Mewar Family
-
రాకుమారి... మూడు ఉద్యోగాలు!
‘నాకు చాలా డబ్బు ఉంది. కాలు మీద కాలేసుకొని బతుకుతాను. కష్టపడను’ అనుకోవడం ఒక రకం. ‘ఎంత డబ్బున్నా సరే, కష్టపడతాను. కష్టంలోనే ఇష్టాన్ని వెదుక్కుంటాను’ అనుకోవడం రెండో రకం. రాజస్థాన్‌లోని మేవార్ రాకుమారి జాహ్నవి రెండో కోవకు చెందిన మహిళ.‘ సంపన్న కుటుంబంలో పుట్టాను. భారతదేశంలో ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన చివరి రాజు మా తాతగారి అన్నయ్య. ఆ తర్వాత రాచరికం ఉనికిలో లేదు. నేను చాలామంది పిల్లల్లాగే పెరిగాను. తేడా ఏమిటంటే నేను మా కజిన్స్‌తో కలిసి రాజభవనంలోనే స్కూల్‌కు వెళ్లాను’ అంటుంది జాహ్నవి.‘రాజ కుటుంబంలో పెరగడం అంటే అపరిమితమైన విలాసం కాదు’ అంటున్న జాహ్నవి మెల్బోర్న్లో చదువుకుంటున్నప్పుడు క్యాటరింగ్, టెలి మార్కెటింగ్, క్లబ్ ప్రమోషన్‌కు సంబంధించి మూడు వేర్వేరు ఉద్యోగాలు చేసేది. అసైన్మెంట్లు చేస్తూ, క్లాస్‌లకు వెళ్తూనే మూడు ఉద్యోగాలు చేసేది.‘కుటుంబ ఆస్తులను అతిథులకు చూపించేదాన్ని. ప్రముఖుల సంభాషణలను దగ్గరి నుంచి వినేదాన్ని. ఈ అనుభవాలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి, మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఇదంత ఒక ఎత్తయితే మెల్బోర్న్లో మూడు ఉద్యోగాలు చేయడం మరో ఎత్తు. ఎన్నో నేర్చుకున్నాను’ అంటుంది రాకుమారి జాహ్నవి. -
రాజకుటుంబం.. డబ్బు కష్టం: జాహ్నవి కుమారి మేవార్
రాజుల గురించి, రాజకుటుంబాల గురించి చాలామంది పుస్తకాల్లో చదువుకుని ఉంటారు. భారతదేశంలో రాజరిక వ్యవస్థ అధికారికంగా అంతరించిపోయినప్పటికీ.. కొన్ని రాజ కుటుంబాలు మాత్రం తమ సంపదను కాపాడుకుంటూ.. కొత్త తరానికి అనుగుణంగా వ్యాపారాలను అభివృద్ధి చేస్తున్నాయి. అలాంటి కుటుంబాల్లో మేవార్ రాజ కుటుంబం ఒకటి.ప్రస్తుతం ఈ కుటుంబం వివిధ వ్యాపారాలు చేస్తూ, పెట్టుబడులు పెడుతూ ముందుకు సాగుతోంది. వీరికి కూడా డబ్బు సమస్య ఉంటుంది. ఈ విషయాన్ని జాహ్నవి కుమారి మేవార్ వెల్లడించారు. ఈమె చదువుకునే రోజుల్లో పలు ఉద్యోగాలు కూడా చేసినట్లు చెప్పారు.వ్యాపార జీవితానికి బలమైన పునాదిజాహ్నవి కుమారి చిన్నప్పటి నుంచే రాజభవన వాతావరణంలో పెరిగింది. ఇతర పిల్లల్లానే ఆమె కూడా సాధారణ బాల్యాన్ని అనుభవించినప్పటికీ, ఆమె చదువు రాజభవనం లోపలే తన బంధువులతో కలిసి సాగింది. చిన్న వయసులోనే ప్రముఖులు, విదేశీ అతిథులను కలవడం వల్ల ఆమెకు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, అనే నైపుణ్యాలు సహజంగానే వచ్చాయి. ఇవే తర్వాత ఆమె వ్యాపార జీవితానికి బలమైన పునాది అయ్యాయి.ఆమె కుటుంబానికి రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, వినియోగ వస్తువులు, విద్య వంటి అనేక రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి. చిన్నప్పటి నుంచే తండ్రి ఆఫీస్ పట్ల ఆమెకు ప్రత్యేక ఆసక్తి ఉండేది. తండ్రి కుర్చీలో కూర్చొని ఫైళ్లపై సంతకాలు చేయాలని పట్టుబడే ఆ చిన్నారి, తర్వాత నిజంగా కుటుంబ వ్యాపార బాధ్యతలను చేపట్టింది.మూడు ఉద్యోగాలు చేస్తూ..అయితే.. రాజ కుటుంబానికి చెందిన వారికి కూడా డబ్బు డబ్బు సమస్య ఉంటుందని జాహ్నవి స్పష్టం చేసింది. విదేశాల్లో చదువుతున్న సమయంలో ఆమెకు అవసరమైన ఖర్చులు మాత్రమే కుటుంబం భరించింది. అదనంగా.. ఆమె క్యాటరింగ్, క్లబ్ ప్రమోషన్, టెలిమార్కెటింగ్ వంటి మూడు ఉద్యోగాలు చేస్తూ చదువు కొనసాగించింది. దీని ద్వారా కష్టపడి సంపాదించే విలువ ఆమెకు అర్థమైంది.తన ఇరవై ఏళ్ల ప్రారంభంలోనే.. జాహ్నవి కుటుంబ పెట్టుబడి వ్యవస్థను మార్చడం ప్రారంభించింది. పెట్టుబడుల్లో పారదర్శకత, బాధ్యత, దీర్ఘకాల లాభాలపై ఆమె ఎక్కువ దృష్టి పెట్టింది. ఆమె తీసుకున్న మొదటి నిర్ణయాల్లో ఒకటి.. కుటుంబంతో కలిసి పెట్టుబడులు పెట్టే బంధువులు, స్నేహితులు తమ ఖర్చులను తామే భరించాలి అనేది. మొదట ఆమె తండ్రి దీనికి వ్యతిరేకించినా, తర్వాత అదే నిర్ణయం కుటుంబ ఆర్థిక వ్యవస్థను మరింత క్రమబద్ధం చేసింది.పెట్టుబడి విధానంలో మార్పు!అంతేకాకుండా.. ఆమె పెట్టుబడి విధానాన్ని కూడా పూర్తిగా మార్చింది. మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. బ్యాంకర్లు, సలహాదారులు, అకౌంటెంట్లు వంటి మధ్యవర్తులు ఖర్చును పెంచుతారని, బాధ్యతను తగ్గిస్తారని ఆమె భావించింది. అందుకే ఆమె కుటుంబాన్ని ప్రపంచవ్యాప్తంగా కొత్త అవకాశాల వైపు మళ్లించింది, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లపై దృష్టి పెట్టింది.ఒక యువతి, అది కూడా రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో, పెద్దవారి మధ్య తనను తాను నిరూపించుకోవడం ఆమెకు సులభం కాలేదు. చాలామంది ఆమె సామర్థ్యాన్ని అనుమానించారు. అయినప్పటికీ, ఆమె ధైర్యంగా ముందుకు సాగింది. ఆమె జీవితంలో మరో ముఖ్యమైన విషయం “సంపదను ముందుగా కాపాడుకోవాలి, తర్వాతే పెద్ద రిస్క్‌లు తీసుకోవాలి” అనే పాఠం. ఈ విషయాన్ని ఆమె కుటుంబానికి ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసిన అనుభవజ్ఞులైన సలహాదారులు నేర్పారు. సంపదను కేవలం ఖర్చు చేయడం కాదు, దాన్ని తరతరాలకు నిలబెట్టడం ముఖ్యం అని అర్థం చేసుకుంది.ఇదీ చదవండి: బంగారం కొనుగోలుపై.. 1967లో ఇదే జరిగిందా? -
ఉదయ్‌పూర్‌లో ఫ్యామిలీ డ్రామా.. ఆ వీలునామాలో అసలేముంది?
జైపూర్: మొఘలులుపై పోరాడిన మహారాణా ప్రతాప్ వారసులు ఆస్తుల కోసం, అధికారం కోసం వీధిన పడ్డారు. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్ కోట వద్ద కొత్త మహారాజు పట్టాభిషేకం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మేవాడ్ 77వ మహారాజుగా పట్టాభిషిక్తుడైన విశ్వరాజ్ సింగ్, ఆయన అనుచరులను ప్యాలెస్‌లోకి అడుగుపెట్టకుండా రాజ కుటుంబంలోని సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి.. పలువురు గాయపడ్డారు.ఏంటి ఈ మహరాణా ప్రతాప్ వారసుల గొడవమహారాణా ప్రతాప్ ప్రసిద్ధ రాజపుత్ర యోధుడు. రాజస్థాన్‌లోని మేవార్ రాజు. భారతదేశ స్వాంతంత్య్ర ఉద్యమంలో మహారాణా భూపాల్ సింగ్ మేవార్ రాజు. ఈయన 1955లో శ్రీ ఎక్లింగ్జీ ( Shri Eklingji Trust) ట్రస్ట్‌ను స్థాపించారు. ఆ ట్రస్ట్ బాధ్యతల్ని ఆయన వారసులు కొనసాగిస్తూ వచ్చారు. అయితే క్రమేపీ ఈ ట్రస్ట్ వ్యవహారాలు పాలన విషయంలో కుటుంబసభ్యుల మధ్య పొరపచ్చాలు వచ్చాయి.75వ మహారాణా విశ్వరాజ్ సింగ్ తాత భగవత్ సింగ్‌కు ఇద్దరు కుమారులు. వారిలో ఒకరు మహేంద్ర సింగ్ కాగా మరొకరు అరవింద్ సింగ్. తన మరణానికి ముందు ట్రస్ట్ నిర్వాహక బాధ్యతల నుంచి తన పెద్ద కుమారుడు మహేంద్ర సింగ్‌ను తప్పించి తన చిన్న కుమారుడు అరవింద్ సింగ్‌కు అప్పగించారు భగవంత్ సింగ్.వీలునామాలో ఉంది ఇదే..తండ్రి నిర్ణయంతో కలత చెందిన మహేంద్ర సింగ్ కోర్టును ఆశ్రయించారు. మే 15, 1984 నాటి తన చివరి వీలునామాలో భగవత్ సింగ్ తన పెద్ద కుమారుడు మహేంద్ర సింగ్‌ను కుటుంబం నుంచి వెలివేస్తున్నట్లు పేర్కొన్నారు. తన చిన్న కుమారుడే ట్రస్ట్ కార్యనిర్వహకుడిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అదే ఏడాది నవంబర్‌లో తండ్రి భగవత్ సింగ్ మరణించడంతో ట్రస్ట్ ఛైర్మన్‌గా అరవింద్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. అయితే..ఈ ఏడాదిలో మహేంద్ర సింగ్ మరణానంతరం.. ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ మేవాడ్ 77వ మహారాజుగా సోమవారం పట్టాభిషేకం చేశారు. చిత్తోర్‌గఢ్ కోటలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం, సంప్రదాయం ప్రకారం కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయ్‌పుర్‌లోని సిటీ ప్యాలెస్‌ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంటుంది.అయితే, ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంగా ఉన్న అరవింద్ సింగ్ మేవార్ .. తన కుమారుడు లక్షయ్ రాజ్ సింగ్ మేవార్ తమ బలగాన్ని ఉపయోగించి విశ్వరాజ్ సింగ్ మేవాడ్‌ను రాజభవనంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఈక్రమంలో విశ్వరాజ్ మద్దతుదారులు రాళ్లదాడికి దిగారు. లక్షయ్ రాజ్ సింగ్ మేవార్ అనుచరులు సైతం ప్రతి దాడులకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపై పోలీసుల ఎంట్రీతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.


