
ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుంటే.. ఆన్‌లైన్ పోర్టల్ సందర్శించాల్సిందే. ఇలా చేయాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అయితే.. డేటా లేకుండా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కష్టమే అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మిస్డ్‌కాల్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. దీని గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
మిస్డ్‌కాల్‌తో పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 9966044425 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఈ నెంబర్‌కు కాల్ చేయగానే ఆటోమేటిక్‌గా కాల్ డిస్‌కనెక్ట్ అవుతుంది. ఆ తరువాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎమ్ఎస్ రూపంలో వస్తుంది.
ఇదీ చదవండి: పాకిస్తాన్ మొత్తం జీడీపీ కలిపితే.. తమిళనాడంత లేదు!
పీఎఫ్ బ్యాలెన్స్ మీకు ఎస్ఎమ్ఎస్ రూపంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు రావాలంటే.. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేట్ అయి ఉండాలి. అంతే కాకుండా మీ నెంబర్ UANకు లింక్ అయి ఉండాలి. కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలి. ఇవన్నీ పూర్తి చేసి ఉంటేనే మీరు పీఎఫ్ బ్యాలెన్సును మెసేజ్ రూపంలో తెలుసుకోగలరు. 7738299899 నెంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు.