తండ్రి సచిన్, తమ్ముడు అర్జున్, మరదలు సానియాతో సారా
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె టెండుల్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. సారా శరీరాకృతిని కించపరిచేలా ఓ పాపరాజీ ఆమె వీడియోకు చెత్త క్యాప్షన్ ఇచ్చాడు. ఇందుకు సారా దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది.
అసలేం జరిగిందంటే.. సారా తమ్ముడు అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సారా, అర్జున్ భార్య సానియా చందోక్ అతడితో కలిసి ఎయిర్‌పోర్టులోకి వెళ్తున్నపుడు తాహిర్ జాసూస్ అనే పాపరాజీ వీడియో తీశాడు.
లావుగా ఉన్న అమ్మాయి సారా అంటూ..
ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘లావుగా ఉన్న అమ్మాయి సారా.. ఆ పక్కనే ఉన్నది ఆమె మరదలు’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన సారా అతడికి గట్టి కౌంటర్ ఇచ్చింది.
నువ్వొక పనికిమాలిన వ్యక్తివి
‘‘తాహిర్ జాసూస్.. నువ్వొక పనికిమాలిన వ్యక్తివి. ఇది నిజమైన జర్నలిజం కాదు. మమ్మల్ని ఇలా వదిలెయ్. ఇప్పుడు నువ్వు మా వీడియోను డిలీట్ చేయొచ్చు. కానీ నీ పనికిమాలినతనం మాత్రం ఎక్కడికీ పోదు’’ అని సారా చురకలు అంటించింది.
ఈ నేపథ్యంలో సారాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘ఆడవాళ్లను బాడీ షేమింగ్ చేయడం అందరికీ బాగా అలవాటైపోయింది. అతడికి బాగా గడ్డిపెట్టావు. ఇకనైనా వేరే వాళ్ల గురించి ఇలాంటి చెత్త రాతలు రాసేముందు అతడికి ఇది గుర్తుకువస్తుంది’’ అని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: అఫ్గన్ మహిళా క్రికెటర్ల కోసం కదిలిన ఈసీబీ
This paparazzi body shamed Sara Tendulkar saying "moti wali sara hai or bagal wali bhabhi hai"
Today, Sara Tendulkar brutally crushed this pap and said "you are disgusting, this is not "journalism" leave us Alone"
This is the lowest level of media we saw! pic.twitter.com/63mCpSJ1eY— Chota Don (@choga_don) May 21, 2026


