రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కనిపించనుంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. సూపర్ హిట్ ఖాయమంటూ మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
అంతేకాకుండా ఈ మూవీ ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందని మేకర్స్ ప్రకటించారు. ఈ ఐటమ్ సాంగ్ కోసం చాలా మంది హీరోయిన్ల పరిశీలించిన మేకర్స్.. చివరికీ కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్‌ను ఎంపిక చేశారు. ఈ సాంగ్‌లో రామ్ చరణ్ సరసన శృతిహాసన్ స్టెప్పులు వేయనుంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. హల్లల్లో హల్లల్లో అంటూ సాగే ఈ పాట ప్రోమో చూస్తుంటే మెగా ఫ్యాన్స్‌ను ఊపేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఫుల్ సాంగ్‌ను మే 23న భోపాల్‌లో జరగనున్న ఈవెంట్‌లో రిలీజ్ చేయనున్నారు.


