సీసం నుంచి గోల్డ్ ఉత్పత్తి: బంగారాన్ని బఠానీల్లా కొనేయొచ్చా? | Physicists Turn Lead into Gold For a Fraction of a Second | Sakshi
Sakshi News home page

సీసం నుంచి గోల్డ్ ఉత్పత్తి: బంగారాన్ని బఠానీల్లా కొనేయొచ్చా?

May 11 2025 3:47 PM | Updated on May 11 2025 4:06 PM

Physicists Turn Lead into Gold For a Fraction of a Second

బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. చాలామందికి గోల్డ్ కొనుగోలు చేయడం, ఇకపై సాధ్యమేనా అనే అనుమానులు కూడా పుడుతున్నాయి. ఇలాంటి సమయంలో.. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్‌(సీఈఆర్ఎన్)లోని భౌతిక శాస్త్రవేత్తలు సీసాన్ని బంగారంగా మార్చడంలో సక్సెస్ సాధించారు.

CERN విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. సీస కేంద్రకాల అధిక శక్తి.. ఘర్షణల సమయంలో బంగారు కేంద్రకాలుగా మారడాన్ని పరిశోధకులు గమనించారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవా సమీపంలోని సీఈఆర్ఎన్ ప్రయోగశాలలో సీసాన్ని బంగారంగా మార్చారు.

మూలకాల మధ్య ప్రోటాన్ సంఖ్యలో తేడాల (సీసానికి 82, బంగారానికి 79) వద్ద బంగారంగా రూపొందించడం కొంత కష్టమే అయినప్పటికీ.. కాంతి వేగంతో ప్రయాణించే సీసపు కిరణాలలోని అయాన్లు అప్పుడప్పుడు ఒకదానికొకటి ఎదురుగా ఢీకొనకుండా  ప్రయాణిస్తాయి. ఇలా జరిగినప్పుడు ఒక అయాన్ చుట్టూ ఉన్న తీవ్రమైన విద్యుదయస్కాంత క్షేత్రం.. శక్తి పల్స్‌ను సృష్టిస్తుంది. ఆ సమయంలో సీసపు కేంద్రకం నుంచి మూడు ప్రోటాన్‌లను బయటకు పంపడానికి ప్రేరేపిస్తుంది. ఇలా జరిగినప్పుడు సీసం బంగారంగా మారుతుంది.

ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు

'సూపర్ ప్రోటాన్ సింక్రోట్రాన్' అని పిలువబడే మరొక సీఈఆర్ఎన్ యాక్సిలరేటర్.. 2002 నుంచి 2004 వరకు సీసం బంగారంగా మారడాన్ని గమనించిందని న్యూయార్క్‌లోని స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ భౌతిక శాస్త్రవేత్త 'జియాంగ్‌యాంగ్ జియా' చెప్పారు. కానీ ఇప్పుడు తాజాగా జరిగిన ప్రయోగాలు అధిక శక్తితో ఉన్నాయి. ఈ విధానంలో బంగారాన్ని మరింత ఎక్కువ సృష్టించవచ్చని ఆయన అన్నారు.

ఈ పద్దతిలోనే మరింత గోల్డ్ ఉత్పత్తి చేస్తే.. బంగారం సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగితే.. డిమాండ్ తగ్గుతుంది. ఇదే జరిగితే బంగారం ధరలు భారీగా తగ్గిపోతాయి. అతి తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement