హైదరాబాద్‌లో జియో టాప్‌.. ట్రాయ్‌ టెస్ట్‌లో బెస్ట్‌ | Jio leads in Trai Drive Test in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో జియో టాప్‌.. ట్రాయ్‌ టెస్ట్‌లో బెస్ట్‌

May 16 2025 6:16 PM | Updated on May 16 2025 7:10 PM

Jio leads in Trai Drive Test in Hyderabad

హైదరాబాద్: రిలయన్స్ జియో హైదరాబాద్‌లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది. కీలకమైన వాయిస్, డేటా పనితీరులో ఇతర టెల్కోలను జియో వెనక్కి నెట్టింది. ఇటీవల ట్రాయ్‌ (TRAI) నిర్వహించిన ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్ (IDT)లో  జియో తన  బలమైన మొబైల్ నెట్‌వర్క్ సామర్ధ్యాన్ని నిరూపించుకుంది.

ట్రాయ్ నివేదిక ప్రకారం రిలయన్స్ జియో తన 4G నెట్‌వర్క్‌లో 240.66 Mbps సగటు డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది.  ఇది నగరంలోని అన్ని ఆపరేటర్లలో అత్యధికం. ఈ అసాధారణ పనితీరు వల్ల జియో కస్టమర్‌లు గరిష్ట వినియోగ సమయాల్లో కూడా వేగవంతమైన వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, వేగవంతమైన యాప్ డౌన్‌లోడ్‌లు, అంతరాయం లేని బ్రౌజింగ్‌ను ఆస్వాదించేలా చేస్తుంది.

ఈ ఫలితాలు..  జియోను అధిక డౌన్‌లింక్ వేగం, తక్కువ లేటెన్సీ కలిగిన ఉత్తమ నెట్‌వర్క్‌గా నిలబెట్టాయి. అతి తక్కువ లేటెన్సీ వినియోగదారులు, సర్వర్‌ల మధ్య డేటా ప్యాకెట్‌లు ప్రయాణించడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.  ఇది వీడియో కాన్ఫరెన్సింగ్ మరియు ఆన్‌లైన్ గేమింగ్ వంటి రియల్-టైమ్ అప్లికేషన్‌లకు అత్యంత అవసరం.

మరోవైపు వాయిస్ సేవలలో కూడా జియో పనితీరు అంతే బలంగా ఉంది.  జియో సేవలు అధిక కాల్ సెటప్ సక్సెస్ రేటు, తక్కువ కాల్ సెటప్ సమయం, అతి తక్కువ కాల్ డ్రాప్ రేటు, అద్భుతమైన వాయిస్  స్పష్టత  అందిస్తున్నాయని ట్రాయ్ నివేదిక సూచిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement