
సాంకేతికతను వినియోగించడంలో, ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావడంలోనూ యువతరం ముందుంటోంది. నిత్యం మొబైళ్ల తయారీలో వస్తున్న మార్పులను వీరు స్వాగతిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ల పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ఫోన్లలో ఫీచర్లతోపాటు మొబైల్ డిజైన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫోన్ తయారీ కంపెనీలు సైతం వినియోగదారుల అభిరుచుల మేరకు వినూత్న మోడళ్లను నిత్యం ఆవిష్కరిస్తున్నాయి. అందులో భాగంగా స్లిమ్‌గా ఉండే ఫోన్ల తయారీపై సంస్థలు ఫోకస్ పెట్టాయి. వినియోగదారుల చేతిలో ఇట్టే నప్పేలా వాటిని తయారు చేస్తున్నాయి. 2025లో అందుబాటులో ఉన్న కొన్ని స్లిమ్ డిజైన్ ఫోన్ల వివరాలు కింద తెలుసుకుందాం.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25
మందం: 6.2 మి.మీ
స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్
50 ఎంపీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర: సుమారు రూ.65,399
ఒప్పో రెనో13
మందం: 6.5 మి.మీ
డైమెన్సిటీ 8350 ప్రాసెసర్
50 మెగాపిక్సెల్ కెమెరా
5600 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర: సుమారు రూ.35,999
వివో వీ50
మందం: 6.7 మి.మీ
స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్
50 ఎంపీ డ్యుయల్ కెమెరా
6000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర: సుమారు రూ.34,999
ఇదీ చదవండి: ఆర్‌బీఐ రూ.2.75 లక్షల కోట్ల డివిడెండ్?
ఐకూ నియో 10ఆర్
మందం: 6.8 మి.మీ
స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్
50 ఎంపీ కెమెరా
6400 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర: సుమారు రూ.26,999
మోటరోలా ఎడ్జ్ 60 ప్రో
మందం: 6.9 మి.మీ
డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్
50 మెగాపిక్సెల్ కెమెరా
6000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర: సుమారు రూ.29,999