Technology
-
'నా కొడుకు చావుకు గూగుల్, ఏఐ కంపెనీలే కారణం'
టెక్నాలజీ వల్ల లాభాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడు నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అయిన క్యారెక్టర్.ఏఐ తన కొడుకు ఆత్మహత్యకు కారణమైందని ఓ తల్లి కోర్టు మెట్లెక్కింది.అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతానికి చెందిన మెగన్ గార్సియా.. తన 14 ఏళ్ల కొడుకు 'సెవెల్ సెట్జర్' ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏఐ చాట్‌బాట్‌తో చాటింగ్ చేసినట్లు పేర్కొంది. పిల్లల మానసిక బాధ లేదా ప్రవర్తన నుంచి బయట పడేయడంలో ఏఐ విఫలమైందని ఆ మహిళ ఆరోపించింది.ఏఐ చాట్‌బాట్ పట్ల ఒక యువకుడు ఎంతగానో మక్కువ పెంచుకున్నాడనే దానివల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే చాట్బాట్ల అవుట్‌పుట్ రాజ్యాంగబద్ధంగా ఉన్న స్వేచ్ఛా వాక్ స్వాతంత్య్రాన్ని కలిగి ఉన్నందున కేసును కొట్టివేయాలని గూగుల్, ఏఐ సంస్థ విజ్ఞప్తి చేశాయి. అయితే దీనిపై యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అన్నే కాన్వే ఏకీభవించలేదు. అంతే కాకుండా కంపెనీ తప్పకుండా జవాబుదారీ తనంతో ఉండాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులుఏఐ చాట్‌బాట్ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. అయితే అడిగే ప్రశ్న మంచిదా?, ప్రమాదాన్ని కలిగిస్తుందా? అనే విషయం ఏఐ గుర్తించడం లేదు. ఒక వ్యక్తి ఎలా చనిపోవాలి అని అడిగితే.. దానికి కూడా తనదైన రీతిలో సమాధానం చెబుతుంది. మానసిక బాధతో ఉన్న వ్యక్తులు ఏఐను ఒక ఫ్రెండ్ లేదా అంతకంటే ఎక్కువే అనుకుంటారు. అలాంటి సమయంలో ఏఐ ఇచ్చే సలహాలు ప్రమాదానికి కారణమవుతున్నాయి. కాబట్టి ప్రశ్న ఎలాంటిదో.. ముందు ఏఐ దానిని తప్పకుండా గమనించేలా కంపెనీలు కూడా సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులు
ఏఐ రాకతో సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం దాదాపు అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా కొనసాగుతోంది. హ్యుమానాయిడ్ రోబోలు ప్రతి పనిలోనూ ఊహించినదానికంటే వేగంగా ముందుకు సాగుతున్నాయి. మానవుల కంటే వేగంగా పనులు పూర్తి చేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో మనుషులు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇప్పటికే జపాన్, చైనా వంటి దేశాల్లో రోబోలను నిర్మాణ పనులలో ఉపయోగిస్తున్నారు. ఇవి మనుషుల కంటే వేగంగా గోడ కేట్టేస్తున్నాయి, ఫినిషింగ్ కూడా ఇచ్చేస్తున్నాయి. నిర్మాణ పరిశ్రమలో రోబోలు గణనీయమైన మార్పులు తెస్తున్నాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.చైనాలో కొన్ని రోబోలను రాత్రి సమయంలో గ్యాస్ స్టేషన్లలో సేవలకు నియమించారు. ఇవి కస్టమర్లకు కావాల్సిన సేవలను అందిస్తున్నాయి. రాత్రి సమయంలో మనుషులు పని చేయడం కొంత కష్టమే. కానీ రోబోలు మాత్రం విశ్రాంతి తీసుకోకుండా.. పనిచేస్తూ ముందుకు సాగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణలోనూ.. సూచిక బోర్డులను వేయడంలోనూ రోబోలు పనిచేస్తున్నాయి.ఇప్పటికే విమానాశ్రయాలు, హోటల్స్ లేదా రెస్టారెంట్లలో.. రోబోలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మనుషుల స్థానంలో ఇవి పనిచేస్తూ.. నిర్విరామంగా సేవలందిస్తున్నాయి. ఫ్యాక్టరీలో సర్వీసింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, సెన్సార్ ఆధారిత పర్యవేక్షణ వంటి పనుల్లో కూడా రోబోల వినియోగం ఎక్కువగానే ఉంది.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరికఎలక్ట్రిక్ సమస్యలను క్లియర్ చేయడంలో కూడా రోబోలు పాత్ర ప్రశంసనీయం. హై వోల్టేజ్ పవర్ మరమ్మత్తుల సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ రంగంలో రోబోలను ఉపయోగించడం వల్ల.. ప్రాణహాని ఉండదు. అంతే కాకుండా పని కూడా వేగవంతం అవుతుంది. మొత్తం మీద ప్రతి రంగంలోనూ మాయ చేస్తున్నట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram A post shared by AI researches | AI (@airesearches) -
'టాకింగ్ ట్రీ'..నిజంగానే మొక్కతో మాట్లాడే టెక్నాలజీ..!
చిన్నప్పుడు సరదాగా చెట్టు వెనుకదాక్కుని దాంతో మాట్లాడటం వంటివి చేసేవాళ్లం. ఆ సరదా అల్లరే వేరు. కొందరు ప్రకృతి ప్రేమికులు చెట్లనే తమ ఆత్మీయులుగా వాటితోనే మాట్లాడటం, పెళ్లి చేసుకోవడం వంటివి చేసిన ఘటనలు చూశాం. అలాగే పరిశోధకులు చెట్టుకు ప్రాణం, ఉంది అవి కూడా స్పందిస్తాయని చెప్పారు. అది ఎంత వరకు నిజం అనేది కూడా ప్రయోగాత్మకంగా ప్రూవ్ చేశారు. అవి ఎలా తన పక్క చెట్లతో సంభాషిస్తుందో కూడా వివరించారు. ఇప్పుడూ ఏకంగా చెట్టుతో నేరుగా మాట్లాడే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధిపరచడమే కాదు..మాట్లాడే అవకాశం కూడా ఇస్తున్నారు. అదెలాగో సవిరంగా తెలుసుకుందాం..!.ఐర్లాండ్ రాజధానిలలోని ట్రినిటి కాలేజ్‌లో 'టాకింగ్ ట్రీ' అనే టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఏఐ సాంకేతికతతో చెట్టుకు స్వరాన్ని అందిస్తారు. అందుకోసం పర్యావరణ సెన్సార్లు ఉపయోగించుకుంటుంది. అంటే ఇక్కడ సెన్సార్లుగా నేల తేమ, నేల pH, గాలి ఉష్ణోగ్రత, తేమ, సూర్యకాంతి, గాలి నాణ్యత' తదితరాల ఆధారంగా 'బయోఎలక్ట్రికల్ సిగ్నల్స్'ని తీసుకుంటుంది. ఆ సిగ్నల్స్‌ని ఏఐ సాంకేతికత మానవులకు అర్థమయ్యే భాషలా మారుస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు లక్ష్యం కేవలం ప్రకృతి ప్రయోజనార్థమే చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రకృతితో మనం అనుసంధానమై ఉంటే..అకస్మాత్తుగా అంటుకుని కార్చిచ్చులను సకాలంలో నివారించడం సాధ్య పడుతుందని చెబుతున్నారు. అంతేగాదండోయ్ తాము చెట్టుతో ఎలా సంభాషిస్తున్నామో వీడియో రూపంలో సవివరంగా చూపించారు. అక్కడ ట్రినిటీ కాలేజ్‌లో దాదాపు 200 ఏళ్ల నాటి లండన్ ప్లేన్ ట్రీ వేర్లకు వైర్లకు టెక్నాలజీని అనుసంధానించి మాట్లాడుతున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ఆ పురాతన చెట్టుతో ఏవిధంగా సంభాషిస్తున్నాడో స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. View this post on Instagram A post shared by RTÉ News (@rtenews) (చదవండి: డ్యాన్స్ బేబీ డ్యాన్స్..! పార్కిన్సన్స్కు నృత్య చికిత్స) -
టీసీఎస్‌కు రూ. 2,903 కోట్ల ఆర్డర్
న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తాజాగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి రూ. 2,903 కోట్ల యాడ్–ఆన్ అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డరు (ఏపీవో) దక్కించుకుంది. దీని ప్రకారం బీఎస్ఎన్ఎల్కు 18,685 సైట్లలో 4జీ మొబైల్ నెట్వర్క్ ప్లానింగ్, ఇంజినీరింగ్, సరఫరా, ఇన్‌స్టాలింగ్, టెస్టింగ్, వార్షిక మెయింటెనెన్స్ మొదలైన సర్వీసులను టీసీఎస్ అందించాల్సి ఉంటుంది.ఏపీవోలో పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలకు లోబడి సవివర పర్చేజ్ ఆర్డర్లను (పీవో) బీఎస్ఎన్ఎల్ జారీ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కాంట్రాక్టుకు సంబంధించి తాము టీసీఎస్‌కు సరఫరా చేసే రేడియో యాక్సెస్ నెట్వర్క్ (ఆర్ఏఎన్), ఇతరత్రా పరికరాల విలువ సుమారు రూ. 1,526 కోట్లుగా ఉంటుందని తేజాస్ నెట్వర్క్స్ పేర్కొంది. నిర్దిష్ట షరతులకు లోబడి టీసీఎస్ సవివర పీవోలను జారీ చేస్తుందని వివరించింది. -
జియో, ఎయిర్టెల్, వీఐ.. చవకైన రీచార్జ్ ప్లాన్లు ఇవే...
టెలికాం కంపెనీలు టారీఫ్‌లు పెంచిన తర్వాత మొబైల్ రీఛార్జ్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో చవకైన రీచార్జ్ ప్లాన్ల కోసం వినియోగదారులు చూస్తుంటారు. అటువంటివారి కోసం కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ వంటి అవసరమైన అన్ని ప్రయోజనాలను తక్కువ ధరలో అందించే రీచార్జ్ ప్లాన్లను ఇక్కడ అందిస్తున్నాం. జియో, ఎయిర్ టెల్, వీఐలు రూ.200 లోపు ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇవి అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, ఎస్ఎంఎస్, అనేక అదనపు ప్రయోజనాలను అందిస్తాయి.ఎయిర్టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ఎయిర్ టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇందులో, వినియోగదారులు మొత్తం 2 జిబి డేటా (రోజువారీ పరిమితి లేకుండా), ఏ నెట్‌వర్క్‌లోనైనా లోకల్, ఎస్టీడీ, రోమింగ్ అపరిమిత కాల్స్ పొందుతారు. ఈ ప్లాన్‌లో మొత్తం 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.జియో రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్జియో రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులు. ఈ ప్లాన్ ద్వారా మొత్తం 2 జీబీ డేటా, మొత్తం 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అలాగే, ఈ ప్లాన్ అపరిమిత కాల్స్ ప్రయోజనాన్ని అందిస్తుంది. జియో టీవీ సబ్ స్క్రిప్షన్, జియోక్లౌడ్ వంటి అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి.వీఐ రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్వొడాఫోన్ ఐడియా రూ .189 ప్రీపెయిడ్ ప్లాన్ 26 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఇది మొత్తం 1 జిబి డేటా (రోజువారీ పరిమితి లేకుండా), మొత్తం 300 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాల్స్, వీఐ మూవీస్ అండ్ టీవీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 18 రోజులు. రోజుకు 1.5 జీబీ డేటా, ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. జియో టీవీ సబ్ స్క్రిప్షన్, జియోక్లౌడ్ వంటి అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి.వీఐ రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్విఐ రూ .189 ప్రీపెయిడ్ ప్లాన్ 26 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఇది మొత్తం 1 జిబి డేటా (రోజువారీ పరిమితి లేకుండా), మొత్తం 300 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాల్స్, వీఐ మూవీస్ అండ్ టీవీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. -
మొబైల్ ఫోన్ హ్యాక్: రూ.11.55 కోట్లు మాయం
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. అమాయక ప్రజలు మాత్రమే కాకుండా.. కొన్ని సంస్థలు కూడా వీరి మాయలో పడిపోతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకుకు సంబంధించిన ఒక పెద్ద ఆన్లైన్ మోసం సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో మోసగాళ్ళు ఒక కస్టమర్ మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేయడం ద్వారా ఏకంగా రూ. 11.55 కోట్లు విత్‌డ్రా చేశారు.మోసగాళ్ళు ఒక కస్టమర్‌ను మోసగించి మొబైల్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకునేలా చేశారు. దీని ద్వారా చంబా జిల్లాలోని బ్యాంక్ హల్టి బ్రాంచ్‌కు లింక్ అయిన అతని బ్యాంక్ ఖాతాకు యాక్సెస్ లభించింది. అంతే కాకుండా బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి NEFT, RTGS లావాదేవీల ద్వారా 20 ఖాతాలకు డబ్బును బదిలీ చేశారు.ఈ స్కాముకు సంబంధించిన లావాదేవీలు మే 11, 12 తేదీలలో జరిగాయి కానీ, మే 13 సెలవు దినం కావడంతో, బ్యాంకు అధికారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లావాదేవీ నివేదిక అందిన తర్వాత మే 14న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే సిమ్లా సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే తొలి AI హాస్పిటల్: డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే..స్కామ్ బయటపడిన వెంటనే.. బ్యాంక్ అధికారులు సంబంధిత ఖాతాలను స్తంభింపజేశారు. దీనిపై లోతైన దర్యాప్తు నిర్వహించడానికి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) బృందం సిమ్లాకు చేరుకోనుంది. హ్యాకర్లు ఎలా ప్రవేశించారు, బ్యాంక్ వ్యవస్థలకు ఇతర భద్రతా బలహీనతలు ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు చేయనున్నారు.డిజిటల్ బ్యాంకింగ్ మోసాలను నివారించడానికి RBI మార్గదర్శకాలు➤మీ లాగిన్ వివరాలు, పిన్, ఓటీపీ లేదా కార్డడుల సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.➤అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం లేదా తెలియని ఫైల్‌లను డౌన్లోడ్ చేయడం మానుకోవాలి.➤యాప్‌లను ఇన్స్టాల్ చేసుకునే సమయంలో కూడా జాగ్రత్త వహించాలి.➤బ్యాంకులకు సంబంధించిన ఏవైనా వివరాలు కావాలనుకుంటే.. సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ లేదా అధికారిక వెబ్సైట్లను సందర్శించాలి. -
పక్క దేశంలో స్టార్‌లింక్ పాగా
ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ యాజమాన్యంలోని శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్ లింక్ బంగ్లాదేశ్‌లో అధికారికంగా సేవలు ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది దేశ డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గణనీయమైన పురోగతిని సూచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్, నెట్వర్క్ సమస్యలతో పోరాడుతున్న మారుమూల, వెనుకబడిన ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించాలనే లక్ష్యంతో ఈ సర్వీసులు ప్రారంభించిస్తున్నట్లు అధికారులు తెలిపారు.స్టార్ లింక్ విభిన్న యూజర్ అవసరాలను తీర్చడానికి బంగ్లాదేశ్‌లో వివిధ సబ్ స్క్రిప్షన్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. స్టార్ లింక్ రెసిడెన్స్ ప్లాన్‌లో భాగంగా నెలకు 6,000 టాకా ధర(రూ.4,200)తో ప్రామాణిక గృహ వినియోగానికి ఇంటర్నెట్ అందిస్తున్నారు. రెసిడెన్సీ లైట్ ప్లాన్‌లో భాగంగా నెలకు 4,200 టాకా(రూ.2,900) ధరతో నెట్ సేవలు అందిస్తున్నారు. వన్ టైమ్ సెటప్ ఫీజు కింద 47,000 టాకాలు(రూ.32,000) చెల్లించాల్సి ఉంటుంది. స్టార్ లింక్ డిష్, రౌటర్‌తో సహా పరికరాల ఖర్చులు ఇందులో కవర్ అవుతాయి.ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..స్టార్‌లింక్ ప్రత్యేకతలుఅంతరిక్షంలోని ఉపగ్రహాల నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ నేరుగా భూమిపై ఉన్న వివిధ డివైజ్‌లకు చేరుతుంది.ఈ కనెక్షన్‌కు చందా కేబుల్ సర్వీస్ డైరెక్ట్ టు హోం (డీటీహెచ్)కు కట్టిన మాదిరిగా ఉంటుంది.ఇంటర్నెట్ కోసం ఈ కంపెనీ పోర్టబుల్ శాటిలైట్ డిష్ కిట్‌ను అందజేస్తుంది. దీనిని ఇంటిపై శాశ్వత పద్ధతిలో బిగించవచ్చు.ముందుగా ఇళ్లలో వైఫై రూటర్ ఆధారిత వైర్ కనెక్షన్ కలిగి ఉండాలి. దీనిని ఆ తర్వాత వైర్లెస్ పద్ధతిలో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు, ఇతర ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గాడ్జెట్స్‌కు జతచేయొచ్చు.ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సర్వీస్ అందించగలదు. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. -
యాపిల్ ఎయిర్‌పాడ్స్ కొత్త వర్షన్ రిలీజ్ ఎప్పుడంటే..
యాపిల్ 2025 సంవత్సరంలో కొత్త ఎయిర్‌పాడ్స్‌ను లాంచ్ చేసే అవకాశం లేదని ప్రముఖ టెక్ విశ్లేషకులు మింగ్-చి కువో తెలిపారు. యాపిల్ ఈ ఏడాదిలో మెరుగైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో థర్డ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్ ప్రోను విడుదల చేస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ తరుణంలో కువో ఇలా ప్రకటనలు చేయడం గమనార్హం.ఇదీ చదవండి: మెహుల్ చోక్సీకి రూ.2 కోట్ల డిమాండ్ నోటీసుఎయిర్పాడ్స్ ప్రో లైనప్‌కు తదుపరి అప్డేట్ వర్షన్ 2026 వరకు రాదని కువో అంచనా వేస్తున్నారు. ఎయిర్‌పాడ్స్ లైటర్ వర్షన్ మ్యాక్స్ వర్షన్ 2027లో వస్తుందని చెప్పారు. ఆడియోను మెరుగుపరచడానికి, వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాలను అందించేందుకు ఉద్దేశించిన బిల్ట్-ఇన్ ఇన్ఫ్రారెడ్(ఐఆర్) కెమెరాలు రాబోయే ఎయిర్‌పాడ్ మోడల్లో ఉంచనున్నట్లు తెలిపారు. ఐఆర్ కెమెరాల అనుసంధానం రోజువారీ వేరబుల్స్‌లో అధునాతన సెన్సింగ్ టెక్నాలజీని తీసుకురావడానికి యాపిల్ ప్రయత్నిస్తుందని చెప్పారు. ప్రస్తుత ఎయిర్‌పాడ్స్ ప్రో 2 2022లో విడుదలైంది. -
యాప్ ఒక్కటే.. సేవలు బోలెడు!
భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం ఇప్పటికే చాలానే యాప్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో దేని ప్రత్యేకత దానిదే. అయినప్పటికీ రైల్వేశాఖ మరో కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) అభివృద్ధి చేసిన ‘స్వరైల్ యాప్’ ఆన్లైన్ రైల్వే సేవలను క్రమబద్ధీకరించడానికి ఆల్-ఇన్-వన్ రైల్వే సర్వీసులకు వేదికగా నిలుస్తుందని తెలిపింది. ఇది బహుళ రైల్వే సేవలను ఒకే యాప్‌లో ఏకీకృతం చేస్తుందని పేర్కొంది. స్వరైల్ యాప్‌లో అందిస్తున్న కొన్ని ఫీచర్ల గురించి తెలుసుకుందాం.టికెట్ బుకింగ్: ప్లాట్‌ఫామ్ టికెట్లతో సహా రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ టికెట్లను నేరుగా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.పీఎన్ఆర్, ట్రైన్ స్టేటస్ ట్రాకింగ్: రైలు షెడ్యూళ్లు, ఆలస్యం, ప్లాట్‌ఫామ్ నంబర్లకు సంబంధించి రియల్ టైమ్ అప్డేట్లను పొందవచ్చు.రైళ్లలో ఫుడ్ ఆర్డర్లు: రైళ్లలో ఆన్లైన్లోనే భోజనాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. నేరుగా మీ సీటు వద్దకే భోజనం డెలివరీ చేస్తారు.రైల్ మదద్ (కంప్లైంట్ మేనేజ్మెంట్): రైలు ప్రయాణంలో మీ సమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. చేసిన ఫిర్యాదు, దాని పరిష్కారాన్ని రియల్ టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు.ఇదీ చదవండి: అతిపెద్ద సోలార్ ప్రాజెక్టుకు రిలయన్స్ ఏర్పాట్లుపార్సిల్, ఫ్రైట్ ఎంక్వైరీ: సరుకు రవాణాను నిర్వహించవచ్చు. పార్సిళ్లను ట్రాక్ చేయడం, సరుకు రవాణా ఖర్చులను లెక్కించడం.కోచ్ పొజిషన్ ఫైండర్: రైలు ఎక్కే సమయంలో కచ్చితంగా ఏ పొజిషన్లో మీరు ఎక్కబోయే కోచ్ నిలుస్తుందో తెలుసుకోవచ్చు.రీఫండ్ అభ్యర్థనలు: రద్దు అయిన, మిస్ అయిన ప్రయాణాల కోసం మీ చెల్లింపులపై సులభంగా రీఫండ్లను పొందేందుకు అభ్యర్థనలు పెట్టుకోవచ్చు.ఇతర భాషలు: ఈ యాప్ హిందీ, ఇంగ్లీష్‌తోపాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది.ఆర్-వాలెట్ ఇంటిగ్రేషన్: టికెట్లు, భోజనం, ఇతర సేవల కోసం సురక్షితమైన, నగదు రహిత చెల్లింపుల కోసం ఆర్-వాలెట్ ఉపయోగించవచ్చు. -
లేఆఫ్ తప్పు తెలిసొచ్చిందీ కంపెనీకి...
ఇప్పుడు ఎక్కడ చూసినా లేఆఫ్‌లు పెరిగిపోయాయి. అదేమంటే ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), ఆటోమేషన్ అంటున్నారు. ఖర్చు పేరు చెప్పి నైపుణ్యంతో పనిచేసే మానవ ఉద్యోగులను తొలగించి ఏఐ సిస్టమ్‌లతో భర్తీ చేసేస్తున్నాయి చాలా కంపెనీలు. ఇలా అన్నింటికీ ఏఐని నమ్ముకుని ఉన్న ఉద్యోగులను తొలగిస్తే ఏమవుతుందో తెలిసొచ్చిందీ స్వీడన్ కంపెనీకి...స్వీడిష్ ఫిన్‌టెక్ కంపెనీ క్లార్నా (Klarna) 2022లో ఏకంగా 700 ఉద్యోగులను తొలగించి, ఓపెన్ఏఐ (OpenAI) సహాయంతో ఏఐ (AI) వ్యవస్థలను ఉపయోగించడం ప్రారంభించింది. 2023 నాటికి, కంపెనీ మానవ ఉద్యోగుల నియామకాన్ని పూర్తిగా నిలిపివేసింది.అప్పట్లో ఈ కంపెనీ లేఆఫ్‌లను అమలు చేసిన తీరు వివాదాస్పదమైంది. ఉద్యోగుల తొలగింపులను ముందుగా రికార్డ్ చేసిన వీడియో ద్వారా ప్రకటించడం, వారి వ్యక్తిగత డేటా లీక్ చేయడం తీవ్ర విమర్శలకు కారణమైంది.తప్పు తెలిసొచ్చింది..ఏఐ ఆధారిత కస్టమర్ సేవలు అంచనాలకు తగినట్లుగా ఫలితాలను ఇవ్వలేదు. ఇవి కస్టమర్ సంతృప్తి తగ్గడానికి దారితీశాయి. మరోవైపు ఉద్యోగుల తొలగింపును అధ్వానంగా నిర్వహించడం, వారి వ్యక్తిగత డేటాను పబ్లిక్ చేయడం క్లార్నా ఇమేజ్ను ప్రభావితం చేసింది.అంతేకాకుండా ఆర్థికంగానూ కంపెనీకి పెద్ద దెబ్బే తగిలింది. 2021లో 45.6 బిలియన్ డాలర్లున్న క్లార్నా వ్యాల్యుయేషన్ 2022లో 6.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఏఐ ఆధారిత విధానం పెట్టుబడిదారుల ఆందోళనలకు కారణమైంది.ఏఐ ఆధారిత కార్యకలాపాలు సేవా నాణ్యతను ప్రభావితం చేశాయని క్లార్నా అంగీకరించింది. లేఆఫ్‌కు వెళ్లడం తప్పేనని కంపెనీ సీఈవో సెబాస్టియన్ సీమియట్కోవ్‌స్కీ అంగీకరించారు. ఖర్చు తగ్గింపునకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని, కానీ ఇది సేవా ప్రమాణాలను దెబ్బతీసిందని ఒప్పుకొన్నారు.తిరిగి నియామకాల వైపు..నైపుణ్యం ఉన్న ఉద్యోగులను తొలగించిన తర్వాత భారీ నష్టాన్ని చవిచూసిన క్లార్నా సంస్థ తన వైఖరి మార్చుకుంది. ఇప్పుడు మళ్లీ నియామకాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా కస్టమర్ సర్వీసు విభాగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తోంది. విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులే లక్ష్యంగా రిమోట్ వర్క్ ఆఫర్ చేస్తోంది. -
నాజిల్ సమస్యే!.. నాలుగో దశను కూల్చివేసిన ఇస్రో
పీఎస్ఎల్వీ.. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది నాలుగు అంచెల రాకెట్. ఈ రాకెట్లో తొలి, మూడో దశల్లో ఘన ఇంధనం వాడతారు. ఇక రెండు, నాలుగో దశల్లో ద్రవ ఇంధనం వినియోగిస్తారు. 101వ ఉపగ్రహం ‘రీశాట్-1బి’ని రోదసికి పంపేందుకు నేటి ‘శతాధిక’ ప్రయోగంతో కలిపి పీఎస్ఎల్వీతో ఇస్రో 63 ప్రయోగాలు నిర్వహించింది. వీటిలో ఈ రాకెట్ విఫలమైన సందర్భాలు మూడు. 2017 తర్వాత రాకెట్లో లోపం కనిపించడం ఇదే తొలిసారి. నిజానికి మూడో దశలో రాకెట్ ఫెయిల్ కావడం అరుదు. 114 సెకండ్లపాటు సాగే ఈ మూడో దశలో హెచ్టీపీబీ (హైడ్రాక్సిల్-టర్మినేటెడ్ పాలీబ్యూటడీన్) ఘన ఇంధన మోటార్ వాడతారు. ఈ ఇంధనం ఆదర్శ స్థితిలో 240 కిలో న్యూటన్ల చోదకశక్తి ఇస్తుంది. తాజా ప్రయోగ వైఫల్య కారణాలను నిగ్గుతేల్చేందుకు ఇస్రో నుంచి ఒకటి, ప్రభుత్వం నుంచి మరొకటి వంతున రెండు కమిటీలు రంగంలోకి దిగాయి. రాకెట్ వేగం, ఎత్తు, ఇంజిన్ల పనితీరు అంశాలపై అవి అధ్యయనం చేస్తాయి. మోటారులో ఇంధన ప్రవాహం సరిగా లేదా? నాజిల్ సమస్యలు తలెత్తాయా? మోటారు డిజైన్/తయారీపరమైన లోపాలున్నాయా? ఇలా పలు కోణాల్లో విశ్లేషణ కొనసాగనుంది. కచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ... రాకెట్ మూడో దశలో మోటార్ కేస్ లోపలి చాంబర్ ప్రెజర్లో అకస్మాత్తుగా పీడనం తగ్గడానికి ఫ్లెక్స్ నాజిల్ నియంత్రణ వ్యవస్థలో తలెత్తిన లోపమే కారణమని ఇస్రో ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. రాకెట్ వేగం, చోదక దిశలను నిర్దేశించేది ఈ కీలక భాగమే. ‘కంబశ్చన్ చాంబర్’లో ఇంధనం దహనమై విపరీత పీడనంతో వేడి వాయువులు నాజిల్ గుండా వెలుపలికి తన్నుకొస్తేనే రాకెట్ ప్రయాణం ముందుకు (పైకి) సాగుతుంది. ఈ ‘చర్యకు ప్రతిచర్య’ అనే మౌలిక సూత్రం ఆధారంగానే రాకెట్ పనిచేస్తుంది. రబ్బరు లాంటి స్థితిస్థాపక గుణం (లేయర్డ్ ఎలాస్టోమెరిక్) గల పదార్థాల పొరలతో ఫ్లెక్సిబుల్ నాజిల్స్ తయారవుతాయి. హైడ్రాలిక్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చి తద్వారా వాల్వులను కదిలిస్తూ ద్రవ/వాయు ప్రవాహాలను నియంత్రించేందుకు సాధారణంగా హైడ్రాలిక్ యాక్చువేటర్లను వినియోగిస్తుంటారు. వీటి పనితీరు సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే పీఎస్ఎల్వీ రాకెట్ మూడో దశ మోటారులో హైడ్రాలిక్ యాక్చువేటర్లు కాకుండా… పరిమిత కోణాల్లోనే అయినప్పటికీ అన్ని దిశల్లో కదులుతూ కచ్చితమైన చోదకశక్తిని అందించేందుకు ఫ్లెక్సిబుల్ బేరింగ్ గల ఫ్లెక్స్ నాజిల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థలో ఉత్పన్నమైన సమస్య వల్లనే తాజా ప్రయోగం విఫలమైనట్టు అనుమానిస్తున్నారు. నాజిల్ యాక్చువేటర్లు, ఫ్లెక్సిబుల్ జాయింట్, కంట్రోల్ సిగ్నల్స్... వీటిలో ఏదో ఒక సమస్య ఏర్పడి చాంబర్ ప్రెజర్లో పీడనం తగ్గి, మరింత ఎత్తుకు ప్రయాణించడానికి చాలినంత చోదకశక్తి లభించక రాకెట్ గతి తప్పడం ఆరంభించింది. దాన్ని అలాగే వదిలేస్తే జనావాసాలపై కూలి ప్రాణ-ఆస్తి నష్టం సంభవించే అవకాశముంది. అందుకే భద్రతా నిబంధనల ప్రకారం ఇస్రో దాన్ని ‘మిడ్ ఎయిర్-అబార్ట్’ చేసింది. అంటే... రాకెట్లో పేలోడ్ (ఉపగ్రహం) ఉన్న చివరిదైన నాలుగో దశను వేరే దారి లేక ఇస్రో కూల్చివేయాల్సి వచ్చింది.-జమ్ముల శ్రీకాంత్.. -
బకాయిలు చెల్లించలేం బాబోయ్..
సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల నుంచి ఉపశమనం కోరుతూ ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) సమర్పించిన రూ.44,000 కోట్ల చెల్లింపులకు విరుద్ధంగా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. ఈ ఆర్థిక భారం కంపెనీని పోటీలో నిలపకుండా నియంత్రిస్తుందని, తదుపరి తరం టెక్నాలజీల్లో పెట్టుబడి పెట్టే సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని కంపెనీ వాదిస్తోంది. ఇటీవల మరో టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా నుంచి ఇదే తరహా పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.ఏజీఆర్ బకాయిలుసర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) అనేది ప్రభుత్వం, టెలికాం ఆపరేటర్ల మధ్య రుసుము భాగస్వామ్య యంత్రాంగ విధానం. ఫిక్స్డ్ లైసెన్స్ ఫీజు మోడల్ స్థానంలో 1999లో అవలంబించిన రెవెన్యూ షేరింగ్ మోడల్లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఈ మోడల్ కింద టెలికాం కంపెనీలు తమ ఏజీఆర్‌లో కొంత శాతాన్ని వార్షిక లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.లెక్కింపు ఇలా..టెలికాం, నాన్ టెలికాం వనరుల నుంచి కంపెనీ ఆర్జించిన అన్ని ఆదాయాలను ఏజీఆర్‌లో చేరుస్తారు. ఇందులో ప్రధాన టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ ఆదాయం, డివిడెండ్, ఆస్తుల అమ్మకంపై లాభం, అద్దె రశీదులు వంటి ప్రధానేతర వనరులు ఉంటాయి. టెలికాం కంపెనీల స్థూల ఆదాయాల ఆధారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) లైసెన్స్ ఒప్పందాల్లో నిర్వచించిన విధంగా ఏజీఆర్‌ను లెక్కిస్తుంది. స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలకు 3-5 శాతం, లైసెన్సింగ్ ఫీజుకు 8 శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారు.వివాదం ఏమిటంటే..ఏజీఆర్‌లో కీలక టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం మాత్రమే ఉండాలని టెలికాం ఆపరేటర్లు వాదిస్తున్నాయి. టెలికాం శాఖ మాత్రం అన్ని ఆదాయాలు అందులో పరిగణిస్తారని పేర్కొంటుంది. సుప్రీంకోర్టు 2019లో డాట్ నిర్వచనాన్ని సమర్థించింది. ఇది టెలికాం ఆపరేటర్లపాలిట శాపంగా మారింది. దాంతో ఇప్పటివరకు బకాయిపడిన, ప్రభుత్వంతో పంచుకోని ఆదాయాన్ని వెంటనే చెల్లించేలా తీర్పు వెలువడింది. దాంతో ప్రభుత్వంతో మంతనాలు సాగించేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ చెల్లింపులకు విరుద్ధంగా సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలు పిటిషన్ దాఖలు చేస్తున్నాయి.ఇదీ చదవండి: భారత్‌లో ఐఫోన్ తయారీకి ఆసక్తి చూపడం లేదు: ట్రంప్కంపెనీ వాదన ఇలా..సుప్రీంకోర్టు విధించిన కఠినమైన 10 సంవత్సరాల రీపేమెంట్ టైమ్‌లైన్ కంపెనీపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుందని, నెట్వర్క్ విస్తరణ, స్పెక్ట్రమ్ పెట్టుబడులు, 6జీ టెక్నాలజీల అభివృద్ధి కోసం వనరులను కేటాయించడం కష్టమవుతుందని ఎయిర్టెల్ తెలుపుతోంది. తిరిగి చెల్లించే నిబంధనలను సుప్రీంకోర్టు, డాట్ పునఃపరిశీలించకపోతే కంపెనీల ఆర్థిక స్థిరత్వం, టెలికాం పరిశ్రమ దెబ్బతింటుందని కంపెనీ వాదిస్తుంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా వడ్డీ, జరిమానాల రూపంలో రూ.45,000 కోట్లు మాఫీ చేయాలని కోరింది. -
ప్రపంచంలోనే తొలి AI హాస్పిటల్: డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేధ హవా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఏఐ.. వైద్య రంగంలో కూడా అద్భుతాలు సృష్టిస్తోంది. ఆధునిక వైద్య శాస్త్రాన్ని పునర్నిర్వచించగల చర్యలో భాగంగా.. చైనా ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి AI ఆధారిత ఆసుపత్రి (ఏజెంట్ హాస్పిటల్)ని ప్రారంభించింది.సింఘువా యూనివర్సిటీ పరిశోధకులు ఏఐ బేస్డ్ "ఏజెంట్ హాస్పిటల్"ను సృష్టించారు. ఇక్కడ ఉన్న డాక్టర్లు, నర్సులు అన్నీ కూడా రోబోలే. ఇక్కడ ఏఐ డాక్టర్లు.. ఉబ్బసం, గొంతునొప్పి వంటి సుమారు 30 రకాల జబ్బులకు చికిత్స అందిస్తాయి. ఈ వినూత్న ప్రయత్నం వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.ఏజెంట్ హాస్పిటల్ రీసర్చ్ టీమ్ లీడర్ 'లియు యాంగ్' మాట్లాడుతూ.. ఏఐ డాక్టర్లు రోగులకు చికిత్స చేయడానికి మాత్రమే కాకుండా.. వైద్య విద్యార్థులకు మెరుగైన శిక్షణను అందించడానికి కూడా ఉపయోగపడతాయని అన్నారు. ఎందుకంటే.. ఈ ఏఐ ఏజెంట్లు యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ (USMLE)లో 93.06 శాతం స్కోర్ సాధించాయని పేర్కొన్నారు.కొన్ని వారాలలోనే.. సంవత్సరాల క్లినిక్ అనుభవాన్ని పొందగల ఏఐ డాక్టర్లు రోగ నిర్దారణలో కూడా ప్రావీణ్యం పొంది ఉన్నాయని అన్నారు. ఏఐ వైద్య సిబ్బంది.. లైసెన్సింగ్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించగలిగితే.. శస్త్రచికిత్సలు సైతం చేయగలవు. ఏజెంట్ హాస్పిటల్లో 14 మంది ఏఐ డాక్టర్లు, నలుగురు ఏఐ నర్సులతో కూడిన సిబ్బంది ఉన్నారు. వీరందరూ.. రోజుకు 3000 మంది రోగులతో.. పరస్పర చర్య చేయగలరని లియు యాంగ్ అన్నారు.ఇదీ చదవండి: 'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'టెక్నాలజీ అభివృద్ధి చెందటం.. వైద్య రంగంలో ఏఐ డాక్టర్లు పుట్టుకురావడం బాగానే ఉంది. ఇవన్నీ యంత్రాలు కాబట్టి.. ఇవి భావోద్వేగాలకు అతీతం. కాబట్టి ఏదైనా చిన్న పొరపాటు జరిగినా.. రోగుల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి వైద్య రంగంలో సహాయకులుగా, వైద్య విద్యార్థులు బోధించడానికి ఏఐ సిబ్బంది ఉపయోగపడినప్పటికీ, ఆపరేషన్స్ చేయడం వంటివి ఏ మాత్రం సమంజసం?.. అనేది ఆలోచించాలి. -
హై'టెక్' హోమ్: ఇంటికొచ్చే చందమామ, పైకెగసే నీటిబొట్లు
ఇంటి అందాన్ని పెంచడంలో ఎప్పుడూ ముందుండే అలంకరణ వస్తువులు.. ఎప్పుడో అప్డేట్ అయ్యాయి. ఇప్పుడు మీరు కూడా ఈ టెక్ డెకర్ ఐటమ్స్ ఉపయోగించి మీ ఇంటిని హైటెక్ హోమ్‌గా మార్చేయండి.క్యూట్ చార్జర్రంగురంగుల వెలుగులతో ప్రకాశించే ఈ ల్యాంప్, ఒట్టి లైట్ మాత్రమే కాదు, ఇదొక వైరెలెస్ చార్జర్, బ్లూటూత్ స్పీకర్, స్లీప్ ల్యాంప్, సన్‌రైజ్ అలారం.. ఇలా మరెన్నో చెప్పుకోవచ్చు. బ్యాటరీతో పనిచేసే ఈ డివైజ్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు రెండు నుంచి మూడు గంటల వరకు నిర్విరామంగా మ్యూజిక్ ప్లే చేస్తుంది. అలాగే, రంగురంగుల లైట్లతో పార్టీ థీమ్ మూడ్‌లోకి కూడా తీసుకురాగలదు. ఇందులోని ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉపయోగించి క్షణాల్లో ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జ్ చేసుకోవచ్చు. ధర రూ. 849.ఇంటికొచ్చే చందమామఇంట్లో ఊహల లోకం కావాలనుకుంటున్నారా? అయితే, ఒక్కసారి నిద్రపోయే ముందు ఈ త్రీడీ మూన్ ల్యాంప్‌ను ఆన్ చేయండి. వెంటనే గోడలపై వెలుగుల పూలు, సీలింగ్‌పై తారల మెరుపులతో గదంతా ఒక ఫెయిరీ టేల్ సినిమా మూడ్‌లోకి మారిపోతుంది. ఏ టూల్స్ అవసరం లేకుండా ‘ప్లగ్ అండ్ ప్లే’ మోడ్‌లో ఇది పనిచేస్తుంది. పిల్లలకు ఎంతో బాగా నచ్చే దీని ధర రూ. 499. ఆన్లైన్లో మరెన్నో ఇలాంటి త్రీడీ ల్యాంప్స్ ఉన్నాయి. అభిరుచిని బట్టి కొనుగోలు చేయవచ్చు.ఫొటోలు మార్చే ఫ్రేమ్స్ఇదివరకు గోడకు వేలాడదీసే ఫ్రేమ్‌లో ఏదో ఒక ఫొటో మాత్రమే ఉండేది. రకరకాల ఫొటోలను ఒకేసారి చూపిస్తుంది ‘స్మార్ట్ డిజిటల్ ఫొటో ఫ్రేమ్’. ఫొటోను ప్రింట్ తీయటం, వాటిని ఫ్రేమ్స్‌లో అతికించడం ఇలాంటి పనులేం చేయనక్కర్లేదు. ఇది మీ ఇంట్లో ఉంటే. త్రీడీ డిస్ప్లే, కలర్ కేలిబ్రేట్తో రూపొందించిన ఈ ఫ్రేమ్, ఫొటోలను అత్యంత సహజంగా కనిపించేలా చేస్తుంది. దీనిని మొబైల్‌కు కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫొటోలను మార్చుకోవచ్చు. ఫ్రేమ్‌కు తగ్గట్లు ఫొటోలను ఇదే అటోమేటిక్‌గా క్రాప్ చేసి, బ్రైట్నెస్ను అడ్జస్ట్ కూడా చేస్తుంది. ధర రూ. 12,595.పైకెగసే నీటిబొట్లుపైకి విసిరిన ప్రతిదీ కింద పడాల్సిందే! కానీ, ఇక్కడ మాత్రం నీటి బొట్లు పైకి ఎగురుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తాయి. చూడటానికి డెకర్ ఐటమ్లా కనిపించే ఈ ‘స్మూత్ సెయిలింగ్ యాంటీగ్రావిటీ లైట్’లో ఎన్నో అబ్బురపరచే ఫీచర్స్ ఉన్నాయి. దీనిని నైట్ లైట్, టేబుల్ క్లాక్లాగే కాదు, అంతకు మించి దీని పనితనం ఉంటుంది. ఇది ఇందులో నింపిన నీటిని ఉపయోగించి, చల్లని గాలిని అందిస్తూ ఒక మినీ కూలర్లాగా కూడా పనిచేస్తుంది. లివింగ్ రూమ్, బెడ్రూమ్, వర్క్డెస్క్లకు ఇది ఒక చక్కటి డెకర్ ఐటమ్. ధర రూ. 1,899. -
ఏఐ నిపుణులు @ 4 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) నిపుణుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం వీరి సంఖ్య 4.16 లక్షలకు చేరింది. అయితే నిపుణులు లభిస్తున్నప్పటికీ, డిమాండ్–సరఫరా మధఅయ ఏకంగా 51 శాతం అంతరం ఉంటోంది. భవిష్యత్ అవసరాలకు సన్నద్ధతను పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తోందని స్టాఫింగ్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ ఒక నివేదికలో వివరించింది. దీని ప్రకారం ఏఐ నిపుణుల నియామకాలు 2017 నుంచి ఎనిమిది రెట్లు పెరిగాయి. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో ఏఐ, డేటా నిపుణులకు డిమాండ్ దాదాపు 45 శాతం పెరిగినట్లు క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో కపిల్ జోషి తెలిపారు. జెన్ఏఐ ఇంజినీరింగ్‌లో పది ఉద్యోగావకాశాలు ఉంటే అన్ని అర్హతలు కలిగిన నిపుణుడు ఒక్కరే ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఏఐ విప్లవానికి సార్థ్యం వహించే సామర్థ్యాలు భారత్‌కి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే దీన్ని అందిపుచ్చుకోవాలంటే వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, విధానకర్తలు ఆ దిశగా త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆకర్షణీయ వేతనాలు.. ఎంట్రీ లెవెల్ నిపుణులకు వార్షికంగా రూ. 8–12 లక్షల స్థాయిలో వేతనాలు ఉంటున్నాయి. ఇక ఎన్ఎల్పీ, జెన్ఏఐలో 5–8 ఏళ్ల అనుభవమున్న వారికి రూ. 25–35 లక్షల వరకు జీతభత్యాలు ఉంటున్నాయి. అటు ప్రోడక్ట్ సంస్థలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) సీనియర్ ప్రొఫెషనల్స్ రూ. 45 లక్షల పైగా అందుకుంటున్నారు. → ఏఐ నియామకాల్లో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగం ముందు వరుసలో ఉంటోంది. దేశీయంగా మొత్తం ఏఐ డిమాండ్‌లో ఈ రంగం వాటా 24 శాతంగా ఉంటోంది. ఆ తర్వాత స్థానాల్లో ఐటీ సరీ్వసులు, హెల్త్‌కేర్ ఉన్నాయి. → డేటా సైంటిస్టులు, ఎంఎల్ ఇంజినీర్లు, ఏఐ డెవలపర్లు, ఏఐ రీసెర్చర్లకు అత్యధికంగా డిమాండ్ ఉంటోంది. ఏఐ ప్రోడక్ట్ మేనేజర్లు, బిజినెస్ అనలిస్టులకు కూడా హైరింగ్ అవకాశాలు బాగుంటున్నాయి. → నైపుణ్యాలపరంగా చూస్తే పైథాన్ ల్యాంగ్వేజ్ ఆధి పత్యం కొనసాగుతోంది. అలాగే టెన్సర్‌ఫ్లో, పై టార్చ్, కేరాస్లాంటి ఫ్రేమ్‌వర్క్‌లకు ప్రాధా న్యం ఉంటోంది. ఎన్ఎల్పీ, కంప్యూటర్ విజన్, జెనరేటివ్ ఏఐ, క్లౌడ్ (ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ), ఎంఎల్ఆప్స్ నైపుణ్యాలను కంపెనీలు కోరుకుంటున్నాయి. → జెన్ఏఐపరమైన నియామకా>ల్లో బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్, హైదరాబాద్ ముందు వరుసలో ఉంటున్నాయి. మెట్రోల పరిధిని దాటి ఏఐ టాలెంట్ హబ్‌లు ఎదుగుతున్నాయనడానికి నిదర్శనంగా మొత్తం ఏఐ డిమాండ్‌లో ద్వితీయ శ్రేణి నగరాల వాటా ఇప్పుడు 14–16 శాతంగా ఉంది. వీటిలోనూ కొచ్చి, అహ్మదాబాద్, కోయంబత్తూర్ నగరాల వాటా 70 శాతంగా ఉంది. → జీసీసీల నుంచి జెన్‌ఏఐకి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. దేశీయంగా మొత్తం ఏఐ హైరింగ్‌లో జీసీసీల వాటా23 శాతంగా ఉంది. → దేశీయంగా ఏఐ నైపుణ్యాలను పెంపొందించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలి. విద్యారంగం, పరిశ్రమ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలతో కలిసి పని చేయాలి. పరిస్థితులకు తగ్గట్లుగా నైపుణ్యాలను పెంపొందించే ప్రోగ్రాంలను రూపొందించాలి. -
పాడ్‌కాస్ట్ చేద్దామా?
పిల్లలూ... ఇంతకు ముందు రేడియోలో బాలానందం అనే ప్రోగ్రామ్ ఉండేది.పిల్లల చేత ఆ ప్రోగ్రామ్‌లో మాట్లాడించేవారు. ఇప్పుడు మనమే రేడియో ప్రోగ్రామ్లాంటిది చేయవచ్చు. దానినే ‘పాడ్‌కాస్ట్’ అంటారు. మనకు నచ్చిన విషయాలు మాట్లాడి, రికార్డు చేసి డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద అప్లోడ్ చేస్తే మీ పాడ్‌కాస్ట్‌ను విని అభిమానులయ్యేవారుంటారు. ఈ సమ్మర్లో మీ కాలనీలోని పిల్లలతో కలిసి పాడ్‌కాస్ట్‌లు చేయండి. అందుకు ఏం చేయాలంటే....పిల్లలూ... మీరు రేడియో వినే ఉంటారు. మామూలు రేడియో వినకపోయినా కారులోని రేడియో వినే ఉంటారు. రేడియోలో ఒకప్రోగ్రామ్ అయిపోయాక మరోసారి ఆప్రోగ్రామ్ వినాలంటే కుదరదు. అదే ఆ ప్రోగ్రామ్‌ను రికార్డు చేసి ఒక చోట పెట్టి కావాల్సినప్పుడల్లా కావాల్సినన్నిసార్లు వినే ఏర్పాటు చేస్తే? పాడ్‌కాస్ట్ అలాంటిదే. మీరు మీ సొంతప్రోగ్రామ్స్ రికార్డు చేసి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో పెడతారు. వాటిని ఎవరు కావాలన్నా ఎప్పుడు కావాలన్నా వింటారు. ఇప్పుడు పాడ్‌కాస్టింగ్ చాలా మంచి హాబీ. డబ్బులు కూడా వస్తాయి... వినేవాళ్లు పెరిగితే. పాడ్‌కాస్ట్ అంటే కేవలం ఆడియోప్రోగ్రామ్ మాత్రమే. ఒకరు/లేదా కొంతమంది మాట్లాడుకునే మాటలను రికార్డు చేసి ఇతరులకు వినిపించడమే పాడ్‌కాస్టింగ్ అంటే.దానికి ఏం కావాలి?కంప్యూటర్ కానీ ల్యాప్‌టాప్ కానీ ఉంటే సరిపోతుంది. రికార్డు చేయడానికి మైక్ ఉండాలి. రికార్డు చేసేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ ఫ్రీగా దొరుకుతుంది. రికార్డ్ అయిన కార్యక్రమాన్ని ‘ఎంపి3’ ఫార్మాట్లో మార్చి పాడ్‌కాస్ట్ ప్లాట్‌ఫామ్స్‌లో అప్లోడ్ చేయాలి. ఈ ప్లాట్‌ఫామ్స్‌ను సబ్స్క్రయిబ్ చేసుకుని ఆ పని చేయవచ్చు. ఇదంతా చాలా సులువు పనే.పాడ్‌కాస్ట్‌లో ఏం మాట్లాడతారు?మనుషులకు మాటలు ఇష్టం. మీరు ఏం మాట్లాడినా వింటారు. ఉదాహరణకు ‘నేనూ... మా కుక్కపిల్ల’ అనే సిరీస్‌లో మీరు వరుసగా పాడ్‌కాస్ట్ చేయవచ్చు. ఒక్కో ఎపిసోడ్లో మీ కుక్కపిల్లతో మీరు పడుతున్న తంటాలు, అదంటే మీకెంత ఇష్టమో, అది మీరు స్కూల్‌కు వెళ్లినప్పుడు ఎలా ఎదురుచూస్తుందో, మీ ఫుడ్‌ను ఎలా లాక్కుంటుందో ఇవన్నీ మాట్లాడి రికార్డు చేసి పెడితే వినేవాళ్లు ఉంటారు.పాడ్‌కాస్ట్ చేసే విధంపాడ్కాస్ట్ అంటే చదవడం కాదు. నోట్స్ ముందు పెట్టుకుని చదివితే ఎవరూ వినరు. పాడ్‌కాస్ట్‌ను ఒక డైలాగ్‌లాగా మాట్లాడుతున్నట్టుగా చేయాలి. అఫ్కోర్స్... మీరు కొంత నోట్స్ రాసుకున్నా అది పాయింట్స్ గుర్తు రావడానికే తప్ప యథాతథంగా చదవకూడదు. ‘మా అమమ్మ’ అనే టాపిక్ మీద కబుర్లు చెబుతున్నట్టుగా మాట్లాడితే వింటారు.ఇంటర్వ్యూలుపాడ్కాస్ట్లో ఇంటర్వ్యూలు బాగుంటాయి. మీరు మీ అమ్మను, నాన్నను, అన్నయ్యను ఇంటర్వ్యూ చేయొచ్చు. క్లయిమేట్ చేంజ్ గురించి మీ సైన్స్ టీచర్‌ను ఆహ్వానించి ఇంటర్వ్యూ చేయొచ్చు. సెల్‌ఫోన్ అడిక్షన్ మీద ఒక డాక్టర్‌ను ఇంటర్వ్యూ చేయొచ్చు. ఇలాంటి వాటికి మమ్మీ, డాడీ సపోర్ట్ తీసుకోవచ్చు. రాబోయే వానాకాలంలో వూళ్లో వాన నీరు వెళ్లాలంటే గవర్నమెంట్ ఏయే పనులు మొదలెట్టాలో చెప్పేలా ఒక పాడ్‌కాస్ట్ చేయొచ్చు. హ్యారీపోటర్ మీద, అవేంజర్స్ మీద మీ ఫ్రెండ్స్‌ను ఇంటర్వ్యూ చేస్తూ పాడ్‌కాస్ట్ చేయొచ్చు. పాడ్‌కాస్ట్ చేయడం వల్ల మీ ఆలోచనలు, మాట, సమయస్ఫూర్తి పెరుగుతాయి. రీసెర్చ్ చేయడం వల్ల చాలా విషయాలు తెలుసుకుంటారు. ఇంటర్వ్యూలు చేయడం వల్ల ఎక్స్‌పర్ట్‌లతో పరిచయాలు జరుగుతాయి. పేరు వస్తుంది. ఇన్ని మేళ్లు జరుగుతాయి కనుక ట్రై చేయండి. ఈ సెలవుల్లో పాడ్‌కాస్టర్‌గా మారండి. ఆల్ ది బెస్ట్. ఇంకా ఏం మాట్లాడొచ్చు పాడ్‌కాస్ట్‌లో...→ తెలుగు పద్యం: వేమన, సుమతి, భాస్కర శతకాల్లో నుంచి ఒక్కో పద్యం తీసుకుని అది మీకు ఎందుకు ఇష్టమో అందులోని నీతి ఏమిటో మీ ఫ్రెండ్‌కు వివరిస్తూ పాడ్‌కాస్ట్ చేయొచ్చు.→ తెలుగువారి హిస్టరీ నుంచి మీకు నచ్చిన విషయాలను పాడ్‌కాస్ట్ చేయొచ్చు.→ సినిమాల మీద చేయొచ్చు.→ ఐ.పి.ఎల్ మేచెస్ మీద చేయొచ్చు.→ మై డ్రీమ్స్.. అని చేయొచ్చు. ఇవి మీ లక్ష్యాలే కాదు... మీ కలలు కూడా చెప్పచ్చు. -
హైదరాబాద్‌లో జియో టాప్.. ట్రాయ్ టెస్ట్‌లో బెస్ట్
హైదరాబాద్: రిలయన్స్ జియో హైదరాబాద్‌లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది. కీలకమైన వాయిస్, డేటా పనితీరులో ఇతర టెల్కోలను జియో వెనక్కి నెట్టింది. ఇటీవల ట్రాయ్ (TRAI) నిర్వహించిన ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్ (IDT)లో జియో తన బలమైన మొబైల్ నెట్వర్క్ సామర్ధ్యాన్ని నిరూపించుకుంది.ట్రాయ్ నివేదిక ప్రకారం రిలయన్స్ జియో తన 4G నెట్‌వర్క్‌లో 240.66 Mbps సగటు డౌన్లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఇది నగరంలోని అన్ని ఆపరేటర్లలో అత్యధికం. ఈ అసాధారణ పనితీరు వల్ల జియో కస్టమర్లు గరిష్ట వినియోగ సమయాల్లో కూడా వేగవంతమైన వీడియో స్ట్రీమింగ్, ఆన్లైన్ గేమింగ్, వేగవంతమైన యాప్ డౌన్లోడ్లు, అంతరాయం లేని బ్రౌజింగ్‌ను ఆస్వాదించేలా చేస్తుంది.ఈ ఫలితాలు.. జియోను అధిక డౌన్‌లింక్ వేగం, తక్కువ లేటెన్సీ కలిగిన ఉత్తమ నెట్‌వర్క్‌గా నిలబెట్టాయి. అతి తక్కువ లేటెన్సీ వినియోగదారులు, సర్వర్ల మధ్య డేటా ప్యాకెట్లు ప్రయాణించడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది వీడియో కాన్ఫరెన్సింగ్ మరియు ఆన్లైన్ గేమింగ్ వంటి రియల్-టైమ్ అప్లికేషన్లకు అత్యంత అవసరం.మరోవైపు వాయిస్ సేవలలో కూడా జియో పనితీరు అంతే బలంగా ఉంది. జియో సేవలు అధిక కాల్ సెటప్ సక్సెస్ రేటు, తక్కువ కాల్ సెటప్ సమయం, అతి తక్కువ కాల్ డ్రాప్ రేటు, అద్భుతమైన వాయిస్ స్పష్టత అందిస్తున్నాయని ట్రాయ్ నివేదిక సూచిస్తోంది. -
గూగుల్ కొత్త ఫీచర్.. కొట్టేసిన ఫోన్ పనిచేయదు!
ఫోన్ల చోరీకి చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. చోరీకి గురైన ఫోన్లను దాదాపు నిరుపయోగంగా మార్చే లక్ష్యంతో గూగుల్ ఆండ్రాయిడ్ 16తో ముఖ్యమైన యాంటీ-థెఫ్ట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ అప్డేట్లో మెరుగైన భద్రతా సాధనాలు ఉంటాయి. ఇవి "ఓనర్ అనుమతి లేకుండా రీసెట్ చేసిన ఫోన్లు పనిచేయకుండా అవుతాయి" అని ఆండ్రాయిడ్ పరికరాల సమాచారాన్ని తెలిపే ‘ఆండ్రాయిడ్ పోలీస్’ అనే వెబ్సైట్ నివేదిక తెలిపింది.గూగుల్ ఇటీవల 'ది ఆండ్రాయిడ్ షో: ఐ/ఓ ఎడిషన్' సందర్భంగా ఈ కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఇది ప్రాథమికంగా ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్ (ఎఫ్ఆర్పీ) ను పెంచుతుంది. ఇది చోరీకి గురైన ఫోన్లను నిరుపయోగంగా చేయడానికి రూపొందించిన భద్రతా ఫీచర్. గూగుల్ ఆండ్రాయిడ్ 15 లో ఎఫ్ఆర్పీకి అనేక మెరుగుదలలు చేసింది. తదుపరి ఆండ్రాయిడ్ అప్డేట్ దీనిని మరింత బలోపేతం చేస్తుంది.ఈ కొత్త ఫీచర్ గురించి గూగుల్ అధికారికంగా ఏమీ చెప్పనప్పటికీ, గూగుల్ ప్రణాళికలను తెలియజేసే ఒక స్క్రీన్ షాట్ ను ఆండ్రాయిడ్ పోలీస్ పబ్లిష్ చేసింది. ఈ స్క్రీన్ షాట్ ఫోన్ స్క్రీన్ పై ఫ్యాక్టరీ రీసెట్ వార్నింగ్ ఫ్లాషింగ్ ను చూపిస్తోంది. ఫోన్‌ను దొంగిలించినవారు ఒకవేళ సెటప్ విజార్డ్ ను చేయకపోతే రీసెట్ చేయకుండా ముందుకెళ్లలేరు. అంటే యూజర్ ఫోన్‌ను రీసెట్ చేసి మునుపటి లాక్ స్క్రీన్ లాక్ లేదా గూగుల్ ఖాతా క్రెడెన్షియల్స్‌ను నమోదు చేసే వరకు ఫోన్ పనిచేయదు. ఆండ్రాయిడ్ పోలీస్ ప్రకారం.. కొత్త ఫీచర్ ఈ సంవత్సరం చివరలో విడుదలయ్యే అవకాశం ఉంది. -
ఏటీఎంలకు డిజిటల్ గ్రహణం!
దేశంలో డిజిటల్ లావాదేవీల విప్లవం ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ఏటీఎం)లకు గండి కొడుతోంది. ఒకపక్క బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు చెలామణీ అంతకంతకూ ఎగబాకుతూ ఆల్‌టైమ్ గరిష్టాల్లో కొనసాగుతోంది. మరోపక్క ఏటీఎంలు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. బ్యాంకులు కొత్తగా తెరుస్తున్న ఏటీఎంల కంటే మూసేస్తున్నవే ఎక్కువ కావడం విశేషం! కొత్తిమీర కట్ట నుంచి బైకులో పెట్రోలు దాకా దేనికైనా డిజిటల్ చెల్లింపులే నడుస్తున్నాయిప్పుడు! మన దైనందిన ఆరి్థక లావాదేవీల్లో యూపీఐ పేమెంట్స్ అంతలా పెనవేసుకుపోయాయి మరి. దీంతో ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాలు కూడా తగ్గుతున్నాయి. ఇదిలా ఉంటే, ఒకప్పుడు మెయిన్ రోడ్లపైనే కాకుండా సందుల్లో కూడా ఎడాపెడా ఏటీఎంలను తెరిచిన బ్యాంకులు.. ఇప్పుడు చడీచప్పుడు లేకుండా వాటికి తాళాలేస్తున్నాయి. ఆర్బీఐ నిబంధనల మేరకు ఏటీఎం ఉచిత లావాదేవీలపై పరిమితులు విధించడం, ఏటీఎం ఇంటర్–ఆపరబిలిటీ, వేరే బ్యాంకుల కస్టమర్లు ఏటీఎంలను ఉపయోగించుకునేటప్పుడు విధించే ఇంటర్చేంజ్ ఫీజు పెరుగుదల పెద్దగా లేకపోవడంతో బ్యాంకులు ఏటీఎంల నిర్వహణ బిజినెస్ పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొత్త ఏటీఎంల ఏర్పాటుకు ముఖం చాటేస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్ నాటికి 2,19,882 ఏటీఎంలు ఉండగా, 2024 డిసెంబర్ నాటికి వీటి సంఖ్య 2,14,398కి తగ్గిపోయింది. అంటే దాదాపు ఏడాది వ్యవధిలో 5,484 ఏటీఎంలను ఎత్తేశాయన్నమాట! ముఖ్యంగా ఆఫ్‌సైట్ (బ్యాంకు బ్రాంచ్‌లలో కాకుండా ఇతర లొకేషన్లలో ఉన్నవి) ఏటీఎంల విషయంలో ఈ కోత భారీగా ఉంది. 2022 సెపె్టంబర్లో గరిష్టంగా 97,072 ఆఫ్‌సైట్ ఏటీఎంలు ఉండగా.. 2024 డిసెంబర్ నాటికి ఇవి 85,913కి తగ్గిపోవడం గమనార్హం. డిజిటల్ రయ్... బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు చెలామణీ ప్రస్తుతం ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో రూ.34.7 లక్షల కోట్లకు పైగానే ఉంది. పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) నుంచి చూస్తే రెట్టింపైంది. మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 12 శాతం కింద లెక్క. ఇంతలా నగదు వ్యవస్థలో ఉన్నప్పటికీ, ఏటీఎంల సంఖ్య పెరక్కపోగా.. అంతకంతకూ తగ్గుతుండటం విశేషం. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో ప్రతి లక్ష మంది జనాభాకు 15 ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. కాగా, 2024 పూర్తి ఏడాదికి చూస్తే, 17,200 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. 2023తో పోలిస్తే (11,760 కోట్లు) 46 శాతం దూసుకెళ్లాయి. మరోపక్క, ఆర్బీఐ అనుమతితో ఈ నెల 1 నుంచి ఏటీఎం చార్జీలను బ్యాంకులు పెంచేశాయి. దీంతో ఉచిత లావాదేవీల పరిమితి దాటితే, ప్రతి లావాదేవీకి ఇప్పు డున్న రూ.21 చార్జీ రూ.23కు పెరిగింది. నెలకు సొంత బ్యాంకుల ఏటీఎంలలో 5, ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయాని కొస్తే మెట్రోల్లో అయితే 3, నాన్ మెట్రోల్లో 5 లావాదేవీలు ఉచితం. క్యాష్ విత్‌డ్రాతో పాటు బ్యాలెన్స్ ఎంక్వయిరీ వంటివన్నీ లావాదేవీగానే పరిగణిస్తున్నారు.ఎనీటైమ్ సమస్యలు...! కొన్ని బ్యాంకులు బ్రాంచ్‌ల వద్ద ఏటీఎంలను బాగానే నిర్వహిస్తున్నప్పటికీ, ఆఫ్‌సైట్ ఏటీఎంల విషయంలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడు చూసినా సాంకేతిక సమస్యలు, లేదంటే క్యాష్ లేకపోవడం వంటివి కస్టమర్లకు నిత్యకృత్యంగా మారుతున్నాయి. దీంతో అత్యవసరంగా క్యాష్ విత్‌డ్రా చేసుకోవాలంటే రెండు మూడు ఏటీఎంలకు తిరగాల్సి వస్తోందనేది అధిక శాతం మంది ఖాతాదారుల ఫిర్యాదు. ‘దేశంలో ప్రస్తుత ఏటీఎంల ట్రెండ్‌ను పరిశీలిస్తే, బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ, ముఖ్యంగా డిజిటల్ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోపక్క, బ్యాంకింగ్ సేవలు తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాలపై బ్యాంకులు దృష్టి పెట్టడం కూడా మొత్తంమీద ఏటీఎంలు తగ్గుముఖం పట్టడానికి కారణం’ అని ఆన్లైన్ పేమెంట్ సరీ్వస్ ప్రొవైడర్ ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ చైర్మన్ రవి బి. గోయల్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల నేపథ్యంలో నెట్వర్క్ స్థిరీకరణ జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.34.7 లక్షల కోట్లు: బ్యాంకింగ్ వ్యవస్థలో చెలామణీలో ఉన్న నగదు (జీడీపీలో ఇది 12 శాతం).2,14,398: 2024 డిసెంబర్ నాటికి దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల మొత్తం ఏటీఎంల సంఖ్య (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు సహా). ఇందులో 1,28,485 ఆన్సైట్, 85,913 ఆఫ్‌సైట్ ఏటీఎంలు ఉన్నాయి.36,000: దేశంలో వైట్ లేబుల్ ఏటీఎంల సంఖ్య దాదాపుగా. ప్రస్తుతం ఈపీఎస్, ఇండియా1 పేమెంట్స్, హిటాచి పేమెంట్ సరీ్వసెస్, టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్, వక్రంగీ.. ఈ ఐదు ప్రైవేటు కంపెనీలు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లుగా ఉన్నాయి. 17,200 కోట్లు : 2024లో యూపీఐ లావాదేవీల సంఖ్య (రోజువారీగా సగటు విలువ రూ. 74,990 కోట్లు) – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇంటర్నెట్ లేకుండా.. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా..
ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుంటే.. ఆన్లైన్ పోర్టల్ సందర్శించాల్సిందే. ఇలా చేయాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అయితే.. డేటా లేకుండా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కష్టమే అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మిస్డ్‌కాల్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. దీని గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.మిస్డ్‌కాల్‌తో పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 9966044425 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఈ నెంబర్‌కు కాల్ చేయగానే ఆటోమేటిక్‌గా కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. ఆ తరువాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎమ్ఎస్ రూపంలో వస్తుంది.ఇదీ చదవండి: పాకిస్తాన్ మొత్తం జీడీపీ కలిపితే.. తమిళనాడంత లేదు!పీఎఫ్ బ్యాలెన్స్ మీకు ఎస్ఎమ్ఎస్ రూపంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు రావాలంటే.. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేట్ అయి ఉండాలి. అంతే కాకుండా మీ నెంబర్ UANకు లింక్ అయి ఉండాలి. కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలి. ఇవన్నీ పూర్తి చేసి ఉంటేనే మీరు పీఎఫ్ బ్యాలెన్సును మెసేజ్ రూపంలో తెలుసుకోగలరు. 7738299899 నెంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు. -
భారత్‌లో ఐఫోన్ తయారీకి ఆసక్తి చూపడం లేదు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోహా పర్యటన సందర్భంగా భారత్‌లో యాపిల్ ఐఫోన్ల తయారీపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో యాపిల్ తన ఉత్పత్తుల తయారీని పెంచుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. ఇండియాలో యాపిల్ తయారీని హైలైట్ చేస్తూ ‘తమ పని తాము చూసుకుంటారు’అని సీఈఓ టిమ్‌కుక్‌కు సూచించారు.భారతదేశం లేదా చైనా వంటి దేశాల్లో అమెరికా కంపెనీలు పెట్టుబడులు పెట్టడం, తయారీ ప్లాంట్లను స్థాపించడం తగదని, అమెరికాలోనే వీటిని చేపట్టాలని ట్రంప్ నిరంతరం యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని కట్టడి చేసేందుకే టారిఫ్‌లను విధిస్తున్నట్లు గతంలో తెలిపారు. కొంతకాలంగా యాపిల్ తన ఐఫోన్ ఉత్పత్తిని భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల చైనాపై అధిక దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు భారత్‌లో మరింత వేగంగా విస్తరించాలని చూస్తున్నాయి. ఈ సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇదీ చదవండి: కంపెనీలకు కలిసొచ్చిన యుద్ధం2025 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలోని ఐఫోన్ ఉత్పత్తి విలువ 22 బిలియన్ డాలర్లకు చేరింది. 2026 చివరి నాటికి భారత్‌ను అమెరికా దిగుమతి చేసుకునే ఐఫోన్లకు ప్రధాన కేంద్రంగా మార్చాలని కంపెనీ యోచిస్తోంది. స్థానికంగా అధిక ఖర్చులు ఉన్నప్పటికీ, యాపిల్ చైనాపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఉత్పాదకతను నియంత్రించడానికి స్థానికంగా పెట్టుబడులు పెంచుతోంది. -
‘అందుకే ప్రభుత్వ ఉద్యోగం మేలు అనేది’..
టెక్ దిగ్గజాలు వరుస పెట్టి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా సత్య నాదళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జీతాలు, జాబ్ సెక్యూరిటీ పరంగా ఐటీ జాబ్‌లు, ప్రభుత్వ ఉద్యోగాలను పోలుస్తూ చర్చ నడుస్తోంది. అమెరికాలోని ఈ సంస్థలో పనిచేస్తున్న తన సోదరుణ్ణి ఉద్యోగం నుంచి తొలగించారంటూ సోషల్ మీడియాలో ఓ మహిళ చేసిన పోస్ట్ దానికి గూగుల్ కు చెందిన ఇంజినీర్ ప్రతిస్పందన వైరల్‌గా మారాయి.మైక్రోసాఫ్ట్ లేఆఫ్‌ల (Microsoft Layoffs) నేపథ్యంలో స్నేహ అనే మహిళ ‘ఎక్స్’లో ఓ పోస్ట్‌పెట్టారు. ‘అమెరికాలో పనిచేస్తున్న నా కజిన్ బ్రదర్‌ను మైక్రోసాఫ్ట్ ఉద్యోగం నుంచి తొలగించింది. టెక్ అనేది స్థిరంగా ఉండే ర రంగం కాదు. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించాలని, కనీసం అక్కడ ఉద్యగ భద్రత అయినా ఉంటుందని మా పెద్దవాళ్లు చెబుతుంటారు’ అంటూ రాసుకొచ్చారు.బెంగళూరుకు చెందిన గూగుల్ ఇంజనీరు రాహుల్ రాణా ఈ పోస్టకు ప్రతిస్పిందించారు. ప్రభుత్వ ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యమివ్వాలనే భావనను ఆయన తిప్పికొట్టారు. టెక్ పరిశ్రమలో అధిక సంపాదన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే ఉద్యోగ భద్రత ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉంటుందని వాదించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి జీవితకాలంలో సంపాదించే దానికంటే ఐదు రెట్లు ఎక్కువ మొత్తాన్ని టెక్ ఉద్యోగి కొన్ని సంవత్సరాలలోనే సంపాదించవచ్చని చెప్పుకొచ్చారు.ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. మరికొంత మంది యూజర్లు ప్రతిస్పందించారు. టెక్ జాబ్స్, ప్రభుత్వ ఉద్యోగాల మధ్య లాభనష్టాలను బేరీజు వేస్తూ, ఉద్యోగ భద్రత, ఆర్థిక ప్రయోజనాలు , కెరీర్ స్థిరత్వంపై తమ దృక్పథాలను పంచుకున్నారు. తన వాదనలను మరింత పెంచుతూ భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు వేతనానికి మించి గణనీయమైన ప్రయోజనాలను అందించగలవని, గృహనిర్మాణం, విద్యుత్తు, ఇతర సౌకర్యాల అలవెన్సులతో సహా, ఇది గణనీయమైన సంపద సేకరణకు దారితీస్తుందని స్నేహ పేర్కొన్నారు. -
మర మనిషా..? మైఖేల్ జాక్సనా..?
మర మనుషులు మానవుల స్థానాన్ని రీప్లేస్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. హ్యుమనాయిడ్ రోబోల ఆవిష్కరణలో వస్తున్న మార్పులే అందుకు ఉదాహరణ. తాజాగా టెస్లా హ్యూమనాయిడ్ రోబో ఆప్టిమస్ మనుషుల్లా డ్యాన్స్ చేస్తున్న వీడియోలను ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఎలాంటి ఆధారం లేకుండా అచ్చం మనుషుల్లానే డ్యాన్స్ చేయడం ఆ వీడియోలో చూడవచ్చు.ఇదీ చదవండి: ఈసారి 7,000 మంది బలి?ఆప్టిమస్ రోబో డ్యాన్స్ చేస్తున్న వీడియోను కోట్ చేస్తూ టెస్లా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందించింది. ప్రధానంగా కార్ల తయారీదారుగా ఉన్న టెస్లా రోబో డ్యాన్స్‌ను ఉటంకిస్తూ ‘మాది కార్ల కంపెనీ కదా’ అని సరదాగా పోస్టు చేసింది. టెస్లా తదుపరి వాటాదారుల సమావేశంలో తనతో పాటు ఆప్టిమస్ నృత్య బృందాన్ని వేదికపైకి తీసుకెళ్తానని ఎలాన్ మస్క్ ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించారు.🕺 pic.twitter.com/NzqAmN3F5z— gorklon rust (@elonmusk) May 13, 2025pic.twitter.com/ZbrZmfjHpd— gorklon rust (@elonmusk) May 14, 2025This is still very far from our final form https://t.co/6gIAllTPP5— gorklon rust (@elonmusk) May 14, 2025We're a car company right https://t.co/DWCw4i3HQV— Tesla (@Tesla) May 14, 2025 -
6జీ పేటెంట్లలో భారత్ టాప్6
న్యూఢిల్లీ: 6జీ పేటెంట్ ఫైలింగ్స్‌కి సంబంధించి అంతర్జాతీయంగా టాప్ ఆరు దేశాల్లో భారత్ కూడా ఉన్నట్లు కేంద్ర టెలికం శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని తెలిపారు. దేశీయంగా 111 రీసెర్చ్ ప్రాజెక్టులకు రూ. 300 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఆయన వివరించారు. 6జీ సేవలు 5జీ కన్నా 100 రెట్లు వేగంగా ఉంటాయన్నారు.టెక్నాలజీలో అంతర్జాతీయంగా భారత్ అగ్రగామిగా ఎదిగే క్రమంలో పలు దశాబ్దాల పాటు ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. దీనితో కొత్త పరిశ్రమలు వస్తాయని, ప్రస్తుతమున్న వాటిలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని భారత్ 6జీ 2025 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు.ఫలితంగా 2035 నాటికి భారత ఎకానమీ 1 లక్ష కోట్ల డాలర్ల మేర పెరుగుతుందని చంద్రశేఖర్ చెప్పారు. దేశీయంగా 6జీని అభివృద్ధి చేసుకోవడం వల్ల మన కమ్యూనికేషన్స్ వ్యవస్థ సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు. -
చిన్న నగరాల్లో స్మార్ట్‌ఫోన్స్ హవా!
మెట్రోలు, బడా నగరాల వంటి అర్బన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు పతాక స్థాయికి చేరుకోవడంతో డిమాండ్ మందకొడిగా మారింది. అయితే, హ్యాండ్సెట్ తయారీ సంస్థలకు ద్వితీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు ఈ లోటును భర్తీ చేస్తున్నాయి. చౌక ఫోన్లే కాదు.. ప్రీమియం 5జీ ఫోన్ల కొనుగోళ్లకూ కస్టమర్లు తగ్గేదేలే అంటున్నారు. పెద్ద నగరాలను మించి విక్రయాలు నమోదవుతుండటంతో సేల్స్ పెంచుకోవడానికి కంపెనీలు రూరల్ రూట్ ఎంచుకుంటున్నాయి. అంతేకాదు, ఫైనాన్సింగ్ ఆప్షన్ల దన్నుతో సెకండ్ హ్యాండ్ 4జీ ఫోన్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఒకప్పుడు కీప్యాడ్ ఫీచర్ ఫోన్స్ వాడకానికి బాగా అలవాటు పడ్డ గ్రామీణ, చిన్న పట్టణాల ప్రజలు ‘స్మార్ట్’గా అప్‌గ్రేడ్ అవుతున్నారు. దీంతో చిన్న నగరాలు, పట్టణాలతో పాటు పల్లెల్లోనూ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ దూసుకెళ్తోంది. పెద్ద నగరాల్లో స్తబ్దుగా మారిన సేల్స్‌ను కంపెనీలు అక్కడ పూడ్చుకుంటున్నాయి. దీంతో మొత్తంమీద స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు పడిపోకుండా, వృద్ధి సిగ్నల్స్‌కు వీలవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘4జీతో పాటు 5జీ మోడల్స్ కూడా అందుబాటు ధరల్లో లభ్యమవుతుండటంతో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఈ ఏడాది అమ్మకాల వృద్ధి భారీగా నమోదుకానుందని టెక్ఆర్క్ అడ్వయిజర్ అజయ్ శర్మ చెప్పారు. ‘2023, 2024 సేల్స్ ట్రెండ్‌ను పరిశీలిస్తే, పెద్ద నగరాలకు మించి టియర్–2 నగరాల్లో అమ్మకాలు పుంజుకున్నాయి. ప్రీమియం ఫోన్ల పట్ట ఆసక్తి ఈ నగరాలకూ పాకింది. మరోపక్క, చౌక 5జీ ఫోన్ల దన్నుతో కొన్ని బ్రాండ్లు మిగతా కంపెనీల కంటే వేగంగా వృద్ధి చెందుతున్నాయి’ అని పేర్కొన్నారు.ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా... చిన్న నగరాలు, పట్టణాల్లో కూడా ప్రజల ఆదాయాలు పెరుగుతుండటంతో పాటు డిజిటల్ టెక్నాలజీ పట్ల అవగాహన, రిటైల్ నెట్‌వర్క్‌లను విస్తరిస్తుండటం వల్ల కస్టమర్లు హై–ఎండ్ డివైజ్‌లకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ఎనలిస్ట్ సుభమ్ సింగ్ తెలిపారు. ‘ప్రధాన హ్యాండ్సెట్ బ్రాండ్లన్నీ ఆఫ్‌లైన్ (రిటైల్ స్టోర్స్) ద్వారా చిన్న నగరాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) గణాంకాల ప్రకారం 2024లో 15.1 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. 4 శాతం వృద్ధి నమోదైంది. స్టోర్‌లో నేరుగా ఫోన్‌ను చూసి, అనుభూతి చెందే అవకాశం, అలాగే ఈజీ ఫైనాన్సింగ్ ఆప్షన్లతో ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లకు వెనకాడటం లేదు’ అని సింగ్ వివరించారు. 30 నగరాల్లో నిర్వహించిన మార్కెట్ అధ్యయనం ప్రకారం, బడా నగరాల్లో (టియర్–1) వార్షిక అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్‌కు పరిమితం కాగా, టియర్–2, అంతకంటే చిన్న నగరాల్లో రెండంకెల వృద్ధి నమోదవుతున్నట్లు చెప్పారు. ఫీచర్ ఫోన్స్ కస్టమర్లు అప్‌గ్రేడ్ అవుతుండటం, అనువైన రుణ సదుపాయాల వల్ల తృతీయ శ్రేణి (టియర్–3) ప్రాంతాల్లో తమ అమ్మకాలు 19–20 శాతం పెరిగాయని హ్యాండ్సెట్ బ్రాండ్ టెక్నో సీఈఓ అరిజిత్ తలపాత్ర పేర్కొన్నారు.అమ్మకాలు ఫ్లాట్.. ఆదాయాలు జూమ్ కోవిడ్ ముందు నాటి స్మార్ట్‌ఫోన్ అమ్మకాల వృద్ధితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో సేల్స్ మందగమనం స్పష్టంగా కనబడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏటా విక్రయాలు 15 కోట్ల స్థాయికి పరిమితం అవుతున్నాయి. ఈ ఏడాది (2025) అమ్మకాలు ఫ్లాట్‌గా ఉంటాయని అంచనా వేస్తున్నారు. టాప్‌లేపుతున్న వివో, శాంసంగ్, షావోమి, ఒప్పో, రియల్మీ వంటి బ్రాండ్లకు ఇది ప్రతికూల సిగ్నల్స్ పంపుతోంది. అయితే, 2024లో దేశీ స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ మొత్తం ఆదాయం ఆల్‌టైమ్ గరిష్ఠానికి (9% వార్షిక వృద్ధి) దూసుకెళ్లడం విశేషం. ప్రధానంగా 5జీ, జెనరేటివ్ ఏఐ వంటి ఫీచర్లు గల ఖరీదైన స్మార్ట్‌ఫోన్స్‌పై కస్టమర్లు భారీగా ఖర్చు చేయడమే దీనికి కారణమని కౌంటర్‌పాయింట్ వెల్లడించింది.సగం ఫోన్ సేల్స్ అక్కడి నుంచే... ‘ప్రీమియం స్మార్ట్ఫోన్ల వాడకం ట్రెండ్ మెట్రోలు, పెద్ద నగరాలకే పరిమితం కావడం లేదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా రూ.8,500–17,000 స్థాయికి మించి ఖరీదైన ఫోన్లకు కస్టమర్లు సై అంటున్నారు. ముఖ్యంగా ఔత్సాహిక మధ్య తరగతి కొనుగోలుదారులు వేగంగా ప్రీమియం ఫోన్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు’ అని సీసీఎస్ ఇన్సైట్ సీనియర్ ఎనలిస్ట్ ఏక్తా మిట్టల్ చెప్పారు. స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో భవిష్యత్తు వృద్ధికి చిన్న నగరాలే చోదకంగా నిలుస్తాయంటున్నారు. ప్రస్తుతం సగానికి పైగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు చిన్న నగరాలు, పట్టణాల్లోనే నమోదవుతున్నాయని కూడా సీసీఎస్ ఇన్సైట్ తెలిపింది. మరోపక్క, జియో, ఎయిర్టెల్ తమ 5జీ నెట్‌వర్క్‌ను గ్రామీణ, సబర్బన్ ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తుండటం, క్వాల్కామ్, మీడియాటెక్ వంటి చిప్ తయారీ దిగ్గజాలు రూ.12,000 కంటే తక్కువ స్థాయిలో 5జీ ఫోన్లు లభించేలా చౌక 5జీ ప్రాసెసర్లను అందుబాటులోకి తేవడం కూడా పరిశ్రమకు దన్నుగా నిలుస్తోందనేది నిపుణుల మాట!–సాక్షి, బిజినెస్ డెస్క్ -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న సెమీకండక్టర్ పరిశ్రమ ఇప్పుడు భారత్‌లోనూ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే దేశంలో ఐదు సెమీకండక్టర్ యూనిట్లు నిర్మాణ దశలో ఉండగా ఆరో యూనిట్‌గా ఇది ఏర్పాటవుతోంది.రూ.3706 కోట్ల వ్యయంతో..హెచ్‌సీఎల్, ఫాక్స్‌కాన్ సంయుక్త భాగస్వామ్యంతో యూపీలోని జెవార్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఈ కొత్త సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు కానుంది.రూ.3706 కోట్ల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2027 నాటికి ఈ యూనిట్ నిర్మాణం పూర్తయి ఉత్పత్తిని మొదలుపెట్టనుంది. ఇక్కడ మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఆటోమొబైల్స్, పర్సనల్ కంప్యూటర్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో వినియోగించే చిప్‌లను ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు.ప్రతి నెలా 3.6 కోట్ల యూనిట్లను తయారు చేసే సామర్థ్యంతో ఈ భారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో ఐదు సెమీకండక్టర్ యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక కేంద్ర కేబినెట్ ప్రకటించిన నిర్ణయాల్లో బెంగళూరు, నోయిడా ప్రాంతాలలో డిస్ప్లే చిప్స్ హబ్‌ల ఏర్పాటు ఉంది. అలాగే తిరుపతి ఐఐటీ విస్తరణకు కూడా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. -
చేతిలో పట్టుకున్నా.. పట్టుకోనట్టే!
సాంకేతికతను వినియోగించడంలో, ఎప్పటికప్పుడు అప్డేట్ కావడంలోనూ యువతరం ముందుంటోంది. నిత్యం మొబైళ్ల తయారీలో వస్తున్న మార్పులను వీరు స్వాగతిస్తున్నారు. స్మార్ట్ఫోన్ల పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ఫోన్లలో ఫీచర్లతోపాటు మొబైల్ డిజైన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫోన్ తయారీ కంపెనీలు సైతం వినియోగదారుల అభిరుచుల మేరకు వినూత్న మోడళ్లను నిత్యం ఆవిష్కరిస్తున్నాయి. అందులో భాగంగా స్లిమ్‌గా ఉండే ఫోన్ల తయారీపై సంస్థలు ఫోకస్ పెట్టాయి. వినియోగదారుల చేతిలో ఇట్టే నప్పేలా వాటిని తయారు చేస్తున్నాయి. 2025లో అందుబాటులో ఉన్న కొన్ని స్లిమ్ డిజైన్ ఫోన్ల వివరాలు కింద తెలుసుకుందాం.శామ్సంగ్ గెలాక్సీ ఎస్25మందం: 6.2 మి.మీస్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్50 ఎంపీ కెమెరా4000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: సుమారు రూ.65,399ఒప్పో రెనో13మందం: 6.5 మి.మీడైమెన్సిటీ 8350 ప్రాసెసర్50 మెగాపిక్సెల్ కెమెరా5600 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: సుమారు రూ.35,999వివో వీ50 మందం: 6.7 మి.మీస్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్50 ఎంపీ డ్యుయల్ కెమెరా6000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: సుమారు రూ.34,999ఇదీ చదవండి: ఆర్బీఐ రూ.2.75 లక్షల కోట్ల డివిడెండ్?ఐకూ నియో 10ఆర్మందం: 6.8 మి.మీస్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్50 ఎంపీ కెమెరా6400 ఎంఏహెచ్ బ్యాటరీధర: సుమారు రూ.26,999మోటరోలా ఎడ్జ్ 60 ప్రోమందం: 6.9 మి.మీడైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్50 మెగాపిక్సెల్ కెమెరా6000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: సుమారు రూ.29,999 -
యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు
యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ సాఫ్ట్వేర్లలో అనేక లోపాల గురించి భారత ప్రభుత్వం వినియోగదారులను హెచ్చరించింది. ఈ లోపాలను ఉపయోగించుకుని సున్నితమైన యూజర్ డేటాను సైబర్ నేరస్థులు యాక్సెస్ చేసే వీలుందని, దాంతోపాటు వారి డివైజ్‌లను పూర్తిగా నిరుపయోగంగా మార్చే అవకాశం ఉందని తెలిపింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) ఈమేరకు యాపిల్ డివైజ్ యూజర్లకు హై-ఇంటెన్సిటీ హెచ్చరికలు జారీ చేసింది.పాత, కొత్త మోడళ్లతో సహా వివిధ యాపిల్ పరికరాలపై ఈ లోపాలు ప్రభావం చూపుతాయని సీఈఆర్టీ-ఇన్ తెలిపింది. ఐఓఎస్ 18.3కు ముందు వెర్షన్లతో పనిచేసే ఐఫోన్లు, మోడల్‌ను బట్టి 17.7.3 లేదా 18.3 కంటే ముందు ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్లతో పనిచేసే ఐప్యాడ్లపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. యాపిల్ అంతర్గత మెసేజింగ్ ఫ్రేమ్‌వర్క్‌లో కీలకమైన డార్విన్ నోటిఫికేషన్ సిస్టమ్‌లో ప్రధాన లోపాన్ని ఒకటి గుర్తించినట్లు తెలిపింది. దాని ప్రకారం ప్రత్యేక అనుమతులు లేకపోయినా ఏదైనా అప్లికేషన్ సిస్టమ్ స్థాయి నోటిఫికేషన్లను పంపేందుకు అది అనుమతిస్తుంది. దీన్ని దుర్వినియోగం చేస్తే డివైజ్ క్రాష్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది.పరిణామాలు ఇలా..ఈ లోపాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని సీఈఆర్టీ-ఇన్ హెచ్చరించింది. హ్యాకర్లు వ్యక్తిగత, ఆర్థిక సమాచారంతో సహా గోప్యమైన డేటాను దొంగిలించే అవకాశం ఉంది. ఇంటర్నల్ భద్రతా యంత్రాంగాలను ఇది కట్టడి చేయవచ్చు. లేదా అనధికార కోడ్‌ను అమలు చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో యూజర్ల డివైజ్‌లు పూర్తిగా క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ లోపాలను అధిగమించేందుకు సత్వర చర్యలు అవసరమని సీఈఆర్టీ-ఇన్ ధ్రువీకరించింది.ఇదీ చదవండి: పదేళ్ల తర్వాత గూగుల్ లోగోలో మార్పులువెంటనే యూజర్లు ఏం చేయాలంటే..ఈ సమస్యకు పరిష్కారంగా యాపిల్ లోపాలను సరిదిద్దడానికి సెక్యూరిటీ అప్డేట్లను విడుదల చేసింది. యూజర్లందరూ తమ డివైజ్‌లను వెంటనే లేటెస్ట్ వర్షన్‌కు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. లేటెస్ట్గా అందుబాటులో ఉన్న ఐఓఎస్ లేదా ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్‌కు అప్డేట్ అవ్వాలని తెలిపింది. వినియోగదారులు ధ్రువీకరించని మొబైల్ అప్లేకేషన్లను ఇన్స్టాల్ చేసుకోకూడదని పేర్కొంది. ఏపీకే ఫైల్ ద్వారా ఎలాంటి యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోరాదని చెప్పింది. హానికరమైన కార్యకలాపాలను సూచించే పాప్అప్ సమాచారంపట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. -
పదేళ్ల తర్వాత గూగుల్ లోగోలో మార్పులు
గూగుల్ దాదాపు దశాబ్ద కాలం తర్వాత తన ఐకానిక్ లోగోలో మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ లోగో ‘జీ’ను కొత్త డిజైన్‌తో పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కొత్త లోగో వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఇది ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో బ్లాక్‌లకు బదులుగా ఒకే రంగులో ఫ్లూయిడ్ గ్రేడియంట్ విధానాన్ని అనుసరించింది. 2015 నుంచి ‘జీ’ లోగోను కంపెనీ మార్పు చేయలేదు.న్యూ లుక్: డిఫరెంట్ ఏంటి?కొన్నేళ్లుగా ఫ్లాట్‌గా బ్లాక్‌ల్లో రంగులకు బదులుగా ‘జీ’ లోగో ఇప్పుడు నాలుగు రంగులను మిళితం చేసే గ్రేడియంట్‌ను కలిగి ఉంది. ఇది ఐకాన్‌కు మరింత ఆధునికత, డైనమిక్ రూపాన్ని ఇస్తుంది. అన్ని విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకోవాలనే గూగుల్ ఉద్దేశానికి ఇది ఒక చిహ్నంగా పనిచేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏఐ జనరేటివ్ అసిస్టెంట్ గూగుల్ జెమిని బ్రాండింగ్‌కు అనుగుణంగా ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: పడి లేచిన పసిడి ధరలు! తులం ఎంతంటే..ఐఓఎస్, పిక్సెల్ యూజర్లకు..గూగుల్ సెర్చ్ యాప్ ద్వారా ముందుగా ఐఓఎస్, పిక్సెల్ యూజర్లకు కొత్త ‘జీ’ లోగో అందుబాటులోకి రానుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గూగుల్ యాప్ బీటా వెర్షన్ 16.18 ద్వారా కొన్ని ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో కూడా దీన్ని ఉపయోగించనున్నట్లు చెప్పారు. గూగుల్ ఇంకా దీని విడుదల తేదీని తెలియజేయలేదు. అయితే రాబోయే కొన్ని వారాల్లో కొత్త లోగో మరిన్ని డివైజ్‌ల్లో అందుబాటులో ఉంటుందని తెలిసింది. క్రోమ్, మ్యాప్స్, జీమెయిల్, డ్రైవ్ వంటి ఇతర లోగోలను మారుస్తారా.. లేదా యథావిధిగా ఉంచుతారా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. -
డేటా సెంటర్లపై బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: డిజిటల్ మౌలిక సదుపాయాల వ్యాపార కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా టెక్నో డిజిటల్ ఇన్ఫ్రా పేరిట సంస్థను ప్రారంభించినట్లు టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజినీరింగ్ కంపెనీ (టీఈఈసీఎల్) వెల్లడించింది. ఇది సుమారు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో దేశవ్యాప్తంగా మొత్తం మీద 250 మెగావాట్ల సామర్థ్యంతో హైపర్‌స్కేల్, ఎడ్జ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. చెన్నైలో 36 మెగావాట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్ (హెచ్‌డీసీ) కార్యకలాపాలను ప్రారంభించిన సందర్భంగా టీఈఈసీఎల్ ఈ విషయాలు పేర్కొంది. తదుపరి హెచ్డీసీలను కోల్‌కతా, నోయిడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. మరోవైపు, 23 రాష్ట్రాలవ్యాప్తంగా 102 నగరాల్లో ఎడ్జ్ డేటా సెంటర్లను నిర్మించేందుకు రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు టీఈఈసీఎల్ తెలిపింది. క్లౌడ్ మాధ్యమం ద్వారా పెద్ద కంపెనీలకు భారీ డేటా స్టోరేజీ, ప్రాసెసింగ్ సరీ్వసులు అందించేందుకు హెచ్డీసీలు ఉపయోగపడతాయి. యూజర్లకు సమీపంలో స్థానికంగా ఏర్పాటు చేసే చిన్న డేటా సెంటర్లను ఎడ్జ్ సెంటర్లుగా వ్యవహరిస్తారు. -
ఐఫోన్ అంతరించనుందా..?
ఏఐ ఆధారిత టెక్నాలజీలు చివరికి స్మార్ట్ఫోన్ల స్థానాన్ని భర్తీ చేయగలవని, వినియోగదారులు వ్యక్తిగత పరికరాలతో సంభాషించేలా ఈ సాంకేతికతలు కీలక మార్పులు తెస్తాయని యాపిల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎడ్డీ క్యూ తెలిపారు. వచ్చే దశాబ్ద కాలంలో ఐఫోన్ లభ్యతపై ఈ ప్రభావం ఉండనుందని చెప్పారు. ఇటీవల యాంటీట్రస్ట్ ట్రయల్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘ఐపాడ్ ఒకప్పుడు మ్యూజిక్ వినియోగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఐఫోన్లు అందుబాటులోకి వచ్చాక క్రమంగా వాటి వినియోగం తగ్గిపోయింది. చివరకు ఐపాడ్లను నిలిపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌లు, నెక్స్ట్ జనరేషన్ ఎయిర్పాడ్లు, స్మార్ట్ గ్లాసెస్ వంటి ఏఐ-ఆధారిత ప్రత్యామ్నాయాలు మనం కమ్యూనికేట్ చేసే సమాచారాన్ని యాక్సెస్ చేసే విధానం మారుతుంది. ఈ మార్పు రానున్న రోజుల్లో ఐఫోన్లను రిప్లేస్ చేసే అవకాశం ఉంది’ అని ఎడ్డీ క్యూ తెలిపారు.యాపిల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు‘వచ్చే తరం కంప్యూటింగ్‌లో ముందుండాలనే లక్ష్యంతో యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీలను అన్వేషిస్తోంది. మెటా వంటి కంపెనీలు ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), ఏఐ ఇంటిగ్రేటెడ్ వేరబుల్స్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. సాంప్రదాయ స్మార్ట్ఫోన్లకు మించి మెరుగైన సామర్థ్యం, అంతరాయం లేని కనెక్టివిటీని ఈ టెక్నాలజీలు అందించే అవకాశం ఉంది. వాయిస్ కంట్రోల్డ్ అసిస్టెన్స్, రియల్-టైమ్ కాంటెక్స్ట్‌వల్ అవేర్నెస్, అడాప్టివ్ ఏఐ ఆధారిత ఇంటర్ఫేస్ వంటి ఆవిష్కరణలు వచ్చే రోజుల్లో ప్రామాణికంగా మారవచ్చు’ అని క్యూ అన్నారు.ఇదీ చదవండి: బలంగా ఎదిగేందుకు భారత్ సిద్ధంయాపిల్ విజన్‘ఐఫోన్ యాపిల్‌కు భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్నప్పటికీ భవిష్యత్తులో కంపెనీ దీనికి ప్రత్యామ్నాయాన్ని సృష్టించేందుకు సిద్ధం అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఆర్, స్మార్ట్ డివైజ్ ఎకోసిస్టమ్స్‌లో యాపిల్ సాధించిన పురోగతితో కంపెనీ వ్యూహాత్మకంగా తదుపరి తరం కంప్యూటింగ్‌లో ముందంజలో ఉంది’ అని క్యూ చెప్పారు. -
భారత్‌లో ఐఫోన్ల తయారీ రెట్టింపు..?
టాటా ఎలక్ట్రానిక్స్ తన హోసూరు యూనిట్లో యాపిల్ ఐఫోన్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచుతోందని ఈ పరిణామాల గురించి అవగాహన ఉన్న వర్గాలు తెలిపాయి. టాటా ఎలక్ట్రానిక్స్ ప్రస్తుతం ఉన్న 50,000 ఎన్క్లోజర్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని యోచిస్తోందని చెప్పాయి. హోసూరు కర్మాగారంలో ఇప్పటికే రెండో దశ నిర్మాణాన్ని చేపట్టినట్లు అధికారులు చెప్పారు. సెప్టెంబర్‌లో యాపిల్ చేసే కొత్త ప్రొడక్ట్ లాంచ్‌లకు ముందు ఈ ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.గత ఏడాది సెప్టెంబర్‌లో హోసూర్ యూనిట్లో జరిగిన అగ్నిప్రమాదానికి ముందు టాటా ఎలక్ట్రానిక్స్ సుమారు 50,000 ఎన్ క్లోజర్ల సామర్థ్యాన్ని సాధించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రమాదం తర్వాత తిరిగి ఇటీవల మునుపటి సామర్థ్యాన్ని చేరుకున్నట్లు తెలిపాయి. కెపాసిటీ విస్తరణకు సంబంధించిన వివరాలపై టాటా ఎలక్ట్రానిక్స్, యాపిల్ సంస్థలు ఇంకా అధికారికంగా స్పందించలేదు.అమెరికాలో విక్రయించే ఐఫోన్లకు భారత్ ప్రధాన తయారీ కేంద్రంగా మారుతుందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల చేసిన ప్రకటనల నేపథ్యంలో టాటా ఎలక్ట్రానిక్స్ విస్తరణ ఊపందుకున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ‘జూన్ త్రైమాసికంలో యూఎస్‌లో విక్రయించే ఐఫోన్లలో ఎక్కువ భాగం భారతదేశం నుంచే సమకూరుతాయని ఆశిస్తున్నాం’ అని కుక్ తెలిపారు. అమెరికాలో విక్రయించే దాదాపు అన్ని ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచ్, ఏర్పాడ్ ఉత్పత్తులకు వియత్నాం మూలస్థానంగా ఉంటుందని అన్నారు.ఇదీ చదవండి: అందాలతో అలరిస్తూ.. వ్యాపారాలు పెంచుతూ..పెగాట్రాన్ టెక్నాలజీ ఇండియా (పీటీఐ)లో 60 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు టాటా ఎలక్ట్రానిక్స్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది. 2024 మార్చిలో విస్ట్రాన్ ఇండియా కార్యకలాపాలను (కర్ణాటకలోని నర్సాపుర కేంద్రంగా) కంపెనీ కొనుగోలు చేసింది. యాపిల్ గ్లోబల్ వాల్యూ చైన్ (జీవీసీ)లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని కంపెనీ చూస్తోంది. -
నక్షత్రాన్నే నమిలేస్తూ.. మింగేస్తూ.. అదృశ్యం చేస్తున్న మహా కృష్ణబిలం
నక్షత్రం అంటేనే అంతులేని ఉష్ణంతో, దేదీప్యమానంగా వెలిగిపోతూ వందల కోట్ల కిలోమీటర్ల దాకా కాంతిని వెదజల్లే శక్తియంత్రం. అలాంటి నక్షత్రాన్ని అరటిపండులా అమాంతం మింగేస్తున్న రాకాసి కృష్ణబిలం జాడను అత్యంత అధునాతన హబుల్ టెలిస్కోప్ కనిపెట్టింది. నక్షత్రం మొత్తాన్ని తనలో కలిపేసుకుంటున్న ఈ బ్లాక్çహోల్ మిగతా కృష్ణబిలాల్లా నక్షత్రమండలం(గెలాక్సీ) కేంద్రస్థానంలో కాకుండా కోట్ల కోట్ల కిలోమీటర్ల దూరంగా ఉండటం మరో విశేషం.గెలాక్సీ మధ్యలో కాకుండా చాలా దూరంగా సైతం భారీ కృష్ణబిలాలు మనగల్గుతాయని, వాటి అపారమైన గురుత్వాకర్షణ బలాలు సమీప స్టార్లనూ సమాధి చేస్తాయని తొలిసారిగా వెల్లడైంది. సాధారణంగా నక్షత్రాలను కృష్ణబిలం తనలో కలిపేసుకునే (టైడల్ డిస్ట్రప్షన్ ఈవెంట్–టీడీఈ) దృగ్విషయం గెలాక్సీ మధ్యలో చోటుచేసుకుంటుంది. కానీ ఇలా టీడీఈ అనేది గెలాక్సీ మధ్యలో కాకుండా వేరే చోట సంభవించడాన్ని తొలిసారిగా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి ‘ఏటీ2024టీవీడీ’అని పేరు పెట్టారు. మింగేస్తున్న ఈ కృష్ణబిలం ద్రవ్యరాశి ఆ అంతర్థానమవుతోన్న నక్షత్రం ద్రవ్యరాశికంటే ఏకంగా 10 కోట్ల రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. నక్షత్రమండలం కేంద్రస్థానం చుట్టూ తిరిగే ఏదైనా నక్షత్రం అనుకోకుండా కృష్ణబిలం చెంతకు వచి్చనప్పుడు మాత్రమే అక్కడ బ్లాక్‌హోల్ ఉందనే విషయం తెలుస్తుంది.బ్లాక్ తాను మింగేసే ఖగోళ వస్తువును ఉన్నది ఉన్నట్లుగాకాకుండా ఆకారాన్ని నూడుల్స్‌లాగా సాగదీసి సాగదీసి లోపలికి లాగేసుకుంటుంది. ఈ ప్రక్రియనే స్పాగెటిఫికేషన్ అంటారు. తాజాగా నక్షత్రాన్ని మింగేస్తున్న క్రమంలోనే ఈ కృష్ణబిలం ఉనికి వెలుగులోకి వచ్చింది. అమెరికా శాండిగోలోని పాలోమార్ అబ్జర్వేటరీలోని ఆప్టికల్ కెమెరా తొలిసారిగా దీనిని గుర్తించింది. ఈ బ్లాక్‌హోల్ మన భూమికి ఏకంగా 60 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. హబుల్ టెలిస్కోప్ దీనిపై మరింత పరిశోధన చేసింది. సాధారణంగా కృష్ణబిలంలోకి నక్షత్రం లాగబడే క్రమంలో ఆ నక్షత్రం ఊహించనంత స్థాయిలో అతినీలలోహిత కాంతిని బయటకు వెదజల్లుతుంది. తర్వాత బ్లాక్‌హోల్ లోపలికి వెళ్లిపోయి ఆ స్టార్ అంతర్థానమవుతుంది. కేంద్రం నుంచి ఎంతో దూరంలో బ్లాక్‌హోల్ ఈ బ్లాక్‌హోల్ తనకు ఆశ్రయం ఇచ్చిన నక్షత్రమండలానికి సంబంధించిన కేంద్రస్థానంలో ఉండకుండా ఏకంగా 2,600 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీంతో కేంద్రస్థానంలోని బ్లాక్‌హోల్స్ కంటే ఇది భిన్నంగా ప్రవర్తిస్తుందేమో అని తెల్సుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రంగంలోకి దిగింది. ఈ కృష్ణబిలంపై ఓ కన్నేశామని చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీ, నేషనల్ రేడియో ఆస్ట్రోనమీ అబ్జర్వేటరీలోని వెరీ లార్జ్ అరే రేడియో టెలిస్కోప్ పరిశోధకుల బృందాలు తెలిపాయి.రెండు గెలాక్సీల విలీనం తర్వాత ఇలాంటి కృష్ణబిలాలు ఇలా సుదూరంగా మిగిలిపోయి ఉంటాయని భావిస్తున్నారు. లేదంటే రెండు అయస్కాంతాల తరహాలో రెండు కృష్ణబిలాల వ్యతిరేక బలాల వల్ల ఇది సుదూరంగా నెట్టివేయబడి ఉండొచ్చని ఇంకొందరు అధ్యయనకారులు అంచనావేస్తున్నారు. ‘‘కేంద్రస్థానంలో స్థిరంగా ఉండిపోకుండా ఇలా సంచార జీవిలా ఎక్కడో మౌనంగా ఉన్న ఇలాంటి కృష్ణబిలాలు కొత్త తరహా పరిశోధనలకు సాయపడతాయి’’అని బెర్క్లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాలో సంబంధిత పరిశోధనలో ప్రధాన రచయిత, ఖగోళశాస్త్రంలో పోస్ట్ డాక్టోరల్ యుహాన్ యాఓ చెప్పారు. త్వరలో అందుబాటులోకి రానున్న వెరీ సి.రూబిన్ అబ్జర్వేటరీ సాయంతో ఇలాంటి ఖగోళ వింతలను మరింత పరిశోధన జరగనుంది. -
అప్పు తీర్చడం ఎలా?: చాట్‌జీపీటీ సమాధానం
చాలీచాలని జీతాలతో పనిచేసేవారి సంఖ్య ఎక్కువే ఉంది. జీతాలు సరిపోక పోవడంతో లోన్స్ తీసుకోవడం లేదా ఇతరుల దగ్గర అప్పు చేయడం వంటివి చేస్తారు. అప్పులు ఎక్కువైపోయినప్పుడు వాటిని ఎలా తీర్చాలో తెలియక కొందరు సతమతమవుతారు. చేసిన అప్పును సులభంగా ఎలా తీర్చాలి?, అనే ప్రశ్నకు.. చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానం ఇక్కడ చూసేద్దాం.స్నోబాల్ విధానం: మీరు చేసిన మొత్తం అప్పుల్లో చిన్న అప్పులను ముందుగా తీర్చేయాలి. ఇలా చేయడం వల్ల అప్పుల సంఖ్య తగ్గుతుంది. ఇది మీకు కొంతవరకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది.అవలాంచీ విధానం: అత్యధిక వడ్డీ చెల్లిస్తున్న అప్పులను ముందుగా తీర్చేయాలి. వడ్డీ ఎక్కువ కడుతున్న అప్పులు తీర్చేయడం వల్ల.. ఆర్ధిక భారం కొంత తగ్గుతుంది. ఎక్కువ వడ్డీ చెల్లించే అవసరం కూడా ఉండదు.బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్: చిన్న మొత్తంలో అప్పు ఉంటే.. దానిని క్రెడిట్ కార్డుకు బదిలీ చేయడం ఉత్తమం. ఇలా క్రెడిట్ కార్డు ద్వారా అప్పు చెల్లించడం ద్వారా ఆర్ధిక ఒత్తిడి తగ్గుతుంది. వడ్డీ రేటు కూడా కొంత తగ్గుతుంది.ఆదాయాన్ని పెంచి, ఖర్చులను తగ్గించండి: అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. ఆదాయాన్ని పెంచుకోవడానికి పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం వంటివి చేయాలి. పొదుపు చేయడం పెంచాలి. మీ డబ్బు ఎక్కడ.. ఎక్కువ ఖర్చు అవుతుందో అర్థం చేసుకోవడానికి మీ ఆదాయం, ఖర్చులను బేరీజు వేసుకోండి. ఇలా చేసినప్పుడు ఖర్చులు తగ్గించడం సాధ్యమవుతుంది.ఇదీ చదవండి: సీసం నుంచి గోల్డ్ ఉత్పత్తి: బంగారాన్ని బఠానీల్లా కొనేయొచ్చా?అప్పుల ఏకీకరణ: బ్యాంకులలో ఒకటి కంటే ఎక్కువ లోన్స్ తీసుకుని ఉన్నట్లయితే.. వాటన్నింటినీ ఒకటే లోన్ కిందికి వచ్చేలా మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల వడ్డీ తగ్గుతుంది. ఈఎంఐ విధానం ద్వారా అప్పు చెల్లిస్తారు కాబట్టి.. అప్పు చెల్లించడం సులభతరం అవుతుంది. -
సీసం నుంచి గోల్డ్ ఉత్పత్తి: బంగారాన్ని బఠానీల్లా కొనేయొచ్చా?
బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. చాలామందికి గోల్డ్ కొనుగోలు చేయడం, ఇకపై సాధ్యమేనా అనే అనుమానులు కూడా పుడుతున్నాయి. ఇలాంటి సమయంలో.. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్(సీఈఆర్ఎన్)లోని భౌతిక శాస్త్రవేత్తలు సీసాన్ని బంగారంగా మార్చడంలో సక్సెస్ సాధించారు.CERN విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. సీస కేంద్రకాల అధిక శక్తి.. ఘర్షణల సమయంలో బంగారు కేంద్రకాలుగా మారడాన్ని పరిశోధకులు గమనించారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవా సమీపంలోని సీఈఆర్ఎన్ ప్రయోగశాలలో సీసాన్ని బంగారంగా మార్చారు.మూలకాల మధ్య ప్రోటాన్ సంఖ్యలో తేడాల (సీసానికి 82, బంగారానికి 79) వద్ద బంగారంగా రూపొందించడం కొంత కష్టమే అయినప్పటికీ.. కాంతి వేగంతో ప్రయాణించే సీసపు కిరణాలలోని అయాన్లు అప్పుడప్పుడు ఒకదానికొకటి ఎదురుగా ఢీకొనకుండా ప్రయాణిస్తాయి. ఇలా జరిగినప్పుడు ఒక అయాన్ చుట్టూ ఉన్న తీవ్రమైన విద్యుదయస్కాంత క్షేత్రం.. శక్తి పల్స్‌ను సృష్టిస్తుంది. ఆ సమయంలో సీసపు కేంద్రకం నుంచి మూడు ప్రోటాన్లను బయటకు పంపడానికి ప్రేరేపిస్తుంది. ఇలా జరిగినప్పుడు సీసం బంగారంగా మారుతుంది.ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు'సూపర్ ప్రోటాన్ సింక్రోట్రాన్' అని పిలువబడే మరొక సీఈఆర్ఎన్ యాక్సిలరేటర్.. 2002 నుంచి 2004 వరకు సీసం బంగారంగా మారడాన్ని గమనించిందని న్యూయార్క్‌లోని స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ భౌతిక శాస్త్రవేత్త 'జియాంగ్యాంగ్ జియా' చెప్పారు. కానీ ఇప్పుడు తాజాగా జరిగిన ప్రయోగాలు అధిక శక్తితో ఉన్నాయి. ఈ విధానంలో బంగారాన్ని మరింత ఎక్కువ సృష్టించవచ్చని ఆయన అన్నారు.ఈ పద్దతిలోనే మరింత గోల్డ్ ఉత్పత్తి చేస్తే.. బంగారం సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగితే.. డిమాండ్ తగ్గుతుంది. ఇదే జరిగితే బంగారం ధరలు భారీగా తగ్గిపోతాయి. అతి తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చేస్తుంది. -
ట్రిప్ కోసం బెస్ట్ గ్యాడ్జెట్స్ ఇవే..
ప్రపంచాన్ని చుట్టేయడం ఒక అందమైన అనుభవం. అందుకే, చాలామంది కాస్త తీరిక దొరికితే చాలు, బ్యాగ్‌లో బట్టలు సర్దేసుకుని, ప్రయాణాలకు సిద్ధపడుతుంటారు. ఇప్పుడు మీ ప్రయాణాన్ని మరింత సులభంగా, సౌకర్యవంతంగా మార్చేయడానికి అవసరమయ్యే ఎనర్జీ గేర్స్.. ఈ గ్యాడ్జెట్స్..చేతిలోనే వాటర్ ఫిల్టర్ ప్రయాణించేటప్పుడు ప్రతిచోటా శుభ్రమైన నీరు దొరకడం చాలా కష్టం. అలాగని, అపరిశుభ్రమైన నీటిని తాగితే, రోగాల బారిన పడతాం. ఇందుకోసమే మార్కెట్లోకి వివిధ వాటర్ ప్యూరిఫైయింగ్ వాటర్ బాటిల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఇవి ఫిల్టర్, యూవీ– సీ లైట్ పద్ధతులతో నీటిలోని బ్యాక్టీరియా, వైరస్, ఇతర సూక్ష్మజీవులను, మలినాలను తొలగించి శుభ్రమైన తాగునీటిని అందిస్తాయి. ఇవి క్యాంపింగ్, ట్రెక్కింగ్, ట్రావెలింగ్ చేసే వారికి బాగా ఉపయోగపడతాయి. బ్యాటరీలతో పనిచేసే వీటిని చార్జ్ చేసుకొని వాడుకోవచ్చు. ధర వివిధ కంపెనీలను బట్టి రూ. పది నుంచి ఇరవై వేల వరకు ఉంటాయి.పాకెట్లో సూర్యశక్తిట్రావెలింగ్ చేస్తూ అడవిలో చిక్కుకున్నా కూడా మీ ఫోన్ బ్యాటరీ తగ్గిపోదు, ఒకవేళ మీ వద్ద ఈ ‘సోలార్ పవర్ బ్యాంక్’ కనుక ఉంటే. దీనిని చాలా చిన్నగా ఎక్కడికైనా సులభంగా జేబులో వేసుకొని వెళ్లేలా రూపొందించారు. ఇది కేవలం సౌరశక్తిని ఉపయోగించి, సుమారు 10,000 ఎమ్ఏహెచ్ వరకు బ్యాటరీని స్టోర్ చేసుకోగలదు. ఒకేసారి మూడు పరికరాలను చార్జ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో పాటు, వాటర్‌ప్రూఫ్, డస్ట్ప్రూఫ్తో వస్తుంది. ఇక దీనికున్న రెండు పవర్ఫుల్ ఫ్లాష్ౖలñ ట్లు మీకు మరో టార్చ్‌తో అవసరం లేకుండా చేస్తాయి. ధర రూ.2,300.బ్యాగ్ పోయే రోజులు పోయాయిప్రయాణాల్లో బ్యాగ్ పోయినా, ఏమాత్రం భయపడనక్కర్లేదు. ఇకపై చిటికెలో పోయిన బ్యాగు ఆచూకీ తెలుసుకోవచ్చు. తాజాగా విడుదలైన ‘అరిస్ట్రా వోల్ట్ స్మార్ట్ లగేజీ బ్యాగ్’లో అబ్బురపరిచే ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. ఇందులోని జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ సులభంగా బ్యాగ్ లొకేషన్‌ను ట్రాక్ చేస్తుంది. మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జ్ చేసుకోవడానికి వీలుగా ఒక ఇంటిగ్రేటెడ్ పవర్‌బ్యాంక్ ఉంటుంది. డిజిటల్ లాక్ సిస్టమ్‌తో బ్యాగ్ భద్రత కూడా క్షేమంగా, సులువుగా మొబైల్‌తోనే చేసేయొచ్చు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఆటోమేటిక్ లగేజీ వెయిట్ చెక్ ఫీచర్. ఇది విమాన ప్రయాణాలు చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది. ధర. రూ.81,100.మినీ ఐరన్ మాస్టర్ప్రయాణాల్లో ఎదురయ్యే సమస్యల్లో బట్టల ఇస్త్రీ ఒకటి. సమస్య చిన్నదే అయినా, బిజినెజ్ ట్రిప్స్, ప్రత్యేక కార్యక్రమాలు, ఫంక్షన్స్‌కు వెళ్లేటప్పుడు నలిగిన బట్టల కారణంగా, ట్రిప్ వైబ్ మొత్తం పాడవుతుంది. ఈ చిన్న సమస్యను, ఒక చిన్న పోర్టబుల్ స్టీమ్ ఐరన్‌తో పరిష్కరించవచ్చు. చూడ్డానికి చిన్నగా, అతి తక్కువ బరువుతో ఉంటే ఈ స్టీమ్ ఐర¯Œ , కేవలం కొద్ది సెకండ్లలోనే వేడి అయ్యి, స్టీమ్‌తో బట్టల మడతలను పోగొడుతుంది. యూఎస్బీ పోర్ట్ ద్వారా చార్జ్ చే సుకొని వాడుకోవచ్చు. ధర రూ. 999. అంతకంటే తక్కువ, ఎక్కువలోనూ వివిధ బ్రాండ్లలో లభిస్తున్నాయి. -
మెటా గ్లాస్.. మొబైల్‌కి లాస్?
ఒక్క మాట చెబితే ఫొటో క్లిక్‌మనిపిస్తుంది.. వాయిస్ కమాండ్ వినగానే వీడియో రికార్డ్ అయిపోతుంది. ఏ భాషలోని అక్షరాలైనా క్షణాల్లో మన భాషలోకి మారిపోయి కనిపిస్తాయి. చేతిలో ఫోన్ లేకుండానే ఎవరితోనైనా ఫోన్ మాట్లాడేయొచ్చు.. త్వరలో అందుబాటులోకి రానున్న స్మార్ట్ కళ్లజోళ్లు చేసే పనులివన్నీ. స్టైలిష్ కళ్లజోళ్లకు పేరు గాంచిన రే–బాన్ కంపెనీ.. మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన మెటా సంయుక్తంగా అత్యాధునిక స్మార్ట్ గ్లాసె స్ను విడుదల చేశాయి. ఇవి త్వరలోనే భారత్‌లోనూ విడుదల కానున్నాయి. అత్యాధునిక స్మార్ట్ ఫోన్లు చేసే పనులన్నీ ఈ స్మార్ట్ కళ్లద్దాలు చేసిపెడతాయి. కంటెంట్ క్రియేటర్లు, వ్యాపారవేత్తలు, వేగవంతమైన కమ్యూనికేషన్‌పై ఆధారపడే వారికి ఈ గ్లాసెస్ గేమ్–ఛేంజర్‌గా నిలుస్తాయని టెక్ నిపుణులు అంటున్నారు. 2024 నాటికి ప్రపంచ స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్ విలువ 18.6 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. 2033 నాటికి అది 53.6 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఐఎమ్ఏఆర్సీ గ్రూప్ అంచనా వేస్తోంది. మెటా, ఆపిల్, గూగుల్, షావోమీ, సోనీ, అమెజాన్, లెన్స్‌కార్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ఏమిటీ గ్లాసెస్ ప్రత్యేకత?వాయిస్ అసిస్టెంట్: మెటా ఏఐతో సంభాషించి రియల్ టైమ్ సమాధానాలు పొందవచ్చు. ఫొటో, వీడియో క్యాప్చర్: వాయిస్ కమాండ్‌తో ఫొటోలు తీయవచ్చు. వీడియోలు కూడా రికార్డ్ చేయవచ్చు.లైవ్ స్ట్రీమింగ్: ఏదైనా కార్యక్రమానికి ఇన్‌స్ట్రాగామ్ లేదా ఫేస్బుక్లో నేరుగా ప్రసారం చేయవచ్చు.సంగీతం, పాడ్‌కాస్ట్‌లు: ఇయర్‌బడ్స్ లేకుండానే సంగీతం లేదా పాడ్‌కాస్ట్‌లు వినవచ్చు. ఫోన్ కాల్స్: బిల్ట్–ఇన్ మైక్రోఫోన్లు, స్పీకర్లు ఈ అద్దాల్లో ఉంటాయి కాబట్టి ఫోన్ కాల్స్ చేయవచ్చు. కాల్స్ స్వీకరించవచ్చు. లైవ్ ట్రాన్స్లేషన్: విదేశీ భాషల సైన్‌బోర్డ్‌లను తక్షణం మనకు తెలిసిన భాషలోకి అనువదించగలవు.ఆబ్జెక్ట్ రికగ్నిషన్: మనం చూసే వస్తువులను గుర్తించి, వాటికి సంబంధించిన సమాచారాన్ని అ అద్దాలు అందిస్తాయి. ఈ కళ్లజోళ్లకు రోజువారీ ఫోన్ ఉపయోగాన్ని పూర్తిగా భర్తీ చేసే ఫీచర్లను జోడించే దిశగా మెటా పనిచేస్తోంది. వీటి ద్వారా యాప్‌లు, సేవలను నోటి మాటతో నియంత్రించవచ్చు. స్క్రీన్ లేని అనుభవం: ఫోన్, ఇతర ఏ రకమైన డిజిటల్ తెర అవసరం లేకుండానే సమాచారం మన దృష్టి క్షేత్రంలో నేరుగా కనిపిస్తుంది.స్మార్ట్ గ్లాసెస్ ప్రయోజనాలు..సహజ కదలిక: స్క్రీన్ వైపు చూడాల్సిన అవసరం లేదు. మల్టీ టాస్కింగ్: నడుస్తూ, వంట చేస్తూ లేదా ప్రయాణిస్తూనే స్మార్ట్‌ఫోన్ ద్వారా చేసే అన్ని పనులు వీటితో చేసుకోవచ్చు. తక్కువ స్క్రీన్ టైమ్: నిరంతర ఫోన్‌ను చూస్తూ స్క్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు.ఎదురయ్యే సవాళ్లు..బ్యాటరీ లైఫ్: రోజంతా గ్లాసెస్‌ను చార్జ్‌లో ఉంచడం కష్టం. వ్యక్తిగత గోప్యత: ఎదుటివారికి తెలియకుండానే మనం వారి ఫొటోలు, వీడియోలను ఈ స్మార్ట్ గ్లాసెస్‌తో తీయొచ్చు. దీంతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే ప్రమాదం ఉంది. ధర: ఈ హై–టెక్ కళ్లద్దాల ధర సామాన్య ఫోన్ల కంటే చాలా ఎక్కువ.అయితే, ఇవి ఇప్పటికిప్పుడు స్మార్ట్ఫోన్లకు పూర్తిగా ప్రత్యామ్నాయంగా మారే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. స్మార్ట్ వాచ్‌ల మాదిరిగా మొదట ఫోన్లకు సహాయక పరికరాలుగా ఉపయోగపడతాయి. పూర్తి స్థాయిలో ఫోన్ స్థానాన్ని దక్కించుకోవాలంటే మరో 10–20 ఏళ్లు పట్టే అవకాశముందని చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్ కంటే బెటర్.. త్వరలోనే ఈ గ్లాసెస్ స్మార్ట్ఫోన్లను భర్తీ చేయగలవు. కళ్ల ముందే డేటా కనిపించడం, వాయిస్ ఆధారంగా నడిచే విధానం వల్ల ఫోన్ అవసరం తగ్గుతుందనేది నా అంచనా. స్మార్ట్ఫోన్లతో మనం చేసే అన్ని పనులు ఇవి చేయగలవు. ఫోన్‌ను పట్టుకోవడం కంటే ముఖంపై గ్లాసెస్ ధరించడం సహజంగా అనిపిస్తుంది. టచ్, స్క్రోల్‌కు బదులుగా వాయిస్ కమాండ్స్, విజువల్స్‌తో టెక్నాలజీని ఉపయోగించే రోజు దగ్గరలోనే ఉంది.’ – మార్క్ జుకర్‌బర్గ్, మెటా సీఈఓ -
స్పెక్ట్రం చార్జీ @ 4 శాతం ఆదాయం
న్యూఢిల్లీ: స్టార్లింక్లాంటి శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్‌కామ్) కంపెనీలు అడుగుతున్న దానికంటే అధిక స్థాయిలో స్పెక్ట్రం చార్జీలు విధించేలా కేంద్రానికి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సులు చేసింది. కంపెనీల సవరించిన ఆదాయాల్లో (ఏజీఆర్) 4 శాతాన్ని చార్జీగా నిర్ణయించాలని పేర్కొంది. ప్రతి మెగాహెట్జ్‌కి వార్షికంగా విధించే రూ. 3,500 స్పెక్ట్రం చార్జీకి ఇది అదనంగా ఉంటుంది. ఇక, పట్టణ ప్రాంతాల్లో ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సరీ్వసులు అందించే ఆపరేటర్లు, ప్రతి యూజరుపై అదనంగా ఏటా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో సేవలకు మాత్రం అదనంగా చార్జీలేమీ ఉండవు. టెలికం శాఖకు (డాట్) ట్రాయ్ ఈ మేరకు సిఫార్సులు చేసింది. స్పెక్ట్రంను కంపెనీలకు అయిదేళ్ల పాటు కేటాయించాలని, ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించాలని ట్రాయ్ సూచించింది. శాట్‌కామ్ సరీ్వసులు ప్రారంభమైతే టెలికం నెట్‌వర్క్‌లు లేని మారుమూల ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చేందుకు వీలవుతుందని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటీ తెలిపారు. శాట్‌కామ్ కంపెనీలు అభ్యరి్ధస్తున్న రేటు కంటే ట్రాయ్ సిఫార్సు చేసిన చార్జీలు గణనీయంగా అధికంగా ఉండటం గమనార్హం. స్పెక్ట్రం చార్జీని ఏజీఆర్‌లో 1 శాతం కన్నా తక్కువగానే ఉంచాలని, అదనంగా చార్జీలేమీ విధించొద్దని ట్రాయ్‌తో సంప్రదింపుల సందర్భంగా స్టార్‌లింక్, అమెజాన్‌కి చెందిన క్విపర్ సిస్టమ్స్ కోరాయి. ఎయిర్టెల్ భాగస్వామిగా ఉన్న యూటెల్‌శాట్ వన్‌వెబ్, జియో ప్లాట్‌ఫామ్స్‌కు ఇప్పటికే శాట్‌కామ్ సేవల లైసెన్సులు లభించాయి. స్టార్‌లింక్ తుది లైసెన్సు తీసుకునే దశలో ఉంది. -
స్టార్‌లింక్ శాట్‌కామ్ వచ్చేస్తోంది..!
న్యూఢిల్లీ: భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్‌కామ్) సర్వీసులు ప్రారంభించే దిశగా తదుపరి పూర్తి చేయాల్సిన ప్రక్రియపై అమెరికన్ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్‌లింక్ దృష్టి పెట్టనుంది. ఇప్పటికే టెలికం శాఖ (డాట్) నుంచి ప్రాథమిక అనుమతులు (లెటర్ ఆఫ్ ఇంటెంట్–ఎల్వోఐ) లభించడంతో, ఇక ఒప్పంద నియమాలను అంగీకరిస్తున్నట్లు కంపెనీ సంతకాలు చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అటుపైన నిర్దేశిత ఎంట్రీ ఫీజును చెల్లించాక తుది లైసెన్సు లభిస్తుందని పేర్కొన్నాయి. శాట్‌కామ్ స్పెక్ట్రం ధరను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసే ప్రక్రియ తుది దశలో ఉందని, ఎప్పుడైనా దీనిపై ప్రకటన వెలువడొచ్చని వివరించాయి. గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్), ఐఎస్పీ, వీశాట్ సేవలకు సంబంధించి స్టార్‌లింక్‌నకు ఎల్వోఐ జారీ అయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డాట్ లైసెన్సుతో నెట్‌వర్క్‌ను నిర్మించుకోవడానికి స్టార్‌లింక్‌కు అనుమతులు లభించినా, కార్యకలాపాలు ప్రారంభించడానికి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్) ఆమోదం, ప్రభుత్వం నుంచి స్పెక్ట్రం అవసరమవుతుంది. ఇప్పటికే వన్‌వెబ్, జియో శాటిలైట్‌కు లైసెన్స్.. ఇప్పటికే యూటెల్‌శాట్ వన్‌వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థలకు ఈ లైసెన్సులు వచ్చాయి. స్పెక్ట్రంను కేటాయించిన తర్వాత అవి సర్వీసులు ప్రారంభించనున్నాయి. భారత్‌లో లైసెన్సు కోసం కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న స్టార్‌లింక్ ఈమధ్యే దేశీ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనితో భారత్‌లో తమ సొంత పంపిణీ, కస్టమర్ సర్వీస్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సిన భారం లేకుండా, సంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లోకి సేవలను విస్తరించే వీలు చిక్కుతుంది. సుదూరంగా ఉండే జియోస్టేషనరీ ఉపగ్రహాలపై ఆధారపడే సాంప్రదాయ శాటిలైట్ సర్వీసులతో పోలిస్తే భూమికి కొంత సమీపంగా (550 కి.మీ. పైన ) ఉండే ’లో ఎర్త్ ఆర్బిట్’ (లియో) శాటిలైట్లను ఉపయోగిస్తుంది. ప్రస్తు తం ఇవి 7,000 ఉండగా, వీటి సంఖ్య 40,000కు పెరగనుంది. -
చిర్రెత్తిన యంత్రుడు.. ఎవరికీ చిక్కడు
కృత్రిమ మేధ ఎంత ప్రయోజనకరమో అంత ప్రమాదకరమని కొందరు భావిస్తున్నారు. ప్రపంచంలో నిత్యం జరుగుతున్న కొన్ని సంఘటనలే అందుకు కారణం. రజనీకాంత్ రోబో సినిమాలో విలన్ సైంటిస్ట్ తయారు చేసిన రోబో టేబుల్‌పై నుంచి బన్ తీయమంటే గన్ తీస్తుంది కదా. అంతటితో ఆగకుండా ఏకంగా ఆ విలన్నే గన్‌తో చంపాలనుకుంటుంది. దాదాపు అలాంటి సంఘటనలే ప్రస్తుతం జరుగుతున్నాయి. హ్యుమనాయిడ్ రోబోల పరీక్ష సమయంలో చాలా ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి.యునిట్రీ అనే కంపెనీ రూపొందించిన హ్యుమనాయిడ్ రోబోను ఇటీవల పరీక్షిస్తున్న సమయంలో ప్రమాదకర సంఘటన జరిగింది. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో విడుదలైన వీడియో వైరల్‌గా మారింది. అందులోని వివరాల ప్రకారం.. చైనా ఫ్యాక్టరీలో ఈ హ్యుమనాయిడ్ రోబోను క్రేన్ ఆసరాతో నిలబెట్టారు. టెస్టింగ్ సమయంలో ఒక్కసారిగా రోబో ఉన్నట్టుండి తన చేతులతో దాడికి పాల్పడింది. క్రేన్‌కు వేళాడుతున్నా ఆ రోబో చుట్టూ కదులుతూ, క్రేన్‌ను సైతం లాగుతూ సమీపంలోని వస్తువులను చిందరవందర చేసింది. వెంటనే దాన్ని పరీక్షించే వ్యక్తి రోబో కనెక్షన్ కట్ చేయడంతో నిదానించింది.An AI robot attacks its programmers as soon as it is activated in China. pic.twitter.com/d4KUcJQvtD— Aprajita Nefes 🦋 Ancient Believer (@aprajitanefes) May 2, 2025ఇదీ చదవండి: గూగుల్ 200 ఉద్యోగాల్లో కోత!ఇతర కంపెనీ రోబోలు కూడా..యునిట్రీ రోబోలు మాత్రమే కాదు.. ఇంతర కంపెనీలకు చెందిన రోబోలు ఇలా విచిత్రంగా ప్రవర్తించిన ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓ ప్రదర్శనలో హ్యూమనాయిడ్ రోబోలు గుంపులుగా వెళ్తూ ఒకటి మానవులపైకి దూసుకొస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈశాన్య చైనాలోని టియాంజిన్‌లో జరిగిన స్ప్రింగ్ ఫెస్టివల్ గాలాలో తీసిన వీడియోలో జాకెట్ ధరించిన రోబో అకస్మాత్తుగా బారికేడ్ వెనుక గుమిగూడిన ప్రేక్షకుల గుంపు వైపు దూసుకెళ్లింది. గతంలో ఓ కంపెనీ కర్మాగారంలో రోబోట్ ఇంజినీర్‌పై దాడి చేసిందని వార్తలొచ్చాయి. సాఫ్ట్వేర్ లోపాలు, అంతర్లీనంగా ఉండే కారణాలతో కొన్నిసార్లు ఇలా ప్రవర్తిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. ఏదేమైనా మానవుల సమూహంతో కలిసి వీటిని వాడుకలోకి తీసుకురావాలంటే కచ్చితమైన, స్పష్టమైన ఎన్నో పరీక్షలు నిర్వహించాలని, వీటి పాలసీల్లో పక్కా నిబంధనలు రూపొందించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
దేశంలో వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య ఎంతంటే..
టెలికాం సేవల వినియోగదారుల్లో వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య మార్చిలో పెరిగి మొత్తం 116.37 కోట్లకు చేరుకుంది. ఇది ఫిబ్రవరిలో 116.33 కోట్లుగా ఉంది. ఈమేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వివరాలు వెల్లడించింది. ముఖ్యంగా గ్రామీణ సబ్ స్క్రిప్షన్లు పెరగగా, పట్టణ సబ్ స్క్రిప్షన్లు స్వల్పంగా తగ్గాయని తెలిపింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లు భారత టెలికాం పరిశ్రమలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ చందాదారుల చేరికల్లో అగ్రగామిగా నిలిచాయి.భౌగోళికంగా ఢిల్లీ సర్వీస్ సెంటర్ అత్యధిక టెలి-సాంద్రతను కలిగి ఉంది. అంటే యూనిట్ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో మొబైల్ చందాదారులను కలిగి ఉండడం. బిహార్ అతి తక్కువ టెలి-సాంద్రతను నమోదు చేసింది. పెరుగుతున్న సబ్‌స్రైబర్ల సంఖ్య దేశంలో కొనసాగుతున్న డిజిటల్ పరివర్తనను హైలైట్ చేస్తుంది. ఎక్కువ మంది గ్రామీణ వినియోగదారులు ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. యూజర్ డెమోగ్రాఫిక్స్, నెట్వర్క్ డిమాండ్లకు సంబంధించి టెలికాం ఆపరేటర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: 27 ఎయిర్‌పోర్ట్‌లు, 430 విమానాలు నిలిపివేతవైర్లెస్ సబ్‌స్రైబర్ల సంఖ్య పెరగడం చాలా అంశాలను ప్రభావితం చేస్తుంది. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీకి అవకాశం అందిస్తుంది. ఆన్లైన్ బ్యాంకింగ్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ సేవలు ఎక్కువ మంది పొందేందుకు వీలవుతుంది. ఈ-కామర్స్, ఫిన్ టెక్, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగాలు వృద్ధి చెందుతాయి. మొబైల్ వినియోగదారులకు సేవలందించే వ్యాపారాలు.. ముఖ్యంగా మొబైల్ అప్లికేషన్లు, స్ట్రీమింగ్ సేవలు, డిజిటల్ సర్వీసులు పెరుగుతాయి. హై-స్పీడ్ కనెక్టివిటీని నిర్ధారించడానికి నెట్వర్క్ విస్తరణకు, 5జీ వినియోగానికి టెలికాం ప్రొవైడర్లు మరింత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. -
ఐటీ ఉద్యోగం ఒక్కసారి పోతే.. ఇక అంతే..!
ప్రస్తత పరిస్థితిలో ఐటీ ఉద్యోగం తెచ్చుకోవడం ఎంత కష్టమో.. దాన్ని నిలబెట్టుకోవడమూ అంతే కష్టం. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంపొందించుకుంటూ మంచి పనితీరు కనబర్చాలి. వెనకబడిన ఉద్యోగులను కంపెనీలు ఉపేక్షించడం లేదు. వెంటనే ఉద్వాసన పలుకుతున్నాయి. దీనికి సంబంధించే ప్రపంచ టెక్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది.పనితీరు సమస్యలతో ఉద్యోగం కోల్పోయి కంపెనీని వీడిన ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్ రెండేళ్ల నిషేధం విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే ఇలా జాబ్ పోగుట్టుకుంటే మళ్లీ రెండేళ్ల వరకూ ఆ ఛాయలకూ కూడా వెళ్లే అవకాశం ఉండదన్న మాట. అంతేకాదు.. ఈ ఉద్యోగాల కోతలను 'గుడ్ అట్రిషన్'గా పిలుస్తారు. అంటే కంపెనీని విడిచిపెట్టాలనుకునే ఉద్యోగులను సంతోషం.. దయచేయండి.. అని భావిస్తుందని బిజినెస్ ఇన్సైడర్ నివేదిక తెలిపింది.గత రెండు నెలలుగా మైక్రోసాఫ్ట్ తన సిబ్బంది పనితీరు నిర్వహణ ప్రక్రియను పునర్వ్యవస్థీకరిస్తోంది. పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులపై కంపెనీ కఠినంగా వ్యవహరించింది. పనితీరు కనబరచని ఉద్యోగులను తొలగించే సంస్థ వ్యూహంలో భాగంగా ఈ రెండు కొత్త టూల్స్ ఉన్నాయి.ఈ ఏడాది పనితీరు తక్కువగా ఉన్న 2000 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించింది. పనితీరు సరిగా లేని ఉద్యోగులకు కంపెనీ సెవెరెన్స్ ప్యాకేజీ కూడా ఇవ్వలేదు. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం కంపెనీ 'గుడ్ అట్రిషన్' ప్రణాళిక ప్రతి సంవత్సరం నిర్ణీత శాతం ఉద్యోగులను తొలగించాలన్న కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది.బడా టెక్ కంపెనీల పనితీరు విధానాల్లో మార్పుబడా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల నిలుపుదల, పనితీరు విధానాల్లో విస్తృత మార్పు వచ్చింది. మెటా, అమెజాన్ వంటి కంపెనీలు కూడా తమ ప్రస్తుత, ఔట్ గోయింగ్ ఉద్యోగుల పనితీరుపై కఠిన విధానాలను ప్రవేశపెట్టాయి. గతంలో అమెజాన్ 'అన్ గ్రేటెడ్ అట్రిషన్'ను ప్రవేశపెట్టింది.దీని ప్రకారం మేనేజర్లు ప్రతి సంవత్సరం తమ బృందంలో కొంత మందిని తొలగించాల్సి ఉంటుంది. పనితీరు తక్కువగా ఉన్న తమ ఉద్యోగులపై కూడా మెటా వేటు వేస్తోంది. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం ఇక తిరిగి నియమించుకోకూడదనంటూ కొంతమంది మాజీ ఉద్యోగులను ఈ కంపెనీ జాబితా చేసిపెట్టుకుంది. -
ఉగ్రదేశం మదం అణచిన ఫైటర్ జెట్లు
పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై ఈ రోజు తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మెరుపుదాడికి పాల్పడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది స్థావరాలను భారత ఆర్మీ బలగాలు మట్టుపెట్టాయి. ఈ ఘటనలో దాదాపు 80 మందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆపరేషన్ సింధూర్‌లో రఫేల్, సుఖోయ్ ఎస్‌యూ -30 ఎంకేఐ, జాగ్వార్ యుద్ధ విమానాలను మోహరించింది. వాటి గురించి తెలుసుకుందాం.డసాల్ట్ రఫేల్డసాల్ట్ రాఫెల్ 4.5 జనరేషన్ మల్టీరోల్ ఫైటర్ జెట్. ఇది అధునాతన ఏవియానిక్స్, మెరుగైన పోరాట సామర్థ్యాలకు ప్రసిద్ది చెందింది. అటాక్ చేసే సమయంలో యుద్ధభూమిలో పరిస్థితుల అవగాహన కోసం ఆర్బీఈ2 ఏఈఎస్ఏ రాడార్, స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్, ఫ్రంట్-సెక్టార్ ఆప్ట్రోనిక్స్ను అమర్చారు. రెండు ఎస్ఎన్సీఎంఏ ఎం88 టర్బోఫాన్ ఇంజిన్లను ఇందులో ఉపయోగించారు. ఇది సూపర్ క్రూయిస్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. 9,500 కిలోల వరకు ఆయుధాలు, ఇంధనాన్ని మోసుకెళ్లగలదు. ఫైటర్ పైలట్లకు యుద్ధభూమిలో రియల్ టైమ్ సమాచారం అందించేందుకు బహుళ సెన్సార్లను ఉపయోగించారు. నౌకాదళం కోసం 26 రఫేల్-మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో భారత్ గతంలో రూ.63,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ఈ జెట్లను ఉంచాలని నిర్ణయించింది.సుఖోయ్ ఎస్ యూ-30 ఎంకేఐఈ ట్విన్ ఇంజిన్, మల్టీరోల్ ఎయిర్ సుపీరియరిటీ ఫైటర్ జెట్ సుఖోయ్ ఎస్‌యూ-30ఎంకేఐను భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కోసం రష్యాకు చెందిన సుఖోయ్ డిజైన్ బ్యూరో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది భారతదేశ ఆయుధాగారంలో అత్యంత అధునాతన యుద్ధ విమానాలలో ఒకటి.ఇది థ్రస్ట్ వెక్టరింగ్ కంట్రోల్‌తో ఏఎల్-31FP టర్బోఫాన్ ఇంజిన్లను కలిగి ఉంటుంది. ఇది ఒకసారి ఇంధనం నింపితే గరిష్టంగా 3,000 కిలోమీటర్లు ఏకదాటిగా ప్రయాణిస్తుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు ఇంధనం నింపితే 8,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.మల్టీ-మోడ్ రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ (ఐఆర్ఎస్టీ)ను కలిగి ఉంది. ఇజ్రాయెల్, ఫ్రెంచ్, ఇండియా ఏవియానిక్స్‌లో ఇవి ఉన్నాయి.గగనతల క్షిపణులు, గైడెడ్ బాంబులతో సహా 8,000 కిలోల ఆయుధాలను మోసుకెళ్లగలదు.భారత వైమానిక దళంలో 260కి పైగా ఈ జెట్లు సేవలందిస్తున్నాయి.ఇదీ చదవండి: ప్రభుత్వ రుణం దిగిరావాలిసెపెకాట్ జాగ్వార్సెపెకాట్ జాగ్వార్ అనేది ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ట్విన్ ఇంజిన్, సూపర్ సోనిక్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్. తక్కువ ఎత్తులో హైస్పీడ్ ఆపరేషన్స్ కోసం రూపొందించారు. శత్రు భూభాగంలో దాడులకు అనువైనది. మెరుగైన రాడార్, జీపీఎస్ నావిగేషన్, నైట్ ఫ్లయింగ్ వ్యవస్థలను కలిగి ఉంది. రెండు రోల్స్ రాయిస్ టర్బోమెకా అడౌర్ టర్బోఫాన్ ఇంజిన్లతో దీన్ని రూపొందించారు. లేజర్ గైడెడ్ బాంబుల కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. భారత వైమానిక దళంలో జాగ్వార్ 1979 నుంచి కీలక స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్‌గా ఉంది. కార్గిల్ యుద్ధ సమయంలో ఇది కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం అంబాలా, గోరఖ్‌పూర్, జామ్ నగర్ వైమానిక స్థావరాల్లో వీటిని మోహరించారు. -
యాపిల్ మొబైల్స్ అన్నీ భారత్‌లోనే తయారీ
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో ఉత్పత్తి చేయడం ప్రతి కంపెనీకి ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. తాము అమెరికాలో విక్రయించబోయే అధిక శాతం ఐఫోన్లు భారత్‌లో తయారైనవే ఉంటాయంటూ టెక్ దిగ్గజం యాపిల్ ప్రకటించడం ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు.‘రాబోయే రోజుల్లో తమ మొబైల్ ఫోన్లు అన్నింటినీ భారత్‌లోనే తయారు చేయాలని, సోర్సింగ్ చేయాలని యాపిల్ నిర్ణయించుకుంది. కాబట్టి భారత్‌లో ఇన్వెస్ట్ చేశారంటే విశ్వసనీయతను, సహజత్వాన్ని, అఫోర్డబిలిటీని (తక్కువ వ్యయాల ప్రయోజనాలు) ఎంచుకున్నట్లే’ అని భారత్ టెలికం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం దన్నుతో దేశీయంగా టెలికం పరికరాల మార్కెట్ అనెక రెట్లు వృద్ధి చెందిందని ఆయన తెలిపారు. రూ.4,000 కోట్ల పెట్టుబడులనేవి రూ.80,000 కోట్ల విక్రయాలకు, రూ.16,000 కోట్లు విలువ చేసే ఎగుమతులతో పాటు 25,000 ఉద్యోగాల కల్పనకు దోహదపడినట్లు సింధియా చెప్పారు.ఇదీ చదవండి: ఆపరేషన్ సిందూర్.. స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే మెజారిటీ ఐఫోన్లు భారత్‌లో తయారైనవే ఉంటాయని టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇదివరకే ప్రకటించారు. ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ మొదలైనవి వియత్నాంలో తయారైనవి ఉంటాయని పేర్కొన్నారు. ఇతరత్రా దేశాల్లో విక్రయించే ఉత్పత్తులు మాత్రమే అత్యధికంగా చైనాలో తయారవుతాయని పేర్కొన్నారు. చైనా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై అమెరికా భారీగా టారిఫ్‌లు ప్రకటించిన నేపథ్యంలో కుక్ వ్యాఖ్యలు ఇటీవల ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొంత మినహాయింపులున్నా, వివిధ టారిఫ్‌లను కలిపితే చైనా నుంచి ఎగుమతి చేసే తమ ఉత్పత్తులపై ఏకంగా 145 శాతం సుంకాలు వర్తిస్తాయని కుక్ తెలిపారు. -
ఏఐ వినియోగంలో దూసుకెళ్తున్న భారత్: కేపీఎంజీ రిపోర్ట్
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఏ రంగంలో చూసినా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా కొనసాగుతోంది. అయితే ప్రపంచంలోని ఇతర దేశాల కంటే కూడా ఏఐను ఎక్కువగా ఇండియా నమ్ముతోందని కేపీఎంజీ (KPMG) నివేదికలో వెల్లడించింది.ట్రస్ట్, యాటిట్యూడ్స్, అండ్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఎ గ్లోబల్ స్టడీ 2025పై KPMG వెల్లడించిన నివేదిక కోసం 47 దేశాలలోని సుమారు 48,000 మందిని సర్వే చేసింది. ఇందులో సుమారు 76 శాతం భారతీయులు ఏఐను విశ్వసిస్తున్నట్లు తెలిసింది.ఆరోగ్య సంరక్షణ మాత్రమే కాకుండా ఎకానమీ, విద్య, వినోదం వంటి దాదాపు అన్ని పరిశ్రమలలో ఏఐ వినియోగం ఎక్కువగా ఉంది. దీంతో మానవ ప్రమేయం తగ్గుతుందని.. ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని సుమారు 78 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. 97 శాతం మంది భారతీయ ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా తమ పనిలో AIని ఉపయోగిస్తున్నారని, 67 శాతం మంది అది లేకుండా తమ పనులను పూర్తి చేయలేరని పేర్కొన్నారు.భారతదేశంలో ఏఐ వినియోగం పెరిగిపోతుండంతో.. ఏఐ-బేస్డ్ ఆర్థిక వృద్ధి & ఆవిష్కరణలలో ఇండియా అగ్రగామిగా దూసుకెళ్తోంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఐదుగురిలో ముగ్గురు వ్యక్తులు ఏఐను విశ్వసిస్తారు. అయితే అభివృద్ధి చెందిన దేశాలలో ఐదుగురిలో ఇద్దరు మాత్రమే దీనిని విశ్వసిస్తున్నారు. -
సాంకేతికతతో యుద్ధానికి సై
సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తోంది. అందుకు యుద్ధ భూమి ఏమీ అతీతం కాదు. శత్రువులపై యుద్ధం సాధించేందుకు, స్పష్టమైన ఫలితాల కోసం టెక్నాలజీ వాడుతున్నారు. ఇందులో భాగంగా మానవరహిత ఆయుధాలు, సైబర్ వార్ఫేర్, డ్రోన్లు, రోబోటిక్స్, అన్ మ్యాన్డ్ అడ్వాన్స్డ్ వెపన్స్.. వంటి చాలా పరికరాల్లో సాంకేతికతను వినియోగిస్తున్నారు. కృత్రిమమేధ వాడకం పెరుగుతున్న ఈ రోజుల్లో రణరంగంలో టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో తెలుసుకుందాం.ఏఐ, మెషిన్ లెర్నింగ్యుద్ధ సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం, ప్రక్రియలను ఆటోమేట్ చేయడం, ఇంటెలిజెన్స్ విశ్లేషణను మెరుగుపరిచేందుకు కృత్రిమ మేధ సాయం తీసుకుంటున్నారు. యుద్ధరంగంలో ఇది విప్లవాత్మక మార్పులు తెస్తోంది. శత్రువుల కదలికలను అంచనా వేయడానికి లేదా వ్యూహాత్మక లక్ష్యాలను గుర్తించడానికి ఏఐ విస్తారమైన డేటాసెట్లను ప్రాసెస్ చేస్తుంది. అటానమస్ విధానం ద్వారా డ్రోన్లు, వాహనాలకు ఏఐ సామర్థ్యాలు జోడిస్తున్నారు. ఇది మానవ ప్రమేయం లేకుండా రియల్ టైమ్ డెసిషన్ మేకింగ్‌కు వీలు కల్పిస్తుంది. సైబర్ బెదిరింపులను గుర్తించి సమర్థంగా కట్టడి చేసేందుకు మెషిన్ లెర్నింగ్ తోడ్పడుతుంది. కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షిస్తుంది.మానవ రహిత వ్యవస్థలు (డ్రోన్లు, రోబోటిక్స్)యుద్ధంలో మానవరహిత వ్యవస్థలు అనివార్యంగా పెరుగుతున్నాయి. ఇది సైనికులు ప్రాణాలు కోల్పోవడాన్ని తగ్గిస్తుంది. ఇందులో డ్రోన్లు కీలకంగా మారుతున్నాయి. ఏరియల్ డ్రోన్లను నిఘా, దాడుల్లో కచ్చితత్వం కోసం ఉపయోగిస్తున్నారు. అమెరికా ఆర్మీకి చెందిన స్మాల్ అన్మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్ (ఎస్‌యూజీవీ) వంటి రోబోలు బాంబుల తొలగింపును నిర్వహిస్తున్నాయి. మానవరహిత అండర్ వాటర్ వెహికల్స్ (యూయూవీ) మైన్ డిటెక్షన్, సబ్ మెరైన్ ట్రాకింగ్ పనులు చేస్తున్నాయి.సైబర్ వార్ఫేర్ టెక్నాలజీయుద్ధ సమయంలో కమ్యూనికేషన్లు, ఆర్థిక వ్యవస్థలు, ఇతర రక్షణ వ్యవస్థలకు అంతరాయం కలిగించేలా సైబర్ దాడులు నిర్వహించే అవకాశం ఉంది. వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సైబర్ వార్‌పేర్ డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. ఇందులో భాగంగా మాల్వేర్, హ్యాకింగ్ టూల్స్ ద్వారా ప్రభుత్వ ప్రాయోజిత వెబ్‌సైట్‌ల్లోని సమాచారం శత్రు దేశాల్లోని నెట్‌వర్క్‌లోకి వెళ్లకుండా అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దాంతోపాటు ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ ద్వారా మిలిటరీ నెట్‌వర్క్‌లను రక్షిస్తున్నారు.అధునాతన ఆయుధాలుఆధునిక ఆయుధాల ద్వారా ప్రమాద పరిధి పెరుగుతుంది. రష్యాకు చెందిన కింజాల్ అనే హైపర్ సోనిక్ ఆయుధాలు లేదా చైనాకు చెందిన డీఎఫ్-జెడ్ ఎఫ్ వంటి క్షిపణులు సంప్రదాయ రక్షణ వ్యవస్థల నుంచి వెంటనే తప్పించుకుంటాయి. లేజర్లు, మైక్రోవేవ్ వ్యవస్థలు డ్రోన్లు లేదా క్షిపణులను కచ్చితత్వంతో నిలిపివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. జీపీఎస్ గైడెడ్ బాంబులు నిర్దిష్ట లక్ష్యాన్ని చేదిస్తాయి.ఇదీ చదవండి: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో టాప్ బ్రాండ్ ఇదే..శాటిలైట్ అండ్ స్పేస్ టెక్నాలజీస్సైనిక కార్యకలాపాలకు అంతరిక్షం కీలకమైన డొమైన్‌గా మారింది. నిఘా ఉపగ్రహాలతో రియల్ టైమ్ ఇమేజ్‌లు, ప్రత్యేకంగా సిగ్నలింగ్ సదుపాయాలను పొందుతున్నారు. దళాల కదలికల కోసం జీపీఎస్, నావిగేషన్‌ను వాడుతున్నారు. కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించే శత్రు ఉపగ్రహాలను నిలిపివేయడానికి లేదా నాశనం చేయడానికి యాంటీ శాటిలైట్ వెపన్స్ రూపొందిస్తున్నారు. -
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో టాప్ బ్రాండ్ ఇదే..
దేశీయంగా మార్చి త్రైమాసికంలో టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 25 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ 8 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. ప్రీమియం స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పెరుగుతుండటం, రిటైల్ స్టోర్స్‌ను కంపెనీ విస్తరించడం, ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు ఇందుకు గణనీయంగా దోహదపడ్డాయి. దీంతో సూపర్ప్రీమియం సెగ్మెంట్లో (రూ. 50,000–రూ. 1 లక్ష వరకు ధర ఉండే ఫోన్లు) యాపిల్ వాటా 28 శాతానికి, ఉబర్–ప్రీమియం విభాగంలో (రూ. 1 లక్ష పైగా రేటు ఉండే ఫోన్లు) 15 శాతానికి చేరింది. జనవరి–మార్చ్ త్రైమాసికంలో భారత్‌లో స్మార్ట్ఫోన్ల సరఫరాపై సైబర్‌మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) ఇండియా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.దేశీయంగా మొత్తం స్మార్ట్ఫోన్ల మార్కెట్లో 21 శాతం వాటాతో చైనా సంస్థ వివో అగ్రస్థానంలో నిలవగా, 19 శాతం షేర్‌తో కొరియన్ దిగ్గజం శాంసంగ్ రెండో స్థానంలో ఉంది. షావోమీ వాటా ఏకంగా 37 శాతం పడిపోయింది. 13 శాతం మార్కెట్ షేర్‌తో మూడో ర్యాంక్‌లో నిలిచింది. ఒప్పో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 8 శాతం పెరగ్గా, మార్కెట్ వాటా 12 శాతంగా నమోదైంది. ఇదీ చదవండి: ఈ ఏడాదిలో ఆర్బీఐ మరోసారి తీపికబురుమరిన్ని ముఖ్యాంశాలు..మార్చి త్రైమాసికంలో భారత్‌లో సరఫరా అయిన మొత్తం ఫోన్లలో 5జీ స్మార్ట్ఫోన్ల వాటా 86 శాతంగా నమోదైంది. వార్షికంగా 14 శాతం పెరిగింది. రూ. 8,000 నుంచి రూ. 13,000 వరకు ఖరీదు చేసే 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు 100 శాతం పెరిగాయి.ఫీచర్ ఫోన్ సెగ్మెంట్లో చైనాకు చెందిన ఐటెల్ మార్కెట్ వాటా వార్షికంగా చూస్తే 6 శాతం తగ్గినప్పటికీ, మొత్తం మీద 41 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. స్మార్ట్‌ఫోన్ చిప్సెట్ మార్కెట్లో మీడియాటెక్ 46 శాతం వాటాతో టాప్‌లో నిల్చింది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో (రూ. 25,000 పైగా రేటు ఉన్నవి) 35 శాతం వాటాతో క్వాల్కామ్ అగ్రస్థానం దక్కించుకుంది. -
ఇవన్నీ ఉంటే అయిపోదా.. స్మార్ట్ కిచెన్
ఇంటి ఆరోగ్యం, ఆనందం అంతా ఉండేది వంటగదిలోనే.. మరి అలాంటి వంటగదిని ఇప్పుడు మరింత స్మార్ట్‌గా మార్చేయాలంటే.. ఇలాంటి గ్యాడ్జెట్స్ (కిచెన్ టీవీ, పిజ్జా ఓవెన్, ఎకోజీ స్మార్ట్ నగ్గెట్ ఐస్ మేకర్, థర్మా ‘మీట్’ర్) ఉండాల్సిందే!. ఈ గ్యాడ్జెట్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.కిచెన్ టీవీ‘వంట చేయడం పెద్ద పనేం కాదు’ అని చేయి తిరిగిన నిపుణులు చెబుతుంటారు. కానీ, ఇప్పుడు ఇదే మాటను వంట రాని వారు కూడా చెప్పగలరు. వాళ్ల వంటగదిలో ఈ ‘జీఈ కిచెన్ క్లబ్’ ఉంటే చాలు. ఇదొక స్మార్ట్ టీవీ లాంటిది. 27 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. వంటగదిలో దీనిని అమర్చుకుంటే, మనకు కావాల్సిన వంటను ఎలా వండాలో, ఏంమేం కావాలో, ఎంత మోతాదులో వేయాలో ఎప్పటికప్పుడు చూపిస్తూ, తెలియజేస్తుంది. మొబైల్, ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ధర 999 డాలర్లు (రూ. 85,301).పిజ్జా ఓవెన్ఆర్డర్ చేసిన అరగంటలో వచ్చే పిజ్జాను వెంటనే తినేయాలి, చల్లారితే అసలు బాగోదు. ఇంట్లో ఉంటే, వెంటనే ఓవెన్లో పెట్టి వేడి చేసుకొని తింటాం. అదే బయట ఉంటే.. సాధ్యం కాని పని. ఇందుకోసం ఈ ‘ఓనీ కోడా 2 పిజ్జా ఓÐð న్’ బాగా ఉపయోగపడుతుంది. ఇదొక గ్యాస్ పవర్డ్ పిజ్జా ఓవెన్. కేవలం పిజ్జాను మాత్రమే ఇందులో వేడి చేసుకొని తినొచ్చు. దీనిని ఎక్కడికైనా తీసుకొని వెళ్లవచ్చు. విహార యాత్రలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ధర 449 డాలర్లు ( రూ. 38,338).ఎకోజీ స్మార్ట్ నగ్గెట్ ఐస్ మేకర్ఫ్రిజ్లో ఐస్‌క్యూబ్స్ తయారు చేసుకోవాలంటే కాస్త సమయం పడుతుంది. అదే ఈ ‘ఎకోజీ స్మార్ట్ నగ్గెట్ ఐస్ మేకర్’ సాయంతో చాలా త్వరగా ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవచ్చు. ఇందులోని ట్రేలో నీరు నింపేసి పెడితే, కేవలం పన్నెండు నిమిషాల్లోనే ఐస్ క్యూబ్స్ తయారవుతాయి. బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే, ఇరవై నాలుగు గంటల వరకు నిరాటంకంగా పనిచేస్తుంది. యాప్ ద్వారా కూడా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు. దీని ధర 239 డాలర్లు (రూ. 20, 407) మాత్రమే!థర్మా ‘మీట్’ర్సరిగ్గా ఉడకని మాంసం, పచ్చి మాంసం తినటం వలన శరీరంలోకి టేప్ వార్మ్‌లు వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే, మాంసం సరిగ్గా ఉడికిందా లేదా అని తెలసుకోవడానికి రూపొందించినదే ఈ ‘మీట్ర్ ప్లస్’. దీనికున్న సూదికొనను మాంసానికి గుచ్చితే, కేవలం పదిసెకండ్లలోనే మాంసం ఎంత వరకు ఉడికిందో పూర్తి సమాచారం ఇస్తుంది. మాంసం లోపలి ఉష్ణోగత్రను సుమారు 212 డిగ్రీ ఫారన్‌హీట్ వరకు, బయటి ఉష్ణోగత్రను 527 డిగ్రీ ఫారన్ హీట్ వరకు చెప్పగలదు. బ్లూటూత్ కెనెక్టివిటీతో మొబైల్‌కు కూడా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ధర 99 డాలర్లు (రూ. 8,543). -
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు వచ్చే బ్యాటరీ
ఒకసారి ఛార్జ్ చేస్తే యాభై సంవత్సరాలు నిరాటంకంగా పని చేసేలా కాంపాక్ట్ న్యూక్లియర్ బ్యాటరీలను రూపొందిస్తున్నట్లు చైనీస్ బ్యాటరీ తయారుదారు బీటెవోల్ట్ ప్రకటించింది. ఇది కాంపాక్ట్ న్యూక్లియర్ ఎనర్జీలో పురోగతిని సూచిస్తుంది. బీవీ 100 నికెల్-63 ఐసోటోపులను ఉపయోగించి రేడియోధార్మికత ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. డైమండ్ సెమీకండక్టర్ల ద్వారా ఈ చర్యలో విడుదలైన శక్తిని విద్యుత్తుగా మారుస్తున్నట్లు పేర్కొంది.బీవీ 100 న్యూక్లియర్ బ్యాటరీ ఫీచర్లుపరిమాణం: ఒక చిన్న నాణెం (15x15x5 మిమీ) పరిమాణంలో ఉంటుంది.పవర్ అవుట్ పుట్: 3 వోల్ట్ సామర్థ్యం ఉన్న బ్యాటరీ 100 మైక్రోవాట్ల పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఏడాది చివరి నాటినికి 1 వాట్ పవర్‌ను ఉత్పత్తి చేసే బ్యాటరీలను తయారు చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది.జీవితకాలం: ఈ న్యూక్లియర్ బ్యాటరీ ఒకసారి ఛార్జింగ్ చేస్తే మళ్లీ ఛార్జ్, మెయింటెనెన్స్ అవసరం లేకుండా 50 ఏళ్లు పనిచేస్తుంది.సామర్థ్యం: ప్రస్తుతం ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీల కంటే 10 రెట్లు అధికం సామర్థ్యంతో పని చేస్తాయి.ఇదీ చదవండి: పాకిస్థాన్ మొత్తం అప్పు ఎంతో తెలుసా..?సేఫ్టీ: విపరీతమైన ఉష్ణోగ్రతల్లో (-60°C నుంచి +120°C) మెరుగ్గా పనిచేస్తుంది. వీటివల్ల మంటలు లేదా పేలుడు ప్రమాదాలను జరగవని కంపెనీ తెలుపుతుంది. పూర్తిస్థాయిలో ఈ బ్యాటరీలు వినియోగంలోకి వచ్చిన తర్వాతే ఈ అంశంపై స్పష్టత వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఉపయోగాలు: వైద్య పరికరాలు, ఏరోస్పేస్ పరికరాలు, ఏఐ వ్యవస్థలు, డ్రోన్లు.. వంటి నిరంతరం విద్యుత్ అవసరమయ్యే పరికరాలకు ఈ బ్యాటరీలో ఎంతో అనువైనవిగా సంస్థ చెబుతుంది. -
కథన రంగంలో ఏఐ చిందులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాల్లోనూ ప్రవేశించింది. ఏఐ సినిమా పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. చిత్ర నిర్మాణంలోని ప్రతి అంశాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతుండడంతోపాటు సినిమాపై ప్రేక్షకుల అంచనాలను పెంచుతోంది. సృజనాత్మక ప్రక్రియలను మెరుగుపరచడం, వర్క్‌ఫ్లోలను ఆప్టిమైజ్ చేయడం, వీక్షకుల అనుభవాలను విశ్లేషించడం ద్వారా ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా మారుతోంది. కృత్రిమ మేధ సినిమా ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఆడియన్స్ ఇంటరాక్షన్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.ప్రీ ప్రొడక్షన్స్క్రిప్ట్ రైటింగ్, కాస్టింగ్, స్టోరీబోర్డింగ్.. వంటి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఏఐ సాయం చేస్తోంది. స్క్రిప్ట్‌బుక్, ప్లాటగాన్ వంటి సాధనాలు స్క్రిప్ట్‌ను విశ్లేషించడానికి, బాక్సాఫీస్ పనితీరును అంచనా వేయడానికి, భావోద్వేగ అంశాలు, సంభాషణ ఆధారంగా కథలో మెరుగుదలను సూచించడానికి నేచురల్ ల్యాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ)ను ఉపయోగిస్తున్నాయి. ఇది సినీ రచయితలు తమ కథలను మెరుగుపరచడానికి, నిర్మాతలు బడ్జెట్లను సమర్థవంతంగా కేటాయించడానికి సహాయపడుతుంది.కాస్టింగ్.ఏఐ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌లు దర్శకులు ఎంచుకున్న పాత్రలకు వర్చువల్‌గా నటులను గుర్తించేందుకు వారి ముఖాల కవళికలను విశ్లేషిస్తుంది. స్టోరీబోర్డర్ వంటి ఏఐ ఆధారిత సాధనాలు స్క్రిప్ట్‌లను విశ్లేషించి విజువల్ డ్రాఫ్ట్‌లను అందిస్తాయి. ఇది దర్శకులు సన్నివేశాలను ముందుగానే విజువలైజ్ చేయడానికి, సినిమాను త్వరగా చిత్రీకరించడానికి సాయం చేస్తుంది.ప్రొడక్షన్ప్రొడక్షన్ సమయంలో విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్), సినిమాటోగ్రఫీ, సెట్ డిజైన్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారుస్తోంది. డాల్.ఈ, మిడ్‌జర్నీ వంటి జనరేటివ్ ఏఐ మోడల్స్ సినిమాలోని సన్నివేశాలకు అనుగుణంగా వర్చువల్‌గా వాస్తవికతను జోడిస్తున్నాయి. వీఎఫ్ఎక్స్లో ఏఐ రోటోస్కోపింగ్, మోషన్ క్యాప్చర్, డీ-ఏజింగ్(నటుల వయసు తగ్గినట్టు చూపడం) వంటి పనులను సులభతరం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా కదలికలను ఆటోమేట్ చేస్తుంది. సీన్ ఆధారంగా లైటింగ్ సెటప్‌లను సూచించడం ద్వారా సినిమాటోగ్రఫీని మెరుగుపరుస్తుంది.పోస్ట్ ప్రొడక్షన్ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్, సౌండ్ డిజైన్లను ఆటోమేట్ చేయడం ద్వారా ఏఐ పోస్ట్ ప్రొడక్షన్‌ను క్రమబద్ధీకరిస్తుంది. అడోబ్ ప్రీమియర్ ప్రో ఆటో రిఫ్రేమ్ వంటి సాధనాలు ఇందుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. కృత్రిమ మేధ సాధనాలు రా-ఫుటేజీని విశ్లేషిస్తాయి. కీలక దృశ్యాలను గుర్తిస్తాయి. సరైన విధంగా ఎడిట్ చేస్తాయి. ఐజోటోప్ ఆర్ఎక్స్ వంటి ఏఐ సాధనాలు బ్యాగ్రౌండ్ సౌండ్‌ను తొలగిస్తాయి. వాస్తవిక సౌండ్ ఎఫెక్ట్స్‌ను క్రియేట్ చేస్తాయి. వాయిస్ఓవర్లను మెరుగుపరుస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డబ్బింగ్ ప్లాట్‌ఫామ్‌లు సహజసిద్ధమైన ట్రాన్స్లేషన్లను అందిస్తాయి. ఇది ప్రపంచంలోని ప్రేక్షకులకు సినిమాను మరింత అందుబాటులోకి తెస్తున్నాయి.డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్సినిమాను ఎలా మార్కెటింగ్ చేయాలి.. ఎలా డిస్ట్రిబ్యూషన్ చేయలనే అంశాలను ఏఐ పునర్నిర్మిస్తోంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల్లో వ్యూయర్షిప్ను విశ్లేషించడానికి ఏఐ అల్గారిథమ్‌లు ఉపయోగపడుతున్నాయి. వ్యక్తిగత వినియోగదారుల కోసం తగిన ట్రైలర్లు, పోస్టర్లను సృష్టిస్తున్నాయి. ప్రమోషన్లో భాగంగా జానర్ ప్రాధాన్యతలు లేదా ఇష్టమైన నటుల ఆధారంగా నిర్దిష్ట ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఏఐ టూల్స్ మార్కెట్ పోకడలు, సోషల్ మీడియా సెంటిమెంట్, చారిత్రాత్మక డేటాను విశ్లేషించి విడుదల తేదీలను సూచిస్తున్నాయి. దీంతోపాటు పైరసీని ఎదుర్కోవటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుంది.ఆడియన్స్ ఎంగేజ్మెంట్ఇంటరాక్టివ్ ఫార్మాట్లను రూపొందించడం ద్వారా సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకునే వీలుంటుంది. ఏఐ ఆధారిత వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) వంటివి ప్రేక్షకులను సినిమాకు మరింత దగ్గర చేస్తున్నాయి. ఏఐ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్‌ను విశ్లేషిస్తుంది. మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరచడంలో స్టూడియోలకు సహాయపడుతుంది.ఇదీ చదవండి: భారత్–అమెరికా మధ్య డీల్..?సవాళ్లు లేవా..?ఏఐ సినిమాకు అపారమైన సామర్థ్యాన్ని అందిస్తుండగా, నైతిక, సృజనాత్మక ఆందోళనలను కూడా లేవనెత్తుతుంది. డీప్‌ఫేక్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో అనుమతి లేకుండా నటుల పోలికలు లేదా స్వరాలను కాపీ కొట్టేలా కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. సినిమా పరిశ్రమలోని క్రియేటివ్ ఉద్యోగులకు ఏఐ ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్, ఎడిటింగ్‌లో ఎంట్రీ లెవల్ ఆర్టిస్టులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఏఐ ఆటోమేటెడ్ ఎడిటింగ్ వల్ల సన్నివేశాల్లోని భావోద్వేగాలు కోల్పేయే ప్రమాదం కూడా ఉంది. ఏదేమైనా ఏఐ చాలా వరకు సినీ ప్రపంచంలో ఇప్పటికీ పాగా వేసింది. ఏ రంగంలోనైనా ఏఐ ప్రభావం కొంత వరకే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రియేటివ్ పరిశ్రమలో నిత్యం చేసే పనులను మాత్రమే ఏఐతో ఆటోమేట్ చేయవచ్చని చెబుతున్నారు. సృజనాత్మకంగా ఆలోచించి, మంచి సన్నివేశాలకు ప్రాధాన్యత ఇస్తూ కళామతల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏఐ కంటే మానవులపైనే అధికంగా ఉందంటున్నారు. -
అమెరికాలో ఇక మేడిన్ ఇండియా ఐఫోన్లే!
న్యూఢిల్లీ: జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే మెజారిటీ ఐఫోన్లు భారత్‌లో తయారైనవే ఉంటాయని టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ మొదలైనవి వియత్నాంలో తయారైనవి ఉంటాయని పేర్కొన్నారు. ఇతరత్రా దేశాల్లో విక్రయించే ఉత్పత్తులు మాత్రమే అత్యధికంగా చైనాలో తయారవుతాయని పేర్కొన్నారు.చైనా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై అమెరికా భారీగా టారిఫ్‌లు ప్రకటించిన నేపథ్యంలో కుక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొంత మినహాయింపులున్నా, వివిధ టారిఫ్‌లను కలిపితే చైనా నుంచి ఎగుమతి చేసే తమ ఉత్పత్తులపై ఏకంగా 145 శాతం సుంకాలు వర్తిస్తాయని కుక్ తెలిపారు.ఎస్అండ్పీ గ్లోబల్ విశ్లేషణ ప్రకారం 2024లో అమెరికాలో ఐఫోన్ విక్రయాలు 7.59 కోట్లుగా ఉండగా, మార్చిలో భారత్ నుంచి 31 లక్షలు ఎగుమతయ్యాయి. టారిఫ్ రేట్లు, పాలసీలు ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగితే జూన్ త్రైమాసికంలో తమ వ్యయాలపై రూ. 900 మిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందని కుక్ చెప్పారు. -
ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు: జాబితాలో ఉన్న మోడల్స్ ఇవే..
స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే దాదాపు ప్రతి ఒక్కరూ.. వాట్సాప్ ఉపయోగిస్తుంటారు. అయితే 2025 మే 5 నుంచి కొన్ని ఫోన్లలో ఈ మెసేజింగ్ యాప్ (వాట్సాప్) పనిచేయదు. ఇంతకీ జాబితాలో ఏ ఫోన్లు ఉన్నాయనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని మెటా ఎప్పటికప్పుడు 'వాట్సాప్'ను అప్డేట్ చేస్తూ లేదా కొత్త ఫీచర్లులను ప్రవేశపెడుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు వాట్సాప్ ఉపయోగించే ఫోన్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో పాత ఆపరేటింగ్ సిస్టం కలిగిన ఐఫోన్లలో తమ సేవలను నిలిపివేయనుంది.మీరు ఉపయోగించే ఐఫోన్ iOS 15.1 తర్వాత లాంచ్ అయిన వెర్షన్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాట్సాప్ పనిచేస్తుంది. అయితే మీ ఐఫోన్ iOS 15.1 లేదా అంతకు ముందు వెర్షన్ అయితే వాట్సాప్ పనిచేయదు. జాబితాలో ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ వంటివి ఉన్నాయి. అంటే ఈ ఫోన్లలో మే 5 నుంచి వాట్సాప్ పనిచేయదు. ఎందుకంటే ఈ ఫోన్లు iOS 14 వెర్షన్లకే పరిమితమయ్యాయి. వీటిని iOS 15కి అప్డేట్ చేయడం కుదరదు. -
మూడు రోజుల్లో స్కైప్ కనుమరుగు
కరోనా సమయంలో పాపులర్ అయిన కొన్ని టెక్నాలజీ సర్వీసులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. అందులో మైక్రోసాఫ్ట్ సర్వీసు స్కైప్ ఒకటి. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి 22 ఏళ్లు అయినా, కొవిడ్ సమయంలో చాలా మంది ఉద్యోగులు, బిజినెస్ సంస్థలు స్కైప్ సర్వీసులు విరివిగా వినియోగించుకున్నారు. కానీ కొవిడ్ అనంతరం క్రమంగా యూజర్ల నుంచి ఆదరణ తగ్గడం, మార్కెట్లో పోటీగా మెరుగైన ఇతర ప్రత్యామ్నాయాలు రావడంతో సవాళ్లు ఎదురవుతున్నాయి. దాంతో ఈ సర్వీసును మే 5, 2025 నుంచి నిలిపేస్తున్నట్లు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అయితే స్కైప్ యూజర్లకు మైక్రోసాఫ్ట్ టీమ్స్‌వైపు మళ్లించేందుకు అన్ని ప్రయత్నాలు జరిగాయి. కాగా, కంపెనీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్కైప్‌ను ఎందుకు నిలిపేస్తున్నారో నిపుణులు విశ్లేషిస్తున్నారు.మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లోకి మార్పుమైక్రోసాఫ్ట్ తన కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లను ఏకీకృతం చేయడం కూడా స్కైప్‌ను నిలిపేసేందుకు కారణమవుతుంది. మెసేజింగ్, వీడియో కాల్స్ ఇతర సర్వీసుల కోసం దాని ప్రాథమిక కేంద్రంగా మైక్రోసాఫ్ట్ టీమ్స్‌పై పూర్తిగా దృష్టి పెడుతోంది. దాంతో స్కైప్ వినియోగదారులను సైతం ఈ టీమ్స్‌లో చేరమని కొంత కాలంగా కోరుతుంది. ఇప్పటికే చాలామంది టీమ్స్‌లోకి మారారు.తగ్గుతున్న ప్రజాదరణస్కైప్ కొన్నేళ్లుగా మెరుగైన సర్వీసులు అందిస్తున్నప్పటికీ జూమ్, గూగుల్ మీట్, వాట్సాప్.. వంటి పోటీదారులు కూడా ఈ సర్వీసు అందిస్తున్నారు. దాంతో ఆఫీస్ 365లో భాగంగా ఉన్న మైక్రోసాఫ్ట్ టీమ్స్‌వైపు వినియోగదారులు నడిపించేలా సంస్థ చర్యలు తీసుకుంటోంది.వినియోగదారులకు మద్దతుగా..స్కైప్ నుంచి టీమ్స్‌కు మైగ్రేట్ అయ్యేందుకు మైక్రోసాఫ్ట్ యూజర్లకు చాలా నెలల సమయం ఇచ్చింది. టీమ్ల్లోకి లాగిన్ కావడానికి ఇప్పటికే ఉన్న స్కైప్ ఐడీలను ఉపయోగించవచ్చని తెలిపింది. ఇది యూజర్ ట్రాన్పర్మేషన్ను సులభతరం చేసింది. చాట్ హిస్టరీలు, కాంటాక్ట్‌లను నిరాటంకంగా టీమ్స్‌కు బదిలీ చేస్తామని మైక్రోసాఫ్ట్ హామీ ఇచ్చింది.పెయిడ్ సేవలు నిలిపివేతస్కైప్ క్రెడిట్, కాలింగ్ ప్రణాళికలతో సహా పెయిడ్ సేవల కోసం కొత్త సబ్ స్క్రిప్షన్లను మైక్రోసాఫ్ట్ నిలిపివేసింది. ఇప్పటికే ఉన్న వినియోగదారులు వారి తదుపరి రీఛార్జ్ సైకిల్ వరకు సబ్స్క్రిప్షన్లను కొనసాగించవచ్చని తెలిపింది. ఆ తర్వాత పెయిడ్ ఫీచర్లు నిలిచిపోతాయని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: గూగుల్ కథ కంచికేనా?ప్రత్యామ్నాయాలుమార్కెట్లో టీమ్స్‌కు కూడా ప్రత్యామ్నాయాలున్నాయి. యూజర్లు వీడియో కాలింగ్ ఫీచర్లను అందించే గూగుల్ మీట్, జూమ్ లేదా వాట్సాప్.. వంటి సర్వీసులకు కూడా మారవచ్చు. అయితే స్కైప్‌తో పోలిస్తే టీమ్స్ మరింత ఆధునిక, ఇంటిగ్రేటెడ్ అనుభవాన్ని అందిస్తుందని మైక్రోసాఫ్ట్ నొక్కి చెప్పింది. -
మేలో లాంచ్ అయ్యే టాప్ 5 స్మార్ట్ఫోన్లు
మొబైల్ యూజర్లు వాటి పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లలో మార్పులు వస్తున్నాయి. మొబైల్ తయారీ కంపెనీలు వినియోగదారుల అభిరుచుల మేరకు వినూత్న మోడళ్లను నిత్యం ఆవిష్కరిస్తున్నారు. అందులో భాగంగా మే, 2025లో లాంచ్ అవ్వనున్న టాప్ 5 కంపెనీల ఉత్పత్తుల గురించి కింద తెలుసుకుందాం.1. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్మే 13, 2025 నాటికి విడుదలవుతుందని అంచనా.6.6 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్.స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్. అల్ట్రా స్లిమ్ డిజైన్ (5.84 మిల్లీమీటర్ మందం, 162 గ్రాముల బరువు).25వాట్ ఛార్జింగ్‌తో 3,900 ఎంఏహెచ్ బ్యాటరీ.2. వన్‌ప్లస్ 13ఎస్విడుదల తేదీ మే 2025లో అంచనా.6.32 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే.స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్.కాంపాక్ట్ ఫ్లాగ్ షిప్ డిజైన్.బ్లాక్, పింక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.ధర సుమారు రూ.55 వేలు.3. రియల్మీ జీటీ 7విడుదల తేదీ మే 2025లో అంచనా.మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్ సెట్.16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్.120 ఎఫ్‌పీఎస్ కలిగిన గేమింగ్ స్మార్ట్‌ఫోన్.రియల్మీ యూఐ 6.0 (ఆండ్రాయిడ్ 15)తో వస్తుంది.4. పోకో ఎఫ్7విడుదల తేదీ మే 2025లో అంచనా.స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్ సెట్.6.8 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే.90 వాట్ ఛార్జింగ్‌తో 7,550 ఎంఏహెచ్ బ్యాటరీ.ఇదీ చదవండి: రూ.5,830 కోట్ల ప్రాజెక్ట్‌ను నిలిపేసిన జోహో5. ఐకూ నియో 10విడుదల తేదీ మే 2025లో అంచనా.6.78 అంగుళాల 144 హెర్ట్జ్ ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ప్లేడైమెన్సిటీ 9400 చిప్ సెట్.6,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాట్ వైర్డ్ ఛార్జింగ్.ధర సుమారు రూ.40 వేలు. -
‘మన టాలెంట్ పోతోంది’.. సీఈవో వార్నింగ్
స్టార్టప్ బూమ్‌లో భారత్ దూసుకుపోతున్నప్పటికీ, యూపీఐ వంటి ఫిన్‌టెక్ విజయగాథలు మనకు ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితిని సమీక్షించుకోవాల్సిన అవసరముందని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి దేశంలోని ఉత్తమ సాంకేతిక మేధావులు విదేశాలకు వెళ్లకుండా ఉండాలంటే దేశానికి తీవ్రమైన రియాలిటీ చెక్ అవసరమని చెప్పారు.ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన ఒక వివరమైన పోస్ట్ పెట్టారు. భారత ఇన్నోవేషన్ సామర్థ్యాలను నాలుగు కేటగిరీలుగా విశదీకరించారు. ఒక్కో అంశానికి మార్కులు సైతం ఇచ్చారు. దేశంలో ప్రైవేట్ రంగం ధృడంగా వ్యవహరించాలని, స్వదేశంలో నిజమైన ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. విమానయాన సంస్థలు, బ్యాంకింగ్, రిటైల్ వంటి ప్రాసెస్ ఆధారిత రంగాల్లో భారత్ ప్రకాశిస్తున్నప్పటికీ, ప్రపంచ స్థాయి ఉత్పత్తులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సృష్టించడంలో వెనుకబడి ఉందని, మన టాలెంట్ (ప్రతిభావంతులు) విదేశాలకు వెళ్లిపోతోందని శ్రీధర్ వెంబు హెచ్చరించారు.ప్రాసెస్ ఇన్నోవేషన్ లో భారత్ 70 శాతం మంచి స్కోర్ సాధిస్తుందని వెంబు అన్నారు. కానీ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ విషయషంలో మాత్రం కేవలం 35% మాత్రమే రేటింగ్ ఇచ్చారు. ఇది ఆశాజనకంగా ఉండవచ్చంటూ యూపీఐ ఆవిష్కరణను ఉదహరించారు. దేశానికి సమర్థవంతమైన ప్రాజెక్ట్ మేనేజర్లు మాత్రమే కాకుండా మరింత దూరదృష్టి కలిగిన ఉత్పత్తి సృష్టికర్తలు అవసరమని నొక్కి చెప్పారు.ఇక టెక్నాలజీ విషయంలో శ్రీధర్ వెంబు అసలు స్కోరే ఇవ్వలేదు. అంతటితో ఆగకుండా తీవ్రమైన ఆందోళన వెలిబుచ్చారు. భారతదేశపు టాప్ టెక్ టాలెంట్ ను విదేశీ సంస్థలు తీసేసుకుంటున్నాయని, టెక్ టాలెంట్‌ను నిలుపుకోవడం, వెనక్కి తీసుకురావడం కోసం దేశ ప్రైవేటు రంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందు కోసం ఇక్కడ ప్రతిష్టాత్మక అవకాశాలను సృష్టించాల్సిన అవసరం ఉందని సూచించారు.సైంటిఫిక్ పురోగతుల కేటగిరీకి స్కోర్ ఇవ్వడానికి ఈ విషయంలో "మనం కనీసం పరీక్ష కూడా రాయలేదు" అంటూ కఠువుగా వ్యాఖ్యానించారు. ఉత్పత్తులు, సాంకేతిక రంగాల్లో ప్రైవేటు సంస్థలు ముందంజలో ఉండాలని, డీప్ సైన్స్ కు ప్రభుత్వ నిధులు అవసరమని ఆయన అన్నారు. 20వ శతాబ్దపు అనేక ఆవిష్కరణలకు నాంది పలికిన ప్రఖ్యాత అమెరికన్ రీసెర్చ్ హబ్ బెల్ ల్యాబ్స్ వంటిది భారత్‌లోనూ రావాల్సిన అవసరం ఉందన్నారు. -
కాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు 20 వేల కొలువులు
అమెరికన్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఈ ఏడాది సుమారు 20,000 మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకునే యోచనలో ఉంది. ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మేనేజ్డ్ సర్వీసెస్ విభాగాల్లో ఈ కొలువులు ఉండనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,36,300గా ఉంది.‘ఇన్వెస్టర్ డే సందర్భంగా చెప్పినట్లు మా వ్యూహంలో భాగంగా 20,000 మంది ఫ్రెషర్లను తీసుకోబోతున్నాం. గతేడాదితో పోలిస్తే ఇది రెట్టింపు‘ అని కంపెనీ సీఈవో ఎస్ రవి కుమార్ తెలిపారు. ఫ్రెషర్లను తీసుకోవడం, ఏఐ ద్వారా ఉత్పాదకతను పెంచుకోవడం, మానవ వనరుల వ్యయాలను తగ్గించుకునేలా సామర్థ్యాల వినియోగాన్ని మెరుగుపర్చుకోవడం వంటి మూడు అంశాలపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు.ఈ ఏడాది జనవరి–మార్చ్ త్రైమాసికంలో కాగ్నిజెంట్ ఆదాయం సుమారు 7 శాతం పెరిగి 5.1 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో టాప్ ఐదు ఐటీ కంపెనీలు మొత్తంగా 80 వేల నుంచి 84 మందిని కొత్తగా నియమించుకోనున్నట్లు సంకేతాలిచ్చాయి. -
ఘనంగా మైక్రోసాప్ట్ ఐడీసీ పినాకిల్ సమ్మిట్-2025
సాక్షి,హైదరాబాద్: ప్రపంచ దేశాల్లో కృత్రిమ మేధ (ai) వినియోగంలో భారత్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా మైక్రోసాఫ్ట్‌కు చెందిన క్లౌడ్ బేస్డ్ టెక్ కంపెనీ గిట్ హబ్ ఓ నివేదికను విడుదల చేసింది. ప్రస్తుతం 1.7కోట్లకు పైగా డెవలప్ ఉన్న భారత్ 2028 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీగా అవతరిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది.ఈ దిశగా మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ (IDC) అడ్వాన్స్డ్ ఏఐపై దృష్టిసారిస్తూ మూడవ పినాకిల్ సమ్మిట్- 2025ను నిర్వహించింది. ‘అన్‌లాక్ ది ఎజెంటిక్ ఫ్యూచర్ - వేర్ ఏఐ ఏజెంట్ మీట్ హ్యూమన్ ఇంజెన్యూయిటీ’ అనే థీమ్ కొనసాగిన ఈ టెక్ సమ్మిట్‌లో పాల్గొన్న ఐడీసీ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్, కోర్ ఏఐ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జయ్ పారిక్,మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చంద్రోక్‌లు భారత్‌లో ఏఐ విస్తరణ, మైక్రోసాఫ్ట్ ఏఐ ఈకో సిస్టమ్ వంటి అంశాపై చర్చించారు. -
పూర్తి కోడింగ్ పనంతా ఏఐదే!
కృత్రిమ మేధ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వినియోగం ఎక్కువైంది. సాఫ్ట్వేర్లోనైతే దీని వాడకం మరీ అధికం. ఇప్పటివరకు కోడింగ్ నిపుణులకు ఏఐ సాయంగా నిలుస్తుంది. అయితే రాబోయే కొన్ని నెలల్లోనే ఏఐ పూర్తి కోడింగ్ రాస్తుందని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అంచనా వేశారు. ఈ నేపథ్యంలో త్వరలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.వచ్చే 12 నుంచి 18 నెలల్లో కృత్రిమ మేధ(ఏఐ) మెటా అంతర్గత ఏఐ ప్రాజెక్టులకు, ముఖ్యంగా దాని లామా ప్రాజెక్ట్‌ల్లో పూర్తిగా కోడింగ్ సేవలందిస్తుందని మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు. ఇప్పటికే ఈ విభాగాల్లో ఏఐ మెజారిటీ కోడ్‌ను రాస్తుందన్నారు. రానున్న రోజుల్లో ప్రాజెక్ట్ లక్ష్యాలను నిర్దేశించడం, పరీక్షలను నిర్వహించడం, బగ్‌లను గుర్తించడం, కోడ్ నాణ్యతను మెరుగుపరచడం వంటి మరింత అధునాతన పనులను ఏఐ చేపడుతుందని జుకర్‌బర్గ్ భావిస్తున్నారు. కృత్రిమ మేధ త్వరలోనే ఈ రంగాల్లో ఇంజినీర్లను రిప్లేస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.సుందర్ పిచాయ్..గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఇటీవల ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రధాన టెక్ కంపెనీల్లో కృత్రిమ మేధను గణనీయంగా వినియోగిస్తున్నట్లు చెప్పారు. గూగుల్ ఆల్ఫాకోడ్, మెటా ఏఐ నమూనాలు వాటి లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్‌తో ఫంక్షనల్ కోడ్‌ను జనరేట్ చేయడం, దోషాలను డీబగ్గింగ్ చేయడం, పనితీరును ఆప్టిమైజ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.ఇదీ చదవండి: బంగారమా..? మకొద్దు బాబోయ్..!ఏఐకి అంత సీన్ లేదు..ఇదిలాఉండగా, ఏఐను అతిగా అంచనా వేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోడింగ్‌లో ఏఐ పురోగతి మెరుగ్గానే ఉన్నప్పటికీ, హ్యూమన్ డెవలపర్లను పూర్తిగా భర్తీ చేయడం కుదరదని చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్‌లో ఫంక్షనల్ కోడ్ రాయడం కంటే సంక్లిష్టమైన వ్యాపార అవసరాలను అర్థం చేసుకోవడం, నైతిక నిర్ణయాలు తీసుకోవడం, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా వ్యవస్థలను రూపొందించడం అవసరం అవుతుంది. ఈ పనులకు సృజనాత్మకత, సందర్భోచిత అవగాహన, డెసిషన్ మేకింగ్ ఎంతో తోడ్పడుతుంది. వీటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమర్థంగా నిర్వహించలేదనే వాదనలున్నాయి. -
వెండింగ్ మెషిన్ల ద్వారా బంగారం కొనుగోలు
దేశవ్యాప్తంగా వచ్చే 12–18 నెలల్లో 50 వరకు బంగారం, వెండి వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేయనున్నట్టు యాస్పెక్ట్ బులియన్ అండ్ రిఫైనరీ ప్రకటించింది. ఈ వెండింగ్ మెషిన్ల ద్వారా బంగారం, వెండి కాయిన్లను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. వెండింగ్ మెషిన్ వద్దే అప్పటికప్పుడు ధరలను కస్టమర్లు చూసుకోవచ్చని.. రియల్‌టైమ్ మార్కెట్ ధరలు అక్కడ కనిపిస్తాయని పేర్కొంది. వేగంగా, భద్రంగా కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఈ వెండింగ్ మెషిన్లు ఉంటాయని.. మూడు నిమిషాల్లోనే కొనుగోలును పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు సహా పలు రకాల పేమెంట్ ఆప్షన్లను వినియోగించుకోవచ్చని తెలిపింది.వెండింగ్ మెషిన్ ఎలా పని చేస్తుందంటే..గోల్డ్ కాయిన్ వెండింగ్ మెషిన్లు సాధారణ వెండింగ్ మెషీన్ల మాదిరిగానే పనిచేస్తాయి. కానీ బంగారం విలువ కారణంగా అదనపు భద్రతను కల్పిస్తారు. అందులో భాగంగా వినియోగదారుల వెరిఫికేషన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.మెషిన్లో ముందుగా వినియోగదారులు తమకు కావాల్సిన బంగారు నాణెం బరువు, రకాన్ని ఎంచుకుంటారు.నగదు, క్రెడిట్/డెబిట్ కార్డు లేదా మొబైల్ బ్యాంకింగ్ (యూపీఐ, క్యూఆర్ కోడ్లు మొదలైనవి) ద్వారా చెల్లింపులు చేయవచ్చు.కొన్ని యంత్రాలకు గుర్తింపు ధ్రువీకరణ అవసరం అవుతుంది. ముఖ్యంగా అధిక మొత్తంలో చేసే లావాదేవీల కోసం ఆధార్ లేదా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వంటి కేవైసీ (నో యువర్ కస్టమర్) పద్ధతులను ఉపయోగిస్తారు.చెల్లింపు అయినట్లు ధ్రువీకరించిన తరువాత మెషిన్లోని స్టోరేజ్ కంపార్ట్మెంట్ నుంచి బంగారు నాణేన్ని రిలీజ్ చేస్తుంది.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫారంలను నోటిఫై చేసిన కేంద్రంకొన్ని యంత్రాల ద్వారా బంగారు కడ్డీలు కూడా పొందే వీలుంటుంది. దానికి సంబంధించిన వివరాలను ముందుగానే వినియోగదారులకు తెలియజేస్తుంది.పంపిణీ సమయంలో భద్రతకోసం సీసీటీవీ మానిటరింగ్, ట్యాంపరింగ్ ప్రూఫ్ మెకానిజమ్స్, వెయిట్ సెన్సర్లను అమరుస్తారు.యంత్రాల్లో యాంటీ-థెఫ్ట్ అలారంలు, రియల్-టైమ్ ఇన్వెంటరీ ట్రాకింగ్ విధానం కూడా ఉంటుంది.బంగారం కొనుగోలు రుజువు కోసం ఈ-రశీదులు కూడా పొందవచ్చు. -
కావసాకీ వారి కీలుగుర్రం
1949లో విడుదలైన శోభనాచల పిక్చర్స్ వారి ‘కీలుగుర్రం’ఆకాశంలో ఎగురుతుంది! మూడు సముద్రాలు దాటి రాకుమారి ఉన్న దీవికి చేరుకుంటుంది! రాజ్యాన్ని కాపలా కాస్తుంది. విక్రమసేనుణ్ని అంగరాజ్య సేనాధిపతిని చేస్తుంది. 76 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అలాంటి కీలుగుర్రమే సోషల్ మీడియాలో స్వారీ చేస్తోంది! కొండలపైకి ఎక్కుతోంది. వాగుల్ని వంకల్ని దాటుతోంది. లోయల పైనుంచి గెంతుతోంది. చిరుతపులిలా ఒళ్లు సాగతీసుకుంటూ గాల్లోకి లేస్తోంది. అరణ్యాలలో పరుగులు పెడుతోంది. ఇవన్నీ కూడా పైన ఒక మనిషిని మోస్తూనే చేస్తోంది. ఈ కీలుగుర్రాన్ని ‘సృష్టించింది’‘కావసాకీ’వారు. గుర్రం పేరు ‘కోర్లియో’. – (సాక్షి, స్పెషల్ డెస్క్) కంప్యూటర్ జనరేటెడ్ కాన్సెప్ట్ ‘కోర్లియో’అనే ఈ కీలుగుర్రం. నిజానికింకా జీవం పోసుకోనే లేదు. ఇదొక కంప్యూటర్ జనరేటెడ్ కాన్సెప్‌్ట. రోబో కీలు గుర్రాన్ని సృష్టిస్తే అదెలా పని చేస్తుంది? ఎన్ని విధాలుగా మానవ జీవితాన్ని సౌకర్యవంతం చేస్తుంది? అని ఊహిస్తూ కావసాకీ విడుదల చేసిన వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది. జపాన్‌లోని ఒసాకాలో ప్రస్తుతం జరుగుతున్న ‘కాన్సాయ్ ఎక్స్పో 2025’లో కావసాకీ ఈ ‘కోర్లియో’కీలుగుర్రం కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. కోర్లియో కాన్ఫిగరేషన్లలో ప్రధానమైనది దృఢమైన నాలుగు రోబో కాళ్లు. అవి స్థిరంగా ఉండి, పరుగెత్తటానికి, దుమకటానికి; ముందుకు, వెనక్కు కదలటానికి అనువైన సాంకేతిక నైపుణ్యాన్ని కలిగి ఉంటాయి. విప్లవాత్మకమైన చలనశీలత! రోబోలు ముందు వెనుకలకు కదలటం, వివిధ రంగాలలో సేవలు అందించటం, సైన్యంలో వ్యూహాలకు అనుగుణంగా టాస్క్ లను చక్కబెట్టటం వంటివి మామూలే. కానీ ‘కోర్లియో’ప్రత్యేకమైనది. సాఫీగా లేని మార్గాలలో అది సొంత తెలివితో ప్రయాణిస్తుంది. అనువు కాని చోట కూడా ముందుకు సాగుతుంది. రోబోల సృష్టిలో మునుపెన్నడూ లేని విప్లవాత్మకమైన చలనశీలత ఇది. వాహనాలు వెళ్లలేని మార్గాలలో సైతం కోర్లి యో మనిషిని సురక్షితంగా మోసుకెళుతుంది. ‘కోర్లియో’ఫార్ములా వెనుక రోబో అనేది రెండు ప్రధాన భాగాలతో కూడిన సంక్లిష్టమైన యంత్రం. ఒకటి శరీరం, ఇంకొటి సమాచార ప్రాసెసింగ్ యూనిట్. వీటిని పని చేయించటానికి యాక్యుయేటర్లు (శక్తిని భౌతిక చలనంగా మార్చే పరికరాలు), సెన్సర్లు ఉంటాయి. అయితే చక్రాల వాహనాలతో పోల్చినప్పుడు కాళ్ల రోబోలు తమను తాము నిరంతరం సమతుల్యం చేసుకుని, తమ బరువును తామే భరించాల్సి ఉంటుంది. తమ పైన కూర్చున్నవారికి కుషనింగ్ అందించే స్థాయి సస్పెన్షన్‌ను కూడా అందించవలసి ఉంటుంది. కోర్లియోకైతే మరింత శక్తిశీలమైన, బలమైన యాక్యులేటర్లు అవసరం అవుతాయి. వాటిని వృద్ధి చేస్తే.. కొండలెక్కే, జలాలపై నుంచి ఎగిరి దుమికే కీలు గుర్రాన్ని తయారు చేయవచ్చునని కావసాకీ ఆలోచన. కోర్లియోపై ప్రస్తుత అంచనాలు – ప్రత్యేకతలు » 2050 నాటికి ఆవిష్కరణ, పూర్తిగా కాలుష్యరహితం » ఇంటెలిజెంట్ డిజైన్ » యంత్రంలా కంటే మనిషిలానే ఎక్కువగా పనిచేస్తుంది » హైడ్రోజన్ పవర్‌తో నడుస్తుంది » ప్రతి కాలిలోనూ హైడ్రోజన్ ఇంజిన్ » కొండలు, గుట్టల్లో అనువైన ప్రయాణం » చిరుతపులిని పోలిన ఫ్లెక్సిబిలిటీ.. 4 పాదాలకు రబ్బరు డెక్కలు » బాడీ కదలికలే హాండిల్బార్స్ » రాత్రి వేళల్లో కదలికలకు గైడింగ్ మార్కర్స్ » మనిషి ఆలోచన/ప్రవృత్తి, యంత్ర మేధల సమన్వయంఅనుకున్నంత తేలికేనా? కోర్లియో అనేది ఇప్పటికైతే ఒక భావన. అదింకా ఉనికిలో లేదు. ఒక ఉత్పత్తిగా, ఆఫ్–రోడ్ ఉపయోగం కోసం నాలుగు పెద్ద టైర్లు కలిగిన క్వాడ్ బైక్‌కు ఒక సమర్థవంతమైన వెర్షన్‌గా దీనిని భావించవచ్చు. ఇది మారుమూల ప్రాంతాలలో రవాణా, పర్యాటక వ్యాపారాలు, ఆర్థికంగా స్థోమత ఉన్నవారికి ఒక స్వారీ అభిరుచిగా, క్రీడలకు కూడా కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుంది. అంతేకాదు, దివ్యాంగులకు సహాయక పరికరాల అభివృద్ధికి ఈ సాంకేతిక రోబో పరిజ్ఞానం తోడ్పడే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ జరిగితే తప్పకుండా ఒక అద్భుతమే. అయితే ఈ పనులన్నీ చేయగల కీలుగుర్రం... కీలుగుర్రం ఆకారంలోనే నాలుగు కాళ్లతో మాత్రమే ఉండాలనేముంది అని ‘కాన్సాయ్ ఎక్స్పో 2025’కి వచ్చిన రోబోటిక్ నిపుణులు కొందరు సరదాగా వ్యాఖ్యానించటం విశేషం. ఇక అసలైన సవాలు ఏమిటంటే.. అడవిలో నడవడానికి, సమర్థవంతమైన లోకోమోషన్ అల్గారిథమ్‌లను అమలు చేయడానికి, వాహనానికి అవసరమైన భద్రతా చలన శీలతను కోర్లియోకు కలిగించటానికి ఇంకా ఎంత సమయం పడుతుందో కచ్చితంగా తెలియకపోవటం. -
మెటా ఏఐ యాప్ వచ్చేసింది..
కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను అందుబాటులోకి తీసుకురావడంలో టెక్ దిగ్గజాల మధ్య పోటీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ల యాజమాన్య సంస్థ మెటా తన ఏఐ సాధనానికి ఎట్టకేలకు మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. టెక్స్ట్ సంభాషణలు, వాయిస్ చాట్స్, ఇమేజ్ ఎడిటింగ్ వంటి ఫీచర్లను అందించే అధునాతన లామా 4 మోడల్‌తో నడిచే ఈ యాప్ ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.ప్రత్యేక ఫీచర్మెటా ఏఐ యాప్ ఒక ప్రత్యేకమైన డిస్కవర్ ఫీడ్‌ను పరిచయం చేసింది. అదే ఏఐతో యూజర్ల ఇంటరాక్షన్‌ను ప్రదర్శించే సోషల్ మీడియా-ప్రేరేపిత ఇంటర్ఫేస్. ఇది ఏఐ యాప్ ల్యాండ్ స్కేప్‌లో మొదటిది. సృజనాత్మక కంటెంట్‌ను సృష్టించడం నుండి సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, కమ్యూనిటీ-ఆధారిత అనుభవాన్ని పెంపొందించడం వరకు ఇతరులు మెటా ఏఐని ఎలా ఉపయోగిస్తున్నారో ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. కేవలం టెక్ట్స్ మాత్రమే కాకుండా ఇమేజ్‌లను సైతం సృజనాత్మకంగా ఇందులో సృష్టించవచ్చు.వాయిస్ చాట్ కోసం ఎదురుచూపులే..ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయినప్పటికీ బాగా ప్రాచుర్యం పొందిన వాయిస్ చాట్ ఫీచర్ మాత్రం భారత్‌లోని యూజర్లకు అందుబాటులో లేదు. ఇది ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ యునైటెడ్ స్టేట్స్లో మాత్రమే అందుబాటులో ఉంది. భారత్‌తోపాటు యూఏఈ, మెక్సికో వంటి ఇతర ఈ మార్కెట్లకు వాయిస్ చాట్ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేది కంపెనీ వెల్లడించలేదు.భారత్ త్వరలో రే-బాన్ మెటా గ్లాసెస్‌ను పరిచయం చేస్తున్న క్రమంలో మెటా ఈ యాప్‌ను లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. మెటా ఏఐ యాప్‌తో అనుసంధానించే ఈ స్మార్ట్ గ్లాసెస్, నావిగేషన్ నుండి రియల్ టైమ్ అనువాదాల వరకు వినియోగదారుల దైనందిన జీవితంలో ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయాన్ని అందిస్తాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ మార్కెట్లో మెటా ఏఐ యాప్‌ను పోటీ చర్యగా పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. -
సమస్యలు విని.. పరిష్కారాలు చెబుతోంది!
కష్ట సమయాల్లో, ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు మనశ్శాంతి కోసం గుడికి వెళుతుంటారు. తమ కోరికలను దేవుడికి చెప్పుకొని మనసులోని భారాన్ని దించుకుంటారు. అదే ఆ దేవుడు నిజంగా మీ కోరికలు వింటే ఎంత బావుంటుంది.. అంతటితో ఆగకుండా సావధానంగా వాటికి పరిష్కారాలు అందిస్తే.. అసలు మీతోనే దేవుడు నేరుగా మాట్లాడితే.. ఇదంతా కలలోనే సాధ్యమని అనుకుంటున్నారా? ఇలలోనూ సాధ్యమే! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో మలేషియాలోని ఓ గుడిలో ఏఐ దేవత ‘మాజు’ను ఐమజిన్ అనే కంపెనీ తయారు చేసింది.దక్షిణ మలేషియా రాష్ట్రం జొహోర్లోని తియాన్హౌ అనే టావోయిస్ట్(చైనీస్ సంప్రదాయాలకు అనుగుణంగా ఉన్న గుడి) దేవాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ దేవత ‘మాజు’. ఇది అత్యంత గౌరవనీయమైన చైనీస్ సముద్ర దేవతను పోలి ఉన్న డిజిటల్ దేవత. ఇది భక్తులతో నేరుగా సంభాషిస్తుంది. వారి సమస్యలను సావధానంగా వింటోంది. వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది.ఇదీ చదవండి: రంగులు మార్చే చాట్‌జీపీటీ‘మాజు’ను అభివృద్ధి చేసిన మలేషియా టెక్ సంస్థ ఏఐ క్లోనింగ్ సేవలను అందించే మలేషియా టెక్నాలజీ కంపెనీ ఐమజిన్ ఈ డిజిటల్ దేవతను రూపొందించింది. ఏప్రిల్ 20న సముద్ర దేవత 1,065వ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ ఏఐ మాజును లాంచ్ చేశారు. మాండరిన్తోపాటు ఇతర కొన్ని భాషల్లో ఈ దేవత సంబాషించగలదని కంపెనీ తెలిపింది. ఒక ప్రదర్శన వీడియోలో కంపెనీ వ్యవస్థాపకుడు షిన్ కాంగ్ ఏఐ మాజును కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. ‘మాండరిన్లో పెన్ కాయ్ ఉన్ అనే ఊహించని అదృష్టం నన్ను వరిస్తుందా?’ అని అడిగినప్పుడు, మాజు ‘మీరు ఇంట్లోనే ఉంటే ఊహించని సంపద రూపంలో మీరు అదృష్టవంతులు అవుతారు’ అని సావధానంగా సమాధానం ఇచ్చింది. నిద్రించడానికి ఇబ్బంది పడుతున్న ఒక యాత్రికుడికి ఏఐ మాజు దేవత సలహా ఇచ్చింది. ‘నిద్రపోయే ముందు గోరువెచ్చని నీరు త్రాగడంతో మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు’ అని తెలిపింది. -
రంగులు మార్చే చాట్‌జీపీటీ
మాయాబజార్ సినిమా గుర్తుంది కదా. నిజానికి ఆ చిత్రాన్ని ముందుగా బ్లాక్ అండ్ వైట్‌లోనే రిలీజ్ చేశారు. కానీ కొన్నేళ్ల తర్వాత ఇటీవల దాన్ని కలర్ సినిమాగా మార్చి థియేటర్లలో విడుదల చేశారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్లోకి మార్చేందుకు ప్రత్యేకంగా ఓ యూనిట్ కొంతకాలం పని చేసింది. అయితే టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో అలాంటి వ్యయప్రయాసలు అవసరం లేకుండా బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్‌లను కలర్లోకి మార్చుకోవచ్చు. మీ తాతగారి ఫోటో.. నానమ్మ ఫోటో..వంటి మీ జ్ఞాపకంగా ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ను క్షణాల్లో కలర్లోకి చేంజ్ చేయవచ్చు. ఇందుకు చాట్‌జీపీటీ అవకాశం కల్పిస్తుంది.జనరేటివ్ ఏఐ అభివృద్ధి చెందుతూ సృజనాత్మక అవకాశాలను మునుపెన్నడూ లేనంత ముందుకు తీసుకెళ్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇమేజ్ ప్రాసెసింగ్‌లో తాజా పురోగతి ఇందుకు నిదర్శనం. జనరేటివ్ ఏఐ నమూనాలు మోనోక్రోమ్ చిత్రాలను అద్భుతమైన పూర్తి కలర్ వర్షన్లుగా మారుస్తున్నాయి. చాట్‌జీపీటీ జీబ్లీ ఇమేజ్ ప్రాసెసింగ్ ద్వారా ప్రత్యేకమైన ప్రాంప్ట్‌తో బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ను కలర్లోకి మార్చవచ్చని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: రోజూ 13,698 వాహనాలు అమ్ముతారట!కలర్లోకి ఎలా మార్చాలంటే..వినియోగదారులు చాట్‌జీపీటీ జీబ్లీలో బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని అప్లోడ్ చేయాలి. ‘Convert this black and white image to color’ అనే ప్రాంప్ట్ అందించాలి. ఈ అభ్యర్థన ఆధారంగా ఏఐ సదరు ఇమేజ్ను ప్రాసెస్ చేస్తుంది. చివరగా కలర్ ఇమేజ్ను అందిస్తుంది. ఇలా ప్రాసెస్ చేసిన ఇమేజ్ను యూజర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాస్తవిక రంగులను అంచనా వేయడానికి, ఏక్కడైనా తప్పిపోయిన రంగులను పూరించడానికి విస్తారమైన డేటాసెట్లపై శిక్షణ పొందిన డీప్ లెర్నింగ్ నమూనాలను ఇందుకు ఉపయోగిస్తుంది. -
కొత్త ఏఐ ఆధారిత ల్యాప్‌టాప్‌లు.. ఫీచర్లు..
హెచ్‌పీ తన తదుపరి తరం ఏఐ ఆధారిత ల్యాప్‌టాప్‌లను మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగా ప్రవేశపెట్టిన హెచ్‌పీ ఎలైట్ బుక్, ప్రోబుక్, ఓమ్నీబుక్‌లను విభిన్న వ్యాపారాలు, వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. వీటిలో సెకనుకు 40 నుంచి 55 ట్రిలియన్ కార్యకలాపాలను అందించగల డెడికేటెడ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్లు (ఎన్పీయూ) ఉన్నాయని పేర్కొంది. ఏఐ కంప్యూటింగ్‌లో ఈ డివైజ్‌లు ముందంజలో ఉన్నాయని తెలిపింది.ఇంటెల్ కోర్ అల్ట్రా 200 వి సిరీస్, ఏఎండీ రైజెన్ ఏఐ 300 సిరీస్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ సిరీస్ చిప్‌లతో ఈ ల్యాప్‌టాప్‌లను తయారు చేసినట్లు సంస్థ చెప్పింది. తాజా ప్రాసెసర్లతో నడిచే ఈ ల్యాప్‌టాప్‌లు అడాప్టివ్ వర్క్‌లోడ్‌ను సర్దుబాటు చేసుకుంటూ రియల్ టైమ్ నాయిస్ క్యాన్సిలేషన్, వీడియో కాల్స్ సమయంలో ఆటో ఫ్రేమింగ్ వంటి ఆప్టిమైజేషన్లను అందిస్తాయని తెలిపింది.ఏఐ ఫీచర్లుహెచ్పీ ఏఐ కంపానియన్: ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వినియోగదారుల ప్రశ్నలకు తక్షణ సమాధానాలు, సురక్షితమైన ఫైల్ విశ్లేషణను అందించే రీసెర్చ్ అసిస్టెంట్.పాలీ కెమెరా ప్రో: ఆటో ఫ్రేమింగ్, మల్టీ కెమెరా సపోర్ట్, స్ట్రీమింగ్ ఇంటిగ్రేషన్‌తో వర్చువల్ సమావేశాలను మెరుగుపరచడం.మైహెచ్‌పీ ప్లాట్ ఫామ్: వినియోగదారు భద్రతను ప్రోత్సహిస్తూ డివైజ్ పనితీరు, బ్యాటరీ ఆప్టిమైజేషన్‌ను మెరుగుపరుచడం.డివైజ్ తయారీలో రీసైకిల్ చేసిన ప్లాస్టిక్, లోహాన్ని ఉపయోగించారు. ఇది పర్యావరణ సుస్థిరత పట్ల కంపనీ నిబద్ధతను స్పష్టం చేస్తుంది. ఎనర్జీ స్టార్ సర్టిఫికేషన్, ఈపీఈఏటీ గోల్డ్ రిజిస్ట్రేషన్‌ను సొంతం చేసుకుంది. ఇది గ్రీన్ టెక్నాలజీ పట్ల కంపెనీ అంకితభావాన్ని మరింత బలోపేతం చేస్తుంది. హెచ్‌పీ వోల్ఫ్ ప్రో సెక్యూరిటీ వంటి భద్రతా ఫీచర్లు పెరుగుతున్న ఆన్లైన్ బెదిరింపుల నుంచి రక్షణ ఇస్తాయని సంస్థ పేర్కొంది.ఇదీ చదవండి: మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..హెచ్‌పీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ ఇప్సితా దాస్ గుప్తా మాట్లాడుతూ..‘భారతదేశం అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ పర్యావరణ వ్యవస్థ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించాం. హెచ్‌పీ డివైజ్‌ల్లో పరిశ్రమలు, స్టార్టప్‌లు, వ్యక్తుల సాధికారతలో అర్థవంతమైన ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అన్నారు. హెచ్‌పీ ఇండియా పర్సనల్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ వినీత్ గెహానీ మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ ఆధారిత పీసీలు పనితీరు, భద్రతను మెరుగుపరుస్తాయి. భారతీయ వినియోగదారులు, వ్యాపారాల విభిన్న అవసరాలను ఇవి తీరుస్తాయి’ అని చెప్పారు. -
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
భానుడి ప్రకోపం మరింత ముదురుతోంది. ఈ ఏడాది భారీగానే వేసవి తాపం ఉంటుందని కొన్ని సంస్థలు ఇప్పటికే అంచనా వేశాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయి. ఇంట్లో తీవ్ర ఉక్కపోత మొదలైంది. ఫ్యానులు, కూలర్లు ఉన్నా గది అంతా చల్లదనం రాక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో చాలా మంది ఏసీలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థల నుంచి, రిటైల్ స్టోర్‌ల్లో వీటి అమ్మకాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. అయితే వాటిని కొనుగోలు చేసేపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఐసెర్ రేటింగ్సరైన అవగాహన లేక కొందరు పెద్ద గదులకు తక్కువ సామర్థ్యం ఉన్న ఏసీలు కొనుగోలు చేస్తారు. 110 చదరపు అడుగులు పరిమాణంలో గది ఉంటే 1 టన్ను, 110-150 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గదికి 1.5 టన్నులు, 150-190 చదరపు అడుగుల గదికి 2 టన్నుల సామర్థ్యమున్న ఏసీని ఎంచుకోవాలి. ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా ఐసెర్ (ఐఎస్‌ఈఈఆర్) రేటింగ్ చూడాలి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ప్రమాణాల ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఐసెర్ రేటింగ్ మారుతుంది. ప్రస్తుతం ఐసెర్ రేట్ 5 అంత కంటే ఎక్కువ ఉంటే ఫైవ్ స్టార్ ఉంటుంది. రేటింగ్ 4.4- 4.99 మధ్య ఉంటే ఫోర్ స్టార్ రేటింగ్ ఉంటుంది. రేటింగ్‌లో తేడా వల్ల విద్యుత్తు వినియోగంలో మార్పు ఉంటుందని గమనించాలి.ఇన్వర్టర్తో మేలుచాలా ఇళ్లల్లో నిత్యం ఏసీని ఉపయోగించే వారు ఇన్వర్టర్తో కూడిన ఏసీ కొనుగోలు చేసుకోవాలి. ఇది విద్యుత్తును పొదుపు చేస్తుంది. మోటారు వేగాన్ని నియంత్రిస్తూ గది ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీల్లో ఈ వెసులుబాటు ఉండదు. కేవలం ఆన్, ఆఫ్ మాత్రమే ఉంటాయి. కేవలం వేసవిలో మాత్రమే రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు ఉపయోగించేవారు నాన్ ఇన్వర్టర్ ఏసీ కొనుక్కోవచ్చు. మార్కెట్లో చాలా వరకు కన్వర్ట్‌బుల్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. చిన్న గదిలో 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన వాటిని ఏర్పాటు చేసినా.. అవసరం మేరకు 1 టన్ను, 0.8 టన్ను ఇలా సమర్థ్యాన్ని మార్చుకోవచ్చు. సామర్థ్యం తగ్గించడం వల్ల ఫ్యాన్ వేగం తగ్గి విద్యుత్తు పొదుపు అవుతుంది.ఇదీ చదవండి: అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?ధరల మధ్య వ్యత్యాసంఏసీ కొనుగోలు చేసేప్పుడే తప్పకుండా స్టెబిలైజర్ కొనాలి. వోల్టేజ్ హెచ్చుతగ్గుల పరిధి దాటినప్పుడు స్టెబిలైజర్ లేకుంటే ఏసీ పాడవుతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల పాడైతే వారంటీ ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా కంపెనీలు స్మార్ట్ ఏసీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వాటిని యాప్‌ల ద్వారానూ నిర్వహించవచ్చు. ఏసీ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా వారంటీ చూసుకోవాలి. ఈ-కామర్స్ సంస్థల మధ్య ధరల విషయంలో తేడాలు ఉంటాయి. ఆఫర్లు ఉంటే గమనించాలి. కొన్ని సందర్భాల్లో ఈ-కామర్స్ సంస్థల కంటే కంపెనీల డీలర్ల వద్ద కూడా తక్కువ ధరకు లభిస్తాయి. -
యాప్ స్టోర్.. ఏడాదిలో రూ.44 వేల కోట్ల విక్రయాలు
టెక్ దిగ్గజం యాపిల్ యాప్ స్టోర్ ద్వారా గతేడాది రూ.44,447 కోట్ల విలువ చేసే డెవలపర్ల బిల్లింగులు, విక్రయాలు (ఉత్పత్తులు, సేవలు) నమోదయ్యాయి. యాపిల్‌కి కమీషన్లులాంటివి లేకుండా ఇందులో 94 శాతం భాగం నేరుగా డెవలపర్లు, వ్యాపార సంస్థలకే లభించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (అహ్మదాబాద్)కి చెందిన ప్రొఫెసర్ విశ్వనాథ్ పింగళి నిర్వహించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.నివేదికలోని అంశాల ప్రకారం గత అయిదేళ్లలో భారతీయ డెవలపర్లకు అంతర్జాతీయంగా వచ్చే ఆదాయాలు రెట్టింపయ్యాయి. ఫుడ్ డెలివరీ, ట్రావెల్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ తదితర రంగాలకు చెందిన యాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగింది. గతేడాది భారతీయ డెవలపర్ల ఆదాయాల్లో దాదాపు 80 శాతం వాటా ఇతర దేశాల్లోని యూజర్ల నుంచే వచ్చింది. ఏడాది పొడవున యాప్ స్టోర్ నుంచి 75.5 కోట్ల సార్లు మన డెవలపర్ల యాప్‌లను యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు.ఇదీ చదవండి: వ్యాపార ‘పద్మా’లు..భారతదేశంలోని డెవలపర్ల సృజనాత్మకత, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో యాప్ స్టోర్ కీలక పాత్ర పోషిస్తుంది. యాపిల్ వ్యాపార నమూనాలో ‘ఫ్రీ’మియం(ఉచితం) యాప్‌లు, పెయిడ్ యాప్‌లు, ఇన్-యాప్ పర్చేజ్లు లేదా సబ్స్క్రిప్షన్లతో కూడిన యాప్‌లు వంటి వివిధ మానిటైజేషన్ విధానాలు ఉన్నాయి. ఇది డెవలపర్లను వారి లక్ష్యాలకు అనుగుణంగా టార్గెటెడ్ ఆడియన్స్‌ను ఎంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. -
రెండు రోజులే పనిచేసే రోజులొస్తాయ్..
విపరీతమైన పని గంటలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వంటి అంశాలపై ఇటీవల చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మానవ ఉద్యోగాలకు ముప్పు తప్పదన్న ఆందోళనలూ మరోవైపు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికరమైన అంచనాను వెల్లడించారు.వారానికి ఐదు.. ఆరు రోజులు పని, 9 టు 5 జాబ్.. ఈ సంప్రదాయ భావనలకు కాలం చెల్లిపోనుందా? ఈ పరిస్థితి మరీ అంత ఎక్కువ దూరంలో ఏమీ ఉండకపోవచ్చు. కృత్రిమ మేధస్సు ప్రపంచ శ్రామిక శక్తిని పునర్నిర్మించగలదని, వచ్చే దశాబ్దంలో ప్రామాణిక పని వారాన్ని కేవలం రెండు రోజులకు తగ్గించగలదని బిల్ గేట్స్ చెప్పారు.బిల్ గేట్స్ బోల్డ్ జోస్యంజిమ్మీ ఫాలన్ ది టునైట్ షోలో ఇటీవల కనిపించిన గేట్స్, ప్రస్తుతం మానవులు చేస్తున్న చాలా పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్వరలో నిర్వహిస్తుందని జోస్యం చెప్పారు. తత్ఫలితంగా, సాంప్రదాయ ఐదు రోజుల పని వారం అంటే వారంలో పనిచేసే రోజులు తగ్గిపోతాయని, విశ్రాంతి, సృజనాత్మకత, వ్యక్తిగత సంతృప్తి కోసం ఉద్యోగులకు ఎక్కువ సమయం లభిస్తుందని చెప్పుకొచ్చారు. దైనందిన జీవితంలో అపారమైన మార్పులను తీసుకురావడంతో పాటు వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణుల కొరత వంటి ప్రధాన సమస్యలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కరించగలదని గేట్స్ పేర్కొన్నారు.పని గంటల్లో ఊహించని మార్పువారానికి ఐదు రోజులు, 40 పని గంటల విధానం దశాబ్దాలుగా ఆధునిక సమాజంలో లోతుగా పాతుకుపోయింది. కానీ ఇది నాటకీయంగా మారుతుందని గేట్స్ భావిస్తున్నారు. తయారీ, లాజిస్టిక్స్ దగ్గర నుండి విద్య, ఆరోగ్య సంరక్షణ వరకు అన్నింటా కృత్రిమ మేధ (ఏఐ) సహాయం చేయడమే కాదు.. మనుషులు చేసే పనిని కూడా భర్తీ చేస్తుందని ఆయన ఊహిస్తున్నారు. ఈ మార్పు ఉద్యోగం అర్థాన్నే పునర్నిర్వచించగలదని గేట్స్ సూచిస్తున్నారు. వారంలో రెండు లేదా మూడు రోజులే పనిచేసే రోజులొస్తాయంటున్నారు.సృజనాత్మకత పెంపు, సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స (ఏజీఐ) సామర్థ్యం గురించి గేట్స్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఇది కలిగించే సామాజిక, ఆర్థిక అంతరాయాల గురించి కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. తయారీ, రవాణా, వ్యవసాయం వంటి కార్యకలాపాల్లో యంత్రాలు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, సాంస్కృతిక, భావోద్వేగ కారణాల వల్ల సమాజం కొన్ని మానవ కేంద్రీకృత కార్యకలాపాలను సంరక్షిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ ఫోన్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. చాలా కంపెనీలు మొబైల్ ఫీచర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పరిచయం చేస్తున్నాయి. దాంతో మొబైల్ ఫోన్లను మరింత స్మార్ట్‌గా మార్చాలని విభిన్న ప్రయోగాలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2025లో విడుదలై వినియోగదారుల ఆదరణ పొందుతున్న కొన్ని ప్రముఖ కంపెనీల ఉత్పత్తులను కింద తెలుసుకుందాం.2025 ఏప్రిల్ విడుదలైన కొన్ని కంపెనీల స్మార్ట్ఫోన్లుషియోమీ 15 అల్ట్రా: 6.73 అంగుళాల డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది.శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా: 6.90 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్, 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా.ఐక్యూ జెడ్10: 7300 ఎంఏహెచ్ బ్యాటరీ.రియల్మీ 14 సిరీస్: స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్సెట్, 120 ఎఫ్‌పీఎస్ గేమింగ్ సపోర్ట్.ఒప్పో కే13 5జీ: 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్సెట్.సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో: డైమెన్సిటీ 7300 ప్రో చిప్సెట్, ఆండ్రాయిడ్ 15.శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్: డ్యూయల్ రియర్ కెమెరాలతో స్లిమ్మెస్ట్ ఫోన్‌గా గుర్తింపు పొందింది.మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్: ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్.నథింగ్ ఫోన్ (3ఏ): మంచి కెమెరా ఎక్స్‌పీరియన్స్‌తో లాంచ్ చేశారు.వివో ఎక్స్ 200 అల్ట్రా: ఏప్రిల్ 29, 2025న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 200 మెగాపిక్సెల్ కెమెరా. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్.నోట్: వీటితోపాటు గతంలో విడుదలై మరింత ప్రజాదరణ పొందిన మెరుగైన ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు ఎలా ఉన్నాయంటే.. -
ఫ్రీ వైఫై వినియోగం.. ప్రభుత్వం హెచ్చరిక
ఉచితంగా వస్తుందంటే.. ఎవరు మాత్రం కాదంటారు. అయితే ఫ్రీ వైఫై మాత్రం వద్దనే చెప్పాలంటూ.. ప్రభుత్వం హెచ్చరించింది. ఇంతకీ ప్రభుత్వం ఎందుకిలా అంటోంది?, కారణాలు ఏమిటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.విమానాశ్రయాలు, కాఫీ షాపులు మొదలైన పబ్లిక్ ప్రదేశాల్లో ఫ్రీ వైఫై సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇలాంటివి కనెక్ట్ చేసుకోవడం ఏ మాత్రం భద్రం కాదని ప్రభుత్వం వెల్లడించింది. స్కామర్లు, హ్యాకర్లు అమాయక ప్రజలను ట్రాప్ చేయడానికి ఏర్పాటు చేసిన ఓ ఉచ్చు కూడా కావచ్చని స్పష్టం చేసింది.ఫ్రీ వైఫై ఉపయోగించుకోవడం వల్ల.. ప్రైవేట్ డేటా, ఆర్థిక సమాచారానికి సంబంధించిన విషయాలు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇటువంటి మోసాలను అరికట్టడానికి.. డిజిటల్ భద్రతా అవగాహనను మరింత పెంచడానికి CERT-In తన 'జాగ్రూక్త దివాస్' చొరవ కింద, పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌ల ద్వారా లావాదేవీలు చేయకుండా పౌరులను హెచ్చరించింది.ఇదీ చదవండి: రూ.60 లక్షల ఆదాయం.. అన్నీ సమస్యలే: పోస్ట్ వైరల్సైబర్ నేరగాళ్లు పెరుగుతున్న సమయంలో.. మోసాలు కూడా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఏదైనా తెలియని లైక్స్ మీద లేదా అటాచ్మెంట్ల మీద ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. ఏవైనా ఖాతాలకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఫిక్స్ చేసుకోవడం మంచిది. ఎప్పటికపుడు జాగ్రత్తగా ఉండాలని CERT-In పేర్కొంది. -
స్నానానికి సిగ్నల్ సిస్టమ్.. కొలతల కొళాయి: సరికొత్త గ్యాడ్జెట్స్
అసలే వేసవి కాలం, నీటి కష్టాలు చాలానే ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. పట్టణ ప్రాంతాల్లో వాటర్ ప్రాబ్లమ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నీటిని పొదుపుగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం కొన్ని ప్రత్యేకమైన పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో..వాటర్ పెబుల్కచ్చితమైన కొలతతో స్నానం చేస్తే చాలా నీటిని ఆదా చేసిన వారమవుతాం. అయితే, అంత కచ్చితంగా కొలత ప్రకారం స్నానం చేయడం సులువుగా సాధ్యం కాదు. అందుకే, రూపొందించారు ఈ ‘వాటర్ పెబుల్’. చూడ్డానికి చిన్న గుండ్రటి బిళ్లలా కనిపిస్తుంది. కాని, ఈ పెబుల్ మిమ్మల్ని కేవలం నాలుగు నిమిషాల్లో మాత్రమే స్నానం చేసేలా ట్రైన్ చేయగలదు.సమయం మించిపోయే కొద్దే ట్రాఫిక్ సిగ్నల్స్ మాదిరి ఎరుపు, నారింజ, ఆకుపచ్చ లైట్లతో హెచ్చరికలు చేస్తుంది. ఎరుపు రంగు లైట్ చూపిస్తే, స్నానం వెంటనే పూర్తి చేయమని అర్థం. నారింజ అయితే సగం స్నానం పూర్తి చేశారని అర్థం. ఆకుపచ్చ అయితే, సమయం ఇంకా ఉందని అర్థం. ఇలా ఎంతో సులభంగా అందరూ అర్థం చేసుకునేలా ఉండే దీని ధర 14 డాలర్లు (రూ. 1,119) మాత్రమే!కొలతల కొళాయి మంచినీటి కొళాయి మనకు ఎంత అవసరమో అంతే నీటిని, కొలిచి ఇస్తే బాగుంటుంది కదూ! అచ్చం ఇలాగే ఈ ‘మెజర్ఫిల్ టచ్ కిచెన్ టాప్’ పనిచేస్తుంది. చాలా రకాల వంటకాలు కచ్చితమైన నీటి కొలతతోనే వండాలి. వంటగదికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వంద మిల్లీ లీటర్ల నుంచి ఐదు లీటర్ల వరకు కచ్చితమైన నీటి పరిమాణాన్ని ఇది అందించగలదు. అవసరమైన మేర కొలతను సర్దుబాటు చేసుకునే వీలుంది. ఇక ఇందులోని టచ్ ఫంక్షనాలిటీ సాయంతో సులభంగా ఆన్, ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ట్యాప్ ఆఫ్ చేయటం మర్చిపోతే, ఐదు నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా ట్యాప్ ఆఫ్ అయిపోతుంది. ధర రూ. 359 డాలర్లు (రూ. 30,741).ఇదీ చదవండి: కొత్త ఏటీఎమ్.. ఇలా బంగారం వేస్తే అలా డబ్బులొస్తాయ్..తడిపొడి విడివిడి..వేసవి వచ్చిదంటే చాలామంది వాటర్ రైడ్స్, స్విమ్మింగ్ ఇలా వివిధ రకాల జలక్రీడలతో కాలక్షేపం చేయడానికి Ðð ళ్తుంటారు. అయితే, చెమట, తడి దుస్తుల కారణంగా లగేజీ మొత్తం దుర్వాసన వస్తుంది. ఇలా కాకుండా ఈ వెట్ అండ్ డ్రై సపరేషన్ బ్యాగ్‌తో తడి దుస్తులను, పొడి దుస్తులను వేర్వేరుగా ఉంచితే, దుర్వాసన రాకుండా ఇది అరికడుతుంది. ఇది అత్యుత్తమ వాటర్ ప్రూఫ్ లైనింగ్, వాటర్ ప్రూఫ్ జిప్పర్తో వస్తుంది. జిమ్, లాండ్రీ బ్యాగ్‌లా కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. స్మాల్, మీడియం, లార్జ్ ఇలా వివిధ సైజుల్లో లభిస్తుంది. ధర వివిధ తయారీ కంపెనీలు, పరిమాణాలను బట్టి ఉంటుంది. -
ఏఐ జాబ్ మార్కెట్ బూమ్.. టాప్ 10 స్కిల్స్ ఇవే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగ మార్కెట్ అనూహ్యమైన వృద్ధిని సాధిస్తోంది. యునైటెడ్ స్టేట్స్లో 2024లో ఏఐ జాబ్ పోస్టింగ్‌లలో 20% పెరుగుదల నమోదైందని లైట్కాస్ట్ నిర్వహించిన 2025 AI ఇండెక్స్ రిపోర్ట్ తెలిపింది. 109 బిలియన్ డాలర్ల ప్రైవేట్ పెట్టుబడులతో ఊపందుకున్న ఈ మార్కెట్, ప్రత్యేక ఏఐ నైపుణ్యాల డిమాండ్‌ను పెంచుతూ ఉద్యోగ రంగాన్ని పునర్నిర్మిస్తోంది.పైథాన్ అత్యంత డిమాండ్ ఉన్న నైపుణ్యంగా నిలిచింది. గత సంవత్సరం దాదాపు 200,000 ఉద్యోగ పోస్టింగ్‌లలో ఈ నైపుణ్యాన్ని అడిగారు. రిపోర్ట్ ప్రకారం.. పైథాన్, ప్రోగ్రామింగ్, డేటా సైన్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌తోపాటు అధిక డిమాండ్ ఉన్న టాప్ 10 ఏఐ ఉద్యోగ నైపుణ్యాలు ఇవే..👉పైథాన్ (199,213 పోస్టింగ్‌లు, 2012-2014తో పోలిస్తే 527% వృద్ధి)👉కంప్యూటర్ సైన్స్ (193,341 పోస్టింగ్‌లు, 131% వృద్ధి)👉డేటా అనాలిసిస్ (128,938 పోస్టింగ్‌లు, 208% వృద్ధి)👉SQL (119,441 పోస్టింగ్‌లు, 133% వృద్ధి)👉డేటా సైన్స్ (110,620 పోస్టింగ్‌లు, 833% వృద్ధి)👉ఆటోమేషన్ (102,210 పోస్టింగ్‌లు, 361% వృద్ధి)👉ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ (101,127 పోస్టింగ్‌లు, 87% వృద్ధి)👉అమెజాన్ వెబ్ సర్వీసెస్ (100,881 పోస్టింగ్‌లు, 1,778% వృద్ధి)👉అజైల్ మెథడాలజీ (88,141 పోస్టింగ్‌లు, 334% వృద్ధి)👉స్కేలబిలిటీ (86,990 పోస్టింగ్‌లు, 337% వృద్ధి)కింగ్ ‘పైథాన్’పైథాన్ బహుముఖ ప్రజ్ఞ, విస్తృత లైబ్రరీలు దీనిని ఏఐ అభివృద్ధిలో కీలకమైన అంశంగా మార్చాయని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో డేటా సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎమిలీ చెన్ అన్నారు. "మెషిన్ లెర్నింగ్ నుండి ఆటోమేషన్ వరకు, పైథాన్ అనివార్యం" ఆమె తెలిపారు.డేటా సైన్స్ (833% వృద్ధి), అమెజాన్ వెబ్ సర్వీసెస్ (1,778% వృద్ధి) వంటి నైపుణ్యాలు అత్యధిక వృద్ధిని సాధించాయి, ఇవి సంక్లిష్ట డేటాసెట్ల నుండి సమాచారాన్ని సంగ్రహించే, స్కేలబుల్ ఏఐ సిస్టమ్‌లను నిర్మించే నైపుణ్యాల అవసరాన్ని సూచిస్తున్నాయి. అజైల్ మెథడాలజీ (88,141 పోస్టింగ్‌లు) సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఇటరేటివ్ విధానాలకు ఉన్న ప్రాధాన్యతను హైలైట్ చేస్తుంది.ఈ డిమాండ్ విస్తరణ టెక్ దిగ్గజ కంపెనీల నుండి స్టార్టప్‌ల వరకు వివిధ రంగాలలో అవకాశాలను సృష్టిస్తోంది. "కంపెనీలు AIని సమగ్రపరచడానికి పోటీపడుతున్నాయి, దీనికి నైపుణ్యం కలిగిన నిపుణులు అవసరం," అని సిలికాన్ వ్యాలీలో టెక్ రిక్రూటర్ మార్క్ రివెరా అన్నారు. అయితే, ఈ వేగవంతమైన వృద్ధి నైపుణ్యాల అంతరాన్ని గురించి ఆందోళనలను లేవనెత్తింది. కొందరు నిపుణులు విద్యా సంస్థలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కరికులమ్‌ను సవరించాలని సూచిస్తున్నారు.ఏఐ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో డిమాండ్ ఉన్న ఈ స్కిల్స్‌లో నైపుణ్యం కలిగిన ఉద్యోగార్థులు ఏఐ జాబ్ బూమ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి పైథాన్, డేటా సైన్స్‌లో నైపుణ్యం సాధించడం ఏఐలో లాభదాయకమైన కెరీర్‌కు కీలకంగా మారవచ్చు. -
హెచ్‌పీ నుంచి 9 కొత్త ఏఐ ల్యాప్‌టాప్‌లు
న్యూఢిల్లీ: కృత్రిమ మేథకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కంప్యూటర్స్ తయారీ దిగ్గజం హెచ్‌పీ తాజాగా తొమ్మిది ల్యాప్‌టాప్ మోడల్స్‌ను ఆవిష్కరించింది. వీటి ధర రూ. 78,999 (16 అంగుళాల హెచ్‌పీ ఆమ్నిబుక్5 నుంచి రూ. 1.86 లక్షల వరకు (హెచ్‌పీ ఆమ్నిబుక్ అల్ట్రా 14 అంగుళాలు) ఉంటుంది.మరోవైపు, భారత్‌లో తమ ఉత్పత్తుల తయారీని 2031 నాటికి రెట్టింపు చేసుకునే యోచనలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. దీనితో భారత్‌లో విక్రయించే ప్రతి మూడు హెచ్‌పీ పీసీల్లో ఒకటి ఇక్కడ తయారు చేసినదే ఉంటుందని సంస్థ భారత విభాగం సీనియర్ డైరెక్టర్ వినీత్ గెహానీ తెలిపారు.2025లో భారత్‌లో తాము విక్రయించే మొత్తం పీసీల్లో 13 శాతం దేశీయంగా ఉత్పత్తి చేసినవే ఉంటాయని వివరించారు. 2024లో దేశీ పీసీ మార్కెట్లో 30.1 శాతం వాటాతో హెచ్‌పీ అగ్రస్థానంలో నిల్చింది. కంపెనీ తమ ల్యాప్‌టాప్‌ల కోసం ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల కంపెనీలు డిక్సన్, వీవీడీఎన్తో జట్టు కట్టింది. -
వాట్సప్ యూజర్లే లక్ష్యంగా కొత్త మోసం!
దేశంలోని వాట్సప్ వినియోగదారులపై ‘ఫ్యాట్ బాయ్ పానెల్’ అనే కొత్త మాల్వేర్ దాడి చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది 2.5 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ పరికరాలను ప్రమాదంలోకి నెడుతోందని చెబుతున్నారు. వాట్సప్‌లో షేర్ అయ్యే ఫేక్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా యూజర్ల బ్యాంక్ అకౌంట్ల నుంచి నేరుగా డబ్బులు దొంగిలించేందుకు ఈ మాల్వేర్ను రూపొందించినట్లు తెలిపారు. దీన్ని గతంలో కంటే అధునాతన సైబర్ మోసంగా నిపుణులు చెబుతున్నారు. ఇది భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలను పోలి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.మోసం చేశారిలా..తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, ధారశివ్ అనే ప్రాంతానికి చెందిన 44 ఏళ్ల డెయిరీ వ్యాపారికి బ్యాంకు అధికారిగా నటిస్తూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే బ్యాంక్ యాప్‌ను అప్డేట్ చేయకపోతే ఆ వ్యక్తి అకౌంట్ బ్లాక్ అవుతుందని పేర్కొన్నాడు. భయాందోళనకు గురైన ఆ వ్యక్తి వాట్సప్ ద్వారా పంపిన బ్యాంకింగ్ యాప్ లింక్‌ను ఇన్స్టాల్ చేయడానికి అనుమతించాడు. దీన్ని ఇన్స్టాల్ చేసిన కొద్ది నిమిషాల్లోనే 26 అనధికారిక లావాదేవీల నుంచి అకౌంట్ బ్యాలెన్స్ దొంగలించారు. అయితే మోసగాళ్లు వాట్సప్‌లో పంపుతున్న లింక్‌లో ఫ్యాట్ బాయ్ పానెల్ ఉందని నిపుణులు చెబుతున్నారు.ఫ్యాట్ బాయ్ పానెల్ అంటే ఏమిటి?సైబర్ సెక్యూరిటీ సంస్థ జింపిరియం తెలిపిన వివరాల ప్రకారం ఫ్యాట్ బాయ్ ప్యానెల్ అనేది మొబైల్ ఫస్ట్ బ్యాంకింగ్ ట్రోజన్‌గా పని చేస్తుంది. ఇది దాదాపు 900 నకిలీ యాప్‌లలో దాగి ఉందని కనుగొన్నారు. ఎక్కువగా ఏపీకే ఫైల్స్ ద్వారానే ఇది వ్యాపిస్తుంది. గూగుల్ అధికారిక ప్లే స్టోర్‌లో కాకుండా నేరుగా ప్రత్యేక ఫైల్ ద్వారానే దీన్ని ఇన్స్టాల్ చేయిస్తారు. దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మాల్వేర్ గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను నిలిపివేస్తుంది. ఎస్ఎంఎస్లను సొంతంగా చదవడానికి అనుమతిని పొందుతుంది. ఓటీపీలను (వన్-టైమ్ పాస్ వర్ట్‌లు) అడ్డుకుంటుంది. దాంతో యూజర్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బును ఇతర ఖాతాల్లోకి బదిలీ చేయడానికి వీలవుతుంది.ఎందుకు అంత ప్రమాదకరం?తక్కువ స్థాయిలో పనిచేసే పాత మాల్వేర్ మాదిరిగా కాకుండా ఫ్యాట్ బాయ్ ప్యానెల్ చాలా సమన్వయంతో ఉంటుంది.. ఇది సెంట్రల్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పని చేస్తుంది. ఈ మాల్వేర్ బహుళ వెర్షన్లను ఏక కాలంలో నిర్వహిస్తుంది. దీన్ని కట్టడి చేయడం కష్టతరం. ఇది ఇప్పటికే 25 మిలియన్లకు పైగా పరికరాల నుంచి డేటాను సేకరించిందని జింపిరియం చీఫ్ సైంటిస్ట్ తెలిపారు. ఇది నిరంతరం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. సాంప్రదాయ భద్రతా సాధనాలతో దీన్ని గుర్తించడం కష్టమని తెలిపారు.ఇదీ చదవండి: రిటైర్ అవుతున్నారా? రూ.5 కోట్లు సరిపోవు!ఎలా రక్షించుకోవాలి?యాప్‌లను ప్లేస్టోర్ నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా డౌన్లోడ్ చేయవద్దు.అధికారిక గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవాలి.ఆటోమేటిక్ స్కానింగ్ కోసం గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఎనేబుల్ చేసుకోవాలి.రియల్ టైమ్ ప్రొటెక్షన్‌తో కూడిన లైసెన్స్ వర్షన్ మొబైల్ సెక్యూరిటీ యాప్‌ను ఉపయోగించాలి.ముఖ్యంగా వాట్సప్‌లో తెలియని లింక్‌ను క్లిక్ చేయకూడదు.అప్లికేషన్ పర్మిషన్లను జాగ్రత్తగా సమీక్షించాలి.పూర్తిగా అవసరమైతే తప్ప ఎస్ఎంఎస్ లేదా కాల్ యాక్సెస్ ఓకే చేయవద్దు. -
జియో స్టోర్స్‌ల్లో స్టార్‌లింక్ హార్డ్‌వేర్
భారతదేశపు ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా ఉన్న తన రిటైల్ అవుట్లెట్లలో స్టార్‌లింక్ హార్డ్‌వేర్‌ను అందించడానికి స్పేస్ఎక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. శాటిలైట్ ఇంటర్నెట్ పరికరాలను మరింత సులువుగా వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇది దేశంలోని డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కీలకంగా మారనుందని చెప్పింది. అయితే, స్పేస్ఎక్స్ దేశంలో తన కార్యకలాపాలు నిర్వహించేందుకు రెగ్యులేటరీ అనుమతులను పొందాల్సి ఉంది.రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ ఆర్థిక పనితీరును, భవిష్యత్తు ప్రణాళికలను హైలైట్ చేసింది. జియో విస్తృతమైన స్థానిక ఉనికిని, స్టార్‌లింక్ అత్యాధునిక లో-ఎర్త్-ఆర్బిట్ శాటిలైట్ టెక్నాలజీతో కలపడం ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్ సర్వీసులు అందించవచ్చని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి. స్టార్‌లింక్ పరికరాల ఇన్స్టలేషన్, యాక్టివేషన్ కోసం ప్రత్యేకమైన కస్టమర్ సర్వీస్ మెకానిజంను ఏర్పాటు చేయడం, వినియోగదారులకు అంతరాయం లేని సర్వీసులు అందించడం ఈ సహకారంలో భాగం. ఇది అందుబాటులోకి వస్తే స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు జియో ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్‌లైన జియో ఫైబర్, జియోఎయిర్ ఫైబర్లకు అనుబంధంగా ఉంటాయో లేదో తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: అవి ‘అల్లం’.. ఇవి ‘బెల్లం’!జియో ప్రస్తుత చర్యలు దేశంలో డిజిటల్ అంతరాన్ని పూడ్చడానికి ఎంతో తోడ్పడుతాయని కంపెనీ నమ్ముతుంది. స్టార్‌లింక్ అధునాతన ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా రిమోట్ ఏరియాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం, ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి 2025 నాటికి రిలయన్స్ జియో 48.8 కోట్లకు పైగా చందాదారులను కలిగి ఉంది. ఇందులో 19.1 కోట్లు ట్రూ 5జీ వినియోగదారులు ఉన్నారు. -
స్టెగానోగ్రఫీ.. అలా చేస్తే లక్షలు మాయం అవుతాయి!
రవికి ఒకరోజు గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ తరువాత ఎస్.ఎం.ఎస్. వచ్చింది. ‘ఫలానా వ్యక్తి మీకు తెలుసా?’ అని. మొదట్లో రవి పట్టించుకోలేదు. పదేపదే ఫోన్ కాల్స్ రావడంతో ‘ఎవరీ వ్యక్తి?’ అని తెలుసుకోవడానికి ఆ ఫోటోను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ ఒక్క క్లిక్‌తో హ్యాకర్లు అతడి ఫోన్లోకి చొరబడగలిగారు. నిమిషాల వ్యవధిలోనే రవి బ్యాంకు ఖాతా నుంచి రెండు లక్షలు మాయమయ్యాయి.ఈ స్మార్ట్ స్కామ్‌ను ‘స్టెగానోగ్రఫీ’ అంటారు,స్టెగానోగ్రఫీ (steganography) అనేది గ్రీకుపదం. దీని అర్థం ‘రహస్య రచన’ ‘దాచిన రచన’ హాని చేయని మీడియా ఫైళ్లలో మాల్వేర్ లేదా సీక్రెట్ ఇన్స్ట్రక్షన్ పొందుపరచడమే ‘స్టెగానోగ్రఫీ’ టెక్నిక్. ఈ హిడెన్ ప్లేలోడ్లు ట్రెడిషనల్ డిటెక్షన్ సిస్టమ్ కంటపడకుండా తప్పించుకుంటాయి. ‘ఇది కొత్త కాన్సెప్ట్ కాదు. 2017లో హ్యాకర్లు వాట్సాప్‌లో షేర్ చేసిన జిఫ్ ఫైల్స్‌లో హానికరమైన కోడ్స్ పొందుపరిచారు. డౌన్లోడ్ చేసినప్పుడు హిడెన్ కోడ్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంది. సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను దాటవేసి, యూజర్ డేటాను యాక్సెస్ చేస్తుంది. ఇది జరగకుండా చర్యలు తీసుకున్నప్పటికీ సరికొత్త మార్పులతో 2019లో స్టెగానోగ్రఫీ తిరిగి వచ్చింది’ అంటున్నాడు సైబర్ ఎక్స్పర్ట్ తుషార్శర్మ. సంప్రదాయ మాల్వేర్ అటెంప్ట్స్‌కు ‘స్టెగానోగ్రఫీ’ ఏ రకంగా భిన్నమైనది? ఎంతమాత్రం అనుమానానికి తావు ఇవ్వని రీతిలో ఇన్నోసెంట్ ఫైల్స్‌లో కోడ్‌ను దాచిపెడతారు, ‘ఈ ఇమేజ్‌లు, ఆడియో ఫైల్స్ ప్రమాదకరమేమీ కాదు అనిపిస్తాయి. అందుకే అవి తరచు యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను దాటవేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) ఆధారిత ఇమేజ్ రికగ్నిషన్ వంటి ఆధునాతన సాధనాలను కూడా స్టెగానోగ్రఫీ మోసం చేయగలదు’ అంటున్నారు నిపుణులుమరి దీనికి పరిష్కారం లేదా?‘స్టెగానోగ్రఫీని గుర్తించడానికి ఫోరెన్సిక్ సాధనాలు, స్టెగానాలిసిస్ ప్లాట్‌ఫామ్‌ల అవసరం ఉంది’ అంటున్నారు సైబర్ నిపుణులు.కొన్ని జాగ్రత్తలు→ అపరిచిత నంబర్స్ నుంచి వచ్చిన ఫైల్స్‌ను ఓపెన్, డౌన్లోడ్ చేయవద్దు → ఫోన్‌ను అప్డేట్ చేస్తూ ఉండాలి → ఆటో డౌన్‌లోడ్‌ను డిజేబుల్ చేయండి. వాట్సాప్ సెట్టింగ్‌ను మార్చడం ద్వారా అన్నోన్ మీడియా ఆటోమేటిక్‌గా సేవ్ కాకుండా నిరోధించవచ్చు. → ఓటీపీలను ఎప్పుడూ షేర్ చేయవద్దు → ‘మై కాంటాక్ట్స్’ గ్రూప్ పర్మిషన్ సెట్ చేయండి. అనుమానాస్పద గ్రూప్‌లను దూరం పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది → వాట్సాప్‌లో ‘సైలెన్స్’ అన్నోన్ కాలర్స్’ ఫీచర్‌ను యాక్టివేట్ చేయండి . -
కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించిన టీసీఎస్
దేశ డిజిటల్ వృద్ధిని మరింత బలోపేతం చేసేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మూడు కొత్త సాంకేతిక సర్వీసులను ఆవిష్కరించింది. న్యూఢిల్లీలో జరిగిన ‘యాక్సిలరేటింగ్ ఇండియా’ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఈ సేవలు దేశ అవసరాలకు అనుగుణంగా రూపొందించామని కంపెనీ తెలిపింది. ఈ సర్వీసులు డేటా భద్రత, స్థిరత్వంతో పాటు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఆవిష్కరణలను వేగవంతం చేస్తాయని పేర్కొంది.టీసీఎస్ సావరిన్‌సెక్యూర్ క్లౌడ్: దేశంలోని పబ్లిక్ సెక్టర్ కంపెనీలకు ఈ క్లౌడ్ ఏఐ సామర్థ్యాలను అందిస్తుంది. ముంబై, హైదరాబాద్‌లోని టీసీఎస్ డేటా సెంటర్లలో నిర్వహించబడే ఈ క్లౌడ్ డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం 2023కు అనుగుణంగా ఉంటుంది. 2030 నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యంతో ఈ క్లౌడ్ తక్కువ లెటెన్సీతో కీలక అప్లికేషన్లకు అవకాశం కల్పిస్తుంది. ఏఐ ఆధారిత డేటా విశ్లేషణలు, నిరంతర భద్రతా పరీక్షలతో పౌర సేవలను మెరుగుపరుస్తూ, డేటా ఆధారిత నిర్ణయాలను వేగవంతం చేస్తుంది.టీసీఎస్ డిజిబోల్ట్: ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్ డిజిబోల్ట్ డిజిటల్ ప్రక్రియలను ఆటోమేషన్ చేసి సంస్థలు తమ ఆవిష్కరణలను వేగంగా అమలు చేయడానికి వీలు కల్పిస్తుంది.టీసీఎస్ సైబర్ డిఫెన్స్ సూట్: ఈ ఏఐ ఆధారిత సైబర్‌సెక్యూరిటీ సర్వీసు భారత సంస్థలకు అధునాతన రక్షణను అందిస్తుంది. సైబర్ బెదిరింపులను ముందస్తుగా గుర్తించి, ఆటోమేటెడ్ రెస్పాన్స్‌తో స్పందిస్తూ, హైబ్రిడ్ మల్టీ క్లౌడ్, ఐటీ సదుపాయాలకు రక్షణ కల్పిస్తుంది. 16,000 మంది సైబర్‌సెక్యూరిటీ నిపుణులతో టీసీఎస్ దేశంలో సైబర్ రక్షణను బలోపేతం చేస్తోంది.ఇదీ చదవండి: ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?ఈ సందర్భంగా టీసీఎస్ ప్రెసిడెంట్ గిరీష్ రామచంద్రన్ మాట్లాడుతూ..‘దేశంలోని వివిధ సంస్థలు ఉపయోగిస్తున్న డేటాకు ఏఐ టూల్స్‌తో భద్రత కల్పిస్తున్నాం. ఈ సర్వీసులు భారత అవసరాలకు అనుగుణంగా రూపొందించాం. దేశ ఆస్తులను రక్షిస్తూ, ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నాం’ అని తెలిపారు. కార్యక్రమంలో టీసీఎస్ సీఈవో కె.కృతివాసన్‌తోపాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల అధికారులు పాల్గొన్నారు. -
కొత్త ఫీచర్‌తో వాట్సప్ గ్రూప్ కంటెంట్‌కు మరింత భద్రత
వినియోగదారులు తమ సందేశాలు, మీడియా ఫైల్స్‌పై మరింత నియంత్రణను కల్పించేందుకు ప్రముఖ ఆన్లైన్ చాటింగ్ యాప్ వాట్సాప్ అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఇతరులు తమ చాట్‌లోని సందేశాలను, మీడియా ఫైల్స్‌ను ఎక్స్పోర్ట్ చేయకుండా, ఆటో డౌన్ లోడ్ చేయకుండా, ఏఐ సంబంధిత సాధనాల కోసం సందేశాలను ఉపయోగించకుండా నిరోధిస్తుంది.ఇదీ చదవండి: బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!గోప్యతకు అత్యంత ప్రాముఖ్యతనిస్తూ వినియోగదారుల అవసరాల కోసం ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. గ్రూప్ మేసేజ్‌లకు మరింత భద్రత కల్పించేందుకు ఇది ఎంతో తోడ్పడుతుందని పేర్కొంది. చాట్ సెట్టింగ్స్‌లో ‘అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ’ ఆప్షన్ ద్వారా దీన్ని మాన్యువల్‌గా ఎనేబుల్ చేయవచ్చు. ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత చాట్‌లో పాల్గొనే వారందరికీ పరిమితులు వర్తిస్తాయి. గ్రూప్‌లోని కంటెంట్ వాట్సాప్‌లోనే ఉండేలా చూసుకుంటుంది. -
టెక్ దిగ్గజంలో తొలగింపులు.. 20 వేల మందికిపైనే!
టెక్ పరిశ్రమలో అనిశ్చితులు ఇప్పట్లో కుదటపడేలా కనిపించడం లేదు. టాప్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్ భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. తమ వర్క్ ఫోర్స్‌లో 20 శాతానికి పైగా తొలగించాలని యోచిస్తోన్న ఇంటెల్ ఈ వారంలోనే లేఆఫ్‌లను ప్రకటించబోతోంది.గత మార్చిలో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన లిప్-బు తాన్ నాయకత్వంలో ఇంటెల్ కంపెనీ ఈ వారం 20,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను ప్రకటించనుందని నివేదికలు సూచిస్తున్నాయి. 2024లో 19 బిలియన్ డాలర్ల నష్టంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇంటెల్, ఈ కోతలతో అధికారిక వ్యవస్థను తగ్గించి, నిర్వహణను సరళీకరించి, ఇంజనీరింగ్-ఆధారిత సంస్కృతిని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదే మొదటిసారి కాదు...ఇంటెల్ తన పరిస్థితిని మెరుగుపరచుకునేందుకు ఉద్యోగాల కోతలను చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. 2024 ఆగస్టులో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో కంపెనీ మొత్తం సంఖ్య 1,08,900కు చేరింది. అంతకుముందు సంవత్సరం 2023లో ఇంటెల్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 124,800 ఉండేది.రోజుకు 450 మంది తొలగింపు2025లో 257 టెక్ కంపెనీలు రోజుకు సగటున 450 మంది చొప్పున 50,372 మంది ఉద్యోగులను తొలగించాయని లేఆఫ్స్.ఎఫ్‌వైఐ తెలిపింది. 2024లో 1,115 కంపెనీల్లో 2,38,461 మంది ఉద్యోగులు తొలగింపునకు గురయ్యారు. ఇంటెల్ మాత్రమే కాకుండా గూగుల్ 2025 ఏప్రిల్‌లో తన ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైజెస్ యూనిట్ (ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్)లో వందలాది మందిని తొలగించింది. అంతకు ముందు క్లౌడ్, హెచ్ఆర్ విభాగాల ఉద్యోగుల సంఖ్యలో కోత విధించింది.మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా వచ్చే మే నెలలో తొలగింపులకు సిద్ధమవుతోంది. ఇంజనీర్-టు-మేనేజర్ నిష్పత్తులను పెంచడానికి మిడిల్ మేనేజర్లు, తక్కువ పనితీరు కనబరిచేవారిని లక్ష్యంగా చేసుకుని, ముఖ్యంగా దాని భద్రతా విభాగంలో ఈ తొలగింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా 2025 ఫిబ్రవరిలో 3,600 మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాలను క్రమబద్ధీకరించడానికి పనితీరు ఆధారిత తొలగింపులపై దృష్టి సారించింది. -
అదానీ నుంచి ఎయిర్‌టెల్‌కు స్పెక్ట్రమ్
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్‌తో కలిసి అదానీ డేటా నెట్వర్క్స్(ఏడీఎన్ఎల్) నుంచి 400 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వినియోగ హక్కులను కొనుగోలు చేయనున్నట్లు మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ పేర్కొంది. 2022లో నిర్వహించిన వేలం ద్వారా 26 గిగాహెట్జ్ బ్యాండ్‌లో 400 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ సంస్థ ఏడీఎన్ఎల్ సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 212 కోట్లు వెచ్చించింది.కాగా.. ఈ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునేందుకు వీలుగా ఏడీఎన్ఎల్తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఎయిర్టెల్ పేర్కొంది. దీనిలో భాగంగా గుజరాత్(100 ఎంహెచ్‌జెడ్), ముంబై(100 ఎంహెచ్‌జెడ్), ఆంధ్రప్రదేశ్(50 ఎంహెచ్‌జెడ్), రాజస్తాన్(50 ఎంహెచ్‌జెడ్), కర్ణాటక(50 ఎంహెచ్‌జెడ్), తమిళనాడు(100 ఎంహెచ్‌జెడ్)లో స్పెక్ట్రమ్‌ను వినియోగించుకోనున్నట్లు తెలియజేసింది. -
కొత్త కస్టమర్లు ఎయిర్‌టెల్‌కే ఎక్కువ!
దేశీయంగా టెలికం యూజర్ల సంఖ్య జనవరిలో స్వల్పంగా పెరిగి 119 కోట్లకు చేరింది. వైర్‌లైన్, మొబైల్ సెగ్మెంట్లలో కొత్త సబ్‌స్క్రయిబర్స్‌ను దక్కించుకోవడంలో ఎయిర్టెల్ అగ్రస్థానంలో నిల్చింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.వీటి ప్రకారం గతేడాది డిసెంబర్లో 118.99 కోట్లుగా ఉన్న టెలికాం సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య జనవరిలో 119.20 కోట్లకు పెరిగింది. మొబైల్, వైర్‌లైన్ సెగ్మెంట్లో ఎయిర్టెల్ యూజర్లు వరుసగా 16.53 లక్షలు, 1.17 లక్షల మేర పెరిగారు. 5జీ ఫిక్సిడ్ వైర్లెస్ యాక్సెస్‌ను వైర్లెస్ సర్వీసుగా ట్రాయ్ వర్గీకరించింది. ప్రస్తుతం ఈ విభాగంలో 48.44 లక్షల యూజర్లతో రిలయన్స్ జియో అగ్రస్థానంలో, 8.72 లక్షల సబ్‌స్క్రయిబర్స్‌తో ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉన్నాయి.మరిన్ని ముఖ్యంశాలు.. » మొబైల్ సెగ్మెంట్లో జియో 46.5 కోట్ల యూజర్లతో నంబర్‌వన్‌గా, 38.69 కోట్ల మందితో ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా 13 లక్షల కనెక్షన్లను, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ 3.69 లక్షలు, ఎంటీఎన్ఎల్ 2,617 మంది కస్టమర్లను కోల్పోయాయి.» వైర్‌లైన్ విభాగంలో బీఎస్ఎన్ఎల్ 39,953, ఎంటీఎన్ఎల్ 9,904, క్వాడ్రాంట్ 4,741, వొడాఫోన్ ఐడియా 3,447 మంది కస్టమర్లను పోగొట్టుకున్నాయి. » జియో, ఎయిర్టెల్ నిర్దేశిత ఫార్మాట్లో డిసెంబర్, జనవరి డేటాను సమర్పించకపోవడంతో ట్రాయ్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల వివరాలను అప్డేట్ చేయలేదు. -
స్మార్ట్ఫోన్లు, పీసీల తయారీ కేంద్రంగా భారత్
ముంబై: అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం భారత్‌కు అనూకూలంగా మారుతోంది. అంతర్జాతీయ స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌ట్యాబ్‌లు/వ్యక్తిగత కంప్యూటర్ (పీసీలు) సంస్థలు తమ ఉత్పత్తి కర్మాగారాలను చైనా నుంచి భారత్‌కు తరలించే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాయి. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం అగ్రరాజ్యల మధ్య సుంకాల విధింపులు, ప్రతీకార టారిఫ్‌ల ఉద్రికత్తలు కొనసాగితే.., అంతర్జాతీయ స్మార్ట్ఫోన్ల మొత్తం ఉత్పత్తిలో డ్రాగన్ దేశపు వాటా 2026 నాటికి 55 శాతానికి పడిపోయే వీలుంది. గత సంవత్సరం(2024) ఈ వాటా 64 శాతంగా ఉంది. ఇదే సమయంలో భారత్ నుంచి ముఖ్యంగా అమెరికాకు యాపిల్, శాంసంగ్ ఎగుమతులు జోరందుకోనున్నాయి. అంతర్జాతీయ స్మార్ట్ఫోన్ల మొత్తం ఉత్పత్తిలో భారత్ వాటా 2026 నాటికి 25–28 శాతానికి చేరొవచ్చు. కాగా గత సంవత్సరంలో ఈ వాటా 18 శాతంగా ఉంది. → అంతర్జాతీయంగా ఐఫోన్ల ఉత్పత్తి విలువలో భారత్ ఎగుమతుల వాటా ప్రస్తుతం 20 శాతంగా ఉంది. ఇది 2025–26 కల్లా 25 శాతానికి, 2026–27 నాటికి 35 శాతానికి చేరుతుందని కౌంటర్‌పాయింట్ అంచనా వేస్తోంది. → ల్యాప్‌ట్యాబ్‌లు/ పీసీల మొత్తం తయారీలో చైనా వాటా 2026 నాటికి 68–70 శాతానికి దిగివచ్చే అవకాశం ఉంది. 2024లో ఈ వాటా 75 శాతంగా ఉంది. అంతర్జాతీయ ల్యాప్‌ట్యాబ్‌ల ఉత్పత్తిలో భారత్ వాటా 2026 నాటికి ఏడు శాతానికి చేరుకోవచ్చు. 2024లో భారత్ వాటా కేవలం నాలుగు శాతంగా ఉంది. ‘‘ల్యాప్‌ట్యాబ్‌లు, పీపీలు చైనా నుంచే అధికంగా దిగుమతి అవుతున్నాయి. వాణిజ్య వార్ నేపథ్యంలో హెచ్‌పీ, డెల్ ఇతర సంస్థలు తమ ఉత్పత్తి స్థావరాలు చైనా నుంచి భారత్‌కు మారిస్తే అంతర్జాతీయంగా దేశీయ మార్కెట్ వాటా పెరగడమే కాకుండా ఎగుమతులు సైతం గణనీయంగా పెరుగుతాయి. భారత్ సైతం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఐటీ హార్డ్‌వేర్ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం ‘మేక్ ఇన్ ఇండియా’ ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం’ వంటి పథకాలు ప్రవేశపెట్టింది’’ అని ఇండియన్ సెల్యూలర్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) సభ్యుడొకరు తెలిపారు. అంత సులువేం కాదు: చైనా నుంచి తయారీ కర్మాగారాలను భారత్‌కు తరలించడం అంత సులువు కాదని కాన్లేస్ నివేదిక చెబుతోంది. డెల్ సంస్థ ల్యాప్‌ట్యాబ్‌ల ఉత్పత్తి 79% చైనాలో ఉండగా, మిగిలినదంతా వియత్నాంలో ఉంది. కాన్లేస్ రిపోర్ట్ ప్రకారం 2026 నాటికి డెల్ తన తయారీ సామర్థ్యాన్ని సగానికిపైగా వియత్నాంకు తరలించనుంది. లెనివో సైతం వియత్నాంను ప్రత్యమ్నాయ దేశంగా చూస్తోంది. చైనాలో 85% తయారీ సామర్థ్యం ఉన్న హెచ్‌పీ.. 2026 కల్లా మెక్సికో, తైవాన్ దేశాలకు 45% మార్చనుంది. -
ఒప్పో కొత్త ఫోన్.. గంటలోపే ఫుల్ చార్జింగ్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో తన సరికొత్త ఒప్పో కే13 5G (Oppo K13 5G) స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. రూ. 20,000 సెగ్మెంట్లోనే స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్సెట్, భారీ 7000mAh బ్యాటరీ ఫీచర్లతో ఈ స్మార్ట్ వచ్చింది. దీని ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు ఇక్కడ చూద్దాం.ఉన్నాయి.ధర.. 8GB RAM + 128GB స్టోరేజ్: రూ.17,9998GB RAM + 256GB స్టోరేజ్: రూ.19,999లాంచ్ ఆఫర్: లాంచ్ రోజున, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లతో రూ.1,000 తక్షణ డిస్కౌంట్ లేదా రూ.1,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంది. ఫలితంగా ధరలు రూ.16,999, రూ.18,999కి తగ్గుతాయి. 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది.లభ్యత: 2025 ఏప్రిల్ 25 నుండి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఈ-స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఐసీ పర్పుల్, ప్రిజం బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్లు లభ్యమవుతాయి.స్పెసిఫికేషన్లు, ఫీచర్లుడిస్ప్లే: 6.67-ఇంచ్ ఫుల్ HD+ (2400x1080 పిక్సెల్స్) AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ప్రాసెసర్: 4nm క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ఆక్టా-కోర్ (2.3GHz వరకు), అడ్రినో 810 GPUతో, స్నాప్‌డ్రాగన్ ఎలైట్ గేమింగ్ ఫీచర్లుఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15, 2 సంవత్సరాల OS అప్డేట్స్. 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్.కెమెరా: వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా.బ్యాటరీ: 7000mAh గ్రాఫైట్ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ (30 నిమిషాల్లో 62%, గంటలోపే పూర్తి ఛార్జ్) -
కొత్త ఏటీఎమ్.. ఇలా బంగారం వేస్తే అలా డబ్బులొస్తాయ్..
ఏటీఎం గురించి తెలుసా? అని ఎవరినైనా అడిగితే.. అదెందుకు తెలియదు మాకు తెలుసు అనే చాలామంది చెబుతారు. అయితే గోల్డ్ ఏటీఎం గురించి తెలుసా? అని అడిగితే.. అడిగిన వాళ్లనే అనుమానంగా చూస్తారు. బహుశా మీ అనుమానం కరెక్టే కావచ్చు, కానీ అలాంటి ఏటీఎం కూడా ఒకటి వచ్చేసింది. దాని గురించి తెలుసుకోవాలంటే, ఈ కథనం చదివేయాల్సిందే..చైనాలోని షాంఘైలో బంగారాన్ని కరిగించి, దానికి తగిన డబ్బును అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసే ఏటీఎం మెషిన్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో గోల్డ్ వేస్తే.. దాని బరువును, నాణ్యతను బట్టి.. ఆ రోజు మార్కెట్ విలువను బట్టి వినియోగదారుడి బ్యాంక్ ఖాతాకు డబ్బును జమ చేస్తుంది. ఇదంతా కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగిపోతుంది. ఈ మెషిన్ బంగారాన్ని 1,200 డిగ్రీల సెల్సియస్ వద్ద కరిగిస్తుంది తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఇదీ చదవండి: దిగ్గజ బ్యాంక్ కీలక నిర్ణయం.. మారిన ఏటీఎం ఛార్జీలువీడియోలో గమనించినట్లయితే.. ఒక మహిళ బంగారాన్ని ఏటీఎం మెషిన్లో వేసిన తరువాత, ఆ రోజు ధరలను లెక్కగట్టి, బంగారంకు విలువకు తగిన డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇదే ప్రపంచంలోని మొట్ట మొదటి గోల్డ్ ఏటీఎం మెషిన్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. టెక్నాలజీకి ఫిదా అయిపోతున్నారు.This gold ATM in China melts your gold and transfers the money to your bank accountpic.twitter.com/vCmS09eRYG— Learn Something (@cooltechtipz) April 20, 2025 -
మూడ్‌కు తగ్గట్టు మ్యూజిక్ వినిపించే స్మార్ట్ లైట్
ఈ ఫొటోలో కనిపిస్తున్న సీలింగ్ లైట్ కేవలం ప్రకాశవంతమైన వెలుగు కోసం మాత్రమే పరిమితమైన లైట్ కాదు. ఎప్పటికప్పుడు మీ మూడ్‌కు తగ్గట్టు సంగీతంతోపాటు, రంగు రంగుల లైట్లతో ఇంటిని పార్టీ థీమ్‌లోకి తీసుకొని వెళ్లగలిగే స్మార్ట్ లైట్.రీచార్జబుల్ బ్యాటరీతోనూ పనిచేస్తుంది. కాబట్టి, మధ్యలో కరెంట్ పోయినా కూడా పార్టీకి అంతరాయం ఏర్పడదు. మొబైల్ యాప్, గూగుల్ హోమ్, అమెజాన్ అలెక్సాతో అనుసంధానం చేసుకొని వాడుకోవచ్చు. ధర 139 డాలర్లు (రూ. 11,995). -
కొత్తరకం ఫ్యాన్లు: ధరలు ఎలా ఉన్నాయంటే?
టెక్నాలజీ పెరుగుతోంది. మనం రోజూ చూస్తున్న వస్తువుల్లో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇస్మార్ట్ క్రిస్టల్ షాండ్లియర్ ఫ్యాన్, కేబుల్ ఫ్యాన్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..షాండ్లియర్ అందించే చల్లగాలిఇంటి సీలింగ్‌కు షాండ్లియర్‌తో అలంకరిస్తే చూడటానికి భలే బాగుంటుంది. కాని, షాండ్లియర్‌ను తగిలిస్తే, ఆ చుట్టు పక్కల ఫ్యాన్ అమర్చుకోలేం. ఇప్పుడు ఈ సమస్యను దూరం చేస్తోంది ఈ ‘ఇస్మార్ట్ క్రిస్టల్ షాండ్లియర్ ఫ్యాన్’. ఇది ఒకవైపు వెలుగులు వెదజల్లుతూనే, మరోవైపు నిశ్శబ్దంగా చల్లని గాలిని కూడా వీస్తుంది. రిమోట్ కంట్రోల్ ద్వారా లైట్, ఫ్యాన్ స్పీడ్‌ను కంట్రోల్ చేయొచ్చు. ధర 299 డాలర్లు (రూ. 25,664).ఇదీ చదవండి: ఒక ఫ్యాన్స్ మూడు లాభాలుకేబుల్ ఫ్యాన్ఇది అచ్చం డేటా కేబుల్లాంటి ఫ్యాన్. ఎక్కడికైనా సరే తీసుకెళ్లడానికి చాలా అనువుగా ఉంటుంది. యూఎస్బీ పోర్ట్ సాయంతో మొబైల్, అడాప్టర్, కంప్యూటర్ కేస్, ల్యాప్‌టాప్ ఇలా దేనికైనా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఫ్యాన్ తిరిగేటప్పుడు చల్లటి గాలితో పాటు, సమయం, ఉష్ణోగ్రతలను తెలిపే డిజిటల్ క్లాక్‌ను కూడా ఇది డిస్ప్లే చేస్తుంది. ధర కంపెనీ, క్వాలిటీ లపై ఆధారపడి ఉంటుంది. వివిధ కంపెనీల పేర్లతో ఆన్లైన్లో లభిస్తోంది. -
ఒకేసారి మూడు లాభాలు
సీలింగ్ ఫ్యాన్‌ను కూడా ఇప్పుడు బయటకు తీసుకెళ్లి వాడుకోవచ్చు. ఇది ఒక స్మార్ట్ పోర్టబుల్ ఫ్యాన్. పేరు ‘క్రోబాట్ స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్’. దీనికున్న ఈజీ డిటాచబుల్ రెక్కల సాయంతో ఎక్కడకు కావాలనుకుంటే అక్కడకు ఇట్టే తీసుకెళ్లవచ్చు.ఏదైనా ఎత్తైన హుక్కు తగిలించి.. సీలింగ్ ఫ్యాన్‌లా స్టాండ్‌కు బిగించి టేబుల్ ఫ్యాన్‌లా వాడుకోవచ్చు. అంతేకాదు, ఇందులో లైటింగ్ సిస్టమ్ ఉండటంతో ఇది ల్యాంప్గానూ పనిచేస్తుంది. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే దీనిని రిమోట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ధర రూ. 1,649 మాత్రమే! -
భూకంపం వస్తే ఏం చేయాలి?: చాట్‌జీపీటీ సమాధానం
చాట్‌జీపీటీ.. అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామంది వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. ఏ ప్రశ్నకైనా తనదైన రీతిలో సమాధానాలు ఇస్తూ.. యూజర్లను అబ్బురపరుస్తున్న ఏఐ చాట్‌బాట్, ఇప్పుడు భకంపం వస్తే ఏం చేయాలి అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఎలాంటి సమాధానం ఇచ్చిందో.. ఈ కథనంలో చూసేద్దాం.ఇంట్లో ఉన్నప్పుడు భూకంపం వస్తే..➤భూకంపం వచ్చినప్పుడు మీరు ఇంట్లోనే ఉంటే.. మోకాళ్లపై వంగి కూర్చున్న విధంగా ఉండండి. ఈ భంగిమలో ఉంటే.. మీరు కిందకు పడిపోకుండా ఉంటారు.➤తల, మెడ మాత్రమే కాకుండా.. వీలైనంత వరకు మీ శరీరాన్ని మొత్తం ఒక దృఢమైన టేబుల్ లేదా డెస్క్ కింద ఉండేలా చూసుకోండి. భూమి కంపించడం ఆగేవరకు అలాగే ఉండండి.➤కిటికీలు, గోడలకు దూరంగా ఉండండి. భయంతో పరుగులు పెట్టడం మంచిది కాదు.➤లిఫ్ట్ వంటి వాటిని ఉపయోగించవద్దు.బయట ఉన్నపుడు భూకంపం వస్తే..➤మీరు బయట ఉన్నప్పుడు భూకంపం వస్తే.. భవనాలు, యుటిలిటీ వైర్లు, సింక్ హోల్స్, ఫ్యూయెల్ స్టేషన్స్, గ్యాస్ లైన్స్ వంటి వాటికి దూరంగా ఉండండి.➤చెట్లు, టెలిఫోన్ స్తంభాలకు దగ్గరగా ఉండటం మంచిది కాదు.➤ఒకవేళా కారులో ప్రయాణిస్తుంటే.. వెంటనే ఒక సేఫ్ పార్కింగ్ ప్రదేశంలో కారును పార్క్ చేయండి.➤బ్రిడ్జ్, ఫ్లైఓవర్స్, సొంరంగాలు వంటి వాటికి దూరంగా ఉండండి.➤భూమి కంపించడం ఆగే వరకు.. పరుగులు పెట్టడం వంటివి చేయడం మంచిది కాదు.ఇదీ చదవండి: ఎండలో కారు చల్లగా ఉండాలంటే: ఇదిగో టాప్ 5 టిప్స్.. -
మనుషులతో.. మరమనుషుల రన్నింగ్ - వీడియో
టెక్నాలజీ వేగంగా పరుగులు పెడుతోంది.. దాదాపు అన్ని రంగాల్లోనూ రోబోల హవా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో చైనా మనుషులతో పోటీగా మారథాన్‌లో పరుగులు పెట్టే రోబోట్లను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింలో వైరల్ అవుతోంది.శనివారం (ఏప్రిల్ 19) చైనాలో నిర్వహించిన మారథాన్‌లో.. మనుషులతో పాటు రోబోలు పరుగులు పెట్టాయి. మనుషులతో.. మరమనుషులు పరుగులు పెట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మారథాన్‌లో పాల్గొన్న రోబోట్లను 20 కంటే ఎక్కువ కంపెనీలు అభివృద్ధి చేశాయి. రోబోట్లు మనుషులు మాదిరిగా కనిపించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది.ఏప్రిల్‌లో జరగనున్న మారథాన్ బీజింగ్‌లోని డాక్సింగ్ జిల్లాలో నిర్వహించనున్నట్లు, 21 కిమీ మేర డజన్ల కొద్దీ హ్యూమనాయిడ్ రోబోలు 12,000 మంది మానవ అథ్లెట్లతో పోటీపడతాయని.. ఈ ఏడాది ప్రారంభంలోనే ఓ వార్త వెల్లడైంది. ఆ విధంగానే మారథాన్ నిర్వహించారు.చైనా హ్యూమనాయిడ్ రోబోలను ఎందుకు అభివృద్ధి చేస్తోందిచైనాలో వృద్ధాప్య జనాభా పెరిగిపోవడంతో.. శ్రామిక శక్తి తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం జనాభాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఇతర దేశాలతో పోటీపడాలన్న.. ఆర్ధిక వృద్ధిని పెంచాలన్నా శ్రామిక శక్తి అవసరం. దీనిని భర్తీ చేయడానికి చైనా హ్యూమనాయిడ్ రోబోలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం.. చైనీస్ క్లయింట్లు 2023లో 2,76,288 రోబోట్లను ఇన్స్టాల్ చేసారు. దీన్ని బట్టి చూస్తే.. ప్రపంచంలో ఉన్న మొత్తం రోబోట్లలో చైనాలో ఉన్న రోబోట్లు 51 శాతం అని సమాచారం.The #Humanoid #Robot half-marathon in #Beijing kicked off an hour ago. #China is accelerating its dominance in the robotics and #AI race with unmatched strategic investments. While the world watches in awe, it’s clear that others including India have significant ground to cover.… pic.twitter.com/sgp42JEtGA— Rana. (@bladeit) April 19, 2025 -
ఫోన్ రీచార్జ్‌లకు జేబులు ఖాళీ!
ఫోన్ రీచార్జ్‌లకు వినియోగదారుల జేబులు ఖాళీ అయ్యే పరిస్థితులు త్వరలో రాబోతున్నాయి. దేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్లు అయిన భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా (విఐ) రానున్న డిసెంబర్ నాటికి తమ టారిఫ్‌లను 10-20% పెంచే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది.ఇది ఆరు సంవత్సరాలలో నాలుగో అతిపెద్ద టారిఫ్ పెంపు కానుంది. టెలికాం కంపెనీలు చివరిసారిగా 2024 జులైలో టారిఫ్‌లను పెంచాయి. 4G, 5G మౌలిక సదుపాయాలపై పెట్టిన పెట్టుబడులను రాబట్టుకునేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు 25 శాతం వరకూ టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచాయి.గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టీన్ విశ్లేషకుల ప్రకారం.. భారత్‌లో టెలికాం టారిఫ్‌లలో సుమారు 15% పెంపు ఉండే అవకాశం ఉంది. టెలికాం కంపెనీలు 10% టారిఫ్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సాధించడానికి టారిఫ్‌ల పెంపు దోహదపడనున్నది. ఇండియన్ టెలికాం మార్కెట్లో పోటీ తీవ్రత కారణంగా టారిఫ్‌లు గత కొన్ని సంవత్సరాలుగా తక్కువగా ఉన్నాయని, దీనిని సరిదిద్దేందుకు ఈ చర్య తీసుకోవాలని ఆపరేటర్లు భావిస్తున్నారు. అయితే టారఫ్‌ల పెంపు కారణంగా వినియోగదారులపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందని, దీని ప్రభావం వినియోగ శక్తి, మార్కెట్ డైనమిక్స్‌పైనా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.టెలికాం రంగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, భవిష్యత్ సాంకేతిక అవసరాల కోసం పెట్టుబడులను సమర్థించేందుకు టారిఫ్‌ల పెంపు అవసరమని టెలికాం ఆపరేటర్లు పేర్కొంటున్నారు. అయితే, ఈ నిర్ణయం ఖరారు కాకపోయినా, ఇది వినియోగదారుల మధ్య చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం రానున్న నెలల్లో టెలికాం ఆపరేటర్ల నుండి వెల్లడవుతుందని భావిస్తున్నారు. -
కోపైలట్ సలహాలు: తల్లిదండ్రులకు ఎన్నో ఉపయోగాలు!
టెక్నాలజీ వేగంగా పెరుగుతోంది. ప్రతి రంగంలోనూ ఊహకందని అద్భుతాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏఐ బేస్డ్ వర్చువల్ అసిస్టెంట్ 'కోపైలట్' (Copilot) తీసుకొచ్చింది. ఇది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, సృజనాత్మకమైన సూచనలను అందించడం, కోడింగ్ చేయడం, ఫోటోలను క్రియేట్ చేయడం వంటివెన్నో చేస్తోంది. మొత్తం మీద ప్రశ్న మీది.. సమాధానం నాది అన్నట్టుగా ఈ కోపైలట్ యూజర్లకు ఉపయోగపడుతోంది.ప్రతి ప్రశ్నకు సమాధానం అందించే.. కోపైలట్ ఈ వేసవిలో తల్లిదండ్రులకు ఎలా సహాయం చేస్తుంది. పిల్లలకు సంబంధించిన విషయాల్లో వాళ్లు తీసుకునే నిర్ణయాలకు ఎలాంటి తోడ్పాటును అందిస్తుందనే విషయాలను వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.➢బడికి సెలవులు వస్తున్నాయంటే.. తల్లిదండ్రులకు ఓ టెన్షన్ మొదలైపోతుంది. ఎందుకంటే.. పిల్లలు ఇల్లు పీకి పందిరేస్తారు. వారిని అదుపులో పెట్టడం కొంత కష్టమైన పనే. కానీ కొంత తెలివిగా ఆలోచిస్తే.. వారు బుద్ధిమంతుల్లా చెప్పినమాట వింటారు. మొబైల్ ఎక్కువగా చూడకుండా ఉండాలంటే.. పిల్లలకు ప్రత్యమ్నాయం ఉండాలి. కాబట్టి పిల్లలకు ఇష్టమైన, సులభమైన బొమ్మలు తయారు చేయడానికి, మంచి స్టోరీస్ కోసం 'కోపైలట్'ను ఉపయోగించుకోవచ్చు.➢పిల్లలు స్కూలుకు వెళ్ళిపోతే.. వారి షెడ్యూల్ అక్కడ వేరుగా ఉంటుంది. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు రోజంతా ఏం చేయాలో వారికి పాలుపోదు. తల్లిదండ్రులకు కూడా ఇదొక చిక్కు ప్రశ్నే. దీనికి కూడా కోపైలట్ సహాయం చేస్తుంది. రోజులో ఎంత సేపు ఆదుకోవాలి, ఎంతసేపు చదువుకోవాలి వంటి వాటికి తగ్గట్టు ఒక షెడ్యూల్ చేసి ఇవ్వడానికి కోపైలట్ హెల్ప్ తీసుకోవచ్చు.➢వేసవి సెలవుల్లో ఆటల్లో మునిగిపోయి.. పిల్లలు బడిలో నేర్చుకున్న విషయాలను మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి రీడింగ్ లిస్ట్, క్విజ్, కథలు చెప్పే థీమ్స్ వంటివి రూపొందించడంలో కోపైలట్ ఉపయోగపడుతుంది. వచ్చే విద్యాసంవత్సరానికి వెళ్లే విద్యార్థులను కూడా ఎలా సిద్ధం చేయాలనే బేసిక్స్ కూడా ముందుగానే కోపైలట్ ద్వారా తెలుసుకుని ఫాలో అవ్వొచ్చు.ఇదీ చదవండి: వాట్సప్ స్టేటస్‌కు పాట జోడింపు: ఎలాగో తెలుసా?➢సమ్మర్ అంటేనే.. చాలామంది అకేషన్స్ లేదా వెకేషన్లకు వెళ్లిపోతుంటారు. దాదాపు చాలామంది లాంగ్ ట్రిప్ వెళ్లాలని ముందుగానే ప్లాన్ వేసుకుంటారు. ఇలాంటి సమయంలో కూడా పిల్లలకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయడంలో, ప్యాకింగ్ చెక్‌లిస్ట్‌లు, విహారయాత్రకు ప్లాన్ చేయడానికి కోపైలట్ ఓ సలహాదారుడిగా ఉపయోగపడుతుంది. మీ ప్రశ్నకు తగిన విధంగా సమాధానాలు ఉంటాయి.కోపైలట్ అనేది టెక్నాలజీలో ఒక అద్భుతం. కాబట్టి అవసరానికి తగిన విధంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇందులో మంచి, చెడు రెండూ ఉండవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని అది ఇచ్చే సూచనలలో ఉపయోగకరమైన ఎంచుకోవాలి. ఇది మొత్తం యూజర్ మీదనే ఆధారపడి ఉంటుంది. -
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్
స్మార్ట్‌ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ.. దాదాపు వాట్సాప్ ఉపయోగిస్తుంటారు. ఈ యాప్ ఉచిత మెసేజింగ్ & వీడియో కాలింగ్ వంటి వాటికి అనుమతిస్తుంది. సంస్థ యూజర్ల భద్రత, సౌలబ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు రెండు కొత్త ఫీచర్స్ పరిచయం చేసింది.వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్స్ సాయంతో.. మీ స్టేటస్, లాస్ట్‌సీన్ ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు అనేది సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకోవడం వల్ల.. మీ వాట్సాప్ స్టేటస్, లాస్ట్‌సీన్ ఎవరికి కనిపించకూడదనుకుంటారో.. వారు చూడలేరు.ఈ ఫీచర్ ఎలా సెట్ చేసుకోవాలంటే..➤వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి.. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి.➤సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తరువాత.. ప్రైవసీ అనే ఆప్షన్స్ కనిపిస్తుంది.➤ప్రైవసీ మీద క్లిక్ చేసిన తరువాత.. మొదట్లోనే లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి.➤ఆలా చేసిన తరువాత.. నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి.➤ఆ తరువాత మీ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ స్టేటస్, లాస్ట్‌సీన్ ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు అనేది సెలక్ట్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: రూ.46.89 లక్షల స్కోడా కారు లాంచ్: పూర్తి వివరాలు -
రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లు
ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఒకరినొకరు కమ్యునికేట్ అవ్వడానికి, సమర్థవంతంగా పనిచేయడానికి, వినోదాన్ని ఆస్వాదించడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి స్మార్ట్ఫోన్లు చాలా అవసరం. అయితే ఈ రంగంలో నిత్యం కొత్త కంపెనీలు విభిన్న మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలో మెరుగైన ఫోన్‌ను ఎంచుకోవడం కష్టంగా మారింది. కొన్ని సంస్థలు అందించిన వివరాల ప్రకారం రూ.10,000లోపు ధర ఉన్న టాప్ 10 మొబైళ్ల వివరాలు కింది తెలియజేశాం.ఇదీ చదవండి: ఫెడ్ ఛైర్మన్‌ను తొలగిస్తామని ట్రంప్ హెచ్చరికఐటెల్ కలర్ ప్రో 5జీ: 6.6 అంగుళాల డిస్ప్లే, మీడియాటెక్ ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్(ఎంపీ కెమెరా).ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ: 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (ఆక్టాకోర్, 2.4గిగాహెర్ట్జ్) ప్రాసెసర్.పోకో సీ 71: 6.88 అంగుళాల డిస్ప్లే, 32 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా.ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్డీ: 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా.పోకో ఎం7 5జీ: స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 50 ఎంపీ రియర్ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ.మోటో జీ35 5జీ: 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, యూనిసోక్ టీ760 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.రెడ్ మీ ఏ4 5జీ: స్నాప్ డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్, 50 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ.వివో వై18టీ: యూనిసోక్ టీ612 చిప్సెట్, 50 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.ఒప్పో ఏ3ఎక్స్ 4జీ: స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 1 ప్రాసెసర్, 8 ఎంపీ రియర్ కెమెరా, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ.టెక్నో స్పార్క్ 30సీ 5జీ: మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 48 ఎంపీ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. -
40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
లేఆఫ్‌లలో అమెరికన్ ఉద్యోగుల పట్ల వివిక్ష చూపుతోందంటూ వచ్చిన ఆరోపణలను భారత్‌కు చెందిన ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఖండించింది. ఈ ఆరోపణలు సంస్థ "నిరాధారమైనవి, తప్పుడు అభిప్రాయాలు" అని పేర్కొంది. తమది అందరికీ సమాన అవకాశాలు కల్పించే సంస్థ అని, సమగ్రతలో గొప్ప రికార్డ్‌ను కలిగి ఉందని టీసీఎస్ వివరించింది.40 ఏళ్లకు పైబడిన, దక్షిణ ఆసియన్లు కాని తమను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల నుంచి టీసీఎస్ తొలగించిందని, కానీ H-1B వీసాలపై ఉన్న భారతీయ ఉద్యోగులను మాత్రం కొనసాగించిందని కొందరు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. 2023 చివర నుండి ఇలాంటి ఆరోపణలు వస్తుండటంతో యూఎస్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్ (EEOC) దీనిపై విచారణ చేపట్టింది. యుకేలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ, టీసీఎస్ దానిని కూడా ఖండించింది.టీసీఎస్‌పై వచ్చిన ఆరోపణలు ఇతర ఐటీ సంస్థల ఉద్యోగ విధానాలపైనా ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీసీఎస్‌పై వచ్చిన ఆరోపణలు ఎలా ఉన్నా నేటి కార్పొరేట్ వాతావరణంలో నలభైలలో ఉన్న ఉద్యోగులే తొలగింపులకు తొలి లక్ష్యంగా మారుతున్నారని బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్ పాండే కూడా ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.పిల్లల చదువులు, వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతలు, ఇంటి కోసం చేసిన అప్పుల ఈఎంఐలు ఇలా సవా లక్ష ఆర్థిక భారాలను నలభైలలోకి అడుగుపెట్టిన ఉద్యోగులు మోస్తున్నారని దేశ్‌పాండే ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇంతటి సమస్యలతో నెట్టుకొస్తున్న వీరినే కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది కుదింపు సందర్భాల్లో మొదట నలభైలలోని ఉద్యోగులనే తొలగించి ఇంటికి పంపిస్తున్నాయని అప్రమత్తం చేశారు.ఈ వయస్సులో ఉద్యోగం కోల్పోవడం ఆర్థికంగా, మానసికంగా తీవ్ర అస్థిరతకు గురిచేస్తుందని దేశ్ పాండే హెచ్చరించారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిలబడేందుకు మూడు కీలకమైన మనుగడ వ్యూహాలను ఆయన అందించారు. కృత్రిమ మేధపై నైపుణ్యాన్ని పెంచుకోవాలని, పొదుపు ఎక్కువగా చేయాలని, వ్యవస్థాపక మనస్తత్వాన్ని అలవరచుకోవాలని సూచించారు. -
గ్రిడ్ స్థిరీకరణకు స్టోరేజ్ సిస్టమ్
దేశరాజధాని ఢిల్లీలోని కిలోక్రీలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్)ను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇండిగ్రిడ్, బీఎస్ఈఎస్ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ స్టాండలోన్ యుటిలిటీ స్కేల్ సిస్టమ్ పవర్ గ్రిడ్‌ను స్థిరీకరించేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. దీనివల్ల దక్షిణ ఢిల్లీలోని దాదాపు లక్ష మంది నివాసితులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.బీఈఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది?బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్)ను 20 మెగావాట్లు/40 మెగావాట్‌హవర్ స్టోరేజీ సామర్థ్యం కలిగిన అత్యాధునిక వ్యవస్థ కోసం రూపొందించారు. ఇది భారీ ఇన్వర్టర్ మాదిరిగా పని చేస్తుంది. విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు ఆఫ్-పీక్ అవర్స్‌లో ఛార్జ్ అవుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు తిరిగి గ్రిడ్‌కు విద్యుత్ సరఫరా అందిస్తుంది. దీనివల్ల విద్యుత్ వినియోగంలో హెచ్చుతగ్గులు లేకుండా ఉండేందుకు వీలవుతుంది. ఇది విద్యుత్ సరఫరా మౌలిక సదుపాయాలపై ప్రభావం, తద్వారా అంతరాయాలను తగ్గిస్తుంది.ప్రయోజనాలుబీఈఎస్ఎస్ విధానం స్థిరమైన విద్యుత్ సరఫరాను నిర్వహించడానికి సహాయపడుతుంది. సప్లైలో హెచ్చుతగ్గులను నిర్వహిస్తుంది. పీక్ అవర్స్‌లో సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడటాన్ని నియంత్రిస్తుంది. పునరుత్పాదక సౌర, పవన విద్యుత్ నిర్వహణకు వీలు కల్పించడం ద్వారా ఈ వ్యవస్థ క్లీన్ ఎనర్జీ పరిష్కారాలకు మద్దతు ఇస్తుంది. వేలాది మంది నివాసితులకు నిరంతర విద్యుత్‌ను అందిస్తుంది. విద్యుత్ సరఫరాలో బ్లాక్అవుట్లను నివారిస్తుంది.ఇదీ చదవండి: రైతన్నపై ప్రకృతి ప్రకోపందక్షిణాసియాలో అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్పంపిణీ స్థాయిలో దక్షిణాసియాలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థ ఇదేనని అధికారులు తెలిపారు. వాతావరణ మార్పులకు సంబంధించి పెరుగుతున్న ఆందోళనలు, స్థిరమైన విద్యుత్ పరిష్కారాలు అవసరం అవుతుండడంతో బీఈఎస్ఎస్ వంటి బ్యాటరీ స్టోరేజ్ విధానాలు ఆధునిక నగరాలకు కీలకమైన సాధనాలుగా మారుతున్నాయని చెప్పారు. -
హిమాలయాల్లో భారత్ ఘనత: ప్రపంచంలోనే ఎత్తైన 3D ప్రింటెడ్ నిర్మాణం
భారత రక్షణ, నిర్మాణ రంగంలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ (Simpliforge Creations), ఐఐటీ హైదరాబాద్ సంయుక్తంగా లేహ్‌లో సముద్రమట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో దేశ తొలి 3డీ ప్రింటెడ్ రక్షణాత్మక సైనిక నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు.భారత సైన్యం తరపున ప్రాజెక్ట్ ప్రబల్లో(Project PRABAL) భాగంగా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఐఐటీ పీహెచ్డీ విద్యార్థి అరుణ్ కృష్ణన్ దీనికి సహకారం అందించారు. అత్యంత ఎత్తైన ప్రదేశాలు, తక్కువ ఆక్సిజన్ (HALO) ఉన్న ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 3డీ నిర్మాణంగా ఇది గుర్తింపు పొందింది.ఐఐటీ హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ కేవీఎల్ సుబ్రమణ్యం మార్గదర్శకంలో.. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్, ఐఐటీ హైదరాబాద్ బృందాలు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే ప్రత్యేక 3డీ ప్రింటింగ్ సాంకేతికతను అభివృద్ధి చేశాయి. ఇందులో భాగంగా స్థానికంగా లభించే పరికరాలను ఉపయోగించి అనుకూలమైన రక్షణాత్మక బంకర్‌ను నిర్మించారు. ఈ నిర్మాణానికి 14 గంటల సమయం పట్టింది. ప్రబల్ కార్యక్రమం స్వదేశీ సాంకేతికత, విద్యా-పరిశ్రమ సహకారం ద్వారా నిర్మాణ శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లింది.ఈ 3డీ బంకర్ భారతదేశంలో తొలిసారి కాగా, సవాళ్లు ఎదురయ్యే ప్రాంతాల్లో వేగవంతమైన నిర్మాణాలకు మార్గం సుగమం చేసి, రక్షణ సన్నద్ధతను బలోపేతం చేస్తుంది. ఈ అద్భుత ప్రాజెక్ట్.. ఇంజినీరింగ్ నూతనత్వం, సైనిక ఉపయోగం, మేక్-ఇన్-ఇండియా సంకల్పాన్ని కలగలిపి భవిష్యత్ సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తుంది.ఈ సందర్భంగా సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ సీఈఓ 'ధ్రువ్ గాంధీ' మాట్లాడుతూ.. "లడఖ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ విజయవంతం కావడం మా బృందానికి, యంత్రాలకు పెద్ద సవాలనే చెప్పలి. అయినా.. రోబోటిక్ ప్రింటర్ వ్యవస్థను 24 గంటల్లో సిద్ధం చేసి, 5 రోజుల రికార్డు సమయంలో అందించి విజయం సాధించాం" అని పేర్కొన్నారు.ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ కేవీఎల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. “ఈ ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటి తీవ్రమైన పర్యావరణ పరిస్థితుల్లో పనిచేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన పరికరాల అభివృద్ధి. ఎత్తైన ప్రాంతాల్లో తక్కువ ఆక్సిజన్, తక్కువ ఆర్ద్రత, ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అలాంటి పరిస్థితుల్లో కేవలం నిర్మాణాత్మక వినూత్నత మాత్రమే కాకుండా, అత్యుత్తమ విజ్ఞానం అవసరమైంది. ఐఐటీ హైదరాబాద్ బృందం, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ కలిసి, మెరుగైన యంత్రాలను, మన్నిక కలిగిన కాంక్రీట్ మిశ్రమాన్ని తయారు చేసింది. అలా ఆ ప్రదేశంలోనే 3డీ ప్రింటింగ్ ద్వారా నిర్మించగలిగారు” అని వెల్లడించారు.ఐఐటీ పీహెచ్డీ స్టూడెంట్ అరుణ్ కృష్ణన్ మాట్లాడుతూ.. "ఐఐటీ హైదరాబాద్‌లో నేను ఎంటెక్ చేస్తున్న సమయంలో ప్రబల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. లేహ్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో 3డీ ప్రింటింగ్ నిర్మాణాన్ని తీసుకురావడానికి అనేక బృందాలు, కంపెనీలు ప్రయత్నించాయి. అయితే లడాఖ్‌లోని తీవ్ర వాతావరణ పరిస్థితులు వారికి పెను సవాలును విసిరాయి" అని తెలిపారు.సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ హరికృష్ణ జీడిపల్లి మాట్లాడుతూ.. “2022 నుంచి మేము అడిటివ్ కన్స్ట్రక్షన్లో సవాళ్లను అధిగమించుకుంటూ వస్తున్నాం. భారతదేశపు తొలి 3డీ ముద్రిత వంతెనను, ప్రపంచంలోనే మొదటి 3డీ ముద్రిత ప్రార్థనా మందిరాన్ని మేమే నిర్మించాం. భారత సైన్యం కోసం, స్థానికంగా దొరికే పరికరాలను ఉపయోగించి, తొలిసారిగా ఒక 3డీ ముద్రిత వైద్య సదుపాయాన్ని, ఇన్-సిటు(in-situ) పద్ధతిలో నిర్మించాం" అని వివరించారు. -
మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లు
నిత్యం మారుతున్న టెక్నాలజీ కారణంగా మొబైల్ రంగంలో మార్పులొస్తున్నాయి. దాంతో ఇప్పటికే మొబైల్ ఫోన్లు ఉన్నా చాలామంది కొత్త సాంకేతికతకు అప్డేట్ అవుతున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. మార్చి 2025లో ఇండియాలో అధికంగా అమ్ముడైన టాప్-5 పాపులర్ మొబైల్ మోడళ్ల వివరాలను కొన్ని సంస్థలు వెల్లడించాయి. ఆయా వివరాలు కింది విధంగా ఉన్నాయి.శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 25 ఆల్ట్రా: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్, 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్: యాపిల్ ఏ 18 ప్రో చిప్సెట్, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 6.9 అంగుళాల ఎల్టీపీఓ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే.ఇదీ చదవండి: ఐపీఎల్ టీమ్‌లతో మాస్టర్ కార్డ్ జట్టుగూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్: ఏఐ ఆధారిత కెమెరా, టెన్సర్ జీ 4 చిప్సెట్, 6.8 అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్ప్లే.షియోమీ 15 అల్ట్రా: 50 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 5410 ఎంఏహెచ్ బ్యాటరీ.వన్‌ప్లస్ 13: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్, 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. -
ఫ్రెషర్స్ జీతం ఎందుకు పెరగదు? ఐటీ కంపెనీ సమాధానం
దేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన విప్రోలో గత దశాబ్ద కాలంగా ఫ్రెషర్ల వార్షిక వేతనం రూ. 3-4 లక్షలుగానే ఉంటోంది. ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఫ్రెషర్లకు ఇచ్చే వేతనాలు అలాగే తక్కువ స్థాయిలోనే ఉండటంపై చాలా కాలంగా కంపెనీ విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే ఫ్రెషర్ల వేతన స్థాయి తక్కువగా ఉండటంపై కంపెనీ యాజమాన్యం తాజాగా వివరణ ఇచ్చింది.ఇది విప్రో సమస్య మాత్రమే కాదుఇటీవలి ఆదాయ ప్రకటన అనంతర పత్రికా సమావేశంలో కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఈ సమస్యపై మాట్లాడారు. జీతాలు స్థిరంగా ఉండటానికి మార్కెట్ ఆధారిత డిమాండ్-సప్లై డైనమిక్స్ కారణమని పేర్కొన్నారు. “ఇది విప్రోకు సంబంధించిన సమస్య కాదు. ఇది మార్కెట్, పరిశ్రమ ఆధారిత సమస్య” అని గోవిల్ తెలిపారు. విప్రో అన్ని స్థాయిల ఉద్యోగులకు పోటీతత్వ వేతనాలను అందిస్తుందని, మార్కెట్ పరిస్థితులు మారినప్పుడు జీతాలను సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఎక్కువ మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లుభారత ఐటీ సెక్టార్ ఏటా 15 లక్షలకు పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలకు అధిక సరఫరా ఏర్పడుతోంది. ఈ అధిక సరఫరా, అధిక ఆరంభ జీతాలకు పరిమిత డిమాండ్‌తో కలిసి, పరిశ్రమ వ్యాప్తంగా ఫ్రెషర్ జీతాలను మార్పులేనివిగా ఉంచింది. విప్రో తన పోటీదారులతో సమానంగా, ఆర్థిక అనిశ్చితులు, క్లయింట్ డిమాండ్ హెచ్చుతగ్గుల మధ్య ఖర్చులను నియంత్రించే వ్యూహాన్ని అనుసరిస్తుంది. అయితే, 2023లో కొందరు అభ్యర్థులకు రూ. 6.5 లక్షల నుంచి రూ. 3.5 లక్షలకు వేతన ఆఫర్లను తగ్గించడం వంటి చర్యలకు సంస్థ విమర్శలను ఎదుర్కొంది. దీనికి వ్యాపార అవసరాల మార్పు కారణమని పేర్కొంది.ద్రవ్యోల్బణం, జీవన వ్యయాల పెరుగుతున్న నేపథ్యంలో వేతనాలు ఇలాగే ఉంటే ఉత్తమ ప్రతిభను ఆకర్షించడంలో ఇబ్బందులు ఏర్పడతాయని విమర్శకులు వాదిస్తున్నారు. అయితే విప్రో మాత్రం తాము ఇస్తున్న వేతనాలు పోటీతత్వంగానే ఉన్నాయని, దీంతోపాటు శిక్షణ కార్యక్రమాలు, కెరీర్ వృద్ధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొంది. భారత ఐటీ పరిశ్రమ గ్లోబల్ ఆర్థిక సవాళ్లను, అభివృద్ధి చెందుతున్న నైపుణ్య అవసరాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఫ్రెషర్ జీతాలపై చర్చ ప్రతిభ నిర్వహణ, మార్కెట్ డైనమిక్స్‌కు సంబంధించిన విస్తృత సమస్యలను హైలైట్ చేస్తోంది.పెంచుతాంలే..ఫ్రెషర్ల వేతన స్థాయిని పెంచే విషయంలో ప్రస్తుతానికి, విప్రో మేనేజ్మెంట్ ఆశాజనకంగానే ఉంది. భవిష్యత్ మార్కెట్ మార్పులకు అనుగుణంగా వేతనాలను సర్దుబాటు చేస్తామని హామీ ఇస్తోంది. పెరుగుతున్న పోటీ, సాంకేతిక పురోగతులు దగ్గర భవిష్యత్తులో ఎంట్రీ-లెవల్ వేతనాల పునఃపరిశీలనకు దారితీస్తాయా అన్నదానిపై పరిశ్రమ పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
వర్క్ ఫ్రమ్ హోమ్‌తో సైడ్ జాబ్.. ఏఐతో పట్టుకున్న సీఈవో
వర్క్ ఫ్రమ్ హోమ్‌ను దుర్వినియోగం చేస్తున్న ఓ ఉద్యోగిని ఆ సంస్థ సీఈవో ఏఐ సాయంతో పట్టుకున్నారు. ఆ ఉద్యోగి తమ కంపెనీలో పనిచేస్తూనే మరో కంపెనీలోనూ పనిచేస్తున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్లేషణను ఉపయోగించి కనుగొన్నట్లు ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ సీఈవో వెల్లడించారు.లా సికో సంస్థ అధిపతి అయిన రామానుజ్ ముఖర్జీ గత రెండు నెలల్లో ఉద్యోగి తన పని లక్ష్యాలలో 70% మిస్ అయినట్లు గమనించారు. జవాబుదారీతనం కోసం టైమ్ ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలని అడిగినప్పుడు, ఆమె అకస్మాత్తుగా ఉద్యోగం మానేసిందని, తరువాత లింక్డ్ఇన్లో కంపెనీ పని సంస్కృతిని విమర్శిస్తూ పోస్ట్ పెట్టిందని ఆయన తెలిపారు.ఆ ఉద్యోగిని రోజూ పని చేయాల్సిన ఆశించిన గంటలలో 40% మాత్రమే పనిచేస్తోందని రోజుకు ఐదు గంటలు పనిని పక్కన పెట్టినట్లు ఏఐ విశ్లేషణలో తేలింది. అంతేకాకుండా తదుపరి దర్యాప్తులో ఆమె నకిలీ ఆఫర్ లెటర్లు, వేతన స్లిప్పులు, అనుభవ ధృవీకరణ పత్రాలు బయటపడ్డాయి.కొన్ని కంపెనీలు ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. దీన్ని అలుసుగా తీసుకుని కొంత మంది ఉద్యోగులు దుర్వినియోగం చేస్తూ ఏక కాలంలో ఒకటి కంటే ఎక్కువకంపెనీలకు పనిచేస్తున్నారు. ఈ సంఘటన రిమోట్ వర్క్ ఎథిక్స్ గురించి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు కంపెనీలు కఠినమైన పర్యవేక్షణను అమలు చేయాల్సిన అవసరంపై సోషల్ మీడియాలో చర్చలను రేకెత్తించింది. -
హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్ లాంచ్..
హెచ్‌పీ తన ఫ్లాగ్షిప్ గేమింగ్ ల్యాప్‌టాప్ ‘ఓమెన్ మాక్స్ 16’ని భారత్‌లో లాంచ్ చేసింది. ఇది కంపెనీ అత్యంత శక్తివంతమైన గేమింగ్ ల్యాప్‌టాప్. అత్యాధునిక ఏఐ-ఆధారిత ఫీచర్లు, బ్లాక్వెల్ ఆర్కిటెక్చర్‌తో కూడిన సరికొత్త ఎన్విడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 5000 సిరీస్ జీపీయూ కలిగిన ఈ ల్యాప్‌టాప్‌ను భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గేమింగ్ కమ్యూనిటీ కోసం రూపొందించారు.ఫీచర్లుహెచ్పీ ఓమెన్ మాక్స్ 16 ల్యాప్‌టాప్ ఇంటెల్ 24-కోర్ కోర్ అల్ట్రా 9-275HX ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఎన్విడియా ఆర్టీఎక్స్ 5080 జీపీయూతో అసాధారణమైన వేగాన్ని, గ్రాఫిక్స్‌ను అందిస్తుంది. ఇది 64జీబీ డీడీఆర్5 ర్యామ్, 1టీబీ పీసీఐసీ జెన్ 5 ఎస్ఎస్డీ వరకు సపోర్ట్ చేస్తుంది.ల్యాప్‌టాప్ 16-అంగుళాల డిస్ప్లే 240Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్, స్క్రీన్ టియరింగ్‌ను తొలగించడానికి వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR)ను కలిగి ఉంది.ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ హెచ్‌పీ ఓమెన్ ఏఐ బీటా. ఇది ఒక క్లిక్‌తో గేమ్‌ప్లే నమూనాల ఆధారంగా ఓఎస్, హార్డ్‌వేర్, గేమ్ సెట్టింగ్‌లను డైనమిక్‌గా సర్దుబాటు చేసే ఏఐ ఆప్టిమైజేషన్ సాధనం. ప్రస్తుతం కౌంటర్-స్ట్రైక్ 2కి సపోర్ట్ చేస్తున్న ఈ సాధనం, ఇతర టైటిల్స్‌కు విస్తరించే హామీతో, మాన్యువల్ సర్దుబాట్లు లేకుండా ఫ్రేమ్ రేట్లు, థర్మల్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. గేమర్లు అత్యుత్తమ పనితీరు కోసం పవర్, థర్మల్ సెట్టింగ్‌లను ఫైన్-ట్యూన్ చేయడానికి ఓమెన్ గేమింగ్ హబ్ అన్లీషెడ్ మోడ్ వీలు కల్పిస్తుంది.ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో కొత్త ఫీచర్..సీపీయూ-జీపీయూ కలగలిసిన దీని 250 వాట్ల పవర్ డ్రా నిర్వహణకు ఓమెన్ మాక్స్ 16 అధునాతన ఓమెన్ టెంపెస్ట్ కూలింగ్ ప్రో ఆర్కిటెక్చర్‌ను ఉపయోగిస్తుంది. ఇందులో వేపర్ ఛాంబర్, డ్యూయల్ ఫ్యాన్స్, హీట్ డిస్సిపేషన్ కోసం లిక్విడ్ మెటల్,థర్మల్ గ్రీస్ హైబ్రిడ్ ఓమెన్ క్రయో కాంపౌండ్ ఉన్నాయి. ఫ్యాన్ క్లీనర్ టెక్నాలజీ ఫ్యాన్ దిశను రివర్స్ చేసి దుమ్ము లోపలికి చేరకుండా నిరోధిస్తుంది.సెరామిక్ వైట్ లేదా షాడో బ్లాక్ మెటల్ ఛాసిస్ ఇందులో ఉంది. ఆర్జీబీ కీబోర్డ్, ఐచ్ఛిక ఆర్జీబీ లైట్ బార్ ఉన్నాయి. 1080p ఫుల్హెచ్డీ ఐఆర్ కెమెరా, నాయిస్ రిడక్షన్, క్లియర్ స్ట్రీమింగ్ కోసం డ్యూయల్-అరే మైక్రోఫోన్ కూడా ఇందులో ఉన్నాయి.ధర.. లభ్యతహెచ్పీ ఓమెన్ మాక్స్ 16 ల్యాప్‌టాప్ రూ.3,09,999 ధరతో హెచ్‌పీ ఆన్లైన్ స్టోర్, అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంది. “ఓమెన్ మాక్స్ 16 ఏఐ-ఆధారిత ఆప్టిమైజేషన్, ఎలైట్ పనితీరుతో లీనమయ్యే గేమింగ్ సరిహద్దులను చెరిపేస్తుంది” అని హెచ్‌పీ ఇండియా సీనియర్ డైరెక్టర్ వినీత్ గెహానీ తెలిపారు. -
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో కొత్త ఫీచర్..
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో సరికొత్త సేఫ్టీ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. ఫోన్ వరుసగా మూడు రోజులు (72 గంటలు) పాటు తెరవకుండా లాక్ అయి ఉంటే స్వయంచాలకంగా రీబూట్ అవుతుంది. ఈ కొత్త భద్రతా ఫీచర్ గూగుల్ ప్లే సర్వీసెస్ (Google Play) తాజా అప్డేట్ (వెర్షన్ 25.14)లో అందుబాటులోకి రానుంది.ఫోన్ పోయినప్పుడు లేదా చోరీ జరిగినప్పుడు యూజర్ డేటా దుర్వినియోగం కాకుండా చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా గూగుల్ ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది. "వరుసగా మూడు రోజులు లాక్ అయి ఉంటే ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అవుతుంది" అని గూగుల్ ప్లే సర్వీసెస్ తాజా అప్డేట్ పేర్కొంటోంది. ఫోన్ యాక్సెస్‌ను తిరిగి పొందాలంటే వినియోగదారులు వారి పాస్‌కోడ్‌ను రీఎంటర్ చేయాల్సి ఉంటుంది.9to5Google నివేదిక ప్రకారం.. ఈ అప్డేట్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లలో అందుబాటులోకి వస్తోంది. అయితే ఆండ్రాయిడ్ ఆటో, వేర్ ఓఎస్‌పై పనిచేసే డివైజ్‌లు, ఆండ్రాయిడ్ టీవీలకు ఈ అప్డేట్ వర్తించదని తెలుస్తోంది. రీబూట్ చేసిన తర్వాత ఫోన్‌ను 'బిఫోర్ ఫస్ట్ అన్‌లాక్' స్థితికి తిరిగి తీసుకురావడం ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుందని జీఎస్ఎంఅరేనా నివేదిక పేర్కొంది. ఈ స్థితిలో ఫోన్ మరింత సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే పాస్‌కోడ్ మాన్యువల్‌గా ఎంటర్ చేసే వరకు ఫింగర్ ప్రింట్ లేదా ఫేసియల్ రికగ్నిషన్ వంటి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఆప్షన్లు అందుబాటులో ఉండవు.తాజా వెర్షన్ 25.14 విడుదలకు దాదాపు ఒక వారం సమయం పట్టవచ్చని అంచనా వేయగా, అర్హత ఉన్న అన్ని పరికరాల్లో ఆటో-రీస్టార్ట్ ఫంక్షన్ పూర్తిగా అందుబాటులోకి రావటానికి కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు. ఈ ఫీచర్‌కు ఏ ఆండ్రాయిడ్ వెర్షన్లు అనుకూలంగా ఉంటాయి.. ఈ సెట్టింగ్‌ను డిజేబుల్ లేదా అడ్జెస్ట్ చేసుకునే అవకాశం వినియోగదారులకు ఉంటుందా అనే దానిపై గూగుల్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.యాపిల్ iOS 18.1 లో ఇలాంటి భద్రతా ఫీచర్ 'ఇనాక్టివిటీ రీబూట్'ను ప్రవేశపెట్టింది. ఇది నాలుగు రోజులపాటు ఇనాక్టివ్‌గా లాక్ ఉండి లాక్ అయిన ఐఫోన్లను రీస్టార్ట్ చేస్తుంది. కొత్త భద్రతా ఫీచర్‌తో పాటు తాజా గూగుల్ ప్లే సర్వేసెస్ అప్డేట్ మరికొన్ని మెరుగుదలలను తీసుకువస్తోంది. వినియోగదారులు ఇప్పుడు వారి ఫోన్లో క్విక్ షేర్ ట్రాన్స్ఫర్ను అంగీకరించే ముందు కంటెంట్‌ను ప్రివ్యూ చేయవచ్చు. కొత్త ఫోన్‌ను సెటప్ చేయడం, పాత ఫోన్ నుండి డేటాను ట్రాన్స్ఫర్ చేయడం మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉండనుంది. -
కృత్రిమ మేధను నియంత్రించవచ్చా..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నందున ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వీటి నైతికత, భద్రత, సృజనాత్మక పరిధి, ఆర్థిక వృద్ధిని ఎలా సమతుల్యం చేయాలో తర్జనభర్జన పడుతున్నాయి. ఇప్పటివరకు కొన్ని దేశాల్లోనే ఏఐ గవర్నెన్స్‌కు సంబంధించిన స్పష్టమైన విధానాలున్నాయి. సామాజిక భద్రత, మానవ హక్కులు, ఆర్థిక శ్రేయస్సుకు ప్రాధాన్యమిస్తూ కృత్రిమ మేధను నియంత్రించడానికి ఖచ్చితమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. ఇంకొన్ని దేశాలు వ్యూహాత్మక విధాన ఫ్రేమ్‌వర్క్‌లతో ముసాయిదా చట్టాన్ని అభివృద్ధి చేస్తున్నాయి.ఏఐ నియంత్రణపై ప్రపంచ దేశాలు ఇలా..చైనా ఏఐ అల్గారిథమ్ల్లో పారదర్శకత, డేటా గోప్యత, ఎథికల్ ఏఐ విధానాలను అమలు చేయడంపై దృష్టి సారించే నిబంధనలను ప్రవేశపెడుతుంది. ముఖ్యంగా జనరేటివ్ ఏఐ, అటానమస్ సిస్టమ్స్ వంటి రంగాల్లో ఈమేరకు చర్యలు తీసుకుంటోంది.యూరోపియన్ యూనియన్(ఈయూ) ఇప్పటికే ఏఐ చట్టాన్ని అమలు చేస్తుంది. సామాజిక భద్రత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారించే లక్ష్యంతో హైరిస్క్ అప్లికేషన్లపై కఠినమైన నిబంధనలను విధిస్తుంది.కెనడాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా యాక్ట్ (ఏఐడీఏ) బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తుంది.దక్షిణ కొరియా నైతిక కృత్రిమ మేధ కోసం మార్గదర్శకాలను అమలు చేస్తుంది. కృత్రిమ మేధ భద్రత, జవాబుదారీతనాన్ని నియంత్రించడానికి చట్టాన్ని అభివృద్ధి చేస్తోంది.పెరూ ప్రభుత్వ సేవల్లో నైతిక ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి, పౌరుల హక్కులను పరిరక్షించడానికి నిబంధనలు ప్రవేశపెట్టింది.అమెరికా కృత్రిమ మేధ విధానంలో మాత్రం మార్పు వచ్చింది. బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చేలా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025లో రద్దు చేశారు.యునైటెడ్ కింగ్డమ్, జపాన్, బ్రెజిల్, కోస్టారికా, కొలంబియాతో సహా అనేక దేశాలు తమ చట్టసభలలో ఆమోదం కోసం కృత్రిమ మేధ బిల్లులను రూపొందించాయి.ఇదీ చదవండి: రైలులో ఏటీఎం.. కొత్త సర్వీసుఏఐ స్ట్రాటజీ డాక్యుమెంట్లుసమ్మిళిత, సుస్థిర వృద్ధిని నిర్ధారించేందుకు, సామాజిక ఆర్థిక ప్రగతిని నడిపించడానికి ఏఐ వినియోగంపట్ల దేశాల ధోరణి ఎలా ఉందనేది నేషనల్ ఏఐ స్ట్రాటజీ డాక్యుమెంట్లు తెలియజేస్తాయి. ప్రస్తుతానికి అధికారిక చట్టాలు పరిమితంగా ఉన్నప్పటికీ ఏఐ పాలనకు మరింత విస్తృతమైన విధానాలు తీసుకువచ్చేందుకు ఈ డాక్యుమెంట్లు తోడ్పడుతాయి. ఆఫ్రికన్ యూనియన్‌తో పాటు సుమారు 85 దేశాలు ఇలాంటి వ్యూహాలను ప్రచురించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పత్రాల్లో ప్రధానంగా కింది విషయాలు పొందుపరిచారని తెలిపారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్, డెవలప్మెంట్, మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించడం.హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్ వంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఏకీకృతం చేయడానికి కాలపరిమితి, ప్రాధాన్యాలను నిర్దేశించడం.నిష్పాక్షికత, పారదర్శకత, జవాబుదారీతనం వంటి బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి మార్గనిర్దేశం చేయడానికి సూత్రాలను ఏర్పాటు చేయడం.ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు పౌరులను సిద్ధం చేయడానికి కావాల్సిన విద్యను ప్రోత్సహించడం.ఏఐ భద్రత, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి భాగస్వామ్యాలు తోడ్పాటు అందించడం. -
వాట్సాప్‌లో కొత్త తరహా సైబర్ మోసం
ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దాదాపు అందరూ వాడే మేసేజింగ్ యాప్ వాట్సాప్ వేదికగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా వాట్సాప్‌లో వచ్చిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇమేజ్‌పై క్లిక్ చేసిన ఓ వ్యక్తి ఏకంగా రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. స్కామర్లు అనుసరిస్తున్న కొత్త మోసపూరిత పంథా ఏమిటో.. దాని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం.కొత్త మోసంలో భాగంగా సైబర్ నేరగాళ్లు తెలియని నంబర్ నుంచి మీ వాట్సాప్‌కు ఒక చిత్రాన్ని పంపుతారు. ఇది స్కామ్ చేయడానికి కీలకంగా మారుతుంది. వారు పంపిన మెసేజ్ ఫొటో ఫార్మాట్లో ఉంటుంది. తెలియని నంబర్ నుంచి ఫొటో ఏంటా అని క్లిక్ చేయడం చాలా మందికి అలవాటు. సరిగ్గా దీన్నే నేరాలకు ఉపయోగిస్తున్నారు. ఆ ఇమేజ్‌పై క్లిక్ చేసిన వెంటనే మీ బ్యాంకింగ్ వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు, యూపీఐ సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు నేరగాళ్లకు పూర్తి అనుమతులు ఇచ్చినట్లు అవుతుంది. అందుకు అనుగుణంగా ఇమేజ్ క్లిక్ చేసిన వెంటనే మీకు తెలియకుండానే మీ ఫోన్‌ను కంట్రోల్ చేసేలా రూపొందించిన మాల్వేర్ అందులో ప్రవేశిస్తుంది.ఇమేజ్ స్టెగానోగ్రఫీఇమేజ్ స్టెగానోగ్రఫీ అని పిలువబడే ఈ సాంకేతికతను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో నేరాలకు అవసరమయ్యే డేటాను రహస్యంగా ఇమేజ్ లోపల ఉంచుతారు. మీరు ఇమేజ్ క్లిక్ చేసిన వెంటనే మీకు తెలియకుండానే ఓటీపీ, పాస్వర్డ్లు.. వంటి సున్నితమైన సమాచారం అంతా స్కామర్ల చేతుల్లోకి వెళుతుంది. మాల్వేర్ పనిచేయడానికి ఇమేజ్ ఓపెన్ చేస్తే చాలు మీ యాప్స్, ప్రైవేట్ డేటాను యాక్సెస్ చేస్తుంది. దాంతో మోసాలకు పాల్పడుతున్నారు.వ్యక్తిని గుర్తించేందుకు సాయం చేయాలంటూమధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఓ వ్యక్తి ఇలా రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. వాట్సాప్‌లో ఇమేజ్ షేర్ చేసి ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు సాయం చేయాలంటూ కొత్త నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఒకే నంబర్ నుంచి పలుమార్లు కాల్స్, మెసేజ్‌లు రావడంతో చివరకు ఆ ఫొటోపై ఆ వ్యక్తి క్లిక్ చేశాడు. ఆ సమయంలో ఫోన్‌ను హ్యాక్ చేసి స్కామర్లు బ్యాంక్ వివరాలు తెలుసుకొని ఖాతా నుంచి డబ్బులు డ్రా చేశారు.ఇదీ చదవండి: ‘ఉన్నతాధికారులతో బేరసారాలు’.. వదలని పోలీసులు..సురక్షితంగా ఉండడం ఎలా..తెలియని నంబర్ల నుంచి వచ్చిన ఇమేజ్‌లు, వీడియోలు డౌన్లోడ్ చేయవద్దు. లింక్‌లపై కూడా అసలు క్లిక్ చేయవద్దు.మీ వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీడియా ఆప్షన్స్‌లో ఆటో డౌన్‌లోడ్‌ను ఆఫ్ చేసుకోండి. దాంతో మీకు తెలిసిన వారు పంపించిన ఫొటోలు, లింకులు మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు.మీ ఫోన్ సాఫ్ట్వేర్, యాంటీవైరస్‌ను నిత్యం అప్డేట్ చేసుకోవాలి. ఏదైనా ఓఎస్, యాప్ వర్షన్ మార్పులుంటే వెంటనే అప్డేట్ అవుతాయి.అనుమానాస్పద నంబర్లను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలి.ఈ విషయం తెలుసుకున్న వెంటనే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారిని హెచ్చరించడం మరిచిపోకండి.మీరు మోసపోయారని అనుమానించినట్లయితే వెంటనే cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి. -
ఏఐ థెరపిస్టు!
లవ్ బ్రేకప్.. ఒంటరితనం.. ఆఫీసులో కోపిష్టి బాస్ వేధింపులు.. సహోద్యోగులతో ఇబ్బందులు.. జీవితంలో ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి, ఓపిగ్గా వినేవారొకరు ఉండాలి. తీరా చెప్పాక జడ్జ్ చేయకుండా ఉంటారా? నిష్పాక్షికంగా పరిష్కార మార్గం సూచిస్తారా? అనుమానమే. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా మానసిక వైద్యులను సంప్రదిస్తారు. కానీ ఇప్పుడు ట్రెండు మారుతోంది. ఈ విషయంలో చాట్‌జీపీటీకే జనం ఓటేస్తున్నారు. సమస్యలను వినే మంచి ఫ్రెండ్‌గానే గాక వాటికి పరిష్కారం చూపే కౌన్సిలర్‌గా కూడా భావిస్తున్నారు.లైఫ్ కౌన్సిలర్‌గా..27 ఏళ్ల మనీశ్ ఇంజినీర్. ప్రియురాలితో గొడవైంది. అపార్థాలతో బంధానికి బ్రేక్ పడింది. మానసికంగా అలసిపోయి ఓ సాయం వేళ చాట్‌జీపీటీని ఆశ్రయించాడు. సమస్యంతా చెప్పాడు. ఏం చేయాలో పాలుపోవడం లేదన్నాడు. చాట్‌జీపీటీ సమాధానం మనోన్ని ఆశ్చర్యపరిచింది. ‘మీరు చెప్పింది ఆమె వినకపోవడం మిమ్మల్ని బాధిస్తోంది. అదే విషయం ఆమెకు నేరుగా చెప్పారా?’అని అడిగింది. అంతటితో ఆగకుండా ప్రేయసికి సందేశం పంపడంలో మనీశ్‌కు సాయపడింది. ఆమెను నిందించకుండా కేవలం అతని ఫీలింగ్స్ మాత్రమే వ్యక్తపరిచే ప్రశాంతమైన, నిజాయితీతో కూడిన నోట్ అది. అందుకున్న ఆ అమ్మాయి మనీష్‌తో మాట్లాడింది. ఇంకేముంది వారి మధ్య దూరం తగ్గిపోయింది. వృత్తి సమస్యల్లో సాయం26 ఏళ్ల అక్షయ్ శ్రీవాస్తవ కంటెంట్ రైటర్, మీడియా ప్రొఫెషనల్. ఆఫీసుకు వెళ్లిరావడానికే నాలుగ్గంటలు పోతోంది. నిద్ర లేదు. కుటుంబంతో గడపడానికి లేదు. ఫిర్యాదులా కాకుండా ఈ విషయాన్ని బాస్‌తో ఎలా చెప్పాలో తేలక చాట్‌జీపీటీని ఆశ్రయించాడు. వాడాల్సిన పదాలతో సహా చక్కని నిర్మాణాత్మక సలహాలిచ్చింది. అప్పటినుంచి అక్షయ్ క్రమం తప్పకుండా చాట్‌బాట్‌ను ఆశ్రయిస్తున్నాడు. ఆయేషాది మరో సమస్య. ఇన్నాళ్లు సహోద్యోగిగా ఉన్న స్నేహితులకే బాస్ అయింది. సాన్నిహిత్యం కోల్పోకుండా వాళ్లతో ఎలా డీల్ చేయాలని చాట్‌జీపీటీనే అడిగింది. అదిచ్చిన సమాధానం ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌లో క్రాష్ కోర్సులా సాయపడింది.బెటర్ కౌన్సిలర్?ఒక్కోసారి కౌన్సిలర్ కంటే మెరుగ్గా చాట్‌జీపీటీ ఇచ్చే సమాధానాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. జీవితంలో చాలా కోల్పోయాననే భావన కలుగుతుందనే ప్రశ్నకు.. ‘మార్పు జరిగినప్పుడు అది మామూలే. అభిరుచులను పెంచుకోండి’అని కౌన్సిలర్ చెప్పారు. చాట్‌జీపీటీ మాత్రం, ‘సంతోషపరిచే పనులు చేయండి. చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరుకునే ప్రయత్నం చేయండి’అని సూచించింది. స్నేహితులు అర్థం చేసుకోవడం లేదంటే వారితో ఓపెన్‌గా మాట్లాడమని థెరపిస్టు చెబితే, ‘స్నేహితుల్లో అపార్థాలు మామూలే. వారితో నిజాయితీగా మాట్లాడండి’అని చాట్‌జీపీటీ సూచించింది. పని నచ్చడం లేదంటే ఒత్తిళ్లను గుర్తించి పరిష్కారానికి కొత్తగా ప్రయత్నించమని కౌన్సిలర్ చెప్పాడు. చాట్‌జీపీటీ మాత్రం ‘పనిలో పరిమితులను పెట్టుకోండి. హెచ్ఆర్ లేదా మెంటార్‌తో మాట్లాడండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి’అని సలహా ఇచ్చింది. భాగస్వామితో విభేదాలపై ఓపెన్‌గా మాట్లాడుకుని, సమస్యకు కారణాలేంటో కనిపెట్టి పరిష్కారానికి కలిసి ప్రయత్నించడన్న చాట్‌జీపీటీ సూచనే మెరుగ్గా ఉందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.ఇదీ చదవండి: హై-ఎండ్ కార్లు.. లగ్జరీ ప్రాపర్టీలు.. కేఎల్ రాహుల్ ఆస్తుల వివరాలుప్రత్యామ్నాయం కాబోదు: మానసిక వైద్యులుమానసిక వైద్యం మనదేశంలో కాస్త ఖరీదైన విషయం. జనంలో అవగాహన లేమి కూడా ఉంది. ఆ సమస్యలకు చాలామంది క్రమంగా ఏఐపై ఆధారపడుతున్నారు. అది జడ్జ్ చేయదు. చెబుతుంటే మధ్యలో అడ్డుకోదు. ఏం చెప్పినా, ఎంతసేపు చెప్పినా, ఎప్పుడు చెప్పినా శ్రద్ధగా వింటుంది. అంతే ఓపిగ్గా సమాధానమూ ఇస్తుంది. దాంతో వ్యక్తిగతం నుంచి వృత్తిపరమైన సలహాల దాకా యూత్ చాట్‌జీపీటీపై ఆధారపడుతోంది. కానీ ఈ చాట్‌బాట్ మానసిక ఇబ్బందులకు మొత్తంగా పరిష్కారం చూపలేదంటున్నారు వైద్యులు. ‘అది తాత్కాలిక ఉపశమనమిచ్చే ఔట్‌లెట్‌లా పనిచేస్తుందంతే. పూర్తిస్థాయి మానసిక చికిత్స ప్రక్రియకు ప్రత్యామ్నాయం కాబోదు. సానుభూతి, అంతర్దష్టి, అవగాహన వాటికుండవు’ అంటున్నారు. అంతేగాక ఏఐ థెరపీ బాట్లతో ముప్పు కూడా ఉంటుందని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ హెచ్చరించింది. ప్రత్యేకించి వాటిని పిల్లలు వాడటంపై ఆందోళన వ్యక్తం చేసింది. మనుషులను అవి మరింత ఒంటరిగా చేస్తాయనీ హెచ్చరించింది. -
కళను దొంగలిస్తున్న ఏఐ
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. మొన్నటికిమొన్న ఓపెన్ఏఐ తీసుకొచ్చిన ఏఐ జనరేటివ్ ఆర్ట్ జీబ్లీ టూల్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఒక సంస్థ ప్రజల్లో ఆదరణ పొందే సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తే పోటీ కంపెనీలు కూడా తమ యూజర్లను కాపాడుకునేందుకు ఎలాగైనా అదే తరహా, అంతకంటే మెరుగైన సేవలు అందించేందుకు పావులు కదుపుతాయి. అందులో భాగంగానే గూగుల్, గ్రోక్ఏఐ వంటి సంస్థలు కూడా ఏఐ ఆర్ట్ జనరేషన్ ఇమేజ్ను అందిస్తున్నాయి. కానీ ఇది నిజమైన కళాకారుల కళలను అనుసరిస్తూ, కాపీ రైట్ ఆందోళలనలకు దారితీస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.కాపీరైట్ ఆందోళనలుఏఐ నమూనాలు శిక్షణ కోసం చాలాసార్లు కాపీరైట్ చేసిన కంటెంట్ డేటాసెట్లపై ఆధారపడతాయి. స్పష్టమైన అనుమతి లేకుండా ఇటువంటి కంటెంట్‌ను ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. దాంతో కృత్రిమ మేధ సృష్టించిన ఆర్ట్ కంటెంట్ ఓనర్షిప్ ఎవరనే దానిపై సందిగ్దత నెలకొంటుంది. ఏఐ ఆర్ట్ జనరేటర్లు నిర్దిష్ట కళాత్మక శైలులను అనుకరిస్తాయి. ఇది మానవ కళాకారుల ఒరిజినాలిటీని బలహీనపరుస్తుంది. ఏఐ ఆర్ట్ కంటెంట్ మానవ కళాకారుల పనిని తగ్గిస్తుంది. ఇది వారిని ఆర్థిక ఊబిలోకి నెట్టివేస్తుందనే అభిప్రాయాలున్నాయి.దుర్వినియోగంఏఐ జనరేటెడ్ ఆర్ట్ ఒక కళాకారుడి శైలిని ప్రతిబింబించగలదేమో కానీ తన విలువలను, ఉద్దేశాలను తెలుపలేదు. ఉదాహరణకు, హయావో మియాజాకి(శాంతికి సంబంధించిన కళాకండాలు వేసే చిత్రకారుడు) వంటి కళాకారుడి శైలికి విరుద్ధంగా సైనిక, హింసాత్మక చిత్రాలను ఏఐ సృష్టిస్తోంది.భావోద్వేగాలుకృత్రిమ మేధ చారిత్రక విషాదాలు లేదా సాంస్కృతిక సంఘటనలు వంటి సున్నితమైన అంశాలను చిత్రాల రూపంలో స్టైలిష్‌గా చూపుతుంది. కొన్నిసార్లు విచిత్రమైన రీతిలో వాటిని ప్రదర్శిస్తుంది. ఇది ఆయా సంఘటనల వల్ల ప్రభావితమైన వారికి ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తుంది.ఇదీ చదవండి: పట్టణాల్లో అధిక ఖర్చు వీటికే..ప్రముఖ కంపెనీల ఏఐ ఆర్ట్ జనరేటివ్ ఇమేజింగ్ వ్యవస్థలు సృష్టిస్తున్న కంటెంట్‌కు పరిమితులుండాలని కొందరు అంటున్నారు. ఎదుటివారి మనోభావాలు, ఆర్థిక, సామాజిక స్థితి దిగజారకుండా ఉండేంతవరకు పరిమితులకు లోబడి ఏఐ కంటెంట్ ఉండే సరిపోతుందని తెలుపుతున్నారు. అందుకు సమగ్ర విధానాలు రూపొందించడానికి ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేయాలని సూచిస్తున్నారు. -
ఐటీకి అనిశ్చితి కొంతకాలమే: టీసీఎస్ సీఈవో
ముంబై: ప్రపంచ దేశాల మధ్య టారిఫ్‌ల కారణంగా తలెత్తిన అనిశ్చితి స్వల్పకాలమే కొనసాగనున్నట్లు సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సీఈవో, ఎండీ కె.కృతివాసన్ పేర్కొన్నారు. వెరసి ఐటీ సేవల పరిశ్రమకు కొంతకాలమే అనిశ్చితి సవాళ్లు సృష్టించనున్నట్లు అభిప్రాయపడ్డారు. కొద్ది నెలల్లోనే పరిష్కారం లభించనున్నట్లు అంచనా వేశారు.39 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ ఆర్డర్ బుక్ భవిష్యత్ ఆదాయ ఆర్జనకు హామీ ఇస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. డీల్ పైప్‌లైన్ పటిష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులతో కొంతమంది క్లయింట్ల నుంచి విచక్షణ వ్యయాలు నిలిచిపోతున్నట్లు వెల్లడించారు. అయితే ధరల విషయంగా ఒత్తిడిలేదని స్పష్టం చేశారు.నిజానికి వార్షికంగా, త్రైమాసికవారీగా ధరలు స్వల్పంగా మెరుగుపడినట్లు తెలియజేశారు. గతేడాదికి 30 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించిన కంపెనీ విచక్షణ వ్యయాల వాటాపై వివరణ ఇవ్వని సంగతి తెలిసిందే. ఇవి ఆదాయంలో కీలకమే అయినప్పటికీ ప్రస్తుత ట్రెండ్‌వల్ల కంపెనీపై ప్రతికూల ప్రభావం పడలేదని వివరించారు.యూఎస్‌లో పరిస్థితులు సర్దుకుంటే ఉత్తర అమెరికా బిజినెస్‌లో తిరిగి పురోభివృద్ధి అందుకోగలమని అంచనా వేశారు. సాఫ్ట్వేర్ సేవల ఔట్‌సోర్సింగ్‌కు ప్రపంచంలోనే యూఎస్ అతిపెద్ద మార్కెట్‌కాగా.. ప్రస్తుతం కంపెనీ ఆదాయంలో వాటా 48%కి పరిమితం కావడం గమనార్హం! -
భారత్ చేతిలో హై పవర్ లేజర్ ఆయుధం
న్యూఢిల్లీ: భారత్ అమ్ములపొదిలో హై పవర్ లేజర్ ఆయుధం వచ్చి చేరింది. అధునాతన అధిక శక్తి కల్గిన 30 కిలోవాట్ల లేజర్ బీమ్ ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఫలితంగా లేజర్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్( (DEW) సిస్టమ్ ద్వారా అధునాతన పవర్ ఫుల్ వెపన్ ను తయారు చేసిన దేశాల జాబితాలో భారత్ చేరిపోయింది. ఇప్పటివరకూ ముందు వరుసలో అమెరికా, రష్యా, చైనాలు ఉండగా, ఇప్పుడు వాటి సరసన భారత్ చేరింది.ఆదివారం కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ (NOAR)లో ఈ విజయవంతమైన ట్రయల్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ లో ఫిక్స్ డ్ వింగ్ డ్రోన్ లు, స్వార్మ్ డ్రోన్ లపై అధునాతన లేజర్ బీమ్‌ను ప్రయోగించారు. ఇది భారత్ సాధించిన మరో విజయందీన్ని సక్సెస్ ఫుల్ గా లేజర్ బీమ్ కూల్చివేయడంతో డీఆర్డీవో సంబరాలు చేసుకుంది. టెక్నాలజీలో ఇది భారత్ సాధించిన మరో విజయంగా పేర్కొంది. భారత్ ట్రయల్ రన్ నిర్వహించిన ఈ లేజర్ బీమ్ కు ఎయిర్ క్రాఫ్ట్ లను, మిస్సెల్స్ ను క్షణాల్లో కూల్చివేసి సామర్థ్యం ఉంది. డీఆర్డీవో చైర్మన్ సమీర్ వీ కామత్ ఆధ్వర్యంలోని ఈ ప్రయోగం చేపట్టారు. ఇది విజయవంతమైన తర్వాత టీమ్ సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేశారు. దీనిలో భాగంగా ఆయన జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. ఇది గగనతలం రక్షణ దళాన్ని మరింత పటిష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయం కావడంతో అధునాతన టెక్నాలజీ కల్గిన అరుదైన దేశాల జాబితాలో చేరినట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల చైనా కూడా ఇదే తరహా టెక్నాలజీతో ఓ పవర్ ఫుల్ బీమ్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే.మనముందు ఇంకా చాలా లక్ష్యాలే ఉన్నాయి..కామత్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ శక్తి సామర్థ్యాలను కల్గి ఉండగా, ఇప్పుడు మనం కూడా వాటి సరసన చేరినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ కూడా ఇదే తరహా టెక్నాలజీతో వెపన్స్ తయారు చేసే పనిలో ఉందన్నారు.మనం ఇంకా చాలా లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. వాటిని సాధించే పనిలోనే ఉన్నాం. హై ఎనర్జీ సిస్టమ్ తో అత్యధిక పవర్ కల్గిన మైక్రోవేవ్స్, ఎలక్ట్రానిక్ మ్యాగ్నటిక్ ఆయుధాలను తయారు చేయడానికి సమాయత్తమైనట్లు ఆయన వెల్లడించారు. మనకున్న పలు రకాలైన సాంకేతిక విజ్ఞానంతో స్టార్ వార్స్ శక్తిసామర్థ్యాలను కల్గిన ఆయుధాలను తీసుకురావచ్చన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా స్టార్ వార్స్ సామర్థ్యం కల్గిన వెపనే అంటూ ఆయన పేర్కొన్నారు. #WATCH | Kurnool, Andhra Pradesh: For the first time, India has showcased its capability to shoot down fixed-wing aircraft, missiles and swarm drones using a 30-kilowatt laser-based weapon system. India has joined list of selected countries, including the US, China, and Russia,… https://t.co/fjGHmqH8N4— ANI (@ANI) April 13, 2025 -
పెట్స్‌కు ఫోన్ చేయండి.. కుక్కల భాష తెలుసుకోండి!
పెంపుడు జంతువులపై ప్రేమతో వాటికి కావాల్సిన వస్తువులు, దుస్తులు, బొమ్మలు ఇలా చాలానే కొంటుంటారు. కాని, ఇప్పుడు ఆ జంతువులకు, వాటి యజమానులకు ఎంతగానో ఉపయోగపడే అత్యాధునిక గాడ్జెట్స్ మీ కోసం..పెట్ ఫోన్పెంపుడు జంతువులకు కూడా ఫోన్ చేసి మాట్లాడే వీలు కల్పిస్తుంది ఈ ‘పెట్ ఫోన్’. దీని ద్వారా మీ పెట్స్ ఎక్కడున్నా, ఎప్పుడైనా సరే వాటికి ఫోన్ చేసి టచ్‌లో ఉండొచ్చు. క్లౌడ్ సిమ్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఫోన్ టూ వే కమ్యూనికేషన్ ఫీచర్‌తో పనిచేస్తుంది. ఇందులోని జీపీఎస్, రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్ సాయంతో సిగ్నల్ తక్కువ ఉన్న ప్రాంతాల్లోనూ వాటి లొకేషన్‌ను గుర్తించి సమాచారం ఇస్తుంది. ధర రూ. 32,411 మాత్రమే!పెంపుడుజీవాల ఆరోగ్యానికి రక్షణపెంపుడు జంతువుల అనారోగ్యం గుర్తించడంలో ఆలస్యం అయితే, వాటి ప్రాణాలకే ప్రమాదం. వాటి ఆరోగ్యం విషయంలో ఎంతగానో జాగ్రత్త తీసుకోవాలి. పెంపుడు జంతువుల హెల్త్ చెకప్ కోసం తయారు చేసినదే ఈ ‘విజ్డమ్ ప్యానెల్ ప్రీమియం’. ఇది డీఎన్ఏ పరీక్ష కిట్‌తో పాటు, వివిధ పరీక్షల ప్యాకేజింగ్‌తో వస్తుంది. ఈ పరీక్షలతో దాదాపు 211 జన్యు, ఇతర ఆరోగ్య పరిస్థితుల ఫలితాలు, వాటి వివరాలను తెలుసుకోవచ్చు. ధర వివిధ ప్యాకేజీలను బట్టి ఉంటుంది.శునక భాషను అనువదిస్తుంది..శునకాలు మూగజీవులైనప్పటికీ వాటికీ ఓ భాష ఉంటుంది. అవి కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాయి. మనకే అర్థం కావు. తాజాగా అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కుక్కల భాషను అర్థం చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన ‘పెట్ ట్రాన్స్‌లేటర్’ను అభివృద్ధి చేశారు. ఈ ప్రత్యేకమైన పరికరం కుక్కలు మొరిగే తీరు, అవి చేసే వివిధ శబ్దాల ఆధారంగా అవి చెప్పాలనకున్న విషయాన్ని మనకు తెలిసిన భాషలో వివరిస్తుంది. ధర 220 డాలర్లు. (రూ. 18,817) మాత్రమే!పాటీ క్లీనర్ ప్రేమగా పెంచుకున్నప్పటికీ పెంపుడు జంతువుల విసర్జనను శుభ్రం చేయడానికి ఇబ్బంది పడుతుంటారు కొందరు. అయితే, ‘ఐ రోబో రోంబా జే7’ వాక్యూమ్ ఈ పనిని చాలా చక్కగా చేస్తుంది. సాధారణ రోబో వ్యాక్యూమ్స్ పాటీలను గుర్తించలేవు. కాబట్టి, వాటిని సరిగ్గా శుభ్రం చేయలేవు. కాని, ఈ రోంబా జే7 పెట్ పాటీలను గుర్తించి ప్రత్యేకంగా వాటిని శుభ్రం చేస్తుంది. ధర 799 డాలర్లు (రూ. 68,322). ఆన్లైన్లో కొనుగోలు చేసే వీలుంది. -
చాట్ జీపీటీ సాయంతో కేసు గెలిచాడు..!
సినిమాల్లో మాదిరి పంచ్ డైలాగ్స్తోనూ, నవ్వులు కురిపించే వాదనలతో కాదు. కేవలం, పదే పది నిమిషాల్లో సూటిగా సుత్తిలేకుండా, ఎటువంటి ఫీజు లేకుండా, అసలు లానే చదవకుండా వాదించాడు ఈ లాయర్. ఆ లాయర్ పేరే ‘చాట్ జీపీటీ’. తాజాగా ఓ కుర్రాడు ఈ టెక్నాలజీ సాయంతోనే కోర్టులో తన కేసు గెలిచాడు. కేసు వాదనలు పట్టుమని పది నిమిషాల్లోనే పూర్తయిపోయాయి. వాయిదాల లాయర్ల మాదిరిగా కాకుండా, చాట్ జీపీటీ ఫటాఫట్ కేసు ముగించేసింది. కజక్స్తాన్లోని అల్మాటీ నగరానికి చెందిన కెంజెబెక్ ఇస్మాయిలోవ్ తన తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో, బేస్‌లైన్ క్రాస్ చేసి, ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించాడు. ఈ అపరాధానికి ప్రభుత్వం అతనికి పదకొండు డాలర్లు (అంటే రూ.940) జరిమానా విధించింది. పుట్టి బుద్ధెరిగాక ఎప్పుడూ కోర్టుకు వెళ్లని ఇస్మాయిలోవ్కి కోర్టు పద్ధతులు తెలియవు. తన కేసును వాదించడానికి లాయర్ల సాయం తీసుకోకుండా, చాట్ జీపీటీ సాయం తీసుకున్నాడు. అది అతనికి కోర్టులో సవాలు చేయమని సలహా ఇవ్వడమే కాదు, కేసు దాఖలు చేయడానికి అవసరమైన పత్రాలను కూడా సిద్ధం చేసింది. పది నిమిషాల విచారణలో, జడ్జి అడిగిన ప్రశ్నలకు చాట్ జీపీటీ స్పీచ్ సింథసిస్ ఫీచర్ ద్వారా అతను సమాధానాలు ఇచ్చాడు. చాట్ జీపీటీ వాదన ఎంతో సమర్థంగా ఉండటంతో జడ్జి జరిమానాను రద్దు చేశారు. (చదవండి: -
సూపర్ సేవర్ ప్యాక్.. 98 రోజుల కొత్త రీచార్జ్ ప్లాన్
దేశంలోని ప్రధాన టెలికాం ఆపరేటర్లలో ఒకటైన రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రారంభిస్తూ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. రీఛార్జ్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కాస్త పొదుపైన, 98 రోజుల సరికొత్త రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, డేటాతోపాటు కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది.జియో రూ.999 ప్లాన్జియో ప్రస్తుతం తన రూ .999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో యూజర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌తో అన్ని లోకల్, ఎస్టీడీ నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్‌ను ఆనందింవచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు.ఇక అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఈ ప్లాన్ 90 రోజులపాటు ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. తద్వారా వినియోగదారులు ప్రస్తుత ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను, సినిమాలను, వెబ్ సిరీస్‌లను ఆస్వాదించవచ్చు. అలాగే ఈ రీఛార్జ్ ప్లాన్‌తో జియో టీవీకి కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది.జియో రూ.1,049 ప్లాన్రూ .999 ప్లాన్‌తో పాటు, దీనికి దగ్గర ఉండే రూ .1,049 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా జియో అందిస్తోంది. దీంతో 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. వినియోగదారులు 50 జీబీ జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా పొందుతారు. ఇది కమ్యూనికేషన్‌తో పాటు స్టోరేజ్ అవసరాలకు అనువుగా ఉంటుంది.ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారి కోసం ఈ ప్లాన్‌లో జియో సినిమా ప్రీమియం (డిస్నీ + హాట్‌స్టార్) కు 90 రోజుల మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు జియో టీవీ మొబైల్ యాప్ ద్వారా జీ5, సోనీలైవ్ యాక్సెస్ లభిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ చేరుకున్న తర్వాత ఇంటర్నెట్ వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. -
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
ప్రీమియం ఫోన్లలో ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫోన్‌ను ఉపయోగించాలని చాలా మందికి ఉంటుంది. అయితే దాని అధిక ధర కారణంగా ఐఫోన్‌ను కొనడం అందరికీ వీలుకాదు. కానీ ఇప్పుడు అతి తక్కువ ధరకు లేటెస్ట్ ఐఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం వచ్చింది.2023లో విడుదలైనప్పటి నుండి యాపిల్ ఐఫోన్ 15.. వివిధ అమెజాన్ డీల్స్ స్థిరంగా లిస్ట్ అవుతూ వస్తోంది. సాధారణంగా ఇచ్చే డిస్కౌంట్లు పెద్దగా వినియోగదారుల దృష్టిని ఆకర్షించనప్పటికీ, ఇప్పటికీ ఆ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి మాత్రం ఈ సారి డీల్ విలువైన అవకాశాన్ని అందిస్తోంది.ఐఫోన్ 15 అమెజాన్ డీల్రాబోయే ఐఫోన్ 16 సిరీస్‌తో అమెజాన్ ఇప్పుడు ఐఫోన్ 15పై గణనీయమైన ధర తగ్గింపును ప్రవేశపెట్టింది. ఇది గతంలో కంటే మరింత ఆకర్షణీయంగా ఉంది. యాపిల్ ఐఫోన్ 15 (128 జీబీ, బ్లాక్) ప్రస్తుతం అమెజాన్‌లో రూ .79,900 ప్రారంభ ధర, దానిపై 23 శాతం డిస్కౌంట్‌తో రూ.61,400 ధరకు లిస్ట్ అయింది. ఇంకా ఎక్కువ పొదుపు చేయాలనుకునేవారు అమెజాన్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.ఉదాహరణకు, ఉపయోగించిన పాత ఐఫోన్ 14 ప్లస్ (512 జీబీ) ను మంచి స్థితిలో ఉంటే దాన్ని ఎక్స్ఛేంజ్ చేస్తే రూ .29,500 తగ్గింపు లభిస్తుంది. ఇలా ఐఫోన్ 15 నికర ధర రూ .31,000 కు తగ్గుతుంది. అదనంగా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ .3,070 అదనపు తగ్గింపు లభిస్తుంది. ఇది తుది ధరను కేవలం రూ .28,830 కు తగ్గిస్తుంది.ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు, ఫీచర్లుఈ ఫోన్ 6.1 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. యాపిల్ మునుపటి మోడళ్ల డిజైన్ ఉన్నప్పటికీ సాంప్రదాయ నాచ్ కు బదులుగా డైనమిక్ ఐలాండ్ నాచ్ ను ప్రవేశపెట్టింది. ఇది ఐఫోన్ 14 ప్రో మోడళ్లలో మంచి ఆదరణ పొందింది.ఈ మోడల్ లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంది. ఇది పగటిపూట, తక్కువ-కాంతి, పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీకి మెరుగ్గా ఉంటుంది.ఐఫోన్ 15 "ఆల్ డే బ్యాటరీ లైఫ్" కలిగి ఉందని యాపిల్ పేర్కొంది. అయితే వాస్తవ వినియోగంలో ఇది సగటు వినియోగంతో 9 గంటలకు పైగా ఉంటుందని సూచిస్తుంది. ఇందులో యూఎస్బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ఉంది.ఇది యాపిల్ ఎ16 బయోనిక్ చిప్ తో పనిచేస్తుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ లలో ఉపయోగించిన ఎ15 చిప్ నుండి అప్ గ్రేడ్ యఅయింది. -
గూగుల్‌లో ఆగని లేఆఫ్‌లు.. మళ్లీ వందలాది తొలగింపులు
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్‌లో (Google) లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తన ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైజెస్ విభాగం నుంచి తాజాగా వందలాది మంది ఉద్యోగులను తొలగించిందని ( layoff )ఆండ్రాయిడ్, పిక్సెల్ స్మార్ట్ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్లో పనిచేసే ఉద్యోగులు ఇందులో ఉన్నారని ‘ది ఇన్ఫర్మేషన్’ అనే వార్తా నివేదిక పేర్కొంది. అయితే ఎంత మంది ఉద్యోగులు తొలగింపులకు గురయ్యారన్న వివరాలు వెల్లడి కాలేదు.తొలగింపు వెనుక కారణం..కార్యకలాపాలను క్రమబద్ధీకరణ, సామర్థ్య పెంపు కోసం గూగుల్ చేస్తున్న విస్తృత ప్రయత్నాలకు అనుగుణంగా ఈ సిబ్బంది పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. గత ఏడాది గూగుల్ తన ఆండ్రాయిడ్, క్రోమ్ టీమ్‌లను పిక్సెల్ అండ్ డివైజెస్ గ్రూప్ కింద విలీనం చేయడంతో ప్రారంభమైన సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా ఈ తొలగింపులు జరిగాయి. జనవరిలో కంపెనీ స్వచ్ఛంద నిష్క్రమణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ తాజా ఉద్యోగ కోతలు ఆ చొరవకు కొనసాగింపు అని సూచిస్తున్నాయి.గూగుల్ ప్రకారం.. చురుకుదనం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడమే పునర్నిర్మాణం లక్ష్యం. ఇది కంపెనీ తన ప్రధాన ఉత్పత్తులు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. వందలాది ఉద్యోగులకు నష్టం కలిగించే ఈ చర్య వ్యయ తగ్గింపు, వనరుల ఆప్టిమైజ్ కోసం మొత్తం టెక్ పరిశ్రమ అవలంభిస్తున్న ధోరణిని ప్రతిబింబిస్తోంది.ఇన్నోవేషన్ పై ప్రభావంపునర్ వ్యవస్థీకరణకు గూగుల్ తీసుకున్న నిర్ణయం ఉత్పత్తుల అభివృద్ధి, ఆవిష్కరణలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనలను రేకెత్తిస్తోంది. కీలక బృందాల్లో తక్కువ మంది ఉద్యోగులతో, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ పురోగతిలో గూగుల్ ఎలా ముందుకు వెళ్తుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంకా నియామకాలు జరుగుతున్నాయని, ఇన్నోవేషన్ పై పూర్తిగా వెనక్కి తగ్గకుండా వనరులను పునర్వినియోగం చేస్తున్నామని కంపెనీ పేర్కొంది.టెక్ పరిశ్రమలో తొలగింపులుఉద్యోగాల కోత, పునర్నిర్మాణ చర్యలను అమలు చేస్తోన్న టెక్ కంపెనీ గూగుల్ ఒక్కటే కాదు. ఆర్థిక అనిశ్చితి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆటోమేషన్ వరకు కారణాలను చూపుతూ అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ సహా పలు బడా టెక్ కంపెనీలు గత ఏడాది ఉద్యోగుల తొలగింపును ప్రకటించాయి. -
ఆన్లైన్లో ఈజీగా హైసెక్యూరిటీ ప్లేట్లు
రాష్ట్రంలో వాహనదారులకు కొత్త నిబంధన అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త, పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్(హెచ్ఎస్ఆర్పీ) ఉండాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటివరకు 2019 ఏప్రిల్ 1 తర్వాత తయారైన వాహనాలకు మాత్రమే ఈ నిబంధన అమలులో ఉండగా, ఇక నుంచి అంతకు ముందు తయారైన వాహనాలకూ ఈ హెచ్ఎస్ఆర్పీ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశిస్తూ రవాణాశాఖ తెలిపింది. ఇందుకు 2025 సెప్టెంబర్ 30 వరకు గడువు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్లోనే సులువుగా ఈ రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఎలా పొందాలో తెలుసుకుందాం.వాహనదారులు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(సియామ్)కు చెందిన అధికారిక వెబ్సైట్ www.siam.in ద్వారా హెచ్‌ఎస్‌ఆర్‌పీని పొందవచ్చు.వెబ్సైట్ హోమ్ పేజీలో కుడివైపు టాప్‌లో ఉన్న ‘బుక్ హెచ్ఎస్ఆర్పీ’పై క్లిక్ చేయాలి.ఆ తర్వాత ప్రత్యేకంగా విండో ఓపెన్ అవుతుంది.అందులో ఫుల్‌నేమ్, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఈమెయిల్, మొబైల్ నంబర్, రాష్ట్రం, జిల్లా వంటివి ఎంటర్ చేసి చెక్‌బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి.మీ వాహనం టైప్(టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్, బస్, ట్రక్, కమర్షియల్ వాహనం) సెలెక్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత కింద కనిపించే మీ వాహన కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి.ఇక్కడ ప్రత్యేకంగా మరో విండో ఓపెన్ అవుతుంది.అందులో మీకు కావల్సిన ‘హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ విత్ కలర్ స్టిక్కర్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.ఇందులో స్టెప్-1 బుకింగ్ డిటెయిల్స్, స్టెప్-2 ఫిట్మెంట్ లొకేషన్, స్టెప్-3 అపాయింట్మెంట్ స్లాట్, స్టెప్-4 బుకింగ్ సమ్మరీ, స్టెప్-5 వెరిఫై డిటెయిల్స్ అండ్ పే, స్టెప్-6 డౌన్లోడ్ రిసిప్ట్ వరకు అన్నింటినీ క్షుణ్ణంగా పూర్తిచేయాలి.స్టెప్-1లో వాహన నంబర్, ఫ్రేమ్/చాసిస్ నంబర్లోని చివరి ఐదు నంబర్లు, ఇంజిన్ నంబర్లోని చివరి ఐదు నంబర్లు ఎంటర్ చేసి క్యాప్చా నంబర్ ఎంటర్ చేయాలి.ఆ తర్వాత మీకు అందుబాటులో ఉన్న డేట్, టైమ్‌ను ఎంపిక చేసుకోవాలి.ఆ తర్వాత మీకు అందుబాటులో ఉన్న ఫిట్మెంట్ లొకేషన్లో సర్వీస్ సెంటర్‌ను ఎంచుకోవాలి. అక్కడే మీ వాహన ప్లేట్‌కు ఖర్చు ఎంత అవుతుందో కనిపిస్తుంది.దాన్ని ఎంచుకుంటే బుకింగ్ సమ్మరీ కనిపిస్తుంది. వివరాలు వెరిఫై చేసుకొని పేమెంట్‌కు వెళ్లొచ్చు.అక్కడ క్రెడిట్, డెబిట్, యూపీఐ, నెట్ బ్యాకింగ్ ఆప్షన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు.డబ్బులు చెల్లించిన తర్వాత వివరాలు చెక్ చేసుకొని అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. సంబంధిత సర్వీస్ సెంటర్ వివరాలు, ఫోన్ నంబర్ ఉంటాయి.అపాయింట్మెంట్ రోజు ఆర్సీ కాపీని వెంట తీసుకెళ్లాలి.ఆ స్లిప్ వ్యాలిడిటీ 28 రోజుల వరకు మాత్రమే ఉంటుంది.ఫిట్‌మెంట్‌కు ఎక్స్ట్రా నగదు చెల్లించాల్సిన అవసరం లేదు.ఏవైనా అభ్యంతరాలుంటే మెయిల్ online@bookmyhsrp.comలో సంప్రదించవచ్చు.ఇదీ చదవండి: ప్రపంచంలోని టాప్ 20 ఎయిర్పోర్ట్లుకొత్త ప్లేట్ల కోసం ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఆలోపు హెచ్ఎస్ఆర్పీలను ఏర్పాటు చేసుకోవాలని, వాటిని ఏర్పాటు చేసుకోని వాహనాలు గడువు తర్వాత రోడ్డెక్కితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని అందులో హెచ్చరించింది. ఫిట్నెస్ టెస్ట్ సహా వాహనాలకు సంబంధించి రవాణాశాఖ ద్వారా ఏ సేవ పొందాలన్నా ఈ నంబర్ ప్లేట్ ఉంటేనే సాధ్యమని, ఆ నంబర్ ప్లేటు లేని వాహనాలకు రవాణాశాఖలో ఎలాంటి సేవలు ఇవ్వబోమని, ఆ వాహనాలకు ఇన్సూరెన్స్ చేయటం కుదరదని తేల్చి చెప్పటం విశేషం. కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసిన సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియతోపాటే హెచ్ఎస్ఆర్పీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.వాహనాలను అనుసరించి ధరలు ఇలా..హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (హెచ్ఎస్ఆర్పీలు) వల్ల కలిగే ప్రయోజనాలుఈ ప్లేట్లు ట్యాంపరింగ్ ఆస్కారాన్ని తగ్గిస్తాయి. వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను దొంగిలించడం లేదా దుర్వినియోగాన్ని కట్టడి చేస్తాయి. ఈ ప్లేట్ల ద్వారా అన్ని వాహనాలకు ఒకే రకమైన నమూనా ఉంటుంది. ఇది రిజిస్ట్రేషన్లను గుర్తించడం, వాటిని ధ్రువీకరించడం అధికారులకు సులభతరం చేస్తుంది. క్రోమియం హోలోగ్రామ్, లేజర్ ఆధారిత వివరాలు డూప్లికేట్ చేయడం దాదాపు అసాధ్యం. వీటిని ఈ ప్లేట్లలో వాడడం వల్ల నకిలీ ప్లేట్లను నిరోధించవచ్చు. ప్లేట్లపై కలర్ కోడెడ్ స్టిక్కర్లు వాహనం ఏ ఇంధన రకానికి చెందిందో (ఉదా. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ లేదా ఎలక్ట్రిక్) సూచిస్తుంది. -
జీతాల పెంపు ఇప్పుడు కాదు..
దేశంలో అగ్ర ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు నిరాశను కలిగించే చేదు వార్తను చెప్పింది. ఏప్రిల్‌లో ప్రారంభం కావాల్సిన వార్షిక వేతన పెంపును వాయిదా వేసింది. నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన అనంతరం మీడియా సమావేశంలో కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది.వేతనాల పెంపును ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో పరిశీలిస్తామని టీసీఎస్ తెలిపింది. నిర్ణయం తీసుకునే ముందు వ్యాపార వాతావరణం మరింత స్థిరంగా మారడానికి వేచి చూస్తున్నామని కంపెనీ అగ్ర నాయకత్వం వెల్లడించింది. వేతనాల పెంపు ఎప్పుడు చేయాలనేది రానున్న రోజుల్లో నిర్ణయిస్తామని ప్రస్తుత చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ ఆర్వో) మిలింద్ లక్కడ్ తెలిపారు. అనిశ్చిత మార్కెట్ పరిస్థితులను ఎదుర్కొంటున్నందున కంపెనీ ఆచితూచి వ్యవహరిస్తున్న వైఖరిని ఆయన ప్రకటన ప్రతిబింబిస్తోంది.ఇప్పటికే చాలా మంది క్లయింట్లు తమ వ్యయాన్ని తగ్గించుకునే సంకేతాలను చూపుతున్నారని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.కృతివాసన్ తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే విచక్షణ వ్యయంలో జాప్యం జరుగుతుందన్నారు. టారిఫ్ సంబంధిత అనిశ్చితి కారణంగా కంపెనీలు తమ బడ్జెట్లను సమీక్షిస్తున్నందున అనేక ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని లేదా తగ్గిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.వార్షిక వేతన పెంపును నిలిపివేసినప్పటికీ, టీసీఎస్ త్రైమాసిక వేరియబుల్ పేను కొనసాగిస్తుంది. నాలుగో త్రైమాసికంలో 70 శాతం మంది ఉద్యోగులకు పూర్తి అర్హత కలిగిన వేరియబుల్ వేతనం అందనుంది. మిగతా సిబ్బందికి వ్యాపార పనితీరు ఆధారంగా వేతనాలు చెల్లిస్తారు.బలంగానే నియామకాలువేతనాల పెంపు ఆలస్యమైనా ఫ్రెషర్ల నియామకాలను కొనసాగిస్తామని టీసీఎస్ తెలిపింది. గత ఏడాది నియామకాల సంఖ్యకు అనుగుణంగా ఈ ఏడాది కాలేజీల నుంచి 42,000 మంది ఇంజినీర్లను నియమించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో టీసీఎస్ 625 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,07,979కి చేరింది.మొత్తంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నికరంగా 6,433 మంది ఉద్యోగులను చేర్చుకుంది. అంతకుముందు సంవత్సరంలోని 13,249 క్షీణత నుంచి కోలుకుంది. నాలుగో త్రైమాసికంలో అట్రిషన్ 13 శాతం నుంచి స్వల్పంగా పెరిగి 13.3 శాతానికి చేరింది. ఇచ్చిన హామీ మేరకు 2025 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ 42,000 మంది ఫ్రెషర్లను విజయవంతంగా ఆన్‌బోర్డ్ చేసిందని లక్కడ్ తెలిపారు.కాగా 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో టీసీఎస్ రూ.12,224 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.12,434 కోట్లతో పోలిస్తే ఇది 1.7 శాతం తక్కువ. ఈ త్రైమాసికంలో ఆదాయం ఏడాది ప్రాతిపదికన 5.3 శాతం పెరిగి రూ.64,479 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 0.79 శాతం పెరిగింది. -
‘ఉప్పల్’లో మరింత ఫాస్ట్‌గా జియో నెట్వర్క్
హైదరాబాద్: దేశవ్యాప్తంగా క్రికెట్ ఉత్సాహం ఊరకలెత్తుతున్న తరుణంలో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ప్రేమికులకు నిరవధిక డిజిటల్ అనుభవం అందించేందుకు రిలయన్స్ జియో ముందుకు వచ్చింది. ప్రతి మ్యాచ్ కు 50,000 మందికి పైగా ప్రేక్షకుల రాకను దృష్టిలో పెట్టుకుని, జియో తన 4జీ, 5జీ నెట్వర్క్ ను స్టేడియం లోపల, బయటా బలోపేతం చేసింది.మ్యాచ్ హైలైట్లు రికార్డ్ చేయడం దగ్గర నుంచి వీడియో కాల్స్ చేయడం వరకు.. స్టేడియంలో ఉన్న అభిమానులు ఇప్పుడు జియో అత్యాధునిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవల ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ను ఆస్వాదించగలుగుతున్నారు. స్టేడియంలో జియో హై-స్పీడ్ ‘జియోనెట్’ వై-ఫై సేవలను కూడా అందిస్తోంది. జియోనెట్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడానికి స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఓటీపీతో నిర్ధారించిన తర్వాత, జియో నెట్ కు కనెక్ట్ అవుతారు. ప్రతి సెషన్ కస్టమర్ కు 480 నిమిషాల హై-స్పీడ్ వైఫైని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.దేశవ్యాప్తంగా ప్రధాన క్రికెట్ స్టేడియాలలో 2,000 కంటే ఎక్కువ ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేసి, జియో ఈ సీజన్లో నెట్వర్క్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది. స్టాండలోన్ 5జీ ఆర్కిటెక్చర్, నెట్వర్క్ స్లైసింగ్, క్యారియర్ అగ్రిగేషన్ సాంకేతికత ఆధారంగా ఈ వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు, అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన 5జీ అనుభవాన్ని అందిస్తున్నాయి. -
470 ఎకరాల అడవిని నిర్మించిన నాయర్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
తన ఎక్స్ ఖాతాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే.. దేశీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. మియావాకి అడవి అంటే ఏమిటో నాకు తెలుసు, కానీ డాక్టర్ నాయర్ గురించి తెలియదు అని పోస్ట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక అడవిని చూడవచ్చు. భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకి అడవిని డాక్టర్ నాయర్ ఎలా సృష్టించారో నాకు తెలియదు. సుస్థిరతకు ప్రాధాన్యం లేని ఈ రోజుల్లో.. మన మధ్య ఇలాంటి హీరోలు ఉండటం గర్వకారణం అని ఆయన ట్వీట్ చేశారు.నాయర్ నిర్మించిన అడవిగుజరాత్లోని కచ్‌లో నాయర్ సుమారు 470 ఎకరాల విస్తీర్ణంలో అడవిని నిర్మించారు. ఇందులో 3,00,000 కంటే ఎక్కువ చెట్లు ఉన్నాయి. ఈ అడవిని జపనీస్ వృక్షశాస్త్రజ్ఞుడు అకిరా మియావాకి టెక్నాలజీ సాయంతో అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిలో సహజ పర్యావరణ వ్యవస్థలను అనుకరించడానికి వివిధ రకాల స్థానిక వృక్ష జాతులను దగ్గరగా నాటడం జరుగుతుంది. దీని ఫలితంగా ఇవి సాధారణ మొక్కలకంటే 10 రెట్లు వేగంగా పెరుగుతాయి.ఎవరీ డాక్టర్ నాయర్డాక్టర్ నాయర్ పర్యావరణవేత్త & ఎన్విరో క్రియేటర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. 2014లో ఈయన 1500 చెట్లతో.. మియావాకి అడవిని ప్రారభించడం మొదలుపెట్టారు. ఇలాంటి అడవులను ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ నిర్మించారు. వీటిలో చెప్పుకోదగ్గది కచ్‌లోని స్మృతివన్ మియావాకి అడవి. దీనిని 2001 గుజరాత్ భూకంప బాధితులకు నివాళిగా నిర్మించారు. కాగా 2030 నాటికి 100 కోట్ల చెట్లను నాటడమే లక్ష్యంగా డాక్టర్ నాయర్ ముందుకు సాగుతున్నారు.మియావాకి పద్దతి1970లో జపనీస్ వృక్షశాస్త్రజ్ఞుడు అకిరా మియావాకి ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో మొక్కలను దగ్గరదగ్గరగా నాటుతారు. కాబట్టి ఇవి సాధారణ చెట్ల కంటే 10 రేట్లు వేగంగా పెరుగుతాయి. ఈ పద్దతిలో మొక్కలను పెంచడం వల్ల మట్టి కూడా ఆరోగ్యంగా ఉంటుందని తెలుస్తోంది.I knew what a Miyawaki forest was but had no idea about Dr Nair and how he had created the world’s largest such forest in India. At a time when the U.S has taken sustainability off its priority list I am just grateful that we have such heroes amongst us…👏🏽👏🏽👏🏽 pic.twitter.com/WNra4TnhVP— anand mahindra (@anandmahindra) April 9, 2025 -
ఐటీ కంపెనీలదే ఆధిపత్యం.. టాప్‌లో టీసీఎస్..
లింక్డ్ఇన్ 2025 టాప్ కంపెనీస్ ఇండియా లిస్ట్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), యాక్సెంచర్, ఇన్ఫోసిస్ తొలి మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ఈ వార్షిక ర్యాంకింగ్ కెరీర్ వృద్ధి, నైపుణ్య అభివృద్ధి, దీర్ఘకాలిక విజయం కోసం ఉత్తమ పని ప్రదేశాలను హైలైట్ చేస్తూ ఉద్యోగార్థులు, ఉద్యోగులు తమ కెరీర్లలో ఎలా ముందుకు వెళ్లాలో మార్గదర్శనం చేస్తుంది.ముందంజలో టెక్ టైటాన్స్టీసీఎస్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్ ల ఆధిపత్యం భారత ఉపాధి రంగంలో టెక్నాలజీ, కన్సల్టింగ్ సేవలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తోంది. ఈ కంపెనీలు తమ ఉద్యోగుల కేంద్రీకృత కార్యక్రమాలకు ప్రత్యేకమైనవిగా నిలుస్తాయి. అప్ స్కిల్లింగ్, నాయకత్వ అభివృద్ధి, సృజనాత్మక-ఆధారిత పని వాతావరణంలో భారీగా పెట్టుబడులు పెడతాయి.క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో గణనీయమైన పెట్టుబడులు పెడుతూ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్‌లో టీసీఎస్ ముందంజలో ఉంది.కన్సల్టింగ్, బిజినెస్ స్ట్రాటజీ, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీలో యాక్సెంచర్ పవర్ హౌజ్‌గా ఉంటూ గ్లోబల్ డిజిటల్ సొల్యూషన్స్‌ను నడిపిస్తోంది.ఏఐ ఇంజినీరింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సస్టెయినబిలిటీ కన్సల్టింగ్‌పై ఇన్ఫోసిస్ దృష్టి సారించింది.ఎమర్జింగ్ ట్రెండ్స్.. హైరింగ్ తీరుతెన్నులులింక్డ్ఇన్ ర్యాంకింగ్ కొన్ని ఆకర్షణీయమైన ధోరణులతో భారతదేశపు అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్‌ను కూడా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది.టాప్ ఇన్-డిమాండ్ రోల్స్: ఫ్రాడ్ అనలిస్టులు, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్టులు, ఫైనాన్షియల్ ఎనలిస్టులు వంటి ఉద్యోగాలకు కంపెనీలు చురుగ్గా నియామకాలు జరుపుతున్నాయి.డిమాండ్ ఉన్న నైపుణ్యాలు: ఏఐ ఇంజినీరింగ్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో నైపుణ్యానికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.పరిశ్రమ మార్పులు: టెక్నాలజీ, ఫైనాన్స్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్లు ఆధిపత్యం కొనసాగిస్తుండగా, టాప్ 25 కంపెనీల్లో 19 కంపెనీలు ఈ రంగాలకు చెందినవే కావడం గమనార్హం.కొత్త కంపెనీలే: ఈ జాబితాలోని కంపెనీల్లో సగానికి పైగా మొదటిసారి ప్రవేశించినవే కావడం యజమాని ప్రాధాన్యతలు, వర్క్ ప్లేస్ అప్పీల్ లో మార్పును సూచిస్తోంది.జాబితాలో టాప్ 10 కంపెనీలు ఇవే..1. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్): ఐటీ సర్వీసెస్2. యాక్సెంచర్: కన్సల్టింగ్ అండ్ ఐటీ సర్వీసెస్3. ఇన్ఫోసిస్: ఐటీ సర్వీసెస్4. ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్: ఫైనాన్షియల్ సర్వీసెస్5. కాగ్నిజెంట్: ఐటీ సర్వీసెస్6. ఒరాకిల్: సాఫ్ట్వేర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్7. జేపీ మోర్గాన్ ఛేజ్: ఫైనాన్షియల్ సర్వీసెస్8. అమెజాన్: ఈ-కామర్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్9. ఆల్ఫాబెట్ ఇంక్ (గూగుల్): టెక్నాలజీ10. డిపాజిటరీ ట్రస్ట్ అండ్ క్లియరింగ్ కార్పొరేషన్ (డీటీసీసీ): ఫైనాన్షియల్ సర్వీసెస్ -
ఇన్స్టాగ్రామ్ లైవ్‌స్ట్రీమ్.. వారికి కొత్త రూల్స్
లండన్: సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో 16 ఏళ్లలోపు టీనేజర్లు ప్రత్యక్షప్రసార సేవ అయిన లైవ్‌స్ట్రీమ్‌లో అనుచిత, అసభ్య, బ్లర్చేయని నగ్న వీడియోలు చూడకుండా కట్టడిచేసే లక్ష్యంతో కఠిన నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాప్లాట్ఫామ్స్ మంగళవారం ప్రకటించింది. తల్లిదండ్రుల సమ్మతితోనే లైవ్‌స్ట్రీమ్ (livestream) సదుపాయం కల్పిస్తామని సంస్థ స్పష్టంచేసింది. తమ అనుబంధ సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్బుక్, మెసెంజర్లలోనూ 18 ఏళ్లలోపు టీనేజర్లకు అదనపు ‘కట్టడి’ చర్యలను అమలుచేస్తామని మెటా పేర్కొంది.టీనేజీ వినియోగదారుల సమయాన్ని, ఆరోగ్యాన్ని సోషల్‌మీడియా (Social Media) తీవ్రంగా ప్రభావితంచేస్తున్న నేపథ్యంలో పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రులకు పూర్తి నిఘా అధికారాలను కట్టబెడుతూ మెటా (Meta) గత సెప్టెంబర్‌లో ‘టీన్ అకౌంట్ ప్రోగ్రామ్’ను అమల్లోకితేవడం తెల్సిందే. ఇన్స్టాగ్రామ్ (Instagram) నూతన కఠిన నిబంధనలను తొలుత అమెరికా, బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియాలలో అమలుచేయనున్నారు. మరికొద్ది నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ నిబంధనలను అమలుచేస్తారు. నిబంధనలు అమల్లోకి వచ్చాక టీనేజర్ల ఖాతాల్లో ఇన్స్టాగ్రామ్ లైవ్ ఆప్షన్ కనపడదు. తల్లిదండ్రుల పర్మిషన్ వచ్చాకే కనిపిస్తుంది. చదవండి: గిబ్లీ–స్టైల్ ఫొటో.. 5 కోట్ల 10 లక్షల వ్యూస్! -
భారత్‌లో మళ్లీ అల్కటెల్ ఫోన్లు..
దేశీ మొబైల్ ఫోన్ల మార్కెట్లో అల్కటెల్ బ్రాండ్‌ను తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు నెక్ట్స్‌సెల్ ఇండియా తాజాగా పేర్కొంది. ఇందుకు వీలుగా తొలి దశలో 3 కోట్ల డాలర్లు(రూ. 260 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. వెరసి ఏడేళ్ల తదుపరి తిరిగి దేశీయంగా అల్కటెల్ బ్రాండ్‌ను విడుదల చేయనుంది.భారత్‌తోపాటు ప్రపంచ మార్కెట్లకు అవసరమయ్యే ప్రత్యేక ఫీచర్స్‌తో స్మార్ట్ఫోన్లను రూపొందించడంపై దృష్టి పెట్టనున్నట్లు నెక్ట్స్‌సెల్ ఇండియా వివరించింది. నోకియాతో ట్రేడ్‌మార్క్ ఒప్పందం కింద అల్కటెల్ బ్రాండ్‌ను చైనీస్ కంపెనీ టీసీఎల్ కమ్యూనికేషన్ నిర్వహిస్తోంది.దేశీయంగా అల్కటెల్ బ్రాండ్ అధీకృత హక్కులను నెక్ట్స్‌సెల్ ఇండియా కలిగి ఉంది. దీంతో అల్కటెల్ ప్రొడక్టుల సంబంధిత అన్నిరకాల కార్యకలాపాలను కంపెనీ నిర్వహించనున్నట్లు నెక్ట్స్‌సెల్ ఇండియా చీఫ్ బిజినెస్ అధికారి అతుల్ వివేక్ వెల్లడించారు. రూ. 20,000 నుంచి రూ. 25,000 ధరల శ్రేణిలో తమకు మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదే స్థాయిలో స్టైలస్‌తో కూడిన స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో తమ బ్రాండ్ ఫోన్ల అమ్మకం కోసం ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కూడా కుదుర్చుకున్నట్లు వివరించారు. -
క్యూఆర్ స్కాన్ చేస్తే ఆధార్ వివరాలు.. కేంద్రం కొత్త యాప్
క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధార్ యాప్‌ను కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టారు. ఇన్స్టంట్ వెరిఫికేషన్, ఆథెంటికేషన్ కోసం రియల్ టైమ్ ఫేస్ ఐడీతో కొత్త యాప్ పని చేస్తుందని చెప్పారు. ఈ యాప్‌తో సులభంగా ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చని తెలిపారు. భారత పౌరులు తమ ఆధార్ కార్డును కొన్ని సందర్భాల్లో భౌతికంగా చూపించడానికి బదులుగా వారి గుర్తింపును ధ్రువీకరించడానికి ఈ యాప్‌ను ఉపయోగించవచ్చని పేర్కొన్నారు.‘కేవలం ఒక ట్యాప్‌తో వినియోగదారులు అవసరమైన డేటాను మాత్రమే ఇతరులతో పంచుకునేలా ప్రభుత్వం వీలు కల్పిస్తుంది. ఇది వారికి తమ వ్యక్తిగత సమాచారంపై పూర్తి నియంత్రణను అందిస్తుంది. న్యూ ఆధార్ యాప్ (బీటా టెస్టింగ్ దశలో ఉంది) ద్వారా వెరిఫికేషన్ యూపీఐ పేమెంట్ చేసినంత సులభంగా ఉంటుంది. యూజర్లు తమ వివరాలు నిర్ధారించేటప్పుడు వారి ఆధార్‌ను డిజిటల్‌గా ధ్రువీకరించవచ్చు. యూపీఐ లావాదేవీల మాదిరిగా కేవలం క్యూఆర్‌ను స్కాన్ చేయడం ద్వారా ఇదంతా సులువుగా చేయవచ్చు’ అని మంత్రి తెలిపారు.ఆధార్ ఫేస్ అథెంటికేషన్దేశంలో యూపీఐ చెల్లింపులకు విస్తృతంగా వినియోగించే క్యూఆర్ కోడ్ల మాదిరిగానే ఆధార్ ధ్రువీకరణకు ‘పాయింట్స్ ఆఫ్ అథెంటికేషన్(వెరిఫికేషన్ భాగస్వాములు)’ వద్ద అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. యూపీఐ యాప్‌ల మాదిరిగానే కొత్త ఆధార్ యాప్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వెంటనే వారి ఫేస్ వెరిఫై ఆప్షన్ వస్తుంది. ఇది ఆధార్ హోల్డర్లకు వారి వ్యక్తిగత సమాచారంపై పూర్తి నియంత్రణను కలిగిస్తుంది. ఈ యాప్ రిక్వెస్ట్ అప్లికేషన్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా డిజిటల్ వెరిఫికేషన్, సమాచార మార్పిడికి అనుమతి లభిస్తుంది. ఇది భౌతిక ఫోటోకాపీల అవసరాన్ని తొలగిస్తుంది. ఇకపై హోటల్ రిసెప్షన్లు, షాపులు, ప్రయాణాల సమయంలో ఆధార్ ఫొటోకాపీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.ఇదీ చదవండి: వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం ఎప్పటి నుంచంటే..బీటా వెర్షన్ఈ యాప్ బీటా వెర్షన్ టెస్టింగ్ దశలో ఉందని మంత్రి అన్నారు. కానీ దేశవ్యాప్తంగా ఇది విస్తృతంగా అమలైతే, పౌరులు ఇకపై వారి భౌతికంగా తమ ఆధార్ లేదా ఫోటోకాపీని ఇవ్వాల్సిన అవసరం తగ్గుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ యాప్‌కు సంబంధించి నిర్దిష్ట యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా యూఐడీఏఐ త్వరలోనే దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. -
మీ ప్రాంతంలో ఏ నెట్వర్క్ వేగంగా ఉంది?: ఇలా తెలుసుకోండి..
దేశంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి టెలికాం సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం జియో అగ్రస్థానంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తుండగా.. మిగిలినవి తరువాత స్థానాల్లో ఉన్నాయి. తమ ప్రాంతంలో ఏ నెట్వర్క్ వేగంగా ఉంది?, దాన్ని ఎలా తెలుసుకోవాలి అనే విషయాలు కొంతమందికి తెలిసి ఉండదు. ఈ కథనంలో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..సరైన మొబైల్ నెట్వర్క్ లేకపోతే.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక కొత్త సిమ్ కార్డును తీసుకోవడానికి ముందే.. మీ ప్రాంతంలో ఏ నెట్వర్క్ వేగంగా ఉందనే విషయం తెలుసుకోవాలి. దీనికోసం మీరు nPerf వెబ్సైట్ లేదా Opensignal యాప్ ఉపయోగించుకోవచ్చు.nPerfలో ఎలా తెలుసుకోవాలంటే..ఎన్పీఈఆర్ఎఫ్ అనేది 2జీ, 3జీ, 4జీ, 5జీ నెట్‌వర్క్‌లను గుర్తించడానికి సహాయపడే వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా మీ ప్రాంతంలో ఏ నెట్వర్క్ ఉత్తమంగా ఉందో ఉచితంగానే తెలుసుకోవచ్చు.➤ముందుగా ఎన్పీఈఆర్ఎఫ్.కామ్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.➤వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత.. ఎడమవైపు పైభాగంలో కనిపించే మై అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి.. ప్రొఫైల్ క్రియేట్ చేయాలి.➤ఆ తరువాత వెబ్సైట్లో కనిపించే మ్యాప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.➤ఆ తరువాత దేశం, మొబైల్ నెట్వర్క్ సెలక్ట్ చేసుకుని.. నగరం ఎంచుకోవాలి.➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. మీ ప్రాంతంలో ఉన్న సిగ్నెల్స్ చూడవచ్చు. ఏ సిగ్నెల్ నెట్వర్క్ ఎక్కువగా ఉందో.. గమనించి సిమ్ కార్డు తీసుకుంటే.. ఎప్పుడు నెట్వర్క్ సమస్య ఉండదు.ఇదీ చదవండి: మరో కొత్త ట్రెండ్!.. క్రికెట్ ప్లేయర్ అవతారమెత్తిన శామ్ ఆల్ట్మాన్ఓపెన్ సిగ్నల్ యాప్ ద్వారా తెలుసుకోవడం ఎలా?ఓపెన్ సిగ్నల్ యాప్ అనేది ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి యూజర్లు ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి ఈ యాప్ (Opensignal) డౌన్లోడ్ చేసుకోవచ్చు.➤యాప్ ఓపెన్ చేసిన తరువాత.. మీకు ఐదు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మూడో ఆప్షన్ మ్యాప్ మీద క్లిక్ చేయాలి.➤మ్యాప్ ఆప్షన్ ఎంచుకున్న తరువాత.. అక్కడే లొకేషన్, ఆపరేటర్, నెట్వర్క్ వంటి వాటిని సెలక్ట్ చేసుకోవాలి.➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. మీ ప్రాంతంలో ఏ నెట్వర్క్ ఎంత ఉందనే విషయం తెలుస్తుంది. దాన్నిబట్టి మీరు ఏ సిమ్ కార్డు తీసుకోవాలనేది తెలుసుకోవచ్చు. -
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
ప్రస్తుతం ఏప్రిల్ నెల ప్రారంభంలో ఉన్నాం. ఈ నెలలో అనేక స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఎంట్రీ లెవల్, మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లతో సహా వివిధ రేంజ్ ధరల్లో శాంసంగ్, ఐక్యూ, వివో, రియల్మీ వంటి బ్రాండ్ల నుంచి అద్భుత ఫీచర్లతో సరికొత్త ఫోన్లు విడుదలకు సిద్ధమయ్యాయి. ఆయా ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు ఇప్పటికే వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో లాంచ్ అవుతున్న కొన్ని స్మార్ట్ఫోన్లు.. వాటి ఫీచర్ల గురించి మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం.రియల్మీ నార్జో 80 ప్రో ఏప్రిల్ 9న రియల్మీ నార్జో 80 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. శక్తివంతమైన డైమెన్సిటీ 7400 చిప్సెట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత. ఎక్కువ కాలం పనిచేసే అంతరాయం లేని మల్టీటాస్కింగ్ కోరుకునే వినియోగదారులకు ఈ కాంబినేషన్ అనువైన ఎంపికగా చేస్తుంది.వివో వీ50ఈ ఏప్రిల్ 10న లాంచ్ కానున్న వీ50ఈతో కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ల సంప్రదాయాన్ని వివో కొనసాగిస్తోంది. సోనీకి చెందిన ఐఎంఎక్స్ 882 సెన్సార్ కలిగిన ఈ ఫోన్ అసాధారణ ఫోటోగ్రఫీ సామర్థ్యాలను అందిస్తుంది, షట్టర్ బగ్స్, కంటెంట్ క్రియేటర్లకు సరైనదిగా ఉంటుంది.ఐక్యూ జెడ్10 7,300 ఎంఏహెచ్ బ్యాటరీతో ఐక్యూ జెడ్10 స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 11న లాంచ్ కానుంది. స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్ సెట్ తో కూడిన ఈ డివైస్ గేమర్స్, హెవీ డ్యూటీ యూజర్ల కోసం రూపొందించారు.శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ ఏప్రిల్ 15న లాంచ్ కానుంది. సొగసైన డిజైన్, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ మొబైల్ టెక్నాలజీలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుందని భావిస్తున్నారు. ఇందులో హైలైట్ ఏంటంటే.. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అద్భుతమైన ఇమేజ్ క్వాలిటీని అందిస్తుంది. -
వైద్య రంగంలో గేమ్ ఛేంజర్‌గా కృత్రిమమేధ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచవ్యాప్తంగా విభిన్న పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఆరోగ్య సంరక్షణలోనూ కృత్రిమమేధ ఎంతగానో తోడ్పడుతుంది. అధునాతన అల్గారిథమ్స్, మెషిన్ లెర్నింగ్, విస్తారమైన డేటాను ఉపయోగించడం ద్వారా ఏఐ రోగి సంరక్షణను మెరుగుపరుస్తుంది.. కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తుంది.. వైద్య పరిశోధనను వేగవంతం చేస్తుంది. ప్రాథమికంగా వ్యాధి గుర్తింపు నుంచి అందుకు అవసరమైన చికిత్సల వరకు ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో, ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో కృత్రిమ మేధ ఒక గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోంది. (నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా..)ప్రాథమికంగా రోగ నిర్ధారణ..ఆరోగ్య సంరక్షణకు ఏఐ సహకారం అందిస్తోంది. సాంప్రదాయ పద్ధతుల కంటే ముందుగానే మరింత కచ్చితంగా వ్యాధులను గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ నమూనాలతో ఎక్స్-రే రిపోర్ట్లు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్లు వంటి మెడికల్ ఇమేజింగ్ వ్యవస్థల ద్వారా మానవుల కంటే మెరుగ్గా వైద్య పరిస్థితులను విశ్లేషిస్తున్నాయి. ఉదాహరణకు, మామోగ్రామ్లలో రొమ్ము క్యాన్సర్ సంకేతాలను గుర్తించడానికి లేదా కంటి స్కాన్లలో డయాబెటిక్ రెటినోపతిని మరింత కచ్చితత్వంతో గుర్తించడానికి ఏఐ వ్యవస్థలు అభివృద్ధి చేశారు.గుండె జబ్బులు, డయాబెటిస్ లేదా అల్జీమర్స్ వంటి పరిస్థితుల అవకాశాలను అంచనా వేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ (ఇహెచ్ఆర్), వేరబుల్స్, జన్యు ప్రొఫైల్స్ నుంచి డేటాను ప్రాసెస్ చేయగలదు. భవిష్యత్తులో తలెత్తె సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా కృత్రిమమేధ త్వరగా వైద్యులకు సమాచారం అందిస్తుంది. ఇది నిత్యం రోగులు వెచ్చించే చికిత్స ఖర్చులను తగ్గిస్తుంది.వైద్య సిఫారసులుఏఐ రోగులకు అనుగుణంగా రిపోర్ట్‌లను విశ్లేషించి చికిత్సలను సూచిస్తుంది. ఇది జన్యు సమాచారాన్ని కూడా అందిస్తుంది. దాంతో జీవనశైలి, వైద్య చరిత్రలు వంటి లార్జ్ డేటాసెట్లను విశ్లేషించి ఏఐ మెరుగై చికిత్సలను అందించేందుకు సాయం చేస్తుంది. ఉదాహరణకు, ఏఐ అల్గారిథమ్స్ రోగి జన్యు డిజైన్ ఆధారంగా నిర్దిష్ట క్యాన్సర్ చికిత్సలను సిఫారసు చేయగలవు. కొత్త మందులకు రోగులు ఎలా స్పందిస్తారో అంచనా వేయడం ద్వారా కృత్రిమ మేధ ఆధారిత సాధనాలు ఔషధ అభివృద్ధికి సహాయపడతాయి. ఇది క్లినికల్ ట్రయల్స్‌ను వేగవంతం చేయడనికి తోడ్పడుతుంది. ఇది నిర్దిష్ట జనాభాకు మరింత ప్రభావవంతమైన మందులను రూపొందించడానికి ఫార్మా కంపెనీలకు సహాయపడుతుంది.పరిపాలనా విధుల్లో..హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ తరచుగా షెడ్యూల్, బిల్లింగ్, రికార్డుల నిర్వహణ వంటి అడ్మినిస్ట్రేటివ్ విధులపై ఉంతో సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ఈ భారాన్ని తగ్గించేందుకు ఏఐ రంగంలోకి దిగుతోంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) సాధనాలు డాక్టర్-రోగి సంభాషణలను విశ్లేషించగలవు. సంబంధిత వివరాలతో ఎలక్ట్రానిక్ హెల్త్ రిపోర్ట్‌లను అప్డేట్ చేయగలవు. చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు రోగులకు డాక్టర్ అపాయింట్మెంట్ బుకింగ్స్‌ను నిర్వహిస్తాయి. సాధారణ రోగి ప్రశ్నలకు సమాధానం కూడా ఇస్తాయి. ఇది ఆసుపత్రులు, క్లినిక్‌లకు నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది.టెలిమెడిసిన్, రిమోట్ కేర్..ముఖ్యంగా కొవిడ్-19 మహమ్మారి వంటి సంఘటనల నేపథ్యంలో టెలిమెడిసిన్ వృద్ధిని కృత్రిమమేధ వేగవంతం చేసింది. ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లు, యాప్‌లు, వీడియో కాల్స్ ద్వారా రోగులు నివేదించిన లక్షణాలను విశ్లేషించడం వల్ల రిమోట్‌గానే సేవలందించింది. కృత్రిమ మేధ ఉపయోగించిన వేరబుల్ పరికరాలు హృదయ స్పందన రేటు లేదా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను ట్రాక్ చేస్తాయి. రియల్ టైమ్‌లోనే అందుకు అనుగుణంగా రోగుల పరిస్థితులపట్ల వైద్యులను అప్రమత్తం చేస్తాయి.పరిశోధనలు వేగవంతంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్య ఆవిష్కరణల వేగాన్ని పెంచుతోంది. విస్తారమైన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని విశ్లేషించడానికి పరిశోధకులు కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. మానవులు కనుగొనడానికి సంవత్సరాలు పట్టే ఔషధ ఆవిష్కరణలో కృత్రిమ మేధ నమూనాలు సమ్మేళనాలు ఎంతో తోడ్పడుతున్నాయి. దీనివల్ల కొత్త మందులను మార్కెట్లోకి తీసుకువచ్చే సమయం, ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. సంక్లిష్ట వ్యాధులను, వాటి పురోగతిని అర్థం చేసుకోవడానికి ఏఐ సహాయపడుతుంది. ఉదాహరణకు, పార్కిన్సన్ వంటి న్యూరోడిజెనరేటివ్ పరిస్థితులు ఎలా అభివృద్ధి చెందుతాయో ఇది అంచనా వేయగలదు.మానసిక ఆరోగ్యానికి మద్దతుగా..ఏఐ మానసిక ఆరోగ్య సంరక్షణలోనూ పురోగతి సాధిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అనువర్తనాలు, చాట్బాట్లు వ్యక్తులకు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ)ని అందిస్తున్నాయి. ఈ సాధనాలు ఆందోళన, నిరాశ లేదా ఒత్తిడి సంకేతాలను విశ్లేషిస్తాయి. అవసరమైనప్పుడు చికిత్సకులను సూచిస్తాయి.ఇదీ చదవండి: కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలుసవాళ్లు-పరిష్కారాలుఆరోగ్య సంరక్షణలో కృత్రిమమేధ ఉంతో తోడ్పాటు అందిస్తున్నప్పటికీ ఈ ఏఐ వ్యవస్థలు సున్నితమైన రోగి సమాచారంపై ఆధారపడతాయి. కాబట్టి డేటా గోప్యత ఒక ప్రధాన ఆందోళనగా ఉంది. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడం, ఈ విభాగంలో చట్టాలకు లోబడి నిబంధనలను పాటించడం చాలా ముఖ్యం. ఈ రంగంలో ఏఐ నమూనాల విశ్లేషణను జాగ్రత్తగా పర్యవేక్షించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. రోగులు ఏఐ సిఫార్సులపై విశ్వాసం కలిగి ఉండేలా విధానాలు పటిష్టంగా రూపొందించాల్సి ఉంటుంది. దీనికి ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయనే దానిపై పారదర్శకత చాలా అవసరం. -
స్మార్ట్ పరుపు.. స్లీప్ ట్రాక్ రింగ్
హెల్త్ ట్రాకర్లు చాలావరకు అన్ని ఆభరణాల రూపాల్లోనూ వచ్చేసినట్టు, అనేక రకాల స్లీప్ ట్రాకర్లు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. వేలికి ధరించే ఈ ‘ఔరా రింగ్ జెన్3’ నిద్ర వ్యవధి, నాణ్యతను ట్రాక్ చేస్తుంది. వీటితోపాటు హృదయ స్పందన, శ్వాస విధానాలు, శరీర కదలికలను కూడా పర్యవేక్షించి, ‘స్లీప్ ఫిట్నెస్ స్కోర్’ను ఇస్తుంది. మొబైల్‌కు అనుసంధానం చేసుకొని, యాప్ సాయంతో ఉపయోగించుకోవచ్చు. ధర రూ. 21,414.స్మార్ట్ పరుపుమంచి నిద్రకు మంచి పరుపు చాలా ముఖ్యం. మెత్తటి పరుపులు నిద్రకు అనుకూలంగా ఉంటాయి. కాని, ఇప్పుడు వచ్చే ఈ స్మార్ట్ పరుపులు మిమ్మల్ని హాయిగా నిద్రపోయేలా చేస్తాయి. ఇవి నిద్ర అలవాట్లు, కదలికలను పర్యవేక్షించడానికి వీటిలో సెన్సార్లు ఉంటాయి. మీరు ఎంత బాగా నిద్రపోతున్నారనే విషయాన్ని ట్రాక్ చేసి, సమాచారం ఇస్తాయి. సౌకర్యవంతంగా ఉండటానికి శరీర ఉష్ణోగ్రతను అనుకూలంగా మార్చి, హాయిగా నిద్రపోయేలా చేస్తాయి. -
నిద్రపుచ్చే రోబో.. దీని రేటెంతో తెలుసా?
కంటి నిండా నిద్రపోతే కలిగే మేలు ఎంతో, కలత నిద్రతో జరిగే కీడు కూడా అంతే! తాజాగా నిద్రలేమి సమస్యతో గుండెజబ్బులు వస్తున్నాయని తేలింది. మిమ్మల్ని హాయిగా నిద్రపోయేలా చేసే స్మార్ట్ టెక్నాలజీతో రూపొందించిన గాడ్జెట్స్ గురించి తెలుసుకుందాం.నిద్రపుచ్చే రోబోఅమ్మలా మిమ్మల్ని జోకొట్టి, పాటలు పాడి, కథలు చెప్పే రోబోలు చాలానే వచ్చేశాయి. అలాంటి వాటిలో ఒకటే ఈ ‘సోమ్నాక్స్ స్లీప్ రోబో’. ఇది మిమ్మల్ని నిద్రపోయే ముందు విశ్రాంతి తీసుకోవడానికి బాగా సహాయపడుతుంది.సంగీతం, కథలను వినిపిస్తూ నిద్ర పుచ్చుతుంది. మెత్తగా, వెచ్చగా ఉండే వీటిని పక్కనే పట్టుకొని నిద్రపోతే ఎటువంటి భయం లేకుండా చాలా ధైర్యంగా ఉంటుంది. ఇక ఇందులో వివిధ ప్రకృతి శబ్దాలు, ఆహ్లాదకరమైన సంగీతంతో పాటు శ్వాస వ్యాయామాలు, ధ్యానం చేసేలా వాల్యూమ్ నియంత్రణలు, నైట్లైట్ ఎంపికలు వంటి ఆప్షన్లు ఉన్నాయి. ధర రూ.46,976. -
ఫ్రీగా జియో హాట్‌స్టార్.. ఆఫర్ ప్లాన్ల పొడిగింపు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫీవర్ దేశాన్ని ఊపేస్తోంది. ఈ ఐపీఎల్-2025 18వ సీజన్ ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఈ సీజన్ ఈసారి కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతోంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జియో హాట్‌స్టార్‌లో ఐపీఎల్‌ను ఉచితంగా వీక్షించే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను జియో లాంచ్ చేసింది.జియో ప్రకటించిన ఆఫర్ల ప్రకారం.. జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందించే ప్రత్యేక ప్లాన్లను రీఛార్జ్ చేసుకునేందుకు మార్చి 31 వరకు అవకాశం ఉండేది. అయితే ఈ టోర్నమెంట్ కు లభిస్తున్న ఆదరణ దృష్ట్యా ఈ ఆఫర్ ను ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తూ జియో నిర్ణయం తీసుకుంది. జియో హాట్‌స్టార్ ఉచిత సబ్స్క్రిప్షన్ కోసం కొత్త జియో సిమ్ కొనడం లేదా ప్రత్యేక ప్లాన్లతో ఇప్పటికే ఉన్న ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో యూజర్లు 4కే రిజల్యూషన్ లో టీవీ, మొబైల్ రెండింటిలోనూ ఐపీఎల్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. ఈ ప్లాన్ ద్వారా అభిమానులు ఈ సీజన్‌లోని ప్రతి మ్యాచ్‌ను ఇంట్లో లేదా ప్రయాణంలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా హై క్వాలిటీ స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు.ఫ్రీ జియో హాట్‌స్టార్ ప్లాన్లు ఇవే..రూ.100 ప్లాన్: ఇది డేటా యాడ్ఆన్ ప్లాన్. దీంతో 5జీబీ డేటా, 90 రోజులపాటు జియో హాట్‌స్టార్ యాక్సెస్ లభిస్తుంది.రూ.195 ప్లాన్: ఇది జియో క్రికెట్ డేటా ప్యాక్. దీంతో 15జీబీ డేటా, 90 రోజులపాటు జియో హాట్‌స్టార్ యాక్సెస్ లభిస్తుంది.రూ.949 ప్లాన్: ఇది 84 రోజుల కాంప్రహెన్సివ్ ప్లాన్. దీంతో ప్రతిరోజూ 2జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్, 5జీ ప్రయోజనాలు ఉంటాయి. 84 రోజులపాటు జియో హాట్‌స్టార్ యాక్సెస్ లభిస్తుంది. అదనంగా జియోక్లౌడ్, ఓటీటీ, ఇతర టెలికమ్ బెనిఫిట్లు ఆనందించవచ్చు. -
ఏఐలో ప్రయివేట్ పెట్టుబడులు గుడ్
న్యూయార్క్: వర్ధమాన దేశాలలో ఏఐ ప్రయివేట్ పెట్టుబడులకు 2023లో చైనా రెండో ర్యాంకును దక్కించుకోగా.. భారత్ టాప్–10గా నిలిచినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రపంచ దేశాలలో ఏఐపై యూఎస్ అత్యధికంగా 67 బిలియన్ డాలర్ల ప్రయివేట్ పెట్టుబడులు వెచ్చించినట్లు వెల్లడించింది. గ్లోబల్ ఏఐ ఇన్వెస్ట్మెంట్లో ఇది 70 శాతంకాగా.. తద్వారా యూఎస్ టాప్ ర్యాంకులో నిలిచినట్లు తెలియజేసింది. వర్ధమాన దేశాలలో చైనా 7.8 బిలియన్ డాలర్లు, భారత్ 1.4 బిలియన్ డాలర్ల ప్రయివేట్ పెట్టుబడులు కేటాయించినట్లు తెలియజేసింది. యూఎన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్(యూఎన్‌సీటీఏడీ) విడుదల చేసిన టెక్నాలజీ, ఇన్నోవేషన్ నివేదిక 2025లో ఈ వివరాలు తెలియజేసింది. 2033కల్లా ప్రపంచవ్యాప్తంగా ఏఐ మార్కెట్ విలువ 4.8 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. వెరసి డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో ప్రధాన పాత్ర పోషించనున్నట్లు అభిప్రాయపడింది. అయితే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నైపుణ్యాలు కొన్ని ఆర్థిక వ్యవస్థలకే పరిమితమవుతున్నట్లు పేర్కొంది. ప్రధానంగా గ్లోబల్ ఆర్అండ్డీ కేటాయింపుల్లో యూఎస్, చైనా 40 శాతం వాటా ఆక్రమిస్తున్నట్లు వెల్లడించింది. -
గిబ్లీ–స్టైల్ ఫొటో.. 5 కోట్ల 10 లక్షల వ్యూస్!
Ghibli & style (గిబ్లీ–స్టైల్) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌గా మారింది. అందరూ తమ ఫొటోలను ఏఐకి ఇచ్చి, దాని ద్వారా గిబ్లీ–స్టైల్ ఫొటోలను పొందుతున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ కారణంగా చాలామంది OpenAI దగ్గరయ్యారు. ఈ ట్రెండ్ ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే, చివరకు OpenAI సీఈవో శామ్ ఆల్ట్మాన్ వచ్చి ‘మీరు కాస్త నిదానించండి. ఇవతల మా ఉద్యోగులు పనిభారంతో చాలా ఒత్తిడికి గురవుతున్నారు’ అని యూజర్లను అభ్యర్థించేంత. మరి బొమ్మలకు ఇంత ప్రచారం కల్పించిన వ్యక్తి గురించి మీకు తెలుసా? ఆయనే సీటల్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ గ్రాంట్ స్లాటన్.మార్చి 26న స్లాటన్ తన భార్య, కుక్కపిల్లతో కలిసి దిగిన ఫొటోను OpenAI ద్వారా గిబ్లీ–స్టైల్ బొమ్మగా మార్చి ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన వెంటనే ఆ ఫొటో వైరల్‌గా మారింది. అందరూ దాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తమకూ అలాంటి ఫొటోలు తయారు చేసుకోవాలని ఉందన్నారు. 50 మిలియన్ల మందిపైగా ఆ పోస్ట్ చూశారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గంటల్లోనే ఈ విషయం ట్విట్టర్లో ట్రెండ్‌గా మారింది. ఇప్పటివరకు 5 కోట్ల 10 లక్షల వ్యూస్ వచ్చాయి.చదవండి: జిబ్లీ ట్రెండ్.. చిక్కులు తెలుసుకోండి!కొందరు ఆ ఫొటోను మెచ్చుకోగా, మరికొందరు దాన్ని విమర్శిస్తూ.. ‘అది చిత్రకారుల గౌరవాన్ని దెబ్బతీస్తోందని’ కామెంట్లు చేశారు. మొత్తానికి ఆ ఫొటో ట్రెండ్ సృష్టించడంతో OpenAI ఆ విషయాన్ని గుర్తించి వెంటనే చర్యలు చేపట్టింది. అందరు యూజర్లు గిబ్లీ–స్టైల్ ఫొటోలు తయారు చేసుకునే అప్డేట్ తీసుకొచ్చింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇది అందరికీ అందుబాటులోకి వచ్చింది. అలా మనం తయారుచేస్తున్న ఫొటోల వెనుక గ్రాంట్ స్లాటన్ చేసిన పని ఉందన్నమాట! tremendous alpha right now in sending your wife photos of yall converted to studio ghibli anime pic.twitter.com/FROszdFSfN— Grant Slatton (@GrantSlatton) March 25, 2025 -
క్షణాల్లో ఫేక్ ఆధార్, పాన్ కార్డులు..
ఏఐ.. అంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. దీని వినియోగం ఇటీవల విస్తృతంగా పెరిగిపోయింది. రోజుకో కొత్త ఏఐ టూల్ అందుబాటులోకి వస్తోంది. వీటిలో ప్రముఖమైంది ఓపెన్ఏఐ సంస్థ సృష్టించిన చాట్‌జీపీటీ. ఇది విడుదలైనప్పటి నుండి వినియోగం ఎంత పెరిగిందో.. గోప్యతా సమస్యలనూ అంతే స్థాయిలో లేవనెత్తుతోంది.ముఖ్యంగా కంటెంట్, చిత్రాల (ఇమేజ్) సృష్టికి సంబంధించి చాట్‌జీపీటీ సామర్థ్యం కలవరపెడుతోంది. అత్యంత వాస్తవికమైన, ఖచ్చితమైన కంటెంట్‌ను సృష్టించే కృత్రిమ మేధ సామర్థ్యం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఇది నకిలీ పత్రాలను సులభంగా సృష్టించడానికి వీలు కల్పిస్తోంది.సాంప్రదాయకంగా ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు పత్రాలకు నకిలీవి సృష్టించడం కష్టతరంగా ఉంటుంది. కానీ జీపీటీ -4 దీనిని చాలా సులభతరం చేసింది. సమర్థవంతమైన, ఖచ్చితమైన ప్రాంప్ట్‌లను ఇవ్వడం ద్వారా మోసగాళ్లు సులభంగా నకిలీ పత్రాలను సృష్టించవచ్చని చాలా మంది ఔత్సాహిక సోషల్ మీడియా యూజర్లు ఇటీవల కనుగొన్నారు.ఇలాంటి ఫోర్జరీ డాక్యుమెంట్ల చిత్రాలను కొందరు మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. "చాట్‌జీపీటీ నకిలీ ఆధార్, పాన్ కార్డులను క్షణాల్లో సృష్టిస్తోంది. ఇది తీవ్రమైన భద్రతా ప్రమాదం. అందుకే ఏఐని కొంతవరకు నియంత్రించాలి" అని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఆధార్, పాన్ కార్డ్ డేటాసెట్లను ఏఐ కంపెనీలకు అమ్మి అటువంటి నమూనాలను తయారు చేస్తోంది ఎవరు? ఫార్మాట్ ను అంత కరెక్ట్ గా అది ఎలా తెలుసుకోగలదు...?" అంటూ మరో యూజర్ ఆందోళన వ్యక్తం చేశారు. ChatGPT is generating fake Aadhaar and PAN cards instantly, which is a serious security risk. This is why AI should be regulated to a certain extent.@sama @OpenAI pic.twitter.com/4bsKWEkJGr— Yaswanth Sai Palaghat (@yaswanthtweet) April 4, 2025 -
ట్రంప్ టారిఫ్‌లు.. ‘ఇండియన్ ఐటీ’కి గట్టి దెబ్బే..
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రతీకార సుంకాలు ప్రపంచ ఆర్థిక కారిడార్లలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వివిధ దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులు, సేవలకు అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు నిర్ణయించారు. దీని ప్రభావం భారత్‌లోని అనేక రంగాలపై పడనుంది. ముఖ్యంగా 280 బిలియన్ డాలర్ల విలువైన భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవల రంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎందుకంటే దీనికి యునైటెడ్ స్టేట్స్ కీలకమైన ఆదాయ వనరు.యూఎస్-ఇండియా టెక్ బంధందశాబ్దాలుగా భారతదేశంలో ఐటీ సేవల రంగం అభివృద్ధి చెందింది. యూఎస్ కంపెనీలతో దాని భాగస్వామ్యం, డిజిటల్ పరివర్తనతో నడిచే ప్రాజెక్టుల స్థిరమైన ప్రవాహం ఇందుకు తోడ్పాటు అందిస్తున్నాయి. భారత ఐటీ పరిశ్రమకు ఆదాయంలో దాదాపు 50% అమెరికన్ మార్కెట్ నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో యూస్ ప్రభుత్వం ప్రకటించిన సుంకాలు అమెరికా-భారత్ టెక్ బంధానికి విఘాతం కలిగిస్తాయన్న ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఈ టారిఫ్‌లు భారతీయ ఐటీ సేవలపై ఆధారపడిన యూఎస్ సంస్థలకు ఖర్చులను పెంచబోతున్నాాయి.తక్షణ పరిణామాలు కొత్త సుంకాలు అమెరికాకు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. కంపెనీలు బడ్జెట్లను కఠినతరం చేయవలసి వస్తుంది. విచక్షణతో కూడిన సాంకేతిక వ్యయంలో వృద్ధి సాధించిన భారత ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి మందగించవచ్చు. 2026 ఆర్థిక సంవత్సరానికి 6-8 శాతం అత్తెసరు వృద్ధి రేటు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇండస్ట్రీ రెస్పాన్స్..యూఎస్ టారిఫ్‌లకు ప్రతిస్పందనగా, భారతీయ ఐటీ సంస్థలు తమ భౌగోళిక పరిధి, క్లయింట్ స్థావరాలను వైవిధ్యపరచడంపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఇంకా, కాస్ట్ ఆప్టిమైజేషన్ వ్యూహాలు, ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, క్లౌడ్ సేవలు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో పెట్టుబడులు ప్రధాన పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఐరోపా, ఆసియా వంటి వెనుకబడిన ప్రాంతాల్లో అవకాశాలను అన్వేషిస్తూ అమెరికా నుంచి డిమాండ్ క్షీణతను పూడ్చడమే ఈ చర్యల లక్ష్యం.కొత్త అవకాశాలూ..ఈ కల్లోలం భారత ఐటీ కంపెనీలకు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మార్గం సుగమం చేస్తుంది. యూఎస్ తయారీ, ఆటోమేషన్ రంగాలకు అనుగుణంగా సృజనాత్మక డిజిటల్ పరిష్కారాలను అందించడం ద్వారా, ఐటీ పరిశ్రమ అమెరికన్ మార్కెట్లో తన ప్రాముఖ్యతను తిరిగి స్థాపించడానికి మార్గాలను కనుగొనవచ్చు.ముందున్న మార్గం తక్షణ సవాళ్లు గణనీయంగా ఉన్నప్పటికీ, భారత ఐటీ సేవల పరిశ్రమ స్థితిస్థాపకతను తక్కువ అంచనా వేయలేము. గతంలో ఆర్థిక మాంద్యం, భౌగోళిక రాజకీయ మార్పుల సమయంలోనూ మన ఐటీ పరిశ్రమ నిలదొక్కుకుంది. అలాగే ప్రస్తుత తుఫానులను కూడా ఎదుర్కోవడమే కాకుండా ఆవిష్కరణ, వైవిధ్యీకరణ ద్వారా మరింత బలంగా ఎదిగే ఈ రంగం సామర్థ్యానికి రాబోయే సంవత్సరాలు పరీక్షగా నిలవనున్నాయి. -
కొత్త రీచార్జ్ ప్లాన్: 2 నెలలు.. 251జీబీ..
ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు ప్రభుత్వ రంగ టెలికాం ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనింత మంది యూజర్లను ఆకర్షించడానికి బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. దాని తాజా ఆఫర్లలో ఒకటైన రూ.251 ప్రీపెయిడ్ డేటా ప్లాన్ మార్కెట్లో పోటీని రేకెత్తిస్తోంది.పరిమిత కాల ఆఫర్బీఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన రూ.251 ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో 251 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తుంది. పెద్ద మొత్తంలో కంటెంట్‌ను స్ట్రీమ్ చేసేవారికి, ముఖ్యంగా ఐపీఎల్ 2025 మ్యాచ్‌లను బఫరింగ్ లేకుండా ఆస్వాదించాలనుకునే క్రికెట్ అభిమానులకు ఇది అద్భుతమైన ఎంపిక. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్, కాబట్టి దీనిని సద్వినియోగం చేసుకోవాలనుకునే వినియోగదారులు వెంటనే బీఎస్ఎన్ఎల్ యాప్ లేదా వెట్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవాలి.ఇది చదివారా? సరికొత్త రీచార్జ్ ప్లాన్.. సగం ఖర్చుతోనే ఎక్కువ రోజులు అన్లిమిటెడ్రీచార్జ్ చేసుకునేవారు ముందుగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది డేటా-ఓన్లీ ప్లాన్. అంటే ఇందులో అపరిమిత కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. మీకు ఆ సేవలు అవసరమైతే అదనపు రీఛార్జ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్ల నుండి పెరుగుతున్న డేటా ఖర్చుల నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ బడ్జెట్ ఫ్రెండ్లీ డేటా ఎంపిక కోసం చూస్తున్నవారికి ఇది అనువైన ప్లాన్. -
మరో కొత్త ట్రెండ్!.. క్రికెట్ ప్లేయర్ అవతారమెత్తిన శామ్ ఆల్ట్మాన్
జిబ్లీ స్టైల్ ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న సమయంలో.. ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ మరో ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. యానిమే స్టైల్ ఫోటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.శామ్ ఆల్ట్మాన్ యానిమే స్టైల్ ఫోటో గమనించినట్లయితే.. ఆల్ట్మాన్ టీమిండియా జెర్సీ వేసుకుని, చేతిలో బ్యాట్ పట్టుకుని.. కళ్ళు బంతిని చూస్తున్నట్లు ఉండటం చూడవచ్చు. మొత్తానికి శామ్ ఆల్ట్మాన్ క్రికెటర్ అవతారమెత్తాడు. ఫోటో షేర్ చేస్తూ.. ''ప్రాంప్ట్: యానిమే స్టైల్లో క్రికెట్ ఆటగాడిగా శామ్ ఆల్ట్మాన్'' అని పేర్కొన్నాడు.శామ్ ఆల్ట్మాన్ టీమిండియా జెర్సీ వేసుకోవడం చాలామందిని ఆకర్శించింది. మీరు ఇండియా తరపున ఆడుతున్నావా?, అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు భారతీయ వినియోగదారులను ఆకర్శించడానికి శామ్ ప్రయత్నిస్తున్నాడని అన్నారు.ఇదీ చదవండి: మారిన రూల్స్.. ఆ టికెట్‌తో ట్రైన్ జర్నీ కుదరదు!భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో ఆధిపత్యాన్ని చెలాయిస్తూ.. ప్రపంచాన్ని అధిగమిస్తోందని చెప్పిన కొన్ని గంటల తరువాత ఆల్ట్మాన్ ఈ పోస్ట్ చేశారు. ఫిబ్రవరిలో భారతదేశ పర్యటన సందర్భంగా కూడా ఏఐ రంగంలో ఇండియా ప్రాముఖ్యతను శామ్ హైలెట్ చేశారు.Are you playing for India?— RB - The Peace Coach (@rajeshbmore) April 2, 2025 -
హెచ్ఎండీ నుంచి 2 మ్యూజిక్ ఫోన్లు
న్యూఢిల్లీ: హ్యూమన్ మొబైల్ డివైజెస్ (హెచ్ఎండీ) తాజాగా రెండు మ్యూజిక్ ఆధారిత ఫీచర్ ఫోన్లను (హెచ్ఎండీ 130 మ్యూజిక్, హెచ్ఎండీ 150 మ్యూజిక్) ప్రవేశపెట్టింది. వీటిలో 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్ 5.0, టైప్ సీ ఫాస్ట్ చార్జింగ్, యూపీఐ పేమెంట్స్ సామర్థ్యాలు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.హెచ్ఎండీ 130 ధర రూ. 1,899గా, హెచ్ఎండీ 150 ధర రూ. 2,399గా ఉంటుంది. రిటైల్ స్టోర్స్, ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంలతో పాటు తమ వెబ్సైట్లో ఇవి లభిస్తాయని సంస్థ గ్లోబల్ చైర్మన్ జీన్ ఫ్రాంకోయిస్ బారిల్ తెలిపారు. త్వరలోనే ఎంట్రీ స్థాయి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.భారత్‌లో విక్రయిస్తున్న దాదాపు అన్ని ఉత్పత్తులు దేశీయంగా తయారైనవేనని హెచ్ఎండీ ఇండియా వీపీ రవి కున్వర్ పేర్కొన్నారు. తమ గ్లోబల్ పోర్ట్‌ఫోలియోలో ఆదాయం, వనరులపరంగా భారత్ కీలక మార్కెట్‌గా ఉంటోందని చెప్పారు. మరోవైపు, ఐపీఎల్ 2025కి సంబంధించి రాజస్థాన్ రాయల్స్‌తో తమ భాగస్వామ్యాన్ని పొడిగించుకున్నట్లు వివరించారు. -
సూపర్ ఫాస్ట్ 5G.. జియో కొత్త సేవలు
రిలయన్స్ జియో 26 గిగాహెర్ట్జ్ మిల్లీమీటర్ వేవ్ (ఎంఎంవేవ్) బ్యాండ్‌లో హై-ఫ్రీక్వెన్సీ 5జీ సేవలను ప్రారంభించింది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పటికే దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉన్న మిడ్-బ్యాండ్ 3.3 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌లో జియో ప్రస్తుత 5జీ కవరేజీని ఎంఎంవేవ్ రోల్అవుట్ భర్తీ చేస్తుంది.ప్రస్తుత మిడ్-బ్యాండ్ 5జీ బలమైన పనితీరు, విస్తృత కవరేజీని అందిస్తూ వినియోగదారుల అవసరాలను చాలా వరకూ తీరుస్తుండగా, ఎంఎంవేవ్ బ్యాండ్ లేదా 26 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను ప్రత్యేక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లు అంటే వాణిజ్య అవసరాల కోసం తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.ఏమిటీ ఎంఎంవేవ్ 5జీ?మిల్లీమీటర్ వేవ్ 5 జి సాంప్రదాయ మొబైల్ నెట్‌వర్క్‌ల కంటే చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీలలో పనిచేస్తుంది. ఇది అల్ట్రా-ఫాస్ట్ డేటా ట్రాన్స్మిషన్, చాలా తక్కువ లేటెన్సీని అనుమతిస్తుంది. అయితే దీని పరిధి పరిమితంగా ఉంటుంది. ఇది భవనాలలోకి చొచ్చుకువెళ్లలేదు. అలాగే విస్తృత ప్రాంతాలను కవర్ చేయలేదు. అందుకే ఎంఎంవేవ్ 5జీకి మరింత దట్టమైన మౌలిక సదుపాయాలు, బేస్ స్టేషన్లు, చిన్న సెల్స్, కచ్చితమైన ప్లేస్మెంట్ అవసరమవుతాయి. దీని వల్ల ఖరీదు కూడా ఎక్కువే.దేశవ్యాప్త వినియోగదారుల రోల్అవుట్ల కంటే నిర్దేశిత ప్రదేశాలల్లో ఏర్పాటుకే ఇవి అనుకూలంగా ఉంటుంది. సరళంగా చెప్పాలంటే, రెగ్యులర్ మొబైల్ బ్రౌజింగ్ లేదా వీడియో స్ట్రీమింగ్ చేసేవారికి ఎంఎంవేవ్ నుండి పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే స్మార్ట్ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్, రిమోట్ సర్జరీలు వంటి ఎంటర్ప్రైజ్ సంబంధిత వినియోగానికి మాత్రం అత్యధిక వేగం, తక్కువ జాప్యంతో ఇది సేవలందిస్తుంది.ఎంఎంవేవ్ 5జీ లాంచ్ ఎక్కడెక్కడంటే..జియో ఎంఎంవేవ్ 5జీ ఇప్పుడు దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉంది. వీటిలో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, బిహార్ ఉన్నాయి. పశ్చిమ భారతదేశంలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జియో ఎంఎంవేవ్ 5జీ అందుబాటులోకి వచ్చింది. ఇక తూర్పు, ఈశాన్య భారతదేశం విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, త్రిపుర, నాగాలాండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. -
భారత్‌లోకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు
యాపిల్ అధికారికంగా భారతదేశంలోని వినియోగదారులకు ‘యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ల’ను విడుదల చేసింది. ఐఓఎస్ 18.4, ఐప్యాడ్ఓఎస్ 18.4, మ్యాక్ఓఎస్ సెకోయా 15.4 అప్డేట్ల్లో ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. వీటిని సర్వీసులను మెరుగు పరిచేందుకు జనరేటివ్ ఏఐను వినియోగించినట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు.యాపిల్ వరల్ట్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2024లో మొదట ఆవిష్కరించిన యాపిల్ ఇంటెలిజెన్స్ క్రమంగా యూఎస్, యూకే, యూరప్, కెనడాలో విస్తరించింది. కొన్ని కారణాల వల్ల ఈ అప్డేట్ను ఇండియాలో ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఇటీవల యాపిల్ ఇంటెలిజెన్స్‌ను భారత్‌లోనూ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లలో ఓఎస్‌ను అప్డేట్ చేసుకొని ఈ ఫీచర్లను ఉపయోగించవచ్చని తెలిపింది.ఇండియాలో అందుబాటులో ఉన్న ఫీచర్లురైటింగ్ టూల్స్ఈమెయిల్, సందేశాలు, గమనికలు, థర్ట్ఫార్టీ అప్లికేషన్లలో టెక్ట్స్‌ను సులువుగా టైప్ చేయడానికి, అందులోని వివరాలను ప్రూఫ్ రీడ్ చేయడానికి వీలు కల్పించారు. ప్రొఫెషనల్ ఈమెయిల్‌ను రూపొందించడం, సాధారణ సందేశాన్ని సిద్ధం చేయడం, వినియోగదారులకు అనుగుణంగా వాటిని సర్దుబాటు చేయడం, వ్యాకరణం, పదాల ఎంపిక, వాక్య నిర్మాణాన్ని మెరుగుపరచడానికి సూచనలు వంటి చాలా అంశాలను ఈ రైటింగ్ టూల్స్‌లో పొందుపరిచారు.మెరుగైన ఫొటోలుఫొటోస్ యాప్‌లో ఏఐను నిక్షిప్తం చేశారు. ఇందులోకి క్లీన్ అప్ టూల్ వినియోగదారులకు ఒరిజినల్ సన్నివేశం పాడవకుండా ఫొటోలోని అనవసర వస్తువులు లేదా వ్యక్తులను తొలగించడానికి అనుమతిస్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫొటోలు, వీడియోలను విశ్లేషిస్తుంది. స్టోరీలను క్రియేట్ చేస్తుంది. జెన్మోజీ ద్వారా కావాల్సిన విధంగా ఫొటోల ఎమోజీలను సృష్టించవచ్చు. మరోవైపు ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్, థీమ్స్, కాస్ట్యూమ్స్ లేదా యాక్సెసరీల ఆధారంగా ప్రత్యేకమైన చిత్రాలను సృష్టించడానికి వినియోగదారులకు వీలు కల్పిస్తుంది.సిరి మరింత తెలివిగా..సిరి యాపిల్ ఇంటెలిజెన్స్‌తో మమేకమై యూజర్ల ప్రశ్నలకు ప్రతిస్పందిస్తుంది. జనరేటివ్ ఏఐ సాయంతో ఈమేరకు సమాధానాలు చెబుతుంది. సిరితో వాయిస్ లేదా టెక్ట్స్ ద్వారా సంభాషించవచ్చు. మెరుగైన భాషా అవగాహన కలిగిన సిరి ఏఐ వినియోగదారులు ప్రశ్నలు అడగడంలో తడబడినప్పటికీ సరైన విధంగా సమాధానం అందించేలా రూపొందించారు.విజువల్ ఇంటెలిజెన్స్ఐఫోన్ 16 సిరీస్, ఐఫోన్ 15 ప్రో మోడళ్లకు ప్రత్యేకంగా ఉన్న ఈ ఫీచర్‌తో తక్షణ సమాచారాన్ని పొందేందుకు వీలవుతుంది. ఉదాహరణకు ఒక పువ్వును ఫొటో తీసేందుకు కెమెరా ముందుంచితే అది పెరుగుతున్న పరిస్థితులు, సంరక్షణ చిట్కాలను వెల్లడిస్తుంది.ఇదీ చదవండి: అమెరికాపై ప్రతిచర్యలు తప్పవు: చైనాచాట్జీపీటీ ఇంటిగ్రేషన్చాట్ జీపీటీని సిరి, రైటింగ్ టూల్స్‌లో ఇంటిగ్రేట్ చేయడానికి యాపిల్ ఓపెన్ ఏఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అధునాతన ఏఐ సామర్థ్యాలతో డాక్యుమెంట్లను విశ్లేషించడం లేదా ఫొటోలకు సంబంధించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వంటి సంక్లిష్ట ప్రశ్నల కోసం సిరి చాట్ జీపీటీని ట్యాప్ చేయవచ్చు. -
జిబ్లీ స్టైల్ ఫోటోపై ఆనంద్ మహీంద్రా రియాక్షన్
సోషల్ మీడియాలో జిబ్లీ ట్రెండ్ కొనసాగుతోంది. ఎక్కడ చూసినా అవే ఫోటోలు. తాజాగా ఆనంద మహీంద్రా జిబ్లీ ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపై వ్యాపార దిగ్గజం స్పందించారు.బైకుపై ఉన్నట్లు కనిపిస్తున్న ఈ ఫోటో ఆనంద్ మహీంద్రాను ఎంతగానో ఆకట్టుకున్నట్టు ఉంది. దీనిపై స్పందిస్తూ.. ఈ జిబ్లీ ఫోటోలను ఎలా చేయాలో నేర్చుకోవాలి అంటూ.. ఒక స్మైమ్ ఎమోజీ యాడ్ చేశారు. ఇంజినీర్స్ వ్యూ అనే ఎక్స్ యూజర్ ఆనంద్ మహీంద్రా బైకుపై ఉన్నట్లు క్రియేట్ చేసి జిబ్లీ స్టైల్లోకి మార్చాడు. ఇప్పుడిది పర్ఫెక్ట్ అంటూ క్యాప్షన్స్ ఇచ్చాడు.😄Have to learn how to do this Ghibli stuff… https://t.co/XnDJArGyWv— anand mahindra (@anandmahindra) April 3, 2025జిబ్లీ స్టూడియోజిబ్లీ అనేది జపనీస్ యానిమేషన్ స్టూడియో. చేతితో గీచే యానిమేషన్, బ్యాక్గ్రౌండ్స్, భావోద్వేగపూరితమైన కథనాలకు ఇది బాగా పాపులర్ అయింది. కాబట్టి ఈ ఫోటోలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలామంది ఫిదా అయిపోయారు. ఇప్పుడు యూత్ మొత్తం తమ ఫోటోలను జిబ్లీ స్టైల్లోకి మార్చుకుని వినియోగించుకుంటున్నారు.జిబ్లీ వినియోగం ఎక్కువ కావడంతో ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ స్పందించారు. జిబ్లీ వినియోగం ఎక్కువగా ఉంది. యూజర్లు ఫోటోలను రూపొందించడంలో కొంత విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే మా సిబ్బందికి కూడా నిద్ర అవసరం కదా అంటూ ట్వీట్ చేశారు. -
ఏజెంటిక్ ఏఐలో భారత్ టాప్!
న్యూఢిల్లీ: కృత్రిమ మేధకు సంబంధించి ఏజెంటిక్ ఏఐ వినియోగంలో భారత్ అగ్రగామిగా ఎదుగుతోంది. దేశీయంగా పలు వ్యాపార సంస్థలు దీనిపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. దాదాపు 80 శాతం సంస్థలు తమ అవసరాల కోసం సొంతంగా ఏఐ ఏజెంట్లను తయారు చేసుకోవడంపై ఆసక్తిగా ఉన్నాయి. భారత్‌లో జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ వినియోగం తీరుతెన్నులపై డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం 80 శాతం భారతీయ సంస్థలు అటానమస్ ఏజెంట్లను తయారు చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఏజెంటిక్ ఏఐ విషయంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకోవడాన్ని ఇది సూచిస్తోందని నివేదిక పేర్కొంది. 70 శాతం కంపెనీలు జెన్ఏఐని ఆటోమేషన్ కోసం ఉపయోగించుకోవడంపై ఆసక్తి కనపర్చగా, సగానికి పైగా కంపెనీలు దాదాపు పది జెన్ఏఐ ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి.మనిషి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండా, స్వతంత్రంగా నిర్దిష్ట పనులను పూర్తి చేసేందుకు ఉపయోగపడే ఏఐ సిస్టమ్‌లను అటానమస్ ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. వివిధ పనులు, ప్రక్రియలను ఆటోమేట్ చేసేందుకు వీటిని వినియోగించుకునే విధానాన్ని ఏజెంటిక్ ఏఐగా పరిగణిస్తారు. ఈ సాంకేతికతపై ఆసక్తి పెరుగుతుండటమనేది .. కొత్త ఆవిష్కరణలు, సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు ఏఐని ఉపయోగించుకునే విధానంలో వస్తున్న మార్పులను సూచిస్తోందని నివేదిక పేర్కొంది. సవాళ్లూ ఉన్నాయి.. ఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ కొన్ని సవాళ్లూ ఉంటున్నాయి. తప్పిదాలు (36 శాతం), పక్షపాతం (30 శాతం), డేటా నాణ్యత (30 శాతం)లాంటివి భారీ స్థాయిలో వినియోగానికి సమస్యగా ఉంటున్నాయి. వెంటనే వినియోగించుకోవడానికి వీలుగా ఉండే రెడీమేడ్ ఏఐని ఎక్కువగా కంపెనీలు ఎంచుకుంటూ ఉండటంతో అవసరాలకు తగ్గట్లుగా వాటిలో పెద్దగా మార్పులు, చేర్పులు చేయడానికి అవకాశాలు ఉండటం లేదు. పైపెచ్చు కొన్నాళ్లకు కొరగాకుండా పోయేలా ఉంటున్నాయి. తాము ప్రస్తుతం ఉపయోగిస్తున్న సొల్యూషన్స్ రెండేళ్లలోపే పనికి రాకుండా పోయే అవకాశం ఉందని 28 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ఆశాభావంతో కంపెనీలు.. ఏఐని విస్తృతంగా వినియోగించుకోవడంపై సవాళ్లు నెలకొన్నప్పటికీ వచ్చే రెండేళ్లలో వాటిని అధిగమించగలమని దేశీ కంపెనీలు ఆశాభావంతో ఉన్నాయి. ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్న ఈ రంగంలో వృద్ధి చెందేందుకు, అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత్ మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ మౌమితా సర్కార్ తెలిపారు. కొన్ని దేశీ సంస్థలు సొంతంగా తయారు చేసుకోవడం కాకుండా ఏఐ సొల్యూషన్స్‌ను కొనుక్కోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో అవసరాలకు అనుగుణంగా మల్చుకోగలిగేలా వాటిని తీర్చిదిద్దాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ పురోగమనంలో ముందంజలో ఉండేందుకు, దీర్ఘకాలంలో అధిక ప్రయోజనాలను పొందేందుకు, పరిస్థితులకు తగ్గట్లుగా మల్చుకోగలిగే ఆవిష్కరణలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని సర్కార్ చెప్పారు. ఇటు వినియోగం వేగవంతం కావడం అటు దీర్ఘకాలంలో నిలబడగలిగే వ్యూహాలను అమలు చేయడం మధ్య సమతూకం పాటించడమే ఏఐపై పెట్టుబడులకు కీలకమని వివరించారు. -
కాగ్నిజెంట్ గ్లోబల్ హెడ్‌గా శైలజ జోస్యుల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సర్వీస్ లైన్ గ్లోబల్ హెడ్‌గా శైలజ జోస్యుల నియమితులయ్యారు. కంపెనీ అంతర్జాతీయ జీసీసీ ప్రణాళికల అమలుకు ఆమె తోడ్పడనున్నారు. గతంలో కాగ్నిజెంట్‌లో ఆరేళ్లు పని చేసిన శైలజ, కొద్ది విరామం తర్వాత తిరిగొచ్చారు.ఆర్థిక సేవల మార్కెట్లో ఆమెకు అపార అనుభవం ఉందని కాగ్నిజెంట్ అమెరికాస్ ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి తెలిపారు. నిరూపితమైన ట్రాక్ రికార్డుతో, శైలజ నాయకత్వం జీసీసీల ఏర్పాటు, అభివృద్ధిలో తమ సామర్థ్యాన్ని పెంచుతుందని, క్లయింట్లకు గొప్ప విలువను అందిస్తుందని పేర్కొన్నారు.ఈవైలో కొంతకాలం పనిచేసిన తర్వాత జోస్యుల తిరిగి కాగ్నిజెంట్‌లో చేరారు. 2018 నుంచి 2024 వరకు కాగ్నిజెంట్‌లో హైదరాబాద్ సెంటర్ హెడ్‌గా, బీఎఫ్ఎస్ఐ ఆపరేషన్స్ డెలివరీ గ్లోబల్ హెడ్‌గా సేవలందించారు. దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉన్న ఆమె థామ్సన్ రాయిటర్స్, హెచ్ఎస్బీసీల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. -
టెక్ లేఆఫ్‌లు.. ఒక్క నెలలో ఎన్ని వేల కోతలో..
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల (layoffs) జోరు తగ్గడం లేదు. గడిచిన మార్చి నెలలో కనీసం 21 కంపెనీలు 8,834 మంది ఉద్యోగులను తొలగించాయని రియల్ టైమ్‌లో టెక్ లేఆఫ్‌లను ట్రాక్ చేసే పోర్టల్ లేఆఫ్స్.ఎఫ్‌వైఐ తెలిపింది. అయితే ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో లేఆఫ్స్ కాస్త తగ్గాయి. ఈ పోర్టల్ ప్రకారం.. ఫిబ్రవరి నెలలో 46 కంపెనీలు 15,994 ఉద్యోగులను తొలగించాయి. ఇది 2025లో ఇప్పటివరకు అదే అత్యధికం.లేఆఫ్స్ కాస్త తగ్గినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగం ఎలా సమూల మార్పులకు లోనవుతోందో ఈ ధోరణి సూచిస్తుంది. మార్చిలో ఉద్యోగులను తొలగించిన కంపెనీల పేర్లలో హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్, నార్త్‌వోల్ట్, బ్లాక్, ఓలా ఎలక్ట్రిక్, నియాంటిక్ వంటివి ప్రముఖంగా ఉన్నాయి. అన్ని రకాల పరిశ్రమలు, ప్రాంతాలు, ఉద్యోగ స్థాయిల్లో ఉద్యోగాల కోతలు పెరిగాయి.ఓలాలో ఉద్యోగాల కోతబెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం ఓలా 1,000 మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని యోచిస్తున్నట్లు మార్చి నెల ప్రారంభంలో వార్తలు వచ్చాయి. పెరుగుతున్న నష్టాలను నియంత్రించుకునే ప్రయత్నంలో భాగంగా కంపెనీ ఈ తొలగింపులను చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రొక్యూర్మెంట్, కస్టమర్ రిలేషన్స్, ఫుల్ఫిల్మెంట్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి పలు విభాగాలపై ఈ ఉద్యోగాల కోత ప్రభావం చూపతోంది. ఐదు నెలల వ్యవధిలో కంపెనీలో ఉద్యోగుల తొలగింపు ఇది రెండోసారి కావడం గమనార్హం. 2024 నవంబర్‌లో ఓలా సుమారు 500 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చింది.భారీ తొలగింపులు ఈ కంపెనీల్లోనే..మార్చిలో హ్యూలెట్ ప్యాకర్డ్ (HP) ఎంటర్ప్రైజెస్ 2,500 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది. సర్వర్ వ్యాపారంలో క్షీణిస్తున్న లాభాలను భర్తీ చేసుకోవడానికి తొలగింపులను అమలు చేస్తున్నట్లు ఈ టెక్ దిగ్గజం ప్రకటించింది. మార్చి 6న ట్రేడింగ్ లో కంపెనీ షేరు 19 శాతం క్షీణించింది. ఉద్యోగుల తొలగింపుతో కూడిన వ్యయ తగ్గింపు కార్యక్రమాన్ని వచ్చే 18 నెలల్లో అమలు చేస్తామని, ఇది 2027 ఆర్థిక సంవత్సరం నాటికి స్థూల పొదుపులో 350 మిలియన్ డాలర్లకు దారితీస్తుందని కంపెనీ తెలిపింది. 2024 అక్టోబర్ నాటికి కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం ఇందులో 61,000 మంది ఉద్యోగులు ఉన్నారు.సగానికి పైగా ఉద్యోగుల తొలగింపుస్వీడిష్ బ్యాటరీ తయారీ సంస్థ నార్త్‌వోల్ట్ దివాలా పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సగానికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. స్వీడన్ లో ఉన్న 4,500 మంది ఉద్యోగుల్లో 2,800 మందిని తొలగించింది. ప్రస్తుతానికి 1,200 మంది ఉద్యోగులను కంపెనీ కొనసాగించనుంది.మరోవైపు, ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సీకి చెందిన ఫిన్‌టెక్ సంస్థ బ్లాక్ 931 మంది ఉద్యోగులను తొలగించింది. పనితీరు ఆధారిత పునర్నిర్మాణమే ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ విస్తృత పునర్నిర్మాణ ప్రయత్నాల్లో భాగంగా తన డబ్లిన్ కార్యాలయం నుండి 300 ఉద్యోగాలను తగ్గించింది. -
ఎక్స్పీరియన్ హైదరాబాద్ జీఐసీ.. ఇప్పుడు డబుల్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డేటా, టెక్నాలజీ దిగ్గజం ఎక్స్పీరియన్, హైదరాబాద్‌లోని తమ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ని (జీఐసీ) మరింతగా విస్తరించింది. గతానికన్నా రెట్టింపు ఆఫీస్ స్పేస్‌తో 85,000 చ.అ. విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటైనట్లు సంస్థ సీఈవో (టెక్నాలజీ సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఇన్నోవేషన్) అలెగ్జాండర్ లింట్నర్ తెలిపారు.ప్రపంచ స్థాయి ప్రోడక్టులు రూపొందించేందుకు, నిరంతరాయంగా సర్వీసులు అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సెంటర్ ప్రధానంగా ఫిన్‌టెక్, అనలిటిక్స్, మోసాల నివారణ వంటి అంశాలకు సంబంధించిన కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెడుతుంది.హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ జీఐసీ ఎక్స్పీరియన్ ప్రపంచవ్యాప్త సాంకేతిక కార్యకలాపాలకు కీలకమైన నాడీ కేంద్రంగా రూపుదిద్దుకుంది. క్లౌడ్ మైగ్రేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పురోగతి, ప్రొడక్ట్ ఇన్నోవేషన్, ప్రాసెస్ ఆటోమేషన్‌లో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. భారత్‌లోని బలమైన ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రతిభను ఉపయోగించుకోవడం ద్వారా, ఎక్స్పీరియన్ ప్రపంచవ్యాప్తంగా స్కేలబుల్, డేటా ఆధారిత పరిష్కారాలను అందించే సామర్థ్యాన్ని పెంచుతోంది. -
చాట్‌జీపీటీ యూజర్లకు గుడ్‌న్యూస్
ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఇటీవల చాట్‌జీపీటీ వినియోగదారుల కోసం కీలక అప్డేట్ను ప్రకటించారు. ఇటీవల చాట్‌జీపీటీలో వైరల్‌గా మారిన ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్ జీబ్లీ సర్వీసును సబ్స్క్రిప్షన్ తీసుకోని వినియోగదారులకు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.‘చాట్‌జీపీటీ ఇమేజ్ జనరేషన్ ఇప్పుడు ఉచిత వినియోగదారులకూ అందుబాటులోకి వచ్చింది’ అని శామ్ ఆల్ట్‌మన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు జీపీటీ-4ఓ యూజర్లకు అందుబాటులో ఉండేది. దాన్ని ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోనివారికి కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఏఐ ఇమేజ్ జనరేషన్‌ను యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేలా ఇటీవల విభిన్న సామాజిక మాధ్యమాల్లో డిమాండ్ వెల్లువెత్తింది. దాంతో ఈమేరకు ఆల్ట్‌మన్ స్పందించడంపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఆమెకు మూడు చేతులు..!chatgpt image gen now rolled out to all free users!— Sam Altman (@sama) April 1, 202526 నెలల క్రితం చాట్‌జీపీటీ ప్రారంభించిన సమయంలో అత్యంత క్రేజ్‌తో క్షణాల్లో ఈ ప్లాట్‌ఫామ్ వైరల్ అయి ఐదు రోజుల్లో 10 లక్షల మంది యూజర్లను సంపాదించుకున్నట్లు ఆల్ట్‌మన్ ఇటీవల చెప్పారు. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన బీజ్లీ స్టూడియో ద్వారా చాట్‌జీపీటీ గతంలో కంటే మరింత వైరల్ అయి కేవలం గంటలోనే 10 లక్షల మంది యూజర్ల బేస్‌ను సంపాదించిందని వివరించారు. ప్రస్తుతానికి కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్యను విడుదల చేయలేదు. ఈ కొత్త ఫీచర్‌ను ఓపెన్ఏఐ గత వారం జీపీటీ-4ఓలో ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఎలాంటి ఎక్స్టర్నల్ టూల్స్ అవసరం లేకుండా నేరుగా చాట్‌జీపీటీలోనే టెక్ట్స్, యూజర్ ఫొటోలు అప్లోడ్ చేసి బీజ్లీ ఇమేజ్‌లను పొందవచ్చు.