భారత్‌లో మళ్లీ అల్కటెల్‌ ఫోన్లు.. | Alcatel Returns to India 30mn USD Investment | Sakshi
Sakshi News home page

భారత్‌లో మళ్లీ అల్కటెల్‌ ఫోన్లు.. ఏడేళ్ల తర్వాత రీఎంట్రీ

Apr 9 2025 3:35 PM | Updated on Apr 9 2025 3:46 PM

Alcatel Returns to India 30mn USD Investment

దేశీ మొబైల్‌ ఫోన్ల మార్కెట్‌లో అల్కటెల్‌ బ్రాండ్‌ను తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు నెక్ట్స్‌సెల్‌ ఇండియా తాజాగా పేర్కొంది. ఇందుకు వీలుగా తొలి దశలో 3 కోట్ల డాలర్లు(రూ. 260 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వెల్లడించింది. వెరసి ఏడేళ్ల తదుపరి తిరిగి దేశీయంగా అల్కటెల్‌ బ్రాండ్‌ను విడుదల చేయనుంది.

భారత్‌తోపాటు ప్రపంచ మార్కెట్లకు అవసరమయ్యే ప్రత్యేక ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్లను రూపొందించడంపై దృష్టి పెట్టనున్నట్లు నెక్ట్స్‌సెల్‌ ఇండియా వివరించింది. నోకియాతో ట్రేడ్‌మార్క్‌ ఒప్పందం కింద అల్కటెల్‌ బ్రాండ్‌ను చైనీస్‌ కంపెనీ టీసీఎల్‌ కమ్యూనికేషన్‌ నిర్వహిస్తోంది.

దేశీయంగా  అల్కటెల్‌ బ్రాండ్‌ అధీకృత హక్కులను నెక్ట్స్‌సెల్‌ ఇండియా కలిగి ఉంది. దీంతో అల్కటెల్‌ ప్రొడక్టుల సంబంధిత అన్నిరకాల కార్యకలాపాలను కంపెనీ నిర్వహించనున్నట్లు నెక్ట్స్‌సెల్‌ ఇండియా చీఫ్‌ బిజినెస్‌ అధికారి అతుల్‌ వివేక్‌ వెల్లడించారు. 

రూ. 20,000 నుంచి రూ. 25,000 ధరల శ్రేణిలో తమకు మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదే స్థాయిలో స్టైలస్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేయబోతున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో తమ బ్రాండ్‌ ఫోన్ల అమ్మకం కోసం ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కూడా కుదుర్చుకున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement