‘ఉప్పల్’లో మరింత ఫాస్ట్‌గా జియో నెట్‌వర్క్ | Jio has strengthened its network in and around Uppal Cricket Stadium Hyderabad | Sakshi
Sakshi News home page

‘ఉప్పల్’లో మరింత ఫాస్ట్‌గా జియో నెట్‌వర్క్

Apr 10 2025 6:32 PM | Updated on Apr 10 2025 7:15 PM

Jio has strengthened its network in and around Uppal Cricket Stadium Hyderabad

హైదరాబాద్: దేశవ్యాప్తంగా క్రికెట్ ఉత్సాహం ఊరకలెత్తుతున్న తరుణంలో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ప్రేమికులకు నిరవధిక డిజిటల్ అనుభవం అందించేందుకు రిలయన్స్ జియో ముందుకు వచ్చింది. ప్రతి మ్యాచ్ కు 50,000 మందికి పైగా ప్రేక్షకుల రాకను దృష్టిలో పెట్టుకుని, జియో తన 4జీ, 5జీ నెట్‌వర్క్ ను స్టేడియం లోపల, బయటా బలోపేతం చేసింది.

మ్యాచ్ హైలైట్‌లు రికార్డ్ చేయడం దగ్గర నుంచి వీడియో కాల్స్ చేయడం వరకు.. స్టేడియంలో ఉన్న అభిమానులు ఇప్పుడు జియో అత్యాధునిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవల ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్‌ను ఆస్వాదించగలుగుతున్నారు. స్టేడియంలో జియో హై-స్పీడ్ ‘జియోనెట్’ వై-ఫై సేవలను కూడా అందిస్తోంది.  

జియోనెట్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడానికి స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఓటీపీతో నిర్ధారించిన తర్వాత, జియో నెట్ కు కనెక్ట్ అవుతారు. ప్రతి సెషన్ కస్టమర్ కు 480 నిమిషాల హై-స్పీడ్ వైఫైని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.

దేశవ్యాప్తంగా ప్రధాన క్రికెట్ స్టేడియాలలో 2,000 కంటే ఎక్కువ ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేసి, జియో ఈ సీజన్‌లో నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది. స్టాండలోన్ 5జీ ఆర్కిటెక్చర్, నెట్‌వర్క్ స్లైసింగ్, క్యారియర్ అగ్రిగేషన్ సాంకేతికత ఆధారంగా ఈ వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు, అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన 5జీ అనుభవాన్ని అందిస్తున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement