యూట్యూబర్‌పై కేసు పెట్టిన యాంకర్ విష్ణుప్రియ | Anchor Vishnu Priya Filed Case Another Youtuber | Sakshi
Sakshi News home page

Anchor Vishnu Priya: విష్ణుప్రియపై సోషల్ మీడియాలో వేధింపులు

May 22 2026 5:59 PM | Updated on May 22 2026 6:21 PM

Anchor Vishnu Priya Filed Case Another Youtuber

దాదాపు నెలరోజుల క్రితం ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ కారణంగా వార్తల్లో నిలిచిన యాంకర్ విష్ణుప్రియ.. ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది. తోటి యూట్యూబర్‌పై హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే దీనికి కారణం. తన వ్యక్తిగత, వృత్తిపర జీవితంపై నిజాలు వక్రీకరిస్తూ వీడియోలు చేస్తున్నారని కంప్లైంట్‌లో పేర్కొంది.

(ఇదీ చదవండి: అమ్మకానికి 'ఐమాక్స్'?)

అసలేం జరిగింది?
యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి తర్వాత బిగ్‌బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ.. ప్రస్తుతానికైతే కొత్తగా ఎలాంటి సినిమాలు చేస్తున్నట్లు లేదు. పలు షోల్లో అడపాదడపా కనిపిస్తోంది. అయితే ఈమె అసభ్య వీడియోలతో యువతని పెడదారి పట్టిస్తోందని, సబ్‌స్క్రిప్షన్ పేరిట లక్షల రూపాయలు సంపాదిస్తుందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది.

అయితే ఈ విషయాన్ని ఆధారంగా చేసుకుని సోనాలి అనే తెలుగు యూట్యూబర్.. విష్ణుప్రియపై రోస్టింగ్ వీడియో చేసింది. ఈ క్రమంలోనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న సదరు యూట్యూబర్‌పై నాలుగు రోజుల క్రితం మియాపుర్ పోలీస్ స్టేషన్‌లో విష్ణుప్రియ ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఇకపై ఏ యూట్యూబర్ అయినా తనని వేధించేలా వీడియోలు చేస్తూ ఇలానే కేసులు నమోదవుతాయని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. విష్ణుప్రియ కేసు పెట్టగానే సదరు యూట్యూబర్.. ఈమెకు సంబంధించిన వీడియోని డిలీట్ చేసింది!

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement