చిరంజీవితో 'విశ్వంభర' తీసిన దర్శకుడు వశిష్ట సోదరుడు కృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'తక్షక'. కుశాల్ రాజు హీరోగా పరిచయమవుతున్నాడు. డా.లతారాజు నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామా కథతో రూపొందుతున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర పోస్టర్‌ని స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేశారు.
(ఇదీ చదవండి: లేడీ యూట్యూబర్‌పై కేసు పెట్టిన యాంకర్ విష్ణుప్రియ)
చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలిసిన కుర్రాడు కృష్ణ. ఫస్ట్ టైమ్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీ చాలా బాగుండాలి, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి అని వినాయక్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఇంత త్వరగా పూర్తయి దర్శకుడిగా నేను మీ ముందుకు రావడం ఎగ్జైటింగ్‌గా ఉంది. సీజీ వర్క్ పూర్తిచేసి ఒక గొప్ప మూవీని మీకు అందించబోతున్నాం అని డైరెక్టర్ కృష్ణ మల్లిడి అన్నారు.
(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు)


