పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టకుండానే..! | Kapu Bhavan Opens in Vizag Without Kapu Leaders | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టకుండానే..!

May 22 2026 4:56 PM | Updated on May 22 2026 6:10 PM

Kapu Bhavan Opens in Vizag Without Kapu Leaders

విశాఖ:  విశాఖ వెస్ట్‌లో ఉన్న గోపాలపట్నం కాపు భవన్‌ ప్రారంభోత్సవానికి ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు, నాయకులకు ఆహ్వానం అందలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు పనులు పూర్తైన కాపు భవన్‌ను.. రెండేళ్ల తర్వాత ప్రారంభోత్సవం చేశారు ఎమ్మెల్యే గణబాబు. అయితే ఈ కార్యక్రమానికి కాపు నాయకులకు గానీ,  ఎమ్మెల్యేలకు గానీ ఆహ్వానం అందలేదు. 

కాపు భవన్‌ ప్రారంభోత్సవం సందర్భం కనీసం కాపు నాయకుడైన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఫోటో కూడా పెట్టలేదు. కాపు భవన్ ప్రారంభోత్సవాన్ని విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, ఎంపీ భరత్‌లే చేసేశారు. దీనిపై కాపు ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. తమ సామాజిక వర్గ భవన్‌ ప్రారంభోత్సవానికి కాపు నేతలను ఆహ్వానించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. కనీసం పవన్‌ కళ్యాణ్‌ ఫోటో పెట్టకపోవడాన్ని కూడా ఆక్షేపిస్తున్నారు. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement