ఇస్లామాబాద్: భారత్‌లో వ్యంగ్యంగా ప్రారంభమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించింది. అక్కడి యువత కూడా కొత్త కొత్త పేర్లతో అకౌంట్లను క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
పాకిస్థాన్‌లో కాక్రోచ్ అవామీ పార్టీ, కాక్రోచ్ అవామీ లీగ్, ముత్తాహిదా కాక్రోచ్ మూవ్‌మెంట్ వంటి పేర్లతో కొత్త సోషల్ మీడియా అకౌంట్లు వెలుగులోకి వచ్చాయి. ‘సిస్టమ్ మనల్ని కాక్రోచ్‌లుగా భావించింది. మేమే ప్రజల స్వరం అని అకౌంట్ల బయోలో పేర్కొనడం గమనార్హం.
లోగోలు,బ్రాండింగ్
పాకిస్థాన్‌లోని ఈ అకౌంట్ లోగోలు భారతీయ వెర్షన్‌లను పోలి ఉన్నప్పటికీ అవి పచ్చ,తెలుపు రంగు ఉపయోగిస్తున్నాయి. ఇది స్థానిక రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమను చూపించడానికి ఒక వ్యూహాత్మక నిర్ణయం. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ పీటీఐ,పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వంటి ప్రధాన పార్టీలకు వ్యతిరేకంగా యువతను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.
యువతలో ప్రభావం
ఈ ఉద్యమం ఒక వ్యంగ్య రాజకీయ వేదికగా మారింది. నిరుద్యోగం, రాజకీయ వ్యవస్థపై అసంతృప్తి, యువతలోని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఇది ఒక కొత్త మార్గంగా నిలుస్తోంది. భారత్‌లో ప్రారంభమైన ఈ వ్యంగ్య ఉద్యమం ఇప్పుడు పాకిస్థాన్ యువత కూడా ఆకర్షితులవుతున్నారు.


