
ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఒకరినొకరు కమ్యునికేట్ అవ్వడానికి, సమర్థవంతంగా పనిచేయడానికి, వినోదాన్ని ఆస్వాదించడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి స్మార్ట్‌ఫోన్లు చాలా అవసరం. అయితే ఈ రంగంలో నిత్యం కొత్త కంపెనీలు విభిన్న మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలో మెరుగైన ఫోన్‌ను ఎంచుకోవడం కష్టంగా మారింది. కొన్ని సంస్థలు అందించిన వివరాల ప్రకారం రూ.10,000లోపు ధర ఉన్న టాప్ 10 మొబైళ్ల వివరాలు కింది తెలియజేశాం.
ఇదీ చదవండి: ఫెడ్ ఛైర్మన్‌ను తొలగిస్తామని ట్రంప్ హెచ్చరిక
ఐటెల్ కలర్ ప్రో 5జీ: 6.6 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్(ఎంపీ కెమెరా).
ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ: 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (ఆక్టాకోర్, 2.4గిగాహెర్ట్జ్) ప్రాసెసర్.
పోకో సీ 71: 6.88 అంగుళాల డిస్‌ప్లే, 32 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్‌డీ: 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా.
పోకో ఎం7 5జీ: స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 50 ఎంపీ రియర్ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ.
మోటో జీ35 5జీ: 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, యూనిసోక్ టీ760 చిప్‌సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.
రెడ్ మీ ఏ4 5జీ: స్నాప్ డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్, 50 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ.
వివో వై18టీ: యూనిసోక్ టీ612 చిప్‌సెట్, 50 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఒప్పో ఏ3ఎక్స్ 4జీ: స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 1 ప్రాసెసర్, 8 ఎంపీ రియర్ కెమెరా, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ.
టెక్నో స్పార్క్ 30సీ 5జీ: మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 48 ఎంపీ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.