భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో టాప్‌ బ్రాండ్‌ ఇదే.. | Xiaomi secured top spot in India smartphone market followed by Vivo Samsung | Sakshi
Sakshi News home page

భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో టాప్‌ బ్రాండ్‌ ఇదే..

May 6 2025 10:59 AM | Updated on May 6 2025 11:11 AM

Xiaomi secured top spot in India smartphone market followed by Vivo Samsung

యాపిల్‌ విక్రయాలు 25% అప్‌

సైబర్‌మీడియా రీసెర్చ్‌ నివేదిక 

దేశీయంగా మార్చి త్రైమాసికంలో టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఐఫోన్‌ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 25 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ 8 శాతం మార్కెట్‌ వాటా దక్కించుకుంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్‌ పెరుగుతుండటం, రిటైల్‌ స్టోర్స్‌ను కంపెనీ విస్తరించడం, ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు ఇందుకు గణనీయంగా దోహదపడ్డాయి. దీంతో సూపర్‌ప్రీమియం సెగ్మెంట్‌లో (రూ. 50,000–రూ. 1 లక్ష వరకు ధర ఉండే ఫోన్లు) యాపిల్‌ వాటా 28 శాతానికి, ఉబర్‌–ప్రీమియం విభాగంలో (రూ. 1 లక్ష పైగా రేటు ఉండే ఫోన్లు) 15 శాతానికి చేరింది. జనవరి–మార్చ్‌ త్రైమాసికంలో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల సరఫరాపై సైబర్‌మీడియా రీసెర్చ్‌ (సీఎంఆర్‌) ఇండియా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

దేశీయంగా మొత్తం స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో 21 శాతం వాటాతో చైనా సంస్థ వివో అగ్రస్థానంలో నిలవగా, 19 శాతం షేర్‌తో కొరియన్‌ దిగ్గజం శాంసంగ్‌ రెండో స్థానంలో ఉంది. షావోమీ వాటా ఏకంగా 37 శాతం పడిపోయింది. 13 శాతం మార్కెట్‌ షేర్‌తో మూడో ర్యాంక్‌లో నిలిచింది. ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు 8 శాతం పెరగ్గా, మార్కెట్‌ వాటా 12 శాతంగా నమోదైంది.  

ఇదీ చదవండి: ఈ ఏడాదిలో ఆర్‌బీఐ మరోసారి తీపికబురు

మరిన్ని ముఖ్యాంశాలు..

  • మార్చి త్రైమాసికంలో భారత్‌లో సరఫరా అయిన మొత్తం ఫోన్లలో 5జీ స్మార్ట్‌ఫోన్ల వాటా 86 శాతంగా నమోదైంది. వార్షికంగా 14 శాతం పెరిగింది. రూ. 8,000 నుంచి రూ. 13,000 వరకు ఖరీదు చేసే 5జీ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు 100 శాతం పెరిగాయి.

  • ఫీచర్‌ ఫోన్‌ సెగ్మెంట్లో చైనాకు చెందిన ఐటెల్‌ మార్కెట్‌ వాటా వార్షికంగా చూస్తే 6 శాతం తగ్గినప్పటికీ, మొత్తం మీద 41 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది.  

  • స్మార్ట్‌ఫోన్‌ చిప్‌సెట్‌ మార్కెట్లో మీడియాటెక్‌ 46 శాతం వాటాతో టాప్‌లో నిల్చింది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్లో (రూ. 25,000 పైగా రేటు ఉన్నవి) 35 శాతం వాటాతో క్వాల్‌కామ్‌ అగ్రస్థానం దక్కించుకుంది.
     

Advertisement
 
Advertisement
Advertisement