kapu bhavan
-
పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టకుండానే..!
విశాఖ: విశాఖ వెస్ట్‌లో ఉన్న గోపాలపట్నం కాపు భవన్ ప్రారంభోత్సవానికి ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు, నాయకులకు ఆహ్వానం అందలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు పనులు పూర్తైన కాపు భవన్‌ను.. రెండేళ్ల తర్వాత ప్రారంభోత్సవం చేశారు ఎమ్మెల్యే గణబాబు. అయితే ఈ కార్యక్రమానికి కాపు నాయకులకు గానీ, ఎమ్మెల్యేలకు గానీ ఆహ్వానం అందలేదు. కాపు భవన్ ప్రారంభోత్సవం సందర్భం కనీసం కాపు నాయకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టలేదు. కాపు భవన్ ప్రారంభోత్సవాన్ని విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, ఎంపీ భరత్‌లే చేసేశారు. దీనిపై కాపు ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. తమ సామాజిక వర్గ భవన్ ప్రారంభోత్సవానికి కాపు నేతలను ఆహ్వానించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. కనీసం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టకపోవడాన్ని కూడా ఆక్షేపిస్తున్నారు. -
'మున్నూరుకాపు భవన్‌కు ప్రభుత్వం స్థలం ఇవ్వాలి'
హైదరాబాద్‌సిటీ: తెలంగాణలో అత్యధిక జనాభా కల్గిన మున్నూరు కాపుల సంక్షేమం కోసం మున్నూరుకాపు భవన్ నిర్మాణానికి 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డు చైర్మన్ మ్యాడం జనార్దన్‌రావు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం మున్నూరుకాపు మెడికల్ అండ్ హెల్త్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పేదలకు ప్రతి ఆదివారం ఉచిత వైద్యసేవలు అందించడానికి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మున్నూరుకాపు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా కుల సంఘం ప్రతినిధులు జనార్దన్‌రావును అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గంప చంద్రమోహన్, ప్రొ.వెంకట్రావు, చామకూర ప్రదీప్, హజారి రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.


