‘దీదీ కాపాడు’ అని మొరపెట్టుకున్న కొన్ని క్షణాల్లోనే | Delhi Woman Gets Sisters Tragedy News In 7 Minutes After Bacha Lo Call, Family Alleges Murder | Sakshi
Sakshi News home page

‘దీదీ కాపాడు’ అని మొరపెట్టుకున్న కొన్ని క్షణాల్లోనే

May 22 2026 3:09 PM | Updated on May 22 2026 4:16 PM

Delhi Woman Gets Sisters tragedy news in 7 Minutes After Bacha Lo call

వరకట్నరక్కసి కోరలు సరికొత్తగా విస్తరిస్తున్న చాయలు ఇటవలికాలంలో బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యం రాజధాని నగరం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నిన్న గాక మొన్న ట్విషా శర్మ, దీపికా నాగర్‌ అనుమానాస్పద మరణం ఘటనలు కలకలంరేపాయి. కట్నం కోసమే తమ బిడ్డల్ని పొట్టనపెట్టుకున్నారని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపణల పర్వం కొనసాగుతుండగానే ఢిల్లీలో మరో  దారుణ ఘటన  వెలుగులోకి వచ్చింది. నన్ను బతికించండి అని మొరపెట్టుకున్న నిమిషాల వ్యవధిలోనే ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో శవమై తేలడం ఉద్రిక్తతను రాజేసింది.

వీణా కుమారి (28) 2022లో రాజు సింగ్‌తో వివాహమైంది. వీరికి ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. వివాహం జరిగిన కొద్దిరోజులకే వారు ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ నుండి ఢిల్లీలోని ఇందర్‌పురికి మకాం మారారు.  మృతురాలి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం పెళ్లి జరిగినప్పటి నుండి కట్నం విషయంలో వీణను భర్త రాజు వేధిస్తూ ఉండేవారు. నీకంటే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడినంటూ నిత్యం పోరు పెట్టేవాడు. మరోవైపు ఇటీవలే పెళ్లి  చేసుకున్న మరిది రాజ్‌కుమార్ తన భార్య తెచ్చిన కట్నంతో (46 ఇంచుల టీవీ, బైక్) వీణ తెచ్చిన కట్నాన్ని (32 ఇంచుల టీవీ) పోల్చుతూ వేధించేవాడు. ఇద్దరూ కలిసి వీణను   మానసికంగా, శారీరకంగాహింసించేవారు.  ఎంతలా అంటే ఒకసారి కొట్టిన దెబ్బలకు వీణ కర్ణభేరి పగిలిపోయింది.


దీంతో పాటు ఇటీవల రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్  బైక్, అదనపు ట్నం వేధింపులు మరింత పెరిగాయి. అయితే కుటుంబం పరువు పోతుందనే భయంతోనే  ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా  సోదరి వీణ ఆపిందని ఆయన పేర్కొన్నారు. ఇంతలోనే అన్యాయం  జరిగిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.  

7 నిమిషాల్లో అంతా
రాత్రి  పదిగంటలకు వీణ తన సోదరి రీనాకి ఫోన్‌  చేసింది.  ఏడుస్తూ.. "దీదీ నన్ను కాపాడు. వీళ్లు నన్ను బాగా కొడుతున్నారు. నన్ను బతకనివ్వరు. చంపేస్తారు" అని చెప్పింది. అంతేకాదు తను చనిపోయాక తన 6 నెలల కొడుకును జాగ్రత్తగా చూసు కోమని వేడుకుంది. అంతలోనే కాల్ కట్ అయింది. ఆందోళన చెందిన రీనా తిరిగి ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదు. వెంటనే ఆమె వీణ ఇంటికి బయలుదేరింది. బచా లో దీదీ అని ప్రాధేయపడిన కేవలం 7 నిమిషాలకే, వీణ బావ రీనాకు ఫోన్ చేసి, "వదిన మేడ పైనుంచి కింద పడిపోయింది" అని చెప్పాడు. రీనా అక్కడికి చేరేలోపే వీణ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

దీంతో అదనపు కట్నం కోసం ఆమె అత్తవారింటి వారే భవనం పైనుంచి తోసి చంపేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ కొనసాగుతోందని పశ్చిమ ఢిల్లీ డీసిపీ శరద్ భాస్కర్ వెల్లడించారు.

అత్తవారింటి వాదన
వీణ మామ జైపాల్ ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించారు. దంపతుల మధ్య చిన్నచిన్న గొడవలు సహజమేనని, తాము ఒక్క స్పూన్ కూడా కట్నం అడగలేదని చెప్పారు. ఆమె భవనం పైనుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోయిందని భర్త రాజు సింగ్ వాదిస్తున్నాడు.

ఇదీ చదవండి: వర్క్‌ ఫ్రం హోం కాదు.. వర్క్‌ ఫ్రం బీచ్, అదీ గోవాలో

Advertisement
 
Advertisement
Advertisement