఇందులో పాకిస్తాన్ బెల్జియం, స్పెయిన్, ఇంగ్లండ్‌తో పాటు చిరకాల ప్రత్యర్థి భారత్‌తోనూ తలపడనుంది. ఈ టోర్నీ ముగిసిన వెంటనే పాకిస్తాన్ హాకీ ప్రపంచకప్ ఆడనుంది.చదవండి: ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ.. వైభవ్‌కు ప్రమోషన్!
నువ్వొక పనికిమాలిన వ్యక్తివి: సారా టెండుల్కర్ ఫైర్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె టెండుల్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. సారా శరీరాకృతిని కించపరిచేలా ఓ పాపరాజీ ఆమె వీడియోకు చెత్త క్యాప్షన్ ఇచ్చాడు. ఇందుకు సారా దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది.అసలేం జరిగిందంటే.. సారా తమ్ముడు అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సారా, అర్జున్ భార్య సానియా చందోక్ అతడితో కలిసి ఎయిర్‌పోర్టులోకి వెళ్తున్నపుడు తాహిర్ జాసూస్ అనే పాపరాజీ వీడియో తీశాడు.లావుగా ఉన్న అమ్మాయి సారా అంటూ.. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘లావుగా ఉన్న అమ్మాయి సారా.. ఆ పక్కనే ఉన్నది ఆమె మరదలు’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన సారా అతడికి గట్టి కౌంటర్ ఇచ్చింది.నువ్వొక పనికిమాలిన వ్యక్తివి‘‘తాహిర్ జాసూస్.. నువ్వొక పనికిమాలిన వ్యక్తివి. ఇది నిజమైన జర్నలిజం కాదు. మమ్మల్ని ఇలా వదిలెయ్. ఇప్పుడు నువ్వు మా వీడియోను డిలీట్ చేయొచ్చు. కానీ నీ పనికిమాలినతనం మాత్రం ఎక్కడికీ పోదు’’ అని సారా చురకలు అంటించింది. ఈ నేపథ్యంలో సారాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘ఆడవాళ్లను బాడీ షేమింగ్ చేయడం అందరికీ బాగా అలవాటైపోయింది. అతడికి బాగా గడ్డిపెట్టావు. ఇకనైనా వేరే వాళ్ల గురించి ఇలాంటి చెత్త రాతలు రాసేముందు అతడికి ఇది గుర్తుకువస్తుంది’’ అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: అఫ్గన్ మహిళా క్రికెటర్ల కోసం కదిలిన ఈసీబీThis paparazzi body shamed Sara Tendulkar saying "moti wali sara hai or bagal wali bhabhi hai"Today, Sara Tendulkar brutally crushed this pap and said "you are disgusting, this is not "journalism" leave us Alone"This is the lowest level of media we saw! pic.twitter.com/63mCpSJ1eY— Chota Don (@choga_don) May 21, 2026
న్యూస్ పాడ్‌కాస్ట్
అమరావతిలో చంద్రబాబు లూటీ... అవినీతి, దోపిడీతో ఎప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు.
పాపాఘ్ని నదిలో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్‌లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్‌లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
బిజినెస్
నైకా లాభం.. నాలుగు రెట్లు
ప్రయివేట్ రంగ సంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్ వెంచర్స్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం నాలుగు రెట్లు జంప్‌చేసి రూ. 79 కోట్లకు చేరింది. సౌందర్య విభాగం అమ్మకాలు పుంజుకోవడం, ఫ్యాషన్ బిజినెస్ నష్టాలు తగ్గడం ఇందుకు సహకరించాయి. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 19 కోట్లు ఆర్జించింది.నైకా బ్రాండ్ ఈరిటైల్ కంపెనీ మొత్తం ఆదాయం సైతం 28 శాతం ఎగసి రూ. 2,648 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 2,062 కోట్ల టర్నోవర్ అందుకుంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నైకా నికర లాభం మూడు రెట్లు పెరిగి రూ. 204 కోట్లను తాకింది. 2024–25లో రూ. 72 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 7,950 కోట్ల నుంచి రూ. 10,022 కోట్లకు బలపడింది. సౌందర్య విభాగ ఆదాయం 26 శాతం ఎగసి రూ. 9,139 కోట్లను దాటింది.ఓ మహిళ 50 ఏళ్ల వయసులో ప్రారంభించిన బిజినెస్కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా దాదాపు 20 ఏళ్ల పాటు విజయవంతమైన కెరీర్‌ను కొనసాగించిన ఫాల్గునీ నాయర్ (Falguni Nayar), 2012లో తన 50 ఏళ్ల వయసులో ఆ ఉన్నత ఉద్యోగాన్ని వదిలేశారు. భారతదేశంలో విశ్వసనీయమైన బ్యూటీ రిటైలర్ అవసరమని గుర్తించి, ఎంతో రిస్క్‌తో కూడుకున్న నిర్ణయాన్ని తీసుకుంటూ 'నైకా' (FSN E-Commerce Ventures) సంస్థను స్థాపించారు. ఐఐఎం అహ్మదాబాద్‌లో చేసిన ఎంబీఏ చదువు, బ్యాంకింగ్ రంగంలో సంపాదించిన లోతైన మార్కెట్ అవగాహన ఆమె వ్యాపార విజయానికి బలమైన పునాదిగా నిలిచాయి.నైకా మొదట ఆన్లైన్ బ్యూటీ స్టోర్‌గా ప్రారంభమైనప్పటికీ.. మార్కెట్లో నకిలీ ఉత్పత్తులు ఎక్కువగా ఉన్న కాలంలో "100% ఒరిజినల్" అనే హామీతో వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంది. ఇన్ఫ్లూయెన్సర్ల ప్రమోషన్లు, ట్యూటోరియల్స్, రివ్యూల వంటి 'కంటెంట్ + కామర్స్' వ్యూహంతో కస్టమర్లను ఆకర్షిస్తూ దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ స్టోర్స్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 'నైకా ఫ్యాషన్' పేరుతో దుస్తులు, యాక్సెసరీల రంగంలోకి కూడా వ్యాపారాన్ని విజయవంతంగా విస్తరించింది.2021లో నైకా ఐపీఓ (IPO) భారత మార్కెట్లో ఒక సరికొత్త రికార్డు సృష్టించడంతో, ఫాల్గునీ నాయర్ భారతదేశంలోనే స్వయంకృషితో బిలియనీర్ అయిన ఇద్దరు మహిళల్లో ఒకరిగా నిలిచారు. సాంప్రదాయకంగా పురుషుల ఆధిపత్యం ఉన్న వ్యాపార రంగంలో బిలియన్ డాలర్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆమె కథ.. సొంత కలలను నిజం చేసుకోవడానికి వయసు ఎప్పటికీ అడ్డంకి కాదని నిరూపిస్తూ ఎంతోమందికి, ముఖ్యంగా మహిళలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.
మోదీ గిఫ్ట్.. 'మెలొడీ' పెంపునకు సిద్ధం!
ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీకి ప్రధాని నరేంద్ర మోదీ ’మెలొడీ’ టాఫీలను బహుకరించడం వైరల్ కావడంతో వాటికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీనితో ఉత్పత్తిని కూడా పెంచుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు పార్లే ప్రోడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా తెలిపారు. బ్రాండ్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ప్రచార కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు.స్వదేశీ బ్రాండ్ వృద్ధి చెందేందుకు మోదీ ఒక చక్కని అవకాశం కల్పించారన్నారు. వివిధ మాధ్యమాల ద్వారా మెలొడీని మరింత ప్రాచుర్యంలోకి తేవడంపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. మెలొడీ ప్రస్తుతం దాదాపు 100 దేశాల్లో అందుబాటులో ఉన్నట్లు వివరించారు. పంపిణీదారుల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ బట్టి చూస్తుంటే మెలొడీకి వినియోగదారుల్లో డిమాండ్ అనూహ్య స్థాయిలో భారీగా పెరిగినట్లు తెలుస్తోందన్నారు.
సెబీలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్: ఎవరికి.. ఎన్ని రోజులు?
దేశంలో ఇంధన పొదుపును ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునకు కార్పొరేట్, ప్రభుత్వ రంగాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ప్రధాని విజ్ఞప్తి చేసిన పక్షం రోజుల వ్యవధిలోనే, ప్రముఖ మార్కెట్ రెగ్యులేటర్ ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ (SEBI) తమ జూనియర్ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, గ్రేడ్ 'ఎ' నుండి గ్రేడ్ 'సి' వరకు ఉన్న ఉద్యోగులకు వారానికి ఒక రోజు ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని సెబీ కల్పించినట్లు 'ఎన్డీటీవీ ప్రాఫిట్' పేర్కొంది. ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన అంతర్జాతీయ ఇంధన ద్రవ్యోల్బణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, తాత్కాలిక చర్యల్లో భాగంగా సెబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇంధన పరిరక్షణ చొరవలో భాగంగా సెబీ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇందులో భాగంగా అంతర్గతంగా నిర్వహించే పలు కార్యక్రమాలను వాయిదా వేయాలని భావిస్తోంది. ఉద్యోగుల అనవసర ప్రయాణాలను, హోటల్ బస ఖర్చులను గణనీయంగా తగ్గించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.కేవలం ప్రభుత్వ రంగానికి చెందిన సెబీ మాత్రమే కాకుండా, దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాలు సైతం ప్రధాని పిలుపునకు మద్దతుగా నిలుస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) ట్రెజరీ కార్యకలాపాలు, క్రెడిట్ అండర్ రైటింగ్, రిస్క్ మేనేజ్మెంట్, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ సేవలు వంటి కీలక విభాగాల్లోని ఎంపిక చేసిన సిబ్బందికి వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించింది. అలాగే హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ (HDFC Securities) కూడా ఇప్పటికే తమ ఉద్యోగుల కోసం 'హైబ్రిడ్ వర్కింగ్ మోడల్'ను అమలుల్లోకి తెచ్చింది.
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 326.42 పాయింట్లు లేదా 0.43 శాతం లాభంతో 75,509.78 వద్ద, నిఫ్టీ 64.60 పాయింట్లు లేదా 0.27 శాతం లాభంతో 23,719.30 వద్ద నిలిచాయి.జాన్ కాకరిల్ ఇండియా లిమిటెడ్, మనాలి పెట్రోకెమికల్స్ లిమిటెడ్, టాల్బ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ లిమిటెడ్, ట్రాన్స్‌వారంటీ ఫైనాన్స్ లిమిటెడ్, బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎస్ఎమ్ఎస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్, గణేశ ఎకోస్ఫియర్ లిమిటెడ్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, ఎస్.కె.ఎం. ఎగ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ (ఇండియా) లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
ఫ్యామిలీ
కిమ్ కర్దాషియాన్:'రోజుకు 35 సప్లిమెంట్లు తీసుకుంటా'
అమెరికన్ రియాలిటీ టెలివిజన్ స్టార్, మోడల్, బిలియనీర్ కిమ్ కర్దాషియాన్ రోజకు 35 సప్లిమెంట్లు తీసుకుంటుందట. వాటిని రోజుకు మూడుసార్లుగా విభజించుకుని మరి తీసుకుంటానని ఇటీవల అమీ పోలర్ పోడ్కాస్ట్లో పాల్గొన్నప్పుడు ఆమెనే స్వయంగా తెలిపింది. దీని కారణంగా 'పిల్ ఫెటీగ్' (మాత్రల అలసట)తో బాధపడుతున్నానని కూడా తెలిపింది. అయితే ఆ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోలేక కొన్నాళ్లు ఆపేసినట్లు తెలిపింది. అయితే కొద్దిరోజుల్లనే మళ్లీ మొదలుపెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రతిరోజూ ఈ మందులను నేరుగా శరీరంలోకి ఎక్కించుకునేలా ఐవీ డ్రిప్ ఉంటే బాగుండును ప్రతిసారి వర్క్టైంలో గుర్తుపెట్టుకుని వేసుకోలేక అవస్థ పడుతున్నా అని బాధగా చెబుతుంది. అసలు నిజంగా ఒక మనిషి ఇన్ని సప్లిమెంట్లు తీసుకోవచ్చా? ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదా? అంటే..సప్లిమెంట్లు అదనపు పోషణను అందించి, పోషకాహార లోపాలను భర్తీచేయడంలో సహాయపడినప్పటికీ, రోజుకు 35 సప్లిమెంట్లు అంటే.. సురక్షితం కాదనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకవేళ అధికంగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి తీవ్రమైన హాని అని, అవయవాలు దెబ్బతినొచ్చు లేదా జీర్ణ సమస్యలు, కణజాలంలో విషపదార్థాలు పేరుకుపోవడం వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.సప్లిమెంట్లు ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రత్యామ్నాయం కాదని నొక్కి చెబుతున్నారు. ఇవి కేవలం పోషకాహార లోపాలకు చికిత్స చేయడానికి, ఇతర వ్యాధులకు , అనారోగ్య సమస్యల నుంచి బయపడటానికి ఉపయోగపడతాయని అన్నారు. ముఖ్యంగా శరీరం కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె లను నిల్వ చేసుకోగల సామర్థ్యం కారణంగా, వాటిని అధికంగా తీసుకుంటే చాలా ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. అంతేకాకుండా, కొన్ని సప్లిమెంట్లను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయానికి నష్టం, మూత్రపిండాల్లో రాళ్లు, జీర్ణ సమస్యలు, నరాల దెబ్బతినడం, ఔషధాల మధ్య ప్రతిచర్యలు తదితరాలు సంభవిస్తాయని అన్నారు. ఇదేదో ట్రెండ్‌లా లేదా సెలబ్రిటీలు వాడుతున్నారనో అస్సలు తీసుకోవద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు నిపుణులు. సప్లిమెంట్లను అధికంగా తీసుకుంటే వచ్చే ఆరోగ్య ప్రమాదాలు1. విటమిన్ విషప్రభావం (విటమిన్ టాక్సిసిటీ)అధిక మోతాదు తీసుకోవడం వల్ల మూత్రపిండాల దెబ్బతినడం, కాలేయం దెబ్బతినడం, కడుపునొప్పి, విరేచనాలు, నరాల దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.2. ఖనిజాల అధిక భారం (మినరల్ ఓవర్‌లోడ్)విటమిన్ల మాదిరిగానే, ఖనిజాల అధిక భారం కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు, సప్లిమెంట్ల రూపంలో తీసుకునే అదనపు ఐరన్ తీవ్రమైన జీర్ణాశయ సంబంధిత సమస్యలను కలిగించి, కాలక్రమేణా కాలేయాన్ని దెబ్బతీస్తుంది.ప్రమాదకరమైన ఔషధ రియాక్షన్ (డ్రగ్ ఇంటరాక్షన్స్)సప్లిమెంట్లు శరీరం మందులను ప్రాసెస్ చేసే విధానాన్ని మార్చగలవు. ఉదాహరణకు, విటమిన్ కె రక్తాన్ని పల్చబరిచే మందుల (బ్లడ్ థిన్నర్స్) ప్రభావాన్ని తగ్గిస్తుంది, దీనివల్ల పక్షవాతం (స్ట్రోక్) వచ్చే ప్రమాదం పెరుగుతుంది.అధిక వినియోగంబ్రేక్ఫాస్ట్ సెరియల్స్, ఎనర్జీ బార్లు, జ్యూస్‌ల వంటి అనేక రోజువారీ ప్రాసెస్ చేసిన ఆహారాలలో విటమిన్లను అధికంగా కలుపుతారు. రోజువారీ మల్టీవిటమిన్ల తోపాటు నిర్దిష్ట లక్షిత సప్లిమెంట్లు తీసుకుంటే మాత్రం తెలియకుండానే అధికంగా తీసుకునే ప్రమాదం ఉంటుందటపరిగణించవలసిన భద్రతా చిట్కాలుఏ రకమైన ఆహార సప్లిమెంట్లు అయినా వాడే ముందు వైద్యుల పర్యవేక్షణ, సలహాలు, సూచనలతో తీసుకోవాలి. అలాగే మనం వాడే సప్లిమెంట్లు మంచి నమ్మదగిన బ్రాండ్వేనా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏదైనా సప్లిమెంట్ వాడుతున్నప్పుడు వికారం, కడుపు నొప్పి, కామెర్లు, గుండె దడ లేదా అలసట వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. తక్షణమే వైద్యులను సంప్రదించి వాడొచ్చో లేదా నిర్థారించుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తి గత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, నో ప్రిజర్వేటివ్స్..! ఈ బామ్మ చేసే ఐస్‌క్రీమ్‌కి ఫిదా అవ్వాల్సిందే..)
బామ్మ చేతి ఐస్‌క్రీమ్ ..! తయారీ నుంచి..
రోజురోజుకి ఎండలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలిసిందే. ఈ ఉక్కపోతలకి నోట్లోకి చల్లగా ఐస్‌క్రీమ్ వెళ్తే ఉంటుంది.. ఆ ఆనందం మాటలకందనిది. అందుకే ఈ కాలంలో చిన్న, పెద్ద అంతా ఐస్‌క్రీమ్‌లు తినేందుకు మక్కువ చూపిస్తుంటారు. అలాంటి టేస్టీ.. టేస్టీ.. కూల్ కూల్ ఐస్‌క్రీమ్‌లను ఈ బామ్మ తన ఇంట్లోనే స్వయంగా తయారు చేసి అందిస్తోంది. అత్యంత సహజసిద్ధమైన వాటితో ఎలాంటి యంత్రాలను ఉపయోగించుకుండా రుచికరమైన హోమ్మేడ్ ఐస్‌క్రీమ్‌లు అందిస్తోంది. దశాబ్దాలుగా ఆమె ఇలానే కొనసాగించడం విశేషం. ఆమె అందించే ఈ రుచికరమైన ఐస్‌క్రీమ్‌లు అనతి కాలంలోనే మంచి బ్రాండ్‌గా స్థిరపడిపోయింది. ఎవరా బామ్మ? ఏమా కథ చూద్దామా..!.అహ్మదాబాద్‌కి చెందిన నిరంజన్ దేశాయ్ ఇంట్లోనే ఐసీక్రీమ్లు తయారు చేయడంలో నైపుణ్యం సాధించారామె. అంతా నిరూబెన్ అని ముద్దుగా పిలుచుకునే ఈ బామ్మ తన వంటగదిలోనే తొలిసారిగా ఐస్‌క్రీమ్ తయారు చేశారట. ఏ ఇతర బ్రాండ్లు ఆ బామ్మ తయారు చేసే ఐస్‌క్రీమ్ రుచికి సరితూగదట. ఆమె మామిడి, సీతాపలం, కొబ్బరి-అల్లం నిమ్మకాయ వంటి ప్లేవర్లలో కృత్రిమ రుచుల్లో ఎలాంటి ప్రిజర్వేటివ్‌లు ఉపయోగించకుండా తయారు చేయడం ఈ బామ్మ ప్రత్యేకత. అంతేగాదు ఈ బామ్మ తాజాపాలు, మీగడ, స్టీవియా, పండ్లు లేదా డ్రైఫ్రూట్స్ వంటి నాలుగు సాధారణ పదార్థాలనే ఆమె ఉయోగిస్తారు. ఆమె తన ఐస్‌క్రీమ్ వ్యాపారాన్ని 1986లో ప్రారంభించింది. సాధారణ స్టవ్‌పై తయారైన ఆ వ్యాపారం దశాబ్దాలు గడిచేకొద్ది చిన్నపాటి సాంప్రదాయ కొలిమితో కూడిన పత్యేక గదిలో ఐస్‌క్రీమ్‌లు తయారు చేయడం ప్రారంభించారు. వాణిజ్య బ్రాండ్లు సాధారణంగా ఉపయోగించే పెద్ద పారిశ్రామిక యంత్రాలపై ఆధారపడకుండా సాంప్రదాయ పద్ధతిలోనే డెజర్ట్‌లను తయారు చేస్తుంది ఈ బామ్మ బృందం. అలాగే తన ఐస్‌క్రీం రుచిని కాపాడుకోవడం కోసం ప్రతి రోజు లిమిటెడ్గానే ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తుంటారు. ఆ నేపథ్యంలోనే ఈ బామ్మ ఐస్‌క్రీమ్ ఓ ప్రసిద్ధ బ్రాండ్‌గా స్థిరపడటమే కాదు బల్క్ నుంచి టేక్ అవే ఆర్డర్ల అందించే స్థాయికి చేరువైంది. మొదటగా గులాబీ-కొబ్బరి, మిరియాలు, చాక్లెట్, బాదం, పిస్తా, కేసర్, యాలకులు వంటి రుచులతో ప్రారంభమైన ఈ నిరుబెన్ బామ్మ దుకాణం ప్రస్తుతం దాదాపు 27 రకాలా వైవిధ్యభరితమైన ఐస్‌క్రీమ్‌లను అందిస్తుంది. అయితే ఈ బామ్మ వయసు పైబడటంతో కొన్ని రకాల పదార్థాలను సేకరించడం కష్టంగా మారి కొన్ని రకాలా ఐస్‌క్రీమ్‌ల తయారీని నిలిపివేసినప్పటికీ..కస్టమర్లు ఇష్టంగా ఆస్వాదించే కొన్ని రకాల హోమ్మేడ్ ఐస్‌క్రీమ్‌లను మాత్రం ఇప్పటికీ అందిస్తోంది. తన కాళ్లపై తాను నిలబడాలన్న తాపత్రయం ఉంటే.. ఎంత సవాలుతో కూడిన పనులైనా సునాయాసంగా జయిస్తూ ముందుకు సాగిపోతారనేందుకు ఈ బామ్మే ఉదాహరణ కదూ..!. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: కేన్స్ రెడ్‌కార్పెట్‌పై పటోలా గౌనులో మెరిసిన మౌనీరాయ్..!)
మహిళా సాధికారతకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా “మహిళా వారోత్సవాలు” నిర్వహించనుంది. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, సంస్థలు, యువతులు, బాలికలు, దివ్యాంగులు, వృద్దులు తో సహా అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యులను చేస్తూ వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేపట్టనున్నారు.ఈ కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన, జీవనోపాధుల విస్తరణ, సామాజిక భద్రత, ఆరోగ్యం, భద్రత, మౌలిక వసతుల అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రారంభోత్సవాలు, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్, రుణమేళాలు నిర్వహించనున్నారు.ప్రత్యేకంగా మే 29న హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వెత్తల కోసం ఇంక్యుబేటర్ ప్రోగ్రాం ప్రారంభం, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమం నిర్వహించనుండటం ఈ వారోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఆర్థిక అవకాశాలు విస్తరించే దిశగా ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలుస్తుంది.మహిళా సంఘాలను కేవలం పొదుపు సమూహాలుగా కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఉత్పాదక శక్తులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలకు బ్యాంకు రుణాలు, జీవనోపాధి యూనిట్లు, సూక్ష్మ పరిశ్రమలు, వ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు వంటి అవకాశాలను గ్రామ స్థాయికే తీసుకెళ్తున్నామని చెప్పారు. మహిళల చేతుల్లో ఆదాయం పెరిగితే కుటుంబాలు బలపడటమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. మహిళా వారోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రతి కార్యక్రమం మహిళల ఆర్థిక స్వావలంబన, భద్రత, నాయకత్వ వికాసానికి దోహదపడేలా రూపొందించామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.కాగా, ప్రజా పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళా సంఘాలను కీలక శక్తిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ఈ వారోత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. (చదవండి: కేన్స్ రెడ్‌కార్పెట్‌పై పటోలా గౌనులో మెరిసిన మౌనీరాయ్..! ఏకంగా 300 గంటలు..)
ఛాయ్ చటుక్కున తాగరా భాయ్..!
అలసిన క్షణాన అందరికీ గుర్తుకొచ్చేది చాయ్.. అందుకే ప్రతీ ఇంట్లో ప్రతీ రోజు ఉయదం చాయ్ ఉండాల్సిందే. ప్రయాణం ముగిసిన వెంటనే.. స్నేహితులు కలిసిన వెంటనే.. ఎవరైనా ఇంటికొచ్చిన వెంటనే అడిగే మొదటి ప్రశ్న చాయ్ తాగుతారా.. అని. అంత‘టీ’ ప్రాధాన్యత కలిగిన చాయ్‌కూ ఓ రోజుంది. 2005 నుంచి ప్రతీ ఏడాది మే 21న అంతర్జాతీయ ‘టీ’ దినోత్సవం నిర్వహిస్తున్నారు.కౌటాల: తాగాల్సిందే టీ.. పొద్దునో టీ.. సాయంత్రమో టీ.. దోస్తులతో టీ.. చుట్టాలతో టీ.. పని ఆపి ఒక టీ.. పనయ్యాకో టీ.. అని టీ ప్రియులు అంటున్నారు. చెమటలు కక్కే వేడిలో పొగలుకక్కే చాయ్ తాగాల్సిందే. ఛాయ్ చటుక్కున తాగరా భాయ్.. ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్.. ఛాయ్ ఖు షీలనే చూపుఆ భాయ్ అంటూ చాయ్ చమక్కుల ను .. చాయ్ కలిగించే కిక్కులను పేద, ధనిక వ్య త్యాసం లేకుండా ఆస్వాధిస్తుంటారు. ఎంత పేదలైనా ఇంటికి వెళ్లామంటే.. ఓ గాస్లు మంచినీళ్లు, కప్పు టీ ఇవ్వాల్సిందే. ఇది అనాదిగా ఉన్న అలవాటు. 1793 నుంచే.. ఎంతో చరిత్ర కలిగిన టీని తేనీరు, చా అని పిలుస్తారు.. దైనందిన కార్యక్రమాలు టీతోనే మొదలువుతున్నాయంటే ఆశ్చర్యం కాదు. 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచానికి టీ పరిచయం అయింది. మొట్ట మొదటిసారిగా మనదేశంలో 1793లో కలకత్తాలోని బొటానికల్ గార్డెన్లో లార్డ్ మెకార్డినీ టీ మొక్కలు పెంచడం ప్రారంభించాడు. మెల్లమెల్లగా మన దేశంలో తేనీరు సేవించడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఇంటింటి టీ చేరింది. ప్రపంచ టీ ఉత్పత్తిలో చైనా తర్వాతి స్థానం భారత్‌దే. అంతర్జాతీయంగా 30 శాతం టీ పొడిని ఒక్క భారతీయులే వాడేస్తున్నారు. టీ తోనే రోజు మొదలుప్రతీ రోజూ ఉదయం పొద్దునే న్యూస్ పేపర్ చదడం అలవాటు. అదికూడా చాయ్ తాగుతానే.. చాయ్ లేదంటే పేపర్ చదవడం కూడా ఇష్టం ఉండదు. సమావేశాలు, సభలకు వెళ్లిన ప్రతీ చోట టీ తప్పనిసరిగా ఇస్తున్నారు. స్నేహితులు కలిసి ప్రతిసారి టీ తాగుతుంటాం. – మోర్లె పాండురంగ్, కన్నెపల్లి
అంతర్జాతీయం
భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్!
భారత పర్యటనకు ముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రూబియో స్పష్టం చేశారు. "భారత్‌కు మాకు ఒక గొప్ప మిత్రదేశం. ఎన్నో ఏళ్లగా ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. భారత్‌లో అడుగుపెట్టేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను.ఈ పర్యటన మాకు అత్యంత కీలకం. విదేశాంగ మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా మొదటి సమావేశం క్వాడ్ కూటమితోనే జరిగింది. ఇప్పుడు ఆ సమావేశాన్ని భారత్‌లో నిర్వహించబోతుండటం సంతోషంగా ఉంది. ఈ ఏడాది చివర్లో మరోసారి క్వాడ్ సమావేశం నిర్వహించనున్నాము. అయితే భారత్ ఎంత పరిమాణంలో ఇందనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే.. అంత మొత్తంలో విక్రయించడానికి మేము సిద్దంగా ఉన్నాము. న్యూఢిల్లీ మా 'పోర్ట్‌ఫోలియోలో ఒక పెద్ద భాగంగా' ఉండాలని కోరుకుంటోందని" మార్కో రూబియో గురువారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.అదేవిధంగా పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌కు ఇంధన భద్రత కల్పించడంపై ఈ పర్యటనలో ప్రధానంగా చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా రూబియో మే 23న భారత్‌కు చేరుకోనున్నారు. తొలుత కోల్‌కతాలో మదర్ థెరిస్సా మిషనరీస్ ఆఫ్ చారిటీస్‌ను ఆయన సందర్శిస్తారు. నంతరం ఆగ్రా, జైపూర్లను సందర్శించి.. న్యూఢిల్లీ చేరుకుంటారు.
ఢిల్లీలో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
వరుసగా ఎయిరిండియా విమానాల్లో చోటుచేసుకుంటోన్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. గురువారం ఒక్క రోజే రెండు ఎయిరిండియా విమానాలకు భారీ ప్రమాదం తప్పింది. తొలుత ఢిల్లీ నుంచి వచ్చిన విమానం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుండగా దాని తోక భాగం రన్‌వేను బలంగా తాకింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విమానంలో 186 మంది ఉన్నారు.అనంతరం బెంగళూరు నుంచి ఢిల్లీ వస్తున్న మరో ఎయిరిండియా విమానం గురువారం సాయంత్రం ఢిల్లీఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం రన్‌వేకు సమీపిస్తున్న సమయంలో, ఒక ఇంజిన్‌లో మంటలు వచ్చినట్లు కాక్‌పిట్ సిబ్బందికి అలర్ట్ వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆ సిగ్నల్‌ను క్రాస్ చెక్ చేసుకోగా, ఇంజిన్‌లో మంటలు రావడం నిజమేనని నిర్ధారణ అయింది.పైలట్లు వెంటనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను అప్రమత్తం చేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. తక్షణమే అత్యవసర నియమావళిని (SOP) అమలు చేస్తూ విమానాన్ని రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో విమానంలో ఉన్న ఉన్న ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ఆగిన తర్వాత ప్రయాణికులను ఎమర్జెన్సీ విండో ద్వారా కిందకు దించారు. ఈ ఘటనపై డీజీసీఏ (DGCA) పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది.
ట్రంప్ షేర్ లావాదేవీల కలకలం.. వైట్‌హౌస్‌ను కుదిపేస్తున్న వివాదం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారీ వివాదంలో చిక్కుకున్నారు. రోజుకు రెండు, మూడు సార్లు షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే సాధారణ ఇన్వెస్టర్లకంటే భిన్నంగా, ట్రంప్ వైట్‌హౌస్‌లో కూర్చొని రోజుకు సగటున 40 సార్లు ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలు ఇప్పుడు అమెరికా రాజకీయ, ఆర్థిక వర్గాలను కుదిపేస్తున్నాయి. కేవలం 90 రోజుల్లోనే 3,700కు పైగా షేర్ లావాదేవీలు జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది.Bloomberg నివేదికల ప్రకారం, 2026 జనవరి నుంచి మార్చి మధ్య ట్రంప్ లేదా ఆయన సలహాదారులు భారీ స్థాయిలో షేర్ల కొనుగోలు, అమ్మకాల లావాదేవీలు నిర్వహించారు. ముఖ్యంగా Microsoft, NVIDIA, Oracle, Boeing, Amazon, Meta వంటి దిగ్గజ కంపెనీల్లో కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్క ఫిబ్రవరి 10న మాత్రమే మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ షేర్లను 5 మిలియన్ నుంచి 25 మిలియన్ డాలర్ల వరకు అమ్మినట్లు సమాచారం.అధ్యక్షుడా? హెడ్జ్ ఫండ్ బాసా? ఈ స్థాయి ట్రేడింగ్ చూసి వాల్ స్ట్రీట్ నిపుణులే ఆశ్చర్యానికి గురయ్యారు. అమెరికా ప్రభుత్వ నైతిక ప్రమాణాల కార్యాలయానికి సమర్పించిన వందల పేజీల ఆర్థిక వివరాలు ఈ వ్యవహారాన్ని బయటపెట్టాయి. పలువురు మార్కెట్ నిపుణులు ఇది సాధారణ వ్యక్తిగత పెట్టుబడి ఖాతా లాగా కనిపించడం లేదని, భారీ అల్గోరిథమిక్ ట్రేడింగ్ నిర్వహించే హెడ్జ్ ఫండ్ తరహాలో ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.అయితే అసలు వివాదం ఇక్కడి నుంచే మొదలైంది. ఒక దేశాధ్యక్షుడు ప్రభుత్వ విధానాలతో నేరుగా ప్రభావితమయ్యే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ఎంతవరకు సమంజసం? అన్న ప్రశ్న ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉదాహరణకు NVIDIA సంస్థ చైనాకు ఏఐ చిప్‌లు ఎగుమతి చేయాలంటే అమెరికా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అలాగే బోయింగ్ కంపెనీ ప్రభుత్వ రక్షణ ఒప్పందాలపై ఆధారపడి ఉంటుంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి కంపెనీలపై ప్రభుత్వం యాంటీ ట్రస్ట్ విచారణలు, ఏఐ నియంత్రణలపై నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒకవైపు ప్రభుత్వ విధానాలు రూపొందిస్తూ, మరోవైపు అదే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం “కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్” కిందికి వస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గత అమెరికా అధ్యక్షులు George H. W. Bush, Bill Clinton తమ ఆస్తులను “బ్లైండ్ ట్రస్ట్”లలో ఉంచి ఇలాంటి ఆరోపణలకు తావివ్వకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ట్రంప్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ సంస్థల నిర్వహణలో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర కొనసాగుతోందని, కొన్ని ఆర్థిక దాఖలాల్లో ఆలస్యానికి జరిమానాలు కూడా చెల్లించారని సమాచారం.ఆటోమేటెడ్ అల్గోరిథమ్స్ ద్వారా జరిగిందా? ఇంత భారీ స్థాయిలో ట్రేడింగ్ సాధ్యమా? లేదంటే ఆటోమేటెడ్ అల్గోరిథమ్స్ ద్వారా జరిగిందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఇది పూర్తిగా అల్గోరిథమిక్ ట్రేడింగ్ అని నిరూపించే ఆధారాలు లేవని తెలుస్తోంది. అయినప్పటికీ, కేవలం మూడు నెలల్లో వేల లావాదేవీలు జరగడం అమెరికా మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.ఈ వివాదానికి మరింత ఊపిరి పోసింది ఇరాన్ అంశం. ఇరాన్‌తో చర్చలు పురోగమిస్తున్నాయని ట్రంప్ ప్రకటించే ముందు కొందరు ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో ఫ్యూచర్స్ మార్కెట్లో బెట్టింగ్ పెట్టారని సమాచారం. ట్రంప్ ప్రకటన తర్వాత చమురు ధరలు పడిపోగా, అమెరికా మార్కెట్లు భారీగా ఎగిశాయి. ఈ టైమింగ్ అనుమానాలకు తావిచ్చినా, ట్రంప్‌కు నేరుగా సంబంధం ఉందని నిరూపించే ఆధారాలు లేవు.ఇదిలా ఉండగా ట్రంప్ అల్లుడు Jared Kushner పేరు కూడా ఈ చర్చల్లో వినిపిస్తోంది. మధ్యప్రాచ్య దేశాలతో దౌత్య చర్చలు జరుపుతూనే, గల్ఫ్ పెట్టుబడిదారులతో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయన సంస్థ Affinity Partners సౌదీ అరేబియా సహా గల్ఫ్ సంపద నిధులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.అయితే వైట్ హౌస్ ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. ట్రంప్ పెట్టుబడులను స్వతంత్ర ఆర్థిక సంస్థలే నిర్వహిస్తున్నాయని, ఆయన గానీ, కుటుంబ సభ్యులు గానీ నేరుగా ట్రేడింగ్‌లో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, ఒక అమెరికా అధ్యక్షుడు ప్రభుత్వ నిర్ణయాలతో ప్రభావితమయ్యే కంపెనీల్లో ఈ స్థాయిలో దూకుడుగా ట్రేడింగ్ చేయడం నైతికంగా సరైనదేనా? అన్న ప్రశ్న మాత్రం అమెరికాలో పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తోంది. - వెబ్ డెస్క్
అది దేశం దాటివెళ్తే మన సంగతి అంతే: ఇరాన్
టెహ్రాన్: ఇరాన్, అమెరికా మధ్య దౌత్య చర్చలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శుద్ధిచేసిన యురేనియం నిల్వలు దేశం బయటకు వెళ్లకూడదని ఆదేశించినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. శుద్ధి చేసిన యురేనియాన్ని ఇరాన్ వదులుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కీలక డిమాండ్‌ను ఇరాన్ మొదటి నుంచి నిరాకరిస్తోంది.అణ్వాయుధ తయారీలో కీలక భాగమైన శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పూర్తిగా ఇస్లామిక్ రిపబ్లిక్ నుంచి బయటకు తరలిస్తామని ట్రంప్ గతంలో ఇజ్రాయెల్‌కు హామీ ఇచ్చారని ఇజ్రాయెల్ అధికారులు రాయిటర్స్‌కు తెలిపారు.ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కఠిన వైఖరిని కొనసాగిస్తున్నారు. శుద్ధి చేసిన యురేనియాన్ని పూర్తిగా ఇరాన్ అధీనంలో లేకుండా చేసేవరకు, ప్రాంతీయ ప్రాక్సీ మిలీషియాలకు టెహ్రాన్ ఆర్థిక, సామగ్రి సహాయం పూర్తిగా ఆపే వరకు వెనక్కి తగ్గబోమన్నారు. అలాగే, ఆ దేశ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసే వరకు యుద్ధ విరమణపై ఆలోచించబోమని ఆయన స్పష్టం చేశారు.అయితే ఈ వైఖరికి టెహ్రాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అత్యంత సున్నితమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా పేరు వెల్లడించకుండా మీడియాతో మాట్లాడారు ఇరాన్ వర్గాలకు చెందిన ఓ ప్రతినిధి. “సుప్రీం లీడర్ ఆదేశం స్పష్టంగా ఉంది. శుద్ధిచేసిన యురేనియం నిల్వలు దేశం బయటకు వెళ్లకూడదన్నారు” అని తెలిపారు.అదే వర్గాలు మరో విషయం వెల్లడించాయి. ఈ పదార్థాన్ని విదేశాలకు పంపితే తమ దేశ భద్రత తీవ్రంగా బలహీనపడుతుందని, భవిష్యత్తులో వాషింగ్టన్, టెల్ అవీవ్ నుంచి సైనిక దాడులను ఎదుర్కోలేదని చెప్పాయి. ఇరాన్ అగ్ర పరిపాలనా, సైనిక వర్గాలు ఈ విధంగానే భావిస్తున్నాయి. ఇరాన్ రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం కీలక ప్రభుత్వ విధానాలపై తుది అధికారం సుప్రీం లీడర్ చేతుల్లోనే ఉంటుందని రాయిటర్స్ తెలిపింది.అమెరికా దాడులు చేయనుందా? ఇరాన్ సీనియర్ వర్గాల సమాచారం ప్రకారం.. టెహ్రాన్ రాజకీయ వ్యవస్థలో తీవ్ర అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం యుద్ధ తీవ్రత పూర్తిగా తగ్గినట్టుగా చూపడం అమెరికా వ్యూహాత్మక మోసమని, తప్పుడు రీతిలో భద్రతాభావం కలిగించి మళ్లీ వైమానిక దాడులు ప్రారంభించాలన్న యత్నమని చాలామంది భావిస్తున్నారు.ఈ భయాలకు బలం చేకూర్చుతూ ఇరాన్ ప్రధాన శాంతి చర్చల ప్రతినిధి బాక్వెర్ తాజాగా మాట్లాడుతూ.. “శత్రువు బహిరంగ, రహస్య కదలికలు చూస్తే అమెరికా సైన్యం కొత్త దాడుల సన్నాహాల్లో ఉందని స్పష్టమవుతోంది” అన్నారు.ఇదిలా ఉండగా, సమగ్ర శాంతి ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయకపోతే ఆ దేశంపై మరోసారి సైనిక దాడులు ప్రారంభించేందుకు అమెరికా పూర్తిగా సిద్ధంగా ఉందని ట్రంప్ బుధవారం ప్రకటించారు. అయితే సరైన సమాధానాలు రావడానికి కొన్ని రోజుల గడువు ఇస్తామన్న సంకేతం ఇచ్చారు.
జాతీయం
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18న పెద్దల సభకు ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అదే రోజున ఫలితాలుంటాయి. దేశవ్యాప్తంగా 24 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఏపీలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.నామినేషన్ దాఖలుకు జూన్ 8 చివరితేదీ కాగా జూన్9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూన్ 11 వరకూ విత్‌డ్రాకు సమయముంటుంది. జూన్ 20తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తోంది.
సీసీటీవీతో పాక్‌కు కీలక సమాచారం.. గుట్టురట్టు
చండీగఢ్: పంజాబ్ పోలీసులు పాకిస్థాన్ కుతంత్రాన్ని తిప్పికొట్టారు. పఠాన్‌కోటలో భారత సైన్యం, పారామిలటరీ దళాల సమాచారాన్ని సీసీటీవీ నిఘాచిత్రాల ద్వారా లాహార్‌కు చేరవేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు.పంజాబ్‌లోని చక్ ధరివాల్ గ్రామానికి చెందిన బల్జిత్ సింగ్ అలియాస్ బిట్టు అనే వ్యక్తి భారత సైన్యం, పారామిలిటరీ దళాల కదలికలపై నిఘా పెట్టేందుకు ఆ ప్రాంతంలోని జాతీయ రహదారి-44లోని పఠాన్‌కోట్-జమ్మూ మార్గంలో ఒక వంతెన సమీపంలోని దుకాణంలో రహస్యంగా సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. దానిలోని నిఘా సమాచారాన్ని పాకిస్థాన్, విదేశాల్లోని ఆపరేటివ్‌లకు ఎలక్ట్రానిక్‌గా పంపినట్లు పేర్కొన్నారు. పోలీసుల విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయని నిందితుడు దీనిని ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. ఇందుకు గానూ దుబాయ్‌లోని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి రూ. 40 వేల అందుకున్నాడని పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి ఒక సీసీటీవీ కెమెరాతో పాటు ఇంటర్నెట్ వైఫై రౌటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో అతనితో పాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశామని వారందరూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విచారణ తేలిందన్నారు. ఈ నెట్వర్క్ సరిహద్దు సంబంధాలను గుర్తించడానికి గూఢచర్యాన్ని గుర్తించడానికి విచారణ వేగవంతం చేశామని పోలీసులు పేర్కొన్నారు.కాగా గత నెలలో పాకిస్థాన్ మద్దతు ఉన్న రెండు గూఢచార ముఠాలను పంజాబ్ పోలీసులు ఛేదించారు. ఈ ముఠాలు, చైనాలో తయారైన అత్యాధునిక సౌరశక్తితో పనిచేసే సీసీటీవీ కెమెరాలను ఉపయోగించి, కీలకమైన సైనిక స్థావరాల లైవ్ విజువల్స్‌ను పాకిస్తాన్‌లోని తమ హ్యాండ్లర్లకు ప్రసారం చేస్తున్నట్లు తెలిపారు. దేశ భద్రతకు ఎంతో కీలకమైన సమాచారం పాక్‌కు చేరడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.
‘హీరా గోల్డ్’ నౌహీరా షేక్ అరెస్ట్
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘హీరా గోల్డ్’ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. హీరా గ్రూప్ నౌహీరా షేక్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. గుర్గావ్ సమీపంలో నౌహీరా షేక్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. నౌహీరా షేక్.. ఫేక్ ఆధారాలతో గుర్గావ్లో ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో, ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే నౌహీరా షేక్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు.. బాధితులకు డబ్బులు చెల్లించకుండా నౌహీరా షేక్ ఇబ్బందులకు గురిచేస్తోంది.కేసు వివరాలు ఇలా.. దేశవ్యాప్తంగా ‘హీరా గోల్డ్’ కుంభకోణం సంచలనం సృష్టించింది. వివిధ రాష్ట్రాల్లోని దాదాపు 1.72 లక్షల మంది నుంచి అక్రమంగా రూ.5,600 కోట్ల డిపాజిట్లు సేకరించినట్టు ఆ సంస్థ ఎండీ నౌహీరా షేక్ ఆరోపణలు ఎదుర్కొంది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే ఏడాదికి 36 శాతం లాభాలు వస్తాయని నమ్మించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రజలను మోసం చేశారన్న ఫిర్యాదులపై నౌహీరా షేక్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు లక్షలాది మంది డిపాజిటర్ల నుంచి రూ.వేల కోట్లు కాజేసిన నౌహీరా వాటిని విదేశాలకు మళ్లించేందుకు సమకూర్చుకున్న పలు పత్రాలు, డిజిటల్ ఆధారాలు సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు. నౌహీరాతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో ఉన్న రూ.45 కోట్ల విలువైన 13 ఆస్తుల పత్రాలు, బినామీల పేరిట ఉన్న రూ.25 కోట్ల విలువైన 11 ఆస్తుల పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.వేల కోట్ల నిధుల గోల్మాల్ కేసులో ఈడీ ఇప్పటికే నౌహీరా షేక్‌కు సంబంధించిన సుమారు రూ.400 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు అటాచ్ చేసింది. ఈ నేపథ్యంలో నౌహీరా షేక్ ఆస్తులను ఈడీ వేలం వేస్తుంది.ఈ నేపథ్యంలో నౌహీరా షేక్‌కు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో, 5 షరతులతో నౌహీరా షేక్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఆ షరతుల్లో దేన్ని అతిక్రమించినా బెయిల్ రద్దవుతుందని అప్పట్లోనే స్పష్టం చేసింది. కానీ, ఆమె ఆ షరతులను ఉల్లంఘించడంతో బెయిల్‌ను రద్దు చేసింది.ప్రధాన ఆరోపణలు“హలాల్ ఇన్వెస్ట్మెంట్” పేరుతో డిపాజిట్లు సేకరణనెలకు భారీ రాబడులు ఇస్తామని హామీలు2018 తర్వాత చెల్లింపులు ఆగిపోవడంవేల కోట్ల రూపాయల మోసం ఆరోపణలుమనీ లాండరింగ్ కేసులు
విజయ్ సర్కార్ దూకుడు.. వెలుగులోకి భారీ స్కాం
సాక్షి, చెన్నై: తమిళనాడు ఇంధన వనరులు, న్యాయశాఖ మంత్రి సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ నేతృత్వంలో తమిళనాడు విద్యుత్ బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన వరుస సమీక్షలలో భారీ స్కాం బయటపడింది. తమిళనాడు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఇటీవల జరిపిన నిధుల కేటాయింపులు, కొన్ని ప్రాజెక్టుల ఆమోదాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఎలాంటి పారదర్శకత లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అత్యంత అత్యవసరంగా కొన్ని సంస్థలకు అనుమతులు, నిధుల కేటాయింపులు మంజూరు చేసినట్లు మంత్రి జరిపిన విచారణలో తేలింది.ఇద్దరు కీలక అధికారుల సస్పెండ్ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో, శాఖాపరమైన నిష్పాక్షిక విచారణకు ఎలాంటి అడ్డంకులు కలగకుండా ఉండేందుకు , పరిపాలనాపరమైన చర్యల్లో భాగంగా ఇద్దరు అగ్ర శ్రేణి అధికారులను ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం సీఎం విజయ్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెండ్ అయిన అధికారులలలో వి. కాసి – చీఫ్ ఫైనాన్షియల్ కంట్రోలర్ (రెవెన్యూ) , పి. చంద్రశేఖరన్ – చీఫ్ ఇంజనీర్ (సాంప్రదాయేతర ఇంధన వనరులు) ఉన్నారు. పరిపాలనాపరమైన దుర్వినియోగం, విధుల్లో అలసత్వం , నిధుల మంజూరులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై వీరిద్దరిపై ఈ వేటు పడింది.రిటైర్డ్ డైరెక్టర్ పెన్షన్ బెనిఫిట్స్ నిలిపివేత ఈ అవినీతి ఆరోపణలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ రిటైర్డ్ డైరెక్టర్ (టెక్నికల్) ఎస్. మంగళనాథన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై ప్రభుత్వం కోరడా ఝుళిపించింది. ఆయనకు అందాల్సిన అన్ని రకాల పెన్షన్ ప్రయోజనాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇంధన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ అక్రమాలకు పాల్పడిన సదరు అధికారులందరిపై విద్యుత్ బోర్డు నిబంధనల ప్రకారం శాఖాపరమైన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణ అనంతరం తదుపరి కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.అధికార పగ్గాలుచేపట్టగానే, అవినీతిని నిర్మూలిస్తామన్న విజయ్ ప్రభుత్వం తాజాగా భారీ స్కాంను గుర్తించి ఇద్దరు కీలక అధికారులపై వేటు వేయడం ఇతర అధికారుల గుండెల్లో గుబులు రేకెత్తించింది.
ఎన్ఆర్ఐ
ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ వార్షికోత్సవాలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ తన సప్తమ వార్షికోత్సవం (ఏప్రిల్25, 2026) ఘనంగా జరుపుకుంది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమం ప్రొఫెసర్ బి.వి.ఎస్. చౌదరి, రాజ్యలక్ష్మి చౌదరి సమక్షంలో సింగపూర్ శివకృష్ణ దేవాలయంవారి ఫంక్షన్ హాలు వేదికగా జరిగింది.స్వరలయ సంస్థ విద్యార్ధుల సంగీత మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆహూతులను అలరించారు. కుమారి శ్రీవిద్య పంతువరాళి రాగంలో “ఎన్నగాను రామభజన” త్యాగరాజ కీర్తనను హృద్యంగా గానం చేశారు. స్వరలయ వ్యవస్థాపక అధ్యక్షురాలు, గురు శేషుకుమారి సంగీత ప్రదర్శనలో ఆలపించిన త్యాగరాజ కీర్తన “ప్రక్కల నిలబడి”, ఒక “మీరా భజన్” , విద్యార్థులతో కలిసి చేసిన జానపద గీతం ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు అందుకున్నాయి.తరువాత తెలుగు విశ్వవిద్యాలయం గ్రేడ్ , యూనివర్సిటీ కోర్సులలో ఉత్తీర్ణులైన సంగీత విద్యార్ధులకు VC నిత్యానందరావు అర్హతాపత్రాలు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేషుకుమారి సంగీత ప్రస్థానాన్ని ప్రశంసించారు. సంగీతకళను భావితరాలకి అందించేలా ఆమెను నడిపిస్తున్నాయన్నారు. స్వరలయ విద్యార్ధులు భవిష్యత్తులో కర్నాటక సంగీతరంగంలో తమవైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.హార్మనీ & హ్యూస్ అధ్యక్షురాలు శ్యామల ప్రసంగిస్తూ 2025లో తిరుపతిలో అన్నమాచార్య 500వ జయంతి ఉత్సవాలలో చేసిన సంగీత కచేరీ, శేషుకుమారి వంశీ-సీల్వెల్ ఫౌండేషన్ వారి మంగళంపల్లి బాలమురళీకృష్ణ అవార్డ్ అందుకోవడం స్వరలయసంస్థ సాధించిన కొత్త మైలురాళ్ళని కొనియాడారు.అలాగే కుమారి మనోజ్ఞ అనే గాత్రసంగీత విద్యార్ధి మాట్లాడుతూ కర్నాటక గాత్ర సంగీతాన్ని ఒక O-level ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుని పరీక్షలు వ్రాసేందుకు MOE (సింగపూర్ విద్యాశాఖ) తాను అనుమతి సాధించగలగటం విశేషం అనీ, ఇది తన గురువు ఇచ్చిన స్ఫూర్తి, మార్గదర్శకత్వం వల్లనే సాధ్యమైందనీ, సంగీతం ఒక సబ్జెక్టుగా తీసుకోవడంతో ఇటు సంగీతంలో కృషి, అటు చదువుకునే సమయాన్ని సమర్ధవంతంగా వాడుకోవడం వీలవుతోందని చెప్పారు. ఈ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా, గురు శేషుకుమారి తాళం మరియు రాగం నేర్పించేందుకు వినూత్నమైన సంగీత ఆటలను ప్రవేశపెట్టారు. ఇవి ప్రత్యక్షంగా వేదికపై నిర్వహించబడి, సంగీత శిక్షణలో ఒక కొత్త పోకడను పరిచయం చేశాయి.యూ.టీ.ఐ.ఏ.ఈ.సీ చైర్మన్ రాయ్, ట్రెజరర్ v. Adesh బాబు , కళ , శివ కృష్ణ ఆలయ చైర్మన్ ,మేనేజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీసాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కాకతీయ సాంస్కృతిక పరివారం నుంచి సబ్బుపాలకుర్తి , సింగపూర్ తెలుగు వనితలు సమూహం నుంచి క్రాంతి, జయ, దీపు , రేఖ , రాణి, గాయత్రి వంటి అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. పిల్లల ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించి, వేడుకను విజయవంతంగా ముగించాయి. సౌజన్య చక్కటి వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు
ఘనంగా తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026
తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, మే డే సందర్భంగా Terusan Recreation Centre వద్ద ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 18 నుంచి మే 1 వరకు నాలుగు వారాంతాల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో, సింగపూర్ నలుమూలల నుంచి వచ్చిన తెలుగు కార్మికులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .“సైట్లో కష్టం… గ్రౌండ్లో శక్తి” అనే నినాదంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్, సింగపూర్ తెలుగు సమాజ ఐక్యత, శక్తి కృషికి ప్రతీకగా నిలిచింది.మొత్తం 18 జట్లు పోటీపడిన ఈ టోర్నమెంట్లో, లీలా నాగేశ్ నాయకత్వంలోని తెలుగు వారియర్స్ జట్టు విజేతగా నిలవగా, సాహు చంద్రశేఖర్ నాయకత్వంలోని మెగాయార్డ్ రైడర్స్ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 17 మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగగా, 250కి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు వరుసగా SGD1,116 మరియు SGD558 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు.వ్యక్తిగత విభాగంలో బండి శ్రీనివాస్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకోగా, శ్యామ్ ఉత్తమ ఆల్‌రౌండర్‌గా, ఆంథోనీ ఉత్తమ బౌలర్‌గా, విజ్జు ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యారు. మెగాయార్డ్ రైడర్స్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు వ్యక్తిగత అవార్డులు గెలుచుకోవడం విశేషం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సారిక ప్రసాద్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే రాంబాబు పాతూరి (కాకతీయ కల్చరల్ అసోసియేషన్), రత్న కుమార్ కవుటూరు (శ్రీ సాంస్కృతిక కళాసారథి), సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్ష్యులు రంగా రవి, చౌదరి జె తదితరులతో పాటు శేషారావు గూడూరి, వినయ్ కుమార్ సూర్యదేవర, సురేంద్ర చెబ్రోలు, చంద్రశేఖర్ చిలుకూరి, హనుమంతరావు మాదాల, అమ్మయ్య చౌదరి, గంగాధర్ తాటి, సతీష్ పారేపల్లి, వేణు నార్నే తదితర ప్రముఖులు విచ్చేసి నిర్వాహకులను మరియు క్రీడాకారులను అభినందించారు.శివ ప్రసాద్ కొల్లా నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బి వర ప్రసాద్, గిరిధర్ సరాయి, అనిల్ కుమార్ బొమ్మారెడ్డి తదితరులతో పాటు కోఆర్డినేటర్లు, లాజిస్టిక్స్ టీమ్, అంపైర్లు, స్కోరర్లు, వాలంటీర్లు అహర్నిశలు శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సురేంద్ర చేబ్రోలు, ఉమా మహేశ్వర రావు, గురురాజ్ బనకర్, శ్రీను యాదవ్, గొర్రెపాటి లక్ష్మీ రెడ్డి అంపైర్లుగా వ్యవహరించగా, రమేష్ వ్యాఖ్యాతగా కార్యక్రమానికి మరింత ఆకర్షణ తీసుకువచ్చారు.టీం శివప్రసాద్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, వచ్చే ఏడాది టీంను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మహిళల విభాగం ప్రవేశపెట్టడం, మెరుగైన లైవ్ స్ట్రీమింగ్, మరిన్ని సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
ఆనీ ఫిలిప్ , మీరా ఫిలిప్ వీరిద్దరూ మలయాళీ సిస్టర్స్..అమెరికాలో స్థిరపడ్డారు. మంచి ఉద్యోగం. సౌకర్య వంతమైన జీవితం. కానీ అనూహ్యంగా కన్యాకుమారిలో వీరిద్దదూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అదీ పక్కాగా ప్లాన్ చేసుకొని మరీ ఉసురు తీసుకున్నారు. తాము ఈ లోకాన్ని సంతోషంగా వీడుతున్నామంటూ, కుటుంబానికి క్షమాపణలు చెపుతూ పంపిన ఈ మెయిల్స్ సంచలనంగా మారాయి.ఆనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, మీరా ఎక్స్‌రే టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అవివాహితులు. ఇటీవల టెక్సాస్ నుంచి కేరళకు వచ్చిన వీరు, కన్యాకుమారి వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుని మరీ, తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎలా ప్లాన్ చేసుకున్నారంటే..అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఆత్మహత్యకు సంబంధించి వారిద్దరూ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కన్యాకుమారి పోలీసులు తెలిపారు. హోటల్ గదిని వదిలి వెళ్లే ముందు, ఒక ఫోన్‌ను అక్కడే వదిలేసి, మరొకటి వెంట తీసుకెళ్లారు. హోటల్లో దొరికిన ఫోన్లో వారు తమ కుటుంబ సభ్యులకు పంపిన రెండు ఇమెయిల్‌లు లభ్యమయ్యాయి.ఆ ఇమెయిల్స్‌లో ఏముంది? మొదటి మెయిల్ : తాము ఈ లోకాన్ని చాలా సంతోషంగా వీడుతున్నామని వారు అందులో పేర్కొన్నారు. తమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు పడిన కష్టానికి, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. చివర్లో వారికి క్షమాపణలు కోరారు.రెండో మెయిల్: 'బై' (Bye) అనే సబ్జెక్ట్ లైన్‌తో మీరా ఫిలిప్ ఈ మెయిల్ పంపారు. అమెరికాలోని తమ వ్యవహారాలన్నీ చక్కదిద్దామని, అక్కడ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.చివరి కోరికతమను కన్యాకుమారిలోనే దహనం చేయాలని, అస్థికలను సముద్రంలో కలపాలని వారు కోరారు. "ఎటువంటి పూజలు లేదా ఆచారాలు వద్దు, దయచేసి మా కోరికను గౌరవించండి" అని ఆ సందేశంలో బోల్డ్ అక్షరాలతో రాశారు.సీసీటీవీ (CCTV) దృశ్యాలుఏప్రిల్ 26 నాటి సిసిటివి విజువల్స్‌లో సోదరీమణులిద్దరూ చేతులతో రెండు ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని, ఎటువంటి హడావిడి లేకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత వారు సముద్రం వైపు వెళ్తున్న మరో వీడియో కూడా దొరికింది. వారు పంపిన సందేశాలతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, గురువారం నాడు వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి పోస్ట్‌మార్టం నిమిత్తం ఈ మృతదేహాలను తరలించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నారు.మరోవైపు సోదరీమణులు వెంట తీసుకెళ్లిన ,సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్న మరో ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్యాకుమారి డీఎస్పీ జయచంద్రన్ తెలిపారు.
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులకు.. వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా మారి ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక దారుణంగా మారింది. ఇప్పటికే పలువురు ఆ దేశం వీడుతుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. ఈ క్రమంలో షికాగోలో విషాదం చోటు చేసుకుంది. షికాగోలో భారత్‌కు చెందిన ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు చందు ఇరగనబోయిన(26). స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతని కుటుంబ నేపథ్యం తెలియరావాల్సి ఉంది.ఇక్కడే ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చేసిన చందు.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకు వెళ్లాడు. చికాగోలో డీపౌల్ యూనివర్సిటిలో ఎమ్మెస్ పూర్తి చేసి కిందటి ఏడాది జూన్ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో డెవలపర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిస్టల్‌తో కాల్చుకుని ఏప్రిల్ 28న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం సూసైడ్‌కు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అలాగే అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే దానిపైనా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
క్రైమ్
ఈ దొంగ... ‘బంగారు’ కొండ!
కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీస్ షోరూంలో ఈ నెల మొదటి వారంలో భారీ దోపిడీకి ఒడిగట్టిన ముఠా నాయకుడు సుబోధ్ సింగ్ అలియాస్ బబువా సామాన్యుడు కాదు. గోల్డెన్ థీఫ్గా పేరున్న ఇతగాడు ఇప్పటి వరకు ఏడు రాష్ట్రాల్లో జరిగిన 400 కేజీల బంగారం చోరీ, దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. బీహార్‌లోని జైలు నుంచే పీఎంజే జ్యువెలర్స్‌లో దోపిడీకి స్కెచ్ చేసి, కథ నడిపంచాడు. ఈ గ్యాంగ్‌ను పట్టుకున్న కరీంనగర్ పోలీసులు ప్రస్తుతం సుబోధ్‌ను పీటీ వారెంట్‌పై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. పదేళ్లల్లో ఏడు రాష్ట్రాల్లో పంజా విసిరిన ఈ సుబోధ్ సింగ్ పూర్వాపరాలు ఇవి...బీహార్‌లోని నాలంద జిల్లాలో ఉన్న చండి పోలీసుస్టేషన్ పరిధిలోని చిస్టిపూర్కు చెందిన ఈశ్వర్ ప్రసాద్ కుర్మి కుమారుడే సుబోధ్ సింగ్ (42). ఇతడిపై దేశంలోని ఏడు రాష్ట్రాల్లో దోపిడీ, హత్య, బందిపోటు దొంగతనం, దాడుల వంటి కేసులు నమోదయ్యాయి. పీఎంజే కేసుతో కలిపితే ఇతడిపై ఉన్న వాటి సంఖ్య 43కు చేరింది. ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా సంప్రదింపులు జరుపుతూ... గూగుల్ మ్యాప్స్, ప్రత్యేక యాప్స్ వంటి అత్యాధునిక విధానాలను వినియోగిస్తూ పంజా విసిరే, విసిరించే సుబోధ్ చదివి కేవలం 12వ తరగతి.1996 వరకు ఇతగాడు బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన చిన్నచిన్న దొంగలతో కలిసి నేరాలు చేశాడు. 1999 నాటికి బీహార్ పోలీసులకు ఇన్ఫార్మర్గా మారాడు. ఆ సమయంలో ఇతడు బీహార్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో పాటు ఉన్నతాధికారులతో కూడా సంబంధాలు పెంచుకున్నాడు. 2007 వరకు తన ఇన్ఫార్మర్ పనిని కొనసాగించాడు. ఇలా సుబోధ్‌కు పోలీసుల పని తీరు, వ్యూహం, కదలికలు పూర్తిగా అవగతం అయ్యాయి. ఓపక్క ఇన్ఫార్మర్గా పనిచేస్తూనే... మరోపక్క తన నేర నెట్‌వర్క్‌ను పెంచుకుంటూ పోయాడు.తనకు ప్రత్యర్థులు, పోటీదారులుగా ఉన్న దొంగలు, ముఠాల సమాచారాన్ని బీహార్ పోలీసులకు అందించిన అతడు.. వాళ్లు జైలుకు వెళ్లేలా చేసి తన ‘లైన్’ క్లియర్ చేసుకున్నాడు. 2008లో ఇతగాడు కోల్‌కతాలోని ఎస్బీఐ బ్యాంకులో దోపిడీ చేశాడు. ఇదే ఇతడి తొలి భారీ నేరం. ఆ తర్వాత రాయపూర్‌లోని ఒక బ్యాంకులో కూడా పంజా విసిరాడు. ఈ కేసుల్లో మొదట కోల్‌కతా పోలీసులు, తరువాత రాయపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2015 వరకు రాయపూర్ జైలులోనే ఉన్నాడు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ముత్తూట్, మణప్పురం మరియు పెద్ద జువెలర్లను లక్ష్యంగా చేసుకుని సొంత గ్యాంగ్‌తో పంజా విసిరాడుసుభోద్ నేరచరిత్ర తొలిసారిగా 2018లో బీహార్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల దృష్టిలోకి వచ్చింది. ప్రతి నేరాన్నీ పక్కా పథకం ప్రకారం, రెక్కీ తర్వాత చేయిస్తున్నట్లు గుర్తించారు. ప్రతి నేరంలోనూ కొత్త అనుచరుల్ని ఏర్పాటు చేసుకుని వారికి ప్రత్యేక పేర్లు, పాత్రలు కేటాయించేవాడు. ప్రతి దోపిడీలో ఈ గ్యాంగ్ 5 నుంచి 20 కిలోలకు వరకు పసిడిని కొల్లగొట్టేది. 2018 నాటికి రాజస్థాన్‌లోని జైపూర్, మహారాష్ట్రలోని పుణే, నాగ్‌పూర్, పశ్చిమ బెంగాల్‌లోని బరాక్పూర్లలో భారీ బంగారం దోపిడీలు చేశాడు. బీహార్‌లోని అనేక నగరాల్లో కూడా నేరాలు చేశాడు.2018 జనవరిలో బీహార్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సుబోధ్‌ను అక్కడి వైశాలి జిల్లా దానాపూర్‌లో అరెస్ట్ చేసింది. తన ప్రేయసిని కలవడానికి వచ్చిన సమయంలో పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి ఏకంగా 16.5 కిలోల బంగారం, ఒక పిస్టల్, దేశీయ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అతడిని పాట్నాలోని బేయూర్ జైలుకు తరలించారు. చాలా కాలం ఆ జైలులోనే ఉన్నాడు. అక్కడి నుంచే తన గ్యాంగ్ సహాయంతో వరుసగా బంగారం దోపిడీలకు పథకాలు వేస్తూ, అమలు చేస్తూపోయాడు.తాను జైలులో ఉన్నప్పటికీ గ్యాంగ్‌ను విస్తరించాడు. సుబోధ్ సింగ్ జైలులో నుంచే కొత్త వ్యక్తులను తన గ్యాంగ్‌లోకి చేర్చడం ప్రారంభించాడు. స్నాచింగ్స్, దొంగతనం కేసుల్లో ఎవరైనా జైలుకు వచ్చిన వాళ్లను సుబోధ్ సింగ్ టార్గెట్ చేసుకుంటాడు. ఇలాంటి వాళ్లను అతడితో పాటు అతడి అనుచరులు బెయిల్, డబ్బు ఆశ చూపి తమవైపు తిప్పుకుంటారు ఆ వ్యక్తి అంగీకరిస్తే జైలులో నుంచే వారి బెయిల్ ఏర్పాట్లు చేయిస్తాడు. వారు బయటకు వచ్చిన తరువాత అప్పటి బయట ఉన్న తన గ్యాంగ్ సభ్యులతో వారికి శిక్షణ ఇప్పించి, బంగారం ఎక్కడ ఎలా దోచుకోవాలో నేర్పిస్తాడు.సుబోధ్ గ్యాంగ్ దోచుకున్న బంగారాన్ని నేపాల్ మరియు పశ్చిమ బెంగాల్‌కు తీసుకెళ్తుంది. అక్కడ దానిని కరిగించి విక్రయిస్తారు. దేశంలో జరిగిన మొత్తం బంగారం దోపిడీల్లో 70 శాతం తమ గ్యాంగ్ దేనని సుబోధ్ పోలీసులకు చెప్తూ ఉంటాడు. జైలులో ఉన్నప్పటికీ వివిధ రాష్ట్రాల్లో నేరాలకు సుబోధ్ సింగ్ పథకాలు రచిస్తాడు. అతడు పాట్నాలోని బేయూర్ జైలులో సెక్టార్–3లోని 21, 22 బ్యారక్‌ల్లో ఉంటాడు. అక్కడ అతడికి వీఐపీ ట్రీట్మెంట్తో పాటు అన్ని సౌకర్యాలు ఉంటాయని సమాచారం. ఈ రెండు బ్యారక్‌ల్లో సుబోధ్ సింగ్ గ్యాంగ్ సభ్యులు, అతడి పరిచయస్తులే ఉంటారట.2025 మార్చిలో ఒడిశాలో జరిగిన బంగారం దోపిడీ కేసులో విచారణ కోసం ఒడిశా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై ఈ ఏడాది ప్రథమార్థలో రాజస్థాన్‌కు చెందిన కంకరోలి పోలీసులు ఇతడిని ఒడిశా నుంచి పీటీ వారెంట్‌పై తీసకువెళ్లారు. బేయూర్ జైలులో ఉన్న సుబోధ్ రాజస్థాన్‌కు చెందిన సైబర్ నేరగాడు కునాల్‌ను బెదిరించి రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. ఆ మొత్తం చెల్లించడానికి అతడు అంగీకరించకపోవడంతో కునాల్‌పై హత్యాయత్నం చేయించాలని భావించాడు. కునాల్‌ను పోలీసులు సియాల్దా కోర్టులో హాజరు పరిచిన సమయంలో అతడిపై కాల్పులు జరిపించాలని భావించాడు. తన అనుచరులకు ఆదేశాలు ఇవ్వడం ద్బారా కునాల్‌పై ఉపాసన ఎక్స్‌ప్రెస్ రైలులో ఎస్కార్ట్ పోలీసు సమక్షంలోనే కాల్పులు జరిపించాడు. అతడు ప్రాణాలతో బయటపడగా... గార్డు గాయపడ్డాడు.2023 ఆగస్టు 23న కంకరోలిలోని భగవందాస్ మార్కెట్ ఎదురుగా ఉన్న రూపం గోల్డ్ జువెలర్స్‌లో దోపిడీ జరిగింది. ఉదయం 10:30 గంటలకు నాలుగు బైక్‌లపై వచ్చిన నేరస్తులు వ్యాపారి మరియు ఉద్యోగులను తుపాకీతో బెదిరించి బందీలుగా మార్చి సుమారు మూడు కిలోల బంగారం, రూ.18 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. దోపిడీదారులు ఉపయోగించిన బైక్‌లలో ఒకదాన్ని భిల్వారా రైల్వే స్టేషన్ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. ఆ బైక్ బీహార్ నుంచి దొంగిలించబడినదిగా తేలింది. నిందితులు రైలులో బీహార్‌కు పారిపోయినట్లు విచారణలో నిర్ధారణ అయింది. ఈ కేసులో సుబోధ్‌ను పీటీ వారెంట్‌పై అరెస్టు చేశారు.ఇంతకుముందు ఇదే గ్యాంగ్ 2022 ఆగస్టు 29న ఉదయపూర్‌లోని సుందర్వాస్లో ఉన్న మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్‌లో జరిగిన భారీ దోపిడీలో కూడా పాల్గొన్నట్లు తేలింది. ఈ కేసులో సుబోధ్‌తో పాటు ముగ్గురు నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సుబోధ్ బీహార్‌లోని పూర్నియా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, హైదరాబాద్.
ఆర్చరీ కోచ్ కుల్దీప్కు ఐదేళ్ల జైలుశిక్ష
చండీగఢ్: జాతీయ స్థాయి ఆర్చరీ కోచ్ కుల్దీప్ వేద్వాన్కు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. మైనర్ ఆర్చర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో న్యాయస్థానం తాజాగా తీర్పు వెల్లడించింది. జాతీయ శిబిరంలో శిక్షణ పొందుతున్న యువ ఆర్చర్‌ను బలవంతం చేసే ప్రయత్నం చేసిన కుల్దీప్ వేద్వాన్కు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ (పోక్సో) చట్టం కింద శిక్ష విధించినట్లు హరియాణాలోని సోనీపత్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం వెల్లడించింది. జైలు శిక్షతో పాటు రూ. 15 వేలు జరిమానాగా విధించింది. కుల్దీప్ నేరాన్ని అంగీకరించగా... జస్టిస్ నరేంద్ర సింగ్ తీర్పు వెల్లడించారు. దీంతో అతడిని తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. ‘పోక్సో’ చట్టంలోని 10వ సెక్షన్ కింద అతడికి శిక్ష విధించినట్లు న్యాయమూర్తి వెల్లడించారు. అసలేం జరిగిందంటే... 2023 ఆగస్టులో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో యూత్ చాంపియన్ షిప్ శిక్షణ శిబిరం నిర్వహించారు. సోనీపత్‌లో నిర్వహించిన ఆ శిబిరంలో పాల్గొనేందుకు వచి్చన ఓ జాతీయ స్థాయి మైనర్ ఆర్చర్‌తో కుల్దీప్ అసభ్యంగా ప్రవర్తించాడు. తెల్లవారు జామున 4 గంటలకు ఆర్చర్ నిద్రిస్తున్న గదిలోకి వెళ్లిన కోచ్ కుల్దీప్... ఆమెను లైంగికంగా వేధించాడు. అతడిని ప్రతిఘటించేందుకు విఫలయత్నం చేసిన మైనర్ ఆర్చర్ అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని పక్కనే ఉన్న ఇతర ఆర్చర్ల గదిలోకి పరుగు తీసింది. ఆ తర్వాత ఈ విషయాన్ని బయట పెడితే కెరీర్ నాశనం చేస్తానని కోచ్ భయపెట్టడంతో యువ ఆర్చర్ తన బాధను ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. తనకు సహకరిస్తే... జాతీయ స్థాయిలో స్టార్ ఆర్చర్‌గా తీర్చిదిద్దుతానని పలుమార్లు ఆమెను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించాడు. ట్రయల్స్ ముగిసిన అనంతరం సింగపూర్‌లో జరిగిన ఆసియా కప్‌నకు యువ ఆర్చర్ ఎంపిక కాగా... ఆ సమయంలో శిబిరం సందర్భంగా జరిగిన చేదు అనుభవాన్ని ఆమె తన కుటుంబ సభ్యులతో పంచుకుంది. దీంతో వారు సోనీపత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... విచారణ చేపట్టిన పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుల్దీప్ గతంలో భారత సైన్యంలో సైతం పని చేశాడు.
బిడ్డల్ని వదిలేసి, డబ్బు, స్కూటర్ తీసుకొని ప్రియుడితో పరార్
ఎంత కష్టమొచ్చినా..కన్నీళ్లొచ్చినా.. బిడ్డల్ని కళ్లల్లో పెట్టుకొని కాపాడేది తల్లి. అలాంటి తల్లే కన్న బిడ్డలకి తీరని అన్యాయం చేస్తే.. ఇక ఆ బిడ్డలకు దిక్కెవ్వరు? సరిగ్గా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో వెలుగుచూసింది. కేవలం పిల్లలను వదిలేయడమే కాదు, తన తండ్రి డబ్బును, స్కూటర్‌ను కూడా దొంగిలించి ప్రియుడితో చెక్కేసిన షాకింగ్ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.అసలేం జరిగింది?పంఢరపూర్ - శంభాజీనగర్ రూట్లో వెళ్తున్న ఒక బస్సులో ఈ ఘటన జరిగింది. ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను బస్సు ఎక్కించి, తన తండ్రి స్కూటర్ వేసుకుని ప్రియుడితో కలిసి వెళ్ళిపోయింది. బస్సులో ఆ పిల్లలు ఇద్దరూ ఒంటరిగా ఏడవడం గమనించిన కండక్టర్, వారి దగ్గరకు వెళ్లి పరిశీలించాడు. ఆ సమయం లోనే ఒకరి జేబులో ఉన్న చీటీని చూసి, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.బస్సులో ఏడుస్తున్న ఒక చిన్నారి జేబులో ఉన్న చీటీలో ఏముంది అంటే "ఈ పిల్లలకు తల్లిదండ్రులు లేరు, దయచేసి వీరిని యావత్మాల్ వెళ్లే బస్సు ఎక్కించండి." అని ఉన్న హృదయవిదారకమైన వాక్యాలివి. ఆ నోట్ పక్కనే ఒక మొబైల్ నంబర్ కూడా ఉంది. పోలీసులు ఆ నంబర్‌కు ఫోన్ చేసి విచారించగా నమ్మలేని ఒక షాకింగ్ నిజం బయట పడింది. సరిగ్గా అదే సమయంలో, యావత్మాల్కు చెందిన ఒక వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురు ఇంట్లో ఉన్న డబ్బు, స్కూటర్ తీసుకుని పారిపోయిందని ఆ ఫిర్యాదు సారాంశం. కేసు నమోదు చేసుకున్న బీడ్ (Beed) జిల్లా పోలీసులు ఆ వృద్ధుడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. బస్సులో ఒంటరిగా దొరికిన ఆ ఇద్దరు పిల్లలు మరెవరో కాదు, తన స్వంత మనవడు, మనవరాలేనని అతను గుర్తించాడు. ఆ పిల్లల కన్నతల్లే వారిని నడిరోడ్డుపై వదిలేసి, తన ప్రియుడితో కలిసి పారిపోయిందని తెలిపాడు.మరో షాకింగ్ సంగతి ఏంటంటే. బిక్కు బిక్కుమంటున్న పిల్లల్ని చూశాక తాత ప్రవర్తన పోలీసులనే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒంటరిగా ఉన్న పిల్లల్ని చూసి తాత మనసు కరగలేదు, కనీసం ఓదార్చ లేదు. వారిని ఇంటికి తీసుకెళ్లడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు సరికదా పిల్లల భవిష్యత్తు కంటే, పోయిన తన స్కూటర్ గురించే అతడు ఎక్కువ ఆందోళన చెందడం మరింత విస్మయ పర్చింది. ఆ పిల్లల బాధ్యతను తీసుకోవడం తన వల్లకాదని తెగేసి చెప్పాడు. చివరకు, పోలీసులే ఆ పిల్లల రక్షణకు ఏర్పాట్లు చేశారు. బీడ్ జిల్లా శిశు సంక్షేమ కమిటీ (Child Welfare Committee), జిల్లా పరిపాలనా యంత్రాంగం సహాయంతో ఆ ఇద్దరు పిల్లలను సురక్షితమైన చిల్డ్రన్ హోమ్‌కు తరలించారు.
తల్లితో సహజీవనం.. ఆమె కూతురిపై లైంగిక దాడి
మేడ్చల్ జిల్లా: తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై అల్వాల్ పోలీసులు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. మచ్చ»ొల్లారంలో నివసించే ఓ మహిళ (33) మహిళ భర్తకు దూరంగా ఉంటూ 15 సంవత్సరాల కూతురితో కలిసి నివాసముంటోంది. స్థానికంగా ఉండే దుర్గాప్రసాద్ (34) తో సహజీవనం చేస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయలో దుర్గాప్రసాద్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు
కాకర్ల వెంకట్రామిరెడ్డి ఉద్యోగం తొలగింపు.. జగన్ సంచలన రియాక్షన్
వందల కోట్ల ఆస్తి.. ACB వలలో డిప్యూటీ కలెక్టర్
మహిళలపై పులి దాడి.. అక్కడికక్కడే నలుగురు మృతి
ఆయన మనసు వెన్న.. జగన్ గురించి మీకేం తెలుసు.. టీడీపీకి జూపూడి స్ట్రాంగ్ కౌంటర్
SIR అంటే ఏంటి? మీ ఓటు జాగ్రత్త.. ఈ డాక్యుమెంట్స్ పక్కా ఉండాలి!
ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినందుకు రెచ్చిపోయిన జనసేన.. ప్రొ. నాగేశ్వర్ పై కేసు
అంతా నా ఇష్టం..! బాబు మాటలను లెక్కచేయని లోకేష్..
ఎవరి ఊహలకి అందదు.. చరణ్ అన్న ఇరగకొట్టేసాడు
నటి ట్విషా శర్మ కేసులో మరో ట్విస్ట్
లెక్చరర్ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య..


