ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌స్ట్రీమ్‌.. వారికి కొత్త రూల్స్‌ | Teens under 16 can no longer livestream on Instagram | Sakshi
Sakshi News home page

Instagram: 16 ఏళ్లలోపు వారికి ఇన్‌స్టా లైవ్‌స్ట్రీమ్‌ కుదరదు

Apr 9 2025 5:45 PM | Updated on Apr 9 2025 6:19 PM

Teens under 16 can no longer livestream on Instagram

తల్లిదండ్రుల అనుమతి ఉండాల్సిందే

లండన్‌: సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో 16 ఏళ్లలోపు టీనేజర్లు ప్రత్యక్షప్రసార సేవ అయిన లైవ్‌స్ట్రీమ్‌లో అనుచిత, అసభ్య, బ్లర్‌చేయని నగ్న వీడియోలు చూడకుండా కట్టడిచేసే లక్ష్యంతో కఠిన నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటాప్లాట్‌ఫామ్స్‌ మంగళవారం ప్రకటించింది. తల్లిదండ్రుల సమ్మతితోనే లైవ్‌స్ట్రీమ్‌ (livestream) సదుపాయం కల్పిస్తామని సంస్థ స్పష్టంచేసింది. తమ అనుబంధ సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్‌బుక్, మెసెంజర్‌లలోనూ 18 ఏళ్లలోపు టీనేజర్లకు అదనపు ‘కట్టడి’ చర్యలను అమలుచేస్తామని మెటా పేర్కొంది.

టీనేజీ వినియోగదారుల సమయాన్ని, ఆరోగ్యాన్ని సోషల్‌మీడియా (Social Media) తీవ్రంగా ప్రభావితంచేస్తున్న నేపథ్యంలో పిల్లల ఆన్‌లైన్‌ కార్యకలాపాలపై తల్లిదండ్రులకు పూర్తి నిఘా అధికారాలను కట్టబెడుతూ మెటా (Meta) గత సెప్టెంబ‌ర్‌లో ‘టీన్‌ అకౌంట్‌ ప్రోగ్రామ్‌’ను అమల్లోకితేవడం తెల్సిందే. 

ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) నూతన కఠిన నిబంధనలను తొలుత అమెరికా, బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియాలలో అమలుచేయనున్నారు. మరికొద్ది నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ నిబంధనలను అమలుచేస్తారు. నిబంధనలు అమల్లోకి వచ్చాక టీనేజర్ల ఖాతాల్లో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ ఆప్షన్‌ కనపడదు. తల్లిదండ్రుల పర్మిషన్‌ వచ్చాకే కనిపిస్తుంది. 

చ‌ద‌వండి: గిబ్లీ–స్టైల్‌ ఫొటో.. 5 కోట్ల 10 ల‌క్ష‌ల వ్యూస్!

Advertisement
 
Advertisement
Advertisement