మనుషులతో.. మరమనుషుల రన్నింగ్ - వీడియో | World First Humanoid Marathon in China | Sakshi
Sakshi News home page

మనుషులతో.. మరమనుషుల రన్నింగ్ - వీడియో

Apr 19 2025 3:59 PM | Updated on Apr 19 2025 4:10 PM

World First Humanoid Marathon in China

టెక్నాలజీ వేగంగా పరుగులు పెడుతోంది.. దాదాపు అన్ని రంగాల్లోనూ రోబోల హవా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో చైనా మనుషులతో పోటీగా మారథాన్‌లో పరుగులు పెట్టే రోబోట్‌లను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింలో వైరల్ అవుతోంది.

శనివారం (ఏప్రిల్ 19) చైనాలో నిర్వహించిన మారథాన్‌లో.. మనుషులతో పాటు రోబోలు పరుగులు పెట్టాయి. మనుషులతో.. మరమనుషులు పరుగులు పెట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మారథాన్‌లో పాల్గొన్న రోబోట్‌లను 20 కంటే ఎక్కువ కంపెనీలు అభివృద్ధి చేశాయి. రోబోట్‌లు మనుషులు మాదిరిగా కనిపించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది.

ఏప్రిల్‌లో జరగనున్న మారథాన్ బీజింగ్‌లోని డాక్సింగ్ జిల్లాలో నిర్వహించనున్నట్లు, 21 కిమీ మేర డజన్ల కొద్దీ హ్యూమనాయిడ్ రోబోలు 12,000 మంది మానవ అథ్లెట్‌లతో పోటీపడతాయని.. ఈ ఏడాది ప్రారంభంలోనే ఓ వార్త వెల్లడైంది. ఆ విధంగానే మారథాన్ నిర్వహించారు.

చైనా హ్యూమనాయిడ్‌ రోబోలను ఎందుకు అభివృద్ధి చేస్తోంది
చైనాలో వృద్ధాప్య జనాభా పెరిగిపోవడంతో.. శ్రామిక శక్తి తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం జనాభాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఇతర దేశాలతో పోటీపడాలన్న.. ఆర్ధిక వృద్ధిని పెంచాలన్నా శ్రామిక శక్తి అవసరం. దీనిని భర్తీ చేయడానికి చైనా హ్యూమనాయిడ్‌ రోబోలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం.. చైనీస్ క్లయింట్లు 2023లో 2,76,288 రోబోట్‌లను ఇన్‌స్టాల్ చేసారు. దీన్ని బట్టి చూస్తే.. ప్రపంచంలో ఉన్న మొత్తం రోబోట్‌లలో చైనాలో ఉన్న రోబోట్‌లు 51 శాతం అని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement