ఉప్పల్ స్టేడియంలో నేడు సన్ రైజర్స్ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్
సొంతగడ్డపై చివరి మ్యాచ్‌తో డిమాండ్
టికెట్లకు అభిమానుల విఫల యత్నం .. యాప్‌లలో దొరక్క అసంతృప్తి
ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో చివరి మ్యాచ్ కావడంతో అభిమానులు ఎలాగైనా చూడాలంటూ టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉప్పల్ వైపు వచ్చే అన్ని భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు తెలిపారు. మెట్రో రైల్ సేవలను అర్థరాత్రి 1 గంట వరకు పొడిగించారు.


