
గూగుల్ దాదాపు దశాబ్ద కాలం తర్వాత తన ఐకానిక్ లోగోలో మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ లోగో ‘జీ’ను కొత్త డిజైన్‌తో పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కొత్త లోగో వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఇది ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో బ్లాక్‌లకు బదులుగా ఒకే రంగులో ఫ్లూయిడ్ గ్రేడియంట్ విధానాన్ని అనుసరించింది. 2015 నుంచి ‘జీ’ లోగోను కంపెనీ మార్పు చేయలేదు.
న్యూ లుక్: డిఫరెంట్ ఏంటి?
కొన్నేళ్లుగా ఫ్లాట్‌గా బ్లాక్‌ల్లో రంగులకు బదులుగా ‘జీ’ లోగో ఇప్పుడు నాలుగు రంగులను మిళితం చేసే గ్రేడియంట్‌ను కలిగి ఉంది. ఇది ఐకాన్‌కు మరింత ఆధునికత, డైనమిక్ రూపాన్ని ఇస్తుంది. అన్ని విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకోవాలనే గూగుల్ ఉద్దేశానికి ఇది ఒక చిహ్నంగా పనిచేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏఐ జనరేటివ్ అసిస్టెంట్ గూగుల్ జెమిని బ్రాండింగ్‌కు అనుగుణంగా ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: పడి లేచిన పసిడి ధరలు! తులం ఎంతంటే..
ఐఓఎస్, పిక్సెల్ యూజర్లకు..
గూగుల్ సెర్చ్ యాప్ ద్వారా ముందుగా ఐఓఎస్, పిక్సెల్ యూజర్లకు కొత్త ‘జీ’ లోగో అందుబాటులోకి రానుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గూగుల్ యాప్ బీటా వెర్షన్ 16.18 ద్వారా కొన్ని ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో కూడా దీన్ని ఉపయోగించనున్నట్లు చెప్పారు. గూగుల్ ఇంకా దీని విడుదల తేదీని తెలియజేయలేదు. అయితే రాబోయే కొన్ని వారాల్లో కొత్త లోగో మరిన్ని డివైజ్‌ల్లో అందుబాటులో ఉంటుందని తెలిసింది. క్రోమ్, మ్యాప్స్, జీమెయిల్, డ్రైవ్ వంటి ఇతర లోగోలను మారుస్తారా.. లేదా యథావిధిగా ఉంచుతారా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.