breaking news
TRAI testing
-
హైదరాబాద్‌లో జియో టాప్.. ట్రాయ్ టెస్ట్‌లో బెస్ట్
హైదరాబాద్: రిలయన్స్ జియో హైదరాబాద్‌లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది. కీలకమైన వాయిస్, డేటా పనితీరులో ఇతర టెల్కోలను జియో వెనక్కి నెట్టింది. ఇటీవల ట్రాయ్ (TRAI) నిర్వహించిన ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్ (IDT)లో జియో తన బలమైన మొబైల్ నెట్వర్క్ సామర్ధ్యాన్ని నిరూపించుకుంది.ట్రాయ్ నివేదిక ప్రకారం రిలయన్స్ జియో తన 4G నెట్‌వర్క్‌లో 240.66 Mbps సగటు డౌన్లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఇది నగరంలోని అన్ని ఆపరేటర్లలో అత్యధికం. ఈ అసాధారణ పనితీరు వల్ల జియో కస్టమర్లు గరిష్ట వినియోగ సమయాల్లో కూడా వేగవంతమైన వీడియో స్ట్రీమింగ్, ఆన్లైన్ గేమింగ్, వేగవంతమైన యాప్ డౌన్లోడ్లు, అంతరాయం లేని బ్రౌజింగ్‌ను ఆస్వాదించేలా చేస్తుంది.ఈ ఫలితాలు.. జియోను అధిక డౌన్‌లింక్ వేగం, తక్కువ లేటెన్సీ కలిగిన ఉత్తమ నెట్‌వర్క్‌గా నిలబెట్టాయి. అతి తక్కువ లేటెన్సీ వినియోగదారులు, సర్వర్ల మధ్య డేటా ప్యాకెట్లు ప్రయాణించడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది వీడియో కాన్ఫరెన్సింగ్ మరియు ఆన్లైన్ గేమింగ్ వంటి రియల్-టైమ్ అప్లికేషన్లకు అత్యంత అవసరం.మరోవైపు వాయిస్ సేవలలో కూడా జియో పనితీరు అంతే బలంగా ఉంది. జియో సేవలు అధిక కాల్ సెటప్ సక్సెస్ రేటు, తక్కువ కాల్ సెటప్ సమయం, అతి తక్కువ కాల్ డ్రాప్ రేటు, అద్భుతమైన వాయిస్ స్పష్టత అందిస్తున్నాయని ట్రాయ్ నివేదిక సూచిస్తోంది. -
జియో డేటా స్పీడు దారుణం!
• టాప్-5 సంస్థల్లో అతి తక్కువ వేగం దీనిదే • ట్రాయ్ పరీక్షల్లో వెల్లడైన వాస్తవం • సేవల వేగంలో ఎయిర్టెల్ టాప్ న్యూఢిల్లీ: ‘4జీ టెక్నాలజీతో దేశంలో డేటా విప్లవాన్ని సృష్టిస్తాం. వేగవంతమైన డేటా సేవలు అందిస్తాం’ అంటూ టెలికం రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన రిలయన్స్ జియో ప్రకటనలు... ఆచరణలో అంతంతమాత్రమేనని తేలుతోంది. 4జీ టెక్నాలజీ అంటేనే వేగంతో కూడుకున్నది కనుక జియో ప్రకటనలను కస్టమర్లు పూర్తిగా విశ్వసించారు. ‘90 రోజుల పాటు జియో సేవల అనుభవాన్ని ఉచితంగా, అపరిమితంగా ఆస్వాదించండంటూ’ చేసిన ప్రకటన చూసి త్రీజీ ఫోన్లను ఎక్స్చేంజ్ చేసుకునో, పక్కన పడేసో 4జీ ఫోన్లకు మారిపోయిన వారు ఎందరో!!. కానీ ఆచరణలోకి వచ్చే సరికి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. రిలయన్స్ జియో డేటా స్పీడు వేగంగా లేదు. సరికదా దారుణంగా ఉంది. స్పీడు సంగతి పక్కనబెడితే చాలా ప్రాంతాల్లో అసలు కనెక్టివిటీనే లేదు. 5 ప్రధాన టెల్కోల 4జీ డేటా వేగాన్ని పరీక్షించగా ఆఖరి స్థానంలో ఉన్నది జియోనేనని సాక్షాత్తూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’... డేటా పరీక్షలు నిర్వహించి మరీ తేల్చింది. దీని ప్రకారం... ⇔ ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్, ఆర్‌కామ్, రిలయన్స్ జియోకు చెందిన 4జీ డేటా సేవల వేగాన్ని ట్రాయ్ పరీక్షించి చూసింది. వీటిలో జియో డేటా సేవల వేగం మిగిలిన సంస్థల సేవల కంటే మెల్లగా ఉంది. 4జీ సేవల వేగంలో అన్నింటికంటే ముందు ఎయిర్టెల్ నిలిచింది. ⇔ ఎయిర్టెల్ 4జీ వేగం సెకనుకు 11.4 మెగాబైట్స్ (ఎంబీపీఎస్) ఉంది. అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్ 4జీ సేవల వేగం 7.9 ఎంబీపీఎస్‌గా ఉంది. ఐడియా 7.6 ఎంబీపీఎస్, వొడాఫోన్ సేవలు 7.3 ఎంబీపీఎస్‌గా ఉన్నట్టు ట్రాయ్ గుర్తించింది. ఇక జియో 4జీ డేటా సేవల వేగం సెకనుకు 6.2 ఎంబీపీఎస్‌గా ఉందని వెల్లడైంది. విభేదించిన జియో: ట్రాయ్ గణాంకాలతో జియో విభేదించింది. ట్రాయ్ అనలిటిక్స్ వెబ్సైట్లో పేర్కొన్న గణాంకాల తర్వాత తాము సైతం అంతర్గతంగా పరీక్షించి చూశామని... జియో వేగాన్ని ఇతర ఆపరేటర్లతో ఏకపక్షంగా పోల్చి చూసినట్టు తాము భావిస్తున్నామని జియో ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారుడి రోజువారీ పారదర్శక వినియోగం (ఎఫ్‌యూపీ) పరిమితి 4జీబీ పూర్తయిన తర్వాత వేగాన్ని పరీక్షించి ఉండొచ్చని సందేహం వ్యక్తం చేసింది. ఈ పరిమితి తర్వాత వేగం 256 కేబీపీఎస్‌కు పడిపోతుందని తెలియజేసింది.