బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. మలయాళ చిత్రసీమలో స్టార్స్ అయిన మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, నయనతార, రేవతి, దర్శన రాజేంద్రన్, కుంచకో బోబన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఇంతకీ ఏ ఓటీటీలోకి రానుంది? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుంది?
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా)
మలయాళ టాప్ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టి.. దాదాపు 18 ఏళ్ల తర్వాత కలిసి నటించిన సినిమా 'పేట్రియాట్'. మహేశ్ నారాయణన్ దర్శకుడు కాగా స్పై యాక్షన్ థ్రిల్లర్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందు ఓ మాదిరి హైప్ తెచ్చుకుంది. ఈ నెల 1వ తేదీన థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేయబోతుంది. జూన్ 5 నుంచి జీ5లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుందని తాజాగా ప్రకటించారు.

'పేట్రియాట్' విషయానికొస్తే.. డేనియల్ జేమ్స్ (మమ్ముట్టి) డీఆర్‌డబ్ల్యూలో సైంటిస్ట్. దేశ రహస్యాలు వేరేవాళ్లకు ఇచ్చేశాడని ఇతడిపై దేశద్రోహి ఆరోపణలు వస్తాయి. దీంతో లండన్‌కి పారిపోతాడు. విమదన్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టి వీడియోలు చేస్తుంటాడు. ఓసారి డేనియల్ బయటపెట్టిన ఓ రహస్యం వల్ల మంత్రి తనయుడు, శక్తి కార్పొరేషన్ అధినేత శక్తి సుందరం (ఫహాద్ ఫాజిల్) చిక్కుల్లో పడతాడు. దీంతో డేనియల్‌పై హత్యాప్రయత్నం జరుగుతుంది. ఇంతకీ ఇదెవరు చేశారు?
శక్తి కార్పొరేషన్‌లో పనిచేసే జ్యోతి (దర్శన రాజేంద్రన్), నళిని హత్యలకు కారణమెవరు? శక్తి కార్పొరేషన్ వల్ల జరిగే డేటా చోరీతో ఎలాంటి అనర్ధాలు ఏర్పడ్డాయి? పేదలు ఎలా మోసపోతున్నారు? శక్తిని డేనియల్ జేమ్స్ ఎలా ఎదుర్కొన్నాడు? ఆయనకు కల్నల్ రహీమ్ నాయక్ (మోహన్ లాల్) నుంచి ఎలాంటి సపోర్ట్ దొరికింది? లాయర్ లతిక (నయనతార), శక్తి సొల్యూషన్స్ ఉద్యోగి మైఖేల్ (కుంచుకో బోబన్) ఏం చేశారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: సీఎం విజయ్‌ని టార్గెట్ చేసి తీసిన సినిమా.. ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్)


