అందుకే బ్రేక్‌ వచ్చింది : వడ్డే నవీన్‌ | Vadde Naveen Made Interesting Comments About Transfer Trimurthulu Movie, Check Out More Detailstitle] | Sakshi
Sakshi News home page

అందుకే బ్రేక్‌ వచ్చింది : వడ్డే నవీన్‌

May 22 2026 8:36 AM | Updated on May 22 2026 11:34 AM

Vadde Naveen Talk About Transfer Trimurthulu Movie

వడ్డే నవీన్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు’. కమల్‌ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం జూన్‌ 19న విడుదల కానుంది. గురువారం జరిగిన ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో వడ్డే నవీన్‌ మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు (నిర్మాత వడ్డే రమేష్‌) చనిపోయిన తర్వాత నేను నటించిన, నిర్మించిన తొలి చిత్రం ఇది. పదేళ్లుగా నేను సినిమాలు చేయకపోయినా నన్ను గుర్తు పెట్టుకున్న ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. 

నేను ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఫ్యామిలీతో ఉంటున్నాను. నాకు బ్రేక్‌ ఎలా వచ్చిందంటే... నాకు నచ్చిన సినిమాలు రాలేదు. నా దగ్గరకు వచ్చిన సినిమాలు నచ్చక నేను చేయలేదు. ఇలా రెండు విధాలుగా నాకు బ్రేక్‌ వచ్చింది. ఎన్నో కథలు విన్న తర్వాత ఈ ‘ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు’ కథ చెప్పారు కమల్‌. కథ, స్క్రిప్ట్‌పై మేం ఇద్దరం ఏడాది పాటు వర్క్‌ చేశాం. కంటెంట్‌ కొత్తగా ఉంటుంది’’ అని చెప్పారు. 

‘‘పూరిగారి వద్ద పని చేసినప్పుడు ఇలాంటి ఓ మూమెంట్‌ కోసం చూశాను. ‘ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు’ నవీన్‌కు మంచి కమ్‌బ్యాక్‌ మూవీలా ఉంటుంది’’ అన్నారు కమల్‌ తేజ నార్ల. ‘‘ఇందులో నేను లక్ష్మీ అనే ΄ాత్రలో నటించాను’’ అని చె΄్పారు రాశీ సింగ్‌. ఈ సినిమాకు సంగీతం: కల్యాణ్‌ నాయక్‌.  

Advertisement
 
Advertisement
Advertisement