పశ్చిమ బెంగాల్‌లోని ఝార్‌గ్రామ్‌కు చెందిన ఝాల్‌మురి (మరమరాల చాట్) విక్రేత విక్రమ్ సౌ గుర్తున్నాడా? అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయన దుకాణం వద్ద ఆగి ఝూల్మురి తినడంతో విక్రమ్ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో వార్తల్లోకి ఎక్కారు. ఆయనకు ఇపుడు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి ప్రాణాపాయ బెదిరింపులు రావడం సంచలనంగా మారింది.
ప్రధాని మోదీకి స్నాక్స్ విక్రయించిన విక్రమ్‌కు పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నంబర్ల నుండి వరుసగా బాంబు దాడులు, చంపేస్తామని బెదిరింపు కాల్స్ రావడంతో కుటుంబం తీవ్ర భయాందోళనలకు గురవుతోంది. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు విచారణ ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా కూడా తీవ్ర కలకలం రేపింది.
ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా ఏప్రిల్ 19న ఝార్గ్రామ్లో జరిగిన బహిరంగ సభ ముగించుకుని వస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సాధారణ వీధి వ్యాపారి స్టాల్ వద్ద ఆగి ఝాల్‌మురి తిన్నారు. దానికి సంబంధించిన ఫోటోలను ఎక్స్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో విక్రమ్ రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యాడు. అయితే, ఈ పాపులారిటీ ఇప్పుడు అతడికి, అతడి కుటుంబానికి పెద్ద శాపంగా మారింది.ఒక్క రోజులో వచ్చిన గుర్తింపు ఆ కుటుంబానికి ఇలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Vikram Sao, who once served Jhalmuri to PM .@narendramodi Ji, claims he's receiving threats from Pakistan & Bangladesh.
Why's Pakistan & Bangladesh rattled with Mamata Bano's defeat? Has something big planned gone down gutter with BJP's win? Will any (P)AAPiya Cockroach answer… pic.twitter.com/HkjOvxRN6l— BhikuMhatre (@MumbaichaDon) May 22, 2026
ఈ ఘటన కాస్తా బెంగాల్ ఎన్నికల సమయంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (TMC) మధ్య పెద్ద రాజకీయ వివాదానికి దారితీసింది. అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీనిని "ముందుస్తుగా ప్లాన్ చేసిన డ్రామా" అని కొట్టిపారేశారు. దీదీ విమర్శలపై స్పందించిన మోదీ తాను కారంగా ఉండే ఝాల్‌మురి తింటే, టీఎమ్‌సీకి సెగ తగులుతోందని ఎద్దేవా చేశారు.
మరోవైపు మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మళ్లీ ఈ ఘటనను గుర్తుచేకోవడం విశేషం.


