రాకుమారి... మూడు ఉద్యోగాలు! | Meet Princess Jahnavi Kumari From Historic Mewar Region, The Royal Princess Who Chose Hard Work Over Luxury | Sakshi
Sakshi News home page

రాకుమారి... మూడు ఉద్యోగాలు!

May 22 2026 6:15 AM | Updated on May 22 2026 10:52 AM

Princess Jahnavi Kumari Mewar says she worked 3 jobs

అసామాన్యురాలు

‘నాకు చాలా డబ్బు ఉంది. కాలు మీద కాలేసుకొని బతుకుతాను. కష్టపడను’ అనుకోవడం ఒక రకం. ‘ఎంత డబ్బున్నా సరే, కష్టపడతాను. కష్టంలోనే ఇష్టాన్ని వెదుక్కుంటాను’ అనుకోవడం రెండో రకం. రాజస్థాన్‌లోని మేవార్‌ రాకుమారి జాహ్నవి రెండో కోవకు చెందిన మహిళ.

‘ సంపన్న కుటుంబంలో పుట్టాను. భారతదేశంలో ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన చివరి రాజు మా తాతగారి అన్నయ్య. ఆ తర్వాత రాచరికం ఉనికిలో లేదు. నేను చాలామంది పిల్లల్లాగే పెరిగాను. తేడా ఏమిటంటే నేను మా కజిన్స్‌తో కలిసి రాజభవనంలోనే స్కూల్‌కు వెళ్లాను’ అంటుంది జాహ్నవి.

‘రాజ కుటుంబంలో పెరగడం అంటే అపరిమితమైన విలాసం కాదు’ అంటున్న జాహ్నవి మెల్‌బోర్న్‌లో చదువుకుంటున్నప్పుడు క్యాటరింగ్, టెలి మార్కెటింగ్, క్లబ్‌ ప్రమోషన్‌కు సంబంధించి మూడు వేర్వేరు ఉద్యోగాలు చేసేది.  అసైన్‌మెంట్లు చేస్తూ, క్లాస్‌లకు వెళ్తూనే మూడు ఉద్యోగాలు చేసేది.

‘కుటుంబ ఆస్తులను అతిథులకు చూపించేదాన్ని. ప్రముఖుల సంభాషణలను దగ్గరి నుంచి వినేదాన్ని. ఈ అనుభవాలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి, మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఇదంత ఒక ఎత్తయితే మెల్‌బోర్న్‌లో మూడు ఉద్యోగాలు చేయడం మరో ఎత్తు. ఎన్నో నేర్చుకున్నాను’ అంటుంది రాకుమారి జాహ్నవి.
 

Advertisement
 
Advertisement
Advertisement