కేన్స్‌కు అందాల సుందరీ రాక ​..! నల్లటి బ్లేజర్‌, లక్షల విలువైన.. | Cannes 2026: Aishwarya Rai Flaunts More Than Rs 4 Lakh Gucci Tote | Sakshi
Sakshi News home page

కేన్స్‌లో కనిపించనున్న ఐశ్వర్యరాయ​..! నల్లటి బ్లేజర్‌, లక్షల విలువైన..

May 22 2026 12:43 PM | Updated on May 22 2026 7:07 PM

Cannes 2026: Aishwarya Rai Flaunts More Than Rs 4 Lakh Gucci Tote

ఫ్రాన్స్‌లో ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఈ నెల మే 12న అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రెడ్‌కార్పెట్‌పై పలువురు ప్రముఖులు,సెలబ్రిటీలు తమదైన డిజైనర్‌ వేర్‌లో అలరించారు. ముఖ్యంగా భారతీయ సంప్రదాయ వారసత్వాన్ని ఈ ప్రపంచ వేదికపై చూపారు. అయితే ఇంత గ్రాండ్‌గా జరుగుతున్న ఈ వేడుకల్లో అందరి మదిలో ప్రశ్నం అందాల రాణి ఐశ్వర్య ఎక్కడ అని ఒకటే చర్చ. కేన్స్‌ వేడుకల్లో ఆమె హాజరు సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆ చర్చలకు తెరదించేలా నిన్న రాత్రి(మే 21 రాత్రి) కూతురు ఆరాధ్య బచ్చన్‌తో కలసి కేన్స్‌కు బయలు దేరుతూ ముంబై విమానాశ్రయంలో కనిపించారు. 

ఈ కేన్స్‌ వేడుకలకు బయలు దేరుతున్నప్పుడే ఈ తల్లి కూతుళ్లు సేమ్‌ డిజైనర్‌వేర్‌లతో అందర్నీ ఆకర్షించారు. ఇద్దరు నలుపురంగు దుస్తుల్లో ఒకేలా కనిపించారు. అక్కడున్న ఫోటోగ్రాఫర్లకు కొన్ని క్షణాల పాటు పోజిలిస్తూ ఎయిర్‌పోర్టుకి తరలి వెళ్లిపోయారు. ఇక ఐశ్వర్య ధ్రువ్ కపూర్ ఫాల్/వింటర్ 2026-27 కలెక్షన్‌కు చెందిన నలుపు రంగు బ్లేజర్‌, దానికి జతగా అదే కలెక్షన్‌కు చెందిన నలుపు రంగు ప్యాంటును ధరించారామె. తాను ధరించిన పూర్తి నలుపు రంగు థీమ్‌కు అనుగుణంగా తన లుక్‌ను మలిచుకున్నారామె. అలాగే ఈ డిజైనర్‌వేర్‌కి అనుగుణంగా బూట్లు, గూచీ డయానా బ్యాగ్‌తో మెరిశారామె. 

ఆమె ధరించిన బూట్లు సుమారు రూ. రూ. 1.78 లక్షలు కాగా ఐశ్వర్య చేతిలో ఉన్న గూచీ బ్యాగ్‌ ధర ఏకంగా రూ. 4 లక్షలు పైనే పలుకుతుందట. మాములుగా సెకండ్‌హ్యండ్‌ మార్కెట్లోనే ఈ గూచీ బ్యాగ్‌ ధర సుమారు రూ. 2 లక్షలు పైమాటే పలుకుతుందట. కాగా, కేన్స్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఐశ్వర్య ఎక్కడ అంటూ అందరు ఆరా తీయడం ప్రారంబించారు. అలాగే లోరియల్‌ పారిస్‌ పోస్టర్‌లో సైతం ఆమె కనపించకపోవడంతో సర్వత్ర ఆ బ్రాండ్‌పై విమర్శులు వెల్లువెత్తాయి. చివరికి స్పందించిన సదరు బ్రాండ్‌ పోస్టర్‌ కేన్స్‌లో ఐశ్వర్య ఆగమనం తప్పక ఉంటుందని,  ఆమె కాలాతీతమైన వ్యక్తి అని అభివర్ణించింది. 

(చదవండి: 
 

Advertisement
 
Advertisement
Advertisement