
ప్రపంచాన్ని చుట్టేయడం ఒక అందమైన అనుభవం. అందుకే, చాలామంది కాస్త తీరిక దొరికితే చాలు, బ్యాగ్‌లో బట్టలు సర్దేసుకుని, ప్రయాణాలకు సిద్ధపడుతుంటారు. ఇప్పుడు మీ ప్రయాణాన్ని మరింత సులభంగా, సౌకర్యవంతంగా మార్చేయడానికి అవసరమయ్యే ఎనర్జీ గేర్స్.. ఈ గ్యాడ్జెట్స్..
చేతిలోనే వాటర్ ఫిల్టర్
ప్రయాణించేటప్పుడు ప్రతిచోటా శుభ్రమైన నీరు దొరకడం చాలా కష్టం. అలాగని, అపరిశుభ్రమైన నీటిని తాగితే, రోగాల బారిన పడతాం. ఇందుకోసమే మార్కెట్‌లోకి వివిధ వాటర్ ప్యూరిఫైయింగ్ వాటర్ బాటిల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఇవి ఫిల్టర్, యూవీ– సీ లైట్ పద్ధతులతో నీటిలోని బ్యాక్టీరియా, వైరస్, ఇతర సూక్ష్మజీవులను, మలినాలను తొలగించి శుభ్రమైన తాగునీటిని అందిస్తాయి. ఇవి క్యాంపింగ్, ట్రెక్కింగ్, ట్రావెలింగ్ చేసే వారికి బాగా ఉపయోగపడతాయి. బ్యాటరీలతో పనిచేసే వీటిని చార్జ్ చేసుకొని వాడుకోవచ్చు. ధర వివిధ కంపెనీలను బట్టి రూ. పది నుంచి ఇరవై వేల వరకు ఉంటాయి.
పాకెట్‌లో సూర్యశక్తి
ట్రావెలింగ్ చేస్తూ అడవిలో చిక్కుకున్నా కూడా మీ ఫోన్ బ్యాటరీ తగ్గిపోదు, ఒకవేళ మీ వద్ద ఈ ‘సోలార్ పవర్ బ్యాంక్’ కనుక ఉంటే. దీనిని చాలా చిన్నగా ఎక్కడికైనా సులభంగా జేబులో వేసుకొని వెళ్లేలా రూపొందించారు. ఇది కేవలం సౌరశక్తిని ఉపయోగించి, సుమారు 10,000 ఎమ్‌ఏహెచ్ వరకు బ్యాటరీని స్టోర్ చేసుకోగలదు. ఒకేసారి మూడు పరికరాలను చార్జ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో పాటు, వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్‌తో వస్తుంది. ఇక దీనికున్న రెండు పవర్‌ఫుల్ ఫ్లాష్‌ౖలñ ట్లు మీకు మరో టార్చ్‌తో అవసరం లేకుండా చేస్తాయి. ధర రూ.2,300.
బ్యాగ్ పోయే రోజులు పోయాయి
ప్రయాణాల్లో బ్యాగ్ పోయినా, ఏమాత్రం భయపడనక్కర్లేదు. ఇకపై చిటికెలో పోయిన బ్యాగు ఆచూకీ తెలుసుకోవచ్చు. తాజాగా విడుదలైన ‘అరిస్ట్రా వోల్ట్ స్మార్ట్ లగేజీ బ్యాగ్’లో అబ్బురపరిచే ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. ఇందులోని జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ సులభంగా బ్యాగ్ లొకేషన్‌ను ట్రాక్ చేస్తుంది. మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జ్ చేసుకోవడానికి వీలుగా ఒక ఇంటిగ్రేటెడ్ పవర్‌బ్యాంక్ ఉంటుంది. డిజిటల్ లాక్ సిస్టమ్‌తో బ్యాగ్ భద్రత కూడా క్షేమంగా, సులువుగా మొబైల్‌తోనే చేసేయొచ్చు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఆటోమేటిక్ లగేజీ వెయిట్ చెక్ ఫీచర్. ఇది విమాన ప్రయాణాలు చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది. ధర. రూ.81,100.
మినీ ఐరన్ మాస్టర్
ప్రయాణాల్లో ఎదురయ్యే సమస్యల్లో బట్టల ఇస్త్రీ ఒకటి. సమస్య చిన్నదే అయినా, బిజినెజ్ ట్రిప్స్, ప్రత్యేక కార్యక్రమాలు, ఫంక్షన్స్‌కు వెళ్లేటప్పుడు నలిగిన బట్టల కారణంగా, ట్రిప్ వైబ్ మొత్తం పాడవుతుంది. ఈ చిన్న సమస్యను, ఒక చిన్న పోర్టబుల్ స్టీమ్ ఐరన్‌తో పరిష్కరించవచ్చు. చూడ్డానికి చిన్నగా, అతి తక్కువ బరువుతో ఉంటే ఈ స్టీమ్ ఐర¯Œ , కేవలం కొద్ది సెకండ్లలోనే వేడి అయ్యి, స్టీమ్‌తో బట్టల మడతలను పోగొడుతుంది. యూఎస్‌బీ పోర్ట్ ద్వారా చార్జ్ చే సుకొని వాడుకోవచ్చు. ధర రూ. 999. అంతకంటే తక్కువ, ఎక్కువలోనూ వివిధ బ్రాండ్‌లలో లభిస్తున్నాయి.